Millionaire
-
ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం..!
అమెరికన్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేందుకు కోట్లకొద్దీ డబ్బులు ఖర్చుపెట్టి వార్తల్లో నిలిచిన సంగత తెలిసంది. దీన్ని బ్లూప్రింట్ ప్రాజెక్ట్ పేరుతో యువకుడిలా కనిపించే ప్రయోగాలకు నాందిపలికారు. ఈక్రమంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో షేర్ చేసుకునేవారు. తాను చేస్తున్న ప్రయోగం సక్సస్ అయితే నిత్య యవ్వనంగా ఉండలనే మనిషి కోరిక నేరవేరడం తోపాటు దీర్ఘాయవును పొందేలా ఆరోగ్యంగా ఉండటం ఎలా అనేదానికి మార్గం సుగమం అవుతుందనేది బ్రయాన్ కోరిక. ఆయన కారణంగానే అందరిలోనూ భవిష్యత్తు ఆరోగ్యం, దీర్ఘాయువు ఎలా ఉండనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆ నేపథ్యంలో ఆయన ఏ చిన్న ట్వీట్ చేసినా, ఎవ్వరితో సమావేశమైనా హాట్‌టాపిక్ అవుతుంది. తాజాగా బ్రయాన్ ముంబై సందర్శన తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. అక్కడ బ్రయాన్ లిటిల్ నెస్ట్ కమ్యూనిటీలో శ్లోకా అంబానీ, ఆనంద్ పిరమల్, సోనమ్ కపూర్ అహుజా వంటి ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో వారితో భవిష్యత్తులో ఆరోగ్యం, దీర్ఘాయువు గురించి చర్చించారు. అలాగే జోమాటో సీఈవో దీపిందర్ గోయల్ వంటి ప్రభావవంతమైన వ్యక్తులతో కూడా సమావేశమయ్యారు. ఇక బ్రయాన్ భారతదేశం పర్యటనలో వాయు కాలుష్యం గురించి మాట్లాడారు. దీన్ని అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా అభివర్ణించారు. ముంభైలో ఉన్న పేలవమైన గాలి నాణ్యత గురించి షేర్ చేసుకున్నారు. ఈ కాలుష్యం ప్రభావం పడకుండా N95 మాస్క్‌లు, HEPA ఫిల్టర్లను ఉపయోగించాలని సూచించారు. ఇక్కడ గాలి నాణ్యత దారుణంగా ఉందని తన కళ్లు, గొంతు కూడా మండుతున్నాయని వాపోయారు. మంచి ఆరోగ్యం కోసం అందరూ ఆరోగ్యకరమైన గాలి లభించే వాతావరణంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, బ్రయాన్ భారత్ పర్యటన సమావేశాలు దీర్ఘాయువుపై ప్రపంచ ఆసక్తిని గురించి నొక్కి చెబుతున్నాయి. అలాగే భారత్‌లోని హెల్త్ సంబంధితన వెల్నెస్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకు వెళ్లేలా తీసుకోవాల్సిన చర్యలను కూడా హైలెట్ చేసింది. Great speaking with the Little Nest community about the future of health and longevity. Big thanks to Shloka Ambani, Anand Piramal and Sonam Kapoor Ahuja for hosting me. pic.twitter.com/i2O2vbrWQC— Bryan Johnson /dd (@bryan_johnson) December 4, 2024 (చదవండి: ఈ సూప్ తయారీకి మూలం బ్రిటిష్ అధికారులట..!) -
బాడీ పోశ్చర్(భంగిమ) కరెక్ట్‌గా ఉందా? హెచ్చరిస్తున్న టెక్ మిలియనీర్
టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్(46) తన యాంటీ ఏజింగ్ ప్రయోగాలకు సంబంధించి.. మరో ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అత్యంత కీలకమైన మన బాడీ పోశ్చర్ గురించి చెప్పారు. ఇది శరీర భాగాల తోపాటు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలిపారు. దాన్ని మెరుగుపరుచుకోకపోతే బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడుతుందంటూ చాలా షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అందుకోసం ఏం చేయాలో కూడా వివరించారు. అవేంటంటే..తన యాంటీ ఏజింగ్ ప్రక్రియల్లో భాగంగా ప్రతి భాగాన్ని అత్యంత కేర్‌ఫుల్‌గా చూసుకుంటున్నారు బ్రయాన్. నిజానికి మన ఏజ్ పెరిగే కొద్ది ఎలాంటి మార్పులు సంభవించి నెమ్మదిగా వృద్ధాప్యం వస్తుందో కూడా వివరంగా చెప్పారు బ్రయాన్. తాను అనుకున్నట్లుగా వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టగలరో లేదో కచ్చితంగా చెప్పలేకపోయినా..ఏ అలవాట్ల వల్ల వేగంగా వృద్ధాప్య లక్షణాలు వస్తాయో ఆయన ప్రయోగాల ద్వారా చాలా క్లియర్‌గా తెలుస్తోంది. ఇక బ్రయాన్ యాంటీ ఏజింగ్ ప్రక్రియలో తెలిసిన మరో ఆసక్తికర విషయం బాడీ పోశ్చర్. ఇది సరిగా లేకపోతే మన ఆరోగ్యంపై ఎలాంటి భయంకరమైన ప్రతికూల ప్రభావం చూపుతుంతో వివరిస్తూ..తన వ్యక్తిగత అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. తన బాడీ పోశ్చర్ చాలా భయంకరంగా ఉండేదని, అది నెమ్మదిగా తన బ్రెయిన్‌పై ఎలా ప్రభావం చూపిస్తుందో గమనించలేకపోయానని పోస్ట్‌లో రాసుకొచ్చారు. తన ఎంఆర్ఐలో తన భంగిమ మెదడులోని రక్తాన్ని బంధించి గుండెకు ప్రసరించకుండా ఎలా అడ్డుకుంటుందో తెలిపారు. దీని కారణంగా తనకు మూర్చ, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసిందన్నారు. నిజానికి బాడీ పోశ్చర్ గురించి చాలమందికి సరిగా తెలియదు. ఇదే ప్రాణాంతక వ్యాధుల బారిన పడేలా చేస్తుందన్నారు. ఒక రోజులో మన బాడీని చాలా తప్పుడు భంగిమల్లో ఉంచుతామని అన్నారు. అది కూర్చీలో కూర్చొవడం దగ్గర నుంచి స్క్రీన్‌వైపు చూసే విధానం వరకు సరైన పోశ్చర్‌లో కూర్చొమని అన్నారు.ఈ అలవాట్లే క్రమేణ కండరాల నొప్పి, రక్తప్రసరణ సమస్యలు, జీర్ణ సమస్యలు, ఊపిరితిత్తు పనితీరు బలహీనపడటం, నరాల కుదింపు, వెన్నుముక అమరికలో తేడాలు, మూడ్ మార్పులు, నిద్రాభంగం తదితర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. తాను ఐదు ముఖ్యమైన విషయాల్లో తన బాడీ భంగిమను మెరుగుపరిచానని అన్నారు. నిటారుగా ఉండేలా వ్యాయామాలు, ఫోన్‌ని చూడటానికి తలవంచకుండా కంటికి సమాన స్థాయిలో పెట్టుకుని చూడటం వంటి మార్పులు చేయాలని సూచించారు. అలాగే రోజులో ప్రతి 30 నిమిషాల కొకసారి కదలడం, చురుకుగా ఉండటం, మెట్లు ఎక్కడం, స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు, డ్యాన్స్ వంటివి చేయాలని అన్నారు. రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా మన బాడీ పోశ్చర్ ఉండటం అత్యంత ముఖ్యం అని చెప్పారు బ్రయాన్. ఇది మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పారు. జస్ట్ మన పోశ్చర్ మాత్రమే మెరుగుపరుచుకోవడమే కాదు మీ చుట్టు ఉండే వాతారవణాన్ని కూడా సరైన విధంగా మన భంగిమకు అనుగుణంగా మార్చుకోగలిగితే సత్ఫలితాలు పొందగలమని చెబుతున్నారు బ్రయాన్. కాగా, ఇంతకుమునుపు బ్రయాన్ తాను బట్టతల రాకుండా ఎలా నివారించింది, జుట్టు రాలు సమస్యను అరికట్టే చిట్కాలు వంటి వాటి గురించి షేర్ చేసుకున్నారు.I didn't realize how terrible my posture was until an MRI showed it was slowly killing my brain.A ticking time bomb of a problem that I've now dramatically improved with these five habits. 🧵 pic.twitter.com/qPGKiCsDXc— Bryan Johnson /dd (@bryan_johnson) October 10, 2024 (చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!) -
నన్ను పిచ్చివాడిగా భావించారు.. అంతా అదృశ్యమైంది: అనుపమ్ మిట్టల్
జీవితమంటే ఎన్నో కష్టాలు, నష్టాలు. అన్నింటిని దాటుకుంటూ వెళ్తేనే అందమైన ప్రపంచం. దీనికి నిదర్శనమే షాదీ.కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ 'అనుపమ్ మిట్టల్'. ఈయన తన అద్భుతమైన ప్రయాణం గురించి ఇటీవల వెల్లడించారు. అతి తక్కువ వయసులోనే ధనవంతుడై.. ఆ తరువాత అన్నీ కోల్పోయానని అన్నారు. దీనికి సంబంధించిన విషయాలను ఈయన లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు.20 ఏళ్ళ వయసులోనే మల్టీ మిలియనీర్‌గా ఎదిగాను. యుఎస్‌లో జీవితం ఒక కలలా అనిపించింది. ఎంతగా అంటే నేను ఫెరారీని కూడా ఆర్డర్ చేసాను. కానీ అది వచ్చిన వెంటనే, అంతా అదృశ్యమైంది. డాట్ కామ్ బుడగ పగిలిపోయింది, దానితో డబ్బు మాయమైంది. ఉన్న డబ్బు పోవడమే కాకుండా అప్పులు చేయాల్సి వచ్చిందని అనుపమ్ మిట్టల్ పేర్కొన్నారు.2003 నాటికి నేను గెలిచిన.. ఓడిపోయిన జ్ఞాపకం తప్పా మరేమీ మిగలలేదు. అన్నింటిని కోల్పోవడం వల్ల వచ్చే ధైర్యంతో నేను మరొక డాట్-కామ్ వెంచర్‌ను (షాదీ.కామ్) నిర్మించడానికి సన్నద్దమయ్యాను. డొమైన్ ధర 25,000 డాలర్లు. ఆ తరువాత మా వద్ద కేవలం 30,000 డాలర్లు మాత్రమే మిగిలింది. ప్రజలందరూ నన్ను పిచ్చివాడిగా భావించారు. అంతే కాకుండా నేను ప్రారంభించిన వ్యాపారం గురించి కూడా ప్రశ్నల వర్షం కురిపించారు.ఎవరు ఏమనుకున్నా.. నేను మాత్రం ఇదే గేమ్ ఛేంజర్ అని భావించాను. ఇదే సరైనదని ముందుకు వెళ్ళాను. మళ్ళీ పూర్వ వైభవం పొందాను. నా ప్రయాణం కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, నేను ఓటమి చూసినా మళ్ళీ ఎదగగలనని నిరూపించానని అనుపమ్ మిట్టల్ అన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో హెడ్ ఆఫీస్ అమ్మేస్తున్న అమెరికన్ కంపెనీఒక వ్యక్తి సామర్థ్యాన్ని కేవలం గెలుపు, ఓటములతో నిర్దారించలేము. విజయం అనేది జనాదరణ పొందిన అభిప్రాయంతో పాటు వెళ్లడం కాదు. మీపై మీరు విశ్వాసంతో ముందుకు నడవడమే. రిస్క్ తీసుకోవాలి, గెలిచే వరకు ఆటను ఆపొద్దని మిట్టల్ సూచించారు. -
వయసుని తగ్గించుకోవడంలో సక్సెస్ అయిన బ్రియాన్ జాన్సన్! ఏకంగా..
మిలియనీర్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్(48) తన వృద్ధాప్యాన్ని తిప్పేకొట్టే ప్రతయత్నంలో విజయం సాధించాడు. ఆయనకు వయసు మీద పడుతున్న యువకిలా కనిపించాలనుకున్నారు. అందుకోసం ప్రాజెక్ట్ బ్లూప్రింట్ పేరుతో గత కొంతకాలం కఠినమైన డైట్‌ని అనుసరించాడు. ప్రత్యేకమైన ఆహారం, వందకు పైగా మాత్రలు వేసుకున్నాడు. తన శరీరంలో ప్రతి భాగం 18 ఏళ్ల యువకుడిలో ఉండేలా ప్రతి నిత్యం దాదాపు 30 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకునేవాడు. దీని కోసం అని అతను కోట్లలో డబ్బు వెచ్చించాడు కూడా. ఎట్టకేలకు వయసు మీద పడుతున్న యువకుడిలో వయసు తగ్గించుకునే బ్లూప్రింట్ ప్రాజెక్ట్ విజయవంతమయ్యిందని, తాను యువకుడిలా మారానని వెల్లడించారు. వృద్ధాప్య ఛాయలకు విజయవంతంగా చెక్పెట్టానన్నారు. అందుకు సంబంధించిన రహస్యాన్ని బ్లూప్రింట్ స్టాక్ పేరుతో మార్కెట్లో విక్రయించనున్నట్లు తెలిపాడు. ఇది మన ఫాస్ట్ ఫుడ్‌పై ఖర్చు చేసే అమౌంట్ కంటే తక్కవలోనే ఈప్రొడక్ట్ స్టాక్‌ని తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. ఆ ప్రొడక్ట్‌లో డ్రింక్ మిక్స్, ప్రొటీన్, ఎనిమిది మాత్రలు, స్నేక్ ఆయిల్, 61 శక్తిమంతమైన థెరపీలు, 400 కెలరీలు సప్లిమెంటరీస్ ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రొడక్స్లను ప్రమోట్ చేస్తే ఇది తల్లిపాలకు సరిసమానమైనదని చెబతూ ఉత్త్పత్తుల వివరాలను ఎక్స్‌లో వెల్లడించారు. ఈ ఉత్పత్తుల పనితీరుపై దాదాపు వెయ్యి క్లినకల్ ట్రయల్స్ నిర్వహించినట్లు తెలిపారు. అంతేగాదు తన వయసు కంటే ఐదేళ్లు తగ్గించుకున్నానని, మెరుగైన ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపాడు. ఆయన ఈ బ్లూప్రింట్ ప్రాజెక్టులో భారీగా పెట్టుబడులు పెట్టాడు. వయసు రీత్యా వచ్చే జుట్టు రాలు సమస్యకు కూడా చెక్ పెట్టానని చెప్పారు. ఈ ఉత్పత్తులను తమ డైట్లో భాగం చేసుకుంటే భోజనం రెండు పూటలా తీసుకోవచ్చలేదన్నది తెలియాల్సి ఉంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేసే ఈ బ్లూప్రింట్ స్టాక్ అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్ పోర్చుగల్, స్పెయిన్, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్, అరబ్ దేశాలు తోసహా మొత్తం 23 దేశాల్లో అందుబాటులో ఉందని వెల్లడించారు బ్రయాన్ జాన్సన్. (చదవండి: లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!) -
సినిమాని తలపించే కథ! వందల కోట్ల ఆస్తులున్న కొడుక్కి చెప్పని తండ్రి..!
అత్యంత సంపన్న కుటుంబం..20 ఏళ్లు వచ్చేవరకు కొడుక్కి చెప్పని తండ్రి సినిమాల్లో, కథల్లోనూ వింటాం ఇలాంటి కథను. నిజ జీవితంలో కనిపించడం అరుదు. అయినా మిలయనీర్ కుటుంబ నేపథ్యం ఉన్న పిల్లలు కచ్చితంగా ఆ రేంజ్ తగ్గట్టు బతుకుతారు. అంతలా సాధారణ పిల్లల్లా ఉండేందుకు వారి తల్లిదండ్రులే ఒప్పుకోరు. వాస్తవికంగా అలా జరగదు. కానీ ఈ మిలియనీర్ కొడుకు కథ సినిమాని తలపించేలా వేరేలెవెల్లో ఉంది. ఇంతకీ అతడి కథ ఏంటంటే.. తండ్రి వందల కోట్ల వ్యాపార సామ్రజ్యానికి అధిపతి. అత్యం సంపన్న కుటుంబం. అయినా ఆ విషయం కొడుక్కి చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. చైనాలో అత్యంత విలువైన ప్రొడక్ట్ హునాన్ స్పైసీ గ్లూటెన్ లాటియో బ్రాండ్ మాలా ప్రిన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యుడాంగ్ కొడుకు జాంగ్ జిలాంగ్ జియుపాయ్ కథ. అతడే స్వయంగా తన తండ్రి ఆస్తిని తనకు చెప్పకుండా రహస్యంగా ఉంచినట్లు తెలిపాడు. తనకు 20 ఏళ్లు వచ్చేవరకు తన తండ్రి మనం అప్పుల్లో ఉన్నామనే చెప్పేవాడు. తన తండ్రి జాంగ్ యడాంగ్ ప్రసిద్ధ బ్రాండ్ ఓనర్ అని తెలుసు. కానీ ఎప్పుడూ కుటుంబం అప్పులు పాలయ్యిందని చెప్పేవాడు. కౌంటీలో ఓ సాధారణ ప్లాట్‌లో తాము నివశించేవారమని చెప్పుకొచ్చాడు. పైగా తన కుటుంబ నేపథ్యాన్ని ఉపయోగించకుండానే తాను ఓ మంచి పాఠశాలలో ప్రవేశం పొంది చదువుకున్నట్లు తెలిపాడు. తన కాలేజ్ చదువు పూర్తయ్యాక వెంటనే కనీసం నెలకు రూ. 60 వేలు వేతనం వచ్చే మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పాడు. ఎందుకంటే..? ఆ డబ్బుతో కుటుంబ అప్పుల్ని తీర్చాలని జిలాంగ్ భావించాడు. అయితే తండ్రి తమకు వేల కోట్లు ఆస్తులు ఉన్నాయన్న విషయం గ్యాడుయేషన్ పూర్తి అవుతుండగా చెప్పినట్లు తెలిపాడు. ఆ తర్వాత తన తండ్రి తమ కుటుంబాన్ని దాదాపు రూ. 11 కోట్లు విలువ చేసే విలాసవంతమైన విల్లాకు మార్చారని అన్నాడు. ప్రస్తుతం జిలాంగ్ తన తండ్రి కంపెనీ ఈ కామర్స్ విభాగంలోనే పనిచేస్తున్నాడు. అయితే అతడు కంపెనీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆశయంతో ఉన్నాడు. కానీ అతడి తండ్రి మాత్రం జిలాంగ్ పనితీరు బాగుంటేనే కంపెనీనీ అతడికి అప్పగిస్తానని చెబుతుండటం గమనార్హం. ఇలాంటి అద్భత కథలు నవలల్లోనూ, సినిమాల్లోనే ఉంటాయి. నిజ జీవితంలో సాధారణ యువకుడిలా పెరిగిన ఈ యువరాజు కథ చాలా అద్భుతంగా ఉంది కదూ..!. ఈ కథ పిల్లలకు ఏ వయసులో ఏది తెలియడం మంచిది అనేది బోధిస్తోంది. వారికి బాధ్యత తెలియాలంటే తండ్రి బ్యాంగ్రౌండ్‌తో పనిలేదని, స్వతహాగా అతడి కాళ్లపై నిలబడేలా పెంచితే చాలని తెలియజేస్తోంది ఈ గొప్ప కథ!. (చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కనపెట్టి అంబాసిడర్ అయిన యువతి!) -
దీపావళి కానుకేమో! బ్యాంక్ అకౌంట్లోకి రూ.4 కోట్లు
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్కు చెందిన ఓ వ్యక్తి దీపావళి నాడు కోటీశ్వరుడు అయ్యాడు. అతనికి చెందిన రెండు వేర్వేరు బ్యాంక్ అకౌంట్లలోకి రూ.4 కోట్లకు పైగా వచ్చి డబ్బు వచ్చిపడింది. ఈ డబ్బు గుర్తుతెలియని ఖాతాల నుంచి జమవడంతో ఖంగారుపడ్డ ఆ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అలీఘడ్‌లో మెడికల్ స్టోర్ నిర్వహించే మహమ్మద్ అస్లాం.. తన బ్యాంక్ ఖాతాలలో పెద్ద మొత్తం జమవడంపై బ్యాంక్ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ దీపావళి సెలవు కావడంతో బ్యాంక్ అధికారుల నుంచి స్పందన రాలేదు. దీంతో అతడు డయల్ 112 కి ఫోన్ చేసి పోలీసులకు విషయం తెలియజేశాడు. తనకు చెందిన ఐడీఎఫ్సీ, యూకో బ్యాంకు ఖాతాల్లోకి నవంబర్ 11, 12 తేదీల్లో పలు దఫాలుగా రూ.4.78 కోట్లు జమైనట్లు అస్లాం తెలిపాడు. అవాక్కైన తాను వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించానని, కానీ వారు సమస్యను పరిష్కరించలేదని పేర్కొన్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక డయల్ 112కి ఫోన్ చేసి విషయం చెప్పానని, తర్వాత వారి సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశానని అస్లాం వివరించాడు. దీనిపై నగర పోలీసు అధికారి మృగాంక్ శేఖర్ పాఠక్ మాట్లాడుతూ దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. బ్యాంకులు పూర్తిగా తెరుచుకున్న తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. -
'నాన్న బ్లడ్ బాయ్'! 71 ఏళ్ల తండ్రి వయసు ఏకంగా 25 ఏళ్లకు..
టెక్ మిలినియర్ బ్రయాన్ జాన్సన్ బయోలాజికల్ ఏజ్ రివర్స్‌లో భాగంగా తనే ఏజ్‌ని తగ్గించడం కోసం ఎంతలా డబ్బును వెచ్చించాడో తెలిసిందే. ఇప్పుడూ ఏకంగా తన రక్తంతో వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి ఏజ్‌ని తగ్గించే ప్రక్రియకు పూనుకున్నాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇంతకీ ఏంటా కథకమామీషు అంటే.. 45 ఏళ్ల సాఫ్ట్వేర్ బిలియనీర్ బ్రయాన్ జాన్సన్ ఏజ్ తగ్గించుకునే ప్రయోగాలు తనకే పరిమితం చేయలేదు కాబోలు. అందుకోసం 71 ఏళ్ల తండ్రిని కూడా వదిలిపెట్టలేదు . జాన్సన్ తన తండ్రి కోసం సుమారు 1 లీటర్ ప్లాస్మా దానం చేసినట్లు తెలిపాడు. అతనికి తన శరీరంలో ఉన్న ప్లాస్మాను తీసివేసి కొడుకు రక్తంలోని ప్లాస్మాను ఎక్కించారు. దీంతో అతడి వృద్ధాప్య వయసు 25 ఏళ్లకు తగ్గింది. ఎంత పెద్దవారైతే అంత తొందరగా వృద్ధాప్యం వస్తుంది. అయితే ఎప్పుడైతే అతనికి కొడుకు జాన్సన్ ప్లాస్మా ఎక్కించారో అప్పుడే అతను 46 ఏళ్ల టైంలో వచ్చే వృద్ధాప్య వేగం వచ్చింది. ఈ చికిత్స జరిగిన నెలలు తర్వాత కూడా అతడిలో అదే తరహా వృద్ధాప్య లక్షణాలు కనిపించాయని జాన్సన్ ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు. తాను ఇప్పుడు మా నాన్న "బ్లడ్ బాయ్"ని అంటూ అసలు విషయం అంతా రాసుకొచ్చాడు. ఈ ప్రక్రియలో తన తండ్రి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉందన్నాడు. అలాగే తన నుంచి పొందిన లీటరు రక్తం కంటే ఎక్కువగానే తన తండ్రిలోని సొంత ప్లాస్మాను తీసేసి ఉండొచ్చు అందువల్లే తన తండ్రిలో ఇంతలా మార్పులు వచ్చాయని అంటున్నాడు. కాగా, జాన్సన్ గత ఫిబ్రవరి ప్రాజెక్ట్ బ్లూప్రింట్‌లో భాగంగా తన యవ్వనాన్ని తిరిగి పొందేందుకు రోజు వందకు పైగా మందులు వేసుకుంటున్నాని, దాదాపు 30 మంది వైద్యులచే నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. పైగా అందుకోసం ఏడాదికి రూ. 16 కోట్లు పైనే ఖర్చు చేస్తున్నట్లు చెప్పాడు. ఈ రివర్స్ ఏజింగ్ ప్రయోగం సఫలం అవుతుందో లేదో తెలియదు గానీ అందుకోసం వారు తీసుకుంటున్న చికిత్సలు, పడుతున్న అవస్థలు వింటుంటే వామ్మో!.. అనిపిస్తుంది కదూ. My super blood reduced my Dad’s age by 25 years My father's (70 yo) speed of aging slowed by the equivalent of 25 years after receiving 1 liter of my plasma, and has remained at that level even six months after the therapy. What does that mean? The older we get, the faster we… pic.twitter.com/s4mBMDSP8Z — Zero (@bryan_johnson) November 14, 2023 (చదవండి: వ్యాయామం రోజూ ఒకే టైంలో చేస్తున్నారా? వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
వరించిన అదృష్టం..రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్స్యకారుడు!
చేపల వేటతో జీవనం సాగించే మత్స్యకారులకు ఒక్కోసారి అదృష్టం వరించి అరుదైన చేపలు వలలో చిక్కుతాయి. దీంతో లక్షాధికారులుగా మారిన పలు సందర్భాలు ఉన్నాయి. అలాంటి అదృష్టమే పాక్‌లోని ఓ మత్స్యకారుడిని వరించింది. దెబ్బతో ఒక్కరాత్రిలో ఊహించని రీతిలో అతని తలరాత మారిపోయింది. అతడికి లక్ అలా ఇలా లేదు. వివరాల్లోకెళ్తే...పాక్‌లోని కరాచీ నౌకాశ్రయం సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఇబ్రహి హైదరీ వలలో అరుదైన చేపలు పడ్డాయి. ఆ చేపలను మాండలికంలో గోల్డెన్ ఫిష్, లేదా సోవా అని పిలుస్తారు. ఇవి చాలా అమూల్యమైనవి, అరుదుగా దొరుకుతాయి. వీటిలో మంచి ఔషధగుణాలు ఉండటంతో వైద్యంలో ప్రముఖంగా వాడతారు. అలాగే వీటిలో దారం లాంటి పదార్థాన్ని శస్త్ర చికిత్స విధానాల్లో వినయోగిస్తారు. ఈ చేప ఒక్కొకటి ఏకంగా 7 మిలియన్లు(దాదాపు 70 లక్షలు) పలికాయి. దీంతో మొత్తం చెప్పలు సుమారు రూ. 7 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో అతను ఓవర్ నైట్‌లో కోటీశ్వరుడు మారిపోయాడు. ఈ చేప సుమారు 20 నుంచి 40 కిలోల బరువు ఉండి దాదాపు 1.5 మీటర్ల వరకు పెరుగుతుంది. వీటిని స్థానిక వంటకాల్లోనే కాక ఔషధాల్లోనూ ఎక్కువుగా ఉపయోగిస్తారు.కాగా, ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడుపోవడంతో మత్స్యకారుడు హైదరీ ఆనందానికి అవధులు లేవు. ఇవి సంతానోత్పత్తి కాలంలోనే తీరాని వస్తాయని, అప్పుడే వలకు చిక్కుతాయని చెబుతున్నాడు హైదర్. తాను ఈ సొమ్ముని తన సిబ్బందితో కలిసి పంచుకుంటానని ఆనందంగా చెబుతున్నాడు. ఏదైన టైం రావలిగానీ ఒక్క క్షణంలో మీ జీవితం అందనంత ఎత్తులోకి వెళ్లిపోతుందంటే ఇదే కదా!. (చదవండి: పేషెంట్‌కి చికిత్స అందిస్తూ..అంతలో వైద్యుడు..) -
కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి..
ప్రస్తుతం కుబేరులుగా.. సక్సెస్ పీపుల్స్‌గా చెప్పుకుంటున్న వారందరూ కూడా ఒకప్పుడు ఎన్నెన్నో కష్టాలు పడి విజయం సాధించిన వారే. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త 'రాజా నాయక్'. ఈయనెవరో, ఈయన సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పేద కుటుంబంలో జన్మించిన రాజా నాయక్ ఆర్థిక పరిస్థితుల వల్ల పాఠశాల విద్యను కొనసాగించలేకపోయాడు. తండ్రికి సంపాదన లేదు, తల్లి బ్రతకడానికి చాలా కష్టపడింది. కష్టాలు భరించలేక 17 సంవత్సరాల వయసులోనే ఇంటి నుంచి పారిపోయిన రాజా ముంబై చేరుకున్నాడు. ఫుట్‌పాత్‌పై షర్టుల విక్రయం ఉన్నత చదువు లేని కారణంగా ఎలాంటి ఉద్యోగం లభించలేదు. కానీ అతనికి.. అతనిమీద ఉన్న దృఢమైన విశ్వాసంతో ఏదో ఒకటి సాధించాలని సంకల్పించుకున్నాడు. ఉద్యోగం లేకపోవడంతో, డబ్బు కూడా లేకుండా పోయింది. ఆ సమయంలో స్నేహితుడితో కలిసి ఫుట్‌పాత్‌పై షర్టులను విక్రయించాడు. జీవితం మీద కసితో పగలు, రాత్రి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. తన కృషి, అంకితభావం వల్ల ఫుట్‌పాత్‌లోని తన చిన్న దుకాణం బాగా నడిచే స్థాయికి చేరింది. వ్యాపార రంగంలో మరిన్ని అడుగులు వేయడానికి కంకణం కట్టుకున్న రాజా నాయక్ అనేక అడ్డంకులను ఎదుర్కొని, ఫుట్‌పాత్ చొక్కాల వ్యాపారం నుంచి అతను కొల్హాపురి చప్పల్స్ అండ్ ఫుట్‌వేర్ బిజినెస్ ప్రారంభించాడు. కొత్త వ్యాపారాలు ఆ తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు, ఇది కాకుండా బాటిల్ డ్రింకింగ్ వాటర్ వెంచర్ జల బేవరేజెస్ ప్రారంభించాడు. ఇప్పటికి కూడా ఈయన తన వ్యాపారాన్ని పెంచుకోవడంలో నిమగ్నమై ఉన్నాడు. ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం.. ఒక షిప్ విలువే వేల కోట్లు! ప్రస్తుతం ఈయన రూ. 60 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన ఈయన సమాజంలోని అణగారిన వర్గాల కోసం విద్యా సంస్థలను నడుపుతున్నాడు. ప్రస్తుతం రాజా నాయక్ కర్ణాటకలోని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (డిఐసిసిఐ) అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. -
ఎప్పటికి యవ్వనంగా ఉండాలని..వందకిపైగా టాబ్లెట్లు, కొడుకు రక్తం..
యవ్వనంగానే ఉండాలనే అందరూ అనుకుంటారు. కానీ అది కుదరుదు. కాలానుగుణంగా వయసు రీత్య వచ్చే మార్పులను యథాతథాంగా ఆమోదించాల్సిందే. దేనికైనా కొంత వరకే అవకాశం. ఆ తర్వాత కనుమరుగు కాక తప్పదు. ఇది ప్రకృతి నియమం కూడా. దీనికి విరుద్ధంగా చేయాలనుకున్న పనులు ఇంతవరకు వికటించాయే గానీ సఫలం కాలేదు. కానీ ఇక్కడొక మిలీనియర్ దాన్ని సఫలం చేసి తిరగ రాయలనుకుంటున్నాడు. ఎప్పటకీ యవుకుడిలా మంచి దేమధారుఢ్యంతో ఉండాలని అతడు చేస్తున్న పనులు వింటే షాక్ అవుతారు. మల మూత్ర విసర్జనలు సైతం.. వివరాల్లోకెళ్తే..యూఎస్‌కి చెందిన టెక్ మిలీనియర్ బ్రయాన్స్ జాన్సన్‌కి ఓ వింత కోరిక పుట్టింది. ఎప్పటికీ నవయవ్వనంగా ఉండాలనే ఆలోచన వచ్చింది. అందుకోసం యాంటీ ఏజింగ్ అనే ప్రక్రియకు తెరతీశాడు. అందులో భాగంగా అతడు రోజుకు దాదాపు వందకు పైగా అంటే.. దగ్గర దగ్గర 111 మాత్రలు హాంఫట్ చేస్తాడట. ఇక దీని వల్ల తన శరీరంలో ఉత్ఫన్నమయ్యే మార్పులను పర్యవేక్షించేలా ఆర్యోగ్య పర్యవేక్షణకు సంబందించిన అత్యాధునిక పరికరాలతో నిరంతరం పర్యవేక్షిస్తాడు. అవి ఏకంగా అతడి మల మూత్ర విసర్జనలను సైతం పరిక్షించి శరీరంలో వచ్చే మార్పులను పసిగట్టి చెబుతుందట. అలాగే ప్రతి రోజు బేస్ బాల్ టోపీని ధరిస్తాడు. అది అతడి నెత్తిపై వృధ్యాప్య లక్షణాలు కనిపించే తెల్ల జుట్టును డిటెక్ట్ చేసి దాన్ని రిపేర్చేస్తుందట. ప్రస్తుతం జాన్సన్ వయసు 46 ఏళ్లు. అయితే అతడు తన అవయవాలన్నీ 18 ఏళ్ల యువకుడి మాదిరిగే మారేలా చేయడం అతని ఆశయం, ఆశ కూడా. నిజానికి జాన్సన్ తన ప్రాసెసింగ్ కంపెనీ బ్రెయిన్ ట్రీ సొల్యూషన్స్‌ను ప్రముఖ దిగ్గజ ఈబే కంపెనీకి రూ. 6 వేల కోట్లకి విక్రయించడంతో.. జాన్సన్ దిశ తిరగబడిందనే చెప్పాలి. ఇక అక్కడ నుంచి పలు వ్యాపారాలతో మిలీనియర్‌గా మారాడు. జాన్సన్(ఎడమ వైపు), తన కొడుకుతో దిగిన ఫైల్ ఫోటో యాక్సిడెంట్ కాకూడదని.. ఇక జాన్సన్‌కి సడెన్‌గా ఇలా యువ్వనంగా మారాలనే వింత కోరిక ఎలా పుట్టిందో గానీ అందుకోసం అతడు తన జీవనశైలిలో ఎన్ని మార్పులు చేశాడంటే..ఒకప్పుడూ లాస్ఏంజిల్స్ వీధుల్లో గంటకు 16 మైళ్ల వేగంలో ఆడి కారులో రయ్యి.. రయ్యి.. మని వెళ్లే ఆ వ్యక్తి కాస్త..ఇప్పుడూ తానే స్వయంగా నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటు వెళ్తున్నాడు. పైగా ఎక్కడకైనా బయలుదేరే ముందు డ్రైవింగ్ మంత్రాన్ని జపిస్తాడట. ఇది ఎందుకంటే?.. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇంతలా యవ్వనంగా మారాలని కోట్లు కోట్లు ఖర్చు చేస్తున్న డబ్బు, అతడి కష్టం వృధా అయిపోతాయి కదా!అందుకని. ప్రాజెక్ట్ బ్లూప్రింట్తో.. మనోడు అక్కడితో ఆగలేదు యవ్వనంగా ఉండాలని ఏకంగా తన కొడుకు రక్తాన్ని ఎక్కించుకుంటున్నాడట. రోజు దాదాపు 30 మంది వైద్యుల బృందం ఎమ్మారై వంటి స్కానింగ్‌లు నిర్వహించి.. శరీరంలో ఎక్కడ కొలస్టాల్ పెరుగుతుందో చెక్ చేస్తారు. వృద్ధాప్య ఛాయలు వచ్చేలా జరగుతున్న మార్పులను గమనిస్తుంటారు. అందుకు తగ్గ ట్రీట్మెంట్ వెంటనే అందిస్తారట జాన్సన్‌కి. పైగా ఆ వైద్య బృందం బ్లూప్రింట్ అనే ప్రాజెక్ట్‌తో జాన్సన్‌ని తిరిగి యవ్వనంగా అయ్యేలా అతడి ఏజ్‌ని వెనక్కు తీసుకొచ్చే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేగాదు జాన్సన్ కొల్లాజెన్,స్పెర్మిడిన్, క్రియేటిన్ వంటి పోషకాలతో నిండిన "గ్రీన్ జెయింట్" స్మూతీతో రోజును ప్రారంభిస్తాడట. ఇక జాన్సన్ ఇలా యవ్వనంగా మారేందుకు ఏడాదికి సుమారు రూ. 16 కోట్లు దాక ఖర్చు పెడుతున్నాడు. నిజం చెప్పాలంటే.. మన జాన్సన్ అత్యంత ఖరీదైన వ్యక్తి అనాలి. అతడు చెప్పిన ప్రకారం యవ్వనంగా మారాలని చేస్తున్న ఖర్చును కనుగా టాలీ చేస్తే అతడి విలువ ఏకంగా మూడు వేలు కోట్లు. వామ్మో!..ఏందిరా నీకు ఈ పిచ్చి కోరిక అనిపిస్తుంది కదా!. ఈ మహానుభావుడు పెట్టే ఖర్చు ఒక దేశం అభివృద్ధి లేదా ఓ రెండు పట్టణాలు అదీ కాదంటే..కనీసంచాలా అట్టడుగు కుగ్రామాల అభివృద్ధికి ఖర్చు చేస్తే బాగుపడతాయి. ఎందరో నిరుపేదల కష్టాలు తీరతాయని అనిపిస్తుంది కదా!. (చదవండి: ఎనిమిదో ఖండం! 375 ఏళ్లుగా !..వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
వజ్రాల వ్యాపారం.. వందల కోట్ల సంపద- సన్యాసుల్లో కలిసిపోయారు!
అందరూ కస్టపడి సంపాదించి జీవితంలో కుబేరులు కావాలని, విలాసవంతమైన జీవితం గడపాలని కలలు కంటూ ఉంటారు. అయితే గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక ఫ్యామిలీ మాత్రం కోట్ల సంపదను వదిలి సన్యాసుల్లో కలిసిపోయారు. ఇంతకీ వారెవరు? ఎందుకిలా చేశారు? వారి సంపాదన ఎలా ఉండేదనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. కొంతమంది ఆస్తులు లేకున్నా జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. మరి కొంతమంది ఎన్ని ఆస్తులున్నా మనశ్శాంతి లేకుండా జీవిస్తుంటారు. గుజరాత్ రాష్ట్రంలో ధనవంతులైన ఒక వజ్రాల వ్యాపారి, అతని భార్య కోట్ల సంపదను.. విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నారు. ఈ వజ్రాల వ్యాపారి కుమార్తె ఇప్పటికే తన తొమ్మిదవ ఏటనే సన్యాస దీక్షను తీసుకుంది. ఇదీ చదవండి: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ - అదేంటో తెలుసా? ఇప్పుడు ఆమె తల్లి తండ్రులు కూడా సన్యాసులుగా మారారు. సంవత్సరానికి రూ. 15 కోట్ల కంటే ఎక్కువ సంపాదించే ఫ్యామిలీ అన్ని వదిలి సన్యాసిగా మారడంతో ఎంతోమంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. షా కుమారుడు భాగ్యరత్న అతని దీక్షా వేడుకకు ఫెరారీలో, అతని తల్లిదండ్రులు దీపేష్ & పికా అదే జాగ్వార్లో ప్రయాణించారు. తమ కుమార్తె ఇప్పటికే సన్యాసంలో కలిసిపోవడం వల్ల వీరు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. సన్యాసంలో చేరకముందే వారు అలాంటి జీవితం గడపాలని నిర్ణయించుకుని దీపేష్ షా 350 కిమీ, అతని భార్య పికా షా 500 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తోంది. మా కుమార్తె సన్యాసంలో స్వీకరించినప్పుడే ఆమె బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు దీపేష్ షా వెల్లడించారు. జీవితంలో ఎన్నెన్నో విజయాలను చూసాను, కానీ అంతిమంగా శాంతి, ఆనందం కోసం ఈ దీక్ష స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: రూ. 200 కోట్లు కంటే ఎక్కువ ఖరీదైన కారు! ఎందుకింత రేటు? దీపేష్ షా తండ్రి ప్రవీణ్ బెల్లం, చెక్కర వ్యాపారం చేసేవాడు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం వజ్రాల వ్యాపారం చేస్తూ బాగా సంపాదిస్తోంది. అయినప్పటికీ భౌతిక సుఖాలు, విలాసాలు శాశ్వతం కాదని ఇప్పుడు జైన మతంలో సన్యాసులుగా చేరి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. -
పెళ్లికాని శ్రీమంతుడు.. రెడీ టూ మింగిల్ అంటున్నా పట్టించుకోని అమ్మాయిలు
అతనో బిలియనీర్.. అమెరికాలోని సంపనుల్లో అతడొకడు. పేరు బ్రియాన్ జాన్సన్. కండలు తిరిగిన దేహంతో చూడటానికి కూడా చాలా అందంగానే ఉంటాడు. పైగా ఆల్కహాల్ కూడా ముట్టుకోడు పక్కా హెల్తీ డైట్‌ను ఫాలో అవుతాడు. అయినా అతనికి ఇప్పటివరకు పెళ్లి కాలేదు. జీవితంలో ఓ తోడు కోసం బ్రియాన్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు. కానీ ఏం చేస్తాం.. ఇప్పటికీ పెళ్లికాని కోటీశ్వరుడిగానే మిగిలిపోయాడు.ఇన్ని మంచి అలవాట్లు ఉన్న జాన్సన్ ఇంకా సింగిల్‌గానే ఉన్నాడు. చాలా సార్లు డేటింగ్‌కు పిలిచినా అమ్మాయిలు నో చెప్పి పారిపోతున్నారట. ఇంతకీ ఈ బిలియనీర్ పెళ్లి కహానీ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. బ్రియాన్ జాన్సన్.. అమెరికాలోని శ్రీమంతుల్లో ఒకడు. అందంగా ఉంటాడు, మద్యం కూడా తాగడు. కాలిఫోర్నియాకు చెందిన ఈ బిజినెస్‌మ్యాన్ వందల కోట్లకు అధిపతి. వయసు 45. పెళ్లీడు ఎప్పుడో వచ్చి వెళ్లిపోయింది కూడా. కానీ జాన్సన్‌కు ఇంకా పెళ్లి కాలేదు. భాగస్వామి కోసం అతను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడట. వందల కోట్లున్నా తన జీవితంలో ఇంకా అమ్మాయి లేదని తెగ ఫీల్ అవుతున్నాడు. వయసు మీద పడుతున్నా యంగ్‌గా కనిపించేందుకు బ్రియాన్ జాన్సన్ ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కూడా. దీనికోసం ఏడాదికి ఏకంగా రూ.16కోట్లు ఖర్చు చేస్తున్నాడు. అయినా నో యూజ్.. అమ్మాయిలు ఇతను చెప్పే కండిషన్స్ విని దూరంగా పారిపోతున్నారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో జాన్సన్.. పెళ్లికోసం తను పడుతున్న ఇబ్బందులను వివరించాడు. కోట్లున్నా తనకింకా పెళ్లి కాలేదని, భాగస్వామి దొరకడం కష్టమైపోయిందని ఆవేదన చెందాడు. అతను ఏమన్నాడంటే.. ''నేను రాత్రి 8.30 గంటలకే నిద్రపోతాను. ఉదయం 6గంటల నుంచి 11గంటలలోపు కేవలం 2250 కెలోరీలనిచ్చే ఆహార పదార్థాలనే తీసుకుంటాను. రోజుకు ఐదు గంటలు ఏకాగ్రత, మంచి లైఫ్‌స్టైల్ కోసమే కేటాయిస్తాను. పక్కా న్యూటిషియన్లు చెప్పిన డైట్‌నే ఫాలో అవుతాను. దీంతో పాటు ముడుచుకొని పడుకోవడం నాకు అలవాటు. ఇదే విషయాల గురించి అమ్మాయిలతో ప్రస్తావిస్తే వాళ్లు షాకవుతున్నారు.మొదట డేట్‌కు వస్తామని చెప్పిన వాళ్లు నా కండిషన్స్ లిస్ట్ చూసి నో చెబుతున్నారు.అందుకే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంతకుముందు మద్యం తాగే అలవాటు కూడా ఉండేది. కానీ దానివల్ల అదనపు క్యాలరీలు వచ్చి బరువు పెరుగుతానని దీనికి కూడా దూరంగా ఉంటున్నా. అందం కోసం రోజుకు 111 ట్యాబ్లెట్స్ వేసుకుంటా. ఇన్ని చేస్తున్నా నాకింకా పెళ్లి కాలేదు'' అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు జాన్సన్. -
ఏడాదికి రూ.16 కోట్లు, నో గర్ల్ ఫ్రెండ్, నో సెక్స్: టెక్ మిలియనీర్ సీక్రెట్
Slow Down the Ageing Process: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే లక్ష్యంతో ఒక్కో అవయవాన్ని యవ్వనత్వంతో నింపుకుంటున్న బ్రయాన్ జాన్సన్ తాజాగా తన సక్సెస్ సీక్రెట్‌ను పంచుకున్నాడు. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేసే ప్రయత్నంలో ప్రతీరోజూ కఠినమైన వ్యాయామంతోపాటు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నట్టు కాలిఫోర్నియాకు చెందిన ఐటీ డెవలపర్ బ్రయాన్ జాన్సన్ తెలిపాడు. ప్రస్తుతం తనకు 18 ఏళ్ల యువకుడికి ఉండే ఊపిరి తిత్తులు, 37 ఏళ్లవయసునాటి గుండె ఉన్నాయని జాన్సన్ మరోసారి గుర్తు చేశాడు. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) యవ్వనంగా ఉండాలనే తపనతో చేసే వ్యాయామం మాత్రమే సరిపోవడంలేదని ఇందుకోసం ఏడాదికి ఏకంగా సుమారు 16.4 కోట్లు(2 మిలియన్ల డాలర్లు) ఖర్చు చేస్తున్నట్టు తెలిపాడు. అయినా చెప్పుకోదగ్గ ప్రయోజనం లేదు. అందుకే మరింత యవ్వనంగా ఉండేందుకు రోజూ 110 మాత్రలు వేసుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే ఎప్పుడూ ఒకే సమయంలో నిద్రపోతా. ఉదయం 11 గంటల తర్వాత ఏమీ తినను.. నో సెక్స్.. కనీసం గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అంటూ ఆశ్చర్యకరమైన విషయాలను తెలిపాడు. ఉదయం 3 ఔన్సుల వైన్ తీసుకోవడం ప్రయోజనకరమని స్పష్టం చేశాడు. ఆహారంలో భాగంగా 100కి పైగా మాత్రలు తీసుకుంటా.. అదీ అశ్వగంధ, పసుపు, వెల్లుల్లి, అకార్బోస్ లాంటి ఆయుర్వేద మందులు మాత్రమే. దీంతో పాటు హార్మోన్లు, ఇతర పదార్ధాల సమ్మిళితమైన గ్లూకోసమైన్ సల్ఫేట్ తీసుకుంటానని, ఇవే సుదీర్ఘ జీవితానికి రహస్యమని పేర్కొన్నాడు. అత్యంత రెజిమెంటెడ్ షెడ్యూల్, కఠిన ఆహార నియమాలు వ్యాయామంతో పాటుగా నెలవారీ ప్రాతిపదికన అనేక రకాల వైద్య ఆపరేషన్లు తప్పవని వెల్లడించాడు. 30 నిమిషాల పాటు వ్యాయామం అదీ కూడా 30 మంది వైద్యుల సిబ్బంది పర్యవేక్షణలో 20,000 సిట్-అప్‌లకు సమానమైన ఎక్స్‌ర్‌సైజ్ చేస్తాడట. ఇందుకోసం ప్రత్యేకమైన పరికరాలను కూడా ఏర్పాటు చేసుకున్నానన్నాడు. (IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!) రోజూ 7 రకాల క్రీములు జాన్సన్ ప్రతిరోజూ ఏడు వేర్వేరు క్రీములు వాడతాడు. ఇందులో విటమిన్లు సి, ఇ , బి3, ఫెరులిక్ యాసిడ్ , అజెలైక్ యాసిడ్ లాంటి ఉన్నాయి. 0.1 శాతం ట్రెటినోయిన్ టాపికర్ క్రీమ్, ప్రతి ఉదయం SPF 30, బాడీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ పడుకునే ముందు సెరావ్ నైట్ క్రీమ్ పూసుకుంటాడు. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఫేస్ ఇంజెక్షన్లు స్కిన్ కేర్ కోసం వీక్లీ యాసిడ్ పీల్స్, లేజర్ థెరపీ, మైక్రోనీడ్లింగ్ అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఫేస్‌కి ఫ్యాట్ ఇంజెక్షన్ (దీనిక తేనెటీగ కుట్టినంత భయంకరంగా ఉబ్బిపోతుందట) మైక్రోబోటాక్స్ ఇంజెక్షన్లు, కొల్లాజెన్ ఉత్పత్తి కోసం పలు ఇంజెక్షన్లతో సహా వివిధ చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకుంటాడు. 10 ఏళ్ల వయసులో ఉండే నున్నని మెరుపు, 14 ఏళ్ల వయస్సులో ఉండే మెరిసే చర్మం వచ్చిందట. దీన్ని కొనసాగించడం కష్టంగాను, చాలా పెయిన్పుల్గా అనిపించినప్పటికీ "ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ తన వయస్సును1.01 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు. పరిగెత్తుతున్న వృద్ధాప్యమనే రైలుకు బ్రేక్‌లు వేయాలంటే సామాన్యమైన విషయంకాదు, కఠోర శ్రమ అంతకు మించిన డబ్బు కూడా ఉండాలంటాడు. -
రూ.కోటికి పైగా వచ్చింది..రూ.లక్షకు పైగా పోయింది
రంగల్/ కౌడిపల్లి: టమాటాకు ఎంత క్రేజీ ఉందో, ఒక్కోసారి అమ్మకాల్లేక, వర్షాలతో అంత డ్యామేజీకి గురవుతోంది. ఒకరింట సిరులు కురిపించగా, మరికొందరికి దిగులు మిగిల్చింది. మెదక్ జిల్లాలో ఓ రైతు టమాట పంట ద్వారా రూ.కోటి 20 లక్షలు సంపాదించగా, వరంగల్ లక్ష్మీపురం మార్కెట్లో టమాటాలు కుళ్లిపోవడంతో కొంతమంది వ్యాపారులు ట్రాక్టర్ లోడ్ మేర పారబోశారు. వరంగల్ లక్ష్మీపురం మార్కెట్‌కు రోజుకు 1,500–2,000 బాక్సుల టమాటా వస్తోంది. బాక్సు టమాటాను రూ.1,800– 2,500 హోల్‌సేల్‌గా, రిటైల్ మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.120 చొప్పున విక్రయిస్తున్నారు. గతంలో ఎత్తు టమాటా(2.5 కిలోలు) రూ.30–50 విక్రయించగా, కొద్దిరోజులుగా రూ.200–300 చొప్పున అమ్ముతుండటంతో వినియోగదారులెవరూ టమాటా వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో శుక్రవారం రూ.లక్షకు పైగా విలువైన టమాటాలను చెత్త ట్రాక్టర్లో తీసుకొచ్చి బయట పారబోసినట్లు వ్యాపారులు తెలిపారు. ఇటు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌కు చెందిన మహిపాల్‌రెడ్డి ఎనిమిదెకరాలలో టమాటా, నాలుగు ఎకరాలలో క్యాప్సికం సాగు చేస్తున్నారు. టమాటా ధర భారీగా పలకడంతో ఇప్పటికే రూ.కోటీ 20 లక్షలు సంపాదించారు. ఇంకా నలభై శాతం పంట పొలంలోనే ఉంది. నెల రోజులుగా రోజుకు రెండు వందల ట్రేల టమాటా దిగుబడి వస్తోంది. ట్రే టమాటా రూ.1,000 నుంచి రూ 3 వేలు ధర పలుకుతోంది. పంటసాగుకు ఎకరాకు రూ.2 లక్షల చొప్పన రూ.16 లక్షలు ఖర్చు అయినట్లు మహిపాల్‌రెడ్డి చెప్పారు. ‘ఛత్తీస్‌గఢ్ నుంచి మొక్కలు తెచ్చి నాటడంతోపాటు ఎండను తట్టుకునేలా షెడ్ వేశా. మల్చింగ్ డ్రిప్ పద్ధతిలో సాగు చేశా. దీంతో మంచి లాభాలు వచ్చాయి’అని అన్నారు. -
ఎంత మిలియనీర్ అయినా.. ఇండియాలో ఇలాగే ఉంటది!
భారతదేశంలో చాలామంది ధనవంతులు ఇష్టపడి కొనుగోలు చేసే కార్ల జాబితాలో రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ వంటి బ్రాండ్ కార్లు మాత్రమే కాకుండా 'మెక్లారెన్' (McLaren) వంటి కార్లు కూడా ఉన్నాయి. అయితే మన దేశంలో ఏదైనా వాహనం కొని దానిని ఉపయోగించే ముందు పూజ చేయడం ఆనవాయితీ.. ఇదే పద్దతిని ఒక మిలియనీర్ కూడా పాటించాడు. కోట్ల సంపద కలిగిన వ్యక్తి తన కారుకి పూజ చేయడానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నివేదికల ప్రకారం, ముంబై నగరానికి చెందిన ఒక వ్యాపారవేత్త ఇటీవల సరికొత్త 'మెక్లారెన్ 720ఎస్' (McLaren 720S) డెలివరీ చేసుకున్నాడు. డెలివరీ తీసుకున్న తరువాత సమీపంలో ఉండే ఒక గుడి వద్ద పూజ కూడా చేయించాడు. పూజాదికార్యక్రమాలు ముగిసిన తరువాత ముంబైలోని పబ్లిక్ రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించింది. ఈ కారుని చూసిన వారిలో చాలా మంది జనం దానితో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. (ఇదీ చదవండి: కోకాకోలా క్యాన్సర్ కారకమా? డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోందంటే!) మెక్లారెన్ 720ఎస్: మెక్లారెన్ 720ఎస్ సూపర్ కారు విషయానికి వస్తే, ఇవి భారతీయ మార్కెట్ కోసం 400 యూనిట్లను మాత్రమే కేటాయించారు. ఇది శక్తివంతమైన 4.0 లీటర్ వి8 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి 710 Bhp పవర్ 770 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 2.8 సెకన్లలో గంటకు 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 341 కి.మీ కావడం విశేషం. దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 5 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. (ఇదీ చదవండి: దంపతులిద్దరికీ అదే సమస్య.. వారికొచ్చిన ఐడియా ధనవంతులను చేసిందిలా!) నిజానికి ఖరీదైన మెక్లారెన్ 720ఎస్ స్టాండర్డ్, లగ్జరీ, పర్ఫామెన్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. అయితే ఇవన్నీ చూడటానికి ఒకే విధంగా ఉన్నప్పటికీ.. పర్ఫామెన్స్ విషయంలో టాప్ ఎండ్ మోడల్ ఓ అడుగు ముందుంటుంది. ఇప్పటికీ ఈ ఖరీదైన కారుని ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ, గౌతమ్ సింఘానియా వంటి వారు కూడా కొనుగోలు చేశారు. కంపెనీ అధికారిక డీలర్షిప్ ముంబైలో ఉంది. అయితే ఈ కార్లు కావాలనుకునే వారు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. -
చైనా మిలియనీర్ సాహసానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. 56 ఏళ్ల వయసులో..
Chinese Millionaire: చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బు సంపాదించి ధనవంతుడవొచ్చు. ఇది సాధారణ ప్రజల ఫిలాసఫీ. అయితే కొంత మంది ఒక స్థాయికి చేరితే చదువును కూడా మధ్యలో ఆపేస్తారు. కానీ దానికి భిన్నంగా చైనాలో ఒక ధనవంతుడు ఒక పరీక్షను 27 సార్లుగా రాస్తూనే ఉన్నాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, చైనాకి చెందిన 56 సంవత్సరాల 'లియాంగ్ షి' (Liang Shi) అత్యంత కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి 27 సార్లు రాసినట్లు తెలుస్తోంది. 'గావోకావో' అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ప్రతిష్టాత్మకమైన సిచువాన్ యూనివర్సిటీలో స్థానం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని పరీక్ష రాస్తున్నాడు. అయితే ఈ సారి కూడా అందులో సెలక్ట్ కాలేకపోయాడు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుని మాదిరిగా లక్ష్యం చేరే వరకు ప్రయత్నం ఆపమని దీక్ష పట్టి కూర్చుకున్నాడు. (ఇదీ చదవండి: కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే ఇవన్నీ!) నిజానికి లియాంగ్ చైనాలోని ధనవంతుల జాబితాలో ఒకరు. మిలీనియర్ అయినప్పటికీ ఎలాగైనా ఆ పరీక్షల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఉన్నత విద్యను పొందడం కోసం కష్టతరమైన పరీక్షలో విజయం సాధించాలనే తపనతో, రోజుకు 12 గంటల పాటు చదువుకుంటూ ఎన్నెన్నో త్యాగాలు చేస్తున్నాడు. 27 సార్లు ఒకే పరీక్ష రాస్తూ ఎంపిక కాకపోవడంతో ఎంతో మంది ఎగతాళి చేస్తున్నట్లు కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: హోండా సంచలన ప్రకటన.. దెబ్బకు 13 లక్షల కార్లు వెనక్కి - కారణం ఇదే!) గావోకావో (Gaokao) గావోకావో అనేది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్ష. దీని అసలు పేరు 'నేషనల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్' (NCEE). చైనాలో ఈ పరీక్షను గావోకావో అని పిలుస్తారు. ఈ ఎగ్జామ్‌ను సంవత్సరానికి ఒకేసారి మాత్రమే నిర్వహిస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఇది ఒక అవసరం. -
17కు వ్యాపారం.. 19కి సెటిల్.. 22కు రిటైర్మెంట్.. అమెరికా కుర్రాడి సక్సెస్ స్టోరీ!
ఆ కుర్రాడికి చిన్నప్పటి నుంచే ఎన్నో కలలు. మరెన్నో ఆశలు. అయితే అతని ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో అవేవీ నెరవేరే అవకాశమే లేదు. అయితే పరిస్థితులను అతను ఎలా మార్చుకున్నాడో తెలిస్తే ఎవరైనా సరే ఒకపట్టాన నమ్మలేరు. ఈ కథ 22 ఏళ్ల యువకుడిది. అతను తన విధిరాతను తానే సమూలంగా మార్చుకున్నాడు. చిన్నవయసులోనే కోట్లకు పడగలెత్తాడు. విద్యార్థిగా చదువు పూర్తయ్యే వయసు వచ్చేనాటికల్లా రిటైర్ అయ్యాడు. అమెరికాకు చెందిన హెడెన్ వాల్ష్ స్కూలు చదువును మధ్యలోనే విడిచిపెట్టాడు. ఈ కామర్స్‌లో తన ప్రతిభ చూపాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు. డెయిలీ మెయిల్ నివేదిక ప్రకారం హెడెన్ తన జీవితానుభవాలను టిక్‌టాక్, యూట్యూబ్‌లో షేర్ చేస్తుంటాడు. తాను ఎంత చిన్నవయసులో వ్యాపారం మొదలుపెట్టిందీ, దాని నుంచి ఎలా ఆదాయం సంపాదించినదనే వివరాలు తెలియజేస్తుంటాడు. హెడెన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు 14 వేలకు మించిన ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ విషయానికొస్తే 3 లక్షలకు మించిన చందాదారులు ఉన్నారు. హెడెన్‌ను ఇంత చిన్నవయసులోనే ఎందుకు స్కూలు చదువు వదిలేసి, సంపాదన ప్రారంభించారని ప్రశ్నించినప్పుడు ఆయన తనకు ఎదురైన ఒక అనుభవాన్ని, అది తన జీవితాన్ని ఎలా మార్చివేసిందో తెలియజేశారు. బాల్యంలో ఎదురైన అనుభవం నుంచి.. హెడెన్ తన అనుభవాన్ని వివరిస్తూ..‘నాకు బాగా గుర్తుంది.. నాకు 10-11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏది కొనుక్కుందామన్నా నా దగ్గర డబ్బు ఉండేది కాదు. మా అమ్మానాన్న కూడా వాటిని కొనిచ్చేవారు కాదు. అప్పుడే నాకు నా సొంత సంపాదన అవసరమని అనిపించింది. నేను 17 ఏళ్ల వయసులోనే వ్యాపారం ప్రారంభించాను. సంపాదించడం కూడా మొదలుపెట్టాను. ఈ- కామర్స్ రంగంలో సత్తా చాటాను. ఇప్పటికీ అదే పనిచేస్తున్నాను. ఈ పని చేయడం అంటే నాకు ఎంతో సరదా. అయితే నేను టెక్నికల్‌గా రిటైర్ అయ్యాను. రియల్ ఎస్టేట్ నుంచి అందిన సొమ్ములోని కొంత మొత్తాన్ని వేరుగా ఉంచాను. దీని నుంచి వచ్చే ఆదాయంతో నా ఖర్చులు నెరవేరుతుంటాయి’ అని అన్నారు. 17 ఏళ్ల వయసులో వ్యాపారంలోకి.. సుమారు 17 ఏళ్ల వయసురాగానే హెడెన్ ‘ఈ కామ్ సీజన్’ను స్థాపించారు. దీనిలో ఆన్లైన్ కోర్సు నిర్వహిస్తుంటాడు. ఫీజు 575 డాలర్లు. హెడెన్‌కు 18 ఏళ్లు వచ్చేసరికి సొంతంగా లంబోర్గినీ(కారు) సమకూర్చుకున్నాడు. 19 ఏళ్ల నాటికి కోటీశ్వరునిగా మారాడు. 2022 నాటికి అతని ఆదాయం 15 మిలియన్ డాలర్లు. దీనిలో 3 మిలియన్ డాలర్లు లాభం ఉంది. తన ఈ- కామర్స్ ప్లాట్ఫారం ద్వారా హెడెన్ లెక్కలేనంతగా సంపాదిస్తున్నాడు. 22 ఏళ్ల వయసులో అతను రియల్ ఎస్టేట్ పోర్టుఫోలియా తీర్చిదిద్దాడు. కోటీశ్వరునిగా మారాలంటే.. మనిషికి అత్యంత అవసరమైన రెండు అంశాల గురించి హెడెన్ తెలియజేశారు. కోటీశ్వరులుగా మారాలనుకుంటున్నవారు.. మీకు వచ్చే సంపాదనలోని 20 శాతం మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేయండి. అప్పుడే మీరు అత్యధిక మొత్తంలో సేవింగ్స్ చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇక రెండవది.. జీవితంలోని అన్ని వ్యాపకాల కన్నా సంపాదించడానికే అధిక ప్రాముఖ్యతనివ్వాలని సూచించారు. ఇది కూడా చదవండి: స్కూల్ పిల్లల బ్యాగుల్లో డైపర్లు.. వయసేమో 11..షాకైన టీచర్లు! -
భారత్ నుంచి వలసలు పోతున్న కుబేరులు
భారత దేశంలో ప్రభుత్వం సంపన్నులకు అండగా నిలుస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడుతుంటే వారు మాత్రం ఇక్కడ సరిపడా సంపాదించుకున్నాక మూట ముల్లె సర్దుకుని పరాయి దేశాలకు పరుగులు తీస్తున్నారు. ఇది కొంత ఆందోళనకరమైన విషయమే అయినప్పటికీ ఈ సంఖ్య గత ఏడాది కంటే ఈ ఏడాది తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం. కుబేరుల వలసల్లో చైనా ఈ ఏడాది 13,500 వలసలతో అగ్రస్థానంలో ఉండగా భారత దేశం 6,500 మంది కుబేరుల వలసలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. తగ్గారండోయ్.. హెన్లీ వెల్త్ మైగ్రేషన్ నివేదిక ప్రకారం 6,500 మంది అధిక నికర విలువ ఉన్న సంపన్నులు ఈ ఏడాది దేశం విడిచి వెళ్తున్నట్లు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కుబేరుల వలసలు గణనీయంగా తగ్గాయని, గత ఏడాది 7,500 మంది కుబేరులు దేశాన్ని విడిచి వెళ్లగా ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్యలో వెయ్యి మంది తగ్గారని తెలిపింది హెన్లీ వెల్త్ మైగ్రేషన్ సంస్థ. నష్టమే లేదు.. న్యూ వరల్డ్ వెల్త్ పరిశోధనాధికారి ఆండ్రూస్ అమాయిల్స్ మాత్రం ఈ వలసల సంఖ్యలతో పెద్దగా కంగారు పడాల్సిందేమీ లేదని, కొందరు వెళ్లిపోయినా వారికి రెట్టింపు సంఖ్యలో భారత దేశం కుబేరులను పుట్టిస్తూ ఉందని అన్నారు. క్లిష్టమైన నిషేధిత పన్ను చట్టాలు, కఠినమైన విదేశీ చెల్లింపుల నిబంధనలే ప్రధానంగా ఈ వలసలకు కారణాలుగా తెలుస్తోంది. నిజమే మరి... సంపాదన ఉంటే సరిపోతుందా దాన్ని దాచుకోవాలి కదా. చైనానే టాప్.. ఇక కుబేరుల వలసల్లో చైనా దేశం అగ్రస్థానంలో కొనసాగుతుండగా భారత దేశం రెండో స్థానంలో ఉంది. చైనా నుండి ఈ ఏడాది భారీగా 13,500 మంది సంపన్నులు ఆ దేశాన్ని విడిచి వెళ్తున్నట్లు నివేదిక చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కుబేరుల వలసలు గత ఏడాది 1,22,000 గా ఉండగా ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్య 1,28,000 కు చేరుకోనున్నట్లు హెన్లీ అండ్ పార్ట్ నర్స్ సీఈవో డాక్టర్ జుర్గ్ స్టీఫెన్ తెలిపారు. ఎక్కడికి పోతున్నారు.. హెన్లీ వెల్త్ మైగ్రేషన్ నివేదిక ప్రకారం ఈ ఏడాది అత్యధికంగా 5200 మంది కుబేరులు ఆస్ట్రేలియా చేరుకోనున్నారు. తర్వాత యూఏఈ 4500 మందిని ఆహ్వనించనుంది. ఇక సింగపూర్ 3200 మందిని అమెరికా 2100 మందిని తమ కుబేరుల జాబితాలో కలుపుకోనున్నాయి. స్విట్జర్లాండ్ , కెనడా, గ్రీస్, ఫ్రాన్స్, పోర్చుగల్, న్యూజిలాండ్ దేశాలు కుబేరులను ఆహ్వానించడంలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇది కూడా చదవండి: లుంగీలు, నైటీలపై తిరగొద్దు.. చూడలేకపోతున్నాం! -
శ్రీమంతుడైన శ్రీవారితో అన్ని సమస్యలేనట..! విచిత్రంగా ఈ అమ్మడి బాధ
శ్రీమంతుడైన భర్తను పొందాలని అమ్మాయిలు అనుకుంటారు. ఎందుకంటే..'ధనం మూలం ఇదం జగత్'. అంటారు కదా! ప్రపంచమంతా డబ్బుతో నడుస్తుంది. డబ్బులుంటే చాలు ఏదైనా చేయొచ్చు. విలాసవంతమైన సౌకర్యాలతో బతకొచ్చు. ఖరీదైన నగలు వేసుకొవచ్చు. విలువైన బట్టలు.. ఇలా ఇతరులు కొనలేని ఎన్నో వస్తువులను ధనవంతుడైన భర్త ఉంటే తెచ్చిపెడతాడు. కానీ ఇదే తనకు సమస్య అవుతుందని అంటోంది ఓ భార్య. శ్రీమంతుడైన భర్తలుంటే ఇదే సమస్య అంటూ.. ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్టు చేసింది. ఇంతకీ ఆవిడ సమస్య ఏంటో మరి..! ఆవిడ పేరు లిండా ఆండ్రాడే. దుబాయ్‌లో ధనవంతుడైన భర్తతో ఉంటోంది. శ్రీమంతడైన భర్త కాబట్టి విలువైనవి కొనిస్తున్నాడట. వాటిని జాగ్రత్తగా ఉంచుకోవడం ఇబ్బందవుతోందట. అవన్నీ దాచుకోవడం కష్టమవుతోందట ఈ అమ్మడుకు. వాటిని ఎప్పుడు, ఎవరు దోచుకెళ్తారో అని భయం పట్టుకుంటోందని వీడియోలో పేర్కొంది. ధనవంతడైన భర్తలున్నా ఎన్నో కష్టాలున్నాయని చెబుతూ ఆ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. నెట్టింట ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. వ్యూయర్స్ విభిన్న స్పందనలతో కామెంట్స్ బాక్స్ నిండిపోయింది. పోస్టు చేసిన 'నీకు అన్ని కష్టాలున్నాయా?. మనం మన జీవితాలను రీప్లేస్ చేసుకుందామా?' అంటూ ఓ వ్యూయర్ కామెంట్ పెట్టాడు. ఈవిడ నిజంగానే సమస్యలతో ఉందా..? ఇది జోకా?, 'మా తల్లే.. నిజంగా ఖరీదైన వస్తువులను ఎప్పుడైనా వాడావా?. ఇదే మొదటిసారా?', ధనవంతులైన భర్తలు తొందరగా బోర్ కొట్టేస్తారేమో అంటూ మరికొందరు స్పందించారు. ఆ మహిళకు కొందరు వ్యూయర్స్ సపోర్టు కూడా చేశారు. ఆమె వ్యక్తిగత జీవితంపై మనం కామెంట్ చేయకూడదు అని కామెంట్ పెట్టారు. రూ.4.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. View this post on Instagram A post shared by Linda Andrade (@lionlindaa) ఇదీ చదవండి:ఓడిపోయాడని ముందు మందు బాటిళ్లు.. ప్రాణాలు తీసిన ఆన్లైన్ గేమ్.. ఎంత తాగాడో తెలుసా? -
ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులు ఏ నగరంలో ఉన్నారో తెలుసా?
కుబేరులు అనగానే మన దృష్టి వారి సంపదవైపే వెళుతుంది. ఆసక్తి ఉంటే వారి కంపెనీలు.. వాళ్లు ఏం చదువుకుకున్నారు. రోజుకి ఎంత ఆర్జిస్తున్నారు?వంటి వివరాలను తెలుసుకుంటాం. కానీ, వాళ్లు ఎక్కుడ? ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారా? ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులు ఎంత మంది ఉన్నారో గుర్తించే హెన్లీ అండ్ పార్ట్నర్ సంస్థ ‘మోస్ట్ మిలియనీర్ ఇన్ 2023’పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌లో అమెరికా న్యూయార్క్ సిటీలోనే ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులు ఉన్నట్లు తెలిపింది. దీంతో న్యూయార్క్ నగరం మరోసారి అత్యధిక ధనవంతులు జాబితాలో మరోసారి స్థానం దక్కించుకుంది. ఈ నగరంలో 3,40,000 మంది మిలియనీర్లు ఉండగా.. తర్వాత టోక్యోలో 290,300 మంది, శాన్ ఫ్రాన్సిస్కో 285,000మంది ఉన్నారు. ఈ నివేదిక ప్రపంచంలో ఎక్కువ సంపద కలిగిన ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సీఐఎస్(Commonwealth of Independent States), తూర్పు ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా, దక్షిణాసియా , ఆగ్నేయాసియాలలో మొత్తం 97 నగరాల్లో ఈ డేటాను సేకరించింది. వాటి ఆధారంగా ఏ ప్రాంతంలో ఎంతమంది మిలియనీర్లు ఉన్నారో నిర్ధారించింది. ఇక న్యూయార్క్, ది బే ఏరియా, లాస్ ఏంజిల్స్,చికాగో నగరాలు అమెరికాలో మిలియనీర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల విభాగంలో ఆధిపత్యం చెలాయించాయి. చైనాకు చెందిన రెండు నగరాలు బీజింగ్, షాంఘైలు సైతం అదే జాబితాలో ఉన్నాయి. రెసిడెంట్ హైనెట్వర్త్ జాబితాలో(HNWI) 258,000 మందితో లండన్ ఈ సంవత్సరం నాల్గవ స్థానానికి పడిపోయింది, 240,100 మందితో సింగపూర్ తర్వాతి స్థానంలో ఉంది. 2000లో లండన్ లక్షాధికారులలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది, కానీ గత 20 ఏళ్లలో ఇది జాబితా నుండి పడిపోయింది. ది బిగ్ యాపిల్‌గా పేరు గడించిన న్యూయార్క్ నగరంలో 3,40,000 మంది మిలియనీర్లు, 724 సెంటీ-మిలియనీర్లు, 58 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇక బ్రాంక్స్, బ్రూక్లిన్, మాన్‌హట్టన్, క్వీన్స్, స్టాటెన్ ఐలాండ్లు, మాన్హాటన్లోని 5వ అవెన్యూతో సహా ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన నివాసాలున్న కాలనీలుగా గుర్తింపు పొందాయి. ఇక్కడ ప్రధాన అపార్ట్మెంట్ ధరలు చదరపు మీటరుకు 27వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉండవచ్చు’ అని హెన్లీ అండ్ పార్ట్నర్ నివేదిక హైలెట్ చేసింది. చదవండి👉 అవధుల్లేని అభిమానం అంటే ఇదేనేమో..టిమ్ కుక్కు ఇంతకన్నా ఏం కావాలి! -
బార్బర్ షాపులో పనిచేసి, ఎన్ని వేల కోట్ల ఖరీదైన కార్లు కొన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు
-
పాత సామాన్లు, చెత్త అమ్ముతున్న మోడల్.. లక్షల్లో సంపాదన
సెలబ్రెటీలు వాడిన వస్తువులకు మార్కెట్లో ధరలు భారీగా ఉంటాయని అందరికి తెలుసు. అయితే వాచ్‌లు, షర్ట్స్, బైక్స్ వంటి వస్తువులకు అభిమానులు ఎక్కువ డబ్బు ఖర్చు చేసి కొనేస్తూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా అమెరికాకు చెందిన ఒక మోడల్ గోర్ల క్లిప్పింగ్స్, పాదాల చర్మం, డాండ్రఫ్ వంటివి అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తోంది. అమెరికా నార్త్ కరోలినాలో చెందిన 'రెబెక్కా బ్లూ' గతంలో ఎగ్జోటిక్ డ్యాన్సర్‌గా చేసి ప్రస్తుతం వెబ్‌క్యామ్ మోడల్, ఇన్ఫ్లూయెన్సర్గా ఉంటోంది. అయితే ఈమె తన వస్తువులను ఆన్లైన్లో విక్రయిస్తూ కావాల్సినంత డబ్బు సంపాదిస్తోంది. మొదట్లో తన స్ట్రిప్పింగ్ అవుట్‌ఫిట్స్‌ను ఒక వ్యక్తికి 20 డాలర్లకు విక్రయించింది. ఈ విధంగా ప్రారంభమైన తన వ్యాపారం ఇప్పుడు పరుగులు పెడుతోంది. తన వద్ద ఉన్న వస్తువులకు డిమాండ్ భారీగా ఉండటం గ్రహించి బిజినెస్ ప్రారంభించి 28 ఏళ్లకే బిలినియర్ అయిపోయింది. మొదట సాక్స్ వంటి వాటిని విక్రయించడం మొదలు పెట్టి ఇప్పడు ఉమ్మి, కాలి గోర్లు, పాదాల నుంచి కత్తిరించిన చర్మం, తన ఇంట్లోని చెత్త, కాటన్ స్వాబ్స్, ఇతర చిత్రవిచిత్రమైన వస్తువుల్ని కూడా అమ్మి డబ్బు సంపాదిస్తోంది.. నిజానికి ఇలాంటి వస్తువులను అమ్మిన సెలబ్రిటీలు ఇంతకు ముందు చాలానే ఉన్నారు. అమెరికాకు చెందిన మాజీ రియాల్టీ టీవీ స్టార్ స్టెఫానీ మాటో గతంలో అపాన వాయువును బాటిళ్లలో నింపి విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాపారం ఆమెకు బాగా కలిసి వచ్చింది. దాంతో పెద్ద ఎత్తున డబ్బు సంపాదించింది. ప్రస్తుతం రెబెక్కా బ్లూ ఇలాంటి చిన్న చిన్న పనికిరానివన్నీ విక్రయిస్తూ నెలకు 2000 డాలర్లు సంపాదిస్తోంది. అంటే ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.60 లక్షలకుపైనే ఉంటుంది. ఇలాంటి ఘటనలు మనదేశంలో చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కానీ అమెరికా వంటి దేశాల్లో అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. -
రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.. సీన్ కట్ చేస్తే జైల్లో ఉన్నాడు
ఒక వ్యక్తికి ప్రమాదవశాత్తు ఏటీఎం నుంచి ఊహించని విధంగా కుప్పులు కుప్పలుగా డబ్బు వచ్చింది. అంతే అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ నడిమంత్రపు సిరి ఉద్యోగాన్ని, ప్రియురాలిని కోల్పోయేలా చేసింది. చివరికి అతన్ని కటకటాలపాలయ్యేలా చేసింది. వివరాల్లోకెళ్తే... ఆస్రేలియాలోని ఒక బార్లో పనిచేసే సర్వర్ డాన్ సాండర్స్‌కి ఊహించని విధంగా ఏటీఎం నుంచి కట్టకట్టలు డబ్బు లభించింది. దీంతో అతను రాత్రికి రాత్రే మిలినియర్గా మారిపోయాడు. అతను ఒక రోజు రాత్రి బాగా మద్యం సేవించి ఆస్ట్రేలియాలోని వాంగారట్టాలో ఏటీఎం వద్దకు వెళ్లాడు. అప్పుడే అతను ఊహించని విధంగా ఏటీఎం నుంచి సుమారు రూ 13 కోట్ల నగదును పొందాడు. అసలేం జరిగిందటే.. అతను ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్న ప్రతిసారి సారీ ట్రై ఎగైన్ అని రావడం పెద్ద మొత్తంలో డబ్బులు మాత్రం ఏటీఎం నుంచి వచ్చేస్తుండేవి. ఇలా అతను మూడుసార్లు చేయగా...మూడుసార్లు పెద్దమొత్తంలో డబ్బు వచ్చింది. కానీ ఏటీఎం మెషిన్ మాత్రం లావాదేవీలు జరుపుతున్నంత సేపు ట్రాన్స్యాక్షన్ క్యాన్సిల్డ్ అని రావడం డబ్బులు మాత్రం వచ్చేయడం జరుగింది. ఐతే తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు కూడా రావడం లేదు. దీంతో సర్వర్ సాండర్స్‌కి దెబ్బకి తాగిన మత్తంతా దిగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక ఆ రాత్రికి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు బ్యాంకుకు ఫోన్‌చేసి సంప్రదిస్తే ఎలాంటి అవాంఛనీయమైన నగదు బదిలీలు జరగలేదని చెబుతారు. అసలు ఏమైంది ఎందుకు ఇలా జరిగిందని సర్వర్ సాండర్స్ వాకాబు చేస్తే ఆ రోజు రాత్రి తెల్లవారుజామున 1 గంట నుంచి 3 గంటలకు బ్యాంక్ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయ్యిందని గ్రహించాడు. అదీగాక తాను ఆరోజు ఏటీఎంలో సేవింగ్ అకౌంట్లోని కొంత సొమ్మును క్రెడిట్ కార్డుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నసమయంలోనే ఇంత పెద్ద మొత్తంలో దాదాపు రూ 13 కోట్ల నగదు బయటకు వచ్చిందని కనుగొన్నాడు. దీంతో ఊహించని విధంగా వచ్చిపడ్డ డబ్బుతో విచ్చల విడిగా జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేశాడు. స్నేహితులు యూనివర్సిటీలు ఫీజులు కట్టడం, ఉన్నత చదువులకు స్నేహితులను ఫారెన్ పంపించే పనులు వంటి సాయాలు కూడా చేశాడు. అతని మితిమీరిన జల్సాల కారణంగా బార్లో ఉద్యోగాన్ని, గర్లఫ్రెండ్‌ని పోగొట్టుకున్నాడు. అంతేకాదు ఆ డబ్బును మొత్తం ఐదునెలలో ఖర్చు పెట్టేశాడు. ఇదిలా ఉండగా బ్యాంకు అధికారులకు ఏటీఎంలో ఫ్రాడ్ జరిగిందని ఎవరో వ్యక్తి అధిక మొత్తంలో డబ్బును పొందినట్లు గుర్తిస్తారు. తర్వాత పోలీసులు ఇలా అక్రమంగా అధిక మొత్తంలో డబ్బుని పొందింది సర్వర్ సాండర్స్గా గర్తించి అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడు సాండర్స్ పై 111 అభియోగాలతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన 2011లో జరిగింది. అతను సుమారు ఐదేళ్లు జైలు శిక్షను కూడా అనుభవించాడు. అతను 2016లో జైలు నుంచి విడుదలయ్యాడని ప్రస్తుతం ఒక బార్లో పనిచేస్తున్నాడని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. ఐతే పోలీసులు ఫ్రాడ్ కేసుల విషయమే చెబుతూ... ఆన్లైన్లో ఈ ఘటన గురించి చెప్పడంతో ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. ఏదీఏమైన ఉచితంగా వచ్చే డబ్బు ఎప్పటికైనా ప్రమాదమే కదా!. (చదవండి: ఫ్రీ బస్సులోనూ టికెట్ కోసం పట్టు.. బామ్మ వీడియో వైరల్) -
కోడి ఈకలతో కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు
-
కోడి ఈకలతో వ్యాపారం అంటే నవ్వారు.. కోట్ల టర్నోవర్‌తో అందరికీ షాకిచ్చారు!
వ్యర్థాల నుంచి కంపోస్ట్ చేయడం లేదా వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ పద్ధతి మనందరికీ తెలుసు, కానీ మనం ధరించే బట్టలు కూడా వ్యర్థాలతో తయారు చేయవచ్చని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఓ దంపతులు మాత్రం అలా ఆలోచించారు కాబట్టే, కోడి ఈకలతో మనం ధరించే బట్టలు తయారు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. వారి ఐడియా విని ఎగతాళి చేసిన వాళ్లే ఆశ్చర్యపోయేలా చేశారు జైపూర్‌కి చెందిన ముదిత, రాధేష్. కాలేజీలో పునాది పడ్డ ఈ ఐడియా, తమ కఠోర శ్రమ, అభిరుచితో దాన్ని కంపెనీగా మార్చిన ఈ దంపతులు ప్రస్తుతం కోట్లలో టర్నోవర్‌ని సొంతం చేసుకున్నారు. అనుకోకుండా ఆలోచన.. అదే వ్యాపారంగా మారి ముదిత మాట్లాడుతూ.. జైపూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్‌లో రాధేష్‌తో ఎంఏ చేస్తున్నప్పుడు, వ్యర్థ పదార్థాలతో కొత్త వస్తువులను తయారు చేసే దానిపై ప్రాజెక్ట్ చేశాను. ఒకరోజు, రాధేష్ ఒక ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ పొరుగున ఉన్న కసాయి దుకాణంలో నిలబడి ఉండగా కోడి ఈకలను చేత్తో తాకాడు. అనుకోకుండా అతనికి ఓ ఆలోచన వచ్చింది దాన్నే ప్రాజెక్ట్‌గా మార్చాం. ఆపై ఆ ప్రాజెక్ట్ ఐడియాతోనే బిజినెస్ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. కోడి ఈకలతో వ్యాపారం అంటే నవ్వారు వారి ఆలోచన కార్యరూపం దాల్చడానికి సుమారు సుమారు 8 సంవత్సరాలు పట్టింది. 2010లో ప్రారంభమైన ఈ కార్యక్రమం 2018లో పూర్తయింది. ఇందుకోసం చాలా కష్టపడి చదవాల్సి వచ్చింది. ఎందుకంటే ఓ వైపు.. రాధేష్ కుటుంబం పూర్తిగా శాఖాహారం కాబట్టి, వాళ్లు ఈ వ్యాపారాన్ని నిరాకరించారు. వ్యాపార పనులు జరుగుతున్నప్పుడు కూడా వాళ్ల కుటుంబం ఆదుకోలేదు. ఈ క్రమంలో వాళ్లు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. మరో వైపు.. ఇంతకు ముందు ఎవరూ అలాంటి బట్టను తయారు చేయలేదు కాబట్టి, పుస్తకాలలో, ఇంటర్నెట్లో కూడా దాని గురించి ఎక్కువ సమాచారం లేదు. చాలా పరిశోధన తర్వాత, కోడి ఈకలను బట్టలుగా మార్చే ఒక పద్ధతిని కనుగొన్నారు. ఇక్కడ వరకు పట్టుదలతో ముందుకు సాగిన వీళ్లకు మళ్లీ వీటి సేల్స్ తలనొప్పిగా మారింది. కానీ తొందరగానే కోడి ఈకలతో తయారు చేసిన శాలువాలకు ఇక్కడి కంటే విదేశాల్లో దీనికి అధిక డిమాండ్ ఉన్న విషయాన్ని గమనించారు. అప్పటి నుంచి వారి ఉత్పత్తులు చాలా వరకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చిన్న కుటీర పరిశ్రమ స్థాయిలో మొదలైన వారి ఆలోచన రూపమే.. గత రెండున్నరేళ్లలో కంపెనీ దాదాపు 7 కోట్ల వ్యాపారం చేయగా ప్రస్తుతం కంపెనీ వార్షిక టర్నోవర్ 2.5 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీలో 1200 మంది కార్మికులు పని చేస్తున్నారు. చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు రాబోతున్నాయ్!