
ఏడుసార్లు ఫార్ములావన్ వరల్డ్ చాంపియన్, బ్రిటన్ దిగ్గజ రేసర్ లూయిస్ హామిల్టన్ మెర్సిడెస్ జట్టును వీడనున్నాడు. 2013 నుంచి మెర్సిడెస్ తరఫున పోటీపడ్డ హామిల్టన్ ఈ ఏడాది తర్వాత ఆ జట్టుతో బంధం తెంచుకోనున్నాడు.
39 ఏళ్ల హామిల్టన్ 2025 సీజన్‌లో ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం దాదాపు ఖరారైంది. హామిల్టన్ 2008, 2014, 2015, 2017, 2018, 2019, 2020లలో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచాడు. 2021లో సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి తర్వాత హామిల్టన్ మరో రేసులో విజేతగా నిలువలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment