love story
-
పాకిస్తాన్ ప్రేమికురాలి కోసంసరిహద్దులు దాటిన యూపీ వాసి
లక్నో: సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆపైన ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రియుడు యూపీ వాసి కాగా ప్రియురాలు పాకిస్తానీ. ఆమెను పెళ్లి చేసుకునేందుకు దొంగచాటుగా సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లాడు. ప్రేమికురాలిని కలుసుకున్నాడు. అక్కడి పోలీసులకు దొరికిపోయి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. యూపీలోని అలీగఢ్ జిల్లా నగ్లా ఖట్కారి గ్రామానికి చెందిన ప్రియుడు బాదల్ బాబు(30) కథ ఇది. పాక్ ప్రియురాలి కోసం ఇప్పటికే ఇతడు 2024 జులైలో ఒక పర్యాయం సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించాడు. బీఎస్ఎఫ్ జవాన్లు ఖఖర్ పోస్ట్ వద్ద ఇతడిని పట్టుకుని జమ్మూకశ్మీర్ పోలీసులకు అప్పగించారు. దీంతో తిరిగి సొంతింటికే చేరాడు. తాజాగా రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. సరిహద్దులు దాటి పంజాబ్‌లోని మండి బహాఉద్దీన్ నగరంలో ప్రేమికురాలిని కలుసుకున్నాడు. అయితే, ఎలాంటి ప్రయాణ పత్రాలు, వీసా వంటివి లేకపోవడంతో డిసెంబర్ 27వతేదీన అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడిపై పారినర్స్ చట్టం కింద కేసు పెట్టారు. కోర్టు ఇతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. జనవరి 10వ తేదీన కేసు విచారణకు రానుందని పాక్ అధికారులు వెల్లడించారు. -
‘సరిహద్దులు’ దాటిన మరో ప్రేమకథ.. నూతన సంవత్సరంలో ఏమవునో..
ప్రేమ గుడ్డిదని, అది చిగురించినప్పుడు సరిహద్దులు కనిపించవని అంటారు. ఇది ‘బాబు’ ప్రేమకథతో మరోమారు నిజమని తేలింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్కు చెందిన బాబు తాను ప్రేమించిన పాక్ యువతి కోసం సరిహద్దులు దాటి, తన ప్రాణాలనే పణంగా పెట్టాడు.బాబు సోషల్ మీడియా(Social media)లో చూసి, ఒక పాక్ యువతిని ప్రేమించాడు. తొలి చూపులోనే ప్రేమలో పడిన బాబు ఆ యువతి కోసం వీసా, పాస్‌పోర్టు లేకుండా దేశ సరిహద్దులు దాటేశాడు. ప్రస్తుతం బాబు పాకిస్తాన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆ ప్రేమికుని అసలు పేరు బాదల్, అయితే బాబు అని ముద్దుగా ఇంట్లోనివారు పిలుస్తుంటారు. ఇప్పుడు అతని కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాబును సురక్షితంగా భారత్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు.అలీగఢ్ జిల్లా బార్లా పోలీస్ స్టేషన్(Police station) పరిధిలోని నాగ్లా ఖిత్కారీ గ్రామానికి చెందిన బాదల్ అలియాస్ బాబు(30) సోషల్ మీడియాలో చూసి, ఒక పాక్ యువతి ప్రేమలో పడ్డాడు. ఈ ప్రేమలో బాబు ఎంతగా మునిగిపోయాడంటే.. వెంటనే ఇంటిని వదిలి పాకిస్తాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సరైన వీసా, పత్రాలు లేకుండా సరిహద్దులు దాటాడు. పాకిస్తాన్‌లోని మోజా మోంగ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన బాబును పాక్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన 2024, డిసెంబర్ 27న జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ పోలీసుల విచారణలో బాదల్ తాను సోషల్ మీడియా ద్వారా పాకిస్తానీ యువతి ప్రేమలో పడ్డానని, ఆమెను కలిసేందుకే పాకిస్తాన్ వచ్చానని చెప్పాడని సమాచారం.బాదల్ ఢిల్లీలోని గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కుటుంబంలోని ముగ్గురు సోదరులలో అతను రెండవవాడు. బాబు ఓ పాకిస్తానీ యువతితో ఫేస్బుక్లో చాట్ చేస్తుంటాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీపావళికి ముందు బాబు ఇంటికి వచ్చాడని, తిరిగి ఢిల్లీకి వెళ్లే ముందు తన గుర్తింపు కార్డు(Identity card), ఇతర పత్రాలను ఇంట్లో పెట్టి వెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పటి నుంచి బాబుకు సంబంధించిన సరైన సమచారం అందలేదన్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం పాకిస్తాన్ పోలీసులు.. బాబును వీసా, ఇతర పత్రాలు అడిగినప్పుడు, అతను ఏమీ చూపించలేదు. దీంతో అతను పాకిస్తాన్ ఫారినర్స్ యాక్ట్, 1946 సెక్షన్ 13, 14 కింద అరెస్టయ్యాడు. కాగా బాబు గతంలో రెండుసార్లు భారత్-పాక్ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించాడని, అయితే అతని ప్రయత్నం సఫలం కాలేదని పాక్ పోలీసులు చెబుతున్నారు.బహౌద్దీన్ ప్రాంతంలో పట్టుబడిన బాబును అక్కడి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అక్కడ అతనికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. బాబు పాక్‌లోకి ప్రవేశించడం ప్రేమ కోసమేనా లేదా మరేదైనా ఉద్దేశ్యం ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ నుంచి కానీ, భారత రాయబార కార్యాలయం నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ నూతన సంవత్సరంలోనైనా తమ బాబు తమ ఇంటికి వస్తాడని అతని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.ఇది కూడా చదవండి: ఆలయాల్లో నూతన సంవత్సర సందడి -
OTT: జీవితం అర్థం చెప్పే ప్రేమకథ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘కథా ఇన్నూవరే’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ప్రేమ..ఈ భావం మనిషికి మనసుకి ఓ మధురానుభూతి. మనిషి పుట్టుక నుండి గిట్టే వరకు ఈ ప్రేమ ప్రతి దశలోనూ ఉంటుంది. ఆ మహత్తరమైన ప్రేమను వెండితెరకు తీసుకురావడానికి తరతరాలుగా ఎంతో మంది దర్శకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే దర్శకుడు విష్ణుమోహన్ ఓ చక్కటి ప్రేమ పంధాను ఈ సినిమాకోసం ఎంచుకున్నారు. మళయాళ దర్శకుడైన విష్ణుమోహన్ సినిమాలన్నీ చాలా వరకు సున్నితమైన భావావేశాలతో రూపొందించబడ్డాయి. అటువంటి కోవలోనే ప్రస్తుతం ఈ సినిమా కథా ఇన్నూవరే కూడా తీశారు. ఓ నాలుగు ప్రేమ కథలు ఒకే కథగా కథా ఇన్నూవరే..(ఇప్పటి వరకు కథ) సినిమాలో చూపించడానికి ప్రయత్నించాడు దర్శకుడు విష్ణుమోహన్. 2018 సంవత్సరంలో ప్రముఖ హీరో రాణా నిర్మాతగా తెలుగులో ఓ సినిమా తీశారు. దాని పేరే C/o కంచరపాళెం. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ఆ సంవత్సరం న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అఫీషియల్ గా నామినేట్ అయింది. ఈ సినిమా రీమేకే ఇప్పటి కథా ఇన్నూవరే. ఇక కథ విషయానికొస్తే కొంచెం లేటు వయస్సులో ఉన్న రామచంద్ర తాను ఫ్యూను గా పనిచేస్తున్న ఆఫీసులో ఆఫీసరైన జానకి ప్రేమలో పడతాడు. జానకి కి 20 సంవత్సరాల కూతురు ఉంటుంది. ఇంకో పక్క కాలేజీలో చదువుకునే ఉమ కమ్యూనిస్ట్ ఉద్యమం కోసం పని చేసే జోసెఫ్ ని ఇష్టపడుతుంది. ఉమ తండ్రికి ఈ విషయం అస్సలు నచ్చదు. మరో పక్క నశీమా అనే వేశ్యను లిక్కర్ షాపులో పని చేసే రామచంద్రన్ ప్రేమిస్తుంటాడు. ఈ మూడు కథలతో పాటు బొమ్మలు తయారు చేసే ఓ శిల్పి కొడుకు స్కూల్ లో మరో అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. ఈ నాలుగు ప్రేమ కథలు ఒకదానికొకటి అస్సలు సంబంధముండదు. అయితే వాటిని లింక్ చేసేది మాత్రం ప్రేమే. అలాగే ఈ సినిమాలో ఆఖర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం సినిమాకే హైలైట్. మామూలుగా అయితే ప్రేమ కథలను చూసి అనుభూతి పొందుతాం. కాని ఈ సినిమాలో ప్రేమ మాత్రం జీవితానికి అర్ధం చెప్తుంది. ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా కథా ఇన్నూవరే స్ట్రీమ్ అవుతోంది. వర్త్ ఫుల్ మూవీ ఫర్ ఎ ఫీల్ గుడ్ వ్యూవర్స్.-ఇంటూరు హరికృష్ణ -
Atal Bihari Vajpayee: చదవని ప్రేమలేఖ
అటల్ బిహారీ వాజ్‌పేయి అవివాహితునిగా మిగిలిపోవడం వెనక ఆసక్తికరమైన కథ ఉంది. కాలేజీ రోజుల్లోనే ఆయన మనసు దోచిన రాజ్‌కుమారీ హస్కర్ అనే మహిళ దూరమవడంతో పెళ్లి చాప్టర్‌కు దూరమయ్యారు. ఏక్ నిరంజన్‌లా ఉండిపోయారు.ఎవరీ హస్కర్? కశ్మీర్ పండిట్ల కుటుంబానికి రాజ్‌కుమారీ హస్కర్ వాజ్‌పేయికి కాలేజీ రోజుల్లో సహాధ్యాయి. ఇందిరాగాందీకి దూరపు బంధువంటారు. పలు కార్యక్రమాల్లో కలిసి పని చేసే క్రమంలో మొదలైన స్నేహం ప్రేమగా మారింది. కానీ ఎవరూ దాన్ని బయటపెట్టలేదు. వాజ్‌పేయి ఆమెకు ప్రేమలేఖ రాసినా నేరుగా ఇవ్వకుండా గ్రంథాలయంలో ఆమె చదివే అవకాశమున్న ఓ పుస్తకంలో పెట్టారు. అయితే హస్కర్ ఆ పుస్తకాన్ని చదవలేదు. అలా వాజ్‌పేయి ప్రేమలేఖ ఆమెకు అందనే లేదు. రాజకీయాలు చేసే వ్యక్తికి కూతురును ఇవ్వడం హస్కర్ తండ్రికీ ఇష్టం లేకపోయింది. దాంతో బ్రిజ్ నారాయణ్ కౌల్ అనే ప్రొఫెసర్‌తో ఆమె వివాహం జరిగిపోయింది. అలా హస్కర్ శ్రీమతి కౌల్గా మారి వాజ్‌పేయి జీవితం నుంచి అదృశ్యమైంది. వాజ్‌పేయి కూడా ప్రేమ సంగతి మర్చిపోయి క్రియాశీల రాజకీయాల్లో మునిగిపోయారు.16 ఏళ్ల తర్వాత దాదాపు 16 ఏళ్ల తర్వాత వాజ్‌పేయి, శ్రీమతి కౌల్ ఓ కాలేజీ ఫంక్షన్లో అనుకోకుండా పరస్పరం తారసపడ్డారు. ఢిల్లీలో తన భర్త పని చేసే కాలేజీలో కీలకోపన్యాసం సందర్భంగా అక్కడ కౌల్‌ను చూసి వాజ్‌పేయి నిశ్చేషు్టలయ్యారు. తర్వాత కౌల్ దంపతులతో ఆయన అనుబంధం బలపడింది. వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా ఉండగా కౌల్ దంపతులు కూడా తమ కూతురు నమితతో కలిసి ఆయన ఇంటికి మారిపోయారు. దాంతో వారి బంధంపై ఢిల్లీ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. భావ సారుప్యత ఉన్న కౌల్‌ను వాజ్‌పేయీ పెళ్లాడితే మంచిదని సన్నిహితులు, రాజకీయ నేతలు, ఆర్ఎస్ఎస్ వర్గాలు చెప్పినా ఆయన కొట్టిపారేశారంటారు. ‘‘దీనిపై చర్చ అనవసరం. నేను పెళ్లీడు వయసులో ఉండగా ఆదర్శవంతమైన భార్య కోసం అన్వేషణ మొదలెట్టాను. దొరికినా దురదృష్టవశాత్తు ఆమె తండ్రి తనకు అనువైన ఆదర్శ భర్త కోసం వెతికారు’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వాజ్‌పేయిలోని ఈ కోణాన్ని జాతీయ మీడియా ఎప్పుడూ పతాక శీర్షికలకు ఎక్కించలేదు. కౌల్ కూతురు నమితను వాజ్‌పేయి తన కన్నకూతురిలా చూసుకున్నారు. తర్వాత దత్తత తీసుకున్నారు. వాజ్‌పేయి అంత్యక్రియలను నమిత, ఆమె కూతురు నీహారిక దగ్గరుండి జరిపించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంటర్మీడియట్ ప్రేమను రివీల్ చేసి షాక్ ఇచ్చిన రాజమౌళి
-
నాగ చైతన్య... శోభితా లవ్ స్టోరీ..
-
సినిమా కథలా జాకీర్ హస్సేన్ ప్రేమ వివాహం
ప్రముఖ తబలా విద్వాంసుడు, సంగీత స్వరకర్త జాకీర్ హుస్సేన్(73) కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తన ఏడేళ్ల వయసులోనే జాకీర్ హుస్సేన్ తబలా వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు. అభిమానులు, శ్రేయోభిలాషులకు జాకీర్ హుస్సేన్ వృత్తిపరమైన విజయాల గురించి తెలుసుకానీ, అతని వ్యక్తిగత వివరాలు అంతగా తెలియదు. జాకీర్ హుస్సేన్ ప్రేమకథ సినిమా స్టోరీని తలపిస్తుంది.జాకీర్ హుస్సేన్ కథక్ నర్తకి ఆంటోనియా మిన్నెకోలాను వివాహం చేసుకున్నారు. ఆమె అతనికి మేనేజర్‌గా వ్యవహరించారు. జాకీర్ హుస్సేన్, ఆంటోనియా మిన్నెకోలాలకు 1978లో వివాహం జరిగింది. వీరికి అనిసా ఖురేషి, ఇసాబెల్లా ఖురేషి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. జాకీర్ హుస్సేన్, ఆంటోనియాలు తొలిసారిగా 70వ దశకం చివరలో కాలిఫోర్నియాలోని బే ఏరియాలో తబలా, కథక్‌లలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు కలుసుకున్నారు.జాకీర్ మొదటి చూపులోనే ఆంటోనియాను ఇష్టపడ్డారు. క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. కానీ ఆంటోనియా మిన్నెకోలా.. జాకీర్ హుస్సేన్‌ను ప్రేమించే విషయంలో వెనుకాడారు. అయితే జాకీర్ ఆమె కోసం ప్రతిరోజూ తరగతి గది బయట వేచి ఉండేవాడు. జాకీర్, ఆంటోనియాలు ఎనిమిదేళ్లు స్నేహం కొనసాగించిన అనంతర వివాహం చేసుకున్నారు. దీనికి ముందు కొంతకాలంపాటు డేటింగ్ చేశారు. ఈ విషయంలో ఇరుకుటుంబాల వారికి తెలుసు.ఆ సమయంలో జాకీర్‌కు సరైన ఆదాయం లేకపోవడంతో ఆంటోనియా తండ్రి ఈ వివాహానికి అభ్యంతరం తెలిపారు. ఇదిలా కొనసాగుతుండగానే జాకీర్, ఆంటోనియాలు 1979లో పెళ్లి చేసుకున్నారు. జాకీర్ ఒక ఇంటర్య్యూలో తాను తన కుటుంబంలోనివారికి భిన్నంగా మతాంతర వివాహంచేసుకున్నానని తెలిపారు. ఆంటోనియాను తాను వివాహం చేసుకుంటానంటే తన తల్లి అందుకు నిరాకరించారని, అయితే తన తండ్రి తమ రహస్య వివాహానికి సహకరించారని జాకీర్ వివరించారు. తరువాతి కాలంలో తన తల్లి ఆంటోనియాను కోడలిగా అంగీకరించారని తెలిపారు.జాకీర్ హుస్సేన్, ఆంటోనియా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఆంటోనియా అమెరికాలో ఉంటూ తమ కుమార్తెలను చూసుకుంటున్నారని గతంలో జాకీర్ తెలిపారు. జాకీర్ కెరియర్ కోసం, ఆయనకు అన్ని విషయాల్లో సహాయం అందించేందుకు ఆంటోనియా తన కెరియర్ను వదులుకున్నారు. జాకీర్ విదేశాలకు వెళ్లేటప్పుడు భావోద్వేగాలకు లోనయ్యేవారని ఆంటోనియా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. భార్యాభర్తలుగా తామిద్దరం ఒకరి ఆచార వ్యవహారాలను, కుటుంబ విలువలను పరస్పరం గౌరవించుకుంటూ మెలుగుతున్నామని, తమ పిల్లలకు కూడా సదాచార లక్షణాలు నేర్పించామని ఆంటోనియా పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎప్పటికీ గుర్తుండే 10 రాజకీయ ఘటనలు -
ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథ
ప్రేమ కథ అన్నారు.. పులి బొమ్మ వేశారేంటనేగా మీ డౌటు.. ఏం.. మనుషులకేనా ప్రేమ కథలు.. పులులకుండవా.. ఇది జానీగాడి ప్రేమ కథ.. లవర్ కోసం వందల కిలోమీటర్లు వాకింగ్ చేసొచ్చిన ఓ పెద్ద పులి కథ.. కట్ చేస్తే.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం.. జానీ ఉండేది ఇక్కడే. గత నెల్లో ఒకానొక శుభముహూర్తాన మనోడికి ‘ప్రేమ’లో పడాలనిపించింది. తీరా చూస్తే.. తనకు ఈడైన జోడు అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో తోడు కోసం తన ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాడు. వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ.. ఏకంగా 200 కిలోమీటర్లు నడిచి మన రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా అడవుల్లోకి వచ్చేశాడు.అక్టోబర్ 25న నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి ప్రాంతంలోకి వచ్చిన జానీ.. ఎక్కడా కుదురుగా ఉండటం లేదు. ఓసారి వెనక్కి మహారాష్ట్ర సరిహద్దు దాకా వెళ్లాడు.. మళ్లా తిరిగొచ్చాడు. రోజుకో మండలమన్నట్లు తిరుగుతూనే ఉన్నాడు. ఈ నెల 10వ తేదీనైతే.. రాత్రిపూట మహబూబ్ ఘాట్ రోడ్డుపై కనిపించి అందరికీ కంగారు పెట్టించేశాడు. పెద్ద పులంటే మాటలా మరి.. మంగళవారం మామడ–పెంబి అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడిచేసి చంపేశాడు. ప్రస్తుతం జానీ అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. తన తోడు కోసం.. గూడు కోసం.. ఇంతకీ అటవీ అధికారులేమంటున్నారు? మిగతా క్రూర జంతువులతో పోలిస్తే పులులు కొంచెం డిఫరెంటుగానే ఉంటాయట. మేటింగ్ సీజన్లో తగిన తోడు, గూడు దొరికేదాకా ఎంత దూరమైనా వెళ్తాయట. ఇప్పటివరకూ జానీ.. 500 కిలోమీటర్ల దూరం నడిచాడట. నిర్మల్– ఆదిలాబాద్ మధ్య దట్టమైన అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు ఉండటంతో ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాడట. ఇలా వచ్చిన పులులను సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని.. ‘జానీ’ అనే ఈ పులి ఎటువైపు వెళ్తుందో గమనిస్తూ ఆయా ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నామని, పులి సంరక్షణకు సంబంధించిన సూచనలు చేస్తున్నామని నిర్మల్ డీఎఫ్‌వో నాగిని భాను తెలిపారు. చదవండి: ‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం... భూమాతకు తీరని శోకం! -
'ప్రతి రోజు ఐదు లవ్ లెటర్స్'.. ప్రేమకథ పంచుకున్న స్టార్ నటుడి భార్య!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి తెలుగువారికి చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించారు. మాలీవుడ్ స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తెలుగులోనూ అంతే ఫేమల్ అయ్యారు. ప్రస్తుతం మంచువిష్ణు కన్నప్ప, ఎంపురన్ చిత్రాల్లో నటిస్తున్నారు.అయితే గతంలో మోహన్ లాల్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన భార్య సుచిత్ర వీరిద్దరి ప్రేమాయణం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తానే మోహన్ లాల్‌కు ప్రేమలేఖలు రాసేదాన్ని అని తెలిపింది. అదేపనిగా లవ్ లెటర్స్ రాస్తూ విసిగించేదాన్ని అంటూ తమ ప్రేమకథను వివరించింది.సుచిత్ర మాట్లాడుతూ..'నేను ఫస్ట్ టైమ్ త్రివేండ్రంలో అతన్ని కలిశా. అంతకు ముందు కేవలం సినిమాల్లో మాత్రమే చూసేదాన్ని. దగ్గర నుంచి చూడడం అదే మొదటిసారి. మా కుటుంబాలకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని బంధువుల పెళ్లిలో నాకు తెలిసింది. నేను కోజికోడ్‌లో ఉన్నప్పుడు సెలవుల్లో అతని సినిమాలను థియేటర్లలో చూసేదాన్ని. ఆయన మొదటి సినిమా మజిల్ విరింజ పుక్కల్ చూసినప్పుడు ఆయనపై ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. కానీ ఆయన టాలెంట్‌ను గుర్తించి ప్రేమించడం మొదలుపెట్టా' అని తెలిపింది.'ఆ తర్వాత నా పేరు రాయకుండా ఆయనకు లేఖలు రాయడం ప్రారంభించా. ప్రతి రోజు ఐదు రాసి పంపించాను. ఆయన అడ్రస్ తెలుసుకుని మరీ లెటర్స్ రాశా. నా ప్రేమలేఖలతోనే ఓ రేంజ్లో వేధించా. మా ఇంట్లో ఉన్నప్పుడు అతన్ని సుందర కుట్టప్పన్ (అందమైన అబ్బాయి) అనే నిక్‌నేమ్‌తో పిలిచేదాన్ని. ఆ తర్వాత మా అమ్మ, నాన్నకు మోహన్‌లాల్ గురించి చెప్పా. వెంటనే నా ప్రేమను అంగీకరించి తెలిసినవాళ్లతో మాట్లాడి మా పెళ్లి చేశారు' తమ లవ్‌స్టోరీని గుర్తుచేసుకున్నారు. కాగా.. మోహన్ లాల్, సుచిత్ర వివాహం 1988లోనే జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. -
‘తను నా కోసమే పుట్టిందనిపించింది’
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల తన భార్య గ్రేసియా మునోజ్‌తో కలిసి ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, తన భార్య, రచయిత్రి సుధా మూర్తితో వేదిక పంచుకున్నారు. దీపిందర్ తన భార్యను ముందుగా ఎలా కలుసుకున్నారో ఈ కార్యక్రమంలో తెలిపారు.‘గ్రేసియాను కలవడానికి ముందు చాలా కాలంపాటు ఒంటరిగా ఉన్నాను. స్నేహితులను తరచు కలుస్తుండేవాడిని. అందులో ఒక స్నేహితుడు పెళ్లి చేసుకోకూడదని సలహా ఇచ్చాడు. ఇంకో స్నేహితుడు మాత్రం నాకు గ్రేసియాను పరిచయం చేశాడు. ఆ సమయంలో తాను నాకోసమే పుట్టిందనిపించింది. చాలా కొద్ది కాలంలోనే మేం కలిపిపోయాం’ అని చెప్పారు. మెక్సికోకు చెందిన గ్రేసియాను కపిల్ భారతీయ వంటకాల గురించి అడిగారు. పంజాబీ వంటకాలకు ప్రాధాన్యతనిస్తానని ఆమె చెప్పారు. ‘ఛోలే భతుర్’ తన ఫేవరెట్ డిష్ అని తెలిపారు. ఇంట్లో ‘పంజాబీ రసోయి’ తయారు చేసుకుంటారా అని కపిల్ అడిగినప్పుడు, తాము జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికే ఇష్టపడుతామని చెప్పారు.ఇదీ చదవండి: ఒకే సంస్థ.. ఒకే హోదా.. రిటైర్మెంట్ వయసులో తేడా!గ్రేసియా మునోజ్ మోడలింగ్, లగ్జరీ ఫ్యాషన్‌లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. 2022లో యునైటెడ్ స్టేట్స్లో మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ అవార్డును అందుకున్నారు. పిల్లల పోషణ, మహిళల సాధికారతపై దృష్టి సారించి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీపిందర్, గ్రేసియా ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది దీపిందర్‌కు రెండో వివాహం. అతను గతంలో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ కంచన్ జోషిని వివాహం చేసుకున్నారు. -
నీతా.. నిన్నే పెళ్లాడుతా! ట్రాఫిక్ సిగ్నల్‌లో ప్రపోజ్
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ జీవిత భాగస్వామి నీతా అంబానీ తన 60వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో ఎంతో ముఖ్యమైన ముఖేష్ అంబానీతో ప్రేమ కథ ఎలా ప్రారంభమైందో ఈ కథనంలో తెలుసుకుందాం..ధీరూభాయ్‌ని మెప్పించి..ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ.. నీతా హుందాతనం, ప్రతిభను చూసి తన కోడలుగా ఎంచుకున్నారు. ఓసారి నీతా భరతనాట్యం ప్రదర్శనను తిలకించిన ధీరూభాయ్ తన కొడుకు ముఖేష్ ఆమే సరిజోడని భావించారు. వారిద్దరికీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది వారి మధ్య స్నేహాన్ని క్రమంగా పెంచింది.చెబితేనే కారు కదిలేది..మీడియా నివేదికల ప్రకారం.. ఒకరోజు ముఖేష్ అంబానీ, నీతాతో కలిసి కారులో వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపి నీతా వైపు తిరిగి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగారు. నిశ్చేష్టురాలైన ఆమె ఆశ్చర్యంతో ఏమీ చెప్పలేక కొద్దిసేపు అలాగే ఉండిపోయింది. సమాధానం చెప్పే వరకూ కారు కదలదని ముఖేష్ అంబానీ చెప్పారు. దీంతో తరువాత ఆమె అంగీకరించారు. అలా వారు కలిసి జీవితాన్ని ప్రారంభించారు. -
కాకినాడ జిల్లాలో ప్రియురాలి మృతికి కారణమైన ప్రియుడు
-
అసలు వీరిద్దరి మధ్య లవ్ స్టోరి ఎప్పుడు స్టార్ట్ అయింది?
-
బుమ్రా లవ్ జర్నీ ఎలా మొదలైందంటే..
-
సినిమా రేంజ్ ట్విస్ట్ స్క్రీన్ షార్ట్స్ బయటపెట్టిన లావణ్య
-
రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. లావణ్య సంచలనం
-
కీలక ఆధారాలతో మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న రాజ్ తరుణ్ లవర్
-
ఇంటర్మీడియట్ లవ్ స్టోరీ.. ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటోన్న ట్రైలర్!
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటిస్తున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాను శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో తెరకెక్కించారు. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ సూపర్బ్ అంటూ సినీ ప్రియులు, నెటిజన్స్ నుంచి కామెంట్స్ చేస్తున్నారు. తమ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడం పట్ల మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రం ఈనెల 21న థియేటర్లలో సందడి చేయనుంది. -
అతన్ని సాధారణ మనిషిలాగే భావించా..చూడగానే ప్రేమ పుట్టలేదు: తాప్సీ
తమిళసినిమా: ఒకరిపై ప్రేమ కలగడానికి సరైన నిర్వచనం ఉండదు. కొందరు చూడగానే నచ్చేస్తారు. మరి కొందరు వారి ప్రవర్తన కారణంగా ప్రేమించబడతారు. మరొకరు ఒకరినొకరు అర్థం చేసుకున్న తరువాత ప్రేమలో పడతారు. ఇలా ప్రేమలో చాలా కోణాలు ఉంటాయి. కాగా తాప్సీ ఎలా ప్రేమలో పడ్డారో చూద్దాం. ఢిల్లీలో పుట్టి పెరిగన బ్యూటీ తాప్సీ. తొలుత బాలీవుడ్లో నటిగా పరిచయమైన, పాపులరైంది మాత్రం దక్షిణాది చిత్రాలతోనే. తెలుగులో జుమ్మందినాథం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ, తమిళంలోకి ఆడుగళం చిత్రంతో దిగుమతయ్యారు. ఈ చిత్రం జాతీయ స్థాయిలో అవార్డులను గెలుచుకుంది. అయితే తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా స్టార్ హీరోలతో జతకట్టి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత హిందీలో అవకాశాలు రావడంతో అక్కడే ఎక్కువగా దృష్టి పెట్టారు. హిందీలో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. కాగా ఈమె డెన్మార్క్‌కు చెందిన మాథియస్ బో అనే బ్యాడ్మింటన్ క్రీడాకారుడితో ప్రేమలో మునిగి తేలుతున్నారు. పెళ్లికి మాత్రం ఇంకా చాలా టైమ్ ఉందంటున్న చెబుతూ వచ్చిన తాప్సీ సమీప కాలంలో రహస్యంగా ప్రియుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. కాగా తన ప్రేమ అనుభవాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలుపుతూ తనకు మాథియస్ను చూడగానే, ఒక నెల తరువాతనో ప్రేమ పుట్టలేదన్నారు. ఆయన్ని చూడగానే గౌరవం ఏర్పడిందన్నారు. ఆయన్ని ఒక సాధారణ మనిషిగానే భావించానని చెప్పారు. ఆ తరువాత తరచూ కలుసుకునేవారిమని చెప్పారు. అలా ఆయన్ని ప్రేమించడం మొదలెట్టానని, అయితే వెంటనే మాథి యస్ బోకు తన ప్రేమను వ్యక్తం చేయలేదని, అందుకు చాలా కాలం తీసుకున్నానని చెప్పారు. ప్రేమ పెళ్లి విధానం వర్కౌట్ అవుతుందా? అని కూడా ఆలోచించడానికి కొంత సమయం తీసుకున్నానని చెప్పా రు. చివరికి తనకు కావలసిన వ్యక్తిని కనుగొన్నానన్న భావన కలగడంతో ఇద్దరం ప్రేమించుకోవడం మొదలెట్టామని తాప్సీ పేర్కొన్నారు. -
నటి హేమ లవ్ స్టోరీ.. ఇంతకీ భర్త ఎవరో తెలుసా?
ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్‌ను కుదిపేసింది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. అయితే ఈ పార్టీకి టాలీవుడ్ నటి హేమ హాజరైనట్లు బెంగళూరు పోలీసులు ఫోటోను కూడా రిలీజ్ చేశారు. మొదటి తాను పార్టీలో లేనంటూ వీడియో రిలీజ్ చేసినప్పటికీ ఆ తర్వాత హేమకు పాజిటివ్‌గా వచ్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు.ఇదంతా పక్కనపెడితే.. టాలీవుడ్లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందలకు పైగా సినిమాల్లో నటించింది. విభిన్నమైన పాత్రలతో వెండితెరపై అలరించింది. ఇటీవల రేవ్ పార్టీలో హేమ పేరు రావడంతో ఆమె గురించి నెట్టింట చర్చ మొదలైంది. హేమ ఫ్యామిలీకి సంబంధించిన వివరాల గురించి ఆరా తీస్తున్నారు. అయితే హేమ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఇంతకీ అతనెవరో తెలుసా? ఆ వివరాలేంటో చూసేద్దాం.నటి హేమ లవ్ స్టోరీతూర్పుగోదావరి జిల్లా రాజోలుకి చెందిన హేమ అసలు పేరు కృష్ణవేణి. తెలుగులో 1989లో బలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అయితే హేమకి ఫేమ్ తీసుకొచ్చిన చిత్రం క్షణక్షణం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హేమ.. శ్రీదేవికి స్నేహితురాలిగా కనిపించారు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హేమకి మంచి గుర్తింపు దక్కింది.ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే ప్రేమ పెళ్లి చేసుకున్నారు హేమ. ఆమె భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్ కాగా.. గతంలో ఓ ఇంటర్య్వూలో తన లవ్ స్టోరీ గురించి నోరువిప్పింది. తాను దూరదర్శన్‌లో పనిచేసే సమయంలో అతను పరిచయమైనట్లు హేమ తెలిపింది. అక్కడే అతను అసిస్టెంట్ కెమెరా మెన్‌గా పనిచేసేవారని వెల్లడించింది. ఓసారి అతన్ని మొదటిసారి కలిసినప్పుడే పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడని పేర్కొంది. మొదటిసారి కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కాదనలేకపోయానని హేమ వివరించింది. కాగా.. వీరిద్దరికీ ఈషా అనే కూతురు కూడా ఉంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో హేమ పేరు బయటకొచ్చిన సంగతి తెలిసిందే. -
Sunil Chhetri Love Story: ‘చిన్నపిల్లవి చదువుకో అని చెప్పాను.. కానీ నా మనసే వినలేదు’
భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి 39 ఏళ్ల వయసులో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఈ మేరకు .. గురువారం (మే 16) ప్రకటన విడుదల చేశాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్లో సునిల్ ఛెత్రి మొత్తంగా 150 మ్యాచ్‌లలో 94 గోల్స్ సాధించాడు. భారత ఫుట్‌బాల్ కెప్టెన్‌గానూ సునిల్ ఛెత్రి సేవలు అందించాడు.సునిల్ ఛెత్రి వ్యక్తిగత జీవితం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. అతడి లవ్‌స్టోరీ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. సునిల్ ఛెత్రి తన కోచ్, భారత మాజీ ఆటగాడు సుబ్రతా భట్టాచార్య కుమార్తె సోనం భట్టాచార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన ప్రేమ కథ గురించి సునిల్ ఛెత్రి గతంలో హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘నాకు అప్పుడు 18 ఏళ్లు. ఆమెకు 15 ఏళ్లు. వాళ్ల నాన్న గురించి అందరితో గొప్పగా చెప్పేవారు.ఆమె వాళ్ల నాన్న దగ్గరి నుంచి నా నా నెంబర్ దొంగతనం చేసి.. నాకు మెసేజ్‌లు పంపేది. ‘నేను సోనం.. నేను మీకు వీరాభిమానిని. మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను’ అని సందేశాలు పంపించేది.నాకు మాత్రం అప్పటికి తనెవరో తెలియదు. అయితే, ఆమె మాట్లాడే విధానం నచ్చి ఓ రోజు తనను కలవాలని నిర్ణయించుకున్నా. తనని చూడగానే ఇంత చిన్నపిల్లా నాకు మెసేజ్‌లు పంపేది అనుకున్నా. ‘నువ్వింకా చిన్నదానివి. వెళ్లి బుద్ధిగా చదువుకో’ అని చెప్పి వెళ్లిపోయా.అయితే, తన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం మాత్రం మానలేకపోయా. రెండున్నర నెలల తర్వాత మా కోచ్ ఫోన్ పనిచేయడం లేదని.. ప్రాబ్లం ఏమిటో చూడాలని నాకు ఇచ్చారు. అప్పుడు మా కోచ్ వాళ్ల కూతురి నంబర్, నాకు మెసేజ్‌లు చేసే అమ్మాయి నంబర్ ఒకేలా అనిపించింది.అప్పుడే నాకు అర్థమైంది తను మరెవరో కాదు మా కోచ్ కూతురేనని! వెంటనే సోనంకు కాల్ చేసి.. ఈ విషయం గురించి మీనాన్నకు తెలిస్తే నా కెరీర్ ముగిసిపోతుంది. ఇక చాలు అని చెప్పేశా.అప్పుడు సోనం నాకు సారీ చెప్పింది. అయితే, విధి రాత మరోలా ఉంది. తను నా మనసులో అలాగే ఉండిపోయింది. ఆమెతో మాట్లాడాలని, మెసేజ్ చేయాలని మా మనసు తహతహలాడేది. సీక్రెట్‌గా కలిసేవాళ్లం. నా బిజీ షెడ్యూల్ కారణంగా ఏడాదిలో రెండు మూడుసార్లు మాత్రమే నేరుగా కలిసేందుకు వీలయ్యేది.సినిమాకు వెళ్లి రెండు టికెట్లు కొని.. ఒకటి తనకోసం కౌంటర్ దగ్గరే వదిలేసి వెళ్తే తను వచ్చి తీసుకునేది. చాలా ఏళ్లపాటు అలాగే ప్రేమలో మునిగితేలాం.నా కెరీర్‌తో పాటు మా ప్రేమ కూడా ట్రాక్‌లో పడింది. సరైన వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.ఈ విషయం గురించి మా కోచ్‌తో మాట్లాడాలని నిర్ణయించుకున్నా. కానీ ధైర్యం చాల్లేదు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని ‘సర్.. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా’ అని చెప్పాను. ఆయన వెంటనే అవునా.. సరే అంటూ వాష్‌రూంలోకి వెళ్లిపోయారు. కాసేపటికి వచ్చి మాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు.ఆతర్వాత కొన్ని నెలలకు మా పెళ్లి జరిగింది. 13 ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. తనే నా ధైర్యం.సపోర్ట్ సిస్టం. ప్రతి అడుగులోనూ నా వెంటే ఉంటుంది. తను లేకుంటే నేను లేను. ఇప్పటికీ తను నాకు వీరాభిమానే!’’ అని సునిల్ ఛెత్రి తెలిపాడు. కాగా సునిల్- సోనం జంటకు 2023లో కుమారుడు జన్మించాడు. -
సుశీల్ మోదీ లవ్ స్టోరీ.. రైలులో మొదలై..
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన సుశీల్ మోదీ జీవితంలో అనేక మరపురాని ఘట్టాలు ఉన్నాయి. వాటిలో ఒకటే ఆయన లవ్ స్టోరీ. తొలి చూపులోనే జెస్సీతో ప్రేమలో పడిన ఆయన దానిని పెళ్లి వరకూ ఎలా తీసుకువెళ్లారంటే..సుశీల్ మోదీ, జెస్సీ జార్జ్ల ప్రేమ కథ సినిమాను తలపిస్తుంది. రైలు ప్రయాణంలో తొలిసారిగా సుశీల్ మోదీ, జెస్సీ జార్జ్ ఒకరినొకరు చూసుకున్నారు. తరువాత మాట్లాడుకున్నారు. తరువాతి కాలంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. కలిసి జీవించాలనుకుని ప్రమాణం చేసుకున్నారు. అయితే వారుంటున్న పరిస్థితుల్లో వారికి సంప్రదాయాల అడ్డుగోడ దాటడం చాలా కష్టంగా మారింది.ఆ సమయంలో సుశీల్ మోదీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో సభ్యునిగా ఉండేవారు. అయితే జెస్సీ జార్జ్ రాజకీయాలకు దూరంగా మెలిగేవారు. ఆమె కేరళలోని ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగారు. దీంతో విరిద్దరి మధ్య భాషతో పాటు మతపరమైన అడ్డంకి కూడా ఉంది. అయినా సుశీల్ మోదీ జెస్సీ జార్జ్ల ప్రేమ కథ విజయవంతంగా ముందుకు సాగింది.40 ఏళ్ల క్రితం నాటి వీరి ప్రేమ కథ గురించి సుశీల్ మోదీ స్నేహితుడు సరయూ రాయ్ ఒకప్పుడు మీడియాకు తెలిపారు. విద్యార్థి పరిషత్ పనుల మీద సుశీల్ తరచూ రైలు ప్రయాణాలు చేసేవారు. ఆ సమయంలో ఆయన జెస్సీని రైలులో కలుసుకున్నారు. తరువాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రేమ గురించి ఇరు కుటుంబాల సభ్యులకు తెలియగానే వారు కోపంతో రగిలిపోయారు. అయితే ఆ జంట తమ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు.చివరికి పెద్దలు ఒప్పుకోవడంతో సుశీల్ మోదీ, జెస్సీలు 1987లో వివాహం చేసుకున్నారు. నాడు బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి వారి వివాహానికి హాజరయ్యారు. ఇది జరిగిన మూడేళ్ల తర్వాత 1990లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నాటి ఎన్నికల్లో సుశీల్ మోదీ గెలుపొందారు. సుశీల్ మోదీ రాజకీయాల్లో కొనసాగగా, జెస్సీ జార్జ్ మోదీ లెక్చరర్‌గా పనిచేశారు. -
ఆ హీరో వల్లే ఒక్కటైన నయన్-విఘ్నేశ్ (ఫోటోలు)
-
ప్రియుడి కోసం వేలకోట్ల సంపదను వదిలేసిన బిజినెస్ టైకూన్ కూతురు
నిజమైన ప్రేమ ఎంతటి కష్టాన్నైనా ఎదురిస్తుంది. స్వచ్ఛమైన ప్రేమ ప్రేమించిన మనిషికోసం ఎంతటి త్యాగానికైనా సాహసానికైనా పూను కుంటుంది. ఇవి సినిమాడైలాగుల్లా, డ్రమటిగ్గా అనిపిస్తున్నాయా? కానీ ఈ మాటల్ని అక్షరాలా నిజం చేసింది ఓ మహిళ . ఆమె ఎవరో తెలుసుకుందాం రండి..! కుటుంబాన్ని, వేలకోట్ల సంపదను వదులుకుని మరీ తన ప్రియుడు కోసం తృణప్రాయంగా త్యజించింది. మలేషియాకు చెందిన కోటీశ్వర కుటుంబానికి చెందిన ఏంజెలిన్ ఫ్రాన్సిస్. ఆమె మలేషియా బిజినెస్ టైకూన్ కూ కే పెంగ్ కుమార్తె. ఈయన కోరస్ హోటల్స్ డైరెక్టర్. మలేషియాలో 44వ ధనవంతుడు. అంతేకాదు మాజీ మిస్ మలేషియా పౌలిన్ సాయ్ కుమార్తె. ధనిక కుటుంబానికి చెందిన ఏంజిలిన్ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు, మిత్రుడు జెడిడియాతో ప్రేమలో పడింది. అతణ్ణే పెళ్లాడనుకుంది. భయపడుతూనే తల్లిదండ్రులను సంప్రదించింది. కానీ ఏంజెలిన్ తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించ లేదు. భిన్న ఆర్థిక నేపథ్యాలను ఏంజెలిన్ తండ్రి వీరి పెళ్లికి ససేమిరా అన్నాడు. బాయ్‌ఫ్రెండ్ కావాలో లేక వేల కోట్ల వారసత్వ ఆస్థి కావాలో తేల్చుకో మన్నాడు. చివరికి ఏంజెలిన్ జెడిడియా ఫ్రాన్సిస్‌ను వివాహం చేసుకోవడానికే నిర్ణయించుకుంది. ఈ పెళ్లి చేసుకోవడం ద్వారా వారసత్వంగా దాదాపు రూ. 25వేల కోట్లు (300 మిలియన్ల డాలర్లు)ను వదిలేసుకుంది. విలాసవంతమైన జీవితం కన్నా ప్రేమించినవాడితో జీవితం చాలునుకుంది. అలా 2008లో ఏంజెలిన్, జెడిడియా వివాహం చేసుకున్నారు. అయితే సాధారణమైన ప్రియుడి కోసం వేల కోట్ల సంపదను కుటుంబాలను వదులుకున్న ఉదంతం మరొకటి కూడా ఉంది. జపాన్ యువరాణి మాకో ప్రేమకోసం అపారమైన సంపదను, రాయల్ బిరుదును కూడా వదులుకుంది. 2021లో మాకో, కీ కొమురోవాను వివాహం చేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ ఆన్లైన్లో గేమ్ ఆడుతూ భారత్‌కు చెందిన వ్యక్తితో ప్రేమలో పడి, ఇండియాకు వచ్చేసిన సంగతి తెలిసిందే. -
సరికొత్త ప్రేమ కథ
ఉదయ్ రాజ్, వైష్ణవీ సింగ్ జంటగా రాజేష్ చికిలే దర్శకత్వం వహించిన చిత్రం ‘మధురం’. శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్పై యం. బంగార్రాజు నిర్మించిన ఈ సినిమా వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. రాజేష్ చికిలే మాట్లాడుతూ– ‘‘1990 నేపథ్యంలో సాగే టీనేజ్ లవ్‌స్టోరీ ‘మధురం’. సరికొత్త ప్రేమ కథతో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్లకు కట్టినట్లు మా చిత్రంలో చూపిస్తున్నాం’’ అన్నారు. ‘‘విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే టీనేజ్ లవ్‌స్టోరీ ఇది. నా పాత్ర ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది’’ అన్నారు ఉదయ్ రాజ్. ‘‘మా మూవీ పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు యం. బంగార్రాజు. ఈ సినిమాకు సంగీతం: వెంకీ వీణ.