Sriya Saran
-
ప్రకృతిని ఆస్వాదిస్తోన్న దేవర భామ.. నేపాల్‌లో శ్రియా శరణ్ చిల్!
ప్రకృతి అందాలు ఆస్వాదిస్తోన్న దేవర భామ జాన్వీ కపూర్..రాయ్‌పూర్‌లో డాకు మహారాజ్ భామ ఊర్వశి రౌతేలా..సమంత బ్లాక్ అండ్ వైట్ లుక్స్..బ్లాక్ డ్రెస్‌లో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్..ఫ్యామిలీతో నేపాల్‌లో చిల్ అవుతోన్న శ్రియా శరణ్.. View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
బిగ్‌బాస్ దివి స్టన్నింగ్ పిక్స్.. ప్రియుడితో ప్రియాంక జైన్ చిల్!
బీచ్‌లో శ్రియా శరణ్ పోజులు..బిగ్‌బాస్ దివి స్టన్నింగ్ పిక్స్..ప్రియుడితో ప్రియాంక జైన్ చిల్..థాయ్‌లాండ్ ట్రిప్ ఫుల్‌గా ఆస్వాదిస్తోన్న ఆండ్రియా..షూట్లో బిజీ బిజీగా సన్ని లియోన్.. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
గౌనులో చిన్నపిల్లలా హన్సిక.. వింటేజ్ లుక్‌లో పుష్ప భామ
గౌనులో చిన్నపిల్లలా హన్సిక హోయలు..వింటేజ్ లుక్ డ్రెస్సుల్లో పుష్ప భామ రష్మిక..హీరోయిన్ శ్రియా శరణ్ స్మైలీ లుక్స్..దుబాయ్‌లో చిల్ అవుతోన్న కల్యాణి ప్రియదర్శన్..ట్రేడిషనల్ డ్రెస్‌లో యాంకర్ శ్రీముఖి.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Genelia Deshmukh - जेनेलिया रितेश देशमुख (@genelia.deshmukh) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
వ్యాపారవేత్తతో పెళ్లి.. ఐటమ్ సాంగ్ కోసం రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్
చిత్రపరిశ్రమలో ఐటమ్ సాంగ్స్‌కు చాలా క్రేజ్ ఉంటుంది. అందుకే చాలామంది హీరోయిన్లు అవకావం వస్తే కాదనకుండా ఓకే చెప్పుతున్నారు. ప్రస్తుతం క్రేజ్‌లో ఉన్న హీరోయిన్లు నటించిన ఐటమ్ సాంగ్స్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి. అలా ఇంతకు ముందు పుష్ప చిత్రంలో నటి సమంత పాటను, ఇటీవల జైలర్ చిత్రంలో తమన్నా పాటను చూశారు. ఈ తరహా పాటలు సినిమాకు అదనపు ఆకర్షణ కావడంతో స్టార్ హీరో చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ ఉండడం పరిపాటిగా మారుతోంది. తాజాగా నటుడు సూర్య చిత్రంలోనూ ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ చోటు చేసుకుంటోందని సమాచారం. కంగువ చిత్రం తరువాత ఈయన నటించిన తన 44వ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయకిగా నటించారు. స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంస్థ, 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ యాక్షన్ కథా చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో శ్రియ నటించనున్నట్లు తాజా సమాచారం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి స్టార్ స్థాయికి చేరుకున్న ఈ బ్యూటీ ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని నటనకు కాస్త విరామం తీసుకున్నారు. ఈమె తమిళంలో చివరిగా 2017లో విడుదలైన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో కథానాయకిగా నటించారు. ఆ తరువాత ఎక్కడా కనిపించని శ్రియ ఆ మధ్య కన్నడంలో ఉపేంద్రకు జంటగా ఒక చిత్రంలో నటించడంతో రీ ఎంట్రీ ఇచ్చారు. అలాంటిది తాజాగా తమిళంలో ఏడేళ్ల తరువాత నటుడు సూర్య హీరోగా నటిస్తున్న ఆయన 44వ చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో మెరవనున్నట్లు తెలిసింది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. అయితే దీని గురించి నటి శ్రియ ఒక భేటీలో పేర్కొనడం విశేషం. ఈ పాట బాగా వచ్చిందని, త్వరలోనే వెలువడనుందనీ ఆమె తెలిపారు. అంతే కాదు ఈ పాటను గోవాలో చిత్రీకరించినట్లు చెప్పారు. కాగా ఈమె నటుడు సూర్యతో నటించిన తొలి చిత్రం ఇదే అవుతుంది. -
స్టార్ హీరోతో సినిమా ఛాన్స్... తిరిగొస్తున్న శ్రియ శరణ్
ఇప్పుడు సీనియర్ హీరోయిన్లకు మంచి టైమ్ నడుస్తుందనే చెప్పవచ్చు. ఇంతకు ముందు అగ్ర హీరోయిన్లుగా రాణించిన సిమ్రాన్, జ్యోతిక,త్రిష, మంజూ వారియర్ వంటి నటీమణులకు ఇప్పుడు సౌత్ చిత్రపరిశ్రమలో మంచి డిమాండ్ పెరుగుతోందనే చెప్పాలి. ఇలాంటి వారికి సీనియర్ నటులకు జంటగా నటించే అవకాశాలు వరిస్తున్నాయి. అదే విధంగా చిరంజీవి, విజయ్, సూర్య, అజిత్ వంటి హీరోల చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలా తాజాగా నటుడు సూర్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో నటి శ్రియ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: ‘మత్తు వదలరా 2’ మూవీ ఎలా ఉందంటే.. ?ఈమె ఇంతకు ముందు తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో టాప్ కథానాయకిగా రాణించిన విషయం తెలిసిందే. రజనీకాంత్‌కు జంటగా శివాజీ చిత్రంలో నటించే స్థాయికి చేరుకున్నారు. పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గపోయా యి. కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ నటించారు. అయితే వివాహానంతరం కాస్త గ్యాప్ వచ్చినా ఆమె నటనకు మాత్రం దూరం కాలేదు. ఈ క్రమంలో చిన్న సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కానీ, అవి అంతగా ఆకట్టుకోలేదు. అలాంటిది తాజాగా నటుడు సూర్య హీరోగా నటిస్తున్న తన 44వ చిత్రంలో నటి శ్రియ నటిస్తున్నట్లు టాక్ స్ప్రెడ్ అవుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ మసాలా చిత్రంలో నాయకిగా నటి పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో నటి శ్రియ పాత్ర ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రీసెంట్గా నటి శ్రియ ఒక సినిమా ఒప్పుకున్నారు. మాదేశ్ దర్శకత్వం వహిస్తున్న సండైక్కారి అనే చిత్రంలో ఆమె నటించనున్నారు. ఇందులో నటుడు విమల్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 31న విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. -
అలాంటి డ్రెస్‌లో శ్రద్ధాదాస్ హోయలు..కలర్ఫుల్గా కనిపించిన మంచులక్ష్మి!
మెరుపులాంటి డ్రెస్‌లో శ్రద్ధాదాస్ హోయలు.. సండే మూడ్‌లో శ్రద్ధా కపూర్... కలర్‌ఫుల్ డ్రెస్‌లో మంచులక్ష్మి స్మైలీ లుక్స్.. బాలీవుడ్ భామ దియా మీర్జా ట్రెండీ పోజులు బ్లాక్ డ్రెస్‌లో శ్రియా శరణ్ బోల్డ్ లుక్స్.. View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
అమెజాన్ ఈవెంట్లో మెరిసిన సమంత.. పెళ్లి తర్వాత రకుల్ లుక్స్ వైరల్!
గౌనులో చిన్నపిల్లలా మారిపోయిన రవీనా టాండన్ అమెజాన్ ఈవెంట్లో మెరిసిన సమంత.. కళ్లతోనే మాయ చేస్తోన్న శ్రియా శరణ్.. గ్రీన్ డ్రెస్‌లో లైగర్ భామ అనన్య పాండే అలాంటి పోజులు.. బ్లాక్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ లుక్స్... View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Arun Prasath (@arunprasath_photography) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) -
అలాంటి లుక్‌లో షాకిచ్చిన మంచు లక్ష్మీ.. వరుడు హీరోయిన్ లేటేస్ట్ లుక్స్!
అలాంటి లుక్‌లో కనిపించి షాకిచ్చిన మంచు లక్ష్మీ వైట్ అండ్ బ్లూ డ్రెస్‌లో వరుడు హీరోయిన్ హోయలు! పింక్ డ్రెస్‌లో ఈషా రెబ్బా స్టన్నింగ్ లుక్స్.. యాంకర్ సుమ ట్రెండీ లుక్.. లైట్ బ్యూ శారీలో శ్రియా చరణ్ పోజులు View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shri bhanu ❤️🔥 (@iam_bhanusri) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
డ్రెస్ కవర్ చేసుకోలేక ఇబ్బంది పడ్డ శ్రియా.. వైరల్ అయిన వీడియో
సీనియర్ బ్యూటీ శ్రియ శరన్ గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు ఇరవై యేళ్లుగా టాలీవుడ్లో తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది. ఒక బిడ్డకు తల్లైన తర్వాత కూడా తన గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు ఈ బ్యూటీ. అయితే తాజాగా శ్రియా దరించిన ఈ డ్రెస్‌పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె నడుస్తన్నప్పుడు ఆమె డ్రెస్ ఎక్కడ జారిపోతుందో అనేంతగా ఉంది. ఆ సమయంలో డ్రెస్‌ను కవర్ చేసుకోలేక ఎంతో కష్టపడింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ తో విరుచుకపడుతున్నారు. (ఇదీ చదవండి: ఫిబ్రవరిలో హీరోయిన్ పెళ్లి.. ప్రెగ్నెన్సీ అంటోన్న నెటిజన్స్!) కొందరు అంతగా ఇబ్బంది పడే డ్రెస్ ఎందుకు వేసుకోవడం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరీ దారుణమైన కామెంట్ ఏమిటంటే.. సోషల్ మీడియాలో ఒక వర్గం వారు శ్రియాను బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్‌తో పోల్చుతున్నారు. ఇలాంటి చెత్త డ్రెస్‌లు ఆమెనే ఇచ్చిందా అంటూ.. ఉర్ఫీ జావేద్ 2.0 వెర్షన్ వచ్చిందని కామెంట్ చేస్తున్నారు. దీంతో శ్రీయా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 2001లో టాలీవుడ్ నుంచి ఇష్టం సినిమాతో శ్రియా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె 2002లో వచ్చిన సంతోషం చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. తరువాత, ఆమెకు టాలీవుడ్ టాప్ హీరోలతో నటించే అవకాశం దక్కింది. తాజాగా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిందీలో ఆమె చేసిన 'దృశ్యం 2' సినిమా భారీ విజయం సాధించింది. అనంతరం తను మళ్లీ బిజీ యాక్టర్‌గా మారిపోయింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) (ఇదీ చదవండి: అడివి శేష్‌కు ఛాలెంజ్ విసిరిన హైదరాబాద్ సీపీ) -
షాపింగ్‌లో బిజీగా అను ఇమ్మాన్యుయేల్.. మిహికా బజాజ్ స్టన్నింగ్ లుక్స్!
►షాపింగ్ ఎంజాయ్ చేస్తోన్న అను ఇమ్మాన్యుయేల్ ►ఒళ్లంతా డ్రెస్‌తో కప్పేసుకున్న శృతిహాసన్ ►రానా సతీమణి మిహికా బజాజ్ స్టన్నింగ్ లుక్స్ ►కలర్ ఫుల్ గౌనులో రష్మీ గౌతమ్ హోయలు ►ట్రెండింగ్ లుక్‌లో సింగర్ గీతామాధురి ►యోగాసనాలు చేస్తున్న శ్రియా శరణ్ View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
కబ్జ ట్విటర్ రివ్యూ
కన్నడ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కబ్జ’. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో శ్రియా శరణ్ హీరోయిన్గా నటించింది. పునీత్ రాజ్‌కుమార్ జయంతి పురస్కరించుకొని నేడు(మార్చి 17) తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై అంచాలను పెంచేసింది. కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో కబ్జ ఒకటి. కేజీయఫ్ తరహాలో గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. దీంతో యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారితో పాటు ఉపేంద్ర ఫ్యాన్స్ కబ్జ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసినవాళ్లు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కబ్జ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. #Kabzaa is another Eldorado of Kannada cinema🔥.R.Chandru's direction was fantastic🔥. #Upendra's acting was next level⭐.#Kicchasupeep's on-screen presence was lit🔥#Shivanna surprising entry gave me goosebumps.surely this is first blockbuster of 2023 Rating:4.5/5#kabzaareview pic.twitter.com/LD6jfZWcvI — Amith A (@AmithA59767744) March 16, 2023 కన్నడ నుంచి వచ్చిన మరో బ్లాక్‌బస్టర్ చిత్రం కబ్జ. చంద్రు డైరెక్షన్ అదిరిపోయింది. ఉపేంద్ర యాక్టింగ్ నెక్ట్లెవల్. కిచ్చా సుదీప్ స్క్రీన్ ఫెర్మార్మెన్స్ బాగుంది. శివరాజ్‌కుమార్ ఎంట్రీ గూస్బంప్స్ తెప్పిస్తుంది. మొత్తంగా 2023లో మొదటి బ్లాక్ బస్టర్‌గా కబ్జ నిలుస్తుందని చెబుతూ 4.5 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. Walkout feels.. Watched kgf 1,2? you can AVOID #Kabzaa Cheap version of KGF, same screenplay , same editing pattern. Not engaging at all. Bad dubbing n bad performance from upendra. Sudeep just cameo, other actors, nothing great. 2/5 FINALLY WATCH KGF AT HOME#Kabzaareview pic.twitter.com/L4Pa0YPiXv — Raghu436 (@436game) March 17, 2023 కబ్జ అస్సలు బాగాలేదు. కేజీయఫ్ 1,2 చూసినవాళ్లు కబ్జను అవైడ్ చేయ్యొచ్చు. కేజీయఫ్‌కి చీప్ వెర్షన్ ఈచిత్రం. అదే తరహా స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్. ఉపేంద్ర నటన కూడా అంతగా ఆకట్టుకోలేకపోయిదంటూ 2 రేటింగ్ ఇచ్చాడు మరో నెటిజన్. #Kabzaa What's wrong with Darshan fans! It's clear that KFI's only back draw is Darshan and his fans... — Thor (@HemsworthStarc) March 17, 2023 #KabzaaReview Mass Entertainment Mass Comeback Of #Upendra and introduction of #KicchaSudeep𓃵 & #ShivarajKumar VereLevel Entry Goosebumps Treat for Fans Story Lineup is More exited with return Gift for fans.. Overall Rating - 4/5 ⭐⭐⭐⭐@nimmaupendra @KicchaSudeep #Kabzaa — SOUTH DIGITAL MEDIA ™ (@SouthDigitalM) March 17, 2023 You have worked very hard for this @rchandru_movies .. wishing you to be blessed wth the success you deserve. Best wshs team #Kabzaa and @nimmaupendra sir . 🥂 pic.twitter.com/PJqRIBGCr8 — Kichcha Sudeepa (@KicchaSudeep) March 17, 2023 KABZAA MOVIE MADE SANDALWOOD PROUD AGAIN 😍🔥 DON'T BELIEVE IN ANY NEGATIVITY🔥 KICCHA BOSS CAMEO🥵💥💥 + INTERVAL BANG & CLIMAX😻😻 FIRE HAI BHAI MOVIE 😎#KabzaaFromTomorrow #Kabzaa #BlockBusterKabzaa pic.twitter.com/29C36MPTQ8 — Vinay (@Thapaswe) March 17, 2023 As Kannada Cinema continues its spectacular journey to mark its footprint across the world, #Kabzaa looks like another Grandeur & Raw attempt. All the best @nimmaupendra Garu @KicchaSudeep sir #ShivaRajkumar sir @shriya1109 Garu @rchandru_movies Garu & @RaviBasrur Garu & team. pic.twitter.com/lLFT7AtzuZ — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 16, 2023 #Kabzaa (Kannada|2023) - THEATRE. Upendra’s show. Kiccha’s 10Mins Cameo disappoints. Shreya gud. Shivanna 1 scene. Has heavy KGF flavour. Dull color tone. Music ok. Poor VFX. Narration s not so gripping. Usual Gangster Action stuff. Cliffhanger climax with a Part2 lead. AVERAGE! pic.twitter.com/FD7fHc61EA — CK Review (@CKReview1) March 17, 2023 -
అజయ్ దేవ్‌గణ్ 'దృశ్యం 2'.. టైటిల్ సాంగ్ చూశారా?
అజయ్ దేవగణ్, శ్రియా శరన్, టబు ప్రధాన పాత్రల్లో హిందీలో తెరకెక్కుతున్న చిత్రం 'దృశ్యం-2'. మలయాళంలో సూపర్ హిట్ మూవీ దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్‌ను చిత్ర నిర్మాతలు రిలీజ్ చేశారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ కాంబినేషన్లో ఇప్పటికే రిలీజైన దృశ్యం భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్) ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఉతుప్, విజయ్ ప్రకాష్ ఈ పాటను ఆలపించగా.. అమితాబ్ భట్టాచార్య ఈ సాంగ్‌ను రచించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. -
దృశ్యం-2 మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్
అజయ్ దేవగణ్, శ్రియ, టబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం-2. మలయాళంలో సూపర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. తాజాగా హిందీలో రాబోతున్నదృశ్యం 2 ట్రైలర్ వచ్చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ కాంబినేషన్లో ఇప్పటికే రిలీజైన దృశ్యం భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: దృశ్యం 2 క్రేజీ అప్డేట్.. టీజర్ డేట్ ఫిక్స్) ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. ఇవాళ విడుదలైన ట్రైలర్‌ను చూస్తే ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తోంది. అజయ్ దేవగణ్ మృతదేహాన్ని పాతిపెట్టే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్లో అజయ్ దేవ్‌గణ్, శ్రియ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ మూవీ నవంబర్ 18 థియేటర్లలో సందడి చేయనుంది. అక్షయ్ ఖన్నా, రజత్ కపూర్, ఇషితా దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మలయాళంలో 2015లో వచ్చిన మోహన్ లాల్ చిత్రానికి రిమేక్‌గా వస్తోంది. -
ఆ సినిమా టికెట్లపై భారీ తగ్గింపు.. అయితే ఆ ఒక్కరోజు మాత్రమే..!
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం- 2. మలయాళంలో సూపర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. హిందీలో దృశ్యం- 2 విడుదలకు సిద్దమైంది. అయితే తాజాగా ప్రేక్షకుల కోసం సరికొత్త బంపర్ ఆఫర్ ప్రకటించింది చిత్రబృందం. సినిమా రీలీజ్ రోజున అడ్వాన్స్ బుకింగ్ టికెట్లపై 50 శాతం భారీ తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 2 తేదీన బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ అభిమానులకు అందించేందుకు బహుళస్థాయి సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు చిత్రబృందం వివరించింది. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో టబు, ఇషితా దత్తా, అక్షయ్ ఖన్నా, రజత్ కపూర్, శ్రియా శరణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే పేరుతో 2021లో వచ్చిన మోహన్ లాల్ మలయాళ చిత్రానికి రీమేక్‌గా వస్తోంది ఈ సినిమా. 2015లో విడుదలైన దృశ్యం సూపర్ హిట్‌గా నిలిచింది. Vijay Salgaonkar and family are back to continue the narrative of 2nd October! Advance bookings open on 2nd October and you can block your tickets on the PVR app for JUST Rs. 50 and get 50% OFF on first day shows of Drishyam 2. #Drishyam2 in cinemas on 18th November, 2022. pic.twitter.com/EIEIV1ijvG — P V R C i n e m a s (@_PVRCinemas) October 1, 2022 -
ఆ రోజు భయం వేసింది: ప్రియాంకా జవాల్కర్
‘‘కెరీర్లో ఎక్కువ సినిమాలు చేయాలనే కంగారు నాకు లేదు.. కథ నచ్చితేనే నటిస్తాను. కెరీర్లో స్లో అయిపోతామని వెంటవెంటనే సినిమాలు అంగీకరిస్తే.. వాటిలో ఎక్కువగా ఫ్లాప్ అయితే అప్పుడు కూడా కెరీర్‌కు ఇబ్బందే’’ అని హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ అన్నారు. శ్రియా శరన్, శివ కందుకూరి, నిత్యామీనన్, ప్రియాంకా జవాల్కర్ ప్రధాన పాత్రల్లో సంజనా రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గమనం’. రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియాంకా జవాల్కర్ మాట్లాడుతూ– ‘‘గమనం’ సినిమా కథ విన్నప్పుడు ‘వేదం’ గుర్తొచ్చింది. సంజనా రావు మహిళా దర్శకురాలు కావడంతో మరింత ఎక్కువగా కనెక్టయ్యాను. ఈ చిత్రంలో జారా అనే ముస్లిం యువతి పాత్రలో కనిపిస్తాను. నటనకు స్కోప్ ఉన్న పాత్రే అయినప్పటికీ కథ రీత్యా నా పాత్రకు పెద్దగా డైలాగ్స్ ఉండవు. ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మాట్లాడాలి.. కళ్లతో హావభావాలు చూపించాలి. ఇదే కష్టంగా అనిపించింది. శివకందుకూరి గ్రాండ్ఫాదర్గా చారుహాసన్గారు కనిపిస్తారు. ఓ రెయిన్ సీక్వెన్స్‌లో చారుహాసన్గారితో కలిసి నటించాను. నటన, వయసు ప్రకారం ఆయన చాలా పెద్దాయన. నా నటనతో (ఎక్కువ టేకులు తీసుకోవడం) ఆయన్ను ఏమైనా ఇబ్బంది పెడతానేమోనన్న భయం షూటింగ్ రోజు కలిగింది. కానీ చిత్రీకరణ అనుకున్నట్టుగా బాగానే సాగింది. ఈ సినిమాకు ఇళయరాజాగారు సంగీతం అందిస్తున్నారని తెలియగానే చాలా సంతోష పడ్డాను. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా నాకు నచ్చింది. కథ డిమాండ్ చేస్తే బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి సిద్ధమే’’ అన్నారు. (చదవండి: ‘అఖండ’ ఫైట్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు) -
ఈ పుస్తకమంటే శ్రియాకు ఎంతో ఇష్టమట
‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శ్రియాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఆమెకు ఇష్టమైన పుస్తకాలలో ఒకటి ది ఎనార్కి. ‘వైట్ మొగల్’ ‘ది లాస్ట్ మొగల్’...మొదలైన పుస్తకాలతో పాఠకుల ఆదరణ పొందిన స్కాటిష్ చరిత్రకారుడు, రచయిత, కళా విమర్శకుడు విలియం డాల్‌ర్లింపుల్ రాసిన పుస్తకం ఇది. ఈస్టిండియా కంపెనీపై రాసిన ‘ది ఎనార్కి’ పరిచయం సంక్షిప్తంగా.... ఈస్టిండియా కంపెనీపై రాసిన పుస్తకం అనగానే కలిగే తొలి సందేహం...అసలు కొత్తగా రాయడానికి ఏముంది? రాజకీయ, ఆర్థిక, సైనిక కోణాలలో చాలామంది రాశారు కదా! అని. ‘నా ఉద్దేశం కంపెనీ సంపూర్ణచరిత్ర తెలియజేయడం కాదు. కంపెనీ వ్యాపారదక్షతకు సంబంధించిన ఆర్థికవిశ్లేషణ కూడా కాదు. రాజకీయాలు, పాలనతో ఏమాత్రం సంబంధం లేని ఒక కంపెనీ అత్యంత బలమైన మొఘల్ సామ్రాజ్యాన్ని ఎలా మట్టికరిపించగలిగింది? వినయవిధేయతలు ఉట్టిపడే కంపెనీగా ప్రవేశించి సామ్రాజ్యవాదశక్తిగా ఎలా ఎదిగింది? అనే కోణంలో రాసిన పుస్తకం’ అంటాడు రచయిత. 1599లో కంపెనీ పుట్టుక నుంచి పుస్తకం మొదలవుతుంది. ‘భారతదేశ«ం నుంచి ఇంగ్లిష్ భాషలోకి చేరిన తొలి పదం...లూట్’ అనే ఒకేవాక్యంలో ఎన్నో విషయాల సారం చెప్పాడు డాల్‌ర్లింపుల్. క్వీన్ ఎలిజబెత్1 బ్రిటీష్ రాణిగా ఉన్న కాలంలో 1600లో ఈస్టిండియా కంపెనీ ఆసియాలోకి అడుగుపెట్టింది. తమ కంపెనీలో పనిచేయడం, తమ వస్తువును కొనడంపై మోజు పెంచింది. వ్యాపారపరమైన ఏకఛత్రాధిపత్యంతో పాటు ఇతర విషయాలలోనూ దాని జ్యోకం పెరిగింది. వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉన్న కంపెనీకి రాజకీయాలు అవసరమా? అనే విషయంలో బ్రిటీష్ పార్లమెంట్లో వాడివేడిగా చర్చ జరిగింది. ఈస్టిండియా వైఖరిని బ్రిటీష్ పత్రికలు ఘాటుగా విమర్శించాయి. భారతదేశంలో ఈస్టిండియా పాలనను క్రమబద్ధీకరిస్తూ పార్లమెంట్లో రెగ్యులెటింగ్ చట్టం కూడా చేశారు. భారతఉపఖండంలోని సంపన్నప్రాంతాలను కైవసం చేసుకున్న కంపెనీ మొగల్ పాలకులపై పాలనాధికారి పాత్ర పోషిచింది. కంపెనీ అనూహ్యంగా దూసుకుపోవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల ప్రస్తావన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. బ్రిటీష్ వారిపై తిరగుబాటు నినాదం వినిపించడంలో పేరున్న సిరాజ్–ఉద్–దౌలా గురించి భిన్నమైన స్వరం వినిపిస్తుంది. ‘ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఉర్దూ, బెంగాలీలలో సిరాజ్ గురించి గట్టి ఆధారాలు దొరుకుతాయి. అతడి గురించి చెప్పుకోవడానికి ఒక్క మంచి పదం దొరకదు’ అంటాడు రచయిత. ప్లాసీ యుద్ధం తరువాత ఈస్డిండియా కంపెనీ అత్యంత సంపన్న శక్తిగా ఎలా ఎదిగింది? మొఘల్ సామ్రాజ్యానికి షా అలం పేరుకు మాత్రమే రాజు ఎందుకు అయ్యాడు? అతడిని ‘చదరంగ రాజు’ అని మరాఠాలు, బెంగాల్ నవాబులు వెక్కిరించడానికి కారణం ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు పుస్తకం సమాధానం చెబుతుంది. ఈ పుస్తకంలో బాగా ఆసక్తి కలిగించే ఘట్టం గులామ్ ఖదీర్. ఇతడి తండ్రి ఢిల్లీపై పోరాడి ఓడిపోతాడు. పదిసంవత్సరాల వయసులో ఖదీర్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు షా ఆలామ్. అందంగా, చురుగ్గా ఉండే ఈ బాలుడిపై మొగల్ పాలకుడికి ప్రత్యేక ప్రేమ. ‘నా ప్రత్యేకమైన కుమారుడు’ అని స్వయంగా ప్రకటిస్తాడు కూడా. అలాంటి కుమారుడు పెరిగి పెద్దయ్యాక కనివిని ఎరగని అరాచకాలకు ఎలా పాల్పడ్డాడు?...ఇవి పుస్తకంలో చదవాల్సిందే. ఎవరికీ తెలియని ఆధారాలను వెలికి తీసి రాసిన ఈ పుస్తకానికి ఇప్పటి వరకు ఈస్టిండియా కంపెనీపై వచ్చిన పుస్తకాల జాబితాలో తప్పకుండా ప్రత్యేక స్థానం ఉంటుంది. మై ఫెవరెట్ బుక్: ది ఎనార్కి రచన: విలియం డాల్‌ర్లింపుల్ -
రూ. 200 చెల్లిస్తే నాతో డ్యాన్స్ చేయొచ్చు : హీరోయిన్
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు, కూలీలు, నిరాశ్రయల సహాయార్ధం హీరోయిన్ శ్రియ సరన్ నడుం బిగించారు. ఇందుకోసం ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్న ఆమె.. వినూత్నంగా విరాళాలు సేకరిస్తున్నారు. www.thekindnessproject.inలో కేవలం 200 రూపాయలు చెల్లించి రిసిప్ట్‌ను మెయిల్ చేసి వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. శనివారం సాయంత్రం 8 గంటలవరకు ఈ అవకాశం ఉందని, ఆదివారం విజేతలను ప్రకటిస్తామని పేర్కొంది. లక్కీడ్రాలో విజేతలుగా నిలిచిన వారు (వీడియో కాల్ )లో తనతో కలిసి డ్యాన్స్, యోగా చేసే అవకాశం సొంతం చేసుకోవచ్చని తెలపింది. మీరిచ్చే విరాళాలు అన్ని నిరుపేదలకు చేరుతాయని, ఈ మంచి పనిలో అందరం భాగస్వాములం అవుదాం అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా పిలుపునిచ్చారు. (ఒకే ఇంట్లో వేరు వేరుగా ఉన్నాం ) View this post on Instagram I Have teamed up with The Kindness Foundation and Chennai Task Force to help with their covid relief efforts They’re addressing those who are most vulnerable: destitute elderly, daily wage laborers, the homeless, orphans, and disabled - Will be offering two lucky winners a chance to dance, do some yoga, or whatever floats your boat to brighten up your quarantine - all you have to do to enter is donate Rs. 200 and email your receipt to give@thekindnessproject.in The contest will run until Saturday at 8pm, and winners will be contacted on Sunday You can swipe right for details or head to The Kindness Foundation page 🤩🤩🤩🤩 let’s have some fun together and do some good too! A post shared by Shriya Saran (@shriya_saran1109) on May 2, 2020 at 5:45am PDT ఇంకా కొన్ని రోజుల వరకు మనం వైరస్‌తో పోరాడాల్సి ఉందని, ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే మరింత జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది. అందరూ సరక్షితంగా ఉండాలని..లక్షణాలు కనిపిస్తే వెంటనే స్వీయ నిర్భంధంలోకి వెళ్లాల్సిందిగా కోరింది. శ్రియ నటించిన నరగసూరన్ అనే తమిళ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అరవింద్ స్వామి ముఖ్య పాత్ర పోషించారు. ఇక రష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొశ్చివ్‌ను రెండేళ్ల క్రితం శ్రియ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ దంపతులు స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉంటున్నారు. -
ఒకే ఇంట్లో వేరు వేరుగా ఉన్నాం
రష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొశ్చివ్‌ను రెండేళ్ల క్రితం శ్రియ వివాహం చేసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ దంపతులు స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉంటున్నారు. కోవిడ్ 19 (కరోనా వైరస్) మహమ్మారి తీవ్రస్థాయిలో ఉన్న ప్రపంచదేశాల్లో స్పెయిన్ ఒకటి. తన భర్త ఆండ్రూలో కోవిడ్ 19 లక్షణాలు కనిపించడంతో చాలా కంగారుపడ్డానని శ్రియ పేర్కొన్నారు. ఈ విషయం గురించి శ్రియ చెబుతూ– ‘‘పొడి దగ్గు, జ్వరంతో ఆండ్రీ బాధపడుతున్నాడని హాస్పిటల్‌కు వెళ్లాం. కానీ అక్కడి వైద్యులు మమ్మల్ని వెంటనే వెళ్లిపొమ్మన్నారు. ఆండ్రీకు కరోనా లక్షణాలు లేవని, ఇక్కడే (హాస్పిటల్లో) ఉంటే నిజంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అక్కడి డాక్టర్స్ అన్నారు. దాంతో మేం వెంటనే ఇంటికి వచ్చేశాం. మా అంతట మేం ‘ఐసోలేషన్’లో ఉండిపోయాం. వేరే వేరు గదుల్లో ఉండటం మొదలుపెట్టాం. ఇంట్లో ఉండి ఆండ్రూ చికిత్స చేయించుకున్నాడు. తను కోలుకున్నాడు’’ అని పేర్కొన్నారు. ఇంకా అక్కడి పరిస్థితుల గురించి శ్రియ మాట్లాడుతూ – ‘‘మా వివాహ వార్షికోత్సవాన్ని (ఈ నెల 13) సెలబ్రేట్ చేసుకోవడానికి మేం ఓ రెస్టారెంట్లో రిజర్వ్ చేయించుకున్నాం. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత అది క్లోజ్ చేసి ఉంది. బయటి పరిస్థితులను చూసిన తర్వాత కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. ఆండ్రూ తెల్లగా, నేను బ్రౌన్ కలర్లో ఉండటం వల్ల మేం ఒకే ఫ్యామిలీ కాదనుకుని విడిచిపెట్టారు. అంటే... నిత్యావసరాల కోసం కుటుంబం నుంచి ఒక్కరే బయటకు వెళ్లాలనేది రూల్. ఇలా చూస్తుండగానే మన చుట్టూ ఉన్న పరిస్థితులను కరోనా వైరస్ ఒక్కసారిగా ఎంత మార్చివేసిందో కదా అని మేమిద్దరం అనుకున్నాం’’ అని చెప్పుకొచ్చారు. -
'శ్రియా.. ప్లీజ్ అతన్ని ఇబ్బంది పెట్టకు'
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండడంతో ప్రజలంతా దాదాపు ఇళ్లకే పరిమితయిన సంగతి తెలిసిందే. ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లాక్డౌన్ నేపథ్యంలో వారు చేసే ప్రతీ పనిని వీడియోలు, ఫోటోల రూపంలో షేర్ చేస్తూ తమ అభిమానులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ శ్రియ ఈ జాబితాలో చేరారు. కాగా 2018లో శ్రియ బార్సిలోనా టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కొచ్చిన్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రియా ఆమె భర్త ఆండ్రీ కలిసి రష్యాలోనే ఉంటున్నారు. కాగా కరోనా నేపథ్యంలో వీరిద్దరు ఇంట్లోనే ఉంటూ హోమ్ క్వారంటైన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా శ్రియ భర్త ఆండ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీరిద్దరు కరోనా సూచనలు చేస్తున్న సైన్బోర్డులను షేర్ చేశాడు. 'ఇంట్లోనే ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకొండి.. సామాజిక దూరం పాటించండి' వంటి సూచనలను శ్రియ చేయగా.. ఆమె భర్త అండ్రీ మాత్రం.. 'నన్ను ఆమె బారీ నుంచి కాపాడండి.. నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంది.. ఏదో ఒక పని చేయిస్తూనే ఉంది అంటూ జాలిగా ముఖం పెట్టి నెటిజన్లను అడుగుతున్నాడు. అయితే వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ 'శ్రియా.. ప్లీజ్ ఆండ్రీకి రోజంతా పని చెప్పి మరీ ఇబ్బంది పెట్టకు' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. -
‘ఇస్త్రీ పెట్టెపై దోశలు వేసి చూపించిన నాగ్’
‘క్రికెట్లో భారతే గెలుస్తుంది.. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేము.. కానీ ‘నేనున్నాను’ సినిమా మాత్రం సూపర్‌డూపర్ హిట్ సాధిస్తుంది’అంటూ మార్చి 11, 2004న జరిగిన ‘నేనున్నాను’ ఆడియో ఫంక్షన్లో అప్పటి యువసామ్రాట్ ఇప్పటి టాలీవుడ్ కింగ్ నాగార్జున పలికిన మాటలివి. నాగార్జున సరసన శ్రియా, ఆర్తీ అగర్వాల్ నటించిన ఈ చిత్రాన్ని విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. నాగార్జున కెరీర్లో మరుపురాని మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అన్నివర్గాలను ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయిన ఈ చిత్రం అనేక సెంటర్లలో వందరోజులు దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. కామాక్షి మూవీస్‌పై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం విడుదలై నేటికి 16 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు మీకోసం.. సినిమా రిలీజ్ కంటే ముందే ఆడియోతో సెన్సేషన్ సృష్టించింది ఈ చిత్రం. ఎంఎం కీరవాణి అందించిన పాటలు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. ‘ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో’ పాట సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. వినోదం, పాటలు, ప్రేమ, ఎమోషన్ ఇలా అన్ని కలబోసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బ్రహ్మానందం, అలీ, శివారెడ్డిల కామెడీ.. నాగార్జున టైమింగ్.. శ్రియ, ఆర్తిల అభినయం.. నాగార్జున, శ్రియల కామెడీ అండ్ ఎమోషన్ సీన్స్ వావ్ అనిపించేలా ఉంటాయి. ముఖ్యంగా శ్రియ కోసం ఇస్త్రీ పెట్టెపై దోశలు వేసే సీన్ అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు లాక్డౌన్ నేపథ్యంలో కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు కదా అందరూ కలిసి మరోసారి ‘నేనున్నాను’ చూసి కుటుంబసమేతంగా ఎంజాయ్ చేయండి. -
'గాయత్రి 'ట్రైలర్ విడుదల
-
ఫిబ్రవరి 9న ‘గాయత్రి’ రిలీజ్
విలక్షణ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘గాయత్రి’. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో విష్ణు మంచు ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. విష్ణు సరసన శ్రియ నటించగా, ఇటీవలే వీరిరువురిపై కీలక సన్నివేశాలు రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. నిఖిలా విమల్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా, నిర్మాతలు ఫిబ్రవరి 9, 2018 ను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇతర ముఖ్య పాత్రలలో బ్రహ్మానందం మరియు అనసూయ భరద్వాజ్ కనిపించనున్నారు. ప్రతిష్టాత్మక 'శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్' బ్యానర్ పై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు. #GayatriOnFeb9th pic.twitter.com/49gGHPaZzo — Mohan Babu M (@themohanbabu) 14 December 2017 -
నాలుగేళ్ల తర్వాత!
శ్రియ నాలుగేళ్ల తర్వాత డ్యాన్స్ చేయబోతున్నారు. అదేంటి? ఈ నాలుగేళ్లలో ఆమె చాలా సినిమాలు చేశారు కదా. వాటిలో డ్యాన్స్ చేశారు కూడా అనుకుంటున్నారా? మరేం లేదు. స్పెషల్ సాంగ్స్‌కి ఆమె డ్యాన్స్ చేసి, నాలుగేళ్లయింది. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘నక్షత్రం’లో శ్రియ ఓ స్పెషల్ సాంగ్‌కి కాలు కదపనున్నారని టాక్. కాగా, సోమవారం సన్నీ లియోన్ని ఈ పాటకు తీసుకున్నారనే వార్త రాగా, ‘అదేం కాదు... ఓ ప్రముఖ హీరోయిన్ కోసం చూస్తున్నాం’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఆ స్టార్ ఈ స్టారే అన్నది మంగళవారం ఖబర్. దేవదాసు, మున్నా, తులసీ వంటి తెలుగు చిత్రాలతో పాటు మరికొన్ని తమిళ సినిమాల్లో శ్రియ స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించారు. చివరిగా 2013లో ‘జిల్లా గజియాబాద్’ చిత్రంలో ఆమె స్పెçషల్ సాంగ్ చేశారు. ఇప్పుడు ‘నక్షత్రం’కి చేస్తున్నారట. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - శ్రియ శరణ్
-
చారిత్రక పాత్రలో శ్రియ
బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణిలో హీరోయిన్ పాత్ర కోసం చాలా రోజులుగా వెతుకున్న చిత్రయూనిట్ ఫైనల్ గా ఓ నిర్ణయానికి వచ్చారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇంత వరకు హీరోయిన్ ఫైనల్ కాలేదు. ఐతే తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ను బాలయ్యకు జోడిగా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. చాలా కాలం క్రితం చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్యకు జోడిగా నటించిన శ్రియను గౌతమీ పుత్రశాతకర్ణి సినిమాలో బాలయ్యకు జోడిగా ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చేతిలో సినిమాలేవి లేని శ్రియ అయితే డేట్స్ సమస్య కూడా లేకుండా షూటింగ్ పూర్తి చేయొచ్చన ఆలోచనలో ఉన్నారు యూనిట్. చివరగా గోపాల గోపాల సినిమాలో నటించిన శ్రియ తరువాత మరే సినిమాను అంగీకరించలేదు. -
శ్రియ కరెక్ట్ కాదు!
చెన్నై: దృశ్యం చిత్రంలో కథానాయకి పాత్రకు శ్రియ కరెక్ట్ కాదా..? అదే అంటున్నారు ఆ చిత్ర సృష్టికర్త మలయాళ సినీ దర్శకుడు జీతూ జోసఫ్. ఆయన మలయాళంలో దర్శకత్వం వహించిన చిత్రం దృశ్యం. మోహన్‌లాల్ హీరోగా నటించారు. ఆయనకు జంటగా నటి మీనా నటించారు. ఇందులో ఆమె పాత్ర చాలా కీలకం. ముగ్గురు పిల్లల తల్లిగా పరిణితి చెందిన నటనను ప్రదర్శించి మెప్పించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. వెంకటేశ్ కథానాయకుడు. నాయిక మీనానే. అక్కడా దృశ్యం హిట్. కన్నడ,తమిళ భాషల్లోనూ పునర్నిర్మాణమై విజయతీరాలను చేరింది. పాపనాశం పేరుతో తమిళంలో విశ్వనాయకుడు కమలహాసన్ నటించారు. ఆయనకు జంటగా నటి గౌతమి నటించారు. సుదీర్ఘ విరామం తరువాత ఆమె రీఎంట్రీ అయిన చిత్రం పాపనాశం. మలయాళం చిత్రానికి దర్శకత్వం వహించిన జీతు జోసఫ్‌నే తమిళ చిత్రానికీ దర్శకత్వం వహించారు. ఇలా దక్షిణాది భాషలన్నిటిలోనూ విజయం సాధించిన దృశ్యం చిత్రాన్ని అదే పేరుతో హిందిలో రీమేక్ చేశారు.అక్కడ కమలహాసన్ పాత్రలో అజయ్ దేవ్గన్ నటించారు. ఆయన సరసన నటి శ్రియ నటించారు. హిందీలో నిషీకాంత్ కామత్ దర్శకత్వం వహించారు. అయితే దక్షిణాది నాలుగు భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దృశ్యం చిత్రం బాలీవుడ్లో బోర్లా పడింది. కారణమేమిటన్న విషయాన్ని ఒరిజినల్ దృశ్యం చిత్ర దర్శకుడు జీతు జోసఫ్ వివరిస్తూ కథకు నప్పే నటీనటుల్ని ఎంపిక చేయడం చాలా ముఖ్యం అన్నారు. దృశ్యం చిత్రానికి మలయాళం, కన్నడం, తెలుగు, తమిళం భాషలో రూపొందించినప్పుడు సరైన తారాగణాన్నిఎంపిక చేసినట్లు అన్నారు. అయితే హిందీలో అలా జరగలేదని వ్యాఖ్యానించారు. నటి శ్రియ గురించే అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.