ఇషా అంబానీ శుక్రవారం సాయంత్రం అంబానీ నివాసంలో బల్గారీ సీఈఓ జీన్ క్రిస్టోఫ్ బాబిన్‌తో కలిసి 'రోమన్ హోలీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు ముంబైకి చెందిన ప్రముఖ సెలబ్రెటీలంతా విచ్చేశారు. ఈ వేడుకల్లో ఇషా లుక్ అందర్నీ కట్టిపడేసింది. ఈ రోమన్ హోలీ వేడుకల కోసం అని ఆమె దుస్తులను రూపొందించడానికి చాలా సమయం తీసుకుందట. దీన్నీ ప్రముఖ డిజైనర్ ఆశ్విన్ త్యాగరాజన్ రూపొందించారు. ఇది చక్కటి ఎండ్రాయిడరీ వర్క్‌తో కూడిన లాంగ్ లెంగ్త్ బనారసీ గౌను అని త్యాగరాజన్ అన్నారు.
దీన్ని రూపొందించడానికి తమకు ఏకంగా వంద గంటలు పైనే పట్టిందన్నారు. కెనడియన్ నటి మైత్రేయి రామకృష్ణ, టాలీవుడ్ నటి తాప్సీ పన్ను, ఐశ్వర్య రాజేష్ వంటి భారతీయ తారలు త్యాగరాజన్ రూపొందించే ఈ బనారస్ డ్రస్‌లంటే బహు ప్రీతి. ఇక త్యాగరాజన్ ప్రత్యేకత పర్యావరణ హితంగా దుస్తులను రూపొందించడం. పైగా అవి మన అమ్మలు, అమ్మమ్మల వారసత్వ చీరలు లేదా లెహంగాలతో కొత్తదనం సృష్టించడంలో మంచి నైపుణ్యం గల డిజైనర్ త్యాగరాజన్. చాలామంది సెలబ్రెటీలు మన పూర్వ సంప్రదాయల్ని అనుకరించేందుకు ఇష్టపడుతుండటంలో త్యాగరాజన్ డిజైన్‌వేర్‌లకు ఇంతల మంచి క్రేజ్ వచ్చింది.
ఇక ఆమె దుస్తులకు సంబంధించిన నైలాన్‌ని పూర్తిగా సముద్రాలు, ఫిషింగ్ నెట్‌లు, వస్త్ర ఫైబర్‌ల వ్యర్థాలను నుంచి ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసి శుద్ది చేసి వాటితో తయారైన నైలాన్‌తో తయారు చేస్తుంది. అంటే ఇక్కడ డిపాలిమరైజేషన్ , శుద్ధికరణతో వచ్చే కొత్త పాలిమర్‌లను థ్రైడ్‌లు మార్చడం ద్వారా ఈ కొత్త నైలాన్ని సృష్టిస్తారని చెప్పొచ్చు. అందువల్లే త్యాగరాజన్ డిజైన్‌వేర్‌లకు పర్యావరణ అనూకూలమైన ఫ్యాషన్ బ్రాండ్‌గా మంచి పేరొచ్చింది. నిజంగానే బ్రాండ్‌కి తగ్గట్టే త్యాగరాజన్ రూపొందించే డ్రస్‌లు సంప్రదాయంగా ఓ పండుగ వాతవరణం తలిపించే లుక్‌ని, కొత్త ఫ్యాషన్‌ని అందిస్తాయి.
(చదవండి: వందేళ్ల క్రితం కరెంట్ లేకుండానే పనిచేసిన ఫ్రిడ్జ్!)
Comments
Please login to add a commentAdd a comment