Dior Fall 2023: Isha Ambani, Radhika Merchant Carry Similar Handbags Worth Rs 21 Lakhs - Sakshi
Sakshi News home page

వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్‌ బ్యాగ్‌ ధర రూ. 21 లక్షలు

Published Mon, May 29 2023 3:54 PM | Last Updated on Mon, May 29 2023 4:21 PM

DiorFall23Isha Ambani Radhika Merchant Lady Dior Mini handbags worth viral pic - Sakshi

సాక్షి,ముంబై: అంబానీ ఫ్యామిలీ మహిళలంటే ఈ కథే వేరుంటుంది కదా. ఈ విషయాన్నే రిలయన్స్‌ అధినేత, ఆసియా బిలియనీర్‌ ముఖేశ్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ,  కాబోయే కోడలు రాధిక మర్చంట్‌ మరోసారి నిరూపించారు.లగ్జరీ బ్రాండ్‌ హ్యాండ్‌బాగ్‌తో  కనిపించి ఇటీవల అందరి దృష్టినీ ఆకర్షించారు. ప్రస్తుతం ఈ  బ్యాగ్‌ ధర హాట్‌ టాపిక్‌గా మారింది. (3 వేల ఉద్యోగాలు కట్‌: లగ్జరీ కార్‌మేకర్‌ స్పందన ఇది!)

నీతా,ముఖేశ్‌ అంబానీ తనయ, రిలయన్స్‌ రీటైల్‌ హెడ్‌ ఇషా అంబానీ,  అనంత్‌  అంబానీ (ఇషా సోదరుడు అనంత్ రాధిక నిశ్చితార్థం జరిగింది) కాబోయే భార్య రాధిక మర్చంట్ ఇద్దరూ లేడీ డియోర్ మినీ హ్యాండ్‌బ్యాగ్‌లతో సందడి చేశారు.  మంచి ఫ్రెండ్స్‌ అయిన వీరిద్దరూ తరచూ అనేక ఈవెంట్లకు హాజరువుతూ ఉంటారు.  ప్రముఖ లగ్జరీ బ్రాండ్‌ బ్యాగ్స్‌ ధరించి ది డియోర్ ఫాల్ 2023 షోలో పోజులిచ్చారు. డియోర్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతానికి ఈ ‍ బ్యాగు అందుబాటులో లేనప్పటికీ వీరిద్దరూ ధరించిన ఈ బ్యాగు ధర భారత కరెన్సీలో సుమారుగా రూ. 21 లక్షల 6 వేలు. (కేవీపీ పెట్టుబడి డబుల్‌ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు! )

లగ్జరీ దిగ్గజం క్రిస్టియన్ డియోర్ లేటెస్ట్‌ ఈవెంట్‌​ ఇటీవల ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియాలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫ్యాషన్‌ షోకు అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ, సోనమ్ కపూర్, శోభితా ధూళిపాలా, మీరా రాజ్‌పుత్, అనన్య పాండే, ఖుషీ కపూర్, కరిష్మా కపూర్, డయానా పెంటీ, ఆథియా శెట్టి లాంటి సెలబ్రిటీలు  హాజరైనారు. ఇంకా హర్ష్ వర్ధన్ కపూర్, అనితా ష్రాఫ్ అడజానియా, శ్వేతా బచ్చన్, అర్జున్ కపూర్, మసాబా గుప్తా, నటాషా పూనావల్లా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు బ్రిడ్జర్టన్ స్టార్ సిమోన్ ఆష్లే, నటుడు పూర్ణ జగన్నాథన్, సంగీత విద్వాంసురాలు అనౌష్క శంకర్ ఇతరజాతీయ అంతర్జాతీయ ప్రముఖులు ఫ్యాషన్ ఈవెంట్‌లో  సందడి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement