
ప్రశాంత్
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో నటించిన హిందీ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అంధాధూన్’. ఈ చిత్రం తమిళంలో రీమేక్ కాబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. హీరోగా ధనుష్, సిద్ధార్థ్ ఇలా పలువురు పేర్లు కూడా వినిపించాయి. ఓ సందర్భంలో ‘అంధాధూన్’ చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నానని కూడా తెలిపారు ధనుష్. ఇప్పుడు ‘అంధాధూన్’ తమిళ రీమేక్‌లో ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ నటిస్తారని తెలిసింది. ఈ హిందీ చిత్రం తమిళ రైట్స్‌ను ప్రశాంత్ తండ్రి, నటుడు–దర్శకుడు–నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. ప్రశాంత్ నటించిన గత చిత్రం ‘జానీ’ (తమిళం) కూడా శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ‘జానీ గద్దర్’ (హిందీ)కు రీమేకే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment