Banarasi-Sarees
-
నీతా అంబానీ కొనుగోలు చేసిన లక్క బుటీ బనారసీ చీరలు! ప్రత్యేకత ఏంటంటే.
రిలయన్స్ దిగ్గజం ముఖేశ్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ రాధికాల వివాహం వచ్చే నెల జూలై 12న ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీతా అంబానీ మొదటి ఆహ్వాన లేఖను కాశీ విశ్వేశ్వరునికి అందించి, అక్కడే కొద్దిసేపు గడిపారు. అక్కడ తనకు ఇష్టమైన వారణాసి చాట్ ఆస్వాదించి తర్వాత అక్కడ పేరుగాంచిన లక్క బుటీ బనారసీ చీరలను భారీగా కొనుగోలు చేశారు. వారణాసి ఈ చీరలకు పెట్టింది పేరు కూడా. అక్కడ చేనేత కార్మకుల చేతి నుంచి జాలువారే ఈ చీరల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా..!నీతా రామ్‌నగర్ జిల్లాలోని విజయ్ మౌర్య ఇంటిని సందర్శించి ..అక్కడ మరీ కొందరూ బనారసీ కళాకారులను తన హోటల్‌కి ఆహ్వానించారు. అంతేగాదు తమ వద్ద పెద్ద సంఖ్యలో చీరలు కొనుగోలు చేసినట్లు వస్త్రాల్లో పీహెచ్డీ చేసిన బనారసీ చీరల తయారుదారు అంజికా కుష్వాహా వెల్లడించారు. ఈ చీర ప్రత్యేకత ఏంటంటే..లక్క బుటీ బనారసీ చీరల చరిత్ర అనేక శతాబ్దాల నాటిది. ఇది వారణాసి సాంస్కృతిక వారసత్వంలో లోతుగా ముడిపడి ఉన్న చేనేత చీర. ఇక్కడ ఉపయోగించే నేత సాంకేతికత తరతరాల నైపుణ్యం కలిగిన కళాకారుల ద్వారా అందిపుచ్చుకున్న కళా నైపుణ్యం. ఈ చీరలు సాంప్రదాయకంగా స్వచ్ఛమైన పట్టు దారాలను ఉపయోగించి చేతిలో నేసినవి. దీనిపైన ఉండే డిజైన్లు జరీతో రూపొందించినవి. ఈ చీరలోని లక్కబుటి అనే పదం అర్థం ఏంటంటే..చిన్నవైన సున్నితమైన అంశాలను పొందుపరిచేలా ఈ చీరను తీర్చిదిద్దుతారు. బట్టలో చిక్కగా అల్లినవి, మొఘల్ డిజైన్లతో ఆకృతులు రూపొందిస్తారు. ఈ డిజైన్లు కంటికి చాలా ఆహ్లాదకరంగా ఉండే క్లిష్టమైన పూల నమూనా, ఆకులను కలిగి ఉంటాయి. కాలక్రమేణ బనారసీ చీరలు అభివృద్ధి చెందాయి. ఇప్పుడవి వివిధ డిజైన్ అంశాలను కలిగి ఉన్నాయి. ఎక్కువగా బ్రోకేడ్ వర్క్, ఎబ్రాయిడరీ వంటి రకరకాల స్టైల్స్‌లో అందుబాటులో ఉన్నాయి.अनंत की शादी से पहले नीता अंबानी ने की बनारसी साड़ियों की शॉपिंग◆ नीता अंबानी ने कई साड़ियां पसंद कीं#NitaAmbani #AnantAmbani #ViralVideo pic.twitter.com/rSHYHSWmQI— News24 (@news24tvchannel) June 27, 2024 (చదవండి: నీతా అంబానీ మనసు దోచుకున్న చాట్...వైరల్వీడియో) -
పెళ్లి వేడుకల్లో సోనాక్షి డ్రెస్సింగ్ స్టైల్ వేరేలెవెల్!..పూజకు అందరిలా..!
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చకుంది. పైగా ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది. ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్న నటుడు జహీర్ ఇక్బాల్‌ని వివాహం చేసుకుంది. అందిరిలా హంగు ఆర్భాటంగా కాకుండా చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకుంది. పెళ్లి కూతురు ముస్తాబులో సోనాక్షి ఎలా ఉంటుందా అని అభిమానులంతా ఎదురు చూడగా తన స్టైల్ వేరేలెవెల్ అన్నట్లుగా ఢిఫరెంట్ లుక్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) పెళ్లి తంతుకి ముందు జరిగే పూజా కార్యక్రమం, సింధూర ధారణ, రిసెప్టన్ వరకు ప్రతి ఘట్టంలో అంచనాలకు అందని విధంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఉంది. ఈ గ్రాండ్ వివాహ వేడుకలో సోనాక్షి ఎలాంటి చీరలు, డ్రెస్‌లు ధరించిందంటే..గత కొన్ని రోజులుగా వాళ్ల పెళ్లికి సంబంధించిన పుకార్లకు చెక్‌పెట్టి మరీ ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లికి ముందు సోనాక్షి సిన్హా కుటుంబం తమ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ వేడుక అనంతరం నీలిరంగు డ్రెస్సులో కనిపించింది. ఆమె ధరించిన నీలి రంగు డ్రెస్సు చాలా అందంగా ఉంది. పెళ్లి అనగానే కేవలం లెహెంగాలు, చీరలు మాత్రమే కాదు, ఇలా డ్రెస్సులో కూడా అందంగా ఉండొచ్చని సోనాక్షి నిరుపించింది. అలాగే పెళ్లి సమయంలో ఐవరీ చీరలో అద్భుతంగా కనిపించింది. వివాహ వేడుకకు లేటెస్ట్ డిజైన్‌తో చీరను ఎంచుకోవడానికి బదులుగా తన తల్లి పూనమ్ సిన్హా పెళ్లి చీరను ఎంచుకుంది. అలాగే శిల్పాశెట్టి రెస్టారెంట్లో జరిగిన రిసెప్టన్లో సంప్రదాయ ఆభరణాలతో అద్భుతమైన బనారసీ చీరలో గ్లామరస్‌గా కనిపించింది. ఇక ఆమె భర్త ఇక్బాల్ బార్యకు అనుబంధంగా తెల్లటి కుర్తా ట్వీట్ జాకెట్, ప్యాంటుని ధరించారు. "సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున మనం కలుసుకున్నాం. ఎన్నో సవాళ్లు, విజయాల తర్వాత తల్లిదండ్రలు, దేవుడి ఆశీర్వాదంతో భార్యభర్తలయ్యాం అంటూ భావోద్వేగంగా ఇన్‌స్టాగ్రాంలో పోస్టు పెట్టింది సోనాక్షి సిన్హా. View this post on Instagram A post shared by Zoom TV (@zoomtv) (చదవండి: మన దేశంలో ఈ నగరాల్లో ఎట్టిపరిస్థితుల్లో మాంసాహారం దొరకదట..!) -
ఇషా అంబానీ దుస్తుల డిజైనింగ్‌కి అంత టైం పడుతుందా!
ఇషా అంబానీ శుక్రవారం సాయంత్రం అంబానీ నివాసంలో బల్గారీ సీఈఓ జీన్ క్రిస్టోఫ్ బాబిన్తో కలిసి 'రోమన్ హోలీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు ముంబైకి చెందిన ప్రముఖ సెలబ్రెటీలంతా విచ్చేశారు. ఈ వేడుకల్లో ఇషా లుక్ అందర్నీ కట్టిపడేసింది. ఈ రోమన్ హోలీ వేడుకల కోసం అని ఆమె దుస్తులను రూపొందించడానికి చాలా సమయం తీసుకుందట. దీన్నీ ప్రముఖ డిజైనర్ ఆశ్విన్ త్యాగరాజన్ రూపొందించారు. ఇది చక్కటి ఎండ్రాయిడరీ వర్క్‌తో కూడిన లాంగ్ లెంగ్త్ బనారసీ గౌను అని త్యాగరాజన్ అన్నారు. దీన్ని రూపొందించడానికి తమకు ఏకంగా వంద గంటలు పైనే పట్టిందన్నారు. కెనడియన్ నటి మైత్రేయి రామకృష్ణ, టాలీవుడ్ నటి తాప్సీ పన్ను, ఐశ్వర్య రాజేష్ వంటి భారతీయ తారలు త్యాగరాజన్ రూపొందించే ఈ బనారస్ డ్రస్లంటే బహు ప్రీతి. ఇక త్యాగరాజన్ ప్రత్యేకత పర్యావరణ హితంగా దుస్తులను రూపొందించడం. పైగా అవి మన అమ్మలు, అమ్మమ్మల వారసత్వ చీరలు లేదా లెహంగాలతో కొత్తదనం సృష్టించడంలో మంచి నైపుణ్యం గల డిజైనర్ త్యాగరాజన్. చాలామంది సెలబ్రెటీలు మన పూర్వ సంప్రదాయల్ని అనుకరించేందుకు ఇష్టపడుతుండటంలో త్యాగరాజన్ డిజైన్వేర్లకు ఇంతల మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఆమె దుస్తులకు సంబంధించిన నైలాన్ని పూర్తిగా సముద్రాలు, ఫిషింగ్ నెట్లు, వస్త్ర ఫైబర్ల వ్యర్థాలను నుంచి ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసి శుద్ది చేసి వాటితో తయారైన నైలాన్‌తో తయారు చేస్తుంది. అంటే ఇక్కడ డిపాలిమరైజేషన్ , శుద్ధికరణతో వచ్చే కొత్త పాలిమర్లను థ్రైడ్లు మార్చడం ద్వారా ఈ కొత్త నైలాన్ని సృష్టిస్తారని చెప్పొచ్చు. అందువల్లే త్యాగరాజన్ డిజైన్వేర్లకు పర్యావరణ అనూకూలమైన ఫ్యాషన్ బ్రాండ్‌గా మంచి పేరొచ్చింది. నిజంగానే బ్రాండ్‌కి తగ్గట్టే త్యాగరాజన్ రూపొందించే డ్రస్‌లు సంప్రదాయంగా ఓ పండుగ వాతవరణం తలిపించే లుక్‌ని, కొత్త ఫ్యాషన్‌ని అందిస్తాయి. (చదవండి: వందేళ్ల క్రితం కరెంట్ లేకుండానే పనిచేసిన ఫ్రిడ్జ్!) -
పెళ్లి వేడుకలు.. ఘనమైన అలంకారాలతో.. ప్రాచీన కళకు కొత్త హంగులు
సంప్రదాయ వేడుకల్లో తెలుగింటి వేషధారణకే అగ్రతాంబూలం ఉంటుంది. అయితే, రాచకళ తీసుకు రావాలన్నా, మరిన్ని హంగులు అమరాలన్నా ప్రాచీనకాలం నాటి డిజైన్స్‌కే పెద్ద పీట వేస్తున్నారు నేటి డిజైనర్లు. ‘నవతరం కోరుకుంటున్న హంగులను కూడా సంప్రదాయ డ్రెస్సులకు తీసుకువస్తున్నాం’ అని చెబుతున్నారు వెడ్డింగ్ డ్రెస్ డిజైనర్ భార్గవి అమిరినేని. కాబోయే పెళ్లికూతుళ్లు కోరుకుంటున్న డ్రెస్ డిజైన్స్ గురించి ఈ విధంగా వివరిస్తున్నారు.. ‘కలంకారీ ప్రింట్స్, బెనారస్, కంచి పట్టులను సంప్రదాయ డిజైన్స్‌కు వాడుతుంటారు. అయితే, నవతరం మాత్రం వీటితోనే ఆధునికపు హంగులను కోరుకుంటున్నారు. ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్‌తోనే వెస్ట్రన్ కట్ కోరుకుంటున్నారు. నెక్, హ్యాండ్ డిజైన్స్ విషయంలోనే కాదు తమ ‘ప్రేమకథ’కు కొత్త భాష్యం చెప్పేలా ఉండాలని పెళ్లి కూతుళ్లు కోరుకుంటున్నారు. అందుకే వివాహ వేడుకలకు మరింత కొత్త హంగులు వచ్చి చేరుతున్నాయి. రంగుల కాంబినేషన్లు మాత్రం వేడుకను బట్టి మారిపోతున్నాయి. వీటిలో పేస్టల్ నుంచి గాఢమైన రంగుల వరకు ఉంటున్నాయి. డబుల్ లేయర్ దుపట్టాలు, లేయర్డ్ స్కర్ట్, టాప్స్.. కూడా వీటిలో ఎక్కువ ఉంటున్నాయి’ అని వివరించారు. వివాహ వేడుకలకు సిద్ధమవ్వాలంటే ఘనమైన అలంకారాలతో గొప్పగా సింగారించాలనుకుంటారు. అందుకు తగినట్టే నేటి వేడుకలకు తరతరాలుగా వస్తున్న ప్రాచీన కళకు కొత్త హంగులను అద్దుతున్నారు. మహారాణి దర్పం పెళ్లి కూతురు వేషధారణలో కంచి పట్టుచీర తప్పక ఉంటుంది. దీనికి కాంబినేషన్ బ్లౌజ్‌తోపాటు కుడివైపున వేసుకునే దుపట్టా కూడా ఓ హంగుగా అమరింది. దుపట్టాను బ్లౌజ్‌కు సరైన కాంబినేషన్ సెట్ అయ్యేలా మెజెంటా కలర్‌ను ఎంచుకొని, గ్రాండ్‌గా మగ్గం వర్క్‌తో మెరిపించడంతో లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది. కాస్ట్యూమ్తోపాటు ఆభరణాలు కూడా పాతకాలం నాటివి ఎంపిక చేయడంతో రాయల్ లుక్ వచ్చేసింది. ఈ గెటప్‌కి వడ్డాణం లేదా వెయిస్ట్ బెల్ట్ యాడ్ చేసుకోవచ్చు. దుపట్టాను అవసరం అనుకుంటే వాడచ్చు. లేదంటే, ఎప్పటికీ గుర్తుగా కూడా ఉంచుకోవచ్చు. ఎంబ్రాయిడరీ బ్రోచ్లు కూడా అలంకరణలో వచ్చి చేరుతున్నాయి. కాన్సెప్ట్ బ్లౌజ్ పెళ్లికూతురు డ్రెస్ అనగానే అందరికన్నా ప్రత్యేకంగా కనిపించాలనే తాపత్రయం ఉంటుంది. దీంట్లో భాగంగా పెళ్లికూతురు ధరించే బ్లౌజ్పైన అమ్మాయికి అబ్బాయి తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్టుగా, అలాగే వారి పేర్లూ వచ్చేలా డిజైన్ చేయడంతో గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఆభరణాల్లో ఉండే పచ్చలు, కెంపులు బ్లౌజ్ డిజైన్లలోనూ వాడుతున్నారు. ఈ బీడ్స్ ధరించే ఆభరణాలకు మ్యాచ్ అయ్యేలా చూసుకుంటున్నారు. పెద్దంచు మెరుపు సంప్రదాయ లుక్ ఎప్పుడూ అందానికి సిసలైన నిర్వచనంలా ఉంటుంది. పెద్ద అంచు లెహంగా మీదకు ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్, దుపట్టా జత చేస్తే చాలు వేడుకలో ఎక్కడ ఉన్నా అందంగా కనిపిస్తారు. అయితే, హాఫ్ శారీ అనగానే గతంలో దుపట్టాలను ఓణీలా చుట్టేసేవారు. ఇప్పుడు ఒకే వైపున వేసుకోవడం కూడా ఫ్యాషన్‌లో ఉంది. డిజైన్స్లోనే కాదు అలంకారంలోనూ వచ్చిన మార్పు మరింత మెరుపునిస్తుంది. కలంకారికి మిర్రర్ ప్రాచీనకాలం నుంచి వచ్చిన మనవైన కళల్లో కలంకారీ ఒకటి. ఇప్పుడు ఈ ఆర్ట్‌పీస్ మరింత ఘనంగా సందడి చేస్తోంది. కలంకారీ క్రాప్టాప్కు మిర్రర్‌తో హ్యాండ్స్, నెక్‌లైన్‌ను డిజైన్ చేయడం ఈ డ్రెస్ స్పెషల్. బ్రొకేడ్ లెహెంగా మీదకు ఈ కలంకారీ బ్లౌజ్ జత చేయడంతో మరింత గొప్పగా అమరింది. – నిర్మలారెడ్డి -
మిషెల్ ఒబామాకు మోదీ ఆశ్చర్య కానుక!
న్యూఢిల్లీ: తమ దేశ పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఊహించని కానుక ఇవ్వనున్నారు. అమోరికా ప్రథమ మహిళకు 100 బనారస్ చీరలు, బనారస్ సిల్క్ మెటీరియల్ కు ఆమెకు బహుమతిగా అందించనున్నారు. ఈ చీరల ఎంపిక, అందంగా ప్యాక్ చేసి అందించే బాధ్యతను వారణాసి వస్త్ర ఉద్యోగ సంఘంకు అప్పగించారు. ఈమేరకు జౌళీ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. మోదీ తన సొంత నియోజకవర్గం నుంచి చీరలు తెప్పించి మిషెల్ కు కానుకగా ఇవ్వనున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు వెల్లడించారు. భారత పట్టు అంటే మిషెల్ ఎంతో ఇష్టమన్న సంగతి బహిరంగ రహస్యం. పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఆమె జాక్వర్డ్ పట్టు దుస్తుల్లో మెరిసిన సంగతి విదితమే.