Tyagarajan
-
ఇషా అంబానీ దుస్తుల డిజైనింగ్‌కి అంత టైం పడుతుందా!
ఇషా అంబానీ శుక్రవారం సాయంత్రం అంబానీ నివాసంలో బల్గారీ సీఈఓ జీన్ క్రిస్టోఫ్ బాబిన్తో కలిసి 'రోమన్ హోలీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు ముంబైకి చెందిన ప్రముఖ సెలబ్రెటీలంతా విచ్చేశారు. ఈ వేడుకల్లో ఇషా లుక్ అందర్నీ కట్టిపడేసింది. ఈ రోమన్ హోలీ వేడుకల కోసం అని ఆమె దుస్తులను రూపొందించడానికి చాలా సమయం తీసుకుందట. దీన్నీ ప్రముఖ డిజైనర్ ఆశ్విన్ త్యాగరాజన్ రూపొందించారు. ఇది చక్కటి ఎండ్రాయిడరీ వర్క్‌తో కూడిన లాంగ్ లెంగ్త్ బనారసీ గౌను అని త్యాగరాజన్ అన్నారు. దీన్ని రూపొందించడానికి తమకు ఏకంగా వంద గంటలు పైనే పట్టిందన్నారు. కెనడియన్ నటి మైత్రేయి రామకృష్ణ, టాలీవుడ్ నటి తాప్సీ పన్ను, ఐశ్వర్య రాజేష్ వంటి భారతీయ తారలు త్యాగరాజన్ రూపొందించే ఈ బనారస్ డ్రస్లంటే బహు ప్రీతి. ఇక త్యాగరాజన్ ప్రత్యేకత పర్యావరణ హితంగా దుస్తులను రూపొందించడం. పైగా అవి మన అమ్మలు, అమ్మమ్మల వారసత్వ చీరలు లేదా లెహంగాలతో కొత్తదనం సృష్టించడంలో మంచి నైపుణ్యం గల డిజైనర్ త్యాగరాజన్. చాలామంది సెలబ్రెటీలు మన పూర్వ సంప్రదాయల్ని అనుకరించేందుకు ఇష్టపడుతుండటంలో త్యాగరాజన్ డిజైన్వేర్లకు ఇంతల మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఆమె దుస్తులకు సంబంధించిన నైలాన్ని పూర్తిగా సముద్రాలు, ఫిషింగ్ నెట్లు, వస్త్ర ఫైబర్ల వ్యర్థాలను నుంచి ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసి శుద్ది చేసి వాటితో తయారైన నైలాన్‌తో తయారు చేస్తుంది. అంటే ఇక్కడ డిపాలిమరైజేషన్ , శుద్ధికరణతో వచ్చే కొత్త పాలిమర్లను థ్రైడ్లు మార్చడం ద్వారా ఈ కొత్త నైలాన్ని సృష్టిస్తారని చెప్పొచ్చు. అందువల్లే త్యాగరాజన్ డిజైన్వేర్లకు పర్యావరణ అనూకూలమైన ఫ్యాషన్ బ్రాండ్‌గా మంచి పేరొచ్చింది. నిజంగానే బ్రాండ్‌కి తగ్గట్టే త్యాగరాజన్ రూపొందించే డ్రస్‌లు సంప్రదాయంగా ఓ పండుగ వాతవరణం తలిపించే లుక్‌ని, కొత్త ఫ్యాషన్‌ని అందిస్తాయి. (చదవండి: వందేళ్ల క్రితం కరెంట్ లేకుండానే పనిచేసిన ఫ్రిడ్జ్!) -
రూ.6200 కోట్లు ఉద్యోగులకు దానం, చిన్న ఇంట్లో నివాసం, ఎవరీ బిజినెస్ టైకూన్
సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాన ధర్మాలు చేయడం చాలామందికి అలవాటు. భారతదేశంలో చాలామంది వ్యాపారవేత్తలు కూడా తమ సంపదలో చాలా దాతృత్వానికి వినియోగిస్తారు. మరి కొంతమంది తమ కంపెనీ అభివృద్ధికి పనిచేసిన ఉద్యోగుల పట్ల కృతజ్ఞత చూపిస్తారు. బోనస్‌లు, బహుమతులతో వారిని ఆనందింపజేస్తారు. కానీ తన సంపదనంతా ఉద్యోగులకు దానం చేసేసి అతి నిరాడంబరంగా జీవనాన్ని గడుపుతున్న ఒక బిజినెస్ టైకూన్ గురించి తెలుసా. ఆయనే ఆర్.త్యాగరాజన్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డు పద్మభూషణ్ అందుకున్న ఆయన గురించి మరిన్ని ఇంట్రస్టింగ్ సంగతులను ఈ కథనంలో తెలుసుకుందాం. సాయం చేయడం అంటే అపారమైన ఆనందం. అందుకే దాదాపు మొత్తం సంపదను రూ. 62,262 కోట్లు (750 మిలియన్ డాలర్లు) తన ఉద్యోగులకి పంచి ఇచ్చారు. సరసమైన ధరలకు రుణాలను అందించే లక్ష్యంతో శ్రీరామ్ గ్రూప్ అనే కంపెనీని ప్రారంభించారు త్యాగరాజన్. ఆర్థిక ఆసరా కోసం ఎదురు చూస్తున్న సాధారణ ప్రజలకు వెలుగు బాట చూపించారు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఇన్వెస్టర్లు, షేర్హోల్డర్లకు కూడా ఎనలేని సంతోషాన్ని మిగిల్చారు. త్యాగరాజన్ చెన్నైలో 1974లో శ్రీరామ్ గ్రూప్‌ను స్థాపించారు. 37 ఏళ్ళ వయసులో స్నేహితులు, బంధువులతో కలసి మొదలు పెట్టి, తక్కువ-ఆదాయ రుణగ్రహీతలకు డబ్బు ఇవ్వడం ద్వారా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆర్. త్యాగరాజన్ 1937, ఆగస్టు 25వ తేదీన తమిళనాడు రాష్ట్రం, చెన్నైలో జన్మించారు. గణితంలో గ్రాడ్యుయేషన్, కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1961సంవత్సరంలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో చేరిన త్యాగరాజన్, దాదాపు 20 ఏళ్లు పలు ఇన్సూరెన్స్ కంపెనీలలో ఉద్యోగిగా పనిచేశాడు. ఇక్కడే ఆయన జీవితం మలుపు తిరిగింది. వడ్డీలు బాధలు, వివిధ రుణాల కోసం ఎదురు చూస్తున్న అల్పాదాయ వర్గాల ఇబ్బందులను చూసి చలించిపోయారు. దీనికి తోడు త్యాగరాజన్ నివసిస్తున్న చెన్నై చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు తమ జీవనోపాధికోసం ట్రాక్టర్లు, ట్రక్కులు, ఇతర వాహనాలు కొనుగోలు చేయడానికి నానా కష్టాలు పడడాన్ని ఆయన గమనించారు. అందుకే సులువుగా, తక్కువ వడ్డీతో రుణాలు అందించేలా శ్రీరామ్ చిట్‌ఫండ్ సంస్తను ఏర్పాటు చేశారు. శ్రీరామ్ చిట్ ఫండ్స్ ద్వారా పిల్లల పాఠశాల ఫీజులు కట్టడానికో, వ్యవదారులు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడానికో, చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులు అందిస్తూ ఆదరణ పొందింది. బ్యాంకులు పైనాన్స్ కంపెనీలలో వడ్డీరేట్లు 30-35శాతం ఉండగా శ్రీరామ్ ఫైనాన్స్ లో 17-18 శాతానికే రుణాలందించేది. అలా ప్రారంభమైన శ్రీరామ్ గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగి 30 కంటే ఎక్కువ కంపెనీలతో అలరారుతోంది. ( Anti Valentine Week 2024 : చెంప పగలగొట్టు...బ్రేకప్ చెప్పేయ్..! 2023 ఆగస్టు నాటికి కంపెనీ 108,000 మంది ఉద్యోగులతో పనిచేస్తోంది. 2006లో 85సంవత్సరాల త్యాగరాజన్ తన ఆస్తులను అన్నింటిని శ్రీరామ్ యాజమాన్య ట్రస్ట్ కుబదిలీ చేశారు. దీని విలువ రూ. 62వేల కోట్లకు పైమాటే. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ 2023 జూన్ త్రైమాసికంలో 200 మిలియన్ డాలర్లు. సెల్ ఫోనూ లేదు, ఖరీదైన కారూ లేదు శ్రీరామ్ గ్రూప్ నుండి విశ్రాంతి తీసుకుంటూ 86 ఏళ్ల వయసులో చిన్న ఇంటిలో, రూ. 6 లక్షల విలువైన కారుతో అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు త్యాగరాజన్. అంతేకాదు ఆయన సెల్‌పోన్ కూడా వాడరు. తనకు ఆ అవసరమే లేదంటారు. పత్రికలు, సాహిత్యం, సంగీతం ఇదే ఆయన కాలక్షేపం. అలాగే కంపెనీ సీనియర్ మేనేజర్లతో ప్రతి 15రోజులకొకసారి మాట్లాడుతో సలహాలు, సూచనలు అందిస్తూ కంపెనీ అభివృద్దికి మార్గనిర్దేశనం చేస్తూ ఉంటారు. ‘‘లాభం అనేది ఒక కొలమానం మాత్రమే’’ లాభం ఎప్పటికీ అంతిమ లక్ష్యం కాదు. కస్టమర్‌దే తొలిస్థానం. లాభం అనేది మనం సమాజానికి ఎంత బాగా సేవ చేస్తున్నామో తెలుసుకునే ఒక మార్గం మాత్రమే. మంచి సేవ చేస్తే లాభంగా కూడా అలానే వస్తుంది అదే తన సక్సెస్ సీక్రెట్ అంటారాయాన.. బిజినెస్‌లో రిస్క్‌లు చాలా సాధారణం. వాటిని అర్థం చేసుకోవాలి తప్పితే భయ పడకూడదంటారు. -
జెన్‌ప్యాక్ట్ సీఈవో ‘టైగర్’ త్యాగరాజన్ రిటైర్మెంట్
అంతర్జాతీయ ప్రొఫెషనల్ సేవల సంస్థ జెన్‌ప్యాక్ట్ ప్రెసిడెంట్, సీఈవో ‘టైగర్’ త్యాగరాజన్ రిటైర్ కాబోతున్నారు. త్యాగరాజన్ 2024 ఫిబ్రవరి 9న రిటైర్ కాబోతున్నట్లు జెన్‌ప్యాక్ట్ ప్రకటించింది. తదుపరి సీఈవోగా బాలక్రిషన్ (బీకే) కల్రాను నియమిస్తున్నట్లు పేర్కొంది. త్యాగరాజన్ అసలు పేరు ఎన్వీ త్యాగరాజన్. ఈ పేరును సంక్షిప్తం చేసి స్నేహితులు ఆయన్ను టైగర్ అని పిలిచేవారు. దీంతో ఆయనకు ‘టైగర్’ త్యాగరాజన్ అనే పేరు స్థిరపడింది. 2011లో జెన్‌ప్యాక్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన త్యాగరాజన్ 2022 నాటికి ఆ కంపెనీని 4.3 బిలియన్ డాలర్ల ఆదాయంతో అగ్రగామిగా తీర్చిదిద్దారు. ‘టైగర్’ త్యాగరాజన్ డేటా అండ్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించి క్లయింట్లకు మెరుగైన సేవలందించారని జెన్‌ప్యాక్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘టైగర్’ త్యాగరాజన్ తర్వాత ఎవరిని సీఈవో చేయాలనే దానిపై జెన్‌ప్యాక్ట్ చాలా పెద్ద కసరత్తు చేసింది. కంపెనీలో ఉన్నవారితోపాటు పలువురు బయట వ్యక్తులను పరిశీలించిన కంపెనీ చివరకు అదే కంపెనీలో పలు కీలక విభాగాలకు నాయకత్వం వహిస్తున్న బీకే కల్రాను తదుపరి సీఈవోగా నియమించింది. ఈయన 1999లో జెన్‌ప్యాక్ట్‌లో చేరారు. -
రూ.50కి ఆశపడి.. లక్ష పోగొట్టుకున్నాడు
సాక్షి, చెన్నై: చెన్నై, ఆవడి సమీపంలోని అంబికాపురానికి చెందిన త్యాగరాజన్ భవన నిర్మాణ కాంట్రాక్టర్. ఇతను తాకట్టు పెట్టిన నగలను విడిపించడానికి రూ.లక్షతో ఇంటి నుంచి శుక్రవారం మధ్యాహ్నం తిరునిండ్రవూర్‌లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు బయలుదేరాడు. అతను తిరువళ్లూరు – చెన్నై జాతీయ రహదారిపై అతన్ని వెంబడించిన నలుగురు వ్యక్తులు త్యాగరాజన్‌తో ‘‘మీ జేబులో ఉన్న రూ. 50 నోటు కింద పడింది..’’ అని తెలిపారు. దీంతో అతను బైకును రోడ్డు పక్కన నిలిపి యాభై రూపాయలు తీసుకుని తిరిగి రాగా ఇంతలో బైక్‌లో ఉంచిన రూ.లక్ష కనిపించలేదు. దీంతో తిరునిండ్రవూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. అందులో నలుగురు వ్యక్తులు బాధితుడి దృష్టిని మళ్లించి రూ.లక్ష నగదు చోరీ చేసి పారిపోయినట్లు తెలిసింది. ఈ మేరకు నిందితుల కోసం గాలిస్తున్నారు. చదవండి: (తండ్రి మైనపు విగ్రహం పక్కనే.. డాక్టర్ అపూర్వతో యతీష్ వివాహం) -
టబు పాత్రలో రమ్యకృష్ణ
హిందీలో ‘అంధాధూన్’ ఘనవిజయం సాధించింది. జాతీయ ఉత్తమ హిందీ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే సినిమాకి కీలకంగా నిలిచిన టబు పాత్రకు, ఆమె నటనకు కూడా విపరీతమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆ పాత్రను తమిళంలో రమ్యకృష్ణ పోషించనున్నారని తెలిసింది. ‘అంధాధూన్’ తమిళ రీమేక్ హక్కులను నటుడు, దర్శకనిర్మాత త్యాగరాజన్ తీసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు, ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ హీరోగా నటించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. హిందీలో టబు చేసిన పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఆ పాత్రకు రమ్యకృష్ణ అయితే బావుంటారని చిత్రబృందం భావించారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌లో నితిన్ నటిస్తారు. -
ధనుష్ కాదు ప్రశాంత్!
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో నటించిన హిందీ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అంధాధూన్’. ఈ చిత్రం తమిళంలో రీమేక్ కాబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. హీరోగా ధనుష్, సిద్ధార్థ్ ఇలా పలువురు పేర్లు కూడా వినిపించాయి. ఓ సందర్భంలో ‘అంధాధూన్’ చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నానని కూడా తెలిపారు ధనుష్. ఇప్పుడు ‘అంధాధూన్’ తమిళ రీమేక్‌లో ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ నటిస్తారని తెలిసింది. ఈ హిందీ చిత్రం తమిళ రైట్స్‌ను ప్రశాంత్ తండ్రి, నటుడు–దర్శకుడు–నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. ప్రశాంత్ నటించిన గత చిత్రం ‘జానీ’ (తమిళం) కూడా శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ‘జానీ గద్దర్’ (హిందీ)కు రీమేకే కావడం విశేషం. -
ఈ ఏడాది 13.5 శాతం వాటా లక్ష్యం
హైదరాబాద్: భారత ఎయిర్ కండీషనర్ల మార్కెట్లో బ్లూ స్టార్‌కు ప్రస్తుతం 12.8 శాతం వాటా ఉంది. 2019–20లో 13.5 శాతం వాటాను లక్ష్యంగా చేసుకున్నామని కంపెనీ జేఎండీ బి.త్యాగరాజన్ మంగళవారం వెల్లడించారు. నూతన శ్రేణి ఏసీలను ఇక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘రూమ్ ఏసీల విక్రయాలు అన్ని బ్రాండ్లు కలిపి 2018–19లో 55 లక్షల యూనిట్లు నమోదు కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 10 శాతం వృద్ధి నమోదు చేయవచ్చు. ఇదే జరిగితే బ్లూ స్టార్ వృద్ధి రేటు 15 శాతం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో బ్లూ స్టార్ ప్లాంటు 2021–22లో సిద్ధం కానుంది. ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 200 నుంచి 250కి చేర్చనున్నాం’ అని వివరించారు. -
తండ్రి పాత్రలో కొడుకు
తండ్రి పోషించిన పాత్రలో కొడుకు నటించడం అన్నది చాలా అరుదుగా జరిగే విషయం. ఇటీవల అలాంటి అవకాశం పొందిన వారిలో తెలుగులో బాలకృష్ణ, తమిళంలో ప్రశాంత్ పేర్లు చెప్పవచ్చును. దివంగత మహానటుడు ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం, లవకుశ చిత్రాల రీమేక్‌లో బాలకృష్ణ నటించారు. ఇక తమిళంలో త్యాగరాజన్ నటించిన మలైయూర్ మంబట్టియాన్ చిత్రం రీమేక్‌లో ఆయన కొడుకు ప్రశాంత్ నటించారు. తాజాగా ఈ కోవలోకి యువ నటుడు పృథ్వి చేరనున్నారు. ఆర్.పాండియరాజన్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించి హీరోగా నటించిన చిత్రం ఆన్‌పావం. ఈ చిత్రంలో అప్పట్లో విశేష ప్రజాదరణ పొందింది. ఆ చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ రీమేక్ చేయడానికి పాండియరాజన్ సన్నద్ధం అయ్యారు. నేటి కాలానికి తగ్గట్టుగా చిన్న చిన్న చేర్పులు, మార్పులు చేసి ఆన్‌పావం 99 శాతం పేరుతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి పాండియరాజన్ దర్శకత్వం వహించనున్నారు. ఆన్‌పావం చిత్రంలో పాండియరాజన్ పోషించిన పాత్రను ఇప్పుడాయన కొడుకు పృథ్వి నటించనున్నారు. ఇంతకుముందు వజ్రం చిత్రాన్ని నిర్మించిన శ్రీసాయిరామ్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ అధినేత ఆర్.శంకర్ నిర్మించనున్నారు. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని త్వరలో చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు. -
దక్షిణాదిన అంతటి నటి ఎవరు?
హిందీలో ఘనవిజయం సాధించిన 'క్వీన్' సినిమా రీమేక్ హక్కులను తమిళ హీరో ప్రశాంత్ తండ్రి, నటుడు, దర్శకుడు, నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. హిందీలో వికాస్ భల్ దర్శకత్వం కంగనా రనౌత్ అద్భుతంగా నటించారు. ఓ నటికి సవాల్ లాంటి పాత్ర ఇది. ఇందులో కంగనా రనౌత్ విజృంభించి నటించారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. దీని రీమేక్ హక్కులకు పెద్ద పోటీ ఏర్పడింది. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఈ చిత్రాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో త్యాగరాజన్ దీని హక్కులు చేజిక్కించుకున్నారు. కథాపరంగా దక్షిణాదికి అనుగుణంగా కొన్ని మార్పులుచేర్పులు చేసి నిర్మించడానికి ఆయన సిద్దమయ్యారు. అయితే ఇందులో క్వీన్ పాత్రదారిని ఎంపికచేయడం ప్రధానం. ప్రస్తుతం త్యాగరాజన్ ఆ వేటలోనే ఉన్నారు. ఆయన మనసులో ఉన్న హీరోయిన్లను సంప్రదించే పనిలో పడ్డారు. నాలుగు భాషల్లో హీరోలు మారతారు. హీరోయిన్ మాత్రం ఒక్కరే ఉంటారు. అందువల్ల ఆ పాత్రకి తగిన, అన్ని భాషలవారికి నచ్చే హీరోయిన్ను ఎంపిక చేయవలసి ఉంది. ఈ పాత్ర కోసం పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, కొంతమంది హీరోయిన్లు ఈ పాత్ర చేయడానికి ఇష్టపడుతుంటే, మరి కొందరు భయపడుతున్నారు. కంగనా రనౌత్ అంతటి స్థాయిలో ఆ చిత్రంలో నటించి మెప్పించారు. కొందరు హీరోయిన్లకు నటించాలన్న ఆసక్తి ఉన్నా, వారికి సమయం చిక్కడంలేదు. దాంతో కొంత సమయం అడుగుతున్నారు. మరికొందరు భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇంకొందరు రీమేక్ అని ధైర్యం చేయలేకపోతున్నారు. క్వీన్ పాత్ర కోసం మలయాళీ ముద్దుగుమ్మ అసిన్‌ని నిర్మాత సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, బాలీవుడ్ సినిమాపై దృష్టి పెట్టిన అసిన్, ఈ చిత్రంలో నటించడం తన వల్ల కాదని తేల్చి చెప్పేసినట్లు సమాచారం. బాలీవుడ్ క్వీన్‌గా నటించిన కంగనా రనౌత్ మాదిరి దక్షిణాదిలో కూడా నటించడం అంటే కుదరని పని. అలా నటించకపోతే ప్రేక్షకులకు నచ్చదు. అదే పాత్రను కొత్తగా నటించి ప్రేక్షకులను మెప్పించడం కష్టం. అందుకే క్వీన్‌లో నటించలేనని అసిన్ త్యాగరాజన్‌కు సారీ చెప్పినట్లు కోలీవుడ్ సమాచారం. బాలీవుడ్లో అరకొర అవకాశాలతో సర్ధుకుంటున్న అసిన్, దక్షిణాది 'క్వీన్' వంటి సినిమాలో నటించడానికి ఆసక్తి కనబరచకపోవడంపై పలువురు సినీ విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో ఓ వెలుగు వెలుగుతున్న హీరోయిన్ సమంత ఈ చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలలో నిజంలేదని సమంత స్పష్టం చేశారు. ఈ చిత్రం కథలో మార్పులు చేర్పులు చేయవలసి ఉంటుందని, ఆ విషయంలో దర్శక, నిర్మాతలకు నచ్చజెప్పడం సాధ్యం కాదని, అందువల్ల ఆ 'యువరాణి'ని తాను కాదని సమంత తన ట్విట్టర్లో పోస్టు చేశారు. కంగనా స్థాయిలో దక్షిణాదిన నటించగల సత్తా త్రిషకు ఉందని పలువురు భావిస్తున్నారు. త్యాగరాజన్ కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ పాత్రకు త్రిష పేరు పరిశీలనలో ఉన్నట్లు ఆయనే స్వయంగా చెప్పారు. ఈ పాత్రకి ఇంకా నయనతార, అనుష్క, కాజల్ - తమన్నా- కలర్స్ స్వాతి, తాప్సీ, నిత్యామీనన్... పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి తాను దర్శకత్వం వహించనని త్యాగరాజన్ చెప్పారు. అయితే మరో దర్శకుని పేరుని మాత్రం ఆయన ఇంకా ప్రకటించలేదు. -ఎస్ఎన్ఆర్ -
దప్పిక తీరేదిలా
=నగరానికి ప్రత్యామ్నాయ జల వనరులు =దృష్టి సారించిన బెంగళూరు జల మండలి =సర్కార్‌కు పలు సూచనలిచ్చిన ‘త్యాగరాజన్’ =‘లింగనమక్కి’ నుంచి నీరు మళ్లింపు =నీటి వృథాను అరికడితే కొంత ఊరట =‘బారాపూలె’ నీటిని సద్వినియోగం చేసుకోవాలి =పలు నదులపై ఆనకట్టలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రత్యామ్నాయ జల వనరులపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని బీఎన్. త్యాగరాజన్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. భవిష్యత్తులో నగర నీటి అవసరా దృష్ట్యా అవసరమైన జల వనరులను గుర్తించడానికి ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ ఇటీవల నివేదికను సమర్పించింది. బెంగళూరు జల మండలి అధ్యక్షుడుగా పని చేసి రిటైరైన త్యాగరాజన్ నివేదిక ప్రకారం...2051 నాటికి నగర జనాభా 3.45 కోట్లకు చేరుతుంది. వైశాల్యం ప్రస్తుతం ఉన్న 800 చదరపు కిలోమీటర్ల నుంచి 1,500కు పెరుగుంది. అప్పట్లో నగరానికి ఏటా 88.25 టీఎంసీల నీరు అవసరమవుతుంది.కమిటీ సూచించిన ప్రత్యామ్నాయాలు... కావేరి నుంచి కావేరి న్యాయ పంచాయతీ తుది తీర్పు అనంతరం రాష్ట్రానికి 270 టీఎంసీల నీటి కేటాయింపు జరిగింది. ఇందులో 250.62 టీఎంసీలు వ్యవసాయానికి పోతుంది. 1.85 టీఎంసీలను ఇతర అవసరాలకు నిర్ణయిస్తూ, మిగిలిన 17.64 టీఎంసీలను రాష్ట్ర విచక్షణకు వదిలి వేశారు. ఇందులో 12.88 టీఎంసీల నీటిని నగరానికి కేటాయించాలి. లింగనమక్కి నుంచి... శివమొగ్గ జిల్లా సాగర తాలూకా లింగనమక్కి జలాశయం నుంచి దశాబ్దానికి పది టీఎంసీల చొప్పున దశలవారీ 30 టీఎంసీల నీటిని నగరానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టాలి. ప్రస్తుతం అక్కడ జల విద్యుదుత్పాదన జరుగుతోంది. తాగు నీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నందున, విద్యుదుత్పాదనను ఇతర మార్గాల ద్వారా చేపట్టవచ్చు. లింగనమక్కి నుంచి టీజీ హళ్లి మీదుగా నగరానికి పది టీఎంసీలు సరఫరా చేయడానికి రూ.12,500 కోట్లు అవసరమవుతుంది. వృథా అరికడితే... ప్రస్తుతం జల మండలి ద్వారా సరఫరా అవుతున్న నీటిలో సుమారు 50 శాతం వరకు లెక్కలు తేలకుండా వృథా అవుతోంది. దీనిని 16 శాతానికి తగ్గించగలిగితే నాలుగు టీఎంసీల నీటిని ఆదా చేయవచ్చు. బారాపూలె నుంచి... కొడగు జిల్లాలో పుట్టి కేరళ ద్వారా సముద్రంలో కలుస్తున్న బారాపూలె నీటిని సద్వినియోగం చేసుకోవాలి. నీటి పారుదుల శాఖ అంచనా ప్రకారమే ఇక్కడి నుంచి పది టీఎంసీలను లక్ష్మణతీర్థ వదృ్ద కష్ణరాజ సాగర్ జలాశయానికి మళ్లించవచ్చు. రెండేళ్లలో రూ.వంద కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయవచ్చు. హేమావతి నుంచి... చిన్న నీటి పారుదల శాఖ హేమావతి జలాశయం ఎడమ కాలువ ద్వారా పంటలకు నీరు సరఫరా చేయని పక్షంలో ఐదు టీఎంసీల నీటిని కుణిగల్, బుడగనహళ్లి చెరువులకు మళ్లించవచ్చు. అక్కడి నుంచి హెసరఘట్ట, తిప్పగొండనహళ్లి జలాశయాలకు పంప్ చేయడం ద్వారా బెంగళూరుకు తరలించవచ్చు. అయితే దీని వల్ల 73 వేల ఎకరాలకు సాగు నీరు అందకుండా పోతుంది. ఎత్తినహొళె నుంచి... పశ్చిమ దిశగా ప్రవహిస్తున్న ఎత్తినహొళె తదితర నదులపై ఆనకట్టలను నిర్మించడం ద్వారా తుమకూరు వరకు 24 టీఎంసీల నీటిని తరలించడానికి నీటి పారుదల శాఖ పథకాన్ని సిద్ధం చేసింది. ఇందులో పది టీఎంసీలను బెంగళూరుకు ఇవ్వాల్సిందిగా నిపుణుల కమిటీ కోరింది. దీనికి ప్రభుత్వం సమ్మతిస్తే జల మండలి ఆ నీటిని వినియోగించుకునే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరానికి రోజూ 1.4 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. దీనికి ఏటా 18.8 టీఎంసీల నీరు అవసరమవుతుంది.