Lewis Hamilton
-
అంగరంగ వైభవంగా...
లండన్: ఫార్ములావన్ 75వ వార్షికోత్సవ సీజన్ ఆరంభ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నలుపు రోడ్డుపై వాయువేగంతో కార్లు నడుపుతూ అభిమానులను అలరించే రేసర్లు... ఈ ఈవెంట్లో ‘రెడ్ కార్పెట్’పై అభిమానులకు చేతులుపుతూ దర్శనమిచ్చారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2025 సీజన్లో పోటీపడే 20 మంది డ్రైవర్లు తమ కార్లతో పాటు పాల్గొన్నారు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్... స్టేజి మీదకు వచ్చిన సమయంలో ప్రేక్షకుల హర్షధ్వానాలతో ఆడిటోరియం మార్మోగిపోయింది. సుదీర్ఘ ఎఫ్1 చరిత్రలో ఇలాంటి వేడుక జరగడం ఇదే తొలిసారి కాగా... ఇందులో భాగంగా బ్రిటన్ సింగర్ కేన్ బ్రౌన్ మ్యూజిక్ షో ఆహుతులను కట్టిపడేసింది. కనీవినీ ఎరగని రీతిలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా సాగిన ఈ కార్యక్రమంలో... పలువురు ప్రముఖ కళాకారులు పాల్గొన్నారు. ఫార్ములావన్‌ను మరింత విస్తరించడంలో భాగంగానే హాలీవుడ్ సినిమా స్థాయిలో ఈ వేడుకు నిర్వహించారు. దీనిపై హామిల్టన్ స్పందిస్తూ... ‘చాలా ఉత్సాహంగా ఉంది. కొత్త సీజన్లో మరింత వేగంగా దూసుకెళ్లాలని చూస్తున్నా. అందుకు కావాల్సిన శక్తి ఉంది. కొత్త జట్టులో భాగం కావడం ఆనందంగా ఉంది. ఇదే ఉత్తేజంతో ముందుకు సాగుతా’ అని అన్నాడు. 24 రేసులతో కూడిన 2025 ఫార్ములావన్ సీజన్ మార్చి 16న మెల్బోర్న్లో జరిగే ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రితో మొదలవుతుంది. -
‘ఫెరారీ’ కారులో జోరుగా...
ఫియోరానో మోడినీస్ (ఇటలీ): ఫార్ములావన్ దిగ్గజాలలో ఒకరిగా గుర్తింపు పొందిన లూయిస్ హామిల్టన్ 40 ఏళ్ల వయసులో కొత్త జట్టు ‘ఫెరారీ’ తరఫున తన సత్తాను పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. 2025 సీజన్ కోసం ఫెరారీ జట్టుతో చేరిన హామిల్టన్ బుధవారం తొలిసారి ఆ టీమ్ ఎఫ్1 కారుతో డ్రైవింగ్ చేశాడు. టీమ్ ట్రాక్ ఫియోరానో వద్ద ఫెరారీ లోగో ఉన్న హెల్మెట్ ధరించి ఎస్ఎఫ్–23 కారుతో దూసుకెళ్లిన అతను పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులకు అభివాదం చేశాడు. హామిల్టన్ కోసమే ఇటాలియన్ ఫ్యాన్స్ సమీపంలోనే బ్రిడ్జ్ వద్ద ఎదురు చూస్తూ కనిపించారు. ఎఫ్1లో 12 ఏళ్ల పాటు మెర్సిడెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హామిల్టన్ ఆ జట్టు తరఫున ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. అంతకుముందు మెక్లారెన్ టీమ్ తరఫున కూడా మరో ప్రపంచ టైటిల్ నెగ్గిన అతను మొత్తం ఏడుసార్లు విశ్వవిజేతగా నిలిచి మైకేల్ షుమాకర్‌తో సమంగా నిలిచాడు. ‘ఫెరారీ తరఫున బరిలో దిగేందుకు నేను ఎప్పటి నుంచో కోరుకున్నాను. అలాంటి అవకాశం వస్తుందని కొంత కాలం వరకు కూడా ఊహించలేదు. కానీ ఇప్పుడు నా కల నిజమైంది. నా కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాను. ఇప్పుడు ఈ టీమ్ తరఫున ఆడటం మరింత ఆనందాన్నిస్తోంది’ అని హామిల్టన్ వ్యాఖ్యానించాడు. 2025 ఫార్ములావన్ సీజన్ మార్చి 16న మెల్బోర్న్లో జరిగే ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రితో మొదలవుతుంది. -
ఫెరారీ కోటలో అడుగు పెట్టిన హామిల్టన్..
మారనెల్లో (ఇటలీ): ఫార్ములావన్ దిగ్గజం, బ్రిటన్ రేసింగ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కొత్త జట్టు ఫెరారీ చెంత చేరాడు. ఏడుసార్లు ఫార్ములావన్ చాంపియన్‌గా నిలిచిన ఈ 40 ఏళ్ల రేసర్ ఇటీవల జట్టు మారాడు. ఈ సందర్భంగా సోమవారం మారనెల్లో పట్టణంలో ఉన్న ఫెరారీ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లాడు. స్కుడెరియా ఫెరారీ (ఫెరారీ జట్టు పేరు)కి సంబంధించిన ఫివోరానో ట్రాక్‌ను సందర్శించిన హామిల్టన్ గంటలతరబడి గడిపాడు. ఫెరారీ టీమ్ కార్యక్రమంలో రోజంతా భాగమయ్యాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ‘ఎవరికైనా జీవితంలో కొన్ని ప్రత్యేక క్షణాలు, ప్రత్యేక రోజులంటూ ఉంటాయి. నాకిది ప్రత్యేకమైన రోజు. కొత్త జట్టుతో కొత్త ప్రయాణం సాఫీగా సాగేందుకు తొలి అడుగు వేశాను. ట్రాక్‌లో రెడ్ కారు (ఫెరారీ రంగు)తో కూడా దూసుకెళ్లాలని కలలైతే ఉండేది. ఇప్పుడా కల నిజం కాబోతోంది. ఇది తలచుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు. ఏళ్ల తరబడి మెర్సిడెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హామిల్టన్ ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచి దిగ్గజ ఫార్ములావన్ రేసర్ మైకేల్ షుమాకర్ రికార్డు (7 విజయాలు)ను సమం చేశాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో సూర్య -
ఫెరారీకి హామిల్టన్!
ఏడుసార్లు ఫార్ములావన్ వరల్డ్ చాంపియన్, బ్రిటన్ దిగ్గజ రేసర్ లూయిస్ హామిల్టన్ మెర్సిడెస్ జట్టును వీడనున్నాడు. 2013 నుంచి మెర్సిడెస్ తరఫున పోటీపడ్డ హామిల్టన్ ఈ ఏడాది తర్వాత ఆ జట్టుతో బంధం తెంచుకోనున్నాడు. 39 ఏళ్ల హామిల్టన్ 2025 సీజన్లో ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం దాదాపు ఖరారైంది. హామిల్టన్ 2008, 2014, 2015, 2017, 2018, 2019, 2020లలో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచాడు. 2021లో సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి తర్వాత హామిల్టన్ మరో రేసులో విజేతగా నిలువలేకపోయాడు. -
ఒక రాధా.. ఇద్దరు కృష్ణులు!
కొలంబియాకు చెందిన 46 ఏళ్ల పాప్ సింగర్ షకీరా గతేడాది స్టార్ ఫుట్‌బాలర్ గెరార్డ్ పీక్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో షకీరా తరచుగా ఇద్దరు వ్యక్తులతో క్లోజ్‌గా మూవ్ అవడం కనిపించింది. అందులో ఒకరు ఏడుసార్లు ఫార్ములావన్ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ అయితే.. మరొకరు హాలీవుడ్ యాక్షన్ హీరో.. మిషన్ ఇంపాజిబుల్(Mission Impossible) ఫేమ్ టామ్ క్రూజ్. ఈ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీ నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మధ్యనే లూయిస్ హామిల్టన్ పాల్గొన్న మియామి గ్రాండ్ ప్రిక్స్ టోర్నీలో షకీరా ప్రత్యక్షమయ్యింది. రేసు ముగిసిన తర్వాత హామిల్టన్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లడం చర్చకు దారి తీసింది. వీరిద్దరి మధ్య ఏదో సమ్‌థింగ్ ఉన్నట్లు అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. షకీరా మాత్రం మేమిద్దరం(లూయిస్ హామిల్టన్) మంచి ఫ్రెండ్స్ అని స్టేట్మెంట్ ఇచ్చింది. అంతకముందు ఈ ఇద్దరు యాచ్‌లో షిప్పింగ్‌తో పాటు పలు సందర్భాల్లోనూ చెట్టాపట్టాలేసుకొని తిరగినట్లు సమాచారం. మరోవైపు యాక్షన్ హీరో టామ్ క్రూజ్‌తో కూడా షకీరా ప్రేమాయణం నడుపుతుందని కొంతమంది అనుకుంటున్నారు. అయితే ఇక్కడ షకీరా కంటే టామ్ క్రూజ్కే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా షకీరాతో డేటింగ్‌కు వెళ్లాలని టామ్ క్రూజ్ అనుకున్నాడని.. ఇంతలో వీరి మధ్యలోని లూయిస్ హామిల్టన్ వచ్చి చేరాడు. కాగా లూయిస్ హామిల్టన్‌తో షకీరా కలిసి తిరగడం టామ్ క్రూజ్‌కు నచ్చలేదని.. అందుకే ఈగో డెంట్ అంటూ పరోక్షంగా అసహనం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియదు కానీ 50 ఏళ్ల వయసుకు దగ్గరలో ఉన్న షకీరా తన అందంతో ఇద్దరు సూపర్స్టార్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుండడం ఆసక్తి కలిగించింది. ఇక ఫార్ములావన్ స్టార్ లూయిస్ హామిల్టన్ 2015 వరకు పుస్సీక్యాట్ డాల్స్ సింగర్ నికోల్ షెర్జింజర్తో రిలేషన్లో ఉన్నాడు. మరోవైపు టామ్ క్రూజ్ మిమి రోజర్స్(1987-1990), నికోల్ కిడ్మన్(1990-2001), కేటీ హోమ్స్(2006-2012)తో రిలేషిన్షిప్ కొనసాగించాడు. చదవండి: #MoeenAli: స్టోక్స్ 'బూడిద'.. టెస్టుల్లోకి తిరిగి వచ్చేలా చేసింది వద్దనుకొని 23 ఏళ్ల క్రితం విడాకులు.. మళ్లీ ఆమెతోనే పెళ్లి -
ఆ ఒక్క లోటునూ తీర్చేసుకున్నాడు! తొలిసారి వెర్స్టాపెన్ ఇలా..
Australian Grand Prix- మెల్బోర్న్: తన కెరీర్లో లోటుగా ఉన్న ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఏడో ప్రయత్నంలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన సీజన్ మూడో రేసులో వెర్స్టాపెన్ ‘పోల్ పొజిషన్’తో బరిలోకి దిగాడు. మూడుసార్లు ట్రాక్‌పై ఆయా జట్ల డ్రైవర్ల కార్లు అదుపు తప్పడం లేదా ఢీ కొట్టుకోవడంతో రేసుకు మూడుసార్లు అంతరాయం కలిగింది. చివరకు వెర్స్టాపెన్ నిర్ణీత 58 ల్యాప్‌లను 2 గంటల 32 నిమిషాల 38.371 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రేసును ప్రారంభించిన 20 మంది డ్రైవర్లలో 12 మంది మాత్రమే గమ్యానికి చేరారు. ఈ సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది రెండో విజయం. హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, ఫెర్నాండో అలోన్సో (ఆస్టన్ మార్టిన్) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని నాలుగో రేసు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 30న జరుగుతుంది. చదవండి: IPL 2023: చేతులు కాలాక.. తాపత్రయపడితే ఏం లాభం! 13 కోట్లు.. ఒక్క సిక్సర్ కూడా లేదు! IPL 2023- Virat Kohli: చెలరేగిన హైదరాబాదీ.. అయినా! కోహ్లి అద్భుత ఇన్నింగ్స్.. అరుదైన ఘనత! ఒకే ఒక్కడితో.. -
టైటిల్ గెలవకపోయినా ప్రపంచ రికార్డు బద్దలు
ఫార్ములావన్‌లో ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచిన మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో మైలురాయిని అందుకున్నాడు. ఆదివారం ముగిసిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ ఎఫ్1 రేసును మూడో స్థానంతో ముగించాడు. టైటిల్ గెలవడంలో విఫలమైనప్పటికి 16 ఏళ్ల తన రికార్డును మాత్రం కాపాడుకున్నాడు. ఎఫ్1 రేసులో హామిల్టన్ పోడియంను మూడో స్థానంతో ముగించాడు. ఒక గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ తన స్థానాన్ని పోడియంతో ముగించడం వరుసగా 16వ ఏడాది కావడం విశేషం. ఇంతకముందు లెజెండరీ ఫార్ములావన్ డ్రైవర్ మైకెల్ షుమాకర్ మాత్రమే ఉన్నాడు. తాజాగా హామిల్టన్ ఆ ఘనత సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. అంతేకాదు 250 రేసుల్లో పాయింట్లు సాధించిన తొలి డ్రైవర్‌గా హామిల్టన్ నిలిచాడు. ఇక క్వాలిఫయింగ్ సెషన్లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించాడు ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్. ఆదివారం జరిగిన ఫార్ములావన్ సీజన్ తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో అతడు విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌లను లెక్లెర్క్ ఒక గంట 37 నిమిషాల 33.584 సెకన్లలో పూర్తి చేసి కెరీర్లో మూడో విజయాన్ని అందుకున్నాడు. ఫెరారీకే చెందిన కార్లోస్ సెయింజ్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ 54వ ల్యాప్‌లో వైదొలిగాడు. చదవండి: Indian Wells Final: నాదల్కు ఊహించని షాక్.. అమెరికా యువ ఆటగాడి సంచలన విజయం క్రీజులోకి వస్తూనే ప్రత్యర్థి ఆటగాళ్లను ఫూల్స్ చేశాడు -
లెక్లెర్క్కు ‘పోల్.. ఐదో స్థానం నుంచి హామిల్టన్
సాఖిర్: ఫార్ములావన్–2022 సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌లోని తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి నేడు జరగనుంది. శనివారం క్వాలిఫయింగ్ సెషన్లో ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 30.558 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి పోల్ పొజిషన్ సాధించాడు. నేడు జరిగే ప్రధాన రేసును లెక్లెర్క్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానం నుంచి... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ హామిల్టన్ (మెర్సిడెస్) ఐదో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్లో మొత్తం 23 రేసులు జరుగుతాయి. -
పేరు మార్చుకోనున్న స్టార్ ఆటగాడు.. కారణం?
''ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు ఉండరు''.. ఇది కేజీఎఫ్ సినిమాలో హీరో చెప్పిన ఫేమస్ డైలాగ్. ఇది అక్షరాలా నిజం.. మనకు జన్మనిచ్చిన తల్లిని మనం ఎంత ప్రేమిస్తే.. అంతే ప్రేమను తిరిగి పొందుతామని అంటుంటారు. తాజాగా ఏడుసార్లు ఫార్ములాన్ చాంపియన్(ఎఫ్ 1), మెర్సిడస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన పేరులో చిన్న మార్పు చేయనున్నట్లు తెలిపాడు. ఇకపై తన పేరు తల్లి పేరుతో కలిపి ఉంటుందని.. ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని తెలిపాడు. ''పెళ్లవ్వగానే ఆడవాళ్ల ఇంటిపేరు మారుతుందంటారు. ఇది విన్నప్పుడల్లా నాకు వింతగా అనిపిస్తుంటుంది. ఆడవాళ్ల పేర్లు మారుతాయి తప్ప.. వారి పేర్లను మనలో ఎందుకు చేర్చమో అర్థం కాదు. అందుకే ఇప్పుడు చెబుతున్నా.. నా తల్లి పేరు కార్మెన్ లార్బలీస్టర్ హామిల్టన్. ఇకపై నా పేరులో తల్లి పేరుతో ఉంటుంది. ఇక నా పూర్తి పేరు లుయీస్ లార్బలీస్టర్ హామిల్టన్.. ఎనిమిదో టైటిల్ గెలిచే సమయంలో నా పేరులో అమ్మ పేరు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది. బహ్రెయిన్ గ్రాండ్ప్రిక్స్ ప్రారంభమయ్యేలోగా ఇదంతా పూర్తవుతుందని ఆశిస్తున్నా. ప్రపంచంలో తల్లికి మించి గొప్ప ఎవరు లేరు.. అందుకే పేరు మార్చుకుంటున్నా'' అని చెప్పుకొచ్చాడు. కాగా హామిల్టన్ 12 ఏళ్ల వయసులో తల్లి కార్మెన్ లార్బలీస్టర్.. తండ్రి ఆంథోని హామిల్టన్ విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి లుయీస్ హామిల్టన్ తల్లి కార్మెన్తోనే ఉంటున్నాడు. చదవండి: Pat Cummins: సుత్తితో క్రీజులోకి ఆసీస్ కెప్టెన్.. ఎగతాళి చేసిన పాక్ అభిమానులు Sandeep Nangal Death: కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. మ్యాచ్ జరుగుతుండగానే కాల్పులు -
అప్పీల్‌పై వెనక్కి తగ్గిన మెర్సిడెస్
ఫార్ములా వన్ సీజన్ ఫినాలే అబుదాబి గ్రాండ్‌ప్రిలో సేఫ్టీ కారు విషయంలో రేసింగ్ డైరెక్టర్ మైకేల్ మాసి తీసుకున్న నిర్ణయాలపై మరోసారి సమీక్షించాలంటూ అంతర్జాతీయ కోర్టులో వేసిన అప్పీల్‌పై మెర్సిడెస్ టీమ్ గురువారం వెనక్కి తగ్గింది. దానిని ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. హామిల్టన్‌తో చర్చించిన అనంతరం ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దామని నిర్ణయించుకున్నట్లు మెర్సిడెస్ తన ప్రకటనలో తెలిపింది. -
ఇక నుంచి ‘సర్’ లూయిస్ హామిల్టన్...
ఫార్ములావన్ (ఎఫ్1) రేసింగ్‌లో ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌ను ఇక నుంచి ‘సర్’ లూయిస్ హామిల్టన్గా పిలవనున్నారు. ఎఫ్1 చరిత్రలో అత్యధికంగా 103 విజయాలు సాధించిన 36 ఏళ్ల హామిల్టన్‌ను బ్రిటన్ ప్రభుత్వం నైట్‌హుడ్ పురస్కారంతో గౌరవించింది. బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రిన్స్ చార్లెస్ చేతుల మీదుగా హామిల్టన్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. 2007 నుంచి ఎఫ్1లో ఉన్న హామిల్టన్ ఇప్పటివరకు 288 రేసుల్లో పాల్గొన్నాడు. చదవండి: Ruturaj Gaikwad: 4 సెంచరీలు... 603 పరుగులు... సంచలన ఇన్నింగ్స్.. అయినా పాపం! -
Max Verstappen: ఎఫ్1లో సంచలనం.. తొలిసారి చాంపియన్‌గా..
Max Verstappen wins Abu Dhabi Grand Prix, beats Lewis Hamilton: గత నాలుగు సీజన్లలో ఎదురులేని మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఆధిపత్యానికి గండికొడుతూ ఫార్ములావన్ (ఎఫ్1)లో మాక్స్ వెర్స్టాపెన్ రూపంలో కొత్త ప్రపంచ చాంపియన్ అవతరించాడు. ఆదివారం జరిగిన చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నాటకీయ పరిణామాల మధ్య విజేతగా నిలిచాడు. తొలిసారి ప్రపంచ చాంపియన్ అయ్యాడు. రేసు చివరి వరకు ఆధిక్యంలో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్, ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ హామిల్టన్ ఆఖరి ల్యాప్‌లో వెనుకబడిపోయి ఓటమి మూటగట్టుకున్నాడు. దాంతో ఏడు ప్రపంచ టైటిల్స్ తో జర్మనీ దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాలని ఆశించిన హామిల్టన్ మరో ఏడాదిపాటు వేచి చూడక తప్పదు. అబుదాబి: ప్రతిభకు కాస్త అదృష్టం కూడా తోడైతే... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే... ఇక ఓటమి ఖాయమనుకున్న చోట కూడా పుంజుకొని అనూహ్య విజయం సాధించవచ్చని ఆదివారం జరిగిన అబుదాబి గ్రాండ్‌ప్రి రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నిరూపించాడు. బ్లాక్ బాస్టర్ సినిమాను తలపించిన 2021 ఎఫ్1 సీజన్ వివాదాస్పదంగా ముగిసింది. డ్రైవర్ చాంపియన్‌షిప్‌ను తేల్చే అబుదాబి గ్రాండ్‌ప్రిలో 58 ల్యాప్‌ల ప్రధాన రేసును వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 17.345 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. దాంతో డ్రైవర్ చాంపియన్‌షిప్‌లో 395.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన 24 ఏళ్ల వెర్స్టాపెన్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. 57వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉండి చివరి ల్యాప్‌లో వెనుకబడిన హామిల్టన్ (బ్రిటన్) మొత్తం 387.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. హామిల్టన్ కొంపముంచిన సేఫ్టీ కార్... రెండో స్థానం నుంచి రేసును మొదలు పెట్టిన హామిల్టన్ తొలి మలుపులోనే వెర్స్టాపెన్ను అధిగమించి రేసులో ఆధిక్యంలోకి వచ్చాడు. ఇక్కడి నుంచి అద్భుతంగా డ్రైవ్ చేసిన హామిల్టన్ వెర్‌స్టాపెన్‌కు అందకుండా దూసుకెళ్లాడు. ల్యాప్ ల్యాప్నకు రెండో స్థానంలో ఉన్న వెర్స్టాపెన్తో అంతరాన్ని పెంచుకుంటూ పోయాడు. ఇక ఎనిమిదో డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయం అనుకున్న తరుణంలో ‘సేఫ్టీ కార్’ ట్విస్ట్ హామిల్టన్ ఆశలపై నీళ్లు చల్లింది. 53వ ల్యాప్‌లో విలియమ్స్ డ్రైవర్ నికోలస్ లతీఫీ కారు ప్రమాదానికి గురికావడంతో రేసు స్టీవర్డ్స్ సేఫ్టీ కారును ట్రాక్ మీదకు పంపారు. ఇదే సమయంలో పిట్లోకి వచ్చిన వెర్స్టాపెన్ టైర్లను మార్చుకొని మళ్లీ ట్రాక్‌పై హామిల్టన్ వెనకగా రెండో స్థానంలో నిలిచాడు. 53వ ల్యాప్ ముందు వరకు హామిల్టన్, వెర్స్టాపెన్ మధ్య 11 ఉన్న సెకన్ల గ్యాప్ .... 57వ ల్యాప్‌లో సెకను కంటే తక్కువకు తగ్గింది. చివరి ల్యాప్‌లో రేసు మరోసారి ఆరంభం కాగా... రెండో స్థానంలో ఉన్న వెర్స్టాపెన్ తన కారుకు ఉన్న కొత్త టైర్ల సాయంతో ఐదో మలుపు వద్ద హామిల్టన్‌ను అధిగమించి విజేతగా నిలవడంతో పాటు డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. మెర్సిడెస్ నిరసన... రేసు చివర్లో సేఫ్టీ కారు విషయంలో రేసు డైరెక్టర్ తీసుకున్న నిర్ణయాలపై మెర్సిడెస్ నిరసన వ్యక్తం చేసింది. అంతేకాకుండా వెర్స్టాపెన్ గెలిచేలా సేఫ్టీ కారు నిర్ణయాలు తీసుకుందంటూ ఆరోపించింది. ఈ విషయంపై స్టీవర్డ్స్‌కు మెర్సిడెస్ ఫిర్యాదు కూడా చేసింది. 53వ ల్యాప్‌లో సేఫ్టీ కారు ట్రాక్‌పైకి రాగా... ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. తొలుత ల్యాప్డ్ (ఒక ల్యాప్ తక్కువగా పూర్తి చేసిన కార్లు) కార్లు అన్‌ల్యాప్ కాకూడదంటూ ఆదేశాలు జారీ చేసి... అనంతరం అన్‌ల్యాప్ చేయొచ్చుంటూ తన నిర్ణయాన్ని మార్చుకుంది. దాంతో హామిల్టన్, వెర్స్టాపెన్ మధ్య ఉన్న ఐదు ల్యాప్డ్ కార్లు హామిల్టన్‌ను దాటుకుంటూ వెళ్లాయి. అదే సమయంలో సేఫ్టీ కార్ పిట్లోకి వెళ్లి రేసును మళ్లీ ఆరంభించాలంటూ ఆజ్ఞలు జారీ చేసింది. ఇక్కడే వివాదం మొదలైంది. సేఫ్టీ కారు వచ్చే సమయానికి మొత్తం ఎనిమిది ల్యాప్డ్ కార్లు ట్రాక్‌పై ఉన్నాయి. కేవలం ఐదు కార్లకు మాత్రమే అన్‌ల్యాప్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించి మిగిలిన మూడు కార్లకు ఎందుకు కల్పించలేదంటూ మెర్సిడెస్ ఆరోపించింది. నిబంధనల ప్రకారం ల్యాప్డ్ కార్లు అన్‌ల్యాప్ అయితే తాము వెనుకబడి ఉన్న ల్యాప్‌ను పూర్తి చేసుకొని మళ్లీ మిగతా కార్ల వెనుక చేరే వరకు కూడా సేఫ్టీ కార్ పిట్లోకి వెళ్లరాదు. అయితే ఇక్కడ దానిని సేఫ్టీ కారు పాటించలేదు. అయితే తీవ్ర చర్చల అనంతరం మెర్సిడెస్ ఫిర్యాదును స్టీవర్డ్స్ తోసిపుచ్చి వెర్స్టాపెన్ను విజేతగా ప్రకటించారు. వరుసగా ఎనిమిదోసారి... ఎఫ్1 కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో మెర్సిడెస్ జట్టు వరుసగా ఎనిమిదో ఏడాది విజేతగా నిలిచింది. ఈ సీజన్లో మొత్తం 9 రేసుల్లో గెలిచిన మెర్సిడెస్ 613.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఎఫ్1కు కిమీ రైకొనెన్ గుడ్‌బై అబుదాబి గ్రాండ్‌ప్రితో ఫార్ములావన్‌కు ఫిన్లాండ్ డ్రైవర్ కిమీ రైకొనెన్ గుడ్‌బై చెప్పాడు. 2001లో సాబర్ జట్టు ద్వారా ఎఫ్1లో అరంగేట్రం చేసిన 41 ఏళ్ల రైకొనెన్... మెక్లారెన్, ఫెరారీ, లోటస్, ఆల్ఫా రొమెయో జట్ల తరఫున రేసింగ్‌లో పాల్గొన్నాడు. ఫెరారీ డ్రైవర్‌గా 2007లో డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నెగ్గాడు. ఈ సీజన్లో వెర్స్టాపెన్ గెలిచిన రేసుల సంఖ్య. మొత్తం 22 రేసులు జరగ్గా... హామిల్టన్ ఎనిమిది రేసుల్లో నెగ్గాడు. పెరెజ్ (రెడ్‌బుల్), ఒకాన్ (అల్పైన్ రెనౌ), రికియార్డో (మెక్లారెన్), బొటాస్ (మెర్సిడెస్) ఒక్కో రేసులో గెలిచారు. The journey to the top of the world for @Max33Verstappen 🏆#AbuDhabiGP 🇦🇪 #F1 pic.twitter.com/rHHH4H0oUj — Formula 1 (@F1) December 12, 2021 -
ఊహకందని విధంగా టైటిల్ గెలిచాడు
జెద్దా: ఊహకందని విధంగా జరిగిన సౌదీ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ మెరిశాడు. ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో తొలి సారి ఆతిథ్యమిచ్చిన ఈ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ విజేతగా నిలిచాడు. భారతకాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన 50 ల్యాప్‌ల ప్రధాన రేసును హామిల్టన్ అందరికంటే ముందుగా 2 గంటలా 6 నిమిషాల 15.118 సెకన్లలో రేసును ముగించి విన్నర్‌గా నిలిచాడు. 21.825 సెకన్లు వెనుకగా రేసును ముగించిన వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానాన్ని బొటాస్ (మెర్సిడెస్) పొందాడు. ఈ రేసులో ఫాస్టెస్ ల్యాప్‌ను హామిల్టనే నమోదు చేయడంతో అతడికి బోనస్ పాయింట్ లభించింది. దాంతో మొత్తం 26 (25+1) పాయింట్లు సాధించిన హామిల్టన్ (369.5 పాయింట్లు)... డ్రైవర్ చాంపియన్‌షిప్‌లో తొలి స్థానంలో ఉన్న వెర్స్టాపెన్ (369.5 పాయింట్లు)తో సమంగా నిలిచాడు. ఈ ఏడాది చాంపియన్ ఎవరనేది 12న జరిగే సీజన్ ముగింపు రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో తేలనుంది. -
Qatar Grand Prix 2021: హామిల్టన్‌కే ‘పోల్’
దోహా: ఫార్ములావన్ సీజన్లో తొలిసారి జరుగుతున్న ఖతర్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ పోల్ పొజిషన్‌తో మెరిశాడు. ప్రస్తుత సీజన్లో చివరిసారిగా హంగేరి గ్రాండ్‌ప్రిలో పోల్‌ను సొంతం చేసుకున్న హామిల్టన్... మళ్లీ ఎనిమిది గ్రాండ్ప్రిల తర్వాత ఆ ఘనతను అందుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్ చివరి రౌండ్లో అతడు ల్యాప్‌ను అందరికంటే ముందుగా ఒక నిమిషం 20.827 సెకన్లలో పూర్తి చేసి పోల్‌ను అందుకున్నాడు. సీజన్లో హామిల్టన్‌కిది నాలుగో పోల్‌కాగా... ఓవరాల్‌గా 102వది. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ రెండో స్థానం నుంచి మొదలుపెడతాడు. మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నేటి ప్రధాన రేసును రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ హెచ్డి–2, హాట్స్టార్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ‘బ్లిట్జ్’ విభాగంలోనూ అర్జున్ జోరు... టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్ (జీఎం), తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్ శనివారం మొదలైన ‘బ్లిట్జ్’ టోర్నమెంట్లోనూ ఆకట్టుకున్నాడు. 18 రౌండ్లపాటు జరుగుతున్న బ్లిట్జ్ టోర్నీలో తొలి రోజు 9 రౌండ్లు ముగిశాయి. తొమ్మిదో రౌండ్ తర్వాత 18 ఏళ్ల అర్జున్ 6.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉన్నాడు. సామ్ షాంక్లాండ్ (అమెరికా), గుకేశ్ (భారత్), విదిత్ (భారత్), ద్రోణవల్లి హారిక (భారత్)లపై గెలిచిన అర్జున్... నిహాల్ సరీన్ (భారత్), çమగ్సూద్లూ (ఇరాన్), రౌనక్ సాధ్వాని (భారత్), లెవాన్ అరోనియన్ (అర్మేనియా), క్వాంగ్ లీమ్ (వియత్నాం)లతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. నేడు మరో తొమ్మిది రౌండ్లు జరుగుతాయి. -
టర్కిష్ గ్రాండ్‌ప్రి పోల్ హామిల్టన్‌దే
Lewis Hamilton.. ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో భాగంగా శనివారం జరిగిన టర్కిష్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌లో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ పోల్ పొజిషన్‌తో మెరిశాడు. క్వాలిఫయింగ్ చివరి సెషన్లో అతడు ల్యాప్‌ను అందరి కంటే ముందుగా నిమిషం 22.868 సెకన్లలో పూర్తి చేసి పోల్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా సీజన్లో నాలుగో ఇంజిన్‌ను తీసుకున్న హామిల్టన్‌కు 10 స్థానాల గ్రిడ్ పెనాల్టీ పడింది. దాంతో అతడు ఆదివారం జరిగే ప్రధాన రేసును 11వ స్థానం నుంచి ఆరంభిస్తాడు. రెండో స్థానంలో నిలిచిన బొటాస్ (మెర్సిడెస్) తొలి స్థానం నుంచి రేసును ఆరంభించనున్నాడు. ప్రధాన రేసు సాయంత్రం గం. 5.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్ సెలెక్ట్ హెచ్డి–2లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత్ ఖాతాలో 30 పతకాలు లిమా (పెరూ): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్íÙప్లో భారత్ ‘టాప్’లేపింది. టోర్నీలో ఏకంగా 13 స్వర్ణాలు, 11 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తం 30 పతకాలు సాధించిన భారత్ పతకాల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. 20 (6 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో) పతకాలు గెలిచిన అమెరికాకు రెండో స్థానం దక్కింది. -
ఫార్ములా వన్‌లో హామిల్టన్ ‘విక్టరీల సెంచరీ’..
సోచీ (రష్యా): ఫార్ములావన్ (ఎఫ్1) స్టార్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ తన కెరీర్లో 100వ రేసు విజయాన్ని అందుకున్నాడు. గత కొంత కాలంగా ఊరిస్తూ వస్తోన్న ‘విక్టరీల సెంచరీ’ని హామిల్టన్ రష్యా గ్రాండ్‌ప్రితో పూర్తి చేశాడు. ఆదివారం జరిగిన 53 ల్యాప్‌ల ప్రధాన రేసును అతడు గంటా 30 నిమిషాల 41.001 సెకన్లలో పూర్తి చేశాడు. రెండో స్థానంలో వెర్స్టాపెన్ (రెడ్‌బుల్)... మూడో స్థానంలో కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) నిలిచారు. పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన లాండో నోరిస్ (మెక్లారెన్) ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రన్నరప్ గాయత్రి జంట జకోపేన్ (పోలాండ్): పోలిష్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ క్రీడాకారిణులు గాయత్రి గోపీచంద్ పుల్లెల, సామియా ఇమాద్ ఫారూఖీ రన్నరప్‌గా నిలిచారు. మహిళల డబుల్స్ విభాగం ఫైనల్లో గాయత్రి–త్రిషా జాలీ (భారత్) ద్వయం 10–21, 18–21తో మార్గోట్ లాంబర్ట్–యాన్ ట్రాన్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో సామియా 11–21, 9–21తో మూడో సీడ్ యు యాన్ జస్లిన్ హుయ్ (సింగపూర్) చేతిలో ఓటమి చవిచూసింది. చదవండి: సానియా మీర్జా ఖాతాలో 43వ డబుల్స్ టైటిల్ -
దేవుడా.. ఆ డివైజ్ లేకుంటే ప్రాణాలు పోయేవే!
రెడ్‌బుల్-మెర్సెడెస్ టాప్ రేసర్లు మరోసారి దూకుడు చర్యలతో వార్తల్లోకి ఎక్కారు. ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్, రెడ్‌బుల్ రేసర్ వెర్స్టాపెన్ కార్ల ‘ఢీ’యాక్షన్.. పరస్పర విమర్శలతో వేడెక్కిస్తోంది. ‘‘ఇవాళ నా అదృష్టం బాగుండి బతికా. హలోకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. లేకుంటే ఏమైపోయేవాడినో..’’ అంటూ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ లూయిస్ హామిల్టన్ చెబుతున్నాడు. ఆదివారం వారియంట్ డెల్ రెటాయిలియో రేసుకోర్టులో జరిగిన ఇటలీ పార్కో డీ మోంజా(ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎఫ్1) రేసులో మెక్లారెన్ రేసర్ డానియల్ రిక్కియార్డో(ఆసీస్-ఇటాలియన్) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ రేసులో ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. మొత్తం 53 ల్యాప్లతో జరిగిన రేసులో.. 26వ ల్యాప్ వద్ద 225 కిలోమీటర్ల వేగంతో దూసుకుకొచ్చిన రెడ్‌బుల్ రేసర్ మాక్స్ వెర్స్టాపెన్ రేస్ కారు.. మెర్సెడెస్ రేసర్ హామిల్టన్ రేస్కారును ఎక్కేసింది. రెండు వాహనాలు ట్రాక్ తప్పి పక్కకు దూసుకెళ్లాయి. 750 కేజీల వెహికిల్ ముందుభాగం పచ్చడికాగా.. క్రాష్‌లో హామిల్టన్ ప్రాణాలు పోయి ఉంటాయని అంతా కంగారుపడ్డారు!. కానీ, హలొ డివైజ్ వల్ల పెద్దగాయాలేవీ కూడా కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు హామిల్టన్. క్రాష్ తర్వాత తనంతట తానే బయటకు నడుచుకుంటూ వచ్చిన హామిల్టన్.. ఆ తర్వాత మెడ నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరాడు. Another hugely dramatic moment in the Verstappen/Hamilton title battle 💥😮#ItalianGP 🇮🇹 #F1 pic.twitter.com/P4J4bN6wX2 — Formula 1 (@F1) September 12, 2021 హలో.. వివాదం హలొ అనేది సేఫ్టీ డివైజ్. క్రాష్ ప్రొటెక్షన్ వ్యవస్థగా పరిగణిస్తారు. ఓపెన్ వీల్ రేసింగ్ సిరీస్‌లలో వీటిని వాడ్తారు. డ్రైవర్ తల భాగంలో కర్వ్ షేప్‌లో ఉంటుంది ఇది. 2016-2017 జులై మధ్యకాలంలో ఈ డివైజ్‌ను టెస్ట్‌లకు ఉపయోగించారు. ఫలితాలను ఇస్తుందనే నమ్మకంతో 2018 ఎఫ్ఐఏ సీజన్ నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత ప్రతీ రేసులో దీన్ని తప్పనిసరి చేశారు. ఇండీకార్ హలొ మాత్రం ఎయిరోస స్క్రీన్ కోసం వేరే ఫ్రేమ్‌లో ఉంటుంది. అయితే దీని వాడకంపై వివాదం నడుస్తున్నా.. ఇలా ప్రాణాలు కాపాడటం ఇది రెండోసారి!. గతంలో ఈ డివైజ్‌ను తీసుకొచ్చిన కొద్దిరోజులకే రేసర్ చార్లెస్ లెక్లెరిక్ పప్రాణాలు కాపాడింది. స్పా ఫ్రాన్కోర్చాంప్స్(2018) రేస్ సందర్భంగా ఫస్ట్ ల్యాప్‌లోనే ఫెర్నాండో అలోన్సో ‘మెక్లారెన్’తో క్రాష్ అయినప్పటికీ.. ఆ ప్రమాదం నుంచి లెక్లెరిక్ చిన్నగాయం కూడా కాకుండా బయటపడగలిగాడు. ఇక వెర్స్టాపెన్-హామిల్టన్ మధ్య జరిగిన క్రాష్ వివాదానికి తెరలేపింది. వెర్‌స్టాపెన్‌కు పెనాల్టీ విధించినప్పటికీ.. మెర్సిడెస్ మేనేజ్మెంట్ మాత్రం ఈ చర్యను తీవ్రంగా భావించాలని కోరుతోంది. చదవండి: డేంజరస్ క్రాష్.. సిగ్గులేకుండా హామిల్టన్ సంబురాలు -
Formula One: గొప్ప అవకాశం.. ధన్యవాదాలు: రసెల్
లండన్: బ్రిటన్‌కు చెందిన 23 ఏళ్ల జార్జ్ రసెల్ వచ్చే ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్ నుంచి మెర్సిడెస్ డ్రైవర్‌గా బరిలోకి దిగనున్నాడు. దాంతో 2022 సీజన్లో హామిల్టన్‌తో కలిసి రసెల్ మెర్సిడెస్ తరఫున రేసింగ్ చేయనున్నాడు. 2019లో విలియమ్స్ టీమ్ ద్వారా రసెల్ ఎఫ్1లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుత సీజన్లో మెర్సిడెస్ డ్రైవర్‌గా ఉన్న బొటాస్... 2022 నుంచి అల్ఫా రొమేయో జట్టు తరఫున రేసింగ్‌లో పాల్గొంటాడు. ఇక తనకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మెర్సిడెస్కు రసెల్ ధన్యవాదాలు తెలిపాడు. చదవండి: Shafali Verma: టాప్ ర్యాంక్‌లోనే షఫాలీ వర్మ US Open 2021: కొత్త చాంపియన్ అవతరించనుంది! You never forget your first…once a Williams driver, always a Williams driver 💙 A message from @GeorgeRussell63...🗣️ pic.twitter.com/BaPQFXAoNL — Williams Racing (@WilliamsRacing) September 7, 2021 -
Hungarian Grand Prix: హామిల్టన్‌కు ‘పోల్’
బుడాపెస్ట్: ఫార్ములావన్ (ఎఫ్1) తాజా సీజన్లో మెర్సిడెస్ డ్రైవర్, ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మళ్లీ మెరిశాడు. శనివారం జరిగిన హంగేరి జీపీ క్వాలిఫయింగ్‌లో ఈ బ్రిటన్ డ్రైవర్ పోల్ పొజిషన్‌ను దక్కించుకున్నాడు. ల్యాప్‌ను అందరికంటే ముందుగా ఒక నిమిషం 15.419 సెకన్లలో పూర్తి చేసి ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు. సీజన్లో హామిల్టన్‌కిది మూడో పోల్‌కాగా... ఓవరాల్‌గా 101వది. బొటాస్ (మెర్సిడెస్) రెండో స్థానంలో నిలువగా... వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచాడు. నేడు జరిగే ప్రధాన రేసు సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
నువ్వేం మనిషివి.. సిగ్గులేకుండా సంబురాలా?
నాటకీయ పరిణామాల నడుమ బ్రిటిష్ప్రి రేస్ నెగ్గిన ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రెడ్‌బుల్ రేసర్ మాక్స్ వెర్స్టాపెన్ని ఢీ కొట్టాడని, అతను ఆస్పత్రి పాలైతే.. లూయిస్ గెలిచి సంబురాలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని హామిల్టన్‌ను నిలదీస్తున్నారు. ఆదివారం బ్రిటిష్ గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచాడు మెర్సెడెస్ రైడర్ లూయిస్ హామిల్టన్. అయితే తొలి ల్యాప్‌లోనే రెడ్‌బుల్ రైడర్ మాక్స్ వెర్స్టాపెన్ను ప్రమాదకరమైన మలుపుతో ఢీకొట్టడం, ఆపై వెర్స్టాపెన్ను ఆస్పత్రికి తరలించడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో లూయిస్‌కు పది సెకండ్ల పెనాల్టీ విధించారు. అయినప్పటికీ లూయిస్ రేస్ నెగ్గి, సంబురాలు చేసుకున్నాడు. అయితే తాను ఆస్పత్రి పాలైన టైంలో వేడుకలు చేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించాడు వెర్స్టాపెన్. ‘లూయిస్ తీరు సరికాదు. అమానుషం. స్పోర్టివ్ స్ఫూర్తికి విరుద్ధం. ఆటగాళ్లు వ్యవహరించాల్సిన తీరు అది కానేకాద’ని అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు సిగ్గులేకుండా క్రాష్‌కి పాల్పడి.. గెలుపు సంబురాలు చేసుకున్నాడని, అదసలు గెలుపే కాదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. What a crash! @SkySports @SkySportsF1 @SilverstoneUK @redbullracing @Max33Verstappen @F1 #f1 #BritishGrandPrix #maxverstappen #RedBullRacing #britishgp #formula1 pic.twitter.com/zpFHwUwiEG — Killian Connolly (@Kill_Connolly) July 18, 2021 మొత్తం లక్షా నలభై వేలమంది వ్యూయర్స్ మధ్య ఆదివారం బ్రిట్రిష్ గ్రాండ్‌ప్రి జరిగింది. అయితే పోల్ పొజిషన్‌తో రేసును ఆరంభించిన వెర్స్టాపెన్, లూయిస్ ఢీ కొట్టడంతో తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు. ఆ వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక 52 ల్యాప్‌ల రేసును 58 నిమిషాల 23.284 సెకన్లలో పూర్తి చేశాడు లూయిస్. తద్వారా బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో వరుసగా మూడో ఏడాది.. ఓవరాల్‌గా ఏనిమిదో సారి విజేతగా నిలిచాడు. Glad I’m ok. Very disappointed with being taken out like this. The penalty given does not help us and doesn’t do justice to the dangerous move Lewis made on track. Watching the celebrations while still in hospital is disrespectful and unsportsmanlike behavior but we move on pic.twitter.com/iCrgyYWYkm — Max Verstappen (@Max33Verstappen) July 18, 2021 జాతి వివక్ష మరోవైపు రెడ్‌బుల్ ఈ విజయాన్ని క్రూరత్వంగా వర్ణిస్తోంది. హామిల్టన్‌కు పెనాల్టీ సరిపోయే శిక్ష కాదని చెబుతోంది. ఇదిలా ఉంటే లూయిస్ హామిల్టన్‌పై సోషల్ మీడియాలో జాతి వివక్ష కామెంట్లు మొదలయ్యాయి. కోతి(మంకీ) ఎమోజీలను ఉంచుతున్నారు చాలామంది. మరోవైపు మెర్సడెస్ ఈ కామెంట్లను ఖండిస్తోంది. వర్ణ వివక్షకు తాము వ్యతిరేకమని, టాలెంట్ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించడమే మా పని అంటూ పేర్కొంది. -
హామిల్టన్... పోల్ @ 98
సాఖిర్ (బహ్రెయిన్): ఇప్పటికే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమైనప్పటికీ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ జోరు తగ్గించడం లేదు. ఈ సీజన్లో పదోసారి... కెరీర్లో 98వ సారి ఈ బ్రిటన్ డ్రైవర్ పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో 34 ఏళ్ల హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 27.264 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే పది రేసుల్లో విజేతగా నిలిచిన హామిల్టన్ 11వ రేసు టైటిల్ వేటలో ఉన్నాడు. మెర్సిడెస్‌కే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. బొటాస్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. ఆల్బోన్ (రెడ్‌బుల్), 5. పెరెజ్ (రేసింగ్ పాయింట్), 6. రికియార్డో (రెనౌ), 7. ఒకాన్ (రెనౌ), 8. గాస్లే (అల్ఫా టౌరి), 9. నోరిస్ (మెక్లారెన్), 10. క్వియాట్ (అల్ఫా టౌరి), 11. వెటెల్ (ఫెరారీ), 12. లెక్లెర్క్ (ఫెరారీ), 13. లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్), 14. రసెల్ (విలియమ్స్), 15. సెయింజ్ (మెక్లారెన్), 16. గియోవినాజి (అల్ఫా రోమియో), 17. రైకోనెన్ (అల్ఫా రోమియో), 18. మాగ్నుసెన్ (హాస్), 19. గ్రోస్యెన్ (హాస్), 20. లతీఫీ (విలియమ్స్). -
బొటాస్‌కు పోల్
ఇమోలా (ఇటలీ): వరుసగా ఏడో ఏడాది కన్స్ట్రక్టర్ (జట్టు) చాంపియన్‌షిప్ టైటిల్‌పై కన్నేసిన ఫార్ములా వన్ (ఎఫ్1) జట్టు మెర్సిడెస్ అదరగొట్టింది. 14 ఏళ్ల తర్వాత ఎఫ్1 సీజన్లో పునరాగమనం చేసిన ఇమోలా రేసు ట్రాక్‌పై ఆ జట్టు డ్రైవర్లు వాల్తెరి బొటాస్, లూయిస్ హామిల్టన్ సత్తా చాటారు. ఇమిలియా రొమాగ్న గ్రాండ్ ప్రి పేరుతో జరుగనున్న ఈ రేసులో భాగంగా శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో బొటాస్ పోల్ పొజిషన్ సాధించాడు. అతడు అందరికంటే వేగంగా ల్యాప్‌ను నిమిషం 13.609 సెకన్లలో పూర్తి చేశాడు. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి మొదలు పెట్టే అవకాశాన్ని దక్కించుకున్నాడు. సహచరుడు హామిల్టన్ 0.097 సెకన్లు వెనుకగా ల్యాప్‌ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నేడు జరిగే రేసును లూయిస్ హామిల్టన్ లేదా వాల్తెరి బొటాస్లలో కనీసం ఒకరైనా ‘టాప్–4’తో ముగిస్తే.. ఎఫ్1 చరిత్రలో వరుసగా ఏడోసారి కన్స్ట్రక్టర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నెగ్గిన తొలి జట్టుగా మెర్సిడెస్ నిలుస్తుంది. 2014 నుంచి 2019 వరకు జరిగిన ఆరు ఎఫ్1 సీజన్‌ల్లోనూ మెర్సిడెస్ జట్టే ఈ టైటిల్స్‌ను సొంతం చేసుకోవడం విశేషం. గతంలో ఫెరారీ (1999–2004 మధ్య) ఇలా వరుసగా ఆరుసార్లు టీమ్ విభాగంలో టైటిల్స్‌ను నెగ్గింది. -
హామిల్టన్‌కు నిరాశ
సోచి (రష్యా): దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ పేరిట 91 టైటిల్స్‌తో ఉన్న ప్రపంచ రికార్డును సమం చేసేందుకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో రెండు వారాలు వేచి చూడక తప్పదు. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్‌కు ఈ అవకాశం వచ్చినా ప్రాక్టీస్ సమయంలో రెండుసార్లు అతను నిబంధనలు ఉల్లంఘించాడు. ప్రాక్టీస్‌కు అనుమతిలేని ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తూ ట్రాక్‌పై రెండుసార్లు రావడంతో అతనిపై 10 సెకన్ల పెనాల్టీని విధించారు. ఫలితంగా ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ చివరకు మూడో స్థానంలో నిలిచాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ నిర్ణీత 53 ల్యాప్‌లను గంటా 34 నిమిషాల 00.364 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. బొటాస్ కెరీర్లో ఇది తొమ్మిదో టైటిల్‌కాగా ఈ సీజన్లో రెండో విజయం. ప్రస్తుతం 10 రేసులు ముగిశాక హామిల్టన్ 205 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బొటాస్ (161 పాయింట్లు), వెర్స్టాపెన్ (128 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు జర్మనీ గ్రాండ్‌ప్రి అక్టోబర్ 11న జరుగుతుంది. రష్యా గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. బొటాస్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. హామిల్టన్ (మెర్సిడెస్), 4. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్), 5. రికియార్డో (రెనౌ), 6. లెక్లెర్క్ (ఫెరారీ), 7. ఒకాన్ (రెనౌ), 8. క్వియాట్ (అల్ఫాటౌరి) 9. పియరీ గాస్లీ (అల్ఫాటౌరి), 10. అలెగ్జాండర్ ఆల్బోన్ (రెడ్‌బుల్). -
హామిల్టన్‌కే పోల్ పొజిషన్
సోచి: ఫార్ములావన్ రేసింగ్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన మైకేల్ షుమాకర్ (91 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేయడానికి మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరింత చేరువయ్యాడు. శనివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 31.304 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కు పోల్ పొజిషన్ దక్కడం ఎనిమిదోసారి కావడం విశేషం. ఈ ఏడాది ఆరు టైటిల్స్ నెగ్గిన బ్రిటన్ డ్రైవర్ హామిల్టన్ రష్యా గ్రాండ్‌ప్రిలోనూ నెగ్గితే 91వ టైటిల్‌తో షుమాకర్ రికార్డును సమం చేస్తాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానం నుంచి... బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. -
హామిల్టన్ సిక్సర్
టస్కన్ (ఇటలీ): గత రేసులో ఎదురైన పరాజయాన్ని పక్కనపెట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మళ్లీ విజయం రుచి చూశాడు. ఆదివారం జరిగిన టస్కన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో తొమ్మిది రేసులు జరగ్గా అందులో హామిల్టన్‌కిది ఆరో విజయం కావడం విశేషం. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ నిర్ణీత 59 ల్యాప్‌లను 2 గంటల 19 నిమిషాల 35.060 సెకన్లలో ముగించి తన కెరీర్లో 90వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఈ క్రీడ చరిత్రలో 1000వ రేసులో బరిలోకి దిగిన ఫెరారీ జట్టుకు ఆశించిన ఫలితం రాలేదు. ఆ జట్టు డ్రైవర్లు చార్లెస్ లెక్లెర్క్ 8వ స్థానంలో నిలిచి 4 పాయింట్లు... సెబాస్టియన్ వెటెల్ 10వ స్థానంలో నిలిచి ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకున్నారు. రేసులో మొత్తం 20 మంది డ్రైవర్లు పాల్గొనగా... 8 మంది రేసును పూర్తి చేయకుండానే వైదొలిగారు. తొలి ల్యాప్‌లోనే మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), పియర్ గ్యాస్లీ (అల్ఫా టౌరి) కార్లు ఢీ కొట్టుకొని తప్పుకోగా... ఐదో ల్యాప్‌లో మాగ్నుసెన్ (హాస్), గియోవినాజి (అల్ఫా రోమియో), కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్) కార్లు ఢీ కొట్టుకోవడంతో రేసు నుంచి నిష్క్రమించారు. ఆరో ల్యాప్‌లో నికొలస్ లతీఫి (విలియమ్స్), ఏడో ల్యాప్‌లో ఒకాన్ (రెనౌ), 42వ ల్యాప్‌లో లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్) వెనుదిరిగారు. రేసులో మూడుసార్లు అంతరాయం కలగడంతో గంటన్నరలోపే ముగియాల్సిన రేసు రెండు గంటలకుపైగా సాగింది. తొమ్మిది రేసుల తర్వాత హామిల్టన్ 190 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ విభాగంలో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి ఈనెల 27న సోచి నగరంలో జరుగుతుంది. -
హామిల్టన్‌కు చుక్కెదురు
మోంజా (ఇటలీ): పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ఇటలీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో ప్రపంచ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు చుక్కెదురైంది. ఊహించని విధంగా అల్ఫా టౌరి జట్టు డ్రైవర్ పియర్ గాస్లీ (ఫ్రాన్స్) విజేతగా అవతరించాడు. 53 ల్యాప్‌ల రేసును 10వ స్థానం నుంచి ప్రారంభించిన 24 ఏళ్ల గాస్లీ గంటా 47 నిమిషాల 06.056 సెకన్లలో రేసుని ముగించి తన కెరీర్లో తొలి ఎఫ్1 టైటిల్‌ను సొంతం చేసుకొని సంచలనం సృష్టించాడు. తద్వారా 1996లో ఒలివర్ పానిస్ (మొనాకో గ్రాండ్‌ప్రి) తర్వాత ఎఫ్1 రేసులో టైటిల్ గెలిచిన తొలి ఫ్రాన్స్ డ్రైవర్‌గా గాస్లీ గుర్తింపు పొందాడు. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్) రెండో స్థానాన్ని, లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్) మూడో స్థానాన్ని పొందారు. -
హామిల్టన్ ‘హ్యాట్రిక్’ పోల్ పొజిషన్
మోంజా (ఇటలీ): వేదిక మారినా... ట్రాక్ ఏదైనా... తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ... రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ఆరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 18.887 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో ఆస్ట్రియా, హంగేరి, బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలలో వరుసగా... మళ్లీ స్పెయిన్, బెల్జియం, ఇటలీ గ్రాండ్‌ప్రిలలో వరుసగా హామిల్టన్‌కు ‘పోల్ పొజిషన్’ దక్కడం విశేషం. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 94వ పోల్ పొజిషన్. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానం నుంచి, మెక్లారెన్ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఫెరారీ జట్టు డ్రైవర్లు 1984 తర్వాత తొలిసారి సొంతగడ్డపై టాప్–10లో లేకుండా రేసును ప్రారంభించనున్నారు. -
హామిల్టన్‌కే టైటిల్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఈ సీజన్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన ఖాతాలో ఐదో విజయాన్ని జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ నిర్ణీత 44 ల్యాప్‌లను గంటా 24 నిమిషాల 08.761 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 89వ టైటిల్ కావడం విశేషం. మరో రెండు టైటిల్స్ గెలిస్తే అత్యధిక ఎఫ్1 టైటిల్స్ గెలిచిన జర్మనీ దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ (91 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ సమం చేస్తాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానాన్ని పొందాడు. ఒకే రేసులో ఇద్దరు మెర్సిడెస్ డ్రైవర్లు టాప్–2లో ఉండటం ఇది 50వసారి కావడం విశేషం. ఏడు రేసులు ముగిసిన ఈ సీజన్లో ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్ 157 పాయింట్లతో ‘టాప్’లో ఉన్నాడు. బెల్జియం గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. బొటాస్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. రికియార్డో (రెనౌ), 5. ఒకాన్ (రెనౌ), 6. అల్బోన్ (రెడ్‌బుల్), 7. నోరిస్ (మెక్లారెన్), 8. గాస్లీ (అల్ఫా టౌరి), 9. లాన్స్ స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 10. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్). -
హామిల్టన్‌కే ‘పోల్’
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఈ సీజన్లో తన జోరును కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఐదోసారి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. శనివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 41.252 సెకన్లలో ముగించాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ సహచరుడు, మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరు రేసులు జరగ్గా... నాలుగింటిలో హామిల్టన్ విజయం సాధించాడు. బొటాస్ (మెర్సిడెస్), వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) ఒక్కో విజయాన్ని అందుకున్నారు. నేటి సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు మొదలయ్యే బెల్జియం గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. బొటాస్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. రికియార్డో (రెనౌæ), 5. ఆల్బోన్ (రెడ్‌బుల్), 6. ఒకాన్ (రెనౌ), 7. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్), 8. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్), 9. లాన్స్ స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 10. లాండో నోరిస్ (మెక్లారెన్), 11. డానిల్ క్వియాట్ (అల్ఫా టౌరి), 12. పియరీ గాస్లీ (అల్ఫా టౌరి), 13. చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ), 14. వెటెల్ (ఫెరారీ), 15. జార్జి రసెల్ (విలియమ్స్), 16. రైకోనెన్ (అల్ఫా రోమియో), 17. గ్రోస్యెన్ (హాస్), 18. గియోవినాజి (అల్ఫా రోమియో), 19. నికోలస్ లతిఫి (విలియమ్స్), 20. మాగ్నుసెన్ (హాస్). -
హామిల్టన్ హవా
బార్సిలోనా (స్పెయిన్): క్వాలిఫయింగ్‌లో మొదలైన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో నాలుగో విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో హామిల్టన్ చాంపియన్‌గా నిలిచాడు. 66 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన హామిల్టన్ ఆద్యంతం తన ఆధిక్యాన్ని కొనసాగించి అందరికంటే ముందుగా గంటా 31 నిమిషాల 45.279 సెకన్లలో లక్ష్యానికి చేరి విజేత అయ్యాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 88వ విజయం కావడం విశేషం. రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ రెండో స్థానంలో, మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ మూడో స్థానంలో నిలిచారు. సీజన్లో ఆరు రేసులు ముగిశాక డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్ 132 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి ఈనెల 30న జరుగుతుంది. -
బొటాస్‌కు ‘పోల్ పొజిషన్’
సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): మరోసారి మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు తమ సత్తా చాటుకున్నారు. వరుసగా ఐదో రేసులోనూ ‘పోల్ పొజిషన్’ను సాధించారు. శనివారం జరిగిన ఫార్ములావన్ (ఎఫ్1) 70వ వార్షికోత్సవ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ ‘పోల్ పొజిషన్’ దక్కించుకున్నాడు. బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 25.154 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి... ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ రెండో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. రేసింగ్ పాయింట్ జట్టు సబ్‌స్టిట్యూట్ డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ మూడో స్థానంలో నిలువడం విశేషం. రేసింగ్ పాయింట్ రెగ్యులర్ డ్రైవర్ సెర్గియో పెరెజ్‌కు కరోనా సోకడంతో హుల్కెన్‌బర్గ్‌కు అవకాశం దక్కింది. గత ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో హుల్కెన్‌బర్గ్ పాల్గొన్నా ప్రధాన రేసు మొదలయ్యే సమయానికి కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో అతను ట్రాక్‌పైకి రాకుండానే వైదొలిగాడు. తన కెరీర్లో 177 రేసుల్లో పాల్గొన్న హుల్కెన్‌బర్గ్ ఏనాడూ టాప్–3లో నిలువలేకపోయాడు. ఎఫ్1 మొదలై ఏడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఎఫ్1 తొలి రేసు వేదిక సిల్వర్‌స్టోన్ సర్క్యూట్లో ఈ రేసును నిర్వహిస్తున్నారు. ఈ సీజన్లో తొలి రేసులో బొటాస్ ‘పోల్’ పొందగా... మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ తర్వాతి మూడు రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సాధించాడు. నేటి ప్రధాన రేసు గ్రిడ్ పొజిషన్స్: 1. బొటాస్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. నికో హుల్కెన్‌బర్గ్ (రేసింగ్ పాయింట్), 4. మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 5. రికియార్డో (రెనౌ), 6. లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్), 7. పియరీ గాస్లే (అల్ఫా టౌరి), 8. చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ), 9. అలెగ్జాండర్ అల్బోన్ (రెడ్‌బుల్), 10. లాండో నోరిస్ (మెక్లారెన్), 11. ఎస్తెబన్ ఒకాన్ (రెనౌ), 12. వెటెల్ (ఫెరారీ), 13. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్), 14. గ్రోస్యెన్ (హాస్), 15. జార్జి రసెల్ (విలియమ్స్), 16. డానిల్ క్వియాట్ (అల్ఫా టౌరి), 17. మాగ్నుసెన్ (హాస్), 18. నికోలస్ లతీఫి (విలియమ్స్), 19. గియోవినాజి (అల్ఫా రోమియో), 20. రైకోనెన్ (అల్ఫా రోమియో). -
రేసింగ్ పాయింట్ జట్టుపై రూ. 3 కోట్ల జరిమానా
సిల్వర్‌స్టోన్: నిబంధనలకు విరుద్ధంగా... ప్రత్యర్థి కారుతో పోలి ఉన్న పరికరాలను వాడుతూ ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో పోటీపడుతున్న రేసింగ్ పాయింట్ జట్టుపై అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్ఐఏ) 4 లక్షల యూరోలు (రూ. 3 కోట్ల 54 లక్షలు) జరిమానా విధించింది. దాంతోపాటు కన్‌స్ట్రకర్స్ చాంపియన్‌షిప్‌లో ఆ జట్టు ఖాతాలో నుంచి 15 పాయింట్లు తొలగించింది. ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్, అతని సహచరుడు వాల్తెరి బొటాస్ సభ్యులుగా ఉన్న మెర్సిడెస్ జట్టు వాడుతున్న బ్రేక్ డక్ట్‌లను రేసింగ్ పాయింట్ జట్టు గత మూడు రేసుల్లో వాడిందని రెనౌ జట్టు స్టీవార్డ్స్‌కు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై విచారించిన స్టీవార్డ్స్ రెనౌ ఫిర్యాదులో నిజం ఉందని తేలుస్తూ రేసింగ్ పాయింట్ జట్టును హెచ్చరించి జరిమానా విధించడంతోపాటు పాయింట్లను తీసివేసింది. ప్రస్తుత ఫార్ములావన్ సీజన్లో నాలుగు రేసులు ముగిశాక కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ విభాగంలో రేసింగ్ పాయింట్ జట్టు 42 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా... 10 పాయింట్లతో రెనౌ జట్టు ఆరో స్థానంలో ఉంది. -
హామిల్టన్ ‘హ్యాట్రిక్’
సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): సొంతగడ్డపై దుమ్మురేపిన బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సీజన్‌లోని నాలుగో రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నిర్ణీత 52 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, ముందుగా గంటా 28 నిమిషాల 01.283 సెకన్లలో ముగించాడు. తద్వారా రికార్డుస్థాయిలో ఏడోసారి (2008, 2014, 2015, 2016, 2017, 2019, 2020) బ్రిటిష్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. రేసు మరో ల్యాప్‌లో ముగుస్తుందనగా హామిల్టన్ కారు టైరు పంక్చర్ కావడం గమనార్హం. పంక్చర్ టైరుతోనే హామిల్టన్ రేసును పూర్తి చేశాడు. మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో రేసింగ్ పాయింట్ డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ రేసును ప్రారంభించలేదు. క్వియాట్ (అల్ఫా టౌరి) 11వ ల్యాప్‌లో, మాగ్నుసెన్ (హాస్) తొలి ల్యాప్‌లో వైదొలిగారు. ఈ గెలుపుతో సొంతగడ్డపై అత్యధిక ఎఫ్1 టైటిల్స్ గెలిచిన తొలి డ్రైవర్‌గా హామిల్టన్ రికార్డు సృష్టించాడు. ఈ రేసుకంటే ముందు ఫ్రాన్స్ డ్రైవర్ అలైన్ ప్రాస్ట్ (ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి–6 సార్లు)తో హామిల్టన్ సమఉజ్జీగా ఉన్నాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 87వ ఎఫ్1 టైటిల్. మరో నాలుగు టైటిల్స్ గెలిస్తే అత్యధిక ఎఫ్1 టైటిల్స్ నెగ్గిన మైకేల్ షుమాకర్ (91 విజయాలు) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ సమం చేస్తాడు. సీజన్‌లోని ఐదో రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి వేదికపైనే ఈనెల 9న జరుగుతుంది. ఆస్ట్రియా, హంగేరి, బ్రిటిష్ గ్రాండ్‌ప్రి విజయాలతో హామిల్టన్ 88 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. -
రికార్డుపై హామిల్టన్ గురి
సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): సొంతగడ్డపై అత్యధిక టైటిల్స్ గెలిచిన ఫార్ములావన్ (ఎఫ్1) తొలి డ్రైవర్‌గా గుర్తింపు పొందేందుకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో విజయం దూరంలో ఉన్నాడు. ఆదివారం జరిగే బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ ‘పోల్ పొజిషన్’తో బరిలోకి దిగనున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 24.303 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి కెరీర్లో 91వసారి పోల్ పొజిషన్ దక్కించుకున్నాడు. నేడు జరిగే ప్రధాన రేసులో హామిల్టన్ విజేతగా గెలిస్తే బ్రిటిష్ గ్రాండ్‌ప్రిని ఏడోసారి సొంతం చేసుకున్న డ్రైవర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం సొంతగడ్డపై అత్యధిక టైటిల్స్ నెగ్గిన రికార్డు విషయంలో హామిల్టన్, అలైన్ ప్రాస్ట్ (ఫ్రాన్స్–ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి; ఆరుసార్లు) సమఉజ్జీగా ఉన్నారు. రెండువారాల క్రితం హంగేరి గ్రాండ్‌ప్రిలో టైటిల్ నెగ్గిన హామిల్టన్ ఒకే రేసును అత్యధికంగా ఎనిమిదిసార్లు గెలిచిన డ్రైవర్‌గా మైకేల్ షుమాకర్ (ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి–8 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసు గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. బొటాస్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. లెక్లెర్క్ (ఫెరారీ), 5. లాండో నోరిస్ (మెక్లారెన్), 6. లాన్స్ స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 7. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్), 8. రికియార్డో (రెనౌ), 9. ఎస్తెబన్ ఒకాన్ (రెనౌ), 10. వెటెల్ (ఫెరారీ), 11. పియరీ గాస్లీ (అల్ఫా టౌరి), 12. ఆల్బోన్ (రెడ్‌బుల్), 13. హుల్కెన్‌బర్గ్ (రేసింగ్ పాయింట్), 14. జార్జి రసెల్ (విలియమ్స్), 15. మాగ్నుసెన్ (హాస్), 16. గియోవినాజి (అల్ఫా రోమియో), 17. రైకోనెన్ (అల్ఫా రోమియో), 18. గ్రోస్యెన్ (హాస్), 19. క్వియాట్ (అల్ఫా టౌరి), 20. నికోలస్ లటీఫి (విలియమ్స్). -
హామిల్టన్ @ 90
బుడాపెస్ట్: అచ్చొచ్చిన ట్రాక్‌పై మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి దూసుకెళ్లాడు. తన కెరీర్లో 90వ పోల్‌ను సాధించాడు. శనివారం జరిగిన ఫార్ములా వన్ (ఎఫ్1) హంగేరి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో అందరికంటే వేగంగా ల్యాప్‌ను పూర్తి చేసిన అతను పోల్ సిట్టర్‌గా నిలిచాడు. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. తాజా పోల్ విజయంతో ఏడో సారి ఈ ఘనత సాధించిన హామిల్టన్... ఇదే ట్రాక్‌పై అత్యధిక పోల్ పొజిషన్ల మైకేల్ షూమాకర్ రికార్డును సమం చేశాడు. క్వాలిఫయింగ్ చివరి సెషన్లో ల్యాప్‌ను ఒక నిమిషం 13.447 సెకన్లలో పూర్తి చేసిన హామిల్టన్ అగ్రస్థానంలో నిలవగా... మెర్సిడెస్‌కే చెందిన మరో డ్రైవర్ వాల్తెరి బొటాస్ 0.107 సెకన్లు తేడాతో ల్యాప్‌ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది పోల్ పొజిషన్ సాధించిన రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ సారి మాత్రం ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. బొటాస్ (మెర్సిడెస్), 3. స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 4. పెరెజ్ (రేసింగ్ పాయింట్), 5. వెటెల్ (ఫెరారీ), 6. లెక్లెర్క్ (ఫెరారీ), 7. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 8. నోరిస్ (మెక్లారెన్), 9. సెయింజ్ (మెక్లారెన్), 10. గాస్లీ (అల్ఫా టోరి). -
హామిల్టన్‌దే విజయం
స్పీల్బర్గ్ (ఆస్ట్రియా): క్వాలిఫయింగ్ సెషన్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అద్భుతంగా రాణించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ప్రధాన రేసులోనూ అదే జోరు కొనసాగించాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ నిర్ణీత 71 ల్యాప్‌లను అందరికంటే ముందుగా గంటా 22 నిమిషాల 50.683 సెకన్లలో పూర్తి చేసి టైటిల్ గెలిచాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 85వ టైటిల్ కావడం విశేషం. జర్మనీ దిగ్గజం మైకేల్ షుమాకర్ (91) పేరిట ఉన్న అత్యధిక ఎఫ్1 టైటిల్స్ రికార్డు సమం చేసేందుకు హామిల్టన్ మరో ఆరు విజయాల దూరంలో ఉన్నాడు. మెర్సిడెస్‌కే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానాన్ని పొందగా... వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచాడు. ఫెరారీ డ్రైవర్లు వెటెల్, లెక్లెర్క్ తొలి ల్యాప్‌లోనే పరస్పరం ఢీకొట్టుకొని రేసు నుంచి నిష్క్రమించారు. సీజన్‌లోని మూడో రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 17న జరుగుతుంది. ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10) 1. లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్), 2. వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. ఆల్బోన్ (రెడ్‌బుల్), 5. నోరిస్ (మెక్లారెన్), 6. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్), 7. స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 8. రికియార్డో (రెనౌ), 9. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్), 10. డానియల్ క్వియాట్ (అల్ఫాటౌరి). -
హామిల్టన్ హవా
స్పీల్బర్గ్ (ఆస్ట్రియా): ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుత ప్రతిభతో అదరగొట్టడంలో తనకు ఎదురులేదని ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నిరూపించాడు. శనివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును పోల్ పొజిషన్‌తో ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 89వ పోల్ పొజిషన్ కావడం విశేషం. క్వాలిఫయింగ్ చివరి సెషన్లో ల్యాప్‌ను ఒక నిమిషం 19.273 సెకన్లలో పూర్తి చేసిన హామిల్టన్ అగ్రస్థానాన్ని సంపాదించాడు. క్వాలిఫయింగ్ సెషన్ జరుగుతున్నంతసేపూ భారీ వర్షం కురిసింది. దాంతో డ్రైవర్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఇలాంటి స్థితిలోనూ హామిల్టన్ ఒత్తిడికి లోనుకాకుండా నియంత్రణతో డ్రైవింగ్ చేసి తన ప్రత్యర్థులను వెనక్కి నెట్టాడు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్), 4. బొటాస్ (మెర్సిడెస్), 5. ఒకాన్ (రెనౌ), 6. నోరిస్ (మెక్లారెన్), 7. ఆల్బోన్ (రెడ్‌బుల్), 8. పియరీ గాస్లీ (అల్ఫా టౌరి), 9. రికియార్డో (రెనౌ), 10. వెటెల్ (ఫెరారీ), 11. లెక్లెర్క్ (ఫెరారీ), 12. రసెల్ (విలియమ్స్), 13. స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 14. క్వియాట్ (అల్ఫా టౌరి), 15. మాగ్నుసెన్ (హాస్), 16. రైకోనెన్ (అల్ఫా రోమియో), 17. పెరెజ్ (రేసింగ్ పాయింట్), 18. నికోలస్ లతీఫి (విలియమ్స్), 19. గియోవినాజి (అల్ఫా రోమియో), 20. గ్రోస్యెన్ (హాస్). -
ఎకిల్‌స్టోన్ ఓ అజ్ఞాని: హామిల్టన్
పారిస్: ‘తెల్లవారికంటే నల్లవారే ఎక్కువగా జాతి వివక్షను ప్రదర్శిస్తారు’ అంటూ ఫార్ములావన్ (ఎఫ్1) మాజీ చీఫ్ బెర్నీ ఎకిల్‌స్టోన్ చేసిన వ్యాఖ్యలపై వరల్డ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మండి పడ్డాడు. అతను ఒక అజ్ఞాని అంటూ తీవ్రంగా విమర్శించాడు. ఇటీవలి జాతి వివక్ష నేపథ్యంలో అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఎకిల్‌స్టోన్... ‘ఈ వివాదం ప్రభావం ఫార్ములావన్‌పై ఏ రకంగానూ ఉండదు. అయితే అందరూ ఆలోచించే తీరు మాత్రం మారుతుంది. తెల్లవారైనా, నల్లవారైనా అవతలి వారి గురించి తప్పుగానే ఆలోచిస్తారు. ఇంకా చెప్పాలంటే నల్లజాతివారే ఎక్కువగా జాతి వివక్షను ప్రదర్శిస్తారు. దీనికి నేను రుజువులు చూపించలేనుగానీ ఇన్నేళ్లుగా నాకు అలాగే అనిపించింది’ అన్నాడు. 89 ఏళ్ల ఎకిల్‌స్టోన్ వ్యాఖ్యలు హామిల్టన్‌కు ఆగ్రహం తెప్పించాయి. దాంతో అతను కూడా ఎదురుదాడికి దిగాడు. ‘బెర్నీ ఆటకు దూరమై చాలా కాలమైంది. అతను పాత తరానికి చెందినవాడు. అయితే ఏమీ తెలియని ఇలాంటి అజ్ఞానులు చేసే వ్యాఖ్యలు చూస్తుంటేనే జాతి వివక్ష విషయంలో అంతరాలు తొలగించడం ఎంత కష్టమో అర్థమవుతుంది. సుదీర్ఘ కాలం ఒక క్రీడకు పరిపాలకుడిగా వ్యవహరించిన వ్యక్తికి దిగువ స్థాయిలో తీవ్రంగా ఉన్న సమస్య గురించి ఇలాంటి అవగాహన ఉంటే అతని వద్ద ఇన్నేళ్లుగా పని చేసినవారి ఆలోచనలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు’ అని వ్యాఖ్యానించాడు. మరోవైపు ఎఫ్1 మేనేజ్మెంట్ మాత్రం ఎకిల్‌స్టోన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన ఏ హోదాలో లేరని స్పష్టం చేసింది. -
ఈ కర్కశంపై మాట్లాడరేంటి?
చార్లొట్ (అమెరికా): అమెరికాలో ఓ నల్లజాతీయుడిని శ్వేతజాతి పోలీస్ అత్యంత కర్కశంగా హత్య చేసిన ఘటనపై ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ గళం విప్పాడు. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిపై పడగవిప్పిన జాతి వివక్షపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ నల్లజాతి రేసర్ అయిన హామిల్టన్ స్పందిస్తూ ఈ దురాగతంపై స్పందించరా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ‘ఈ కర్కశ హత్యపై నా క్రీడ నుంచి ఎవరు మాట్లాడరేంటి. బహుశా శ్వేతజాతీయుల ఆధిపత్యం ఉన్న క్రీడ కాబట్టే పెదవి విప్పడం లేదనుకుంటా’ అని సోషల్ మీడియాలో తన ఆక్రోశాన్ని వెలిబుచ్చాడు. వెంటనే ఫార్ములావన్ క్రీడాలోకం స్పందించడం మొదలుపెట్టింది. వర్ణ వివక్ష హత్యపై నిరసించింది. రేసర్లతో పాటు మిగతా క్రీడలకు చెందిన స్టార్లు కూడా జరిగిన ఘోరంపై స్పందించారు. జార్జ్ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాల్సిందేనని సోషల్ మీడియా వేదికపై నినదించారు. బాధగా ఉంది... కోపమొస్తోంది: జోర్డాన్ ఆఫ్రికన్–అమెరికన్‌ను శ్వేతజాతి పోలీసు కర్కశంగా చంపడం తనను చాలా బాధించిందని అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ అన్నాడు. ‘ఆ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. నిజంగా చెబుతున్నా... చాలా బాధగా ఉంది. అలాగే కోపంగా కూడా ఉంది. జాతి వివక్ష హత్యపై అందరూ కదం తొక్కుతున్నారు. తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికైనా జాత్యహంకారం తొలగిపోవాలి. హింస సద్దుమణగాలి’ అని ఎన్బీఏ సూపర్‌స్టార్ జోర్డాన్ అన్నాడు. -
స్వీయ నిర్బంధంలో హామిల్టన్
లండన్: బ్రిటన్‌కు చెందిన దిగ్గజ రేసర్, ఆరుసార్లు ఫార్ములావన్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు శనివారం తెలిపాడు. తనలో కరోనా వైరస్ లక్షణాలేమీ లేవని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్వారంటైన్లోకి వెళ్లిపోయానని అతను పేర్కొన్నాడు. స్టార్ రేసర్ అయిన 35 ఏళ్ల హామిల్ట న్ ఈనెల 4న లండన్‌లో జరిగిన చారిటీ ఈవెంట్లో నటుడు ఇడ్రిస్ ఎల్బా, కెనడా ప్రధాని పియరీ భార్య సోఫీ గ్రెగోరీలతో కలిసి పాల్గొన్నాడు. అయితే తాజాగా ఎల్బీ, సోఫీ కోవిడ్–19 పాజిటివ్‌గా తేలడంతో హామిల్టన్ స్వీయ నిర్బంధాన్ని పాటిస్తున్నట్లు చెప్పాడు. ‘ఇడ్రిస్, సోఫీలను కలిసి 17 రోజులు దాటింది. నేను చాలా బాగున్నా. ఎలాంటి వైరస్ లక్షణాలు లేవు. వైద్యులు ఒకటికి రెండుసార్లు పరీక్షించి చెప్పారు’ అని హమిల్టన్ తెలిపాడు. -
వెర్‌స్టాపెన్‌దే బ్రెజిల్ గ్రాండ్ ప్రి
బ్రాసిల్: ఈ సీజన్ ఫార్ములావన్‌లో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో టైటిల్ గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన బ్రెజిల్ గ్రాండ్ ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల రేసును 1 గంటీ 33 నిమిషాల 14.678 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. దాంతో బ్రెజిల్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు. క్వాలిఫయింగ్ రేసులో తొలిస్థానంలో నిలిచిన వెర్స్టాపెన్.. ఫైనల్ రేసులో కూడా అదరగొట్టాడు. ఇక టోరో రోస్సో డ్రైవర్ పీర్రే గాస్లీ రెండో స్థానంలో నిలిచాడు. కాగా, ఇటీవల మెక్సికో గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలిచిన తర్వాత వరల్డ్‌చాంపియన్ షిప్టైటిల్ను గెలుచుకున్న మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్.. బ్రెజిల్ ఫార్ములావన్ రేసులో ఏడోస్థానంతో సరిపెట్టుకున్నాడు. హామిల్టన్ మూడో స్థానంలో నిలవాల్సి ఉన్నప్పటికీ లైన్‌ను క్రాస్ చేయడంతో ఐదు పెనాల్టీ పాయింట్లు కారణంగా ఏడోస్థానానికి పడిపోయాడు. ఇది వెర్‌స్టాపెన్‌కు ఈ సీజన్లో మూడో టైటిల్. అంతకుముందు ఆస్ట్రియా, జర్మన్ గ్రాండ్ ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. కాగా, తన కెరీర్లో వెర్‌స్టాపెన్‌కు ఇది ఎనిమిదో టైటిల్. అయితే ఈ సీజన్లో పోల్ పొజిషన్‌ను సాధించడం మాత్రం వెర్‌స్టాపెన్‌కు ఇది తొలిసారి. ఇక ఫెరారీ డ్రైవర్లు సెబాస్టియన్ వెటల్, చార్లెస్ లీక్లెర్క్ల కార్లు ఢీకొట్టుకోవడంతో ఆ ఇద్దరి అర్హత సాధించలేకపోయారు. -
ఆరోసారి ప్రపంచ చాంపియన్‌గా..
టెక్సాస్: ఫార్ములావన్ చరిత్రలో బ్రిటన్‌కు చెందిన మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరొకసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం ముగిసిన యూఎస్ గ్రాండ్ ప్రిలో రెండో స్థానంలో నిలిచిన హామిల్టన్.. వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించాడు. తన ఫార్ములావన్ కెరీర్లో హామిల్టన్ వరల్డ్‌చాంపియన్‌గా నిలవడం ఆరోసారి. ఫలితంగా అర్జెంటీనాకు చెందిన జువాన్ మాన్యుల్ ఫాంగియో రికార్డును హామిల్టన్ బ్రేక్ చేశాడు. ఫాంగియో ఐదుసార్లు వరల్డ్‌చాంపియన్‌గా నిలవగా ఆ రికార్డును హామిల్టన్ బద్దలు కొట్టాడు. ఒక ఆల్‌టైమ్ జాబితాలో టాప్‌లో నిలిచేందుకు హామిల్టన్ అడుగుదూరంలో ఉన్నాడు. ఫార్ములావన్‌లో అత్యధికంగా వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలిచిన జాబితాలో జర్మన్‌కు చెందిన మైకేల్ స్కూమచర్ ఉన్నాడు. స్కూమచర్ ఏడుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలిచాడు. దాంతో హామిల్టన్ మరొకసారి చాంపియన్‌గా నిలిస్తే స్కూమచర్ సరసన నిలుస్తాడు. యూఎస్ గ్రాండ్ ప్రి తర్వాత హామిల్టన్ 381 పాయింట్లు సాధించి ఈ సీజన్లో టాప్‌లో నిలిచాడు. యూఎస్ గ్రాండ్ ప్రిలో హామిల్టన్ తన రేసును రెండో స్థానంతో ముగించగా, సహచర డ్రైవర్ బొటాస్ విజయం సాధించాడు. మొత్తం 21 ఫార్ములావన్ రేసుల్లో హామిల్టన్ పదింటిని గెలుచుకున్నాడు. దాంతో ఇంకా రెండు గ్రాండ్ ప్రిలో ఉండగానే వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను హామిల్టన్ గెలుచుకున్నాడు. ఇది హామిల్టన్‌కు వరుసగా మూడో వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ కాగా, అంతకుముందు 2008, 2014, 2015 సంవత్సరాల్లో కూడా హామిల్టన్ ప్రపంచ చాంపియన్ టైటిల్స్ సాధించాడు. -
హ్యాట్రిక్ వరల్డ్ టైటిల్‌కు స్వల్ప దూరంలో..
మెక్సికో: మరోసారి వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచేందుకు మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ స్వల్ప దూరంలో నిలిచాడు. 2017, 2018 సంవత్సరాల్లో వరుసగా వరల్డ్చాంపియన్షిప్ టైటిల్స్ సాధించిన హామిల్టన్ హ్యాట్రిక్ టైటిల్ సాధించడానికి నాలుగు పాయింట్ల దూరంలో నిలిచాడు. ఆదివారం జరిగిన మెక్సికో గ్రాండ్ ప్రి రేసులో హామిల్టన్ విజేతగా నిలవడంతో తన చాంపియన్‌షిప్ టైటిల్‌ను కాపాడుకోవడానికి మరింత చేరువయ్యాడు. మెక్సికో గ్రాండ్ ప్రి రేసును మూడో స్థానం నుంచి ఆరంభించిన హామిల్టన్.. ప్రత్యర్థి రేసర్లను వెనక్కినెట్టుతూ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ 71 ల్యాప్‌ల రేసును 1 గంటా 36 నిమిషాల 48. 904 సెకన్లలో పూర్తి చేసిన విజయం సాధించాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా, మెర్సిడెస్కు చెందిన బోటాస్ మూడో స్థానంలో నిలిచాడు. తాజా విజయంతో 25 పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కు ఇది పదో విజయం. ఫలితంగా మొత్తం 363 పాయింట్లతో ముందుంజలో ఉన్నాడు. ఆపై తన జట్టుకే చెందిన బోటాస్ 289 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇది హామిల్టన్‌కు రెండో మెక్సికో గ్రాండ్ ప్రి టైటిల్ కాగా, కెరీర్లో 83వ టైటిల్. ఇక మెర్సిడెస్ జట్టుకు ఫార్ములావన్‌లో 100వ విజయం. ఇక తదుపరి రేసు యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిలో హామిల్టన్ ఎనిమిదో స్థానంలో నిలిచినా వరల్డ్ చాంపియన్‌గా నిలుస్తాడు. 2008, 2014, 2015ల్లో వరల్డ్‌చాంపియన్‌గా నిలిచిన హామిల్టన్.. 2017,2018ల్లో కూడా చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. ఇప్పటివరకూ ఐదు వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలిచిన హామిల్టన్.. ఆరో చాంపియన్‌షిప్‌పై గెలిచాడు. ఇక వరల్డ్ కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో కూడా మెర్సిడెస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
హామిల్టన్‌ను భయపెట్టారు..!
మెక్సికో: ఐదుసార్లు ఫార్ములావన్ వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలిచిన బ్రిటిన్‌కు చెందిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌ను భయపెట్టిన క్షణాలను మెర్సిడెస్ టీమ్ చీఫ్ టోటో వూల్ఫ్ మరొకసారి గుర్తు చేసుకున్నారు. మెక్సికో ఫార్ములావన్ గ్రాండ్ ప్రిలో భాగంగా వూల్ఫ్ మాట్లాడాడు. ‘ హామిల్టన్ నల్లగా ఉండటం వల్ల అతనిపై వర్ణ వివక్షతో భయపెట్టారు. హామిల్టన్‌కు సుమారు 10 ఏళ్ల వయసులో ట్రాక్‌లోకి వచ్చినప్పుడు తోటి పిల్లలు అతన్ని నువ్వు నల్లగా ఉన్నావంటూ హేళన చేశారు. అదే సమయంలో ఫార్ములావన్ నీవల్ల కాదంటూ బెదిరింపులకు దిగారు. అదే హామిల్టన్‌ను చాంపియన్గాన్ నిలబెట్టింది. అతనిలోని వ్యక్తిత్వాని మరింత రాటుదేలేలా చేసింది. ఒకవైపు కామెంట్లు వస్తున్నా హామిల్టన్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ రోజు హామిల్టన్ అంటే ఏమిటో ప్రపంచానికి తెలుసు. ఆ వర్ణ వివక్ష వ్యాఖ్యలు హామిల్టన్‌ను తీర్చిదద్దడమే కాదు.. అతను ప్రస్తుతం నివస్తిన్న జీవితానికి సాక్షాలు. ఆ విమర్శలే హామిల్టన్‌ను వ్యక్తిగా ఎంతో పరిణితి సాధించిపెట్టాయి. ప్రతీసారి హామిల్టన్‌కు ఎదురైన చేదు అనుభవాలతో ఈ స్థాయికి రావడం అంటే మాటలు కాదు’ అని టోటో వూల్ఫ్ పేర్కొన్నారు. ఈ సీజన్ ఫార్ములావన్ గ్రాండ్ ప్రిలో హామిల్టన్ తొమ్మిందిట విజేతగా నిలిచాడు. మొత్తంగా 338 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంకా ఈ ఏడాది నాలుగు రేసులో మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో హామిల్టన్ మరోసారి చాంపియన్‌షిప్‌పై కన్నేశాడు. కనీసం రెండు రేసుల్లో మూడో స్థానంలో నిలిచినా చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుస్తాడు. 2017, 2018 సంవత్సరాల్లో వరుసగా వరల్డ్చాంపియన్షిప్ టైటిల్స్ సాధించిన హామిల్టన్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. గతేడాది 408 పాయింట్లతో చాంపియన్‌షిప్‌ను హామిల్టన్ గెలుచుకున్నాడు. -
హామిల్టన్‌ను గెలిపించిన ఫెరారీ
సోచి: గెలవాల్సిన రేసును బంగారు పళ్లెంలో పెట్టి మెర్సిడెస్కు అప్పగించింది ఫెరారీ. ప్రత్యర్థి పేలవ రేసు వ్యూహాన్ని అనుకూలంగా మార్చుకున్న మెర్సిడెస్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ ఈ సీజన్లో తొమ్మిదో విజయాన్ని నమోదు చేశాడు. దీంతో ఆరోసారి ప్రపంచ డ్రైవర్ చాంపియన్‌గా అవతరించడానికి మరింత దగ్గరయ్యాడు. ఆదివారం 53 ల్యాప్‌ల ప్రధాన రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన అతను అందరి కంటే ముందుగా గంటా 33 నిమిషాల 38.992 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. మరో మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ 3.829 సెకన్ల వెనుకగా రేసును ముగించి రెండో స్థానంలో నిలువగా... పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా రేసు మధ్యలోనే వైదొలిగాడు. రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్, ఆల్బన్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. అందరి కంటే చివరగా... పిట్లేన్ నుంచి రేసును ఆరంభించిన ఆల్బన్ అద్భుతమైన డ్రైవింగ్‌తో ఐదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం డ్రైవర్ ఛాంపియన్ షిప్ లో హామిల్టన్ 322 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 73 పాయింట్ల తేడాతో బొటాస్ రెండో స్థానంలో ఉన్నాడు. తదుపరి గ్రాండ్‌ప్రి అక్టోబర్ 13న జపాన్‌లో జరుగుతుంది. -
‘బహ్రెయిన్’ విజేత హామిల్టన్
బహ్రెయిన్: నాటకీయంగా సాగిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రిలో డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ లూయీస్ హామిల్టన్ (మెర్సిడెస్) విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. 1 గంట 34 నిమిషాల 21.29 సెకన్లలో హామిల్టన్ రేసును పూర్తి చేశాడు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానంలో నిలిచాడు. రేసు ఆరంభంనుంచి వేగంగా దూసుకుపోయి విజేతగా నిలుస్తాడని అనిపించిన చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ)ని దురదృష్టం వెంటాడింది. అతని కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరకు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 సీజన్లో ప్రస్తుతం అగ్రస్థానంలో బొటాస్ కొనసాగుతుండగా... తర్వాతి రేసు ఏప్రిల్ 12–14 మధ్య చైనా గ్రాండ్ ప్రి రేసు జరుగనుంది. -
టైటిల్ వేటకు వేళాయె...!
మెల్బోర్న్: గతేడాది మాదిరిగానే ఈసారీ ఫార్ములావన్ సీజన్ తొలి గ్రాండ్‌ప్రి రేసులో ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఆదివారం జరిగే 2019 సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిని మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 20.486 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్‌కే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానం నుంచి... డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానం నుంచి రేసును మొదలు పెడతారు. 2019 ఫార్ములావన్ సీజన్లో ముగ్గురు కొత్త డ్రైవర్లు అరంగేట్రం చేయనున్నారు. లాండో నోరిస్ (మెక్లారెన్ ), రసెల్ (విలియమ్స్), అలెగ్జాండర్ అల్బోన్ (ఎస్టీఆర్) ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో తొలిసారి బరిలోకి దిగనున్నారు. ప్రపంచ మాజీ చాంపియన్ కిమీ రైకోనెన్ ఫెరారీ జట్టు నుంచి అల్ఫా రోమియో జట్టుకు మారాడు. తొమ్మిదేళ్ల తర్వాత రాబర్ట్ కుబికా పునరాగమనం చేయనున్నాడు. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ప్రధాన రేసు గ్రిడ్ పొజిషన్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. బొటాస్ (మెర్సిడెస్), 3. వెటెల్ (ఫెరారీ), 4. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 5. లెక్లెర్క్ (ఫెరారీ), 6. గ్రోస్యెన్ (హాస్), 7. మాగ్నుసెన్(హాస్), 8. నోరిస్ (మెక్లారెన్ ), 9. రైకోనెన్ (అల్ఫా రోమియో), 10. పెరెజ్ (రేసింగ్ పాయింట్), 11. హుల్కెన్‌బర్గ్ (రెనౌ), 12. రికియార్డో (రెనౌ), 13. అల్బోన్ (ఎస్టీఆర్), 14. గియోవినాజి (అల్ఫా రోమియో), 15. క్వియాట్ (ఎస్టీఆర్), 16. స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 17. గాస్లీ (రెడ్‌బుల్), 18. సెయింజ్ (మెక్లారె¯Œ ), 19. జార్జి రసెల్ (విలియమ్స్), 20. కుబికా (విలియమ్స్). ఉదయం గం. 10.35 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం -
జపాన్ గ్రాండ్‌ప్రి విజేత లూయిస్ హామిల్టన్
వేదిక మారిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ జోరు తగ్గలేదు. క్వాలిఫయింగ్‌లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ కొనసాగించాడు. ఫలితంగా ఈ సీజన్ ఫార్ములావన్‌లో తొమ్మిదో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. నిర్ణీత 53 ల్యాప్‌లను అందరికంటే ముందుగా అతను గంటా 27 నిమిషాల 17.062 సెకన్లలో పూర్తి చేశాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడు, ఒకాన్ తొమ్మిది స్థానాల్లో నిలిచారు. -
విజేత వెర్స్టాపెన్
స్పీల్బెర్గ్: నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మార్క్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్లపాటు సాగిన ఈ రేసును వెర్స్టాపెన్ గంటా 21 నిమిషాల 56.024 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫెరారీ జట్టు డ్రైవర్లు రైకోనెన్, వెటెల్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ 13వ ల్యాప్‌లో... అతని సహచరుడు హామిల్టన్ 62వ ల్యాప్‌లో వైదొలిగారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్ ఆరో స్థానంలో, ఒకాన్ ఏడో స్థానంలో నిలిచారు. సీజన్లో తొమ్మిది రేసులు ముగిశాక డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో వెటెల్ (146 పాయింట్లు) తొలి స్థానంలో, హామిల్టన్ (145 పాయింట్లు), రైకోనెన్ (101 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
వెటెల్ ‘హ్యాట్రిక్’ పోల్ పొజిషన్
బాకు (అజర్బైజాన్): ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ వరుసగా మూడో పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెటెల్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 41.498 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును వెటెల్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. -
మళ్లీ వెటెల్‌కే పోల్
షాంఘై: ఫార్ములావన్ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ ఈ సీజన్లో ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై కన్నేశాడు. చైనా గ్రాండ్‌ప్రిలోనూ అతను దూసుకెళ్తున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో ఫెరారీ డ్రైవర్ వెటెల్ తన జోరు చూపెట్టాడు. అందరికంటే వేగంగా ఒక నిమిషం 31.095 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి పోల్ పొజిషన్ సాధించాడు. నేడు జరిగే ప్రధాన రేసును అతను మొదటి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు. ఈ సీజన్లో రెండు టైటిళ్లు గెలిచిన వెటెల్‌కు వరుసగా ఇది రెండో పోల్ పొజిషన్. ఫెరారీ మరో డ్రైవర్ కిమి రైకోనెన్ (1:31.182 సె.) రెండో స్థానం పొందగా, మెర్సిడెస్ డ్రైవర్లు బొటాస్ (1:31.625 సె.), హామిల్టన్ (1:31. 675 సె.) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా ఎనిమిది, 12వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. -
ఎఫ్1 విశ్వవిజేత హామిల్టన్
మెక్సికో సిటీ:ఈ ఏడాది ఫార్మాలావన్ డ్రైవర్స్ చాంపియన్ షిప్ లో మెర్సిడెస్ జట్టుకు చెందిన బ్రిటీష్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విశ్వవిజేతగా నిలిచాడు. దాంతో ప్రపంచ ఫార్ములావన్ టైటిల్ ను హామిల్టన్ నాల్గోసారి సాధించాడు. భారతకాల మాన ప్రకారం ఆదివారం రాత్రి జరిగిన మెక్సికో ఫార్ములావన్ రేసులో హామిల్టన్ తొమ్మిదోస్థానంతో సరిపెట్టుకున్నాడు. దాంతో ఓవరాల్ గా హామిల్టన్ ఖాతాలో 333 పాయింట్లు చేరాయి. తద్వారా వరల్డ్ చాంపియన్ గా మరోసారి అవతరించాడు. 2008లో మెక్ లారెన్ తరపున బరిలోకి దిగిన హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్ షిప్ లో విజేతగా నిలవగా, 2014,15ల్లో మెర్సిడెస్ జట్టు తరపున విశ్వవిజేతగా నిలిచాడు. గతేడాది నికో రోస్ బర్గ్ విజేతగా నిలవగా, హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తాజాగా జరిగిన మెక్సికో రేసులో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ నాల్గో స్థానంలో నిలవడంతో హామిల్టన్ చాంపియన్ గా నిలవడానికి దోహదం చేసింది. మెక్సిక్ గ్రాండ్ ప్రి అనంతరం హామిల్టన్ పోటీగా ఉన్న వెటల్ 277 పాయింట్లతో కొనసాగుతున్నాడు. ఇంకా మిగిలి ఉన్న బ్రెజిలియన్ గ్రాండ్ ప్రి, అబుదాబి గ్రాండి ప్రిల్‌లో వెటల్ విజయం సాధించినప్పటికీ అతని ఖాతాలో 50 పాయింట్లు మాత్రమే చేరతాయి. అంటే 327 పాయింట్లను మాత్రమే వెటల్ సాధించే అవకాశం మాత్రమే ఉంది. దాంతో వెటల్ కు చాంపియన్ గా నిలిచే అవకాశం లేదు. ఆ క్రమంలోనే హామిల్టన్ కు ప్రపంచ టైటిల్ ఖాయమైంది. నిన్న జరిగిన మెక్సికో గ్రాండ్ ప్రిలో రెడ్ బుల్ కు చెందిన మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు.71 ల్యాప్ ల రేసును గంటా 36 నిమిషాల 26.552 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానం సాధించాడు. ఈ సీజన్ లో వెర్స్టాపెన్ కు ఇది రెండో ఎఫ్ 1 టైటిల్. అంతకుముందు మలేషియన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను వెర్స్టాపెన్ సాధించాడు. 23 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి.. డిఫెండింగ్ చాంపియన్ లేకుండా ఒక ఫార్ములావన్ సీజన్ జరగడం 1994 తరువాత ఇదే తొలిసారి. గతేడాది విశ్వవిజేతగా నిలిచిన నికో రోస్ బర్గ్ ఈసారి బరిలోకి దిగలేదు. ఆ చాంపియన్ షిప్ లో విజేతగా నిలిచిన వెంటనే తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో 23 ఏళ్ల తరువాత డిఫెండింగ్ చాంపియన్ లేకుండా ఫార్ములావన్ సీజన్ జరగడం విశేషం. -
హామిల్టన్ హవా
ఆస్టిన్ (అమెరికా): నాలుగోసారి ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకునే దిశగా మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో అడుగు ముందుకేశాడు. ఫార్ములావన్ సీజన్లో భాగంగా జరిగిన అమెరికా గ్రాండ్‌ప్రి రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ రేసులో హామిల్టన్ నిర్ణీత 56 ల్యాప్‌లను గంటా 33 నిమిషాల 50.991 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది తొమ్మిదో విజయం కావడం విశేషం. వెటెల్ (ఫెరారీ), రైకోనెన్ (ఫెరారీ), వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), బొటాస్ (మెర్సిడెస్) వరుసగా రెండు నుంచి నాలుగు స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఆరు, ఎనిమిది స్థానాలను సంపాదించారు. సీజన్‌లోని 20 రేసులకుగాను ప్రస్తుతం 17 రేసులు పూర్తయ్యాయి. హామిల్టన్ 331 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా... సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ–265 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. ఈనెల 28న జరిగే మెక్సికో గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ టాప్–5లో నిలిస్తే అతనికి ప్రపంచ టైటిల్ ఖాయమవుతుంది. -
హామిల్టన్‌కు పోల్
సుజుకా: బ్రిటిష్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో మరో ‘పోల్’ పొజిషన్ సాధించాడు. జపాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో ఈ మెర్సిడెజ్ డ్రైవర్ అందరి కంటే వేగంగా 1 నిమిషం 27.319 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తద్వారా సుజుకా సర్క్యూట్లో అత్యంత వేగంగా ల్యాప్‌ను పూర్తిచేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది పదో పోల్ పొజిషన్ కాగా... జపాన్ రేసులో మొదటిది. ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. క్వాలిఫయింగ్‌లో ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఈస్టెబన్ ఒకాన్ (1:29.111 సె.), పెరెజ్ (1:29.260 సె.) వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచారు. -
హామిల్టన్ హవా
ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం మోంజా (ఇటలీ): క్వాలిఫయింగ్‌లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ఆరో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ నిర్ణీత 53 ల్యాప్‌లను గంటా 15 నిమిషాల 32.310 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఈ బ్రిటన్ డ్రైవర్ ఆద్యంతం ఆధిక్యంలో నిలిచాడు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని దక్కించుకోగా... వెటెల్ (ఫెరారీ) మూడో స్థానాన్ని పొందాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లిద్దరూ టాప్–10లో నిలిచారు. ఒకాన్ ఆరో స్థానంలో, పెరెజ్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 20 రేసుల ఈ సీజన్లో ఇప్పటికి 13 రేసులు పూర్తయ్యాయి. తాజా విజయంతో హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో 238 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. వెటెల్ (235 పాయింట్లు) రెండో స్థానానికి పడిపోగా... బొటాస్ (197 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 17న జరుగుతుంది. -
వెటెల్‌కు ‘పోల్’ నేడు హంగేరి గ్రాండ్‌ప్రి
బుడాపెస్ట్: ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో రెండోసారి పోల్ పొజిషన్‌ను సాధించాడు. శనివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో అతను అందరికంటే వేగంగా ఒక నిమిషం 16.276 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఫెరారీకే చెందిన కిమీ రైకోనెన్‌కు రెండో స్థానం లభించింది. ఫలితంగా హంగేరి గ్రాండ్‌ప్రిలో 2004 తర్వాత మరోసారి తొలి రెండు స్థానాల నుంచి ఫెరారీ డ్రైవర్లు రేసును ఆరంభించనున్నారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ 12వ, పెరెజ్ 14వ స్థానాల నుంచి రేసును మొదలు పెడతారు. నేటి ప్రధాన రేసు సాయంత్రం గం. 5.25 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం -
ఎదురులేని హామిల్టన్
వరుసగా నాలుగోసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సిల్వర్‌స్టోన్: క్వాలిఫయింగ్‌లోనే కాదు ప్రధాన రేసులోనూ తన ఆధిపత్యం చలాయించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సొంతగడ్డపై మెరిశాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. తద్వారా వరుసగా నాలుగో ఏడాది ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా ఐదోసారి ఈ టైటిల్‌ను నెగ్గిన అతను బ్రిటిష్ గ్రాండ్‌ప్రిని అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన జిమ్ క్లార్క్ (బ్రిటన్) రికార్డును సమం చేశాడు. ‘పోల్ పొజిషన్’తో ప్రధాన రేసును ప్రారంభించిన హామిల్ట న్ నిర్ణీత 51 ల్యాప్‌లను గంటా 21 నిమిషాల 27.430 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది నాలుగో విజయం. ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లిన హామిల్టన్‌కు తన ప్రత్యర్థుల నుంచి ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానం పొందగా... ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఎనిమిది, తొమ్మిది స్థానాలను దక్కించుకున్నారు. సీజన్‌లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 30న జరుగుతుంది. -
హామిల్టన్ హవా...
► చైనా గ్రాండ్‌ప్రి టైటిల్ కైవసం ► కెరీర్లో 54వ టైటిల్ సొంతం షాంఘై: క్వాలిఫయింగ్ సెషన్లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో తొలి విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 37 నిమిషాల 36.160 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందా డు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 54వ టైటిల్. ‘పోల్ పొజిషన్’తో ఈ రేసును ఆరంభించిన హామిల్టన్‌కు ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయితే హామిల్టన్ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా తన ఆధిక్యాన్ని కాపాడుకుంటూ అందరికంటే ముందు గమ్యానికి చేరాడు. వెటెల్‌కు రెండో స్థానం లభించగా... వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఒకాన్ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. హామిల్టన్ గమ్యం చేరే సమయానికి ఎనిమిది మంది డ్రైవర్లు చివరి ల్యాప్‌ను ఇంకా పూర్తి చేయకపోవడం గమనార్హం. మరో ఐదుగురు డ్రైవర్లు రేసును పూర్తి చేయకుండానే మధ్యలోనే వైదొలిగారు. సీజన్‌లోని మూడో రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 16న జరుగుతుంది. -
హామిల్టన్‌కు పోల్ పొజిషన్
నేడు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి మెల్బోర్న్: ఫార్ములావన్ కొత్త సీజన్లో మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్‌కు శుభారంభం లభించింది. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 22.188 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. సీజన్లో తొలి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌కిది వరుసగా నాలుగో ‘పోల్’ కావడం విశేషం. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఎస్టెబన్ ఒకాన్ వరుసగా 11వ, 14వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెటెల్ (ఫెరారీ), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. రైకోనెన్ (ఫెరారీ), 5. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 6. గ్రోస్యెన్ (హాస్), 7. మసా (విలియమ్స్), 8. సెయింజ్ (ఎస్టీఆర్), 9. క్వియాట్ (ఎస్టీఆర్), 10. రికియార్డో (రెడ్‌బుల్), 11. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 12. హుల్కెన్‌బర్గ్ (రెనౌ), 13. అలోన్సో (మెక్లారెన్), 14. ఒకాన్ (ఫోర్స్ ఇండియా), 15. ఎరిక్సన్ (సాబెర్), 16. జియోవినాజి (సాబెర్), 17. మాగ్నుసెన్ (హాస్), 18. వాన్డోర్నీ (మెక్లారెన్), 19. స్ట్రోల్ (విలియమ్స్), 20. పాల్మెర్ (రెనౌ). -
హామిల్టన్‌పైనే అందరి దృష్టి
నేటి నుంచి ఫార్ములావన్–2017 సీజన్ మెల్బోర్న్: గత ఏడాది సహచరుడు నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్)కు టైటిల్ సమర్పించుకున్న లూయిస్ హామిల్టన్ ఈ ఏడాది మళ్లీ ప్రపంచ చాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 2017 ఫార్ములావన్ సీజన్‌కు శనివారం జరిగే తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌తో తెర లేవనుంది. ఆదివారం ప్రధాన రేసు జరుగుతుంది. 2008, 2014, 2015లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన హామిల్టన్‌కు గత ఏడాది నికో రోస్‌బర్గ్ షాక్ ఇచ్చాడు. ఓవరాల్‌గా రోస్‌బర్గ్ 385 పాయింట్లు సాధించి విజేతగా నిలువగా... హామిల్టన్ 380 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అయితే రోస్‌బర్గ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సంవత్సరం హామిల్టన్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు. మాజీ చాంపియన్స్ సెబాస్టియన్ వెటెల్, కిమీ రైకోనెన్ (ఫెరారీ) నుంచి హామిల్టన్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు తరఫున సెర్గియో పెరెజ్, ఎస్టెబెన్ ఒకాన్ బరిలోకి దిగనున్నారు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో గత ఏడాది ఫోర్స్ ఇండియా 178 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కార్లు, వాటి టైర్ల వెడల్పును పెంచడం, ఇంధనం పరిమితిని పెంచడం... ఇతరత్రా మార్పులతో కొత్త సీజన్ మరింత ఆసక్తి రేకెత్తించనుంది. మొత్తం 20 రేసులు ఉన్న 2017 ఎఫ్1 సీజన్ ఈనెల 26న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో మొదలై నవంబరు 26న అబుదాబి గ్రాండ్‌ప్రితో ముగుస్తుంది. 2017 ఎఫ్1 షెడ్యూల్ మార్చి 26: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి; ఏప్రిల్ 9: చైనా గ్రాండ్‌ప్రి; ఏప్రిల్ 16: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి; ఏప్రిల్ 30: రష్యా గ్రాండ్‌ప్రి; మే 14: స్పెయిన్ గ్రాండ్‌ప్రి; మే 28: మొనాకో గ్రాండ్‌ప్రి; జూన్ 11: కెనడా గ్రాండ్‌ప్రి; జూన్ 25: అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి; జూలై 9: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి; జూలై 16: బ్రిటిష్ గ్రాండ్‌ప్రి; జూలై 30: హంగేరి గ్రాండ్‌ప్రి; ఆగస్టు 27: బెల్జియం గ్రాండ్‌ప్రి; సెప్టెంబరు 3: ఇటలీ గ్రాండ్‌ప్రి; సెప్టెంబరు 17: సింగపూర్ గ్రాండ్‌ప్రి; అక్టోబరు 1: మలేసియా గ్రాండ్‌ప్రి; అక్టోబరు 8: జపాన్ గ్రాండ్‌ప్రి; అక్టోబరు 22: అమెరికా గ్రాండ్‌ప్రి; అక్టోబరు 29: మెక్సికో గ్రాండ్‌ప్రి; నవంబరు 12: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి; నవంబరు 26: అబుదాబి గ్రాండ్‌ప్రి. -
'ఆ నిర్ణయం ఆశ్చర్యపరచలేదు'
వియన్నా:సహచర ఫార్ములావన్ డ్రైవర్, ఎఫ్1 విశ్వవిజేత నికో రోస్ బర్గ్ వీడ్కోలు నిర్ణయం బాధాకరమే అయినప్పటికీ తనను పెద్దగా ఆశ్చర్యపరచలేదని బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ స్పష్టం చేశాడు. సుదీర్ఘ కాలం నుంచి అతను ఫార్ములావన్ రేసులో ఉన్న విషయం తనకు తెలుసని, అందుచేత ఆ ఆకస్మిక నిర్ణయం తనను ఆశ్చర్యపరచకపోవడానికి కారణం కావొచ్చన్నాడు. అయితే వచ్చే ఏడాది తమతో పాటు రోస్ బర్గ్ రేసులో పాల్గొనడం లేదనే ఒక్క విషయం మాత్రం బాధిస్తుందన్నాడు.కచ్చితంగా రోస్ బర్గ్ ను మిస్ అవుతున్నామన్న హామిల్టన్.. అతను భవిష్యత్తు మరింత బాగుండాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే ఫార్ములావన్‌కు గుడ్ బై చెప్పుంటాడని అనుకుంటున్నట్లు హామిల్టన్ అన్నాడు. ఫార్ములావన్‌లో ఉండాలంటే ఎక్కువ సమయం ఆ క్రీడకే కేటాయించక తప్పదనే విషయం అంగీకరించక తప్పదన్నాడు. -
రోస్‌బర్గ్ కు హామిల్టన్ వార్నింగ్!
సావో పాలో:ఈ ఏడాది ఫార్ములావన్‌లో విశ్వవిజేతగా ఎవరు నిలుస్తారనే దానిపై ఆసక్తికర పోరు సాగుతోంది. ఒకవైపు పాయింట్ల పరంగా మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ అగ్రస్థానంలో ఉంటే, మరొకవైపు సహచర డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వరుస విజయాలతో దుమ్ములేపుతున్నాడు. దాంతో ఈనెల 27న అబుదాబిలో జరిగే సీజన్ చివరి రేసు వరకూ ప్రపంచ చాంపియన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఆదివారం జరిగిన బ్రెజిల్ గ్రాండ్ ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలిచిన హామిల్టన్ కు ఇది వరుసగా హ్యాట్రిక్ విజయం కావడంతో విశ్వవిజేత పోరు రసవత్తరంగా మారింది. ఈ తరుణంలో రోస్ బర్గ్..కాచుకో అంటూ హామిల్టన్ వార్నింగ్ ఇచ్చాడు. 'నేను టైటిల్ వేటలోకి వచ్చేశా. ప్రపంచ చాంపియన్ సాధించడం కోసం నాశాయ శక్తులా ప్రయత్నిస్తా. ఐదు అంతకంటే ఎక్కువ సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవాలనేది నా కల. ఈ పరిస్థితుల్లో ఎటువంటి తప్పిదాలు చేయదలుచుకోలేదు. విజయంపైనే గురి. నా జట్టు నాకు ఇచ్చిన కారు చాలా బాగుంది. అది ఒక నమ్మదగిన కారు ' అని హామిల్టన్ పేర్కొన్నాడు. ఇప్పటి వరకూ 20 రేసులో జరగ్గా, అందులో రోస్ బర్గ్ 9 గెలిచాడు. అటు హామిల్టన్ కూడా తొమ్మిది విజయాల్నే సొంతం చేసుకున్నాడు. అయితే పాయింట్ల పరంగా రోస్ బర్గ్ కంటే హామిల్టన్ 12 పాయింట్లు వెనుకబడ్డాడు. ప్రస్తుతం రోస్ బర్గ్ 367 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, హామిల్టన్ 355 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.ఇక ఈ సీజన్ లో మిగిలింది అబుదాబి గ్రాండ్ ప్రి మాత్రమే. నవంబర్ 27వ తేదీన ఈ రేసు జరుగనుంది. ఇందులో హామిల్టన్ గెలిస్తే 25 పాయింట్లు అతని ఖాతాలో చేరతాయి. అదే క్రమంలో రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలిస్తే 18 పాయింట్లు, మూడో స్థానంలో నిలిస్తే 15పాయింట్లు, నాల్గో స్థానంలో నిలిస్తే 12 పాయింట్లు వస్తాయి. అంటే రోస్ బర్గ్ మూడో స్థానంలో నిలిచినా చాంపియన్ గా అవతరిస్తాడు. -
పులితో హామిల్టన్ టైమ్ పాస్!
-
పులితో హామిల్టన్ టైమ్ పాస్!
మెక్సికో:సాధారణంగా పులితో సరదా అంటే రిస్కే. అయితే ఎప్పుడూ రేసుల్లో దూసుకుపోయే మెర్సిడెస్ జట్టు డ్రైవర్, విశ్వ విజేత లూయిస్ హామిల్టన్‌కు పులులతో ఆడుకోవడం సరదా. ఇటీవల మెక్సికో ఫార్ములావన్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచిన తరువాత హామిల్టన్ ఆ సరదాను మరోసారి తీర్చుకోవాలనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిందే తడువుగా స్థానికంగా పులి ఎన్ క్లోజర్లోకి వెళ్లిన హామిల్టన్ ఆ ముచ్చటను తీర్చుకున్నాడు. ఒకానొక సందర్భంలో హామిల్టన్ పైకి పులి ఒక్కసారిగా దూకడంతో అతగాడు కంగారుపడ్డాడు. ఆ పులిని తాకిన మరుక్షణమే అది ఆమాంతం తన రెండు కాళ్లను ముందుకు లేపి హామిల్టన్‌పై వేసింది. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపోటుకు గురైన హామిల్టన్ దాన్ని సుతిమెత్తగా సముదాయించే యత్నం చేశాడు. ఆ పులిని నెమ్మదిగా నెమరడంతో అది కాస్త కూల్ అయ్యింది. ఈ తాజా వీడియోను హామిల్టన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అయితే అది శిక్షణ ఇచ్చిన పులి కావడంతో హామిల్టన్ సరదాగా టైమ్ పాస్ చేసి బయటకి వచ్చాడు. -
విశ్వవిజేత ఎవరో?
మెక్సికో: గతేడాది ఫార్ములావన్ గ్రాండ్ ప్రిలో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సునాయాసంగా దక్కించుకున్న మెర్సిడెస్ జట్టుకు చెందిన బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్.. ఈ ఏడాది ఆ టైటిల్‌ను మరోసారి నిలబెట్టుకోవడానికి శ్రమించక తప్పడంలేదు. తన సహచర డ్రైవర్ నికో రోస్ బర్గ్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నాడు. ఆదివారం జరిగిన మెక్సికో ఫార్ములావన్ రేసులో హామిల్టన్ టైటిల్ సాధించినా.. ఆ తరువాత రెండో స్థానంలో మెర్సిడెస్ కే చెందిన నికో రోస్ బర్గ్ నిలిచాడు. ఈ 71 ల్యాప్‌ల ప్రధాన రేసును పోల్ పొజిషన్‌తో ఆరంభించిన హామిల్టన్.. అందరికంటే వేగంగా గమ్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. దాంతో ఈ సీజన్ ఫార్ములావన్‌లో హామిల్టన్ 330 పాయింట్లకు చేరగా, రెండో స్థానంలో నిలిచి రోస్ బర్గ్ 349 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బ్రెజిల్, అబుదాబి గ్రాండ్ ప్రిలో మాత్రమే మిగిలి ఉండటంతో హామిల్టన్ ఆ రెండు రేసుల్లో విజేతగా నిలిస్తే వరల్డ్ టైటిల్‌ను మరోసారి దక్కించుకుంటాడు. అదే క్రమంలో రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలవకూడదు. ఒకవేళ ఆ రెండు రేసుల్లో రెండో స్థానంలో రోస్ బర్గ్ నిలిచిన పక్షంలో టైటిల్ అతనికే దక్కుతుంది. ఒక ఫార్మాలావన్ రేసులో తొలి స్థానంలో నిలిచిన డ్రైవర్‌కు 25 పాయింట్లు అతని ఖాతాలో చేరతాయి. అదే సమయంలో రెండో స్థానంలో నిలిచిన డ్రైవర్‌కు 18 పాయింట్లు వస్తాయి. ఆ లెక్కన హామిల్టన్ మిగతా రెండు రేసుల్లో విజేతగా నిలిస్తే 380 పాయింట్లు అవుతాయి. అప్పుడు రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలిస్తే 384 పాయింట్లు అతని ఖాతాలోకి వస్తాయి. దాంతో ఆ రెండు రేసుల్లో విజయం హామిల్టన్ ఎంత ముఖ్యమో? అదే క్రమంలో రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలవడం కూడా అంతే ముఖ్యం. మరోవైపు ఆ రెండు రేసుల్లో రోస్ బర్గ్ ఒకదాంట్లో విజయం సాధిస్తే ప్రపంచ చాంపియన్ అవుతాడు. గతేడాది మూడు రేసులు మిగిలి ఉండగానే హామిల్టన్ విశ్వ విజేతగా నిలవడంతో.. ఆ టైటిల్‌ను మూడుసార్లు సాధించి దిగ్గజాల సరసన నిలిచాడు. అప్పుడు హామిల్టన్ 327 పాయింట్లతోనే ప్రపంచ చాంపియన్‌షిప్ ను కైవసం చేసుకున్నాడు. గత సీజన్లో 247పాయింట్లు సాధించిన రోస్ బర్గ్.. ఈ సీజన్లో మాత్రం అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ తొమ్మిది రేసుల్లో రోస్ బర్గ్ విజయం సాధించగా, హామిల్టన్ ఎనిమిదింట్లో మాత్రం గెలుపు దక్కించుకున్నాడు. దాంతో ఇరువురి మధ్య హోరాహోరీగా సాగుతున్న ఈ పోరులో విశ్వ విజేతగా ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
రయ్ రయ్... రోస్‌బర్గ్
జపాన్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం ఈ సీజన్లో తొమ్మిదో విజయం మెర్సిడెస్ జట్టుకు కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ సుజుకా: గత రెండేళ్లలో జపాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. అయితే రెండుసార్లూ అతను లూయిస్ హామిల్టన్ చేతిలో ఓడిపోయి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ ఈసారి అలా జరగలేదు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్ చివరి ల్యాప్ వరకు తన ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. తొలిసారి జపాన్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 53 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 26 నిమిషాల 43.333 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలువగా... గత ఏడాది విజేత హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్, హుల్కెన్‌బర్గ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. ఈ సీజన్లో తొమ్మిదో విజయాన్ని సాధించిన రోస్‌బర్గ్ కెరీర్లో ఇది 23వ టైటిల్. రోస్‌బర్గ్, హామిల్టన్ ఫలితాలతో... మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ వరుసగా మూడో ఏడాదీ మెర్సిడెస్ జట్టుకు (593 పాయింట్లు) ఖాయమైంది. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో రోస్‌బర్గ్ (313 పాయింట్లు), హామిల్టన్ (280 పాయింట్లు), రికియార్డో (212 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. తదుపరి రేసు యూఎస్ గ్రాండ్‌ప్రి ఈనెల 23న జరుగుతుంది. ‘హామిల్టన్, నాకు మధ్య 33 పాయింట్ల తేడా ఉంది. అయితే ఈ ఆధిక్యంపై నేను దృష్టి పెట్టలేదు. మిగిలిన మరో నాలుగు రేసుల్లో మెరుగైన ప్రదర్శన చేస్తాను. హామిల్టన్‌ను తక్కువ అంచనా వేయడంలేదు’ అని రోస్‌బర్గ్ వ్యాఖ్యానించాడు. గమ్యం చేరారిలా (టాప్-10): 1. రోస్‌బర్గ్ (మెర్సిడెస్-1:26:43.333 సెకన్లు), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్-1:26:48.311 సె), 3. హామిల్టన్ (మెర్సిడెస్-1:26:49.109 సె), 4. వెటెల్ (ఫెరారీ-1:27:03.602 సె), 5. రైకోనెన్ (ఫెరారీ-1:27:11.703 సె), 6. రికియార్డో (రెడ్‌బుల్-1:27:17.274 సె), 7. పెరెజ్ (ఫోర్స్ ఇండియా-1:27:40.828 సె), 8. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా-1:27:42.510 సె), 9. మసా (విలియమ్స్-1:28:20.409 సె), 10. బొటాస్ (విలియమ్స్-1:28:21.656 సెకన్లు). -
రికియార్డో సంచలనం
సెపాంగ్: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో మెర్సిడెస్ డ్రైవర్ల ఆధిపత్యానికి రెండోసారి రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లు అడ్డుకట్ట వేశారు. మలేసియా గ్రాండ్‌ప్రిలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రెడ్‌బుల్ డ్రైవర్ డానియల్ రికియార్డో ఈ సీజన్లో తొలి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. రికియార్డో సహచరుడు మాక్స్ వెర్స్టాపెన్ రెండో స్థానాన్ని దక్కించుకొని రెడ్‌బుల్ బృందం ఆనందాన్ని ‘డబుల్’ చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 16 రేసులు జరిగాయి. అందులో 14 రేసుల్లో మెర్సిడెస్ డ్రైవర్లు (రోస్‌బర్గ్ 8, హామిల్టన్ 6) విజేతలుగా నిలిచారు. మిగతా రెండింటిలో రెడ్‌బుల్ డ్రైవర్లు (వెర్స్టాపెన్, రికియార్డో) టైటిల్స్ నెగ్గారు. 56 ల్యాప్‌ల మలేసియా గ్రాండ్‌ప్రి రేసును రికియార్డో గంటా 37 నిమిషాల 12.776 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. కెరీర్లో నాలుగో గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గిన రికియార్డోకిది 41 రేసుల తర్వాత తొలి విజయం కావడం గమనార్హం. 2014లో అతను మూడు టైటిల్స్ సాధించాడు. మెర్సిడెస్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ మూడో స్థానంలో నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్)ను దురదృష్టం వెంటాడింది. 40 ల్యాప్‌ల వరకు ఆధిక్యంలో ఉన్న హామిల్టన్ కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. ప్రపంచ మాజీ చాంపియన్ వెటెల్ తొలి ల్యాప్‌లోనే రోస్‌బర్గ్ కారును ఢీకొట్టి వెనుదిరగ్గా... మరో నలుగురు డ్రైవర్లు కూడా ఇతర సమస్యలతో రేసు మధ్యలోనే తప్పుకున్నారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ డ్రైవర్లు పెరెజ్ ఆరో స్థానంలో, హుల్కెన్‌బర్గ్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. మరో ఐదు రేసులు మిగిలిఉన్న ఈ సీజన్లో ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో రోస్‌బర్గ్ (288 పాయింట్లు), హామిల్టన్ (265 పాయింట్లు), రికియార్డో (204 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 9న జరుగుతుంది. -
నా ఇంజినే ఎందుకు ఫెయిలైంది?
సెపంగ్: 'మెర్సిడెస్ కు ఇదే నా ప్రశ్న. డ్రైవర్ల కోసం చాలా ఇంజన్లు తయారు చేశాం. కానీ ఈ సంవత్సరం నా ఇంజినే ఎందుకు ఫెయిలైంది. నేను డ్రైవర్స్ చాంపియన్ షిష్ రేసులో ఉన్నాను. ప్రస్తుతం చోటు చేసుకున్న ఘటన ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదు. కేవలం నా ఇంజిన్లు మాత్రమే ఎందుకు చెడిపోతున్నాయి. ఈ ప్రశ్నకు నాకు సమాధానం దొరకాలి. అప్పటివరకూ నాకు నిద్రపట్టదు' అని ప్రపంచచాంపియన్ హామిల్టన్ అసహనం వ్యక్తం చేశాడు. ఆదివారం జరిగిన మలేషియా గ్రాండ్ ప్రి ప్రధాన రేసులో మెర్సిడెస్ కు చెందిన హామిల్టన్ కారు ఇంజన్లో మంటలు వ్యాపించాయి. దాంతో అప్పటివరకూ ఆధిక్యంలో ఉన్న హామిల్టన్ పోరును అర్ధాంతరంగా ముగించాడు. 56 ల్యాప్‌ల రేసులో భాగంగా హామిల్టన్ 40 వ ల్యాప్ లో ఉండగా కారు ఇంజన్ లో ఆకస్మికంగా పొగ వ్యాపించింది. ఆ తరువాత ఒక ల్యాప్ ను కొనసాగించిన తరువాత మంటలు రావడంతో హామిల్టన్ పోరు నుంచి రిటైర్డ్ అయ్యాడు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న రెడ్ బుల్ డ్రైవర్ డేనియల్ రికియార్డో విజేతగా నిలిచి మలేషియా గ్రాండ్ ప్రిని సాధించాడు. మరో రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ రెండో స్థానంలో నిలిచాడు. గత సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ కు మూడో స్థానం దక్కింది. -
హామిల్టన్ ఎనిమిదోసారి...
♦ మెర్సిడెస్ డ్రైవర్‌కే ‘పోల్’ పొజిషన్ ♦ నేడు మలేసియా గ్రాండ్‌ప్రి సెపాంగ్: గత మూడు రేసుల్లో నిరాశపరిచిన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. శనివారం జరిగిన ఫార్ములావన్ మలేసియా గ్రాండ్‌ప్రి క్వాలిఫరుుంగ్ సెషన్లో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ పోల్ పొజిషన్ సాధించాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది ఎనిమిదో పోల్ పొజిషన్ కావడం విశేషం. అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 32.850 సెకన్లలో ముగించిన హామిల్టన్ మలేసియా గ్రాండ్‌ప్రి చరిత్రలో క్వాలిఫరుుంగ్ సెషన్లో కొత్త రికార్డు నెలకొల్పాడు. మెర్సిడెస్‌కే చెందిన రోస్‌బర్గ్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్, నికో హుల్కెన్‌బర్గ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులో ప్రస్తుతం నికో రోస్‌బర్గ్ (273 పారుుంట్లు), హామిల్టన్ (265 పారుుంట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. రికియార్డో (రెడ్‌బుల్), 5. వెటెల్ (ఫెరారీ), 6. రైకోనెన్ (ఫెరారీ), 7.పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 8. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 9. బటన్ (మెక్లారెన్), 10. మసా (విలియమ్స్), 11. బొటాస్ (విలియమ్స్), 12. గ్రోస్యెన్ (హాస్), 13. గుటిరెజ్ (హాస్), 14. మాగ్నుసెన్ (రెనౌ), 15. క్వియాట్ (ఎస్టీఆర్), 16. సెరుుంజ్ (ఎస్టీఆర్), 17. ఎరిక్సన్ (సాబెర్), 18. నాసర్ (సాబెర్), 19. పాల్మెర్ (రెనౌ), 20. ఒకాన్ (మనోర్), 21. వెర్లీన్ (మనోర్), 22. అలోన్సో (మెక్లారెన్). నేటి ప్రధాన రేసు మధ్యాహ్నం గం. 12.25 నుంచి స్టార్ స్పోర్ట్స-4లో ప్రత్యక్ష ప్రసారం -
రోస్‌బర్గ్‌దే పైచేయి...
ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం మోంజా (ఇటలీ): సహచరుడు లూరుుస్ హామిల్టన్ చేసిన తప్పిదాన్ని పూర్తిస్థారుులో సద్వినియోగం చేసుకున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్లో ఏడో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి రేసులో రోస్‌బర్గ్ 53 ల్యాప్‌లను గంటా 17 నిమిషాల 28.089 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ రేసు మొదలైన రెండో క్షణంలోనే ఆరో స్థానానికి పడిపోయాడు. దాంతో తొలి ల్యాప్‌లోనే రోస్‌బర్గ్ ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలిసారి ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు మూడో స్థానం దక్కింది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లకు ఈ రేసు కలిసొచ్చింది. పెరెజ్ ఎనిమిదో స్థానంలో, హుల్కెన్‌బర్గ్ పదో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 18న జరుగుతుంది. -
మరో టైటిల్‌పై హామిల్టన్ గురి
నేడు ఇటలీ గ్రాండ్‌ప్రి రేసు మోంజా (ఇటలీ): మూడు రేసుల తర్వాత మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూరుుస్ హామిల్టన్ మరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసు క్వాలిఫరుుంగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ పూర్తి ఆధిపత్యం చలారుుంచాడు. అందరికంటే వేగంగా ఒక నిమిషం 21.135 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది ఏడో ‘పోల్ పొజిషన్’ కావడం విశేషం. తాజా పోల్‌తో హామిల్టన్ ఇటలీ గ్రాండ్‌ప్రిలో అత్యధికంగా ఐదుసార్లు పోల్ పొజిషన్ పొందిన దిగ్గజాలు అయర్టన్ సెనా (బ్రెజిల్), యువాన్ మాన్యుయెల్ ఫాంగియో (అర్జెంటీనా) సరసన నిలిచాడు. ఈ సీజన్లో జరిగిన 13 రేసుల్లో ఆరింటిలో విజయం సాధించిన హామిల్టన్ మరో టైటిల్‌పై గురి పెట్టాడు. మెర్సిడెస్‌కే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, నికో హుల్కెన్‌బర్గ్ వరుసగా ఎనిమిది, తొమ్మిది స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. గ్రిడ్ పొజిషన్‌స: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 3. వెటెల్ (ఫెరారీ), 4. రైకోనెన్ (ఫెరారీ), 5. బొటాస్ (విలియమ్స్), 6. రికియార్డో (రెడ్‌బుల్), 7. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 8. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 9. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 10. గుటిరెజ్ (హాస్), 11. మసా (విలియమ్స్), 12. గ్రోస్యెన్ (హాస్), 13. అలోన్సో (మెక్లారెన్), 14. వెర్లీన్ (మనోర్), 15. బటన్ (మెక్లారెన్), 16. సెరుుంజ్ (ఎస్టీఆర్), 17. క్వియాట్ (ఎస్టీఆర్), 18. నాసర్ (సాబెర్), 19. ఎరిక్సన్ (సాబెర్), 20. పాల్మెర్ (రెనౌ), 21. మాగ్నుసెన్ (రెనౌ), 22. ఒకాన్ (మనోర్). నేటి ప్రధాన రేసు సా.గం. 5.25 నుంచి స్టార్ స్పోర్ట్స సెలెక్ట్ హెచ్డీ-2లో ప్రత్యక్ష ప్రసారం -
ఎదురులేని హామిల్టన్
హాకెన్‌హీమ్ (జర్మనీ): క్వాలిఫయింగ్‌లో తడబడినా... ప్రధాన రేసులో దుమ్మురేపిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. 67 ల్యాప్‌ల ఈ రేసును రెండో స్థానంతో ప్రారంభించిన ఈ బ్రిటన్ డ్రైవర్ గంటా 30 నిమిషాల 44.200 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది ఆరో టైటిల్ కావడం విశేషం. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలెట్టిన రోస్‌బర్గ్ (మెర్సిడెస్) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రికియార్డో (రెడ్‌బుల్) రెండో స్థానంలో, వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచారు. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానంలో, పెరెజ్ పదో స్థానంలో నిలిచారు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో హామిల్టన్ 217 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
రోస్బర్గ్కే పోల్ పొజిషన్
హాకెన్‌హీమ్:ఫార్ములావన్ సీజన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ మరోసారి పోల్ పొజిషన్ సాధించాడు. సొంతగడ్డపై శనివారం జరిగిన జర్మన్ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ పోల్ పొజిషన్ సాధించాడు. తద్వారా ఈ సీజన్ లో ఐదోసారి పోల్ పొజిషన్ ను నమోదు చేశాడు. రోస్ బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 14. 363 సెకన్లలో ల్యాప్ ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్ బర్గ్ పోల్ పొజిషన్ నుంచి ఆరంభిస్తాడు. అయితే అతని సహచర జట్టు డ్రైవర్, ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 0.107 సెకన్ల వెనుకబడి రెండో స్థానానికి పరిమితం కాగా, రెడ్ బుల్ డ్రైవర్ డేనియల్ రికియార్డో మూడో స్థానంలో నిలిచాడు. గత హంగేరీ గ్రాండ్ ప్రిలో పోల్ పొజిషన్ సాధించిన రోస్ బర్గ్ కు ఇది వరుసగా రెండో పోల్ పొజిషన్. -
హామిల్టన్ హ్యాట్రిక్
* హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం * సీజన్లో ఐదో విజయం బుడాపెస్ట్: ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వరుసగా మూడో విజయాన్ని సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ 70 ల్యాప్‌లను గంటా 40 నిమిషాల 30.115 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ సీజన్లో హామిల్టన్‌కిది ఐదో విజయం కాగా, కెరీర్లో 48వ టైటిల్. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్)ను తొలి ల్యాప్‌లోనే వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి వచ్చిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. రోస్బర్గ్కు రెండో స్థానం దక్కగా... రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానాన్ని పొందాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ పదో స్థానంలో, పెరెజ్ 11వ స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు జర్మనీ గ్రాండ్‌ప్రి ఈనెల 31న జరుగుతుంది. -
హామిల్టన్ సరికొత్త రికార్డు
హంగారోరింగ్: ప్రపంచ ఫార్ములావన్ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గత బ్రిటీష్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచి ఆ టైటిల్ ను వరుసగా మూడు సార్లు సాధించిన తొలి ఇంగ్లిష్ డ్రైవర్ గా ఘనత సాధించిన హామిల్టన్.. తాజాగా జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్ ను అత్యధికంగా ఐదుసార్లు గెలిచిన డ్రైవర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలవడంతో ఈ ఘనతను అందుకున్నాడు. అంతకుముందు 2007, 09,12,13 సంవత్సరాల్లో హంగేరి గ్రాండ్ ప్రి ఫార్ములావన్ టైటిల్ ను హామిల్టన్ సాధించాడు. ఇదిలా ఉండగా ఈ సీజన్లో హామిల్టన్ ఖాతాలోఐదో విజయం చేరడం మరో విశేషం. అంతకుముందు మొనాకో, కెనడా, ఆస్ట్రియన్, బ్రిటీష్ గ్రాండ్ ప్రిలను హామిల్టన్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రధాన రేసును రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన హామిల్టన్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగిన హామిల్టన్ అదే ఊపును చివరి వరకూ కొనసాగించాడు. 70 ల్యాప్‌లో రేసును అందరికంటే వేగంగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అయితే పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన తన సహచర డ్రైవర్ నికో రోస్ బర్గ్ మాత్రం రెండో స్థానానికే పరిమితమయ్యాడు. మరోవైపు రెడ్ బుల్ డ్రైవర్ డేనియల్ రికాయార్డో మూడో స్థానం సాధించాడు. ఈ గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రోస్ బర్గ్‌ను హామిల్టన్ వెనుక్కునెట్టాడు. ఈ సీజన్లో తొలిసారి హామిల్టన్(181పాయింట్లు) ప్రథమ స్థానంలోకి రాగా, రోస్ బర్గ్(178పాయింట్లు) రెండో స్థానానికి పడిపోయాడు. -
హామిల్టన్ ‘హ్యాట్రిక్’
* వరుసగా మూడోసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): ఈ సీజన్ ఆరంభంలో నిరాశపరిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. సొంతగడ్డపై జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములవన్ రేసులో హామిల్టన్ వరుసగా మూడో ఏడాది విజేతగా నిలిచి ‘హ్యాట్రిక్’ సాధించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ నిర్ణీత 52 ల్యాప్‌లను గంటా 34 నిమిషాల 55.831 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఐదు రేసుల్లో నాలుగింట హామిల్టనే విజయం సాధించడం విశేషం. ఓవరాల్‌గా హామిల్టన్‌కిది నాలుగో బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్. 2008లో తొలిసారి అతను ఈ టైటిల్‌ను నెగ్గాడు. ఈ గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రోస్‌బర్గ్ (171 పాయింట్లు), హామిల్టన్ (167 పాయింట్లు) మధ్య తేడా నాలుగు పాయింట్లకు చేరింది. ఈ సీజన్లో మరో 11 రేసులు మిగిలి ఉన్నాయి. తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. హామిల్టన్ సహచరుడు రోస్బర్గ్కు రెండో స్థానం లభించగా... వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ రేసులో ఆరుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లిద్దరూ టాప్-10లో నిలిచారు. సెర్గియో పెరెజ్‌కు ఆరో స్థానం, హుల్కెన్‌బర్గ్‌కు ఏడో స్థానం లభించింది. -
హామిల్టన్ సరికొత్త చరిత్ర
సిల్వర్‌స్టోన్: ప్రపంచ ఫార్ములావన్ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్.. బ్రిటీష్ గ్రాండ్ ప్రిలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసులో హామిల్టన్ విజయం సాధించి వరుసగా మూడు సార్లు బ్రిటీష్ గ్రాండ్ ప్రి గెలిచిన తొలి డ్రైవర్ గా రికార్డు సాధించాడు. 52 ల్యాప్‌ల రేసును హామిల్టన్ అందరి కంటే వేగంగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. దీంతో ఈ సీజన్లో నాల్గో విజయాన్ని హామిల్టన్ తన ఖాతాలో వేసుకోగా, వరుసగా రెండో విజయాన్ని సాధించాడు. మరోవైపు బ్రిటీష్ గ్రాండ్ ప్రిని హామిల్టన్ ఓవరాల్‌గా నాలుగుసార్లు గెలిచి మాజీ ఫార్ములావన్ డ్రైవర్ నిజిల్ మేన్ సిల్ సరసన నిలిచాడు. సొంతగడ్డపై జరిగిన ఈ రేసులో హామిల్టన్ దుమ్మురేపగా, సహచర డ్రైవర్ నికో రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ తాజా విజయంతో రోస్ బర్గ్ పాయింట్లకు హామిల్టన్ మరింత దగ్గరగా వచ్చాడు. కేవలం రోస్ బర్గ్ కంటే నాలుగు పాయింట్లు మాత్రమే హామిల్టన్ వెనకబడ్డాడు. ఇదిలా ఉండగా, మ్యాక్స్ వెర్స్టాపెన్(రెడ్ బుల్) మూడో స్థానంలో నిలవగా, అదే జట్టుకు చెందిన డేనియల్ రికార్డియో నాల్గో స్థానానికి పరిమితమై పోల్ పొజిషన్ సాధించడంలో విఫలమయ్యాడు. -
హామిల్టన్‌కు ఆరో ‘పోల్’
నేడు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): సొంతగడ్డపై మరోసారి సత్తా చాటుకునేందుకు బ్రిటన్ ఫార్ములావన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సిద్ధమయ్యాడు. ఆదివారం జరిగే బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టుకు చెందిన హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 29.287 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ఈ సీజన్లో ఆరోసారి ‘పోల్ పొజిషన్’ను సంపాదించాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రేసును రెండో స్థానం నుంచి మొదలుపెడతాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్ వరుసగా తొమ్మిది, 11వ స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు. నేటి ప్రధాన రేసు సా.గం. 5.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
హామిల్టన్‌కే పోల్
సిల్వర్‌స్టోన్:ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్, మెర్సిడెజ్ జట్టు డ్రైవర్ ఈ సీజన్లో ఆరో పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన బ్రిటీష్ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్‌లో హామిల్టన్ 1:29:287 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచి పోల్ పొజిషన్ సాధించాడు.ఓవరాల్ గా ఇది హామిల్టన్ కెరీర్లో 55వ పోల్ పొజిషన్. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ పోల్ పొజిషన్ నుంచి ఆరంభిస్తాడు. ఇదిలా ఉండగా, హామిల్టన్ కంటే 0:319 సెకన్లు వెనుకబడ్డ అతని సహచరుడు నికో రోస్‌బర్గ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ తొమ్మిది ఫార్ములావన్ రేసులో జరగ్గా అందులో రోస్ బర్గ్ ఐదింటిని, హామిల్టన్ మూడింటిని దక్కించుకున్నాడు. ప్రస్తుతం రోస్ బర్గ్ 153 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, హామిల్టన్ 142 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు స్పెయిన్ గ్రాండ్ ప్రి విజేత మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్ బుల్) మూడో స్థానంలో నిలవగా, డానియల్ రికార్డో(రెడ్ బుల్) నాల్గో స్థానంలో సాధించారు. కాగా, ఫోర్స్ ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఫోర్స్ ఇండియా డ్రైవర్ నికో హుల్కెన్ బర్గ్ ఎనిమిదో స్థానంలో, సెర్గియో పెరెజ్ పదకొండో స్థానాలకు పరిమితమయ్యారు. -
