Reliance Industries (RIL)
-
రిలయన్స్, డిస్నీ డీల్‌కు ఎన్సీఎల్టీ ఓకే
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ మధ్య విలీనానికి తాజాగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), ముంబై బెంచ్ ఆమోదముద్ర వేసింది. వెరసి ఆర్ఐఎల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాలు(వయాకామ్18, డిజిటల్18), వాల్ట్ డిస్నీకి చెందిన స్టార్ ఇండియా మధ్య విలీన పథకానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఇప్పటికే ఈ డీల్‌కు కొన్ని స్వచ్చంద సవరణల తదుపరి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా రూ. 70,000 కోట్ల విలువైన అతిపెద్ద మీడియా దిగ్గజం ఆవిర్భావినికి మరింత దారి ఏర్పడింది. తమ పరిశీలన ప్రకారం విలీన పథకం సక్రమంగానే ఉన్నట్లు ఎన్సీఎల్టీ పేర్కొంది. అను జగ్మోహన్ సింగ్ (మెంబర్, టెక్నికల్), కిషోర్ వేములపల్లి (మెంబర్, జ్యుడీíÙయల్)లతో కూడిన బెంచ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి నిబంధనల ఉల్లంఘన లేకపోవడంతోపాటు ప్రజావిధానాలకు వ్యతికేరంగా లేదని అభిప్రాయపడ్డారు. ఈ భాగస్వామ్య కంపెనీ(విలీన సంస్థ) రెండు ఓటీటీలతోపాటు 120 టీవీ చానళ్లను కలిగి ఉండనుంది. ఆర్ఐఎల్కు 63.16 శాతం వాటా లభించనుండగా.. వాల్ట్ డిస్నీ 36.84 శాతం వాటాను పొందనుంది. మీడియా దిగ్గజాలు సోనీ, నెట్‌ఫ్లిక్స్‌తో మరింత తీవ్రస్థాయిలో పోటీకి దిగేందుకు వీలుగా ఆర్ఐఎల్ దాదాపు రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. -
Reliance AGM 2024: రిలయన్స్ బొనాంజా
రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం)లో చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు బోనస్ షేర్లను ప్రకటించారు. సమీప భవిష్యత్‌లో టాప్–30 గ్లోబల్ దిగ్గజాల్లో ఒకటి గా కంపెనీని తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు టెక్నా లజీ విస్తృత వినియోగం, ఆధునిక తయారీ విధానాలు దన్నుగా నిలుస్తాయని చెప్పారు. ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ విస్తృత స్థాయి టెక్నాలజీ కంపెనీగా మారు తోందని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. అన్ని వ్యాపా రాల్లోనూ ఏఐ సంబంధ డిజిటల్ ఇన్ఫ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తద్వారా కంపెనీ అత్యంత వృద్ధి పథంలో సాగనున్నట్లు చెప్పారు. వెరసి రానున్న కాలంలో కంపెనీ విలువ భారీగా మెరుగుపడనున్నట్లు వివరించారు. ఏజీఎంలో వాటాదారులను ఉద్దేశించి పలు అంశాలను ప్రస్తావించారు. వీటి ప్రకారం ఆర్ఐఎల్ గతేడాది ఆర్అండ్డీపై రూ. 3,643 కోట్లు వెచ్చించింది. గత ఐదేళ్లలో రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ షేరుకీ మరో షేరుని ఉచితంగా(బోనస్) అందించనుంది. ఈ అంశాన్ని సెప్టెంబర్ 5న సమావేశంకానున్న డైరెక్టర్ల బోర్డు పరిశీలించనుంది. కంపెనీ ఇంతక్రితం 2017 సెప్టెంబర్, 2009 నవంబర్లోనూ 1:1 ప్రాతిపదికన బోనస్ షేర్లను జారీ చేసింది. రిటైల్ జోరు..: గతేడాది రిలయన్స్ రిటైల్ తొలిసారి రూ. 3 లక్షల కోట్ల టర్నోవర్ మైలురాయిని దాటింది. రానున్న 3–4ఏళ్లలో బిజినెస్‌ను రెట్టింపు చేసే లక్ష్యంతో ఉన్నట్లు ఆర్ఐఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు. మూడు ప్రయివేట్ లేబుళ్లు రూ. 2,000 కోట్ల వార్షిక అమ్మకాలను అందుకున్నాయి. లగ్జరీ జ్యువెలరీ విభాగంలోకి కంపెనీ ప్రవేశించనుంది. దేశవ్యాప్తంగా 18,836 స్టోర్లను నిర్వహిస్తోంది. దీంతో స్టోర్లరీత్యా టాప్–5 గ్లోబల్ రిటైలర్‌గా నిలుస్తోంది. ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ సరీ్వసుల మిల్క్‌బాస్కెట్‌ను కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. కళానికేతన్, జివామే, క్లోవియా, అర్బన్ ల్యాడర్లలో పెట్టుబడులు ఫ్యాషన్ విభాగంలో పట్టుసాధించేందుకు దోహదం చేస్తున్నాయి. జియో.. బంపర్ ఆఫర్: 100జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీరానున్న దీపావళి కానుకగా రిలయన్స్ జియో యూజర్లకు ఉచితంగా 100 జీబీ క్లౌడ్ స్టోరేజీని అందించనుంది. తద్వారా ఫొటోలు, వీడియోలు ఇతర డిజిటల్ ఫైళ్లను భద్రంగా దాచుకునేందుకు వీలుంటుంది. వచ్చే 3–5 ఏళ్లలో రిలయన్స్ రిటైల్, జియో, డిజిటల్ సర్వీసుల ఆదాయం, నిర్వహణ లాభం (ఇబిటా) రెట్టింపు కానున్నట్లు ముకేశ్ అచనా వేశారు. డేటా ఆధారిత ఏఐ సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రీమియం డివైస్ల అందుబాటులోఉన్న క్లౌడ్ సేవలను లగ్జరీగా కాకుండా చౌకగా అందించనున్నట్లు వెల్లడించారు. టీవీ వినియోగదారులకు హలోజియో పేరుతో వాయిస్ అసిస్టెంట్ సేవలను ప్రారంభించింది. రిలయన్స్ డిస్నీ.. వినోదంలో కొత్త శకం డిస్నీతో ఒప్పందం దేశీ వినోద రంగంలో సరికొత్త శకానికి దారి చూపనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. జియో, రిటైల్ తరహాలో మీడియా బిజినెస్ సైతం వృద్ధి బాటలో సాగుతుందని చెప్పారు. డిజిటల్ స్ట్రీమింగ్‌తో కంటెంట్ సృష్టిని జత చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ ప్రయాణంలో భాగంగా ఈ ఏడాది (2024–25) చివరికల్లా ఆర్ఐఎల్ తొలి సోలార్ గిగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు ముకేశ్ వెల్లడించారు. ఈ ప్లాంటు లో ఒకే చోట పీవీ మాడ్యూల్స్, సెల్స్, వేఫర్స్, పాలీసిలికాన్, గ్లాస్ తయారీని చేపట్టనున్నారు. తద్వారా ఈ యూనిట్ సౌరశక్తిని విద్యుత్‌గా మార్చనుంది. -
ముఖేష్ అంబానీ: ఏ వర్కౌట్స్ లేకుండానే 15 కిలోలు తగ్గాడట, ఎలా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు 67వ ఏట అడుగుపెట్టాడు. బిజినెస్ మాగ్నెట్, ఆసియాకుబేరుడు ముఖేష్ అంబానీ, ధీరూభాయ్ అంబానీ, కోకిలా బెన్ దంపతులకు 1957 ఏప్రిల్ 19న యెమెన్‌లో పుట్టాడు. వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, కెమికల్ ఇంజనీరింగ్ చదివిన అంబానీ తన సామర్థ్యం, కృషితో రిలయన్స్‌ను ప్రపంచంలోనే ప్రముఖ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించాడు. భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా, ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో నిలవడం విశేషం. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను తన వారసులు, ఇషా అంబానీ పిరమల్, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలకు పంచి ఇచ్చినప్పటికీ 67 ఏళ్ల వయసులో కూడా వ్యాపార దక్షతలో చురుగ్గా ఉంటాడు. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో కీలకమైన వ్యాపార నిర్ణయాలతోపాటు ఇటు కుటుంబ బాధ్యతలను కూడా దిగ్విజయంగా నిర్వరిస్తున్నాడు. అంతేకాదు తన ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను కాపాడుకోవడంలో కూడా దిట్ట. ఆయన పాటించే ఆహారం నియమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియనప్పటికీ, ఎలాంటి వర్కవుట్ లేకుండానే ముఖేష్ అంబానీ 15 కిలోలు తగ్గారట. ఈ సందర్బంగా ఆయన డైట్ , జీవన శైలి ఏంటి అనేది చర్చలో నిలిచింది. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!) కఠినమైన ఆహార నియమాలతోనే ముఖేష్ అంబానీ ఈ అద్భుత ఫలితాన్ని సాధించారని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర సక్సెస్ఫుల్ వ్యక్తుల మాదిరిగానే ముఖేష్ అంబానీ యోగా, ధ్యానంతో రోజు ప్రారంభిస్తాడు. ఉదయం 5:30 గంటలకు మేల్కొంటాడు. యోగా, ధ్యానం సూర్య నమస్కారాలు, వాకింగ్ కోసం బయటికి కూడా వెళ్తాడు. ఎంత బిజీషెడ్యూల్ ఉన్నా ఈ ఉదయపు దినచర్యను మాత్రం ఎప్పుడూ దాటవేయడు. (మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్) బ్రేక్‌ఫాస్ట్, లంచ్ డిన్నర్ ఇలా.. అంబానీ స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్‌ని ఫాలో అవుతారు. ఆల్కహాల్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాడు. ఇక రోజులోని అంబానీ తొలి భోజనం విషయానికి వస్తే అల్పాహారంలో తాజా పండ్లు, జ్యూస్, ఇడ్లీ-సాంబార్ తీసుకుంటాడు. లంచ్, డిన్నర్ కూడా సాంప్రదాయ భారతీయ ఆహారాలతో చాలా సింపుల్‌గా కానిచ్చేస్తారట. గుజరాతీ తరహాలో దాల్, సబ్జీ, అన్నం, సూప్‌లు , సలాడ్లను ఇష్టపడతాడు. అది కూడా ఇంట్లో వండిన భోజనం మాత్రమే. కాగా ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలిగా ఐపీఎల్ జట్టుకు ఓనర్‌గా ఉన్నారు. నీతా, అంబానీ దంపతులు ఇప్పటికేపెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి, కుమార్తె ఇషా అంబానీకి వివాహాలు జరపించారు. నలుగురు మనవలు కూడా ఉన్నారు. ఇక చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ఈ ఏడాది జూన్‌లో జరగనుంది. -
Forbes richest list 2024: టాప్–10లో ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సాధించారు. 2024 ఏడాదికి ఫోర్బ్స్ టాప్–10 బిలియనీర్లలో 9వ ర్యాంకును పొందారు. 116 బిలియన్ డాలర్ల సంపదతో 66 ఏళ్ల ముకేశ్ టాప్–9గా నిలిచారు. 2023లో ముకేశ్ సంపద 83.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా.. దేశీయంగా సంపదలో టాప్–2గా నిలుస్తున్న గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో 17వ ర్యాంకును అందుకున్నారు. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా 2023లో అదానీ సంపద 47.2 బిలియన్ డాలర్లకు క్షీణించిన సంగతి తెలిసిందే. హిండెన్‌బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ తిరిగి బలపడింది. ఇక 2022లో అదానీ 90 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌ను సాధించడం ప్రస్తావించదగ్గ అంశం! జాబితా ఇలా ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో 2,781 మంది వ్యక్తులు చోటు సాధించారు. గతేడాది జాబితాతో పోలిస్తే 141 మందికి అదనంగా చోటు లభించింది. 2023తో పోలిస్తే కుబేరుల ఉమ్మడి సంపద 2 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 14.2 ట్రిలియన్ డాలర్లను తాకింది. సరికొత్త రికార్డ్ నమోదైన 2021తో పోలిస్తే 1.1 లక్షల కోట్ల డాలర్లు జత కలసింది. ఫ్యాషన్స్, కాస్మెటిక్స్ దిగ్గజం ఎల్వీఎంహెచ్కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 233 బిలియన్ డాలర్లతో టాప్ ర్యాంకును, 195 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ రెండో ర్యాంకునూ కొల్లగొట్టారు. 177 బిలియన్ డాలర్లతో ఫేస్బుక్ జుకర్‌బర్గ్ టాప్–3గా నిలిచారు. -
అచ్చం అనంత్ మామలాగే..క్యూట్ కృష్ణ ఫోటో వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ. రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా ఇషా, 2018 డిసెంబరులో వ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది. ఇషా, ఆనంద్ జంటకు కవలలు - కృష్ణ (కుమారుడు) ఆదియా (కుమార్తె) జన్మించారు. అటు తల్లిగా, ఇటు వ్యాపార నిర్వహణలోనూ అంబానీ వారసురాలిగా తన సత్తా చాటుకుంటోంది. ఇటీవల ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో తన ట్విన్స్‌తో సందడిగా కనిపించింది ఇషా. ఇషాతో ట్విన్స్ ఫోటోలో సోషల్ మీడియాలో తెగ షేర్ అయ్యాయి. ముఖ్యంగా ఇషా కుమారుడు కృష్ణ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ ఫోటోలు అచ్చం మేనమామ అనంత్ అంబానీలా ఉండటం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. బ్లాక్ సూట్లో రాయల్ లుక్‌లో చిరునవ్వుల చిందిస్తున్న ఇషా కుమారుడు కృష్ణ, తమ్ముడు అనంత్ కార్బన్ కాపీలా ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. " అచ్చం అనంత్ అంబానీ లాగానే ఉన్నాడు అని ఒకరు, "అనంత్ మాము జైసా లగ్తా హై" అని మరొకరు వ్యాఖ్యానించారు. అంతేకాదుఆ చిన్నారి ధీరూభాయ్ అంబానీలా ఉన్నాడని మరికొందరు కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ మామ, అల్లుళ్ల పోలికల ఫోటో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
పారామౌంట్ గ్లోబల్‌తో రిలయన్స్ డీల్
న్యూఢిల్లీ: పారామౌంట్ గ్లోబల్ సంస్థ భారత్‌లోని టీవీ వ్యాపార విభాగం వయాకామ్ 18లో తమకున్న 13.01 శాతం వాటాలను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి విక్రయించనుంది. ఇందుకు సంబంధించి పారామౌంట్ గ్లోబల్‌కి చెందిన రెండు అనుబంధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ తెలిపింది. ఈ డీల్ విలువ రూ. 4,286 కోట్లుగా ఉంటుందని వివరించింది. రిలయన్స్‌కి చెందిన టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌కి వయాకామ్18 అనుబంధ సంస్థ. కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా అందులో రిలయన్స్‌కి 57.48 శాతం వాటా ఉంది. పారామౌంట్ గ్లోబల్‌తో ఒప్పందం పూర్తయ్యాక ఇది 70.49 శాతానికి పెరుగుతుంది. తమ కంటెంట్‌కి సంబంధించి వయాకామ్18కి లైసెన్సును ఇకపైనా కొనసాగిస్తామని పారామౌంట్ వెల్లడించింది. నియంత్రణ సంస్థల అనుమతులు, రిలయన్స్–స్టార్ డిస్నీ జాయింట్ వెంచర్ పూర్తి కావడం తదితర అంశాలకు లోబడి ఈ ఒప్పందం ఉంటుందని పేర్కొంది. మీడియాలో రిలయన్స్ మరింత పటిష్టం.. 2014లో నెట్వర్క్18లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన రిలయన్స్ ఆ తర్వాత నుంచి మీడియా రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. భారత్‌లో తమ మీడియా కార్యకలాపాలను విలీనం చేసుకునేందుకు వాల్ట్ డిస్నీ, రిలయన్స్ కుదుర్చుకున్న ఒప్పందం ఇందుకు దోహదపడనుంది. సదరు జాయింట్ వెంచర్లో రిలయన్స్ రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సోనీ, నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి పోటీనిచ్చేందుకు రిలయన్స్ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం రిలయన్స్‌కి చెందిన మీడియా వెంచర్స్ అన్నీ నెట్వర్క్18 కింద ఉన్నాయి. ఇది టీవీ18 బ్రాండ్ పేరిట న్యూస్ చానళ్లు, ఇతరత్రా స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ చానల్స్‌ని నిర్వహిస్తోంది. అలాగే, మనీకంట్రోల్డాట్కామ్, బుక్‌మైషో వంటి సంస్థల్లోనూ నెట్ట్ వర్క్18కి వాటాలు ఉన్నాయి. వీటితో పాటు రిలయన్స్‌కి జియోసూ్టడియోస్ అనే సినిమా నిర్మాణ సంస్థ ఉంది. రెండు లిస్టెడ్ కేబుల్ డి్రస్టిబ్యూషన్ కంపెనీల్లో (డెన్, హాథ్‌వే) మెజారిటీ వాటాలు ఉన్నాయి. -
అనంత్-రాధిక : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ధర ఎంతో తెలుసా?
వ్యాపారవేత్త, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు. స్వయంగా డ్యాన్సర్ అయిన ఆమె అంబానీ కుటుంబవేడుకల్లో తన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో అందరినీ మెస్మరైజ్ చేయడం ఆమెకు అలవాటు. తాజాగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్లో తన నాట్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతేకాదు నీతా లుక్స్, ఫ్యాషన్‌తో అతిథులను సర్ప్రైజ్ చేశారు. ముఖ్యంగా నీతా ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. నీతా కాంచీపురం చీరలో హుందాగా కనిపించారు. రిలయన్స్ లగ్జరీ రిటైల్ బ్రాండ్ స్వదేశ్ సహకారంతో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీర అద్భుతంగా ఆమెకు అమరింది. బోర్డర్‌పై క్లాసిక్ ట్రెడిషనల్ జర్దోసీ వర్క్, బ్లౌజ్ స్లీవ్‌లపై ప్రత్యేకమైన గోటా వర్క్, చక్కటి మేకప్‌తో తన ఐకానిక్ సిగ్నేచర్ స్టయిలో మెరిసిపోయారు. కాంచీపురం చీరకు జతగా, కోట్ల విలువైన పచ్చలు పొదిగిన డైమండ్ నెక్లెస్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అందానికి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. పచ్చలు పొదిగిన, పొడవాటి నెక్లెస్‌లో ఆమె లుక్‌తో అతిథులు చూపు తిప్పుకోలేక పోయారంటే అతిశయోక్తి కాదు. దీనికి సరిపోయేలా చెవిపోగులు, బ్యాంగిల్స్ , వేలి రింగ్ ఆకట్టుకున్నాయి. పలు నివేదికల ప్రకారం ఈ పచ్చల హారం ధర దాదాపు రూ. 400-500 కోట్టు ఉంటుందని అంచనా. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కాక్టెయిల్ నైట్ ఈవెంట్లో వైన్ కలర్ కస్టమ్-మేడ్ గౌను, క్లాసిక్ ఫ్రెంచ్ ట్విస్ట్ బన్‌లో ఆమె లుక్ నీతా స్టయిలింగ్‌ను ప్రతిబింబించింది. -
అమ్మకు 90 ఏళ్లు : అంబానీ కుటుంబంసెలబ్రేషన్స్
వ్యాపారం ప్రపంచంలో అపరకుబేరుల్లా వెలుగుతున్న ఫ్యామిలీ అంబానీ. అలాంటి వంశ పార్యంపర్య వ్యాపారానికి వెన్నుముకగా నిలిచిన అద్భత మహిళ కోకిలాబెన్ అంబానీ అంటే అతిశయోక్తి కాదు. ధీరూభాయ్ వ్యాపార ప్రపంచాన్ని శాసించినా, ముఖేష్ అంబానీ ఆసియా కుబేరుడిగా అవతరించినా, దీని వెనుకున్న గొప్ప మహిళా మూర్తి కోకిలా బెన్. భార్యగా, తల్లిగా అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని అంబానీ కుటుంబానికి పెద్ద దిక్కుగా బలమైన అండగా నిలిచారు. దివంగత భర్త ధీరూభాయ్ అంబానీ కలలకు అండగా నిలవడమే కాకుండా, ఆయన మరణానంతరం కుమారులు ముఖేష్ అంబానీ , అనిల్ అంబానీను నిలబెట్టిన మాతృమూర్తి. ఈ రోజుతో ఆమెకు (ఫిబ్రవరి 24) 90 ఏళ్లు . అంబానీ ఫ్యాన్ ప్యాజ్ ఇన్‌స్టా ప్రకారం ఆమె బర్త్‌డేని పురస్కరించుకొని కోకిలాబెన కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, నీనా కొఠారి, దీప్తి సల్గావ్కర్, వారి జీవిత భాగస్వాములు ఆమె పుట్టినరోజు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. కోకిలాబెన్ అంబానీ తన పుట్టినరోజు సందర్భంగా టీనా అంబానీ, అనిల్ అంబానీలతో కలిసి ప్రత్యేకంగా రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లోని శ్రీనాథ్జీ ఆలయాన్ని శనివారం సందర్శించారు. 'మనోరత్ భోగ్', ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. శ్రీనాథ్జీ మందిర్ మండల్ బోర్డ్ వైస్ చైర్పర్సన్ కూడా అయిన కోకిలా బెన్ నాధ్‌ద్వారాలోని పుష్టి మార్గీయ ప్రధాన్ పీఠ్ శ్రీనాథ్జీ భవనంలో 56 నైవేద్యాలు సమర్పిస్తారు. ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియాలో కూడా కోకిలాబెన్ పూజలు చేశారు. అలాగే ఆంటిలియాలోని మందిరం దగ్గర పలువురు పండితులు కోకిలాబెన్ ఆరోగ్యం కోసం ప్రార్థన్లు చేశారు. గతంలో 2022లో ముత్యాల అంచుతో త్రీ స్టెప్స్ కేక్ అద్భుతమైన కేక్‌ను తయారుచేయించారు. ఇందులో విశేషం ఏమిటంటే, అంబానీ వంశానికి చెందిన ప్రతి సభ్యుని ఫోటోలు ఇందులో ఉన్నాయి. గుజరాత్లో జామ్ నగర్లో పుట్టిన ఆమె ఇష్టదైవం కృష్ణుడు. ఇష్టమైన కలర్ పింక్. ఆరోగ్యంగా ఉండేందుకు రోజూయోగ సాధన, చక్కటి ఆహారం తీసుకుంటారట. -
నిఫ్టీ కొత్త రికార్డ్
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో శుక్రవారం నిఫ్టీ కొత్త రికార్డు సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ స్టాకులు రాణిండంతో ఇంట్రాడేలో 429 పాయింట్లు ఎగసి 22,127 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీ నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న స్టాక్ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన, మెటల్, సరీ్వసెస్, యుటిలిటీ, ఐటీ, విద్యుత్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రథమార్థంలో 2% ర్యాలీ చేశాయి. నిఫ్టీ ఆల్‌టైం హై(22,127)ని నమోదు చేయగా.., సెన్సెక్స్ 1444 పాయింట్లు దూసుకెళ్లి 73,089 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే మిడ్‌సెషన్ నుంచి ఆయిల్‌అండ్‌గ్యాస్, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సెన్సెక్స్ 440 పాయింట్లు లాభపడి 72,086 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 156 పాయింట్లు పెరిగి 21,854 వద్ద నిలిచింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.80%, 0.50% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.71 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,463 కోట్ల షేర్లు కొన్నారు. నాస్డాక్లో ఐటీ షేర్ల ర్యాలీ ప్రభావం గురువారం రాత్రి అమెరికా మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభంతో ముగిశాయి. దీంతో శుక్రవారం ఆసియా, యూరప్ స్టాక్ సూచీలు 0.5–1% మేర పెరిగాయి. ► ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(73,089) నుంచి ఏకంగా 1004 పాయింట్లు, నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయి(22,127) నుంచి 273 పాయింట్లు నష్టపోయాయి. ఇక ఈ బడ్జెట్ వారంలో సెన్సెక్స్ 1,385 పాయింట్లు, నిఫ్టీ 502 పాయింట్లు చొప్పున ఆర్జించాయి. ► సెన్సెక్స్ 441 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.34 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.382 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ► కేంద్రం బడ్జెట్లో పర్యావరణ అనుకూల ఇంధనాలకు ప్రాధాన్యత నివ్వడం, అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 80 డాలర్ల దిగువకు చేరుకోవడం ఇంధన షేర్లకు కలిసొ చి్చంది. బీపీసీఎల్ 10%, ఐఓసీ 8%, హిందుస్థాన్ పెట్రోలియం 5%, ఓఎన్జీసీ 4%, కోల్ ఇండియా 3% లాభపడ్డాయి. ► ఇంధన షేర్లలో భాగంగా రిలయన్స్ షేరు 2% పెరిగి రూ.2915 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.33% ర్యాలీ చేసి రూ.2950 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ విలువ రూ. 41,860 కోట్లు పెరిగి రూ.19.72 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ► పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లు, టాపప్ వంటి పలు సర్వీసులను నిలిపివేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో వరుసగా రెండోరోజూ పేటీఎం షేరు 20% లోయర్ సర్క్యూట్ తాకింది. బీఎస్ఈలో శుక్రవారం 20% పతనమై రూ.487 వద్ద ముగిసింది. -
వచ్చే వారం రిలయన్స్ డేటా సెంటర్ ప్రారంభం
చెన్నై: వేగంగా వృద్ధి చెందుతున్న డేటా సెంటర్స్ విభా గంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంట్రీ ఇస్తోంది. వచ్చే వారం చెన్నైలో సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, అమెరికాకు చెందిన డిజిటల్ రియాలిటీ సంస్థలతో కలిసి దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. చెన్నైలో 20 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న ఈ జాయింట్ వెంచర్ సంస్థ ముంబైలో మరో 40 మెగావాట్ల సెంటర్ కోసం 2.15 ఎకరాలు కొనుగోలు చేసింది. -
Reliance-Disney: త్వరలో రిలయన్స్–డిస్నీ స్టార్ ఇండియా విలీనం
న్యూఢిల్లీ: దేశీయంగా మీడియా రంగంలో కన్సాలిడేషన్‌కు తెరతీస్తూ డిస్నీ–స్టార్ ఇండియాను విలీనం చేసుకునే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మెగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన నాన్–బైండింగ్ టర్మ్ షీటుపై సంతకాల కోసం లండన్‌లో జరిగిన భేటీలో డిస్నీ ప్రతినిధి కెవిన్ మేయర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన మనోజ్ మోదీ తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం కుదరడంతో వ్యాపార విలువ మదింపు తదితర ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 45–60 రోజుల గడువు విధించుకున్నారు. అవసరమైతే దీన్ని పొడిగించే అవకాశం ఉంది. జనవరి ఆఖరు నాటికి ఈ డీల్‌ను పూర్తి చేయాలని రిలయన్స్ ఆసక్తిగా ఉన్నప్పటికీ ఫిబ్రవరి ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ పూర్తిగా స్టాక్, నగదు రూపంలో ఉండగలదని వివరించాయి. ఇరు సంస్థలు టర్మ్ షీటుపై చాలాకాలంగా కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రతిపాదన ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన వయాకామ్18, స్టార్ ఇండియా కార్యకలాపాలను విలీనం చేస్తారు. విలీన సంస్థలో రిలయన్స్‌కు 51 శాతం, డిస్నీకి 49 శాతం వాటాలు ఉండనున్నాయి. ఇందులో స్టార్ ఇండియాకు చెందిన 77 చానల్స్, వయాకామ్18కి చెందిన 38 చానల్స్ కలిపి మొత్తం 115 చానల్స్ ఉంటాయి. వీటితో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా అనే రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా భాగమవుతాయి. జీ ఎంటర్టైన్మెంట్, కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా) విలీన ప్రక్రియ జరుగుతుండగా కొత్తగా రిలయన్స్, డిస్నీ–స్టార్ డీల్ కూడా కుదిరితే దేశీయంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ఐదేళ్లలో రూ.9.63 లక్షలకోట్ల సంపద సృష్టి
ఇన్వెస్టర్ల సంపద సృష్టికి గత ఐదేళ్ల కాలం(2018–23)లో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ చెయిర్‌ను అలంకరించింది. ఈ బాటలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ రెండో ర్యాంకులో నిలవగా.. లాయిడ్స్ మెటల్స్, అదానీ గ్రూప్ సైతం ఇదే బాటలో నడవడం గమనార్హం! వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్)లో పలు దిగ్గజాలు గత ఐదేళ్లలో జోరు చూపాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అత్యధికంగా రూ. 9,63,800 కోట్ల మార్కెట్ క్యాప్‌ను జమ చేసుకుంది. నంబర్‌వన్ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్(టీసీఎస్) రూ. 6,77,400 కోట్ల విలువను జత చేసుకోవడం ద్వారా తదుపరి ర్యాంకును సాధించింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ నివేదిక ప్రకారం సంపద సృష్టిలో అదానీ ఎంటర్ప్రైజెస్ ఆల్‌రౌండ్ ప్రతిభను కనబరిచింది. స్టాక్ మార్కెట్లో వివిధ కంపెనీల పనితీరును పరిశీలించిన మోతీలాల్ ఓస్వాల్ ఆర్ఐఎల్ వరుసగా ఐదో ఏడాదిలోనూ టాప్‌లో నిలిచినట్లు పేర్కొంది. ఐసీఐసీఐ, ఎయిర్టెల్ 2018–23 కాలంలో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ రూ. 4,15,500 కోట్లమేర బలపడగా.. ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ విలువ రూ. 3,61,800 కోట్లు పుంజుకుంది. మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ రూ. 2,80,800 కోట్లను జత చేసుకుంది. అయితే లాయిడ్స్ మెటల్స్ అత్యంత వేగంగా 79 శాతం సంపదను పెంచుకున్న కంపెనీగా ఆవిర్భవించింది. ఈ బాటలో అదానీ ఎంటర్ప్రైజెస్ 78 శాతం వార్షిక వృద్ధితో ద్వితీయ ర్యాంకును సాధించింది. ఈ కాలంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్‌ను మించుతూ అత్యంత నిలకడగా పురోగమించిన కంపెనీగా క్యాప్రి గ్లోబల్ నిలిచింది. ఏడాదికి 50 శాతం చొప్పున లాభపడింది. రూ. 10 లక్షలు.. ఐదేళ్లలో రూ.కోటి గత ఐదేళ్లుగా అత్యున్నత ర్యాలీ చేసిన టాప్–10 కంపెనీలలో 2018లో రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. 2023కల్లా ఈ పెట్టుబడి రూ. కోటికి చేరి ఉండేదని నివేదిక పేర్కొంది. -
5 రోజుల్లో రూ. 26 వేల కోట్లు లాభపడిన లక్కీ ఇన్వెస్టర్లు
దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) కూడా ఒకటి. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంకాప్) పరంగా కూడా టాప్ 10 కంపెనీల జాబితాలో టాప్‌లో కొనసాగుతూ వస్తుంది. తాజాగా లిస్ట్‌లో కూడా రిలయన్స్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. దీంతో రిలయన్స్ పెట్టుబడిదారులు అపార లాభాలను సొంతం చేసుకున్నారు. గత 5 రోజుల ట్రేడింగ్‌లో రూ. 26,000 కోట్లకు పైగా లాభాలను సాధించారు. ఆర్ఐఎల్ ఎంక్యాప్ గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. క్రితం వారంతో పోలిస్తే రూ.26,014.36 కోట్లు పెరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో నాలుగు కంపెనీలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఇందులో ఆర్ఐఎల్ తరువాత భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ ,హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నిలిచింది. ఆరు కంపెనీలు లాభాలనుకోల్పోయాయి. రూ. 20,490 లాభాలతో రూ. 11,62,706.71 కోట్ల ఎంక్యాప్‌తో హెచ్డీఎఫ్సీ రెండో స్థానంలో ఉంది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ. 5,46,720.84 కోట్లకు చేరుకుంది. ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,030.88 కోట్లు పెరిగి రూ.6,51,285.29 కోట్లకు చేరుకుంది. గత వారం నష్టపోయిన టాప్ కంపెనీల్లో టీసీఎస్ నిలిచింది. రూ.16,484.03 కోట్లు తగ్గి రూ.12,65,153.60 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఎస్బీఐ , బజాజ్ ఫైనాన్స్ నష్టపోయిన ఇతర టాప్ కంపెనీలు. -
బెంగాల్‌పై అంబానీ వరాల జల్లు : వేల కోట్ల పెట్టుబడులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పశ్చిమ బెంగాల్‌పై వరాల జల్లు కురిపించారు. బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ఈవెంట్లో అంబానీ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ వృద్ధిని వేగవంతం చేయడంలో ఎంత మాత్రం వెనుకాడబోదని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు రూ. 45 వేల కోట్ల పెట్టుబడి పెట్టామని దీనికి అదనంగా రూ. 20వేల కోట్లు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నామని అంబానీ ప్రకటించారు. రానున్న మూడేళ్లలో ఈ పెట్టుబడులను రిలయన్స్ పెడుతుందని ప్రకటించారు. ముఖేష్ అంబానీ కోల్‌కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ప్రారంభ వేడుకలకు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంబానీకి స్వాగతం పలికారు. గొప్ప సంస్కృతి, విద్య, వారసత్వాల నెలవు బెంగాల్. ఐకమత్యమే బలం. ఇక్కడ అందరం కలిసే ఉంటాం.. అదే బెంగాల్‌కున్న మరో ప్లస్ పాయింట్. తమకు విభజించి పాలించు విధానం లేదంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్- 2023 7వ ఎడిషన్‌ను సీఎం మమత ప్రారంభించారు. #WATCH | At the Bengal Global Business Summit event, Reliance Industries chairman Mukesh Ambani says, "Reliance will leave no stone unturned to accelerate West Bengal's growth. Reliance has invested close to Rs 45,000 crores in West Bengal. We plan to invest an additional Rs… pic.twitter.com/fmNWCVfekF — ANI (@ANI) November 21, 2023 -
రూ.20,000 కోట్లు సమీకరించిన రిలయన్స్
న్యూఢిల్లీ: భారీ వ్యాపార వృద్ధి ప్రణాళికలతో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు స్థాయిలో నిధులు సమీకరించింది. 7.79 శాతం రేటుపై పదేళ్ల కాల బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.20,000 కోట్లు సమకూర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం రుణ సమీకరణ రేటు కంటే రిలయన్స్ 0.40 శాతం ఎక్కువ ఆఫర్ చేసింది. 20,00,000 సెక్యూర్డ్, రెడీమబుల్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను (ఎన్సీడీలు), రూ.1,00,000 ముఖ విలువపై ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేసినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. కనీస ఇష్యూ సైజు రూ.10,000 కోట్లు కాగా, స్పందన ఆధారంగా మరో రూ. 10,000 కోట్లను గ్రీన్ షూ ఆప్షన్ కింద రిలయన్స్ ఇండస్ట్రీస్ నిధుల సమీకరణ చేసింది. రిలయన్స్ బాండ్ల ఇష్యూకు మొత్తం రూ.27,115 కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎన్సీడీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ కానున్నాయి. -
ఇతర సంస్థల నుంచి డీజిల్ కొనుగోళ్ల నిలిపివేత
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి కంపెనీల నుంచి డీజిల్ కొనుగోళ్లను వచ్చే ఏడాది నుంచి నిలిపివేయాలని ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) భావిస్తోంది. వైజాగ్ రిఫైనరీ విస్తరణ పనులు పూర్తయి, వచ్చే ఆర్థిక సంవత్సరం రాజస్థాన్‌లో కొత్త రిఫైనరీని నిర్మించిన తర్వాత నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో సంస్థ వెల్లడించింది. వైజాగ్ రిఫైనరీ ప్రస్తుత వార్షిక సామర్ధ్యం 13.7 మిలియన్ టన్నులుగా ఉండగా విస్తరణ పనులు పూర్తయితే 15 మిలియన్ టన్నులకు పెరుగుతుందని కంపెనీ చైర్మన్ పుష్ప్ కుమార్ జోషి చెప్పారు. రాజస్థాన్ రిఫైనరీ 72 శాతం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది దశలవారీగా వినియోగంలోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము విక్రయించే పెట్రోల్‌లో 43 శాతం, డీజిల్‌లో 47 శాతం ఇంధనాలను ముంబై, వైజాగ్ రిఫైనరీలు సమకూరుస్తున్నాయి. వైజాగ్ రిఫైనరీ విస్తరణ పనులు పూర్తయ్యాక డీజిల్ విక్రయాల్లో హెచ్‌పీసీఎల్ సొంత రిఫైనరీల వాటా 61 శాతానికి పెరుగుతుంది. రాజస్థాన్ రిఫైనరీ కూడా అందుబాటులోకి వస్తే మొత్తం డీజిల్‌ను హెచ్‌పీసీఎల్ సొంతంగానే ఉత్పత్తి చేసుకోగలుగుతుంది. దేశీయంగా మొత్తం పెట్రోల్ బంకుల్లో దాదాపు పావు శాతం బంకులు హెచ్‌పీసీఎల్‌వే ఉన్నాయి. అయితే, వాటిలో విక్రయ అవసరాలకు తగినంత స్థాయిలో సొంతంగా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి చేసుకోలేకపోతుండటంతో ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. హెచ్‌పీసీఎల్ ఇప్పటికే తమ ముంబై రిఫైనరీ సామరŠాధ్యన్ని 7.5 మిలియన్ టన్నుల నుంచి 9.5 మిలియన్ టన్నులకు విస్తరించింది. -
అంబానీకి బెదిరింపుల కేసులో ఇద్దరి అరెస్ట్
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిళ్లు పంపిన వ్యవహారంలో తెలంగాణ, గుజరాత్‌లకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఎనిమిది రోజుల వ్యవధిలో అంబానీకి చెందిన సంస్థకు మూడు ఈమెయిళ్లు అందాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామంటూ మొదటి మెయిల్ పంపారు. తమ వద్ద మంచి షూటర్లు ఉన్నట్లు అందులో బెదిరించారు. ఆతర్వాత మరో మెయిల్లో రూ.200 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. సోమవారం పంపిన మెయిల్లో రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని ఉంది. వీటిపై అంబానీ భద్రతా అధికారి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒకరు తెలంగాణలోని వరంగల్‌కు చెందిన గణేశ్ రమేశ్ వనపర్తి(19) కాగా, మరొకరు గుజరాత్‌కు చెందిన షాదాబ్ ఖాన్(21). శనివారం గణేశ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 8వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. షాదాబ్ ఖాన్ ఉన్నతవిద్యా వంతుడని పోలీసులు చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అంబానీకి మళ్లీ బెదిరింపులు
ముంబై: కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని శుక్రవారం ఓ అగంతకుడు మెయిల్ ద్వారా బెదిరించిన విషయం తెలిసిందే. ఆదివారం మళ్లీ అదే అడ్రస్‌తో మరోసారి బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు తెలిపారు. రూ.200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని అందులో ఉందన్నారు. అంబానీ నివా సం ఆంటీలియా భద్రతాధికారి దేవేంద్ర ము న్షీరామ్ ఫిర్యాదు చేశారు. నిందితుడు యూరప్‌కు చెందిన ఈ–మెయిల్ సరీ్వస్ ప్రొవైడర్ ఉపయోగించాడని చెప్పారు. అతడిపై ఐపీసీ 387, 506(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. అయితే షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి ఆ బెదిరింపు మెయిల్ వచి్చనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ముకేశ్ అంబానీకి బెదిరింపులు
ముంబై: కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించి అంబానీ సంస్థకు చెందిన ఓ ఈ–మొయిల్ ఐడీకి శుక్రవారం మెయిల్ వచ్చింది. ‘మా దగ్గర మంచి షూటర్లు ఉన్నారు. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం’అని ఆ మెయిల్ సారాంశం. దీంతో, ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్చార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి ఆ మెయిల్ వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు. గత ఏడాది సైతం ముకేశ్ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. 2022 ఓ వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హర్‌కిసాన్‌దాస్ ఆస్పత్రికి ఫోన్ చేసి ‘ఆసుపత్రిని పేల్చేస్తాం. అంబానీ కుటుంబాన్ని చంపేస్తాం’అని బెదిరించాడు. 2021లో ముంబైలోని అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే. -
రిలయన్స్ చేతికే డిస్నీ?, డీల్ విలువ రూ.80,000 కోట్లు
దేశీయ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్,అమెరికన్ ఎంటర్టైన్మెంట్ జెయింట్ వాల్ట్ డిస్నీల మధ్య నగదు బదిలి, స్టాక్ కొనుగోలు ఒప్పందం చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌లోని వాల్ట్ డిస్నీ తన డిస్నీ స్టార్ ఇండియా 10 బిలియన్ డాలర్ల నియంత్రిత వాటాను అమ్మేందుకు సిద్ధమైంది. అయితే, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 7 బిలియన్ డాలర్ల నుంచి 8 బిలియన్ల డాలర్ల మేర చెల్లించి వాల్ట్ డిస్నీ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటూ పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇక డిస్నీస్టార్‌ను కొనుగోలు చేసిన మరుసటి నెలలో రిలయన్స్ మీడియా యూనిట్లను డిస్నీలో కలపనున్నారు. ప్రస్తుతం, ఈ కొనుగోలు అంశంపై ఆ రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. డిస్నీ ఆస్తులన్నీ తన వద్దే ఇక డిస్నీస్టార్‌ను కొనుగోలు చేసిన మరుసటి నెలలో రిలయన్స్ మీడియా యూనిట్లను డిస్నీలో కలపనున్నారు. ప్రస్తుతం, ఈ కొనుగోలు అంశంపై ఆ రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. చర్చల్లో భాగంగా డిస్నీ తన మైనారిటీ వాటాను అలాగే ఉంచుకుని మిగిలిన మేజర్ వాటాను నగదు బదిలి, స్టాక్స్‌ను కొనుగోలు చేసేలా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. డీల్‌పై తుది నిర్ణయం తీసుకోలేదు. డిస్నీ ఆస్తులను కొంత కాలం పాటు ఉంచుకోవాలని వాల్ట్ డిస్నీ అనుకుంటుందని సమాచారం. ఐపీఎల్ దెబ్బ.. ఆపై 2022లో ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను 2.7 బిలియన్ డాలర్లకు అంబానీ సొంతం చేసుకున్నారు. జియో సినిమా ఫ్లాట్‌ఫారమ్‌లో ఐపీఎల్ ప్రసారాల్ని ఉచితంగా యూజర్లకు అందించారు. ఆ తర్వాత వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హెచ్‌బీవో షోలను భారత్‌లో ప్రసారం చేసేందుకు గాను ఆ హక్కుల్ని రిలయన్స్ సొంతం చేసుకోవడం వంటి వరుస పరిణామాలతో వాల్ట్‌డిస్నీ స్టార్ డిస్నీని అమ్మేలా నిశ్చయించుకుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. భారత్ - న్యూజిలాండ్ దేశాల మధ్య జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 43 మిలియన్ల వ్యూస్ వచ్చాయని డిస్నీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను 35 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు బ్లూమ్ బెర్గ్ నివేదించింది. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. బలహీన జాతీయ అంతర్జాతీయ సంకేతాలతో బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు ఒకశాతం మేర నష్టపోయాయి. మార్జిన్ల క్షీణత ఆందోళనలతో బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు నెలకొన్నాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3–1% క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాల భయాలు, పశి్చమాసియా దేశాల్లోని యుద్ధ పరిస్థితుల పరిణామాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోయి 66 వేల స్థాయి దిగువన 65,877 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయి 19,671 వద్ద నిలిచింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ఫార్మా, ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేదు. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 586 పాయింట్లు క్షీణించి 65,842 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 19,660 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,832 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,470 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘బలహీన అంతర్జాతీయ సంకేతాలు, పశ్చిమాసియా దేశాల్లోని అనిశ్చిత పరిణామాలు దేశీయ మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయి. క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఉద్రికత్తలు మరింత ఎక్కువయ్యాయి. ఫెడ్ చైర్మన్ ప్రసంగానికి ముందు ఎఫ్ఐఐలు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ ఐటీ, ఫైనాన్స్ రంగ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇన్వెస్టర్లను మరింత నిరాశపరిచింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. ► సెప్టెంబర్ క్వార్టర్లో నికరలాభం 28% క్షీణించడంతో బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్ షేరు 3% నష్టపోయి రూ.7,871 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ ఒక్కరోజులో రూ.13,345 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ► యాజమాన్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయ వృద్ధి అంచనాలు తగ్గించడంతో ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ షేరు 6% క్షీణించి రూ.4,354 వద్ద స్థిరపడింది. ► జెన్సార్ టెక్నాలజీ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరడంతో కంపెనీ 6% నష్టపోయి రూ. 517 వద్ద స్థిరపడింది. ► సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ టాటా మోటార్స్ 2%, సన్ ఫార్మా 1.50%, మారుతీ 0.50% షేర్లు మాత్రమే లాభపడ్డాయి. సూచీ ఒకశాతం పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.2.42 లక్షల కోట్ల నష్టంవాటిల్లింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.321.40 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
బద్రీనాథ్‌ను సందర్శించిన ముఖేష్ అంబానీ, కాబోయే చిన్న కోడలు సందడి
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ గురువారం బద్రీనారాయణ ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కాబోయే భార్య రాధికా మర్చంట్‌తో కూడా ఉండటం విశేషం. అలాగే RIL డైరెక్టర్ మనోజ్ మోడీ ఈసారి ముఖేష్ అంబానీకి తోడుగా ఉన్నారు. బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ), సీఈవో బీడీ సింగ్, ఉపాధ్యక్షుడు కిషోర్ పవార్ వీరికి స్వాగతం పలికారు. అనంతరం కేదార్‌నాథ్‌ను కూడా సందర్శించారు అంబానీ. ఈ సందర్బంగా బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ (BKTC)కి అంబానీ 5 కోట్ల రూపాయలli విరాళంగా ఇచ్చారు. కాగా అంబానీ కుటుంబం దేవాలయాలు పవిత్ర పుణ్యక్షేత్రాలలో నిత్యం సందర్శిస్తుంటారు. గతంలో కూడా ఈ కమిటీకి విరాళాన్ని ప్రకటించారు అంబానీ. అంతేకాదు 2019లో బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ సభ్యుడిగా అనంత్ అంబానీ నియమితులయ్యారు. అలాగే అనంత్ అంబానీ, రాధిక వచ్చే ఏడాది పెళ్లి పీటలెక్కనున్నారు. చిన్ననాటి స్నేహితుడితో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఆమె తన అత్తమామలతో కలిసి అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించడం, తన సింప్లిసిటీతో ఫ్యాన్స్ ఆకట్టుకోవడం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో, అంబానీ తన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, కోడలు శ్లోకా మెహతా , మనవడు పృథ్వీ అంబానీతో కలిసి ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. గతేడాది అక్టోబర్‌లో అంబానీ బద్రీనాథ్ ధామ్, కేదార్నాథ్ ధామ్‌లను సందర్శించారు. అలాగే కేరళలోని గురువాయూర్ ఆలయాన్ని సందర్శించి, ఆలయ 'అన్నదానం' నిధికి 1.51 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ తిరుపతి ఆలయాన్ని సందర్శించినప్పుడు దాదాపు రూ.1.50 కోట్లు విరాళంగా ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్‌లో అంబానీ రాజస్థాన్‌లోని శ్రీనాథ్జీ ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే #WATCH | Reliance Industries Chairman, Mukesh Ambani offered prayers at Badrinath Dham in Uttarakhand. pic.twitter.com/fUUvdljevr — ANI (@ANI) October 12, 2023 -
ఎట్టకేలకు శుభవార్త చెప్పిన అంబానీ : త్వరలోనే మూడు ముళ్లు!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ తేదిని తాజాగా వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాధికా మర్చంట్‌తో నిశ్చితార్థాన్ని చేసుకున్న అనంత్ అంబానీ ముచ్చటగా మూడు ముళ్ల వేడుకతో వివాహ జీవితంలో అడుగు పెట్టబోతున్నారని సమాచారం. అంబానీ ఫ్యాన్ పేజీ అందించిన సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ( 2024) జూలై 10, 11, 12 తేదీల్లో అంగరంగ వైభవంగా అనంత్ -రాధిక పెళ్లి జరగబోతోంది. దీంతో అంబానీ ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. అంబానీ కుటుంబం అధికారిక ప్రకటన కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా అనంత్ అంబానీ తన ప్రియురాలు రాధికా మర్చంట్‌తో 2023జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ లవ్‌బర్డ్స్ కుటుంబ వేడుకల్లో, పలు పబ్లిక్ ఈవెంట్లలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులతో నిర్వహించిన గణేష్ చతుర్థి వేడుకల్లో కాబోయే భర్త అనంత్ అంబానీ కుటుంబంతో పాటు రాధికా మర్చంట్ సందడి చేసిన ఫోటోలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. కాబోయే అత్తగారు నీతా అంబానీ, తోటికోడలు శ్లోకా మెహతాతో కలిసి పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచింది. -
నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం
రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ నీతా అంబానీ మరో అరుదైన ఘనతను సొంతంచేసుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే నుంచి ప్రతిష్టాత్మక సిటిజన్ ఆఫ్ ముంబై అవార్డు (2023-24)ను అందుకున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రీడలు, కళలు మరియు సంస్కృతికి అందించిన సేవలకు గాను రోటరీ క్లబ్ ఆఫ్ బొంబే ఈ అవార్డును ప్రదానం చేసింది. ఒక వ్యాపారవేత్తగా పరోపకారిగా నీతా అంబానీ సాధించిన మరో కీలక విజయం అంటూ అందరూ ఆమెకు అభినందనలు తెలిపారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ బోర్డు గౌరవ ట్రస్టీగా ఎన్నికైన తొలి భారతీయురాలిగా నీతా అంబానీ చరిత్ర సృష్టించారు. అలాగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా రికార్డు క్రియేట్ చేసిన నీతా అంబానీ, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్యగా మాత్రమే కాదు, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సేవలందిస్తూ తనదైన ప్రత్యేకతను సాధించారు. ఇటీవల ముంబైలో ఆవిష్కరించిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ కళలకు సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన, కళాకారులకు ఇదొక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.అలాగే ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ ద్వారా భారతీయులందరికీ అందుబాటు ధరలో ప్రపంచ స్థాయి వైద్య సేవల్ని అందిస్తోంది అలాగే రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 5,000 స్కాలర్షిప్లను అందిస్తుంది. Nita Ambani receives the prestigious citizen of Mumbai Award 2023-24 from the Rotary Club of Bombay – a recognition of her enduring contributions to creating transformative institutions in healthcare, education, sports, arts, and culture. pic.twitter.com/SQ7d4CxPAL — ANI (@ANI) September 27, 2023 అంతే కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన క్రికెట్ జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్‌కు అంబానీ యజమానిగా కూడా రాణిస్తున్నారు. అంబానీ ఇండియన్ సూపర్ లీగ్‌ను ప్రారంభించిన ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ ఫౌండర్ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. పిల్లల అభివృద్ధికి తోడ్పడే 'అందరికీ విద్య మరియు క్రీడలు' కార్యక్రమానికి కూడా ఆమె సారథ్యం వహిస్తున్నారు. ఇంకా, ఎంఐ న్యూయార్క్ ఫౌండర్‌గా ప్రొఫెషనల్ అమెరికన్ T20 లీగ్ మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ప్రారంభ ఎడిషన్‌ను గెలుచుకున్న ఘనత కూడా నీతా అంబానీకే దక్కింది. -
Jio AirFiber: జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసింది..లాంచింగ్ ధర, ఆఫర్లు
Jio AirFiber ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్ ఎయిర్‌ఫైబర్ ను లాంచ్ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించినట్టుగానే నేడు (సెప్టెంబరు 19) ఈ సేవలను ఆవిష్కరించింది. ముందుగా దేశంలోని 8 నగరాల్లో ఈ సేవలను జియో ప్రారంభిస్తున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. ప్రారంభ నెలవారీ ప్లాన్ రూ.599గాను, హై ఎండ్ ప్లాన్‌ను రూ.3,999 గాను జియో ప్రకటించింది. జియో ప్రకటించిన దాని ప్రకారం అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణేలలో Jio AirFiber సేవలు అందుబాటులో ఉంటాయి. (గణపయ్యకు ఈ ఏడాది అంబానీ అదిరిపోయే గిఫ్ట్) Jio AirFiber విశేషాలు Jio AirFiber వినియోగదారులు గరిష్టంగా 1Gbps వేగంతో ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయవచ్చు. 550 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లను , 16 ఓవర్-ది-టాప్ (OTT) యాప్‌లకు యాక్సెస్‌ను లభిస్తుంది. టీవీ లేదా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులను ప్రపంచ-స్థాయి హోమ్ ఎంటర్టైన్మెంట్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ అనుభవానికి అప్‌గ్రేడ్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ద్వారా అందించబడుతుంది. జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్ల ప్రారంభ ధర రూ. 599. ఎయిర్‌ఫైబర్ కస్టమర్లకు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా Wi-Fi రూటర్, 4K స్మార్ట్ సెట్-టాప్ బాక్స్ . వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్‌ను అందిస్తోంది. ఇంకా పేరెంటల్ కంట్రోల్, Wi-Fi 6కి మద్దతు ,ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌వాల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. (యాక్సిస్ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్ ) Jio AirFiber ప్లాన్స్ ♦ పోర్ట్‌ఫోలియోలో మొత్తం ఆరు ప్లాన్లున్నాయి. రెగ్యులర్ ప్లాన్ ధర రూ. 599, ఇది 30Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. ♦ రూ. 899. రూ. 1,199 ప్లాన్లు 100Mbps వద్ద అపరిమిత డేటా ♦ AirFiber Max కింద, ప్రాథమిక ప్లాన్ ధర రూ. 1,499గా నిర్ణయించింది. ఇది 300Mbps డేటాను అందిస్తుంది. ♦ రూ. 2,499 ప్లాన్ 500Mbps వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చు. ♦ అత్యంత ఖరీదైన జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్ రూ. 3,999. ఇది 1Gbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. ♦ అన్ని ప్లాన్లు ఆరు లేదా 12 నెలల వ్యవధితో వస్తాయి , ఈప్లాన్ అన్నింటికి జీఎస్టీ అదనం ♦ ఇన్స్టాలేషన్ ఛార్జీలు రూ.1,000 ♦12 నెలల ప్లాన్‌పై ఇన్స్టాలేషన్ ఛార్జీలు లేవు ♦ ఇన్స్టాలేషన్ 1 అక్టోబర్, 2023 నుండి ప్రారంభం ఈ కొత్త ప్లాన్లు జియో అధికారిక వెబ్సైట్, లేదా సమీపంలోని Jio స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వాట్సాప్‌లో 60008-60008కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా వినియోగదారులు ఈ కనెక్షన్‌ని పొందవచ్చు.