సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి టాప్‌లోకి దూసుకొచ్చారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కి వెనక్కి నెట్టి ఇండియా, ఆసియా బిలియనీర్‌గా తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకున్నారు. శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) షేర్లు రికార్డు స్థాయిలో లాభపడటంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, రిలయన్స్ ఛైర్మన్ అంబానీ నికర సంపద విలువ 99.7 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఎనిమిదో స్థానానికి ఎగబాగారు. ఇక గౌతం అదానీ నికర విలువ 98.7 బిలియన్ డాలర్లు, సూచీలో తొమ్మిదో స్థానంలో నిలిచారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రిలయన్స్ అంబానీని అధిగమించిన గౌతం అదానీ ఆసియాలో అత్యంత సంపన్నవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, ముఖేష్ అంబానీ నికర విలువ 104.7 డాలర్లు బిలియన్లకు పెరిగింది. మరోవైపు ఈ వారం అదానీ గ్రూప్ స్టాక్‌లలో అమ్మకాల నేపథ్యంలో గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ నికర సంపద 100.1 బిలియన్ల డాలర్లకు పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment