
హామిల్టన్‌కే ‘పోల్ పొజిషన్’
ఈ సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వరుసగా నాలుగో రేసులోనూ ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. శనివారం జరిగిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో ఈ బ్రిటన్ డ్రైవర్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
నేడు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి
మనామా (బహ్రెయిన్): ఈ సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వరుసగా నాలుగో రేసులోనూ ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. శనివారం జరిగిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో ఈ బ్రిటన్ డ్రైవర్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
డిఫెండింగ్ చాంపియన్ హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 32.571 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి... ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ), నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్), రైకోనెన్ (ఫెరారీ), బొటాస్ (విలియమ్స్) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ 8వ, సెర్గియో పెరెజ్ 11వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు.