Chinese Millionaire: చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బు సంపాదించి ధనవంతుడవొచ్చు. ఇది సాధారణ ప్రజల ఫిలాసఫీ. అయితే కొంత మంది ఒక స్థాయికి చేరితే చదువును కూడా మధ్యలో ఆపేస్తారు. కానీ దానికి భిన్నంగా చైనాలో ఒక ధనవంతుడు ఒక పరీక్షను 27 సార్లుగా రాస్తూనే ఉన్నాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, చైనాకి చెందిన 56 సంవత్సరాల 'లియాంగ్ షి' (Liang Shi) అత్యంత కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి 27 సార్లు రాసినట్లు తెలుస్తోంది. 'గావోకావో' అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ప్రతిష్టాత్మకమైన సిచువాన్ యూనివర్సిటీలో స్థానం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని పరీక్ష రాస్తున్నాడు. అయితే ఈ సారి కూడా అందులో సెలక్ట్ కాలేకపోయాడు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుని మాదిరిగా లక్ష్యం చేరే వరకు ప్రయత్నం ఆపమని దీక్ష పట్టి కూర్చుకున్నాడు.
(ఇదీ చదవండి: కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే ఇవన్నీ!)
నిజానికి లియాంగ్ చైనాలోని ధనవంతుల జాబితాలో ఒకరు. మిలీనియర్ అయినప్పటికీ ఎలాగైనా ఆ పరీక్షల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఉన్నత విద్యను పొందడం కోసం కష్టతరమైన పరీక్షలో విజయం సాధించాలనే తపనతో, రోజుకు 12 గంటల పాటు చదువుకుంటూ ఎన్నెన్నో త్యాగాలు చేస్తున్నాడు. 27 సార్లు ఒకే పరీక్ష రాస్తూ ఎంపిక కాకపోవడంతో ఎంతో మంది ఎగతాళి చేస్తున్నట్లు కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: హోండా సంచలన ప్రకటన.. దెబ్బకు 13 లక్షల కార్లు వెనక్కి - కారణం ఇదే!)
గావోకావో (Gaokao)
గావోకావో అనేది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్ష. దీని అసలు పేరు 'నేషనల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్' (NCEE). చైనాలో ఈ పరీక్షను గావోకావో అని పిలుస్తారు. ఈ ఎగ్జామ్‌ను సంవత్సరానికి ఒకేసారి మాత్రమే నిర్వహిస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఇది ఒక అవసరం.
Comments
Please login to add a commentAdd a comment