ఆ సినిమా టికెట్లపై భారీ తగ్గింపు.. అయితే ఆ ఒక్కరోజు మాత్రమే..! | Drishyam 2 Team offers Fifty Percent discount on advance booking of film tickets. Know twist | Sakshi
Sakshi News home page

Drishyam 2 Movie: దృశ్యం 2 మూవీ బంపర్ ఆఫర్.. సగం ధరకే సినిమా చూసేయండి..!

Published Sun, Oct 2 2022 3:45 PM | Last Updated on Sun, Oct 2 2022 3:49 PM

Drishyam 2 Team offers Fifty Percent discount on advance booking of film tickets. Know twist - Sakshi

అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం- 2. మ‌లయాళంలో సూప‌ర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. హిందీలో దృశ్యం- 2 విడుదలకు సిద్దమైంది. అయితే తాజాగా ప్రేక్షకుల  కోసం సరికొత్త బంపర్ ఆఫర్ ప్రకటించింది చిత్రబృందం. సినిమా రీలీజ్ రోజున అడ‍్వాన్స్ బుకింగ్ టికెట్లపై 50  శాతం భారీ తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 2 తేదీన బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ అభిమానులకు అందించేందుకు బహుళస్థాయి సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు చిత్రబృందం వివరించింది.  

అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో టబు, ఇషితా దత్తా, అక్షయ్ ఖన్నా, రజత్ కపూర్,  శ్రియా శరణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే పేరుతో 2021లో వచ్చిన మోహన్ లాల్ మలయాళ చిత్రానికి రీమేక్‌గా వస్తోంది ఈ సినిమా.  2015లో విడుదలైన దృశ్యం సూపర్ హిట్‌గా నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement