
టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరణ్ (Shriya Saran) తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన నటించింది. ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల సినిమాల్లో ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులతో మాత్రం టచ్‌లోనే ఉంటోంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
సోషల్ మీడియా వేదికగా తన భర్త అండ్రీ కొచ్చీవ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. తనతో సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని తెలిపింది. మార్చి 19న 2017లో మొదటిసారి అతన్ని కలుసుకున్నట్లు వెల్లడించింది. అనుకోకుండా ఓ రాంగ్ ఫ్లైట్.. ఓ డైవింగ్ ట్రిప్ వల్లే మేమిద్దరం ఒక్కటయ్యామని పేర్కొంది. అసలు మా ఇద్దరికీ ఎలా కుదిరిందో ఇప్పటికీ తెలియదని.. ప్రస్తుతం ప్రతిరోజు కలిసి నడుస్తున్నామని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. 2017 నుంచి 2025 వరకు తన భర్తతో ఉన్న మధురమైన జ్ఞాపకాలను పోస్ట్ చేసింది. అలాగే తన ముద్దుల కూతురితో దిగిన ఫోటోను కూడా పంచుకుంది.
కాగా.. శ్రియ శరన్ రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడింది. ముంబైలో అతికొద్ది మంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి మనోజ్ బాజ్‌పేయి, షబానా అజ్మీలను మాత్రమే వివాహానికి హాజరయ్యారు.
.
Comments
Please login to add a commentAdd a comment