Shakira, Lewis Hamilton and Tom Cruise's 'love triangle' rumours goes viral - Sakshi
Sakshi News home page

#LewisHamilton-Shakira-TomCruise: ఒక రాధా.. ఇద్దరు కృష్ణులు!

Published Wed, Jun 14 2023 11:44 AM | Last Updated on Wed, Jun 14 2023 12:24 PM

Rumours-Triangle Love Story Between Lewis Hamilton-Shakira-Tom Cruise - Sakshi

కొలంబియాకు చెందిన 46 ఏళ్ల పాప్‌ సింగర్‌ షకీరా గతేడాది స్టార్‌ ఫుట్‌బాలర్‌ గెరార్డ్‌ పీక్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో షకీరా తరచుగా ఇద్దరు వ్యక్తులతో క్లోజ్‌గా మూవ్‌ అవడం కనిపించింది. అందులో ఒకరు ఏడుసార్లు ఫార్ములావన్‌ ఛాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ అయితే.. మరొకరు హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో.. మిషన్‌ ఇంపాజిబుల్‌(Mission Impossible) ఫేమ్‌ టామ్‌ క్రూజ్‌.

ఈ ముగ్గురి మధ్య ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మధ్యనే లూయిస్‌ హామిల్టన్‌ పాల్గొన్న మియామి గ్రాండ్‌ ప్రిక్స్‌ టోర్నీలో షకీరా ప్రత్యక్షమయ్యింది. రేసు ముగిసిన తర్వాత హామిల్టన్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లడం చర్చకు దారి తీసింది. వీరిద్దరి మధ్య ఏదో సమ్‌థింగ్‌ ఉన్నట్లు అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. షకీరా మాత్రం మేమిద్దరం(లూయిస్‌ హామిల్టన్‌) మంచి ఫ్రెండ్స్‌ అని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. అంతకముందు ఈ ఇద్దరు యాచ్‌లో షిప్పింగ్‌తో పాటు పలు సందర్భాల్లోనూ చెట్టాపట్టాలేసుకొని తిరగినట్లు సమాచారం. 

మరోవైపు యాక్షన్‌ హీరో టామ్‌ క్రూజ్‌తో కూడా షకీరా ప్రేమాయణం నడుపుతుందని కొంతమంది అనుకుంటున్నారు. అయితే ఇక్కడ షకీరా కంటే టామ్‌ క్రూజ్‌కే ఎక్కువ ఇంట్రెస్ట్‌ ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా షకీరాతో డేటింగ్‌కు వెళ్లాలని టామ్‌ క్రూజ్‌ అనుకున్నాడని.. ఇంతలో వీరి మధ్యలోని లూయిస్‌ హామిల్టన్‌ వచ్చి చేరాడు.

కాగా లూయిస్‌ హామిల్టన్‌తో షకీరా కలిసి తిరగడం టామ్‌ క్రూజ్‌కు నచ్చలేదని.. అందుకే ఈగో డెంట్‌ అంటూ పరోక్షంగా అసహనం వ్య​క్తం చేశాడని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియదు కానీ 50 ఏళ్ల వయసుకు దగ్గరలో ఉన్న షకీరా తన అందంతో ఇద్దరు సూపర్‌స్టార్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుండడం ఆసక్తి కలిగించింది.

ఇక ఫార్ములావన్‌ స్టార్‌ లూయిస్‌ హామిల్టన్‌ 2015 వరకు పుస్సీక్యాట్‌ డాల్స్‌ సింగర్‌ నికోల్‌ షెర్జింజర్‌తో రిలేషన్‌లో ఉన్నాడు. మరోవైపు టామ్‌ క్రూజ్‌ మిమి రోజర్స్‌(1987-1990), నికోల్‌ కిడ్‌మన్‌(1990-2001), కేటీ హోమ్స్‌(2006-2012)తో రిలేషిన్‌షిప్‌ కొనసాగించాడు.

చదవండి: #MoeenAli: స్టోక్స్‌ 'బూడిద'.. టెస్టుల్లోకి తిరిగి వచ్చేలా చేసింది

వద్దనుకొని 23 ఏళ్ల క్రితం విడాకులు.. మళ్లీ ఆమెతోనే పెళ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement