హామిల్టన్‌ హవా | Lewis Hamilton wins Italian Grand Prix to take lead in F1 title race | Sakshi
Sakshi News home page

హామిల్టన్‌ హవా

Published Mon, Sep 4 2017 12:56 AM | Last Updated on Tue, Aug 21 2018 9:00 PM

హామిల్టన్‌ హవా - Sakshi

హామిల్టన్‌ హవా

ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్‌ సొంతం
మోంజా (ఇటలీ): క్వాలిఫయింగ్‌లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఈ సీజన్‌లో ఆరో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్‌ నిర్ణీత 53 ల్యాప్‌లను గంటా 15 నిమిషాల 32.310 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన ఈ బ్రిటన్‌ డ్రైవర్‌ ఆద్యంతం ఆధిక్యంలో నిలిచాడు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్‌ రెండో స్థానాన్ని దక్కించుకోగా... వెటెల్‌ (ఫెరారీ) మూడో స్థానాన్ని పొందాడు.

భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా జట్టు డ్రైవర్లకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లిద్దరూ టాప్‌–10లో నిలిచారు. ఒకాన్‌ ఆరో స్థానంలో, పెరెజ్‌ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 20 రేసుల ఈ సీజన్‌లో ఇప్పటికి 13 రేసులు పూర్తయ్యాయి. తాజా విజయంతో హామిల్టన్‌ డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ రేసులో 238 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. వెటెల్‌ (235 పాయింట్లు) రెండో స్థానానికి పడిపోగా... బొటాస్‌ (197 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 17న జరుగుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement