ఫార్ములావన్‌లో బరిలోకి దిగిన తొలి చైనా డ్రైవర్‌గా గుర్తింపు పొందిన జో గ్వాన్‌యు తన కెరీర్‌లో గొప్ప పురోగతి సాధించాడు. 2025 సీజన్‌కుగాను విఖ్యాత ఫెరారీ జట్టులో రిజర్వ్ డ్రైవర్‌గా స్థానం దక్కించుకున్నాడు. రెండో రిజర్వ్ డ్రైవర్‌గా ఆంటోనియో జియోవినాజి కొనసాగుతాడు. ఈ సీజన్‌లో ఫెరారీ జట్టుకు రెగ్యులర్ డ్రైవర్లయిన లూయిస్ హామిల్టన్, చార్లెస్ లెక్‌లెర్క్‌లలో ఒకరు ప్రధాన రేసులో బరిలోకి దిగే అవకాశం లేకపోతే వారి స్థానాల్లో జో గ్వాన్‌యు లేదా జియోవినాజిలకు చాన్స్ లభిస్తుంది.
25 ఏళ్ల జో గ్వాన్‌యు 2022లో అల్ఫా రోమియో జట్టు తరఫున ఫార్ములావన్‌లో అరంగేట్రం చేశాడు. 2024లో అల్ఫా రోమియో జట్టు తమ పేరును సాబెర్‌గా మార్చుకుంది. వరుసగా మూడేళ్లు అల్ఫా రోమియో/సాబెర్ జట్టుకు ప్రధాన డ్రైవర్‌గా వ్యవహరించిన జో గ్వాన్‌యు మొత్తం 68 రేసుల్లో పోటీపడ్డాడు. ఓవరాల్‌గా ఏడుసార్లు టాప్–10లో నిలిచాడు. 2022లో కెనడా గ్రాండ్‌ప్రిలో, 2024లో ఖతర్ గ్రాండ్‌ప్రిలో గ్వాన్‌యు అత్యుత్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
సాకేత్–రామ్ జంట శుభారంభం
చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సాకేత్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ 6–3, 6–1తో కిమర్ కాప్‌జాన్స్ (బెల్జియం)–ఎర్గీ కిర్కిన్ (టర్కీ) ద్వయంపై అలవోకగా గెలిచింది. 53 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ ద్వయం ఎనిమిది ఏస్‌లు సంధించింది. తమ సరీ్వస్‌ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. భారత్‌కే చెందిన విజయ్ సుందర్ ప్రశాంత్–జీవన్ నెడుంజెళియన్ జంట 6–3, 3–6, 13–11తో చిరాగ్ దుహాన్–దేవ్ జావియా (భారత్) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment