తండ్రి పాత్రలో కొడుకు | father role in son | Sakshi
Sakshi News home page

తండ్రి పాత్రలో కొడుకు

Published Sun, Apr 19 2015 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM

తండ్రి పాత్రలో కొడుకు

తండ్రి పాత్రలో కొడుకు

తండ్రి పోషించిన పాత్రలో కొడుకు నటించడం అన్నది చాలా అరుదుగా జరిగే విషయం. ఇటీవల అలాంటి అవకాశం పొందిన వారిలో తెలుగులో బాలకృష్ణ, తమిళంలో ప్రశాంత్ పేర్లు చెప్పవచ్చును. దివంగత మహానటుడు ఎన్‌టీఆర్ నటించిన పాండురంగ మహత్యం, లవకుశ చిత్రాల రీమేక్‌లో బాలకృష్ణ నటించారు. ఇక తమిళంలో త్యాగరాజన్ నటించిన మలైయూర్ మంబట్టియాన్ చిత్రం రీమేక్‌లో ఆయన కొడుకు ప్రశాంత్ నటించారు. తాజాగా ఈ కోవలోకి యువ నటుడు పృథ్వి చేరనున్నారు. ఆర్.పాండియరాజన్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించి హీరోగా నటించిన చిత్రం ఆన్‌పావం. ఈ చిత్రంలో అప్పట్లో విశేష ప్రజాదరణ పొందింది.
 
 ఆ చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ రీమేక్ చేయడానికి పాండియరాజన్ సన్నద్ధం అయ్యారు. నేటి కాలానికి తగ్గట్టుగా చిన్న చిన్న చేర్పులు, మార్పులు చేసి ఆన్‌పావం 99 శాతం పేరుతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి పాండియరాజన్ దర్శకత్వం వహించనున్నారు. ఆన్‌పావం చిత్రంలో పాండియరాజన్ పోషించిన పాత్రను ఇప్పుడాయన కొడుకు పృథ్వి నటించనున్నారు. ఇంతకుముందు వజ్రం చిత్రాన్ని నిర్మించిన శ్రీసాయిరామ్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ అధినేత ఆర్.శంకర్ నిర్మించనున్నారు. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని త్వరలో చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement