wealth
-
రూ.1,275 లక్షల కోట్లకు ప్రపంచ కుబేరుల సంపద
ప్రపంచ కుబేరుల సంపద అనూహ్యంగా 2024లో 2 ట్రిలియన్ డాలర్ల(రూ.170 లక్షల కోట్లు)కు పెరిగి 15 లక్షల కోట్ల డాలర్ల (రూ.1275 లక్షల కోట్ల)కు చేరిందని ఆక్స్‌ఫామ్(Oxfam) తాజా నివేదిక వెల్లడించింది. ఇది రోజుకు 5.7 బిలియన్ డాలర్లకు సమానమని తెలిపింది. ఇది గతేడాది కంటే మూడు రెట్లు పెరుగుదలను సూచిస్తుంది. ఇది అతి సంపన్నుల సంపద పెరుగుదలను, ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల మధ్య పెరుగుతున్న ఆర్థిక అసమానతలను నొక్కి చెబుతుంది.నివేదికలో కీలక అంశాలు‘టేకర్స్ నాట్ మేకర్స్’ అనే శీర్షికతో రూపొందించిన ఆక్స్‌ఫామ్ నివేదికలో బిలియనీర్ల సంపద 2023 కంటే 2024లో మూడు రెట్లు వేగంగా వృద్ధి చెందింది. బిలియనీర్ల సంఖ్య 2024లో 204 పెరిగి మొత్తం 2,769కి చేరింది. అందులో 41 మంది ఆసియాకు చెందిన వారున్నారు. ఆసియాలో బిలియనీర్ల సంపద విలువ 299 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25.42 లక్షల కోట్ల) మేర పెరిగింది.ఈ ఏడాది సమకూరిన సంపదలో గణనీయమైన భాగం 60% వారసత్వం, వ్యవస్థ లేదా కంపెనీలపై గుత్తాధిపత్యం, క్రోనీ కనెక్షన్ల(అధికారంలోని వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి ఉండడం) ద్వారా చేకూరింది. 30 ఏళ్లలోపు ఉన్న బిలియనీర్‌కు తమ సంపద వారసత్వంగా వచ్చిందే. వచ్చే 20-30 ఏళ్లలో ప్రస్తుత 1000 మందికి పైగా బిలియనీర్లు తమ 5.2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.442 లక్షల కోట్ల)సంపదను తమ వారసులకు అందించనున్నారు.కుబేరుల సంపద గణనీయంగా పెరిగినప్పటికీ దాదాపు సగం మంది రోజుకు 6.85 డాలర్ల(రూ.550) కంటే తక్కువ ఆదాయంతో మనుగడ సాగిస్తున్నారు. ఈ సంఖ్యలో 1990 నుంచి మెరుగుదల కనిపించడంలేదు.ఇదీ చదవండి: కెనడా, మెక్సికోలపై సుంకాలు.. ప్రభావితమయ్యే వస్తువులుఆర్థిక అసమానతలుపెరుగుతున్న బిలియనీర్ల సంపద, ప్రపంచ పేదరికం మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ఈ నివేదిక చూపుతుంది. మహిళలు తీవ్రమైన పేదరికంతో అసమానంగా ప్రభావితమవుతున్నారు. 10 మందిలో ఒకరు రోజుకు 2.15 డాలర్లు(రూ.170) కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. ఈ అసమానతలను పరిష్కరించడానికి వ్యవస్థాగత మార్పులు అవసరమని నివేదిక చెబుతుంది. అతి సంపన్నుల(Billionaires)పై పన్ను విధించడం, గుత్తాధిపత్యాలను తొలగించడం వంటి విధానాలను అనుసరించాలని సూచిస్తుంది. ఆర్థిక అసమానతలపై ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు ఆందోళనలు వెలిబుచ్చిన విషయాన్ని ఆక్స్‌ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ గుర్తు చేశారు. -
2025లో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ..బెస్ట్ టిప్స్!
చిరకాలం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం చాలా ముఖ్యం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. 2025లోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, జీవనశైలి మార్పులు ఆరోగ్యంపై ఎంత ప్రభావితం చేస్తాయనే దానిపై పెరుగుతున్న అవగాహనతో, ప్రోటీన్లు, ఒమేగా-3లు, విటమిన్లు , ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలకు ప్రాధాన్యత గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఇదే మన భవిష్యత్ ఆనందానికి, ఆరోగ్యానికి బలమైన పెట్టుబడి.పోషకాహారం అంటే కేలరీలను లెక్కించడం గురించి మాత్రమే కాదు. అది శరీరానికి ఎంత అవసరమో తెలుసుకోవడం. ఆరోగ్యంగా ఉండటానికి శక్తితోపాటు సూక్ష్మపోషకాల కోసం సరైన మాక్రోన్యూట్రియెంట్లు ఉండేలా చూసుకోవాలంటున్నారు. అబాట్, న్యూట్రిషన్ బిజినెస్, మెడికల్ & సైంటిఫిక్ అఫైర్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి ఠాకూర్. ఆహారపు అలవాట్ల పట్ల మరింత శ్రద్ధ వహిస్తున్నందున, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇది ఆరోగ్యకరమైన ఆహార విధానాలకు దారితీస్తుంది. ముఖ్యంగా నోటి పోషక పదార్ధాలు (ONS) పోషకాహార లోపాలను పూరించడానికి, పోషకాహార లోపాన్ని నివారించడానికి సహాయపడుతంది. ముఖ్యంగా ఆకలి లేని వారికి, పోషకాహార లోపం ఉన్నవారికి,పోషకాలను గ్రహించడంలో ఇబ్బంది ఉన్న వ్యక్తులకు ఇది సాయపడుతుంది.పోషకాహారం & అభివృద్ధి చెందుతున్న పోషక అవసరాలను అర్థం చేసుకోవడంపోషకాహారం అంటే ఏంటి అనేది అస్పష్టంగా ఉండిపోతున్నప్పటికీ, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి పోషకాహారం చాలా అవసర అనేది మనందరికీ తెలుసు. శాకాహారం పాలియో డూట్, గ్లూటెన్-రహిత , కీటో డైట్ వంటివి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇందులో దేన్ని ఎంచుకోవాలనేది కష్టంగా అనిపించినా, సమతుల్యమైన ఆహారం అందరికీ శ్రయస్కరం అనేది అధ్యయనాలతోపాటు అందరూ అంగీకరించే విషయం.ఎదుగుతున్న క్రమంలో వివిధ దశల ఆధారంగా పోషక అవసరాలు పెరుగుతాయి. ఉదాహరణకు, పిల్లలకు పెరుగుదలకు అధిక మొత్తంలో కొన్ని పోషకాలు అవసరం, పెద్దలు కండబలం, ఎముక సాంద్రతను నిర్వహించడంపై దృష్టి పెట్టాలి. అదే వద్ధులైతే కండరాల నష్టాన్ని నివారించేలా, ఎక్కువ ప్రోటీన్ , అభిజ్ఞా పనితీరును నిర్వహించడానికి విటమిన్‌డీ, బీ 12 అదనపు విటమిన్లు అవసరం పడుతుంది. ఈ మార్పులను గుర్తించడం అనేది చాలా ముఖ్యమైనది.పెద్దల ఆహారం-ముఖ్యమైన పోషకాలుప్రోటీన్: ఇది కండరాల మరమ్మత్తుకు పెరుగుదలకు మద్దతు ఇస్తుంది . పప్పు (కాయధాన్యాలు), చిక్పీస్, కిడ్నీ బీన్స్ (రాజ్మా), పనీర్ (కాటేజ్ చీజ్), గుడ్లు ,చికెన్ ద్వారా దీన్ని పొందవచ్చు.కార్బోహైడ్రేట్లు: శరీరానికి ప్రాథమిక శక్తి వనరు అయిన కార్బోహైడ్రేట్లు సాధారణంగా బియ్యం, గోధుమ రోటీ, పోహా, ఓట్స్, చిలగడదుంపల్లో లభిస్తాయి.ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు: గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంతోపాటు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి అవిసె గింజలు (ఆల్సి), వాల్నట్లు, ఆవనూనె , ఇండియన్ మాకేరెల్ (బంగ్డా) లేదా రోహు వంటి చేపల ద్వారా అందుతాయి.ఫైబర్: ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. బ్రౌన్ రైస్, మిల్లెట్ వంటి తృణధాన్యాలు, జామ ,ఆపిల్ వంటి పండ్లు, పాలకూర , బ్రోకలీ వంటి కూరగాయలు, ఇంకా సైలియం పొట్టు (ఇసాబ్గోల్)లో లభిస్తుందివిటమిన్లు:విటమిన్ డి: ఎముకల ఆరోగ్యానికి కాల్షియం శోషణకు సహాయపడుతుంది. పాలు, పెరుగు,సూర్యకాంతి ద్వారా పొందవచ్చువిటమిన్ ఇ: యాంటీఆక్సిడెంట్, కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. బాదం, పొద్దుతిరుగుడు గింజలు, ఆవ ఆకూరలో ఉంటుంది.విటమిన్ సి: రోగనిరోధక పనితీరుకు,ఆరోగ్యానికి అవసరం, నారింజ ,యు నిమ్మకాయలు, ఆమ్లా (ఇండియన్ గూస్బెర్రీ), జామ వంటి సిట్రస్ పండ్లలో లభిస్తుందివిటమిన్ బి6: మెదడు ఆరోగ్యం , జీవక్రియకు ముఖ్యమైనది, అరటిపండ్లు, బంగాళాదుంపలు, పొద్దుతిరుగుడు విత్తనాలలో లభిస్తుందివిటమిన్ బి12: నాడీ పనితీరుకు, రక్త కణాల ఉత్పత్తికి ముఖ్యమైనది, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు,బలవర్థకమైన తృణధాన్యాలలో లభిస్తుందిఖనిజాలు:కాల్షియం: ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది, పాలు, పెరుగు, రాగి (Finger millets) నువ్వుల గింజల్లో ఎక్కువ లభిస్తుంది.ఐరన్: జీవక్రియ ప్రక్రియలకు మద్దతు ఇస్తుంది. పాలకూర, మెంతి ఆకులు ((Fenugreek), బెల్లం (గుర్), పప్పుధాన్యాలు (పప్పు) ద్వారా లభిస్తుందిజింక్: రోగనిరోధకశక్తి, గాయాలను నయం చేయడంలో సాయపడుతుంది. గుమ్మడికాయ గింజలు, చిక్పీస్ . బజ్రా వంటి తృణధాన్యాలలో లభిస్తుంది.రోజువారీ భోజనం ఎలా ఉండాలంటే..సామెత చెప్పినట్టుగా "రాజులాగా అల్పాహారం, యువరాజులాగా భోజనం, బిచ్చగాడిలా రాత్రి భోజనం’’ ఉండాలి. కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్లు ఎక్కువ ఉండాలి. కొవ్వులు జీర్ణం కావడం కష్టం కాబట్టి, వాటిని అల్పాహారం , భోజనంలో తీసుకోవాలి. అరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి భోజనం తేలిగ్గా ఉండాలి. ఆహారానికి మధ్యలోచాలా విరామం తర్వాత తీసుకునే భారమైన అల్పాహారం శక్తివంతమైందిగా ఉండాలి. అయితే పరగడుపున శరీరంలోని మలినాలను బైటికి పంపేందుకు గోరువెచ్చని నీరుతాగిలి. సీజన్‌ను బట్టి కూరగాయలు, పప్పుధాన్యాల నుండి తయారు చేసిన పోహా, ఉప్మా, దోస, ఇడ్లీ లేదా చీలా పవర్పేక్డ్ కార్బోహైడ్రేట్స్‌ను తీసుకోవచ్చు.2025లో చిన్న చిన్న మార్పులు, భారీ లాభాలు చిన్న మార్పులు మన మొత్తం ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలకు దారితీస్తాయిసమతుల ఆహారంపై దృష్టిపెట్టడంప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడంహైడ్రేడెట్గా ఉండటం, అంటే రోజుకు సరిపడినన్ని నీళ్లు తాగడం.పోషకాహారం తీసుకుంటూ ఎముకలు కండరాల బలాన్ని పెంచుకునేందుకు క్రమం తప్పని వ్యాయామం. ఆరోగ్య సంరక్షణలో శారీరక శ్రమ చాలా కీలకం. వారానికి కనీసం రెండుసార్లు బలమైన వ్యాయామాల వల్ల సమతుల్యత మెరుగుపడుతుంది. నడక, ఈత లేదా యోగా వంటివి ఫిట్‌నెస్‌కు దోహదం చేస్తాయి.ఈ ఏడాదిలో ఆరోగ్యకరమైన జీవనంపై దృష్టి పెడదాం. శరీరానికి బలాన్నిచ్చే ఆహారాన్ని, చురుకునిచ్చే వ్యాయామాలను, సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించే మార్పులను స్వీకరిద్దాం. తద్వారా సమిష్టిగా జీవితాన్ని ఆరోగ్యకరంగా, సంతోష కరంగా మార్చుకుందాం. ఇదీ చదవండి: కొత్త బంగారు లోకం.. అనాథ చిన్నారులకు ఆహ్వానం -
‘ఐదు శాతం’తో రూ.1.8 కోట్లు సంపాదన
కొత్త ఏడాదిలోకి ప్రవేశించాం. ఆర్థికంగా మరింత డబ్బు పోగు చేసుకోవాలని అందరూ అనుకుంటారు. కొత్త సంవత్సరంలో కొన్ని మార్గాలు పాటిస్తే సులువుగా ఆర్థిక లక్ష్యాలు(Financial Targets) చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు తాము చేస్తున్న కొలువు(Job)లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల రూపంలో అదనంగా సంపాదన అందుకుంటారు. దాన్ని వైవిధ్యంగా ఇన్వెస్ట్ చేస్తే సంపాదనను పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. పదోన్నతులు, ఇంక్రిమెంట్ల వల్ల సమకూరే డబ్బును దీర్ఘకాలికంగా పొదుపు చేస్తే మదుపు ఖాతాలో ఇంకొంత సొమ్ము పోగవుతుందని చెబుతున్నారు.ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల సమయంలో కంపెనీలు అదనంగా అందించే సుమారు ఐదు శాతం(సంస్థను బట్టి ఇది మారుతుంది) డబ్బు భవిష్యత్తులో భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు మీకు నెలకు లక్ష రూపాయల జీతం అనుకుందాం. ఏటా ఐదు శాతం ఇంక్రిమెంటును పరిగణిలోకి తీసుకుందాం. మీరు ఇప్పటికే చేసిన పెట్టుబడులు ఏటా పది శాతంమేర రాబడిని ఇస్తున్నట్లు భావిద్దాం. ఇప్పటి దాకా చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌ను 15 శాతం నుంచి అదనంగా ఐదు శాతం కలిపి 20 శాతానికి పెంచడం వల్ల జీవనశైలిలో పెద్దగా మార్పు ఉండదు. కానీ దీర్ఘకాలంలో మీరు చేస్తున్న పెట్టుబడి భారీగా పెరిగి ముప్పై ఏళ్ల తర్వాత కనీసం రూ.5.3 కోట్ల స్థానంలో అక్షరాలా రూ.7.1 కోట్లకు పెరుగుతుంది. అంటే కేవలం ఐదు శాతం అదనంగా ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు దాదాపు రూ.1.8 కోట్లు పెరుగుతుంది.ఇదీ చదవండి: మీకూ అందుతాయి ఐటీ నోటీసులు.. ఎప్పుడంటే..ముందు పొదుపు తర్వాతే ఖర్చుఖర్చు చేసిన తర్వాత మిగిలిన డబ్బును పొదుపు చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ ముందు పొదుపు తర్వాతే ఖర్చు అనే సూత్రాన్ని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు తప్పకుండా ఆరోగ్య బీమా(Health Insurance)తోపాటు జీవిత బీమాను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థతుల్లో ఉద్యోగం పోయినా ఇంటి ఖర్చులు భరించేలా కనీసం ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఈ నిధిని వెంటనే నగదుగా మార్చుకునే ఫండ్స్‌ల్లో పెట్టుబడి పెట్టాలని, ఈక్వీటీల జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. -
దూసుకెళ్తున్న భారత్.. భారీగా పెరిగిన బిలియనీర్లు
భారతదేశం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సంపద సృష్టికి హాట్‌స్పాట్‌గా ఉద్భవించింది. పదేళ్లలో ఇండియాలోని బిలియనీర్ల నికర విలువ దాదాపు మూడు రేట్లు పెరిగి 905.6 బిలియన్లకు చేరింది. దీంతో భారత్ ఇప్పుడు మొత్తం బిలియనీర్ సంపదలో ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో నిలిచినట్లు స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంక్‌గా పేరుపొందిన 'యూబీఎస్' నివేదికలో వెల్లడించింది.యూబీఎస్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ జాబితాలోకి కొత్తగా 32 మంది చేరారు. దీంతో 153 మంది నుంచి బిలియనీర్ల సంఖ్య 185కు చేరింది. వీరి మొత్తం నికర విలువ ఒక్కసారిగా (905.6 బిలియన్స్) పెరిగింది. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.76 లక్షల కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా 2024లో బిలియనీర్ల సంఖ్య 2682కు చేరింది. అంతకు ముందు సంవత్సరంలో ఈ సంఖ్య 2,544గా ఉంది. నికర విలువ కూడా ఈ ఏడాది 12 ట్రిలియన్ డాలర్ల నుంచి 14 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అమెరికాలో బిలియనీర్ల సంఖ్య 751 నుంచి 835కి పెరిగింది, వారి మొత్తం సంపద 4.6 ట్రిలియన్స్ నుంచి 5.8 ట్రిలియన్లకు పెరిగింది.చైనాలో మాత్రం బిలియనీర్ల సంఖ్య 520 నుంచి 427కి చేరింది. వారి సంపద 1.8 ట్రిలియన్ డాలర్ల నుంచి 1.4 ట్రిలియన్లకు పడిపోయింది. భారత్ విషయానికి వస్తే.. ఇక్కడ బిలియనీర్ల సంఖ్య 153 నుంచి 185కు చేరింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
సంపదలు సత్కార్యాలకు ద్వారాలు
సాధారణంగా సంపద అంటే డబ్బులు అనుకుంటారు. కాని, సనాతన ధర్మం ఎప్పుడు కాగితం ముక్కల్ని కాని, లోహపు బిళ్ళలని కాని ధనంగా పరిగణించినట్టు కనపడదు. అష్టలక్ష్ములు అని చేప్పే సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ధనంగా చెప్పటం జరిగింది. సత్కార్యాలు చేయటానికి చేతి నిండుగా డబ్బు లేదే అని బాధ పడ నవసరం లేదు. మనకి ఎన్నో రకాలైన సంపదలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేయవచ్చు.సంపదలు ఉంటే ఎన్నో సత్కార్యాలు చేయవచ్చు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సంపదలు అనుభవించటానికి మాత్రమే అని లోకంలో ఉన్న అభిప్రాయం. కానీ, అవి ఎన్ని పనులు చేయటానికో సాధనాలు. దురదష్టవంతులు, దుర్మార్గులు అయినవారికి పతనానికి హేతువులుఅవుతాయి. సంపద అంటే ఇతరులకి ఎంత ఇచ్చినా తరగనంత ఉన్నది. తాను అనుభవించటానికి లేదే అని కొద్దిగా కూడా బాధ పడవలసిన అవసరం లేనంత ఉండటం. ఎవరికైనా ఇవ్వాలంటే ముందు తన దగ్గర ఉండాలి కదా! ఇవ్వాలని ఉద్దేశం ఉంది కాని, తన దగ్గర తగినంత లేక పోతే ఏమి చేయగలరు ఎవరైనా? అందువల్ల ఎవరికైనా సహాయం చేయాలంటే తగినంత సమకూర్చుకోవలసి ఉంటుంది. అన్నిటిని మించి ఆరోగ్యవంతమైన శరీరం ఉంది. దానితో శారీరకంగా బలహీనంగా ఉన్న వారికి సహాయం చేయ వచ్చు. బలహీనుడు మరొకరికి చేయూత నివ్వలేడు కదా! కనీసం ఈ సంపదని పెంపొందించు కోవచ్చు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం కోసమైనా ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. అదీ కాక పోయినా, తాను ఇతరుల పైన ఆధార పడి ఉండకుండా ఉంటే అదే పెద్ద సహాయం. (నట్టింటి నుంచి.. నెట్టింటికి..)మరొక ప్రధాన మైన సంపద జ్ఞానసంపద. ఇతరులకి జ్ఞానాన్ని పంచాలి అంటే తన దగ్గర ఉండాలి. ఎంత చదువుకుంటే ఏం లాభం? అంటూ ఉంటారు చాలా మంది. నిజమే! దానిని ఎవరికి పంచక, తన జీవితంలో ఉపయోగపరచక పోతే వ్యర్థమే. సార్థకం చేసుకోవాలంటే తనకున్న జ్ఞానాన్ని వీలైనంత మందికి పంచుతూ పోవాలి. ఈ మాట అనగానే నాకు పెద్ద పెద్ద డిగ్రీలు లేవు నేనేం చేయ గలను? అంటారు. జ్ఞానం అంటే కళాశాలలలోనో, విశ్వవిద్యాలయాలలోనో చదివితే వచ్చేది కాదు. ఆ చదువు సహజంగా ఉన్న దానికి సహకరించ వచ్చు. అనుభవంతో, లోకాన్ని పరిశీలించటంతో వచ్చేది ఎక్కువ. ఆ జ్ఞానాన్ని తన వద్దనే ఉంచుకోకుండా పదిమందికి పంచితే నశించకుండా తరువాతి తరాలకి అందుతుంది. అందుకే ధర్మశాస్త్రాలు కూడా ఏదైనా విషయంలో కలిగిన సందేహానికి పరిష్కారం గ్రంథాలలో లభించక పోతే ఆ కుటుంబంలో వృద్ధురాలైన మహిళని అడగమని చెప్పాయి. అనుభవ జ్ఞానం అంత గొప్పది. అన్నిటినీ మించినది ప్రేమ. దీనితోఎన్నిటినో సాధించవచ్చు. ఈ సంపద పంచిన కొద్ది పెరుగుతూ ఉంటుంది. మనం ఇచ్చినదే మన సంపద. దాచుకున్నది ఏమవుతుందో తెలియదు. మనం అన్ని విధాలా సంపన్నులం అయే మార్గం తెలిసింది కదా! శారీరికంగా ఏమీ చేయలేనప్పుడు ఏ మాత్రం కష్టపడకుండా చేయగలిగిన సహాయం కూడా ఉంది. అది మాట సాయం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న వారికి మాట సహాయం చేయవచ్చు. తాను చేయ లేక పోయినా, చేసే వారిని చూపించ వచ్చు. అది కూడా తనకి అందుబాటులో లేక పోతే కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పుగా ఒక్క మాట చెపితే ఎంతో ధైర్యం కలుగుతుంది. మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోవుగా! ఇదీ చేయటం రాక పోతే ఊరకున్నంత ఉత్తమం లేదు. పిచ్చి మాటలు మాట్లాడి చెడగొట్టకుండా ఉండటం కూడా గొప్ప సహాయమే అంటారు తెలిసిన పెద్దలు. నేర్పుగా మాట్లాడిన ఒక్క మాటతో సమస్యల పరిష్కారం, బాధల నుండి ఓదార్పు దొరకటం చూస్తూనే ఉంటాం. – డా. ఎన్. అనంతలక్ష్మి -
సంపద వృద్ధిలో టాప్ 10 దేశాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. చాలా దేశాలు వాటి ఆదాయాలు పెంచుకుంటున్నాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. మౌలిక వసతులను మెరుగు పరుస్తున్నాయి. స్థానికంగా తయారీ రంగాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఫలితంగా ఇతర దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. దాంతో జీడీపీ పెంచుకుంటున్నాయి. 2010 నుంచి 2023 వరకు వివిధ దేశాల సంపద ఎలా వృద్ధి చెందిందో తెలియజేస్తూ ‘యూబీఎస్ గ్లోబల్ వెల్త్ నివేదిక 2024’ను విడుదల చేశారు.గడిచిన పదమూడేళ్ల కాలంలో కజకిస్థాన్ 190 శాతం, చైనా 185 శాతం, ఖతార్ 157 శాతం, ఇజ్రాయెల్ 140 శాతం, ఇండియా 133 శాతం సంపద వృద్ధి నమోదు చేసిందని నివేదిక తెలిపింది. జపాన్, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ దేశాల సంపద వృద్ధి రుణాత్మకంగా ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోని మొత్తం ఆర్థిక ఆస్తులు(స్టాక్స్, బాండ్లు, ఇతర పెట్టుబడులు)+వాస్తవిక ఆస్తుల(ఇళ్లు, స్థలాలు, బంగారం..) నుంచి మొత్తం రుణాలను తొలగించి సంపదను లెక్కించినట్లు నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: కేంద్ర సంస్థల మార్గదర్శకాలపై ప్రభుత్వం సమీక్ష2010-23 కాలానికిగాను సంపద వృద్ధిలో టాప్ 10 దేశాలు(శాతాల్లో)కజకిస్థాన్-190చైనా-185ఖతార్-157ఇజ్రాయెల్-140ఇండియా-133హాంగ్‌కాంగ్-127ఇండోనేషియా-125అమెరికా-121హంగరీ-109తైవాన్-108సింగపూర్-106 -
పెట్టుబడి మొత్తం ఈక్విటీలకేనా?
సంపాదనను సంపదగా మార్చుకోవాలంటే అనుకూలమైన వేదికల్లో ఈక్విటీ ముందుంటుంది. రియల్ ఎస్టేట్ సైతం దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టికి మార్గమవుతుంది. కానీ, ఈక్విటీ మాదిరి సులభమైన లిక్విడిటీ సాధనం రియల్ ఎస్టేట్ కాబోదు. మొత్తం పెట్టుబడిని ఒకటి రెండు రోజుల్లోనే వెనక్కి తీసుకోవడానికి స్టాక్ మార్కెట్ వీలు కలి్పస్తుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఈ విభాగం వైపు అడుగులు వేయడానికి గల కారణాల్లో ఇదీ ఒకటి. అయితే, ఒకరి పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులు ఎంత మేర ఉండాలి..? రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా మంది దీనికి సూటిగా బదులు ఇవ్వలేరు. ఈక్విటీల జిగేల్ రాబడులు చూసి చాలా మంది తమ పెట్టుబడులు మొత్తాన్ని స్టాక్స్‌లోనే పెట్టేస్తుంటారు. ఇలా చేయడం ఎంత వరకు సబబు? అసలు ఈ విధంగా చేయవచ్చా? ఒకరి పెట్టుబడుల కేటాయింపులు ఎలా ఉండాలి? ఈ విషయాలపై స్పష్టత కోసం కొన్ని కీలక అంశాలను ఒకసారి మననం చేసుకోవాల్సిందే. మీరు ఎలాంటి వారు? బుల్ మార్కెట్లో రిస్క్ తీసుకునేందుకు వెనుకాడకపోవడం.. బేర్ మార్కెట్లో రిస్‌్కకు దూరంగా ఉండడం రిటైల్ ఇన్వెస్టర్లలో కనిపించే సాధారణ లక్షణం. సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ సూత్రానికి ఇది పూర్తి విరుద్ధం. ‘‘ఇతరులు అత్యాశ చూపుతున్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయపడుతున్నప్పడు అత్యాశ చూపాలి’’ అన్నది బఫెట్ స్వీయ అనుభవ సారం. మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. పైగా తమ రిస్క్ స్థాయి ఎంతన్నది కూడా పరిశీలించుకోరు. పెట్టుబడిపై భారీ రాబడుల అంచనాలే వారి నిర్ణయాలను నడిపిస్తుంటాయి. దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లో రాణించాలంటే ఇలాంటి ప్రతికూల ధోరణలు అస్సలు పనికిరావు. అత్యవసర నిధి ఉన్నట్టుండి ఉపాధి కోల్పోయి ఏడాది, రెండేళ్ల పాటు ఎలాంటి ఆదాయం రాకపోయినా జీవించగలరా? ప్రతి ఒక్కరూ ఒకసారి ఇలా ప్రశ్నించుకోవాలి. లేదంటే ఏడాది, రెండేళ్ల జీవన అవసరాలు తీర్చే దిశగా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాల్సిందే. దీర్ఘకాలం కోసమేనా?దీర్ఘకాలం అంటే ఎంత? అనే దానిపై ఇన్వెస్టర్లలో భిన్నమైన అంచనాలు ఉండొచ్చు. కొందరు 2–3 ఏళ్లు, కొందరు 5–10 ఏళ్లను దీర్ఘకాలంగా భావిస్తుంటారు. కానీ, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే వారు స్వల్పకాలాన్ని మరిచి.. అవసరమైతే దశాబ్దాల పాటు ఆ పెట్టుబడులు కొనసాగించే మైండ్‌సెట్‌తో ఉండాలి. బేర్ మార్కెట్ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్ మార్కెట్ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్ మార్కెట్ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్ మార్కెట్లో తమ పోర్ట్‌ఫోలియో స్టాక్స్ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. నూరు శాతం కాదు..? ఎన్ని చెప్పుకున్నా.. మధ్యమధ్యలో అనుకోని ఆర్థిక అవసరాలు ఎదురవుతుంటాయి. కనుక సామాన్య మధ్యతరగతి ఇన్వెస్టర్లు నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకుకోవడం సమంజసం కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఇలాంటి వారు ఒకటి కంటే ఎక్కువ సాధనాల మధ్య పెట్టుబడులు వర్గీకరించుకోవాలి (అస్సెట్ అలోకేషన్). ఏ సాధనంలో ఎంతమేర అన్నది నిర్ణయించుకోవాలంటే.. విడిగా ఒక్కొక్కరి ఆరి్ధక అవసరాలు, లక్ష్యాలు, ఆశించే రాబడులు, రిస్క్ సామర్థ్యం, పెట్టుబడులు కొనసాగించడానికి ఉన్న కాల వ్యవధి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అస్సెట్ అలోకేషన్ అంటే? ఒకరు రూ.100 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ఇందులో ఈక్విటీకి ఎంత, డెట్‌కు ఎంత అన్నది నిర్ణయించుకోవడం. ఈ రెండు సాధనాలే కాదు, బంగారం, రియల్ ఎస్టేట్ తదితర సాధనాలు కూడా ఉన్నాయి. కానీ, ఎవరికైనా ఈ నాలుగు సాధనాలు సరిపోతాయి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తుంటే ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. డెట్‌లో రిస్క్ డెట్‌లో రిస్క్ లేదా? అంటే లేదని చెప్పలేం. ఇందులో వడ్డీ రేట్లు, క్రెడిట్ రిస్క్ ఉంటాయి. అందుకే ఏఏఏ రేటెడ్ సాధనాల ద్వారా క్రెడిట్ రిస్‌్కను దాదాపు తగ్గించుకోవచ్చు. డెట్‌కు సింహ భాగం, కొంత శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ‘ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్’ను సైతం అరుణ్ కుమార్ సూచించారు.బేర్ మార్కెట్ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్ మార్కెట్ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్ మార్కెట్ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్ మార్కెట్లో తమ పోర్ట్‌ఫోలియో స్టాక్స్ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. రాబడులు దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే కచి్చతంగా రాబడులే వస్తాయా? నిఫ్టీ 50 టీఆర్ఐ (రోలింగ్ రాబడులు) ఐదేళ్ల కాల పనితీరును గమనిస్తే ఒక్కో ఏడాది 47 శాతం పెరగ్గా, ఒక ఏడాది మైనస్ 1 శాతం క్షీణించింది. 2007 నుంచి 2023 మధ్య ఒక ఏడాది 52 శాతం, మరొక ఏడాది 25 శాతం వరకు నిఫ్టీ సూచీ నష్టపోయింది. కానీ, 55 శాతం, 76 శాతం రాబడులు ఇచి్చన సంవత్సరాలూ ఉన్నాయి.ఏ సాధనానికి ఎంత? సాధారణంగా ఈక్విటీలకు ఎక్కువ కేటాయించుకోవడం వల్ల దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు అవకాశాలు ఉంటాయని చెప్పుకున్నాం. కనుక 20–30 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 70–80 శాతం వరకు కేటాయించుకున్నా పెద్ద రిస్క్ ఉండబోదు. ఎందుకంటే వారు తమ పెట్టుబడులను దీర్ఘకాలంపాటు అంటే 20 ఏళ్ల పాటు కొనసాగించే వెసులుబాటుతో ఉంటారు. అదే 30–40 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 50–70 శాతం మధ్య కేటాయించుకోవచ్చు. అంతకుపైన వయసున్న వారు 50 శాతం మించకుండా ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించుకోవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. 70 శాతం ఈక్విటీ కేటాయింపులు చేసుకునే వారు 20 శాతం డెట్‌కు, 10 శాతం బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. 50 శాతం ఈక్విటీలకు కేటాయించే వారు 30–40 శాతం డేట్‌కు, బంగారానికి 10 శాతం వరకు కేటాయించొచ్చు. ఈ గణాంకాలన్నీ సాధారణీకరించి చెప్పినవి. విడిగా చూస్తే, 30 ఏళ్ల వయసున్న వ్యక్తికి 5 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని అనుకుందాం. అటువంటప్పుడు పిల్లల ఉన్నత విద్యకు 10–15 ఏళ్ల కాలంలో నిరీ్ణత మొత్తం కావాల్సి వస్తుంది. అటువంటప్పుడు పెట్టుబడులకు 10–15 ఏళ్ల కాలం మిగిలి ఉంటుంది. కనుక ఈక్విటీలకు 70 శాతం వరకు, మిగిలినది డెట్, గోల్డ్‌కు కేటాయింపులు చేసుకోవచ్చు. పిల్లల వివాహం కోసం అయితే 20 ఏళ్లు, రిటైర్మెంట్ కోసం అయితే 30 ఏళ్ల కాలం ఉంటుంది. వీటి కోసం కూడా ఈక్విటీలకు గణనీయమైన కేటాయింపులు చేసుకోవచ్చు. ఒకవేళ ఐదేళ్లలోపు లక్ష్యాలు అయితే 80 శాతం డెట్‌కు, 20 శాతం ఈక్విటీలకు (ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్) కేటాయించుకోవచ్చు. మూడేళ్ల లక్ష్యాల కోసం అయితే పూర్తిగా డెట్‌కే పరిమితం కావడం శ్రేయస్కరం.3టీ కార్యాచరణ అస్సెట్ అలోకేషన్ విషయంలో మూడు ‘టీ’ల కార్యాచరణను ఫండ్స్ ఇండియా రీసెర్చ్ హెడ్ అరుణ్ కుమార్ తెలియజేశారు. మొదటిది కాలం (టైమ్). ‘‘చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో డెట్ (ఫిక్స్డ్ ఇన్కమ్)తో పోలి్చనప్పుడు ఈక్విటీలే మెరుగైన పనితీరు చూపించాయి. కానీ స్వల్పకాలంలో 10–20 శాతం వరకు పతనాలు కనిపిస్తుంటాయి. అలాగే ఏడు–పదేళ్లకోసారి 30–60 శాతం వరకు పతనాలు కూడా సంభవిస్తుంటాయి. గత 40 ఏళ్ల చరిత్ర చూస్తే ఇదే తెలుస్తుంది. కానీ, ఈ 10–20 శాతం దిద్దుబాట్లు 30–60 శాతం పతనాలుగా ఎప్పుడు మారతాయన్నది ఎవరూ అంచనా వేయలేరు. ఇలాంటి పతనాలను ఎక్కువ మంది తట్టుకోలేరు. అందుకే పోర్ట్‌ఫోలియోలో డెట్‌ను చేర్చుకోవాలి. ఇది నిలకడైనది. దీర్ఘకాలంలో రాబడి 5–7 శాతం మధ్యే ఉంటుంది. కనుక ఈక్విటీలకు ఎంత కేటాయించాలన్న విషయంలో కాలాన్ని చూడాలి. ఎంత ఎక్కువ కాలం ఉంటే, ఈక్విటీలకు ఎక్కువ పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. రెండోది టోలరెన్స్(టీ). అంటే నష్టాలను భరించే సామర్థ్యం. స్వల్పకాలంలో 10–20 శాతం పతనాలను తట్టుకునే సామర్థ్యం లేని వారు డెట్ కేటాయింపులు మరికాస్త పెంచుకోవచ్చు. ఈక్విటీలకు 50 శాతమే కేటాయించుకుంటే తరచూ వచ్చే పతనాల ప్రభావం తమ పోర్ట్‌ఫోలియోపై 10 శాతం, ఏడు–పదేళ్లకోసారి వచ్చే భారీ పతన ప్రభావాన్ని 25 శాతానికి తగ్గించుకోవచ్చు. మూడోది. ట్రేడాఫ్ (టీ). పెట్టుబడికి దీర్ఘకాలం ఉన్నప్పటికీ నష్టాల భయంతో రాబడుల్లో రాజీపడడం. ఏటా 12 శాతం రాబడి (ఈక్విటీల్లో దీర్ఘకాలం సగటు వార్షిక రాబడి) సంపాదిస్తే 20 ఏళ్లలో పెట్టుబడి 10 రెట్లు అవుతుంది. రాబడి ఏటా 10 శాతమే ఉంటే 20 ఏళ్లలో పెట్టుబడి ఏడు రెట్లే పెరుగుతుంది. 8 శాతం వార్షిక రాబడే వస్తే 20 ఏళ్లలో పెట్టుబడి ఐదు రేట్లే వృద్ధి చెందుతుంది. డెట్‌కు కేటాయింపులు పెంచుకున్నకొద్దీ అంతిమంగా నికర రాబడులు తగ్గుతుంటాయి’’ అని అరుణ్ కుమార్ వివరించారు. నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వారు 70–80 శాతం లార్జ్‌క్యాప్‌నకు, మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు 10–15 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు 5–10 శాతం మధ్య కేటాయించుకోవచ్చని సూచించారు. ఫండ్స్ ద్వారా అయినా సరే ఇంతే మేర ఆయా విభాగాల ఫండ్స్‌కు కేటాయింపులు చేసుకోవచ్చు. -
గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
-
PM Narendra Modi: కాంగ్రెస్ వస్తే దేశమంతటా కర్ణాటక మోడల్
ఆగ్రా/మొరేనా: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శల దాడిని రోజురోజుకూ ఉధృతం చేస్తున్నారు. సంపద పునఃపంపిణీ, ఓబీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ను ఇరుకున పెడుతున్నారు. ప్రజలు కష్టపడి సంపాదించి, దాచుకున్న సొమ్మును దోచేయడానికి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను, హక్కులను దొడ్డిదారిన కాజేసి, ఓటు బ్యాంక్‌కు కట్టబెట్టడానికి కాంగ్రెస్ పెద్ద కుట్ర పన్నిందని మరోసారి నిప్పులు చెరిగారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో, బరేలీ, షాజహాన్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని మొరేనా నగరంలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని మండిపడ్డారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే... అడ్డుగోడను నేను.. ‘‘మన తల్లులు, అక్కచెల్లెమ్మల సొత్తుపై కాంగ్రెస్ నాయకులు గురిపెట్టారు. అధికారంలోకి రాగానే తస్కరించాలని కుట్ర పన్నారు. మన ఆడపడుచుల సొమ్మును ఎవరూ దోచుకెళ్లకుండా నేను కాపలాదారుడిగా పనిచేస్తున్నా. మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా. ప్రజలకు, కాంగ్రెస్‌కు మధ్య ఒక అడ్డుగోడగా నేను నిల్చున్నా. ప్రజల ఆస్తులను కాంగ్రెస్ దోచుకోకుండా కాపాడుతున్నా. జనం ఆస్తులను, సంపదను ఎక్స్–రే తీస్తామని కాంగ్రెస్ రాజకుమారుడు అంటున్నారు. ప్రజలపై వారసత్వ పన్ను విధించాలని మరో కాంగ్రెస్ నాయకుడు చెబుతున్నారు. ఎవరైనా ఆస్తి సంపాదించి మరణిస్తే అందులో 55 శాతం ఆస్తిని స్వా«దీనం చేసుకొని, మిగతా 45 శాతం ఆస్తిని వారసులకు ఇస్తారట! ఇదెక్కడి న్యాయమో అర్థం కావడం లేదు. మతపరమైన రిజర్వేషన్లను మన రాజ్యాంగం అనుమతించదు. అయినా కాంగ్రెస్ పార్టీ మతం ఆధారంగా మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోంది. తద్వారా రాజ్యాంగాన్ని కించపరుస్తోంది. మతం ఆధారంగా రిజర్వేషన్ల వ్యవస్థ తీసుకొచ్చేందుకు ఇప్పటిదాకా కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలను కోర్టులు తిరస్కరించాయి. అందుకే ఆ పార్టీ దొడ్డిదారిని ఎంచుకుంది. మైనార్టీలను ఓబీసీ కోటాలో చేర్చి రిజర్వేషన్లు ఇచ్చేస్తోంది. కర్ణాటకలో ముస్లింలను ఇప్పటికే చట్టవిరుద్ధంగా ఓబీసీ కేటగిరీలో చేర్చి, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పదేపదే ఈ విషయం చెబుతోంది. మేనిఫెస్టోలో కూడా చేర్చింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలుత ఆంధ్రప్రదేశ్‌లోనే ముస్లిం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. కేంద్రంలో అధికారంలోకి రాగానే కర్ణాటక మోడల్‌ను దేశమంతటా అమలు చేయాల న్నదే కాంగ్రెస్ కుయుక్తి. నేను కూడా ఒక ఓబీసీనే. కర్ణాటక మోడల్ నాకు ఆందోళన కలిగిస్తోంది. ఇక సామాన్య ప్రజల సంగతి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను, హక్కులను ఎవరూ తస్కరించకుండా రక్షణ కల్పించడానికి ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కుటుంబాల్లో రెండు ఉద్యోగాలు ఉంటే అందులో ఒకటి బలవంతంగా లాగేసుకుంటారు. ముస్లింలకు కట్టబెడతారు. ఇలాంటి బుజ్జగింపు రాజకీయాలు మన దేశాన్ని ముక్కలు చేస్తాయని అందరూ తెలుసుకోవాలి. సంతుïÙ్టకరణ(ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తిపర్చడం) ద్వారా తుషీ్టకరణ(బుజ్జగింపు)ను అంతం చేయాలన్నదే మా ప్రయత్నం. అసలు లోగుట్టు ఇదే..ఎస్టేట్ డ్యూటీ(పన్ను)ని అప్పట్లో ప్రధాని రాజీవ్ గాంధీ రద్దు చేశారని కాంగ్రెస్ నాయకులు గొప్పగా చెబుతున్నారు. నిజానికి ఇందిరా గాంధీ మరణం తర్వాత ఆమె ఆస్తులను ప్రభుత్వం స్వా«దీనం చేసుకోకుండా కాపాడుకోవడానికి ఎస్టేట్ డ్యూటీని కుమారుడు రాజీవ్ గాంధీ రద్దు చేశారు. అసలు లోగుట్టు ఇదే. ఇందిరా గాంధీ నుంచి బదిలీ అయిన ఆస్తులను ఆమె కుటుంబంలో నాలుగు తరాలు చక్కగా అనుభవించాయి. ఇందిరా గాంధీ మరణం కంటే ముందు ఎస్టేట్ డ్యూటీతో భారీగా లాభపడిన కాంగ్రెస్ ఇప్పుడు అదే విధానం తీసుకురావాలని భావిస్తోంది. బీజేపీ ఉన్నంతకాలం కాంగ్రెస్ ఆటలు సాగవు. జనం ఆస్తులను కాజేసే ప్రయత్నాలను కచి్చతంగా తిప్పికొడతాం. -
Rama Navami 2024: శ్రీరాముని కటాక్షం, ఇశ్వర్యం, ఆరోగ్యం కావాలంటే..
Sri Rama Navami 2024 చైత్ర మాసం శుక్ల పక్ష నవమి రోజున శ్రీరామనవమి అత్యంత భక్తి శ్రద్దలతో జరుపు కుంటారు. ఈ సందర్బంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించడంఆనవాయితీ. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. బెల్లంతో చేసిన పానకం, వడ పప్పును దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడిని పూజించి కొన్ని నియమాలు పాటిస్తే సుఖ సంతోషాలు, సిరి సంపదలతో అందరి జీవితాలు విరాజిల్లుతాయని పెద్దలు చెబుతారు. శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే.. ఇంట్లో శాంతి, సంతోషం ఉండాలంటే శ్రీ రామ నవమి రోజున రాముని కటాక్షంతో ఐశ్వర్యం పొందాలంటే రాముడిని శంఖం, పసుపు రంగు గవ్వలను పూజించాలి. అమ్మవారికి తామర పూలను, ఎర్రని రంగు గల పువ్వులను సంపర్పించడం ద్వారా కూడా ఆర్ధిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు. గ్రహ దోషాలు తొలగిపోవాలంటే, ఐదు గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి, తులసి మొక్క వద్ద ఉంచడం వలన గ్రహ దోషాలు తొలగిపోయే అవకాశం ఉందట. రామాయణాన్ని పఠించడం, హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కూడా సంతోషం కలుగుతుందట. సంపద, శ్రేయస్సు వృద్ధి అవుతుంది. నవమి రోజున దుర్గ అమ్మవారిని కూడా పూజిస్తారు. దుర్గా సప్తశతి పారాయణం చేస్తే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని నమ్ముతారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు దుర్గా దేవిని పూజించి ఆగ్నేయ మూలలో నెయ్యి దీపం వెలిగిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం కలిగి ఆరోగ్యాన్ని పొందవచ్చని చెబుతారు. రామాలయానికి కుంకుమ జెండాను దానం చేయడంతోపాటు, దేవతలకు పసుపు ఆహారాన్ని సమర్పిస్తారు. శ్రీరాముడికి కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేస్తే ధనలాభం కలుగుతుందని విశ్వాసం. ప్రధానంగా రామమందిరంలో 'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.. సహస్తనామతత్తుల్యం శ్రీరామ నామ వరాననే'ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అంతా మంచి జరుగుతుందని రామభక్తుల విశ్వాసం. రామనవమి రోజున దేవుడికి పసుపు బట్టలు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పేదలకు అన్న దానం, వస్త్రదానం చేస్తారు. ఈ రోజు హనుమంతుని విగ్రహం దగ్గర చందనం తీసుకుని.. సీతమ్మవారి పాదాలకు పూస్తే కోరిన కోరికలు నెరవేరతాయట. -
సినిమాని తలపించే కథ! వందల కోట్ల ఆస్తులున్న కొడుక్కి చెప్పని తండ్రి..!
అత్యంత సంపన్న కుటుంబం..20 ఏళ్లు వచ్చేవరకు కొడుక్కి చెప్పని తండ్రి సినిమాల్లో, కథల్లోనూ వింటాం ఇలాంటి కథను. నిజ జీవితంలో కనిపించడం అరుదు. అయినా మిలయనీర్ కుటుంబ నేపథ్యం ఉన్న పిల్లలు కచ్చితంగా ఆ రేంజ్ తగ్గట్టు బతుకుతారు. అంతలా సాధారణ పిల్లల్లా ఉండేందుకు వారి తల్లిదండ్రులే ఒప్పుకోరు. వాస్తవికంగా అలా జరగదు. కానీ ఈ మిలియనీర్ కొడుకు కథ సినిమాని తలపించేలా వేరేలెవెల్లో ఉంది. ఇంతకీ అతడి కథ ఏంటంటే.. తండ్రి వందల కోట్ల వ్యాపార సామ్రజ్యానికి అధిపతి. అత్యం సంపన్న కుటుంబం. అయినా ఆ విషయం కొడుక్కి చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. చైనాలో అత్యంత విలువైన ప్రొడక్ట్ హునాన్ స్పైసీ గ్లూటెన్ లాటియో బ్రాండ్ మాలా ప్రిన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యుడాంగ్ కొడుకు జాంగ్ జిలాంగ్ జియుపాయ్ కథ. అతడే స్వయంగా తన తండ్రి ఆస్తిని తనకు చెప్పకుండా రహస్యంగా ఉంచినట్లు తెలిపాడు. తనకు 20 ఏళ్లు వచ్చేవరకు తన తండ్రి మనం అప్పుల్లో ఉన్నామనే చెప్పేవాడు. తన తండ్రి జాంగ్ యడాంగ్ ప్రసిద్ధ బ్రాండ్ ఓనర్ అని తెలుసు. కానీ ఎప్పుడూ కుటుంబం అప్పులు పాలయ్యిందని చెప్పేవాడు. కౌంటీలో ఓ సాధారణ ప్లాట్‌లో తాము నివశించేవారమని చెప్పుకొచ్చాడు. పైగా తన కుటుంబ నేపథ్యాన్ని ఉపయోగించకుండానే తాను ఓ మంచి పాఠశాలలో ప్రవేశం పొంది చదువుకున్నట్లు తెలిపాడు. తన కాలేజ్ చదువు పూర్తయ్యాక వెంటనే కనీసం నెలకు రూ. 60 వేలు వేతనం వచ్చే మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పాడు. ఎందుకంటే..? ఆ డబ్బుతో కుటుంబ అప్పుల్ని తీర్చాలని జిలాంగ్ భావించాడు. అయితే తండ్రి తమకు వేల కోట్లు ఆస్తులు ఉన్నాయన్న విషయం గ్యాడుయేషన్ పూర్తి అవుతుండగా చెప్పినట్లు తెలిపాడు. ఆ తర్వాత తన తండ్రి తమ కుటుంబాన్ని దాదాపు రూ. 11 కోట్లు విలువ చేసే విలాసవంతమైన విల్లాకు మార్చారని అన్నాడు. ప్రస్తుతం జిలాంగ్ తన తండ్రి కంపెనీ ఈ కామర్స్ విభాగంలోనే పనిచేస్తున్నాడు. అయితే అతడు కంపెనీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆశయంతో ఉన్నాడు. కానీ అతడి తండ్రి మాత్రం జిలాంగ్ పనితీరు బాగుంటేనే కంపెనీనీ అతడికి అప్పగిస్తానని చెబుతుండటం గమనార్హం. ఇలాంటి అద్భత కథలు నవలల్లోనూ, సినిమాల్లోనే ఉంటాయి. నిజ జీవితంలో సాధారణ యువకుడిలా పెరిగిన ఈ యువరాజు కథ చాలా అద్భుతంగా ఉంది కదూ..!. ఈ కథ పిల్లలకు ఏ వయసులో ఏది తెలియడం మంచిది అనేది బోధిస్తోంది. వారికి బాధ్యత తెలియాలంటే తండ్రి బ్యాంగ్రౌండ్‌తో పనిలేదని, స్వతహాగా అతడి కాళ్లపై నిలబడేలా పెంచితే చాలని తెలియజేస్తోంది ఈ గొప్ప కథ!. (చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కనపెట్టి అంబాసిడర్ అయిన యువతి!) -
తరతరాలకు సరిపడ సంపదలో అత్యుత్తమ దేశం ఇదే!
ఇంతవరకు ఆర్థికంగా, ఆకలి, కాలుష్యం, అక్షరాస్యతల పరంగా ఉత్తమ దేశాల జాబితను ప్రకటించడం చూశాం. అలాగే ఆ జాబితాలో తక్కువ స్థాయిలో ఉన్న దేశాలు మెరుగుపరుచుకోవాల్సిన అంశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడూ తాజాగా తరతరాలకు సరిపడ సంపదను కూడబెట్టే అత్యుతమ దేశాల జాబిత వెల్లడైంది. అందులో ఏ దేశం బెస్ట్ స్థానంలో ఉందంటే.. నిజానికి సంపాదన సంభావ్యత, కెరీర్లో పురోగతి, ఉపాధి అవకాశాలు, ప్రీమియం విద్య, ఆర్థిక చలనశీలత, జీవనోపాధి వంటి ఆరు విభిన్న పారామితుల ఆధారంగా ఆయ దేశాల తరతరాలకు సరిపడ సంపదను అంచనా వేస్తారు. ఈ జాబితను ఇచ్చేది పౌర సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్. ఈ కొత్త సూచీ ప్రకారం మొత్తం పారామితుల్లో సుమారు 85% స్కోర్‌తో స్విట్జర్లాండ్ అత్యుత్తమ స్థానాన్ని దక్కించుకుంది. ఆ పారామితులకు సంబంధించి.. సంపాదన సంభావ్యతలో (100), కెరీర్ పురోగతిలో (93), ఉపాధి అవకాశాల్లో (94) పాయింట్లతో స్విట్జర్లాండ్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతేగాదు అధిక జీవన శైలి, ఆర్థిక చలనశీలపై కూడా స్విట్జర్లాండ్ 75 పాయింట్లు సాధించగా, ప్రీమియం విద్యలో 73 పాయింట్లు స్కోర్ చేసింది. ఇలా ఆయా మొత్తం విభాగాల్లో 82 శాతం స్కోర్ చేసి అమెరికా స్విట్జర్లాండ్ తర్వాతి స్థానానికి పరిమితమయ్యింది. అయితే ఉపాధి అవకాశాల పరంగా యూఎస్ స్విట్జర్లాండ్‌తో సమానంగా 94 పాయింట్లు సంపాదించుకుంది. కానీ సంపాదన సంభావ్యత(93), కెరీర్ పురోగత(86), అధిక జీవనోపాధి(68)లలో క్షీణించింది. ఇక ఉపాధి అవకాశాలు, ప్రీమీయం విద్య పరంగా 74 పాయింట్లు స్కోర్ చేసింది. ఇక తరతరాలకు సరిపడే సంపదలో.. భారతదేశం మొత్తం పారామితుల్లో సుమారు 32% పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఇది గ్రీస్‌తో పోలిస్తే తక్కువ. అలాగే జాబితాలో మొదటి 15 స్థానాల్లో చివరి స్థానానికి పరిమితమయ్యింది భారత్. ఆర్థిక చలనశీలతలో 8 పాయింట్లతో అత్యల్ప స్కోర్ చేయగా, ఇతర పారామితుల్లో 43 పాయింట్లతో అత్యధిక పురోగతిని కలిగి ఉంది. సింగపూర్ 79%తో మూడో స్థానంలో ఉండగా, అత్యధిక ఉపాధి అవకాశాల పరంగా మిగత 15 దేశాల కంటే ఎక్కువ పాయింట్లు స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా 75% నాల్గో స్థానంలో ఉండగా, కెనడా 74%తో ఐదో స్థానంలో ఉంది. అలాగే గ్రీస్ 49%తో 15 దేశాల జాబితాలో చివరి స్థానంలో ఉంది. (చదవండి: చేతిలో చేయి వేసుకుని మరణించటం మాటలు కాదు..కన్నీళ్లు పెట్టించే భార్యభర్తల కథ!) -
300 కార్లు, ప్రైవేట్ ఆర్మీ, సొంత జెట్స్ ఇంకా...కళ్లు చెదిరే మలేషియా కింగ్ సంపద
మలేషియా కొత్త రాజుగా బిలియనీర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ (65) సింహాసనాన్ని అధిష్టించారు. దక్షిణ జోహోర్ రాష్ట్రానికి చెందిన సుల్తాన్ మలేసిమా 17వ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ సందర్బంగా ఆయనకు సంబంధించిన ఆస్తులు, ఇతర సంపదపై ఆసక్తి నెలకొంది. మలేషియాలో ఇప్పటికీ ప్రత్యేకమైన రాచరిక వ్యవస్థ అమల్లో ఉంది. తొమ్మిది రాజకుటుంబాల అధిపతులు ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒక సారి రాజుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరిని ‘‘యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్’’ అని పిలుస్తారు. దేశ రాజధాని కౌలాలంపూర్ లోని నేషనల్ ప్యాలెస్‌లో సుల్తాన్ ఇబ్రహీం.. ఇతర రాజకుటుంబాలు, ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం , క్యాబినెట్ సభ్యుల సాక్షిగా జరిగిన వేడుకలో పదవీ బాధ్యతలు చేపట్టారు. దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన సుల్తాన్ ఇబ్రహీం రియల్ ఎస్టేట్ నుండి టెలికాం , పవర్ ప్లాంట్ల దాకా విస్తృతమైన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి 5.7 బిలియన్ల డాలర్ల సంపద అతని సొంతం. బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసిన కుటుంబ సంపద 5.7 బిలియన్లు డాలర్లుగా అంచనా వేసినప్పటికీ, సుల్తాన్ నిజమైన సంపద అంతకు మించి ఉంటుందని భావిస్తారు. రియల్ ఎస్టేట్ , మైనింగ్ నుండి టెలికమ్యూనికేషన్స్ , పామాయిల్ వరకు అనేక వ్యాపారాల ద్వారా అపార సంపద అతని సొంతం. ముఖ్యంగా మలేషియా ప్రధాన సెల్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన ‘యూ’ మొబైల్లో 24శాతం వాటాతో పాటు, ఇతర అదనపు పెట్టుబడులూ ఉన్నాయి. అతని అధికారిక నివాసం ఇస్తానా బుకిట్ సెరీన్, సుల్తాన్ న కుటుంబ సంపదకు నిదర్శనం. అడాల్ఫ్ హిట్లర్ బహుమతిగా అందించినదానితో సహా ఇతనికి 300కు పైగా లగ్జరీ కార్లున్నాయి. గోల్డెన్, బ్లూ కలర్బోయింగ్ 737తో సహా, ఇతర ప్రైవేట్ జెట్లున్నాయి. వీటిన్నిటితోపాటు అతని ప్రైవేట్ సైన్యం కూడా విశేషంగా నిలుస్తోంది. సింగపూర్‌లో 4 బిలియన్ల డాలర్ల విలువైన భూమి ఉంది. ఇంకా షేర్లు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు కూడా పెద్ద ఎత్తునే ఉన్నాయి. సుల్తాన్ పెట్టుబడి పోర్ట్‌ఫోలియో మొత్తం 1.1 బిలియన్ డాలర్లు ఉంటుందట. సుల్తాన్ సింహాసనాన్ని అధిష్టించిన క్రమంలో దేశాభివృద్ధి, ఇతర దేశాలతో సంబంధాలు ఎలా ఉంటాయనేది పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యంగా మలయ్ కమ్యూనిటీకి గేట్ కీపర్, అతను చైనీస్ వ్యాపారవేత్తలతో జాయింట్ వెంచర్ల ద్వారా ప్రధాన ప్రాజెక్టులలో కీలక పాత్ర పోషించిన సుల్తాన్ రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించాడనీ, తన పూర్వీకుల మాదిరిగా కాకుండా, సుల్తాన్ ఇబ్రహీం విభిన్నంగా ఉంటాడని అంచనా. సింగపూర్ బిజినెస్ టూకూన్స్తో సన్నిహిత సంబంధాలు, ప్రముఖ చైనీస్ డెవలపర్లతో వ్యాపార అనుబంధం లాంటివి దేశీయ, విదేశాంగ విధానంతోపాటు, దేశ ఆర్థికరంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయంటున్నారు విశ్లేషకులు. -
ఎక్కువ పన్నులు కట్టాలంటున్న బిల్ గేట్స్! ఎందుకు..?
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఈయన ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం బిల్‌గేట్స్ సంపద 141 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోని సంపన్నులు ఎక్కువ పన్నులు చెల్లించాలని తాను కోరుకుంటున్నట్లు బిల్ గేట్స్ చెప్పారు. తాజాగా దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో బిల్‌గేట్స్ మాట్లాడుతూ సంపన్న దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ డబ్బును విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆర్థిక అసమానతలను సరిదిద్దడంలో ఈ చర్య సహాయపడుతుందన్నారు. కాగా ఏడాది క్రితమే ఆయన రెడ్డిట్‌లో తన 'ఆస్క్ మీ ఎనీథింగ్' ఫోరమ్‌లో చేసిన వ్యాఖ్యలో సంపన్నులకు పన్నులు ఎక్కువగా పెంచకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంపద పన్ను విధించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిస్తూ 250 మందికి పైగా అల్ట్రా-రిచ్ వ్యక్తులు బహిరంగ లేఖ విడుదల చేసినట్లు బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అత్యంత సంపన్నడైన బిల్‌గేట్స్.. అత్యధిక సంపదను కలిగి ఉన్న దేశాలు, కంపెనీలు, వ్యక్తులు మరింత ఉదారంగా ముందుకు రావాలన్నారు. అబిగైల్ డిస్నీ, 'సక్సెషన్' నటుడు బ్రియాన్ కాక్స్ వంటి వారు సంతకం చేసిన ఈ బహిరంగ లేఖలో సంపన్నులకు మరింత పన్ను విధించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. అత్యంత సంపన్నులపై అధిక పన్నులు విధించడం వల్ల వారి జీవన ప్రమాణాలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. -
హార్ట్ఎటాక్ సమస్య వెంటాడుతుందా..? అయితే ఇలా చేయండి!
'ఈ మధ్య కాలంలో దాదాపుగా 30 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్నవారు తరచుగా మృతి చెందుతూ ఉండడం ఆందోళనలకు గురిచేస్తోంది. ప్రణాళిక లేని ఆహారపు అలవాట్లు, మద్యపానం, సరైన వ్యాయామం లేకపోవడం, క్రిమిసంహారక మందులతో పండించిన కూరగాయలు, దినుసులు వంటివాడకం మితిమీరిపోవడంతోనే ఇలాంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.' పెరుగుతున్న హృద్రోగ, కాలేయ సమస్యలు తరచుగా ఆకస్మిక మరణాలు నాలుగుపదుల వయసువారే అధికం అసమతుల్య ఆహారపు అలవాట్లు, జీవనశైలే కారణం క్రమబద్ధమైన నియమాలు పాటించాలంటున్న ఆరోగ్యనిపుణులు ఎన్నో కారణాలు.. ప్రధానంగా గుండె లయతప్పడానికి ఎన్నో అంశాలు ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు పెద్దగా కారణాలేవి లేకుండానే ఇటువంటి ప్రమాదం సంభవిస్తుంది. కొందరిలో మాత్రం గుండె కండరం మందం కావడం, పుట్టుకతో గుండెలో ఉండే లోపాలు, కర్ణికలు పెద్దగా ఉండడం, జన్యుపరంగా తలెత్తే ఇతర ఇతర సమస్యలు రక్తంలో ఖనిజలవణాల సమతుల్యత లోపించడం, మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటివి కారణమవున్నాయి. బాగున్న కండరం మధ్యభాగంలోని కణాలు అతి చురుకుగా స్పందించడంతో కూడా గుండె కొట్టుకునే వేగం పెరుగుతోంది. దీంతో శరీరానికి రక్తప్రసరణ సరిగా జరగకపోవడం, ఫలితంగా తలతిరగడం, స్పహ తప్పి కోల్పోవడం, నిమిషాల వ్యవధిలోని మరణం సంభవించడం వంటి వాటికి ఆస్కారం ఉంటుంది. జీవనశైలిలో మార్పుతోనే నివారణ.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అనేక ఒత్తిడిలతో కూడిన జీవన విధానంలో ప్రశాంతత లోపించడం సమయభావంతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయం నడక, వ్యాయామక కసరత్తులు, యోగా, మెడిటేషన్ వంటివి నిపుణుల పర్యవేక్షణలో చేయడంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాము. కాలేయ సంబంధ వ్యాధుల్లో ప్రధానంగా ఆహారపు అలవాట్లు ప్రభావం చూపుతాయి. సరైన ఆహారపు అలవాట్లు లేని వ్యక్తుల్లో సమస్యలు తలెత్తడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుకోవాలి.. ఈ రోజుల్లో ఎటువంటి ఆరోగ్య సమస్య ఎటువైపు నుంచి మంచికొస్తుందో తెలియనిస్థితిలో ఉన్నాం. ఆరో గ్యపరంగా శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుకునే విధంగా నియమాలు పాటించాలి. ఆహారం పరంగా, శారీరకంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – ఎండపెల్లి అశోక్‌కుమార్, మైథిలీ వెల్నెస్ సెంటర్, నిర్మల్ నిరంతర పరీక్షలతోనే నివారణ గుండె సంబంధిత జబ్బులు ప్రస్తుత కాలంలో అధికమవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులవారు గుండె, కాలేయ సంబంధ సమస్యలకు గురవుతున్నారు. గుండె జబ్బులు ఇతర అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరీక్షలను చేయించుకోవాలి. – డాక్టర్ ఎం.ఎస్. ఆదిత్య, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
Global Wealth Report 2023: భారత్ తప్ప పలు అగ్రదేశాల్లో సంపద కరిగిపోతోంది
అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాల్లో సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో సంపద పెరుగుతోంది. భారత్‌లో తప్ప ► అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. అధిక ధరలు, డాలర్‌తో పోల్చి చూస్తే వివిధ దేశాల కరెన్సీలు పడిపోవడం, భౌగోళిక రాజకీయాలు, వాతావరణ మార్పులు వంటివెన్నో దేశాల ఆర్థిక వ్యవస్థని కుంగదీస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సంపద క్షీణించడం ప్రారంభమైంది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత మళ్లీ 2022లో ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచ దేశాలు ఎదుర్కొన్నట్టుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యూబీఎస్) రూపొందించిన గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2023లో వెల్లడైంది. ప్రపంచ దేశాల్లో అమెరికా అత్యధికంగా సంపదని కోల్పోతే ఆ తర్వాత స్థానంలో జపాన్ ఉంది. 2021లో ప్రపంచ దేశాల సంపద 466.2 ట్రిలియన్ డాలర్లు ఉండగా 2022 నాటికి 2.4% తగ్గి 454.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక సంపద తగ్గిపోవడంలో అమెరికా ముందుంది. ఏడాదిలో 5.9 ట్రిలియన్ డాలర్ల సంపదను అగ్రరాజ్యం కోల్పోయింది. ఆ తర్వాత స్థానంలో జపాన్ నిలిచింది. 2021తో పోల్చి చూస్తే ఆ దేశం 2.5 ట్రిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. ప్రాంతాల వారీగా ఇలా.. ► అత్యంత సంపన్న దేశాలున్న ఉత్తర అమెరికా, యూరప్‌లు భారీగా నష్టపోయాయి. 2022లో ఈ దేశాల్లో 10.9 ట్రిలి యన్ డాలర్ల నష్టం జరిగింది. ► ఆసియా ఫసిఫిక్ దేశాల్లో 2.1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది. ► లాటిన్ అమెరికాలో 2.4 ట్రిలియన్ డాలర్ల సంపద పెరిగింది. ► 2022లో భారీగా సంపద హరించుకుపోయిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత జపాన్, చైనా, కెనడా, ఆ్రస్టేలియా ఉన్నాయి. ► సంపద భారీగా పెరిగిన దేశాల్లో భారత్, బ్రెజిల్, మెక్సికో, రష్యా నిలిచాయి. ► తలసరి ఆదాయంలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంటే, అమెరికా, ఆస్ట్రేలియా, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లో పెరుగుతున్న సంపద ► ప్రపంచ దేశాల్లో సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో మాత్రం సంపద పెరుగుతోంది. 2021తో పోల్చి చూస్తే మన దేశ సంపద 675 బిలియన్ డాలర్లు అంటే 4.6% పెరిగింది. 2022 నాటికి 15.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనా వంటి దేశాల్లో కూడా సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో మాత్రం పెరగడం విశేషం. దేశంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అపర కుబేరులుగా మారారు. 2000 నుంచి 2022 వరకు ఏడాదికి 15% మిలియనీర్లు పెరుగుతూ వస్తున్నారు. ఉక్రెయిన్‌తో ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్నప్పటికీ రష్యా సంపద కూడా పెరగడం గమనార్హం. స్థిరంగా సంపద పెరుగుదల.. ► భారత్‌లో సంపద పెరుగుదల 20 ఏళ్లుగా స్థిరంగా కొనసాగుతోంది. మధ్య తరగతికి చెందిన వ్యక్తుల సంపద ఏడాదికి 5.9% చొప్పున పెరుగుతోంది. ఒకప్పుడు చైనాలో మధ్యతరగతి సంపద అధికంగా పెరుగుతూ ఉండేది. ఇప్పుడు భారత్ చైనా స్థానాన్ని ఆక్రమించింది. మిలియనీర్లు మన దేశంలో ఏకంగా 15% పెరుగుతూ వస్తున్నారు. మొత్తమ్మీద మిలియనీర్లు అమెరికాలోనే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా కోట్లకు పడగలెత్తిన వారు 5.9 కోట్ల మంది ఉంటే వారిలో 2.3 కోట్ల మంది అంటే 40% అమెరికాలోనే ఉన్నారు. 2027 నాటికి భారత్, చైనా, బ్రెజిల్, యూకే, దక్షిణ కొరియాలో కూడా కోటీశ్వరుల సంఖ్య పెరుగుతుందని గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ అంచనా. 2022–27 మధ్య చైనాలో కోటీశ్వరులు 26%,భారత్‌లో 11% పెరుగుతారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
అంబానీ.. అదానీ ఓకే.. మరి మనం?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఓసారి మస్క్ అని మరోసారి మరొకరని.. ఒకదాంట్లో అంబానీ టాప్ అని.. మరొకదాంట్లో అదానీ అని.. ఇలా అత్యంత కుబేరుల జాబితాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి.. ఇంతకీ దేశంలో టాప్ 1 శాతం రిచెస్ట్ జాబితాలో చేరాలంటే.. ఎంత సంపద ఉండాలో మీకు తెలుసా? తెలియదు కదా.. అందుకే ఆ పనిని గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ చేసిపెట్టింది. వివిధ దేశాల్లో టాప్ 1 శాతం ధనవంతుల జాబితాలో చేరాలంటే.. వ్యక్తిగత నికర సంపద కనీసం ఎంత ఉండాలి(కటాఫ్ మార్క్) అన్న వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం వ్యక్తిగత నికర సంపద(అప్పులన్నీ తీసేయగా మిగిలినది) కనీసం రూ.1.4 కోట్లు ఉంటే చాలు.. మీరు మన దేశంలోని 1 శాతం ధనవంతుల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చినట్లే. ప్రపంచంలో ధనికులు ఎక్కువగా ఉండే మొనాకోలో ఇది రూ.102 కోట్లుగా ఉంది. ఈ జాబితాలో మొనాకోదే ఫస్ట్ ప్లేస్. చదవండి: 10 ఏళ్లకే కంపెనీ సీఈవో.. 12 ఏళ్లకే రిటైర్మెంట్! అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదూ -
ఆనందమయ జీవితానికి నీమ్ కరోలీబాబా సూక్తులు
నీమ్ కరోలీ బాబాను హనుమంతుని స్వరూపంగా భావిస్తారు. 20వ శతాబ్ధపు మహనీయులలో అతనిని ఒకరిగా గుర్తిస్తారు. ఆయనకు ఎన్నో సిద్ధులు కూడా ఉన్నాయని చెబుతుంటారు. ఈ సిద్ధుల కారణంగానే అతని మహిమలు ప్రపంచానికంతటికీ తెలిశాయని అంటుంటారు. కరోలీ బాబా ఆశ్రమం నైనితాల్‌కు 65 కిలోమీటర్ల దూరంలోగల పంత్‌నగర్‌లో ఉంది. బాబా తన అలౌకిక శక్తులతోనే కాకుండా తన సిద్ధాంతాల ద్వారా కూడా అందరికీ సుపరిచితమయ్యారు. 1900వ సంవత్సరంలో జన్మించిన ఆయన 1973లో కన్నుమూశారు. మనిషి ఆనందంగా ఉండేందుకు జీవితంలో ఎలా మెలగాలో నీమ్ కరోలీ బాబా లోకానికి తెలియజేశారు. వీటిని అనుసరించడం ద్వారా మనిషి ప్రశాంతంగా కూడా ఉండవచ్చని బాబా తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవద్దు నీమ్ కరోలీ బాబా చెప్పినదాని ప్రకారం మనిషి ఎంత కష్టసమయంలోనైనా ఆందోళనకు లోనుకాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. కాలం ఎంత కఠినంగా ఉన్నా, ఏదో ఒకరోజు మార్పంటూ వస్తుంది. అందుకే ఎవరైనా విపత్కర పరిస్థితుల్లోనూ శాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ప్రతీ వ్యక్తీ.. ఈరోజు పరిస్థితులు బాగులేకపోయినా రేపు మంచి రోజులు వస్తాయనే నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. మనిషి భగవంతునిపై పూర్తి నమ్మకం ఉంచాలి. డబ్బును సక్రమంగా వినియోగించాలి ప్రతీ ఒక్కరూ డబ్బును సక్రమంగా వినియోగించాలి. అటువంటివారే ధనవంతులవుతారు. డబ్బు సంపాదించడంలోనే గొప్పదనం లేదని, దానిని సరిగా ఖర్చు చేయడంలోనే ఘనత ఉందన్నారు. ఇతరులను ఆదుకునేందుకు డబ్బును వెచ్చించాలి. అప్పుడే మనిషి దగ్గర ధనం నిలుస్తుంది. హనుమంతుని పూజించండి నీమ్ కరోలీ బాబా హనుమంతునిపై తన భక్తిని చాటారు. బాబాను హనుమంతుని అవతారం అని కూడా అంటుంటారు. ఎవరైతే ప్రతీరోజు హనుమంతుని పూజిస్తారో వారికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని నీమ్ కరోలీ బాబా తెలిపారు. ప్రతీవ్యక్తి రోజూ హనుమాన్ చాలీసా పఠిస్తే ధైర్యం వస్తుందని బాబా బోధించారు. -
ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులు ఏ నగరంలో ఉన్నారో తెలుసా?
కుబేరులు అనగానే మన దృష్టి వారి సంపదవైపే వెళుతుంది. ఆసక్తి ఉంటే వారి కంపెనీలు.. వాళ్లు ఏం చదువుకుకున్నారు. రోజుకి ఎంత ఆర్జిస్తున్నారు?వంటి వివరాలను తెలుసుకుంటాం. కానీ, వాళ్లు ఎక్కుడ? ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారా? ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులు ఎంత మంది ఉన్నారో గుర్తించే హెన్లీ అండ్ పార్ట్నర్ సంస్థ ‘మోస్ట్ మిలియనీర్ ఇన్ 2023’పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌లో అమెరికా న్యూయార్క్ సిటీలోనే ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులు ఉన్నట్లు తెలిపింది. దీంతో న్యూయార్క్ నగరం మరోసారి అత్యధిక ధనవంతులు జాబితాలో మరోసారి స్థానం దక్కించుకుంది. ఈ నగరంలో 3,40,000 మంది మిలియనీర్లు ఉండగా.. తర్వాత టోక్యోలో 290,300 మంది, శాన్ ఫ్రాన్సిస్కో 285,000మంది ఉన్నారు. ఈ నివేదిక ప్రపంచంలో ఎక్కువ సంపద కలిగిన ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సీఐఎస్(Commonwealth of Independent States), తూర్పు ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా, దక్షిణాసియా , ఆగ్నేయాసియాలలో మొత్తం 97 నగరాల్లో ఈ డేటాను సేకరించింది. వాటి ఆధారంగా ఏ ప్రాంతంలో ఎంతమంది మిలియనీర్లు ఉన్నారో నిర్ధారించింది. ఇక న్యూయార్క్, ది బే ఏరియా, లాస్ ఏంజిల్స్,చికాగో నగరాలు అమెరికాలో మిలియనీర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల విభాగంలో ఆధిపత్యం చెలాయించాయి. చైనాకు చెందిన రెండు నగరాలు బీజింగ్, షాంఘైలు సైతం అదే జాబితాలో ఉన్నాయి. రెసిడెంట్ హైనెట్వర్త్ జాబితాలో(HNWI) 258,000 మందితో లండన్ ఈ సంవత్సరం నాల్గవ స్థానానికి పడిపోయింది, 240,100 మందితో సింగపూర్ తర్వాతి స్థానంలో ఉంది. 2000లో లండన్ లక్షాధికారులలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది, కానీ గత 20 ఏళ్లలో ఇది జాబితా నుండి పడిపోయింది. ది బిగ్ యాపిల్‌గా పేరు గడించిన న్యూయార్క్ నగరంలో 3,40,000 మంది మిలియనీర్లు, 724 సెంటీ-మిలియనీర్లు, 58 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇక బ్రాంక్స్, బ్రూక్లిన్, మాన్‌హట్టన్, క్వీన్స్, స్టాటెన్ ఐలాండ్లు, మాన్హాటన్లోని 5వ అవెన్యూతో సహా ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన నివాసాలున్న కాలనీలుగా గుర్తింపు పొందాయి. ఇక్కడ ప్రధాన అపార్ట్మెంట్ ధరలు చదరపు మీటరుకు 27వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉండవచ్చు’ అని హెన్లీ అండ్ పార్ట్నర్ నివేదిక హైలెట్ చేసింది. చదవండి👉 అవధుల్లేని అభిమానం అంటే ఇదేనేమో..టిమ్ కుక్కు ఇంతకన్నా ఏం కావాలి! -
సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు పంచుతున్నాం: కేటీఆర్
సిరిసిల్ల: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సంపదను సృష్టిస్తున్నామని, తిరిగి ఆ సంపదను పేదలకు పంచుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహాలను ఆయన సోమవారం ఆవిష్కరించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పుడు భూముల ధరలు ఎంత ఉన్నాయని, ఇప్పుడు ఎంత ఉన్నాయో తేడాను ప్రజలు గమనించాలన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ రైతులకు రైతుబంధు ఇవ్వడంతోనే భూముల ధరలు పెరిగాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 13,117 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ వినియోగం 16 వేల మెగావాట్లకు చేరిందన్నారు. ఏటా విద్యుత్ కొనుగోలుకు రూ. 10 వేల కోట్లు వెచి్చస్తున్నామని... రూ. 50 వేల కోట్లు వెచ్చించి రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తున్నామన్నారు. రూ. 200 నుంచి రూ. 2,016కు పెన్షన్ పెంచాం.. పేదరికమే గీటురాయిగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఒకప్పుడు రూ. 200గా ఉన్న పెన్షన్‌ను రూ. 2,016కు పెంచామని గుర్తుచేశారు. తెలంగాణలో ఉన్న సౌకర్యాలు ఏ రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేశారు. ఏ ఊరికి వెళ్లినా వైకుంఠధామాలు, డంప్‌యార్డులు, పల్లె ప్రకృతివనాలు, ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఇలా ఎక్కడాలేని సౌలత్లు కలి్పంచిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. నిత్యం తమ ప్రభుత్వాన్ని నిందించే ప్రతిపక్షాలకు చెందిన నాయకులకు సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి గృహలక్ష్మి పథకం కింద రూ. 3 లక్షలు అందిస్తామన్నారు. అర్హులందరికీ డబ్బులిస్తామని కేటీఆర్ తెలిపారు. అంబేడ్కర్ చలవతోనే తెలంగాణ... దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చలవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజ్యాంగంలో నాడు ఆరి్టకల్–3ని పొందుపరచడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కంటివెలుగు పథకం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని వివరించారు. సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని కుటుంబాలేమైనా ఉంటే ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సాయాన్ని ఆయా కుటుంబాలకు అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, రాష్ట్ర పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన ఎంపీ సక్కంగ లేడు... మన ఎంపీ (కరీంనగర్) బండి సంజయ్ సక్కంగ లేడని, ఆయన సక్కంగ ఉంటే ఇప్పటికే సిరిసిల్ల జిల్లాకు రైలు సౌకర్యం వచ్చేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆయన హిందూ, ముస్లింల చిచ్చుపెట్టేలా మసీదులను కూలుస్తామని చెప్పడంతోపాటు పేపర్ లీక్‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా వినోద్‌కుమార్‌ను గెలిపిస్తే ఈపాటికి జిల్లాకు రైలు వచ్చేదన్నారు. చదవండి: సుప్రీంకు వెళితే తప్ప బిల్లులు పాస్ చేయరా? -
దేశం... ధనవంతుల భోజ్యం?
బలవంతుడిదే రాజ్యం అని లోకోక్తి. కానీ, ఇప్పుడు ధనవంతుడిదే రాజ్యం. ఈ సమకాలీన సామాజిక పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తున్నదే అయినా, తాజాగా లెక్కలతో సహా వెల్లడైంది. ప్రభుత్వేతర సంస్థ ‘ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్’ తన తాజా ప్రపంచ సంపద నివేదికలో ససాక్ష్యంగా కుండబద్దలు కొట్టింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు తొలి రోజు సోమవారం ఆక్స్‌ఫామ్ విడుదల చేసిన ఈ నివేదికలోని అంశాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కరోనా కాలం నుంచి ప్రపంచమంతటా ఆర్థిక అంతరాలు బాగా పెరిగాయన్న వాదన అక్షరాలా నిజ మని రుజువు చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై, నిరుద్యోగం పెరిగిన వేళ ప్రపంచంలోనూ, భారత్‌లోనూ సంపద అంతా కొద్దిమంది చేతుల్లోనే పోగుపడుతుండడం ఆందోళనకరం. 2020 నుంచి కొత్తగా సమకూరిన 42 లక్షల డాలర్లలో మూడింట రెండు వంతుల సంపద ప్రపంచంలోని ఒకే ఒక్క శాతం అపర కుబేరుల గుప్పెట్లో ఉంది. మిగతా ప్రపంచ జనాభా సంపాదించిన సొమ్ముకు ఇది దాదాపు రెట్టింపు అనే నిజం విస్మయపరుస్తుంది. మన దేశానికొస్తే అగ్రశ్రేణి ఒక్క శాతం మహా సంపన్నుల చేతిలోనే 2012 నుంచి 2021 మధ్య జరిగిన సంపద సృష్టిలో 40 శాతానికి పైగా చేరింది. ఇక, దేశ జనాభాలో అడుగున ఉన్నవారిలో సగం మంది వాటా మొత్తం 3 శాతమే. కరోనా వేళ ధనికులు మరింత ధనవంతులయ్యారు. కరోనాకు ముందు భారత్‌లో 102 మంది బిలి యనీర్లుంటే, ఇప్పుడు వారి సంఖ్య 166కు పెరిగింది. కరోనా నుంచి గత నవంబర్‌కు దేశంలో శత కోటీశ్వరుల సంపద 121 శాతం పెరిగింది. మరోమాటలో నిమిషానికి 2.5 కోట్ల వంతున, రోజుకు రూ. 3,068 కోట్లు వారి జేబులో చేరింది. కనివిని ఎరుగని ఈ తేడాలు కళ్ళు తిరిగేలా చేస్తున్నాయి. అలాగే, సంపన్నుల కన్నా, పేద, మధ్యతరగతి వారిపైనే అధిక పన్ను భారం పడుతోందన్న మాట ఆగి, ఆలోచించాల్సిన విషయం. భారత్‌లో జీఎస్టీ ద్వారా వస్తున్న ఆదాయంలో 64 శాతం జనాభాలోని దిగువ సగం మంది నించి ప్రభుత్వం పిండుతున్నదే. అగ్రస్థానంలోని 10 శాతం ధనికుల ద్వారా వస్తున్నది 4 శాతమే అన్న మాట గమనార్హం. ఇవన్నీ సముద్రంలో నీటిబొట్లు. భారతదేశం శరవేగంతో కేవలం సంపన్నుల రాజ్యంగా రూపాంతరం చెందుతోందన్న అంచనా మరింత గుబులు రేపుతోంది. ధనికుల దేవిడీగా మారిన వ్యవస్థలో దళితులు, ఆదివాసీలు, ముస్లిమ్‌లు, మహిళలు, అసంఘటిత కార్మికుల లాంటి అణగారిన వర్గాల బాధలకు అంతమెక్కడ? అర్ధాకలితో అలమటిస్తున్నవారికీ, మధ్యతరగతికీ మెతుకు విదల్చడానికి సందేహిస్తున్న పాలకులు జేబు నిండిన జనానికి మాత్రం గత బడ్జెట్లోనూ కార్పొరేట్ పన్నుల్లో తగ్గింపు, పన్ను మినహాయింపులు, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడం విడ్డూరం. ధనికులకు పన్ను రాయితీలిస్తే, వారి సంపద క్రమంగా దిగువవారికి అందుతుందనేది ఓ భావన. అది వట్టి భ్రమ అని ఆక్స్‌ఫామ్ తేల్చేసింది. కొద్దిరోజుల్లో కొత్త బడ్జెట్ రానున్న వేళ పెరుగుతున్న ఆర్థిక అంతరాన్ని చక్కదిద్దడానికి సంపద పన్ను విధించాలంటోంది. పేద, గొప్ప తేడాలు ఇప్పుడు ఎంతగా పెరిగాయంటే, భారత్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి 10 మంది కుబేరులపై 5 శాతం పన్ను వేసినా చాలు. దాంతో దేశంలో పిల్లలందరినీ మళ్ళీ బడి బాట పట్టించవచ్చు. దేశంలోకెల్లా మహా సంపన్నుడైన గౌతమ్ అదానీ సంపద నిరుడు 2022లో 46 శాతం మేర పెరిగింది. దేశంలోని అగ్రశ్రేణి 100 మంది అపర కుబేరుల సమష్టి సంపద ఏకంగా 66 వేల కోట్ల డాలర్లకు చేరింది. అదానీ ఒక్కరికే 2017 – 2021 మధ్య చేకూరిన లబ్ధిపై 20 శాతం పన్ను వేస్తే, రూ. 1.79 లక్షల కోట్లు వస్తుంది. దాంతో దేశంలోని ప్రాథమిక పాఠశాల టీచర్లలో 50 లక్షల పైమందికి ఏడాదంతా ఉపాధినివ్వవచ్చని ఆక్స్‌ఫామ్ ఉవాచ. ఈ అంచనాలు తార్కికంగా బాగున్నా, ఆచరణాత్మకత, గత అనుభవాలను కూడా గమనించాలి. సంపద పన్ను సంగతే తీసుకుంటే, మనదేశంలో 1957లోనే దాన్ని ప్రవేశపెట్టారు. కానీ, భారీ ఎగవేతలతో లాభం లేకపోయింది. అసమానతలూ తగ్గలేదు. చివరకు, సంపద పన్ను వసూళ్ళతో పోలిస్తే, వాటి వసూలుకు అవుతున్న ఖర్చు ఎక్కువుందంటూ 2016–17 బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దాన్ని ఎత్తేశారు. అందుకే, మళ్ళీ సంపద పన్ను విధింపు ఆలోచనపై సమగ్రంగా కసరత్తు అవసరం. పన్నుల వ్యవస్థలో మార్పులు తేవాలి. కాకుంటే, భారత్ లాంటి దేశంలో మధ్యతరగతిని పక్కనపెడితే, మహా సంపన్నులపై ఏ పన్ను వేసినా, అడ్డదోవలో దాన్ని తప్పించుకొనే పనిలో ఉంటారనేది కాదనలేని వాస్తవం. కాబట్టి, భారీ పన్నుల ప్రతిపాదన కన్నా దేశ సామాజిక – ఆర్థిక విధానంలో వారిని భాగం చేయడం లాంటి ఆలోచనలు చేయాలి. విద్య, వైద్యం, ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పనల్లో ఈ కుబేరుల సంపదను పెట్టేలా చూడాలి. దారిద్య్ర నిర్మూలనకు కార్పొరేట్ అనుకూలత కన్నా సామాన్య ప్రజానుకూల విధానాలే శరణ్యం. స్త్రీ, పురుష వేతన వ్యత్యాసాన్నీ నివారించాలి. కార్పొరేట్ భారతావనిలో సీఈఓలు ఓ సగటు మధ్యశ్రేణి ఉద్యోగితో పోలిస్తే 241 రెట్ల (కరోనాకు ముందు ఇది 191 రెట్లు) ఎక్కువ జీతం సంపాదిస్తున్న వేళ... సత్వరం ఇలాంటి పలు దిద్దుబాటు చర్యలు అవసరం. గత 15 ఏళ్ళలో 41 కోట్లమందిని దారిద్య్ర రేఖకు ఎగువకు తెచ్చామని లెక్కలు చెప్పి, సంబరపడితే చాలదు. ఇప్పటికీ అధికశాతం పేదసాదలైన ఈ దేశంలో ఆర్థిక అంతరాలు సామాజిక సంక్షోభానికి దారి తీయక ముందే పాలకులు విధానపరమైన మార్పులు చేయడమే మార్గం. -
భారత అపర కుబేరుల సంపద.. దిమ్మతిరిగి పోయే వాస్తవాలు
మన దేశంలో ధనికుల సంపద.. దాని గురించి దిమ్మ తిరిగి పోయే వాస్తవాలు ఒక అధ్యయనం వెల్లడించింది. భారత్ లో సంపన్నులు 1 శాతం ఉంటే.. దేశం మొత్తం సంపద లో 40 శాతం వాళ్ళ దగ్గరే ఉంది. ఇక సగం జనాభా దగ్గర ఉన్న సంపద కేవలం 3 శాతం మాత్రమే!!.. దావోస్ వేదికగా జనవరి 16 నుంచి జనవరి 20 వరకు వరల్డ్ ఎకనమిక్స్ ఫోరమ్ వార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లోని తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రారంభమైన స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో మనదేశ సంపన్నుల వివరాలు, వారి వద్ద ఉన్న సంపదతో ఏమేమి చేయొచ్చో పొందుపరిచింది. పిల్లలను బడుల్లో చేర్పించవచ్చు టాప్ 100 భారతీయ బిలియనీర్లకు 2.5 శాతం పన్ను విధించడం లేదా టాప్ 10 భారతీయ బిలియనీర్లపై 5 శాతం పన్ను విధించడం వల్ల పేదరికం కారణంగా చదువుకు దూరమైన పిల్లలను బడుల్లో చేర్పించవచ్చని తెలిపింది. అదాని అవాస్తవిక లాభాలపై ట్యాక్స్ విధిస్తే ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. 128.3 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ మూడో స్థానంలో ఉన్నారు. అయితే అదానీ 2017 నుంచి 2021 వరకు సంపాదించిన అవాస్తవిక లాభాలపై ఒక్కసారి ట్యాక్స్ విధిస్తే 1.79లక్షల కోట్లను సమీకరించవచ్చు. ఆ మొత్తాన్ని సంవత్సరానికి ఐదు మిలియన్లకు పైగా భారతీయ ప్రాథమిక పాఠశాల్లో ఉపాధ్యాయుల్ని నియమించుకునేందుకు సరిపోతుంది. పోషక ఆహార లోపం తగ్గించొచ్చు పోషకాహార లోపం.. చిక్కిపోయిన (ఐదేండ్లలోపు పిల్లలు) (ఎత్తుకు తగ్గ బరువులేని పిల్లలు), ఎదుగుదలలేని పిల్లలు (వయస్సుకు తగ్గ ఎత్తులేని పిల్లలు) పిల్లల మరణాలు వంటి నాలుగు పారామీటర్స్ ఆధారంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (ప్రపంచ ఆకలి సూచీ)-2022లో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా 121 దేశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులను విడుదల చేయగా భారత్ 107వ స్థానాన్ని దక్కించుకుంది. తాజా ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ నివేదికలో.. భారత్‌లో ఉన్న బిలియనీర్లలో ఒక్కసారి 2శాతం ట్యాక్స్ విధిస్తే రూ.40,423కోట్లను సమీకరించవచ్చు. ఆ మొత్తంతో వచ్చే మూడేళ్లలో దేశ మొత్తంలో పోషక ఆహార లోపంతో బాధపడుతున్న వారికి బలవర్ధకమైన ఆహారాన్ని అందించవచ్చు. 1.5 రెట్లు ఎక్కువ భారత్‌లో ఉన్న 10 మంది బిలియనీర్లపై ఒక్కసారి 5శాతం ట్యాక్స్ విధిస్తే రూ.1.37లక్షల కోట్లు సమీకరించవచ్చు. ఆ మొత్తం ఎంతంటే? 2022-23లో కేంద్ర సంక్షేమ పథకాలైన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ (రూ.86,200 కోట్లు), మినిస్ట్రీ ఆఫ్ ఆయిష్ (రూ.3,050 కోట్లు) అంచనా వేసిన నిధుల కంటే 1.5 రెట్లు ఎక్కువ. పురుషుడి సంపాదన రూపాయి, మహిళ సంపాదన 63 పైసలు లింగ అసమానతపై నివేదిక ప్రకారం..ఒక పురుషుడు రూపాయి సంపాదిస్తే.. అందులో మహిళ సంపాదించేది 63 పైసలు సంపద రోజుకు రూ.3,608 కోట్లు పెరిగింది కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి 2022 నవంబర్ వరకు భారతదేశంలోని బిలియనీర్లు తమ సంపద 121 శాతం లేదా రోజుకు రూ. 3,608 కోట్ల మేర పెరిగినట్లు ఆక్స్‌ఫామ్ తెలిపింది. 3శాతం జీఎస్టీ వసూళ్లు మరోవైపు, 2021-22లో దేశ వ్యాప్తంగా మొత్తం రూ. 14.83 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు అయ్యాయి. ఆ జీఎస్టీ దేశంలోని అట్టడుగు వర్గాల నుంచి 64 శాతం వస్తే, భారత్‌లో ఉన్న టాప్ 10 బిలియనీర్ల నుంచి కేవలం 3శాతం జీఎస్టీ వసూలైంది. పెరిగిపోతున్న బిలియనీర్లు భారతదేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102 కాగా 2022 నాటికి 166కు పెరిగిందని ఆక్స్‌ఫామ్ తెలిపింది. ఆక్సోఫామ్ ఆధారాలు ఎలా సేకరించిందంటే దేశంలోని సంపద అసమానత, బిలియనీర్ల సంపదను పరిశీలించేందుకు ఫోర్బ్స్,క్రెడిట్ సూయిస్ వంటి దిగ్గజ సంస్థల నివేదికల్ని ఆక్సోఫామ్ సంపాదించింది.అయితే నివేదికలో చేసిన వాదనలను ధృవీకరించడానికి ఎన్ఎస్ఎస్, యూనియన్ బడ్జెట్ పత్రాలు, పార్లమెంటరీ ప్రశ్నలు మొదలైన ప్రభుత్వ నివేదికలు ఉపయోగించింది. చివరిగా::: అవాస్తవిక లాభాలంటే వాణిజ్య భాషలో అవాస్తవిక లాభాలంటే ఉదాహరణకు..రమేష్ అనే వ్యక్తి ఏడాది క్రితం ఓ కంపెనీకి చెందిన ఓక్కో స్టాక్‌ను రూ.100 పెట్టి కొనుగోలు చేస్తే.. ఆ స్టాక్ విలువ ప్రస్తుతం రూ.105లకు చేరుతుంది. అలా పెరిగిన రూ.5 అవాస్తవిక లాభాలంటారు. చదవండి👉 చైనాపై అదానీ సెటైర్లు, ‘ఇంట కుమ్ములాటలు.. బయట ఏకాకి!’ -
ఆనంద్ రాఠీ వెల్త్ లాభం జూమ్
న్యూఢిల్లీ: నాన్‌బ్యాంక్ వెల్త్ సొల్యూషన్స్ కంపెనీ ఆనంద్ రాఠీ వెల్త్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 35 శాతం జంప్‌చేసి రూ. 43 కోట్లను అధిగమించింది. గతేడాది (2021– 22) ఇదే కాలంలో రూ. 32 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 29 శాతం ఎగసి రూ. 140 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 109 కోట్ల టర్నోవర్ నమోదైంది. కంపెనీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూ ఎం) 20 శాతం వృద్ధితో రూ. 38,517 కోట్లకు చేరాయి. మ్యూచువల్ ఫండ్స్ పంపిణీ, ఫై నాన్షియల్ ప్రొడక్టుల విక్రయం తదితర ఫైనాన్షియల్ సర్వీసులను కంపెనీ అందిస్తోంది. ఫలితాల నేపథ్యంలో ఆనంద్ రాఠీ వెల్త్ షేరు ఎన్ఎస్ఈలో 2.4 శాతం జంప్‌చేసి రూ. 773 వద్ద ముగిసింది. తొలుత రూ. 780 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. -
అయ్యో.. ఎలన్ మస్క్! సంచలన పతనం
ఎలన్ మస్క్.. వ్యాపార రంగంలోనే కాదు సోషల్ మీడియాలోనూ ఓ ట్రెండ్ సెట్టర్. గత రెండేళ్లుగా ప్రపంచ మీడియా సంస్థల్లో ఆయన పేరు నానని రోజంటూ లేదు. అంతలా సంచలనాలకు తెర లేపాడు ఆయన. పైపెచ్చు 2021 జనవరిలో వ్యక్తిగత సంపదను 200 బిలియన్ల మార్క్ దాటించుకుని.. మానవ చరిత్రలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తద్వారా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను దాటేసి.. అపర కుబేరుల జాబితాలో అగ్ర స్థానంలో కొనసాగుతూ వస్తున్నాడు. అయితే.. ట్విటర్ కొనుగోలు నేపథ్యంలో ఎలన్ మస్క్‌కు బ్యాడ్ టైం నడుస్తున్నట్లు ఉంది. 2022 ఎలన్ మస్క్‌కు ఏరకంగానూ కలిసి రాలేదు. ఈ ఏడాదిలో చెప్పుకోదగ్గ పరిణామాలేవీ ఆయన ఖాతాలో పడకపోవడం గమనార్హం. పైగా ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం.. ప్రపంచ అపర కుబేరుల జాబితా నుంచి రెండో స్థానానికి పడిపోయారు ఆయన. ఏడాది చివరకల్లా.. 150 బిలియన్ డాలర్లకు దిగువకు పడిపోయింది ఆయన సంపద. ఒకానొక టైంకి 137 బిలియన్ డాలర్లకు చేరుకుంది కూడా. చరిత్రలో తొలి ట్రిలియన్ బిలియనీర్‌గా నిలిచిన ఘనత ఎలన్ మస్క్‌దే. నవంబర్ 4, 2021 నాటికి ఆయన సంపద అక్షరాల 340 బిలియన్ డాలర్లు. కానీ, ఆ మార్క్‌ను ఆయన ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయాడు!. ఎలన్ మస్క్ సంపద తరుగుతూ వస్తోంది. మరోవైపు ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినా.. ఆయన సంపదపై ఆ ప్రభావం పడదని ఆర్థిక విశ్లేషకులు భావించారు. కానీ, అ అంచనా తప్పింది. టెస్లా షేర్లు గణనీయంగా, క్రమం తప్పకుండా పతనం అవుతుండడం(2022లో ఏకంగా 65 శాతం దాకా పతనం అయ్యింది) ఆయన సంపద కరిగిపోవడానికి ప్రధాన కారణంగా మారింది. అయితే ఎలన్ మస్క్ మాత్రం టెస్లా అద్భుతంగా పని చేస్తోందని, అది అంతకు ముందు కంటే అద్భుతంగా ఉందంటూ డిసెంబర్ 16వ తేదీన ఒక ట్వీట్ చేశాడు. గణాంకాలు మాత్రం విశ్లేషకుల అంచనాలకు తగ్గట్లే ఉన్నాయి. మిగతా సొంత కంపెనీలతో(న్యూరాలింక్, ఓపెన్ ఏఐ, స్పేస్ఎక్స్.. దీని అనుబంధ సంస్థ స్టార్‌లింక్, ది బోరింగ్ కంపెనీలతో ఎలన్ మస్క్‌కు పెద్దగా ఒరిగింది కూడా ఏం లేకపోవడం గమనార్హం!. ఈ కథనం రాసే సమయానికి ఫోర్బ్స్ లిస్ట్‌లో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ అర్నాల్ట్ & ఫ్యామిలీ 179 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానంలో ఎలన్ మస్క్ 146 బిలియన్ డాలర్లత సంపదతో నిలిచారు. అంటే ఏడాది కాలంలోనే ఏకంగా 200 బిలియన్ డాలర్ల సంపదను ఆయన కోల్పోయారన్నమాట. మానవ చరిత్రలో ఇప్పటిదాకా ఇంతలా ఓ వ్యక్తి సంపదను కోల్పోయిందే లేదు. ఇక.. భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ 127 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: రిలయన్స్‌ను ముకేశ్ ఎలా ఉరుకులు పెట్టించారో తెలుసా? -
సంపన్నులకు కలిసిరాని 2022.. బిలియనీర్ క్లబ్ నుంచి 22 అవుట్!
న్యూఢిల్లీ: ఐశ్వర్యవంతులకు ఈ ఏడాది అచ్చిరాలేదు. మార్కెట్ల పతనంతో బిలియనీర్ల స్థానాలు చెల్లా చెదురయ్యాయి. బడా బిలియనీర్లు మరింత బలపడితే.. బిలియనీర్ క్లబ్ (కనీసం బిలియన్ డాలర్లు అంతకుమించి సంపద ఉన్నవారు)లో దిగువన ఉన్నవారు ఏకంగా ఆ హోదానే కోల్పోవాల్సి వచ్చింది. ఒక్క అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీకి 2022ను జాక్‌పాట్ సంవత్సరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే దేశ కుబేరుడిగా ఉన్న ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి, దేశంలోనే అత్యంత ఐశ్వర్యమంతుడిగా మొదటి స్థానానికి చేరుకోవడమే కాదు.. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి ఎగబాకారు. 2021 చివరికి అదానీ నెట్‌వర్త్ (సంపద విలువ) 80 బిలియన్ డాలర్లు ఉండగా, ఏడాది తిరిగేసరికి 70 శాతం పెరిగి 135.7 బిలియన్ డాలర్లకు చేరింది. బ్లూంబర్గ్ గణాంకాల ప్రకారం ఆసియాలోనూ అదానీయే నంబర్ 1గా ఉన్నారు. డాలర్ మారకంలో బిలియనీర్ ప్రమోటర్ల సంఖ్య ఈ ఏడాది 120కి తగ్గింది. 2021 చివరికి వీరి సంఖ్య 142గా ఉంది. అయితే 24 మంది ప్రమోటర్లు బిలియనీర్ క్లబ్లో స్థానం కోల్పోగా.. కొత్తగా ఐఐఎఫ్ఎల్ ప్రమోటర్లు ఇద్దరు ఉమ్మడిగా, క్యాప్రిగ్లోబల్ ప్రమోటర్ ఇందులోకి వచ్చి చేరారు. బిలియనీర్ల ఉమ్మడి సంపద సైతం ఈ ఏడాది కొంత కరిగిపోయింది. 8.8 శాతం క్షీణించి 685 బిలియన్ డాలర్లకు (రూ.56.62 లక్షల కోట్లు) పరిమితమైంది. 2021 చివరికి వీరి ఉమ్మడి సంపద విలువ 751.6 బిలియన్ డాలర్లుగా ఉండడాన్ని గమనించొచ్చు. దేశంలోని టాప్–10 సంపన్న పారిశ్రామికవేత్తల్లో ఈ ఏడాది గౌతమ్ అదానీతోపాటు, సన్ ఫార్మా దిలీప్ సంఘ్వి, భారతీ ఎయిర్టెల్ సునీల్ భారతీ మిట్టల్ మినహా మిగిలిన ఏడుగురి సంపద విలువ క్షీణించింది. ముకేశ్ సంపద 102 బిలియన్ డాలర్లు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్థానచలనం పొందారు. 2021 చివరికి జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, దీన్ని గౌతమ్ అదానీకి కోల్పోయి రెండో స్థానంలోకి వచ్చారు. ముకేశ్ అంబానీ కుటుంబ సంపద విలువ 2.5 శాతం క్షీణించి గతేడాది చివరికి ఉన్న 104.4 బిలియన్ డాలర్ల నుంచి 101.75 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం పెరుగుదల, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ప్రభావాలతో ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లు బలహీన పనితీరు చూపించడం, బిలియనీర్ల సంపద తగ్గడానికి గల కారణాల్లో ప్రధానమైనది. టెలికం రంగంలో చిన్నాచితకా కంపెనీలన్నీ మూతపడిపోవడం, చివరికి వొడాఫోన్ ఐడియా సైతం బక్కచిక్కడం, టారిఫ్‌లను గణనీయంగా పెంచడంతో ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ సంపద వృద్ధి చెందింది. చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 తగ్గింపు.. త్వరపడాలి, అప్పటివరకే! -
మేము ఎన్నారైలు అయ్యాము కదా.. ఇంకా తెప్ప ఎందుకు..!?
