దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్ | Ajay Devgn Drishyam 2 Trailer Out Today | Sakshi
Sakshi News home page

Drishyam 2 Trailer: ఆసక్తికరంగా దృశ్యం 2 ట్రైలర్.. చూసేయండి..!

Published Mon, Oct 17 2022 4:57 PM | Last Updated on Mon, Oct 17 2022 5:01 PM

 Ajay Devgn Drishyam 2 Trailer Out Today - Sakshi

అజయ్ దేవగణ్, శ్రియ, టబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం-2. మ‌లయాళంలో సూప‌ర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో విడుద‌లై ఘనవిజయం సాధించింది. తాజాగా హిందీలో రాబోతున్నదృశ్యం 2 ట్రైలర్ వ‌చ్చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. అజ‌య్ దేవ్‌గ‌ణ్, శ్రియ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టికే రిలీజైన దృశ్యం భారీ వసూళ్లు రాబ‌ట్టింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

(చదవండి: దృశ్యం 2 క్రేజీ అప్‌డేట్.. టీజ‌ర్‌ డేట్ ఫిక్స్)

ఇప్పటికే విడుదలైన ఫ‌స్ట్ లుక్, టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. ఇవాళ విడుదలైన ట్రైలర్‌ను చూస్తే ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తోంది. అజయ్ దేవగణ్ మృతదేహాన్ని పాతిపెట్టే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్‌లో అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ మూవీ న‌వంబ‌ర్ 18 థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. అక్ష‌య్ ఖ‌న్నా, రజ‌త్ క‌పూర్‌, ఇషితా ద‌త్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మలయాళంలో 2015లో వచ్చిన మోహన్ లాల్ చిత్రానికి రిమేక్‌గా వస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement