టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్(46) తన యాంటీ ఏజింగ్ ప్రయోగాలకు సంబంధించి.. మరో ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అత్యంత కీలకమైన మన బాడీ పోశ్చర్ గురించి చెప్పారు. ఇది శరీర భాగాల తోపాటు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలిపారు. దాన్ని మెరుగుపరుచుకోకపోతే బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడుతుందంటూ చాలా షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అందుకోసం ఏం చేయాలో కూడా వివరించారు. అవేంటంటే..
తన యాంటీ ఏజింగ్ ప్రక్రియల్లో భాగంగా ప్రతి భాగాన్ని అత్యంత కేర్‌ఫుల్‌గా చూసుకుంటున్నారు బ్రయాన్. నిజానికి మన ఏజ్ పెరిగే కొద్ది ఎలాంటి మార్పులు సంభవించి నెమ్మదిగా వృద్ధాప్యం వస్తుందో కూడా వివరంగా చెప్పారు బ్రయాన్. తాను అనుకున్నట్లుగా వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టగలరో లేదో కచ్చితంగా చెప్పలేకపోయినా..ఏ అలవాట్ల వల్ల వేగంగా వృద్ధాప్య లక్షణాలు వస్తాయో ఆయన ప్రయోగాల ద్వారా చాలా క్లియర్‌గా తెలుస్తోంది.
ఇక బ్రయాన్ యాంటీ ఏజింగ్ ప్రక్రియలో తెలిసిన మరో ఆసక్తికర విషయం బాడీ పోశ్చర్. ఇది సరిగా లేకపోతే మన ఆరోగ్యంపై ఎలాంటి భయంకరమైన ప్రతికూల ప్రభావం చూపుతుంతో వివరిస్తూ..తన వ్యక్తిగత అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. తన బాడీ పోశ్చర్ చాలా భయంకరంగా ఉండేదని, అది నెమ్మదిగా తన బ్రెయిన్‌పై ఎలా ప్రభావం చూపిస్తుందో గమనించలేకపోయానని పోస్ట్‌లో రాసుకొచ్చారు.
తన ఎంఆర్‌ఐలో తన భంగిమ మెదడులోని రక్తాన్ని బంధించి గుండెకు ప్రసరించకుండా ఎలా అడ్డుకుంటుందో తెలిపారు. దీని కారణంగా తనకు మూర్చ, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసిందన్నారు. నిజానికి బాడీ పోశ్చర్ గురించి చాలమందికి సరిగా తెలియదు. ఇదే ప్రాణాంతక వ్యాధుల బారిన పడేలా చేస్తుందన్నారు. ఒక రోజులో మన బాడీని చాలా తప్పుడు భంగిమల్లో ఉంచుతామని అన్నారు. అది కూర్చీలో కూర్చొవడం దగ్గర నుంచి స్క్రీన్‌వైపు చూసే విధానం వరకు సరైన పోశ్చర్‌లో కూర్చొమని అన్నారు.
ఈ అలవాట్లే క్రమేణ కండరాల నొప్పి, రక్తప్రసరణ సమస్యలు, జీర్ణ సమస్యలు, ఊపిరితిత్తు పనితీరు బలహీనపడటం, నరాల కుదింపు, వెన్నుముక అమరికలో తేడాలు, మూడ్ మార్పులు, నిద్రాభంగం తదితర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. తాను ఐదు ముఖ్యమైన విషయాల్లో తన బాడీ భంగిమను మెరుగుపరిచానని అన్నారు. నిటారుగా ఉండేలా వ్యాయామాలు, ఫోన్‌ని చూడటానికి తలవంచకుండా కంటికి సమాన స్థాయిలో పెట్టుకుని చూడటం వంటి మార్పులు చేయాలని సూచించారు.
అలాగే రోజులో ప్రతి 30 నిమిషాల కొకసారి కదలడం, చురుకుగా ఉండటం, మెట్లు ఎక్కడం, స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు, డ్యాన్స్ వంటివి చేయాలని అన్నారు. రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా మన బాడీ పోశ్చర్ ఉండటం అత్యంత ముఖ్యం అని చెప్పారు బ్రయాన్. ఇది మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పారు. జస్ట్ మన పోశ్చర్ మాత్రమే మెరుగుపరుచుకోవడమే కాదు మీ చుట్టు ఉండే వాతారవణాన్ని కూడా సరైన విధంగా మన భంగిమకు అనుగుణంగా మార్చుకోగలిగితే సత్ఫలితాలు పొందగలమని చెబుతున్నారు బ్రయాన్. కాగా, ఇంతకుమునుపు బ్రయాన్ తాను బట్టతల రాకుండా ఎలా నివారించింది, జుట్టు రాలు సమస్యను అరికట్టే చిట్కాలు వంటి వాటి గురించి షేర్ చేసుకున్నారు.
I didn't realize how terrible my posture was until an MRI showed it was slowly killing my brain.
A ticking time bomb of a problem that I've now dramatically improved with these five habits. 🧵 pic.twitter.com/qPGKiCsDXc— Bryan Johnson /dd (@bryan_johnson) October 10, 2024
(చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!)
Comments
Please login to add a commentAdd a comment