గడచిన ముప్ఫై ఏళ్లలో కొత్తగా ఎగువ మధ్యతరగతిగా మారిన వర్గాలను, ఈ రోజు మీరు ఇంత భద్రంగా ఉండడానికి, ఇవీ కారణాలు అని చెప్పి వారిని ఒప్పించడం అంత తేలిక ఏమీ కాదు. కొన్నివేల రూపాయలతో కొన్న స్థలం నుంచి ఇప్పుడు నమ్మశక్యం కానంత ‘రిటర్న్స్’ వచ్చేట్టుగా మీ ఆస్తి విలువ పెరిగింది అంటే– అప్పట్లో దాన్ని కొనడం తప్ప, అదనంగా మీరు చేసింది ఏమీలేదు, అని వాళ్లనిప్పుడు ఒప్పించడం కష్టం. మీ పిల్లల జీతాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి కూడా– ‘మార్కెట్ ఎకానమీ’ కారణం తప్ప, అందులో మన పనితనం ఏమీ లేదు. ఇవన్నీ సంపద పంపిణీ క్రమంలో, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల వల్ల మనకు అందిన ఫలాలు. అయితే, ఇలా కొత్తగా ఎగువ మధ్యతరగతిగా ‘ప్రమోట్’ అయిన వారే చిత్రంగా ఇప్పుడు మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలనూ, వాటిని అమలుచేస్తున్న ప్రభుత్వ ఉదార వైఖరినీ తప్పు పడుతున్నారు. ఇటువంటి ధోరణి మునుపు ఉందా అని వెనక్కి చూస్తే, 1970–80 దశకాల మధ్య కాలంలో అమలైన సంక్షేమం పట్ల ఈ తరహా విమర్శ దాదాపు లేదనే చెప్పాలి. కారణం– స్వాత్యంత్య్రం తర్వాత, కేంద్ర ప్రభుత్వ ‘సంక్షేమ విధానాల’ వల్ల కులాలతో సంబంధం లేకుండా ఆర్థికంగా చితికి ఉన్న అన్ని వర్గాలు ఎంతోకొంత మేలుపొందాయి. కులీన వర్గాలుగా పేర్కొనే ఎగువ మధ్యతరగతి ఇప్పటిలా ప్రభుత్వ ఉదారవాద చర్యల్ని తప్పుపట్టేది కాదు. అప్పట్లో ఎక్కువమంది స్వాగతించిన – రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ వంటి నిర్ణయాలు అటువంటివే. అప్పట్లో భద్రతతో స్థిరపడి ఉన్న కులీన వర్గాలలోని విద్యాధికులు, దేశంలో జరుగుతున్న మార్పు ‘ప్రాసెస్’లో చురుకైన భాగస్వామ్య పాత్ర పోషించారు. వారు ఇక్కడ చదివి, విదేశాల్లో ఉన్నత విద్య తర్వాత ఇండియా తిరిగివచ్చి, దేశం చేస్తున్న ప్రగతి యజ్ఞంలో తమదైన పాత్ర పోషించారు. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు (బయోకెమిస్ట్), డాక్టర్ యలవర్తి నాయుడమ్మ (లెదర్ టెక్నాలజీ) అటువంటివారే. ఇటీవల డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఇంకా రెండేళ్ల పాటు చీఫ్ సైంటిస్ట్‌గా కొనసాగే అవకాశాన్ని ఈ నవంబర్ 30 నాటికి వదులుకుని, ఇండియాలో బాలల ఆరోగ్య రంగంలో చేయాల్సింది చాలా ఉందని వెనక్కి రావడం ఈ ధోరణికి కొనసాగింపే అవుతుంది. ఇప్పుడైనా ఇది చర్చించాల్సిన అంశం ఎందుకైందంటే– ‘ఏరు దాటి మేము ‘ఎన్నారై’లు అయ్యాము కదా, మా వెనక వచ్చేవారి కోసం ఇంకా తెప్ప ఎందుకు ఉండాలి’ అని పేద కుటుంబాల కోసం అమలవుతున్న ప్రభుత్వ పథకాల పట్ల వారికున్న దుగ్ధను దాచుకోవడం లేదు. లేని వంకలు వెతికి మరీ ప్రభుత్వానికి మసిపూయడానికి వీరు చేస్తున్న ప్రయత్నంలో దాపరికం ఏమీలేదు. అది తెలుస్తున్నది. ఈ క్రమంలో వాదన కోసం, వీరికి ఆక్షేపించడానికి మరేదీ కనిపించక కొందరు– ‘రోడ్లు సంగతి ఏమిటి?’ అంటున్నారు. కానీ మూడేళ్ళకు ముందు రోడ్ల పరిస్థితి ఏమిటి, ఈ మూడేళ్ళలో క్రమం తప్పకుండా కురుస్తున్న వానలు వల్ల గట్లకు నీళ్లు తన్నుతూ నిండుతున్న చెరువులు, వాగుల సంగతి వీరికి పట్టదు. అంతేనా ‘కరోనా’ కాలంలో అత్యవసర వైద్యసేవల కోసం చేసిన వ్యయం గురించి కానీ, దాని వల్ల ప్రభుత్వ ఖజానాకు పడిన గండి గురించి గానీ – ఎంతో సౌకర్యంగా వీరు తమ వాదనలో దాటవేస్తారు. నిజానికి వీరి సమస్య వేరు. అదేమో పైకి చెప్పుకోలేనిది. ఈ ప్రభుత్వం ప్రతి రంగాన్నీ క్రమబద్ధీకరించడంతో, మునుపటిలా వీరి ఆస్తుల విలువ పెరగడం లేదు. విషయం ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒకప్పుడు బలుపుగా కనిపించిన వాపులన్నీ పొంగు తగ్గి నరాలు బయటపడి, అన్ని రంగాలు మళ్ళీ సాధారణ ఆరోగ్య స్థితికి చేరు తున్నాయి. ఈ మూడేళ్ళలో ఇక్కడ రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీలు, డీజీపీ ఇప్పటికీ ఇక్కడ పనిచేయడానికి సుముఖత చూపడం, ‘బ్యూరోక్రసీ’కి ఇక్కడున్న పని అనుకూల వాతావరణంగా చూడాల్సి ఉంటుంది. కానీ కొందరికి ఇవేమీ జరగకూడదు. జరుగుతున్నవి ఎలాగోలా మధ్యలో ఆగిపోవాలి. అయితే ఎలా? ప్రభుత్వంపై ఫిర్యాదు ఉన్నవర్గాలు ఇప్పుడు పెద్దగా లేవు. ఫిర్యాదు ఉన్న వారి సమస్యేమో – ‘బ్లాక్ అండ్ వైట్’లో చెప్పలేనిది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యక్షుడు క్లావ్ స్వాబ్ 2004 ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో మాట్లాడుతూ– ‘సమాజంలో ప్రతి ఒక్కరికీ వికాసం పొందే అవకాశం కల్పిస్తే తప్ప, మనకు ఎంతమాత్రం భద్రత ఉండదు’ అనే హెచ్చరిక అయినా వీళ్ళకిప్పుడు అర్థం కావడం ఎంతైనా అవసరం. (క్లిక్ చేయండి: ‘మై హూ నా’ హామీ తీరేదెన్నడు?) - జాన్సన్ చోరగుడి అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
ఆస్తిలో సింహభాగం సేవకే.. తేల్చి చెప్పిన అమెజాన్ అధినేత
న్యూయార్క్: తాను ఆర్జించిన సంపదలో అధిక భాగం సొమ్మును సమాజ సేవ కోసమే ఖర్చు చేస్తానని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తేల్చిచెప్పారు. ఫోర్బ్స్ మేగజైన్ తాజా అంచనా ప్రకారం.. బెజోస్ ఆస్తి విలువ 124.1 బిలియన్ డాలర్లు (రూ.10,04,934 కోట్లు). ఆయన తన మిత్రురాలు లారెన్ సాంచెజ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తన సంపదలో సింహభాగం వాటాను సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఎంత సొమ్ము ఇస్తారు? ఎవరికి ఇస్తారు? అనే విషయాలు మాత్రం బహిర్గతం చేయలేదు. అమెజాన్ సంస్థను నిర్మించడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని, అలాగే సమాజ సేవ కూడా అనుకున్నంత సులభం కాదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్, వారెన్ బఫెట్ తదితరులు సమాజ సేవకు అంకితం అవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. జెఫ్ బెజోస్ ఇలాంటి ప్రతిజ్ఞ చేయలేదంటూ గతంలో విమర్శలు వచ్చాయి. -
చరిత్రకెక్కిన యంగ్ సీఈఓ.. రాత్రికి రాత్రే లక్షల కోట్లు ఆవిరి, 94 శాతం సంపద కరిగిపాయే!
ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరు ఊహించలేరు. జీవితంలో ఒక్కోసారి అకస్మిక ప్రమాదాలు , అదృష్టాలు, అలానే నష్టాలు.. ఇవన్నీ సడన్ సునామీలా మన లైఫ్‌లోకి వచ్చి పలకరిస్తుంటాయి. సరిగ్గా ఇదే తరహాలో ఓ యంగ్ బిలియనీర్‌కి భారీ షాక్ తగిలింది. రాత్రికి రాత్రి లక్షల కోట్లు పొయాయి. ఎలా అని అనుకుంటున్నారా! వివరాల్లోకి వెళితే.. క్రిప్టో కరెన్సీల (Cryptocurrency) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇక పెట్టుబడిదారులకు దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. క్రిప్టో కరెన్సీ అనేది ఎవరి నియంత్రణలో లేకుండా లావాదేవీలు జరుగుతున్న వ్యవస్థ. అందుకే ఇందులో షాకింగ్ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. తాజాగా క్రిప్టో ఎక్స్చేంజీ కంపెనీ అయిన FTX ఫౌండర్, సీఈఓ, అయిన సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ రాత్రికి రాత్రే తన బిలియనీర్ హోదాను కోల్పోయారు. తన వ్యక్తిగత సంపద ఏకంగా 94 శాతం ఆవిరై ప్రస్తుతం 991.5 బిలియన్ డాలర్లకు ఒక్కసారిగా ఢమాల్ అంటూ పడిపోయింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ఒక్కరోజులో అత్యధిక సంపద కోల్పోయిన బిలియనీర్‌గా చరిత్రలోకెక్కారు ఈ యంగ్ బిలియనీర్. క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టిఎక్స్‌ను( Crypto Exchange FTX) తన ప్రత్యర్థి కంపెనీ బినాన్స్( Binanace) కొనుగోలు చేస్తున్నట్లు ఈ యంగ్ బిలియనీర్ ప్రకటించిన తర్వాత బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ సంపద కరిగిపోయింది. కాయిన్‌డెస్క్ ప్రకారం, సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ FTX అమ్మకంపై వార్త వెలువడే ముందు $15.2 బిలియన్ల విలువ ఉన్నట్లు అంచనా. ఆ తర్వాత అతని సంపద నుంచి దాదాపు $14.6 బిలియన్లు తుడిచిపెట్టుకుపోయాయి. బినాన్స్ హెడ్ చాంగ్‌పెంగ్ జావో ఈ అంశంపై ఒక ట్వీట్ చేశారు. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాం అయిన బినాన్స్.. FTXను కొనుగోలు చేయడానికి తమ కంపెనీ ఆసక్తి చూపిస్తుందని, డీల్ కూడా కుదిరిందని తెలిపారు. చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! -
సొంతంగా కారు కూడా లేదు.. ములాయం సింగ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
లక్నో: రాజకీయ దిగ్గజం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) కన్నుమూసిన విషయం తెలిసింది. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ములాయం.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆనారోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22 నుంచి ములాయం ఆసుపత్రిలోనే ఉన్నారు. ములాయం సింగ్ మరణాన్ని ఆయన కుమారుడు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘మా తండ్రి, మీ ‘నేతాజీ’ ఇక లేరు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు అక్టోబర్ 11(మంగళవారం) సౌఫయ్ గ్రామంలో జరుగుతాయి’. అని తెలిపారు. ములాయం సింగ్ ఆస్తులు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన ప్రాంతీయ నేతగా గుర్తింపు పొందిన ములాయం సింగ్ ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో ములాయం సింగ్ నికర ఆస్తులు విలువ రూ. 20.56 కోట్లు. ఈ అఫిడవిట్ ప్రకారం తన మొత్తం చర, స్థిరాస్తులు దాదాపు రూ.16.5 కోట్లు.(16,52,44,300). 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌తో పోలిస్తే ఇది రూ. 3.20 కోట్లు తక్కువ. వీటితోపాటు ములాయం ఏటా రూ.32.02 లక్షలు సంపాదిస్తుండగా.. ఆయన భార్య సాధనా యాదవ్ వార్షికాదాయాన్ని రూ. 25.61 లక్షలుగా పేర్కొన్నారు. చదవండి: ప్చ్.. ములాయంకు ఆ కోరిక మాత్రం తీరలేదు బ్యాంక్ డిపాజిట్లు, బంగారం ములాయం సింగ్ యాదవ్ వద్ద రూ.16,75,416 నగదు ఉండగా, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఎన్బీఎఫ్సీల్లో రూ.40,13,928 డిపాజిట్లు ఉన్నాయి. మొత్తం రూ. 9,52,298 విలువైన ఎల్ఐసీ ఇతర బీమా పాలసీలను కలిగి ఉన్నాడు. అంతేగాక ఆభరణాల విషయానికొస్తే.. ఆయన వద్ద 7.50 కిలోల బంగారం ఉంది. దీని విలువ రూ.2,41,52,365. తదితర ప్రాంతాల్లో ఆయనకు రూ.7,89,88,000 విలువైన వ్యవసాయ భూమి కూడా ఉంది. వ్యవసాయేతర భూమిపరంగా రూ.1,44,60,000 విలువైన ఆస్తులు ఉన్నాయి. యూపీలో అతని నివాస ప్రాపర్టీ ధర రూ.6,83,84,566. చదవండి: రక్షణ మంత్రిగా, సీఎంగా ఎనలేని సేవలందించారు! కారు లేదు, కొడుకు నుంచి అప్పు ములాయం సింగ్ యాదవ్ తన వద్ద కారు లేదని అఫిడవిట్లో వెల్లడించారు. అలాగే కుమారుడు అఖిలేష్ యాదవ్ నుంచి రూ.2,13,80,000(2.13 కోట్లు) అప్పు కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఇక ములాయం చదువు విషయానికొస్తే 1968లో ఆగ్రా యూనివర్శిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పూర్తి చేశారు. 1964లో ఆగ్రా యూనివర్శిటీ నుంచి బీటీ పట్టా పొందారు. ఎస్పీలో విషాదఛాయలు ములాయం మృతితో ఎస్పీ పార్టీలో విషాద చాయలు అలుముకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ములాయం అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన సైఫయిలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి, రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. కాగా 22 నవంబర్ 1939న యూపీలోని ఇటావా జిల్లాసైఫయ్ గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన ములాయం రాజకీయాల్లోకి రాకముందు టీచర్‌గా సేవలు అందించారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. ఇది కూడా చదవండి: ఎస్పీకి ఆయనో నేతాజీ.. కుస్తీల వీరుడు కూడా! ములాయం సింగ్ ఉత్తర ప్రదేశ్‌కు మూడుసార్లు సీఎంగా పనిచేశారు. యూపీ రాజకీయాల్లో చక్రం తిప్పడంతోపాటు జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రముఖపాత్ర పోషించారు.పదిసార్లు ఎమ్మెల్యే, ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో(1996-98) రక్షణశాఖ మంత్రిగానూ సేవలందించారు. సుధీర్ఘకాలంపాటు పార్లమెంటేరియన్‌గా కొనసాగారు. పార్టీ నేతలు, అభిమానులు ఆయన్ను ముద్దుగా నేతాజీ అని పిలుచుకుంటారు. ఆయన తుదిశ్వాస వరకు మెయిన్‌పూరి లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. -
మంచి మాట..: ఏది నిజమైన సంపద?
సంపద అంటే చాలామంది దృష్టిలో, భవంతులు, పొలాలు. మరికొందరికి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు. ఇంకొందరి భావనలో వాహనాలు, ఇళ్ళ స్థలాలు. కషీవలుడికి పంట, పశువులు, పండితుడికి జ్ఞానం... ఇలా సంపదను ఎన్నో రకాలుగా భావించి నిర్వచించవచ్చు. ఇది లౌకిక దృష్టి, సహజమైనది. ఆ రకమైన సంపద మన జీవనానికి అవసరమైనది. అయితే, సంపదంటే కేవలం ఇదే కాదు, ఈ భావనలకు లేదా మరికొన్ని ఇటువంటి భావనలకే ఈ మాట అర్థాన్ని పరిమితం చేయలేం. ఇది అర్థమయితేనే దాని లోతైన, విస్తృతార్థం బోధపడుతుంది. ఇహపరమైన సంపద ఏ రూపంలో ఉన్నా, తరతరాలకు తరగనిదైనా ఎవరి దగ్గర ఉన్నా వారికి తృప్తి అనేది ఉండాలి. తమ శక్తి మేరకు కూడబెట్టామన్న ఆలోచన రావాలి. ఇంకా ఎక్కువ పొందాలి అన్న తీవ్రమైన కోరిక కూడదు. అది ఉన్నవారు ప్రశాంతతకు దూరమవుతారు. అపార సంపన్నులైనా పరిమిత ప్రాథమిక అవసరాలతో, కోరికలతో నిరాడంబర జీవితం గడపగలగాలి. తమ తోటి వారికి ఆర్ధిక సహాయం చేయగలిగే దృష్టి రావాలి. ఆపన్నులకు చేయాత నివ్వాలన్న భావన రావాలి. ఇలా ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన నిజమైన సంపద. ఈ తృప్తి, నిరాడంబర జీవితం, పక్కవారిని ఆదుకోవాలన్న ఆలోచన ఉన్న వారు ఎంత పేదవారైనా ఐశ్వర్యవంతులే. ఆ ఆలోచన లేని వారు ఎంత ధనవంతులైనా అభాగ్యులే. గురువుల నుండి నేర్చుకున్న విద్యకు మెరుగు లు దిద్ది మన పరిశీలనా దృష్టితో దానిని మరింతగా వృద్ధి చేసుకోవాలి. ఇతరులకు అందివ్వగలగాలి. అపుడు అదెంతో సుసంపన్నమవుతుంది. ఇలా గురువులే కాదు ఇతరులూ చేయవచ్చు. గురువుల జ్ఞానం లేదా పాండిత్యం వారి శిష్యప్రశిష్యుల ద్వారా సర్వవ్యాపితమై అ దేశం జ్ఞాన సంపదగా నిక్షిప్తమవుతుంది. ‘మిడాస్ టచ్’ అనే కథలో ఒక రాజు తను ముట్టుకున్నది ప్రతిది బంగారంగా మార్చగల వరం పొందాడు. ఇక తన ఆనందానికి అవధులే లేవనుకుంటూ తన రాజభవనంలోని ప్రతి దానిని ముట్టుకుని హేమమయం చేసుకున్నాడు. తను తినే ఆహారం, తాగే మంచి నీరు, చివరకు తన కూతురు బంగారు విగ్రహంగా మారి పోవటం చూసి నిశ్చేష్టుడై, తన వరాన్ని వెనుకకు తీసుకోమని ఆ దేవతను వేడుకున్నాడు. నిజమైన ప్రేమ, అనుబంధాలు ముఖ్యమైన వని, అవే నిజమైన సంపదని గ్రహించాడు. నిజమైన సంపద ఇహపరమైనది కాదు. దానిని మన భౌతిక సంపదతో కొలవలేం. మన వ్యక్తిత్వం, గుణశీలత, మానవీయతలను మన ముందు తరాలవారికి వారసత్వంగా ఇవ్వగలగాలి. అదే నిజమైన సంపద. ఒక దేశంలోని అద్భుత కట్టడాలు సృజనశీలురు వారి అపురూప సృష్టి, సంగీత, సాహిత్య ప్రవాహాలు, శిల్ప సంపద, జీవనవిధానం, ఆహారం, నాట్యం, చలనచిత్రాలు, శాస్త్రవేత్తల అద్భుత మేధస్సు.. వీటి కలయిక ఆ దేశ సంస్కృతిగా భావన చేస్తారు. ఈ సంస్కృతి ఆ దేశ సంపదవుతుంది. వీటికి మనం జత చేయవలసిన అంశాలు ఆ దేశ ప్రజల నీతి, నిజాయితీ, నైతిక వర్తన, నిబద్ధత, వ్యక్తిత్వం, వారి ఆలోచనా తీరు. ఇవి వారికి వారసత్వసంపదగా వచ్చిన సంస్కృతిని మరింత ఉదాత్తంగా చేస్తుంది. ఇహపరమైన సంపదే కాకుండా ప్రతి ఒక్కరికీ సహజసిద్ధమైన చక్కని లక్షణాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఆలోచనలు. మనల్ని సక్రమమార్గంలో పయనింపచేసే పథాలు. మనలోని అంతర్గత శక్తులకు సరైన ఆకృతి వీటివల్లే వస్తుంది. ఆలోచనలు మనిషి వ్యక్తిత్వ వికాసాన్నే కాదు సమాజ, దేశ వికాసాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. దేశ ప్రజల సక్రమ ఆలోచనా సరళి దేశ సంపదగానే భావించాలి. – బొడ్డపాటి చంద్రశేఖర్, అంగ్లోపన్యాసకులు -
ఐశ్వర్యం వస్తుందని.. బాలుడి నరబలి
న్యూఢిల్లీ: మూఢనమ్మకం అభంశుభం తెలియని ఓ ఆరేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. సంపద వస్తుందనే అంధ విశ్వాసంతో మానవత్వం మరిచి పసివాడిని నరబలి ఇచ్చారు. దేశ రాజధానిలో∙ఈ ఘోరం చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన అజయ్ కుమార్, అమర్ కుమార్ దక్షిణ ఢిల్లీ లోధి కాలనీలోని మురికివాడలో ఉంటున్నారు. అక్కడే యూపీకి చెందిన బాధిత బాలుడి కుటుంబం ఉంటోంది. వీరంతా భవన నిర్మాణ కార్మికులు. అజయ్, అమర్ శనివారం రాత్రి తమ గుడిసెలో పాటలు పాడుతూ పూజలు మొదలుపెట్టారు. అది చూసేందుకు బాలుడు వెళ్లాడు. పూజలు ముగిశాక అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ, తన కుమారుడు ఎంతకీ రాకపోయేసరికి వెతుక్కుంటూ తండ్రి వెళ్లాడు. ఆ గుడిసెలో నుంచి రక్తం చారికలుగా ప్రవహిస్తూ కనిపించింది. లోపల మంచం కింద తన కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో హతాశుడయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు వస్తుందనే మూఢ నమ్మకంతోనే తమ వద్దకు వచ్చిన బాలుడి తలపై మోది, చాకుతో గొంతుకోసి చంపినట్లు అజయ్, అమర్ పోలీసుల విచారణలో వెల్లడించారు. -
కుబేరుల అడ్డాల గురించి తెలుసా? తక్కువ పన్నుల వల్లే..
న్యూయార్క్: ప్రపంచంలో అపర కుబేరుల అడ్డా జాబితా వెల్లడైంది. ఎక్కువగా ఉన్న నగరాల్లో న్యూయార్క్, టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రెసిడెన్సీ అడ్వైజరీ సంస్థ ‘హెన్లీ అండ్ పార్ట్నర్స్ గ్రూప్’ తాజా నివేదికలో ఈ మేరకు వెల్లడించింది. ధనవంతులకు అడ్డా అయిన మొదటి 10 నగరాల్లో 5 నగరాలు అమెరికాలోనే ఉండడం విశేషం. ► 2022లో తొలి అర్ధభాగంలో న్యూయార్క్ సిటీ 12 శాతం మిలియనీర్లను కోల్పోయింది. శాన్ఫ్రాన్సిస్కోలో మిలియనీర్లు 4 శాతం పెరిగారు. లండన్‌లో 9 శాతం తగ్గిపోయారు. ► సౌదీ అరేబియా రాజధాని రియాద్, యునైటెట్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని షార్జాలో సంపన్నుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. ► అబూ దాబీ, దుబాయ్ సిటీలు బడా బాబులను ఆకర్శిస్తున్నాయి. ధనవంతులు ఆయా నగరాల్లో నివసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అక్కడ తక్కువ పన్నులు, కొత్త కొత్త నివాస పథకాలు అమల్లోకి వస్తుండడమే ఉండడమే ఇందుకు కారణం. ► రష్యా ధనవంతులంతా యూఏఈకి వస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, రష్యాపై ఆంక్షలూ ఇందుకు ప్రధానకారణం. ► సంపన్నుల నగరాల జాబితాలో చైనాలోని బీజింగ్, షాంఘై సిటీలు తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్నాయి. ► ఇక భారత్‌లోని ముంబై నగరం 25వ స్థానంలో నిలిచింది. ► ఈ ఏడాది సంపద తరలిపోతున్న దేశాల్లో రష్యా తర్వాత రెండో స్థానం చైనాదేనని ‘హెన్లీ అండ్ పార్ట్నర్స్ గ్రూప్’ అంచనా వేసింది. ఇదీ చదవండి: పెరగడమే కాదు.. తగ్గడమూ ప్రమాదమే! -
బెజోస్ నుంచి మస్క్ దాకా, ప్రపంచ బిలియనీర్లకు భారీ షాక్
న్యూఢిల్లీ: అమెరికా ఎకానమీలో ముదురుతున్న మాంద్యం భయాలకు తోడు, ఊహించినదానికంటే ఎక్కువగా నమోదైన అధిక ద్రవ్యోల్బణం కారణంగా అక్కడి మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఫలితంగా భారీగా ఫెడ్ వడ్డింపు తప్పదనే భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని అత్యంత సంపన్న బిలియనీర్ల సంపద మంగళవారం నాడు 93 బిలియన్ డాలర్ల మేర పడిపోయింది. ఇది తొమ్మితో అత్యంత దారుణమైన రోజువారీ నష్టమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. (బెజోస్,మస్క్ సరే! మరి అదానీ, అంబానీ సంపద మాట ఏంటి?) బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అమెరికా కుబేరుల సంపద భారీగా తుడుచిపెట్టుకుపోయింది. ముఖ్యంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద ఒక్క రోజు లోనే రూ. 80 వేల కోట్లు (9.8 బిలియన్ డాలర్లు)ను కోల్పోయారు.. అలాగే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నికర విలువలో రూ.70 వేల కోట్లు (8.4 బిలియన డాలర్లను) పడిపోయింది. అంతేకాదు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ , స్టీవ్ బాల్మెర్లు ఇదే బాటలో పయనించారు. వీరి సంపద మొత్తం 4 బిలియన్ డాలర్లకు పైగా క్షీణించగా, టాప్ 10 జాబితాలోని ఇతర బిలియనీర్లు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వరుసగా 3.4 బిలియన్ డాలర్లు, 2.8 బిలియన్ డాలర్లను కోల్పోయారు. కాగా అమెరికా వినియోగదారుల ధరల సూచీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8.3 శాతం మేర పెరిగింది. ఇది 8.1 శాతంగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. దీంతో ఇది మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో గత ఐదు రోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. -
రోజురోజుకూ పెరుగుతున్న వ్యత్యాసాలు
దేశంలో పేదల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. సరైన పోషకాహారం లభించక కోట్లమంది రక్త హీనతతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మరొక వైపున కొద్ది మంది సర్వభోగాలూ అనుభవిస్తు న్నారు. దేశంలో ఈ దారుణ పరిస్థితులకు కారకులు ఎవరు? కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆర్థిక సంస్కరణల కారణంగా సంపద కొందరి దగ్గరే పోగుపడటం ప్రారంభమైంది. భారతదేశంలో ఆదాయం, సంపద పరంగా తీవ్ర అసమానతలు ఉన్నాయని ప్యారిస్ లోని అధ్యయన సంస్థ (వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్) 2022 నివేదిక వెల్లడించింది. 2021లో భారత సమాజంలోని 10శాతం అగ్రశ్రేణి సంపన్న వర్గం జాతీయ ఆదాయంలో 57 శాతం కలిగి ఉంది. అందులోని ఒక శాతం అగ్ర ధనిక వర్గం 22 శాతం వాటాను సొంతం చేసుకుంది. 50 శాతం ప్రజల వాటా 13 శాతం మాత్రమే. 1980 నుంచి భారత్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే ఈ పరిస్థితికి కారణమని నివేదిక వెల్లడించింది. ఇండియాలో ప్రైవేట్ వ్యక్తుల సంపద 1980లో 290 శాతం ఉంటే 2020 నాటికి 560 శాతానికి పెరిగింది. మరొక వైపున ప్రపంచంలో అత్యంత పేదరికం ఉన్న దేశాల్లో భారత్ మొదటి వరుసలో ఉంది. ప్రపంచం మొత్తం మీద అత్యంత పేదరికం అనుభవిస్తున్నవారు 68.9 కోట్లు ఉండగా... అందులో భారతదేశం వాటా 20.17 శాతంగా ఉంది. ఆర్థిక అసమానతల ఫలితంగా పేదలు పస్తులతో అర్ధాకలితో కాలం గడుపుతున్నారు. ప్రపంచ ఆహార సంస్థ ‘పోషక, ఆహార భద్రత– 2018’ నివేదిక ప్రకారం 19.59 కోట్ల మంది భారత ప్రజలు పస్తులతో పడుకుంటున్నారు. 2018 ప్రపంచ ఆకలి సూచీ(జీహెచ్ఐ) మేరకు 119 దేశాల్లో భారత్ 103వ స్థానంలో ఉంది. ఆహార భద్రత సూచీ ప్రకారం 113 దేశాల్లో భారత్ 76వ స్థానంలో ఉంది. ఈ విషయంలో శ్రీలంక, ఘనా, బొలీవియా కన్నా వెనకబడి ఉంది. పోషకాహారం లోపం వలన 17.3 శాతం చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు లేరు. 2015–16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేతో పోలిస్తే దేశంలో మరింత ఎక్కువ మందిలో రక్త హీనత ఏర్పడింది. చిన్నపిల్లల్లో, గర్భిణుల్లో అధికంగా రక్త హీనత ఉంది. ‘జాతీయ ఆహార భద్రత చట్టం’ అమలులోకి వచ్చి 54 ఏళ్లయినా ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వీటిని ప్రభుత్వాలు గుర్తించ నిరాకరిస్తున్నాయి. 2015–18లో దేశవ్యాప్తంగా ఆకలి చావులు సంభవించాయి. 2018లో 46 మంది ఆకలితో మరణించారు. స్వరాజ్ అభియాన్ సంస్థ 2015 చేసిన సర్వే వివరాల ప్రకారం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోకి వచ్చే బుందేల్ ఖండ్ ప్రాంతం లోని 13 జిల్లాల్లోని 38 శాతం గ్రామాల్లో 8 నెలల వ్యవధిలో పల్లెకొకరు చొప్పున పస్తులతో మరణిం చారు. మోదీ ప్రభుత్వం మాత్రం అవి ఆకలి చావులు కావనీ, అనారోగ్య కారణాలతో చనిపోయారనీ చెప్పి బాధ్యత నుంచి తప్పించుకుంది. పేదరికానికి, అనారోగ్య సమస్యలకు, ఆకలి చావులకు దుర్భరమైన ఆర్థిక పరిస్థితులే కారణం. ప్రభుత్వ పథకాలు వలన పేదల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడలేదని ప్రస్తుత పరిస్థితులే నిరూపిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ పేదల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే తక్షణం తీసుకోవాల్సిన చర్యలున్నాయి. గ్రామీణ పేదలకు సేద్యపు భూమి పంపిణీ చేసి, హక్కు కల్పించాలి. పట్టణ పేదలకు, శ్రామికులకు ఉపాధి కల్పించే పరిశ్రమలు నెలకొల్పి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి. వారికి వాటిల్లో భాగస్వామ్యం కల్పించాలి. ఇందు కోసం గ్రామీణ, పట్టణ పేదలు సమష్టిగా ఉద్యమించాలి. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) - బొల్లిముంత సాంబశివరావు రైతు కూలీ సంఘం ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
గౌతమ్ అదానీ మరో ఘనత: బిజినెస్ మాగ్నెట్లకు షాకిచ్చి మరీ
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపారదిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి మరీ ప్రపంచ కుబేరుల సరసన చోటు సంపాదించడం విశేషం. అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానాన్ని సాధించిన తొలి ఆసియా వ్యక్తిగా రికార్డును తన ఖతాలో వేసుకున్నారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, చైనాకు చెందిన జాక్ మా, సంపన్నుల జాబితాలో నిలిచినప్పటికీ ఎప్పుడూ మొదటి మూడు స్థానాలకు చేరుకోలేదు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆసియాకు చెందిన వ్యక్తి మొదటి మూడు స్థానాల్లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. 137.4 బిలియన్ల డాలర్ల మొత్తం నికర విలువతో, 60 ఏళ్ల అదానీ, సంపదలో లూయిస్ విట్టన్ ఛైర్మన్ ఆర్నాల్ట్‌ను అధిగమించారు. అంతేకాదు ఈ ర్యాంకింగ్‌లో బిజినెస్ మాగ్నెట్ ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌ల సమీపంలోకి వచ్చారు. ప్రస్తుతం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ నికర విలువ వరుసగా 251 బిలియన్ డాలర్లు, 153 బిలియన్ డాలర్లుగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. కాగా ఈ ఇండెక్స్‌లో ముఖేశ్ అంబానీ మొత్తం 91.9 బిలియన్ల డాలర్లతో 11వ స్థానంలో ఉన్నారు. దేశీయంగా అదానీ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ తర్వాత మూడో అతిపెద్ద వ్యాపారసంస్థగా ఉంది. ఒక్క 2022 లోనే అదానీ సంపద 60.9 బిలియన్ డాలర్లు పెరిగింది. మిగిలిన బిలియనీర్లతో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ. ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలి ఆసియా కుబేరుడిగా ముఖేశ్ అంబానీని దాటేశారు. ఆ తరువాత ఏప్రిల్‌లో సెంట్ బిలియనీర్ అయ్యారు. గతనెలలో మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ అధినేత బిల్‌గేట్స్‌ను తలదన్ని ప్రపంచంలో నాల్గవ సంపన్న వ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. -
అయ్యయ్యో అదానీ...అదరగొట్టిన అంబానీ
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి టాప్‌లోకి దూసుకొచ్చారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కి వెనక్కి నెట్టి ఇండియా, ఆసియా బిలియనీర్‌గా తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకున్నారు. శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) షేర్లు రికార్డు స్థాయిలో లాభపడటంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, రిలయన్స్ ఛైర్మన్ అంబానీ నికర సంపద విలువ 99.7 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఎనిమిదో స్థానానికి ఎగబాగారు. ఇక గౌతం అదానీ నికర విలువ 98.7 బిలియన్ డాలర్లు, సూచీలో తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రిలయన్స్ అంబానీని అధిగమించిన గౌతం అదానీ ఆసియాలో అత్యంత సంపన్నవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, ముఖేష్ అంబానీ నికర విలువ 104.7 డాలర్లు బిలియన్లకు పెరిగింది. మరోవైపు ఈ వారం అదానీ గ్రూప్ స్టాక్‌లలో అమ్మకాల నేపథ్యంలో గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ నికర సంపద 100.1 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. -
వారసత్వ రక్షణ బాధ్యత ప్రజలపైనే
కడప కల్చరల్: ముందుతరం పెద్దలు అయాచితంగా మనకు ఎంతో గొప్ప వారసత్వ సంపదను అందించారు. వాటిని పరిక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యేటా ఏప్రిల్ 18న ప్రపంచ వ్యాప్తంగా వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించకుంటూ వారసత్వ సంపద పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి జరుగుతోంది. వారసత్వ సంపద పరిస్థితి గురించి ప్రత్యేక కథనం. ప్రపంచంలోని ఘనమైన వారసత్వ సంపదలో మనజిల్లాలోని గండికోట కూడా ముందు వరుసలో నిలుస్తుంది. జిల్లాలోని సిద్దవటం కోట కూడా నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. సిద్దవటం కోటలో బురుజులు, గోడ కూలుతున్నాయి. వాటికి కూడా తక్షణ మరమ్మతులు అవసరం. ప్రజలకు ఈ సంపదను రక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత గురించి వివరించాల్సిన బాధ్యత గల వారు పర్యాటకులను నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతుండడంతో క్రమంగా సందర్శకుల సంఖ్యతోపాటు ఆదాయం తగ్గుతోంది. -
తెలంగాణ రాష్ట్ర సగం సంపద హైదరాబాద్‌లోనే..!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సంపదలో సగం మొత్తం హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమై ఉంది. రాష్ట్రంలోని బ్యాంకులలో ఉన్న మొత్తం డిపాజిట్ల విలువలో హైదరాబాద్ వాటా సగం. దేశంలో అతి చిన్న రాష్ట్రం అయిన తెలంగాణలో 5442 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఇందులో ఉన్న డిపాజిట్ల విలువ 6,11,401 కోట్లు అయితే, హైదరాబాద్‌లోనే 3 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే, తెలంగాణలోని అనేక జిల్లాల్లో 2,000 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లు ఉన్నాయి. రాష్ట్ర సాధారణ క్రెడిట్ స్కోరు డిపాజిట్ నిష్పత్తి 93 శాతంగా ఉంది. ఇది రాష్ట్ర పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థను సూచిస్తుంది. ఇటీవల రాష్ట్ర ప్రణాళిక మండలి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గణాంక సారాంశానికి అనుగుణంగా, హైదరాబాద్ నగరంలోని 1,202 బ్రాంచ్‌లలో 3,61,115 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అందులో మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో 93,039 కోట్ల డిపాజిట్లు ఉంటే, రంగారెడ్డికి 30,179 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అభివృద్ధి గురించి దేశవ్యాప్త ఇన్వెంటరీ ఛేంజ్(ఎన్ఎస్ఈ) అనేక మంది నిర్వాహకుల్లో ఒకరైన ఓకే నరసింహ మూర్తి వివరిస్తూ ఇలా అన్నారు. "సాధారణంగా, మంచి & స్థిరమైన ఆదాయం కలిగిన నగరాలు అధిక డిపాజిట్లను కలిగి ఉంటాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో మంచి స్థిరమైన ఆదాయం గల రెండు మహానగరాలను కలిగి ఉన్న వివిధ జిల్లాల్లో కూడా అధిక డిపాజిట్లను కలిగి ఉండవచ్చు. అయితే, తెలంగాణలో మూడు జిల్లాలు(హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి, రంగారెడ్డి) ఉన్నాయి. అయితే ఈ మూడు అన్నీ కూడా హైదరాబాద్‌లో ఒక భాగం"అని ఆయన అన్నారు. తెలంగాణలోని చాలా జిల్లాల్లో కేవలం కొన్ని కమర్షియల్ బ్యాంకు బ్రాంచ్‌లు మాత్రమే ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం 2,000 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లను కలిగి ఉన్నాయి. (చదవండి: సరికొత్త హంగులతో విడుదలైన ఎంజీ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారు..!) -
ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన కంపెనీ.. ఐదేళ్లలో రూ. 9.70 లక్షల కోట్లు
దేశంలోనే అగ్రగామి వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన రిలయన్స్ తాజాగా మరో ఘనత సాధించింది. గడిచిన ఐదేళ్ల కాలంలో ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్టర్లకు అత్యధిక లాభాలు అందించిన సంస్థగా రికార్డుకెక్కింది. మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే మోతీలాల్ ఓస్వాల్ సంస్థ తాజాగా వార్షిక సంపద సృష్టి నివేదిక విడుదల చేసింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్‌తో పాటు ఇన్వెస్ట్ సర్వీసులను ఈ సంస్థ అందిస్తోంది. ఐదేళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుని ఈక్విటీ మార్కెట్లలో కంపెనీల పెర్ఫార్మెన్సుల ఆధారంగా ఈ జాబితాను ఆ సంస్థ ప్రకటిస్తుంది. రిలయన్స్ నంబర్ 1 మోతీలాల్ రిపోర్టులో ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూపు ప్రథమ స్థానంలో నిలిచింది. 2016 నుంచి 2021 వరకు ఈక్విటీ మార్కెట్లో ఈ సంస్థ షేర్లు గణనీయంగా పెరిగాయి. తద్వారా ఈ షేర్లలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల ఇంట ఏకంగా రూ. 9.7 లక్షల కోట్ల సంపద జమ అయ్యింది. అంతకు ముందు 2014-19 టైం పీరియడ్‌లో రూ.5.6 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. రెండో స్థానంలో టీసీఎస్ దేశ వ్యాపార దిగ్గజ సంస్థల్లో ఒకటైన టాటా గ్రూపు సైతం సంపద సృష్టిలో ఎప్పటిలాగే ముందు వరుసలోనే నిలిచింది. ఈ గ్రూపుకి చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ. 7.3 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రూ.5.2 లక్షల కోట్ల స్థానంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రూ.3.2 లక్షల కోట్లతో హిందూస్థాన్ యూనీలీవర్, రూ.3.3 లక్షల కోట్లతో ఇన్ఫోసిస్ సంస్థలు నిలిచాయి. బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ. కోటక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థలు టాప్‌టెన్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. టాప్ 100.. రూ. 71 లక్షల కోట్లు మోతీలాల్ ఓస్వాల్ 26 యాన్వువల్ వెల్త్ క్రియేషన్ స్టడీలో ఇండియాలో టాప్ 100 సంస్థలు కలిసి రూ. 71 లక్షల కోట్ల సంపదను సృష్టించినట్టు మోతీలాల్ ఓస్వాల్ నివేదిక పేర్కొంది. 2016 నుంచి 2021 వరకు ఐదేళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నివేదిక సిద్ధం చేసింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో సంపద సృష్టి జరగలేదని ఆ నివేదిక పేర్కొంది. అంతకు ముందు 2014-19 వ్యవధికి సంబంధించి రూ. 49 లక్షల కోట్ల సంపద మార్కెట్లోకి వచ్చి పడింది. చదవండి: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1 -
అమెరికాను దాటి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా చైనా..
బీజింగ్: ప్రపంచలో అత్యంత ధనిక దేశంగా చైనా కొత్త రికార్డ్ సృష్టించింది. సంపద సృష్టిలో అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి నెంబర్ వన్‌గా డ్రాగన్ దేశం అవతరించింది. గడిచిన రెండు దశాబ్ధాల్లో ప్రపంచ సంపదలో చైనా సంపద మూడు రేట్లు పెరిగినట్లు బ్యూమ్బెర్గ్లోని నివేదిక వెల్లడించింది. మెకిన్సే అండ్ కో పరిశోధనా విభాగం 10 దేశాల బ్యాలెన్స్ షీట్లను విశ్లేషించి ఈ నివేదిక అందించినట్లు పేర్కొంది. ప్రపంచం మొత్తం ఆదాయంలో 60 శాతం ఈ పది దేశాల వద్దే ఉన్నట్లు పేర్కొంది. ఆ దేశాల జాబితాలో అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో, స్వీడన్లు ఉన్నాయి. మెకిన్సే ఏజెన్సీ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సంపద 2000లో 156 ట్రిలియన్ డాలర్లు ఉండగా ఇది 2020లో అనూహ్యంగా 514 ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లు వెల్లడించింది. దీనిలో చైనాకు అత్యధిక వాటా లభించిందని, ప్రపంచ ఆదాయంలో దాదాపు మూడో వంతు చైనా సొంతమైందని తెలిపింది. కాగా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు మనం సంపన్నులమయ్యామని జూరిచ్‌లోని మెకన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ భాగస్వామి జాన్ మిచ్‌కి తెలిపారు. 2000 సంవత్సరంలో 7 ట్రిలియన్ల డాలర్లు ఉన్న చైనా సంపద ఇప్పుడు 120 ట్రిలియన్ల డాలర్లకు చేరుకున్నట్లు వెల్లడించారు. ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా చేరిన తర్వాత ఆ దేశ సంపద దూసుకెళ్తున్నట్లు మెకన్సీ తన రిపోర్ట్‌లో తెలిపింది. మరోవైపు అమెరికా సంపద రెండితలు పెరిగి 90 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంది. చైనా, అమెరికా ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్న దేశాలు. అయితే ఈ రెండు దేశాల్లో మూడింట రెండొంతుల సంపద కేవలం 10 శాతం కుటుంబాల వద్దే ఉందని ఈ నివేదిక పేర్కొంది. కేవలం వారు మాత్రమే మరింత ధనవంతులు అవుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 68 శాతం నికర సంపద మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉందని నివేదిక తెలిపింది. -
అటు అందం..ఇటు యవ్వనం: ఇంకెందుకు ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ చిరునవ్వు దినోత్సవం ప్రతి సంవత్సరం, అక్టోబర్ మొదటి శుక్రవారం జరుపుకుంటాం. ఈ స్మైల్ డేను తొలిసారిగా 1999లో అమెరికన్ ఆర్టిస్ట్ హార్వే బాల్ ప్రారంభించారు. నవ్వుతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియజేయడంమే దీని ఉద్దేశం. పని ఒత్తిడినుంచి మన బాడీ రిలాక్స్ అయ్యేందుకు ఓ చక్కటి చిరునవ్వు చాలు. శరీరంలో అనేక చక్కటి మార్పులకు శ్రీకారం చుడుతుంది చిరునవ్వు. ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా గుండె కదలికలు, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మనతోపాటు, మనచుట్టూ ఉన్నవారిని కూడా సంతోషకరంగా ఉండేలా చేస్తుంది. నగుమోముతో ఉంటే మీరే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. ఎందుకంటే ఎప్పటికీ యవ్వనంగా ఉంటారు కాబట్టి. నవ్వు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సాధారణ జలుబు, ఫ్లూనుంచి సులువుగా బయటపడవచ్చు, అంతేనా సహజమైన పెయిన్ కిల్లర్‌గా కూడా పనిచేస్తుంది. నవ్వినప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు సహజమైన పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తాయి. సెరోటోనిన్ సహజమైన యాంటీడిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. తద్వారా మన మానసిక స్థితిని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచేలా దోహదపడుతుంది. నవ్వడం వలన సగటున కనీసం 3 సంవత్సరాల వయసు తగ్గి, మరింత యవ్వనంగా కనిపించేలా చేస్తాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. చిరునవ్వులు చిందిస్తూ.. హాయిగా జీవిద్దాం! -
మైక్రోసాప్ట్కు షాక్; టాప్‌లోకి దూసుకొచ్చిన జెఫ్ బెజోస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థపాకుడు జెఫ్ బెజోస్ సంపద మరోసారి ఆల్ టైం రికార్డుకు చేరింది. పెంటగాన్ కీలక ప్రకటనతో ఆయన ఆస్తులు కనీవినీ ఎరగని రీతిలో ఆకాశమే హద్దుగా దూసుకు పోయాయి. తద్వారా బెజోస్ నికరసంపద ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరింది. ప్రధానంగా అమెజాన్ షేర్లు 4.7 శాతం పెరగడంతో ఆయన నికర ఆస్తుల విలువ 211 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 15.69 లక్షల కోట్లు) చేరడం విశేషం. ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్ సంస్థతో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్టును రద్దుచేసుకున్నట్లు పెంటగాన్ ప్రకటించడంతో అమెజాన్ షేర్‌పై ఇన్వెస్టర్ల ఆసక్తి నెలకొంది. 2019 లో మైక్రోసాఫ్ట్ సంస్థతో 10 బిలియన్ డాలర్ల క్లౌడ్-కంప్యూటింగ్ కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు పెంటగాన్ మంగళవారం తెలిపింది. దీంతో షేర్లు అమాంతం పుంజుకున్నాయి. మంగళవారం అమెజాన్ షేర్ విలువ 8.4 బిలియన్ డాలర్ల మే లాభపడింది. ఈ ర్యాలీతో జెఫ్ బెజోస్ సంపదన 8.4 బిలియన్ డాలర్లు పుంజుకుంది. ఫలితంగా ఆయన నికర విలువ 211 బిలియన్ డాలర్లకు చేరింది. మాకెంజీ స్కాట్ : ఇచ్చిందంతా తిరిగొచ్చింది తాజా పరిణామంతో అటు బెజోస్ మాజీ భార్య ,ప్రపంచంలోని 15 వ రిచెస్ట్ పర్సన్ మాకెంజీ స్కాట్ సంపద ఏకంగా 2.9 బిలియన్ డాలర్లు పెరిగింది. అంతేకాదు ఈ సంవత్సరం ఇప్పటివరకు ఆమె దానం చేసిన 2.7 బిలియన్ల డార్లను మించిపోవడంమరో విశేషం. కాగా ఈ ఏడాది జనవరిలో 210 బిలియన్ డాలర్ల సంపదతో టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ టాప్ ప్లేస్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రికార్డును జెఫ్ బెజోస్ బద్దలుకొట్టి అపరకుబేరుడి రికార్డును మరోసారి చేజిక్కించుకున్నారు. 57 ఏళ్ల బెజోస్ 27 సంవత్సరాల సుదీర్ఘ కరియర్ తరువాత ఇటీవల అమెజాన్ సీఈఓ పదవి నుంచి తప్పుకుని, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. -
ఇన్వెస్టర్ల సంపద రికార్డు: సెన్సెక్స్ నెక్ట్స్ టార్గెట్
సాక్షి,ముంబై: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలపడింది. అటు ఎనలిస్టులు కూడా లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో తిరిగి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడితుందని భావిస్తున్నారు.వరుసగా నాలుగో రోజు కరోనా కొత్త కేసులు లక్ష మార్క్‌కు దిగి రావడం, చక్కటి వర్షపాతం వార్తలతో వరుసగా రెండవ సెషన్లోనూ దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల మోత మోగింది. కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేశాయి. ఫలితంగా బీఎస్ఈ మార్కెట్ క్యాప్ ఈ రోజు రికార్డు స్థాయిలో 231.52 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఏడాది మార్చి 23 కనిష్టంతో పోలిస్తే ఇది 129.66 లక్షల కోట్ల రూపాయలు లేదా 127.29శాతం ఎక్కువ. అంటే గత14 నెలల్లో స్టాక్ మార్కెట్ , పెట్టుబడిదారుల సంపదలో గణనీయంగా పుంజుకుందన్నమాట. శుక్రవారం సెన్సెక్స్ 52,641 వద్ద, నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 15,835 జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16 న సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 52,516వద్ద, నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయిని 15,431ని తాకింది. సెన్సెక్స్ ఈ సంవత్సరం ప్రారంభం నుండి 10.09శాతం లేదా 4,816 పాయింట్లు సాధించింది. నిఫ్టీ 13.24శాతం లేదా 1,851 పాయింట్లు పెరిగింది. ఒక సంవత్సరంలో 59.86 శాతం లేదా 5,922 పాయింట్లు ఎగిసింది. ఈ రికార్డుర్యాలీ తరువాత ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. మరికొంతమంది మార్కెట్ ర్యాలీ కొనసాగుతుందని సెలక్టివ్‌గా పెట్టుబడులను కొనసాగించాలని భావిస్తున్నారు. అన్‌లాక్ ప్రక్రియ, దేశంలో ప్రజలందరికీ టీకాలు పూర్తియితే ఆర్థిక పునరుజ్జీవనంపై యస్ సెక్యూరిటీస్ సీనియర్ ప్రెసిడెంట్, రీసెర్చ్ , ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ హెడ్ అమర్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మార్కెట్ టాప్ 10 హెవీవెయిట్ స్టాక్‌లలో ర్యాలీ ఉంటుందని.. ఇప్పటికే ఆరు నెలల విరామం తర్వాత ఆర్ఐఎల్ ఆ దశలో ముందుందని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో సెన్సెక్స్ డిసెంబర్ 2021 నాటికి 60వేలకు చేరుతుదని వ్యాఖ్యానించారు. జెఎమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్, టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్, రాహుల్ శర్మ కూడా మార్కెట్ భవిష్యత్తు సానుకూల అంచనాలను ప్రకటించారు. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన వికె విజయకుమార్ మాట్లాడుతూ మిడ్, స్మాల్ క్యాప్ జోరు ఆందోళన కలిగించే అంశమన్నారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ 2017లో చిన్న సూచిక 60శాతం పెరగడాన్ని గుర్తు చేశారు. స్మాల్ క్యాప్స్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉంటూ ముఖ్యంగా ఆర్థిక, ఐటీ, ఫార్మా, మెటల్ సెక్టార్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. సానుకూల గ్లోబల్ మార్కెట్లు, తగ్గుతున్న కోవిడ్ కేసులు, అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ సడలింపులు, మంచి మాన్సూన్స్ మధ్య సెన్సెక్స్ ఓవర్‌బాట్ స్థాయికి చేరుకుందని టిప్స్ 2 ట్రేడ్స్ సహ వ్యవస్థాపకుడు, ట్రైనర్ ఎ.ఆర్.రామచంద్రన్ పేర్కొన్నారు. పెట్టుబడిదారులు ప్రస్తుత స్థాయిలో లాభాల స్వీకరణకు దిగుతారన్నారు. రానున్న వారంలో 52170 వద్ద నిఫ్టీ బలమైన మద్దతు స్థాయిగా అంచనా వేశారు. చదవండి: stock market : రికార్డు క్లోజింగ్ పద్మ అవార్డు: ట్రెండింగ్‌లో సోనూసూద్ -
లాక్డౌన్ గుబులు: సుమారు 6 లక్షల కోట్లు సంపద ఆవిరి
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్ల మహాపతనంతో లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సందను క్షణాల్లో ఆవిరై పోయింది. దేశంలో రెండోదశలో కరోనా సృష్టిస్తున్న ప్రకంపనలు దేశీయ ఈక్విటీ మార్కెట్ల పెట్టుబడి దారులను వణికించింది. దేశంలో కరోనావైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరగడంతో ఆర్థికవ్యవస్థపై నెలకొన్న ఆందోళనలు, లాక్డౌన్ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సోమవారం భారీ అమ్మకాలకుదిగారు. ఇంట్రా డేలో సెన్సెక్స్ 1,470 పాయింట్లు పడిపోయి 47,362 వద్దకు చేరుకుంది. అంతకుముందు 48,832 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 426 పాయింట్ల పతనమై 14200కు దిగువకు చేరింది. దీంతో ఇంట్రా డేలో దాదాపు 6 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. సోమవారం ఆరంభంలో మార్కెట్ల భారీ పతనంతో రూ .5.82 లక్షల కోట్ల మేర క్షీణించడంతో బీఎస్ఇ-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాప్ గత సెషన్‌లోని రూ. 205.71 లక్షల కోట్లతో పోలిస్తే రూ. 199.89 లక్షలకు కోట్లకు పడిపోయింది. బ్యాంకింగ్, ఆటో తో పాటు అన్న రంగాల్లో భారీ అమ్మకాల ఒత్తిడి ఈ పరిణామానికి దారి తీసింది. అయితే ఫార్మ, ఆక్సిజన్ రంగ షేర్లు మాత్రం లాభపడ్డాయి. (కరోనా సెగ : రుపీ ఢమాల్) తీవ్రస్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయని కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ ఎగ్జిక్యూటివ్-విపి రస్మిక్ ఓజా తెలిపారు. కోవిడ్ కేసుల పెరుగుదల, రాష్ట్రాలలో పాజిటివిటీ రేటు రాబోయే 2-3 నెలలలో మరింత ఎగియనుందనే ఆందోళన, దీంతో పలు రాష్ట్రాల్లో కొత్త ఆంక్షలు, లాక్డౌన్ల అంచనాలకు అనుగుణంగా మార్కెట్లు స్పందిస్తున్నాయన్నారు. ఇది మన ఎకానమీ వీ షేప్ రికవరీని దెబ్బతీస్తుందనీ, ఆదాయ అంచనాలను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. భారతదేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో పాటు మరణాల రేట్లు పెరగడం పెట్టుబడిదారులను భయపెట్టిందని టిప్ప్ 2 ట్రేడ్స్‌లో సహ వ్యవస్థాపకుడు, ట్రైనర్ ఎ.ఆర్.రామచంద్రన్ తెలిపారు. సాంకేతికంగా, నిఫ్టీ 14192 కన్నా దిగువన ముగిస్తే మరింత బలహీనం తప్పదన్నారు. (దలాల్ స్ట్రీట్‌లో కరోనా ప్రకంపనలు) కాగా కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకటారం గత 24 గంటల్లో 2.73 లక్షల తాజా కరోనావైరస్ కేసులు నమోదు కాగా 1,619 కొత్త మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసులకుసంబంధించి ఇండియా ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. (కరోనా విలయం: ఢిల్లీలో లాక్డౌన్) -
కరోనా మహమ్మారి విజృంభణ ఇన్వెస్టర్ల కొంపముంచుతోంది..
-
మార్కెట్ల క్రాష్: రూ. 7 లక్షల కోట్లు మటాష్
సాక్షి,ముంబై: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఇన్వెస్టర్ల కొంపముంచుతోంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లో కూడా రికార్డు స్థాయిలో అమ్మకాలు వెల్లువెత్తాయి. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఏకంగా 1700 పాయింట్లకు పైగా కుప్పకూలింది. దీంతో కేవలం 15 నిమిష్లాలో దలాల్ స్ట్రీట్‌లో మునుపెన్నడూ లేని విధంగా 7లక్షల కోట్ల మేర పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది. ఫలితంగా బీఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,86,708.74 కోట్ల రూపాయల నుంచి 2,02,76,533 కోట్లకు పడిపోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 7 శాతం నష్టపోయింది. ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ యాక్సిస్ బ్యాంక్ కూడా ఇదే వరుసలో ఉన్నాయి. దీంతో కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే రూ. 6.86 లక్షల కోట్ల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. కరోనా రెండో దశలో శరవేంగా విస్తరిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో రికార్డు స్థాయి కేసుల నమోదు ఇన్వెస్టర్లను వణికిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విస్తరణను అడ్డుకునేందుకు పూర్తి లాక్డౌన్ తప్పదనే భయాలు వెంటాడుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 1745 పాయింట్లు కుప్పకూలి 48 వేల దిగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 526 పాయింట్ల నష్టంతో 14313 వద్ద కొనసాగుతోంది. మరోవైపు రానున్న పారిశ్రామికోత్పత్తి సూచి, మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. అలాగే నాలుగవ క్వార్టర్ ఫలితాలు, ముఖ్యంగా వారంలో ఐటీ మేజర్ల ఫలితాలు ప్రభావితం చేయనున్నాయని, వీటిని దృష్టిలో ఉంచుకోవాలని రిలయన్స్ సెక్యూరిటీస్ స్ట్రాటజీ హెడ్ బినోద్ మోడీ సూచించారు. -
గంటకు అంబానీ ఆదాయం ఎంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ:ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతాకాదు. దిగ్గజ ఆర్థికవ్యవస్థలు కూడా తీవ్ర మాంద్యంలోకి జారుకున్నాయి. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా దేశీయంగా కోట్లాదిమంది కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడ్డారు. కనీసం ఆదాయం లేక తీరని సంక్షోభంలోకి కూరుకుపోయారు. ఈ సంక్షోభానికి సంబంధించిన ఆక్స్‌ఫాం నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. దేశంలో తీవ్రమవుతున్న ఆదాయ అసమానతలపై ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేసింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సోమవారం ఈ నివేదికను ప్రవేశపెట్టింది. దీనిప్రకారం భారతీయ బిలియనీర్ల సంపద 35 శాతం పుంజుకుంది. దీంతో వారి ఆస్థి 422.9 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఈ విషయంలో అమెరికా చైనా, జర్మనీ, రష్యా , ఫ్రాన్స్ తరువాత భారతదేశం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది. కరోనావై మహమ్మారి మూలంగా భారతదేశంలోని దేశ బిలియనీర్ల సంపద 35 శాతం పెరిగింది. మరోవైపు పేదలు నిరుద్యోగం, ఆకలితో చావులకు గురయ్యారు. కోట్లాది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఫలితంగా ఆదాయ అసమానతల రేషియో మరింత దిగజారిందని వ్యాఖ్యానించింది. లాక్డౌన్ సమయంలో 84 శాతం కుటుంబాలు వివిధ రకాల ఆదాయ నష్టాలను చవిచూశాయని, 2020 , ఏప్రిల్‌లోనే ప్రతి గంటకు 1.7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది. ఇది అనధికారిక రంగాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసినట్లు నివేదిక పేర్కొంది. మొత్తం 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా, వీరిలో 75 శాతం మంది అనధికారిక రంగంలో 9.2 కోట్ల ఉద్యోగాలు కోల్పోయారని తెలిపింది. ఈ పరిస్థితులను వెంటనే పరిష్కరించకపోతే ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతుందని ఆక్స్‌ఫాం ఇండియా సీఈఓ అమితాబ్ బెహార్ హెచ్చరించారు. మరోవైపు లాక్డౌన్ అమలు చేసిన 2020 మార్చి కాలంనుంచి భారతదేశంలోని టాప్ 100 బిలియనీర్ల ఆదాయం భారీ పెరుగుదలను చేసింది. అంతేకాదు వీరి ఆదాయాన్ని 138 మిలియన్ల పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి, రూ. 94,045 చొప్పున పంచడానికి సరిపోతుందని వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ ఒక గంటలో ఆర్జించిన సంపదను పొందాలంటే సగటు నైపుణ్యం లేని కార్మికుడికి వెయ్యి సంవత్సరాలు పడుతుందని పేర్కొంది. అలాగే ఒక సెకనులో సృష్టించిన దాన్ని సాధించాలంటే మూడు సంవత్సరాలు పడుతుందని నివేదిక తెలిపింది. ఆరోగ్య సంరక్షణలో ఉన్న అసమానతలను కూడా ఎత్తి చూపిన నివేదిక మరో కీలక వ్యాఖ్య చేసింది. కోవిడ్ సమయంలో దేశంలోని టాప్ 11 బిలియనీర్లు ఆర్జించిన సంపదపై కేవలం ఒక శాతం పన్ను విధించినా ప్రజలకు సరసమైన ధరలో నాణ్యమైన మందులను అందించే కేంద్ర జనఔషధి పథకం కేటాయింపులను 140 రెట్లు పెంచుకోవచ్చని అభిప్రాయపడింది. అలాగే 2020 ఏప్రిల్‌లో 1.7 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారని తెలిపింది. ముఖ్యంగా లాక్డౌన్ తరువాత మహిళా నిరుద్యోగిత 15 శాతం పెరిగిందని నివేదించింది. కాగా 2020 ఆగస్టులో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ గ్రహం మీద నాల్గవ ధనవంతుడిగా నిలిచిన సంగతి తెలిసిందే. మహమ్మారి సమయంలో ఒకవైపు దేశంలో 24 శాతం మంది ప్రజలు నెలకు 3,000 లోపే ఆర్జించగా, అంబానీ మాత్రం గంటకు 90 కోట్ల రూపాయలు సంపాదించారు. ఒక్క అంబానీ ఆర్జించిన సంపాదనతోనే 40 కోట్లమంది అసంఘటిత కార్మికులను కనీసం అయిదునెలలపాటు ఆదుకోవచ్చని ఆక్స్‌ఫాం నివేదించడం గమనార్హం. -
కోవిడ్ స్ట్రెయిన్ : ఒక్కరోజే లక్షల కోట్లు ఢమాల్
సాక్షి, ముంబై: సరికొత్త గరిష్టాలతో దూకుడుమీద ఉన్న దేశీయ స్టాక్‌మార్కెట్లకు కోవిడ్ స్ట్రెయిన్ దెబ్బ భారీగా తగిలింది. మరో ప్రాణాంతకమైనకొత్త వైరస్‌ను గుర్తించామంటూ యూకే ప్రకటించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులో పెద్ద మొత్తంలో ఆవిరైపోయింది. ఒక్క సోమవారం రోజు స్టాక్ మార్కెట్లో దాదాపు 6.64లక్షల కోట్ల సంపద హారతి కర్పూరంలా హరించుకుపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల కేపిటలైజేషన్ మొత్తం 185.39 కోట్లు ఉండగా.. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి 178.75 కోట్లుగా ఉంది. సెన్సెక్స్ 3శాతం, నిఫ్టీ 3.14శాతం పడిపోవడంతో భారీగా నష్టపోయారు ఇన్వెస్టర్లు. అయితే మంగళవారం ఆరంభంలో బలహీన పడిన సూచీలు ముగింపులో కోలుకున్నాయి. సెన్సెక్స్ 452 పాయింట్లు ఎగిసి 46 వేల ఎగువన ముగియగా, నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 13466 వద్ద స్థిరపడటం విశేషం. కరోనా వైరస్ దెబ్బకు సోమవారం అన్ని సెక్టార్లు దెబ్బతిన్నాయి. భారీనుంచి అతి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, యుటిలిటీస్, రియాల్టీ, బేసిక్ మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్, పవర్, బాంక్స్ 6.05 శాతం కుప్పకూలాయి. అయితే ప్రస్తుతం ట్రెండ్ వైరస్ కారణంగా జరిగిందేనని.. ఇక ముందు పెద్దగా ఉండకపోవచ్చని అంటున్నారు. 7-10 శాతం వరకూ పడినా మళ్లీ అందుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కీలక సూచీలు సెన్సెక్స్,నిఫ్టీ రెండూ ఇటీవల గరిష్ట స్తాయిలను తాకిన క్రమంలో ప్రాఫిట్ బుకింగ్ కూడా ఒక కారణమని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ స్ట్రాటజీ బినోద్ మోడీ అన్నారు. అయితే కొత్త వైరస్ ఆందోళనలు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
10 లాటరీలు ఒకేసారి తగిలాయా, ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: ఏ రంగంలోనైనా సెలబ్రిటీలుగా ఉన్నవారికి భారీ క్రేజ్ ఉంటుంది. అందులోనూ వ్యాపార రంగంలో దూసుకుపోతూ, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రాణిస్తోంటే.. యువత ఆసక్తి మామూలుగా ఉండదు. తాజాగా టెస్లా సహ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ బిల్ గేట్స్ దాటేయడంతో ట్రెండింగ్‌లో నిలిచారు. దీంతో ఆయనపై సోషల్‌మీడియా అంతా మంగళవారం మీమ్స్ సందడి నెలకొంది. తమాషా వ్యాఖ్యలు, క్లిప్‌లు, ఇమేజ్‌లతో ట్విటర్ యూజర్లు సందడి చేస్తున్నారు. అతడు సినిమాలో తనికెళ్ల భరణి ‘ఆడు మగాడ్రా బుజ్జా’ అన్నట్టు కమెంట్ చేస్తున్నారు. మచ్చుకు కొన్ని ఇక్కడ అందిస్తున్నాం.. మీరూ సరదాగా నవ్వుకోండి. (మస్క్ దూకుడు: మరోసారి బిల్ గేట్స్‌కు షాక్) #ElonMusk beats #BillGates to become second richest person Meanwhile Elon Musk:- pic.twitter.com/b2fhwx47ks — Raj Aditya (@chiku_9693) November 24, 2020 #ElonMusk ELON MUSK TO BILL GATES pic.twitter.com/GoDyFsgtLC — fᵣₑₑ wₐy (@T_O_freeway) November 24, 2020 #ElonMusk beats #BillGates to become second richest person Meanwhile Jeff bezos: pic.twitter.com/slamrRpdCu — Naveen Kumar (@Navikumar108) November 24, 2020 #ElonMusk becomes 2nd richest person after overtaking #BillGates Jeff Bezoz be like: pic.twitter.com/0EN0kAtdxn — Adarsh Adhar (@AdarshAdhar) November 24, 2020 #ElonMusk become 2nd richest person by surpassing #BillGates * Meanwhile Bill Gates to Elon pic.twitter.com/vuVvRk79FA — Chayan Jain (@ChayanJ20734351) November 24, 2020 -
కరోనా : లక్ష కోట్ల అంబానీ సంపద ఆవిరి
సాక్షి,ముంబై: ఆసియా అపర కుబేరుడు పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద దారుణ పతనాన్ని నమోదు చేసింది. త్రైమాసిక లాభం క్షీణించడంతో రిలయన్స్ షేరు భారీగా నష్ట పోయింది. ఏడు నెలల్లో లేనంతగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు అత్యధికంగా పడిపోవడంతో అంబానీ నికర విలువ దాదాపు 7 బిలియన్ డాలర్ల సంపద ఆవిరై పోయింది. అంబానీ నెట్‌వర్త్ రూ.13.52 లక్షల కోట్ల నుంచి రూ.12.69 లక్షల కోట్లకు పడిపోయింది. సోమవారం ఆర్ఐఎల్ దాదాపు 8.6శాతం నష్టపోయి 1877.45 వద్ద ముగిసింది దీంతో అంబానీ ఆస్తి కూడా 6.8 బిలియన్ డాలర్లు తగ్గింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముకేశ్ అంబానీ 71.5 బిలియన్ డాలర్లు. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానంలో ఉన్న అంబానీ ప్రస్తుతం 9వ స్థానానికి పరిమితం అయ్యారు. మంగళవారం నాటి మార్కెట్లో కూడా రిలయన్స్ షేరు నష్టాలతోనే కొనసాగుతోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇంధన డిమాండ్ భారీగా పడిపోవడంతో రిలయన్స్ లాభాలను ప్రభావితం చేసింది. కీలకమైన చమురు, రసాయనాల విభాగం ఆదాయాలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనికర లాభం తగ్గింది. 15 శాతం క్షీణించి 9,570 కోట్ల రూపాయలుగా (1.3 బిలియన్ డాలర్లు) నమోదైంది. ఆదాయం 24 శాతం పడిపోయి 1.16 లక్షల కోట్లకు చేరుకుంది. కరోనావైరస్కు ఇంకా టీకా అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల వైరస్ వ్యాప్తి, రెండవసారి లాక్డౌన్ ఆందోళనల మధ్య పెట్రోకెమికల్ వ్యాపారం ఎప్పటికి పుంజుకుంటుందో తెలియని అనిశ్చితి ఏర్పడింది. కాగా ఇటీవల రిలయన్స్ జియో, రీటైల్ విభాగంలో దిగ్గజసంస్థల నుంచి పెట్టుబడుల వెల్లువ కురిసింది. దాదాపు 25 బిలియన డాలర్లకు పైగా పెట్టుబడులను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇన్వెస్టర్లు రిలయన్స్ షేర్లలో పెట్టుబడులకు మొగ్గారు. ఫలితంగా షేర్లు ఈ సంవత్సరం 25 శాతం ర్యాలీ అయ్యాయి. అయితే సెన్సెక్స్ 3.6శాతం పడిపోవడం గమనార్హం. తాజాగా ఫ్యూచర్ రిటైల్ ఒప్పందానికి సంబంధించి అమెజాన్‌తో వివాదాలు, పెట్రోలియం విభాగంలో సౌదీ కంపెనీ ఆరామ్కో ఒప్పందం ఆలస్యం తదితర కారణాల రీత్యా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. -
హరూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 విడుదల
-
ఒక్క గంటకు అంబానీ సంపాదన ఎంతో తెలుసా?
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (63) సంపద పరుగులు పెడుతోంది. ఈ ఏడాది అంబానీ సంపద 73 శాతం పెరిగి రూ.6.58 లక్షల కోట్లకు చేరినట్టు సోమవారం విడుదలైన ‘హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2020’ పేర్కొంది. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదో ఏట తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ సంస్థతో కలసి హరూన్ ఈ నివేదికను రూపొందించింది. రిలయన్స్ జియో, రిటైల్ విభాగాల్లో వాటాల విక్రయాల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఈ ఏడాది గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో అంబానీ ప్రపంచంలోనే టాప్-5 స్థానంలో నిలిచినట్టు హురూన్ నివేదిక తెలిపింది. ఈ ఏడాది మార్చి నుంచి లాక్డౌన్ కాలంలో ప్రతి గంటకు 90 కోట్ల రూపాయలు సంపాదించారని హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 వెల్లడించింది. కరోనా వైరస్ కోట్లాది మంది జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తూ, అసమానతలు పెరిగిన తరుణంలో హురూన్ భారత సంపన్నుల జాబితా వెలువడడం గమనార్హం. 19 మంది సంపద రెట్టింపు ఆగస్ట్ 31 నాటికి రూ.1,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన 828 మందిని హురూన్ నివేదిక గుర్తించి సంపన్నుల జాబితా 2020లో చేర్చింది. ఉమ్మడిగా వీరి సంపద ఈ ఏడాది 20 శాతం పెరిగినట్టు çహురూన్ ప్రకటించింది. 2020లో 19 మంది సంపద రెట్టింపు కాగా, ఇందులో ఆరుగురు ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు చెందిన వారే. రిటైల్ పరిశ్రమకు చెందిన ముగ్గురున్నారు. కరోనా మహమ్మారి ఫార్మా పరిశ్రమపై కనక వర్షం కురిపించగా, రియల్ ఎస్టేట్ రంగంపై గట్టి ప్రభావం చూపించినట్టు çహురూన్ నివేదిక పేర్కొంది. ఫార్మా రంగం నుంచి కొత్తగా ఈ జాబితాలో 27 మంది వచ్చి చేరారు. కెమికల్స్, పెట్రో కెమికల్స్ నుంచి 20 మంది, సాఫ్ట్వేర్ రంగం నుంచి 15 మంది కొత్తగా జాబితాలో చోటు సంపాదించుకున్నారు. మొత్తం మీద ఫార్మా పరిశ్రమ నుంచి 122 మంది, కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగాలకు సంబంధించి 55 మంది, సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ నుంచి 50 మందికి చోటు లభించింది. హిందుజా సోదరులు రూ.1.43 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శివ్‌నాడార్, ఆయన కుటుంబం సంపద 34 శాతం పెరిగి రూ.1.41 లక్షల కోట్లుగా ఉంది. జాబితాలో ఆయన మూడో స్థానంలో నిలిచారు. అదానీ గ్రూపు సారథి గౌతం అదానీ సంపద ఈ ఏడాది 48 శాతం పెరిగి రూ.1.40 లక్షల కోట్లకు చేరింది. రెండు స్థానాలు ఎగబాకి అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో నాలుగో స్థానానికి చేరారు. రూ.1.14 లక్షల కోట్లతో విప్రో అజీమ్ ప్రేమ్‌జీ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి జారిపోయారు. సిరమ్ ఇనిస్టిట్యూట్ సైరస్ పూనవాలా సంపద 6% పెరిగి రూ.94,300 కోట్లకు చేరుకోవడంతో ఆయన 6వ స్థానంలో నిలిచారు. డీమార్ట్ ప్రమోటర్ రాధాకిషన్ దమానీ, ఆయన కుటుంబం సంపద 56 శాతం పెరగడంతో టాప్ 10లోకి చేరారు. వారి సంపద రూ.87,200 కోట్లకు చేరింది. కోటక్ మహీంద్రా బ్యాంకు ప్రమోటర్ ఉదయ్ కోటక్ సంపద 8 శాతం తగ్గి రూ.87,000 కోట్లుగా ఉండడంతో ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 62 మంది ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్–2020లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 62 మంది పారిశ్రామికవేత్తలు చోటు దక్కించుకున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి జాబితాలో చోటు సంపాదించిన వ్యక్తులందరి సంపద రూ.2,45,800 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది 34 శాతం అధికం. తెలుగు రాష్ట్రాల నుంచి రూ.7,500 కోట్లు, ఆపైన సంపద కలిగిన వారి సంఖ్య గతేడాది 5 కాగా, ఈ సంవత్సరం ఇది 9కి చేరింది. రూ.49,200 కోట్లతో దివిస్ ల్యాబొరేటరీస్‌కు చెందిన మురళి దివి, కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో తొలి స్థానంలో నిలిచింది. హెటిరో డ్రగ్స్‌కు చెందిన బి.పార్థసారథి రెడ్డి, కుటుంబం రూ.13,900 కోట్ల సంపదతో రెండవ స్థానంలో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి ఐఐఎఫ్ఎల్ జాబితాలో కొత్తగా 9 మంది స్థానం దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల జాబితాలో బయాలాజికల్–ఈ ఎండీ మహిమ దాట్ల ఒక్కరే మహిళ కావడం విశేషం. టాప్ 10 జాబితా చూస్తే... టాప్–10లో.. 1.మురళి దివి, కుటుంబం (దివిస్ ల్యాబొరేటరీస్). 2.బి.పార్థసారథి రెడ్డి, కుటుంబం (హెటిరో డ్రగ్స్). 3.కె.సతీశ్‌రెడ్డి, కుటుంబం (డాక్టర్ రెడ్డీస్). 4.పి.పిచ్చి రెడ్డి (మేఘా ఇంజనీరింగ్). 5.పి.వి.కృష్ణారెడ్డి (మేఘా ఇంజనీరింగ్). 6.జి.వి.ప్రసాద్, జి.అనురాధ (డాక్టర్ రెడ్డీస్). 7. రామేశ్వర్ రావు జూపల్లి, కుటుంబం (మై హోం). 8.ఎం.సత్యనారాయణ రెడ్డి, కుటుంబం (ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్). 9.వి.సి.నన్నపనేని (నాట్కో ఫార్మా). 10.సి.విశ్వేశ్వర రావు, కుటుంబం (నవయుగ) ఉన్నారు. రంగాల వారీగా అధిక సంపద కలిగిన వారిలో మురళి దివి, కుటుంబం (ఫార్మా), అల్లూరి ఇంద్ర కుమార్ (ఫుడ్ ప్రాసెసింగ్), పి.పిచ్చిరెడ్డి (కన్స్ట్రక్షన్), యుగంధర్ రెడ్డి, కుటుంబం (క్యాపిటల్ గూడ్స్), చల్లా రాజేంద్ర ప్రసాద్ (ఫుడ్, బెవరేజెస్) చోటు సాధించారు. ఫార్మా నుంచి∙అత్యధికంగా 20 మంది ఉన్నారు. -
వారెన్ బఫెట్‌కు షాకిచ్చిన అంబానీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ (63) తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. నికర విలువ పరంగా, బిజినెస్ టైకూన్, ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్‌ను అధిగమించారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అంబానీ విలువ ఇప్పుడు 70.1 బిలియన్ డాలర్లకు చేరగా, వారెన్ బఫెట్ సంపద విలువ 67.9 బిలియన్ డాలర్లు మాత్రమే. దీంతో అంబానీ ప్రపంచంలో ఏడవ ధనవంతుడుగా నిలిచారు. రిలయన్స్ టెలికాం విభాగం జియోలో వరుస పెట్టుబడులతో అంబానీ సంపద గణనీయంగా పుంజుకుంది. దీంతో ప్రపంచంలోని టాప్10 ధనవంతుల క్లబ్లో ఉన్న ఏకైక ఆసియా వ్యాపారవేత్తగా అంబానీ నిలిచారు. బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ సీఈఓ వారెన్ బఫెట్ (82) 37 బిలియన్ డాలర్లకు పైగా బెర్క్‌షైర్ హాత్వే షేర్లను ఇటీవల విరాళంగా ఇచ్చిన తరువాత సంపద క్షీణించింది. ఒరాకిల్ ఆఫ్ ఒమాహా గా పేరొందిన బఫెట్ ఈ వారంలో 2.9 బిలియన్ డాలర్లను స్వచ్ఛంద సంస్థకు డొనేట్ చేశారు. దీంతో ఆయన సంపద నికర విలువ క్షీణించింది. కాగా హురున్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, అంబానీ ఇటీవల ప్రపంచంలో ఎనిమిదవ ధనవంతుడిగా అంబానీ అవతరించారు. సంపన్న భారతీయుడిగా అంబానీ నంబర్ వన్ ర్యాంకులో దూసుకుపోతున్నారు.ఈ ఏడాదిలో మొదటి రెండు నెలల్లో తీవ్ర నష్టాలను నమోదు చేసినప్పటికీ, జియోలో వరుస భారీ పెట్టుబడుల నేపథ్యంలో రిలయన్స షేరు రికార్డు గరిష్టాన్ని తాకింది. దీంతో కరోనా సంక్షోభంలో కూడా గణనీయమైన వృద్దిని సాధించి, అప్పుల్లేని సంస్థగా రిలయన్స్ అవతరించింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12.70 లక్షల కోట్ల రూపాయల రికార్డు స్థాయికి చేరింది. (రిలయన్స్- బీపీ జాయింట్ వెంచర్ లాంచ్) -
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ రికార్డు
అమెజాన్ ఫౌండర్, సీఈఓ జెఫ్ బెజోస్ సంపదలో మరోసారి రికార్డు సాధించారు. గత సంవత్సరం మెకెంజీతో విడాకుల పరిష్కారంలో భాగంగా అమెజాన్ లో తన వాటాలో నాలుగింట ఒక వంతును వదులుకున్న తర్వాత కూడా బెజోస్ సంపద 172 బిలియన్ డాలర్ల వద్ద మళ్లీ తారాస్థాయిని తాకింది. అమెజాన్ షేర్లు బుధవారం 4.4 శాతం పెరిగి రికార్డు స్థాయి 2,879 డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచ కుబేరుడి బెజోస్ ఆదాయం 171.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, సెప్టెంబర్ 4, 2018 నాటికి బెజోస్ సంపద 167.7 బిలియన్ డాలర్ల వద్ద రికార్డు స్థాయిని తాకింది. తాజాగా తన రికార్డును తనే బ్రేక్ చేశారు. కరోనా మహమ్మారి, మహామాంద్యం పరిస్థితులున్న ఈ ఏడాదిలోనే 56.7 బిలియన్లను ఆర్జించడం విశేషం. కరోనా సంక్షోభ సమయంలో ముందుండి పనిచేస్తున్న ఉద్యోగులకు వన్ టైం బోనస్ కింద 500 మిలియన్ డాలర్లు చెల్లించనున్నట్టు గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వ్యవస్థాపకుడి రికార్డు సంపదపై వ్యాఖ్యానించడానికి అమెజాన్ నిరాకరించింది. మరోవైపు విడాకుల తర్వాత అమెజాన్‌లో 4 వాతం వాటాను సొంతం చేసుకున్న జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ సంపద నికర విలువ 56.9 బిలియన్ డాలర్లు పెరిగింది. తద్వారా బ్లూమ్‌బెర్గ్ ర్యాంకింగ్‌లో 12వ స్థానాన్ని సాధించారు. అంతేకాదు ప్రపంచంలో రెండవ సంపన్న మహిళగా నిలిచారు. లోరియల్ కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్ మొదటి మహిళగా ఉన్నారు. మిగిలిన బిలియనీర్లలో ఎక్కువ మంది టెక్ రంగానికి చెందినవారున్నారు. వీరిలో టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ సంపద జనవరి 1 నుండి 25.8 బిలియన్ డాలర్లు పెరిగింది. జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు ఎరిక్ యువాన్ సంపద దాదాపు నాలుగు రెట్లు పెరిగి 13.1 బిలియన్ డాలర్లుకు చేరింది. కాగా కరోనా కాలంలో ప్రపంచ కుబేరుల సంపద స్వల్పంగా పెరిగింది. మరికొంత మంది భారీగా నష్టపోయారు. స్పెయిన్ కు చెందిన అమాన్సియో ఒర్టెగా 19.2 బిలియన్ డాలర్లను కోల్పోగా, బెర్క్‌షైర్ హాత్వే సంస్థ చైర్మన్ వారెన్ బఫ్ఫెట్ 19 బిలియన్ డాలర్లు, ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ 17.6 బిలియన్ డాలర్లు సంపదను పోగొట్టుకున్నారు. 500 మంది ధనవంతుల మొత్తం సంపద ఈ సంవత్సరం ప్రారంభంలో 5.91 ట్రిలియన్ల డాలర్లతో పోలిస్తే స్పల్పంగా పుంజుకుని 5.93 ట్రిలియన్ డాలర్లకు చేరింది. -
కరోనా : భారీ సంపదనార్జించిన బిలియనీర్లు
వాష్టింగ్టన్: కరోనా మహమ్మారి సంక్షోభం కాలంలో అమెరికా అతలాకుతలమవుతోంది. ఆర్థికవ్యవస్థ మరింత మందగమనంలోకి కూరుకుపోతోందని స్వయంగా ఫెడ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ కాలంలో కూడా అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు భారీ సంపదను ఆర్జించాయి. ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భారీ లాభాలను సాధించారు. అమెరికాలో పలు సంస్థల తీవ్ర నష్టాలు, వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో వీరి సంపద 45 శాతం ఎగియడం గమనార్హం. (అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు) (2026 నాటికి జెఫ్ బెజోస్, మరి ముకేశ్ అంబానీ?) రెండు నెలల కరోనా వైరస్ కాలంలో టెక్నాలజీ స్టాక్స్ లాభాల్లో దూసుకుపోవడంతో వీరు మరింత ధనవంతులయ్యారు. బెజోస్ సంపద 30 శాతం పెరిగి 147.6 బిలియన్ డాలర్లకు చేరుకోగా, జుకర్‌బర్గ్ సంపద 45 శాతం పెరిగి 80 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రధానంగా లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో క్లౌడ్ బిజినెస్, వీడియో కాన్ఫరెన్స్ , గేమింగ్ వ్యాపారం పుంజుకోవడం, కొత్త ప్రోగ్రామ్ ప్రకటనలతో అమెజాన్, ఫేస్బుక్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. (మోసగాళ్లకు చెక్ : మెసెంజర్లో కొత్త ఫీచర్) తాజాపరిశోధనల ప్రకారం ఈ కాలంలో అమెరికాలోని 600 మంది బిలియనీర్లు టెక్ స్టాక్స్‌లో ర్యాలీతో మరింత ధనవంతులయ్యారు.ఈ బిలియనీర్ల మొత్తం నికర విలువ మార్చి18- మే19 మధ్యకాలంలో 434 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 32.97 లక్షల కోట్లు) పెరిగింది. మరోవైపు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ బెర్క్‌షైర్ హాత్వే వారెన్ బఫెట్ స్వల్ప లాభాలకు పరిమితమయ్యారు. వీరు వరుసగా 8.2 శాతం, 0.8 శాతం లాభాలను నమోదు చేయగలిగారు. టాక్స్ ఫెయిర్‌నెస్ , ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ ప్రోగ్రామ్ ఫర్ ఈక్వాలిటీ అనే సంస్థలు ఈ విశ్లేషణ చేశాయి. (కరోనా : ఉద్యోగులను తొలగిస్తున్న టెక్ దిగ్గజం) -
రూ.5.8 లక్షల కోట్లు ఆవిరి
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లో సోమవారం నాటిఅమ్మకాలతో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. లాక్డౌన్ పొడగింపు, అగ్ర ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య ముదురుతున్న ట్రేడ్ వార్ భయాలతో ప్రపంచమార్కెట్లు ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 1700 పాయింట్ల మేర పతనమైంది. ఆరంభ నష్టాల నుంచి మరింత బలహీన పడిన మార్కెట్ ఒక దశలో 2 086 పాయింట్లు లేదా 6 శాతం కుప్పకూలింది. బ్యాంకింగ్, ఆటో, మెటల్, రియాల్టీ షేర్లు బాగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్ 1791 పాయింట్లు లేదా 8శాతం పైగా పడిపోయి 19,744 స్థాయిలకు చేరుకోగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 7.86 శాతం క్షీణించింది. (దీర్ఘకాల లాక్డౌన్ : కుప్పకూలిన మార్కెట్లు) ప్రధానంగా ఆసియా ఈక్విటీలలోని భారీ అమ్మకాల ప్రభావంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది.దీంతో బిఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల్లో నేటి పతనంతో రూ. 5.8 ట్రిలియన్ల పెట్టుబడిదారుల సంపద తుడుచిపెట్టుకు పోయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 లక్షల 15వేల 309 కోట్ల రూపాయలు తగ్గి 1,24,26,311.83 కోట్లకు చేరుకుంది.(లాక్డౌన్ ఎఫెక్ట్ : పీఎంఐ రికార్డు కనిష్టం) ఐసీఐసీఐ బ్యాంక్ (11 శాతం తగ్గి) ఇండెక్స్‌లో అత్యధిక నష్టాన్ని చవిచూడగా, బజాజ్ ఫైనాన్స్ (10 శాతం), హెచ్డీఎఫ్సీ (10 శాతం) ఇండస్ఇండ్ బ్యాంక్ (9.6 శాతం) భారీగా నష్టపోయాయి. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో మార్చి 2020 తో ముగిసిన త్రైమాసికంలో నిరాశాజనక ఫలితాలతో టెక్ మహీంద్రా 8 శాతం, హిందూస్థాన్ యూనిలీవర్ 5 శాతం క్షీణించింది. నిఫ్టీ ఫార్మ మాత్రమే స్వల్పంగా లాభపడింది. అలాగే కొన్ని షరతులతో మద్యం దుకాణాలను ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతించిన తరువాత బ్రూవరీస్ అండ్ డిస్టిలరీ కంపెనీల షేర్లు దాదాపు 11 శాతం వరకు ర్యాలీ చేశాయి. చివరికి 2002 పాయింట్లు పతనంతో సెన్సెక్స్ 31715వద్ద, నిఫ్టీ 566 పాయింట్లు కుప్పకూలి 9293 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా సెన్సెక్స్ 32 వేల దిగువకు చేరగా, నిఫ్టీ 9300 స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. (ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు) -
ధనవంతులపై ‘కరోనా’ పన్ను!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి యూరప్‌లోని ధనవంతులపై సంపద పన్నును విధించాలంటూ ప్రముఖ రచయితలు కమిల్లే లాండాయిస్, ఎమ్మాన్యుయల్ సేజ్, గాబ్రియల్ సుజ్మన్ ‘ఏ ప్రొగ్రెసివ్ యురోపియన్ వెల్త్ టాక్స్ టు ఫండ్ ది యూరోపియన్ కోవిడ్ రెస్పాన్స్’ పేరిట ఓ వ్యాసాన్నే రాశారు. వారి ప్రతి పాదనలను యూరోపియన్ యూనియన్ ప్రస్తుతం నిశితంగా పరిశీలిస్తోంది. (414కి చేరిన కరోనా మృతుల సంఖ్య) భారత్ కూడా సంపద పన్నును విధించినట్లయితే కరోనా కాటు నుంచి భారత ఆర్థిక వ్యవస్థ కూడా త్వరగానే కోలుకోగలదు. ఇంతకుముందు భారత్‌లో కూడా సంపద పన్ను ఉండేది. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పన్నును ఎత్తివేశారు. పలు సర్వేల ప్రకారం దేశంలో 953 మంది అత్యధిక ధనవంతులు ఉన్నారు. వారి సరాసరి సగటు సంపద 5,278 కోట్ల రూపాయలు. వారి మొత్తం ఆదాయాన్ని కలిపితే 50.3 లక్షల కోట్ల రూపాయలు. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి డబ్బుల్లో 190.5 లక్షల కోట్ల రూపాయలు. అంటే ధనవంతుల వాటా జీడీపీలో 26.4 శాతం. వీరి సంపదపై కేవలం నాలుగు శాతం పన్ను విధించినా మొత్తం జీడీపీలో ఒక్క శాతానికి పైగా డబ్బులు వసూలవుతాయి. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ 1.7 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. ఆ మొత్తం జీడీపీలో ఒక శాతం కూడా కాదు. అత్యధిక ధనవంతులపై నాలుగు శాతం పన్ను విధించినట్లయితే ఈ ఆర్థిక ప్యాకేజీకన్నా ఎక్కువ డబ్బులే వసూలవుతాయి. పైగా నాలుగు శాతం పన్ను వారికేమాత్రం భారం కాదు. అందుకని ఈ ప్రతిపాదనను భారత ప్రభుత్వం కూడా పరిశీలించాలని మేథావులు, ఆర్థిక నిపుణులు కోరుతున్నారు. -
శార్వరి నామ సంవత్సర (ధనస్సు రాశి ) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థికంగా ఎదుగుతారు. పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ ద్వారా సహాయసహకారాలు పొంది, మీ పలుకుబడితో ఉన్నతస్థానాలలో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు మీపట్ల సానుకూలంగా ప్రవర్తిస్తారు. పరోక్షంగా వారిని కూడా భాగస్వాములను చేసి నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. ప్రారంభించిన వ్యాపారం చాలా బాగుంటుంది. అధికంగా లాభాలు వస్తాయి. మీ కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు తోస్తుంది. స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. అధికార స్థానంలో ఉన్న స్త్రీల వల్ల మరింత మేలు జరుగుతుంది. న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన మీ కోరికలను వారి ఆమోదిస్తారు. అంతేకాక ప్రతి విషయంలోను స్త్రీల సహాయసహకారాలు మీకు లభిస్తాయి. వ్యాపార నిమిత్తం స్థలం కొనుగోలు చేస్తారు. నూతన అవకాశాలను ఉపయోగించుకుంటారు. ఆర్థికపరమైన పురోగతి బాగుంటుంది. స్థిరాస్తులు వృద్ధిచేస్తారు. పట్టుదలతో కృషి చేసి సానుకూల ఫలితాలు సాధిస్తారు. సమాజంలో మీరంటే ఏమిటో నిరూపించుకుంటారు. గతంలో మిమ్మల్ని కించపరిచిన వారే గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో స్థానచలనం తప్పదనుకుంటారు. కానీ చివరిక్షణంలో ఆ స్థానచలనం ఆగిపోతుంది. అష్టమూలికా తైలంతో నిత్యం దీపారాధన చేయండి. గృహప్రవేశాలు, శుభకార్యాలు సంతోషపరుస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, స్త్రీలు, అనాథలు వారికి సంబంధించిన సేవాసంస్థలకు చెప్పుకోదగిన సహాయం చేస్తారు. మీకు దొంగ లెక్కలు చెప్పేవారు అధికమవుతారు. కనుక ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా, స్వయంగా పరిశీలించుకోవడం మంచిది. సౌకర్యం కోసం కార్యాలయం మారుస్తారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. బాల్యంలో సరదాగా నేర్చుకున్న పనులు, విజ్ఞాన సంబంధిత విషయాలు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా ఉన్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. మీ పాండిత్యం అందరిచేత ప్రశంసించబడుతుంది. అసూయాగ్రస్తులైన శత్రువర్గంతో ఇబ్బందులు ఏర్పడినా వాటిని అధిగమించగలుగుతారు. శత్రువర్గం అంటే చిన్న శత్రువర్గం కాదు. ఉన్నతస్థానంలో ఉన్న అధికారుల అండదండలు కలిగిన వారితో పోరాటం చేయవలసి వస్తుంది. మీ మిత్రవర్గం, మీకు సన్నిహితంగా చెప్పుకునే వారు మీరు పోరాటంలో ఓడిపోవాలని కోరుకుంటారు. శల్యసారథ్యం చేస్తారు. దైవానుగ్రహం వల్ల మీరే విజయం సాధించగలుగుతారు. మీ ఉనికికి, స్థానానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. భాగస్వాముల నిరాశా వైఖరి మీకు విసుగు కలిగిస్తుంది. వారిని మార్చే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు. వారిని కార్యోన్ముఖులను చేయగలుగుతారు. ప్రతినిత్యం నాగసింధూరం నుదుటన ధరించడం వలన నరదిష్టి, నరఘోష తొలగిపోయి జనాకర్షణ ఏర్పడుతుంది. ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఐ.టి ఉద్యోగాలకుఎంపికవుతారు. వచ్చిన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు. ప్రభుత్వపరంగా, ప్రైవేటు సంస్థలపరంగా రావలసిన పెద్ద మొత్తంలోని ధనం మీ చేతికి అందుతుంది. మీ స్వంత ఆలోచనలు అమలు చేసే ముందు పూర్వాపరాలు సన్నిహితులతో, మిత్రులతో చర్చించడం మరువవద్దు. కలిసి వచ్చే కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఓర్పు, సంయమనం చాలా ముఖ్యమని గ్రహించండి. న్యాయబద్ధంగా మీకు రావలసిన ఉద్యోగం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని పూజించడం చెప్పదగినది. సంస్కారహీనులు, వ్యసనాలకు బానిసలైన చిన్ననాటి మిత్రులను దూరంగా ఉంచుతారు. వారి ప్రవర్తన కారణంగా మీ చేతిలో ఉన్న సహాయం కూడా చేయరు. దూరప్రాంత విద్య, ఉద్యోగం వంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రజాసంబంధాలు పెంచుకోవడానికి అనుకూల సంవత్సరమిది. యూనియన్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. తోటివారికి న్యాయం జరగాలని మీరు జరిపే పోరాటం ఫలిస్తుంది. సాంకేతిక కారణాల వలన పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని నమ్ముతారు. ఇందువల్ల ప్రయోజనాలకు నష్టం ఏర్పడకపోయినా అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలవైపు దృష్టి మళ్ళించడం మంచిది. మనోనిగ్రహంతో కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెడతారు. కుటుంబసభ్యులతో కలిసి విందువినోదాలలో పాల్గొంటారు. అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం రెండూ కలిసిరావు. శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఇమెయిల్స్ లేదా ఫోన్ సంభాషణల ద్వారా మీకు ఉపయోగపడే సమాచారం అందుకుంటారు. స్వయం నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారు. నిదానమే ప్రధానమన్న సూక్తిని పాటించడం మంచిది. రాజకీయ పదవి లభిస్తుంది. అంతరంగిక చర్చలు జరిగే చోట కొత్తవారికి చోటు కల్పించకండి. మీ మాటలకు వక్రభాష్యాలు చెప్పేవారు అధికమవుతారు. జాగ్రత్త వహించండి. దుబారా ఖర్చులు, ఆదాయాన్ని మించిన ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆడంబరాలకు ఇంత వ్యయం చేయాలా? అనే భావన కలుగుతుంది. ఇసుక నుండి తైలం తీయవచ్చు కానీ ఇష్టంలేని వ్యక్తుల నుంఢి ప్రేమాభిమానాలు సాధించడం సాధ్యంకాని పని అని గ్రహిస్తారు. కొందరి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. సైట్ పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. వివాదాలకు, తగువులకు దూరంగా ఉండాలని మీరు భావించినా కాలం అందుకు సహకరించదు. మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. మీ సామర్థ్యాన్ని మరోసారి ఋజువు చేసుకుంటారు. మీ మీద ఆధారపడిన అనేకమందికి న్యాయం చేస్తారు, ఆదుకుంటారు. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌక్యంగా విధులు నిర్వర్తించుకోవడమే సమాజ ప్రవృత్తిగా భావిస్తారు. ఆ విధంగా ప్రవర్తించకపోతే ‘‘పాముపడగ నీడలోనైనా సురక్షితంగా ఉండవచ్చునేమో కానీ ఆ మోసపూరిత సమాజంలో బ్రతకలేమని గ్రహిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుండే లొంగి ఉండడం మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయడం మీకు చేతకాదని తేల్చి చెప్పేస్తారు. ఆత్మగౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదని తెగతెంపులు చేసుకుంటారు కృషిని నమ్ముకుంటారు. భగవంతుడిని కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెబుతారు. మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాలలో ఋజువవుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ పని మీరు నిరాటంకంగా చేసుకుపోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తుల విషయంలో పెద్దవారు వ్రాసిన డాక్యుమెంట్స్‌లో లోపాలు బయటపడతాయి. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తిప్రతిష్ఠలు గడిస్తారు. మీ ప్రాధాన్యత ఎంతమాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితులలో చాలా మందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం, నీతి నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి. అయినవారి విషయంలో న్యాయం జరుగుతుంది. ఒరిగిపోయిన ఓ జీవి జ్ఞాపకాలు అదేపనిగా గుర్తుకురావడం వల్ల చెప్పలేని మానసిక వేదన, హృదయభారం, వైరాగ్యం, నిర్వేదం, నిరుత్సాహం కలిగిస్తాయి. కొన్ని సందర్భాలలో ఇంకా ఏమి సాధించాలని జీవిస్తున్నామన్న భావన మనస్సును వేధిస్తుంది. భగవంతుడి సంకల్పం ముందు మానవుడి శక్తిసామర్థ్యాలు, అభ్యర్థనలు, విన్నపాలు, ప్రార్థనలు, పూజలు పనిచేయవన్న కఠోర సత్యాన్ని తెలుసుకుంటారు. ప్రింట్మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నూతన అవకాశాలు కలిసివస్తాయి. వంశపారంపర్యంగా ఆస్తులు కలిసివస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యమవుతాయి. కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఇన్కవ్ుట్యాక్స్ సమస్యలు తొలగిపోతాయి. విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్త వహించండి, చోరభయం పొంచి వుంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలాసవంతమైన జీవితానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ పరిధిలో లేని పనులు చేసిపెట్టమని ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది. రాజకీయ నాయకులను కొనుక్కుంటే ఏ రకమైన తప్పు చేసినా శిక్షలు పడవు అని గ్రహిస్తారు. గనులు, ఇసుక వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. కొంతమంది రాజకీయ నాయకులకు మీరు అంతరంగికులుగా ఉంటారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. స్టాక్ మార్కెట్లు కలిసిరావు. -
కరోనా: రూ.19.49 లక్షల కోట్లు ఆవిరి
సాక్షి, ముంబై: కోవిడ్-19 భయాలతో దలాల్ స్ట్రీట్ గజగజ వణుకుతోంది. కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ మార్కెట్లతోపాటు, దేశీయ స్టాక్‌మార్కెట్లను అతలాకుతలం చేస్తోంది. దీంతో ఈ వారంలో కూడా కీలక సూచీలు తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నాయి. వరుస నష్టాలతో లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకు పోయింది. ముఖ్యంగా ఈ వారంలో నాలుగు రోజుల వ్యవధిలో రూ.19.49 లక్షల కోట్ల విలువైన పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. దీనికితోడు భారతదేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు, మరణాలు ఇన్వెస్టర్లలో తీవ్ర నిరాశను నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ట్రేడింగ్‌లో ఆరంభంలోనే నష్టాల బాట పట్టాయి. మిడ్ సెషన్లో కొంత పుంజుకున్నప్పటికీ, ప్రధాన మద్దతు స్థాయిలను నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందాయి. అయితే షార్ట్ కవరింగ్ ప్రభావంగానే రికవరీ వచ్చిందనీ, ఇన్వెస్టర్ల అప్రమత్తత రానున్న కాలంలో కొనసాగుతుందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. వరుసగా నాలుగవ రోజు మార్కెట్లు పడిపోవడంతో, బీఎస్ఈ-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19,49,461.82 కోట్ల నుండి 1,09,76,781 కోట్లకు పడిపోయింది. నాలుగు రోజుల్లో బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 5,815 పాయింట్లు కుప్పకూలింది. 1200 కు పైగా కంపెనీలు ఏడాది కనిష్ట స్థాయికి చేరుకున్నాయంటే.. నష్టాలను అంచనా వేయవచ్చు. మరోవైపు కోవిడ్ -19 (కరోనా) ముప్పు దేశీయ కరెన్సీని కూడా బాగా ప్రభావితం చేసింది. దీంతో గురువారం డాలరుమారకంలో రూపాయి చారిత్రక కనిష్టానికి పడిపోయింది. 85 పైసల నష్టంతో 75.11 వద్ద ఆల్ టైం కనిష్టానికి చేరింది. -
రూ.7లక్షల కోట్లు ఎగిరి పోయాయి
సాక్షి,ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, కోవిడ్-19 ఆందోళనలు, రష్యా, సౌదీ అరేబియా ప్రైస్‌వార్ కారణంగా భారీ ఎగిసిన చమురు ధరలతో దేశీయ స్టాక్మార్కెట్లో ప్రకంపనలు రేపింది. చమురు ధరల చారిత్రక పతనం దలాల్ స్ట్రీట్‌ను వణింకించింది. ఇన్వెస్టర్ల ఆందోళనభారీ అమ్మకాలకు తెరతీసింది. దీంతో వరుస నష్టాలతో కుదేలైన దలాల్ స్ట్రీట్ మరింత కనిష్టానికి కుప్పకూలింది. కీలక సూచీలు సెన్సెక్స్,నిఫ్టీ అతి భారీ ఇంట్రాడే నష్టాలను నమోదు చేసింది. నిఫ్టీలోని 50 షేర్లలోదాదాపు అన్ని నష్టాలనే మూట గట్టుకున్నాయి. సెన్సెక్స్‌లో సుమారు 800పైగా షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయంటేనే పతనం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఆటో, మిడ్ క్యాప్, ప్రైవేటు రంగ ఆయిల్ షేర్ల భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. రూ .7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది. కాగా సెన్సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 2450 పాయింట్లు కుప్పకూలింది. బ్యాంకింగ్, ఆటో సహా అన్ని రంగాలు అమ్మకాలతో కుదేలయ్యాయి. ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర బీఎస్ఈలో 13.65 శాతం పతనమైంది. అలాగే రూ. 10లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌లోరూ.2.7లక్షల కోట్లు ఆవిరైపోయాయి. అటు డాలరుతో రూపాయి మారకం విలువ కూడా పతనం బాటలోనే పయనించింది. 16 పైసలు దిగజారి ఈ రోజు (మార్చి 9, 2020) ట్రేడింగ్ రూ.74.03 వద్ద కనిష్టానికి పతనమైంది. అనంతరం 74.18 స్థాయిని తాకి చివరకు 74.08 వద్ద ముగిసింది. 2018 అక్టోబరులో 74.48 వద్ద అల్ టైం కనిష్టానికి పడిపోయింది. శుక్రవారం రూపాయి 73.78 వద్ద క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. చదవండి : కోవిడ్‌కు ‘చమురు’ ఆజ్యం, మార్కెట్ కుదేలు రిలయన్స్‌కు చమురు షాక్ -
కోవిడ్ క్రాష్ : అంబానీకి నష్టం ఎంతంటే?
సాక్షి, ముంబై: కోవిడ్-19 కల్లోలానికి ప్రపంచ మార్కెట్లు విలవిల్లాడాయి. అటు దేశీయ ఈక్విటీమార్కెట్లు కూడా ఫిబ్రవరి చివరి వారంలో భారీగా నష్టపోయాయి. గత ఆరు సెషన్లుగా వరుస నష్టాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లు ఆవిరైపోయింది. శుక్రవారం ఒక్కరోజే రూ.4 లక్షల కోట్లకు పైగా సంపద నిమిషాల్లో కరిగిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కడా అడ్డుకట్టపడకపోవడంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు భారీ అమ్మకాలకు దిగారు. దీంతో దేశంలోని కుబేరులు కూడా సంపదను కోల్పోయారు. (5 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు హాంఫట్) ముఖ్యంగా ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లోని బలహీన ధోరణి భారత బిలియనీర్ల సంపదను ప్రభావితం చేసింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ సూచిక ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ ఏడాది తన సంపదలో 5 బిలియన్ డాలర్లకు పైగా కోల్పోయారు.ఇండెక్స్‌లో పదిహేనవ స్థానంలో ఉన్న ఆసియా టాప్ బిలియనీర్ మొత్తం నికర విలువ 53.5 బిలియన్ డాలర్లు. సెన్సెక్స్1500 పాయింట్లు కుప్పకూలడంతో, మార్కెట్ క్యాప్ పరంగా టాప్‌లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర శుక్రవారం 4.12 శాతం క్షీణించి రూ.1,328 కు చేరుకుంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .8.4 లక్షల కోట్లకు పడిపోయింది. (టెక్ దిగ్గజాలకు కోవిడ్-19 సెగ) ఇదే వరుసలో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా 884 మిలియన్ డాలర్లు కోల్పోయారు. విప్రో లిమిటెడ్ చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ సంపద రెండు నెలల కాలంలో 869 మిలియన్ డాలర్లు క్షీణించింది. అలాగే గౌతమ్ అదానీ 496 మిలియన్ డాలర్లను కోల్పోయారు. విప్రో షేర్లు 4.53, అదానీ ఎంటర్ప్రైజెస్ 6.5శాతం నష్టపోయాయి. ఇంకా టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ షేర్లు 2.5 -3.5 శాతం మధ్య, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు 4-5 శాతం మధ్య కుప్పకూలిన సంగతి తెలిసిందే. బెంచ్‌మార్క్ సూచికలు 7 శాతం పతనం కావడంతో సెంటిమెంటు పూర్తిగా దెబ్బతిందనీ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. కరోనా మహమ్మారి ముప్పు ఊహించనదానికంటే పెద్దగా ఉండనుందని అంచనా వేశారు. (కోవిడ్-19 : స్విస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం) -
ఇంకా ఇంత అంతరమా?
సంపద రాకపోకల గురించి శతకకారుడొక మంచి మాట చెప్పాడు. ‘సిరి తా వచ్చిన వచ్చును, సరళముగా నారికేళ సలిలము భంగిన్...’ అన్నాడు. అంటే, కాలం కలిసొస్తే కొబ్బరి నీళ్లు దొరికినంత సరళంగా, సులువుగా సంపద వచ్చి చేరుతుందని కవి హృదయం. పోయే విషయం లోనూ... ‘సిరి తా పోయిన పోవును, కరిమింగిన వెలగపండు కరణిన్ సుమతీ!’ అంటాడు. ఏనుగు తినడానికి ముందు, తిన్న తర్వాత కూడా బయటకు వెలగపండు అంతే నిక్షేపంగా కనబడుతుంది, కానీ, లోపల గుజ్జంతటినీ వ్యాక్యూమ్ క్లీనర్ లాగా ఏనుగు లాగేస్తుంది. అలా తెలియకుండానే సంపద వెళ్లిపోతుందని ఉవాచ. ఒకరికి సంపద ఎంత తేలిగ్గా రావచ్చో అంతే చడీచప్పుడు లేకుండా వెళ్లిపోనూ వచ్చని, అది స్థిరం కాదని చెప్పడం కవి ఉద్దేశం. కానీ, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో తేడా ఉంది. ఏమంటే, వచ్చే వాళ్లకు పైన చెప్పినట్టు తేలిగ్గా, సులభంగా సంపద వచ్చి చేరుతోంది. ఇక పోయే వాళ్లకు పాపం, చడీచప్పుడు లేకుండా సంపద దక్కకుండా పోతోంది. దాంతో ఆర్థిక అంతరాలు బాగా పెరుగుతున్నాయి. ధనవంతులు ఇంకా సంపన్ను లవుతుంటే, పేదలు మరింత పేదరికంలోకి జారి, బతుకు సమరం నెగ్గలేక చతికిలపడుతున్నారు. మన దేశంలో ఒక శాతం జనాభా దగ్గర ఉన్న సంపద, 70 శాతం అట్టడుగు జనాభా (అంటే, 95 కోట్ల మంది) వద్దనున్న సంపదకు నాలుగురెట్లపైనే అధికం అంటే ఆలోచించండి! దావోస్‌లో సోమవారం ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ (డబ్లుఈఎఫ్) యాభయవ వార్షిక భేటీ సందర్భంగా ఎప్పట్లాగే ‘ఆక్స్‌ఫామ్’ ఓ నివేదిక విడుదల చేసింది. ‘జాగ్రత్తకు వేళాయె’ (టైమ్ టు కేర్) అంటూ ఈ అధ్యయన నివేదిక వెల్లడించిన వివరాలు సగటు ఆలోచనాపరుల్ని కలవరపరుస్తున్నాయి. ఇంతటి ఆర్థిక అంతరాలు ఎడతెగని సామాజిక అసమానతలకు, అశాంతికి దారితీస్తున్నాయి. భూమ్మీది 60 శాతం జనాభా (460 కోట్ల మంది) వద్ద కన్నా ఎక్కువ సంపద ప్రపంచంలోని 2,153 మంది కోటీశ్వరుల వద్ద పోగులుపడి ఉందనేది తాజా లెక్క! దశాబ్ద కాలంలో ప్రపంచ కోటీశ్వరుల సంఖ్య రెట్టింపయింది. అసమానతల్ని తొలగించే నిర్దిష్ట విధానాలు, కార్యక్రమాలు లేకుండా ఈ అంత రాల్ని తగ్గించడం దాదాపు అసంభవమని ఆర్థిక నిపుణులంటున్నారు. ఇప్పటికే వివిధ దేశాల్లో అశాంతికి కారణమౌతున్న సామాజిక, రాజకీయ అంశాలకు తోడు ఈ ఆర్థిక అంతరాల సమస్య తోడవడం అగ్నికి ఆజ్యం పోస్తోంది. ప్రపంచ ఆర్థిక వేదిక ‘గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్’ కూడా ఇలాంటి హెచ్చరికే చేసింది. ఐక్యరాజ్యసమితి (యూఎన్) గుర్తించిన 195 ప్రపంచ దేశాల్లో 40 శాతం, అంటే 75 దేశాల్లో ఈ సంవత్సరం (2020) అలజడి, అశాంతి పరిస్థితులు నెలకొంటాయన్నది ‘వెరిక్స్ మ్యాపిల్ క్రాఫ్ట్’ అనే సామాజిక, ఆర్థిక, రాజకీయ డాటా విశ్లేషణ సంస్థ అంచనా! అందులో భారత్ కూడా ఉంది. 2019 లో హాంగ్‌కాంగ్, చిలీ, నైజీరియా, సుడాన్, హైతీ, లెబనాన్ వంటి 47 దేశాల్లో అలజడి, అశాంతి పరిస్థితులుంటే ఇప్పుడా దేశాల సంఖ్య 75కు చేరుతోంది. ఆర్థిక అసమానతలు సామాజిక అశాంతికి దారితీస్తున్న దుస్థితి దాదాపు అన్ని ఖండాల్లోనూ ఉంది. అవినీతి, పాలకుల ఆశ్రితపక్షపాతం, రాజ్యాంగ ఉల్లంఘనలు, అడ్డగోలుగా పెరిగే నిత్యావసరాల ధరలు వంటివే ఆర్థిక అంతరాల వృద్ధికి కారణమని ఎకనమిక్ ఫోరమ్ భావన. అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశాల్లోనూ వ్యక్తులు, కుటుంబాల వార్షికాదాయాల్లో పెరుగుతున్న వ్యత్యాసాలు రికార్డు స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అవకాశాల అంతరాలే ఆర్థిక అసమానతలకు కారణం. ఉన్న వాళ్లకు అన్నీ సమకూరుతాయి. తద్వారా వాళ్లు సంపదను పెంచుకుంటున్నారు. అవకాశాల్లోనే అన్యాయం వల్ల పేదలు తమ పరిస్థితిని ఎప్పటికీ మెరుగు పరచుకోలేకపోతున్నారు. ఉద్యోగాలుండవు, ఉపాధి దొరకదు, జీవన ప్రమాణాలు మెరుగుపరచుకునే ఆస్కారమే శూన్యం! అరకొర సంపాదన కూడా రోజువారీ ఖర్చు లకు తోడు విద్య, వైద్యం వంటి అత్యవసరాలకే కరిగిపోతోంది. ఇక సంపద వృద్ధికి అవకాశ మెక్కడ? వారి ఆర్థికస్థితి మెరుగుకు దోహదపడకుండా, ఎంత సేపూ వారిని ఓటు బ్యాంకులుగా పరిగణించే పాలనా వ్యవస్థలు ఎప్పటికప్పుడు తృణమో, పణమో తాయిలాలు అందించి పబ్బం గడుపుకుంటున్నాయి. ‘అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో వడ్డించే...’ పద్ధతిలో ఎర్ర తివాచీలు పరచి కార్పొరేట్లకు దాసోహమంటున్నాయి. పెద్ద ఖర్చుతో కూడుకున్న మన ఎన్నికల సమయంలో వారు వీరికి, అధికారం చేపట్టాక వీరు వారికి పరస్పరం తోడ్పడుతూ ప్రజాధనం కొల్లగొడుతున్న ఫార్ములాలే సమాజంలో ఆర్థిక అంతరాల్ని పెంచుతున్నాయి. ఏటా ఇది పెరు గుతోంది. 63 మంది భారత అతి ఐశ్వర్యవంతుల సంపద 2018–19 కేంద్ర మొత్తం బడ్జెట్ (రూ.24,42,200 కోట్లు) కంటే ఎక్కువ. డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు, మన అంతరాల సమాజం... మధ్యలో మెట్లు, నిచ్చెనల్లేని బహుళ అంతస్తు భవనం లాంటిది. పై అంతస్తుల్లో ఎవరైనా అనర్హు లున్నా కిందకు రారు. కింది అంతస్థుల్లోని వారిలో యోగ్యులున్నా పైకి రాలేరు. కాలక్రమంలో మన వ్యవస్థలు ఈ దుస్థితినే మరింత పెంచిపోషిస్తున్నాయి. మరి మన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ రక్షణలు, పంచవర్షప్రణాళికలు, భారీ బడ్జెట్లు... ఏం ఫలితాలు సాధించి నట్టు? అనే ప్రశ్న సహజం. ఏ రూపంలో ఉన్నా పేదరికాన్ని రూపుమాపి, ఆర్థిక అంతరాల్ని తొలగిం చాలన్నది యూఎన్ నిర్దేశించిన సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లో (ఎస్డీజీ) ముఖ్యమైంది. అసమానతల్ని పూడ్చే ప్రత్యేక ఆర్థిక వనరుల్ని సమకూర్చుకునే అవకాశాలున్నా మన ప్రభుత్వాలు సంపన్నులపై పన్ను విధింపులో ఉదారంగా ఉంటున్నాయి. ప్రపంచ జనాభాలో శీర్షాన ఉన్న ఒక శాతం సంప న్నులు 0.5 శాతం పన్ను ఎక్కువ చెల్లిస్తే, వచ్చే పదేళ్లలో విద్య–వైద్యం, పిల్లలు–వృద్ధుల సంక్షేమం వంటి కీలక రంగాల్లో 11.70 కోట్ల ఉద్యోగావకాశాలు కల్పించొచ్చు. ఇది ఖచ్చితంగా ఆలోచించదగ్గ ప్రతిపాదనే! -
మూడు గంటల్లో రూ. 3లక్షల కోట్లు
సాక్షి,ముంబై: జియో పొలిటికల్ అందోళన నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయంగా స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాక్‌పై ఆంక్షలు, బెదింపులతో దలాల్ స్ట్రీట్ అల్లకల్లోలమైంది. సోమవారం మధ్యాహ్నం నాటికి 3లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. ఈ రోజు (సోమవారం) కేవలం మూడుగంటల్లో రూ. 3 లక్షల కోట్లు నష్టపోయారు. కాగా మధ్యాహ్నం 2.30 సమయానికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 154 లక్షల కోట్లకు దిగజారింది. గత శుక్రవారం ఈ విలువ రూ. 157 లక్షల కోట్లు. సెన్సెక్స్ 788 పాయింట్లు, నిఫ్టీ 234 పాయింట్లు పతనమైనాయి. తద్వారా శుక్రవారం ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేసిన కీలక సూచీలు సెన్సెక్స్ 41వేల కిందికి, నిఫ్టీ 12 వేల దిగువకు చేరింది. ప్రతి ఐదు షేర్లలోనాలుగు నష్టపోగా, స్మాల్ క్యాప్స్ లో ఎక్కువ షేర్లు భారీగా నష్టపోయి లోయర్ సర్క్యూట్ కావడం గమనార్హం. మరోవైపు ఇరాన్ ఉద్రిక్తతలతో బ్రెంట్‌క్రూడ్ 70 డాలర్లను చేరడంతో రూపాయి కూడా బలహీననడింది. ఈ పరిస్థితి ఇలాగాఏ కొనసాగితే ముందుగా క్రూడ్ 75 డాలర్లను చేరవచ్చని అంచాన. క్రూడ్ దెబ్బతో డాలర్ పుంజుకోగా, దేశీయ కరెన్సీ బలహీనపడింది. డాలరు మారకంలో రూపాయి మరోసారి 72 స్థాయికి చేరింది. ఇరాన్ స్పందన తీవ్రంగా ఉంటే ప్రపంచ క్రూడ్ సరఫరాలో 20 శాతం మేర దెబ్బతింటుందని, దీంతో క్రూడాయిల్ ధర 20 శాతం మేర పెరగవచ్చని అంతర్జాతీయ నిపుణుడు జొనాథన్ బారాత్ వ్యాఖ్యానించారు. చదవండి : ఇరాన్-అమెరికా ఉద్రిక్తత : కుదేలైన రూపాయి చదవండి : ప్రతీకార హెచ్చరికలు, మార్కెట్ల పతనం -
2019లో దూసుకుపోయిన ఇండియన్ టైకూన్
సాక్షి, ముంబై: ఇండియన్ టైకూన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ముకేశ్ అంబానీకి 2019 ఏడాది బాగా కలిసి వచ్చిన మంచి సంవత్సరంగా నిలిచింది. ఒక పక్క దేశ ఆర్థిక వ్యవస్థలో మందమనం ఆందోళన రేపుతోంటే ఆయన మాత్రం సంపద సృష్టిలో దూసుకుపోయారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, భారత వ్యాపారవేత్త, కుబేరుడు అంబానీ సంపద డిసెంబర్ 23 నాటికి దాదాపు 18 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఇది ఆసియాలో అత్యధికం. దీంతో ఆయన సంపద నికర విలువ 61 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా నికర విలువ 11.3 బిలియన్ డాలర్లు పెరగ్గా, జెఫ్ బెజోస్ 13.2 బిలియన్ డాలర్లు పెరిగింది. 2021 నాటికి రిలయన్స్ కంపెనీని జీరో డెబిట్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆగస్ట్ నెలలో చెప్పిన అంబానీ ఆ వైపుగా దూసుకుపోతున్నారు. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ల విలువ 40 శాతం పెరగడంతో పుంజుకోవడం ముకేశ్ అంబానీ సంపద భారీగా పెరగడానికి దోహదపడింది. ఇదే కాలంలో ఇండియా బెంచ్ మార్క్ ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్ లాభపడిన దాని కంటే రిలయన్స్ స్టాక్స్ రెండింతలు పెరిగడం గమనార్హం. ఆయిల్ అండ్ గ్యాస్, టెలి కమ్యూనికేషన్స్ సహా రీటైల్ వివిధ రంగాలు, పెట్టుబడులు, రిలయన్స్‌ను ఓ స్థాయికి తీసుకు వెళ్లారని, టీసీజీ అసెట్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ చక్రి లోకప్రియ తెలిపారు. త్వరలోనే అమెజాన్‌కు పోటీగా ఇ-కామర్స్ దిగ్గజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో, ఈ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టనుందన్నారు. అలాగే రానున్న రిలయన్స్ వాటాదారుల విలువను రెట్టింపు అవుతుందని తాము నమ్ముతున్నామన్నారు. తద్వారా రిలయన్స్ కొత్త వెంచర్స్ ద్వారా 50 శాతం ఆదాయం రానుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది 32 శాతంగా ఉంది. సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్కోతో ఒప్పందం రిలయన్స్ షేర్లలో కొనుగోళ్లకు ఊతమిచ్చాయి.(ఆరాంకోతో ప్రతిపాదిత లావాదేవీకి కేంద్రం ద్వారా ప్రస్తుతానికి అడ్డుకట్ట పడింది). దీనికితోడు టెలికాం రంగంలో రిలయన్స్ జియో సంచలనం, ప్రత్యర్థుల ధీటుగా శర వేగంగా దూసుకెళ్లి మూడేళ్లలోనే దేశంలో నెంబర్ 1 గా అవతరించడం వంటివి రిలయన్స్‌కు 2019లో బాగా కలిసి వచ్చిన అంశాలు. కాగా ఫోర్బ్స్ గత నెలలో ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ 9వ స్థానంలో నిలిచిన సంగతి విదితమే. -
ఐదేళ్లలో 5 రెట్లు పెరిగిన ఒడిశా సీఎం ఆస్తులు
భువనేశ్వర్ : దేశంలోనే అత్యంత నిరాడంబరుడైన ముఖ్యమంత్రుల్లో నవీన్ పట్నాయక్ ఒకరు. అలాంటిది గడిచిన ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ దాదాపు ఐదు రెట్లు పెరిగింది. అయితే ఇందులో కొత్తగా కూడబెట్టిన ఆస్తులేవి లేవు. గతంలో ఉన్న ఆస్తుల మార్కెట్ విలువ పెరగడం వల్లే ప్రస్తుతం ఆయన ఆస్తి ఐదు రెట్లు పెరిగిందంటున్నారు అధికారులు. నిన్ననే హింజిలీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఛత్రాపూర్ సబ్ కలెక్టర్ ఆఫీసులో నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ ప్రస్తుతం తన పేర రూ. 63 కోట్ల ఆస్తులున్నట్లుగా ఎన్నికల ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. అయితే 2014 నాటికి బంగారం, నగదు, ఇళ్లు, వాహనాల మొత్తం కలిపి రూ. 12 కోట్ల ఆస్తులున్నట్లు చూపించారు. ప్రస్తుతం వీటి విలువ ఐదురెట్లు పెరగడంతో ఆస్తి మొత్తం రూ.63 కోట్లు అయ్యింది. ప్రస్తుతం నవీన్ పట్నాయక్ చేతిలో రూ. 25 వేల నగదుతో పాటు తొమ్మిదివేల రూపాయలు విలువ చేసే 1980 నాటి మోడల్ అంబాసిడర్ కార్ ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా నవీన్ పట్నాయక్ తొలిసారి రెండు అసెంబ్లీ స్థానాల బరిలో నిలువనున్నారు. అందులో ఒక స్థానం హింజిలీ కాగా మరొకటి బిజేపూర్. -
ఆరోగ్యం + ఆదాయం = చిరుధాన్యాల సాగు
సాక్షి, జడ్చర్ల టౌన్: ఆరోగ్యంతోపాటు మంచి ఆదాయాన్ని ఇస్తుంది చిరుధాన్యాల సాగు. ఇటీవల కాలంలో చిరుధాన్యాలను భుజించటం సర్వసాధారణమైంది. అయితే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెరగకుండా ఉంది. ఈక్రమంలోనే బాదేపల్లి పట్టణానికి చెందిన బి.రవిశంకర్ అనే ఆదర్శరైతు మాత్రం చిరుధాన్యాలను సాగుచేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే పంట సాగుపట్ల అనేక ప్రయోగాలు చేయడంతోపాటు జడ్చర్ల రైతుసహకార సంఘం అధ్యక్షుడిగా పలు సెమినార్లకు హాజరై నూతన సాగు విధానాల పట్ల ఆయన మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే చిరుధాన్యాలు సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఎకరా పొలంలో అండుకొర్రలు సాగుచేస్తున్నాడు. డ్రిప్ పద్ధతిలో సాగు.. తక్కువ నీటితో డ్రిప్ పద్దతిలో అండుకొర్రలు సాగుచేయటం గమనార్హం. 65రోజుల కిందట విత్తనాలు వేయగా మరో 25రోజుల్లో పంట చేతికిరానుంది. ఇప్పటి వరకు ఎకరా అండుకొర్రల సాగుకు మొత్తం రూ.20వేలు ఖర్చు అయినట్లు సదరు రైతు తెలిపాడు. పంట దిగుబడి 7–8క్వింటాళ్ల వరకు రావచ్చని చెబుతున్నాడు. బహిరంగ మార్కెట్లో అండుకొర్రలు కిలో రూ.250గా ఉంది. 7–8క్వింటాళ్ల సాగుతో రూ.లక్షల్లో లాభాలు ఆర్జించేందకు ఆస్కారం ఉందంటున్నాడు. గత ఏడాది చిరుధాన్యాలైన అర్కలు, సామలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు ఐదు రకాలను సాగుచేసి వచ్చిన 8క్వింటాళ్ల దిగుబడి అలాగే భద్రపర్చారు. ఏడాదికి మూడు పంటలు సులువుగా తీసే ఆస్కారం ఉండటంతో చిరుధాన్యాల సాగుపట్ల ఆసక్తి క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రాసెసింగ్ యూనిట్ ఉంటే సాగువిస్తీర్ణం పెరిగే అవకాశం చిరుధాన్యాలు పండించిన తరువాత వాటిని ప్రాసెసింగ్ చేసేందుకు జిల్లాలో అవకాశం లేకుండా పోయింది. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటయినట్లయితే రైతులు మరికొంత మంది చిరుధాన్యాల సాగు చేసేందుకు సిద్దంగా ఉన్నారు. పట్టించుకోని ఐఐఎంఆర్‌సీ రాజేంద్రనగర్‌లో ఉన్న కేంద్ర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్ అధికారులు పట్టించుకోకపోవటం వల్లే ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కాకుండా ఉంది. చిరుధాన్యాల విత్తనాలు సరఫరా చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నప్పటికీ రైతులు పండించిన చిరుధాన్యాలను నేరుగా విక్రయించలేక, ప్రాసెసింగ్ చేసుకోలేక సాగుకు ముందుకు రాకుండా ఉన్నారు. ఈప్రాంతంలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని, అందుకు ఐఐఎంఆర్‌సీ అ«ధికారులు ముందుకు రావాలని రైతులు కోరుతున్నారు. ఎకరాకి రూ.20వేలు వెచ్చించి.. అండుకొర్రల సాగుకు ఇప్పటి వరకు ఒక ఎకరా పొలానికి రూ.20వేలు వెచ్చించా. మరో 25రోజుల్లో పంట చేతికి రానుంది. ఎకరాకు 7–8క్వింటాళ్ల దిగుబడి వచ్చే ఆస్కారం ఉంది. చిరుధాన్యాలు పండించేందుకు నీటి వసతి నామమాత్రంగా ఉన్నప్పటికీ డ్రిప్‌తో సులువుగా సాగు చేయవచ్చు. ఏడాదికి మూడుపంటలు సులువుగా సాగు చేసే వెసులుబాటు ఉంది. చిరుధాన్యాల సాగు వల్ల భూమిలో సారం కోల్పోకుండా మరింత బాగా మారుతుంది. అయితే, రైతులు సాగుకు ఆసక్తిగా ఉన్నా ప్రాసెసింగ్ యూనిట్ లేకపోవటంతో ముందుకు రావడంలేదు. – బి.రవిశంకర్, ఆదర్శరైతు, బాదేపల్లి -
చెత్త పేరుతో సంపద లూటీ!
సాక్షి, లింగసముద్రం(ప్రకాశం) : చెత్తతో సంపద తయారీ కేంద్రాల మాట ఎలా ఉన్నా ఆ పేరు చెప్పి మండలంలో అధికార పార్టీ నాయకులు బాగానే సంపాదించుకుంటున్నారు. చెత్త సేకరణ పేరుతో చేపట్టిన సంపద కేంద్రాల నిర్మాణాలు గ్రామస్థాయి నాయకులకు వరంగా మారాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న వర్మీ కంపోస్ట్ షెడ్లు టీడీపీ నాయకులు ఉపాధిగా మలుచుకుని లక్షలాది రూపాయలు కొల్లగొట్టారు. గ్రామాల్లో ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇదీ..పరిస్థితి లింగసముద్రం మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో చెత్త సంపద కేంద్రాలు నిర్మించేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే సర్పంచ్ల పదవీ కాలం ముగియగానే టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఒక్కో షెడ్ నిర్మాణానికి రూ.4 లక్షల నుంచి 9 లక్షల వరకు మంజూరు కావడంతో ఇదే అదునుగా భావించి నిర్మాణాలు మొదలు పెట్టారు. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి నిర్మాణాలు పూర్తి చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా బిల్లులు చెల్లింపులు ఉండటంతో టీడీపీ నాయకులు ఆడిందే ఆటగా ఉంది. నిర్మాణాలు పూర్తి చేయకుండానే మొత్తం బిల్లులు కాజేశారు. నిరుపయోగంగా ఉన్న సంపద కేంద్రం షెడ్డు మండలంలో 16 గ్రామ పంచాయతీల్లో కొన్ని సంపద కేంద్రాలు పూర్తయ్యాయి. మిగిలిన సంపద కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటన్నింటికీ దాదాపుగా రూ.1.09 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి. గ్రామాలకు దూరంగా వీటిని నిర్మించడంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదనేది స్పష్టమవుతోంది. ఈ సంపద కేంద్రాల్లో అసాంఘిక కార్యకలాపాలు రాత్రిళ్లు వ్యభిచారం, పగలు పేకాట వంటివి జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించాల్సి ఉన్నా టీడీపీ నాయకుల స్థలాలకు అనువుగా ఉంటాయన్న చోట ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మండల కేంద్రం లింగసముద్రం గ్రామానికి చెత్త సంపద తయారీ కేంద్రాన్ని గ్రామానికి దాదాపు మూడు కిలో మీటర్ల దూరంలో నిర్మించారు. రూ.8 లక్షల వ్యయంతో ఈ సంపద కేంద్రాన్ని తాటాకుల కప్పుతో ఏడాది క్రితం నిర్మించారు. తాటాకుతో నిర్మించి ఏడాది కావడంతో తాటాకు లేచి పోయి శిథిలావస్థకు చేరింది. గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే మండలంలోని పంచాయతీల్లో చెత్త పేరుతో సంపద తయారీ కేంద్రాలు నిర్మించినా అవి నిరుపయోగంగానే కనిపిస్తున్నాయి. సంపద కేంద్రాల వినియోగించక పోవడంతో గ్రామాల్లో ఎక్కడ బడితే అక్కడ చెత్తా చెదారం, మట్టి దిబ్బలు, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలు పేరుకు పోతున్నాయి. చెత్తా చెదారం మురుగు కాలువల్లో పడి అస్తవ్యస్తంగా మారుతున్నాయి. చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్వహణకు గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు ప్రభుత్వం నియమించిన స్వచ్ఛ దూతలు ఎక్కడా కనిపించడం లేదు. చెత్త సేకరణ రిక్షాల కొనుగోలు ఊసేలేదు. పంచాయతీల్లో రిక్షాలను కొనుగోలు చేశామని అధికారులు చెబుతున్నా అవి ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. -
ఆసియాకే కుబేరుడు అంబానీ!
న్యూఢిల్లీ: ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ క్రమంలో చైనాకి చెందిన ఈ– కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ చీఫ్ ‘జాక్ మా’ను కూడా అధిగమించారు. వార్షికంగా చూస్తే.. మిగతా సంపన్నుల సంపద కరిగిపోతున్నా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు పరుగుల కారణంగా ముకేశ్ అంబానీ సంపద మాత్రం 4 బిలియన్ డాలర్ల మేర పెరిగి సుమారు 43.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. అటు జాక్ మా సంపద 35 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ నివేదిక ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2018లో ఆసియాలో 128 మంది కుబేరుల సంపద 137 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయింది. ర్యాంకింగ్‌లు ప్రారంభించిన 2012 సంవత్సరం నాటి నుంచి చూస్తే ఆసియా సంపన్నుల సంపద ఇలా తగ్గిపోవడం ఇదే ప్రథమం. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు, షేర్ల విలువలు అనుచిత స్థాయిలకు పెరిగిపోయాయన్న ఆందోళనలు.. ఇందుకు కారణమయ్యాయి. చైనాతో పాటు భారత్, దక్షిణ కొరియా దేశాల సంపన్నులపై ఎక్కువగా ప్రభావం పడింది. బ్లూమ్‌బర్గ్ సూచీలో ర్యాంకింగ్ పొందిన 40 మంది చైనా సంపన్నుల్లో మూడింట రెండొంతుల మంది సంపద తగ్గిపోయింది. లిస్టులో భారతీయ కుబేరులు 23 మంది ఉండగా.. వారి సంపద 21 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. ఉక్కు దిగ్గజం అర్సెలర్ మిట్టల్ చీఫ్ లక్ష్మీ నివాస్ మిట్టల్ నికర విలువ అత్యధికంగా 29 శాతం మేర (5.6 బిలియన్ డాలర్లు) కరిగిపోయింది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద జనరిక్స్ తయారీ దిగ్గజం సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి సంపద 4.6 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. -
అభ్యర్థుల ఆస్తులు.. అంతస్తులు
ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా తమ ఆస్తుల వివరాలు వెల్లడించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించారు. అయితే, కొంతమంది ఆస్తుల విలువ గతం కంటే ఇప్పుడు రెట్టింపు కాగా, మరికొంత మంది సంపద కూడా బాగానే పెరిగింది. స్వల్ప పెరుగుదల.. సాక్షి,కామారెడ్డి: కామారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ నామినేషన్ వేసిన సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. తనకు మొత్తం రూ.1.89 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా వెల్లడించారు. 2014లో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు రూ.58.50 లక్షల విలువైన ఆస్తులు ఉండేవి. వాటి ప్రకారం గత నాలుగున్నరేళ్లలో ఆయన ఆదాయంలో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. చరాస్తుల విషయానికి వస్తే ప్రస్తుతం చేతిలో నగదు రూ.4,52,800, భార్య వద్ద రూ.2,46,700 ఉండగా.. 2014 లో ఆయన వద్ద రూ.2 లక్షలు మాత్రమే ఉన్నాయి. అప్పటికి, ఇప్పటికి వార్షికాదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. 2012–13 వార్షిక ఆదాయం రూ.6 లక్షలు ఉండగా, ప్రస్తుతం చూపించిన లెక్కల ప్రకారం 2017–18 వార్షికాదాయం రూ.19,72,810గా ఉంది. పాలసీలు, సేవింగ్స్ పేరిట 2014లో రూ.11 లక్షలు చూపించగా ఈ సారి రూ.15 లక్షల వరకు చూపించారు. వాహ నాలు, వాటి విలువ మారలేదు. ప్రస్తుతం కామారెడ్డి కార్పొరేషన్ బ్యాంక్ ఖాతాలో రూ.28 లక్షలు, హైదరాబాద్ సెక్రెటేరియట్ ఎస్బీఐ బ్యాంకులో రూ.9.47 లక్షలు ఉన్నట్లుగా వెల్లడించారు. 2014లో అన్ని ఖాతాల్లో కలిపి రూ.20 వేల వరకు మాత్రమే ఉన్నాయి. స్థిరాస్తుల విషయానికి వస్తే 2014లో ఆయన స్వగ్రామమైన బస్వాపూర్ వద్ద పాత ఇల్లు, 2.16 ఎకరాల వ్యవసాయ భూమి, ఎన్బీటీ నగర్ హైదరాబాద్‌లో స్వయంగా కొనుగోలు చేసిన రూ.38 లక్షల విలువైన ప్లాటు ఉండేవి. తాజాగా సమర్పించిన అఫిడవిట్ ప్రకా రం కామారెడ్డిలో రూ.45 లక్షల విలువైన ఇల్లు నిర్మించుకున్నారు. ఇవేకాకుండా ఈ నాలుగున్నరేళ్లలో రూ.25 లక్షలకు పైగా విలువైన మరో 7 ఎకరాల వ్యవసాయభూమి, రంగారెడ్డి జిల్లాలో రూ.15 లక్షల విలువైన ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేశారు. మొత్తమ్మీద గత ఎన్నికలతో పోలిస్తే గంప ఆస్తుల్లో కొద్దిపాటి పెరుగుదల ఉంది. మల్యాద్రి.. స్వతంత్ర అభ్యర్థి మల్యాద్రిరెడ్డి ఆస్తులను పరిశీలిస్తే.. ఆయన వద్ద బ్యాంకులో రూ.25 వేల డిపాజిట్, రూ.5లక్షల విలువ చేసే రెండు ఎల్ఐసీ పాలసీలు, ఒక మోటారు వాహనం, రూ.64 వేల విలువ చేసే 10 గ్రాముల బంగారం, భార్య వద్ద రూ.2.24లక్షల విలువ చేసే 70 గ్రాముల బంగాచం, తల్లి వద్ద రూ.96 వేల విలువ చేసే 30 గ్రాముల బంగారం ఉంది. హైదరాబాద్‌లోని కొత్తపేటలో, మన్సూరాబాద్‌లో ఇళ్లు ఉన్నాయి. ఆయనపై వర్ని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ధన్పాల్ సాక్షి, నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ అర్బన్‌లో శివసేన పార్టీ తరఫున బరిలోకి దిగిన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నామినేషన్ దాఖలు సందర్భంగా తన ఆస్తులు వెల్లడించారు. గతంలో కంటే ఈసారి కొద్దిమేర ఆస్తులు పెరిగినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ధన్పాల్ బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ టికెట్ రాకపోవడంతో ఆయన శివసేన నుంచి బరిలోకి దిగారు. 2014 ఎన్నికల సమయానికి ధన్‌పాల్‌కు రూ.26,55,114 విలువైన చరాస్తులు ఉండగా, ప్రస్తుతం రూ.55,77,927 చరాస్తులు ఉన్నట్లు చూపారు. అప్పట్లో స్థిరాస్తుల విలువ రూ.2.71 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.3.65 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.5.44 లక్షల విలువైన ఇన్నోవా, రూ.19.6 లక్షల విలువైన క్రిస్టా, రూ.21.34 లక్షల మెర్సిడెస్ బెంజ్ కార్లున్నాయి. అలాగే, రూ.3.20 లక్షల విలువైన 105 గ్రాముల బంగారం ఉందని, 2017–18 వార్షికాదాయం రూ.5.77 లక్షలున్నట్లు చూపారు. భార్య మణిమాల పేరిట రూ.37.48 లక్షల చరాస్తులు, రూ.1.77 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తన ముగ్గురు పిల్లల పేరిట రూ.4.60 కోట్ల స్థిరాస్తులు, రూ.24 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. కాసుల గలగలలు.. సాక్షి, బాన్సువాడ: బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్ ఆస్తులు గతంలో కంటే ప్రస్తుతం రెట్టింపయ్యాయి.! 2014 ఎన్నికల సమయంలో మొత్తం రూ.22.23 లక్షల విలువైన స్థిర, చరాస్తులు ఉండగా, ప్రస్తుతం రూ.1.33 కోట్ల ఆస్తులున్నట్లు బాల్‌రాజ్ తాజాగా సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించారు. 2014లో బాల్‌రాజ్ వద్ద నగదు రూపంలో కేవలం రూ.8 వేలు, రూ.17లక్షల విలువైన ఇన్నోవా, రూ.3లక్షల విలువైన ట్రాక్టర్, రూ.లక్ష విలువ చేసే ట్రాలీ, రూ.25 వేల విలువ చేసే బైక్, రూ.90 వేల విలువ చేసే 30 గ్రాముల బంగారం తదితరాలు కలిపి మొత్తం ఆస్తులు రూ.22,23,000 ఉన్నట్లు తెలిపారు. అయితే, ప్రస్తుతం తన వద్ద నగదు రూ.4 లక్షలు, బ్యాంకులో రూ.4.45 వేలు ఉన్నాయి. రూ.14 లక్షల విలువ చేసే ఇన్నోవా, రూ.2.65 లక్షల విలువ చేసే ట్రాక్టర్, భార్య పేర హీరోహోండా మోటర్ సైకిల్, కుమారుడి పేర మోటర్ సైకిల్ ఉన్నాయి. బాల్‌రాజ్ వద్ద రూ.1.50 లక్షల విలువ చేసే 50 గ్రాముల బంగారం, భార్య వద్ద రూ.3 లక్షల విలువ చేసే 100 గ్రాముల బంగారం, తల్లి వద్ద 1.50 లక్షల విలువ చేసే 50 గ్రాముల బంగారం ఉంది. బాల్‌రాజ్ పేర రూ.50 లక్షల విలువైన 7.05 ఎకరాల భూమి, రూ.65లక్షల విలువ చేసే ప్లాట్లు ఉన్నాయి. ఆయన ఆస్తుల మొత్తం విలువ రూ.1.33 కోట్లు కాగా, రూ.32 లక్షల అప్పులు ఉన్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సందర్భంగా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. పెరిగిన స్థిరాస్తులు, తగ్గిన చరాస్తులు సాక్షి,జామాబాద్అర్బన్: నిజామాబాద్ అర్బన్ టీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్‌గుప్తా తన స్థిరాస్తుల్లో పెరుగుదల ఉండగా, చరాస్తులు తగ్గినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. గణేశ్‌గుప్తా చరాస్తులు 2014 కంటే ఇప్పుడు రూ.17.90 లక్షల మేర తగ్గాయని, రూ.7.50 కోట్ల మేర స్థిరాస్తులు పెరిగినట్లు చూపించారు. 2014 ఎన్నికల సమయంలో తన పేరిట మొత్తం రూ.3.54 కోట్ల విలువైన చరాస్తులు ఉండగా, ప్రస్తుతం రూ.3.36 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అప్పట్లో మార్కెట్ విలువ ప్రకారం రూ.17.39 కోట్ల స్థిరాస్తులు ఉండగా, ప్రస్తుతం రూ.24.32 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు వివరించారు. వ్యక్తిగత రుణాలు రూ.99.27 లక్షలు ఉన్నాయి. బిగాల పేరిట రూ.20.62 లక్షల ఇన్నోవా క్రిస్టా, రూ.26.89 లక్షల విలువైన ఫార్చునర్ కార్లున్నాయి. బ్యాంకులో రూ.71 లక్షలు, రూ.19.50 లక్షల విలువైన 650 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపారు. అలాగే, 2017–18 వార్షిక ఆదాయం రూ.15.28 లక్షలని పేర్కొన్నారు. భార్య లత పేరిట రూ.1.78 కోట్ల చరాస్తులు, రూ.16.49 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.7.31 లక్షల పెట్టుబడులు, బ్యాంకులో నగదు రూపంలో రూ.17 లక్షలు, రూ.78 లక్షల విలువైన 2,600 గ్రాముల బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో వివరించారు. ఆమె పేరిట రూ.33.50 లక్షల వ్యక్తిగత రుణాలతో పాటు రూ.18 లక్షల విలువైన కారు ఉన్నట్లు తెలిపారు. వార్షికాదాయం రూ.7.41లక్షలున్నట్లు అఫిడవిట్లో చూపారు. -
నయా చాలెంజ్ : మీ సంపదేంటో చూపించగలరా..?
బీజింగ్ : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక చాలెంజ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. రెండు నెలల క్రితం వరకూ కూడా ‘కీకీ చాలెంజ్’ హల్చల్ చేసింది. పోలీసుల హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా.. సెలబ్రిటీల నుంచి సాధరణ పౌరుల వరకూ.. వయసుతో సంబంధం లేకుండా కీకీ డ్యాన్స్ చేసి వీడియోలను ఇంటర్నెట్లో అపలోడ్ చేశారు. ఇప్పుడు కొత్త తరహా చాలెంజ్ ఒకటి చైనాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆ చాలెంజ్ విశేషాలు చూడండి. ‘వెల్త్ ఫ్లాంటింగ్ చాలెంజ్’ పేరుతో వైరలవుతోన్న ఈ చాలెంజ్‌ని సెలబ్రిటీల నుంచి ప్రభుత్వ అధికారులు కూడా ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఈ చాలెంజ్‌లో ఏం చేయాల్సి ఉంటుంది అని ఆలోచిస్తున్నారా.. చేప్తాం. ఈ వెల్త్ ఫ్లాంటింగ్ చాలెంజ్ తీసుకున్న వ్యక్తులు తమ నిజ జీవితంలో వేటినైయితే అత్యంత భద్రంగా చూసుకుంటారో.. వేటిని ఎక్కువగా ప్రేమిస్తారో.. ఇంకో రకంగా చెప్పాలంటే తమ సంపదగా భావించే వాటిని రోడ్డు మీద పెట్టాలి, పడేయ్యాలి. అంటే క్రెడిట్ కార్డ్స్, డబ్బు, జ్యూవెలరి, డిజైనర్ బట్టలు, చెప్పులు, బ్యాగ్‌లు, వృత్తికి సంబంధించినవి, వస్తువులు, జంతువులు, మనషులతో సహా. వాటిని రోడ్డు మీద పడేయాలి. తర్వాత కార్ నుంచి బయటకు వచ్చి పడేసిన వాటి మధ్య పడుకోని ఫోటో దిగాలి. ఏదో ఫోటోషూట్‌కి ఫోజ్ ఇస్తున్నట్లు కాకుండా.. స్పృహతప్పి కింద పడిపోయినట్లు పేవ్మెంట్ వైపుగా ముఖం పెట్టి పడిపోవాలి. తర్వాత ఈ ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. ప్రస్తుతం చైనాలో ట్రెండ్ అవుతోన్న ఈ చాలెంజ్‌లో ఇప్పటికే పలువురు తమ విలువైన సంపదను ప్రంపచానికి పరిచయం చేశారు. కొందరు ఖరీదైన బ్యాగ్‌లు, మేకప్ సామాగ్రిని చూపించగా.. మరి కొందరు ఫైల్‌లను.. మెకానిక్ వస్తువులను.. పరిచయం చేశారు. View this post on Instagram It's not how you fall.... It's how you get up! #fallingstarschallenge #fallingstars2018 #fallingstars #fall #bodifitbootcamp #bootcampsemarang #didiesantoso #bootcamp #streetworkout #calisthenics A post shared by didiesantoso (@didiesantoso) on Oct 24, 2018 at 8:34pm PDT -
5 నిమిషాల్లో రూ.4 లక్షల కోట్ల ఆవిరి
సాక్షి,ముంబై: భారీ నష్టాల్లోంచి తేరుకుని బుధవారం లాభాల్లోకి అడుగుపెట్టిన దలాల్ స్ట్రీట్‌కు నేడు (గురువారం) వాల్‌స్ట్రీట్ సెగ తగిలింది. దీంతో ఆరంభంలోనే కీలక సూచీలు భారీగా కుప్పకూలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టంతో 34వేల కిందికి, నిఫ్టీ 300 పాయింట్లు క్షీనించి10,200 స్థాయి కిందికి దిగజారాయి. దీంతో కేవలం 5 నిమిషాల్లో సుమారు రూ.4లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. బీఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కసారిగా 134.38 లక్షలకోట్ల రూపాయలకు పడిపోయింది. మార్కెట్లో దాదాపు 175 స్టాక్స్ 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, భారతీ ఎయిర్ టెల్, బాంబేడైయింగ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , దీపక్ ఫెర్టిలైజర్స్, ఫినోలెక్స్,హెచ్ఏఎల్ తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. మరోవైపు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 26పైసలు క్షీణించి రూ.74.47 పైసలతో జీవన కాల గరిష్ఠానికి చేరింది. ఆసియా మార్కెట్లు, అమెరికా మార్కెట్లు బాగా నష్టపోవడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ కుదించింది. ఈ రెండు దేశాలూ వచ్చే ఏడాదిలో వాణిజ్య వివాద ప్రభావాలను చవిచూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఎస్ అండ్ పి 500 3.29 శాతం నాన్డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 4.08 శాతం, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ క్యాజువల్ 2.2 శాతం నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో తైవాన్ సూచీ 5.21 శాతం, జపాన్ నిక్కి 3.7 శాతం, కొరియాకు చెందిన కోస్పి 2.9 శాతం షాంఘై కాంపోజిట్ 2.4 శాతం క్షీణించాయి. -
మార్కెట్ క్రాష్ : రూ. 5.66 లక్షల కోట్లు మటాష్!
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్ ఉత్థానపతనాలను ఒడిసిపట్టుకోవడం కత్తిమీదసామే. రికార్డుస్తాయిలకు చేరుకున్నకీలక సూచీలు లాభనష్టాల ఊగిసలాడాయి. అనూహ్య పరిణామాలతో మార్కెట్లో ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సందప ఆవిరై పోయింది. ముఖ్యంగా ఈ వారాంతంలో శుక్రవారం నాటి పరిణామాలు ఇన్వెస్టర్లను వణికించాయి. నిమిషాల వ్యవధిలోనే సంపద అలా మంచులా కరిగిపోయింది. ఇక మ్యూచువల్ ఫండ్ల సంగతి సరే. ముఖ్యంగా ఈ వారంలోని నాలుగు రోజుల ట్రేడింగ్‌లో రూ. 5.66 లక్షల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. బ్యాంకింగ్, ఫార్మా, ఆటో, ఐటీ, హౌసింగ్ ఫైనాన్స్ ఇలా దాదాపు అన్ని సెక్టార్ల షేర్లు పాతాళానికి పరుగులు తీశాయి. ఇవాళ ఒక్కరోజే సెన్సెక్స్ 1100పాయింట్లకుపైగా ఢమాల్ అంది. అయితే, ఇది కొన్ని నిమిషాలలో మెరుగుపడినా..ఇన్వెస్టర్ల నష్టం మాత్రం తప్పలేదు. బీఎస్ఇలో లిస్టయిన షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,66,187 కోట్లు కరిగిపోయింది. అటు నిఫ్టీది కూడా ఇదేబాట. ఈ వారంలో నిఫ్టీ 1249 పాయింట్లు అంటే 3.28 శాతం నష్టపోయింది శుక్రవారం ఒక్క రోజే 2,02,433 కోట్లు నష్టపోయారు. ఎస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ రాణా కపూర్ పదవీకాలం పొడిగించేందుకు ఆర్బీఐ ససేమిరా అనడంతో ఆ కంపెనీ షేర్ ఏకంగా 34 శాతం పడింది. -
వైద్యుడు కోరుకున్న సంపద
ఇది చాలా పురాతన సంఘటన. ఒకసారి బుఖారా చక్రవర్తి బాగా జబ్బు పడ్డాడు. రాజవైద్యులు ఎంత వైద్యం చేసినా, ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించలేదు. ఎంతో మంచివాడు, దయార్ద్ర హృదయుడైన చక్రవర్తి జబ్బు పడ్డాడని తెలిసి ప్రజలంతా ఆందోళన చెందసాగారు. గొప్ప గొప్ప వైద్య నిపుణుల చికిత్సకు కూడా జబ్బు ఏ మాత్రం తగ్గలేదు. దీంతో, చక్రవర్తికి సరైన వైద్యం చేసిన వారికి కోరిన బహుమతి ఇవ్వబడుతుందని బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. ఒక యువకుడు రాజదర్బారుకు వచ్చి, రాజుగారికి వైద్యం చేస్తానని ముందుకొచ్చాడు. ఆ యువ వైద్యుణ్ణి చూసి, తమ వల్ల కానిది ఈ కుర్ర వైద్యుడివల్ల ఏమవుతుందని పెద్దవాళ్లంతా గుసగుసలాడుకున్నారు. చక్రవర్తికి కూడా నమ్మకం కుదరలేదు. అయినా ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లుగా సరేనన్నారు. వైద్యం మొదలైంది. కొద్దిరోజుల్లోనే చక్రవర్తి ఆరోగ్యంలో గణనీయమైన మార్పు వచ్చింది. మరికొద్ది రోజుల్లో లేచి తిరగడం ప్రారంభించాడు. చివరికి పూర్తిగా స్వస్థత పొందాడు. అందరూ సంతోషించారు. ఒకరోజు చక్రవర్తి సభ ఏర్పాటు చేసి యువ వైద్యుణ్ణి ఘనంగా సత్కరించాడు. ‘అపారమైన సంపద, వజ్ర వైఢూర్యాలు సిద్ధంగా ఉన్నాయి. కోరుకున్నది దక్కుతుంది. నీకేం కావాలో కోరుకో’ అన్నాడు. సభికులు, మంత్రులు అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఎంత సంపద కోరుకుంటాడో, ఎంతడిగినా చక్రవర్తి కాదనే ప్రసక్తేలేదు అనుకున్నారు. కొద్ది క్షణాలు యువకుడు కూడా మౌనం వహించాడు. ఆ యువ వైద్యుడు మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ‘‘మహారాజా..! నాకు మీ గ్రంథాలయంలో అధ్యయనం చేసుకోడానికి కొన్నిరోజులు అనుమతించండి.’అన్నాడు. ఈ కోరిక విని సభికులు, మంత్రులే కాదు, స్వయంగా చక్రవర్తి కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. చదువు, అధ్యయనం పట్ల అతనికున్న శ్రద్ధను చూసి ఎంతో అబ్బురపడ్డాడు. కోరినంత సంపద కళ్ల ముందు సిద్ధంగా ఉన్నా, దాన్ని కాదని గ్రంథాలయంలో అధ్యయనం చేసుకోడానికి అనుమతి కోరిన ఆ యువ వైద్యుని సంస్కారానికి సలాం చేశాడు. ఆ యువ వైద్యుడే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్య పితామహుడు ఇబ్నెసీనా అలియాస్ అవెసీనా. – మదీహా -
నిమిషాల్లో రూ. 30వేల కోట్లు
సాక్షి, ముంబై: ఆర్థిక ఫలితాల నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ మరో రికార్డును సొంతం చేసుకుంది. 2017-18 క్యూ4లో పటిష్ట ఫలితాల్లో అంచనాలకు మించి రాణించడంతోపాటు వాటాదారులకు 1:1 బోనస్ బొనాంజాతో నిమిషాల్లో ఇన్వెస్టర్ల సంపదను భారీగా రూ. 30వేలకోట్ల మేర పుంజుకుంది. శుక్రవారం టీసీఎస్ షేరు 6శాతానికిపైగా పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 6.5 లక్షల కోట్లకు చేరింది. అంతేకాదు 100బిలియన్ డాలర్ల క్లబ్లో చేరేందుకు సమీపంలో ఉంది. దేశీ స్టాక్ మార్కెట్లలో తొలిసారి రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్(విలువ)ను సాధించిన దిగ్గజ సంస్థగా ఇప్పటికే చరిత్ర సృష్టించిన టాటా గ్రూప్ ఐటీ సేవల కంపెనీ టీసీఎస్ తాజాగా ఈ సరికొత్త రికార్డును సాధించింది. టీసీఎస్ షేర్ రూ. 3400 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకడంతో కంపెనీ మార్కెట్ విలువ తొలిసారి రూ. 6.5 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మార్కెట్ విలువలో దేశీయంగా ఈ ఘనతను సాధించిన తొలి కంపెనీ టీసీఎస్. అంతేకాదు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌తో (38 బిలియన్ డాలర్లు) పోలిస్తే ఇది రెండున్నరెట్లు ఎక్కువ. కాగా క్యూ4(జనవరి-మార్చి)లో త్రైమాసిక ప్రాతిపదికన టీసీఎస్ నికర లాభం 5.7 శాతం పెరిగి రూ. 6904 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం రూ. 32,075 కోట్లకు చేరింది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి బోర్డు అనుమతించింది. దీంతోపాటు వాటాదారులకు షేరుకి రూ. 29 తుది డివిడెండ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అర్థజ్ఞానం... అర్ధజ్ఞానం
‘‘ఓయీ మానవా... నేను మరణ దండన దేవతను. నిజం చెప్పు.రాణిగారి సంపదను కొల్లగొట్టింది నువ్వే కదా’’ అని భయంకరంగా గర్జించింది. దొంగ గజగజ వణికిపోయాడు. ఓ దొంగ తన దారిన తను పోతున్నాడు. ఆ దొంగ వెళుతున్న దారిలో ఎవరిదో స్వామీజీ ప్రవచనం వినిపిస్తోంది. ‘మంచి మాటలు వింటే మనం చెడ్డ పనులు చెయ్యలేం’ అనుకుంటూ గట్టిగా చెవులు మూసుకున్నాడు. అలా నడుస్తూ వెళ్తుండగా కుడి కాలిలోకి కసుక్కున ముల్లు దిగింది. ‘అబ్బా’ అనుకుంటూ కిందికి వంగి, కుడిచేత్తో ముల్లును లాగేసుకున్నాడు. ఈలోపు కుడి చెవిలోకి స్వామీజీ మాట ఒకటి దూరిపోయింది. ‘‘... దేవుళ్లకు, దేవతలకు నీడలు ఉండవు ...’’ అంటున్నారాయన. దొంగ గబుక్కున చెయ్యి తీసి మళ్లీ తన చెవి మీద పెట్టుకున్నాడు. ఆ తర్వాత స్వామీజీ మాటలు ఏమీ దొంగకు వినిపించలేదు కానీ, విన్న ఆ ఒక్కమాట మనసులో ఉండిపోయింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఓసారి అంతఃపురంలో రాణిగారి ఆభరణాలు దోచుకుంటూ పట్టుబడ్డాడు. రాజభటులు తీసుకెళ్లి కొట్లో బంధించారు. నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుందన్నారు. దొంగ లొంగలేదు. ‘నేను దొంగతనం చేయలేదు’ అన్నాడు. చివరికి ఇలా కాదనుకుని, ఓ అర్ధరాత్రి రాణిగారు మారువేషంలో దొంగ ఉన్న బందీఖానా దగ్గరకు వచ్చారు. ‘‘ఓయీ మానవా... నేను మరణ దండన దేవతను. నిజం చెప్పు. రాణిగారి సంపదను కొల్లగొట్టింది నువ్వే కదా’’ అని భయంకరంగా గర్జించింది. దొంగ గజగజ వణికిపోయాడు. నిజం ఒప్పుకోబోయాడు. కానీ అంతలోనే అతడికి స్వామీజీ మాట గుర్తుకువచ్చింది. దేవుళ్లకు, దేవతలకు నీడలు ఉండవు కదా! మరి ఈ వెన్నెల కాంతిలో మరణ దండన దేవత వెనకే ఆమె నీడ కూడా ఉందేమిటి? అనుకున్నాడు. నీడ ఉంది కాబట్టి ఈమె దేవత కాదు, మనిషే అనుకున్నాడు. అలా అనుకోగానే అతడికి ధైర్యం వచ్చింది. ‘‘ఈ దొంగతనం నేను చేయలేదు’’ అని ధైర్యంగా అన్నాడు. రాణిగారు మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దొంగ నిర్దోషి అని విడుదల చేయించారు. దొంగ తన జ్ఞానానికి సంతోషించాడు. అనుకోకుండా చెవిన పడిన మాటలే తనను శిక్షనుంచి తప్పిస్తే, నిజంగా జ్ఞానులు చెప్పే మాటలు తనకెంత ఉపకరించేవో అనుకున్నాడు. -
ఆరోగ్యమే మహాభాగ్యం
నెల్లూరు(బారకాసు): మారుతున్న ఆహారపు అలవాట్లు.. శారీరక శ్రమ లేకపోవడం.. పనిఒత్తిడి.. వెరసి చిన్న వయసులోనే అనారోగ్యాలకు గురువుతున్నారు. మూడు పదుల వయస్సులోనే మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు చుట్టముట్టడంతో గుండె, కిడ్నీ, లివర్, కంటి సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆరోగ్యకర జీవన విధానం, ఆయా వ్యాధులను అధిగమించడం ఎలా? వ్యాధులు ఉన్న వారు ఎలాంటి చికిత్సలు తీసుకోవాలనే సందేహాలను నివృత్తి చేసేందుకు ‘సాక్షి’ చక్కటి వేదికను ఏర్పాటు చేసింది. నెల్లూరు అపోలో హాస్పిటల్ ప్రధాన స్పాన్సర్‌గా నిర్వహిస్తున్న గుడ్హెల్త్ మెగా షోని ఈ నెల 24, 25 తేదీల్లో మాగుంట లేఅవుట్లోని అనిల్గార్డెన్లో నిర్వహించనున్నారు. ఇందులో ఆరోగ్య సమస్యల గురించి వివరించడంతోపాటు పలు వైద్య పరీక్షలు ఉచితంగా చేసేందుకు నెల్లూరు నగరంలోని ప్రముఖ హాస్పిటల్స్ ముందుకొచ్చాయి. ‘సాక్షి’ గుడ్హెల్త్ మేగా షోలో పాల్గొనే ఆస్పత్రులు అపోలో హాస్పిటల్: గుండెజబ్బులు, నరాల, మూర్చ, పక్షవాతం, కిడ్నీ తదితర ప్రధాన వ్యాధులకు సంబంధించి ప్రముఖ వైద్య నిపుణులు అవగాహన కల్పించి పలు సూచనలు ఇస్తారు. సాయిపథం హాస్పిటల్: కాన్పులు, గర్భకోశవ్యాథులపై అవగాహన కల్పిస్తారు. సంతాన సాఫల్యం వంటి అంశాలతో పాటు జనరల్ సర్జరీలకు సంబంధించి వైద్యరంగంలో వచ్చిన నూతన వైద్యవిధానాల్లో భాగంగా ఎలాంటి కోత లేకుండా ల్యాప్రోస్కోపిక్ ద్వారా కేవలం చిన్న రంధ్రం వేసి ఆపరేషన్ చేసే సదుపాయం గురించి డాక్టర్ వంగిమళ్ల రాధామాధవి వివరిస్తారు. మాడరన్ ‘ఐ’ హాస్పిటల్: కంటి వ్యాధులు ఎలా, ఎందుకు వస్తాయి. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కంటి సమస్యలు ఉన్న వారు ఎలాంటి చికిత్సలు పొందాలనే విషయాలపై డాక్టర్ పీఎల్.రావు అవగాహన కల్పిస్తారు. రత్నం హాస్పిటల్: శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల్లో నెమ్ము, ఆయాసం, ఉబ్బసం తదితర వ్యాధులకు సంబంధించిన జబ్బులపై డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు అవగాహన కల్పించనున్నారు. ఆయుష్ దంతవైద్యశాల: ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు నోటి ఆరోగ్యంపై ప్రముఖ దంత వైద్య నిపుణుడు డాక్టర్ ఉమ్రాన్ అవగాహన కల్పిస్తారు. రవి చిన్నపిల్లల హాస్పిటల్: చిన్నపిల్లల వ్యాధులకు సంబంధించి వైద్యులు పాల్గొంటారు. అవసరమైన చిన్నారులకు పలు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. పిల్లల్లో తరచుగా వచ్చే వ్యాధుల పట్ల ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ రవికుమార్‌తోపాటు తన వైద్య బృందం హాజరై అవగాహన కల్పించనున్నారు. అదేవిధంగా సందేహాలను నివృత్తి చేస్తారు. ఉమా మహేష్ న్యూరో హాస్పిటల్: నరాలు, మెదడుకు సంబంధించిన పక్షవాతం, మూర్ఛ, మతిమరుపు లాంటి జబ్బులు నివారణపై అవగాహన కలిగిస్తారు. ఈవ్యాధులు వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి, అవిరాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ ఉమామహేష్ వివరిస్తారు. మైధిలి హాస్పిటల్(మెటర్నిటి అండ్ ఫర్టిలిటి సెంటర్): కాన్పులు,గర్భకోశ వ్యాదులు, సంతానం లేని వారికి ఎటువంటి ప్రత్యేక చికిత్స ఉందనే విషయాలను వివరిస్తారు. మహిళలు తమకున్న అనారోగ్య సమస్యలపై ఉన్న సందేహాలను డాక్టర్ జి.మైధిలి నివృత్తి చేస్తారు. చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్: చెన్నైలోని ఉన్న అన్ని ప్రముఖ హాస్పిటల్స్‌కు సంబందించిన పూర్తి సమాచారాన్ని తెలియచేస్తారు. అక్కడున్న హాస్పిటల్స్‌లో ఏహాస్సిటల్లో ఎటువంటి వైద్య సదుపాయాలున్నాయనే విషయాలను కూడా తెలియచేయనున్నారు. కేబీఆర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్: డాక్టర్ గరిక సతీష్ ఎముకలు, కీళ్లు, నరాల శస్త్రచికిత్సలకు సంబందించిన విషయాలపై అవగాహన కల్పించనున్నారు. మోకాలి చిప్పలు అరుగుదల వచ్చే సమస్యలపై వివరిస్తారు. బాలాజీ ఈఎన్టీ హాస్పిటల్: చెవి,ముక్కు, గొంతు వ్యాధులకు సంబందించిన పలు విషయాలపై డాక్టర్ దేసు మురళి అవగాహన కల్పిస్తారు. సహజ డయాబెటిస్ అండ్ థైరాయిడ్ క్లీనిక్: మధుమేహం, థైరాయిడ్ గ్రంథి సమస్యలు, పిల్లల్లో ఎదుగుదల లోపాలు, శారీరక వికాసలోపం, స్థూలకాయం, మోనోపాజ్, అధిక కొలెస్ట్రాల్ సమస్యలపై డాక్టర్ ఆలూరు సహజ అవగాహన కలిగిస్తారు. షుగర్, థైరాయిడ్‌కు సంబంధించిన పరీక్షలు ఉచితంగా చేస్తారు. నవ్య ఆయుర్వేదిక్ హాస్పిటల్: అన్ని రకాల వ్యాధులకు సంబందించి ఆయుర్వేదంలో ఉన్న వైద్య సదుపాయాలు గురించి డాక్టర్ రాజశేఖర్ వివరిస్తారు. ఆయుష్ ఆయుర్వేద వైద్యశాల: ఆయుర్వేద వైద్యం వలన ఎటువంటి ఫలితాలుంటాయనే విషయాలను డాక్టర్ స్వాతి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు. విఘ్నేశ్వర స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్: పుట్టకతోను, చిన్నారుల్లో వచ్చే వినికిడి లోపాలు గురించి వివరిస్తారు. అందుకు ఎటువంటి చికిత్సలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ఆడియాలజిస్ట్ డాక్టర్ కిరణ్‌కుమార్ పాల్గొంటారు. -
ఆ సిటీలో బతకడం కష్టం
సాక్షి, ముంబయి : కాంక్రీట్ జంగిల్స్‌గా మారిన నగరాల్లో బతుకు రోజురోజుకూ దుర్భరమవుతుంటే మండుతున్న ధరలు సిటిజనులకు చుక్కలు చూపుతున్నాయి. భారత నగరాల్లో సైతం బడుగు జీవి బతికే పరిస్థితి లేదు. ప్రపంచంలోని 20 అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబయి 16వ స్ధానంలో నిలిచింది. నైట్‌ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ వెల్లడించిన ఈ నివేదికలో మొనాకో అత్యంత ఖరీదైన నగరంలో టాప్‌ప్లేస్‌లో ఉంది. హాంకాంగ్, న్యూయార్క్, లండన్, సింగపూర్లు టాప్ 10 ఖరీదైన నగరాల జాబితాలో నిలిచాయి. సంపద, పెట్టుబడులు, జీవన శైలి, భవిష్యత్ అవకాశాల వంటి అంశాల ప్రాతిపదికన అత్యంత ఖరీదైన నగరాలను ఈ సంస్థ ఎంపిక చేసింది. -
భారత బిలియనీర్ల సంపద ఏకంగా..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ధనికులు, పేదల మధ్య అంతరాలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో దేశ జీడీపీలో భారత బిలియనీర్ల సంపద ఏకంగా 15 శాతంగా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. పాలకుల అసంబద్ధ విధానాలతో అసమానతలు పెరుగుతున్నాయని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. దేశంలో సృష్టించబడుతున్న సంపదలో అధిక శాతం వారసత్వంగా, క్రోనీ క్యాపిటలిజం ద్వారా అత్యంత సంపన్నుల వద్దే పోగుపడుతోందని పేర్కొంది. మరోవైపు సమాజంలో అట్టడుగు ప్రజలకు దక్కాల్సిన వాటా మాత్రం కుచించుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. 1991 ఆర్థిక సంస్కరణల అనంతరం ఈ అసమానతలు విపరీతంగా పెచ్చుమీరాయని ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈఓ నిషా అగర్వాల్ పేర్కొన్నారు. తాజా అంచనాల ప్రకారం దేశ జీడీపీలో భారత బిలియనీర్ల మొత్తం సంపద 15 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. ఐదేళ్ల కిందట దేశ జీడీపీలో 10 శాతంగా ఉన్న బిలియనీర్ల సంపద ఇప్పుడు ఏకంగా 15 శాతానికి ఎగబాకింది. 2017 నాటికి భారత్‌లో 101 మందికి పైగా బిలియనీర్లున్నారు. -
స్కాం ఎఫెక్ట్ : రూ. 7వేల కోట్లు ఆవిరి
సాక్షి, ముంబై: మాల్యా తరహాలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ భారీ కుంభకోణం వెలుగు చూడటంతో మార్కెట్లో జ్యువెల్లరీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో పలుషేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతేకాదు పీఎన్బీ ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 7వేల కోట్లు ఆహుతైపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లావాదేవీల్లో భారీగా అక్రమాలు ఆరోపణల నేపథ్యంలో మార్కెట్ లో ఆందోళన నెలకొంది. దీంతో అటు జ్యువెలరీ, బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతోపాటు ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ముంబై బ్రాంచీలో సుమారు రూ. 11,400 కోట్లమేర అక్రమ లావాదేవీలు జరిగిన నేపథ్యంలో జ్యువెలరీ స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాల వెల్లువ సాగింది. ముఖ్యంగా పీసీ జ్యువెలర్స్ షేరు దాదాపు 9 శాతం పతనంకాగా గీతాంజలి జెమ్స్ షేర్ లో అదే ధోరణి. ఇంకా తంగమాయిల్ జ్యువెలరీ , టీబీజెడ్, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, రినైసన్స్ జ్యువెలరీ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేరు కూడా దాదాపు 13 శాతం కుప్పకూలింది. రెండు రోజుల్లో మొత్తం 18శాతం నష్టపోయింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు మూడు వేలకోట్ల రూపాయలను కోల్పోగా, సీబీఐ ప్రకటన వెలువడిన వెంటనే గురువారం మరో నాలుగు వేల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సందర ఆవిరైపోయింది. దీంతో మొత్తం రూ7వేల కోట్ల సంపద నిమిషాల్లో గాల్లో కలిసిపోయింది. మరోవైపు ఇప్పటికే పీఎన్బీలో జరిగిన కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌తోపాటు సీబీఐ పలు వ్యక్తులపై కేసులు నమోదు చేశాయి. ఫైర్‌స్టార్ డైమండ్ కంపెనీ చీఫ్ నీరవ్ మోదీతోపాటు, అతడి భార్య, సోదరుడు, తదితరులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
ఈ ఒక్కరోజే రూ. 5లక్షల కోట్ల సంపద ఆవిరి
సాక్షి, ముంబై: దలాల్‌స్ట్రీట్‌లో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రకంపనలు పుట్టించాయి. వారాంతంలోస్టాక్మార్కెట్లో ఈ శుక్రవారం టెర్రర్ డేగా నిలిచింది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 10శాతం పన్ను ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళన రేపింది. దీంతో అమ్మకాల ఒత్తిడి భారీగా నెలకొంది. దీంతో దేశీయ ఈక్విటీలు 70 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశాయి. ఈ ఒక్కరోజులోనే సుమారు 50లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. బిఎస్ఇలో లిస్ట్ అయిన కంపెనీల కంబైన్డ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .4.7 లక్షల కోట్లు మేర పడిపోయింది. ఇది ఇలా వుంటే ఈ పతనం సోమవారం కూడా స్టాక్మార్కెట్లో నష్టాలు కొనసాగే అవకాశం ఉందని క్వాంటమ్ సెక్యూరిటీస్‌కు చెందిన నీరజ్ దీవాన్ తెలిపారు. బాగా పెరిగిన మిడ్ క్యాప్ వాల్యుయేషన్ లాంటివి మార్కెట్ పతనానికి అనేక కారణాలున్నప్పటికీ కీలక సూచీలను బడ్జెట్ కూడా ప్రభావితం చేసినట్టు చెప్పారు. బడ్జెట్‌కంటే7-8 రోజుల ముందే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేపట్టడం మంచిదైందన్నారు. ఈ తరుణంలో మార్కెట్లకు ఎక్కడ నిలుస్తాయో చెప్పడం కష్టమన్నారు. మరోవైపు ఇటీవల రికార్డు స్థాయిలను తాకిన ఈక్విటీ మార్కెట్లలో ఈ కరెక్షన్ మంచి పరిణామమని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈ వీకెనెస్ మరో రెండు నెలలు కొనసాగుతుందని, తరువాత మార్కెట్లకు సానుకూలమేనని ఎలారా క్యాపిటల్ ఎండీ హరీంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు. కాగా దేశీయ స్టాక్‌మార్కెట్లలో సెన్సెక్స్ 2.34 శాతం (839పాయింట్లు) నష్టంతో, నిఫ్టీ 2.36 శాతం(256పాయింట్లు) భారీ నష్టంతో ముగిశాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌కాప్ సెక్టార్లు 4శాతం నష్టపోయాయి. 2016, నవంబరు తరువాత ఇదే అది పెద్ద పతనంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.