ఆఖర్లో.. ఆధిపత్యం
ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రి విజేత హామిల్టన్ స్పీల్బర్గ్: ఆఖరి ల్యాప్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ఆస్ట్రియన్ గ్రాండ్‌ప్రిలో.. మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన 71 ల్యాప్‌ల ప్రధాన రేసును అతను గంటా 27 నిమిషాల 38.107 సెకన్లలో ముగించి తొలిసారి ఈ టైటిల్ గెలిచాడు. మ్యాక్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్-1:27:43.826), రైకోనెన్ (ఫెరారీ-1:27:44.131) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పోల్ పొజిషన్‌తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్... ఆరంభంలో కాస్త వెనుకబడ్డాడు. 22 ల్యాప్‌ల తర్వాత కారును వ్యూహాత్మకంగా నడిపిస్తూ క్రమంగా ఆధిక్యంలోకి వచ్చాడు. 32వ ల్యాప్ నుంచి రోస్బెర్గ్ (మెర్సిడెజ్), హామిల్టన్ మధ్యనే పోటీ జరిగింది. అయితే చివరి ల్యాప్‌లో రోస్బెర్గ్ (1:27:54.817) కారును హామిల్టన్ ఢీకొట్టడంతో అతను నాలుగోస్థానానికి పరిమితమయ్యాడు. ఈ సంఘటనపై విచారణ జరుగుతుందని రేసు అనంతరం స్టీవార్డు ప్రకటించారు. రికియార్డో (రెడ్‌బుల్-1:28:09.088), బటన్ (మెక్లారెన్-1:28:15.813), గ్రోస్జీన్ (హాస్-1:28:22.775), సైంజ్ (టోరో రోసో-1:28:25.507) ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచారు. ‘ఫోర్స్’ వైఫల్యం: రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ కారు టైర్లతో ఇబ్బంది పడి 65వ ల్యాప్‌లో వైదొలిగాడు. మరో ఫోర్స్ డ్రైవర్ పెరెజ్ కూడా రేసును పూర్తి చేయలేకపోయాడు. -
హామిల్టన్‌కే పోల్
‘ఫోర్స్’ హుల్కెన్‌బర్గ్‌కు మూడోస్థానం ఆస్ట్రియన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ స్పీల్బర్గ్: మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ఐదో పోల్ పోజిషన్ సాధించాడు. శనివారం జరిగిన ఆస్ట్రియన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌లో అతను 1:07.922 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో నేడు (ఆదివారం) జరిగే ప్రధాన రేసును ఒకటో స్థానంనుంచి మొదలుపెడతాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 54వ పోల్. మెర్సిడెజ్ మరో డ్రైవర్ నికో రోస్బెర్గ్ (1:08.465 సెకన్లు) రెండో స్థానంలో నిలిచాడు. కానీ ప్రాక్టీస్ సెషన్లో గేర్ బాక్స్‌ను మార్చుకున్నందుకు అతనిపై ఐదు గ్రిడ్ల పెనాల్టీ పడింది. దీంతో రోస్బెర్గ్ ఏడో గ్రిడ్ నుంచి రేసును మొదలుపెడతాడు. మూడో స్థానంలో నిలిచిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ (1:09.285 సెకన్లు) రెండో గ్రిడ్ నుంచి బరిలోకి దిగుతాడు. నాలుగో స్థానం సాధించిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ (1:09.781 సెకన్లు)పై కూడా ఐదు గ్రిడ్ల పెనాల్టీ పడటంతో అతను తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. క్వాలిఫయింగ్‌లో ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన బటన్ (మెక్లారెన్-1:09.900 సెకన్లు), రైకోనెన్ (ఫెరారీ-1:09.901 సెకన్లు) ఒక్కో స్థానం ముందుకు జరిగారు. బొటాస్ (విలియమ్స్-1:10.440 సెకన్లు), వెర్స్టపెన్ (రెడ్‌బుల్-1:11.153 సెకన్లు), మసా (విలియమ్స్-1:11.977 సెకన్లు)లు క్వాలిఫయింగ్‌లో వరుసగా 8,9,10 స్థానాల్లో నిలిచారు. ట్రాక్ పరిమితులను దాటి డ్రైవ్ చేసిన ఫోర్స్ డ్రైవర్ పెరెజ్‌తో పాటు గుటిరెజ్ (హాస్), పాస్కల్ (మనోర్ రేసింగ్), గ్రోస్జీన్ (హాస్), అలోన్సో (మెక్లారెన్), సైంజ్ (టోరో రోసో)లు క్వాలిఫయింగ్-2లోనే వెనుదిరిగారు. క్వాలిఫయింగ్-1లో కయాట్ (టోరో రోసో) కారు పెద్ద ప్రమాదానికి గురైంది. -
హామిల్టన్ హవా
* కెనడా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం * సీజన్లో రెండో విజయం మాంట్రియల్ (కెనడా): ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఫార్ములావన్ సీజన్‌లోని తొలి ఐదు రేసుల్లో విఫలమైన ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ తాజాగా వరుసగా రెండో విజయాన్ని సాధించాడు. రెండు వారాల క్రితం మొనాకో గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన ఈ బ్రిటన్ డ్రైవర్... భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన కెనడా గ్రాండ్‌ప్రిలోనూ టైటిల్ సాధించాడు. 70 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 31 నిమిషాల 05.296 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచి గమ్యానికి చేరుకున్నాడు. మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) రెండో స్థానంలో నిలువగా... బొటాస్ (విలియమ్స్)కు మూడో స్థానం లభించింది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ (8వ స్థానం), పెరెజ్ (పదో స్థానం) టాప్-10లో నిలువడం విశేషం. సీజన్లో ఏడు రేసులు ముగిశాక రోస్‌బర్గ్ (మెర్సిడెస్-116 పాయింట్లు), హామిల్టన్ (మెర్సిడెస్-107 పాయింట్లు), వెటెల్ (ఫెరారీ-78 పాయింట్లు) టాప్-3లో ఉన్నారు. సీజన్లో తదుపరి రేసు యూరోప్ గ్రాండ్‌ప్రి అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో ఈనెల 19న జరుగుతుంది. అలీకి అంకితం కెనడా గ్రాండ్‌ప్రి విజయాన్ని దివంగత మేటి బాక్సర్ మొహమ్మద్ అలీకి అంకితం ఇస్తున్నట్లు హామిల్టన్ ప్రకటించాడు. ‘సాధారణంగా నా విజయాన్ని నేనెవరికీ అంకితం ఇవ్వను. కానీ బాక్సర్ అలీ నన్నెంతగానో ప్రభావితం చేశారు. ఆయన జీవితం నాకు ప్రేరణగా నిలిచింది. ఈ రేసులో నేను డ్రైవ్ చేస్తున్న సమయంలోనూ ఆయన గురించి ఆలోచించాను’ అని హామిల్టన్ వ్యాఖ్యానించాడు. -
కెనడా గ్రాండ్ ప్రి విజేత హామిల్టన్
మోంట్రీల్: ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ ఈ సీజన్లో వరుసగా రెండో విజయాన్ని సాధించాడు. ఆదివారం జరిగిన కెనాడియన్ గ్రాండ్ ప్రిలో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. 78 ల్యాప్‌ల రేసును ఒక గంటా 31 నిమిషాల 05.296 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సాధించాడు. పోల్ పొజిషన్ తో ప్రధాన రేసును ఆరంభించిన హామిల్టన్ ఆద్యంతం ఆకట్టుకుని విజయం సాధించాడు. ఇది హామిల్టన్ కెరీర్ లో 45వ విజయం. కాగా, అంతకుముందు ఈ ఏడాది జరిగిన మొనాకో గ్రాండ్ టైటిల్ ను గెలిచి వరుసగా రెండో విజయాన్ని హామిల్టన్ దక్కించుకోవడం విశేషం. ఇదిలా ఉండగా, సహచర డ్రైవర్ నికో రోస్ బర్గ్ ఐదో స్థానానికి పరిమితం కాగా, ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ రెండో స్థానాన్ని సాధించాడు. మరోవైపు భారత్ కు చెందిన ఫోర్స్ ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఫోర్స్ ఇండియా డ్రైవర్ నికో హుకెన్ బర్గ్ ఎనిమిదో స్థానంలో నిలవగా, సెర్గియో పెరెజ్ 11వ స్థానానికి పరిమితమయ్యాడు.ఈ విజయాన్ని ఇటీవల కన్నుమూసిన బాక్సింగ్ దిగ్గజం మొహ్మద్ అలీకి అంకితం ఇస్తున్నట్లు హామిల్టన్ ప్రకటించాడు. -
హామిల్టన్ బోణీ
మొనాకో గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం ‘ఫోర్స్’ పెరెజ్‌కు మూడో స్థానం మోంటెకార్లో: ఫార్ములావన్‌లో ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో తొలి విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి రేసులో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. 78 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 59 నిమిషాల 29.133 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 44వ విజయం కాగా... మొనాకో గ్రాండ్‌ప్రిలో రెండో టైటిల్. చివరిసారి 2008లో హామిల్టన్ ఈ రేసులో విజేతగా నిలిచాడు. ‘ పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన రికియార్డో (రెడ్‌బుల్) రెండో స్థానాన్ని పొందగా... భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 28 రేసుల తర్వాత ఫోర్స్ ఇండియా డ్రైవర్ టాప్-3లో నిలిచాడు. ఫోర్స్ ఇండియాకే చెందిన మరో డ్రైవర్ హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానాన్ని పొందడం విశేషం. ఈ రేసులో ఏడుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 12న జరుగుతుంది. -
హామిల్టన్ బోణీ
మోంటెకార్లో: గత ఐదు గ్రాండి ప్రిల్‌లో విఫలమైన మెర్సిజట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈసారి అద్వితీయమైన ప్రదర్శనతో పుంజుకున్నాడు. మొనాకో గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచి ఈ సీజన్లో తొలి టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ప్రధాన రేసును మూడో స్థానం ప్రారంభించిన హామిల్టన్ దుమ్మురేపాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో హామిల్టన్ అందరికంటే ముందుగా లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలిచాడు. కాగా, ఈ సీజన్లో నాలుగు టైటిల్స్ సాధించిన మెర్సిజట్టుకే చెందిన సహచర డ్రైవర్ నికోలస్ రోస్ బర్గ్ ఏడో స్థానానికి పరిమితమయ్యాడు., అయితే రేసును మొదటి స్థానం నుంచి ఆరంభించిన డానియల్ రికియార్డో (రెడ్ బుల్) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
రికియార్డోకు తొలి పోల్
► నేటి ప్రధాన రేసు ► సాయంత్రం గం. 5.25 నుంచి ► స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం ► నేడు మొనాకో గ్రాండ్‌ప్రి మోంటెకార్లో: నికో రోస్‌బర్గ్, లూయిస్ హామిల్టన్ కాకుండా ప్రస్తుత ఫార్ములావన్ సీజన్లో తొలిసారి మరో జట్టు డ్రైవర్‌కు పోల్ పొజిషన్ లభించింది. శనివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రెడ్‌బుల్ జట్టుకు చెందిన డానియల్ రికియార్డో తన కెరీర్లో తొలిసారి పోల్ పొజిషన్ సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ డ్రైవర్ క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా ఒక నిమిషం 13.622 సెకన్లలో ల్యాప్‌ను ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి మొదలుపెట్టే అవకాశాన్ని సంపాదించాడు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు రోస్‌బర్గ్, హామిల్టన్ వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు నికో హుల్కెన్‌బర్గ్ ఐదో స్థానం నుంచి... సెర్గియో పెరెజ్ ఎనిమిదో స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు. ఈ సీజన్లో ఐదు రేసులు ముగిశాక రోస్‌బర్గ్ 100 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. గ్రిడ్ పొజిషన్స్: 1. రికియార్డో (రెడ్‌బుల్), 2. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 3. హామిల్టన్ (మెర్సిడెస్), 4. వెటెల్ (ఫెరారీ), 5. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 6. రైకోనెన్ (ఫెరారీ), 7. కార్లోస్ సెయింజ్ (ఎస్టీఆర్), 8. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 9. క్వియాట్ (ఎస్టీఆర్), 10. అలోన్సో (మెక్లారెన్), 11. బొటాస్ (విలియమ్స్), 12. గుటిరెజ్ (హాస్), 13. బటన్ (మెక్లారెన్), 14. మసా (విలియమ్స్), 15. గ్రోస్యెన్ (హాస్), 16. మాగ్నుసెన్ (రెనౌ), 17. ఎరిక్సన్ (సాబెర్), 18. పాల్మెర్ (రెనౌ), 19. హర్యాంతో (మనోర్), 20. వెర్లీన్ (మనోర్), 21. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 22. నాసర్ (సాబెర్). -
హామిల్టన్‌కు ‘పోల్’
నేడు స్పెయిన్ గ్రాండ్‌ప్రి బార్సిలోనా: గత రెండు రేసుల్లో విఫలమైన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. శనివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 22 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది మూడో ‘పోల్’ కాగా... కెరీర్లో 52వది. సీజన్‌లోని తొలి నాలుగు రేసుల్లో విజేతగా నిలిచిన మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో రెండో స్థానం నుంచి రేసును ప్రారంభిస్తాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, హుల్కెన్‌బర్గ్ వరుసగా తొమ్మిది, 11వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. -
రైట్ రైట్... రోస్‌బర్గ్
► రష్యా గ్రాండ్‌ప్రిలోనూ మెర్సిడెస్ డ్రైవర్ హవా ► సీజన్లో వరుసగా నాలుగో టైటిల్ సొంతం సోచి (రష్యా): వేదిక మారినా... రేసు మారినా... ఫలితం మారలేదు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ ఏడాది తన అద్వితీయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన రోస్‌బర్గ్ నిర్ణీత 53 ల్యాప్‌లను గంటా 32 నిమిషాల 41.997 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియా, బహ్రెయిన్, చైనా గ్రాండ్‌ప్రి రేసుల్లోనూ రోస్‌బర్గ్ టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా రోస్‌బర్గ్‌కిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. గతేడాది చివరి మూడు రేసుల్లోనూ నెగ్గిన ఈ జర్మన్ డ్రైవర్ ఈ సీజన్లో జరిగిన తొలి నాలుగు రేసుల్లోనూ చాంపియన్‌గా నిలిచాడు. తద్వారా వరుసగా ఏడు అంతకంటే ఎక్కువ రేసుల్లో గెలిచిన నాలుగో డ్రైవర్‌గా గుర్తింపు పొం దాడు. గతంలో వెటెల్ (జర్మనీ) 2013లో వరుసగా తొమ్మిది రేసుల్లో గెలుపొందగా... షుమాకర్ , అస్కారి వరుసగా ఏడేసి రేసుల్లో నెగ్గారు. ఈ ముగ్గురి సరసన రోస్‌బర్గ్ చేరాడు. ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) ఈ రేసులో ఆకట్టుకున్నాడు. పదో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన అతను రెండో స్థానాన్ని సంపాదించాడు. రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంతో సంతృప్తి పడ్డాడు. రైకోనెన్ ఫలితంతో ఎఫ్1 చరిత్రలో 700సార్లు టాప్-3లో నిలిచిన జట్టుగా ఫెరారీ గుర్తింపు పొందింది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పెరెజ్ తొమ్మిదో స్థానాన్ని పొందగా... హుల్కెన్‌బర్గ్ తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు. సీజన్‌లోని తదుపరి రేసు స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 15న జరుగుతుంది. -
రోస్‌బర్గ్‌దే హవా
► మెర్సిడెస్ డ్రైవర్‌కే పోల్ పొజిషన్ ► నేడు రష్యా గ్రాండ్‌ప్రి సోచి (రష్యా): ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ రెండోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.417 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఈ సీజన్లో జరిగిన తొలి మూడు రేసుల్లో విజేతగా నిలిచిన రోస్‌బర్గ్ నాలుగో టైటిల్‌పై కన్నేశాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో హామిల్టన్ రెండో క్వాలిఫయింగ్‌ను దాట లేకపోయాడు. ప్రధాన రేసును అతను పదో స్థానం నుంచి మొదలు పెడతాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్ ఆరో స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ 13వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. -
'మరో దశాబ్దం మా అబ్బాయిదే'
లండన్: ఫార్ములావన్‌లో రాబోయే పది సంవత్సరాలు కూడా తన కుమారుడు లూయిస్ హమిల్టన్ హవానే కొనసాగుతుందని తండ్రి ఆంథోని జోస్యం చెప్పాడు. ప్రపంచ ఫార్ములావన్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హమిల్టన్ మరొక దశాబ్దం పాటు రాజ్యమేలడం ఖాయమన్నాడు. హమిల్టన్ రోజు రోజుకీ మెరుగుపడటమే కాదు, మానసికంగా ఎంతో దృఢంగా తయారవుతున్నాడని కుమారునిపై విశ్వాసం వ్యక్తం చేశాడు. తన కుమారునికి మోటార్ రేస్‌పై ఉన్న మక్కువే అతన్ని మూడు సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలపిందన్నాడు. హమిల్టన్ కు గెలవాలన్న తపన చాలా ఎక్కువని, అందుకోసం తీవ్రంగా శ్రమిస్తూ తన అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ ఉంటాడని ఆంథోని తెలిపాడు. కనీసం మరో ఏడు సంవత్సరాలైనా తన కుమారుని జైత్రయాత్ర కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. గతేడాది హమిల్టన్ మూడోసారి ప్రపంచ చాంపియన్ గా అవతరించిన సంగతి తెలిసిందే. దీంతో తొమ్మిదేళ్ల వ్యవధిలో హామిల్టన్ మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి ఫార్ములావన్ లో తనదైన ముద్రను వేశాడు. దీంతో పాటు 43 గ్రాండ్‌ప్రి టైటిల్స్ గెలిచి ఫార్ములావన్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన మూడో డ్రైవర్ గా హమిల్టన్ గుర్తింపు సాధించాడు. -
దుమ్మురేపిన రోస్ బర్గ్
మెక్సికో: గత 23 ఏళ్ల అనంతరం తొలిసారి మెక్సికోలో జరిగిన మెక్సికన్ గ్రాండ్ ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ దుమ్మురేపాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 42 నిమిషాల 35.038 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్, సహచరుడు లూయిస్ హమిల్టన్(మెర్సిడెస్) ను బోల్తా కొట్టించిన రోస్ బర్గ్ విజేతగా నిలిచాడు. రోస్ బర్గ్ కంటే ఒక నిమిషం 954 సెకన్ల వెనుకబడ్డ హమిల్టన్ రెండో స్థానంలో నిలవగా.. విలియమ్స్ జట్టు డ్రైవర్ బోటాస్ మూడో స్థానం సాధించాడు. కాగా, భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ ఆకట్టుకుంది. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానంలో నిలువగా, మరో డ్రైవర్ సెర్గియో పెరెజ్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ లో పోల్ పొజిషన్ సాధించిన రోస్ బర్గ్ ప్రధాన రేసును మొదటి స్థానం నుంచి ఆరంభించగా.. హమిల్టన్ రెండో స్థానం నుంచి ప్రధాన రేసును ప్రారంభించాడు. ఆదివారం రాత్రి జరిగిన ప్రధాన రేసులో రోస్ బర్గ్ -హమిల్టన్ ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. కాగా, 51వ ల్యాప్ వద్ద హమిల్టన్ ను దాటుకుని ముందుకు దూసుకుపోయిన రోస్ బర్గ్ అదే పరంపరను చివరి వరకూ కొనసాగించి మెక్సికన్ గ్రాండ్ ప్రిని గెలుచుకున్నాడు. దీంతో ఈ సీజన్ లో రోస్ బర్గ్ సాధించిన టైటిల్ సంఖ్య నాలుగుకు చేరగా, ఓవరాల్ గా అతని కెరీయర్ లో 12 వ టైటిల్ వచ్చి చేరింది. ఈ సీజన్ లో గత జూన్ 21 వ తేదీన జరిగిన ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రి సాధించిన తరువాత రోస్ బర్గ్ కు ఇదే తొలి టైటిల్. ఈ సీజన్ లో స్పానిష్ గ్రాండ్ ప్రి, మొనాకో గ్రాండ్ ప్రి, ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రి, మెక్సికన్ గ్రాండ్ ప్రి టైటిళ్లను రోస్ బర్గ్ తన ఖాతాలో వేసుకున్నాడు. క్వాలిఫయింగ్ రేసులో రోస్ బర్గ్ ఒక నిమిషం 19.480 సెకన్లలో ల్యాప్ ను పూర్తి చేసుకుని పోల్ పొజిషన్ సాధించాడు. దీంతో రోస్ బర్గ్ ప్రధాన రేసును పోల్ పొజిషన్ నుంచి ఆరంభించాడు. రోస్ బర్గ్ కంటే 0.188 సెకన్ల వెనుకబడ్డ హమిల్టన్ రెండో స్ధానంతో రేసును మొదలు పెట్టాడు. అంతకుముందు సెప్టెంబర్ లో జరిగిన ఇటాలియన్ గ్రాండ్ ప్రి తరువాత హమిల్టన్ పోల్ పొజిషన్ సాధించలేదు. గడిచిన మూడు రేసుల్లో రోస్ బర్గ్ పోల్ పొజిషన్ సాధించినా.. ప్రధాన రేసుకు వచ్చేసరికి హమిల్టన్ చేతిలో భంగపడ్డాడు. -
'ఫార్ములా వన్ లో ఇదే నా బెస్ట్'
న్యూయార్క్: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్ లో సాధించిన ఘనతల పట్ల మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హమిల్టన్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ 10 రేసుల్లో విజేతగా నిలిచిన హమిల్టన్ విశ్వ విజేతగా అవతరించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. తన కెరీయర్ లో 2015 సంవత్సరం ఒక గొప్ప అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నాడు. ఈ సంవత్సరం తన కెరీయర్ లో అత్యంత ఉత్తమమైనదనిగా హమిల్టన్ స్పష్టం చేశాడు. ' ఈ ఏడాది యూఎస్ గ్రాండ్ ప్రితో పాటు అంతకుముందు సాధించిన రెండు టైటిల్స్ నన్ను మరోసారి ప్రపంచ చాంపియన్ గా నిలపడంలో సహకరించాయి. ఈ ఏడాది నాకు చాలా ఇచ్చింది. ఇదే నా కెరీయర్ లో ఓ అద్భుతమైన సంవత్సరం. నన్ను మరింత శక్తివంతుడిగా చేసింది. ప్రపంచ చాంపియన్ అయ్యానంటే నిజంగా నమ్మబుద్ధిగా లేదు' అని బ్రిటీష్ రేసర్ హమిల్టన్ పేర్కొన్నాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో మూడు రేసులు మిగిలుండగానే ప్రపంచ విజేతగా అవతరించిన సంగతి తెలిసిందే. భారత కాలమాన ప్రకారం ఆదివారం జరిగిన యూఎస్ గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటిష్ రేసర్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల రేసును హామిల్టన్ గంటా 50 నిమిషాల 52.703 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో పాటు మూడోసారి ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ షిష్ ను కైవసం చేసుకున్నాడు. -
హామిల్టన్ అదుర్స్
జపాన్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం ఈ సీజన్లో ఎనిమిదో విజయం సుజుకా (జపాన్): వారం రోజుల క్రితం సింగపూర్ గ్రాండ్‌ప్రిలో విఫలమైన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈసారి అద్వితీయ ప్రదర్శనతో పుంజుకున్నాడు. జపాన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచి ఈ సీజన్లో తన ఖాతాలో ఎనిమిదో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన 53 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 28 నిమిషాల 06.508 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా... ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానాన్ని సాధించాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. నికో హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ పెరెజ్ 12వ స్థానంతో సంతృప్తి పడ్డాడు. తాజా విజయంతో హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులో 277 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... నికో రోస్‌బర్గ్ (229 పాయింట్లు), వెటెల్ (218 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ విజయంతో హామిల్టన్ ఫార్ములావన్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన డ్రైవర్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. 41 టైటిల్స్‌తో విఖ్యాత డ్రైవర్ అయిర్టన్ సెనా (బ్రెజిల్)తో కలిసి హామిల్టన్ సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. మైకేల్ షుమాకర్ (91 టైటిల్స్), అలైన్ ప్రాస్ట్ (51 టైటిల్స్), సెబాస్టియన్ వెటెల్ (42 టైటిల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి అక్టోబరు 11న జరుగుతుంది. తొలి ల్యాప్‌లోనే ఆధిక్యంలోకి... రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన హామిల్టన్ తొలి ల్యాప్ మలుపులో ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన నికో రోస్బర్గ్ను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. అటు నుంచి హామిల్టన్ వెనుదిరిగి చూడలేదు. మధ్యలో రెండుసార్లు పిట్స్‌లో ఆగిన అతనికి ఏదశలోనూ మిగతా డ్రైవర్ల నుంచి పోటీ ఎదురుకాలేదు. చివరి ల్యాప్ వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొన్న హామిల్టన్ తుదకు విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. గమ్యం చేరారిలా (టాప్-10) 1. హామిల్టన్ (మెర్సిడెస్-1గం:28ని.06.508 సెకన్లు), 2. నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్-1గం:28ని.25.472 సెకన్లు), 3. వెటెల్ (ఫెరారీ-1గం:28ని.27.358 సెకన్లు), 4. రైకోనెన్ (ఫెరారీ-1గం: 28ని.40.276 సెకన్లు), 5. బొటాస్ (విలియమ్స్-1గం:28ని.43.254 సెకన్లు), 6. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా-1గం:29ని.02.067 సెకన్లు), 7. గ్రోస్యెన్ (లోటస్-1గం:29ని.18.806 సెకన్లు), 8. మల్డొనాడో (లోటస్-1గం: 29ని.20.083 సెకన్లు), 9. వెర్స్టాపెన్ (ఎస్టీఆర్-1గం:29ని.41.823 సెకన్లు), 10. కార్లోస్ సెయింజ్ (ఎస్టీఆర్-ప్లస్ ఒక ల్యాప్). -
జపాన్ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్
సుజుకా (జపాన్): మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 41వ ఫార్ములావన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రిలో అతడు విజేతగా నిలిచాడు. పోల్ పొజిషన్ సాధించిన మెర్సిడెస్ జట్టు మరో డ్రైవర్ నికో రోస్ బర్గ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గత వారం సింగపూర్ గ్రాండ్‌ప్రిలో విఫలమైన వీరిద్దరూ ప్రధాన రేసును తొలి రెండు స్థానాల నుంచి ప్రారంభించి చివరివరకు తమ ఆధిక్యం కొనసాగించారు. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానం దక్కించుకున్నాడు. ఇక భారత్‌కు చెందిన 'ఫోర్స్ ఇండియా' జట్టు డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానంలో నిలిచాడు. -
రోస్‌బర్గ్ రెండోసారి...
- మెర్సిడెస్ డ్రైవర్‌కు ‘పోల్ పొజిషన్’ - నేడు జపాన్ గ్రాండ్‌ప్రి సుజుకా (జపాన్): గత వారం సింగపూర్ గ్రాండ్‌ప్రిలో విఫలమైన మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు నికో రోస్‌బర్గ్, లూయిస్ హామిల్టన్ మళ్లీ గాడిలో పడ్డారు. శనివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సాధించగా... హామిల్టన్ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ ఇద్దరూ తొలి రెండు స్థానాల నుంచి ప్రారంభిస్తారు. ఈ సీజన్లో రోస్‌బర్గ్‌కిది రెండో ‘పోల్ పొజిషన్’ కాగా... జపాన్ గ్రాండ్‌ప్రిలో వరుసగా రెండోసారి. క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 32.584 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బొటాస్ (విలియమ్స్) మూడో స్థానం నుంచి, ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) నాలుగో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. కెరీర్లో ఇప్పటికే 42 గ్రాండ్‌ప్రి టైటిల్స్ సాధించిన వెటెల్... గ్రిడ్ పొజిషన్స్‌లో టాప్-3లో లేకుండా ఒక్క టైటిల్ కూడా నెగ్గలేదు. గత వారం సింగపూర్ గ్రాండ్‌ప్రిలో టైటిల్ నెగ్గిన వెటెల్ జపాన్‌లో ఏం చేస్తాడో వేచి చూడాలి. ఇక భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ తొమ్మిదో స్థానం నుంచి, నికో హుల్కెన్‌బర్గ్ 11వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. నేటి ప్రధాన రేసు ఉదయం గం. 10.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
హామిల్టన్ పై దర్యాప్తు
విజయవంతంగా రేస్ ముగించిన మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్, అతని సహచరుడు రోస్ బర్డ్ పై ఫార్ములా వన్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. రేస్ కు ముందు నిర్నీత స్ధాయి కంటే తక్కువ ఎయిర్ ప్రెజర్ ఉండటమే దీనికి కారణమని ప్రాధమికంగా తెలుస్తోంది. రేస్ కు ముందు ఎఫ్ వన్ కారు టైర్ లో 19.5psi వత్తిడి ఉండాలి. అయితే.. మెర్సిడెజ్ కార్లు రెండింటిలోనూ నిర్ణీత స్ధాయి కంటే తక్కువ ఎయిర్ ప్రెజర్ ఉందని అధికారులు గుర్తించారు. దీనిపై మెర్సిడెజ్ అధికారులకు ఎఫ్ఐఎ ప్రతినిధి జో బాయర్ రిపోర్టు అందించాడు. దీనిపై విచారణ కొనసాగనుంది. -
హామిల్టన్ మళ్లీ గెలిచాడు
సర్కూట్ మారినా.. వెటెల్ ఎంత ట్రై చేసినా.. మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో రేస్ గెలిచాడు. ఇటలీ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీ రేస్ లో మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. మోంజాలో జరిగిన రేస్ లో ప్రపంచ ఛాంపియన్ హామిల్టన్ 53 ల్యాప్ ల రేసును గంటా 18 నిమిషాల్లో రేస్ పూర్తి చేసి అగ్ర స్థానాన్ని సంపాదించాడు. పోల్ పొజిషన్ తో రేస్ ప్రారంభించిన ఈ బ్రిటన్ డ్రైవర్ కు ఆద్యంతం ప్రత్యర్ధి ఫెరారీ డ్రైవర్ వెటెల్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. దీంతో పాటు రేస్ కు ముందు కార్ లో సాంకేతిక సమస్యలు వచ్చినా.. విక్టరీని చేజిక్కించుకున్నాడు. ఇక ఫెరారీ డ్రైవర్ వెటెల్ ఎంత ప్రయత్నించినా.. హామిల్టన్ ను అధిగమించలేక పోయాడు. 25 సెకండ్లు వెనకబడ్డ వెటెల్ రెండో స్ధానంతో సరిపెట్టుకున్నాడు. రెండో స్ధానంలో రేస్ మొదలు పెట్టిన విలియమ్స్ డ్రైవర్ మాసా.. మూడో స్ధానంతో రేస్ ముగించాడు. విలియమ్స్ మరో డ్రైవర్ బోట్టాస్, ఫెరారీ రెండో డ్రైవర్ రైకోనెన్ నాలుగు, ఐదో స్ధానల్లో రేస్ ముగించారు. కాగా ఇటాలియన్ గ్రాండ్ ప్రీ ప్రధాన రేస్ కు ముందు డ్రైవర్లు అంతా.. గత నెలలో అమెరికా రేస్ లో మరణించిన డ్రైవర్ జస్టిన్ విల్సన్ మృతికి సంతాపంగా.. ఒక నిమిషం మౌనం పాటించారు. ప్రపంచ ఛాపింయన్ హామిల్టన్... జస్టిన్ ఆత్మకు శాంతి చేకూరాలని.. రేస్ ముందు ట్విట్టర్ నివాళి తెలిపాడు. భారత్ కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్ ఐదో స్ధానంలో నిలవగా.. హుల్కెన్ బర్గ్ ఏడో స్థానంతో రేస్ ముగించాడు. సీజన్ తదుపరి రేస్ సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ సెప్టెంబర్ 20న జరుగుతుంది. డ్రైవర్స్ ఛాంపియన్ షిప్ రేసులో ప్రస్తుతం హామిల్టన్ ( 252పాయింట్లు), రోస్ బర్గ్ (199 పాయింట్లు), వెటెల్ (178 పాయింట్లు)తో వరసగా తొలి మూడు స్ధానాల్లో ఉన్నారు. -
హామిల్టన్ కు 'పోల్'
ఈ సీజన్ లో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న మెర్సిడెస్ టీమ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఇటాలియన్ గ్రాండ్ పిక్స్ లో పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫైయింగ్ సెషల్ లో అందరి కంటే వేగంగా.. ల్యాప్ ను పూర్తి చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. ఆదివారం జరిగే రేస్ లో అతను తొలి స్ధానం నుంచి ఆరంభిస్తాడు. కాగా.. ఫెరారీ రెండు మూడు స్థానాలు కైవశం చేసుకుంది. కిమి రైకొనెన్ సెకండ్ ప్లేస్ సాధించగా.. ఫెరారీ మరో డ్రైవర్ వెటెల్ మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. హామిల్టన్ కు ఈ ఏడాది జరిగిన 12 రేసుల్లో 11వ సారి పోల్ పొజిషన్ సాధించాడు. ఇక మెర్సిడెజ్ మరో డ్రైవర్ రోస్ బెర్గ్ నాలుగో స్ధానానికే పరిమితమయ్యాడు. మరో వైపు హామిల్టన్ సాధించిన ఈ ఫీట్ తో అతని టీమ్ మెర్సిడెజ్.. 1992-93 సీజన్ లో విలియమ్స్ జట్టు క్రియేట్ చేసిన రికార్డుకు అడుగు దూరంలో ఉంది. -
హామిల్టన్ హవా
బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సీజన్లో ఆరో విజయం స్పాఫ్రాంకోర్చాంప్స్: దాదాపు నెలరోజుల తర్వాత మళ్లీ ట్రాక్‌పైకి వచ్చినప్పటికీ తనలో ఎలాంటి దూకుడు తగ్గలేదని మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నిరూపించాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి రేసులో ఈ ఇంగ్లండ్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 53 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 23 నిమిషాల 40.387 సెకన్లలో ముగించి సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ ఆద్యంతం ఆధిక్యంలో నిలిచాడు. ఏదశలోనూ అతనికి తన ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురుకాలేదు. మెర్సిడెస్ జట్టుకే చెందిన రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని పొందగా... గ్రోస్యెన్ (లోటస్) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. సెర్గియో పెరెజ్ ఐదో స్థానాన్ని పొందగా... నికో హుల్కెన్‌బర్గ్ తొలి ల్యాప్‌లోనే రేసు నుంచి నిష్ర్కమించాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఇటలీ గ్రాండ్‌ప్రి సెప్టెంబరు 6న జరుగుతుంది. -
బెల్జియం గ్రాండ్ ప్రీ విజేత హామిల్టన్
బ్రసెల్: బెల్జియం ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీలో మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసులో హామిల్టన్ ప్రథమ స్థానంలో నిలవగా, మెర్సిడెజ్ టీమ్మేట్ నికో రోజ్‌బర్గ్ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఈ రేసులో ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్ ఐదో స్థానంలో నిలిచాడు. -
హామిల్టన్‌దే విజయం
మూడోసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సిల్వర్‌స్టోన్ (ఇం గ్లండ్): ప్రతికూల పరిస్థితులను అధిగమించిన లూయిస్ హామిల్టన్ సొంతగడ్డపై మూడోసారి విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 52 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 31 నిమిషాల 27.729 సెకన్లలో పూర్తి చేశాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ మొదట్లో అనూహ్యంగా వెనుకబడ్డాడు. 18 ల్యాప్‌ల వరకు ఫెలిప్ మసా ఆధిక్యంలో ఉండగా... ఆ తర్వాత హామిల్టన్ ఆధిక్యంలోకి వచ్చాడు. అక్కడి నుంచి ఈ బ్రిటన్ డ్రైవర్ వెనుదిరిగి చూడలేదు. మధ్యలో భారీ వర్షం వచ్చినా... తన సహచరుడు రోస్‌బర్గ్ నుంచి గట్టిపోటీ ఎదురైనా అన్నింటిని అధిగమించి హామిల్టన్ అందరికంటే ముందు గమ్యానికి చేరుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది ఐదో విజయం కావడం విశేషం. డేవిడ్ కూల్ట్‌హర్డ్ (1999, 2000లో) తర్వాత బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో వరుసగా రెండేళ్లు విజేతగా నిలిచిన డ్రైవర్‌గా హామిల్టన్ గుర్తింపు పొందాడు. తొలిసారి అతను 2008లో ఈ టైటిల్‌ను నెగ్గాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని పొందగా... వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు ఈ రేసు కలిసొచ్చింది. హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానంలో, పెరెజ్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. మొత్తం 20 మంది డ్రైవర్లు బరిలోకి దిగగా ఏడుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 26న జరుగుతుంది. -
సొంతగడ్డపై మెరిసిన హామిల్టన్
-
సొంతగడ్డపై మెరిసిన హామిల్టన్
లండన్: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సొంతగడ్డపై మెరిశాడు. ముచ్చటగా మూడోసారి బ్రిటీష్ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీలో హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసులో హామిల్టన్ ప్రథమ స్థానం సాధించాడు. పోల్ పొజిషన్ నుంచి రేసు ఆరంభించిన 30 ఏళ్ల హామిల్టన్ తొలిస్థానంలో నిలవగా, మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ మూడో స్థానంలో నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు నికో హుల్కెన్‌బర్గ్ ఏడు, సెర్గియో పెరెజ్ తొమ్మిది స్థానాలు సొంతం చేసుకున్నారు. -
హామిల్టన్‌దే హవా
కెనడా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సీజన్లో నాలుగో విజయం మాంట్రియల్: రెండు వారాల క్రితం మోంటెకార్లోలో చివరి నిమిషాల్లో విజయాన్ని చేజార్చుకున్న లూయిస్ హామిల్టన్ ఈసారి మాత్రం ఎలాంటి తప్పిదం చేయలేదు. కెనడా గ్రాండ్ ప్రిలో ఆద్యంతం ఆధిపత్యం చలాయించి సీజన్లో నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన కెనడా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ నిర్ణీత 70 ల్యాప్‌లను గంటా 31 నిమిషాల 53.145 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని పొందగా... బొటాస్ (విలియమ్స్), రైకోనెన్ (ఫెరారీ), వెటెల్ (ఫెరారీ) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. హుల్కెన్‌బర్గ్ ఎనిమిదో స్థానాన్ని పొందగా... సెర్గియో పెరెజ్ 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. మొత్తం 20 మంది డ్రైవర్లలో ముగ్గురు మధ్యలోనే వైదొలిగారు. ఈ సీజన్లో ఆరోసారి ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ తొలి పది ల్యాప్‌లు ముగిసేసరికి తన సమీప ప్రత్యర్థికంటే 3.7 సెకన్ల ముందున్నాడు. ఆఖరిదాకా ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న అతను సునాయాసంగా గమ్యానికి చేరుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఈనెల 21న జరుగుతుంది. -
హామిల్టన్‌కు ‘పోల్’
మాంట్రియల్ : ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఆరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన కెనడా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 43.393 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), రైకోనెన్ (ఫెరారీ), బొటాస్ (విలియమ్స్), గ్రోస్యెన్ (విలియమ్స్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
హామిల్టన్‌కు ‘పోల్’
మోంటెకార్లో (మొనాకో) : ప్రపంచ డిఫెండింగ్ చాంపియన్, మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్... కెరీర్లో తొలిసారి మొనాకో గ్రాండ్‌ప్రి పోల్ పోజిషన్‌ను దక్కించుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో అతను 1ని.15.909 సెకన్ల టైమింగ్‌తో అత్యంత వేగవంతమైన ల్యాప్‌ను నమోదు చేశాడు. తనకు ఫేవరెట్ సర్క్యూట్ అయిన మొనాకోలో తొమ్మిదో ప్రయత్నంలో ఈ బ్రిటన్ డ్రైవర్ పోల్ పొజిషన్ సాధించాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 40వ పోల్. మెర్సిడెస్ డ్రైవర్ నికో రోస్బెర్గ్ 1ని 15.440 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచాడు. హామిల్టన్‌కు ఇతని మధ్య తేడా కేవలం 0.342 సెకన్లు మాత్రమే. వెటెల్ (ఫెరారీ-1ని 15.849 సెకన్లు), రెడ్‌బుల్ డ్రైవర్లు రికియార్డో (1ని.16.041 సెకన్లు), క్వియాట్ (1ని.16.182 సెకన్లు) వరుసగా మూడు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. కిమీ రైకోనెన్ (ఫెరారీ-1:16,427 సెకన్లు) ఆరో స్థానం నుంచి, ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్ (1:16,808 సెకన్లు) ఏడో స్థానం నుంచి రేసు మొదలుపెడతారు. సైంజ్ (టోరో రోసో), మల్డోనాలో (లోటస్), వెర్స్టాపెన్ (టోరో రోసో) వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలను సాధించారు. ప్రధాన రేసు నేటి సాయంత్రం గం. 5.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
రోస్బర్గ్కు తొలి పోల్
నేడు స్పెయిన్ గ్రాండ్‌ప్రి బార్సిలోనా : ఈ సీజన్‌లోని తొలి నాలుగు రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సంపాదించి దూకుడు మీదున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు సహచరుడు నికో రోస్‌బర్గ్ చెక్ పెట్టాడు. శనివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టుకే చెందిన రోస్‌బర్గ్ ఈ సీజన్లో తొలిసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. మూడు క్వాలిఫయింగ్ సెషన్లలో కలిపి రోస్‌బర్గ్ మొత్తం 18 ల్యాప్‌లు డ్రైవ్ చేశాడు. ఈ క్రమంలో అతను ఒక నిమిషం 24.681 సెకన్లలో అందరికంటే వేగవంతమైన ల్యాప్‌ను నమోదు చేసి పోల్ పొజిషన్ దక్కించుకున్నాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. హామిల్టన్ ఒక నిమిషం 24.948 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. మాజీ చాంపియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో, బొటాస్ (విలియమ్స్) నాలుగో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ 17వ, సెర్గియో పెరెజ్ 18వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. -
దుమ్మురేపిన హామిల్టన్
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సీజన్లో మూడో విజయం మనామా (బహ్రెయిన్): క్వాలిఫయింగ్‌లోనే కాదు ప్రధాన రేసులోనూ తన సత్తా చాటుకున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ సీజన్లో మూడో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో డిఫెండింగ్ చాంపియన్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 35 నిమిషాల 05.809 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. తద్వారా బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో వరుసగా రెండేళ్లు విజేతగా నిలిచిన నాలుగో డ్రైవర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో అలోన్సో (2005, 06); మసా (2007, 08), వెటెల్ (2012, 13) ఈ ఘనత సాధించారు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఈ బ్రిటన్ డ్రైవర్‌కు చివరి దశలో మాత్రమే ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ నుంచి పోటీ ఎదురైంది. దాంతోపాటు తన కారులో చిన్నపాటి సమస్య వచ్చినా హామిల్టన్ నియంత్రణ కోల్పోకుండా డ్రైవ్ చేసి గమ్యానికి చేరుకున్నాడు. ఈ సీజన్లో ఆస్ట్రేలియా, చైనా గ్రాండ్‌ప్రిలలో కూడా హామిల్టన్ విజేతగా నిలిచాడు. మరో ల్యాప్ మిగిలి ఉండగా హామిల్టన్ సహచరుడు నికో రోస్బర్గ్ను ఓవర్టేక్ చేసిన రైకోనెన్ చివరకు రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. రోస్బర్గ్కు మూడో స్థానం, బొటాస్ (విలియమ్స్) నాలుగో స్థానం, వెటెల్ (ఫెరారీ) ఐదో స్థానం సంపాదించారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లలో పెరెజ్ ఎనిమిదో స్థానంలో నిలువగా... హుల్కెన్‌బర్గ్ 13వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు స్పెయిన్ గ్రాండ్‌ప్రి మే 10వ తేదీన జరుగుతుంది. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో ప్రస్తుతం హామిల్టన్ (93 పాయింట్లు), రోస్‌బర్గ్ (66), వెటెల్ (65) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
హామిల్టన్‌కే ‘పోల్ పొజిషన్’
నేడు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి మనామా (బహ్రెయిన్): ఈ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వరుసగా నాలుగో రేసులోనూ ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. శనివారం జరిగిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 32.571 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి... ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ), నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్), రైకోనెన్ (ఫెరారీ), బొటాస్ (విలియమ్స్) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ 8వ, సెర్గియో పెరెజ్ 11వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. -
హామిల్టన్‌కే ‘పోల్ పొజిషన్’
నేడు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి మనామా (బహ్రెయిన్): ఈ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వరుసగా నాలుగో రేసులోనూ ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. శనివారం జరిగిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 32.571 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి... ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ), నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్), రైకోనెన్ (ఫెరారీ), బొటాస్ (విలియమ్స్) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ 8వ, సెర్గియో పెరెజ్ 11వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. -
హామిల్టన్ హవా
చైనా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సీజన్లో రెండో విజయం ‘ఫోర్స్ ఇండియా’కు నిరాశ షాంఘై: ఈ సీజన్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన ఖాతాలో రెండో విజయాన్ని జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రి రేసులో అతను విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల రేసును హామిల్టన్ గంటా 39 నిమిషాల 42.008 సెకన్లలో పూర్తి చేశాడు. ‘పోల్ పొజిషన్’తో రేసు మొదలుపెట్టిన ఈ బ్రిటన్ డ్రైవర్ ఆద్యంతం ఆధిక్యంలో ఉన్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని దక్కించుకోగా... మాజీ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు నిరాశ ఎదురైంది. సెర్గియో పెరెజ్ 11వ స్థానంలో నిలువగా... హుల్కెన్‌బర్గ్ తొమ్మిదో ల్యాప్‌లోనే రేసు నుంచి వైదొలిగాడు. సీజన్‌లోని తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 19న జరుగుతుంది. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో నెగ్గిన హామిల్టన్, మలేసియా గ్రాండ్‌ప్రిలో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. గతంలో మూడుసార్లు చైనా గ్రాండ్‌ప్రి టైటిల్‌ను నెగ్గిన హామిల్టన్‌కు ఈ ఏడాదీ అం తగా పోటీ ఎదురుకాలేదు. తొలి ల్యాప్ నుంచే ఆధిక్యం లోకి వెళ్లిన అతనికి చివరి దశలో సహచరుడు రోస్‌బర్గ్ నుంచి సవాలు ఎదురైంది. అయితే 7 సెకన్ల ఆధిక్యంలో ఉన్న హామిల్టన్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా గమ్యానికి చేరాడు. -
హామిల్టన్‌దే బోణీ
ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో విజేత మెల్బోర్న్: గత సీజన్‌ను విజయంతో ముగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కొత్త సీజన్‌నూ విజయంతోనే ప్రారంభించాడు. ఆదివారం జరిగిన 2015 ఫార్ములావన్ సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ విజేతగా నిలిచాడు. తద్వారా తన కెరీర్లో 34వ విజయాన్ని నమోదు చేశాడు. 58 ల్యాప్‌ల ఈ రేసును ఈ బ్రిటిష్ డ్రైవర్ గంటా 31 నిమిషాల 54.067 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. చివరి నిమిషంలో ఉపసంహరణలు... సాంకేతిక సమస్యలు... చిన్నపాటి ప్రమాదాలు... తదితర కారణాలు సీజన్ తొలి రేసును పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. విలియమ్స్ జట్టు డ్రైవర్ బొటాస్ గాయం కారణంగా... మనోర్ మారుసియా జట్టు తమ కార్లను సకాలంలో సిద్ధం చేయకపోవడంతో తొలి రేసులో పాల్గొనలేదు. ఫలితంగా 1963 తర్వాత ఒక సీజన్‌లోని తొలి రేసులో కనిష్టంగా 15 మంది బరిలోకి దిగారు. రేసు మొదలయ్యాక ఆరుగురు డ్రైవర్లు రైకోనెన్, వెర్స్టాపెన్, గ్రోస్యెన్, మల్డొనాడో, క్వియాట్, మాగ్నుసెన్ మధ్యలోనే వైదొలిగారు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ చివరి వరకు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ విజేతగా నిలిచాడు. సెకను తేడాతో మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలువగా... ఫెలిప్ మసా (విలియమ్స్) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు టాప్-10లో నిలువడం విశేషం. హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానాన్ని ... సెర్గియో పెరెజ్ పదో స్థానాన్ని సాధించాడు. ఓవరాల్‌గా 11 మది డ్రైవర్లే రేసును పూర్తి చేయగలిగారు. ఎస్టీఆర్ జట్టు తరఫున బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌కు చెందిన మాక్స్ వెర్స్టాపెన్ 17 ఏళ్ల 166 రోజుల ప్రాయంలో అరంగేట్రం చేసి ఫార్ములావన్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. అయితే అతనికి తొలి రేసు కలిసిరాలేదు. కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో వెర్స్టాపెన్ 32వ ల్యాప్‌లో వైదొలిగాడు. తదుపరి రేసు మలేసియా గ్రాండ్‌ప్రి ఈనెల 29న జరుగుతుంది. -
ఎఫ్1కు వేళాయె..!
నేటి నుంచి కొత్త సీజన్ షురూ మెల్బోర్న్: డిఫెండింగ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) మళ్లీ టైటిల్ నిలబెట్టుకుంటాడా... నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచి గతేడాది విఫలమైన సెబాస్టియన్ వెటెల్ కొత్త జట్టు ఫెరారీతో మళ్లీ గాడిలో పడతాడా... ఈసారైనా ఎలాంటి ప్రమాదాలు లేకుండా అంతా సాఫీగా సాగుతుందా... భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ మరింత మెరుగైన ప్రదర్శన చేస్తుందా... ఈ సందేహాల నడుమ 2015 ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌కు శనివారంతో తెరలేవనుంది. ఆదివారం మెల్బోర్న్లో జరిగే ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రితో మొదలయ్యే కొత్త సీజన్‌కు నవంబరు 29న అబుదాబి గ్రాండ్‌ప్రి రేసుతో ముగింపు లభిస్తుంది. శనివారం ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్ జరుగుతుంది. ఈ సెషన్ ఫలితాల ఆధారంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును ఆయా డ్రైవర్లు ఏ ఏ స్థానం నుంచి (గ్రిడ్ పొజి షన్స్) ప్రారంభించాలో నిర్ణయిస్తారు. తొమ్మిది నెలలపాటు సుదీర్ఘంగా సాగే ఈ సీజన్లో మొత్తం 20 రేసులు ఉంటాయి. అత్యధిక పాయింట్లు సాధించిన వారికి ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్... అత్యధిక పాయింట్లు నెగ్గిన జట్టుకు ‘కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్ అందజేస్తారు. -
ఆల్ హ్యాపీస్..!
‘పాత’నే ‘కొత్త’గా మొదలెట్టాడు ఫార్ములా వన్ స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్. సోగకళ్ల సుందరి నికోల్ స్కాజినెగర్తో కొంత కాలం కిందట విడిపోయిన ఇతగాడు... ‘డిన్నర్ డేట్’లో తిరిగి ఆమెతోనే కొత్త ఏడాది లైఫ్ స్టార్ట్ చేశాడు. అంతే కాదు... ఆ రాత్రి ఇద్దరూ మునుపెన్నడూ లేనంత ఆనందంగా టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌లో గడిపారట. ఈ సంబరాన్ని హామిల్టన్ తన సామాజిక సైట్లో పంచుకున్నాడు. సదరు ఫొటో ఒకటి అప్లోడ్ చేసి... అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఓ కామెంట్ కూడా రాశాడు. డిసెంబర్ 31 రాత్రంతా రెడ్ వైన్‌తో మైమరిచిపోయిన ఈ జంట... జనవరి 1 సూర్యోదయాన్నీ అంతే ఉల్లాసంగా ఎంజాయ్ చేశారట. -
హామిల్టన్‌కే పట్టం
అబుదాబి: విజేతను తేల్చే రేసులో సంయమనంతో డ్రైవ్ చేసిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఒకే విజయంతో రెండు లక్ష్యాలను సాధించాడు. ఆదివారం జరిగిన 2014 ఎఫ్1 సీజన్ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. దాంతోపాటు ఈ ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌నూ కైవసం చేసుకున్నాడు. 2008లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన హామిల్టన్ కెరీర్లో ఇది రెండో ప్రపంచ టైటిల్. 55 ల్యాప్‌ల అబుదాబి రేసును ఈ మెర్సిడెస్ డ్రైవర్ గంటా 39 నిమిషాల 02.619 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. 19 రేసుల ఈ సీజన్‌ను హామిల్టన్ 11వ విజయంతో ఘనంగా ముగింపు పలికాడు. మారిన నిబంధనల ప్రకారం సీజన్ చివరి రేసులో రెట్టింపు పాయింట్లు లభిస్తాయి. ఫలితంగా హామిల్టన్ 384 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన రోస్బర్గ్కు తొలి మలుపు వద్దే హామిల్టన్ ఓవర్టేక్ చేశాడు. రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన హామిల్టన్ రెండో ల్యాప్ నుంచే ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించాడు. కారులో సమస్య తలెత్తడంతో రోస్‌బర్గ్ ఆఖరికి 14వ స్థానంతో సరిపెట్టుకొని ఒక్క పాయింట్ కూడా నెగ్గలేకపోయాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, పెరెజ్ వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. గత నాలుగేళ్లుగా ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన వెటెల్ ఈ సీజన్లో ఒక్క విజయాన్ని దక్కించుకోలేకపోవడం గమనార్హం. 2015 సీజన్ మార్చి 15న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో మొదలవుతుంది. కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5) స్థానం జట్టు పాయింట్లు 1 మెర్సిడెస్ 701 2 రెడ్‌బుల్ 405 3 విలియమ్స్ 320 4 ఫెరారీ 216 5 మెక్లారెన్ 181 డ్రైవర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5) స్థానం డ్రైవర్ జట్టు పాయింట్లు 1 హామిల్టన్ మెర్సిడెస్ 384 2 రోస్‌బర్గ్ మెర్సిడెస్ 317 3 రికియార్డో రెడ్‌బుల్ 238 4 బొటాస్ విలియమ్స్ 186 5 వెటెల్ రెడ్‌బుల్ 167 గమ్యం చేరారిలా... స్థానం డ్రైవర్ జట్టు సమయం పాయింట్లు 1 హామిల్టన్ మెర్సిడెస్ 1:39:02.619 50 2 మసా విలియమ్స్ 1:39:05.195 36 3 బొటాస్ విలియమ్స్ 1:39:31.499 30 4 రికియార్డో రెడ్‌బుల్ 1:39:39.856 24 5 బటన్ మెక్లారెన్ 1:40:02.953 20 6 హుల్కెన్‌బర్గ్ ఫోర్స్ ఇండియా 1:40:04.767 16 7 పెరెజ్ ఫోర్స్ ఇండియా 1:40:13.679 12 8 వెటెల్ రెడ్‌బుల్ 1:40:14.664 8 9 అలోన్సో ఫెరారీ 1:40:28.432 4 10 రైకోనెన్ ఫెరారీ 1:40:30.439 2 -
హామిల్టన్‌కు ఏడో ‘పోల్'
నేడు రష్యా గ్రాండ్‌ప్రి సోచి (రష్యా): మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ఏడోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 38.513 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), బొటాస్ (విలియమ్స్), బటన్ (మెక్లారెన్), క్వియాట్ (ఎస్టీఆర్), రికియార్డో (రెడ్‌బుల్), అలోన్సో (ఫెరారీ), రైకోనెన్ (ఫెరారీ), జీన్ వెర్జెన్ (ఎస్టీఆర్), వెటెల్ (రెడ్‌బుల్), మాగ్నుసన్ (మెక్లారెన్), పెరెజ్ (ఫోర్స్ ఇండియా), గుటిరెజ్ (సాబెర్), సుటిల్ (సాబెర్), గ్రోస్యెన్ (లోటస్), ఎరిక్సన్ (కాటర్‌హమ్), హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), మసా (విలియమ్స్), కొబయాషి (కాటర్‌హమ్), మల్డొనాడో (లోటస్), చిల్టన్ (మారుసియా) వరుసగా 2 మొదలుకొని 21వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. -
హామిల్టన్ దూకుడు
ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం తొలి రెండు స్థానాలు మెర్సిడెస్వే ‘ఫోర్స్’కు మిశ్రమ ఫలితాలు మోంజా (ఇటలీ): ఆరంభంలో చేసిన పొరపాటును అవకాశం వచ్చినపుడు సరిదిద్దుకోవడంతో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అనుకున్న ఫలితం సాధించాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 53 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 19 నిమిషాల 10.236 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’ నుంచి రేసును మొదలుపెట్టిన హామిల్టన్ ప్రారంభంలో కాస్త నెమ్మదించడంతో నాలుగో స్థానానికి పడిపోయాడు. రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన రోస్‌బర్గ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే తన తప్పిదాన్ని తెలుసుకున్న హామిల్టన్ వెంటనే దూకుడు పెంచి రోస్బర్గ్ను వెంబడించాడు. హామిల్టన్ మళ్లీ ఆధిక్యంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్న విషయాన్ని గమనించిన రోస్‌బర్గ్ 29వ ల్యాప్‌లో ఒత్తిడికి లోనయ్యాడు. నేరుగా ట్రాక్‌పై నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గంగుండా ముందుకు వెళ్లాలని చూశాడు. అయితే ఈ వ్యూహం బెడిసికొట్టింది. హామిల్టన్ వేగాన్ని పెంచి నేరుగా ట్రాక్ మీదుగా దూసుకెళ్లి రోస్బర్గ్ను దాటుకొని ఆధిక్యంలోకి వెళ్లాడు. అటునుంచి హామిల్టన్ వెనుదిరిగి చూడలేదు. రోస్‌బర్గ్ ఎంతగా ప్రయత్నించినా మళ్లీ ఆధిక్యంలోకి రాలేకపోయాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సెర్గియో పెరెజ్ ఏడో స్థానాన్ని సంపాదించగా... హుల్కెన్‌బర్గ్ 12వ స్థానంలో నిలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 21న జరుగుతుంది. -
ఏడు రేసుల తర్వాత మళ్లీ...
హామిల్టన్‌కు ‘పోల్ పొజిషన్’ నేడు ఇటలీ గ్రాండ్‌ప్రి మోంజా (ఇటలీ): సీజన్ ఆరంభంలో మెరిపించి ఆ తర్వాత తడబడిన మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఏడు రేసుల తర్వాత మరోసారి ‘పోల్ పొజిషన్’ను దక్కించుకున్నాడు. శనివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 24.109 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని పొందాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ ప్రపంచ మాజీ చాంపియన్ తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు. మెర్సిడెస్‌కే చెందిన నికో రోస్‌బర్గ్ రేసును రెండో స్థానం నుంచి ప్రారంభిస్తాడు. 220 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులో ఆధిక్యంలో ఉన్న రోస్‌బర్గ్ గత 12 రేసుల్లో నిలకడగా రాణించాడు. నాలుగు రేసుల్లో విజేతగా నిలువడమేకాకుండా ఆరు రేసుల్లో రెండో స్థానాన్ని సంపాదించాడు. ఇటలీలో ఈ ఇద్దరు మెర్సిడెస్ డ్రైవర్ల మధ్యే ప్రధాన పోటీ ఉంటుదనడంలో సందేహం లేదు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు క్వాలిఫయింగ్ సెషన్ కలిసిరాలేదు. ‘ఫోర్స్’ డ్రైవర్లు సెర్గియో పెరెజ్ 10వ స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ 13వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఎస్టీఆర్ జట్టు డ్రైవర్ క్వియాట్ క్వాలిఫయింగ్‌లో 11వ స్థానాన్ని పొందినా... నిబంధనలకు విరుద్ధంగా ఇంజిన్‌ను మార్చడంతో అతనిపై 10 గ్రిడ్ల పెనాల్టీ పడింది. దాంతో అతను ప్రధాన రేసును 21వ స్థానం నుంచి మొదలుపెడతాడు. ఇటలీ గ్రాండ్‌ప్రి వివరాలు ల్యాప్‌ల సంఖ్య: 53 సర్క్యూట్ పొడవు: 5.793 కి.మీ. రేసు దూరం: 306.720 కి.మీ. మలుపుల సంఖ్య: 11 ల్యాప్ రికార్డు: 1ని:21.046 సెకన్లు (బారిచెల్లో-2004) ప్రధాన రేసు నేటి సాయంత్రం గం. 5.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
ఆరేళ్ల తర్వాత... అదే తేదీన
బ్రిటిష్ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్ సీజన్లో ఐదో విజయం సిల్వర్‌స్టోన్: సొంతగడ్డపై లూయిస్ హామిల్టన్ సత్తా చాటుకున్నాడు. సరిగ్గా ఆరేళ్ల క్రితం జూలై 6న తొలిసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గిన ఈ బ్రిటన్ డ్రైవర్... అదే ఫలితాన్ని, అదే తేదీన 2014లో పునరావృతం చేశాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ సంపూర్ణ ఆధిపత్యం చలాయించి 52 ల్యాప్‌లను 2 గంటల 26 నిమిషాల 52.094 సెకన్లలో పూర్తి చేశాడు. ఆరో స్థానం నుంచి రేసును ప్రారంభించిన హామిల్టన్ 29వ ల్యాప్‌లో తొలిసారి ఆధిక్యంలోకి వెళ్లాడు. అటునుంచి ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ దూసుకుపోయాడు. చివరికి 30 సెకన్ల తేడాతో విజయాన్ని దక్కించుకొని సీజన్లో ఐదో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ 28 ల్యాప్‌ల వరకు ఆధిక్యంలో ఉన్నాడు. అయితే హఠాత్తుగా అతని గేర్‌బాక్స్‌లో సమస్య తలెత్తడంతో రోస్‌బర్గ్ 28వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకున్నాడు. రేసు ఆరంభమైన కొద్ది క్షణాల్లోనే ఫెలిప్ మసా (విలియమ్స్), కిమీ రైకోనెన్ (ఫెరారీ) నియంత్రణ కోల్పోయి ట్రాక్‌పై పరస్పరం ఢీకొట్టుకోవడంతో గంటపాటు రేసును నిలిపివేశారు. రేసు పునః ప్రారంభమయ్యాక హామిల్టన్, రోస్‌బర్గ్ హోరాహోరీగా పోటీపడినా తుదకు హామిల్టన్ పైచేయి సాధించాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ హుల్కెన్‌బర్గ్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు జర్మనీ గ్రాండ్‌ప్రి ఈనెల 20న జరుగుతుంది. -
రోస్బర్గ్కు ‘పోల్’
నేడు కెనడా గ్రాండ్‌ప్రి మాంట్రియల్: రెండు వారాల క్రితం మొనాకో గ్రాండ్‌ప్రిలో సాధించిన విజయంతో జోరు మీదున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ అదే దూకుడును కెనడాలోనూ కొనసాగించాడు. ఈ సీజన్లో మూడోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన కెనడా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ జర్మన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 14.874 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. రోస్‌బర్గ్ సహచరుడు లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్‌లు వరుసగా 11వ, 13వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్లో ఇప్పటిదాకా జరిగిన ఆరు రేసుల్లోనూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకే టైటిల్ లభించింది. మరోసారి గ్రిడ్ పొజిషన్స్‌లో తొలి రెండు స్థానాలు మెర్సిడెస్ డ్రైవర్లకే దక్కడంతో వారి ఖాతాలో వరుసగా ఏడో టైటిల్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రోస్బర్గ్కు ‘పోల్’
తొలి రెండు గ్రిడ్లు మెర్సిడెస్వే నేడు మొనాకో గ్రాండ్‌ప్రి మోంటెకార్లో: ఈ సీజన్ ఆరంభం నుంచి ఆధిపత్యం చలాయిస్తున్న మెర్సిడెస్ జట్టు మొనాకో గ్రాండ్‌ప్రిలోనూ విజయంపై దృష్టి సారించింది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. గత ఏడాది ఈ రేసులో విజేతగా నిలిచిన రోస్‌బర్గ్ క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా ఒక నిమిషం 15.989 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. అయితే ల్యాప్ చివర్లో ఈ జర్మన్ డ్రైవర్ చేసిన పొరపాటు అతని సహచరుడు లూయిస్ హామిల్టన్ ‘పోల్’ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. ల్యాప్ ముగిసే సమయంలో రోస్‌బర్గ్ అదుపుతప్పి ట్రాక్ దాటి వేరే మార్గంలో వెళ్లిపోయి తిరిగి వెనక్కి వచ్చాడు. దాంతో నిర్వాహకులు ప్రమాద సూచికగా పసుపు జెండాను ప్రదర్శించారు. దాంతో నిబంధనల ప్రకారం... రోస్‌బర్గ్ వెనకాలే వేగంగా దూసుకొస్తున్న హామిల్టన్ తన కారును నెమ్మదించాల్సి వచ్చింది. దాంతో అతను క్వాలిఫయింగ్ చివరి ల్యాప్‌లో తన సమయాన్ని మెరుగుపర్చుకోలేకపోయాడు. చివరకు రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రోస్‌బర్గ్ వ్యవహరించిన తీరుపై స్టీవార్డ్స్ విచారణ చేపట్టారు. దాంతో ‘పోల్ పొజిషన్’ ఫలితం తారుమారు అవుతుందా అనే అనుమానం కలిగింది. అయితే విచారణ అనంతరం స్టీవార్డ్స్ రోస్బర్గ్పై చర్య తీసుకోకపోడంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ జర్మన్ డ్రైవరే తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు సెర్గియో పెరెజ్ 10వ స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ 11వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. రోస్‌బర్గ్ ఉద్దేశపూర్వకంగానే ట్రాక్ నుంచి పక్కదారి పట్టాడా లేదా అనే విషయంపై వ్యాఖ్యానించేందుకు అతని సహచర డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నిరాకరించాడు. చివరి ల్యాప్‌లో తాను దూకుడు మీద ఉన్నానని... రోస్‌బర్గ్ పొరపాటు చేయకపోయుంటే తనకూ ‘పోల్ పొజిషన్’ అవకాశం దక్కేదని గత నాలుగు రేసుల్లో విజేతగా నిలిచిన హామిల్టన్ అన్నాడు. -
కెరీర్లో తొలిసారి...
హామిల్టన్‌కు స్పానిష్ గ్రాండ్‌ప్రి సీజన్లో వరుసగా నాలుగో విజయం రెండో స్థానంలో రోస్‌బర్గ్ టాప్-10లో నిలిచిన ‘ఫోర్స్’ బార్సిలోనా: ఫార్ములావన్ ప్రస్తుత సీజన్లో ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ జోరు కొనసాగుతోంది. వరుసగా నాలుగో రేసులోనూ విజయబావుటా ఎగురవేశాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రి రేసును హామిల్టన్ 1 గం. 41 ని. 05.155 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. తద్వారా కెరీర్లో తొలిసారి ఈ గ్రాండ్‌ప్రిని సొంతం చేసుకున్నాడు. హామిల్టన్ ఈ రేసుకు ముందు వరుసగా మలేసియా గ్రాండ్‌ప్రితో పాటు బహ్రెయిన్, చైనా గ్రాండ్ప్రిలను సైతం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ కూడా తన జోరుకు ఎదురులేదని నిరూపిస్తూ మెర్సిడెస్ ఖాతాలో వరుసగా ఐదో విజయాన్ని చేర్చాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 26వ విజయం. ప్రసుత రేసులో ద్వితీయ స్థానంలో నిలిచిన రోస్‌బర్గ్.. హామిల్టన్‌కు గట్టి పోటీనిచ్చాడు. కేవలం 0.6 సెకన్ల తేడాతో వెనకబడ్డాడు. డేనియల్ రికియార్డోకు మూడో స్థానం దక్కగా... డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ నాలుగో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఫోర్స్ ఇండియా డ్రైవర్లు చైనా గ్రాండ్ప్రిలాగే ఇక్కడా మెరిశారు. సీజన్లో నాలుగోసారి ఇద్దరూ టాప్-10లో నిలిచారు. పెరెజ్ తొమ్మిదో స్థానం, హల్కెన్‌బర్గ్ పదో స్థానం దక్కించుకున్నారు. రేసులో పాల్గొన్న 22 మంది డ్రైవర్లలో కొమయషి, జీన్ ఎరిక్ వర్గిన్ మధ్యలో వైదొలిగారు. తదుపరి రేసు ఈనెల 25న మొనాకోలో జరుగనుంది. -
మళ్లీ హామిల్టన్‌దే పోల్
* రెండో స్థానంలో రోస్‌బర్గ్ * నేడు స్పానిష్ గ్రాండ్ ప్రి బార్సిలోనా: ఈ సీజన్ ఫార్ములా వన్‌లో జోరు మీదున్న లూయీస్ హామిల్టన్ (మెర్సిడెస్) స్పానిష్ గ్రాండ్ ప్రిలోనూ సత్తా చాటాడు. శనివారం ఇక్కడ జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో అతను మొదటి స్థానంలో నిలిచాడు. ఈ బ్రిటన్ డ్రైవర్ 1 నిమిషం 25.232 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేస్‌ను అతను ‘పోల్ పొజిషన్’నుంచి ప్రారంభిస్తాడు. ఈ ఏడాది ఐదు అర్హత రేస్‌లలో నాలుగో సారి తొలి స్థానంలో నిలిచిన హామిల్టన్ కెరీర్లో ఇది 35వ పోల్ పొజిషన్ కావడం విశేషం. క్వాలిఫయింగ్ రేస్‌లో హామిల్టన్ సహచర మెర్సిడెస్ డ్రైవర్, జర్మనీకి చెందిన నికో రోస్‌బర్గ్ (1 ని. 25.400 సె.) రెండో స్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డో (1 ని. 26.285 సె.)కు మూడో స్థానం నుంచి రేస్ ప్రారంభిస్తాడు. టాప్-10లో ‘ ఫోర్స్’కు దక్కని చోటు: ఈ ఏడాది తొలి నాలుగు అర్హత రేస్లలోనూ టాప్-10 నిలిచిన ఫోర్స్ ఇండియా స్పానిష్ రేసులో మాత్రం విఫలమైంది. సెకనులో పదో వంతు తేడాతో వెనుబడి ఫోర్స్ డ్రైవర్ హల్కెన్‌బర్గ్ 11వ స్థానంలో నిలవంగా, సెర్గియో పెరెజ్ 12వ స్థానంతో సరి పెట్టుకున్నాడు. -
హామిల్టన్ హ్యాట్రిక్
సీజన్లో వరుసగా మూడో టైటిల్ చైనా గ్రాండ్‌ప్రిలో విజేత తొలి రెండు స్థానాలు మెర్సిడెస్వే టాప్-10లో ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు షాంఘై: ఫార్ములావన్‌లో గత నాలుగేళ్లుగా ఆధిపత్యం చలాయించిన రెడ్‌బుల్ జట్టుకు ఈసారి పగ్గాలు వేస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ తన జోరు కొనసాగిస్తూ సీజన్లో వరుసగా మూడో విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ 54 ల్యాప్‌ల రేసును గంటా 33 నిమిషాల 28.338 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో తన కెరీర్లో తొలిసారి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. సీజన్లో తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో మధ్యలోనే వైదొలిగిన హామిల్టన్... రెండో రేసు మలేసియా గ్రాండ్‌ప్రిలో, మూడో రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అదే జోరును చైనాలోనూ పునరావృతం చేసి మెర్సిడెస్ జట్టుకు వరుసగా నాలుగో విజయాన్ని అందించాడు. సీజన్లో ఇప్పటివరకు జరిగిన నాలుగు రేసుల్లోనూ మెర్సిడెస్ డ్రైవర్లకే టైటిల్స్ లభించడం విశేషం. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌కే చెందిన రోస్‌బర్గ్ టైటిల్ సాధించాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు మరోసారి ఆకట్టుకున్నారు. సీజన్లో మూడోసారి టాప్-10లో స్థానాన్ని సంపాదించారు. హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానంలో... సెర్గియో పెరెజ్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ ఐదో స్థానంతో సరిపెట్టుకోగా... ఈ రేసు గత ఏడాది విజేత అలోన్సో మూడో స్థానంలో నిలిచాడు. మొత్తం 22 మంది డ్రైవర్లలో 20 మంది రేసు పూర్తిచేయగా... గ్రోస్యెన్ (లోటస్), సుటిల్ (సాబెర్) మధ్యలో వైదొలిగారు. తదుపరి రేసు మే 11న స్పెయిన్ గ్రాండ్‌ప్రి జరుగుతుంది. తప్పిదంతో రేసు కుదింపు... చైనా గ్రాండ్‌ప్రి రేసు 56 ల్యాప్లపాటు జరగాల్సింది. అయితే రేసు ముగింపునకు సూచికగా ప్రదర్శించే చెకర్డ్ ఫ్లాగ్‌ను పొరపాటుగా 55వ ల్యాప్ ముగింపు దశలో చూపించారు. ఫలితంగా నిర్వాహకులు రేసును తొందరగా ముగించాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం రేసు ఫలితాలను 54 ల్యాప్‌ల వరకు తీసుకొని ప్రకటించారు. చెకర్డ్ ఫ్లాగ్ విషయంలో జరిగిన తప్పిదాన్ని అన్ని జట్ల డ్రైవర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. -
హ్యాట్రిక్‌పై హామిల్టన్ గురి
సీజన్లో మూడో ‘పోల్ పొజిషన్’ నేడు చైనా గ్రాండ్‌ప్రి షాంఘై: మరోసారి తన జోరు కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ‘హ్యాట్రిక్’ విజయంపై దృష్టి సారించాడు. ఆదివారం జరిగే చైనా గ్రాండ్‌ప్రి రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ ‘పోల్ పొజిషన్’ నుంచి ప్రారంభించనున్నాడు. ఆస్ట్రేలియా, మలేసియా గ్రాండ్‌ప్రి రేసులను కూడా ‘పోల్ పొజిషన్’తో మొదలుపెట్టిన హామిల్టన్ ఈసారి గెలిస్తే తన కెరీర్లో తొలిసారి ‘హ్యాట్రిక్’ నమోదు చేస్తాడు. ఈ సీజన్లో అతను మలేసియా, బహ్రెయిన్ రేసుల్లో గెలిచాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచాడు. చిరు జల్లుల మధ్యే కొనసాగిన క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 53.860 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తన కెరీర్లో 34వ సారి ‘పోల్ పొజిషన్’ను సంపాదించాడు. ఈ క్రమంలో ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో అత్యధిక పోల్ పొజిషన్స్ దక్కించుకున్న వారి జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో మైకేల్ షుమాకర్ (68-జర్మనీ), అయర్టన్ సెనా (65-బ్రెజిల్), సెబాస్టియన్ వెటెల్ (45-జర్మనీ) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. మరోవైపు హామిల్టన్ సహచరుడు నికో రోస్‌బర్గ్ క్వాలిఫయింగ్‌లో తడబడి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రపంచ చాంపియన్ వెటెల్ మూడో స్థానం నుంచి... రికియార్డో రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు మిశ్రమ ఫలితాలు లభించాయి. హుల్కెన్‌బర్గ్ 8వ స్థానం నుంచి... పెరెజ్ 16వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. చైనా గ్రాండ్‌ప్రి వివరాలు ల్యాప్‌ల సంఖ్య : 56 సర్క్యూట్ పొడవు : 5.451 కి.మీ. రేసు దూరం : 305.066 కి.మీ. మలుపుల సంఖ్య : 16 ల్యాప్ రికార్డు : 1ని:32.238సె (షుమాకర్-2004) గతేడాది విజేత : అలోన్సో -
దుమ్మురేపిన హామిల్టన్
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి సొంతం ‘ఫోర్స్ ఇండియా’ పోడియం ఫినిష్ సెర్గియో పెరెజ్‌కు మూడో స్థానం మనామా: ‘పోల్ పొజిషన్’ లభించకపోయినా ప్రధాన రేసులో దుమ్మురేపిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సీజన్లో రెండో టైటిల్ సాధించాడు. ఆదివారం జరిగిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్‌ల రేసును హామిల్టన్ గంటా 39 నిమిషాల 42.743 సెకన్లలో పూర్తి చేశాడు. ఇక ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ సహచరుడు నికో రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటివరకు సీజన్‌లోని మూడు రేసుల్లో మెర్సిడెస్ డ్రైవర్లే నెగ్గడం విశేషం.భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు తీపి జ్ఞాపకాన్ని మిగిల్చింది. ‘ఫోర్స్ ఇండియా’కు చెందిన డ్రైవర్లు టాప్-5లో నిలువడం విశేషం. సెర్గియో పెరెజ్ మూడో స్థానాన్ని సంపాదించి పోడియంపై నిలువగా... మరో డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ ఐదో స్థానాన్ని పొందాడు. 2009లో యూరోప్ గ్రాండ్‌ప్రి రేసులో ఫిషిచెల్లా రెండో స్థానం పొందిన తర్వాత ఫోర్స్ ఇండియా జట్టుకు చెందిన మరో డ్రైవర్ టాప్-3లో నిలువడం ఇదే ప్రథమం. తొలి రెండు రేసుల్లో ఏడుగురు చొప్పున డ్రైవర్లు రేసును ముగించడంలో విఫలంకాగా... ఈసారి ఐదుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. గతేడాది విజేత సెబాస్టియన్ వెటెల్ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు చైనా గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 20న జరుగుతుంది. -
హామిల్టన్ తొలిసారి...
కౌలాలంపూర్: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ... పది రేసుల తర్వాత మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన మలేసియా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ గంటా 40 నిమిషాల 25.974 సెకన్లలో పూర్తి చేశాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. నిరుటి విజేత వెటెల్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈనెల 16న సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో ‘పోల్ పొజిషన్’తో బరిలోకి దిగిన హామిల్టన్ రెండు ల్యాప్‌ల తర్వాత వైదొలిగాడు. అయితే మలేసియాలో మాత్రం ఎలాంటి తప్పిదం చేయకుండా ఆరంభం నుంచి చివరి ల్యాప్ వరకు తన దూకుడు కొనసాగించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ తొలి మలుపు వద్ద ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు. తన ఎనిమిదేళ్ల ఫార్ములావన్ కెరీర్లో హామిల్టన్‌కిది 23వ టైటిల్ కాగా మలేసియా గ్రాండ్‌ప్రిలో తొలిసారి చాంపియన్‌గా నిలిచాడు. గతేడాదిలో జులై 28న హంగేరి గ్రాండ్‌ప్రి రేసును నెగ్గిన తర్వాత హామిల్టన్‌కు వరుసగా పది రేసుల్లో విజయం దక్కలేదు. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి మాదిరిగానే ఈ రేసులోనూ అనూహ్యంగా ఏడుగురు డ్రైవర్లు రేసును పూర్తి చేయలేకపోయారు. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), రికియార్డో (రెడ్‌బుల్), గుటిరెజ్ (సాబెర్), సుటిల్ (సాబెర్), జీన్ వెర్జెన్ (ఎస్టీఆర్), బియాంచి (మారుసియా), మల్డొనాడో (లోటస్) ఈ జాబితాలో ఉన్నారు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. నికో హుల్కెన్‌బర్గ్ ఐదో స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ సెర్గియో పెరెజ్ కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో బరిలోకి దిగలేదు. సీజన్లో తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 6న జరుగుతుంది. -
మళ్లీ హామిల్టన్‌కే...
మెర్సిడెస్ డ్రైవర్‌కు వరుసగా రెండో ‘పోల్ పొజిషన్’ నేడు మలేసియా గ్రాండ్‌ప్రి రేసు కౌలాలంపూర్: సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో ఎదురైన చేదు ఫలితాన్ని మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వెనక్కినెట్టాడు. రెండో రేసు మలేసియా గ్రాండ్‌ప్రిలో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో దుమ్మురేపాడు. మూడు క్వాలిఫయింగ్ సెషన్స్‌లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకున్న ఈ ప్రపంచ మాజీ చాంపియన్ సీజన్లో వరుసగా రెండోసారి ‘పోల్ పొజిషన్’ను సొంతం చేసుకున్నాడు. చివరిదైన మూడో క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 59.431 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలోనూ ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ తన కారు ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా రెండో ల్యాప్‌లోనే వైదొలిగాడు. రెండో రేసులో హామిల్టన్ అదృష్టం ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. హామిల్టన్ మాదిరిగానే తొలి రేసులో వెటెల్‌కు నిరాశ ఎదురైంది. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానం నుంచి... పెరెజ్ 14వ స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. -
హామిల్టన్‌కు బ్రేక్
మోంజా: వరుసగా గత నాలుగు రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సాధించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ జోరుకు డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ కళ్లెం వేశాడు. శనివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెటెల్ దుమ్మురేపాడు. అందరికంటే వేగంగా ఒక నిమిషం 23.755 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ఈ సీజన్లో నాలుగోసారి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసు ఈ రెడ్‌బుల్ డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. వెటెల్ సహచరుడు మార్క్ వెబెర్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. మరోవైపు హామిల్టన్ పేలవ ప్రదర్శనతో ఆశ్చర్యకరంగా 12వ స్థానంలో నిలిచాడు. గత 67 రేసుల్లో అతను క్వాలిఫయింగ్ మూడో సెషన్‌కు అర్హత పొందకపోవడం ఇదే తొలిసారి. ‘మరీ మూర్ఖంగా డ్రైవ్ చేశాను. చాలా కాలం తర్వాత ఇంత చెత్తగా డ్రైవ్ చేసినందుకు జట్టు సిబ్బందికి క్షమాపణలు చెబుతున్నాను. ప్రధాన రేసులో సాధ్యమైనంత మెరుగైన స్థానం దక్కించుకునేందుకు కృషి చేస్తాను’ అని హామిల్టన్ అన్నాడు. ఇక ఈ సీజన్లో ఐదుసార్లు విజేతగా నిలిచిన వెటెల్ క్వాలిఫయింగ్ సెషన్లో సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచాడు. తొలి రెండు క్వాలిఫయింగ్ సెషన్స్‌లో అందరికంటే వేగంగా ల్యాప్‌లను పూర్తి చేసిన అతను చివరిదైన మూడో సెషన్లోనూ దూసుకుపోయాడు. గతంలో రెండుసార్లు ఇటలీ గ్రాండ్‌ప్రిలో టైటిల్ నెగ్గిన ఈ జర్మన్ డ్రైవర్ మూడో విజయంపై విశ్వాసంతో ఉన్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు టాప్-10లో నిలువలేకపోయారు. సుటిల్ 14వ స్థానం నుంచి... పాల్ డి రెస్టా 16వ స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు. -
వారెవ్వా... వెటెల్
స్పా ఫ్రాంకోర్చాంప్స్: క్వాలిఫయింగ్ సెషన్స్‌ను ప్రత్యర్థులకు వదిలేస్తున్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ప్రధాన రేసుల్లో మాత్రం తన సత్తా నిరూపించుకుంటున్నాడు. వరుసగా నాలుగోసారి ‘పోల్ పొజిషన్’ను లూయిస్ హామిల్టన్‌కు వదిలేసిన ఈ డిఫెండింగ్ ‘హ్యాట్రిక్’ వరల్డ్ చాంపియన్ ఈ సీజన్లో ఐదో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి రేసులో వెటెల్ విజేతగా నిలిచాడు. 44 ల్యాప్‌ల రేసును వెటెల్ గంటా 23 నిమిషాల 42.196 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫెరారీ డ్రైవర్ అలోన్సో రెండో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు పాల్ డి రెస్టా, అడ్రియన్ సుటిల్లకు ఈ రేసు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. 5వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన పాల్ డి రెస్టా 26వ ల్యాప్‌లో వైదొలిగాడు. ట్రాక్ మలుపు వద్ద విలియమ్స్ జట్టు డ్రైవర్ మల్డొనాడో కారు రెస్టా కారును ఢీకొట్టింది. సుటిల్ తొమ్మిదో స్థానంలో నిలిచి తన ఖాతాలో రెండు పాయింట్లు వేసుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఇటలీ గ్రాండ్‌ప్రి సెప్టెంబరు 8న జరుగుతుంది. ఈ సీజన్లో హామిల్టన్‌కు నాలుగోసారి ‘పోల్ పొజిషన్’ కలిసిరాలేదు. తొలి ల్యాప్‌లోనే హామిల్టన్‌ను వెనక్కినెట్టిన వెటెల్ అటునుంచి వెనుదిరిగి చూడలేదు. ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ ట్రాక్‌పై దూసుకెళ్లి 16 సెకన్ల తేడాతో విజయం సాధించాడు. ఓవరాల్‌గా వెటెల్ కెరీర్లో ఇది 31వ టైటిల్ కావడం విశేషం. ‘రేసు అద్భుతంగా సాగింది. హామిల్టన్‌పై మా వ్యూహం ఫలించింది. తొలి ల్యాప్‌లోనే అతణ్ని అధిగమించాను. వర్షం వస్తుందేమోనని కాస్త అందోళన చెందినా అంతా సవ్యంగా సాగిపోయింది’ అని వెటెల్ వ్యాఖ్యానించాడు. గమ్యం చేరారిలా... స్థానం డ్రైవర్ జట్టు సమయం పాయింట్లు 1 వెటెల్ రెడ్‌బుల్ 1:23:42.196 25 2 అలోన్సో ఫెరారీ 1:23:59.065 18 3 హామిల్టన్ మెర్సిడెస్ 1:24:09.930 15 4 రోస్‌బర్గ్ మెర్సిడెస్ 1:24:12.068 12 5 వెబెర్ రెడ్‌బుల్ 1:24:16.041 10 6 బటన్ మెక్లారెన్ 1:24:22.990 8 7 మసా ఫెరారీ 1:24:36.118 6 8 గ్రోస్యెన్ లోటస్ 1:24:38.042 4 9 సుటిల్ ఫోర్స్ ఇండియా 1:24:51.743 2 10 రికియార్డో ఎస్టీఆర్ 1:24:55.666 1 నోట్: సమయం గంటలు, నిమిషాలు, సెకన్లలో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5) స్థానం డ్రైవర్ జట్టు పాయింట్లు 1 వెటెల్ రెడ్‌బుల్ 197 2 అలోన్సో ఫెరారీ 151 3 హామిల్టన్ మెర్సిడెస్ 139 4 రైకోనెన్ లోటస్ 134 5 వెబెర్ రెడ్‌బుల్ 115 కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5) స్థానం జట్టు పాయింట్లు 1 రెడ్‌బుల్ 312 2 మెర్సిడెస్ 235 3 ఫెరారీ 218 4 లోటస్ 187 5 మెక్లారెన్ 65