nita ambani
-
నీతా అంబానీయా మజాకా : ఆమె బ్యాగు ధరతో కారు కొనేయొచ్చట!
మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం నిర్వహించిన మినీ వేలంలో ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ తనదైన స్టైల్‌తో ఆకట్టుకున్నారు. సందర్భానికి తగ్గట్టు తన డ్రెస్సింగ్ స్టైల్‌తో అదరగొట్టడం మాత్రమే కాదు, హై-ఎండ్ యాక్సెసరీలతో స్పెషల్ లుక్‌లో అందరి కళ్లను తనవైపు తిప్పుకోవడంలో నీతా అంబానీ ముందుంటారు. తాజాగా బెంగళూరులో నిర్వహించిన WPL 2025 మినీ వేలం ఈవెంట్లో మరోసారి ఈ విషయాన్నే రుజువుచేశారు. ముఖ్యంగా ఆమె చేతిలోని పింక్ బ్యాగ్ హాట్ టాపిక్‌గా నిలిచింది.నీతా అంబానీ పవర్ లుక్!ఈ వేలం కార్యక్రమం కోసం నీతా అంబానీ నీతా అంబానీ పవర్లుక్లో అదర గొట్టారు. ఈ బిజినెస్ ఐకాన్ పవర్ షోల్డర్లు, డబుల్ కాలర్స్‌తో కూడిన చిక్ పాస్టెల్ పింక్ బ్లేజర్‌ను ధరించారు. స్టైలిష్ డెనిమ్ బ్లేజర్‌కు జతగా విలాసవంతమైన హ్యాండ్‌బ్యాగ్‌తో కనిపించారు. అంతేనా డైమండ్ స్టడ్స్, హార్ట్ షేప్డ్ లాకెట్టు నెక్లెస్, తెల్లటి చేతి గడియారం , హై హీల్స్‌తో తన స్టయిల్‌కి లగ్జరీ టచ్ ఇచ్చారు.ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్ మహిళా టీం, యువ ప్రతిభకు ప్రాధాన్యం : నీతా పింక్ హ్యాండ్బ్యాగ్ఈ ఔట్‌ఫిట్‌కు తగ్గట్టుగా పర్ఫెక్ట్ మ్యాచింగ్‌తో ధరించిన పింక్ హ్యాండ్‌బ్యాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పింక్ అండ్ వైట్ గోయార్డిన్ కాన్వాస్, చెవ్రోచెస్ కాల్ఫ్స్కిన్ సైగాన్ స్ట్రక్చర్ ఉన్న ఈ వాచ్ ధరతో ఒక కారు కొనేయొచ్చంటే నమ్ముతారా? ప్రఖ్యాత బ్రాండ్ గోయార్డ్ బ్రాండ్‌కు చెందిన బ్యాగ్ ధర సుమారు 10 లక్షల(12వేల అమెరికా డాలర్లు) రూపాయలట.కాగా మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం రిలయన్స్ఫౌండేన్ చైర్పర్సన్ నీతా అంబానీ యాజమాన్యలోని ముంబై ఇండియన్స్ పటిష్టమైన టీంను సిద్ధం చేసింది. WPL 2025 ఆదివారం బెంగుళూరులో జరిగిన వేలంలో కొత్తగా నలుగురు మహిళా క్రికెటర్లను జట్టులో చేర్చుకుంది. దీనిపై నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. -
ముంబై ఇండియన్స్ మహిళా టీం, యువ ప్రతిభకు ప్రాధాన్యం : నీతా
మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం రిలయన్స్ఫౌండేన్ చైర్పర్సన్ నీతా అంబానీ యాజమాన్యలోని ముంబై ఇండియన్స్ పటిష్టమైన టీంను సిద్ధం చసింది. WPL 2025 ఆదివారం బెంగుళూరులో జరిగిన వేలంలో కొత్తగా నలుగురు మహిళా క్రికెటర్లను జట్టులో చేర్చుకుంది. దీనిపై నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. తమ ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో యువతకు ప్రాధాన్యత ఇచ్చి, వారిలోని ప్రతిభను గుర్తించి, తద్వారా టీం పటిష్టతకు ప్రయత్నిస్తోందని నీతా తెలిపారు.నీతా అంబానీ కొత్తగా ఎంపికైన టీంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పురుషుల జట్టులో ఆటగాళ్లు బుమ్రా, హార్తిక్, తిలక్ ప్రపంచ వేదికపై ప్రతిభతో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. అలాగే గతేడాది వేలంలో తీసుకున్న సజనకూడా అద్భుతంగా ఆడిందంటూ ప్రశంసించారు నీతా. ముంబై ఇండియన్స కుటుంబంలో భాగమైన అమ్మాయిలందరి గురించి తాను గర్వపడుతున్నానని వ్యాఖానించారు. కొత్తగా టీంలో చేరిన తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల వికెట్ కీపర్ జి. కమలిని, ఆల్ రౌండర్లు సంస్కృతి గుప్తా, అక్షితా మహేశ్వరి, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ నాడిన్ డి క్లర్క్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. “Grooming young talent, and watching them play at the global stage feels wonderful.”Mrs. Nita Ambani encourages new talent joining the 𝗙𝗔𝕄𝕀𝗟𝗬 at the #TATAWPLAuction! 💙#OneFamily #AaliRe #MumbaiIndians pic.twitter.com/VySfK4B6W6— Mumbai Indians (@mipaltan) December 15, 2024 -
నీతా అంబానీకి అత్యంత ఇష్టమైన చీర! ఏకంగా 900 ఏళ్ల నాటి..!
కొన్ని చీరలు మన భారతీయ హస్తకళా నైపుణ్యానికి ప్రతీకలుగా ఉంటాయి. కాలాలు మారుతున్న వాటి ఉనికి ప్రకాశవంతంగా నిలిచే ఉంటుంది. ఎన్నో వెరైటీ డిజైన్లు వచ్చినా.. పురాతన హస్తకళతో కూడిన చీరలే అగ్రస్థానంలో అలరారుతుంటాయి. తరతరాలు ఆ చీరలను ఆదరిస్తున్నే ఉంటారు. అలాంటి చీరల కళా నైపుణ్యానికి సెలబ్రిటీలు, ప్రముఖులు దాసోహం అంటూ వాటిని ప్రోత్సహిస్తూ భవిష్యత్తు తరాలు తెలసుకునేలా.. ఆ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు కూడా. అలాంటి 900 ఏళ్ల నాటి హస్తకళా నైపుణ్యానికి పేరుగాంచిని పటోలా చీరల విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీకి సైతం ఈ చీరలంటే మహా ఇష్టం. ఆ మక్కువతోనే ఇటీవల గ్రాండ్‌గా నిర్వహించిన చిన్న కుమారుడు అనంత్-రాధికల వివాహంలో ఈ చీరలనే అతిధులకు గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతలా కట్టిపడేసేలా ఆ పటోల చీరల్లో ప్రత్యేకత ఏముందంటే..?ఎక్కడ నుంచి వచ్చాయంటే..ఈ పటోలా చీరలు గుజరాత్‌లోని పటాన్ ప్రాంతం నుంచి వచ్చాయి. ఈ చీరలు శక్తిమంతమైన రంగుల కలయికతో క్లిష్టమైన డిజైనలతో ఉంటాయి. ఈ చీరల తయారీ అనేది శ్రమతో కూడిన హస్తకళ అని చెప్పాచ్చు. అంబానీల ఇంట జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత నుంచి వీటి అమ్మకాలు బాగా ఎక్కువయ్యాయి. ఇప్పుడు చాలామంది మగువలు ఏరికోరి ఈ పటోలా చీరలను తెప్పించుకుని మరీ కొంటున్నారు. ప్రత్యేకతలు..పటోలా చీర తయారీ అంత ఈజీ కాదు. తొందరగా అయ్యిపోయే పనికూడా కాదు. ప్రతిభాగానికి దాదాపు పది నుంచి పన్నెండు మంది కళాకారుల బృందంతో సుమారు ఆరు నెలల శ్రమ ఫలితం ఈ చీరలు. చక్కటి పట్టు దారాలతో నేసిన చీరలివి. భారతదేశ గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబించేలా చక్కటి మనికతో ఉంటాయి. వీటి సరిగ్గా వాడితే శతాబ్దం వరకు చెక్కు చెదరవట. అయితే ఈ పటోలా చీరలను మాములు పద్ధతిలో వాష్ చేయకూడదు. వీటిని డ్రై-క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. సరిహద్దులు దాటి..పటోలా చీరల కీర్తీ సరిహద్దులు దాటి..జర్మనీ, యూఎస్ఏ, రష్యా వంటి దేశాల అభిమానం కూడా సంపాదించుకుది. బనారసీ చీరల తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న సాంప్రదాయ వస్త్రాలలో ఇవి ఒకటి. అయితే వీటి ధరలు ప్రారంభ ధర రూ. 10 వేల నుంచి మొదలై దాదాపు ఏడు లక్షలుదాక పలికే లగ్జీరియస్ చీరలు కూడా ఉన్నాయి. (చదవండి: ప్రమాణ స్వీకారంలో కసవు చీరలో మెరిసిన ప్రియాంక.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?) -
ఇటు కావ్యా మారన్, ప్రీతి జింటా.. అటు నీతా అంబానీ, జూహీ చావ్లా.. వేరే లెవల్! (ఫొటోలు)
-
ఐపీఎల్ వేలం 2025 : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ఫ్యాషన్ స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సమయానికి తగ్గట్టుగా డ్రెస్‌లను ఎంపిక చేసుకోవడంలో, ఫ్యాషన్‌ను, బిజినెస్‌ను మిళితం చేయడంలో నీతా తరువాతే ఎవరైనా అనేది అభిమానుల మాట మాత్రమే కాదు, ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం కూడా. తాజా ఐపీఎల్ -2025 వేలం సందర్భంగా మరోసారి తన స్టైల్‌తో అందర్నీ తనవైపు తిప్పుకుంది. నీతా అంబానీ నేవీ బ్యూ ప్యాంట్‌సూట్ ధరించి అందరినీ ఆకర్షించింది. అంతేకాదు ఆ డ్రెస్ ధర కూడా హాట్ టాపిక్‌గా నిలిచింది. ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన నీతా అంబానీ వైడ్-లెగ్ ప్యాంట్, బ్లూ సూట్లో హుందాగా కనిపించారు. నీతా ధరించిన ‘మజే’ బ్రాండ్‌కు చెందిన ఈ బ్రేజర్ సూట్ ధర అక్షరాలా 950 డాలర్లు. అంటే దాదాపు రూ.78 వేలు. ఇందులో బ్లేజర్ రూ. 47 వేలు కాగా వైడ్-లెగ్ ట్వీడ్ ట్రౌజర్ ధర సుమారు రూ. 31వేలు, మొత్తంగా ఆమె సూట్ ధర రూ.78 వేలు. అంతేనా వజ్రాలు పొదిగిన ఎంఐ బ్రూచ్, హ్యాండ్‌బ్యాగ్, డైమండ్ రింగ్, డైమండ్ చెవిపోగులు, సన్ గ్లాసెస్, వాచ్, హీల్స్ ఇలా అన్నీ ప్రత్యేకంగా కనిపించడం విశేషం. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)nbsp;ఐపీఎల్ మెగా వేలం-2025 తొలి రౌండ్ విడత ప్రక్రియ దుబాయ్‌లోని జెడ్డాలో ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో ఎంఐ నలుగురు సూపర్ స్టార్లు రోహిత్ శర్మ,హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాతోపాటు టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మకూడా ఉన్నాడు. ముఖ్యంగా తిలక్ వర్మను రూ.8 కోట్లకు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ఈ వేలంలో నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. -
అనంత్-రాధికా అంబానీ అదిరిపోయే దుబాయ్ విల్లా, ఫోటోలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తమ చిన్న కొడుకు అనంత్ అంబానీకి అద్భుతమైన పెళ్లి కానుక ఇచ్చారు. అత్యంత వైభవంగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహాన్ని ఇటలీలో జరిపించిన అంబానీ దంపతులు అలాగే కనీవినీ ఎరుగని రీతిలో రెండు ప్రీ-వెడ్డింగ్ బాష్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటలీలోని ఓ క్రూజ్ షిప్లో భారీ పార్టీని ఏర్పాటు చేసారు. ఇందంతా ఒక ఎత్తయితే అంబానీలు తమ చిన్న కోడలు రాధికా మర్చెంట్‌కు దుబాయ్‌లో 640 కోట్ల విలువైన బంగ్లాను కానుకగా ఇచ్చారు. ఈ లగ్జరీ బంగ్లాకు సంబంధించిన ఫోటోలు ఇపుడు నెట్టింట సందడి చేస్తున్నాయి.దుబాయ్‌లోని ఫేమస్ పామ్ జుమైరాలో ఈ విలాసవంతమైన విల్లా ఉంది. దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విల్లాలో ఇదొకటి. దాదాపు 3000 చదరపు అడుగుల్లో ఈ విల్లాను నిర్మించారు. ఈ విల్లా మొత్తంలో 10 బెడ్రూంలు, 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. సొగసైన లివింగ్ రూమ్‌లు, బెడ్రూమ్లు విలాసవంతమైన బాత్రూమ్ల ఇలా ప్రతీది చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా జాగ్రత్తపడ్డారట. ఇటాలియన్ మార్బుల్, అద్భుతమైన ఆర్ట్‌వర్క్‌తో అలంకరించిన 10 ఖరీదైన బెడ్రూమ్లు, ఆకట్టుకునే ఇంటీరియర్స్‌తో విల్లా ఒక అద్భుత కళాఖండంగా ఉంటుందని సమాచారం. ఇండోర్, అవుట్డోర్ పూల్స్ ఉన్నాయి. పాంపరింగ్ సెషన్ల కోసం ప్రైవేట్ స్పా, ప్రైవేట్ సెలూన్ కూడా ఉన్నాయి. పెద్ద కోడలు శ్లోకా మెహతాకి 450 కోట్ల ఖరీదైన బంగ్లాతో పాటు రూ. 200 కోట్ల ఖరీదైన నెక్లెస్ ఇచ్చారు. ఈ ఏడాది జులై 12న రాధిక, అనంత్ అంబానీ వివాహ వేడుక చాలా గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే.👉 ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదీ చదవండి: పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...! -
పిల్లలతో నీతా అంబానీ: కొత్త పథకంతో లక్ష మందికి మేలు
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & ఛైర్పర్సన్ 'నీతా అంబానీ' బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్‌లో ప్రతి జీవితం విలువైనదని మేము విశ్వసిస్తున్నాము. ప్రతి బిడ్డ సంతోషంగా, ఆరోగ్యంగా పెద్ద కలలు కనడానికి, వాటిని సాకారం చేసుకోవడానికి అర్హులు అని వ్యాఖ్యానించారు.బాలల దినోత్సవం సందర్భంగా.. కొత్త ఆరోగ్య సేవా పథకాన్ని ప్రారంభించినట్లు నీతా అంబానీ ప్రకటించారు. పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు & మహిళలపై దృష్టి సారించి, అట్టడుగు వర్గాలకు చెందిన 1,00,000 మంది వ్యక్తులకు ఎటువంటి ఖర్చు లేకుండా అవసరమైన ఆరోగ్య పరీక్షలు మరియు చికిత్సలను అందించడం ఈ చొరవ లక్ష్యం అని పేర్కొన్నారు.ఈ సంవత్సరం, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి.. మా కొత్త ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రవేశపెట్టడం గర్వకారణంగా ఉందని, నీతా అంబానీ పేర్కొన్నారు. అంతే కాకుండా.. 50,000 మంది పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు ఉచిత పరీక్షలు చేసి తగిన చికిత్సను అందించడం, 50వేల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌లతో పాటు 10,000 మంది కౌమార బాలికలకు గర్భాశయ క్యాన్సర్ వ్యాధి నిరోధక టీకాల వంటి వాటికి సంబంధించిన లక్ష్యాలను నీతా అంబానీ వెల్లడించారు.ప్రారంభం నుంచి రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 1,50,000 కంటే ఎక్కువమంది పిల్లలతో సహా సుమారు 27 లక్షల కంటే ఎక్కువమంది భారతీయులకు సేవలందించింది. భారతదేశంలోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌గా గుర్తింపు పొందిన ఈ సంస్థ నాణ్యమైన సేవలను అందిస్తోంది.బాలల దినోత్సవానికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నీతా అంబానీ.. పిల్లలతో ముచ్చటించడం, పిల్లకు కేక్ తినిపించడం వంటివి కూడా చూడవచ్చు. అంతే కాకుండా రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ద్వారా మేలు పొందిన వారు సంస్థకు కృతజ్ఞతలు చెప్పడం కూడా ఇక్కడ చూడవచ్చు. -
రిలయన్స్, డిస్నీ విలీనం: దిగ్గజ మీడియా సంస్థగా..
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీకి చెందిన మీడియా వ్యాపారాల విలీనం పూర్తయింది. ఈ విలీనం ఏకంగా రూ.70,352 కోట్ల విలువైన కొత్త జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. రిలయన్స్ - డిస్నీ విలీనంతో దేశంలోనే అతి పెద్ద మీడియా సామ్రాజ్యం అవతరించింది.జాయింట్ వెంచర్ వృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 11,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ సంస్థకు నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు, వైస్ చైర్‌పర్సన్‌గా ఉదయ్ శంకర్ ఉంటారు. విలీన కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 16.34 శాతం వాటాను, వయాకామ్ 18 46.82 శాతం వాటాను, డిస్నీ 36.84 శాతం వాటాను పొందుతాయి.కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ), జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి విలీనానికి కావలసిన అనుమతులు కూడా ఇప్పటికే లభించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ విలీనం తరువాత వీటి కింద సుమారు 100 కంటే ఎక్కువ టీవీ ఛానల్స్ ఉండనున్నాయి. ఇవి ఏడాదికి 30,000 గంటల కంటే ఎక్కువ టీవీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను ఉత్పత్తి చేయగలవని సమాచారం.ఇదీ చదవండి: ఆధార్, పాన్ లింకింగ్: ఆలస్యానికి రూ.600 కోట్లు..రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ జాయింట్ వెంచర్ భారతదేశ వినోద పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలుకుతుంది. ప్రపంచ స్థాయి డిజిటల్ స్ట్రీమింగ్ సామర్థ్యాలతో పాటు డిజిటల్ ఫస్ట్ అప్రోచ్‌తో భారతీయులకు మాత్రమే కాకుండా.. ప్రవాస భారతీయులకు సరసమైన ధరలకు అసమానమైన కంటెంట్ ఆప్షన్స్ అందించటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. -
తిరా ఈవెంట్ : ప్రత్యేక ఆకర్షణగా నీతా అంబానీ, ఇషా: ఇక బ్యాగ్స్ అయితే!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ఆరు పదుల వయసులోనూ స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని సైతం మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. అంతేనా ముఖేష్, నీతా అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ కూడా ఫ్యాషన్ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటూ ఉంటుంది. తాజాగాముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో జరిగిన ఈహై-ప్రొఫైల్ లాంచ్ ఈవెంట్లో అంబానీ లేడీస్ తమ ప్రత్యేక నిలుపుకున్నారు. రిలయన్స్ బ్యూటీ వెంచర్ తిరా తన కొత్త స్టోర్‌ను ముంబైలో లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఇషా అంబానీపిరామిల్ మెరిసే లావెండర్ పవర్ ప్యాంట్‌సూట్ అందన్నీ ఆకట్టుకోగా, నీతా అంబానీ, లూజ్ ప్యాంట్, చెకర్డ్ బ్లేజర్‌తో ప్రత్యేకంగా దర్శనమిచ్చింది. ముఖ్యంగా వారి బ్యాగ్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.నీతా అంబానీ పాప్‌కార్న్ బ్యాగ్నీతా అంబానీ పాప్‌కార్న్ పర్స్ స్పెషల్ ఎట్రాక్షన్.. రెసిన్, ఎనామెల్, ఇమిటేషన్ ముత్యాలు, గోల్డ్-టోన్ మెటల్‌తో తయారు చేశారట.ఇషా అంబానీ బో క్లచ్ఫ్యాషన్ గేమ్‌లో తగ్గేదే లేదు అన్నట్టుంది ఇషా అంబానీ చేతిలోని పర్స్. చిన్న వెండి విల్లు ఆకారపు క్లచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యూటీ రిటైల్ చైన్ అయిన తీరా ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో ప్రారంభించింది. భారతదేశంలో ప్రీమియం బ్యూటీ షాపింగ్ డెస్టినేషన్ అని కంపెనీ ప్రకటించింది. ఈ విస్తారమైన 6,200 చదరపు అడుగుల స్టోర్‌లో టాప్ గ్లోబల్ బ్యూటీ బ్రాండ్లతో హై-ఎండ్ రిటైల్ అనుభవాన్ని అందించనుంది. ఈ హై-ప్రొఫైల్ లాంచ్ ఈవెంట్లో ఫ్యాషన్ క్రిటిక్ ఇన్ఫ్లుయెన్సర్, సూఫీ మోతీవాలా, పలువురు బాలీవుడ్ క్వీన్లు మెరిసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Limelight Nova (@limelightnova) ఇదీ చదవండి : పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...! -
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో 'ది ఫాంటమ్ ఆఫ్ ది ఒపెరా' సంగీత ప్రదర్శన
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రపంచంలోని అత్యుత్తమ సంగీత ప్రదర్శన ‘ది ఫాంటమ్ ఆఫ్ ది ఒపెరా’ని ప్రదర్శించనుంది. ఇది ఒక ఐకానిక్ లవ్ స్టోరీకి సంబంధించిన సంగీతం. మార్చి 05, 2025న ముంబైలోని గ్రాండ్ థియేటర్ నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్(ఎన్ఎంఏసీసీ)లో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఎన్ఎంఏసీసీ చైర్మన్ నీతా అంబానీ మాట్లాడుతూ.. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచంలోని అత్యుత్తమమైన సంగీతాన్ని భారతీయ ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ఉన్నాం. ప్రస్తుతం ఈ కల్చర్ సెంటర్ రెండొవ వార్షికోత్సవానికి చేరుకున్న నేపథ్యంలో థియేట్రికల్ అద్భుతం 'ది ఫాంటమ్ ఆఫ్ ది ఒపెరాను ప్రదర్శించనున్నాం అని ప్రకటిస్తున్నాందుకు చాలా సంతోషంగా ఉంది." అని నీతా ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఈ సంగీత ప్రదర్శనను వీక్షించేందుకు అందురూ రావాలని ఆహ్వానించారు. బ్రిటన్ ప్రసిద్ధ మ్యూజిక్ కంపోజర్ లాయిడ్ వెబ్బర్ దీనికి సంగీతాన్ని అందించారు. 1910 నవల "ది ఫాంన్టాం ఆఫ్ ఒపెరా" ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇందులో ఫాంటమ్ అనే ఒక యువ సోప్రానో, క్రిస్టీన్ డాయే అనే అమ్మాయితో ప్రేమలోపడతాడు. ఆ కథ అంతా ప్యారిస్ ఒపేరా హౌస్ క్రింద దాగి ఉన్న వ్యక్తి గురించి చెబుతుంది. ఫాంటమ్ అనే యువ సోప్రానో ఈ ప్యారిస్ హౌస్ కింద ఉంటాడు. అతడిని ముట్టడించే ప్రయత్నం చేస్తుంది క్రిస్టీన్ డాయే. ఇది వారిద్దరి మధ్య సాగే ప్రేమ, ముట్టడి, అందం, రాక్షసత్వం మధ్య సాగిన పోరాటమే ఇతివృత్తంగా ఈ సంగీత ప్రదర్శన ఉంటుంది. ఈ సంగీత ప్రదర్శన తొలిసారిగా అక్టోబర్ 9, 1986న లండన్ వెస్ట్ ఎండ్‌లోని హర్ మెజెస్టి థియేటర్లో ప్రదర్శించారు. ఆ తర్వాత జనవరి 26, 1988న బ్రాడ్వేలో మెజెస్టిక్ థియేటర్లో ప్రదర్శించడం జరిగింది. అలా మొత్తం 70కి పైగా ప్రధాన థియేటర్ అవార్డులను గెలుచుకున్న గొప్ప సంగీత ప్రదర్శనగా నిలిచింది. మొత్తం 21 భాషల్లో 195 నగరాల్లో 160 మిలియన్ల మందికి పైగా వీక్షించిన ప్రసిద్ధ సంగీత ప్రదర్శన కళగా ఘనత దక్కించుకుంది. అంతేగాదు బ్రాడ్ వే థియేటర్లో ఎక్కువ కాలం ప్రదర్శించిన సంగీత ప్రదర్శనగా కూడా నిలిచింది. ముంబైకి వస్తున్న ఈ సంగీత ప్రదర్శన కళని వీక్షించాలంటే ఎన్ఎంఏసీసీ డాట్ కామ్ లేదా బుక్‌మైషో డాట్ కామ్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. టిక్కెట్ ధర రూ. 1250 నుంచి మొదలవ్వుతుంది.(చదవండి: అందాల రాణి ఐశ్వర్య రాయ్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
నీతా.. నిన్నే పెళ్లాడుతా! ట్రాఫిక్ సిగ్నల్‌లో ప్రపోజ్
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ జీవిత భాగస్వామి నీతా అంబానీ తన 60వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో ఎంతో ముఖ్యమైన ముఖేష్ అంబానీతో ప్రేమ కథ ఎలా ప్రారంభమైందో ఈ కథనంలో తెలుసుకుందాం..ధీరూభాయ్‌ని మెప్పించి..ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ.. నీతా హుందాతనం, ప్రతిభను చూసి తన కోడలుగా ఎంచుకున్నారు. ఓసారి నీతా భరతనాట్యం ప్రదర్శనను తిలకించిన ధీరూభాయ్ తన కొడుకు ముఖేష్ ఆమే సరిజోడని భావించారు. వారిద్దరికీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది వారి మధ్య స్నేహాన్ని క్రమంగా పెంచింది.చెబితేనే కారు కదిలేది..మీడియా నివేదికల ప్రకారం.. ఒకరోజు ముఖేష్ అంబానీ, నీతాతో కలిసి కారులో వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపి నీతా వైపు తిరిగి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగారు. నిశ్చేష్టురాలైన ఆమె ఆశ్చర్యంతో ఏమీ చెప్పలేక కొద్దిసేపు అలాగే ఉండిపోయింది. సమాధానం చెప్పే వరకూ కారు కదలదని ముఖేష్ అంబానీ చెప్పారు. దీంతో తరువాత ఆమె అంగీకరించారు. అలా వారు కలిసి జీవితాన్ని ప్రారంభించారు. -
Nita Ambani birthday: దీపాలతో వేడుక : ఉత్సాహంగా చిన్న కోడలు
రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ వ్యాపారవేత్త ,పరోపకారి, నీతా అంబానీ 60వ పుట్టిన రోజు (నవంబరు 1). ఈ సందర్భంగా కొత్తకోడలు, నీతా చిన్న కుమారుడు అనంత్ అంబానీ భార్య, రాధిక మర్చంట్, కంపెనీ సిబ్బంది ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్ఎంఏసీసీ కూడా నీతా అంబానీకి స్పెషల్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేసింది. Paltan, join us in wishing Mrs. Nita Ambani, a very Happy Birthday! 💙#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/MQlPXKqLGx— Mumbai Indians (@mipaltan) November 1, 2024అలాగే పలువురు సెలబ్రిటీలు నీతా అంబానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించారు. ఐపీఎల్టీం ముంబై ఇండియన్స్ కూడా ఎక్స్ ద్వారా విషెస్ తెలిపింది. Today, on the birthday of our Founder and Chairperson, Mrs. Nita Ambani, we celebrate her passion for the arts! pic.twitter.com/Sq47Fpg55r— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) November 1, 2024నీతా బర్త్‌డేను కంపెనీ సిబ్బంది దీపాలతో స్పెషల్‌గా సెలబ్రేట్ చేశారు. దీపాలను వెలిగించిన పళ్లెంతో ఆమెకు హారతి ఇచ్చారు. హ్యాపీ బర్త్‌డే పాటను ఆలపించారు. దీంతో నీతా అంబానీ ఆనందంతో మెరిసి పోయింది. ఈ వేడుకలో చిన్నకోడలు రాధిక మర్చంట్ ఉత్సాహంగా పాల్గొంది. పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ గులాబీ రంగు చీరలో మెరిసారు. మెడలో మూడు పేటల ముత్యాల హారం, మ్యాచింగ్ చెవిపోగులు, రింగుల జుట్టుతో మరింత అందంగా కనపించారు. అత్తగారికి తగ్గట్టుగా చోటి బహు, రాధిక మర్చంట్ కూడా గులాబీ రంగు పూల దుస్తుల్లో మెరిసింది. -
ఇషా, ఆకాష్ అంబానీ పేర్ల వెనుక స్టోరీ, వాటి అర్థం తెలుసా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ,నీతా అంబానీల పిల్లలు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ. ఐవీఎఫ్ ద్వారా ఈ కవల పిల్లలకు జన్మనిచ్చారు నీతా అంబానీ. అక్టోబర్ 23న పుట్టిన ఇషా , ఆకాష్ అంబానీలు పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?ఇషా, ఆకాష్ అంబానీ పుట్టిన రోజు సందర్బంగా గతంలో డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లాతో నీతా అంబానీ సంభాషణ ఇపుడు వైరల్‌గా మారింది. ఇందులో తన కవల పిల్లలు ఇషా, ఆకాష్ పేర్ల వెనుకున్న కథను నీతా పంచుకున్నారు.కవలల పిల్లల ప్రసవం కోసం తాను అమెరికాలో ఉన్నానని నీతా తెలిపారు. అపుడు నత భర్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తనను కలిసి ఇండియా వెళ్లేందుకు విమానం దిగారో లేదో వెంటనే అమెరికా బయలుదేరాల్సి వచ్చింది. ఎందుకంటే... నెలలకు నిండకుండానే. ఇషా, ఆకాష్‌కు జన్మనిచ్చారట నీతా. దీనితో ముఖేష్ U.S.కి తిరిగి వెళ్లవలసి వచ్చింది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే..నీతాకు డెలివరీ అయిందన్న సంగతి తెలియగానే అంబానీతోపాటు, నీతా తల్లి, డాక్టర్ ఫిరోజా, విమానంలో అమెరికాకు బయలు దేరారు. అపుడు వారు ప్రయాణిస్తున్న విమానం పైలట్ ఈ సంతోషకరమైన వార్తను ప్రకటించారు. అంతేకాదు తమ పిల్లలకు ఇషా, ఆకాష్ పేర్లు ఎలా పెట్టిందీ వివరించారు నీతా. పిల్లలకు పేర్ల చర్చ వచ్చినపుడు పర్వతాల మీదుగా ఆకాశంలో ఎగురుతున్నపుడు ఈ వార్త తెలిసింది కాబట్టి అమ్మాయికి ఇషా (పర్వతాల దేవత) ఆకాష్ (ఆకాశం) అని అనే పేర్లు పెడదామని చెప్పారట అంబానీ. అదీ సంగతి. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ పుట్టిన మూడేళ్ల తర్వాత వారి మూడో సంతానం అనంత్ అంబానీ జన్మించాడు. కాగా ప్రస్తుతం ఇషా, ఆకాష్, అనంత్ రిలయన్స్వ్యాపార సమ్రాజ్య బాధ్యతల్లో ఉన్నారు. ఆకాష్ , డైమండ్స్ వ్యాపారి కుమార్తె శ్లోకా మెహతాను పె ళ్లాడాడు వీరికి ఇద్దరు సంతానం. వ్యాపారవేత్త ఆనంద్పిరమిల్ వివాహమాడిన ఇషాకు ఇద్దరు కవల పిల్లలు. అనంత్ తన చిన్న నాటి స్నేహితురాలు రాధికా మర్చంట్‌ను ఈ ఏడాది జూలైలో అంగరంగ వైభవంగా పెళ్లాడిన సంగతి తెలిసిందే. -
అంబానీ కవల పిల్లల వ్యాపార సామ్రాజ్యం
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వారసులు, కవలు ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీలు బుధవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ముఖేశ్-నీతా అంబానీ దంపతులకు ఐవీఎఫ్ ద్వారా అక్టోబర్ 23, 1991లో వీరు ఇద్దరు జన్మించారు.ఇషా అంబానీముంబయిలో అక్టోబర్ 23, 1991లో జన్మించారు.యేల్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.కింది సంస్థలకు ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్రిలయన్స్ ట్రెండ్స్టిరా బ్యూటీయూస్టాఅజార్ట్హామ్లేస్నెట్మెడ్స్ఫ్రెష్పిక్ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..ఆకాశ్ అంబానీముంబయిలో అక్టోబర్ 23, 1991లో జన్మించారు.ముంబయిలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషన్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు.అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.2018లో శ్లోకామెహతాను వివాహం చేసుకున్నారు. వీరికి పృథ్వీ, వేద ఇద్దరు పిల్లలు.కింది సంస్థలకు ఆకాశ్ అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్జియో ప్లాట్‌ఫామ్స్ లిమిడెట్రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ముంబయి ఇండియన్స్ -
‘అమ్మా నీ వల్లనే’ : ఐకాన్ ఇషా భావోద్వేగం, ట్రెండింగ్‌లో దూకుడు
అంబానీ వారసురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ మరో ఘనతను సొంతం చేసుకుంది. బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా కుమార్తె, ఇషా అంబానీ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. ఈ సందర్భంగా తల్లినుద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేసింది. అలాగే తనకు దక్కిన అవార్డును తల్లి నీతాకు, తన కుమార్తె ఆదియాకు అంకితమివ్వడం విశేషంగా నిలిచింది. దీంతో ప్రస్తుతం ఇషా గూగుల్ ట్రెండింగ్‌లో నిలిచింది.హార్పర్స్ బజార్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 2024లో 'ఐకాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ఇషా అందుకుంది. ఈ అవార్డును ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్, వ్యవస్థాపకురాలు గౌరీఖాన్ ఆమెకు అందించారు. అవార్డు అందుకున్న తర్వాత, ఇషా తన తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ హార్ట్ టచింగ్ ప్రసంగం చేసింది.‘‘నా విజయానికి బాటలు వేసిన నా తల్లి, నా రోల్ మోడల్" అంటూ తల్లి నీతాకు ధన్యవాదాలు తెలిపింది ఇషా. ‘అమ్మా, నీకు ధన్యవాదాలు, నీ నడకే నాకు పరుగులు నేర్పింది. ఇది నిజంగా నీ వల్లనే’.. అంటూ ప్రసంగించింది. ఈ ఘనత అంతా అమ్మకే దక్కుతుంది. అందుకే ఈ అవార్డు అమ్మకు అంకితం’’ అన్నారు. అంతేకాదు "ఈ అవార్డును నా కుమార్తె ఆదియాకు కూడా అంకితమిస్తున్నా..నా బిడ్డ ప్రతీ రోజూ నన్నెంతో ప్రోత్సహిస్తోంది’’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. రిలయన్స్ రిటైల్ డిజిటల్ ఉనికిని మెరుగుపరచడంలో ఇషా కీలక పాత్ర పోషించింది ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అజియో, ఆన్లైన్ బ్యూటీ మార్కెట్‌ప్లేస్ తీరా లాంటివాటితో వ్యాపారం రంగంలో దూసుకు పోతోంది. వ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను పెళ్లాడిని ఇషాకు కవల పిల్లలు. ఇవీ చదవండి: హనీమూన్ డెస్టినేషన్ : పడవింట్లో విహారం!కలల పంటకోసం ఎదురు చూపులు : అందమైన మెటర్నిటీ షూట్ -
గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా.. రతన్ టాటాకు అంబానీ ఫ్యామిలీ నివాళి
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక దీపావళి విందులో 'రతన్ టాటా'కు ముఖేష్ అంబానీ ఫ్యామిలీ, వేలాది మంది ఉద్యోగులు నివాళులర్పించారు. నీతా అంబానీ 'గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా' అని రతన్ టాటాను కొనియాడారు. దూరదృష్టి కలిగిన పారిశ్రామికవేత్త, పరోపకారి, ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తి అని అన్నారు.దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా.. మా మామయ్య ధీరూభాయ్ అంబానీకి, నా భర్త ముకేశ్ అంబానీకి, మా కుటుంబానికి మంచి స్నేహితులు. ఆకాష్ అంబానీకి మార్గదర్శి అని నీతా అంబానీ అన్నారు. మహనీయుడు రతన్ టాటాకు నివాళిగా అందరూ మౌనం పాటించాలని పేర్కొన్నారు. ఈ సమయంలో ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురైనట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. -
మనవడితో దాండియా స్టెప్పులేసిన నీతా అంబానీ, ఆ స్టార్ కిడ్ కూడా!
రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ నీతా అంబానీ దసరా వేడుకల్లో సందడి చేశారు. కుటుంబ సభ్యులతో పాటు, మనవడు పృథ్వీ, చదువుకుంటున్ నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ (NMAJS)లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అతని క్లాస్‌మేట్స్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిలో బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా , సైఫ్ కుమారుడు జెహ్ అలీ ఖాన్ కూడా ఉన్నారు. దాదీ, మనవళ్ళ డ్యాన్స్ నెట్టింట సందడి చేస్తోంది.అంబానీ కుటుంబం ప్రతీ పండుగను వైభవంగా జరుపుకుంటుంది. తాజాగా నవరాత్రి సంబరాల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ భార్య, కొత్త కోడలు రాధికా మర్చంట్‌తో ఉత్సాహంగా పాల్గొన్నారు. నీతా కుమార్తె ఇషా అంబానీ కుమారుడు పృథ్వీ స్కూల్లో నిర్వహించిన వేడుకలో చిన్న పిల్లలతో దాండియా స్టెప్పులు వేశారు. మనవడు పృథ్వీరాజ్ అంబానీ కరీనా కపూర్ కొడుకు జెహ్, ఇతర పిల్లలతో కలిసి సరదాగా గడిపారు. పింక్ టోన్ స్ట్రాపీ హీల్స్,అద్భుతమైన పింక్ కలర్ సల్వార్ సెట్‌ను ధరించి నీతా ఆనందంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అలాగే తల్లి పూనమ్ దలాల్‌తో కలిసి గర్భా ఆచారం, అమ్మవారికి హారతి ఇచ్చి దసరా వేడుకను జరుపుకున్నారు. నీతా అంబానీ తన మనవడు, పృథ్వీ ,అతని క్లాస్మేట్లను స్టోరీ సెషన్‌తో ఆశ్చర్యపరిచారు. పెప్పా పిగ్ పుస్తకంనుంచి ఒక కథను వివరించి పిల్లలతో ఉత్సాహంగా కనిపించడం పిల్లలు శ్రద్ధగా వినడం, లంచ్‌లో వారితో ముచ్చటించడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలను స్కూలు యాజమాన్యం తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. -
ఐకానిక్ ఇషా అంబానీ, స్టైలిష్ లుక్స్ (ఫోటోలు)
-
అంబానీ నివాసంలో తళుక్కుమన్న పతక విజేతలు.. వాళ్లిద్దరు హైలైట్(ఫొటోలు)
-
ఒలింపిక్ పతక విజేతలతో నీతా అంబానీ: వైరల్ వీడియో
ముంబైలోని అంబానీ నివాసం యాంటిలియాలో ఆదివారం రాత్రి రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ 'యునైటెడ్ ఇన్ ట్రయంఫ్' ఈవెంట్లో భారతదేశ ఒలింపిక్స్, పారాలింపిక్స్ పోటీదారులకు ఆతిథ్యం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ ఈవెంట్లో.. పారిస్ ఒలింపిక్స్ 2024 పతక విజేతలు మను భాకర్, నీరజ్ చోప్రాతో పాటు పారిస్ పారాలింపిక్స్ 2024 పతక విజేతలు నవదీప్ సింగ్, మోనా అగర్వాల్‌లతో నీతా అంబానీ ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన క్రీడాకారులు సత్కరించారు.Mrs Nita M Ambani, Founder and Chairperson of Reliance Foundation, welcomed the athletes to United in Triumph: an unprecedented evening that united India's Olympians and Paralympians and rejoiced and cherished their success. Speaking on the occasion, Mrs Ambani said, "Today is a… pic.twitter.com/7wxsO9TE0c— Reliance Industries Limited (@RIL_Updates) September 30, 2024సుమిత్తో పాటు నీరజ్ చోప్రా, మను భాకర్, మురళీకాంత్ పెట్కర్, దేవేంద్ర ఝఝరియా సహా భారతదేశ ఒలింపిక్ & పారాలింపిక్ ఛాంపియన్లు అంటిల్, నితేష్ కుమార్, హర్విందర్ సింగ్, ధరంబీర్ నైన్, నవదీప్ సింగ్, ప్రవీణ్ కుమార్, దీపా మాలిక్, సానియా మీర్జా, కర్ణం మల్లీశ్వరి, పుల్లెల గోపీచంద్, హర్భజన్ సింగ్ వంటి క్రీడా దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారత మాజీ దిగ్గజ గోల్‌కీపర్ పిఆర్ శ్రీజేష్ తన కుటుంబంతో సహా ఆంటిలియాకు చేరుకున్నారు. పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన పారా షట్లర్లు సుహాస్ యతిరాజ్, నితేష్ కుమార్ కూడా ఈ ఈవెంట్‌ను హాజరయ్యారు.ఇదీ చదవండి: ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ ఈవెంట్లో నీతా అంబానీ మాట్లాడుతూ.. భారతదేశం మొత్తం మన అథ్లెట్లను చూసి గర్విస్తోంది. మొదటిసారి భారత పారిస్ ఒలింపియన్లు, పారా ఒలింపియన్లు ఒకే వేదికపైకి చేరుతున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ తరపున, 'యునైటెడ్ వుయ్ ట్రయంఫ్' ఒక ఉద్యమంగా మారాలని కోరుకుంటున్నానని అన్నారు.Together as one, celebrating unity ✨✨ India’s star Paralympians & Olympians arrive at Reliance Foundation’s United In Triumph awards to celebrate spirit of Olympism together🤝🤝 #RFsports #UnitedinTriumph #Paris2024 #Paralympics2024 pic.twitter.com/7xVfxJ7lhV— RF Youth Sports (@RFYouthSports) September 29, 2024 -
వయాకామ్18 బోర్డులో అంబానీలు
న్యూఢిల్లీ: గ్లోబల్ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ దేశీ బిజినెస్‌తో విలీనం నేపథ్యంలో తాజాగా ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు వయాకామ్18 బోర్డులో చేరారు. ముకేశ్ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్శన్ నీతా అంబానీ, కుమారుడు ఆకాశ్ అంబానీ బోర్డు సభ్యులుగా చేరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధి ట్రీ సిస్టమ్స్‌కు చెందిన మీడియా, ఎంటర్టైన్మెంట్ బిజినెస్‌లకు హోల్డింగ్ కంపెనీగా వయాకామ్18 వ్యవహరిస్తోంది. స్టార్ ఇండియా విలీనానికి సీసీఐ, ఎన్సీఎల్టీ అనుమతులు లభించడంతో వాల్ట్ డిస్నీ, వయాకామ్18 బోర్డులో సర్దుబాట్లకు తెరలేచినట్లు తెలుస్తోంది. బోధి ట్రీ సిస్టమ్స్ సహవ్యవస్థాపకుడు జేమ్స్ మర్డోక్, కీలక ఇన్వెస్టర్ మహమ్మద్ అహ్మద్ అల్‌హర్డన్, ఆర్ఐఎల్ మీడియా, కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే, అనాగ్రామ్ పార్ట్నర్స్ పార్ట్నర్ శువ మండల్ సైతం బోర్డులో చేరనున్నారు. స్టార్ ఇండియాతో వయాకామ్18 మీడియా, డిజిటల్ 18 మీడియా విలీనానికి గత నెల(ఆగస్ట్) 30న ఎన్సీఎల్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
మల్టీ కలర్ చీరలో నీతా అంబానీ స్పెషల్ అండ్ సింపుల్ లుక్
రిలయన్స్ పౌండేషన్ అధ్యక్షురాలు నీతా అంబానీ ఏ చీర కట్టినా, ఏనగ పెట్టినా అద్భుతమే. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫ్యాషన్, డిజైనర్ దుస్తులు అందర్నీ ఆకర్షిస్తుంటాయి. చేనేత, ,పట్టుచీరలు, డైమండ్ నగలు, ముత్యాల హారాలతో తనదైన ఫ్యాషన్ సెన్స్‌తో ఫ్యాషన్ ఐకాన్‌లా నిలుస్తుంటారామె. ఇటీవల అంబానీ కుటుంబం గణేష్ చతుర్థిని ఉత్సాహంగా నిర్వహించింది. ఈ సందర్బంగా నీతా అంబానీ 'బంధేజ్' చీరలో ప్రత్యేకంగా కనిపించారు.డిజైనర్ జిగ్యా పటేల్ డిజైన్ చేసిన వంకాయ రంగు, గులాబీ రంగుల మల్టీకలర్ బంధేజ్ చీరలో నీతా అంబానీ అందంగా కనిపించారు. ఇక ఆమె వేసుకున్న గుజరాతీ ఎంబ్రాయిడరీతో ఎరుపు రంగు బ్లౌజ్ ప్రత్యేకత ఏంటంటే స్లీవ్‌లపై గణపతి బప్పా డిజైన్ ఉండటం. ఇంకా ఎనిమిది వరుసల ముత్యాల హారం, డైమండ్ చెవిపోగులు, ముత్యాలు పొదిగిన గాజులు, చేతి రింగ్, ఇంకా సింపుల్‌గా పువ్వులతో ముడితో ఎత్నిక్ లుక్‌తో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశారు. ఇటీవల ఎన్ఎంఈసీసీలో జరిగిన ఈవెంట్లో నీతా అంబానీ పట్టు 'పటోలా' చీరలో మెరిసారు. స్టైలిష్ రెడ్-హ్యూడ్ సిల్క్ పటోలాకు మ్యాచింగ్‌గా రాధా-కృష్ణ-ప్రేరేపిత గ్రాఫిక్ డిజైన్ వర్క్ బ్లౌజ్ ధరించిన సంగతి తెలిసిందే.కాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ , రాధిక పెళ్లి తరువాత వచ్చిన తొలి వినాయక చవితి కావడంతో అంబానీ కుటుంబం ఈ గణేష్ చతుర్థి వేడుకలనుఘనంగా నిర్వహించారు. బాలీవుడ్ తారలు, క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులు హాజరై గణపతి బప్పా ఆశీస్సులు తీసుకున్నారు. -
దీప్‌వీర్ బిడ్డను చూసేందుకు తరలివెళ్లిన అంబానీ
బాలీవుడ్ నటులు రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ దంపతులకు ఇటీవల (సెప్టెంబర్ 8)న ఆడబిడ్డ పుట్టింది. ఈ నేపథ్యంలో పలువురుబాలీవుడ్ పెద్దలు, ఇతర సెలబ్రిటీలకు ఈజంటకు అభినందనలు అందించారు. మరికొంతమంది స్వయంగా హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి వెళ్లి రణ్వీర్, దీపిక తొలి సంతానాన్ని ఆశీర్వదించారు. అలాగే దీపికా, రణ్వీర్ దంపతులతో సన్నిహిత సంబంధాలున్న, వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భారీ భద్రత మధ్య దక్షిణ ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌కు వెళ్లారు. రణ్వీర్, దీపికకు అభినందనలు తెలిపారు. వారి ముద్దుల తనయను ఆశీర్వదించారు.Mukesh Ambani made a late night visit to H.N. Reliance Hospital to meet Deepika, Ranveer and their baby.#DeepikaPadukone #RanveerSingh pic.twitter.com/4oLdspp7PN— Deepika Padukone Fanpage (@DeepikaAccess) September 10, 2024 కాగా బిలియనీర్ ముఖేష్ అంబానీ బాలీవుడ్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారు. అంబానీ ఇంట ఏ పండుగ, ఏ వేడుక జరిగిన బాలీవుడ్ పెద్దలంతా అక్కడ హాజరు కావాల్సిందే. అనంత్, రాధిక ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలు, మొన్న అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ అతిరథ మహారథులంతా తరలి వచ్చారు. అయితే గర్భంతో ఉన్న నేపథ్యంలో దీపికా రాలేకపోయినప్పటికీ, రణ్వీర్ అనంత్ , రాధిక వివాహ వేడుకల్లో ప్రత్యేక డ్యాన్స్‌తో అలరించారు. -
గణేష్ నిమజ్జనం: వేడుకగా ఆడిపాడిన అంబానీ కుటుంబం
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట విశేష పూజలందుకున్న విఘ్ననాయకుడు నిమజ్జనం కోసం తరలి వెళ్లాడు. గణపతి బప్పా మోరియా అంటూ అంబానీ అధికారిక నివాసం ఆంటిలియాలో పూజలందుకున్న గణపతిని అంబానీ కుటుంబం సాదరంగా సాగ నంపింది. పోయిరావయ్య బొజ్జ గణపతి, మళ్లొచ్చే ఏడాది మళ్లీ రావయ్యా అంటూ ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో లంబోదరుడికి మోకరిల్లి, హారతిచ్చి, జై బోలో గణేష్ మహారాజ్‌కీ అంటూ జేజేలు పలుకుతూ మేళ తాళాలతో ఊరేగింపుగా యాంటిలియా చా రాజాను నిమజ్జనానికి తోడ్కొని పోయారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla)నిమజ్జనానికి ముందు నిర్వహించిన పూజాకార్యక్రమంలో ముఖేష్ అంబానీ తల్లి కోకిలా బెన్, భార్య నీతా అంబానీ హారతి నివ్వగా, కొత్త దంపతులు అనంత్, రాధికతోపాటు, ఆకాశ్ అంబానీ,శ్లోకా అంబానీ,ఇషా, పిరామిల్ ఆనంద్ దంపతులు, అంబానీ మనవలు ,మనవరాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.కాగా గణేష్ చతుర్ధి అంటే అంబానీ ఇంట పెద్ద సందడే ఉంటుంది. అందులోనూ అంబానీ, నీతాల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం తరువాత వచ్చిన తొలి వినాయక చవితి కావడంతో మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే 15కోట్ల రూపాయల విలువైన స్వర్ణకిరీటాన్ని ముంబైలోని లాల్బాగ్యా గణపతికి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా అంబానీ ఇంట వినాయక చవితి వేడుకల్లో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, రేఖ, సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, బోనీ కపూర్, సారా అలీ ఖాన్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, అనన్య పాండే, భూమి పెడ్నేకర్ , సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. -
పారాలింపిక్స్ పతక విజేతలకు నీతా అంబానీ శుభాకాంక్షలు
ప్యారిస్ పారాలింపిక్స్-2024లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు రిలయన్స్ ఫౌండేషన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సభ్యురాలు నీతా అంబానీ శుభాకాంక్షలు తెలిపారు. మువ్వన్నెల జెండాను పారా విశ్వక్రీడ వేదికపై రెపరెపలాడించినందుకు అభినందించారు. ఈ మేరకు.. ‘‘ప్యారిస్ పారాలింపిక్స్ క్రీడల్లో భారత అథ్లెట్లు దేశాన్ని గర్వపడేలా చేస్తూ ముందుకు సాగుతున్నారు.నిత్య శివన్, సుమిత్ ఆంటిల్, శీతల్ దేవి, రాకేశ్ కుమార్, సుహాస్ యతిరాజ్, తులసీమతి మురుగేశన్, మనీశా రామదాస్, నితేశ్ కుమార్, యోగేశ్ కతూనియా, నిషద్ కుమార్, ప్రీతిపాల్, రుబీనా ఫ్రాన్సిస్.. అద్బుతమైన ప్రతిభ చూపి పతకాలు సాధించారు. మీ ఈ చిరస్మరణీయ విజయం, అసాధారణ ప్రయాణం అందరికీ ఆదర్శప్రాయం.మీ ప్రదర్శనతో యావత్ భారతావని గుండెను ఉప్పొంగేలా చేశారు. సంకల్పానికి ఉన్న శక్తిని మరోసారి మాకు చూపించారు. మీరు ఇలాగే కోట్లాదిమందికి స్ఫూర్తిదాతలుగా కొనసాగుతూ.. మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి’’ అని నీతా అంబానీ పతక విజేతలకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ప్యారిస్‌లో మిగిలిన ఈవెంట్లలో పాల్గొనబోయే భారత అథ్లెట్లు కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు.కాగా పారాలింపిక్స్ చరిత్రలోనే తొలిసారిగా భారత్ టోక్యోలో అత్యధికంగా 19 పతకాలు సాధించింది. ప్యారిస్‌లో ఇక ఇప్పటికే 15 పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇందులో మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్యాలు ఉన్నాయి. షూటర్ అవని లేఖరా, బ్యాడ్మింటన్ ప్లేయర్ నితేశ్ కుమార్, జావెలిన్ త్రోయర్ సుమిత్ ఆంటిల్ పసిడి పతకాలతో చరిత్ర సృష్టించారు. వీరిని కూడా నీతా ప్రశంసించారు. ఇక 25 మెడల్స్ సాధించాలన్న పట్టుదలతో ప్యారిస్ బరిలోకి దిగిన మన అథ్లెట్లు లక్ష్యం దిశగా దూసుకుపోతున్నారు.