Watch: Ajay Devgan Drishyam 2 Movie Title Song Released Today, Video Viral - Sakshi
Sakshi News home page

Drishyam 2 Movie: హిందీలో దృశ్యం 2.. ఆసక్తి పెంచుతోన్న టైటిల్ సాంగ్

Published Wed, Nov 9 2022 6:35 PM | Last Updated on Wed, Nov 9 2022 7:31 PM

 Ajay Devgan Drishyam 2 Movie Title Song Released Today - Sakshi

అజయ్ దేవగణ్, శ్రియా శరన్, టబు ప్రధాన పాత్రల్లో హిందీలో తెరకెక్కుతున్న చిత్రం 'దృశ్యం-2'. మ‌లయాళంలో సూప‌ర్ హిట్ మూవీ దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళం, హిందీ భాషల్లో విడుద‌లై ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్‌ను చిత్ర నిర్మాతలు రిలీజ్‌ చేశారు. అజ‌య్ దేవ్‌గ‌ణ్, శ్రియ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టికే రిలీజైన దృశ్యం భారీ వసూళ్లు రాబ‌ట్టింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

(చదవండి: దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్)

ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్ సాంగ్‌ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఉతుప్, విజయ్ ప్రకాష్ ఈ పాటను ఆలపించగా.. అమితాబ్ భట్టాచార్య ఈ సాంగ్‌ను రచించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement