tabu
-
'మగాడు కేవలం దానికోసమే'.. హీరోయిన్ టబు కథనాలపై స్పందించిన టీమ్!
హీరోయిన్ టబు తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో వెంకటేష్ సరసన కూలి నెంబర్ వన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా, చెన్నకేశవరెడ్డి ,ఆవిడే మా ఆవిడ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. దాదాపు 50 ఏళ్లు దాటినా కూడా తనదైన గ్లామర్‌తో సినీ ప్రియులను అలరిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సరసన భూత్ బంగ్లా చిత్రంలో నటిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోలేదు.తాజాగా ఆమె తన పెళ్లి గురించి మాట్లాడారని కొన్ని వార్తలొచ్చాయి. మగాడు కేవలం బెడ్ మీదకే మాత్రమే పనికొస్తాడని టబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారని సోషల్ మీడియాతో పాటు పలువురు వార్త కథనాలు రాసుకొచ్చారు. ఇలా బోల్డ్ కామెంట్స్ చేయడంపై కొందరు ఆమెను విమర్శిస్తుంటే.. మరికొందరు సమర్థించారంటూ ప్రచురించారు. ఈ నేపథ్యంలో టబుపై వస్తున్న వార్తలపై ఆమె టీమ్ ఘాటుగానే స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు ప్రచురించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.ఖండించిన టబు టీమ్..ఇటీవల ఆన్లైన్లో వచ్చిన అసభ్యకర కథనాలను టబు టీమ్ ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొద్ది రోజులుగా అనేక వార్తా వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్లు వివాహంపై టబు తన అభిప్రాయాలను ప్రస్తావిస్తూ మాట్లాడారని ప్రచురించాయి. ఈ కథనాలన్నీ కేవలం కల్పితమని వాటిలో ఎలాంటి నిజం లేదని టబు టీమ్ స్పష్టం చేసింది. ఆమె ఎప్పుడు ఇలా మాట్లాడలేదని.. కేవలం అభిమానులను తప్పుదారి పట్టించేందుకే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం నైతికి ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రకటనలో పేర్కొంది. ఆమె ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించిన వారంతా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది టబు టీమ్.కాగా.. టబు ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో భూత్ బంగ్లా చిత్రం కోసం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో పరేష్ రావల్ కూడా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ప్రియదర్శన్ - అక్షయ్ కుమార్ కాంబోలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరూ గతంలో 'హేరా ఫేరీ', భాగమ్ భాగ్, గరం మసాలా, దే దానా దాన్, భూల్ భూలయ్యా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. అంతేకాదు దాదాపు 25 సంవత్సరాల తర్వాత అక్షయ్, టబుల కాంబో రిపీట్ కానుంది. వీరిద్దరూ చివరిసారిగా 'హేరా ఫేరి'లో కలిసి నటించారు.ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిలిమ్స్, అ క్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 2, 2026న థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. టబు చివరిసారిగా డూన్: ప్రొఫెసీ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఈ సిరీస్ ద్వారా ఆమె హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. -
భూత్ బంగ్లాలో టబు
హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘భూత్ బంగ్లా’. వామికా గబ్బి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, అస్రానీ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం టబును సంప్రదించారు. కథ నచ్చడంతో టబు కూడా ఓకే అన్నారు. ఇక 2000లో విడుదలైన హిందీ చిత్రం ‘హేరా ఫేరి’ తర్వాత హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ టబు, దర్శకుడు ప్రియదర్శన్‌లు కలిసి చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అంటే... పదమూడు సంవత్సరాల తర్వాత ఈ ముగ్గురి కాంబినేషన్లో సినిమా కుదిరిందన్న మాట. ‘భూత్ బంగ్లా’ సినిమాను 2026 ఏప్రిల్ 2న విడుదల చేయాలని అనుకుంటున్నారు. -
53 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ.. పెళ్లి గురించి ఆలోచన లేదు(ఫొటోలు)
-
లైఫ్ అంటే... పెళ్లి మాత్రమేనా?!
టబు వయసు 53. ఈమధ్యే, నవంబర్ 4న ఆమెకు అభిమానుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు, బంధు మిత్రులనుంచి.. ‘ఎప్పుడూ వర్కేనా? కాస్త లైఫ్ గురించి కూడా ఆలోచించు..‘ అనే వివాహ ఆంక్షలూ అందాయి. టబుకు ఏటా ఉండేవే ఈ పుష్పగుచ్ఛాలు. ‘‘ఎప్పుడూ వర్కేనా? కాస్త లైఫ్ గురించి కూడా ఆలోచించు..’’ అంటే.. ‘పెళ్లి గురించి ఆలోచించు, వయసేం మించి΄ోలేదు..’ అని చెప్పటం. పెళ్లి మాట అటుంచితే, ‘ఎప్పుడూ వర్కేనా? కాస్త లైఫ్ గురించి కూడా ఆలోచించు..’ అనే మాట టబును అమితంగా ఆశ్చర్యపరుస్తుందట. ‘ఒక వ్యక్తికి వర్కే లైఫ్ ఎందుకు కాకూడదు? లైఫ్‌ని పక్కన పెట్టి ఒక వ్యక్తి వర్క్‌ను మాత్రమే ఎందుకు కోరుకోకూడదు? అని ‘ది నాడ్ ’ అనే డిజిటల్ మ్యాగజీన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ప్రశ్నించారు టబు. ‘వర్క్, లైఫ్ నాకు వేర్వేరు కావు. అందుకే నాకు ‘వర్క్ – లైఫ్ బ్యాలెన్స్’ అనే మాట అర్థం కాదు. జీవితంలో ప్రతిదీ, ప్రతి సమస్యా, ప్రతి పోరాటం, ప్రతి యుద్ధం.. వ్యక్తిగత ప్రాధాన్యాలను బట్టే ఉంటుంది. నాకు వర్క్ తప్ప వేరే జీవితం గురించి తెలియదు. పోల్చి చూసుకోటానికి నాకు వేరే జీవితం కూడా లేదు. నా జీవితంలో వేరే ఎవరైనా ఉంటే ఇంతకన్నా బాగుండేదా లేక, ఇప్పుడున్న జీవితమే మెరుగ్గా ఉండేదా అనేది కూడా నాకు తెలీదు. ఎప్పటికీ తెలియదు. నేనిప్పుడు నా జీవితంతో చాలా సంతోషంగా ఉన్నాను. నేను 20 ఏళ్ల వయసులో లేను కనుక సంతోషానికి నా నిర్వచనం 50లలో ఉన్నట్లే ఉంటుంది. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేందుకే ప్రయత్నిస్తారు. అయితే సంతోషం కన్నా కూడా సంతృప్తి ముఖ్యం అనుకుంటాను నేను. అంతకన్నా కూడా మనల్ని మనం యాక్సెప్ట్ చెయ్యాలి’ అన్నారు టబు. ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన టబు తాజా రొమాంటిక్ థ్రిల్లర్.. ఔరోన్ మే కహా దమ్ థా. ఆ ధైర్యం ఇతరులకు ఎక్కడిది?’ అని ఆ టైటిల్‌కి అర్థం. (చదవండి: ‘పెళ్లాం చెబితే వినాలి'.. ఇది ఫైర్‌లాంటి పుష్పగాడి మాట మాత్రమే కాదు..) -
100 నిక్‌నేమ్స్.. పెళ్లి పీటలెక్కని ప్రేమకథ.. టబు గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
ఓటీటీలో భారీ డిజాస్టర్ సినిమా.. నష్టం ఎన్ని కోట్లో తెలుసా..?
అజయ్ దేవగన్, టబు నటించిన బాలీవుడ్ సినిమా ' ఔరో మే కహా దమ్ థా' ఓటీటీలో విడుదలైంది. ఆగష్టు 2న విడుదలైన ఈ మూవీ భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా నీరజ్ పాండే తెరకెక్కించారు. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో శీతల్ భాటియా, నరేంద్ర హిరావత్, సంగీతా అహిర్, కుమార్ మంగత్ సంయుక్తంగా నిర్మించారు. పనోరమా స్టూడియోస్ ఈ చిత్రాన్ని పంపిణీ చేసింది. అయితే, సినిమా భారీ డిజాస్టర్ కావడంతో నిర్మాతలు నష్టాలను మిగిల్చింది.ఇదీ చదవండి: ఓటీటీలో అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్'ఔరో మే కహా దమ్ థా' సినిమాను ఎలాంటి ప్రకటన లేకుండానే సెప్టెంబర్ 13న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చింది. అయితే, ఈ సినిమాను చూడాలంటే భారీ మొత్తంలో రెంట్ చెల్లించాలి. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు ఈ సినిమాను చూడాలంటే అదనంగా రూ. 349 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. థియేటర్లో భారీ డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రానికి అధిక మొత్తంలో రెంట్ పెట్టడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.అగష్టు 2న విడుదలైన తొలి ఆట నుంచే సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. కనీసం రూ.2 కోట్ల కూడా ఓపెనింగ్స్ రాలేదు. బాలీవుడ్లో ఈ ఏడాది భారీ డిజాస్టర్ చిత్రాల లిస్ట్‌లో ' ఔరో మే కహా దమ్ థా' ప్రథమ స్థానంలో ఉంటుంది. ఈ సినిమా వాణిజ్య పరంగా నిర్మాతలు,పంపిణీదారులకు సుమారు రూ. 150 కోట్ల వరకు నష్టం మిగిల్చిందని ప్రచారం ఉంది. ఫైనల్‌గా ఈ చిత్రం రూ. 12.91 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అయితే, ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం. -
ప్రతిసారి ఇదే ప్రశ్న.. అన్నీ తెలిసి కూడా ఎందుకో?: టబు ఫైర్
హీరోలకన్నా హీరోయిన్లకు తక్కువ పారితోషికం.. ఇది అందరికీ తెలుసు! అయినా పదే పదే దీని గురించి నటీమణులను గుచ్చిగుచ్చి అడుగుతుంటారు. మీకు హీరోలకన్నా తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారా? దాని గురించి మీరు అభ్యంతరాలు తెలపరా? అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు. తాజాగా ఆరో మే కహా దమ్ తా సినిమా ప్రమోషన్స్‌కు హాజరైన టబుకు మరోసారి ఇదే ప్రశ్న ఎదురైంది.వెళ్లి వాళ్లను అడగండిదీంతో అసహనానికి లోనైన ఆమె.. హీరోలకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నవారి దగ్గరకు వెళ్లి ఈ ప్రశ్నలు అడగండి అని ఫైర్ అయింది. 'హీరోహీరోయిన్లకు పారితోషికం దగ్గర ఎందుకు వ్యత్యాసం చూపిస్తారని ప్రతి నటిని పట్టుకుని అడుగుతారు. పైగా మగవారికే ఎక్కువ డబ్బు ఇస్తారని, వారికంటే మాకు తక్కువే ముడుతుందని మీకూ తెలుసు. పారితోషికం..అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకని ఆ ప్రశ్నలు అడుగుతారు? వెళ్లి ఆ పారితోషికం ఇచ్చేవారినే అడగండి. దీనికి నేనెలా సమాధానం చెప్తాను. హీరోల కన్నా తక్కువ పారితోషికం ఇవ్వడం నచ్చడం లేదనో లేదా ఇచ్చినదానితోనే సర్దుకుపోతున్నానో చెప్తే దాన్ని సెన్సేషనల్ చేయాలనే కదా మీ తాపత్రయం. మీకు ఎందుకు ఎక్కువ ఇస్తున్నారని వెళ్లి హీరోలను అడండి. అప్పుడు ఏం సమాధానాలు వస్తాయో చూద్దాం అంది.వీరి కాంబినేషన్లో 10వ సినిమాకాగా టబు, అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆరో మే కహా దమ్తా. వీరి కాంబినేషన్లో తెరకెక్కిన 10వ చిత్రమిది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ మూవీలో జిమ్మీ షెయిర్గిల్, సాయాజీ షిండే, శాంతను మహేశ్వరి, సాయి మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదలైంది.చదవండి: Buddy Movie Review: అల్లు శిరీష్ 'బడ్డీ' సినిమా రివ్యూ -
టీనేజ్ అమ్మాయిలా కనిపించాలని లేదు: టబు
అందరివాడు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ భామ టబు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన మెప్పించింది. తెలుగులో అంతకుముందే విక్టరీ వెంకటేశ్, నాగార్జున సరసన నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న ముద్దుగమ్మ ఇటీవల క్రూ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. మూడు దశాబ్దాలకు పైగా తనదైన నటనతో మెప్పిస్తోంది. ప్రస్తుతం అజయ్ దేవగన్‌తో కలిసి ఔరోన్ మే కహన్ దమ్ థాలో కనిపించనుంది. ఈ మూవీ ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సందర్భంగా తాజాగా టబు ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ద్వారా మరింత యవ్వనంగా కనిపించనున్నారా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి టబు స్పందిస్తూ.. తెరపై టీనేజ్ అమ్మాయిలా నటించాలని తనకు లేదని అన్నారు. తాను ప్రస్తుతం ఎలా ఉన్నానో.. అలాగే కనిపిస్తానని వెల్లడించింది. దర్శకుడు నీరజ్ పాండే కూడా తన వయస్సును తగ్గించి చూపే సాహసం చేయలేదని తెలిపింది. గతంలో నటీనటులు వయస్సుకి తగిన పాత్రలే చేసేవారని.. ఇటీవలి కాలంలో పాతనటులు సైతం యంగ్ పాత్రల్లో నటిస్తున్నారని టబు వివరించింది. కానీ ఈ సినిమాలో నాకు 30 ఏళ్ల అమ్మాయిలా చేయడం ఇష్టం లేదని తెలిపింది. ఈ చిత్రంలో నా వయస్సును దాచే ప్రయత్నం చేయలేదని పేర్కొంది. కాగా.. ఔరాన్ మే కహన్ దమ్ థా మూవీని రొమాంటిక్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగణ్ సరసన కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చేయనున్నారు. -
సినిమాల్లోకి రాకముందే ఆ హీరోతో పరిచయం: హీరోయిన్
బాలీవుడ్ భామ టబు తెలుగువారికి సుపరిచితమే. టాలీవుడ్లో మెగాస్టార్ అందరివాడు చిత్రంలో మెరిసింది. అంతకుముందే విక్టరీ వెంకటేశ్, నాగార్జున సరసన నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న ముద్దుగమ్మ ఇటీవల క్రూ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అజయ్ దేవగన్‌తో కలిసి ఆరోన్ మే కహన్ దమ్ థా చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ అజయ్ దేవగణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి మాట్లాడింది.టబు మాట్లాడుతూ..'అజయ్ దేవగన్‌ని తాను చాలా గౌరవిస్తా. నాకు ఏదైనా చిత్రనిర్మాతతో సమస్యలు వచ్చినప్పుడల్లా నా తరపున మాట్లాడడానికి అజయ్‌ను పిలుస్తాను. అతను నాతో పూర్తిగా స్వతంత్రంగా ఉంటాడు. అంతే కాదు నాతో పనిచేయడానకి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అజయ్ నా నిర్ణయాలలో ఎలాంటి జోక్యం చేసుకోడు. ఒకరిని ప్రభావితం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించడు. ఎందుకంటే అతను ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాడు' అని తెలిపింది.అంతే కాకుండా అజయ్ తన సోదరుడికి చిన్ననాటి స్నేహితుడని.. టీనేజ్ నుంచే తాము ఒకరికొకరు తెలుసని టబు తెలిపింది. మేమిద్దరం కలిసి పెరిగామని.. అతను సినిమాల ద్వారా నాకు పరిచయం కాలేదని పేర్కొంది. ఇతర సహనటుల కంటే.. ఆయనతో ఉన్న రిలేషన్ వేరని ఆమె అన్నారు. ఆయనకు పెళ్లయినప్పటికీ మా మధ్య రిలేషన్లో ఎలాంటి మార్పులేదని తెలిపింది. ఆయనకు సినిమా అంటే మక్కువ అని.. దర్శకుడు కావాలని కోరుకున్నట్లు ఆమె వివరించింది. -
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ హీరోయిన్స్ టబు, కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ నటించిన చిత్రం 'క్రూ'. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రాజేశ్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది.అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు స్టార్ హీరోయిన్స్ ఎయిర్ హోస్టెస్ పాత్రల్లో కనిపించారు.అసలు కథేంటంటే?పని ఎక్కువ, జీతాలు తక్కువ, మరోవైపు ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనన్న భయం. ఈ ముగ్గురూ ఉన్న ఫ్లయిట్లో ఓరోజు సడన్‌గా ఓ పెద్దాయన కుప్పకూలిపోతాడు. తన చొక్కా కింద బంగారు కడ్డీలు కనిపిస్తాయి. అవి కొట్టేసి జీవితంలో సెటిలైపోవాలనేది వారి ఆశ. తరువాత ఏమైందన్నదే కథ. ముగ్గురు హీరోయిన్ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
టబుకి హాలీవుడ్ చాన్స్.. ఆ వెబ్ సీరీస్‌లో కీలక పాత్ర!
సీనియర్ నటి టబు సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస బాలీవుడ్ చిత్రాలతో దూసుకెళుతున్నారు. ఇటీవల విడుదలైన ‘క్రూ’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న టబు ప్రస్తుతం హిందీలో మరికొన్ని ప్రాజెక్ట్‌లు కమిట్ అయ్యారు. అలాగే హాలీవుడ్ సూపర్ హిట్ టెలివిజన్ సిరీస్ ‘డ్యూన్: ఫ్రొఫెసి’లో నటించే లక్కీ చాన్స్ అందుకున్నారు. ‘డ్యూన్’ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. తొలి భాగానికి మంచి స్పందన రావడంతో రెండో భాగం ‘డ్యూన్: ఫ్రొఫెసి’ని ప్లాన్ చేశారు మేకర్స్. ఇందులో సిస్టర్ ఫ్రాన్సెస్ అనే ఎంతో ప్రాధాన్యమైన పాత్రలో టబు నటించనున్నారు. డయాన్ అడెము–జాన్ క్రియేషన్‌లో ఈ సిరీస్ రూపొందనుంది. పది వేల సంవత్సరాల క్రితం ఏం జరిగింది? అనే పాయింట్‌తో ‘డ్యూన్’ తొలి భాగం రూపొందింది. ‘డ్యూన్: ఫ్రొఫెసి’ని సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కించనున్నారట. తొలి భాగం కంటే ఐదు రెట్ల బడ్జెట్ కేటాయించారని టాక్. -
ఇక్కడ టిల్లు స్క్వేర్.. అక్కడ క్రూ.. రెండింట్లో ఒకటి కామన్!
కంటెంట్ బాగుంటే చాలు.. బడ్జెట్, తారాగణం.. ప్రమోషన్స్.. ఇవేవీ పట్టించుకోరు జనాలు. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనిపించిందా.. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా లెక్క చేయకుండా పోలోమని థియేటర్లకు వెళ్లిపోతుంటారు. అలా ఈ మధ్య ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ సైతం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. రేపటితో వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఓన్లీ మ్యాజిక్ టిల్లు స్క్వేర్‌లో కథ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు.. ఓన్లీ మ్యాజిక్ అంతే! పంచులు, కామెడీ డైలాగులు పటాసుల్లా పేలుతాయి. అలాంటి మ్యాజిక్‌తోనే బాలీవుడ్లో ఓ సినిమా వచ్చింది.. అదే క్రూ. ఇందులో పెద్దగా ఎమోషన్స్ ఉండవు, సీరియస్ సినిమా కానే కాదు.. కామెడీ ఎంటర్టైనర్. ముగ్గురు ఫ్లయిట్ అటెండెట్లు.. కరీనా, టబు, కృతి పని చేసే ఎయిర్‌లైన్స్ త్వరలో దివాలా తీస్తుందని ఓ రూమర్. కథేంటంటే? పని ఎక్కువ, జీతాలు తక్కువ, మరోవైపు ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనన్న భయం. ఈ ముగ్గురూ ఉన్న ఫ్లయిట్లో ఓరోజు సడన్‌గా ఓ పెద్దాయన కుప్పకూలిపోతాడు. తన చొక్కా కింద బంగారు కడ్డీలు కనిపిస్తాయి. అవి కొట్టేసి జీవితంలో సెటిలైపోవాలనేది వారి ఆశ. తరువాత ఏమైందన్నదే కథ. ముగ్గురు హీరోయిన్ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. కలెక్షన్స్ ఎంతంటే? మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు హిందీ బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడంతో దూసుకుపోతోంది. రాజేశ్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.87 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చూస్తుంటే త్వరలోనే రూ.100 కోట్లు దాటేసేలా కనిపిస్తోంది. అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్‌ల బడే మియా చోటే మియా, అజయ్ దేవ్‌గణ్ మైదాన్ ఈ నెల 10న రిలీజ్ కానుంది. అప్పటివరకు క్రూ మూవీ కలెక్షన్స్‌కు ఎలాంటి ఢోకా లేనట్లే! CREW is flying high with a strong start at the box office with a solid week 1 collection! 🛫#CrewInCinemasNow Book your tickets now: https://t.co/jAZNn6fYMR#Tabu #KareenaKapoorKhan @kritisanon @diljitdosanjh and a special appearance by @KapilSharmaK9 pic.twitter.com/IZJnvt9QIC — BalajiMotionPictures (@balajimotionpic) April 5, 2024 చదవండి: మలయాళంలో రూ.200 కోట్లు వసూలు చేసిన మంజుమ్మల్ బాయ్స్ ఎలా ఉంది? -
హోలీ వేడుకల్లో మెగా డాటర్స్.. గ్రీన్ శారీలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్!
హోలీ వేడుకల్లో మెగా డాటర్స్ సందడి.. అలాంటి లుక్‌లో కనిపించిన టబు... అయోధ్య బాలరామున్ని దర్శించుకున్న అనన్య నాగళ్ల... గ్రీన్ శారీలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్ హోయలు.. హోలీ వేడుకల్లో సందడి చేసిన మంచులక్ష్మి.. ప్రగ్యా జైస్వాల్ స్టన్నింగ్ పోజులు.. వేసవిలో చిల్ అవుతోన్న లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Roopa Koduvayur (@roopakoduvayur_9) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Tabu (@tabutiful) View this post on Instagram A post shared by Sushmita (@sushmitakonidela) -
కాస్కోండి మూడోసారి కూడా ఈ సినిమాతో భయపెట్టడం గ్యారెంటీ
హారర్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘భూల్ భులయ్యా’. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో భాగంగా రెండు సినిమాలు వచ్చాయి. అవి రెండూ భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్‌తో ఆ సక్సెస్‌ను కొనసాగిస్తున్నారు మేకర్స్. సౌత్ ఇండియాలో మంచి విజయాన్ని అందుకున్న 'చంద్రముఖి' సినిమాకు రీమేక్ వెర్షన్‌గా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన సినిమా 'భూల్ భులయ్యా'. 2007లో విడుదలైన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్ ప్రధాన పాత్రలు పోషించారు. 'చంద్రముఖి' డైరెక్టర్ ప్రియదర్శన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. దీంతో సుమారు 15 ఏళ్ల తర్వాత అనీస్ బజ్మీ దర్శకత్వంలో 'భూల్ భులయ్యా 2' విడుదలైంది. 2022లో వచ్చిన ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్, కియారా అడ్వాణీ, టబు నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ ప్రాంచైజీకి బాలీవుడ్లో మంచి గుర్తింపు రావడంతో మూడో ప్రయత్నానికి ముహూర్తం కుదిరింది. ఇందులో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. మాధురీ దీక్షిత్, విద్యాబాలన్ ఈ ప్రాజెక్టులో భాగమవ్వడంతో సెట్స్‌కు చేరకముందే దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. 'భూల్ భులయ్యా 3' నవంబర్‌లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
విమానంలో చోరీ
టబు, కరీనా కపూర్, కృతీసనన్ ప్రధాన పాత్రల్లో, దిల్జీత్ సింగ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ది క్రూ’. కార్పొరేట్ ఏవియేషన్ బిజినెస్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో టబు, కరీనా, కృతీ ఎయిర్‌హోస్టెస్‌గా నటించారు. ఓ విమానం హైజాకింగ్, దొంగతనం నేపథ్యంలో ‘ది క్రూ’ సినిమా కథనం ఉంటుందని బీ టౌన్ టాక్ . ఇక బాలీవుడ్లో ‘లూట్కేస్’ సినిమా తీసిన రాజేష్ కృష్ణన్ ఈ సినిమాకు దర్శకుడు. ‘వీరే ది వెడ్డింగ్ (2018)’, ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్(2023)’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ నిర్మించిన రేఖా కపూర్, ఏక్తా కపూర్ ‘ది క్రూ’ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమాలోని ప్రధాన తారాగణం అయిన టబు, కరీనా, కృతీసనన్ల కొత్త పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. తొలుత ఈ సినిమాను మార్చి 22న రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత మార్చి 29కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
మనసు మార్చుకున్న హీరోయిన్ టబు.. 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు!
టబు గురించి ఇప్పటి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ కాస్త ముందు జనరేషన్‌ని అడిగితే ఆమె యాక్టింగ్ గురించి చెబుతారు. గత కొన్నేళ్ల నుంచి పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైపోయిన ఈ బ్యూటీ.. మధ్యలో 'అల వైకుంఠపురములో' అనే తెలుగు సినిమాలో మాత్రమే నటించింది. తర్వాత మళ్లీ హిందీపైనే ఫోకస్ చేసింది. అలాంటిది ఇప్పుడు మరోసారి దక్షిణాదిలో నటించనుంది. (ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?) తమిళంలో అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం 'విడాముయర్చి' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో త్రిష హీరోయిన్ కాగా నటిస్తుండగా అర్జున్, రెజీనా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీని తర్వాత అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇందులో అజిత్ సరసన బాలీవుడ్ భామ టబు నటిస్తున్నట్లు తాజా సమాచారం. 2000లో టబు-అజిత్ జంటగా తమిళంలో 'కండు కొండేన్' అనే సినిమా వచ్చింది. 'ప్రియురాలు పిలిచింది' పేరుతో ఇది తెలుగులోనూ డబ్ అయింది. రాజీవ్ మేనన్ దర్శకుడు. అదే ఏడాది మరో తమిళ సినిమా చేసిన టబు.. 2013లో మరో తమిళ మూవీ చేసింది అంతే. మళ్లీ ఇన్నాళ్లకు మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే అజిత్‌తో అయితే ఏకంగా 24 ఏళ్ల తర్వాత కలిసి పనిచేయబోతుందనమాట. (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న అందాల తార టబు
-
ఫ్రాంచైజీలుగా రాబోతున్న టబు ‘ఖూఫియా’
ఈ మధ్య కాలంలో సీక్వెల్ అనేది కామన్ అయిపోయింది. ఒక సినిమా హిట్ అయిందంటే చాలు దానికి సీక్వెల్ తీసుకొస్తున్నారు. పార్ట్ 1, 2,3 అంటూ ఫ్రాంచైజీలుగా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఫ్రాంచైజీ అంటే ఒక సినిమా కథలోని పాత్రలు తీసుకొని..ఇంకో కథలా మార్చి..చూపించడమే. దాన్నే మన భాషలో సీక్వెల్ అని అంటాం. గతంలో హాలీవుడ్లో మాత్రమే ఫ్రాంచైజీ మూవీస్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఇండియన్ చిత్రాల్లో కూడా ఫ్రాంచైజీ కల్చర్ వచ్చేసింది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీలోనూ సీక్వెల్స్ జోరు నడుస్తోంది. హిట్ మూవీలకు వెంటనే పార్ట్ 2 వచ్చేస్తుంది. తాజాగా మరో చిత్రం కూడా ఫ్రాంచైజీలుగా రావడానికి సిద్ధమైంది. అదే ‘ఖూఫియా’. అలనాటి అందాల తార టబు నటించిన స్పై థ్రిల్లర్ సినిమా ఇది. విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. విశాల్ మేకింగ్, టబు యాక్టింగ్‌పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఏడాదికో ‘ఖూఫియా’ టబు, అలీ ఫజల్, హాట్ బ్యూటీ వామిగా గబ్బి, ఆశీష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఖుఫియా’. అమర్ భూషణ్ రచించిన 'ఎస్కేప్ టు నో వేర్' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు విశాల్ భరద్వాజ్. ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో.. ఫ్రాంచైజీలుగా తీసుకురావాలని భావిస్తున్నాడట దర్శకుడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా విశాల్ భరద్వాజే ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘ఖూఫియా’ ఫ్రాంచైజీలుగా తీసుకురావాలనుకుంటున్నాడు. ఈ చిత్రంలోని కృష్ణ మెహ్రా పాత్రతో ఫ్రాంచైజీ ప్లాన్ చేస్తున్నాడు. ఇకపై ఏడాదికొక ‘ఖుఫియా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను’అని విశాల్ భరద్వాజ్ చెప్పుకొచ్చాడు. అంటే త్వరలోనే ‘ఖుఫియా 2’ రాబోతుందన్నమాట. ‘ఖూఫియా’ కథేంటి? కృష్ణ మెహ్రా అలియాస్ కేఎం (టబు), జీవ్ ( ఆశిష్ విద్యార్థి) రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ‘రా’ అధికారులు. ఢిల్లీలోని ‘రా’ ప్రధాన కార్యాలయంలో పనిచేసే రవి మోహన్ (అలీ ఫాజిల్)..అక్కడి సమాచారాన్ని ఉగ్రవాద సంస్థలకు చేరవేస్తున్నట్లు జీవ్ అనుమానిస్తాడు. అతనిపై నిఘా పెట్టాలని కేఎంను ఆదేశిస్తాడు. పై అధికారి ఆదేశంతో కేఎం ‘ఆపరేషన్ బ్రూటస్’పేరుతో రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో కేఎం బృందానికి ఎదురైన సమస్యలు ఏంటి? జీవ్ అనుమానించినట్లు రవి నిజంగానే ఉగ్రసంస్థలకు సమాచారం చేరవేశాడా? రవి దేశ ద్రోహ చర్యల వెనుక ఉన్నదెవరు? ఈ మోసంలో రవి భార్య చారు(వామికా గబ్బీ) హస్తం ఉందా? హీనా రెహమాన్(అజ్మేరీ), కేఎంకు ఉన్న సంబంధం ఏంటి? హీనాను హత్య చేసిందెవరు? కేఎం నేపథ్యం ఏంటి? ‘ఆపరేషన్ బ్రూటస్’ ఏ మేరకు సక్సెస్ అయింది అనేది తెలియాలంటే ‘ఖూఫియా’ సినిమా చూడాల్సిందే. ‘రా’ ఎలా పని చేస్తుందో వివరించే కథ ఇది. -
Social Hulchul: అందాల ప్రదర్శనలో అనుపమతో తమన్నా పోటీ
► బ్లాక్ డ్రెస్‌లో డోస్ పెంచుతున్న అనుపమ పరమేశ్వరన్.. ఘాటైన పోజులతో లేటెస్ట్ ఫోటలు వైరల్ ► భూమిపై నిజమైన స్వర్గం ఇదేనేమో అంటూ.. కుటుంబంతో పాటు స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న హనీరోజ్ ► ఎవర్గ్రీన్ అందంతో మెరిసిపోతున్న టబు ► లగ్జరీ బైక్‌పై సింగిల్‌గా రైడ్ చేస్తూ తగ్గేదెలే అంటున్న మంజు వారియర్ ►లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్ ఫోటో షూట్లో రెచ్చిపోయిన తమన్నా View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
లేటు వయసులోనూ అందంతో మెస్మరైజ్ చేస్తున్న టబు.. ఫొటోలు
-
తుపాకీ పట్టిన హీరోయిన్లు.. బాక్సాఫీస్‌పై గురి
తుపాకీ పట్టారు.. విలన్లపై గురి పెట్టారు...రెచ్చిపోయి ఫైట్స్ చేస్తున్నారు... బాక్సాఫీస్ కలెక్షన్లపై గురి పెట్టారు... ప్రస్తుతం కొందరు కథానాయికలు సిన్సియర్ పోలీసాఫీసర్లుగా, లేడీ జేమ్స్ బాండ్ తరహా పాత్రల్లో నటిస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. సీనియర్ నటి టబు మరో రెండు నెలల్లో ఇన్స్పెక్టర్ డయానా జోసెఫ్‌గా కనిపించనున్నారు. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న హిందీ చిత్రం ‘భోలా’లోనే ఆమె పోలీస్ ఇన్స్పెక్టర్ డయానా జోసెఫ్ పాత్ర చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఈ చిత్రంలో టబు లుక్ విడుదలైంది. మార్చి 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక గత ఏడాది సెప్టెంబర్‌లో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో యువరాణి పాత్రలో కనిపించిన త్రిష త్వరలో విడుదల కానున్న వెబ్ సిరీస్ ‘బృందా’లో తుపాకీ తూటాలను అలవోకగా వదిలే పోలీస్‌గా కనిపించనున్నారు. త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. సూర్య వంగల దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ సీజన్ వన్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస్ రూపొందింది. ఇక కాజల్ అగర్వాల్ కూడా సిన్సియర్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ‘ఘోస్టీ’ అనే చిత్రంలోనే ఈ పాత్ర చేశారామె. తన తండ్రి అడుగుజాడలను అనుసరించి, పోలీస్‌గా మారుతుంది ఆర్తి (కాజల్). ఇరవయ్యేళ్ల క్రితం తన తండ్రి కస్టడీ నుంచి తప్పించుకున్న ఖైదీని పట్టుకోవాలన్నదే ఆర్తి ఆకాంక్ష. ఈ క్రమంలో ఆమెకు విచిత్రమైన ఘటనలు ఎదురవుతుంటాయి. కాజల్ నటించిన తొలి హారర్ సినిమా ఇది. కల్యాణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు అధికారిక ప్రకటన రాలేదు కానీ ఓ హిందీ షోలో తమన్నా పోలీస్‌గా చేస్తున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ షో సాగుతుందని సమాచారం. ఇంకోవైపు దాదాపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న నయనతార తన తొలి హిందీ చిత్రం ‘జవాన్’లో పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. షారుక్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న తొలి హిందీ చిత్రం ఇది. ఈ చిత్రంలో అన్యాయంగా జైలుపాలైన మహిళలను విడిపించి, వారిని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడే ఒక టీమ్‌గా మార్చే కామన్ మేన్ పాత్రను షారుక్ ఖాన్ చేస్తున్నారని సమాచారం. ఈ కేసును ఛేదించే పోలీసాఫీసర్ పాత్రలో నయనతార కనిపిస్తారని టాక్. ఈ ఏడాది జూన్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలంటే దర్శకులకు గుర్తొచ్చే కథానాయికల్లో కీర్తీ సురేష్ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం కీర్తి చేస్తున్న చిత్రాల్లో ‘రివాల్వర్ రీటా’ ఒకటి. రెండు చేతులతో రెండు తుపాకీలు పట్టుకుని అలవోకగా షూట్ చేసే రీటా పాత్రలో కనిపించనున్నారు కీర్తి. కె. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లేడీ జేమ్స్ బాండ్ తరహా పాత్ర చేస్తున్నారామె. మరోవైపు హిందీ చిత్రం ‘కమాండో’ సీక్వెల్స్‌లో పోలీస్ ఇన్స్పెక్టర్ భావనా రెడ్డిగా కనిపించిన అదా శర్మ ప్రస్తుతం ఓ హిందీ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా చేస్తున్నారు. విశాల్ పాండ్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోసారి పోలీస్‌గా నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది అంటున్నారు అదా. ఇక ‘సీతారామం’ చిత్రంతో పాపులర్ అయిన మృణాల్ ఠాకూర్ నటించిన హిందీ చిత్రం ‘గూమ్రా’. ‘సీతారామం’లో సున్నిత మనసు ఉన్న సీత పాత్రలో అందర్నీ ఆకట్టుకున్న మృణాల్ ‘గూమ్రా’లో శక్తిమంతమైన పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర చేయడానికి శిక్షణ తీసుకున్నారు మృణాల్. తమిళ చిత్రం ‘తడమ్’కి రీమేక్‌గా వర్థన్ కట్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ తారలే కాదు.. మరికొందరు కథానాయికలు కూడా పోలీసాఫీసర్ పాత్రలో విజృంభించనున్నారు. -
అజయ్ దేవగన్ డైరెక్షన్లో పోలీస్ ఆఫీసర్‌గా టబు! ఫస్ట్‌లుక్ రిలీజ్
అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘భోలా’. అజయ్ దేవగన్ ఫిలిమ్స్, టీ–సిరీస్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, కృషణ్ కుమార్, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టబు కీలక పాత్ర చేస్తున్నారు. ఆమె చేస్తున్న పోలీస్ ఆఫీసర్ లుక్‌ని అజయ్ దేవగన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘ఏక్ ఖాకీ.. సౌ సైతాన్స్’(ఒక పోలీసు.. వంద మంది దెయ్యాలు) అంటూ రాసుకొచ్చారు. పోలీస్ డ్రెస్, చేతిలో గన్‌తో టబు పవర్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా కనిపించారు. కార్తీ నటించిన ‘ఖైదీ’ చిత్రానికి హిందీ రీమేక్‌గా ‘భోలా’ తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది. Ek khaaki. Sau shaitaan.#TabuInBholaa #Bholaain3D #Tabu pic.twitter.com/W5wLWqENyQ — Ajay Devgn (@ajaydevgn) January 17, 2023 -
బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్న సీనియర్ హీరోయిన్లు
సినిమాల సక్సెస్ రేటు పడిపోయింది. విజయాలు రావటం అంటే అశా మాషి విషయం కాదు అనేలా మారింది. అయితే..కొందరు సీనియర్ భామలు మాత్రం..వెతుక్కుంటూ మరి హిట్ సినిమాలలో నటిస్తున్నారు. వీళ్ల గురించి..ఎవరు పట్టించుకోని టైమ్ లో..ఫోకస్ మొత్తం ఈ బ్యూటీల సైడ్ మారిపోయేలా చేశారు.ముందు ముందు కూడా మంచి సినిమాలతో దూసుకపోయేలా ప్లాన్ కూడా చేస్తున్నారు. టాబు అప్పట్లో కథానాయికగా ఓ ఊపు ఊపింది.ఇప్పుడు కూడా ప్రధాన పాత్రలలో నటిస్తూ..ఆకట్టుకుంటుంది. ఈమె నటించిన దేదే ప్యార్ దే మూవీ హిట్ కొట్టింది.అలాగే అల..వైకుంఠపురంలో మూవీలో కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించిన మ్యాటర్ తెలిసిందే. ఈమె ప్రధాన పాత్రలో నటించిన భూల్ భులయ్య 2 కూడా బిగ్ హిట్ కొట్టింది.అలాగే రీసెంట్ గా దృశ్యం 2 లో కూడా నటించింది.ఈ మూవీ రెండు వందల కోట్ల వసూళ్లు రాబట్టింది శ్రీయా శరన్ కూడా టాలీవుడ్ తో పాటు..బాలీవుడ్ లో నటించింది. ఈ భామ అదృష్టం కూడా బాగానే ఉంది. ట్రిపుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీలో ఓ పాత్రలో మెరిసింది..దృశ్యం 2 లో అజయ్ దేవగన్ పక్కన జోడి కట్టింది. 2018 లో వచ్చిన 96 సినిమా తప్పితే,త్రిషకు అనుకున్న విజయాలు మాత్రం దక్కటం లేదు. ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ మూవీలో కుందవాయ్ దేవిగా ఆకట్టుకుంది .ఈ మూవీ బిగ్ హిట్ కొట్టింది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి 67 మూవీ రూపొందబోతుంది.ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా ఫిక్స్ అయిందట. మొత్తానికి సినిమా సక్సెస్ రేట్ పడిపోయినా..కొందరు సీనియర్ హీరోయిన్స్ బాక్సాఫీసు దగ్గర సత్తా చూపిస్తున్నారు. -
అజయ్ దేవ్‌గణ్ 'దృశ్యం 2'.. టైటిల్ సాంగ్ చూశారా?
అజయ్ దేవగణ్, శ్రియా శరన్, టబు ప్రధాన పాత్రల్లో హిందీలో తెరకెక్కుతున్న చిత్రం 'దృశ్యం-2'. మలయాళంలో సూపర్ హిట్ మూవీ దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్‌ను చిత్ర నిర్మాతలు రిలీజ్ చేశారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ కాంబినేషన్లో ఇప్పటికే రిలీజైన దృశ్యం భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్) ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఉతుప్, విజయ్ ప్రకాష్ ఈ పాటను ఆలపించగా.. అమితాబ్ భట్టాచార్య ఈ సాంగ్‌ను రచించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. -
తండ్రిని ఇష్టపడని టబు, ఎందుకంటే?
సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ టాప్ హీరోయిన్గా వెలుగొందింది టబు. తన పూర్తి పేరు టబసమ్ ఫాతిమా హష్మీ. ఇందులో ఆమె తల్లి ఇంటిపేరే ఉంది కానీ తండ్రి ఇంటి పేరు లేదు. అంతేకాదు, అసలు ఎక్కడా తన తండ్రి పేరును ఉపయోగించదు టబు. దీనికి గల కారణమేంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిందీ సీనియర్ హీరోయిన్. 'నా బాల్యం గొప్పగా జరిగింది. నాన్న అమ్మకు విడాకులిచ్చాక మేము హైదరాబాద్‌లోని అమ్మమ్మవాళ్లింట్లో ఉన్నాం. అక్కడే పెరిగాను. అమ్మ టీచర్ కావడంతో నేను ఎక్కువగా అమ్మమ్మతోనే సమయం గడిపేదాన్ని. తను నాకోసం ఎన్నో పుస్తకాలు చదివి వినిపించేది. అలాగే పెరుగుతూ వచ్చాను. నేను చాలా పిరికిదాన్ని. అప్పట్లో పెద్దగా గొంతు పెగిల్చేదాన్ని కాదు. నిజానికి హీరోయిన్ అయ్యాక కూడా నేను ఎప్పుడూ గట్టిగా మాట్లాడలేదు. నా పేరులోని ఫాతిమా అమ్మ పుట్టింటి నుంచి వచ్చిన ఇంటిపేరు. ఇకపోతే నాన్న ఇంటి పేరునే వాడాలని నాకెప్పుడూ అనిపించలేదు. నాన్నకు సంబంధించిన ఏ జ్ఞాపకాలూ నా దగ్గర లేవు. అతడి గురించి ఆలోచించాలన్న ఆసక్తి కూడా లేదు. ఇప్పుడెలా ఉన్నానో అలానే ఉండాలనుకుంటున్నాను. ఇలాగే సంతోషంగా ఉన్నాను కూడా!' అని చెప్పుకొచ్చింది టబు. చదవండి: తెలుగులో మలయాళ హిట్ మూవీ డబ్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఇనయ నీ మనసులో ఏముందు తెలుసు, సీక్రెట్ రూమ్ ఓపెన్ చేసిన నాగ్ -
ఆ హీరోతో ఒక్కటంటే ఒక్క సినిమా చేయని టబు! మారిషస్‌లో అప్పుడేమైంది?
భారత్‌లో అత్యున్నత నాలుగో అవార్డు పద్మ శ్రీ సాధించిన ఘనత. జాతీయ ఉత్తమ నటిగా రెండు అవార్డులు, ఆరు ఫిలింఫేర్ అవార్డులు. చలనచిత్ర రంగానికి చేసిన సేవలకు మరెన్నో పురస్కారాలు, విమర్శకుల ప్రశంసలు. 52 ఏళ్ల వయసులోనూ వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తూ బిజీబిజీ. నేడు దిగ్గజ నటి టబు పుట్టినరోజు. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు..! 1985లో ఎవర్గ్రీన్ నటుడు దేవానంద్ నవ్ జవాన్ సినిమాలో టీనేజర్ కేరెక్టర్ ద్వారా టబు సినీరంగ ప్రవేశం చేసింది. 1991లో విక్టరీ వెంకటేష్ హీరోగా కూలీ నెం.1 సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. పలు హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు చేసిన టబు తనకంటూ ప్రత్యేక గుర్తింపుపొందింది. 1994లో బాలీవుడ్ మూవీ విజయ్పథ్లో నటించి ఫిలింఫేర్ అవార్డు గెలుపొందింది. గుల్జార్, మాచీస్ సినిమాల్లో నటనకు విమర్శకుల ప్రశంసలు, ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డులు వరించాయి. నాగార్జున కెరీర్‌ని మరో మలుపు తిప్పిన నిన్నే పెళ్లాడతా సినిమాలో టబు నటన యువతకు గిలిగింతలు పెట్టింది. ఆ సినిమాకు కూడా ఆమెకు ఫిలింఫేర్ అవార్డు లభించింది. విరాసత్, అస్థిత్వ, చాందినీ బార్ సినిమాల్లో నటనకు విమర్శకుల ప్రశంసలు పొందింది. తదనంతరం కాలంలో సపోర్టింగ్ కేరెక్టర్లతోనూ రాణిస్తోంది. అంధాధూన్, భూల్‌భులయ్యా-2, దృశ్యం-2 వంటి సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తూ టబు బిజీ అయింది. అయితే, తన వ్యక్తిగత విషయాలను ఎక్కువగా షేర్ చేసుకోని ఆమె జీవితంలో ఓ చేదు ఘటన దాగుంది. (చదవండి: అరుదైన వ్యాధులతో బాధపడుతున్న అందమైన భామలు వీళ్లే) టాప్ హీరోయిన్ చెల్లి టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. ఆమె సోదరి ఫరా నాజ్ అప్పట్లో టాప్ హీరోయిన్. సోదరి వెంట టీనేజర్‌గా ఉన్న టబు షూటింగ్ స్పాట్లకు వెళ్లేది. అలా వెళ్లిన సమయంలోనే 1980లో లైంగిక వేధింపులకు గురైంది. ఒరిస్సా పోస్టు 1986లో ఇచ్చిన కథనం ప్రకారం.. జాకీ ష్రాఫ్, ఫరా నాజ్ హీరో, హీరోయిన్లుగా ఓ సినిమా షూటింగ్ మారిషస్‌లో జరుగుతోంది. ఆ క్రమంలో సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు డేనీ డెంగ్జోపా అక్కడే తన ఇంట్లో చిత్ర యూనిట్‌కు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చాడు. పార్టీలో ఫరా నాజ్తోపాటు టబు కూడా పాల్గొంది. అయితే, ఫరా నాజ్ ఫూటుగా తాగి పడిపోయింది. సోదరి పరిస్థితి చూసి అప్పటికే భయంతో వణిపోయిన టబుకు మరో ఉపద్రవం వచ్చిపడింది. మద్యం మత్తులో ఉన్న జాకీ ష్రాఫ్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది గమనించిన డేనీ డెంగ్జోపా ఆ స్థితిలో నుంచి టబును రక్షించాడు. తర్వాత ఈ విషయం కొద్దికాలం ఎక్కడా బయటకు పొక్కలేదు. కానీ, ఫరా నాజ్ తన సోదరి పట్ల జాకీ ష్రాఫ్ ప్రవర్తనను ఎండగట్టింది. లైంగికంగా తన చెల్లెలిని వేధించాడని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ అంశం అప్పట్లో సంచలనంగా మారింది. ఇంత జరిగినా టబు ఎక్కడా ఎప్పుడూ ఈ విషయాన్ని చెప్పకపోవడం గమనార్హం. ఎందరో నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె జాకీ ష్రాఫ్‌తో మాత్రం లీడ్ రోల్స్‌లో ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ చేయలేదు. గతంలో ఎదురైన చేదు అనుభవం దృష్ట్యానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరగడం మామూలైపోయింది. (చదవండి: చీటింగ్ చేసి ప్రియాంక మిస్ వరల్డ్ అయ్యిందా? ఆమె కామెంట్స్ వైరల్) -
వయస్సు పెరిగినా అందంలో తగ్గేదేలే.. అగ్ర హీరోలతో టబు (ఫొటోలు)
-
దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్
అజయ్ దేవగణ్, శ్రియ, టబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం-2. మలయాళంలో సూపర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. తాజాగా హిందీలో రాబోతున్నదృశ్యం 2 ట్రైలర్ వచ్చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ కాంబినేషన్లో ఇప్పటికే రిలీజైన దృశ్యం భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: దృశ్యం 2 క్రేజీ అప్డేట్.. టీజర్ డేట్ ఫిక్స్) ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. ఇవాళ విడుదలైన ట్రైలర్‌ను చూస్తే ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తోంది. అజయ్ దేవగణ్ మృతదేహాన్ని పాతిపెట్టే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్లో అజయ్ దేవ్‌గణ్, శ్రియ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ మూవీ నవంబర్ 18 థియేటర్లలో సందడి చేయనుంది. అక్షయ్ ఖన్నా, రజత్ కపూర్, ఇషితా దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మలయాళంలో 2015లో వచ్చిన మోహన్ లాల్ చిత్రానికి రిమేక్‌గా వస్తోంది. -
ఆ సినిమా టికెట్లపై భారీ తగ్గింపు.. అయితే ఆ ఒక్కరోజు మాత్రమే..!
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం- 2. మలయాళంలో సూపర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. హిందీలో దృశ్యం- 2 విడుదలకు సిద్దమైంది. అయితే తాజాగా ప్రేక్షకుల కోసం సరికొత్త బంపర్ ఆఫర్ ప్రకటించింది చిత్రబృందం. సినిమా రీలీజ్ రోజున అడ్వాన్స్ బుకింగ్ టికెట్లపై 50 శాతం భారీ తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 2 తేదీన బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ అభిమానులకు అందించేందుకు బహుళస్థాయి సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు చిత్రబృందం వివరించింది. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో టబు, ఇషితా దత్తా, అక్షయ్ ఖన్నా, రజత్ కపూర్, శ్రియా శరణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే పేరుతో 2021లో వచ్చిన మోహన్ లాల్ మలయాళ చిత్రానికి రీమేక్‌గా వస్తోంది ఈ సినిమా. 2015లో విడుదలైన దృశ్యం సూపర్ హిట్‌గా నిలిచింది. Vijay Salgaonkar and family are back to continue the narrative of 2nd October! Advance bookings open on 2nd October and you can block your tickets on the PVR app for JUST Rs. 50 and get 50% OFF on first day shows of Drishyam 2. #Drishyam2 in cinemas on 18th November, 2022. pic.twitter.com/EIEIV1ijvG — P V R C i n e m a s (@_PVRCinemas) October 1, 2022 -
రూ.50 వేలు పెట్టి ఆ క్రీమ్ కొన్నాను.. సీక్రెట్ రివీల్ చేసిన టబు
సాధారణంగా హీరో హీరోయిన్లు తన గ్లామర్ రహస్యాన్ని బయటపెట్టరు. అందంగా ఉండేందుకు రకరకలా ఫేస్ క్రీములను వాడుతుంటారు. కానీ వాటిని గోప్యంగా ఉంచుతారు. అయితే సీనియర్ హీరోయిన్ టబు మాత్రం తన అందానికి సంబంధించిన ఓ సీక్రెట్‌ని అభిమానులతో పంచుకుంది. అందంగా ఉండేందుకు తాను ఒక్కసారి రూ.50 వేలు పెట్టి ఫేస్ క్రీమ్ కొన్నానని, ఆ తర్వాత ఇంకెప్పుడు ఫేస్ క్రీమ్ వాడలేదని చెప్పుకొచ్చింది. ఇటీవల ఆమె ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా మీ అందం వెనుక ఉన్న రహస్యం ఏంటని ప్రశ్నించిన యాంకర్‌కు పైవిధంగా సమాధానం చెప్పింది. ‘ఓసారి నా మెకప్ ఆర్టిస్ట్ ‘మీ అందానికి రహస్యం ఏంటి?’అని నన్ను ప్రశ్నించింది. అప్పుడు నేను ఏ సీక్రెట్ లేదని చెప్పాను. అయితే కొన్నాళ్ల తర్వాత నాకు ఓ ఫేస్‌క్రీమ్ కొనమని సలహా ఇచ్చింది. దాని ఖరీదు రూ.50 వేలు. ఒక్కసారి మాత్రమే దానిని కొనుగోలు చేశా. ఆ తర్వాత ఎప్పుడూ ఆ క్రీమ్‌ని వాడలేదు. అందంగా ఉండేందుకు నేను ప్రత్యేకంగా ఎలాంటి క్రీములు గానీ, ఫేస్ వాష్‌లు గానీ చేయించను’అని టబు చెప్పుకొచ్చింది. కాగా,ఇటీవల బాలీవుడ్ మూవీ భూల్ భులయ్య-2తో మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న టబు.. ప్రస్తుతం అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి ‘దృశ్యం-2’లో నటిస్తోంది. -
25న చెన్నకేశవరెడ్డి రీ రిలీజ్
‘‘చెన్నకేశవరెడ్డి’ సినిమాని 20 ఏళ్ల క్రితం ఒక పండగలా రిలీజ్ చేశాం. ఇప్పుడు కూడా రీ రిలీజ్‌లా లేదు.. కొత్త సినిమాని విడుదల చేస్తున్నట్లే అనిపిస్తోంది. మంచి ఉద్దేశం కోసం రీ రిలీజవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు, నందమూరి ఫ్యాన్స్ ఆదరించాలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. బాలకృష్ణ హీరోగా, టబు, శ్రియ హీరోయిన్లుగా వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెన్నకేశవ రెడ్డి’. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమా 2002 సెప్టెంబర్ 25న రిలీజైంది. ఈ సినిమా రిలీజై 20 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ నెల 25న రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు బెల్లంకొండ సురేష్. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘చెన్నకేశవ రెడ్డి’లో బాలయ్యగారిని ఎలా చూపించాలా? అనే పిచ్చితో కొన్ని గంటలు మాత్రమే నిద్రపోయేవాణ్ణి. ఈ సినిమాలో వచ్చే మేజర్ రెవెన్యూని ‘బసవతారకం ట్రస్ట్’కి విరాళంగా ఇస్తాం’’ అన్నారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ– ‘‘చెన్నకేశవ రెడ్డి’ రీ రిలీజ్ గురించి బాలకృష్ణగారికి చెప్పగానే సంతోషపడ్డారు. ఈ నెల 24న ప్రీమియర్ షోలతో మొదలుపెట్టి, 25న రెగ్యులర్ షోలతో విడుదల చేస్తున్నాం. రీ రిలీజ్లో ఒక సినిమాని కోటి రూపాయలకు అడిగిన దాఖలాలు లేవు.. కానీ పలువురు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కోటి రూపాయలకు అడగడం ‘చెన్నకేశవ రెడ్డి’ క్రేజ్‌కి నిదర్శనం. ఈ సినిమాకి వచ్చే రెవెన్యూలో 75 శాతం ‘బసవతారకం ట్రస్ట్’కి, మిగతాది నాకు సంబంధించిన అసోషియేషన్స్కి ఇస్తాను. నవంబర్ నుంచి మళ్లీ యాక్టివ్‌గా ప్రొడక్షన్ మొదలు పెట్టాలనుకుంటున్నాను’’ అన్నారు. -
పెళ్లి కాకుండానే గర్భం దాల్చొచ్చు : హీరోయిన్ టబు
సీనియర్ హీరోయిన్ టబుకి 50ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఓ ప్రెస్మీట్లో మాట్లాడిన టబు పెళ్లి, పిల్లలపై బోల్డ్ కామెంట్స్ చేసింది. 'నాకు కూడా తల్లినవ్వాలనుంది. అయితే దీనికి పెళ్లిచేసుకోవాల్సిన అవరసం లేదు. పెళ్లికాకుండానే గర్భం దాల్చొచ్చు. సరోగసి ద్వారా కూడా తల్లినయ్యే అవకాశం ఉంది. పెళ్ళి కాకపోతే చచ్చిపోం, తల్లి కాకపోయినా చచ్చిపోం. ప్రస్తుతం కెరీర్, యాక్టింగ్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. పెళ్లి, పిల్లలకి వయసుతో సంబంధం లేదు' అంటూ పేర్కొంది. తన మనసుకి నచ్చినవాడు ఇంకా దొరకలేదని, మహిళల్ని అన్ని విధాలుగా గౌరవించేవాడు తనకు దొరికితే పెళ్లిచేసుకుంటానంటూ టబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తతం టబు చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
అజయ్‌తో నేను చేసిన తొమ్మిదో చిత్రం ఇది: టబు
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా హిందీ చిత్రం భోళ. ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా టబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. భోళ షూటింగ్‌ను పూర్తిచేశాం. అజయ్‌తో నేను చేసిన తొమ్మిదో చిత్రం ఇది అంటూ లొకేషన్లోని ఫోటోని షేర్ చేశారు టబు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది. కాగా తమిళంలో హిట్ సాధించిన 'ఖైది' చిత్రానికి హిందీ రీమేక్‌గా భోళ తెరకెక్కింది. View this post on Instagram A post shared by Tabu (@tabutiful) -
కాలు విరగ్గొట్టుకున్నా డోంట్ కేర్ అంటున్న హీరోయిన్స్
‘రిస్కీ ఫైట్ చేయాలా? డూప్ వద్దు.. చేసేస్తాం’ అని కొందరు హీరోయిన్లు యాక్షన్ సీన్స్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో గాయాలపాలవుతుంటారు. అలా ఈ మధ్య టబు, శిల్పా శెట్టి, సంయుక్తా హెగ్డే షూటింగ్లో గాయపడ్డారు. అయితే వెనక్కి తగ్గేదే లే అంటున్నారు. కోలుకున్నాక డూప్ లేకుండానే ఫైట్స్ చేస్తాం అంటున్నారు. ‘ఆడపులులం మేము’ అంటూ ఇటీవల వీరు చేసిన రిస్కీ యాక్షన్ గురించి తెలుసుకుందాం. టబు పేరు గుర్తు రాగానే ‘కొత్త కొత్తగా ఉన్నది...’ అంటూ వెంకటేశ్‌తో ‘కూలీ నెం. 1’లో, ‘ఎటో వెళ్లిపోయింది మనసు..’ అంటూ ‘నిన్నే పెళ్లాడతా’లో నాగార్జునతో రొమాంటిక్‌గా ఆడిపాడిన పాటలు గుర్తొస్తాయి. అలాంటి క్యూట్ రోల్స్ చేసిన టబు వీలు కుదిరినప్పుడల్లా పవర్ఫుల్ రోల్స్ చేస్తుంటారు. తాజాగా ‘భోలా’ చిత్రంలో ఆమె పోలీసాధికారి పాత్ర చేస్తున్నారు. పవర్ఫుల్ పోలీసాఫీసర్ అన్నమాట. ఈ సినిమా కోసం ఇటీవల టబు పాల్గొనగా ఓ ఛేజింగ్ సీన్ చిత్రీకరించారు. ఆ సమయంలో ఓ మోటారు సైకిల్, ట్రక్కు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ట్రక్కు అద్దాలు పగలడంతో టబు నుదురు, కంటి దగ్గర గాయాలయ్యాయి. అయితే పెద్ద ప్రమాదం కాకపోవడంతో యూనిట్ ఊపిరి పీల్చుకుంది. కానీ టబు కంటి దగ్గర గాయం కావడంతో అది తగ్గే వరకూ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ కథానాయకుడు. ఇక టబు గాయపడిన ఒకట్రెండు రోజులకు మరో నటి శిల్పాశెట్టి ప్రమాదం బారిన పడ్డారు. ప్రస్తుతం శిల్పా చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ ఒకటి. శిల్పాకి ఇది తొలి వెబ్ సిరీస్. ఇందులో శిల్పాది పోలీసాఫీసర్ క్యారెక్టర్. సో.. ఫైట్స్ ఉండటం సహజం. ‘ఒక యాక్షన్ సీన్ తీస్తూ.. యాక్షన్ అని చెప్పి, కాలు విరగ్గొట్టుకో అని నా యూనిట్ సభ్యులు అన్నారు. ఆ మాటలను సీరియస్‌గా తీసుకున్నాను. అంతే.. కాలికి బలమైన గాయం అయింది. ఫలితంగా ఆరు వారాలు షూటింగ్‌కి బ్రేక్. బలంగా తిరిగొస్తా.. ఫైట్ సీన్ చేస్తా’ అని పేర్కొన్నారు శిల్పా శెట్టి. మరోవైపు యువకథానాయిక సంయుక్తా హెగ్డే కూడా ఇటీవల షూటింగ్లో గాయపడ్డారు. ‘కిర్రాక్ పార్టీ’ చిత్రం ద్వారా ఈ కన్నడ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమయ్యారు. తాజాగా ‘క్రీమ్’ అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారామె. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సంయుక్తాకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. ఈ సినిమాకి ఆమెను కథానాయికగా ఎంపిక చేయడానికి అదొక కారణం. కాగా, ‘క్రీమ్’ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్‌తో ప్రత్యర్థులను ఎదుర్కొనే ఫైట్ సీన్లో సంయుక్తా హెగ్డేకి బలమైన గాయం తగిలింది. కాలికి గాయం కావడంతో రెండు నెలలు విశ్రాంతి సూచించారు. ‘‘ఇంటిపట్టున కూర్చోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. అయితే ఇప్పుడు కాలు కదపలేని పరిస్థితి. ఈ రెండు నెలల్లో పాటలు పాడటం నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే గతంలో కొన్ని కథలు రాశాను. వాటికి స్క్రీన్‌ప్లే రాసే టైమ్ దొరకలేదు. ఇప్పుడు ఆ పని కూడా పూర్తి చేయాలను కుంటున్నాను’’ అన్నారు సంయుక్తా. కథానాయికలకు గ్లామరస్ రోల్స్ ఎక్కువగా వస్తుంటాయి. అందుకు భిన్నంగా చాలెంజింగ్ రోల్స్ వస్తే, ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. టబు, శిల్పా, సంయుక్తా ఇటీవల గాయపడిన తారలైతే గతంలో తాప్సీ, కంగనా రనౌత్ వంటి కథానాయికలు షూటింగ్స్‌లో ప్రమాదాల బారిన పడ్డారు. అయినప్పటికీ సవాల్‌లాంటి క్యారెక్టర్ అంటే ‘సై’ అంటున్నారు. ‘ఆడపులులు’ అంతే మరి.. -
సీనియర్ హీరోయిన్ టబుకు తీవ్రగాయాలు.. షూటింగ్‌కి బ్రేక్
సీనియర్ హీరోయిన్ టబు షూటింగ్లో తీవ్రంగా గాయపడింది.బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును బైక్స్‌తో ఛేజ్ చేసే సీన్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ట్రక్కు అద్దాలు పగిలి టబు కన్ను, నుదుటికి గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో యూనిట్ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదం జరగడంతో హీరో అజయ్ దేవగన్ షూటింగ్‌కు చిన్న విరామం ప్రకటించారు. రెప్ప పాటులో ఆమె కంటికి పెను ప్రమాదం తప్పిందని సమాచారం. దీంతో మూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా మరో సినిమా షూటింగ్ సెట్లో హీరోయిన్ శిల్పాశెట్టి గాయపడింది. యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె కాలు విరిగింది. ఒకే రోజు ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ గాయపడటం గమనార్హం. -
మరోసారి మెగాఫోన్ పట్టిన బాలీవుడ్ స్టార్ హీరో
కెరీర్లో నాలుగోసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్. కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ హిట్ ఫిల్మ్ ‘ఖైదీ’ (2019) హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో కార్తీ చేసిన పాత్రను అజయ్ దేవగన్ చేస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాకు ధర్మేంద్ర శర్మను దర్శకుడిగా అనుకున్నారు. షూటింగ్ కూడా ఆరంభించారు. (చదవండి: గాడ్ ఫాదర్ లుక్‌లో అదరగొట్టేసిన చిరంజీవి) అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు అజయ్ దేవగనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని సోమవారం ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘బోళ’ అనే టైటిల్ ఖరారు చేశారు. టబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది. ఇక ‘యు మీ ఔర్ హమ్’ (2008), ‘శివాయ్’ (2016), ‘రన్ వే 34’ (2022) చిత్రాల తర్వాత అజయ్ దేవగన్ దర్శకత్వంలో రూపొందుతున్న నాలుగో చిత్రం ‘బోళ’యే కావడం విశేషం. -
‘అందులో ఉన్న ఆత్మ సామాన్యమైనది కాదు'.. ఆసక్తిగా ట్రైలర్
కార్తీక్ఆర్యన్, కియారా అద్వానీ నటిస్తున్న సినిమా ‘భూల్ భులయ్యా-2’. ప్రియదర్శన్ దర్శకత్వంలో 2007లో వచ్చిన సూపర్ హిట్ ‘భూల్ భులయ్యా’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోందీ చిత్రం. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళం, తెలుగులోనూ చంద్రముఖి పేరుతో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. భూల్ భూలైయా చిత్రం వచ్చి దాదాపు 15 ఏళ్ళు అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రం సీక్వెల్ రాబోతుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.‘పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరో ఆ తలుపును తట్టారు. అందులో ఉన్నది సామాన్యమైన ఆత్మ కాదు. అందులో ఉంది మంజులిక’ అంటూ టబు చెప్తుండటంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. రాజ్‌పాల్ యాదవ్, పరేశ్ రావల్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హ్యాకింగ్ బారిన పడిన సెలబ్రిటీలు వీళ్లే..
Celebrities List Who Have Been Affected By Hacking: సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చాలా యాక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన విషయాలు, మెమోరెబుల్ సంఘటనలను ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటూ టచ్‌లో ఉంటారు. ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు దగ్గరవుతుంటారు. కామెంట్స్ రూపంతో సెలబ్రిటీలతో వారి ఫ్యాన్స్ కూడా ఇంటరాక్ట్ అవుతుంటారు. అయితే తారలకు, అభిమానులకు అనుసంధానంగా ఉన్న ఈ సామాజిక మాధ్యామాలకు హ్యాకర్ల బెడద తక్కువేమి కాదు. ఇప్పటివరకు అనేకమంది ప్రముఖ సినీ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్‌ను హ్యాక్ చేశారు కొందరు ఆకతాయిలు. హ్యాక్ చేసి తమకు నచ్చినట్లుగా అసభ్యకర పోస్టులు, వీడియోలు, కామెంట్స్ పెడుతూ తారలను ఇబ్బందులకు గురి చేస్తారు. ఇలా సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్‌కు గురై ఇబ్బందులపాలైన సెలబ్రిటీలు వీళ్లే. అమితాబ్ బచ్చన్ పవన్ కల్యాణ్ పూజా హెగ్డె టబు వరలక్ష్మీ శరత్ కుమార్ అమృత అయ్యర్ అవికా గోర్ ఈషా రెబ్బా మేఘా ఆకాష్ అమీ జాక్సన్ అమృతా రావు ఇషా డియోల్ యాంకర్ గాయత్రి భార్గవి విద్యుల్లేఖ -
యంగ్ హీరోకు నటి టబు వార్నింగ్!
Ala Vaikunthapurramuloo Bollywood Remake: బన్నీ నటించిన హిట్ చిత్రాల్లో అల వైకుంఠపురములో ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమా సక్సెస్‌పై కన్నేసిన బాలీవుడ్ హిందీ రీమేక్ తీయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే! యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్గా 'షెహజాదా' అన్న టైటిల్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో రోహిత్ ధావన్ డీల్ చేస్తున్నారు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో టబు పాత్రలో బాలీవుడ్ నటి మనీషా కొయిరాల నటిస్తోంది. వచ్చే ఏడాది నవంబర్ 4న రిలీజ్ కానుంది. తాజాగా హీరో కార్తీక్ దర్శకుడు రోహిత్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రోహిత్‌తో పనిచేయడం చాలా బాగుంది అని రాసుకొచ్చాడు. దీనికి టబు రిప్లై ఇస్తూ.. ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తీయాలి అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చింది. దీనిపై కార్తీక్ ఆర్యన్ స్పందిస్తూ.. మీ సినిమాను మేము ఎంతో ప్రేమతో తీస్తున్నాం అని బదులిచ్చాడు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
ఆ స్టార్ హీరో వల్లే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు: టబు
Tabu And Ajay Devgan Relationship: హీరోయిన్గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన టబు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటిస్తోంది. వయసు పైబడిపోతున్నా ఆమె పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండటానికి కారణమెవరో తెలుసా? బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్. అవును, ఈ మాట అంటోంది మరెవరో కాదు టబునే.. ఆమె గతంలో ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి పలు షాకింగ్ విషయాలు వెల్లడించింది. అజయ్ దేవ్‌గణ్ తనకు సహనటుడు మాత్రమే కాదని, చిన్నప్పటి నుంచే తెలుసని చెప్పింది. 13 -14 ఏళ్ల వయసులోనే ఒకరికొకరం తెలుసంది. అజయ్ తన సోదరుడి స్నేహితుడేనని, తామంతా జుహులోనే కలిసి పెరిగామని పేర్కొంది. తనెక్కడికి వెళ్లినా అజయ్ తనను ఫాలో అయేవాడని చెప్పుకొచ్చింది. నాతో ఎవరైనా అబ్బాయిలు మాట్లాడితే అజయ్ అస్సలు సహించేవాడు కాదని, వాళ్లను కొట్టడానికైనా సిద్ధపడేవాడని తెలిపింది టబు. అంతేకాకుండా తనను ఓ కంట కనిపెడుతూ ఎప్పుడు? ఎక్కడికి వెళుతున్నానో తెలుసుకుని వెనకాలే వచ్చేవాడంది. అతడి వల్లే తానిప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి బాధ్యుడైనందుకు సదరు హీరో పశ్చాత్తాపపడాలని చెప్పుకొచ్చింది. కాగా అజయ్, టబు ఇద్దరూ కలిసి 'దృశ్యం', 'గోల్మాల్ అగెయిన్', 'విజయ్‌పథ్', 'హకీకత్' సినిమాల్లో నటించారు. చివరిసారిగా 'దేదే ప్యార్ దే' చిత్రంలో వీళ్లిద్దరూ నటించారు. -
Akkineni Nagarjuna: ‘నేను చూసిన నాగార్జుననే పేరు మార్చి శీనుగా చూపించా’
‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం విడుదలై నేటికి పాతికేళ్లు. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఆ సినిమా విశేషాలను పంచుకున్నారిలా.. ► నిన్నే పెళ్లాడతా’ చిత్రంలో నాగార్జునగారు ఎలా ఉంటారో నిజ జీవితంలోనూ అలాగే ఉంటారు. రియల్ లైఫ్‌లో నేను చూసిన నాగార్జుననే సినిమాలో శీనుగా పేరు మార్చి చూపించానంతే. ► చెన్నైలో మూడు నాలుగేళ్లుగా వివిధ డిపార్ట్మెంట్స్లో రకరకాల పనులు చేస్తున్న నన్ను.. శివ నాగేశ్వరరావు ‘శివ’ సినిమా కోసం రాముగారి వద్ద (రామ్ గోపాల్ వర్మ) అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేర్పించారు. ‘శివ’ సమయంలో నేను, తేజ, శివ నాగేశ్వరరావు అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పనిచేశాం. ఆ చిత్ర నిర్మాత నాగార్జునగారు అన్నపూర్ణ స్టూడియోలోనే మాకు గెస్ట్ హౌస్ ఇచ్చారు. తెలుగు ‘శివ’, హిందీ ‘శివ’ చిత్రాలకు దాదాపు రెండున్నరేళ్లు స్టూడియోలోనే ఉండి పనిచేశాం. అప్పుడు నా జీవితంలో దగ్గరగా చూసిన పెద్ద స్టార్ (అక్కినేని నాగేశ్వరరావు) కొడుకు, స్టార్ హీరో నాగార్జునగారు. ‘అంతం’ సినిమాకి బెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అనిపించుకున్నాను. నా పనితీరును గమనించిన నాగార్జునగారు డైరెక్టర్ అవుతావా? ఏదైనా కథ రెడీ చేసుకో అన్నారు. ► ‘అంతం’ సినిమా చిత్రీకరణ ముగిసే సమయంలో విజయవాడ రౌడీయిజంపై నాగార్జునకి ఓ కథ చెప్పాను. ఇంట్రవెల్ వరకూ విని.. ‘ఈ కథ వద్దులే వంశీ.. రాము(ఆర్జీవీ) సినిమాలాగానే ఉంది ఇది. నీకు ఇండిపెండెంట్ కథ ఉన్నప్పుడు కచ్చితంగా చేద్దాం’ అన్నారు నాగార్జున. నా ‘గులాబీ’ సినిమా అయిపోయిన సమయంలో నాగార్జున ‘రాముడొచ్చాడు’ సినిమా చేస్తున్నారు. అప్పటికే నేను రెడీ చేసుకున్న ‘అన్యాయం’ అనే ఓ కథ వినిపిస్తే, ‘బాగుంది.. కానీ ఇంకొంచెం కొత్తగా చేద్దాం’ అన్నారు. ► ‘గులాబీ’ విడుదలయ్యాక నేను, ‘నిధి’ ప్రసాద్, కెమెరామ్యాన్ కలసి వైజాగ్‌లో లొకేషన్స్ చూడటానికి వెళ్లాం. ఒకతను వచ్చి.. ‘గులాబి’ సినిమాని అచ్చం మీ బాస్‌లాగా (ఆర్జీవీ) బాగా తీశావ్ అన్నాడు. ‘గులాబి’ చిత్రానికి నాకంటూ ప్రత్యేక గుర్తింపు రాలేదా? అని అప్పుడు నేను ఆలోచనలో పడ్డా. వయలెంట్ సినిమా తీస్తే బాస్‌లా తీశావంటారు.. ఇప్పటి వరకూ బాస్ టచ్ చేయని ఫ్యామిలీ జానర్లో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయాన్ని బాస్‌కి చెబితే ఓకే అన్నారు. నేను ఏ సినిమా చేసినా కథ బాస్‌కి(ఆర్జీవీ) చెప్పేవాణ్ణి.. ఆయనకు నచ్చితే ఓకే అంటారు.. ఎక్కడైనా అభ్యంతరం అనిపిస్తే చెప్పేవారు. ► ఈ చిత్రంలో ‘నా మొగుడు రామ్‌ప్యారి’ అనే పాటని సుద్దాల అశోక్ తేజగారు బాగా రాశారు. ఆ ఒక్క పాట మినహా మిగిలిన అన్ని పాటల్ని గురువుగారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి తనదైన శైలిలో అద్భుతంగా రాశారు. ► నాకెప్పుడూ ఒక కొత్త ఇమేజ్ క్రియేట్ చేయడం ఇష్టం. చలపతిరావుగారి ఫార్ములాయే జీవా, బ్రహ్మాజీలకు వాడాను. ఫ్యామిలీ అంటే రక్త సంబంధీకులే కాదు.. స్నేహితులు కూడా అనే కాన్సెప్ట్‌లో తీసుకున్నాను. చలపతి రావు, చంద్రమోహన్, గిరిబాబు, ఉత్తేజ్ పాత్రలు కూడా బాగా పండాయి. ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత ‘సింధూరం’ కథ అనుకున్నా. రాఘవేంద్ర రావుగారు నాపై ఉన్న ఇష్టంతో మందలించారు. ‘ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే ఎవరూ మనల్ని పట్టించుకోరు. మంచి జానర్ నుంచి ఎందుకు బయటికొస్తున్నావ్.. అందరి హీరోలతోనూ కుటుంబ కథా చిత్రాలు చెయ్’ అన్నారు. ‘నిన్నే పెళ్లాడతా’ హిట్ అయ్యాక చాలా మంది హీరోలు కూడా కుటుంబం నేపథ్యంలో మాతో కూడా సినిమాలు చేయమని అడిగారు. అయితే నాగార్జునగారు మినహా వేరే హీరోలపై నాకు కుటుంబ కథా చిత్రం చేయాలనే ఆలోచన రాలేదు. చదవండి: ఇప్పుడైతే ‘నిన్నే పెళ్లాడతా’లో ఆ సీన్స్ చేసేవాణ్ణి కాదు -
ఇప్పుడైతే ‘నిన్నే పెళ్లాడతా’లో ఆ సీన్స్ చేసేవాణ్ణి కాదు: నాగార్జున
కొన్ని పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి. శ్రీను, పండు పాత్రలు అలాంటివే. ‘నిన్నే పెళ్లాడతా’లో నాగార్జున అక్కినేని –టబు చేసి పాత్రల పేర్లివి. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ ‘హోల్సమ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్’ విడుదలై సోమవారానికి (అక్టోబర్ 4)కి పాతికేళ్లు. ఈ సందర్భంగా ఆ సినిమా హీరో, హీరోయిన్లతో స్పెషల్ టాక్. నాకు రొమాంటిక్ ఇమేజ్ తెచ్చిపెట్టింది ► ఇది చూస్తుంటే ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాకు అప్పుడే పాతికేళ్లు పూర్తయ్యాయా అనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. రాము (రామ్‌గోపాల్ వర్మ) ప్రొడక్షన్లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గులాబి’ సినిమాను రిలీజ్‌కు ముందే చూశాను.. ఆ సినిమా నచ్చి, నా అభిప్రాయాలను రామూతో షేర్ చేసుకున్నాను. ఈ దర్శకుడితో ఓ రొమాంటిక్ ఫిల్మ్ తీస్తే బాగుంటుందని రామూతో అన్నాను. కృష్ణవంశీ క్రియేటివ్ డైరెక్టర్.. అతనితో నువ్వు వర్క్ చేస్తే బాగానే ఉంటుందన్నాడు. పైగా నా ‘శివ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన కృష్ణవంశీతో నాకూ పరిచయం ఉంది. అలా ‘నిన్నే పెళ్లాడతా’ మొదలైంది. కథ ముందే చెబితే పడే గొడవల్ని షూటింగ్‌కు ముందే పడదామని వంశీకి చెబితే ఓకే అన్నాడు. డైలాగ్స్, ప్లేస్‌మెంట్స్ ఇలా అన్నింటితో కథ చెప్పాడు. అయితే చివరి 10 నిమిషాలు మినహాయించి కథ చెప్పాడు. అద్భుతంగా అనిపించింది. ► కథ నచ్చడంతో అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో ఈ సినిమాను నిర్మిస్తూ, నిర్మాతగా మారాను. అప్పటివరకు నాన్నగారు, అన్నయ్య సినిమాలు తీస్తూ ఉన్నారు. అయితే నాన్నగారు రిటైర్ అవ్వడం, పెద్దన్నయ్య సినిమాలు కాస్త తగ్గించడంతో నేను స్టార్ట్ చేశాను. ► అప్పట్లో శ్రీను, పండు (మహాలక్ష్మి) క్యారెక్టర్లు బాగా పాపులర్ అయ్యాయి. బైక్ రేస్, సముద్రంలో పాట... ఇలా కొత్తగా చూపించాం. ‘గ్రీకువీరుడు..’ పాట వండర్ఫుల్. నాకు మ్యాచో అండ్ రొమాంటిక్ ఇమేజ్ను తెచ్చిపెట్టిన పాట ఇది. సాధారణంగా రొమాంటిక్కు మ్యాచో ఇమేజ్ రాదు. రెండూ ఒకే టైమ్‌లో వర్కౌట్ కావు. కానీ కృష్ణవంశీకి అది సాధ్యం అయ్యింది. కృష్ణవంశీ తక్కువ రోజుల్లోనే షూట్‌ను కంప్లీట్ చేసి నాకు బాగా హెల్ప్ చేశారు. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెట్టారు. ► సినిమాలోని బైక్ సీక్వెన్స్‌ను నేను డూప్ లేకుండా చేశాను. అంత వేగంతో ఎలా నడిపానో తెలియదు. ఇప్పుడైతే చేయను. ఇప్పుడు మా పిల్లలు అడిగినా కూడా చేయవద్దనే చెబుతాను. ఇది ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్. పాటల్లో పెద్దగా డ్యాన్స్ లేకపోయినా ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయి. ► క్యారెక్టర్ల మధ్య వైవిధ్యం చూపించడాన్ని నా అదృష్టంగానే భావిస్తాను. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘అన్నమయ్య’ షూటింగ్‌ను స్టార్ట్ చేశా. క్లాస్, మాస్ కన్నా అది ఇంకా డిఫరెంట్. ఇక్కడ టబుతో ‘కన్నుల్లో నీ రూపమే..’ వంటి పాటలు చేసి, ‘అన్నమయ్య’ షూట్లో పాల్గొనడం అంటే.. కాస్త లక్కీయే. తెలుగు ప్రేక్షకులు నన్ను రెండు విధాలుగా చూసేందుకు అంగీకరించారు. అలాగే దర్శకులు నాపై ఉంచిన నమ్మకం కూడా. ‘‘నిన్నే పెళ్లాడతా..’ వంటి రొమాంటిక్ ఫిల్మ్ చేస్తున్నాను... మీరు ‘అన్నమయ్య’ సినిమా చేయమంటున్నారు. వచ్చి ఒకసారి పాటలు చూడండి’ అని రాఘవేంద్రరావుగారితో అన్నాను. ‘నాకు వదిలెయ్’ అన్నారు. ‘అన్నమయ్య’ సినిమాకు పనికి రాడు అని టాక్ కూడా వచ్చింది. కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరికినట్లయింది. ‘అన్నమయ్య’ వంటి పాత్రలు కూడా నేను చేయగలనని నిరూపించుకోగలిగాను. నా కెరీర్లో ఓ బెంచ్ మార్క్: టబు నా జీవితంలో ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా ఓ తీయని అనుభూతిని మిగిల్చింది. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పుడు ఇంత పెద్ద స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. కృష్ణవంశీ మంచి తపన ఉన్న దర్శకుడు. ఈ సినిమాకి వర్క్ చేసినప్పుడు కుటుంబసభ్యుల మధ్య పని చేసినట్లుగా, ఏదో పిక్నిక్కి వెళ్లినట్లుగా అనిపించింది. షూటింగ్ పూర్తయిన తర్వాత నా ఫ్యామిలీని వదిలి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. సినిమాతో పాటు పాటలు కూడా హిట్టే. తన తొలి సినిమాయే అయినా సందీప్ చౌతా మంచి సంగీతాన్ని అందించారు. ఇప్పటివరకూ నేను వర్క్ చేసిన దర్శకుల్లో వంశీ (కృష్ణవంశీ) మంచి ప్రతిభాశాలి. ∙ఈ చిత్రంలో నాగార్జున చేసిన శ్రీను క్యారెక్టర్ ఫన్నీ, లవ్లీ అండ్ ఎంటర్టైనింగ్. నా క్యారెక్టర్ పేరు మహాలక్ష్మి. కానీ సినిమాలో పండు అని పిలుస్తుంటారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో నటించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. శ్రీను, పండుల మధ్య కెమిస్ట్రీని వంశీ చాలా సహజంగా తీశారు. ఇలాంటి సినిమాలను రీ క్రియేట్ చేయడం కష్టం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇది ఓ బెంచ్ మార్క్ ఫిల్మ్... నా కెరీర్లో కూడా. చదవండి: ఓటీటీ నుంచి మంచి అవకాశాలు వచ్చాయి.. కానీ.. -
'కాంబినేషన్ రిపీట్'..చాలా ఎగై్జటింగ్‌గా ఉంది: టబు
‘‘మళ్లీ వీబీ (విశాల్ భరద్వాజ్) కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాను. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. నా మనసుకి బాగా దగ్గరైన అద్భుతమైన స్పై థ్రిల్లర్ ఇది. మిమ్మల్ని (ప్రేక్షకులు) ఫుల్‌గా థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నాం’’ అని సోషల్ మీడియా వేదికగా టబు పేర్కొన్నారు. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘మక్బూల్’, హైదర్’ వంటి చిత్రాల్లో టబు నటించారు. ఈ చిత్రాలు నటిగా ఆమెకు మరింత మంచి పేరు తెచ్చాయి. అయితే ఈసారి విశాల్‌తో కలిసి టబు చేయనున్నది సినిమా కాదు.. వెబ్ సిరీస్. ‘ఖుఫియా’ టైటిల్‌తో రూపొందనున్న ఈ సిరీస్‌లో అలీ ఫజల్, ఆశిష్ విద్యార్థి, వామికా గబ్బీ ఇతర ప్రధాన పాత్రధారులు. ఢిల్లీలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందనుంది. అమర్ భూషణ్ రాసిన ‘ఎస్కేప్ టు నౌహియర్’ నవల ఆధారంగా తెరకెక్కించనున్నారు. భారతీయ గూఢచారి సంస్థ ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్)లో పని చేసే కృష్ణ మెహ్రా చుట్టూ ముఖ్యంగా ఈ కథ సాగుతుంది. భారతదేశ రక్షణ రహస్యాలను విక్రయించే ఓ ముఠాను పట్టుకునే పనిని కృష్ణకి అప్పగిస్తారు. ఒకవైపు ఈ బాధ్యత, మరోవైపు ప్రియురాలిగా కృష్ణ పాత్ర సాగుతుంది. ఈ పాత్రనే టబు చేయనున్నారు. -
బయటకు రానంటున్న టబు
బయో బబుల్ నుంచి బయటకు రాను అంటున్నారట టబు. కార్తీక్ ఆర్యన్, టబు, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో అనీస్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘భూల్ భులైయా 2’. 2007లో వచ్చిన ‘భూల్ భులయ్యా’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం కార్తిక్, టబు, కియారాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువ కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తున్నారట టబు. తన వంతు షూటింగ్ ఉంటే తప్ప బయో బబుల్ నుంచి టబు బయటకు రావడం లేదు. ‘‘టబుగారు తిరిగి సెట్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ ఆమె బయో బబుల్ నుంచి బయటకు రావడం లేదు’’ అంటూ సెట్స్‌లో ఉన్న ఫొటోను షేర్ చేశారు కార్తీక్ ఆర్యన్. 2021 నవంబరు 19న ఈ చిత్రం రిలీజ్. -
నా అకౌంట్ హ్యాక్ అయింది
సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవడం చూస్తూనే ఉంటాం. కొందరు తుంటరి నెటిజన్లు చేసే పని వల్లో, ఇంకేదో కారణం వల్లనో వాళ్ల అకౌంట్స్ హ్యాక్ అవుతుంటాయి. తాజాగా టబు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ – ‘‘నా అకౌంట్ హ్యాక్ అయింది. అందులో కనిపించే మెసేజ్‌లను, పోస్ట్‌లను పట్టించుకోవద్దు’’ అంటూ అభిమానులను అప్రమత్తం చేశారు టబు. -
టబు ఎంత అలరించిందో తస్నీమ్ కూడా..
‘ఎ సూటబుల్ బాయ్’ సిరీస్‌లో సయీదా బాయి పాత్రలో టబు ఎంత అలరించిందో తస్నీమ్ కూడా అంతే అలజడి సృష్టించింది. ఆ భూమిక పోషించిన జోయీతా దత్తా మీద వీక్షకుల దృష్టే కాదు విమర్శకుల ప్రశంసలూ పడ్డాయి. ఆ ఒక్క సిరీస్‌తోనే మోస్ట్‌వాటెండ్ యాక్ట్రెస్ అయిపోయింది. కాని జోయితానే ఆచితూచి ఎంపికచేసుకుంటోంది వచ్చిన అవకాశాలను. ఆమె గురించి.. జోయితా పుట్టిపెరిగింది గువాహటి. అస్సామ్ వ్యాలీ స్కూల్లో చదువుకుంది. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ నుంచి డగ్రీ పట్టా తీసుకుంది. కాలేజ్ నుంచి బయటకు రాగానే ఓ ఏడాదిపాటు మెక్‌కిన్సేలో ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే నటన అంటే ఆసక్తి కలిగింది జోయీతాకు. ప్రముఖ బాలీవుడ్, హాలీవుడ్ నటుడు అదిల్ హుస్సేన్, ఎన్.కె. శర్మల థియేటర్ గ్రూప్ ‘యాక్ట్ వన్’ నిర్వహించిన వర్క్‌షాప్‌లో చేరింది. నటనలో మెలకువలు నేర్చుకుంది. ఆ శిక్షణ వృథాకాలేదు. మీరా నాయర్ దర్శకత్వం వహించిన సంగీతనాటకం ‘మాన్సూన్ వెడ్డింగ్’లో మంచి క్యారెక్టర్ దొరికింది. అందులో జోయీతా నటించడమే కాదు, ఆడింది.. పాడింది కూడా. ఆ అభినయానికే మీరా నాయర్ ముచ్చటి పడి ఇదిగో ఇలా ‘ఎ సూటబుల్ బాయ్’లో తస్నీమ్‌గా ఓటీటీ వీక్షకులకు పరిచయం చేసింది. అమాయకమైన హావభావాలతో తనదైన ముద్ర వేసింది జోయీతా. ‘మీరా నాయర్ దర్శకత్వంలో వరుసగా నటించే చాన్స్ రావడమంటే మాటలా? ఆ ఆఫర్స్ వచ్చిన రోజు నా కాలు నేల మీద లేదు. ఆమె డైరెక్షన్ అంటే నాలాంటి వాళ్లకు డబుల్ బెనిఫిట్స్. పనిచేస్తూ నేర్చుకునే స్కోప్ దొరుకుతుంది. ఇలాగే మంచి దర్శకుల దగ్గర, మంచి నటీనటులతో కలిసి పనిచేసే చాన్సెన్స్ కోసం చూస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో నా మార్క్ చూపించాలనుకుంటున్నా’ అంటుంది జోయితా దత్తా. -
గ్రీకు సుందరి
-
ఆమె అన్ని పాత్రలకి సూ‘టబు’ల్..
సౌత్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి స్టార్స్ అయిన వారిలో చాలా మంది ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైలో జెండా పాతినవారిలో శ్రీదేవి, జయప్రద మొదటి వరుసలో వస్తారు. కాని అంతే స్టార్‌డమ్‌ను, రెస్పెక్ట్ను సృష్టించుకున్న ఇంకో హీరోయిన్ను మన సౌత్ ఖాతాలో ఎవరూ వేయరు. ఆమె టబూ.. అసలు సిసలు తెలుగు అమ్మాయి. అందులోనూ హైదరాబాదీ అమ్మాయి. టబు బాలీవుడ్లో తన టాలెంట్‌ను చూపారు. ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో ఒక వర్సటైల్ ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకున్నారు. ఇవాళ తన బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు.. అసలు పేరు తబస్సుమ్... టబు అని అందరూ పిలుస్తారు గాని ఆమె అసలు పేరు తబస్సుమ్. పిలిస్తే తబు అని పిలవాలి. కాని టబు అని అలవాటైంది. ఆమె మదర్, ప్రసిద్ధ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ మదర్ దగ్గరి బంధువులు. షబానా ఆజ్మీకి టబూ మేనకోడలి వరుస. టెన్త్ వరకూ హైదరాబాద్‌లో చదువుకున్న టబు ఇంటర్ నుంచి చదువు కోసం ముంబై వెళ్లింది. షబానా ఆజ్మీ వల్ల సినిమా వాతావరణం ఉండటంతో ముందు టబు అక్క పర్హా ఖాన్ హీరోయిన్ అయ్యారు. ఆ తర్వాత టబు కూడా సినిమా రంగ ప్రవేశం చేసింది. షబానా ఇంట్లో టబును చూసిన ప్రసిద్ధ నటుడు దేవ్ ఆనంద్ ఆమెకు హమ్ నౌజవాన్ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. కాని కొత్త హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉండే మన నిర్మాత రామానాయుడు టబును కూలీ నంబర్ ఒన్ సినిమాతో తెలుగులోకి తీసుకు వచ్చారు. ఆ సినిమా సూపర్‌హిట్. టబు కూడా సూపర్ హిట్. బాలీవుడ్లో కూడా విజయపథమే.. కూలీ నంబర్ ఒన్ తర్వాత టబు రేంజ్ పెరిగిపోయింది. అందరు హీరోలకు అందుబాటులో లేనంత స్థాయికి వెళ్లింది. ఆ టైమ్‌లోనే హిందీలో అజయ్ దేవ్‌గణ్‌తో చేసిన విజయ్‌పథ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. అజయ్ దేవగణ్ ముంబైకు వచ్చినప్పటి నుంచి టబుకు క్లోజ్ ఫ్రెండ్. వాళ్లు ముంబైలో ఇరుగు పొరుగు ఉండేవారు. ఆ పరిచయం వల్లే విజయపథ్లో కలిసి నటించారు. హిట్ కొట్టారు. (చదవండి: మళ్లీ జంటగా...) టబు-నాగ్ల స్నేహానికి నాంది.. ఈ లోపు తెలుగులో మాస్టర్ అఖిల్ హీరోగా సిసింద్రీ మొదలయ్యింది. నాగార్జున సొంత సినిమా కావడం వల్ల ఇందులో స్పెషల్ సాంగ్‌లో నటించింది టబు. నాగార్జున టబుల సుదీర్ఘ స్నేహానికి ఈ సినిమా మొదటి మెట్టుగా నిలిచింది. పండు అలియాస్ మహాలక్ష్మి.. కాని అసలు సిసలు మాయాజాలం, టబూజాలం తెలియజేసిన సినిమా నిన్నే పెళ్లాడుతా. హిందీలో కొత్త ఫ్యామిలీ స్టోరీ ట్రెండ్‌ను తీసుకొచ్చిన హమ్ ఆప్ కే హై కౌన్ స్ఫూర్తితో రాసుకున్న ఈ కథలో మహాలక్ష్మి అలియాస్ పండుగా టబు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. నాగార్జునను గ్రీకువీరుడిగా మోహించే అందాలరాశిగా ఆకర్షించారు. (చదవండి: ముచ్చటగా మూడోసారి) ప్రేమదేశంతో సౌత్‌లో టాప్ కాని అదే సమయంలో దర్శకుడు కదిర్ తమిళంలో తీసిన కాదల్ దేశం టబును మొత్తం సౌత్‌కు పరిచయం చేసింది. ఆ సినిమా తెలుగులో ప్రేమదేశం పేరుతో విడుదలయ్యి సంచలన విజయం సాధించింది. టబులోని గ్రేస్ ఈ సినిమాలో కుర్రకారు వెర్రెత్తి చూశారు. మేచిస్, అస్తిత్వతో మరో మెట్టు పైకి.. కాని టబు అంటే ఇలాంటి కేరెక్టర్లేనా? ఆమెలో నటిగా టాలెంట్ లేదా? ఉంది అని కనిపెట్టినవాడు దర్శకుడు గుల్జార్. అతడు తీసిన హిందీ సినిమా మేచిస్ టబులోని కొత్త నటిని లోకానికి వెల్లడి చేశారు. ఆమెను దృష్టిలో పెట్టుకుని మంచి కథలు రాయవచ్చని ఆ సినిమా రుజువు చేసింది. ఉగ్రవాదం నేపథ్యంలో నలిగే ఒక అమ్మాయి పాత్రలో టబు అద్భుత నటన ప్రదర్శించి ఎన్నో అవార్డులు ఎన్నో గెలుచుకున్నారు. ఆ తర్వాత నటుడు, దర్శకుడు సంజయ్ మంజ్రేకర్ తీసిన అస్తిత్వ సినిమా టబును నటనను మరో స్థాయికి తీసుకెళ్లారు. భర్త ఉండగా మరో పురుషుడితో సంబంధంలోకి వెళ్లే గృహిణి పాత్రలో టబు ఈ సినిమాలో నటించారు. స్త్రీల మానసిక ప్రపంచం గురించి భావోద్వేగాల గురించి ఈ సినిమాలో టబు చేసిన స్టేట్మెంట్ ఆ సమయంలో గొప్ప ఫెమినిస్టిక్ స్టేట్మెంట్గా విమర్శకులు వ్యాఖ్యానించారు. ఉత్తమ నటిగా నిలబెట్టిన చాందిని బార్ ఆ తర్వాత ఫైనల్ టచ్‌గా మధుర్ భండార్కర్ తీసిన చాందిని బార్ టబును జాతీయ ఉత్తమ నటిగా నిలబెట్టింది. ముంబైలో పని చేసే బార్ డాన్సర్ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అటు ప్రేక్షకుల ఇటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత టబు గొప్ప కథలకు ఒక ముఖ్యమైన ఎంపికగా నిలిచింది. హిందీలో సీరియస్ సినిమాలు చేస్తూనే తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున పక్కన సినిమాలలో నటించింది టబు. చిరంజీవితో అందరివాడులో ఆమె చేసిన పాట ఎవరు మర్చిపోతారు. (చదవండి: హార్ట్ బీట్‌ని ఆపగలరు!) అంధాదున్కి క్రిటిక్స్ కితాబు.. టబు ఇటీవల బాలీవుడ్లో అంధాధున్ సినిమాలో కీలకమైన పాత్ర చేసి బాలీవుడ్‌ను మరోసారి సర్ప్రైజ్ చేశారు. ఆమె చేయడం వల్లే ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని క్రిటిక్స్ కితాబు. మొన్నటి అల వైకుంఠపురములో టబు తాజా తెలుగు సినిమా. ఇక టబు పర్సనల్ లైఫ్‌లోకి వస్తే తను సింగిల్ ఉమన్‌గా ఉన్నారు. ఇంకా వివాహ బంధంలోకి వెళ్లలేదు. ఖాళీ దొరికితే సోలో ట్రావెలర్‌గా దేశాలు తిరగడం ఆమెకు ఇష్టం. గొప్ప నటిగా గొప్ప సినిమాలు మరెన్ని చేస్తూ తను హ్యాపీగా ఉంటూ మనల్ని హ్యాపీగా ఉంచాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే టుయూ వన్స్ అగైన్ టబు. -
110 మంది నటించిన ‘చిత్రం’
సాక్షి, న్యూఢిల్లీ : సలామ్ బాంబే, ది నేమ్‌సేక్, మాన్సూన్ వెడ్డింగ్ లాంటి విభిన్న కథాంషాలతో సినిమాలు తీసి బాలీవుడ్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ప్రముఖ మహిళా దర్శకురాలు మీరా నాయర్ నుంచి మరో ఆణిముత్యం లాంటి సినీ సిరీస్ వెలువడింది. ‘ఏ సూటబుల్ బాయ్’ పేరిట ఆమె తీసిన ఆరు అంకాల (ఆరు గంటల) సినీ సీరిస్‌ను బీబీసీ టెలివిజన్ ఛానల్ జూలై నెలలోనే ప్రసారం చేయగా, శుక్రవారం నుంచి (అక్టోబర్ 23) ‘నెట్‌ఫ్లిక్స్’లో ఇది ప్రసారం అవుతుంది. ఈ సినీ సిరీస్ ఇంగ్లీషు వర్షన్‌ను బీబీసీ ప్రసారం చేయగా, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీషుతోపాటు ప్రత్యేకించి భారతీయుల కోసం హిందీ వర్షన్‌కు అందుబాటులోకి వస్తోంది. ఎంతో ప్రజాదరణ పొందిన విక్రమ్ సేథ్ రాసిన ‘ఏ సూటబుల్ బాయ్’ నవలనే మీరా నాయర్ తెర కెక్కించారు. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ సినిమాను బీబీసీయే నిర్మించినప్పటికీ బీబీసీ నిబంధనలను ఉల్లంఘించి మరి మీరా నాయర్ తెరకెక్కించారు. ఆంగ్ల చిత్రంలో 20 శాతానికి మించి సంభాషణల్లో అన్య భాషా పదాలుండకూడదన్నది బీబీసీ నియమం. అంతకుమించి సంభాషణల్లో హిందీ, ఉర్దూ, అవిధి భాషలను మీరా నాయర్ ఉపయోగించారు. తొలి భారత స్వాతంత్య్ర ఎన్నికల నేపథ్యంలో సాగే కథాకాలానికి ఆధునికతను జోడించి తీసిన ఈ సినీ సిరీస్‌లో ఏకంగా 110 మంది నటీనటులు పాల్గొనడం విశేషం. టబూ, తాన్య మానిక్తాలా, ఇషాన్ కట్టర్, నమిత్ దాస్ లాంటి విశిష్ట నటీ నటులున్నారు. కరోనా కట్టడి కోసం లాక్డౌన్లో భాగంగా సినిమా థియేటర్లు మూత పడడంతో ప్రేక్షకులు సినిమాల కోసం ఆన్లైన్ ఫ్లాట్ఫారమ్లనే ఆశ్రయిస్తున్న విషయం తెల్సిందే. -
రా రా సరసకు రారా!
‘రారా సరసకు రారా...’ పాట సౌత్ ఇండస్ట్రీల్లో సూపర్ పాపులర్. ‘చంద్రముఖి’లోని ఈ పాటను, పాటలో జ్యోతిక గెటప్‌ను, ఆమె అభినయాన్ని ఎవరూ మర్చిపోలేరు. మలయాళ చిత్రం ‘మణిచిత్ర తాళ్’ ఆధారంగా కన్నడంలో ‘ఆప్తమిత్రన్’, తెలుగు/తమిళంలో ‘చంద్రముఖి’, హిందీలో ‘భూల్ బులేయ్య’, బెంగాలీలో ‘రాజ్మొహోల్’ సినిమాలు రూపొందాయి. హిందీ రీమేక్‌లో ‘రారా సరసకు రారా (‘మేరే డోల్నా సున్’) పాటలో విద్యా బాలన్ నర్తించారు. ఇప్పుడు ‘భూల్ బులేయ్య’ సీక్వెల్ ‘భూల్ బులేయ్య 2’లో ఆ పాట రీమిక్స్‌లో డ్యాన్స్ చేయనున్నారు టబు. దెయ్యం పట్టిన డ్యాన్సర్ గెటప్‌లో ‘రారా సరసకు రారా’ అని పాడనున్నారట. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు ముఖ్య తారలుగా అనీజ్ బజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 31న విడుదల కానుంది. -
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన బాలీవుడ్ భామలు
-
టబుతో రొమాన్స్ సులభం: యంగ్ హీరో
సీనియర్ నటి టబుతో కలిసి రొమాన్స్ చేయడానికి తను ‘సూటబులే’ అంటున్నాడు ‘దఢక్’ హీరో ఇషాన్ ఖట్టర్. ఈ హీరో తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఏ సూటబుల్ బాయ్’. ఇందులో ఇషాన్.. టబుతో కలిసి సందడి చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ... ‘టబుతో రొమాన్స్ చేయడం నాకు సులభమే.. ఎందుకంటే తను టబు కాబట్టి. ఎదుటివారిని మంత్రముగ్ధుల్ని చేయడంలో తనకు తానే సాటి. ముఖ్యంగా ‘ఏ సూటబుల్ బాయ్‌లో’ని సైదా బాయి పాత్ర. ఇక నాకు ప్రేమికుడిగా కనిపించడం ఇష్టం. ఆ పాత్రలో నేను సులభంగా నటించగలనని ఇంతకు ముందే చెప్పాను’ అని పేర్కొన్నాడు. అంతేకాదు టబుకు ‘తబాస్కో’ అనే ముద్దు పేరును పెట్టినట్లు వెల్లడించాడు. అలాగే టబును మిర్చితో కూడా పోల్చాడు ఇషాన్ ఖట్టర్. ఈ క్రమంలో టబుకు ఏ బహుమతిని ఇస్తారు అని అడగ్గా.. ‘తనకు నా హృదయాన్ని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. అంతేకాదు గాలిబ్ కవిత పుస్తకాన్ని కూడా తనకు బహుమతిగా ఇస్తాను’ అంటూ సమాధానం చెప్పాడు. ఇక మీరా నాయర్ దర్శకత్వంలో వస్తున్న..ఏ సూటెబుల్ బాయ్‌లో ఇషాన్ రాజకీయ నాయకుడు మహేష్ కపూర్ కుమారుడు మాన్ కపూర్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా మాన్కపూర్(ఇషాన్ ఖట్టర్) ఓ అందమైన వేశ్యకు ఆకర్షితుడై తండ్రికి ఎదురు తిరిగే కుమారుడి పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో వేశ్య సైదా బాయ్ పాత్రలో టబు కనిపించనున్నారు. -
రీమేక్‌కి రెడీ
బాలీవుడ్లో గత ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన చిత్రం ‘అంధాధూన్’. ఆయుష్మాన్ ఖురానా, టబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో రీమేక్ కాబోతోంది. నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ చిత్ర రీమేక్ హక్కులు తీసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు నితిన్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ప్రకటించలేదు. తాజాగా ఈ రీమేక్‌ను సుధీర్ వర్మ హ్యాండిల్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఒరిజినల్లో నటించిన టబు రీమేక్‌లోనూ కనిపిస్తారా? వేచి చూడాలి. -
సూటబుల్
ఎవరికైనా ఒక పుట్టిన రోజు ఉంటుంది. టబూకి ప్రతి సినిమా ఒక పుట్టిన రోజు!ఆమె కోసమే పుట్టినట్లుంటుంది తను వేసే ప్రతి పాత్రా. డేర్‌గా ఉంటుంది.. డెవిలిష్గా ఉంటుంది. జీనియస్‌గా ఉంటుంది. ‘బ్యాడ్ క్యారెక్టర్స్ కూడా వేస్తారు కదా మీరు?’ఇదే మీ ప్రశ్నైతే కనుక.. టబు జవాబు కూడా వినాలి మీరు!! ‘క్యారెక్టర్‌కి బ్యాడ్ ఏంటి, గుడ్ ఏంటి? బ్యాడ్‌గా చేశామా, గుడ్‌గా చేశామా... అనేదొక్కటే ఉంటుంది’ అంటారామె!! ఏ పాత్రకైనా సూట్ అయిపోయే టబు.. ‘అల.. వైకుంఠపురములో..’ కొత్తగా దర్శనం ఇవ్వబోతున్నారు. అంతకన్నా ముందు..సాక్షి ‘ఫ్యామిలీ’లో.. ఎక్స్‌క్లూజివ్‌గా ఇలా!! ముందుగా పుట్టినరోజు (నవంబర్ 4)ను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెబుతారా? టబు: ఈసారి బర్త్‌డేకి ఇంట్లోనే ఉన్నాను. గత రెండేళ్లుగా నా పుట్టిన రోజు అప్పుడు షూటింగ్స్ కోసం జర్నీలో ఉన్నాను. అయినవాళ్లు దగ్గర లేకపోతే ఎంత ప్రత్యేకమైన రోజు అయినా మనకు మామూలుగానే అనిపిస్తుంది. ఈసారి స్పెషల్ డే చాలా స్పెషల్‌గా అనిపించింది. ఎందుకంటే ఇంట్లోనే ఉన్నాను. మా అమ్మగారు, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశాను. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ తెలుగులో సినిమా (‘అల.. వైకుంఠపురములో..’) చేస్తున్నారు. తెలుగుకి ఎందుకింత గ్యాప్ ఇచ్చారు? తెలుగు సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ‘అల వైకుంఠపురములో’ సినిమా నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చే మంచి సినిమాలను మిస్ కాకూడదని నా ఫీలింగ్. త్రివిక్రమ్ మీద నాకు నమ్మకం ఉంది.. మంచి పాత్ర రాస్తారని. నేను బాంబేలో చేస్తున్న సినిమాలకు కొంచెం డిఫరెంట్‌గా ఉంటేనే తెలుగు సినిమా చేయాలనుకున్నాను. ఈ సినిమా అలానే ఉంది. 1991లో ‘కూలీ నెం.1’ ద్వారా పరిచయం అయ్యారు. నటిగా 28 ఏళ్ల కెరీర్. పెద్దగా మార్పు లేకుండా బాగానే ఉన్నారు... డైట్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారా? నిజానికి నాకు ప్రత్యేకమైన డైట్ ఏమీ లేదు. పుడ్ విషయంలో మాత్రం చాలా కంట్రోల్లో ఉంటాను. స్వీట్స్ అస్సలు తినను. ఫ్రైలు, కేక్‌లు ముట్టుకోను కూడా. సాఫ్ట్ డ్రింక్స్ తాగను. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతాను. ఉదయం కొద్దిపాటి ఎక్సర్సైజ్ చేస్తాను. వాకింగ్ చేస్తాను. ఈత కొడతాను. కొంచెం హైట్‌గా ఉంటాను కాబట్టి కొన్నిసార్లు బరువు పెరిగినా పెద్దగా కనిపించను. ఆ విషయంలో నేను లక్కీ. ఈ హైట్ వల్ల మీకు ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురయ్యాయి? ఎత్తు తక్కువ ఉన్న హీరోల పక్కన యాక్ట్ చేసే అవకాశాలు కోల్పోయిన సందర్భాలు? (నవ్వుతూ) నా ఎత్తు కారణంగా రిజెక్ట్ చేసినట్లు నా వరకూ రాలేదు. నన్ను అడగకుండా వదిలేశారేమో తెలియదు. అయితే నేను దాదాపు అందరి హీరోలతో వర్క్ చేశాను. నేను కెరీర్ స్టార్ట్ చేసిన టైమ్‌లో నాలా మంచి ఎత్తు ఉన్న హీరోయిన్లు తక్కువ. ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు మంచి హైట్ ఉంటున్నారు. హ్యాపీ. ‘నను నేను మరిచినా నీ తోడు.. విరహాన వేగుతూ ఈనాడు..’ వంటి ‘ప్రేమదేశం’లోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. మీ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన ఆ సినిమా గురించి? ఈ చిత్రదర్శకుడు ఖదీర్ చాలా టాలెంటెడ్. కొత్త కాన్సెప్ట్‌తో సినిమాలు తీస్తారు. ఆయన సినిమాలో హీరోయిన్లను చూపించే విధానం కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కోసం కోటి రూపాయలతో మహాబలిపురంలో కాలేజ్ సెట్ వేశారు. అప్పట్లో కోటి రూపాయలతో సెట్ అంటే చాలా పెద్ద మొత్తం. ఆ సెట్లో తీసిన సీన్లు, పాటలు, ఆ సినిమాకి నేను వాడిన కాస్ట్యూమ్స్ అన్నీ గుర్తుండిపోయాయి. రెహమాన్ అద్భుతమైన సంగీతం అందించారు. ఆ సినిమా తర్వాత ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయి? గుర్తులేదు (పెద్దగా నవ్వుతూ). ఇప్పుడైతే సోషల్ మీడియా వల్ల మన గురించి ఎంతమంది పోస్ట్ పెడుతున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. ఉత్తరాలు లెక్కపెట్టుకునే తీరిక మాకు ఉండేది కాదు. మీ టైమ్‌లో సోషల్ మీడియా ఉండుంటే ఇంకా పాపులారిటీ పొందేవాళ్లం అనిపిస్తుందా? అప్పట్లో స్టార్డమ్ క్వాలిటీ డిఫరెంట్‌గా ఉండేది. ఇప్పడు సోషల్ మీడియా వల్ల ఎంతో అటెన్షన్ దొరుకుతోంది. అలాగే ఎంతో సమాచారం కూడా అందుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్, ఫొటోలు వస్తుంటాయి. అందుకే రెండు నిమిషాల క్రితం ఎవరి ఫొటో చూశామో కూడా మర్చిపోతాం. మనం కూడా షార్ట్ మెమరీని అలవర్చుకుంటున్నాం. ఆడియన్స్ కూడా మారారు. వాళ్ల అటెన్షన్ కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. వాళ్లకి టీవీ, వెబ్, ఫారిన్ సినిమా ఇలా చాలా ఉంది. ఫాస్ట్ యుగంలో వేగంగా పేరొస్తోంది... అంతే వేగంగా మరచిపోవడం కూడా జరుగుతోంది. అందుకని మా టైమ్‌లో సోషల్ మీడియా లేదనే ఫీలింగ్ లేదు. బీబీసీ కోసం ‘ఏ సూటబుల్ బాయ్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఆ అనుభవం? దాని గురించి అప్పుడే మాట్లాడకూడదు. ఒక నవల ఆధారంగా ఈ సిరీస్ ఉంటుంది. మీరా నాయర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ది నేమ్ సేక్’ సినిమా తర్వాత ఆమెతో కలిసి పని చేస్తున్నాను. దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ మీరా నాయర్ డైరెక్షన్లో చేయడం ఓ స్పెషల్ ఫీలింగ్. ఈ మధ్యనే షూటింగ్ స్టార్ట్ చేశాం. బాగుంది. బాలీవుడ్ మీడియా మిమ్మల్ని ‘రిస్క్ టేకర్’ అని సంబోధిస్తుంటుంది...? నేను చేసే పాత్రలు వేరేవాళ్లకు రిస్క్ అనిపించవచ్చు. ఎందుకంటే ఎవరూ ప్రయత్నించని పాత్రలు చేస్తూ వస్తున్నాను. కానీ రిస్క్ చేస్తున్నాననే ఫీలింగ్‌తో చేయను. ‘చాందినీ బార్, హైదర్, అంధాధూన్’ లాంటి విభిన్నమైన సినిమాలు వచ్చినప్పుడు రిస్క్ అని ఆలోచించకుండా ఒప్పుకున్నాను. కొందరు హిందీ హీరోయిన్లు చేసే రెగ్యులర్ క్యారెక్టర్లు నేను చేయలేదు. మామూలుగా హీరోయిన్ పాత్ర అంటే అన్నీ మంచి లక్షణాలు ఉండాలి. నైతికంగా కరెక్ట్‌గా ఉండాలి. తప్పు చేయకూడదు లాంటివి కొన్ని ఉండిపోయాయి. అవన్నీ నేను నమ్మను. మనుషులందరం ఎప్పుడో ఓసారి తప్పు చేస్తాం. ఎప్పుడూ మంచిగానే ఉండం కదా. అలాంటి పాత్రను స్క్రీన్ మీద చూపిస్తే ఏమవుతుంది? ‘కూలీ నం.1’లో హెడ్వెయిట్ ఉన్న అమ్మాయిగా, ‘చాందినీ బార్’లో బార్ డ్యాన్సర్‌గా చేశాను. పాత్ర మంచిదా? చెడ్డదా అని ఆలోచించకూడదు. మంచిగా చేశామా? లేదా అన్నదే ముఖ్యం. థర్టీ, ఫార్టీ ప్లస్ ఏజ్ హీరోయిన్లను అయితే అమ్మ లేకపోతే అత్తయ్య పాత్రలకంటూ ఇండస్ట్రీ ఓ స్టాంప్ వేసేస్తుంది. కానీ మీకు ఇప్పటివరకూ అలాంటి ట్యాగ్ వేయలేదు... అది నిజమే. నాకు ఏదైనా పాత్ర ఇచ్చినప్పుడు నేను ముందు చూసేది ఏంటంటే తన పాత్ర ఏంటి? తన ప్రయాణం ఏంటి? కథలో తనేం చేస్తుంది? తను అమ్మ అయినా అత్త అయినా కూతురు అయినా వ్యక్తిగా తనేంటి? అన్నది నాకు ముఖ్యం. నేను చేసిన పాత్రలన్నీ అలాంటివే. ఆ పాత్రకు అభిప్రాయాలు ఉంటాయి. ఆ పాత్రకు ఒక ఆలోచనా విధానం ఉంటుంది. వ్యక్తిత్వం ఉంటుంది. అందుకే ప్రేక్షకులు ఆ పాత్రల్ని సాధారణ పాత్రల్లా చూడరు. అలా కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నాను కాబట్టి ‘అమ్మ, అత్త పాత్రలకే’ అన్నట్లు నన్ను పరిమితం చేయలేదు. ఓకే.. 2019 ఎలా గడిచింది? చాలా బావుంది. 2018లో ‘అంధాధూన్’ రిలీజ్ అయింది. 2019 ఏప్రిల్ వరకూ అదే టాపిక్‌గా నిలిచింది. ఈ ఏప్రిల్‌లో చైనాలో రిలీజ్ చేశాం. 400–500 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ‘అంధాధూన్’ తెలుగులో రీమేక్ కాబోతోంది. ‘దేదే ప్యార్ దే’ సినిమా చేశాను. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ‘అల.. వైకుంఠపురములో..’ చేశాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, హిట్ అవుతుందని అనుకుంటున్నాను. గ్యాప్ తర్వాత ఒక మంచి సినిమా సెలెక్ట్ చేసుకుని వస్తున్నానని ప్రేక్షకులు భావిస్తారనుకుంటున్నా. ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌లో చేస్తారా? నన్ను సంప్రదించారు. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ఆ సినిమాని తెలుగులో ఎలా అడాప్ట్ చేస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. 2020లో ఎక్కువ తెలుగు సినిమాల్లో చూడొచ్చా? మొదటినుంచి కూడా నేను కథల ఎంపిక విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటూ వస్తున్నాను. మరి.. మంచివి వస్తే తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తాను. తెలుగు తెర మీద ఎక్కువగా కనిపించాలని అనుకుంటున్నాను. హైదరాబాద్ వస్తే నా ప్రపంచంలోకి వచ్చినట్టు, నా రూట్స్‌ని పలకరించుకున్నట్టు ఉంటుంది. నా బంధువులందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్లను కలవొచ్చు. ‘నిన్నే పెళ్లాడతా’లో గ్రీకువీరుడు కావాలని పాట పాడారు. పర్సనల్ లైఫ్‌లో కావాలనుకోలేదా? (నవ్వుతూ) గ్రీకువీరుడు సినిమాల్లో ఉంటారు. నిజజీవితంలో గ్రీకువీరుడు ఎవ్వరూ ఉండరు. మ్యారేజ్ మీద ఆసక్తి లేదా? పెళ్లి చేసుకుందాం అని ఎవ్వరూ ప్రపోజ్ చేయలేదా? ఇన్నేళ్లుగా నా సినిమాలు చూస్తున్నారు. నా స్క్రిప్ట్ విషయంలోనే నేనెంత జాగ్రత్తగా ఉంటానో తెలుసు కదా(నవ్వు) చాలా తెలివిగా చెప్పారు. సోలో లైఫ్ ఎలా ఉంటుంది? అమ్మతో అన్నీ షేర్ చేసుకుంటారా? నాది సోలో లైఫ్. దీని గురించి మాత్రమే చెప్పగలను. అయితే సోలో లైఫ్ బెటరా? మ్యారీడ్ లైఫ్ బెటరా? అంటే ఏది బెటరో చెప్పలేను. సోలో లైఫ్ చాలా బాగుంది. అలాగని పెళ్లి కరెక్ట్ కాదు అని కూడా చెప్పలేను. ప్రతీదానికి ప్లస్, మైనస్‌లు ఉంటాయి. మనం హ్యాపీగా ఉన్నామా లేదా అన్నది ముఖ్యం. నటిగా చాలా మంది ప్రేమను పొందుతున్నాను. ఒక్క జీవితంలో ఇంత ప్రేమ, గౌరవం పొందడం చాలా అదృష్టం. ఐయామ్ హ్యాపీ. – డి.జి. భవాని ‘ప్రేమదేశం’లో సాఫ్ట్‌గా, ‘కూలీ నం. 1’లో కొంచెం పొగరుగా కనిపించారు. రియల్‌లైఫ్‌లో మీ షేడ్ ఏంటి? నాకే తెలియదు (నవ్వుతూ). సీరియస్‌గా ఉంటారేమో? సరిగ్గా మాట్లాడరేమో అనిపిస్తూ ఉంటుంది.. కరెక్టే. నా మీద ఆ ఇమేజ్ ఉంది. కానీ ఏమీ చేయలేను. డేట్స్ క్లాష్ వల్ల రానా ‘విరాట పర్వం’ వదులుకున్నారని విన్నాం.. అవును. ‘అల.. వైకుంఠపురములో..’ చేస్తున్నాను. ఆ వెంటనే ‘సూటబుల్ బాయ్’ కమిట్ అయ్యాను. డేట్స్ కుదర్లేదు. దాంతో తప్పుకోవాల్సి వచ్చింది. ఆటోబయోగ్రఫీ రాస్తున్నారని తెలిసింది.. (నవ్వుతూ).. అస్సలు లేదు. నా జీవితంలో అంత డ్రామా లేదు. పుస్తకం రాసే అన్ని సంఘటనలు ఏమీ లేవు. సినిమాలు తప్ప ఎంటర్టైనింగ్గా నా జీవితంలో ఏదీ లేదు. హైదరాబాద్‌లో పుట్టారు. చిన్నప్పుడు చార్మినార్, గోల్కొండను సందర్శించి ఉంటారు. పాత జ్ఞాపకాల గురించి? అప్పుడు నేను పిక్నిక్కి వెళ్లిన జూబ్లీహిల్స్‌లో ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాను. అప్పట్లో జూబ్లీ హిల్స్ పిక్నిక్ స్పాట్. ఇప్పుడు బాగా డెవలప్ అయింది. ఫలక్‌నుమా ప్యాలస్ హోటల్ అయింది. నాంపల్లి, చార్మినార్ అన్నీ గుర్తున్నాయి. అప్పట్లో డబుల్ కా మీఠా ఇష్టంగా తినేదాన్ని. -
హార్ట్ బీట్‌ని ఆపగలరు!
‘‘చిన్న చూపుతో మన హార్ట్ బీట్‌ని ఒక్క క్షణం ఆపేయగలరు. టాలెంట్‌తో ఎవ్వరినైనా ముగ్ధుల్ని చేయగలరు టబు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలకు కలసి పని చేయాలనుకుంటున్నాం’’ అని టబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది ‘అల వైకుంఠపురములో..’ టీమ్. అంతేకాదు.. ఈ సినిమాలో టబు లుక్‌ను విడుదల చేశారు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయిక. అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. పదకొండేళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో తెలుగు తెరపై కనిపించబోతున్నారు టబు. 2008లో వచ్చిన ‘పాండురంగడు’ టబు నటించిన చివరి తెలుగు చిత్రం. -
హ్యాపీ బర్త్‌డే టబు.. వైరలవుతున్న ఫోటో
ముంబై: బాలీవుడ్ నటి టబు పుట్టిన రోజు సందర్భంగా సోమవారం పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో టబు సోదరి ఫరా నాజ్ తన ఇస్టాగ్రామ్ ఖాతాలో..టబుతో దిగిన చిన్ననాటి పాత ఫోటోను షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే..మై డియర్ సిస్టర్’ అని కమెంట్ పెట్టారు. దీంతో ముద్దుల మూట కడుతున్న బుల్లి టబు ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా టబు తన 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆమె 1994లో బాలీవుడ్లో ‘పెహలా పెహలా ప్యార్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే అదే ఏడాది ఆమె నటించిన ‘విజయ్‌పథ్’ సినిమా విడుదలై బాక్సీఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇక అప్పటి నుంచి తను వెనుదిరిగి చూడలేదు. పలు విజయవంతమైన చిత్రాలు ఆమె ఖాతాలో చేరాయి. టబు..హకీఖత్, జీత్, మాచిస్ (ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది), విరాసాట్, చాచి 420, బీవీ నెం.1 వంటి సినిమాల్లో నటించారు. 2001లో తాను నటించిన ‘చాందిని బార్’ సినిమాకు రెండోసారి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. తను చివరిగా భారత్, డీ దే ప్యార్ దే, అంధాధున్ వంటి చిత్రాల్లో నటించారు. తాజాగా తాను నటించిన ‘జవానీ జానెమాన్’ సినిమా నవంబర్‌లో విడుదల కానుంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ చిత్రంలొ టబు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. యంగ్ హీరో రానా, సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న డిఫరెంట్ మూవీ విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా కీలక పాత్రలో టబును అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పాత్రలో నటించేందుకు ముందుగా అంగీకరించిన టబు, తాజాగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక నో చెప్పారట. బన్నీ, త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉండటంతో విరాటపర్వంలో నటించలేనని చెప్పేశారట. అయితే టబు సోదరి ఫరానాజ్ కూడా బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించారు. 1985లో వచ్చిన ‘ఫాస్లే ’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఆమె యతీమ్, వో ఫిర్ ఆయేగి, బెగునా వంటి చిత్రాల్లో నటించారు. ఆమె చివరగా నటించిన చిత్రాలు శిఖర్ (2005), హల్చల్ (2004). కాగా ప్రముఖ నటి షబానా అజ్మీకి టబు మేనకోడలు అన్ని విషయం తెలిసిందే. టబు రేర్ ఫోటోలు: సోదరి వివాహంలో టబు.. తల్లితో టబు.. -
డేట్ ఫిక్స్ చేసిన అల్లు అర్జున్?
‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం తర్వాత అల్లు అర్జున్ స్క్రీన్‌పై కనిపించకుండా చిన్న గ్యాప్ ఇచ్చారు. అది కావాలని ఇవ్వకపోయినా ఆ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆ గ్యాప్‌కి బ్రేక్ ఇచ్చిన ఆయన థియేటర్లో కనిపించే తేదీని ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. టబు, జయరామ్, సుశాంత్, నివేదా పేతురాజ్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. -
ఫుల్ స్పీడ్
సగానికి పైనే ప్రయాణాన్ని పూర్తి చేసింది ‘అల వైకుంఠపురములో’ టీమ్. మిగతా భాగాన్ని కూడా ఫుల్ స్పీడ్‌లో పూర్తి చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. టబు, జయరామ్, నివేదా పేతురాజ్, సుశాంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్ మరికొన్ని రోజులు సాగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. -
ధనుష్ కాదు ప్రశాంత్!
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో నటించిన హిందీ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అంధాధూన్’. ఈ చిత్రం తమిళంలో రీమేక్ కాబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. హీరోగా ధనుష్, సిద్ధార్థ్ ఇలా పలువురు పేర్లు కూడా వినిపించాయి. ఓ సందర్భంలో ‘అంధాధూన్’ చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నానని కూడా తెలిపారు ధనుష్. ఇప్పుడు ‘అంధాధూన్’ తమిళ రీమేక్‌లో ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ నటిస్తారని తెలిసింది. ఈ హిందీ చిత్రం తమిళ రైట్స్‌ను ప్రశాంత్ తండ్రి, నటుడు–దర్శకుడు–నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. ప్రశాంత్ నటించిన గత చిత్రం ‘జానీ’ (తమిళం) కూడా శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ‘జానీ గద్దర్’ (హిందీ)కు రీమేకే కావడం విశేషం. -
రానా సినిమా నుంచి టబు అవుట్!
బిజీ షెడ్యూల్లో డేట్స్ సర్దుబాటు చేయలేక సీనియర్ నటీనటులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మహేష్ సరిలేరు నీకెవ్వరు నుంచి జగపతి బాబు, బన్నీ, త్రివిక్రమ్ సినిమా నుంచి రావూ రమేష్‌లు తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నటి ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. యంగ్ హీరో రానా, సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న డిఫరెంట్ మూవీ విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలక పాత్రకు టబును తీసుకున్నారు. ఈ పాత్రలో నటించేందుకు ముందుగా అంగీకరించిన టబు, తాజాగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక నో చెప్పారట. బన్నీ, త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉండటంతో విరాటపర్వంలో నటించలేనని చెప్పేశారట. దీంతో విరాటపర్వం టీం ఆ పాత్రకు నందిత దాస్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. -
బన్నీ సినిమాలో టబు లుక్!
లాంగ్ గ్యాప్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కొత్త సినిమాను ప్రారంభించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాను ప్రస్తుతం ‘ఏఏ19’గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో టబు లుక్కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అత్తారింటింకి దారేది సినిమాలో నదియా పాత్ర తరహాలోనే టబు పాత్రను డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి క్యారెక్టర్ టబు కూడా సౌత్‌లో బిజీ ఆర్టిస్ట్ అవుతారేమో చూడాలి. -
సంక్రాంతికి సై
సంక్రాంతి బరిలో తాను ఉన్నానంటున్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు బుధవారం చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాకు పీడీవీ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. టబు, సుశాంత్, నివేతా పేతురాజ్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘జులాయి’ (2012), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015) సినిమాల తర్వాత త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. -
కాజల్ స్పెషల్?
‘నేను పక్కా లోకల్ పక్కా లోకల్’ అంటూ ‘జనతా గ్యారేజ్’లో స్పెషల్ సాంగ్ చేశారు కాజల్ అగర్వాల్. ఈ పాట సూపర్ హిట్. కాజల్ స్టెప్స్‌కి ఫ్యాన్స్ విజిల్స్ మీద విజిల్స్ కొట్టారు. ఆ తర్వాత మళ్లీ ప్రత్యేక పాటలోనూ కనిపించలేదు కాజల్. లేటెస్ట్గా మరో స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తారని తెలిసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాట ఉందట. ఆ పాటకు కాజల్ స్టెప్పేస్తే అదిరిపోతుందని చిత్రబృందం భావించిందట. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, నివేతా పేతురాజ్ కథానాయికలుగా కనిపిస్తారు. టబు, సుశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
28 ఏళ్ల తరువాత మళ్లీ జంటగా..!
విక్టరీ వెంకటేష్, టబు కాంబినేషన్లో వచ్చిన కూలీ నెం.1 చిత్రం అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రంతో టబు హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ ఒక్క సినిమాతో టబు క్రేజ్ సంపాదించుకుని బాలీవుడ్లో అవకాశాలను అందిపుచ్చుకుంది. అయితే ఈ మధ్య టబు నటించిన అంధాదున్, దేదే ప్యార్‌దే చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అజయ్ దేవగణ్‌తో కలిసి నటించిన ‘దేదేప్యార్దే’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో సురేష్ ప్రొడక్షన్స్ ఉంది. ఈ చిత్రంలో వెంకీ సరసన టబునే తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని, అందుకు టబు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే.. 1991లో వచ్చిన కూలీ నెం.1 తరువాత మళ్లీ ఇన్నేళ్లకు వీరు జంటగా నటించబోతున్నారన్నమాట. వెంకటేష్ ప్రస్తుతం ‘వెంకీమామ’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. -
పాయల్ బోల్డ్ కబుర్లు
ఛకొన్ని సినిమాలు హిట్ అయినట్టుకొన్ని బండ్లు కూడా హిట్ అవుతుంటాయి.ఒకప్పుడు ఆర్ఎక్స్ బైక్ పెద్ద హిట్.ఆ పేరుతో వచ్చిన ‘ఆర్ఎక్స్100’ కూడా హిట్.హీరోగా కిక్ కొట్టిన కార్తికేయకు ఎన్ని సినిమాలువచ్చాయో బ్యాక్సీట్లో కూర్చున్నపాయల్కి కూడా అంతే డిమాండ్ వచ్చింది.ఆల్రెడీ ఐదు సినిమాలు చేస్తోంది.ఇంకో నాలుగైదు డిస్కషన్లో ఉన్నాయి.బ్యూటిఫుల్ మాత్రమే కాదు..బోల్డ్ పాత్రలు చేస్తున్న పాయల్ రాజ్‌పుత్‘సాక్షి’తో బోలెడు కబుర్లు చెప్పింది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో నటించాక బైక్ స్పీడ్ అంత వేగంగా కెరీర్ కొనసాగుతున్నట్లుంది? పాయల్: అవును. ఫుల్ స్పీడ్. తెలుగులో ‘వెంకీ మామ, డిస్కో రాజా, ఆర్డిఎక్స్ లవ్’ సినిమాలు చేస్తున్నాను. తమిళంలో ‘ఏంజెల్’ అనే సినిమాలో నటిస్తున్నాను. తేజగారి ‘సీత’లో స్పెషల్ సాంగ్ చేశాను. చూసే ఉంటారు. ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాను. అందులో వేశ్య పాత్రలో కనిపిస్తాను. లైఫ్ చాలా బిజీ బిజీగా ఉంది. అయినా తప్పక బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. బ్రేకా.. ఎందుకు? నెల రోజులుగా పాపికొండల్లో ‘ఆర్డిఎక్స్ లవ్’ సినిమా కోసం ఏకధాటిగా షూటింగ్ చేస్తున్నాం. అంతా సాఫీగా జరిగితే బ్రేక్ వచ్చేది కాదు. ఒక పాటకు డ్యాన్స్ చేస్తూ గాయపడ్డాను. ఆ పాట తీసే ముందు నాలుగు రోజులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం. అప్పుడు మోకాలి ఎముక డిస్లొకేట్ అయింది. దాంతో పది రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్‌లో ఉండాల్సి వచ్చింది. పాపికొండల్లో ఎండలను ఎలా తట్టుకోగలిగారు? అయ్య బాబోయ్.. చాలా ఎండలు. నాకు వైరల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. ముఖ్యంగా నా టవల్‌ను ఉతక్కుండా నాలుగు రోజులు వాడాను. ఉతికి ఇవ్వమని చెబుదామంటే మరచిపోయేదాన్ని. హరీబరీగా షూటింగ్‌కి రెడీ కావడం, మళ్లీ టవల్‌తో ముఖం తుడుచుకున్నప్పుడు ఉతకలేదని గుర్తుకు రావడం.. దాంతో ఫేస్ మీద చిన్న చిన్న ర్యాషెస్ వచ్చాయి. మేకప్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డాను. సినిమా ఆర్టిస్ట్ జాబ్ అంత ఈజీ కాదనిపించిందా? చాలా టఫ్. మన భుజం మీద చాలా బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ఒక్క సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఆ హైప్‌ని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఎండ, వాన, చలి.. ఇలా సీజన్స్‌ని పట్టించుకోకూడదు. మాకున్నదల్లా సినిమా సీజన్ ఒక్కటే. ఆల్ టైమ్ సీజన్ అన్నమాట. దానికోసం ఎంతైనా కష్టపడాలి. మరి పేరు, డబ్బూ ఊరికే రావు కదా. హీరోయిన్ కావాలన్నది మీ చిన్నప్పటి కలా? అవును. హీరోయిన్ కావాలని కలలు కన్నాను. ఆ కలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. నిజమైంది. నిలబెట్టుకోవడానికి ఇప్పుడు ఇంకా కష్టపడుతున్నాను. నా మాతృభాష పంజాబీలో సినిమాలు చేసుకుంటున్న నన్ను తెలుగు ఇండస్ట్రీ ఎంతో ప్రేమతో ఆహ్వానించింది. ‘ఆర్ఎక్స్ 100’లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చింది. ప్రేక్షకుల ప్రేమ వర్ణించలేనిది. ‘ఆర్ఎక్స్ 100’లో బోల్డ్ క్యారెక్టర్ చేశారు. అబ్బాయిని మోసం చేసే అమ్మాయి పాత్ర అది. అవకాశం పోగొట్టుకోకూడదని చేశారా? ఇష్టంగానే చేశారా? నిజానికి నాకు గ్లామరస్ రోల్స్ ఎక్కువగా ఇష్టం ఉండదు. అయితే ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం. వ్యక్తిగా నా పర్సనల్ చాయిస్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. కానీ నటిగా ఏదైనా కొత్త పాత్రలు, స్క్రిప్ట్ వచ్చినప్పుడు చేయాలనుకుంటాం కదా. అందుకే ఆ పాత్ర చేయడానికి అంగీకరించాను. చాలా మంది హీరోయిన్లు ఆ పాత్ర విని చేయడానికి ఒప్పుకోలేదట. నాకు మాత్రం కథ వినగానే, ఇలాంటివి సొసైటీలోనూ జరుగుతున్నాయి కదా. అబ్బాయిల కంటే కొందరు అమ్మాయిలు చాలా స్మార్ట్‌గా ఉన్నారు. సినిమాలో చూపిస్తే తప్పేంటి? అని ఒప్పుకున్నాను. ఆ సినిమాలో అన్నీ మోతాదుకి మించి ఉంటాయి. లిప్‌లాక్ సన్నివేశాలైనా, ఇతర రొమాంటిక్ సీన్స్ అయినా. మరి ఈ పాత్ర గురించి ఇంట్లో చెప్పారా? మాది ట్రెడిషనల్ పంజాబీ ఫ్యామిలీ. అలాగని లేనిపోని హద్దులు పెట్టి, మా అమ్మానాన్న నన్ను పెంచలేదు. కూతురికి అండగా ఉండటానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఇద్దరూ నా బ్యాక్‌బోన్. డైరెక్టర్ అజయ్ భూపతిగారు కథ చెప్పినప్పుడే ‘మీ పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుంది’ అన్నారు. ఇంట్లో చెప్పాను. ఫస్ట్‌లో కొంచెం ఆలోచించినా తర్వాత ఒప్పుకున్నారు. ‘యాక్టర్‌గా నువ్వు ఏది చేసినా అది నీ కెరీర్‌కు హెల్ప్ అవ్వాలి. ప్లస్ ఏది కరెక్టో ఏది రాంగో నువ్వే డిసైడ్ చేసుకో’ అన్నారు. ఈ సినిమా చేయడం నాకు కరెక్ట్ అనిపించింది. అయితే సినిమా చూసి నా పేరెంట్స్ షాక్ అయ్యారు. రవితేజతో చేస్తున్న ‘డిస్కో రాజా’లో మీది చాలెంజింగ్ రోల్ కదా? అవును. డెఫ్ అండ్ డమ్ (మూగ, చెవిటి అమ్మాయి) పాత్రలో కనిపిస్తాను. నటిగా నన్ను సవాల్ చేసే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను. దానికోసం ఎంతైనా కష్టపడతాను. ఇంకా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాలేదు. వెంకటేశ్ గారితో చేస్తున్న ‘వెంకీ మామా’ షూటింగ్ చేస్తున్నాను. వచ్చే నెల ‘డిస్కో రాజా’ షూటింగ్లో అడుగుపెడతాను. ఆ మధ్య ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘అడ్జెస్ట్ కావాలి’ అని అడిగారని క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పారు. దాని గురించి? నీకు ఇది కావాలంటే ఇలా కాంప్రమైజ్ కావాలి అని అడగటం నా దృష్టిలో బుల్షిట్. అలాంటి వాళ్లను అసలు కేర్ కూడా చేయను. సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనూ అడుగుతారు. ఓ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన తర్వాత కూడా అడుగుతూనే ఉంటారు. అంటే అడగడం కామన్ అన్నమాట. వాటిని అంగీకరించకూడదు. తిరస్కరించాలి. మన టాలెంట్ మీదే మనం ఆధారపడాలి. తిరస్కరణ అనేది తెలివిగా జరగాలి. మరి ఆ టైమ్‌లో మీ తెలివితేటలను ఎలా ప్రదర్శించారు? కరెక్టే. గొడవలకు దిగకూడదు. అలాగని అమాయకత్వాన్ని ప్రదర్శించకూడదు. సింపుల్‌గా ‘నో’ అనేయడమే. నో చెప్పేటప్పుడు మన గొంతులో సీరియస్‌నెస్‌ని ఎదుటివాళ్లు గ్రహించగలగాలి. అలా చెప్పాలి. అంతే. యాక్టింగ్‌లో నా బెస్ట్ ఇవ్వడానికి నేను ఎంత కష్టపడటానికైనా రెడీ. ఎంత కష్టపెట్టినా రెడీయే. అందుకే ఇలాంటి విషయాలకు తలొంచాల్సిన అవసరం లేదనుకున్నా. పోనీ అడిగారే అనుకుందాం.. ఎందుకు బయటకు చెబుతున్నావు అని కొందరు అన్నారు. చెబితే తప్పేంటి? అనేది నా ఫీలింగ్. అడ్జస్ట్ కావాలని అడిగినది మీ పంజాబీ ఇండస్ట్రీలోనా? ఇక్కడా? క్యాస్టింగ్ కౌచ్ ప్రతి చోటా ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంటుంది. ఓకే.. పాయల్ టామ్ బోయా లేక నాటీ గాళా? నేనంత నాటీ కాదు.. టామ్ బోయ్ టైప్ కూడా కాదు. అయితే చాలా హుషారైన అమ్మాయిని. నా లైఫ్ చాలా బ్యూటిఫుల్. నాన్న, అమ్మ, తమ్ముడు, నేను. చిన్నప్పుడు పెద్ద బ్రైట్ స్టూడెంట్ను కాదు. నా చదువు మీద ఎందుకింత ఖర్చు చేస్తున్నారు? ముంబై పంపితే హీరోయిన్ అయిపోతాను కదా? అనేదాన్ని. ఏదైనా డిగ్రీ పూర్తయిన తర్వాతే అన్నారు. అమ్మానాన్న మాటలను కాదనలేదు. మీకు ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఉందా? లేదు. కానీ నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. దేవుణ్ణి ఏదైతే అడిగానో దాన్ని ఇచ్చాడు. దీన్ని ఇలా కొనసాగించాలంటే ఈ హార్డ్ వర్క్‌ను ఇలా కొనసాగించాలి. నటిగా అవకాశాలు సంపాదించుకునే క్రమంలో పడిన కష్టాల గురించి? నేను కాలేజ్‌లో ఉండే సమయంలో మా అమ్మ నాకు 5 వేలు పాకెట్ మనీ ఇచ్చేవారు. ఐదు వేలంటే తక్కువ కాదు. కానీ హీరోయిన్ కావడానికి ముంబై వెళ్లాలంటే కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. అందుకే ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. 1500 నుంచి 5 వేలు సంపాదించడం స్టార్ట్ చేశాను. సేవింగ్స్‌తో ముంబై వెళ్లాలన్నది ఆలోచన. ముంబై వెళ్లే సమయానికి మీ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది? లక్ష రూపాయలు. ఫైనల్లీ... ప్రస్తుతం సినిమాకు లక్షల్లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఈ గ్రోత్‌ని ఎలా చూస్తున్నారు. సంపాదన కోట్ల దాకా ఎదగడం ఆనందమే (పెద్దగా నవ్వుతూ). చాలా బావుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్టు అనిపిస్తోంది. గతంలో నేను కొన్ని సౌత్ సినిమాలకు ఆడిషన్ ఇచ్చాను. ‘బ్యూటిఫుల్... అవకాశం మీకే’ అనేవారు. కానీ ఇచ్చేవారు కాదు. చాలా సినిమాలు వచ్చినట్టే వచ్చి చేజారేవి. ఇది మన టైమ్ కాదనుకుంటా అనుకునేదాన్ని. అప్పట్లో నేను సీరియల్స్ చేసేదాన్ని. ఆ సీరియల్ షూటింగ్ బ్రేక్స్‌లో సినిమాలకు ట్రైల్ వేస్తుండేదాన్ని. ప్రతిదాంట్లో రిజెక్షన్. ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు క్యాస్టింగ్ డైరెక్టర్స్ ముంబైలో నా ఫోటో చూపించి ‘ఇలాంటి హీరోయిన్ కావాలి’ అంటున్నారు. అది చాలా గర్వంగా అనిపిస్తుంది. – డి.జి. భవాని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో చేస్తున్న సినిమాలో మీది వేశ్య పాత్ర అన్నారు. మళ్లీ బోల్డ్ రోలా? అది బయోపిక్. నిజంగా చాలెంజింగ్ రోలే. సవాళ్లు నాకిష్టం (నవ్వుతూ). రాణీ ముఖర్జీ, టబు, అనుష్క వంటి స్టార్స్ వేశ్య పాత్రలు చేశారు. వాటిని రిఫరెన్స్‌గా తీసుకుంటున్నారా? అఫ్కోర్స్. వారి సినిమాలు చూస్తాను. అయితే నా స్టైల్లో చేస్తాను. వేశ్యల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ సినిమా ఒప్పుకున్నాక వాళ్ల లైఫ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. వారి జీవితం అంత ఈజీగా సాగదు. ఒకవేళ వాళ్లు బ్రెడ్ అండ్ బటర్ కోసమే ఆ పని చేస్తున్నారంటే దాన్ని ఆపేయమని చెప్పలేం. కేవలం డబ్బు కోసం, లగ్జరీల కోసం అలాంటి పనులు చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా ఎవరి జీవితం వారిష్టం కాబట్టి నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు అని కామెంట్ చేయలేం. -
భాషతో సంబంధం లేదు
సౌత్‌లో సక్సెస్ఫుల్ హీరోయిన్ లిస్ట్‌లో ప్రేక్షకుల చేత పేరు రాయించుకున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. కానీ నార్త్‌లో మాత్రం కాస్త స్లో అయ్యారు. తాజాగా ఆమె నటించిన ‘దే దే ప్యార్ దే’ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. టబు మరో హీరోయిన్. ‘మీ కెరీర్లో తొలి హిందీ చిత్రం ‘యారియాన్’ (2014)కు మంచి స్పందన వచ్చినప్పటికీ మీరు నెక్ట్స్ హిందీ చిత్రం చేయడానికి నాలుగేళ్లు పట్టింది. ఇందుకు కారణం ఏంటి?’ అని రకుల్‌ని అడిగితే... ‘‘నిజానికి ‘యారియన్’ సినిమా కంటే ముందే తెలుగులో నాకో అవకాశం వచ్చింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో మంచి పేరొచ్చింది. ఆ తర్వాత సౌత్‌లో నాకు మంచి అవకాశాలు వచ్చాయి. అందుకే హిందీ వైపు వెళ్లలేదు. కథాబలం ఉన్న సినిమాల్లో అవకాశం వచ్చినప్పుడు హిందీ సినిమాలు చేయాలనుకున్నాను. ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నాను. ఇప్పుడైతే భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కడ వస్తే అక్కడ చేయాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు రకుల్. హిందీలో సిద్దార్థ్ మల్హోత్రా సరసన రకుల్ చేసిన ‘మర్జావాన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం నాగార్జున సరసన ‘మన్మథుడు 2’తో చేస్తున్నారు. తమిళంలో ఆమె నటించిన రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. -
వాళ్లిద్దరితో బంధానికి పేరు లేదు : టబు
సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు అని సీనియర్ నటి టబు పేర్కొన్నారు. వాళ్లతో తనకు ఉన్న అనుబంధానికి పేరు పెట్టలేమని వ్యాఖ్యానించారు. టబు సినీ రంగప్రవేశం చేసి దాదాపు మూడు దశాబ్దాలు అవుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్‌గానే కాకుండా సహాయక పాత్రల్లో కూడా మెప్పించిన టబుకు ఇండస్ట్రీలో చాలా మందే స్నేహితులే ఉన్నారు. ఈ విషయం గురించి టబు మాట్లాడుతూ..‘ నా వృత్తిలో భాగంగా ఎంతో మందిని కలిశాను. అయితే సల్మాన్, అజయ్లతో నాకున్న అనుబంధం అన్నింటికన్నా అతీతమైంది. నా జీవితంలో ఎక్కువ భాగం వారితోనే కలిసి ఉన్నాను. కఠిన పరిస్థితుల్లో కూడా కుంగిపోకుండా ధైర్యంగా ఉండేలా వారిద్దరు నా వెన్నంటే ఉన్నారు. వాళ్లను కుటుంబ సభ్యుల్లాగానే భావిస్తా’ అని ఆప్త మిత్రుల గురించి చెప్పుకొచ్చారు. వాళ్లను అమితంగా ప్రేమిస్తా.. ‘అజయ్, సల్మాన్‌లతో ఒక్కసారి స్నేహం చేస్తే ఎవరైనా సరే వారిని అంత తేలికగా వదులుకోలేరు. మనం చెప్పకుండానే మనసులోని భావాలను వాళ్లు అర్థం చేసుకోగలరు. అందుకే వాళ్లిద్దరిని నేను అమితంగా ప్రేమిస్తా. మా అద్భుత బంధానికి ఫలానా అని పేరు పెట్టలేము’ అని టబు అజయ్, సల్మాన్ ఖాన్‌పై ప్రశంసలు కురిపించారు. కాగా అజయ్ దేవగణ్ సినిమా విజయ్‌పథ్ సినిమాతో హీరోయిన్గా సక్సెస్ రుచి చూసిన టబు.. ఆ తర్వాత హకీకత్, తక్షక్, దృశ్యం, గోల్మాల్ తదితర సినిమాల్లో అతడితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం అజయ్‌తో కలిసి నటించిన దే దే ప్యార్ దే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సల్మాన్ సినిమాలు బీవీ నంబర్1, హమ్ సాథ్ సాథ్ హై, జైహో, భారత్ తదితర సినిమాల్లో టబు నటించారు. -
నటన బోర్ కొట్టలేదు
‘‘ఏదైనా ఓ పనిని ఏళ్ల తరబడి చేస్తూ ఉంటే బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. అలాగే అలసిపోయే చాన్స్ కూడా ఉంది. కానీ యాక్టింగ్ నాకెప్పుడూ బోర్ కొట్టలేదు’’ అంటున్నారు టబు. 30ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారామె. యాక్టింగ్ ప్రాసెస్ గురించి, ఇంత లాంగ్ కెరీర్ గురించి ఓ ఇంటర్వ్యూలో టబు మాట్లాడుతూ– ‘‘యాక్టింగ్ అనేది ఫిజికల్ జాబ్‌తో పాటు మెంటల్ జాబ్ కూడా. ఇంతలాంగ్ కెరీర్లో కచ్చితంగా కొన్నిసార్లు అలసిపోతాం. బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. కానీ ఏదైనా కొత్త కథ, విభిన్నమైన పాత్ర ఉంటే మాత్రం వెంటనే ఉత్సాహం వచ్చేస్తుంది. కథ, పాత్ర మాత్రమే నా కెరీర్‌కు మోటివేషన్. నా మైండ్ మోటివేటెడ్‌గా ఉన్నంత కాలం యాక్టింగ్ బోర్ కొట్టదు.. అలసిపోను కూడా’’ అన్నారు. హిందీలో టబు నటించిన ‘దే దే ప్యార్ దే’ రిలీజ్‌కు రెడీ అయింది. తెలుగులో అల్లు అర్జున్– త్రివిక్రమ్, వేణు ఊడుగుల–రానా సినిమాల్లో ఆమె కీలక పాత్ర చేయనున్నారని తెలిసింది. -
ఇరవై ఏళ్ల తర్వాత...!
రెండు దశాబ్దాల కాలచక్రం తర్వాత మళ్లీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు సైఫ్ అండ్ టబు. ఫిల్మిస్తాన్ (2012), మిత్రోం (2018), నోట్‌బుక్ (2019) చిత్రాలను తెరకెక్కించిన నితిన్ కక్కర్ దర్శకత్వంలో ఓ ఫన్ అండ్ ఫ్యామిలీ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో సైఫ్అలీఖాన్ హీరోగా నటిస్తున్నారు. అలియా ఎఫ్ అనే కొత్త అమ్మాయి సైఫ్ కూతురి పాత్రలో కనిపించబోతుంది. ఈ చిత్రంలోనే టబు కూడా ఓ కీలకపాత్ర చేయనున్నారు. 1999లో ‘బివి నం.1, హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రాల్లో కలిసి నటించారు సైఫ్ అండ్ టబు. మళ్లీ దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ‘‘టబుకి కథ వినిపించాం. ఆమెకు నచ్చింది. నటించడానికి ఒప్పుకున్నారు. ఆమె పాత్ర గురించి ఇప్పుడే చెప్పడం సరికాదు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. లండన్‌లో 45రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాం ’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఆమిర్ తర్వాత ఆయుష్!
‘పియానో ప్లేయర్’గా ఆయుష్మాన్ ఖురానా వాయించిన రాగానికి చైనీస్ సినీ జనం ఫిదా అయిపోయారు. కాసుల వర్షం కురిపిస్తున్నారు. కథలో కంటెంట్ ఉంటే స్టార్ కాస్టింగ్‌తో సంబంధం లేదని నిరూపించారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే ముఖ్య తారలుగా రూపొందిన హిందీ చిత్రం ‘అంథా ధూన్’. గత ఏడాది అక్టోబరులో విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమాను ‘పియానో ప్లేయర్’ టైటిల్‌తో చైనాలో రిలీజ్ చేశారు చిత్రబృందం. అక్కడ ఈ సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అక్కడ 300 కోట్ల రూపాయలను వసూలు చేసింది. చైనాలో అత్యధిక కలెక్షన్స్‌ను రాబట్టిన భారతీయ చిత్రాల్లో ‘అంథా ధూన్’ చిత్రానిది మూడో స్థానం కావడం విశేషం. బాలీవుడ్ మిస్టర్ పర్పెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ నటించిన ‘దంగల్’ (2016), సీక్రెట్ సూపర్‌స్టార్ (2017) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అలాగే సల్మాన్‌ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ (2015), ఇర్ఫాన్ ఖాన్ ‘హిందీ మీడియం’ (2017) చిత్రాలు 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఇలా పెద్ద హీరోల లిస్ట్ ఉన్న చైనీస్ మూవీ మార్కెట్లోకి కుర్రహీరో ఆయుష్మాన్ ఖురానా చేరడం అభినందనీయం. -
25 రోజులు.. 4 గంటలు.. 10 కేజీలు!
హెడ్డింగ్‌లో ఉన్న ఫార్ములానే ఫాలో అయ్యారు హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. ఎందుకు అంటే హిందీ చిత్రం ‘దే దే ప్యార్ దే’ కోసం. అజయ్ దేవగన్, టబు, రకుల్‌ప్రీత్ సింగ్ ముఖ్య తారలుగా అకివ్ అలీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దే దే ప్యార్ దే’. ఈ సినిమాలో అయేషా అనే పాత్ర చేశారు రకుల్. ఈ పాత్ర కోసం ఆమె పాతిక రోజుల్లో పది కేజీల బరువు తగ్గాల్సి వచ్చింది. ఇంత తక్కువ టైమ్‌లోనే రోజుకు నాలుగు గంటలు శ్రమించి, కఠినమైన డైట్‌ని ఫాలో అయ్యి అనుకున్నది సాధించారు రకుల్. ‘‘ఈ సినిమాలోని నా పాత్ర కోసం పాతిక రోజుల్లో పది కిలోల బరువు తగ్గాల్సి వచ్చింది. నా జీవితంలో ఫిట్నెస్ పరంగా చాలా కష్డపడ్డ సమయం అది. స్క్రిప్ట్ నచ్చితే పాత్ర కోసం ఎందాకైనా, ఎంతైనా కష్టపడటం నాకు ఇష్టం’’ అని పేర్కొన్నారు రకుల్. ఇంతకుముందు ‘యారియాన్’ (2014), ‘అయ్యారే’ (2018) చిత్రాల్లో నటించారు రకుల్. కానీ హిందీలో ఆమెకు ఆశించిన ఫలితం దక్కలేదనే చెప్పాలి. ఇప్పుడు చేసిన ‘దే దే ప్యార్ దే’ చిత్రం వచ్చే నెలలో రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమా కాకుండా రకుల్ చేతిలో ‘మర్జావాన్’ చిత్రం ఉంది. మరి.. ‘దే దే ప్యార్ దే, మర్జావాన్’ చిత్రాల రిలీజ్ తర్వాత బాలీవుడ్లో రకుల్ కెరీర్ స్పీడ్ అందుకుంటుందేమో చూడాలి. సౌత్‌లో మాత్రం మంచి స్పీడ్ మీదే ఉన్నారు. -
చిన్న సినిమా చైనాలో దుమ్ముదులుపుతోంది
భారతీయ చిత్ర పరిశ్రమకు చైనా ఘన స్వాగతం పలుకుతోంది. ఇప్పటికే చైనాలో భారతీయ సినిమాలు తమ సత్తాను చాటాయి. దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్, హిందీ మీడియం, భజరంగీ భాయీజాన్ లాంటి చిత్రాలు వందల కోట్లను కొల్లగొట్టాయి. మూవీలో కంటెంట్ ఉంటే చాలు అక్కడ ఈజీగా వంద కోట్లను వసూలు చేయోచ్చు. ఇలా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా సినిమాలు చైనాకు క్యూ కట్టాయి. అయితే ఇదే వరుసలో గతేడాది వచ్చిన అంధాదున్ చిత్రం బాలీవుడ్లో చిన్న సినిమాగా రిలీజై.. రికార్డుల మోత మోగించింది. ఇక్కడ సెన్సేషన్ సృష్టించడమే కాకుండా.. చైనాలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రెండో వారాంతంలోనే రెండు వందల కోట్లను కలెక్ట్ చేసింది. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆధ్యంతం ఆసక్తిని రేకేత్తించేలా ఉంటుంది. అంధుడిగా నటిస్తూ.. జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నాని హీరోగా తెరకెక్కుతున్న ‘జెర్సీ’ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ చిత్రం అక్కడ ఎలాంటి రిజల్ట్‌ని ఇస్తుందో చూడాలి. -
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా ప్రారంభం
-
గెట్.. సెట్... గో
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా ప్రారంభమైంది. ‘జులాయి, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన కాంబినేషన్ కాబట్టి హ్యాట్రిక్ పై గురి పెట్టారని ఊహించవచ్చు. హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మాతలు. శనివారం ఉదయం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 24న హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుంది. అల్లు అర్జున్‌కు ఇది 19వ చిత్రం. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నారు. చాలాకాలం తర్వాత ప్రముఖ నటి టబు తెలుగులో నటిస్తుండటం విశేషం. ప్రత్యేక పాత్రలో హీరో సుశాంత్ కనిపిస్తారు. సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్ తమన్. కెమెరా: పి.యస్ వినోద్, ఆర్ట్: ఏయస్ ప్రకాశ్, ఫైట్స్: రామ్–లక్ష్మణ్, ఎడిటర్: నవీన్ నూలి. -
టబు వస్తున్నారా?
సీనియర్ యాక్టర్స్‌ను తన సినిమాల్లో కీలక పాత్రలకు తీసుకోవడం త్రివిక్రమ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ‘అత్తారింటికి దారేది’తో నదియాను, ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఉపేంద్రను మళ్లీ తెలుగు స్క్రీన్‌పైకి తీసుకొచ్చారు. లేటెస్ట్గా అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమాలో టబును నటింపజేయాలనుకుంటున్నారట. అల్లు అర్జున్ తల్లిగా ఆమె పాత్ర ఉండబోతోందని టాక్. తండ్రీ– కొడుకుల కథాంశంగా తెరకెక్కబోయే ఈ చిత్రానికి ‘నాన్న.. నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. 2008లో బాలకృష్ణ సరసన ‘పాండురంగడు’ సినిమాలో కనిపించారు టబు. మళ్లీ పదేళ్ల తర్వాత తెలుగు సినిమాలో కనిపించనుండటం విశేషం. -
బాలీవుడ్ స్టార్స్‌కు షాకిచ్చిన కోర్టు
జైపూర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణజింక వేట కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసులో గతంలో కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన బాలీవుడ్ నటులు టబు, సోనాలి బింద్రే, సైఫ్ అలీ ఖాన్, దుష్యంత్ సింగ్, నీలమ్ కొఠారిలకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 1998 అక్టోబర్‌లో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రీకరణ సమయంలో సల్మాన్ ఖాన్‌తో కలిసి వీరంతా కృష్ణ జింకలను వేటాడారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. జోధ్‌పూర్ కోర్టు గతేడాది ఈ కేసుకు సంబంధించిన తీర్పును వెలువరిస్తూ సల్మాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. మిగతావారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే.. ఈ కేసులో సల్మాన్‌ది ఎంత తప్పు ఉందో అతనితో పాటు ఉన్న వారిది కూడా అంతే తప్పు ఉందని భావిస్తూ జోధ్‌పూర్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రేలకు నోటీసులు జారీ చేసింది. 1998 నాటి ఈ కేసులో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్‌ని దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. శిక్షపడిన తర్వాత సల్మాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. (చదవండి : టబు, సోనాలీలు తప్పించుకోవడానికి కారణమిదే!) -
100 డేస్... 5 లుక్స్
పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఓ జంట. అంతలోనే భర్తకు ఆర్మీ నుంచి పిలుపొచ్చింది. దేశ సేవ కోసం వెంటనే సరిహద్దు దిశకు ప్రయాణం మొదలు పెట్టే సమయం ఆసన్నం అవుతుంది. అప్పుడు ఆ దంపతులు ఎలా ఎమోషనల్‌గా ఫీలయ్యారు? అనే దృశ్యాలను వెండితెరపై చూడాలంటే ‘భారత్’ సినిమా చూడాల్సిందే. సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా ఈ చిత్రం రూపొందుతోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిశా పాట్నీ, టబు కీలక పాత్రలు చేస్తున్నారు. శనివారంతో ఈ సినిమా షూటింగ్ వంద రోజులకు చేరుకుంది. ఇంతటితో ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. చివరిగా ముంబైలో సల్మాన్, కత్రినాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. మాల్తా, అబుదాబి, లూధియానా, ఢిల్లీ ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో సల్మాన్ ఐదు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తారు. 1947 నుంచి 2000 కాలపరిణామ నేపథ్యంలో ఈ సినిమా స్రీన్‌ప్లే ఉంటుంది. 2014లో వచ్చిన కొరియన్ హిట్ మూవీ ‘యాన్ ఓడ్ టు మై ఫాదర్’కి ‘భారత్’ హిందీ రీమేక్. ఈ సినిమాను ఈ ఏడాది రంజాన్‌కి విడుదల చేయాలనుకుంటున్నారు. -
స్క్రీన్ టెస్ట్
ప్రతిభకు కొలమానం ఏంటి? అంటే చెప్పలేం. అయితే ప్రతిభను గుర్తించి ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, అభినందనలు, ప్రతిష్టాత్మక పురస్కారాలు ఏ కళాకారుడిలో అయినా ఉత్సాహాన్ని నింపుతాయి. భారతదేశ ప్రతిష్టాత్మక పురస్కారం అయిన ‘పద్మ’ అవార్డు వరిస్తే ఆ గౌరవమే వేరు. జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించిన సందర్భంగా ఇప్పటివరకూ ఈ అవార్డు అందుకున్న స్టార్స్‌లో కొందరి గురించి ఈ వారం స్పెషల్ క్విజ్. 1. ‘పడమటి సంధ్యారాగం’ చిత్రంలో సహాయ నటునిగా నటించారు ఈ నటుడు. 2019వ సంవత్సరంలో ఈయనను పద్మశ్రీ వరించింది. సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎవరాయన? ఎ) మణిశర్మ బి) యం.యం. కీరవాణి సి) శివమణి డి) కోటి 2. 2011వ సంవత్సరానికి పద్మశ్రీ అవార్డుగ్రహీత ఈ నటి. వెంకటేశ్ నటించిన ఓ సూపర్‌హిట్ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారీమె. ఎవరా నటి? ఎ) టబు బి) రమ్యకృష్ణ సి) మీనా డి) కత్రినా కైఫ్ 3. 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్‌లను దక్కించుకున్న ఏకైక నటుడెవరు? ఎ) యస్వీ రంగారావు బి) శోభన్‌బాబు సి) కాంతారావు డి) అక్కినేని నాగేశ్వరరావు 4. అద్భుతమైన నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, సింగర్‌గా చాలా ఫేమస్ ఈ నటి. 1966లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న ఆ నటి ఎవరు? ఎ) భానుమతి బి) జమున సి) సావిత్రి డి) అంజలీదేవి 5. కామెడీ యాక్టర్‌గా ఎన్నో సంవత్సరాలు చిత్రపరిశ్రమను ఏలారు. 1990లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ ప్రకటించింది. ఆ నటుని పేరేంటి? ఎ) అల్లు రామలింగయ్య బి) పద్మనాభం సి) సుత్తివేలు డి) నగేశ్ 6. 2019వ సంవత్సరానికి గాను ప్రభుదేవాని పద్మశ్రీ వరించింది. తన నృత్యంతో అలరించిన ఆయన్ను ఏ ప్రభుత్వం పద్మశ్రీకి నామినేట్ చేసిందో తెలుసా? ఎ) తమిళనాడు బి) తెలంగాణ సి) కర్ణాటక డి) కేరళ 7. ‘సిరివెన్నెల’ చిత్రం తర్వాత చెంబోలు సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మారిపోయారు. ఆయన్ను చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడెవరు? (సీతారామ శాస్త్రికి ‘సిరివెన్నెల’ మొదటి చిత్రం కాదు) ఎ) కె.రాఘవేంద్రరావు బి) కె.విశ్వనాథ్ సి)ఆదుర్తి సుబ్బారావు డి) దాసరి నారాయణరావు 8. తన గళంతో ఎన్నో భాషల్లోని పాటలను అలవోకగా ఆలపించే గాయకుడు కె.జె. ఏసుదాస్. భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ (1977), పద్మభూషణ్ (2002), పద్మవిభూషణ్‌లతో సత్కరించింది. ఆయన ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ అందుకున్నారో తెలుసా? (సి) ఎ) 2011 బి) 2013 సి) 2017 డి) 2009 10 1968లో పద్మశ్రీ అవార్డు పొందిన నటుడెవరో కనుక్కుందామా? ఎ) యన్టీఆర్ బి) చిత్తూరు నాగయ్య సి) గుమ్మడి డి) కాంతారావు 9. 2006లో ఆయన్ను కేంద్రప్రభుత్వం పద్మభూషణ్‌తో గౌరవించింది. అదే సంవత్సరం ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి డాక్టరేట్‌ను కూడా పొందారు. ఎవరా హీరో? ఎ) కృష్ణంరాజు బి) చిరంజీవి సి) బాలకృష్ణ డి) నాగార్జున 11. 2009లో పద్మశ్రీ అవార్డు పొందిన ఈ నటుడు అప్పటికే ఒకే భాషలో దాదాపు 700 చిత్రాలు పైగా నటించారు. ఎవరతను? ఎ) కైకాల సత్యనారాయణ బి) అలీ సి) బ్రహ్మానందం డి) ధర్మవరపు çసుబ్రహ్మణ్యం 12. కమల్‌హాసన్ నటించిన ‘శుభసంకల్పం’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు ఈయన. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఎవరితను? ఎ) దాసరి నారాయణరావు బి) టి. సుబ్బరామిరెడ్డి సి) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డి) డి. రామానాయుడు 13. అనేక భాషల్లో తన సంగీతం ద్వారా చాలా సుపరిచుతులు ఈయన. 2010లో పద్మభూషణ్, 2018లో పద్మవిభూషణ్ ఆయన్ను వరించాయి. ఎవరా సంగీత దర్శకుడు? ఎ) కె.వి. మహదేవన్ బి) ఇళయరాజా సి) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ డి) పి.బి. శ్రీనివాస్ 14. 2013వ సంవత్సరంలో కేంద్రప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డ్‌ను తిరస్కరించిన ప్రముఖ సింగర్ ఎవరో తెలుసా? (అవార్డును నిరాకరించటానికి ఆ సింగర్ చెప్పిన కారణం ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని) ఎ) ఎస్. జానకి బి) పి. సుశీల సి) వాణీ జయరాం డి) జిక్కీ 15. కర్ణాటక ప్రభుత్వ సిఫార్సుతో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు. ఆయన ఏ సంవత్సరంలో ఈ అవార్డును పొందారో తెలుసా? ఎ) 2014 బి) 2016 సి) 2018 డి) 2019 16. 340 తెలుగు చిత్రాలకు పైగా నటించారు ఈ ప్రముఖ నటుడు. 2009లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ ప్రకటించింది. ఎవరా హీరో? ఎ) కృష్ణ బి) కృష్ణంరాజు సి) శోభన్‌బాబు డి) శరత్‌బాబు 17. కళలు, విద్యా రంగాలకు సంబంధించి 2007లో పద్మశ్రీ అవార్డును పొందిన ప్రముఖ తెలుగు నటుడెవరో తెలుసా? ఎ) మోహన్‌బాబు బి) మురళీమోహన్ సి) శ్రీధర్ డి) రంగనాథ్ 18. 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డులను సొంతం చేసుకున్న ప్రముఖ హీరో ఎవరు? ఎ) కమల్‌హాసన్ బి) రజనీకాంత్ సి) విక్రమ్ డి) శరత్‌కుమార్ 19. నాటకరంగం నుండి సినిమా రంగానికి వచ్చి ఎన్నో సినిమాల్లో నటించారు ఈ ప్రముఖ క్యారెక్టర్ నటుడు. 2015లో ఆయన్ను పద్మశ్రీ వరించింది. ఎవరా నటుడు కనుక్కోండి? ఎ) జయప్రకాశ్ రెడ్డి బి) తనికెళ్ల భరణి సి) బెనర్జీ డి) కోట శ్రీనివాసరావు 20 .1992లో పద్మశ్రీ అవార్డు పొందారు ఈ ప్రముఖ దర్శకుడు. 2017లో భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఆ దర్శకుని పేరేంటి? ఎ) కె. భాగ్యరాజా బి) భారతీరాజా సి) కె. విశ్వనాథ్ డి) కె. బాలచందర్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (సి) 2) (ఎ) 3) (డి) 4) (ఎ) 5) (ఎ) 6) (సి) 7) (బి) 8) (సి) 9) (బి) 10) (ఎ) 11) (సి) 12) (సి) 13) (బి) 14) (ఎ) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (బి) 19) (డి) 20) (సి) నిర్వహణ: శివ మల్లాల -
ఫోర్.. సిక్స్!
ఆఫ్ సైడ్, ఆన్ సైడ్ అన్న తేడా లేకుండా ఫీల్డర్స్‌ను పరిగెత్తించారు సల్మాన్‌ఖాన్. అవును.. సల్మాన్ క్రికెట్ ఆడారు. కానీ స్టేడియంలో కాదు. ‘భారత్’ సినిమా షూటింగ్ లొకేషన్ ప్లేస్‌లో. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘భారత్’. ‘ఓడ్ టు మై ఫాదర్’ అనే కొరియన్ చిత్రానికి ఇది హిందీ రీమేక్. ఇందులో కత్రినా కైఫ్ కథానాయిక. దిశాపాట్నీ, టబు, జాకీ ష్రాఫ్, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. షూట్ కంప్లీట్ అయిన తర్వాత సల్మాన్ అండ్ టీమ్ సరదాగా క్రికెట్ ఆడారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ‘భారత్’ విషయానికొస్తే.. ఈ సినిమా టీజర్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది రంజాన్‌కు ‘భారత్’ సినిమా విడుదల కానుంది. -
స్క్రీన్ టెస్ట్
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎలా ఏ స్థాయికి వెళతారో ఎవరూ ఊహించలేరు. అందుకే సినిమా అనేది చాలా మందికి డ్రీమ్. ఆ కలకి నాయకుడు దర్శకుడు. అందుకే దర్శకుణ్ణి ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అంటారు. సినిమా ఇండస్ట్రీలోని అనేక శాఖల్లో పని చేసిన అనుభవంతో మెగాఫోన్ పట్టిన దర్శకుల గురించి ఈ వారం క్విజ్ స్పెషల్... 1. ఈయన మొదట దర్శకుడు కాదు. ఎడిటింగ్ శాఖలో ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. తర్వాత చాలా పెద్ద దర్శకుడయ్యారు. ఎవరా డైరెక్టర్? ఎ) శ్రీను వైట్ల బి) వీవీ వినాయక్ సి) వంశీ పైడిపల్లి డి) ఎస్.ఎస్ రాజమౌళి 2. నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారామె. ‘చిన్నారి పాపలు’ అనే చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. ఎవరా హీరోయిన్? ఎ) ‘షావుకారు’ జానకి బి) జమున సి) సావిత్రి డి) వాణిశ్రీ 3. ఈ ప్రముఖ హీరోల్లో ఓ హీరో మెగాఫోన్ పట్టుకోలేదు. ఆయనెవరో కనుక్కోండి? ఎ) అక్కినేని బి) కృష్ణ సి) యన్టీఆర్ డి) చిత్తూరు వి. నాగయ్య 4. దర్శకత్వం చేయకముందు నంబర్ ప్లేట్లకు స్టిక్కర్ డిజైనింగ్ చేయడంలో అందెవేసిన చెయ్యి ఈ దర్శకునిది. ఎవరా దర్శకుడు? ఎ) సుధీర్‌వర్మ బి) మారుతి సి) చిన్నికృష్ణ డి) విరించివర్మ 5. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ చిత్రంతో దర్శకునిగా మారారు. అంతకుముందు ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఎ) బోయపాటి శ్రీను బి) వక్కంతం వంశీ సి) కొరటాల శివ డి) దశరథ్ 6 నటి విజయశాంతి మేకప్‌మేన్‌గా ఈయన సుపరిచితుడు. ‘పెద్దరికం’ చిత్రానికి దర్శకత్వం వహించి విజయం సాధించారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతగానూ పేరుంది. ఎవరతను? ఎ) బండ్ల గణేష్ బి) ‘దిల్’ రాజు సి) ఏ.యం.రత్నం డి) కాస్ట్యూమ్స్ కృష్ణ 7. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా 400 చిత్రాలకు పైగా పని చేశారీయన. తన దర్శకత్వ ప్రతిభతో కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎవరా నటుడు? ఎ) చలం బి) పద్మనాభం సి) రాజబాబు డి) రేలంగి 8. పవన్ కల్యాణ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘జానీ’. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించారు. ఆ చిత్రంలో పవన్ సరసన నటించిన కథానాయిక ఎవరో కనుక్కోండి? ఎ) కీర్తి రెడ్డి బి) రేణూ దేశాయ్ సి) సుప్రియ డి) అమీషా పటేల్ 9. 1957లో ‘పాండురంగ మహత్యం’ సినిమాలో బాలకృష్ణుని పాత్రలో నటించారీమె. 1971లో ‘మీనా’ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఎవరా ప్రముఖ నటి? ఎ) బి.సరోజాదేవి బి) కృష్ణకుమారి సి) కాంచన డి) విజయనిర్మల 10. తమిళ నటుడు జీవా, కార్తీక కాంబినేషన్లో తమిళ్, తెలుగులో విడుదలైన చిత్రం ‘రంగం’. ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రముఖ కెమెరామేన్. ఆ కెమెరామేన్ పేరేంటో కనుక్కోండి? ఎ) పీసీ శ్రీరామ్ బి) రాజీవన్ సి) కేవీ ఆనంద్ డి) రసూల్ ఎల్లోర్ 11. నటునిగా 150 చిత్రాలను పూర్తి చేసుకున్నారు యాక్షన్ కింగ్ అర్జున్. ఆయన దర్శకునిగా మారి ఎన్ని చిత్రాలు తెరకెక్కించారో తెలుసా? ఎ) 5 బి) 8 సి) 7 డి) 11 12. 1949లో యన్టీఆర్ నటించిన మొదటి చిత్రం ‘మన దేశం’ రిలీజైంది. 1961లో ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఆ చిత్రం పేరేంటి? ఎ) తల్లా? పెళ్లామా? బి) వరకట్నం సి) సీతారామ కల్యాణం డి) శ్రీకృష్ణ పాండవీయం 13. దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ మొదట దర్శకత్వ శాఖలో పనిచేయలేదు. సినీ పరి శ్రమలో మొదట ఆయన ఏ శాఖలో పనిచేశారో తెలుసా? ఎ) ఎడిటింగ్ బి) కెమెరా సి) ఆడియోగ్రాఫర్ డి) కొరియోగ్రాఫర్ 14 కమల్‌హాసన్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘చాచీ 420’. ఆ చిత్రంలో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) టబు బి) గౌతమి సి) అమలా డి) రమ్యకృష్ణ 15. ‘మణికర్ణిక’ చిత్రానికి మొదట దర్శకునిగా చాలా బాగాన్ని చిత్రీకరించారు క్రిష్. ఆ తర్వాత ఆయన ‘యన్టీఆర్’ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం వల్ల మిగతా చిత్రాన్ని కంప్లీట్ చేసిన నాయిక ఎవరో చెప్పుకోండి? ఎ) ఆలియా భట్ బి) దీపికా పదుకోన్ సి) కంగనా రనౌత్ డి) ప్రియాంకా చోప్రా 16 హీరో కృష్ణ దాదాపు 230 సినిమాల్లో నటించిన తర్వాత ‘సింహాసనం’ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు. ఆ సినిమాలో విషకన్య పాత్ర ద్వారా తెలుగులో నటించిన బాలీవుడ్ నటి ఎవరో తెలుసుకుందామా? ఎ) దివ్యభారతి బి) రేఖ సి) హేమమాలిని డి) మందాకిని 17. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన చిత్రం ‘చండీరాణి’. ఆ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన ఫేమస్ హీరోయిన్ ఎవరు? ఎ) భానుమతి బి) లక్ష్మీ సి) యస్.వరలక్ష్మీ డి) అంజలీదేవి 18. ఆయనో ప్రముఖ నిర్మాత. అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో దర్శకుడయ్యారు. తను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘దసరాబుల్లోడు’తో సంచలన విజయం నమోదు చేశారు. ఆ దర్శక–నిర్మాత ఎవరో తెలుసా? ఎ) వీబీ రాజేంద్రప్రసాద్ బి) కేయస్ ప్రకాశరావు సి) క్రాంతికుమార్ డి) మురారి 19. సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు తేజ. ఆయన దర్శకుడు కాకముందు ఫేమస్ సినిమాటోగ్రాఫర్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఏంటో గుర్తుందా? ఎ) జయం బి) చిత్రం సి) నిజం డి) ధైర్యం 20. తరుణ్, రాజా, సలోనిలు ముఖ్య పాత్రలుగా నటించిన చిత్రం ‘ఒక ఊరిలో’. ఆ చిత్రంతో దర్శకునిగా మారారు రమేశ్‌వర్మ. దర్శకుడు కాకముందు ఆయన ఏం చేసేవారో తెలుసా? ఎ) స్టిల్ ఫొటోగ్రఫీ బి) ఆర్ట్ డైరెక్టర్ సి) పోస్టర్ డిజైనర్ డి) మ్యూజిక్ డైరెక్టర్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) సి 3) ఎ 4) బి 5) సి 6) సి 7) బి 8) బి 9) డి 10) సి 11) డి 12) సి 13) సి 14) ఎ 15) సి 16) డి 17) ఎ 18) ఎ 19) బి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
రీమేక్ ? చేయాలా? వద్దా?
2018 బాలీవుడ్లో మంచి హిట్ సాధించి, టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన చిత్రం ‘అంథాధూన్’. శ్రీరామ్ రాఘవన్ రూపొందించిన ఈ థ్రిల్లర్‌లో ఆయుష్మాన్ ఖురాన, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇప్పుడీ సూపర్‌హిట్ చిత్రం సౌత్‌లో రీమేక్ కానుంది. ఈ రీమేక్‌ను సిద్ధార్థ్‌తో చేయాలనుకున్నారు దర్శక–నిర్మాతలు. బాల్ ఆయన కోర్ట్‌లో ఉంది. వెంటనే సిద్ధార్థ్ ‘‘అంథాధూన్’ లాంటì అద్భుతమైన చిత్రం రీమేక్‌లో నన్ను ఎంతమంది చూడాలనుకుంటున్నారు? సీరియస్‌గా అడుగుతున్నాను చెప్పండి’’ అంటూ ట్వీటర్లో అడిగేశారు. చాలా మంది ఫ్యాన్స్ చేయండి అంటూ సమాధానాలిచ్చారు. ఒరిజినల్లో యాక్ట్ చేసిన ఆయుష్మాన్ ఖురాన కూడా ‘చెయ్ మచ్చా (మావా)’ అని రిప్లై చేశారు. మరి ఈ రీమేక్‌లో సిద్ధార్థ్ కనిపిస్తారో లేదో చూడాలి. -
మ్యూజిక్ టీచర్!
పైనున్న ఫొటో చూశారుగా! కథానాయిక కత్రినా కైఫ్ ఎంత ఏకాగ్రతతో సంగీత సాధన చేస్తున్నారో! ఇది చూసి ఆమె ఏమైనా మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాలనుకుంటున్నారా? అంటే అదేం కాదు. ఇదంతా తాజా ‘భారత్’ చిత్రం కోసం. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, టబు, దిశా పాట్నీ కీలక పాత్రలు చేస్తున్న చిత్రమిది. కొరియన్ చిత్రం ‘ఓడ్ టు మై ఫాదర్’ చిత్రానికిది రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతోందట. ‘‘భారత్’ ప్రిపరేషన్లో భాగంగా ఇలా సంగీత సాధన చేస్తున్నా’’ అని పేర్కొన్నారు కత్రినా. దీంతో ఈ సినిమాలో కత్రినా సింగర్‌గా కనిపిస్తారని కొందరు అంటుంటే.. లేదు లేదు.. మ్యూజిక్ టీచర్‌గా కనిపిస్తారని ఇంకొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటీ? అనేది వచ్చే ఏడాది రంజాన్‌కు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడే ‘భారత్’ సినిమా రిలీజ్ అవుతుంది. -
మనిషి గుణ రాగం అంధాధున్
ఏదీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కాదు.. మన ప్రతీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది... అంధాధున్ సినిమా ఫిలాసఫీ ఇదే! ఎవరి కోసం ఎవరూ ఉండరు. ఎవరి స్వార్థం వాళ్లదే. మనుషుల్లోని ఈ కోణానికే 24 క్రాఫ్ట్స్‌ను అద్ది తెరమీద ప్రెజెంట్ చేశాడు దర్శకుడు శ్రీరామ్ రాఘవన్. ‘బదలాపూర్’ (ఆయన తీసినదే) సినిమా బిగినింగ్లాగే ‘అంధాధున్’ బిగినింగ్ కూడా మిస్ కాకూడదు. ఈ బిగిని తగిన వ్యవధి వరకూ లాగాడు కాని సినిమా ప్రారంభంలో వేసిన టైటిల్స్‌లో ‘‘లైఫ్.. డిపెండ్స్ ఆన్ ఇట్స్ లివర్’’ ముక్కకే సాగదీస్తే కానీ కనెక్టివిటీ దొరకలేదు. అయినా ఉత్కంఠ తగ్గదు. అంత టైట్‌గా ఉంది స్క్రీన్‌ప్లే. కథ.. సంగీత కళాకారులకు జ్ఞానేంద్రియ లోపం శాపం కాదు.. ఏకాగ్రతను కుదిర్చే వరం! అందుకే బెథోవెన్ సంగీతబ్రహ్మ అయ్యాడు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే తన ప్రయాణాన్నీ మొదలుపెడ్తాడు ఆకాశ్ (ఆయుష్మాన్ ఖురానా). అయితే గుడ్డివాడిగా! అతను పియానో వాద్యకారుడు. అద్భుతమైన ట్యూన్‌తో టాలెంట్‌ను ప్రూవ్ చేసుకొని .. తర్వాత లండన్ వెళ్లిపోయి స్వరప్రయోగాలతో కాలక్షేపం చేయాలనేది ఆయన లక్ష్యం. ఆ ఆశను నెరవేర్చుకునే దిశలో అనూహ్య మలుపుల్లో చిక్కుకుంటాడు. వాటిని పరిష్కరించుకునే ప్రయత్నంలో కొత్త ఆపదలను ఎదర్కొంటుంటాడు. అన్నిటినీ జయించుకుంటూ అనుకున్నది సాధిస్తాడా? గుడ్డివాడిగానే మిగిలిపోయి అంధాధున్ (గుడ్డి రాగం) పాడుకుంటాడా? ఎండ్ తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడాల్సిందే! ఈలోపు కొన్ని సీన్స్ గురించి తెలుసుకుందాం. కథా ప్రదేశం.. పుణె. మధ్య తరగతివాళ్లుండే ప్రభాత్ నగర్లో ఉంటుంటాడు హీరో. సంగీతం మీద కాన్సంట్రేషన్ కుదరడానికి గుడ్డితనాన్ని టూల్‌గా వాడుకుంటాడు. ఒకరోజు యాక్సిండెటల్గా.. లిటరల్లీ యాక్సిడెంటల్‌గానే కలుస్తుంది సోఫీ (రాధికా ఆప్టే). ఆమె ఓ క్లబ్ ఓనర్ కూతురు. ఆ యాక్సిడెంట్లోనే ఆకాశ్ పియానో ప్లేయర్ అని తెలుస్తుంది. తమ క్లబ్‌కి తీసుకెళ్లి తండ్రికి పరిచయం చేస్తుంది. ఆ క్లబ్లో పియానో వాయించే ఉద్యోగం ఇస్తాడు ఆమె తండ్రి. ఆ రోజు సాయంకాలం సోఫీ .. ఆకాశ్‌ను ఇంటి దగ్గర దింపేసి వెళ్తుంటే.. నల్ల కళ్లజోడు తీసి సోఫీని చూస్తాడు ఆకాశ్. ఆ విషయాన్ని ఆ ఇంటి కింద ఉన్న ఓ పిల్లాడు గ్రహిస్తాడు. సహజంగా ఆ పిల్లాడు ఆకాశ్‌ను ఏడిపిస్తుంటాడు గుడ్డివాడని. సంగీతం.. సాగనంపడం అలా సోఫీ వాళ్ల క్లబ్లో ఆకాశ్ పాత పాటలకు ఫిదా అవుతాడు రియల్టర్‌గా మారిన మాజీ హీరో ప్రమోద్ సిన్హా (ఆనంద్ ధవన్). తెల్లవారి వాళ్ల మ్యారేజ్ డే సందర్భంగా ఇంటికొచ్చి పియానో వినిపించాల్సిందిగా కోరుతాడు. తన భార్యకు ఇష్టమైన రాజేశ్ ఖన్నా పాటలు వినిపించాలని అడుగుతాడు. సరేనని తెల్లవారి ప్రమోద్ సిన్హా చెప్పిన సమయానికి వాళ్లింటికి వెళతాడు ఆకాశ్. కాని ఆయన లేడని చెప్తుంది ఆయన భార్య సిమీ సిన్హా (టబు). గుమ్మంలోనే చాలా సేపు మాట్లాడుతుంటుంటే.. ఎదురింటి ఫ్లాట్ ఆవిడ తలుపు తెరిచి చూస్తుంది. ఇబ్బందిగా ఫీలయ్యి ఆకాశ్‌ను లోపలికి రమ్ముంటుంది సిమీ. ఇంట్లోకొచ్చిన ఆకాశ్‌కు హాల్లో ఉన్న పియానో చూపిస్తుంది సిమీ. కచేరీ మొదలుపెడ్తాడు ఆకాశ్. పియానో మెట్ల మీద వేళ్లను పరిగెత్తిస్తుంటే రక్తం, లిక్కర్ కలిసిన మడుగు.. ఓ మనిషి కాళ్లూ అతని కంటబడ్తాయ్. ఆ ఇంటి యజమాని ప్రమోద్సిన్హా హత్య జరిగిందని తెలుస్తుంది. అయినా గుడ్డిగా ఏమీ ఎరగనట్టు ఆ ఇంట్లోంచి సెలవు తీసుకొని సరాసరి పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు ఆకాశ్. తీరా అక్కడికి వెళ్లే సరికి ఆ ఇన్స్పెక్టర్ సిమీ సిన్హా బాయ్‌ఫ్రెండే అని తేలుతుంది. గతుక్కుమంటాడు. ఆ ఇన్స్పెక్టరూ సిమీ వాళ్లింట్లో ఆకాశ్‌ను చూస్తాడు. అతను గుడ్డివాడు కాదేమోనని అనుమానపడ్తాడు. ఆ విషయం సిమీకి చెప్పి వాకబు చేయమంటాడు. ఈలోపు పోలీస్ ఎంక్వయిరీలో ప్రమోద్ సిన్హా హత్య వెనక సిమీ సిన్హా హస్తం ఉందనే డౌట్‌ను పోలీసుల ముందు క్రియేట్ చేస్తుంది ఎదురింటి ఆవిడ. ఈ విషయం సిమీకి తెలిసి ఆ ముసలావిడను బిల్డింగ్ మీద నుంచి తోసి చంపేస్తుంది. యాదృచ్చికంగా దీనికీ సాక్షిగా నిలుస్తాడు ఆకాశ్. ఈ సంఘటనతో ఆకాశ్ కంటి చూపు మీద సిమీకీ సందేహం వస్తుంది. నివృత్తి చేసుకోవడానికి ఆకాశ్ వాళ్లింటికి వెళ్తుంది. గుడ్డివాడు కాదని రుజువవుతుంది. స్వీట్‌తో విషప్రయోగం చేసి ఆకాశ్ చూపు నిజంగానే పోయేలా చేస్తుంది. ఈలోపు సోఫీ ఆకాశ్ వాళ్లింటికి వస్తుంది. ఆకాశ్ అంధుడు కాదు అని అందరికన్నా ముందు అనుమాన పడ్డ ఆకాశ్ ఇంటి దగ్గరి కుర్రాడు.. ఆకాశ్ వీడియో తీస్తాడు అతనికి చూపు ఉంది అని నిరూపించడానికి. సోఫీ వచ్చినప్పుడు ఆ వీడియో చూపిస్తాడు. ఆకాశ్ తనను మోసం చేశాడనే కోపం, ఉక్రోషంతో గదికి వెళ్తుంది. అక్కడ సిమీ కనపడుతుంది. అవాక్కవుతుంది సోఫీ. ఆకాశ్ పడుకొని ఉంటాడు. ఆ గది వాతావరణం, సిమీ ప్రవర్తనను బట్టి వాళ్లిద్దరి మధ్య ఏదో జరిగిందని అర్థం చేసుకొని ‘‘ఆకాశ్‌కి ఇన్ఫామ్ చేయండి .. మా నాన్న పియానో అమ్మేశాడు. క్లబ్లో అతనికిక ఉద్యోగం లేదని’’ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సోఫీ. ఇక్కడ ఆ పాత్ర పాజ్ తీసుకుంటుంది. తర్వాత... ఆకాశ్‌కి చూపు పోయినంత మాత్రాన నోరుంది కాబట్టి తమ నేరాన్ని బయటకు చెప్పే ప్రమాదం ఉందని భయపడ్డ ఇన్స్పెక్టర్ ఆకాశ్‌ను చంపడానికి ప్రయత్నిస్తాడు. తప్పించుకుని ఓ డాక్టర్ చేతిలో పడ్తాడు ఆకాశ్. ఆ డాక్టర్.. ఆర్గాన్స్ అమ్ముకునే వ్యాపారి. అంధుడిగా ఆకాశ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతనిని డ్రాప్ అండ్ పికప్ చేసే ఆటోవాలా, ల్యాటరీ టిక్కెట్లు అమ్ముకునే మహిళ.. ఈ ఇద్దరి బ్రోకర్ల సహాయంతో ఆకాశ్ కిడ్నీలను అమ్మేయాలని చూస్తాడు డాక్టర్. తెలుసుకున్న ఆకాశ్.. సిమీ విషయం చెప్పి ఆమెను కిడ్నాప్ చేస్తే కోటి రూపాయలు సంపాదించొచ్చని ఆశ చూపించి ఆపదలోంచి తప్పించుకోవాలనుకుంటాడు. కిడ్నాప్‌కు ప్లాన్ చేస్తారు వాళ్లందరూ కలిసి. పోలీస్ భార్యకు ఫోన్ చేసి ప్రమోద్ సిన్హాను హత్య చేసింది మీ భర్తే అని చెప్తారు. సాక్ష్యాలూ ఉన్నాయని, కోటి రూపాయలు ఇవ్వకపోతే మీడియాకు లీక్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తారు. భర్తతో కోటి రూపాయలు పంపిస్తానని ఒప్పుకుంటుంది. ఆకాశ్‌ను కూడా తప్పిస్తే ఆ కోటి రూపాయాలు తామే కొట్టేయొచ్చని పథకం పన్ని ఆకాశ్‌నూ బంధిస్తారు ఆటోవాలా, లాటరీ టిక్కెట్ల మహిళ. కాని పోలీస్ చేతిలో మోసపోయి ఆటోవాలా ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాడు. ఇక్కడ మళ్లీ సిమీ.. ఆకాశ్‌ను మోసం చేయాలనుకుంటుంది. ఆర్గాన్స్ అమ్మే ప్రాసెస్‌లో సేకరించిన బ్లడ్ శాంపుల్స్‌లో సిమీది రేర్ బ్లడ్ గ్రూప్ అని, ఆ గ్రూప్‌తో ఉన్న ఓ దుబాయ్ షేక్ కూతురికి సిమీ లివర్ ఇస్తే కోటి ఏంటి ఆరు కోట్లు సంపాదించొచ్చనే ఆలోచనలో పడ్తాడు డాక్టర్. ఆకాశ్తోనూ చెప్పి.. లివర్ అమ్మేయగా వచ్చిన డబ్బులోంచి కోటి ఇస్తానని, ఆమె కార్నియాతో కళ్లూ తెచ్చుకోవచ్చని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. సిమీకి మత్తు మందు ఇచ్చి కారు డిక్కీలో పడేసి, ఆకాశ్‌ను తీసుకొని ముంబై ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరుతాడు డాక్టర్. ఆకాశ్ వద్దని వారిస్తున్నా వినడు. సిమీకి మళ్లీ మత్తు ఇవ్వడానికి దార్లో కారు ఆపి డిక్కీ దగ్గరకు వెళ్తాడు. కట్‌చేస్తే.. కారు మళ్లీ స్టార్ట్ అవుతుంది. ‘‘సిమీ లివర్ అమ్మడం పాపం. జరిగినవేవీ ఎక్కడా చెప్పను. సిమీని, నన్ను వదిలేయండి’’ అని చెప్తుంటాడు ఆకాశ్. ఆ మాటలన్నీ వింటూ మౌనంగా ఏడుస్తూ.. హఠాత్తుగా కారులోంచి ఆకాశ్‌ను దిగిపొమ్మని ఆజ్ఞాపిస్తుంది ఓ స్వరం. ఖంగు తింటాడు ఆకాశ్. డాక్టర్ ఏమయ్యాడు అని అడుగుతాడు సిమీని. ముందు నువ్వు వెళ్లిపో అంటుంది డ్రైవింగ్ సీట్లో ఉన్న సిమీ. దిగిపోతాడు. సిమీ వెళ్లిపోతుంది. కాస్త ముందుకెళ్లాక నోరుంది కదా.. నమ్మడానికి లేదు అని అనుకొని మళ్లీ వెనక్కు తిప్పుతుంది కారును.. ఆకాశ్‌ను ఢీ కొట్టడానికి. ఇంతలోకే ఆ రోడ్డు పక్కనున్న పంటపొలాల్లో ముంగీస బెడద ఎక్కువవడంతో దాన్ని చంపడానికి గురిపెడ్తాడు చేను కాపలాదారుడు.. అది తప్పించుకుని రోడ్డుకి ఆవలవైపు పరిగెడ్తుంది.. కాపలాదారుడి తుపాకి గురి తప్పి సిమీ కారుకు తగులుతుంది. టైర్ బరస్ట్ అయి, పల్టీ కొట్టి సిమీ పడిపోతుంది.. కారు పేలిపోతుంది. రెండేళ్ల తర్వాత.. యూరప్‌లోని ఓ దేశంలోని ఓ క్లబ్లో ఆకాశ్ పియానో వాయిస్తూ ఉంటాడు. ఆ రాగాలు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది అటుగా వెళ్తున్న సోఫీకి .. ఆమె మళ్లీ అప్పియర్ అయ్యేది ఇక్కడే. బయట నల్ల కళ్లద్దాలు పెట్టుకొని ఉన్న ఆకాశ్ ఫోటో, అతని పేరు ఉన్న పోస్టర్ చూసి కించిత్ ఆశ్చర్యంతో లోపలికి వెళ్తుంది. పాట అయిపోయాక అందరూ వచ్చి అతని చేతిని స్పృశిస్తూ అభినందనలు చెప్తుంటారు. అతనూ దానికి స్పందిస్తూ వాళ్ల చేతిని తడుముతూ కృతజ్ఞతలు చెప్తుంటారు. సోఫీ కూడా వచ్చి షేక్‌హ్యాండ్ ఇస్తుంది.. ఏమీ మాట్లాడకుండా. ఆ స్పర్శను గుర్తించి ‘‘సోఫీ’’ అంటాడు ఆకాశ్. ‘‘కంగ్రాట్స్.. ఇక్కడి వాళ్లనూ ఫూల్స్‌ని చేస్తున్నావన్నమాట’’ అంటుంది. ‘‘అదో పెద్ద కథ.. కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా?’’ అని అడుగుతాడు. సరేనని కాఫీ షాప్‌కు వెళ్తారు. జరిగిందంతా చెప్తాడు. నిట్టూర్చి.. ‘‘ఎంతమంది జీవితాలతోనో ఆడుకుంది సిమీ? డాక్టర్ అన్నట్టు ఆమె కార్నియా తీసుకోవాల్సింది నువ్వు’’ అంటుంది సోఫీ. ‘‘అలా తీసుకుని ఉంటే అపరాధ భావంతో సంగీతానికి దూరమయ్యేవాడిని. బై దవే.. రేపు నా కన్సర్ట్ ఉంది.. వస్తావా?’’ అడుగుతాడు. ‘‘రేపు వెళ్లిపోతున్నా. అయినా ట్రై చేస్తా’’ అంటుంది. సరేనని సెలవు తీసుకుంటుండగా.. లోపలి నుంచి వెయిట్రెస్ ముంగీస తలను చెక్కిన చేతికర్రను తెచ్చి ‘‘ఇది మీదే కదా.. ’’ అంటూ ఆకాశ్ చేతికి అందిస్తుంది. ముంగీస బొమ్మ చెవులను తడుముతూ ‘‘అవును నాదే.. థ్యాంక్స్’’ అంటూ ఆ కర్ర సహాయంతో క్లబ్ బయటకు వస్తాడు. వెళ్తూ వెళ్తూ దారిలో కాళ్లకు అడ్డంగా ఉన్న ఖాళీ కోక్ టిన్నును కర్రతో బలంగా కొడ్తాడు. అదెళ్లి ఆ చివరన పడుతుంది. అక్కడున్న వాళ్లంతా ఆ అంధుడిని ఆశ్చర్యంగా చూస్తుంటారు. ది ఎండ్.. అనుకోని ట్విస్ట్‌లు.. కథలో కనిపించే ప్రతి పాత్రకూ ఔచిత్యమైన కంటిన్యూటీ.. ప్రేక్షకుల కళ్లు తిప్పుకోనివ్వదు. ఒక నేరం నుంచి తప్పించుకోవడానికి ఇంకో నేరం.. దాని నుంచి బయటపడడానికి ఇంకో నేరానికి పాల్పడం.. ఒక పరిస్థితిని ఎవరి స్వార్థానికి వాళ్లు ఉపయోగించుకోవడం.. అవతలి వాడి కష్టాన్ని తమకు లాభంగా మలచుకోవడం.. మనుషుల సామాన్య స్వభావం. అదే అసలు నైజం. ఇదే ఈ సినిమా పల్స్! అంధాధున్ సారాంశం. – శరాది -
పాత ట్యూన్‌కి కొత్త స్టెప్స్
తొంభైలలో అజయ్ దేవగన్, టబు పాడుకున్న ‘రుక్ రుక్...’ పాటను లేటెస్ట్గా రీమిక్స్ చేశారు ‘హెలికాఫ్టర్ ఈల’ చిత్రబృందం. కాజోల్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘హెలీకాఫ్టర్ ఈల’. గాయని కావాలనుకునే తల్లి పాత్రలో కాజోల్ కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అజయ్ దేవగన్, టబు నటించిన ‘విజయ్‌పథ్ ’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘రుక్ రుక్..’ను రీమిక్స్ చేశారు. ఈ పాత ట్యూన్‌కు కొత్త స్టెప్స్ జోడించారట కాజోల్. ఈ సాంగ్ హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. అజయ్ దేవగన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ఆయన పాటకే ఆయన శ్రీమతి కాజోల్ డ్యాన్స్ చేయడం విశేషం. ఈ సినిమాను అజయ్ దేవగన్, జయంతీలాల్ నిర్మించారు. అక్టోబర్ 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
అంధాధున్ ట్రైలర్ రిలీజ్
-
మిస్టరీ థ్రిల్లర్ ‘అంధాధున్’
బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ అంధాధున్. ఈ సినిమాలో ఆయుష్మాన్ అంధుడైన పియానో ప్లేయర్‌గా కనిపించనున్నాడు. సీనియర్ నటి టబు మరో ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాధిక ఆప్టే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఏజెంట్ వినోద్, బద్లాపూర్ లాంటి థ్రిల్లర్లను తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 5న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
వీరనారిగా...
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ స్టార్ క్యాస్ట్‌తో ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో స్క్రీన్ అంతా ఆడియన్స్‌కు ఐ ఫీస్ట్‌లా మారనుడటం పక్కా. ఇప్పుడీ భారీ చిత్రంలో టాలీవుడ్ టు బాలీవుడ్ వెళ్లి స్థిరపడిన టబు కూడా యాడ్ అయ్యారని సమాచారం. ‘సైరా’ సినిమాలో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్గా కనిపించనున్నారట. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న పీరియాడికల్ మూవీ ‘సైరా : నరసింహారెడ్డి’. రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో పాటు ఓ ముఖ్య ఘట్టంలో ఝాన్సీ లక్ష్మీభాయ్ కూడా ఉన్నారట. దాంతో ఈ పాత్రకు టబును సెలెక్ట్ చేసుకున్నారట చిత్ర బృందం. పదేళ్ల గ్యాప్ తర్వాత టబు నటిస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఆల్రెడీ అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతిలతో నిండిపోయిన ఈ పీరియాడికల్ మూవీలో టబు కూడా జాయిన్ అవ్వడం కచ్చితంగా ఆడియన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: అమిత్ త్రివేది. -
చలో ఉక్రెయిన్
లండన్‌కు బై బై చెప్పారు కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్. నెక్ట్స్ ఉక్రెయిన్‌కు వెళ్తారామె. అకివ్ అలీ దర్శకత్వంలో అజయ్ దేవగన్, రకుల్‌ప్రీత్ సింగ్, టబు ముఖ్య తారలుగా హిందీలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా నెల రోజుల లాంగ్ షెడ్యూల్ కోసం లండన్ వెళ్లారు రకుల్. ‘‘లండన్ షెడ్యూల్ పూర్తయింది. ‘దేవ్’ సినిమా కోసం ఉక్రెయిన్ వెళ్తున్నాను. హిందీ టు తమిళ్’’ అని పేర్కొన్నారు రకుల్. కార్తీ హీరోగా రజత్ రవిశంకర్ దర్శకునిగా పరిచయం అవుతున్న తమిళ చిత్రం ‘దేవ్’. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వడానికే రకుల్ ఉక్రెయిన్ వెళ్తున్నారు. ‘దేవ్’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. -
పెళ్లి చేసుకోకపోవడానికి ఆయనే కారణం: టబు
సాక్షి, సినిమా: నటి టబు తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆయనే అంటోంది. ఈ ఉత్తరాది బ్యూటీ దక్షిణాదిలోనూ బహుళ పాచుర్యం పొందింది. టబుకి ప్రస్తుతం 46 ఏళ్లు. ఇంకా అవివాహితనే. పెళ్లి చేసుకోకపోవడానికి కారణాన్ని ఇటీవల ఒక భేటీలో చెబుతూ.. నేనిప్పటికీ ఒంటరిగానే జీవిస్తున్నాను. అయితే ఇలా ఉండటం వల్ల ప్రతి నిమిషం నాకు సంతోషంగానే ఉంది. పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని గడపడం మంచిదా.? ఒంటరిగా గడపడం మంచిదా.? అని అడుగుతున్నారు. అయితే నాకు ఒక వైపు జీవితం గురించే తెలుసు. పెళ్లి చేసుకోకపోవడంతో మరో వైపు జీవితానుభవం తెలియదు. అందువల్ల ఆ ప్రశ్నకు నేనెలా జవాబు చెప్పగలను. నేను వివాహం చేసుకుని ఉంటే ఏది సంతోషకరమైన జీవితమో చెప్పేదాన్నని సమాధానమిచ్చారు. నాకు వివాహం జరగక పోవడానికి నటుడు అజయ్ దేవ్గన్ కారణం. తను నా సోదరుడుకి (దగ్గర బంధువు) మిత్రుడు. నా జీవిత ఆరంభం నుంచే అజయ్ నాతో కలిసి ఉన్నాడు. మేమిద్దరం 25 ఏళ్లు స్నేహితులుగా మెలిగాం. అజయ్ దేవ్గన్ కారణంగానే నేను వివాహం చేసుకోలేదు. అందుకు నాకు బాధ లేదని నటి టబు పేర్కొన్నారు. ఈ అమ్మడు హిందిలో అజయ్ దేవ్గన్తో కలిసి పలు చిత్రాల్లో నటించింది. అజయ్‌దేవ్‌గన్ నటి కాజోల్‌ను 1999లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. -
.నో ఫ్లయిట్స్.. నో ట్రావెల్
రీసెంట్ టైమ్స్‌లో చెన్నై, ముంబై, హైదరాబాద్ నగరాల మధ్య తెగ చెక్కర్లు కొట్టారు హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. ఆమె తమిళంలో మూడు (సూర్యతో ‘ఎన్జీకే’, కారీత్తో ‘దేవ్’, శివకార్తీకేయన్‌తో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం), హిందీలో (అజయ్ దేవగణ్) ఒక సినిమా చేస్తుండటమే ఇందుకు కారణం. అయితే ఇప్పుడు దాదాపు నెల రోజుల పాటు ఒకే చోట కుదురుగా ఉండనున్నారట రకుల్. అకివ్ ఆలీ దర్శకత్వంలో అజయ్ దేవగణ్ హీరోగా ఓ రొమాంటిక్ కామెడీ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో టబు, రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ‘‘హిందీలో నేను నటిస్తున్న సినిమా కోసం లండన్ వెళ్లాను. ఈ షెడ్యూల్ కోసం ఇక్కడే నెల రోజులు ఉంటాను. నో ఫ్లయిట్స్.. నో ట్రావెల్’ అని పేర్కొన్నారు రకుల్‌ప్రీత్ సింగ్. మరోవైపు తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న రకుల్ ఇంతవరకు తెలుగు సినిమాకు ఓకే చెప్పలేదు. కానీ ఈ నెలలో ఆమె నటించబోయే తెలుగు సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని టాక్. -
అది ప్రశ్నలా మిగిలిపోయింది
నటిగా అటు బాలీవుడ్, ఇటు సౌత్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు టబు. ‘చాందినీ బార్, చీనీ కమ్, నిన్నే పెళ్లాడతా, ప్రేమ దేశం’ వంటి సూపర్ హిట్స్‌లో నటించిన ఈ 46 ఏళ్ల సుందరి రిలేషన్షిప్ స్టేటస్ ఇంకా సింగిలే. ‘సింగిల్‌గా ఉంటున్నానని నేనెప్పుడూ బాధపడలేదు’ అని అంటున్నారు టబు. ఇటీవల ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో సింగిల్‌గా ఉండటం, పెళ్లి గురించి టబు మాట్లాడుతూ –‘‘నా లైఫ్‌లో సింగిల్‌గా ఉన్న ఏ మూమెంట్లోనూ నేను బాధపడలే దు. ప్రతి నిమిషాన్ని బెస్ట్ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇంకో సైడ్ (రిలేషన్షిప్) ఏంటో నాకు తెలియదు. నేను పెళ్లి చేసుకోలేదు. రెండు సైడ్స్‌ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే ఏది బెస్టో చెప్పగలం. సో.. సింగిల్‌గా ఉండటమా? రిలేషన్షిప్లో ఉండటమా? ఏది బెస్టో కచ్చితంగా చెప్పలేను. పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నందుకు ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు. లైఫ్‌లో పెళ్లి చేసుకుంటానా? అనే ప్రశ్న కూడా ప్రశ్నలా ఉంది. దానికి నా దగ్గర ప్రస్తుతానికైతే సమాధానం లేదు’’ అని పేర్కొన్నారు టబు. -
దే దే ప్యార్ దే!
పెళ్లైన వ్యక్తి జీవితంలోకి ఒక అందమైన అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. అతని మనసులో మళ్లీ ప్రేమ చిగురించింది. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ ప్రేమ గురించి తన భార్యకు తెలియకుండా ప్లానుల మీద ప్లానులు మొదలుపెట్టాడు. ఫైనల్‌గా ఓ రోజు ఏం జరిగిందంటే.. ఇప్పుడే తెలుసుకుంటే కిక్ ఏముంది? థియేటర్స్‌లో చూస్తేనేగా అసలు కిక్ వస్తుంది. అజయ్ దేవగన్, టబు, రకుల్ ప్రీత్‌సింగ్, జిమ్మి షెర్గిల్ ముఖ్య పాత్రలుగా అకివ్ అలీ దర్శకత్వంలో హిందీలో ఓ చిత్రం రూపొందుతుంది. ఇందులో అజయ్ భార్యగా టబు, ఆయన ప్రేయసి పాత్రలో రకుల్ కనిపిస్తారని టాక్. మ్యారేజ్ అండ్ మోడ్రన్ డేస్ రిలేషన్షిప్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు ‘దే దే ప్యార్ దే’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. అంటే.. ఇవ్వు.. ఇవ్వు.. ప్రేమ ఇవ్వు అని అర్థం. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ‘దే దే ప్యార్ దే...’ అనే సాంగ్ 1948లో అమితాబ్ బచ్చన్, జయప్రద నటించిన ‘షరాబి’ చిత్రంలో ఉంది. మరి.. అజయ్ అండ్ టీమ్ ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా? లేక మరేదైనా టైటిల్‌ను కన్ఫార్మ్ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన నైట్ సీన్స్‌ని ముంబైలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
టబు, సోనాలీలు తప్పించుకోవడానికి కారణమిదే!
సాక్షి, జైపూర్ : రాజస్థాన్ అడవుల్లో కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ జోధ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కానీ ఆ రోజు సల్మాన్‌తో పాటు జీపులో సైఫ్, టబు, సోనాలీ, నీలంలు కూడా వున్నారని, వారే సల్మాన్‌ను తుపాకీతో కాల్చమని ప్రోత్సహించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అయితే వారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకలేదు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన పూనమ్ బిష్ణోయ్.. జీపులో ఉన్నది వారేనా? అన్నది కచ్చితంగా చెప్పలేకపోయారు. దీంతో సైఫ్ అలీ ఖాన్, నీలమ్, టబు, సొనాలీ బింద్రేలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వారితో పాటు ఈ క్రైమ్‌లో కీలక పాత్ర పోషించిన దుష్యంత్ సింగ్‌ను కూడా నిర్దోషిగానే కోర్టు ప్రకటించింది. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం టబు, సోనాలీలను ఒక రోజు కోర్టు ముందుకు తీసుకొచ్చినప్పటికీ, పూనమ్ బిష్ణోయ్ వారిని గుర్తుపట్టలేకపోయారు. ఫిర్యాదులో వారి పేర్లను పేర్కొని, ఎందుకు అతను గుర్తుపట్టలేకపోతున్నారని కోర్టు ప్రశ్నించింది. అయితే ఘటన జరిగిన రోజు అందరూ తెలుపు రంగ సల్వార్ సూట్స్ ధరించారని, ఆ కారణంతో వారిని గుర్తించలేపోతున్నానని బిష్ణోయ్ తెలిపారు. దీంతో ఇక వారిని ధ్రువీకరించే ఆధారాలు లేనందున.. నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వారు సల్మాన్ వెంట ఉన్నారే తప్పితే కృష్ణ జింకలను చంపడంలో పాత్ర ఏమీ లేదని వారి తరఫు న్యాయవాది వాదించడం కూడా టబు, సోనమ్, నీలమ్, సైఫ్ అలీ ఖాన్లకు కలిసి వచ్చింది. -
ఓ కేసు... మరో న్యూసెన్సు
సెలబ్రిటీ మూడ్‌తో కామన్ పీపుల్‌కి సంబంధం ఉండదు. వాళ్లని ఆటపట్టించాలనుకునే ఆకతాయిలకు అయితే అస్సలు ఉండదు. వాళ్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా తాము అనుకున్నది చేస్తారు. టబు పట్ల ఓ ఆకతాయి అలానే వ్యవహరించాడు. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన సమయంలో అతని పక్కనే ఉన్న సోనాలి బింద్రే, సైఫ్ అలీఖాన్, టబు కూడా బుధవారం కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. అసలే ఏం జరుగుతోందనే టెన్షన్. ఆ టెన్షన్ బయటికి కనిపించనివ్వకుండా హడావిడిగా వెళుతున్న టబూని ఎయిర్‌పోర్ట్‌లో ఓ ఆకతాయి తాకడానికి ప్రయత్నించాడు. ఊహించని ఈ చర్యకు టబు ఖంగు తిన్నారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అప్రమత్తమై అతన్ని వెనక్కు లాగారు. మామూలుగా అయితే టబు అతని మీద కేసు పెట్టేవారేమో. ఇప్పుడు వెళుతున్నదే ఓ కేసు గురించి కదా. ఇలాంటి సమయంలో వేరే విషయాలను పట్టించుకునే ఆలోచన ఎందుకుంటుంది? ఆ సంగతలా ఉంచితే.. సెలబ్రిటీలు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకుని కూడా వాళ్లను ఇబ్బందులపాలు చేయడం పద్ధతి కాదేమో. ఇదిలా ఉంటే కోర్టు నుంచి బయటకు వచ్చిన సైఫ్ అలీఖాన్ మీడియా అడిగిన ప్రశ్నలకు ఇరిటేట్ అయ్యారు. ఆ కోపాన్ని కార్ డ్రైవర్ మీద చూపించారు. ‘‘భయ్యా, కార్ అద్దాలైనా పైకి ఎత్తు లేదా కారుని అయినా రివర్స్ చేయి. లేదంటే చెంప చెళ్లుమనిపిస్తా’’ అంటూ డ్రైవర్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష
-
సల్మాన్ ఖాన్ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించడంతో సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ కు జైలుశిక్షతో పాటు 10వేల రూపాయల జరిమానా విధించింది. కాగా జోధ్‌పూర్ కోర్టు తీర్పు నేపథ్యంలో కండలవీరుడికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 1998లో వచ్చిన ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో రాజస్థాన్ అడవుల్లో సల్మాన్ కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. మూగజీవుల ప్రాణాలను బలిగొన్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 లోని 9/51 ప్రకారం సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించారు. జింకలను క్రూరంగా వేటాడిన సల్మాన్‌కు గరిష్టంగా శిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదనలు వినిపించారు. కాగా, జోధ్‌పూర్ కోర్టు తీర్పును సల్మాన్ ఖాన్ హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. సల్మాన్ దోషిగా తేలడంతో ప్రస్తుతం షూటింగ్లో ఉన్న ఆయన సినిమాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. -
తబు రాయని డైరీ
కోల్‌కతాలో దిగాను. ముంబైలో ఎలా ఉందో, క్లైమేట్ ఇక్కడా అలాగే ఉంది. చలిగా లేదు. వెచ్చగా లేదు. బాగుంది. డమ్‌డమ్‌లో ఫిల్మ్ ఫెస్టివల్. నాదే ఈసారి ఇనాగరేషన్. మొదటిది ఐదేళ్ల క్రితం జరిగింది. తర్వాత మూడేళ్లు బ్రేక్. లాస్ట్ ఇయర్ రెండోది. ఇది మూడోది. బ్రేక్ లేకుండా ఈవెంట్స్, బ్రేకప్స్ లేకుండా రిలేషన్స్ ఉండవా అనిపిస్తుంది! మళ్లీ ఎవరో ఒకరు పూనుకోవాలేమో ఈవెంట్స్‌ని కొనసాగించడానికి, రిలేషన్స్‌ని కలపడానికి. ఈవెంట్‌ని ఎవరైనా కొనసాగించగలరు. రిలేషన్‌నే ఎవరికి వారు కలుపుకోవాలి. మధ్యలోకి మూడోవాళ్లు, నాలుగోవాళ్లు వచ్చి కూర్చుంటే రిలేషన్ కూడా ఈవెంట్ అయిపోతుంది. ఎయిర్‌పోర్ట్‌కి మనిషిని పంపించారు బ్రత్యాబసు. మినిస్టర్ ఆయన. డమ్‌డమ్ ఎమ్మెల్యే. డైరెక్టర్, యాక్టర్ కూడా. సినిమాలంటే ఇష్టం. సినిమాల్లోంచి పాలిటిక్స్‌లోకి వచ్చారు. సినిమాలన్నీ తీసేసి, అలసటతో పాలిటిక్స్‌లోకి రాలేదు. ‘‘ఐ లవ్ టు ఎంజాయ్ యువర్ యాక్టింగ్ తబూజీ’’ అన్నారు, ఫోన్లో ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు. ‘‘థ్యాంక్యూ బ్రత్యాజీ’’ అన్నాను నవ్వుతూ. బ్రత్యాజీ మూవీ లవర్. మమతాజీ నుంచి టైమ్ తీసుకున్నారట.. ఫిల్మ్ ఫెస్టివల్‌ని ఆర్గనైజ్ చేయించడానికి. ‘‘మీలా నేనూ సినిమాల్లోనే ఉండిపోతే, మీలా నాకూ సినిమాల్లో పాతికేళ్ల కెరియర్ ఉండేది తబూజీ’’ అన్నారు నవ్వుతూ బ్రత్యాజీ.. సాయంత్రం మేం కలుసుకున్నప్పుడు! సినిమా అంటే ఆయనకు అఫెక్షన్. రెండు సినిమాలు కూడా డైరెక్ట్ చేశారు. గొప్ప సినిమాలేం కావవి అంటారు బ్రత్యాజీ నవ్వుతూ. సినిమా గొప్పగా రాకపోవచ్చు. థీమ్ నాకు గొప్పగా అనిపించింది. ‘‘ఎలా చేస్తారు.. మీరు అంత గొప్పగా..’’ అన్నారు బ్రత్యాజీ చిన్న మట్టి పాత్రలోని టీని నా చేతికి అందిస్తూ. ‘‘గొప్పగా చెయ్యడం ఉంటుందా బ్రత్యాజీ, గొప్పగా చేయిస్తాయి అనుకుంటాను.. ఆ పాత్రలు, ఆ డైరెక్టర్..’’ అని నవ్వాను. ‘అస్తిత్వ’ గురించి, ‘చండీబార్’ గురించి ఆయన మాట్లాడారు. ‘అస్తిత్వ’లో నమ్రతా శిరోద్కర్‌కు అత్తగారిలా, ‘హైదర్’లో షాహిద్ కపూర్‌కు తల్లిగా చేయడం గురించి కూడా మాట్లాడారు. ఎక్కువసేపు ఉండలేదు. వెళ్లిపోయారు. తర్వాత మీడియా నుంచి ఎవరో వచ్చారు. ‘‘మీ లైఫ్‌లో బ్రేకప్స్ ఉన్నాయా? సింగిల్ ఉమన్‌గా ఎందుకు ఉండిపోయారు?’.. ఎప్పటిలా చివరి రెండు ప్రశ్నలు. నవ్వాను. ఏం చెప్పాలి? జీవితంతో నాకున్న ఏ రిలేషన్‌నీ నేను బ్రేక్ చేసుకోను. ఎప్పుడూ ఇవే ప్రశ్నల్ని అడుగుతుండే సమాజంతో కూడా. అభిమానం ఉంటేనే కదా ఎవరైనా అడుగుతారు. - మాధవ్ శింగరాజు -
వన్ మోర్ చాన్స్
... కొట్టేశారు హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్. నీరజ్ పాండే దర్శకత్వంలో ఆమె నటించిన ‘అయ్యారీ’ సినిమా రిలీజ్ కాకముందే మరో హిందీ సినిమాకు సైన్ చేశారు. అకివ్ అలీ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా భూషణ్ కుమార్, రంజన్ నిర్మిస్తున్న సినిమాలో రకుల్‌ను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు నిర్మాతలు. ‘‘రకుల్ హిందీలో నటించిన తొలి చిత్రం ‘యారియాన్’కి నేనో నిర్మాతను. ఇప్పుడు మళ్లీ మా అసోసియేషన్ కుదరడం ఆనందంగా ఉంది. సౌత్‌లో మంచి యాక్టర్‌గా రకుల్‌కు పేరు తెచ్చుకుంది’’ అన్నారు భూషణ్‌కుమార్. ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్ర చేయనున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభించి అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఒకవైపు తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉంటూ మరోవైపు హిందీ సినిమాలకూ డేట్స్ ఇస్తూ.. రకుల్ జోరు మీద ఉన్నారు. -
సీనియర్ హీరోతో రొమాన్స్‌కు సై
సాక్షి, సినిమా : గతేడాది పెద్దగా సక్సెస్‌లు పలకరించకపోయినా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ప్రస్తుతం నిలకడగానే ఉంది. సెలక్టివ్ కథలను ఎంచుకుంటూ ఈ ఏడాది మంచి చిత్రాలతోనే ప్రేక్షకులను పలకరించబోతోంది. ముందుగా బాలీవుడ్లో ‘అయ్యారీ’ ద్వారా రీ ఎంట్రీతో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్లో మరో చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నటుడు అజయ్ దేవగన్ తర్వాతి చిత్రంలో రకుల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అకివ్ అలీ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కూడా ఓ కీలకపాత్ర పోషించబోతున్నారు. ఈ విషయాలను నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు. గతంలో రకుల్‌ను యారియాన్ ద్వారా బాలీవుడ్‌కు పరిచయం చేసింది భూషణ్ కుమార్ కావటం విశేషం. రచయిత లవ్ రంజన్(ప్యార్ కా పంచ్‌నామా ఫేమ్) మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుందని నిర్మాతలు వెల్లడించారు. దసరాకు ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు నీరజ్ పాండే డైరెక్షన్లో సిద్ధార్ధ్ మల్హోత్రా-రకుల్ జంటగా నటించిన అయ్యారీ ఫిబ్రవరి 9న విడుదల కానుంది. -
ప్రేమ నిండిన స్నేహం ప్రేమదేశం
ప్రేమ వాహనాన్ని సవారీ చేసి ప్రతి ఒక్కరూ చేరుకోవడానికి తహతహలాడే డెడ్ ఎండ్నే పెళ్లి అంటారు.ప్రేమలో మోహం ఉంటుంది. ఆకర్షణ ఉంటుంది. కోరిక ఉంటుంది. హక్కు ఉంటుంది. పై చేయి ఉంటుంది. దబాయింపు ఉంటుంది. సంజాయిషీ ఉంటుంది. పెత్తనం ఉంటుంది. పగ ఉంటుంది.కాని స్నేహం మాత్రం ఉండదు.స్నేహంలో ఇష్టం ఉంటుంది. సర్దుబాటు ఉంటుంది. ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది. అంగీకారం ఉంటుంది. సమభావన ఉంటుంది. అందుకే ఆ అమ్మాయి డైలమాలో పడుతుంది. ప్రేమా? స్నేహమా?ఈ సినిమాలో టబూ ఆమె తండ్రితో– నా భర్త నాకు మంచి స్నేహితుడిలా ఉండాలి అని అంటుంది. అప్పటికే ఆమె ఇద్దరితో స్నేహంలో ఉంది.ఒకరు వినీత్. మరొకరు అబ్బాస్.అది గమనించిన తండ్రి ఆమెతో అంటాడు– ‘మరి వారిద్దరిలోనే ఒకరిని ఎంచుకోవచ్చు కదా’.అంతే కాదు మరో మాట కూడా అంటాడు ‘నీకు కాబోయే భర్త నీకు మంచి స్నేహితుడు కాలేకపోవచ్చు. కాని మంచి స్నేహితుడు తప్పకుండా నీకు మంచి భర్త అవుతాడు’.మంచి సలహా.ఎదురుగా ఇద్దరు ఉన్నారు.ఇప్పుడు సమస్య వచ్చింది.ఎవరిని ఎంచుకోవాలి? ఆ సమస్య ఆమెదైతే తమలో ఎవరు ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలనే సమస్య వినీత్, అబ్బాస్‌లకు వస్తుంది. వినీత్ పేదవాడు. అబ్బాస్ ధనవంతుడు. కాని ఇద్దరూ మంచి సంస్కారవంతులు. ఇద్దరూ గాఢ స్నేహితులవుతారు. ఒకరికి తెలియకుండా మరొకరు టబూని ప్రేమిస్తారు. కాని ఎప్పుడైతే ఆ సంగతి వారికి అర్థమవుతుందో బద్ధ శత్రువులవుతారు. ఇద్దరివీ వేరు వేరు కాలేజీలు కావడం ఈ శతృత్వాన్ని పెంచుతుంది. పేదోళ్ల కాలేజీ అబ్బాయిల గర్ల్‌ఫ్రెండ్స్‌ని డబ్బున్న కాలేజీ అబ్బాయిలు తన్నుకుపోతున్నారని ఇది వరకే కొట్లాటలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ల ప్రేమకు ఆ నేప«థ్యం తోడైంది. వినీత్ ఫ్రెండ్స్ అబ్బాస్‌పై అబ్బాస్ ఫ్రెండ్స్ వినీత్‌పై దాడి చేస్తారు. గాయపరుస్తారు. కాని ఇదంతా అబ్బాస్, వినీత్‌లకు ఇష్టం ఉండదు. ఇది మా పర్సనల్ సమస్య.. మేమే తేల్చుకుంటాం అంటారు. అబ్బాస్ తన ప్రేమను త్యాగం చేసి వేరే ఊరు వెళ్లిపోవడానికి ట్రైన్ ఎక్కుతాడు. కాని వినీత్ ఒప్పుకోడు. ట్రైనెక్కి అతణ్ణి కిందకు దించేస్తాడు. ‘ప్రేమను త్యాగం చేయడం కంటే మించిన అబద్ధం ఇంకోటి ఉండదు. ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం ఆ జ్ఞాపకాలు ఉంటాయి. వాటిని త్యాగం చేసి ఎవరూ ఉండలేరు. నువ్వు చేసిన త్యాగాన్ని భారంగా మోస్తూ నేను సుఖంగా ఉండలేను’ అంటాడు. మనం మనం కొట్టుకోవడం ఎందుకు... ఛాయిస్ ఆమెకే వదిలిపెడదాం... ఎవర్ని చేసుకుంటుందో అంటాడు. ఇది కూడా బాగానే ఉంది.కాని ఛాయిస్ ఎంచుకోవడం ఎలా? టబూకి ఈ ఎంపిక ప్రాణ సంకటంగా మారుతుంది.ఇద్దరూ మంచి మిత్రులు. యోగ్యులు. ఇద్దరూ తనకు సమానమైన వారు.ఎవరినో ఒకర్ని ఎంచుకోవచ్చు. కాని ఆమె ప్రేమలో కంటే ముందు స్నేహంలో ఉంది. ప్రేమ– మనసు నొప్పించగలదేమోకాని స్నేహం నొప్పించలేదు. అందుకే తాను వారిలో ఒకరిని ఎంచుకుని మరొకరి మనసు నొప్పించాలని అనుకోదు.వారిరువురినీ తన ఫామ్ హౌస్‌కు పిలిచి ఒక మాట చెబుతుంది– ‘నాకు మీరిద్దరూ ముఖ్యమే. మీరిద్దరూ నాకు స్నేహితులుగా ఉండాలి. నా మీద మీకున్న ప్రేమను స్నేహంగా మలచండి. జీవితాంతం మీ స్నేహితురాలిగా ఉంటాను. స్వార్థం లేని స్నేహం నాకు కావాలి. మీ ఇద్దరి కోసం కావాలంటే నా జీవితాన్నే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటుంది.వారిద్దరి మనసులో కూడా బహుశా ఇదే ఉండొచ్చు. ప్రేమకు పంచడం రాదు. కాని స్నేహానికి వచ్చు. అందుకే ఆ ముగ్గురు స్నేహితులుగా మిగలడంతో సినిమా పూర్తవుతుంది.అప్పుడు దర్శకుడు ఒక మాట అంటాడు – ఈ స్నేహం వీరిలోనే కాదు అన్న చెల్లి, అమ్మ నాన్న, భార్య భర్త... వీరందరి రిలేషన్లో కూడా స్నేహం అభివృద్ధి కావాలి. అప్పుడే ఆ బంధాలు మరింత ఫలవంతం అవుతాయి అని.సినిమా క్లయిమాక్స్‌లో వాన వెలుస్తుంది.మనక్కూడా సందేహాలు వెలిసిన అనుభూతి లేదా ఒక మంచి కథలో తడిసిన అనుభూతి. ప్రేమ, స్నేహం ఉన్నంత కాలం ఈ జడి, ఈ సినిమా తప్పక ఉంటాయి. కాదల్ దేశం 1996లో దర్శకుడు కదిర్ చేసిన సంచలనమే ‘కాదల్ దేశం’. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోని కుర్రకారుని ఒక రకమైన ఉన్మాదంలో ముంచెత్తిందని చెప్పుకోవాలి. ప్రేమ, స్నేహాలకు ముఖ్యమైన విలువ ఏర్పడే టీనేజ్‌లో ఉన్న వాళ్లందరూ ఈ సినిమాను పదే పదే చూశారు. మొదటిసారి నటించిన అబ్బాస్ ఈ సినిమాతో ఆడపిల్లల కలల రాకుమారుడు అయ్యాడు. ఈ సినిమాలోని ‘ముస్తఫా.. ముస్తఫా’ పాటకు థియేటర్స్‌లో గ్రూపులు గ్రూపులుగా నిలబడి కుర్రాళ్లు డాన్స్ చేసిన విడ్డూరం సంభవించింది. మామూలు ప్రేమ కథకు కూడా భారీ ఖర్చు, సెట్టింగులు వేయడం వల్ల దర్శకుడు కదిర్కి, నిర్మాత కుంజుమోహన్కి పెద్ద పేరు వచ్చింది. అప్పటిదాకా ముక్కోణ ప్రేమ కథ అంటే ఎవరో ఒకరు త్యాగం చేయడమే. ఆ మూసను ఈ సినిమా బద్దలు కొట్టి కొత్త క్లయిమాక్స్‌కు చోటిచ్చింది. రెహమాన్ ఊపు ఈ సినిమా పాటల్లో, రీరికార్డింగ్‌లో చూడవచ్చు. ‘హలో డాక్టర్... హార్ట్ మిస్సాయే’... ‘వెన్నెలా వెన్నెలా’, ‘కాలేజీ స్టయిలే’.. ‘ప్రేమా’... ఇవన్నీ ఇప్పుడూ ఫేవరెట్ పాటలే. ‘తొలిప్రేమ’ తో డైరెక్టర్ అయిన కరుణకారన్ ఈ సినిమాకు క్లాప్ అసిస్టెంట్. అలాగే ‘రంగం’తో డైరెక్టర్ అయిన సినిమాటోగ్రాఫర్ ఆనంద్ ఈ సినిమాకు జాతీయ అవార్డు పొందాడు. అద్భుతమైన ఫొటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం, భారీ ఖర్చు, నటీనటులు ఇవన్నీ ‘ప్రేమదేశం’ ను చిరకాలం నిలిచేలా చేశాయి. ‘ఒక గుడిలో ఎంతమంది దేవుళ్లైనా ఉండొచ్చు.. కాని ఆడదాని గుండెలో ఇద్దరు మగాళ్లు ఉండకూడదు’ వంటి తమిళ్ మార్క్ డైలాగులు ఉన్నాయి. కదిర్ మీద చాలామందికి ఆశలు ఉండేవి. అతడు ‘ప్రేమికుల రోజు’ తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమాలు తీయక కనుమరుగయ్యాడు. – కె -
ఇష్టం లేని టాపిక్
ఈ మధ్యనే తబుస్సమ్ ఫాతిమా హష్మీ బర్త్‌డే జరిగింది. ఈ మధ్యే అంటే నవంబర్ 4న. ఈ తబుస్సమ్ ఎవరంటే.. మన హీరోయిన్ టాబూ! బర్త్‌డే పార్టీకి వచ్చిన వారిలో కొందరు ‘పెళ్లెప్పుడు టాబూ’ అన్నట్లు చూశారు. ‘పెళ్లే ఇంత ఆలస్యమైతే.. పిల్లలెప్పుడు’ అని ఇంకొన్ని చూపులు ఆమెను అడిగాయి. ‘ఇంకా ఎంతమందిని ప్రేమిస్తావ్ తల్లీ’ అని మరికొన్ని చనువున్న చూపులు ప్రశ్నించాయి. అన్నిటికీ టాబూ సమాధానం ఒక్కటే. చిరునవ్వు. టాబూకి 46 ఏళ్లు. ఇప్పటికైనా, అసలెప్పటికైనా ఒక తోడు లేకుండా ఎలా అని దగ్గరి బంధువులు ఆమెను డైరెక్టుగానే అడుగుతున్నారు. వీటన్నిటికీ రియాక్ట్ అవుతూ కూర్చుంటే, అగ్నికి ఆజ్యం పోసినట్లేనని టాబూ ఫీల్ అవుతోంది. ‘‘ఎన్నిసార్లని చిరునవ్వుతో నెట్టుకొస్తాం. వీళ్లు విసిరే చూపులకు, అడిగే ప్రశ్నలకు కొన్నిసార్లు చికాకు వేస్తుంది. కొన్నిసార్లు నిస్పృహ కలుగుతుంది. నన్ను నాలా ఎందుకు ఉండనివ్వరు. ఒక మనిషి జీవితాన్ని ‘పెళ్లి, పిల్లలు’ అనే కొలమానాలతోనే ఈ సమాజం ఎందుకు జడ్జ్ చేస్తుందో అర్థం కాదు. నేనెవర్నీ పట్టించుకోను. నన్నూ ఎవరూ పట్టించుకోకపోతే నాకు కంఫర్ట్‌గా ఉంటుంది’’ అని టాబూ అంటోంది. అయినా సడెన్‌గా ఇప్పుడెందుకు టాబూ హర్ట్ అయ్యారు. అవదా మరి? అకేషన్ ఏదైనా.. లొకేషన్ ఏదైనా మీడియా కొన్నేళ్లుగా ఆమెకు సంధిస్తున్న మొదటి ప్రశ్న ఇదే.. పెళ్లెప్పుడని! ‘మక్బూల్’లో నిమ్మీగా, ‘చాందినీ బార్’లో డ్యాన్సర్‌గా, దృశ్యంలో టాప్ కాప్‌గా.. ఆమె కెరీర్లో ఇన్ని మంచి పాత్రలుంటే, నిజ జీవితంలో లేని ‘భార్య’ అనే పాత్ర గురించే అంతా అడగడం న్యాయమేనా? ‘ఆ టాపిక్ నాకు నచ్చదు దేవుడా’ అని టాబూ మొత్తుకుంటున్నా కూడా అడగడం కరెక్టేనా? -
అతను చీటర్.. చీటర్.. చీటర్!
మూడు సార్లు ఇంత బలంగా చీటర్.. చీటర్... చీటర్ అని పరిణీతి చోప్రా చెబుతున్నారంటే.. అతనెవరో పెద్ద మోసమే చేసి ఉంటాడు. ఇంతకీ అతనెవరు? అంటే.. ఇంకెవరో కాదు. ఈ మధ్యే విడుదలైన ‘గోల్మాల్ ఎగైన్’ దర్శకుడు రోహిత్‌శెట్టి. అజయ్ దేవ్గన్, పరిణీతీ చోప్రా, టబు, అర్షద్ వార్షి ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం బీ టౌన్ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టి, 200 కోట్ల క్లబ్‌లోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ, షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విశేషాలను పరిణీతి గుర్తు చేసుకున్నారు. అందులో రోహిత్ శెట్టితో ఆమె క్రికెట్ ఆడిన ఇన్సిడెంట్ ఒకటి. ఆ సమయంలో వీడియో కూడా తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న పరిణీతి లాంగ్ఆన్ షాట్ కొట్టారు. నాన్–స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న రోహిత్ శెట్టి ముందు రన్‌కు ట్రై చేసి, సడన్‌గా వెనక్కి వెళ్లారు. అక్కడితో ఆగకుండా మళ్లీ ట్రై చేయడంతో పరిణీతి చోప్రా రనౌట్ అయ్యారు. ఈ సీన్‌కు చిత్రబృందం అంతా నవ్వేశారు. దీంతో ‘మోసం.. మోసం.. అంతా మోసం’ అంటూ రోహిత్ శెట్టిపై సరదాగా అలిగారు పరిణీతి. ‘‘ రోహిత్ శెట్టి సార్ నన్ను చీట్ చేశారు. రనౌట్ అయ్యాను. ఆయన చీటర్.. చీటర్.. చీటర్’’ అని పరిణీతి పేర్కొన్నారు. -
నాగ్ సినిమాపై వర్మ క్లారిటీ
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస ఫ్లాప్‌లతో ఉన్న వర్మతో సినిమాతో నాగార్జున లాంటి సీనియర్ స్టార్ హీరో సినిమా చేస్తుండటంతో ఆ సినిమా టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబందించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారని, నాగ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, నాగ్ ఫ్రెండ్ అయిన టబు నటించనుందన్న టాక్ గట్టిగా వినిపించింది. ఈ వార్తలపై దర్శకుడు వర్మ క్లారిటీ ఇచ్చాడు. తను నాగ్ తో చేయబోయే సినిమాలో టబు, అమితాబ్‌లు నటించటం లేదని తెలిపాడు. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందన్న వర్మ ఇతర కాస్టింగ్ వివరాలు మాత్రం వెల్లడించలేదు. -
నాగ్, ఎన్టీఆర్ మూవీస్.. ఓ క్లారిటీ!
సాక్షి, సినిమా : సీనియర్ నటి టబు గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నాగ్-వర్మ కొత్త చిత్రానికి హీరోయిన్గా కన్ఫర్మ్ అయ్యిందని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందన్నది ఓ వార్త కాగా, ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రం కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారన్నది మరో వార్త సారాంశం. ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రాలపై ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టబు స్పందించారు. ఇండియా టుడే వెలువరించిన కథనం ప్రకారం.. గత కొన్నేళ్లుగా ఆమె సినిమా-సినిమాకు ఆమె 8 నెలల నుంచి ఏడాది గ్యాప్ తీసుకుంటున్నారు. ఆ లెక్కన కొత్తగా తాను ఏ సినిమాకు అంగీకరించలేదని స్పష్టం చేశారు. ఇంత వరకు ఏ మేకర్లు తనని సంప్రదించలేదని.. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నానని ఆమె తెలిపారు. అయితే తన కొత్త చిత్రం మాత్రం వచ్చే ఏడాదిలోనే ఉంటుందని ఆమె ప్రకటించారు. ఆ లెక్కన నాగ్, ఎన్టీఆర్ చిత్రాల్లో ఆమె నటించబోతుందన్న వార్త నిజం కాదని స్పష్టమయ్యింది. ఇక అజయ్ దేవగన్ హీరోగా ఆమె నటించిన గోల్మాల్ రిటర్న్స్ దీపావళికి రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రూ. 182 కోట్ల కలెక్షన్లతో ఈ ఏడాది బాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా ఆ చిత్రం నిలిచింది. -
న్యూ లుక్
ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ మొదలు కావడానికి ఇంకో రెండు నెలలు ఉంది. కొత్త సంవత్సరంలో మొదటి నెల షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారట. ఈలోపు ఈ చిత్రంలో నటించబోయే నాయికలు, సహాయ నటీనటుల గురించి చర్చలు మొదలయ్యాయి. అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తీ సురేశ్‌లను తీసుకున్నారని ఓ టాక్. పూజా హెగ్డే పేరు కూడా పరిశీలనలో ఉందని మరో టాక్. తాజాగా, టబు పేరు సీన్లోకొచ్చింది. ఓ కీలక పాత్రకు ఆమెను తీసుకున్నారని సమాచారం. ‘అత్తారింటికి దారేది’తో టాలీవుడ్లో నదియా సెకండ్ ఇన్నింగ్స్ వైభవంగా మొదలయ్యాయి. టబు పాత్రను కూడా త్రివిక్రమ్ ఆ రేంజ్లో డిజైన్ చేశారట. ఇప్పటికే అఖిల్ ‘హలో’ లో, నాగార్జున–రామ్‌గోపాల్ వర్మ సినిమాలోనూ టబు కమిట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఫైనల్లీ ఈ పొడుగుకాళ్ల సుందరి ఎన్ని సినిమాల్లో కనిపిస్తారో చూడాలి. ఆ సంగతలా ఉంచితే, త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపిస్తారట. ఈ మధ్య దాదాపు అన్ని సినిమాల్లోనూ గడ్డంతో కనిపించిన చిన్న ఎన్టీఆర్ ఈ సినిమాలో క్లీన్ షేవ్‌లో చాక్లెట్ బాయ్‌లా కనిపిస్తారని టాక్. -
నాగ్ సరసన సీనియర్ బ్యూటీ
కింగ్ నాగార్జున, బాలీవుడ్ బ్యూటీ టబులది సూపర్ హిట్ పెయిర్. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన నిన్నేపెళ్లాడతా.. ఆవిడా మా ఆవిడే సినిమాలు మంచి విజయాలు సాధించాయి. కేవలం నాగ్ తో ఉన్న స్నేహం కారణంగా హీరోయిన్ గా మాంచి ఫాంలో ఉన్న సమయంలో సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది టబు. కేవలం హీరో హీరోయిన్లుగా మాత్రమే కాదు.. నాగ్ టబుల మధ్య మంచి స్నేహం కూడా ఉంది. నాగ్ ఫ్యామిలీతో నాకు ఎంతో అనుబంధం ఉందంటూ టబు చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు ఈ ఇంట్రస్టింగ్ పెయిర్ ను మరో సారి తెరమీద చూపించేందుకు రెడీ అవుతున్నాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఈ నెల 20న సినిమా ప్రారంభించనున్నారు. అప్పట్లో శివ సినిమాను ప్రారంభించిన అదే ప్లేస్ లో కొత్త సినిమా స్టార్ట్ చేయనున్నారు. పోలీస్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా టబు నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే నాగ్ టబుతో జోడి కడతాడా లేదా తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
హిట్ కాంబినేషన్ గురూ!
నాగార్జున–రామ్‌గోపాల్ వర్మలది హిట్ కాంబినేషన్. కాదు.. కాదు.. సూపర్ హిట్ కాంబినేషన్. సుమారు 28 ఏళ్ల క్రితం ఈ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘శివ’ సృష్టించిన సెన్సేషన్ అలాంటిది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నాగ్–రాము ఓ సినిమా చేయనున్నారు. ఇటీవల ఈ మూవీ గురించి వర్మ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దర్నీ పక్కన పెడితే నాగ్–టబులది కూడా హిట్ కాంబినేషన్. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాల్లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ కేక. అఖిల్ ‘సిసింద్రీ’లో నాగ్‌తో టబు ‘ఆటాడుకుందాం రా.. అందగాడా...’ అంటూ సందడి చేసిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు నాగ్ హీరోగా వర్మ దర్శకత్వం వహించనున్న సినిమాలో టబూని నాయికగా తీసుకున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. మరోవైపు.. అఖిల్ తాజా చిత్రం ‘హలో’లో టబు ఓ కీలక పాత్ర చేస్తున్నారనే వార్త కూడా ఉంది. -
ఆ హీరో మూవీకి ఎప్పుడూ నో చెప్పను!
న్యూఢిల్లీ : బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ వల్లే తాను పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోయానంటూ గతంలో ఎన్నోసార్లు చెప్పారు ప్రముఖ నటి టబు. అయితే అజయ్ దేవగన్‌తో నటించే అవకాశం వస్తే మాత్రం ఆ మూవీలో కచ్చితంగా నటిస్తానని, ఎట్టి పరిస్థిత్తుల్లోనూ అవకాశాలు వదుకునే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న గోల్మాల్ అగేయిన్ చిత్రంలో అజయ్, టబు నటించారు. ఈ శుక్రవారం ఆ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్‌పథ్, తక్షక్, దృశ్యం వంటి అజయ్ దేవగన్ చిత్రాల్లో గతంలో నటించిన టబు గోల్మాల్ అగేయిన్లోనూ కలిసి పనిచేశారు. గోల్మాల్ విడుదల నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘అజయ్, నేను చిన్నాప్పటినుంచీ మంచి మిత్రులం. దాంతో అతడి మూవీల్లో నటించేందుకు నాకెలాంటి ఇబ్బంది ఉండదు. అజయ్ హీరోగా నటించినా.. లేక దర్శకుడు, నిర్మాతగా ఇలా ఏ విధంగా పనిచేసినా సరే.. ఆయన మూవీల్లో ఛాన్సిస్తే కచ్చితంగా నటిస్తాను. గోల్మాల్ అగేయిన్ తర్వాత లవ్ రంజన్ నిర్మాతగా తెరకెక్కించనున్న లేటెస్ట్ మూవీలో అజయ్‌తో మరోసారి జతకట్టనున్నానంటూ’ టబు వివరించారు. పెళ్లి చేసుకునేందుకు నా కోసం ఓ అబ్బాయిని వెతికి పెట్టమంటూ అజయ్‌ని ఇప్పటికీ అడుగుతుంటానని గతంలో ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలు పెను దూమారం రేపిన సంగతి తెలిసిందే. -
మా పెళ్లిళ్ల గురించి మీకెందుకు?
బాలీవుడ్లో అత్యంత ముదురు బ్రహ్మచారిగా ముద్రపడిన సల్మాన్ ఖాన్‌కు నిత్యం ఎదురయ్యే ప్రశ్న.. 'మీకు పెళ్లి ఎప్పుడు'. ఆయన కార్యక్రమానికి వెళ్లినా.. ఎక్కడ కనిపించినా.. అభిమానులు, మీడియా ప్రతినిధులు పదేపదే అడిగే ప్రశ్న ఇది. ఇప్పుడు ఇదే తరహా ప్రశ్న మరో బాలీవుడ్ సెలబ్రిటీని వెంటాడుతోంది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు.. మన హైదరాబాద్ ముద్దుగుమ్మ టబునే. తెలుగులో ఎన్నో సినిమాలతో అదరగొట్టిన ఈ అమ్మడు ఇప్పుడు 'గోల్మాల్ అగైన్'తో మళ్లీ ప్రేక్షకులను పలుకరించబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఈ సీనియర్ నటికి తరచూ ఎదురవుతున్న ఓ ప్రశ్న చికాకు తెప్పిస్తోందట. అదేమిటంటే.. ఎక్కడికి వెళ్లినా విలేకరులు, జనాలు 'మీ పెళ్లెప్పుడు' అని ప్రశ్నిస్తున్నారట. తాజాగా 'నవభారత్ టైమ్స్'కు ఇంటర్వ్యూ ఇచ్చిన టబు ఈ విషయాన్ని తెలిపింది. పెళ్లి చేసుకొనే ఆలోచన ఎంతవరకు వచ్చిందంటూ పదేపదే అడుగుతుండటం.. చాలా చిరాకు తెప్పిస్తున్నదని, దీంతో మీ పని మీరు చూసుకొండి.. నా పెళ్లి గురించి అడగకండి అని అనాల్సి వస్తున్నదని టబు తెలిపింది. సల్మాన్ ఖాన్, తన పెళ్లిళ్ల గురించి జనాలు ఎక్కువ ఆందోళన పడుతున్నట్టు కనిపిస్తున్నదని ఆమె పేర్కొంది. 'సల్మాన్, నా పెళ్లిల గురించి ప్రతి ఒక్కరూ వర్రీ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఒకే ప్రశ్న పదేపదే అడుగుతుండటంతో విసిగిపోయాను. మరొకటి ఏదైనా కొత్తది అడగొచ్చు కదా' అని కోరుతోంది టబు. -
కేంద్రమంత్రిగా టబు!
టబు రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు! ఇదంతా ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా? టబు కేంద్రమంత్రి బాధ్యతలు స్వీకరించనుంది రియల్ లైఫ్‌లో కాదు... రీల్ లైఫ్‌లో! అదీ సంగతి. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాత్రలో టబు నటించనున్నారని బాలీవుడ్ వర్గాల టాక్. ఉజ్మా అహ్మద్ అనే భారతీయురాలిని పాకిస్థాన్‌కు చెందిన తాహిర్ బెదిరించి, బలవంతంగా పెళ్లి చేసుకోవడం, సుష్మా స్వరాజ్ బాధితురాలికి అండగా నిలిచి, ఇండియాకి రప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ కుమార్ ఇప్పుడు ఉజ్మా అహ్మద్ జీవితకథను తెరపైకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఉజ్మా పాత్రలో పరిణీతి చోప్రా, సుష్మా స్వరాజ్ పాత్రలో టబును ఎంపిక చేసినట్లు సమాచారం. -
సంజయ్ బయోపిక్‌లో సీనియర్ హీరోయిన్
స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితకథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో రణబీర్ కపూర్ సంజయ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పరేశ్ రావల్, మనీషా కొయిరాలా, సోనమ్ కపూర్, దియా మీర్జా, అనుష్క శర్మ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. తాజాగా ఈ భారీ చిత్రంలో నటించేందుకు మరో స్టార్ హీరోయిన్ అంగీకరించింది. సీనియర్ బాలీవుడ్ స్టార్ టబు సంజయ్ బయోపిక్ లో అతిథి పాత్రలో కనిపించనుంది. తన రియల్ లైఫ్ క్యారెక్టర్ లోనే రీల్ లైఫ్ లోనూ నటించనుంది. 2004లో మున్నాభాయ్ ఎంబీబీయస్ సినిమాకు గానూ టబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు సంజయ్. ఇప్పుడు అదే సీన్ కోసం అతిథి పాత్రలో నటించేందుకు టబు అంగీకరించింది. అంతేకాదు ఆ రోజు అవార్డ్ ఫంక్షన్ లో కట్టుకున్న అదే చీరతో సినిమాలో నటించనుందట. -
అజయ్ వల్లే ఒంటరిగా మిగిలిపోయాను: నటి
ముంబయి: బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్‌పై ప్రముఖ నటి టబూ పెద్ద నిందలే వేశారు. తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అజయ్ కారణం అని చెప్పారు. తాను ఈ రోజు ఇలా ఒంటరిగా ఉండాల్సి వచ్చిందంటే అందుకు కారణం అతడే(నవ్వులు) అని వివరించారు. ప్రస్తుతం అజయ్ దేవగన్‌తో రోహిత్ షెట్టీ దర్శకత్వంలో వస్తున్న గోల్మాల్ 4 చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు ముంబయి మిర్రర్‌తో మాట్లాడుతూ ఈ సరదా సంభాషణ సాగించారు. మీరు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండటానికి కారణం ఏమిటని ప్రశ్నించగా స్పందించిన టబూ ‘నేను ఈ రోజు ఒంటిరిగా ఉండిపోవాల్సి వచ్చిందంటే అందుకు అజయ్ దేవగన్ మా కజిన్ కారణం. నాతో ఏ అబ్బాయి అయినా మాట్లాడినట్లు కనిపిస్తే అతడిని కొడతామని హెచ్చరించేవారు. దాంతో నేను ఎవరితోనూ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. వారు అలా అప్పుడు చేసిన పనికి ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పటికీ నేను అజయ్‌కు చెప్పాను.. పెళ్లి చేసుకునేందుకు నా కోసం ఓ అబ్బాయిని వెతికి పెట్టమని’ అంటూ ఆమె సరదాగా చెప్పుకొచ్చారు. ఇది వరకే విజయపథ్, దృశ్యం వంటి చిత్రాల్లో అజయ్‌తో కలిసి టబూ నటించిన విషయం తెలిసిందే. -
భాగమతి వచ్చేస్తోంది..!
కొంత కాలంగా తన లుక్స్‌తో ఆకట్టుకోలేకపోతున్న అనుష్క, మరో డిఫరెంట్ రోల్లో దర్శనమివ్వనుంది. దాదాపు ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న భాగమతి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పిల్ల జమిందార్ ఫేం అశోక్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో భాగమతి సినిమాను తెరకెక్కిస్తుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా లేడిఓరియంటెడ్ కథతో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, బాలీవుడ్ బ్యూటీ టబులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ స్టార్ కాస్ట్, టెక్నీషియన్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంతవరకు రావాల్సినంత హైప్ మాత్రం రాలేదు. అందుకే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఫస్ట్ లుక్‌తో పాటు రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. -
కన్ఫామ్ : అఖిల్ సినిమాలో సీనియర్ హీరోయిన్
తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్ లో టబు పై సన్నివేశాలను చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు. మనం, 24 సినిమాల ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. తెలుగు సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన టబు, తరువాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. గతంలో నాగ్ సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటి అక్కినేని కుటుంబంతో మంచి రిలేషన్ మెయిన్టైన్ చేస్తోంది. అఖిల్ బాలనటుడిగా తెరకెక్కిన సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన టబు, ఇప్పుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. అయితే టబు చేస్తుంది తల్లి పాత్రే అయినా..అది హీరో తల్లి పాత్రనా.. లేక హీరోయిన్ తల్లి పాత్రనా తెలియాల్సి ఉంది. -
ఆ పాత్రల్లో నటించడం వేస్ట్
హీరోయిన్లు సెంట్రిక్ ప్రాత్రల్లో నటించడం వేస్టే అంటోంది నటి టబూ. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి బహుభాషా నటిగా గుర్తింపు పొందిన నటి టబూ. ముఖ్యంగా కోలీవుడ్‌లో కండుకొండేన్ కండుకొండెన్, సిరైశాలె, స్నేహితియే వంటి వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించిన ఈ బాలీవుడ్ భామకు ఇటీవల జోరు తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం హిందీ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న టబూ ఒక భేటీలో పేర్కొంటూ తనకు వైవిధ్య భరిత కథా పాత్రల్లో నటించిన నాయకిగా అభిమానుల మధ్య మంచి పేరు ఉందని అంది. అయితే పాత్రల ఎంపికలో తాను ఎలాంటి పాలసీని అవలంభించలేదన్నారు. తనను ఆకట్టుకున్న పాత్రల్లో నటిస్తున్నానని చెప్పింది. ముఖ్యంగా హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రల్లోనే నటించాలన్న భావన తనకు ఎప్పుడూ కలగలేదంది. అసలు అలాంటి కథా చిత్రాల్లో నటించమని తనను ఎవరూ అడగలేదని పేర్కొంది. ఇంకా చెప్పాలంటే హృదయాలను కట్టిపడేసే సన్నివేశాలు లేని అలాంటి పాత్రల్లో నటించడం వృథా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వర్తమాన భామల నుంచి, ప్రముఖ కథానాయికల వరకూ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నారు కదా అన్న ప్రశ్నకు వారి గురించి చెప్పడానికి తానెవరినని, అది వారి వారి ఆకాంక్ష అని పేర్కొంది. ఈ అమ్మడు ఎవరిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిందన్న చర్చ బాలీవుడ్లో బాగానే జరుగుతోంది. ఇకపోతే తన ఎదుగుదల తన తాహత్తుకు తగ్గట్టుగానే అమరిందని టబూ చెప్పుకొచ్చింది. -
టబు కన్ఫర్మ్ చేసిందోచ్!
ముంబై: మంచి అభినేత్రిగా టబుకు బాలీవుడ్లో చక్కని పేరుంది. 'చాందినీ బార్', 'హైదర్' లాంటి విమర్శకుల ప్రశంసలందుకున్న సినిమాల్లో నటించిన ఈ భామ.. సినీవర్గాలను విస్మయపరుస్తూ.. తాజాగా కామెడీ జానర్ సినిమాకు సై అంటూ పచ్చజెండా ఊపింది. రోహిత్ శెట్టీ పాపులర్ కామెడీ ఫ్రాంచెజీ 'గోల్మాల్'లో నటించేందుకు ఓకే చెప్పింది. 'గోల్మాల్' లెటెస్ట్ వెర్షన్లో ఎప్పటిలాగే అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తుండగా అతని సరసన పరిణీతి చోప్రా నటించబోతున్నది. ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్ర పోషించబోతున్నది. 'గోల్మాల్' సిరీస్‌కు తాను పెద్ద అభిమానిని కావడంతో ఈ ఆఫర్ తనకు ముందుకు వచ్చినప్పుడు కాదనలేకపోయానని టబు తెలిపింది. 'ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నేను షాక్ తినలేదు. సర్ప్రైజ్ కాలేదు. 'గోల్మాల్' సిరీస్‌ను నేను బాగా ఇష్టపడతాను. ఇందులో భాగం కానుండటంతో ఎంతో ఆనందం కలిగిస్తోంది. అజయ్ (దేవగణ్) నా స్నేహితుడు. మిగతా చిత్రయూనిట్ కూడా నాకు తెలుసు. స్నేహితులతో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఆనందమే కదా' అంటూ ఆమె ఓ దినపత్రికతో పేర్కొంది. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యభరితమైన సీరియస్ పాత్రలు పోషించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టబు.. తనలో కామెడీ యాంగిల్ కూడా ఉందని, తనకు చాలా తొందరగా నవ్వు వస్తుందని పేర్కొంది. -
అఖిల్ చిత్రంలో?
‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ ‘సిసింద్రీ’ సినిమాలో నాగార్జునతో టబు హుషారుగా డ్యాన్స్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఊహే తెలియని వయసులో అఖిల్ ఆ సినిమాతో ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఇక నాగ్ సరసన టబు ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మళ్లీ అఖిల్ సినిమాలో నటించనున్నారట. ‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ ద్వితీయ చిత్రం ఉంటుందని నాగ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఉన్న ఓ కీలక పాత్ర కోసం టబూని సంప్రదించడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని భోగట్టా. -
అఖిల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ
తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే కథా కథనాలను ఫైనల్ చేసిన ఈ యంగ్ హీరో, త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ప్రస్తుతం తన నిశ్చితార్థం పనుల్లో బిజీగా ఉన్న అఖిల్, జనవరి నుంచి కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లోనే హీరోయిన్గా పరిచయం అయిన టబు, తరువాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తరువాత నాగ్ సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటి అక్కినేని కుటుంబంతో మంచి రిలేషన్ మెయిన్టైన్ చేస్తోంది. అఖిల్ బాలనటుడిగా తెరకెక్కిన సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన టబు, ఇప్పుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ క్యారెక్టర్‌కు రెడీ అవుతోంది. నాగార్జున స్వయంగా అడగటంతో టబు ఈ పాత్రకు అంగీకరించిందన్న ప్రచారం జరుగుతోంది. -
పత్తు సుందరిగళ్!
ఇక్కడున్న ఫొటోని చూడ్డానికి రెండు కళ్లూ చాలడంలేదు కదూ! కేరళ సంప్రదాయ చీరలో తారలందరూ తళుక్కుమంటే చూసే కొద్దీ చూడబుద్ధవుతోంది కదూ! ఫొటోలో మన తెలుగింటి కోడలు అమల, హైదరాబాదీ భామ టబు, తమిళింటి ఆడపడుచులు రాధిక, శ్రీప్రియ... ఇలా అందరూ కేరళ స్టైల్ చీర కట్టుకుని ఎక్కడ మెరిసినట్లు? ఆ విషయానికే వస్తున్నాం. ఇటీవల రాధిక కుమార్తె రేయాన్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. చెన్నైలో జరిగిన ఆ వేడుకకు దక్షిణ, ఉత్తరాది చిత్రసీమ నుంచి పలువురు ప్రముఖ తారలు హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైనవాళ్లలో కొంతమంది కేరళలో జరిగిన లక్ష్మి తనయుడు వరుణ్ పెళ్లికి వెళ్లారు. ఒకప్పటి ప్రముఖ తారలు, తమిళ, మలయాళ పరిశ్రమల్లో ట్రివాంకూర్ సిస్టర్స్‌గా పేరు, ప్రతిష్ఠలు సాధించిన పద్మిణి-రాగిణి-లలితల మనవడే వరుణ్. రాగిణి కూతురు లక్ష్మి. కేరళలోని ట్రివాంకూరులో జరిగిన వరుణ్ పెళ్లికి వెళ్లిన వాళ్లల్లో రాధిక, శ్రీప్రియ, లిజి, అమల, టబు, జ్యోతిక తదితరులు ఉన్నారు. పెళ్లి కేరళలో కాబట్టి, అక్కడి సంప్రదాయానుసారంగా చీర కట్టుకుని, నగలు పెట్టుకుని.. ఇలా ఫొటో దిగారు. ఈ ‘పత్తు సుందరిగళ్’ అంటే.. పదిమంది సుందరీమణులు వివాహ వేడుకకు నిండుదనం తెచ్చి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
జేజమ్మకు అమ్మ!
ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కథానాయికలిప్పుడు అత్త, అమ్మ వంటి పాత్రలతో పాటు ఇతర ముఖ్యమైన క్యారెక్టర్లపైనా దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే రమ్యకృష్ణ, నదియా వంటి తారలు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి బిజీగా ఉన్నారు. ఇప్పుడా జాబితాలోకి టబు చేరారు. గడచిన రెండేళ్లల్లో హిందీలో ‘హైదర్’, ‘దృశ్యం’, ఫితూర్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేశారామె. ఇప్పుడు తెలుగులో ‘భాగమతి’ చిత్రంలో నటించడానికి అంగీకరించారని సమాచారం. అనుష్క టైటిల్ రోల్లో ‘పిల్ల జమిందారు’ ఫేం అశోక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో అనుష్కకు తల్లిగా టబు కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ముందు ఈ పాత్రకు నదియాను అనుకున్నారట. కానీ, టబు అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటారని చిత్రబృందం ఆమెను సంప్రదించిందట. ఈ పాత్ర నచ్చడంతో టబు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. తెలుగులో టబు నటించిన చివరి చిత్రం ‘పాండు రంగడు’. ఆ చిత్రం విడుదలై ఎనిమిదేళ్లవుతోంది. ఒకవేళ ‘భాగమతి’ చిత్రాన్ని టబు అంగీకరించిన విషయం నిజమే అయితే తెలుగులో ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌కి ఇది నాంది అవుతుందని చెప్పొచ్చు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వి. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
భాగమతిలో బాలీవుడ్ బ్యూటి
తెలుగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ టబు. అడపాదడపా సౌత్ సినిమాల్లోనూ కనిపిస్తున్న ఈ బ్యూటి, ఇటీవల సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తుంది. తాజాగా దృశ్యం బాలీవుడ్ రీమేక్‌లో తనదైన నటనతో మెప్పించిన టబు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో సౌత్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. అనుష్క లీడ్ రోల్లో పిల్ల జమీందార్ ఫేం అశోక్ తెరకెక్కిస్తున్న సినిమా భాగమతి. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు మరో కీలక పాత్రలో టబు నటించనుందట. ఈ సినిమాలో టబు, అనుష్క తల్లిగా నటిస్తుందన్న టాక్ వినిపిస్తున్నా.. యూనిట్ సభ్యుల నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
'ఆ హీరోయిన్లలో ఒక్కరితోనైనా రొమాన్స్ చేయాలి'
న్యూఢిల్లీ: లవ్ ఎఫైర్లతో తరచూ వివాదాలలో చిక్కుకుంటున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. రూమర్ల కారణంతో ప్రేయసితో గొడవపడి బ్రేకప్ చెప్పేశాడు. ఇక విషయానికొస్తే.. యంగ్ హీరోలు తనకంటే తక్కువ వయసుండే హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడానికి ఒకే చెబుతుంటారు. అయితే సుశాంత్ మాత్రం తన టేస్ట్ ఏంటో చెప్పకనే చెబుతున్నాడు. తనకు ఒకవేళ అవకాశం ఇస్తే, కష్టసాధ్యమైనా సరే ముగ్గురు మాజీ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తానని అంటున్నాడు. 'ఎక్ దో తీన్' అంటూ కుర్రకారు గుండెల్లో రెండు దశాబ్దాల కిందట వేడి పుట్టించిన మాధురీ దీక్షిత్, డైరెక్టర్ల హీరోయిన్ గా, అందానికే హంగులు అద్దినట్లుగా ఉండే మనీషా కొయిరాలా, ఇప్పటికీ తనకంటూ గుర్తింపునిచ్చే క్యారెక్టర్లలో కనిపించే టబుతో కలిసి నటించాలని ఆశ పడుతున్నాడు సుశాంత్. ఎందుకుంటే ఆ ముగ్గురు సూపర్ హీరోయిన్లు. వారి అందం తనకు నిద్రలేని రాత్రులను కల్పించిందని చెప్పుకొచ్చాడు. ఆ ముగ్గురిలో కనీసం ఒక్కరితోనే రొమాన్స్ చేసే అవకాశం రావాలని మనసులో మాట చెప్పేశాడు. సుశాంత్ నటించిన ఎం.ఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ, రాబ్తా మూవీలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. -
యాక్షన్ సినిమాలపై మనసుపడ్డ హీరోయిన్!
ముంబై: సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉన్న హీరోయిన్ టబు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలో పోషించి నటిగా నిరూపించకున్న టబు మనస్సు ఇప్పుడు యాక్షన్ సినిమాల వైపు మళ్లింది. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యరాయ్ 'జజ్బా' యాక్షన్ సినిమాతో సత్తా చాటింది. ఈ నేపథ్యంలో తాను కూడా ఓ యాక్షన్ సినిమాలో ఫైట్లు, విన్యాసాలు చేసి.. ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఈ అమ్మడు కోరుకుంటోంది. ఇదే విషయాన్ని తాజాగా ఓ వార్తాసంస్థకు టబు తెలిపింది. పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేయడానికి రెడీ అని ప్రకటించింది. ప్రస్తుతానికైతే భారీ యాక్షన్ సీన్లతో గొప్ప కంటెంట్ ఉన్న స్ర్కిప్ట్ తన దృష్టికి రాలేదని, ఒకవేళ వస్తే తప్పకుండా చేస్తానని ఆమె తెలిపింది. ఇది కమర్షియల్ ఎంటర్టైనింగ్ యాక్షన్ సినిమాగా ఉండాలని చెప్పింది. ఈ మధ్యకాలంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నప్పటికీ, తన ప్రయారిటీస్ వేరు అని, మంచి బలమున్న కథాంశంతోపాటు దానిని సరిగ్గా డీల్ చేయగల డైరెక్టర్, చక్కగా నిర్మించగల ప్రొడ్యూసర్ ఉంటేనే.. అలాంటి ప్రాజెక్టుల్లో తాను భాగం అవుతానని టబు వివరించింది. టబు తాజాగా నటించిన సినిమా ఫితూర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడు అభిషేక్ కపూర్, నిర్మాత సిదార్థ రాయ్ కపూర్. -
'ఆమె ఇన్వాల్వ్మెంట్ అద్భుతం' : టబు
సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ను మరో హీరోయిన్ పొగడటం చాలా అరుదు. అయితే ఇటీవలి కాలంలో నటీమణులు ...ఇతర నటులను పొగడటం తరుచు జరుగుతోంది. చాలామంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తమ తోటి నటీమణులను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇదే బాటలో సీనియర్ హీరోయిన్ టబు... టాప్ హీరోయిన్లలో ఒకరైన కత్రినా కైఫ్‌ను ఆకాశానికి ఎత్తేసింది. ఫితూర్ సినిమాలో టబు, కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్నారు. హీరోయిన్గా కెరీర్ ముగిసిన తరువాత ప్రస్తుతం స్పెషల్ క్యారెక్టర్స్‌లో మాత్రమే కనిపిస్తోంది టబు. అదే బాటలో ఫితూర్ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో అలరించింది. ఈ సందర్భంగా తన కో-స్టార్ కత్రినా కైఫ్‌పై పొగడ్తల వర్షం కురిపించింది. 'ఇప్పటివరకు నేను కలిసి పనిచేసిన వారిలో కత్రినానే హార్డ్ వర్కింగ్ హీరోయిన్, నటన పట్ల ఆమె ఇన్వాల్వ్మెంట్ అద్భుతం అనిపించింది' అంటూ కత్రినాపై ప్రశంసలు కురిపించింది. అదే సమయంలో క్యాట్ కూడా టబుపై తన గౌరవాన్ని చూపించింది. ' ఈ సినిమాలో నమ్మలేని విషయం టబు నా తల్లిపాత్రలో కనిపించటం' అంటూ కామెంట్ చేసింది. ఆదిత్యరాయ్ కపూర్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఫితూర్, చార్లెస్ డికెన్స్ రచించిన గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ నవల ఆధారంగా తెరకెక్కింది. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతోంది. -
నవంబర్ 4న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: టబు (నటి), మిలింద్ సోమన్ (నటుడు) ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధ సంఖ్య కావడం వల్ల మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, చాకచక్యంతో పనులను చకచకా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు కోరుకున్న ఇన్స్టిట్యూట్లలో కోరుకున్న కోర్సులలో సీట్లు వస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారం నిమిత్తం విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక భద్రత, స్నేహసంబంధాలు పెరిగి కొత్త అవకాశాలు వస్తాయి. అయితే వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లపై సంతకాలు చేయవలసి వచ్చినప్పుడు విజ్ఞతతో వ్యవహరించక తప్పదు. వీరు పుట్టిన తేదీ 4. ఇది రాహు సంఖ్య కావడం వల్ల కంప్యూటర్ రంగంలోని వారికి, ఎం.బి.ఎ; సి.ఎ; ఎల్.ఎల్.బి చదివిన వారికి మంచి అవకాశాలు. పోటీపరీక్షల్లో విజయం. సొంత ఇంటికల నెరవేరుతుంది. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. రియల్ ఎస్టేట్, మేనేజ్మెంట్, ఫైనాన్స్ రంగాలలోని వారికి, చార్టెర్డ్ ఎకౌంటెంట్లకు కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ తమ రంగాలలో బాగా పుంజుకుంటారు. లక్కీ నంబర్లు: 2,3, 4,5,6,8; లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, శుక్ర, శనివారాలు; లక్కీ కలర్స్: గ్రే, క్రీమ్, వైట్, గ్రీన్, గోల్డెన్, ఎల్లో, పర్పుల్, బ్లూ, వయోలెట్. సూచనలు: పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం, ఆవులకు, కోతులకు ఆహారం పెట్టడం, కోపాన్ని, నోటి దురుసుతనాన్ని తగ్గించుకోవడం, సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, వృద్ధులకు, అనాథలకు, వితంతువులకు సహాయం చేయడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
నేను పెళ్లికి రెడీ !
మీ పెళ్లెప్పుడు...? పెళ్లి కానివాళ్లు తరచుగా ఎదుర్కొనే ప్రశ్నే ఇది. ఇక.. పెళ్లి కాని సినిమా తారలనైతే ప్రతి ఇంటర్వ్యూలోనూ ‘మీ పెళ్లెప్పుడు?’ అని అడగడం సహజం. ఈ ప్రశ్న ఎదుర్కొంటున్న తారల్లో టబు కూడా ఉన్నారు. ఆమె ప్రస్తుతం ‘దృశ్యం’ హిందీ చిత్రం ప్రచార కార్యక్రమాలతో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో టబు పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఎప్పటిలానే ఇప్పుడు కాదనో, నో కామెంట్ అనో అనలేదామె. ‘‘నాకూ పెళ్లి చేసుకోవాలనే ఉంది. పిల్లలు కూడా కావాలనుకుంటున్నా. నాకంటూ ఓ కుటుంబం కావాలి’’ అని పేర్కొన్నారు టబు. కొంతమంది కథానాయికలు విదేశాల్లో సెటిల్ అవుతూ ఉంటారు. మీకలాంటి ఆలోచన ఉందా? అంటే -‘‘లేదు. ఏదో పని ఉంటే వెళ్లమంటే వెళతాను కానీ, మనకంటూ ఎవరూ లేని దేశంలో నేనెందుకు ఉంటా? పైగా ముంబైకి అలవాటు పడిన వాళ్లు ఇంకెక్కడా ఉండలేరు’’అని చెప్పుకొచ్చారామె. -
ఇక వెరైటీ కావాలి!
సీరియస్ పాత్రలంటే టబు చేయాల్సిందే అన్నట్లుగా ఉంది హిందీ రంగంలో. డేవిడ్, జయహో, హైదర్... వంటి చిత్రాల్లో సీరియస్ రోల్స్ చేసిన టబు త్వరలో విడుదల కానున్న ‘దృశ్యం’లో పోలీసాఫీసర్‌గా చేశారు. ఇది కూడా సీరియస్ క్యారెక్టరే. ఇవి నటనకు అవకాశం ఉన్న పాత్ర లైనప్పటికీ ఇలా వరుసగా ఒకే తరహా పాత్రలు చేయడం టబూకి విసుగ్గా ఉందట. ఈ విషయం గురించి ఆమె చెబుతూ -‘‘కొన్నేళ్లుగా నేను సీరియస్ పాత్రలకే పరిమితమైపోయాను. ఇలాంటి పాత్రలంటే చాలు దర్శక, నిర్మాతలు నన్ను సంప్రతిస్తున్నారు. అలా కాకుండా, వేరే వైవిధ్యమైన పాత్రలు కూడా ఇస్తే బాగుంటుంది. నాలో ఉన్న నటిని ఇంకెంత వైవిధ్యంగా చూపించవచ్చు అనే అంశం మీద దృష్టి పెడితే రొటీన్ పాత్రల నుంచి నాకు రిలీఫ్ దక్కుతుంది’’ అన్నారు. -
నా పాత్రలపై ఫిల్మ్ మేకర్ల అలసత్వం..
ముంబై:బాలీవుడ్ చిత్రం 'హైదర్'లో తల్లి పాత్ర పోషించి ప్రశంసలందుకున్న ప్రముఖ నటి టబు.. దృశ్యం హిందీ రీమేక్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించనున్నారు. ఇదిలా ఉంచితే తన పాత్రల ఎంపికపై టబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనను విభిన్న పాత్రల్లో చూపించే విషయంలో ఫిల్మ్ మేకర్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ టబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సినీ అభిమానులు తనను ఏరకంగా చూపిస్తే బాగుంటుందనే దానిపై దర్శకులకు సరైన వర్క్ చేయడం లేదన్నారు. తన పాత్రల ఎంపికపై దర్శకుల్లో నిబద్ధత లోపించిందని అనుకుంటున్నట్లు టబు తాజాగా పేర్కొన్నారు. తనను వివిధ పాత్రల్లో చూపించాలనుకున్నప్పుడు పక్కా విజన్ తో దర్శకులు వ్యవహరిస్తే బాగుంటుందని ఆమె సూచించారు. అయితే తన సినీ జీవితం బిజీగా ఉండటం పట్ల టబు ఆనందం వ్యక్తం చేశారు. తన జీవితంలో నలభై ఏళ్ల ఒడి ఒక అద్భుతమైనదిగా ఆమె పేర్కొన్నారు. తన జీవితం ఎన్నో అనుభవాలను నేర్పిందని ఈ సందర్భంగా పేర్కొన టబు.. ఎవరైనా అనుభవం లేకుండా రాటుదేలడం అసాధ్యమన్నారు. -
ఆయన అడిగితే అతిథి పాత్రకైనా రెడీ!
‘‘నా జీవితంలో అజయ్ దేవగన్ చాలా స్పెషల్. ఎందుకంటే నేను, అజయ్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అతనితో నాకెంతో సాన్నిహిత్యం ఉంది’’ అని కథానాయిక టబు అంటున్నారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘విజయ్‌పథ్’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు నాకు మంచి పేరు తెచ్చిపెట్టిందని టబు అన్నారు. కానీ, ఆ తర్వాత అజయ్, టబు కలిసి సినిమా చేయలేదు. ఇప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు అజయ్ దేవగన్‌తో కలిసి మలయాళ ‘దృశ్యం’ రీమేక్‌లో నటించారు టబు. దీని గురించి ఆమె మాట్లాడుతూ- ‘‘మా కజిన్, అజయ్, నేను చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్లం. నేను అజయ్‌ను ‘వీడీ’ అని పిలుస్తా. అజయ్ అడిగితే అతిథి పాత్ర చేయడానికి కూడా నేను రెడీ’’ అన్నారు. ఈ పద్ధెనిమిదేళ్లల్లో తామిద్దరం కలిసి నటించకపోవడం ఆశ్యర్యంగా ఉందని టబు చెబుతూ - ‘‘సినిమాలు మేమిద్దరం కలిసి నటించకపోయినా అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటాం. పార్టీల్లో అయితే మా ఇద్దరి అల్లరికి అంతే ఉండదు. సరదాగా ఆటపట్టించుకుంటూ ఉంటాం’’ అన్నారు. -
సింగిల్ సెలబ్స్...
బాలీవుడ్ బీట్ పెళ్లి ప్రస్తావన తెస్తే చాలు చాలామంది హీరోయిన్లు ‘మాకింకా పెళ్లి చేసుకునే వయసు రాలేదు’ అని బుకాయిస్తారు. కెరీర్ ఇక చరమాంకంలో పడిన సూచనలు కనిపించగానే, చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకుని, తెరమరుగైపోతారు. కొందరు హీరోయిన్లు మాత్రం చాలా భిన్నంగా ఉంటారు. పెళ్లితో పనేముంది? సోలో బతుకే సో బెటరని డిసైడైపోయి, తమకు నచ్చినరీతిలో బతుకుబండిని బ్రహ్మాండంగా పూలతేరులా లాగిస్తుంటారు. బాలీవుడ్లో అలాంటి అరుదైన సింగిల్ సెలబ్రిటీల గురించి... ప్రీతీ జింటా సాటి హీరోయిన్లతో పోల్చుకుంటే సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింటా చేసిన సినిమాలు తక్కువే అయినా, వార్తల్లో ఆమె రేపిన కలకలం తక్కువేమీ కాదు. సైనికాధికారి కూతురైన ప్రీతీ 1997లో మణిరత్నం దర్శకత్వంలోని ‘దిల్ సే’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తెలుగులో ‘ప్రేమంటే ఇదేరా’, ‘రాజకుమారుడు’ చిత్రాల్లో నటించింది. సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనే ప్రీతి... కింగ్స్ ఇలెవెన్ పంజాబ్ క్రికెట్ టీమ్ నిర్వహణతో సంతోషపడిపోతోంది. ఆ ధ్యాసలో పడి పెళ్లిని మర్చిపోయినట్లుంది. సుస్మితా సేన్.. విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకోవడమే తడవుగా సుస్మితా సేన్‌కు బాలీవుడ్ రెడ్‌కార్పెట్ పరిచింది. ‘దస్తక్’ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టిన సుస్మితా తెలుగు సహా దక్షిణాది చిత్రాల్లోనూ నటించింది. కెరీర్ తొలినాళ్లలోనే 2000 సంవత్సరంలో తన పాతికేళ్ల వయసులో రెనీ అనే పాపను దత్తత తీసుకుంది. ఈ దత్తత వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో న్యాయపోరాటం సాగించి మరీ బాంబే హైకోర్టు తీర్పుతో దత్తత హక్కులు సాధించుకుంది. మళ్లీ 2010లో అలీసా అనే మరో పాపను దత్తత తీసుకుంది. సింగిల్ మామ్‌గా ఇద్దరు పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే, సినీ రంగంలోనూ తన సత్తా చాటుకుంటోంది. టబు నాలుగు పదులు నిండినా, వన్నెతరగని టబు విలక్షణ చిత్రాలతో ఇప్పటికీ తన ఉనికి చాటుకుంటోంది. తొమ్మిదేళ్ల వయసులో బాలనటిగా 1980లో ‘బాజార్’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఐదేళ్లకు ‘హమ్ నౌజవాన్’లో దేవానంద్ కూతురిగా నటించింది. తెలుగులో ‘కూలీ నం-1’ చిత్రం ద్వారా 1987లో హీరోయిన్గా పరిచయమైంది. పలు భాషల్లో కమర్షియల్ బ్లాక్బస్టర్లతో పాటు పలు విలక్షణ చిత్రాల్లో సత్తా చాటుకుంటోంది. కానీ పెళ్లి మాటెత్తడం లేదు. రైమా సేన్ అమ్మమ్మ సుచిత్రా సేన్, తల్లి మూన్‌మూన్ సేన్ల నుంచి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రైమా సేన్, 1999లో ‘గాడ్‌మదర్’ చిత్రం ద్వారా బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. తెలుగులో ‘ధైర్యం’ చిత్రంలో నటించింది. హిందీ, బెంగాలీ చిత్రాల్లో అడపా దడపా నటిస్తూనే ఉన్నా, ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ బ్లాక్‌బస్టర్స్ పెద్దగా లేవు. రైమా చెల్లెలు రియా కూడా బాలీవుడ్లో రాణిస్తోంది. రైమాలో తల్లి పోలికల కంటే అమ్మమ్మ పోలికలే ఎక్కువ. ఈమె సోలో లైఫ్‌కు కారణాలైతే చెప్పనేలేదు. -
పోలిస్డ్రెస్లో కనిపించబోతున్న భామలు
-
రోజూ రోజా!
రంజాన్ మాసం అంటే ఎవరికైనా గుర్తొచ్చేది ‘హలీమ్’. మటన్ హలీమ్, చికెన్ హలీమ్‌తో పాటు ఇప్పుడు వెజిటెబుల్ హలీమ్ కూడా తయారు చేస్తున్నారనుకోండి. ఆ విధంగా శాకాహారులకు కూడా హలీమ్ టేస్ట్ చేసే అవకాశం దక్కుతోంది. ఇక, ఈ మాసంలో ముస్లిమ్ సోదర, సోదరీమణులు ఉపవాసం ఉంటారనే విషయం తెలిసిందే. దీన్ని ‘రోజా’ అంటారు. ప్రతి ఏడాదీ రంజాన్ మాసంలో ప్రతి రోజూ టబు రోజా ఆచరిస్తారు. అందుకు తగ్గట్టుగా తన దినచర్యను ప్లాన్ చేసుకుంటారామె. షూటింగ్స్ అంటే రద్దు చేసుకోవడానికి కుదరదు కాబట్టి, ప్రచార కార్యక్రమాలను మాత్రం రోజాకి అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు. తాజాగా మలయాళ ‘దృశ్యం’కి రీమేక్‌గా టబు నటించిన హిందీ ‘దృశ్యం’ వచ్చే నెల విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రోజంతా ఉపవాసం ఉంటారు కాబట్టి, సాయంత్రం ఉపవాస దీక్ష విరమించుకున్న తర్వాత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. తప్పనిసరి అయితేనే డే టైమ్ ప్రోగ్రామ్స్‌కి టబు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట. -
ఉపవాస దీక్షలో హీరోయిన్
హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ప్రముఖ నటి టబు రంజన్ నెల మొత్తం ఉపవాస దీక్ష చేస్తున్నారు. టాలీవుడ్ 'దృశ్యం' చిత్రం హిందీ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీస్ ఉన్నతాధికారి పాత్రలో టబు నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో కూడా ఎలాంటి ఆహారం తీసుకోకుండా టబు ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఒకవేళ సాయంత్రం సమయంలో విలేకర్లతో ముఖాముఖి నిర్వహించాల్సి వస్తే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాతే టబు ఉపవాసం(రోజా) విరమిస్తుంది. దృశ్యం హిందీ వెర్షన్ జులై నెలాఖరున విడుదల చేయడానికి యత్నాలు చేస్తున్నారు. -
హిందీ 'దృశ్యం'లో టబు
న్యూఢిల్లీ: బాలీవుడ్ చిత్రం 'హైదర్'లో తల్లి పాత్ర పోషించి ప్రశంసలందుకున్న ప్రముఖ నటి టబు ఈ సారి విభిన్నపాత్ర పోషిస్తున్నారు. టబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించనున్నారు. తెలుగులో వచ్చిన దృశ్యం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు దృశ్యంలో నదియా పోషించిన పాత్రను హిందీలో ఐజీ మీరా దేశ్‌ముఖ్‌గా టబు నటిస్తున్నారు. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. -
అసలేం జరిగింది?
రేఖ గొప్ప అందగత్తె. మంచి నటి. ఆమె ఓ పాత్ర చేశారంటే, అందులో వేరే తారను ఊహించుకోలేం. అంత అద్భుతంగా ఆ పాత్రలో ఒదిగిపోతారామె. మరి అంత అద్భుతమైన నటి అంగీకరించిన ఓ పాత్రను ఇప్పుడు టబు చేస్తున్నారు. ఆ సినిమా పేరు ‘ఫితూర్’. ప్రసిద్ధ రచయిత చార్లెస్ డికెన్స్ రాసిన ‘గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్’ నవల ఆధారంగా అభిషేక్ కపూర్ ‘ఫితూర్’ చిత్రం రూపొందిస్తున్నారు. ఇందులో ‘మిస్ హవీషమ్’ అనే పాత్రకు రేఖను తీసుకున్నారు. ఆమె కొన్ని సన్నివేశాల్లో నటించారు కూడా. కాగా, ఈ చిత్రం నుంచి రేఖ తప్పుకున్నారని, ఆమె స్థానంలో టబూని తీసుకున్నారనీ వార్త వచ్చింది. టబు మంచి నటే అయినప్పటికీ రేఖను రీప్లేస్ చేయగల సత్తా ఉందా? అని హిందీ రంగంలో చెప్పుకుంటున్నారు. అసలు రేఖ ఈ చిత్రం నుంచి ఎందుకు తప్పుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. కొన్ని సన్నివేశాలు ఆమెకు అసంతృప్తిగా అనిపించాయనీ, సినిమాలో తన లుక్ కూడా పెద్దగా బాగాలేదనీ ఆమె భావించారట. అందుకే తప్పుకున్నారని భోగట్టా. అసలింతకీ ఏం జరిగిందో ‘ఫితూర్’ బృందానికే ఎరుక. -
తెలుగు తెరపైకి కమల్ టబూల కూతురు!!
కమల్ హాసన్, టబు హీరో హీరోయిన్లుగా వచ్చిన 'చాచీ 420' చిత్రం గుర్తుంది కదూ. అందులో వాళ్ల కూతురిగా చేసిన చిన్నారి అప్పట్లోనే యాక్టింగ్ ఇరగదీసింది. ఆ సినిమా విడుదలై ఇప్పటికి దాదాపు 17 ఏళ్లు గడిచాయి. దాంతో అప్పటి చిన్నారి.. ఇప్పుడు నిండు జవ్వనిగా తెలుగు తెరమీదకు వచ్చేస్తోంది. 'నువ్వు నేను ఒక్కటవుదాం' అనే సినిమాతో తెరంగేట్రం చేయడానికి సనా షేక్ సిద్ధమైంది. బాలనటిగా తాను చాలా సినిమాల్లో చేశానని.. కమల్ హాసన్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అమ్రిష్ పురి, కాజోల్, అజయ్ దేవ్‌గణ్.. ఇలా అందరితో కలిసి నటించానని ఆమె చెప్పింది. భామనే సత్యభామనే సినిమా షూటింగులో అయితే కమల్ హాసన్ స్వయంగా తనకు తలదువ్వి జడ వేశారని, వాళ్లెవ్వరూ ఇప్పుడు తనను గుర్తుపట్టలేకపోవచ్చని సనా తెలిపింది. ముంబైలో పుట్టి పెరిగిన సనా షేక్ ఇంతకుముందు తహాన్, ఆకాశవాణి లాంటి చిత్రాల్లో ఇటీవల నటించింది. తెలుగువాళ్లంతా చాలా అభిమానంగా ఉంటారని, డైలాగులు సరిగా చెప్పలేక తిప్పలు పడుతున్నా చాలా సహనంతో తనను భరించారని చెప్పింది. తాను నటిని కాకపోతే ఫొటోగ్రఫీ నేర్చుకుని సినిమాటోగ్రాఫర్ అయ్యి ఉండేదాన్నని, అయితే.. నటన మాత్రం తన ప్రాణమని సనా తెలిపింది. ఇంటర్ తర్వాత చదువును అటకెక్కించేసినట్లు కూడా నిర్మొహమాటంగా చెప్పేసింది. -
30 దాటినా ఇప్పటికీ ఒంటరే....
బెంగాలీ బ్యూటీ రాణి ముఖర్జీ ఎట్టకేలకు 36 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కింది. ఎప్పుడో 30 దాటిన ప్రీతీజింటా, ఊర్మిళా మతోంద్కర్, టబూ వంటి బ్యూటీలు మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్లుగా కొనసాగుతున్న ప్రియాంకా చోప్రా, అమృతారావు వయసు కూడా మూడు పదులు దాటిపోయింది. హాలీవుడ్ సహా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ప్రియాంక, హర్మన్ బవేజా, షహీద్ కపూర్‌తో డేటింగ్ చేసినా ఎవరినీ మనువాడలేదు. లేటు వయసులోనూ హాట్‌గా నటించే బిపాసా బసు కూడా డినో మోరియా, జాన్ అబ్రహంతో చాలా కాలం ప్రేమాయణం నడిపింది. జాన్‌కు 2011లో గుడ్‌బై చెప్పేసింది. తాను మళ్లీ ప్రేమలో పడ్డానంటూ కొన్ని నెలల క్రితమే ప్రకటించింది. అతడు ఎవరో కాదు.. ‘వాట్స్ యువర్ రాశి’ ఫేం హర్మన్ బవేజా! వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. కునాల్ ఖేముతో పీకల లోతు ప్రేమలో ఉన్న సోహా అలీఖాన్‌కు 30 ఏళ్లు ఎప్పుడో దాటాయి. పెళ్లి గురించి ఈమె కూడా ఏమీ మాట్లాడడం లేదు. మరో బ్యూటీ నేహా ధూపియా కొన్నాళ్లు రిత్విక్ భట్టాచార్య అనే క్రీడాకారుడితో డేటింగ్ చేసింది. వెనెజులా నటుడు జేమ్స్ సిల్విస్టర్తోనూ చెట్టాపట్టాలేసుకొని తిరిగినట్టు వార్తలు వచ్చాయి. క్రికెటర్ యువరాజ్ సింగ్‌తోనూ ఏదో ఉందంటూ కథనాలు వినిపించాయి. నేహ వీటి గురించి ఎప్పుడూ స్పందించలేదు. పెళ్లి గురించి కూడా మాట్లాడలేదు. 32 ఏళ్ల వయసున్న ఉన్న అమృతారావు మొదట పాక్ గాయకుడు ఫర్హాన్ సయీద్‌ను ప్రేమించింది. తరువాత ఒక ఎన్ఆర్ఐ డాక్టర్‌తోనూ సన్నిహితంగా ఉంది. అయితే వీరిలో ఎవరినీ అమృత పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు. కహోనా ప్యార్ బ్యూటీ అమిషా పటేల్, మరో బెంగాలీ బ్యూటీ రైమాసేన్ కూడా లేడీ బ్యాచిలర్లే! -
ప్రియాంకా చోప్రా తల్లిగా?
టబూకు అమ్మ పాత్రలు చేసే వయసొచ్చేసిందా? అది కూడా ముప్ఫయేళ్ల ప్రియాంకా చోప్రాకి...! అంటే, ఎవరైనాసరే టబూకు అంత ఏజ్ లేదంటారు. కానీ, దర్శకురాలు జోయా అఖ్తర్ మాత్రం ‘దిల్ ధడక్నే దో’లో టబూను ప్రియాంకా చోప్రా తల్లిగా నటింపజేయాలనుకున్నారు. ఐదు నెలల క్రితం ఆ చిత్రం కోసం టబూను కలిశారామె. కానీ, ఫస్ట్ మీటింగ్‌లోనే టబు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. టబు, ప్రియాంకల వయసు తేడా పదేళ్లే. అందుకే ప్రియాంకకు తల్లిగా నప్పనంటూ, టబు ‘నో’ చెప్పి ఉంటారని ఊహించవచ్చు. -
చలి కాచుకుందామని వెళ్లి...!
‘సినిమావాళ్లు సుకుమారంగా ఉంటారు. కష్టం ఎలా ఉంటుందో వాళ్లకు తెలీదు. నిరంతరం లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తుంటారు’... చాలామంది అభిప్రాయం ఇదే. కానీ.. వారి జీవితం సుఖాలకు ఆలవాలం ఎంతమాత్రం కాదని, వారిక్కూడా లెక్కలేనన్ని కష్టాలుంటాయని, ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంటుందని బయటి వారికి తెలీదు. షూటింగుల్లో గాయాలపాలై చావు దరిదాపుల్లోకెళ్లి వచ్చిన కళాకారులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి టబు కూడా చేరారు. వివరాల్లోకెళితే... ప్రస్తుతం టబు ‘హైదర్’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ జమ్ముకాశ్మీర్‌లోని ఓ భయంకరమైన కొండ ప్రాంతంలో జరుగుతోంది. శనివారం తెల్లారు జామున మైనస్ డిగ్రీల చలిలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు విశాల్భరద్వాజ్. షాట్ గ్యాప్‌లో ఓ పక్కకెళ్లి కూర్చున్నారు టబు. ఉన్నట్లుండి చలి తీవ్రత ఎక్కువైంది. దాంతో పక్కనే ఏర్పాటు చేసిన చలిమంటను ఆశ్రయించారు. ఆ మంటలోంచి పొగరావడం మొదలైంది. ఆ పొగను పీల్చి ఉక్కిబిక్కిరైపోయారు టబు. ఒకానొక దశలో శ్వాస సరిగ్గా అందలేదు. అక్కడిక్కడే స్పృహ కోల్పోయారు. వెంటనే యూనిట్ సభ్యులు అప్రమత్తమయ్యారు. అయితే.. హాస్పిటల్ 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలస్యం చేయకుండా హుటాహుటిన ఉదయం 9 గంటలకల్లా టబుని హాస్పిటల్లో చేర్చారు. సమయానికి హాస్పిటల్‌కి చేర్చడంతో ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పారు. చికిత్స పూర్తి చేసి, ఆ రోజు సాయంత్రం టబుని డిశ్చార్చ్ చేశారు. దీన్ని బట్టి సినిమా వాళ్ల కష్టాలు ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. -
సినిమా రివ్యూ: సల్మాన్ ఖాన్ ‘జై హో’
పాజిటివ్ పాయింట్స్: సల్మాన్ ఖాన్ నటన యాక్షన్ ఎపిసోడ్స్ సంతోష్ తుండియిల్ ఫోటోగ్రఫీ మైనస్ పాయింట్స్: హీరోయిన్ డైసీ షా మ్యూజిక్ తారాగణం: సల్మాన్ ఖాన్, డౌసీ షా, టబు, సునీల్ శెట్టి, డానీ, మెహనీష్ బెహల్, మహేశ్ మంజ్రేకర్, జెనిలీయా తదితరులు బాలీవుడ్లో ఘన విజయాలతో దూసుకుపోతున్న కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన ఇమేజ్‌కు భిన్నంగా సామాజిక అంశాన్ని నేపథ్యంగా ఎంచుకున్నారు. తెలుగులో ఓ మోస్తారుగా విజయం సాధించిన ‘స్టాలిన్’ చిత్రం ఆధారంగా సోహైల్ ఖాన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. భారీ అంచనాలతో జనవరి 24 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జై హో’ చిత్రం కథేంటో ఓసారి పరిశీలిద్దాం. జై(సల్మాన్ ఖాన్) ఓ మాజీ మిలటరీ ఆఫీసర్. ఓ కారణంగా మిలిటరీ నుంచి సస్పెండైన జై సమాజంలోని చెడును ఎదిరిస్తూ.. సాధారణ జీవితం గడుపుతుంటాడు. అపదలో ఉన్నవారిని ఆదుకుంటూ.. అన్యాయాల్ని ఎదురించే క్రమంలో హోం మంత్రి(డానీ)తో గొడవ మొదలవుతుంది. హోం మంత్రి అక్రమాలను ఎదుర్కోనే నేపథ్యంలో ముఖ్యమంత్రి పై హత్యాయత్నం జరుగుతుంది. ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు ప్రయత్నించారనే అపవాదు జై పై పడుతుంది. అయితే హోం మంత్రి ఆగడాలకు ఎలా అంతం పలికాడు? ముఖ్యమంత్రిని ఎలా రక్షించుకున్నాడు? తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ‘జై హో’ చిత్ర కథ. జై పాత్రలో సల్మాన్ ఖాన్ గత చిత్రాలకు భిన్నంగా కనిపిస్తాడు. మూస పాత్రలకు పరిమితం కాకుండా సామాజిక అంశాన్ని నేపథ్యంగా ఎంచుకుని.. కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. జై పాత్రలో సల్మాన్ ఖాన్‌ను అభిమానులను ఊపించుకోవడం కొంత కష్టమైనా.. పాత్ర పరిధి మేరకు సల్లూభాయ్ పరిణతిని ప్రదర్శించాడు. సల్మాన్ సరసన నటించే అవకాశం చేజిక్కించుకుని.. తొలిసారి బాలీవుడ్ తెరపై కనిపించిన డైసీ షా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో సల్మాన్‌కు సరియైన జోడి అని ఒక్క సన్నివేశంలో కూడా ప్రూవ్ చేసుకోలేకపోయింది డైసీ. ముఖ్యంగా హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో పాటలకే పరిమితమైంది. చాలాకాలం తర్వాత టబు మళ్లీ బాలీవుడ్ తెరపై దర్శనమిచ్చింది. సల్మాన్ సోదరి పాత్రలో పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించింది.అంగవైకల్యంతో బాధపడే అమ్మాయిగా గెస్ట్ పాత్రలో కనిపించిన జెనిలీయా దేశ్‌ముఖ్ మంచి మార్కులే సంపాదించుకుంది. డానీ విలనిజం ఓకే. సునీల్ శెట్టి, మెహనీష్ బెహల్, మేహ శ్ మంజ్రేకర్, సనా ఖాన్ తదితర పాత్రలు సినిమాకు అదనపు ఆకర్షణ. విశ్లేషణ: వాంటెడ్, దబాంగ్, రెడీ, బాడీగార్డ్, ఏక్తా టైగర్, దబాంగ్-2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా సల్మాన్ నిలిచాడు. అయితే తన రూట్ మార్చుకుని.. సామాజిక నేపథ్యమున్న 'జై హో’ చిత్రంతో ప్రేక్షకులకు సరికొత్త సల్మాన్‌ను చూపించాడు. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో కొత్త తరహా లుక్ తో సల్మాన్ ఆకట్టుకున్నాడు. సల్మాన్‌లో మాస్ ఎలిమెంట్స్‌ను ఎక్కువగా ఆశించే అభిమానులకు ఈ చిత్రంలో అలాంటి మార్కు ఎక్కడ కనిపించకపోవడం నిరాశ కలిగించే అంశం. గత చిత్రాల్లో కత్రినా, సోనాక్షి, కరీనాలతో జత కట్టిన సల్మాన్.. ఈ చిత్రంలో డైసీ షాను హీరోయిన్ గా ఎంచుకున్నాడు. అయితే గతంలో సల్మాన్ సరసన నటించిన హీరోయిన్లకు ధీటుగా డైసీ గ్లామర్ పరంగా, అభినయంలోనూ మెప్పించలేకపోయింది. ఇక సల్మాన్ దీటుగా విలనిజం ఎలివేట్ కాకపోవడం ఈ చిత్రంలో ఓ మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సల్మాన్ అభిమానులను మెప్పించేందుకు దర్శకుడు సోహైల్ ఖాన్ తన శక్తిమేరకు ప్రయత్నించాడు. సాజిద్-వాజిద్, దేవి శ్రీప్రసాద్, అమల్ మాలిక్‌లు పాటలకు సంగీతాన్ని అందించారు. అయితే ‘బాకీ సబ్ ఫస్ట్ క్లాస్’, ‘తేరే నైనా’, ‘ఫోటో కాపీ’ పాటలు మాత్రమే ఆకట్టుకునేలా ఉన్నాయి. సందీప్ శిరోద్కర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్యూ చెప్పకుండా.. మరో ముగ్గురికి సహాయం చేయమని చెప్పే థీమ్ కు కథలో బలమైన పాయింట్. అయితే అంతగా తీవ్రత లేని పాయింట్ ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించడం కష్టమే. సెకండాఫ్ స్లోగా ఉండటం, ఉపన్యాసాలు ఎక్కువ కావడం ప్రేక్షకుడ్ని విసిగించేలా ఉంటాయి. కొన్ని ఎపిసోడ్స్ సినిమాకు తక్కువ టెలివిజన్ సీరియల్స్ ఎక్కువలా అనిపిస్తాయి. కమర్షియల్ హంగులకు దూరంగా ఉన్న ఈ చిత్ర విజయం పూర్తిగా సల్లూభాయ్పైనే ఆధారపడి ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారనే విషయాన్ని తెలుసుకోవాలంటే కొద్దిరోజులాగాల్సిందే. -
‘హామ్లెట్’ నాటకం ఆధారంగా సినిమా
పదేళ్ల తర్వాత విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు టబు. ఈ ఇద్దరి కాంబినేషన్లో 2003లో విడుదలైన ‘మక్బూల్’ సినీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న విషయం తెలిసిందే. విలియమ్స్ షేక్స్పియర్ రాసిన ‘మాక్బెత్’ నాటకం ఆధారంగా ఆ చిత్రం చేశారు విశాల్. తాజాగా, మరో చిత్రం చేయబోతున్నారు. అది కూడా షేక్స్పియర్ రచనే కావడం విశేషం. షేక్స్పియర్ రాసిన అద్భుతమైన నాటకాల్లో ఒకటైన ‘హామ్లెట్’ ఈ చిత్రానికి ఆధారం. ఈ చిత్రకథ అనుకోగానే ఓ కీలక పాత్రకు టబుని అనుకున్నారట విశాల్. ఈ మధ్యకాలంలో ఏ సినిమా పడితే అది ఒప్పుకోవడానికి ఇష్టపడని టబు, కథాబలం, మంచి పాత్రలైతే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఈ చిత్రం గురించి విశాల్ చెప్పగానే అలానే చేశారట. ఆత్మవిశ్వాసానికి, ఆత్మస్థయిర్యానికి ప్రతీకగా నిలిచే పాత్రను టబు చేయబోతున్నారని విశాల్ పేర్కొన్నారు. కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్‌ను సంవత్సరాంతంలో ప్రారంభించాలనుకుంటున్నారు.