
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ తేదిని తాజాగా వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాధికా మర్చంట్‌తో నిశ్చితార్థాన్ని చేసుకున్న అనంత్ అంబానీ ముచ్చటగా మూడు ముళ్ల వేడుకతో వివాహ జీవితంలో అడుగు పెట్టబోతున్నారని సమాచారం.
అంబానీ ఫ్యాన్ పేజీ అందించిన సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ( 2024) జూలై 10, 11, 12 తేదీల్లో అంగరంగ వైభవంగా అనంత్ -రాధిక పెళ్లి జరగబోతోంది. దీంతో అంబానీ ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. అంబానీ కుటుంబం అధికారిక ప్రకటన కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
కాగా అనంత్ అంబానీ తన ప్రియురాలు రాధికా మర్చంట్‌తో 2023జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ లవ్‌బర్డ్స్ కుటుంబ వేడుకల్లో, పలు పబ్లిక్ ఈవెంట్‌లలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.
ముఖ్యంగా ఇటీవల పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులతో నిర్వహించిన గణేష్ చతుర్థి వేడుకల్లో కాబోయే భర్త అనంత్ అంబానీ కుటుంబంతో పాటు రాధికా మర్చంట్ సందడి చేసిన ఫోటోలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. కాబోయే అత్తగారు నీతా అంబానీ, తోటికోడలు శ్లోకా మెహతాతో కలిసి పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment