Drishyam 2 Movie
-
కంక్లూజన్ తో వచ్చేస్తున్న దృశ్యం 3
-
సూపర్ హిట్ సినిమా అరుదైన ఘనత.. తొలి భారతీయ చిత్రంగా రికార్డ్!
మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం మూవీకి అరుదైన ఘనత దక్కింది. ఈ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లిష్, స్పానిష్‌లలో తెరకెక్కించన్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్లో రీమేక్ కానున్న మొదటి భారతీయ చిత్రంగా దృశ్యం నిలవనుంది. ఈ చిత్రాన్ని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్‌గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే దృశ్యం సిరీస్ చిత్రాలను కొరియన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా హాలీవుడ్‌కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో హలీవుడ్ దృశ్యంలో నటీనటులుగా ఎవరు కనిపించనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాగా.. త్వరలోనే మలయాళంలో దృశ్యం 3 రానుంది. -
ఇది కదా అసలు సిసలైన పాన్ ఇండియా కథ!
ఒక ‘దృశ్యం’... మలయాళంలో బంపర్ హిట్. అదే ‘దృశ్యం’... తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలోనూ సూపర్ హిట్. అందుకే ఈ ‘దృశ్యం’ దేశం దాటింది. అటు చైనా.. ఇండోనేషియాలోనూ ‘దృశ్యం’ బాక్సాఫీస్ రికార్డులు సాధించింది. ఇలా మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ ఏ భాషలో రీమేక్ అయితే ఆ భాషలో హిట్. ఇప్పుడు ఇంగ్లీష్ ‘దృశ్యం’ రానుంది. ఇంకా పలు విదేశీ భాషల్లో రీమేక్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసే సినిమాలను ‘పాన్ ఇండియా’ అంటున్నాం. ‘పాన్ ఇండియా మూవీ’ అంటే కథ కూడా ‘పాన్ ఇండియా’ది అయ్యుండాలి.‘దృశ్యం’ అలాంటి కథే. ఇది కదా... పాన్ ఇండియా కథ! ఇక ఈ ‘దృశ్యం’ గురించి తెలుసుకుందాం. తొమ్మిదేళ్ల క్రితం హీరో మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లో మలయాళంలో ‘దృశ్యం’ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో మీనా, అన్సిబా హాసన్, ఎస్తర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు. ఐదు కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. 2013 డిసెంబరు 19న విడుదలై సంచలన విజయం సాధించిందీ చిత్రం. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి జీతూ జోసెఫ్ తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఎంతగా నచ్చిందంటే.. కేరళ బాక్సాఫీస్ చరిత్రలో యాభై కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా ‘దృశ్యం’ చరిత్ర సృష్టించింది. మొత్తంగా 75 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 44 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇక ‘దృశ్యం’ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో 2020 సెప్టెంబర్‌లో ‘దృశ్యం 2’ షూటింగ్‌కు శ్రీకారం చూట్టారు మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ అండ్ ఆంటోనీ పెరుంబవూర్. తొలి భాగంలానే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో 46 రోజుల్లో షూటింగ్‌ను పూర్తి చేసి 2021 ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ‘దృశ్యం 2’ కూడా సూపర్ డూపర్ హిట్. అయితే ఓ వెలితి. అదేంటంటే.. ‘దృశ్యం 2’ థియేటర్స్‌లో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. దీనికి కారణం కరోనా. ఒకవేళ థియేటర్స్‌లో విడుదలై ఉంటే కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ నమోదై ఉండేవేమో! 2016లో విడుదలై దాదాపు రూ. 150 కోట్ల వసూళ్లను సాధించిన ‘పులిమురుగన్’(ఇందులో మోహన్‌లాల్ హీరో) రికార్డును ‘దృశ్యం 2’ బ్రేక్ చేసి ఉండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయయపడ్డాయి. తొలి ఇండియన్ మూవీ! ‘దృశ్యం’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై వీక్షకుల, విమర్శకుల ప్రసంశలను పొందింది. దీంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మలయాళ ‘దృశ్యం’ సినిమాను 2014లో తెలుగులో ‘దృశ్యం’గా (ఇందులో వెంకటేశ్ హీరోగా నటించారు), కన్నడంలో ‘దృశ్య’ (ఇందులో రవిచంద్రన్)గా రీమేక్ చేశారు. ఆ తర్వాత 2015లో తమిళంలో ‘పాపనాశం’గా (కమల్‌హాసన్ హీరో), హిందీలో ‘దృశ్యం’ (అజయ్ దేవగన్)గా రీమేక్ చేశారు. అంతేకాదు.. ఆ తర్వాత శ్రీలంక భాషలో ‘ధర్మయుద్దాయ’ (2017)గా, చైనాలో ‘షీప్ వితవుట్ షెపర్డ్’(2019)గా ఆ తర్వాత ఇండోనేషియాలో ‘దృశ్యం’గా రీమేక్ అయ్యింది. ఇలా చైనా, ఇండోనేషియా భాషల్లో రీమేక్ అయిన తొలి ఇండియన్ మూవీ కూడా ‘దృశ్యం’ కావడం విశేషం. రీమేక్ కావడమే కాదు.. అక్కడ బాక్సాఫీస్ పరంగా హిట్ సాధించింది. కాగా, ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా 2021లో విడుదలైన మలయాళ ‘దృశ్యం 2’కి కూడా డిజిటల్ వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ‘దృశ్యం 2’ను తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. ‘దృశ్యం’ రీమేక్‌లో నటించిన వెంకటేశ్‌నే ‘దృశ్యం 2’లోనూ నటించారు. కోవిడ్ వల్ల ఈ చిత్రం 2021 నవంబరు 25న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. కాగా ‘దృశ్యం 2’ హిందీ రీమేక్ గత ఏడాది నవంబరు 18న థియేటర్స్‌లో విడుదలై రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2022లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ టెన్ హిందీ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. హిందీ ‘దృశ్యం’లో నటించిన అజయ్ దేవగనే ‘దృశ్యం 2’లోనూ నటించారు. అలాగే హిందీ చిత్రం ‘దేవదాస్’ (1955) తర్వాత ఇతర భాషల్లో ఎక్కువగా రీమేక్ అవుతున్న చిత్రం ‘దృశ్యం’ అని టాక్. మాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి... ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలకు సంబంధించిన ఇంగ్లిష్, నాన్ ఇండియన్ లాంగ్వేజెస్ రీమేక్ హక్కులను పనోరమ స్టూడియోస్ ఇంటర్నేషనల్ సంస్థ దక్కించుకుంది (ఫిలిప్పినో, ఇండోనేషియా, సింహళ భాషల హక్కులు మాత్రం కాదు.. ఎందుకంటే ఈ భాషల్లో ఆల్రెడీ ‘దృశ్యం’ రీమేక్ అయ్యింది). ‘‘దృశ్యం’, ‘దృశ్యం 2’ల ఫారిన్ లాంగ్వేజెస్ హక్కులను దక్కించుకున్నాం. జపాన్, కొరియా, హాలీవుడ్లో ‘దృశ్యం’ను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాం. ‘దృశ్యం 2’కు చెందిన చైనీస్ రీమేక్ హక్కులు కూడా మా వద్దే ఉన్నాయి’’ అని పనోరమ స్టూడియోస్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కథ ఏంటంటే... సినిమాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తండ్రి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన పెద్ద కుమార్తెను ఊహించని ఆపాయం నుంచి ఎలా రక్షించుకోగలిగాడు? ఈ ప్రయత్నంలో ఓ పోలీసాఫీసర్ కుమారుడి హాత్య కేసును చేధించాలనుకునే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యూహాలకు ఎటుంవంటి ప్రతివ్యూహాలు రచించి, ఆ తండ్రి సక్సెస్ అయ్యాడు అన్నదే ఈ చిత్రకథ. మోహన్‌లాల్, జీతూ జోసెఫ్, ఆంటోనీల కాంబినేషన్లో ‘దృశ్యం 3’ కూడా రానుంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో ‘దృశ్యం 3’ ఉంటుందన్నారు ఆంటోనీ. చదవండి: నాకు బుద్ధి తక్కువై అలా చేశాను.. చీటింగ్‌పై స్పందించిన సింగర్ -
హీరోయిన్‌తో దృశ్యం 2 డైరెక్టర్ పెళ్లి.. పోస్ట్ వైరల్
బాలీవుడ్లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇటీవలే అతియా శెట్టి పెళ్లిపీటలెక్కగా ఓ వారం రోజుల్లో కియారా అద్వానీ కూడా పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. తాజాగా ఓ బాలీవుడ్ డైరెక్టర్ కూడా పెళ్లిపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దృశ్యం 2 (హిందీ) డైరెక్టర్ అభిషేక్ పాఠక్, కుదా హఫీజ్ హీరోయిన్ శివలేఖ ఒబెరాయ్ త్వరలో వైవాహిక బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారట! ఇదే విషయాన్ని నటి హింటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. 'ఆకాశంలో అన్ని నక్షత్రాలుండగా, సముద్రం ఒడ్డున ఇన్ని నక్షత్ర చేపలుండగా అతడు మాత్రం వాటన్నింటినీ పట్టించుకోకుండా నావైపే చూస్తున్నాడు' అంటూ ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో అభిషేక్ ముఖం కనిపించకుండా బ్లర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ త్వరలోనే వీరు మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టబోతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అభిషేక్ పాఠక్- శివలేఖ గోవాలో పెళ్లి చేసుకోనున్నారంటూ బీటౌన్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా శివలేఖ ఒబెరాయ్ 'యే సాలి ఆషికి' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఖుదా హఫీజ్ 1, 2 సినిమాల్లో నటించగా వీటికి అభిషేక్ పాఠక్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరికి పరిచయం ఏర్పడగా, అది తర్వాత ప్రేమగా మారింది. View this post on Instagram A post shared by Shivaleeka Oberoi (@shivaleekaoberoi) చదవండి: హీరోయిన్‌కు అభిమాని పూజలు -
ఓటీటీలో అజయ్ దేవ్‌గణ్ బ్లాక్‌బస్టర్ 'దృశ్యం 2', కానీ ఓ ట్విస్ట్
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్, హీరోయిన్ శ్రియ జంటగా నటించిన చిత్రం దృశ్యం 2. మలయాళ సూపర్ హిట్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో టబు, ఇషితా దత్తా, అక్షయ్ ఖన్నా, రజత్ కపూర్ ముఖ్యపాత్రల్లో నటించారు. అభిషేక్ పాఠక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తాజాగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ పద్ధతిలో అందుబాటులో ఉన్న ఈ సినిమా తాజాగా ఫ్రీగా చూసేందుకు అవకాశం కల్పించింది. ఈ విషయంపై అజయ్ దేవ్‌గణ్ మాట్లాడుతూ.. 'మా సినిమాను థియేటర్లలో ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ ద్వారా ప్రపంచంలో ఏ మూలన ఉన్న ప్రేక్షకుడైనా ఈ చిత్రాన్ని చూసే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు. కాగా దృశ్యం చిత్రాన్ని దివంగత డైరెక్టర్ నిషికాంత్ కామత్ తెరకెక్కించగా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా వచ్చిన ఏడేళ్లకు సీక్వెల్ రాగా ఇది కూడా సూపర్ డూపర్ హిట్టయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లదాకా కలెక్షన్లు రాబట్టింది. unfold the mystery 🌀#Drishyam2OnPrime, watch now!https://t.co/w8sKUEdkHg pic.twitter.com/8NYDcXvTau — prime video IN (@PrimeVideoIN) January 13, 2023 చదవండి: ఇడియట్, వెళ్లు.. అంటూ నా భార్య ముందే నాన్న కోప్పడ్డారు: రామ్‌చరణ్ నటుడితో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ -
పబ్లిక్‌లో ఇదేం పని.. శ్రియాశరణ్‌పై దారుణంగా ట్రోల్స్..!
సీనియర్ నటి శ్రియాశరణ్ ఇటీవల నటించిన చిత్రం 'దృశ్యం-2'. మలయాళంలో సూపర్ హిట్ మూవీ దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా హిందీలో తెరకెక్కించారు. అయితే ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో శ్రియా శరణ్ తన భర్త టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కోస్చివ్‌తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా వేదికపై ఈ జంట చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. శ్రియాపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దారుణంగా ట్రోల్స్ చేస్తూ శ్రియాశరణ్‌కు కౌంటరిచ్చారు. అయితే నెటిజన్లు చేసిన ట్రోల్స్ పట్ల తాజాగా నటి శ్రియాశరణ్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ..' అందులో తప్పేముంది. కెమెరా ముందు నా భర్తను ముద్దు పెట్టుకున్నా. ఇది చాలా సాధారణమైన విషయమని ఆండ్రీ కూడా భావించారు. దీనిపై ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సందర్భం.' అంటూ చెప్పుకొచ్చింది శ్రియా. అయితే ఈ జంట కెమెరా ముందు ముద్దు పెట్టుకోవడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ జంట కాస్త అతిగా స్పందించిందంటూ కామెంట్స్ చేశారు. మరో నెటిజన్ 'ప్రతిసారీ బహిరంగంగా ఎందుకు ముద్దు పెట్టుకోవాలి?' అని ప్రశ్నించారు. దృశ్యం 2 తర్వాత శ్రియా శరణ్ కన్నడలో ఉపేంద్ర, సుదీప్‌లతో కలిసి గ్యాంగ్‌స్టర్ డ్రామా కబ్జాలో కనిపించనుంది. ఈ చిత్రంలో కబీర్ దుహన్ సింగ్, కోట శ్రీనివాస్, కామరాజ్, జగపతి బాబు, డానిష్ అక్తర్ సైఫీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అజయ్ దేవ్‌గణ్ 'దృశ్యం 2'.. టైటిల్ సాంగ్ చూశారా?
అజయ్ దేవగణ్, శ్రియా శరన్, టబు ప్రధాన పాత్రల్లో హిందీలో తెరకెక్కుతున్న చిత్రం 'దృశ్యం-2'. మలయాళంలో సూపర్ హిట్ మూవీ దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్‌ను చిత్ర నిర్మాతలు రిలీజ్ చేశారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ కాంబినేషన్లో ఇప్పటికే రిలీజైన దృశ్యం భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్) ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఉతుప్, విజయ్ ప్రకాష్ ఈ పాటను ఆలపించగా.. అమితాబ్ భట్టాచార్య ఈ సాంగ్‌ను రచించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. -
దృశ్యం-2 మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్
అజయ్ దేవగణ్, శ్రియ, టబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం-2. మలయాళంలో సూపర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. తాజాగా హిందీలో రాబోతున్నదృశ్యం 2 ట్రైలర్ వచ్చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ కాంబినేషన్లో ఇప్పటికే రిలీజైన దృశ్యం భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: దృశ్యం 2 క్రేజీ అప్డేట్.. టీజర్ డేట్ ఫిక్స్) ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. ఇవాళ విడుదలైన ట్రైలర్‌ను చూస్తే ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తోంది. అజయ్ దేవగణ్ మృతదేహాన్ని పాతిపెట్టే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్లో అజయ్ దేవ్‌గణ్, శ్రియ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ మూవీ నవంబర్ 18 థియేటర్లలో సందడి చేయనుంది. అక్షయ్ ఖన్నా, రజత్ కపూర్, ఇషితా దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మలయాళంలో 2015లో వచ్చిన మోహన్ లాల్ చిత్రానికి రిమేక్‌గా వస్తోంది. -
ఆ సినిమా టికెట్లపై భారీ తగ్గింపు.. అయితే ఆ ఒక్కరోజు మాత్రమే..!
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం- 2. మలయాళంలో సూపర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. హిందీలో దృశ్యం- 2 విడుదలకు సిద్దమైంది. అయితే తాజాగా ప్రేక్షకుల కోసం సరికొత్త బంపర్ ఆఫర్ ప్రకటించింది చిత్రబృందం. సినిమా రీలీజ్ రోజున అడ్వాన్స్ బుకింగ్ టికెట్లపై 50 శాతం భారీ తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 2 తేదీన బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ అభిమానులకు అందించేందుకు బహుళస్థాయి సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు చిత్రబృందం వివరించింది. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో టబు, ఇషితా దత్తా, అక్షయ్ ఖన్నా, రజత్ కపూర్, శ్రియా శరణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే పేరుతో 2021లో వచ్చిన మోహన్ లాల్ మలయాళ చిత్రానికి రీమేక్‌గా వస్తోంది ఈ సినిమా. 2015లో విడుదలైన దృశ్యం సూపర్ హిట్‌గా నిలిచింది. Vijay Salgaonkar and family are back to continue the narrative of 2nd October! Advance bookings open on 2nd October and you can block your tickets on the PVR app for JUST Rs. 50 and get 50% OFF on first day shows of Drishyam 2. #Drishyam2 in cinemas on 18th November, 2022. pic.twitter.com/EIEIV1ijvG — P V R C i n e m a s (@_PVRCinemas) October 1, 2022 -
దృశ్యం 2 క్రేజీ అప్డేట్.. టీజర్ డేట్ ఫిక్స్
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం-2. మలయాళంలో సూపర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. తాజాగా హిందీలో రాబోతున్నదృశ్యం 2 నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. అజయ్ దేవ్గన్, శ్రియ కాంబినేషన్లో ఇప్పటికే రిలీజైన దృశ్యం భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్నుగురువారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీ నవంబర్ 18 థియేటర్లలో సందడి చేయనుంది. అక్షయ్ ఖన్నా, టబు, రజత్ కపూర్, ఇషితా దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మలయాళంలో 2015లో వచ్చిన మోహన్ లాల్ చిత్రానికి రిమేక్. 2 aur 3 October ko kya hua tha yaad hai na? Vijay Salgaonkar is back with his family. Recall Teaser Out Tomorrow! #Drishyam2 #Tabu #AkshayeKhanna @shriya1109 #RajatKapoor @ishidutta #MrunalJadhav @AbhishekPathakk pic.twitter.com/RgUxGQZPVo — Ajay Devgn (@ajaydevgn) September 28, 2022 -
‘దృశ్యం 2’ థియేటర్లో విడుదల చేసినా ఈ రేటింగే వచ్చేది కానీ...: సురేశ్ బాబు
విక్టరీ వెంకటేష్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన దృశ్యం 2 చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు. సూపర్ హిట్ థ్రిల్లర్ దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం నవంబర్ 25న విడుదలైంది. సినిమా సక్సెస్ అవ్వడంతో నిర్మాత సురేష్ బాబు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► దృశ్యం 2 మళయాలంలో మంచి హిట్ అయింది. వెంటనే రైట్స్ తీసుకున్నాం. జీతూ జోసెఫ్‌ను స్క్రిప్ట్ పంపించమని అడిగాను. కొన్ని మార్పులు చేర్పులు సూచించాను. అలా మొత్తానికి స్క్రిప్ట్ పూర్తయింది. వెంటనే షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా అంత త్వరగా ఏ చిత్రాన్ని పూర్తి చేయలేదు. హైద్రాబాద్, కేరళలో షూట్ చేశాం. కరోనా భయంతో నేను మాత్రం సెట్‌కు వెళ్లలేదు. కానీ మా వాళ్లతో మాత్రం పని చేయించాను. ►దృశ్యం 2 అనేది కమర్షియల్ సినిమా కాదు, పాటలు, ఫైట్లు ఉండే సినిమాలను థియేటర్లో చూస్తే మంచి కిక్ వస్తుంది. దృశ్యం 2ను థియేటర్లో విడుదల చేసినా కూడా ఈ రేటింగ్ వచ్చేది. కానీ కలెక్షన్లు ఎంత వస్తాయనేది చెప్పలేం. ఓటీటీ అనేది ఫైనాన్షియల్‌గా సేఫ్ అవుతుంది. ఇప్పుడు ఓటీటీ, యూట్యూబ్ వంటి వాటి వల్ల కొత్త టాలెంట్ కూడా వస్తోంది. టాలెంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ సినిమాను తీయగలుగుతున్నారు. ► థియేటర్లో చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు. కానీ ఆడియెన్స్ టేస్ట్ మారిపోతోంది. అఖండ, పుష్ప వంటి చిత్రాలకు ఆడియెన్స్ కచ్చితంగా వస్తారు. ► పండుగలకు జనాలు థియేటర్లకు వస్తున్నారని అందరికీ అర్థమైంది. అందుకే ఫెస్టివల్ సీజన్‌కు రావాలని ఫిక్స్ అయ్యారు. ఒకప్పుడు నాలుగు సినిమాలు వచ్చేవి. నాలుగు వందల థియేటర్ల చొప్పున నాలుగు చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు 1500 స్క్రీన్స్ కావాలని అంటున్నారు. అక్కడే గొడవ వస్తోంది. చూడాలి ఈ సంక్రాంతికి ఎలా ఉంటుందో.. ► నేను ఈ సినిమా ఇండస్ట్రీలో పుట్టాను. పెరిగాను. నేను ఏం చేసినా కూడా సినిమా పరిశ్రమ కోసమే చేస్తాను. నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను. నేను డబ్బు జనరేట్ చేయాలి. ప్రొడక్షన్ కంపెనీ నడపాలి. థియేటర్లను చూసుకోవాలి. అంతేకానీ ఎవరో ఏదో అన్నారని నేను పట్టించుకోను ► శాకిని డాకిని, దొంగలున్నారు జాగ్రత్త, డ్యాన్సింగ్ క్వీన్ అనే మూడు సినిమాలు ఓటీటీకి ఇచ్చేశాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్‌లు సెట్స్ మీదున్నాయి. వెంకటేష్ హీరోగా రానా నాయుడు, ఎఫ్ 3లు కాకుండా ఇంకొన్ని రెడీ అవుతున్నాయి. అవి రివిల్ చేశాక తప్పకుండా మీరు సర్ప్రైజ్ అవుతారు. ► విరాటపర్వం ఇంకా ఐదు రోజుల బ్యాలన్స్ షూటింగ్ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. సినిమా, పాలిటిక్స్, స్పోర్ట్స్ అనే వాటిని డబ్బుతో కొలవొద్దు. మన హైద్రాబాద్‌ను దేశానికి సినీ రాజధాని చేసే విధంగా కేటీఆర్ గారు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. సినిమా అనేది ఎక్కువ కనిపిస్తుంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పుడు ఎందుకు అంత సబ్సిడీ ఇస్తున్నారు.. యూపీ ఎందుకు ఇండస్ట్రీ కోసం ట్రై చేస్తోంది.. సినిమా వల్ల టూరిజం పెరుగుతుంది. డెవలప్మెంట్ జరుగుతుంది. సినిమా పరిశ్రమను డబ్బుతో కొలవొద్దు. -
చేతిలో సినిమాలు లేవు, ఖాళీగా ఉన్నా: వెంకటేశ్
సినిమా హిట్టయితే చాలు.. అది ఏ భాషా చిత్రమయినా సరే దిగుమతి చేసుకోవడానికి రెడీగా ఉంటుంది తెలుగు చిత్రపరిశ్రమ. అలా టాలీవుడ్లో రీమేక్ సినిమాల పరంపర ఎక్కువైంది. ముఖ్యంగా విక్టరీ వెంకటేశ్ తమిళ సినిమాకు జై కొడుతున్నాడు. అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దృశ్యం, నారప్ప చిత్రాలను రీమేక్ చేసి హిట్లు అందుకున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం 2 సినిమా ఈనెల నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో వెంకటేశ్ గురువారం మీడియాతో ముచ్చటిస్తూ సినీ విశేషాలను పంచుకున్నారు. ఆ విశేషాలు.. ► ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు రాంబాబు. అది తప్పా.. ఒప్పా అని ఆలోచించడు. తన ఫ్యామిలీని కాపాడుకోవడమే రాం బాబు ముఖ్య ఉద్దేశ్యం. అలాంటి పాత్రలో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. సీక్వెల్ చేస్తే సినిమా హిట్ అవుతుందా? లేదా? అని అందరిలోనూ కొన్ని అనుమానాలుంటాయి. కానీ జీతూ జోసెఫ్ మాత్రం మొదటి పార్ట్ కంటే అద్భుతంగా స్క్రిప్ట్ రాశారు. రాంబాబు ఇన్ని రకాలుగా ఆలోచిస్తాడా? అని జనాలు అనుకుంటారు. అంతా బాగుందని అనుకునే సమయంలో ఆరేళ్ల తరువాత ఇన్వెస్టిగేషన్ మొదలవ్వడం, మళ్లీ సమస్యలు రావడం.. సీటు అంచున కూర్చోబెట్టే సినిమాలు అంటారు కదా?..అలా ఉంటుంది సినిమా. ఏం జరిగిందనేది ఫ్యామిలీకి కూడా చెప్పడు. ఫ్యామిలినీ రక్షించడం మాత్రం తెలుసు. ఇది చాలా గొప్ప పాత్ర. మోహన్ లాల్ అద్భుతంగా నటించారు. రాంబాబు పాత్రలో మరోసారి నటించడం చాలా హ్యాపీ.. ► దాదాపు ఒరిజినల్‌లానే ఉంటుంది. ఎక్కువ మార్పులు చేర్పులు చేయలేదు. కొత్తగా నాలుగైదు సీన్లు యాడ్ చేశాం. మొదటి పార్ట్ చూడకపోయినా దృశ్యం 2 అర్థమవుతంది. ఒకవేళ మొదటి పార్ట్ చూడాలని అనుకున్నా కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. సినిమా చేయడం వరకే నా బాధ్యత. విడుదల విషయంలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వను. తప్పూ ఒప్పూ అని ఏమి ఉండదు. పరిస్థితులకు తగ్గట్టుగా వెళ్లిపోవాలి. ఇంకా చాలా సినిమాలు థియేటర్లో కూడా వస్తాయి. ఈ సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో చాలా త్వరగా షూటింగ్ పూర్తి చేశాం. ► సినిమాలు తీశామా? రిలీజ్ చేశామా? అంతే.. ఎంజాయ్ చేసే వాళ్లు ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. మనం ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి. ఇలాంటి చిత్రాలు ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఎంత మంది చూస్తారు అని కాదు కానీ..ఈ బడ్జెట్‌కు ఓటీటీ బెస్ట్ అని నిర్మాతలు అనుకున్నారేమో. నా అభిమానులు కాస్త హర్ట్ అవుతారేమో కానీ.. నెక్ట్స్ సినిమాలతో థియేటర్లోకి వస్తాను అని వాళ్లకు తెలుసు. అన్నింటికి ఓపిగ్గా ఉండాలి. ఈ సారి ఇలా జరిగిందంతే. అందరూ కూర్చుని ఎంజాయ్ చేసే చిత్రాలను చేయబోతోన్నాను. కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నాను. నేను ఇలాంటి చిత్రాలే చేయలని అనుకోను. నా దగ్గరకు వచ్చిన సినిమాలు మాత్రమే నేను చేస్తాను. ► దృశ్యంకి మూడో పార్ట్ ఉంటుందో లేదో నాకు తెలీదు. అయితే ఈ సారి మాత్రం చాలా టైం పడుతుందని మాత్రం చెప్పారు. మూడు నాలుగేళ్లు పట్టొచ్చు. ఈ సారి తెల్లగడ్డంతో కనిపించినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడూ ఇమేజ్ గురించి ఆలోచించను. అదృష్టం కొద్దీ ఈ రంగంలోకి వచ్చాను. ప్రేక్షకుల అభిమానం దొరికింది. ఇంకా చూపిస్తూనే ఉన్నారు. కొత్తగా చేసేందుకు ట్రై చేసేందుకే ప్రయత్నిస్తున్నాను. నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను. ► ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే బాధ ఎఫ్ 3తో పోతుంది. ఎఫ్ 3 డబ్బు చుట్టూ సినిమా తిరుగుతుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ అదే అవసరం కదా..అందుకే తప్పకుండా కనెక్ట్ అవుతుంది. దాదాపు షూటింగ్ పూర్తయింది. సమ్మర్లో సినిమా వచ్చే అవకాశాలున్నాయి. ఎక్కువగా ఏమీ ఆశించొద్దు. వచ్చిన దాన్ని స్వీకరించాలి. ఫీడ్ బ్యాక్ అనే దాంట్లో ప్లస్, మైనస్‌లుంటాయి. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు. కానీ ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని పాఠాలు నేర్చుకోవాలి. రిలీజ్ అయిన వెంటనే కాకుండా ఓ ఆరు నెలల తరువాత కూడా సినిమాలు చూస్తారు. బాగుందని అంటారు. ఓటీటీలోని అందం అదే. కొన్ని సినిమాలు వెంటనే చూస్తారు. కొన్ని మెల్లిగా చూస్తారు. థియేటర్లోంచి సినిమా వెళ్లి పోతుందని ముందు చూస్తారు. కానీ ఓటీటీలో తీరిగ్గా తర్వాతైనా చూస్తారు. ► చాలామంది యువ దర్శకులు కథలు వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకీ సంతకం చేయలేదు. ఖరారైన వెంటనే ఆ వివరాల్ని తెలియజేస్తా. ప్రస్తుతానికి రానాతో కలిసి ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ ప్రాజెక్టులో నటిస్తున్నా. అవకాశం వచ్చినప్పుడు దానికోసం 100 శాతం కష్టపడదాం. పని లేనప్పుడు ఖాళీగా హ్యాపీగా ఉందాం. ప్రపంచాన్ని చుట్టేద్దాం. అందరూ బాగుండాలని కోరుకుందాం. వీటికి మించింది ఏముంది?.. అనే ఆలోచనతో ముందుకు సాగుతుంటా అన్నారు వెంకటేశ్. -
‘దృశ్యం 2’ సినిమా ఫస్ట్‌లుక్ వాయిదా
మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం’ మూవీని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసి వెంకటేష్ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మలయాళీ సినిమాకి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ ఓటీటీలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వెంకీ రీమేక్ చేస్తున్నాడు. దీనికి సైతం జీతూనే డెరెక్షన్ చేయనున్నాడు. కాగా వెంకీ ‘దృశ్యం 2’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని సోమవారం (సెప్టెంబర్ 20న) ఉదయం 10.08గంటలకు రిలీజ్ చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం మూవీ టీం ప్రకటించింది. కానీ అనుకోని కారణాల వల్ల విడుదల చేయలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించిన మేకర్స్ అనివార్య కారణాల వల్ల సినిమా ఫస్ట్ లుక్ వాయిదా వేస్తున్నామని, అసౌకర్యానికి క్షమాపణలు అని తెలిపారు. అయితే మలయాళం మోహన్లాల్కి జోడిగా నటించిన మీనా ఈ చిత్రంలోనూ వెంకీతో జతకడుతోంది. కాగా ‘దృశ్యం 2’ మూవీని దసరా కానుకగా విడుదల చేయడానికి చిత్రబృందం ప్లానింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: దసరాకే ‘దృశ్యం 2’, విడుదల తేదీ ఎప్పుడంటే.. Due to unforeseen circumstances, the release of the first look of Drushyam 2 has been delayed. Sorry for the inconvenience. — Suresh Productions (@SureshProdns) September 20, 2021 -
దృశ్యం 2: కమల్ హాసన్‌తో జోడీ కట్టనున్న నదియా!
మలయాళ ‘దృశ్యం’ తెలుగులో వెంకటేష్, మీనా జంటగా అదే పేరుతో, తమిళంలో కమల్‌హాసన్, గౌతమి జంటగా ‘పాపనాశమ్’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. మలయాళ ‘దృశ్యం 2’ అదే పేరుతో తెలుగులో వెంకీ, మీనా జంటగా రీమేక్ అవుతోంది. ఇప్పుడు తమిళ సీక్వెల్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో కమల్ హీరోగా నటిస్తారట. అయితే కమల్–గౌతమి విడిపోయిన నేపథ్యంలో సీక్వెల్లో వేరే తారను తీసుకోవాలనుకుంటున్నారని టాక్. ఈ పాత్రకు నదియాను ఎంపిక చేయాలనుకుంటున్నారని భోగట్టా. కాగా తెలుగు ‘దృశ్యం’లో పోలీసాఫీసర్‌గా, ‘దృశ్యం 2’లో మాజీ పోలీసాఫీసర్‌గా కనిపించారు నదియా. తమిళంలో కమల్‌కి జోడీగా నటిస్తే.. ఒకే కథలో రెండు వేరు వేరు పాత్రల్లో ఆమె నటించినట్లవుతుంది. చదవండి: తమిళనాడు: ఆ ఎన్నికల ఫలితాలు ఎప్పుడొస్తాయి? -
‘దృశ్యం 2’ అరుదైన రికార్డు, ఇండియన్ సినిమాల్లో అత్యధిక రేటింగ్
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, మీనాలు లీడ్‌రోల్ వచ్చిన చిత్రం దృశ్యం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగు, తమిళంలో కూడా ఈ చిత్రం రీమేక్ కాగా అక్కడ కూడా దృశ్యం సూపర్ హిట్ సాధించి బాక్సాఫీసుకు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో దర్శకుడు దీనికి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ ఇటీవల ఓటీటీలో విడుదలైన చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అకర్షించింది. దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఈ మూవీని చూసి నివ్వెరబోయాడు. ఈ మూవీ దర్శకుడు జీతూ జోసెఫ్‌పై ఆయన ప్రశంసలు వర్షం కురిపించాడు. ఇక ఇప్పుడు తెలుగులో కూడా ‘దృశ్యం 2’ రీమేక్ అవుతుండగా, ఈ సినిమాకు సంబంధించి వార్తలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా దశ్యం అరుదైన రికార్టును సాధించింది. ఐఎండీబీ లెక్కల ప్రకారం ఈ ఏడాది అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా ‘దృశ్యం 2’ రికార్డు సృష్టించింది. అన్ని వయసు వర్గాల వారు, అంతర్జాతీయ ప్రేక్షకుల ఆధారంగా ఈ మూవీ అంత్యధిక గణాంకాలతో 8.8 రేటింగ్‌తో మిగతా చిత్రాలకంటే ముందంజలో ఉంది. కాగా ఈ చిత్రంలో మోహన్ లాల్, మీనా నటన ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. -
ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అయిన తెలుగు సినిమాలివే!
గతేడాది కరోనా ప్రభావం చిత్ర పరిశ్రమను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్ట్ నుంచి ఈ ఏడాది మొదట్లో కాస్త కోలుకుంటున్నట్లు అనుకునేలోపే మళ్లీ సెకండ్ వేవ్ విజృంభించింది. దీంతో రిలీజ్ డేట్ కూడా ప్రకటించిన చాలా సినిమాలు వెనక్కి తగ్గాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలవుతుండటంతో థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియని సందిగ్ధత ఏర్పడింది. దీంతో నిర్మాతలు కూడా ఇప్పుడు ఓటీటీకే జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు సైతం త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. అవేంటో చూసేద్దాం.. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ రీమేక్ సినిమా దృశ్యం 2 షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే తెలుగు ‘దృశ్యం 2’కు కూడా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ కి అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందే ఈ సినిమాను ఓటీటీలో చేయాలని భావించినా నిర్మాత సురేశ్ బాబు వాటిని ఖండించారు. అయితే తాజాగా సినిమాల విడుదలకు ఆలస్యం అవుతుండటంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ ద్వారా 'దృశ్యం 2' సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అభిప్రాయపడుతున్నారట. ఈ విషయంలో వెంకటేష్ కూడా సముఖత వ్యక్తం చేశారని, 'దృశ్యం 2'ను ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పినట్లు ఇండస్ర్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ సూపర్‌హిట్ ‘అంధాదున్’కి రీమేక్ ఇది. నటా నటేశ్ హీరోయిన్గా నటిస్తోండగా తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను జూన్ 11న విడుదల చేయాలని బావించినా కరోనా కారణంగా బ్రేక్ పడింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని బావిస్తున్నారట. ఇందుకు సంబంధించి నిర్మాతలు ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థతో డీల్ మాట్లాడినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం `పాగల్`.నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇక జూన్‌లో ఈ మూవీని థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని భావించినా ప్రస్తుతం అందుకు తగ్గ పరిస్థితులు లేవు. లాక్డౌన్ కారణంగా ఈ మూవీ రిలీజ్‌కు బ్రేక్ పడింది. దీంతో ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌తో డీల్ మాట్లాడినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. చదవండి : ప్రియాంకకు షారుఖ్ కిస్: విడాకులిస్తానని భార్య బెదిరింపులు! Prabhas-Nag Ashwin Movie: రెమ్యునరేషనే రూ.200 కోట్లట! -
హిందీలోకి దృశ్యం 2: హీరోపై రాని క్లారిటీ!
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటీటీలో విడుదలైన మలయాళ ‘దృశ్యం 2’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. పనోరమ స్టూడియోస్ ఇంటర్నేషన్ సంస్థ నిర్మాతలు కుమార్ పాఠక్, అభిషేక్ పాఠక్ ‘దృశ్యం 2’ హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. ‘‘దృశ్యం 2’ మంచి హిట్ సాధించింది. ఇలాంటి కథలు మరింతమంది ప్రేక్షకులకు చేరాలనే ఉద్దేశంతో హిందీ రీమేక్ హక్కులను తీసుకున్నాం’’ అన్నారు కుమార్, అభిషేక్. అయితే హిందీ రీమేక్‌లో ఎవరు హీరోగా నటిస్తారు? అనే విషయంపై సరైన స్పష్టత ఇవ్వలేదు నిర్మాతలు. ఇక మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రధారులుగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో 2013లో ‘దృశ్యం’ చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లోనే ‘దృశ్యం 2’ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్‌లో వెంకటేష్ హీరోగా నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. చదవండి: హిట్ రిపీట్ అవుతుందా? -
ఓటీటీలో దృశ్యం-2.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత సురేశ్‌బాబు
అనుకోకుండా చిక్కుకున్న ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం-2. ‘దృశ్యం’ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ జంటగా నటించారు. మలయాళంలో డైరెక్ట్ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు. సురేశ్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మలయాళంలో కేవలం 45 రోజుల్లో మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 19న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అక్కడ ఈ మూవీకి మంచి స్పందన రావడంతో, అదే సినిమాను తెలుగులో వెంకటేశ్‌తో రీమేక్ చేశారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి తరుణంలో దృశ్యం-2 సబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, త్వరలోనే ఈ సినిమా ఓటీటీ సంస్థలో విడుదల కానుందని పుకార్లు వచ్చాయి. వీటిపై తాజాగా నిర్మాత సురేశ్ బాబు స్పందించారు. ఓటీటీలో విడుదల అనేది కేవలం పుకారు మాత్రమేనని, తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తామే స్వయంగా చెప్పే వరకు ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. చదవండి: ఈ వీకెండ్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే.. హాట్ టాపిక్‌గా మారిన పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ -
‘దృశ్యం 2’ సెట్స్‌లో జాయిన్ అయిన మీనా
‘దృశ్యం 2’ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు హీరోయిన్ మీనా. సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ (2014) సినిమాకు సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో హీరో హీరోయిన్లుగా నటించిన వెంకటేష్, మీనాయే సీక్వెల్లో కూడా చేస్తున్నారు. సోమవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు మీనా. ‘‘స్టార్ట్ రోలింగ్.. ‘దృశ్యం 2’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాను’’ అని పేర్కొన్నారు మీనా. ఈ సినిమాలో నటి పూర్ణ కూడా ఓ కీలకపాత్ర చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మలయాళ మాతృక ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాలను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ తెలుగు ‘దృశ్యం 2’తో దర్శకుడిగా తెలుగుకి పరిచయం కానున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. చదవండి: ఈ ఆపరేషన్ నా జీవితాన్ని మార్చేసింది : బిగ్ బీ -
రాజమౌళి వాట్సాప్ చాట్‌ను పంచుకున్న జోసెఫ్
దక్షిణాదిలోని సుప్రసిద్ధ దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన ఆయన ‘దృశ్యం’ దర్శకుడు జీతూ జోసెఫ్ని ప్రశంసించడం విశేషం. మలయాళ చిత్రాలు ‘దృశ్యం, దృశ్యం 2’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జీతూ జోసెఫ్. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘దృశ్యం 2’ ఫిబ్రవరి 19న అమెజాన్‌లో విడుదలై మంచి హిట్ అందుకుంది. ‘దృశ్యం’ రీమేక్‌లో నటించిన వెంకటేష్ ‘దృశ్యం 2’ రీమేక్‌లోనూ నటిస్తున్నారు. జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి వాట్సాప్ ద్వారా జోసెఫ్‌తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు జోసెఫ్. రాజమౌళి ప్రశంస ఏంటంటే.. ‘‘హాయ్ జీతూ.. నేను డైరెక్టర్ రాజమౌళిని. ‘దృశ్యం 2’ చూసిన తర్వాత నా ఆలోచలన్నీ దాని చుట్టూనే తిరిగాయి. వెంటనే మళ్లీ ఒకసారి మలయాళ ‘దృశ్యం’ చూశాను. (తెలుగులో విడుదల అయినప్పుడే చూశాను). దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, యాక్టింగ్.. ఇలా అన్ని విభాగాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన కథ ఇది. ‘దృశ్యం’ ఒక మాస్టర్ పీస్. అదే ఉత్కంఠతో సీక్వెల్ తీసుకురావడం గొప్ప విషయం. మీ నుంచి మరికొన్ని మాస్టర్ పీస్ చిత్రాలు రావాలి’’ అన్నారు. చదవండి: RRR Movie: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్! -
దృశ్యం 2: కేసు రీఓపెన్ చేయనున్న రానా!
‘దృశ్యం’ సినిమా చూసినవారికి కథ తెలిసే ఉంటుంది. అమ్మాయిని వేధించి, హత్యకు గురవుతాడు అబ్బాయి. ఆ హత్య చేసింది ఎవరో పోలీసులు తెలుసుకోలేకపోతారు. చివరికి కేసు క్లోజ్ అయిపోతుంది. ‘దృశ్యం 2’లో కొత్త ఇన్స్పెక్టర్ చార్జ్ తీసుకున్నాక కేసుని రీ ఓపెన్ చేస్తారు. మళ్లీ అమ్మాయి తండ్రి రాంబాబు కేసు నుంచి తప్పించుకోవడానికి ప్లాన్లు మొదలుపెడతాడు. రాంబాబు పాత్రలో వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో మీనా నటించిన ‘దృశ్యం’కి సీక్వెల్ ఇటీవల ఆరంభమైన విషయం తెలిసిందే. మలయాళంలో ఆల్రెడీ ‘దృశ్యం 2’ని తెరకెక్కించిన దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగు సీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో మురళీ గోపీ చేసిన కొత్త ఇన్స్పెక్టర్ పాత్రను తెలుగులో రానా చేయనున్నారని టాక్. రానా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో వెంకటేశ్ ‘బళ్లారి బావ..’ పాటలో కనిపించారు. ఇప్పుడు ఈ బాబాయ్‌తో అబ్బాయ్ ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపిస్తారని ఊహించవచ్చు. చదవండి: ఈ చిత్రం నన్ను పూర్తి మనిషిగా మార్చింది