అత్యంత సంపన్న కుటుంబం..20 ఏళ్లు వచ్చేవరకు కొడుక్కి చెప్పని తండ్రి సినిమాల్లో, కథల్లోనూ వింటాం ఇలాంటి కథను. నిజ జీవితంలో కనిపించడం అరుదు. అయినా మిలయనీర్ కుటుంబ నేపథ్యం ఉన్న పిల్లలు కచ్చితంగా ఆ రేంజ్ తగ్గట్టు బతుకుతారు. అంతలా సాధారణ పిల్లల్లా ఉండేందుకు వారి తల్లిదండ్రులే ఒప్పుకోరు. వాస్తవికంగా అలా జరగదు. కానీ ఈ మిలియనీర్ కొడుకు కథ సినిమాని తలపించేలా వేరేలెవెల్‌లో ఉంది. ఇంతకీ అతడి కథ ఏంటంటే..
తండ్రి వందల కోట్ల వ్యాపార సామ్రజ్యానికి అధిపతి. అత్యం సంపన్న కుటుంబం. అయినా ఆ విషయం కొడుక్కి చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. చైనాలో అత్యంత విలువైన ప్రొడక్ట్ హునాన్ స్పైసీ గ్లూటెన్ లాటియో బ్రాండ్ మాలా ప్రిన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యుడాంగ్ కొడుకు జాంగ్ జిలాంగ్ జియుపాయ్ కథ. అతడే స్వయంగా తన తండ్రి ఆస్తిని తనకు చెప్పకుండా రహస్యంగా ఉంచినట్లు తెలిపాడు. తనకు 20 ఏళ్లు వచ్చేవరకు తన తండ్రి మనం అప్పుల్లో ఉన్నామనే చెప్పేవాడు. తన తండ్రి జాంగ్ యడాంగ్ ప్రసిద్ధ బ్రాండ్ ఓనర్ అని తెలుసు.
కానీ ఎప్పుడూ కుటుంబం అప్పులు పాలయ్యిందని చెప్పేవాడు. కౌంటీలో ఓ సాధారణ ప్లాట్‌లో తాము నివశించేవారమని చెప్పుకొచ్చాడు. పైగా తన కుటుంబ నేపథ్యాన్ని ఉపయోగించకుండానే తాను ఓ మంచి పాఠశాలలో ప్రవేశం పొంది చదువుకున్నట్లు తెలిపాడు. తన కాలేజ్ చదువు పూర్తయ్యాక వెంటనే కనీసం నెలకు రూ. 60 వేలు వేతనం వచ్చే మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పాడు. ఎందుకంటే..? ఆ డబ్బుతో కుటుంబ అప్పుల్ని తీర్చాలని జిలాంగ్ భావించాడు.
అయితే తండ్రి తమకు వేల కోట్లు ఆస్తులు ఉన్నాయన్న విషయం గ్యాడుయేషన్ పూర్తి అవుతుండగా చెప్పినట్లు తెలిపాడు. ఆ తర్వాత తన తండ్రి తమ కుటుంబాన్ని దాదాపు రూ. 11 కోట్లు విలువ చేసే విలాసవంతమైన విల్లాకు మార్చారని అన్నాడు. ప్రస్తుతం జిలాంగ్ తన తండ్రి కంపెనీ ఈ కామర్స్ విభాగంలోనే పనిచేస్తున్నాడు. అయితే అతడు కంపెనీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆశయంతో ఉన్నాడు. కానీ అతడి తండ్రి మాత్రం జిలాంగ్ పనితీరు బాగుంటేనే కంపెనీనీ అతడికి అప్పగిస్తానని చెబుతుండటం గమనార్హం.
ఇలాంటి అద్భత కథలు నవలల్లోనూ, సినిమాల్లోనే ఉంటాయి. నిజ జీవితంలో సాధారణ యువకుడిలా పెరిగిన ఈ యువరాజు కథ చాలా అద్భుతంగా ఉంది కదూ..!. ఈ కథ పిల్లలకు ఏ వయసులో ఏది తెలియడం మంచిది అనేది బోధిస్తోంది. వారికి బాధ్యత తెలియాలంటే తండ్రి బ్యాంగ్రౌండ్‌తో పనిలేదని, స్వతహాగా అతడి కాళ్లపై నిలబడేలా పెంచితే చాలని తెలియజేస్తోంది ఈ గొప్ప కథ!.
(చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కనపెట్టి అంబాసిడర్ అయిన యువతి!)
Comments
Please login to add a commentAdd a comment