మారనెల్లో (ఇటలీ): ఫార్ములావన్ దిగ్గజం, బ్రిటన్ రేసింగ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కొత్త జట్టు ఫెరారీ చెంత చేరాడు. ఏడుసార్లు ఫార్ములావన్ చాంపియన్‌గా నిలిచిన ఈ 40 ఏళ్ల రేసర్ ఇటీవల జట్టు మారాడు. ఈ సందర్భంగా సోమవారం మారనెల్లో పట్టణంలో ఉన్న ఫెరారీ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లాడు.
స్కుడెరియా ఫెరారీ (ఫెరారీ జట్టు పేరు)కి సంబంధించిన ఫివోరానో ట్రాక్‌ను సందర్శించిన హామిల్టన్ గంటలతరబడి గడిపాడు. ఫెరారీ టీమ్ కార్యక్రమంలో రోజంతా భాగమయ్యాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ‘ఎవరికైనా జీవితంలో కొన్ని ప్రత్యేక క్షణాలు, ప్రత్యేక రోజులంటూ ఉంటాయి.
నాకిది ప్రత్యేకమైన రోజు. కొత్త జట్టుతో కొత్త ప్రయాణం సాఫీగా సాగేందుకు తొలి అడుగు వేశాను. ట్రాక్‌లో రెడ్ కారు (ఫెరారీ రంగు)తో కూడా దూసుకెళ్లాలని కలలైతే ఉండేది. ఇప్పుడా కల నిజం కాబోతోంది. ఇది తలచుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు. ఏళ్ల తరబడి మెర్సిడెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హామిల్టన్ ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచి దిగ్గజ ఫార్ములావన్ రేసర్ మైకేల్ షుమాకర్ రికార్డు (7 విజయాలు)ను సమం చేశాడు.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో సూర్య
Comments
Please login to add a commentAdd a comment