నీతా అంబానీ కొనుగోలు చేసిన లక్క బుటీ బనారసీ చీరలు! ప్రత్యేకత ఏంటంటే. | Nita Ambani Purchases Lakkha Buti Banarasi Saree | Sakshi
Sakshi News home page

నీతా అంబానీ కొనుగోలు చేసిన లక్క బుటీ బనారసీ చీరలు! ప్రత్యేకత ఏంటంటే.

Published Fri, Jun 28 2024 12:59 PM | Last Updated on Fri, Jun 28 2024 3:10 PM

Nita Ambani Purchases Lakkha Buti Banarasi Saree

రిలయన్స్‌ దిగ్గజం ముఖేశ్‌ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ రాధికాల వివాహం వచ్చే నెల జూలై 12న ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీతా అంబానీ మొదటి ఆహ్వాన లేఖను కాశీ విశ్వేశ్వరునికి అందించి, అక్కడే కొద్దిసేపు గడిపారు. అక్కడ తనకు ఇష్టమైన వారణాసి చాట్‌ ఆస్వాదించి తర్వాత అక్కడ పేరుగాంచిన లక్క బుటీ బనారసీ చీరలను భారీగా కొనుగోలు చేశారు. వారణాసి ఈ చీరలకు పెట్టింది పేరు కూడా. అక్కడ చేనేత కార్మకుల చేతి నుంచి జాలువారే ఈ చీరల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా..!

నీతా రామ్‌నగర్‌ జిల్లాలోని విజయ్‌ మౌర్య ఇంటిని సందర్శించి ..అక్కడ మరీ కొందరూ బనారసీ కళాకారులను తన హోటల్‌కి ఆహ్వానించారు. అంతేగాదు తమ వద్ద పెద్ద సంఖ్యలో చీరలు కొనుగోలు చేసినట్లు వస్త్రాల్లో పీహెచ్‌డీ చేసిన బనారసీ చీరల తయారుదారు అంజికా కుష్వాహా వెల్లడించారు. ఈ చీర ప్రత్యేకత ఏంటంటే..

లక్క బుటీ బనారసీ చీరల చరిత్ర అనేక శతాబ్దాల నాటిది. ఇది వారణాసి సాంస్కృతిక వారసత్వంలో లోతుగా ముడిపడి ఉన్న చేనేత చీర. ఇక్కడ ఉపయోగించే నేత సాంకేతికత తరతరాల నైపుణ్యం కలిగిన కళాకారుల ద్వారా అందిపుచ్చుకున్న కళా నైపుణ్యం. ఈ చీరలు సాంప్రదాయకంగా స్వచ్ఛమైన పట్టు దారాలను ఉపయోగించి చేతిలో నేసినవి. 

దీనిపైన ఉండే డిజైన్‌లు జరీతో రూపొందించినవి. ఈ చీరలోని లక్కబుటి అనే పదం అర్థం ఏంటంటే..చిన్నవైన సున్నితమైన అంశాలను పొందుపరిచేలా ఈ చీరను తీర్చిదిద్దుతారు. బట్టలో చిక్కగా అల్లినవి, మొఘల్‌ డిజైన్‌లతో ఆకృతులు రూపొందిస్తారు. ఈ డిజైన్లు కంటికి చాలా ఆహ్లాదకరంగా ఉండే క్లిష్టమైన పూల నమూనా, ఆకులను కలిగి ఉంటాయి. కాలక్రమేణ బనారసీ చీరలు అభివృద్ధి చెందాయి. ఇప్పుడవి వివిధ డిజైన్ అంశాలను కలిగి ఉన్నాయి. ఎక్కువగా బ్రోకేడ్‌ వర్క్‌, ఎబ్రాయిడరీ వంటి రకరకాల స్టైల్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

 

(చదవండి: నీతా అంబానీ మనసు దోచుకున్న చాట్...వైరల్‌వీడియో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement