Ferrari
-
ఫెరారీ కోటలో అడుగు పెట్టిన హామిల్టన్..
మారనెల్లో (ఇటలీ): ఫార్ములావన్ దిగ్గజం, బ్రిటన్ రేసింగ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కొత్త జట్టు ఫెరారీ చెంత చేరాడు. ఏడుసార్లు ఫార్ములావన్ చాంపియన్‌గా నిలిచిన ఈ 40 ఏళ్ల రేసర్ ఇటీవల జట్టు మారాడు. ఈ సందర్భంగా సోమవారం మారనెల్లో పట్టణంలో ఉన్న ఫెరారీ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లాడు. స్కుడెరియా ఫెరారీ (ఫెరారీ జట్టు పేరు)కి సంబంధించిన ఫివోరానో ట్రాక్‌ను సందర్శించిన హామిల్టన్ గంటలతరబడి గడిపాడు. ఫెరారీ టీమ్ కార్యక్రమంలో రోజంతా భాగమయ్యాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ‘ఎవరికైనా జీవితంలో కొన్ని ప్రత్యేక క్షణాలు, ప్రత్యేక రోజులంటూ ఉంటాయి. నాకిది ప్రత్యేకమైన రోజు. కొత్త జట్టుతో కొత్త ప్రయాణం సాఫీగా సాగేందుకు తొలి అడుగు వేశాను. ట్రాక్‌లో రెడ్ కారు (ఫెరారీ రంగు)తో కూడా దూసుకెళ్లాలని కలలైతే ఉండేది. ఇప్పుడా కల నిజం కాబోతోంది. ఇది తలచుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు. ఏళ్ల తరబడి మెర్సిడెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హామిల్టన్ ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచి దిగ్గజ ఫార్ములావన్ రేసర్ మైకేల్ షుమాకర్ రికార్డు (7 విజయాలు)ను సమం చేశాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో సూర్య -
జొమాటో సీఈఓ గ్యారేజిలో ఇన్ని కార్లు ఉన్నాయా (ఫోటోలు)
-
రూ.5 కోట్ల కారును పట్టించిన ఎయిర్‌పాడ్స్ - ఎలా అంటే?
ప్రపంచ వ్యాప్తంగా వాహన దొంగతనాలు సర్వ సాధారణం అయిపోయాయి. అయితే ఇప్పుడున్న టెక్నాలజీల సాయంతో పోలీసులు దొంగలను అవలీలగా పట్టుకుంటున్నారు. ఇటీవల కూడా అమెరికాలో పోయిన దాదాపు రూ.5 కోట్ల కారును ఎయిర్పాడ్ల సహాయంతో కనిపెట్టేశారు.యూఎస్ నగరంలోని కనెక్టికట్‌లోని వాటర్‌బరీలో దొంగతనానికి గురైన రూ. 4.81 కోట్ల విలువైన ఒక ఫెరారీ కారును పోలీసులు పట్టుకోగలిగారు. దొంగతనానికి గురైన కారులో యజమాని తన ఎయిర్పాడ్లను వదిలిపెట్టారు. వాటర్‌బరీ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు యాపిల్ ఫైండ్ మై ఫీచర్ సాయంతో దానిని ట్రాక్ చేసి పట్టుకోగలిగారు.ఇదీ చదవండి: 40 ఏళ్ల క్రితం టీసీఎస్‌లో జీతం ఎంతంటే?: ఆఫర్ లెటర్ వైరల్కారులో వదిలిపెట్టిన యాపిల్ ఎయిర్పాడ్లు దొంగలించిన కారును వేగంగా గుర్తించడానికి సహాయపడ్డాయి. యాపిల్ పరికరాల సాయంతో పోయిన వస్తువులను గుర్తించిన సంఘటనలు గతంలో కూడా కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. పోయిన కారు మళ్ళీ దొరకడంతో యజమానికి యాపిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఇటాలియన్ బ్రాండ్ కారులో 'ఆకాష్ అంబానీ' - వీడియో
ముకేశ్ అంబానీ ఫ్యామిలీ గతంలో చాలాసార్లు ఖరీదైన అన్యదేశ్య కార్లలో కనిపించారు. తాజాగా మరోసారి ఆకాష్ అంబానీ రూ. 10.5 కోట్ల కారును డ్రైవ్ చేస్తూ అగుపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆకాష్ అంబానీ ఇటీవల ముంబైలో ఫెరారీ పురోసాంగ్యూ (Ferrari Purosangue) కారు డ్రైవ్ చేస్తున్నట్లు ఓ వీడియోలు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే జియో గ్యారేజ్‌లో ఓ ఫెరారీ పురోసాంగ్యూ కారు ఉంది. కాగా ఇది రెండో ఫెరారీ పురోసాంగ్యూ అని తెలుస్తోంది. ఎరుపురంగులో చూడచక్కగా ఉన్న ఈ ఖరీదైన కారును ఆకాష్ అంబానీ స్వయంగా డ్రైవ్ చేయడం వీడియోలో చూడవచ్చు.ఆకాష్ అంబానీ డ్రైవ్ చేస్తూ కనిపించిన ఫెరారీ పురోసాంగ్యూ 4 డోర్స్ వెర్షన్. ఇది పరిమాణం పరంగా దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంచెం పెద్దదిగా ఉంటుంది. కాబట్టి బూట్ స్పేస్ కొంత ఎక్కువగానే లభిస్తుంది. ఈ కారు 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 725 పీఎస్ పవర్, 716 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. -
'ఫెరారీ పురోసాంగ్యూ' కొన్న బిజినెస్ మ్యాన్ - ధర ఎంతో తెలుసా?
బెంగళూరులో ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకరైన 'బ్రెన్ కార్పొరేషన్' ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'బూపేష్ రెడ్డి' ఇటీవల ఓ ఖరీదైన ఇటాలియన్ సూపర్ కారును కొనుగోలు చేశారు. భారతదేశంలో ఈ కారును కొన్న మొదటి వ్యక్తిగా బూపేష్ రెడ్డిగా నిలిచారు. బూపేష్ రెడ్డి కొనుగోలు చేసిన కారు ఫెరారీ కంపెనీకి చెందిన 'పురోసాంగ్యూ' (Purosangue). దీని ధర రూ.6.5 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఫెరారీ పురోసాంగ్యూ మంచి డిజైన్ కలిగి.. చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. బ్లాక్ కలర్ పొందిన ఈ కారు రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్స్ కలిగి ఉండటం గమనించవచ్చు. ఇంటీరియర్ గోధుమ రంగులో ఉంది. లోపలి భాగంలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చూడవచ్చు. ఫెరారీ పురోసాంగ్యూ SUV 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వీ12 పెట్రోల్ ఇంజిన్ కలిగి 725 పీఎస్ పవర్, 716 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, 10.6 సెకన్లలో గంటకు 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ సూపర్ కారు టాప్ స్పీడ్ గంటకు 310 కిమీ కావడం గమనార్హం. ఇదీ చదవండి: ఇది లక్నో విమానాశ్రయమేనా? ఆశ్చర్యపోతున్న ఆనంద్ మహీంద్రా.. బూపేష్ రెడ్డి గ్యారేజిలో కేవలం ఫెరారీ పురోసాంగ్యూ కారు మాత్రమే కాకుండా లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీఓ, లంబోర్ఘిని ఉరస్, లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్వీజే, లంబోర్ఘిని ముర్సిలాగో, మెర్సిడెస్ ఏఎంజీ జీ63, మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎంజీ, ఫెరారీ 458స్పెషలే, ఫెరారీ 296 జీటీబీ, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, టెక్ఆర్ట్ పోర్స్చే జీటీ స్ట్రీట్ ఆర్, పోర్స్చే 911 ఆర్, పోర్స్చే 911 జీతీ2 ఆర్ఎస్, పోర్స్చే కేమాన్ జీటీ4, పోర్స్చే 911 కారెరా ఎస్, పోర్స్చే 39, పోర్స్చే 911 డీబీఎస్ కార్బన్ బ్లాక్ మొదలైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by Boopesh Reddy (@bren_garage) -
ఫెరారీకి హామిల్టన్!
ఏడుసార్లు ఫార్ములావన్ వరల్డ్ చాంపియన్, బ్రిటన్ దిగ్గజ రేసర్ లూయిస్ హామిల్టన్ మెర్సిడెస్ జట్టును వీడనున్నాడు. 2013 నుంచి మెర్సిడెస్ తరఫున పోటీపడ్డ హామిల్టన్ ఈ ఏడాది తర్వాత ఆ జట్టుతో బంధం తెంచుకోనున్నాడు. 39 ఏళ్ల హామిల్టన్ 2025 సీజన్లో ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం దాదాపు ఖరారైంది. హామిల్టన్ 2008, 2014, 2015, 2017, 2018, 2019, 2020లలో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచాడు. 2021లో సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి తర్వాత హామిల్టన్ మరో రేసులో విజేతగా నిలువలేకపోయాడు. -
జియో మాల్‌పై పోలీసుల దాడి: లగ్జరీ కార్లు సీజ్.. స్టోరీ ఏంటంటే?
విలాసవంతమైన జీవితానికి, ఖరీదైన కార్లకు పెట్టింది పేరు రిలయన్స్ అధినేత బిలియనీర్ అంబానీ కుటుంబం. తాజాగా ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌పై పోలీసుల దాడి వార్తల్లో నిలిచింది. ఈ మాల్లో 41 ఖరీదైన కార్లతో పాటు ఫెరారీస్, లంబోర్గినీ లాంటి లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఏం జరిగిందంటే..? టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం అంబానీకి చెందిన మాల్ పార్కింగ్ స్థలంలో ముంబై పోలీసులు 41 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో ఫెరారీ, లంబోర్ఘిని, పోర్షెస్ తదితర అత్యాధునిక లగ్జరీ కార్లు ఉన్నాయి. భారతదేశంలోని అతిపెద్ద మాల్స్‌లో ఒకటి ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్ దేశంలోనే యాపిల్ స్టోర్ ఉన్న తొలి మాల్ కూడా ఇదే. తాజా వార్తలపై రిలయన్స్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా సంస్థ నిర్వహించిన ఈవెంట్, ర్యాలీకిగా ను ముంబై పోలీసుల ముందస్తు అనుమతి పొందలేని కారణంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారని సమాచారం. అయితే ఈ కారు అంబానీ కుటుంబంలోని ఏ ఒక్కరికీ చెందకపోవడం గమనార్హం. ముంబైలో జనవరి 23 నుంచి ఫిబ్రవరి 6 వరకు నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ రిపబ్లిక్ డే రోజున నిర్వహించిన ర్యాలీలో ఫెరారీలు, లంబోర్గినిలు, పోర్షెస్, మెక్లారెన్స్, బిఎమ్‌డబ్ల్యూలు, జాగ్వార్లు, ఆడి, మెర్సిడెస్‌తో సహా 100కి పైగా కార్లు పాల్గొన్నాయని అంచనా. దీంతో పబ్లిక్ సర్వెంట్ అండ్ మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ 1951 ద్వారా సక్రమంగా ప్రకటించిన ఆర్డర్‌ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు కార్ల యజమానులపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
తప్పు చేసింది కాక.. పోలీసు కాలుపైకి ఎక్కిస్తాడా?
-
ఫెరారి నుంచి మరో సూపర్ కారు - లాంచ్ ఎప్పుడంటే?
భారతీయ మార్కెట్లో సూపర్ కార్ల వినియోగం పెరుగుతున్న తరుణంలో విదేశీ కంపెనీలు కూడా దేశీయ విఫణిలో కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఫెరారీ కంపెనీ వచ్చే ఏడాది ఓ కొత్త కారుని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'ఫెరారీ' వచ్చే సంవత్సరంలో సరికొత్త సూపర్‌ఫాస్ట్ కారు '812 సక్సెసర్' (Ferrari 812 Successor)ను విడుదల చేయనుంది. ఇప్పటికే అనేక మార్లు ఇటలీలో టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారు 2024లో ప్రారంభమవుతుంది. ప్రారంభంలో ఫెరారీ రోమా మాదిరిగా కనిపించిన ఈ కారు ఇప్పుడు కొంత అప్డేట్ పొంది ఉండటం గమనించవచ్చు. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ కారులో వీ12 ఇంజిన్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పర్ఫామెన్స్ గురించి కంపెనీ అధికారిక వివరాలను వెల్లడించలేదు. ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం.. అనన్య సామాన్యం ఫెరారీ 812 సక్సెసర్ కొత్త-లుక్ హెడ్‌లైట్ డిజైన్, క్వాడ్-ఎగ్జిట్ ఎగ్జాస్ట్‌లు పొందుతుంది. అండర్‌పిన్నింగ్‌లు దాదాపు రోమా, పురోసాంగ్యూ మాదిరిగా ఉంటుంది. ఫీచర్స్ కూడా దాని మునుపటి మోడల్స్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. 2025 నాటికి ఇది ఎలక్ట్రిక్ కారుగా మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. -
ఈ కారు కొనే డబ్బుతో ఫ్లైటే కొనేయొచ్చు!
ప్రపంచంలో ఖరీదైన కారు అంటే చాలామంది చెప్పే సమాధానం రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన 'బోట్ టెయిల్'. కానీ ఇప్పుడు ఈ కారుకంటే రెట్టింపు ధరకు 1962 నాటి ఫెరారీ కారు అమ్ముడైంది. ఇంతకీ ఈ కారు ప్రత్యేకత ఏమిటి, ఎంతకు అమ్ముడైంది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. న్యూయార్క్‌లో జరిగిన వేలంలో 1962 నాటి 'ఫెరారీ 250 జీటీవో' (Ferrari 250 GTO) 51.7 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. దీనిని అనామక బిడ్డర్ ఆర్ఎమ్ సోథెబీస్ కొనుగోలు చేశారు. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ కారు ధర సుమారు రూ. 430 కోట్లు కంటే ఎక్కువ. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడైన కార్ల జాబితాలో ఇది స్థానం సంపాదించింది. ఫెరారీ 250 జీటీవో ప్రారంభంలో 4.0 లీటర్ ఇంజిన్ కలిగి 7500 ఆర్పీఎమ్ వద్ద 3910 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసేది, ఆ తరువాత 3.0-లీటర్ జీటీవో డెవలప్మెంటల్ ఇంజన్ అమర్చారు. అప్పట్లోనే ఈ కారుని రేసింగ్‌లో ఎక్కువగా ఉపయోగించేవారు. ఇది 1965 సిసిలియన్ హిల్‌క్లైంబ్ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్ స్థానాన్ని పొందింది. ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? గతంలో ఫెరారీ క్లబ్ ఆఫ్ అమెరికా ఛైర్మన్ యాజమాన్యంలో ఉన్న ఈ కారు కావల్లినో క్లాసిక్‌లో FCS ప్లాటినం అవార్డు, కొప్పా బెల్లా మచినా అవార్డు గెలుచుకుంది. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఎక్కువ ధరకు అమ్ముడైన కారు మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే (Mercedes 300 SLR Uhlenhaut Coupe). ఇది జర్మనీలో జరిగిన వేలంలో రూ. 1202 కోట్లకు అమ్ముడైంది. -
ఫెరారీ కారు ఇలా కూడా కొనేయొచ్చు! అక్కడ మాత్రమే..
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'ఫెరారీ' (Ferrari) తమ బ్రాండ్ కార్లను క్రిప్టోకరెన్సీ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది. యూరోపియన్ దేశాలలోని సంపన్న కస్టమర్ల అభ్యర్థమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెరారీ పేర్కొంది. ఫెరారీ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ ఆఫీసర్ 'ఎన్రికో గల్లీరా' (Enrico Galliera) దీని గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో క్రిప్టోకరెన్సీ ద్వారా విక్రయాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. క్రిప్టోకరెన్సీ ద్వారా కార్లను కొనుగోలు చేస్తే ధరల్లో ఏమార్పు ఉండదని, ఎలాంటి అధిక ఫీజులు ఉండవని స్పష్టం చేశారు. ఫెరారీ ఈ క్రిప్టోకరెన్సీ ద్వారా ఎన్ని కార్లను విక్రయించనుంది? నిర్దిష్ట సంఖ్య (లిమిట్) ఏమైనా ఉందా? అనేదానికి సంబంధించిన అధికారికి వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. క్రిప్టోకరెన్సీ చెల్లింపుల ద్వారా విక్రయాలు ప్రారంభమైతే యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మార్కెట్లలో విక్రయాలు భారీగా పేరే సూచనలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇదీ చదవండి: ధనవంతుల జాబితాలో రైతు బిడ్డ - సంపద తెలిస్తే అవాక్కవుతారు! గతంలో బిట్‌కాయిన్ ద్వారా టెస్లా విక్రయాలు 2021లో టెస్లా కంపెనీ అధినేత 'ఎలాన్ మస్క్' (Elon Muck) బిట్‌కాయిన్ చెల్లింపుతో టెస్లా కార్లను కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతి తక్కువ కాలంలోనే ఈ విధానానికి ముగింపు పలికేసాడు. అయితే ఇప్పుడు ఫెరారీ ఈ విధానానికి సుముఖత వ్యక్తం చేసింది. ఇది సజావుగా ముందుకు సాగుతుందా? ఏదైనా సమస్యలను ఎదుర్కుంటుందా? అనే వివరాలు భవిష్యత్తులో తెలుస్తాయి. -
విషాదం: బిలియనీర్ వికాస్, నటి గాయత్రి లగ్జరీ కార్ క్రాష్, వీడియో వైరల్
బాలీవుడ్ మూవీ 'స్వదేశ్' లో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన యాక్టర్ గాయత్రి జోషి ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ప్రమాదానికి గురైంది. గాయత్రితోపాటు, భర్త, వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ తృటిలో ఈ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. అయితే మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఇటలీలో విహార యాత్రలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సార్డినియా సూపర్‌కార్ ఎక్స్పీరియన్స్ సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు గాయత్రి ప్రయాణిస్తున్న లంబోర్ఘిని కారు మరో లగ్జరీ కారు ఫెరారీని, క్యాంపర్ వ్యాన్ని ఢీకొట్టింది. లంబోర్ఘిని ,ఫెరారీతో సహా ఇతర లగ్జరీ వాహనాలతో పాటు, మినీ ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇది జరిగింది. దీంతో ఫెరారీ కారులో ఉన్న స్విట్జర్లాండ్‌కు జంట ప్రాణాలు కోల్పోయారు. మీడియా నివేదికల ప్రకారం, ఫెరారీలో మంటలు చెలరేగడంతో మెలిస్సా క్రౌట్లీ(63) మార్కస్ క్రౌట్లీ, 67 అక్కడి క్కడే ప్రాణాలొదిలారు. వికాస్ ఒబెరాయ్ మేనేజర్ ప్రకారం గాయత్రి, వికాస్ జంట ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. కాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన గాయత్రీ జోషి వీడియో జాకీగా తన కెరీర్‌ను ప్రారంభించింది. అడ్వర్టైజింగ్ మోడల్‌గా కూడా పనిచేసింది. హన్స్ రాజ్ హన్స్ 'ఝంజరియా, జగ్జిత్ సింగ్ 'కాఘజ్ కి కష్టి'తో సహా అనేక మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. ఆ తర్వాత ఫెమినా ఇండియా అందాల పోటీల్లో విజేతగా నిలవాలనే లక్ష్యంతో 2000లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకుంది. అలాగే మిస్ ఇంటర్నేషనల్ 2000లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇక సినిమాల విషయానికి వస్తే 2004లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ 'స్వేడ్స్'లో నటించింది. 2005లో వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ని పెళ్లాడి సినిమాలకు గుడ్‌బై చెప్పింది. వీరికి ఇద్దరు పిల్లలు. వికాస్ ఒబెరాయ్: టాప్ ముంబై రియల్టర్, ఒబెరాయ్ రియల్టీ ఎండీ వికాస్ ఒబెరాయ్. ఫోర్బ్స్ అతని నికర విలువ 3.8 బిలియన్లు డాలర్లుగా అంచనా వేసింది. Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T — Globe Clips (@globeclip) October 3, 2023 -
జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!
దీపిందర్ గోయల్ (Deepinder Goyals) అనగానే అందరికి జొమాటో గుర్తొస్తుంది. భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అందరూ మెచ్చే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో జొమాటో ఒకటిగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో ఒక సాధారణ ఉపాధ్యాయ దంపతులకు జన్మించిన గోయల్ ఈ రోజు రూ. 2వేల కోట్లకంటే ఎక్కువ సంపాదించాడు. కోటీశ్వరుడైన దీపిందర్ గోయల్ ఉపయోగించే కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫెరారీ రోమా జొమాటో ప్రధాన కార్యాలయం సమీపంలోని రోడ్ల మీద తరచుగా దీపిందర్ గోయల్ తన ఫెరారీ రోమా కారులో కనిపిస్తూ ఉంటాడు. ఈ కారు రెడ్ కలర్లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చిత్రమేమంటే జొమాటో యాప్ కూడా ఇదే కలర్లో ఉండటం గమనార్హం. ఈ కారు ధర సుమారు రూ. 4.3 కోట్లు (ఆన్-రోడ్ ప్రైస్). ఫెరారీ రోమా 3.9 లీటర్ ట్విన్టర్బో వి8 ఇంజన్ కలిగి 690 బిహెచ్పి పవర్, 760 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. పోర్స్చే 911 టర్బో ఎస్ పోర్స్చే కంపెనీకి చెందిన 911 టర్బో ఎస్ కూడా దీపిందర్ గోయల్ ఉపయోగించే కార్లలో ఒకటి. దీని ధర రూ. 3.13 కోట్లు. ఈ కారు కేవలం 8.9 సెకన్లలో గంటకు 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని ఇంజిన్ 650 hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. (ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్ - ఈ ధరతో ఒక కారు కొనేయొచ్చు!) లంబోర్ఘిని ఉరుస్ మన దేశంలో ఎక్కువ మంది సెలబ్రిటీల వద్ద ఉన్న లగ్జరీ కార్లలో లంబోర్ఘిని ఉరుస్ ఒకటి. ఈ కారుని దీపిందర్ గోయల్ కూడా కొనుగోలు చేశారు. దీని ధర రూ. 4.18 కోట్లు. ఇందులో 4.0-లీటర్, ట్విన్-టర్బో వి8 ఇంజిన్ ఉంటుంది. ఇది 650 hp పవర్, 850 Nm టార్క్ అందిస్తుంది. కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. పోర్స్చే కారెరా ఎస్ పోర్స్చే కంపెనీకి చెందిన కారెరా ఎస్ దీపిందర్ గోయల్ వద్ద ఉన్న సూపర్ కార్లలో ఒకటి. దీని ధర రూ. 1.88 కోట్లు. ఇందులోని 3.0 లీటర్ ప్లాట్ సిక్స్ సిలిండర్ బాక్సర్ పెట్రోల్ ఇంజిన్ 450 bhp పవర్, 530 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉండటమే కాకుండా పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: అపర కుబేరులు జిమ్‌లో ఉంటే ఇలాగే ఉంటారా? ఫోటోలు చూడండి!) ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ముఖేష్ అంబానీ ఉపయోగించే టాప్ 5 లగ్జరీ కార్లు
ప్రముఖ పారిశ్రామికవేత్త, అపరకుబేరుడు ముఖేష్ అంబానీ గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ఈయన అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లను ఉపయోగిస్తారు. ముఖేష్ అంబానీ ఉపయోగించే టాప్ 5 లగ్జరీ కార్లను గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. రోల్స్ రాయిస్ ఫాంటమ్: ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారుచేసే కంపెనీలలో చెప్పుకోదగ్గది రోల్స్ రాయిస్. ఈ సంస్థకు చెందిన ఫాంటమ్ SUV ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 13.50 కోట్లు. ఈ లగ్జరీ కారు 6.75 లీటర్ V12 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉత్తమమైన పనితీరుని అందిస్తుంది. మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్660 గార్డ్: జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ 'మేబ్యాచ్ ఎస్660' ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 10.50 కోట్లు. ఈ కారు అత్యంత సురక్షితమైన, అధిక సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. ఇది బుల్లెట్లు, బాంబులు ఇతర ప్రాణాంతక ప్రమాదాల్లో రక్షించడానికి ప్రత్యేకంగా తయారుచేశారు. బిఎండబ్ల్యు 760ఎల్ఐ సెక్యూరిటీ: రూ. 8.9 కోట్లు విలువ చేసే బిఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 760ఎల్ఐ సెక్యూరిటీ కూడా ముఖేష్ అంబానీ వినియోగించే కార్లలో ఒకటి. ఈ లగ్జరీ సెడాన్ 6 లీటర్ V12 ఇంజన్ కలిగి 544 బిహెచ్పి పవర్, 880 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అధిక భద్రతా ఫీచర్స్ కలిగిన కార్లలో ఇది ఒకటి. ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్: అంబానీ గ్యారేజిలోని మరో ఖరీదైన కారు ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్. దీని ధర రూ. 7.50 కోట్లు. ఈ స్పోర్ట్స్ కారు 2019లో ప్రారంభమై హైబ్రిడ్ టెక్నాలజీ ఉపయోగించిన మొదటి కారు. ఇది 4 లీటర్ వి8 ఇంజిన్ కలిగి 769 బిహెచ్పి పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్: బెంట్లీ కంపెనీకి చెందిన కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ ధర రూ. 3.69 కోట్లు. ఇది 2005లో బెంట్లీ ఆర్నేజ్కు వారసుడిగా పరిచయమైంది. కావున ఇది కూడా అదే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ 6 లీటర్ డబ్ల్యు12 ఇంజన్‌తో అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఈ కార్లతో పాటు ముఖేష్ అంబానీ గ్యారేజిలో మరిన్ని ఖరీదైన కార్లు ఉన్నాయి. -
పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌కు భారీ షాక్!
అమెరికన్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌కు ఇటాలియన్ సూపర్ కార్ మ్యానిఫ్యాక్చరర్ ఫెరారీ సంస్థ భారీ షాకిచ్చింది. ఈ పాప్ స్టార్ ఫెరారీ కారును వినియోగించేందుకు వీలు లేదని హెచ్చరించింది. ఇటలీకి చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఇల్ జియోర్నాలే నివేదిక ప్రకారం..ఫెరారీ సంస్థ జస్టిన్ బీబర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఫెరారీ కార్ల పట్ల జస్టిన్ బీబర్‌కు నైతిక విలువలు లేవని, వాటిని మెయింటెన్స్ చేయడంలో విఫలం అయ్యాడని,అందుకే ఫెరారీ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా సంస్థ తెలిపింది. ఫెరారీ సంస్థ తన కార్లను సరైన రీతిలో వినియోగించని సెలబ్రిటీలపై ఆంక్షలు విధించడం సర్వసాధారణం. గతంలో హాట్ మోడలింగ్‌తో గ్లోబల్ వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కిమ్ కర్దాషియన్‌తో పాటు, నికోలస్ కేజ్, ర్యాపర్ 50సెంట్ వంటి ప్రముఖులు ఫెరారీ కార్లను వినియోగించకుండా నిషేధించింది. తాజాగా ర్యాపర్ జస్టిన్ బీబర్‌పై అదే తరహాలో చర్యలు తీసుకుంది. జస్టిన్ బీబర్‌కు చెందిన ఎఫ్ 458ను నిర్వహణలో అలసత్వం వహించడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. జస్టిన్ బీబర్ ఫెరారీ రంగును మార్చడం, వేలం వేయడం వంటి అంశాలే ఫెరారీ సంస్థ జస్టిన్ బీబర్‌పై నిషేదం విధించే కారణాల్లో ఇవి కూడా ఉన్నాయి. గతంలో జస్టిన్ బీబర్ తన ఎఫ్ 458ని కొనుగోలు చేసిన కొన్ని నెలల తరువాత బెవర్లీ హిల్స్ నైట్ క్లబ్ వెలుపల పార్కింగ్ చేశాడు. నాటి నుంచి బీబర్‌కు ఫెరారీ కార్ల విషయంలో ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటుంన్నాడు. బెవర్లీ హిల్స్ నైట్ క్లబ్లో పార్కింగ్ చేసిన తర్వాత ఆ కారు మిస్ అవ్వడం కలకలం రేగింది. దీంతో బీబర్ సహాయకుడు ఆ సూపర్ కార్‌ను గుర్తించాడు. కారు అదృశ్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ కెనడియన్ ర్యాపర్ తన ఫెరారీ కారును తెలుపు రంగును బ్లూకి మార్చాడు. అంతేకాదు కారు స్టీరింగ్ వీల్ మీద గుర్రం సింబల్ రంగును, అల్లాయ్ వీల్స్, రిమ్స్ మీద బోల్ట్ లను మార్చాడు. దీంతో ఫెరారీ సంస్థ బీబర్‌పై గుర్రుగా ఉంది. దీనికితోడు రంగును మార్చి వేలం వేయడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన ఫెరారీ సంస్థ.. ఇకపై బీబర్ తమ సంస్థకు చెందిన కారును వినియోగించే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉టాటా ఎలక్ట్రిక్ వెహికల్,లాంచ్ చేసిందో లేదో.. హాట్ కేకుల్లా బుకింగ్స్ -
సూపర్ యాచ్.. బాగుందోచ్
ఫెరారీ కంపెనీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన కార్లను డిజైన్ చేసిందీ కంపెనీ. ముఖ్యంగా కారు డోర్లు పక్షి రెక్కల్లా పైకి తెరుచుకునేట్టు రూపొందించిన డిజైన్ అప్పట్లో ఓ సంచలనం. మరి అచ్చం అలాగే ఉండే ఓ లగ్జరీ బోట్‌ను డిజైన్ చేస్తే! ‘లాజ్జ్జరిని డిజైన్ స్టూడియో’ కంపెనీ ఇదే చేసి చూపించింది. ఫెరారీ కార్లలా అద్భుతమైన లగ్జరీ సూపర్ యాచ్ డిజైన్‌ను రూపొందించింది. ఈ యాచ్‌ను ‘ఫెరారీ ఆఫ్ ద సీ’ అంటోంది. దీనికి గ్రాన్ టూరిస్మో మెడిటెర్రేనియా అని పేరు పెట్టింది. ఈ సూపర్ యాచ్ పొడవు దాదాపు 26 మీటర్లు. గంటకు 136 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఈ యాచ్ నడవడానికి 22 టన్నుల బరువుండే 6,600 బ్రేక్–హార్స్ పవర్ ఇంజిన్లను వాడుతున్నారు. యాచ్‌లో కింద, పైన రెండు క్యాబిన్లు ఉంటాయి. కింది క్యాబిన్లో పెద్ద లివింగ్ రూమ్, ఇందులోనే ఓ కిచెన్ కూడా ఉంటుంది. అలాగే మూడు, నాలుగు బెడ్రూమ్లకు స్థలం కూడా ఉంటుంది. పై క్యాబిన్లో రెండో లివింగ్ ప్రాంతం, యాచ్ నడిపే కెప్టెన్ క్యాబిన్ ఉంటాయి. యాచ్ వెనక గ్యారేజ్ ఉంటుంది. దీన్నే సన్ డెక్‌గా కూడా వాడుకోవచ్చు. అంటే బయటకు వచ్చి సూర్యుడి వేడిని ఆస్వాదించవచ్చు. ఈ సూపర్ యాచ్ ధర రూ. 74 కోట్లు. ప్రస్తుతానికైతే ఇది డిజైన్ మాత్రమే. లాజ్జ్జరిని కంపెనీ గతంలో కూడా రకరకాల యాచ్ డిజైన్లను రూపొందించింది. హంసలా, షార్క్ చేపలా ఉండే డిజైన్లతో పాటు యాచ్ మధ్యలో ఖాళీ ప్రదేశం (రంధ్రం) ఉండేలా రకరకాల డిజైన్లను చేసి అబ్బురపరిచింది. –సాక్షి,సెంట్రల్‌డెస్క్ -
'రిలయెన్స్ జియో' మరో రికార్డ్
ముంబయి: భారత టెలికాం రంగంలో అనేక రికార్డులను సృష్టించిన రిలయెన్స్ జియో మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా భాగా గుర్తింపు పొందిన ఫెరారీ, కోకాకోలా వంటి కంపెనీల సరసన రిలయన్స్ జియో నిలచింది. ప్రపంచవ్యాప్తంగా బలమైన(స్ట్రాంగెస్ట్) బ్రాండ్స్‌లో రిలయెన్స్ జియో 5వ స్థానంలో నిలిచింది. బ్రాండ్ ఫైనాన్సెస్ గ్లోబల్ 500 ర్యాంకింగ్‌లో రిలయెన్స్ జియోకు ఈ ఘనత దక్కింది. మొదటి స్థానంలో వీచాట్(చైనా) ఉంటే, రెండో స్థానంలో ఫెరారీ ఉంది. ఇక మూడో స్థానంలో రష్యాకు చెందిన ఎస్ బిఈఆర్ బ్యాంకు ఉండగా, సాఫ్ట్ డ్రింక్ కంపెనీ కోకా కోలా నాలుగో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ఇండియాకు చెందిన రిలయెన్స్ జియో ఉండటం విశేషం.(చదవండి: విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్డీఓ శుభవార్త!) 2016లో స్థాపించిన జియో అతి తక్కువ కాలంలోనే జియో భారతదేశంలో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్‌గా నిలిచింది. అలాగే, ప్రపంచంలో మూడవ అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్‌గా ఉంది. ప్రస్తుతం జియోకు దాదాపు 40 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. మార్కెటింగ్ పెట్టుబడి, వాటాదారుల ఈక్విటీ, వ్యాపార పనితీరు వంటి కొలమానాల ఆధారంగా బ్రాండ్ ఫైనాన్స్ మార్కెట్ రీసెర్చ్ ర్యాంకింగ్ ఇచ్చిందని తెలిపింది. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే వీటిలో జియో అత్యధికంగా స్కోర్ చేసిందని బ్రాండ్ ఫైనాన్స్ కొనియాడింది. అలాగే బ్రాండ్ ఫైనాన్సెస్ గ్లోబల్ 500 ర్యాంకింగ్ టాప్ 25లో మన దేశానికి చెందిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు 25వ స్థానంలో ఉండటం విశేషం. -
ఫెరారీ సవారీ...
టస్కన్ (ఇటలీ): సొంతగడ్డపై విఖ్యాత మోటార్ రేసింగ్ జట్టు ఫెరారీ చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో 1000 రేసుల్లో పాల్గొన్న తొలి జట్టుగా ఫెరారీ సంస్థ నేడు రికార్డు సృష్టించనుంది. ఇటలీలోని టస్కన్ పట్టణంలో నేడు జరిగే టస్కన్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును ఫెరారీ జట్టు డ్రైవర్లు చార్లెస్ లెక్లెర్క్ 5వ స్థానం నుంచి... ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ 14వ స్థానం నుంచి ప్రారంభించనున్నారు. 1950లో ఎఫ్1 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ క్రీడలో ఫెరారీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 999 రేసుల్లో పాల్గొన్న ఫెరారీ జట్టు డ్రైవర్లు 238 రేసుల్లో విజేతగా నిలిచారు. ఎఫ్1 క్రీడలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన జట్టుగా ఫెరారీకే గుర్తింపు ఉంది. విఖ్యాత డ్రైవర్ మైకేల్ షుమాకర్ పదేళ్లపాటు (1996–2006) ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆ జట్టుకు 72 విజయాలు అందించాడు. 871 రేసులతో ఫెరారీ జట్టు తర్వాత మెక్లారెన్ (బ్రిటన్) జట్టు రెండో స్థానంలో ఉంది. మెక్లారెన్ జట్టు డ్రైవర్లు 182 రేసుల్లో విజయం సాధించారు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి అదరగొట్టాడు. అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 15.144 సెకన్లలో ముగించి కెరీర్లో 95వ సారి, ఈ సీజన్లో ఏడోసారి ‘పోల్ పొజిషన్’ను సంపాదించాడు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానం నుంచి రేసును ప్రారంభిస్తాడు. -
లెక్లెర్క్కు పోల్ పొజిషన్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్: ఈ సీజన్లో తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న ఫెరారీ జట్టుకు మరో అవకాశం లభించింది. ఆ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ఈ సీజన్లో మూడోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో 21 ఏళ్ల లెక్లెర్క్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 42.519 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. నేడు జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఫెరారీకే చెందిన సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. ఈ సీజన్లో గ్రిడ్‌లోని తొలి రెండు స్థానాలు ఫెరారీకి లభించడం తొలిసారి. మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, బొటాస్ వరుసగా మూడు, నాలుగు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 రేసులు జరగ్గా... హామిల్టన్ ఎనిమిది రేసుల్లో, బొటాస్, మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండేసి రేసుల్లో విజేతగా నిలిచారు. బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి, ఆస్ట్రియా గ్రాండ్ప్రిలలోనూ లెక్లెర్క్ పోల్ పొజిషన్ సాధించాడు. అయితే ప్రధాన రేసులో అతను మూడో స్థానంలో (బహ్రెయిన్), రెండో స్థానంలో (ఆస్ట్రియా) నిలిచాడు. మూడో ప్రయత్నంలో అతను టైటిల్ సాధిస్తాడా లేదా వేచి చూడాలి. -
హామిల్టన్‌కే పోల్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్: బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా 1 ని.58.179 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఫెరారీ డ్రైవర్ వెటెల్ రెండో స్థానం పొందగా, రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్, రికియార్డో ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. -
ఆ బుక్ రేటు.. జస్ట్ రూ.20 లక్షలే!
చరిత్ర ఎంత కాస్ట్లీయో తెలియాలంటే.. ముందు ఫెరారీ గురించి తెలియాలి. ఫెరారీ.. ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్.. రేట్లు అదిరిపోతాయ్.. మనం కొనలేం.. అయితే.. కారే కాదు.. ఆ కారు గురించి రాసిన పుస్తకాన్ని కూడా కొనలేం. ఎందుకంటే.. ఈ మధ్య ఆ కార్ల చరిత్రను తెలియజేస్తూ ఓ పుస్తకాన్ని ముద్రించారు. దాని రేటెంతో తెలుసా? జస్ట్.. రూ.20 లక్షలే.. 514 పేజీలుండే ఆ పుస్తకాన్ని ఉంచిన స్టాండ్.. చూడ్డానికి ఫెరారీ 12 సిలెండర్ల ఇంజిన్‌లా ఉంటుంది. స్టీల్‌పై క్రోమియం పూత వేసి తయారుచేశారు. అల్యూమినియం పెట్టెలో ఉంచారు. ఇందులో ఫెరారీకి సంబంధించిన అరుదైన చిత్రాలు ఉన్నాయట. ఈ బుక్ స్టాండ్‌ను డిజైనర్ మార్క్ న్యూసన్ రూపొందించారు. మొత్తం 1,947 పుస్తకాలను ముద్రించారు. అందులో 250 పుస్తకాలను ఒక్కోటి రూ.20 లక్షల చొప్పున విక్రయిస్తారు. అదీ కూడా డబ్బున్న ప్రతి ఒక్కళ్లకూ అమ్మేయరు. మ్యూజియంలకు, ఫెరారీ కార్లను ఎక్కువగా కొనే వినియోగదారులకు అమ్ముతారు. మరి మిగిలిన 1,697 పుస్తకాల సంగతేంటనేగా మీ ప్రశ్న.. వీటిని అమ్మడానికి ఇలాంటి షరతులేవీ లేవు. ఎవరికైనా అమ్ముతారు. వాటి ధర రూ.4.1 లక్షలు.. అయితే.. ఆ డిజైనర్ స్టాండ్‌లాంటి అదనపు హంగులు ఉండవట. ఇంతకీ ఈ పుస్తకం పేరు చెప్పలేదు కదూ.. వేరేది పెడితే బాగుండదని.. ‘ఫెరారీ’అనే పెట్టేశారు. -
ఈ కారు ధర ఎంతో తెలుసా?
ప్యారిస్ : ఎంత ఖరీదైన కారైనా మహా అయితే నాలుగైదు కోట్లు పలుకుతుంది. ఎంతో ప్రత్యేకమైనదైతే దాదాపు రూ.20 కోట్లదాకా పలకొచ్చు. కానీ రూ.537 కోట్లు విలువ చేసే కారు గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇక్కడ కనిపిస్తున్న ఫెరారీ 250 జీటీవో అనే ఈ కారు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించింది. ప్యారిస్‌లో జరిగిన ఓ వేలంలో ఈ కారు 8 కోట్ల డాలర్లు (సుమారు రూ.537 కోట్లు)కు వెదర్‌టెక్ సంస్థ సీఈవో డేవిడ్ మెక్నీల్ సొంతం చేసుకున్నారు. 2014లో ‘ఫెరారీ 250 జీటీవో’ పేరిటే ఉన్న రికార్డును మళ్లీ అదే మోడల్ కారు తిరగరాసింది. అప్పట్లో బోన్హామ్స్ మానెటరీ ఆక్షన్‌లో ఆ కారు 3.8 కోట్ల డాలర్ల (సుమారు రూ.255 కోట్లు)కు అమ్ముడుపోయింది. ఇప్పుడా రికార్డు బద్దలైంది. తాజాగా అమ్ముడుపోయిన ఈ కారును 1963లో తయారు చేశారు. 1962–64 మధ్య కేవలం 36 ఫెరారీ 250 జీటీవో మోడల్ కార్లను మాత్రమే ఆ సంస్థ తయారు చేసింది. -
వెటెల్దే విజయం
మెల్బోర్న్: ఫార్ములావన్ సీజన్లో తొలి విజయం ఫెరారీ జట్టు ఖాతాలోకి వెళ్లింది. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సీజన్‌లోని మొదటి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన వెటెల్ నిర్ణీత 58 ల్యాప్‌లను గంటా 29 నిమిషాల 33.283 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 25 ల్యాప్‌ల వరకు అగ్రస్థానంలోనే ఉన్న హామిల్టన్ ఆ తర్వాత ఆధిక్యాన్ని వెటెల్‌కు కోల్పోయాడు. 25వ ల్యాప్‌లో ఆధిక్యంలోకి వచ్చిన వెటెల్ చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. కెరీర్లో 200వ రేసులో పాల్గొన్న అతను 48వ టైటిల్‌ను గెలిచాడు. కిమీ రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో, రికియార్డో (రెడ్‌బుల్) నాలుగో స్థానంలో, అలోన్సో (మెక్లారెన్) ఐదో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు నిరాశ మిగిల్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ 11వ స్థానంలో, ఒకాన్ 12వ స్థానంలో నిలిచారు. మొత్తం 20 మంది డ్రైవర్లు రేసులో పోటీపడగా ఐదుగురు మధ్యలోనే వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 9న జరుగుతుంది. -
అమూల్యమైన ఫెరారీ కారు దొరికింది
సాక్షి, ప్రత్యేకం: ప్రపంచవ్యాప్తంగా ఫెరారీ కార్లుకు ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. క్రేజ్‌కు తగ్గట్లే ఆ కార్ల ధర ఆకాశాన్నంటుతుంది. ఫెరారీ కార్లలో అత్యంత అమూల్యమైనదిగా భావించే ఫెరారీ 365 జీటీబీ/4 కారును జపాన్‌లో కనుగొన్నారు. అదేంటి కనుగొనడం అంటున్నారు అనుకుంటున్నారా?. ప్రపంచంలో పూర్తిగా అల్యూమినియం మెటల్ బాడీతో కార్లను తయారు చేసిన తొలి, ఆఖరి కంపెనీ ఫెరారీనే. 1969-1973ల మధ్య మొత్తం 1200 అల్యూమినియం మెటల్ బాడీ కార్లను తయారు చేయాలని నిర్ణయించింది ఫెరారీ. అయితే, అనుకున్నవన్నీ సాధ్యపడవుగా. ఐదు కార్లు తయారు చేసిన తర్వాత ఆ ఆలోచనను ఉన్నట్లుండి విరమించుకుంది. అలా అల్యూమినియం బాడీతో తయారైన కార్లలో నాలుగు రేసింగ్‌లకు వినియోగిస్తుండగా.. ఫెరారీ 365 జీటీబీ/4ను మాత్రం మామూలు వాడకానికి ఫెరారీ కంపెనీ అమ్మింది. ఈ కారుకు ఉన్న ముద్దు పేరు 'డేటోనా'. దీన్ని జపాన్‌కు చెందిన ఓ డీలర్ 1971లో షిప్పింగ్ చేయించుకున్నారు. ఆ తర్వాత కొద్దికాలానికి పలువురు ఓనర్ల చేతులు మారుతూ ఎక్కడ ఉందో కూడా ఆచూకీ తెలియకుండా పోయింది. తాజాగా దీన్ని జపాన్‌లోని ఓ కార్ షెడ్లో గుర్తించారు. ఇప్పటికీ తన సామర్ధ్యాన్ని కోల్పోని 'డేటోనా'.. కేవలం 22 వేల మైలేజ్ మాత్రమే నడిచింది. ఇప్పటికిప్పుడు డేటోనాను అమ్మకానికి పెడితే దాదాపు రూ.12 కోట్ల 79 లక్షల పలుకుతుందని అంచనా. కొత్త ఫెరారీ కార్లతో పాటు దీన్ని కూడా వేలం వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కార్ల ప్రేమికులు భారీ సంఖ్యలో హాజరవుతారని సమాచారం. -
ఫెరారీ లగ్జరీ కార్లు లాంచ్.. ధర
న్యూడిల్లీ: ఇటాలియన్ ఆటోమేకర్ ఫెరారీ రెండు కొత్త కార్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లగ్జరీ కార్ సెగ్మెంట్ లో ఫెరారీ జీటీసీ4లుస్సో జీటీసీ4 లుస్సో టీ పేరుతో రెండు మోడళ్లను బుధవారం విడుదల చేసింది. లుస్సో ఇటాలియన్ పదానికి అర్థం లగ్జరీ. అందుకే లూసో పేరుతో ఈ సరికొత్త కార్లను విడుదల చేసినట్లు ఫెరారీ ప్రకటించింది. ఈజీటీసీ 4లుస్సో ధర రూ. 5.20కోట్లు(ఎక్స్ షోరూం), కొంచెం తక్కువ ధరలో జీటీసీ4 లుస్సో టీ ధర రూ. 4.20కోట్లు(ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది. రెండు కార్లను 4-వీల్ డ్రైవ్, 4 సీట్ల కానఫిగరేషన్తో లాంచ్ చేసింది. లగ్జరీకి మారు పేరుగా లెదర్ క్యాబిన్ తదితర ఫీచర్లతో గ్రాండ్ టూరిస్మో కూప్ (జీటీసీ) కార్లను కార్ లవర్స్‌కు అందుబాటులో తెచ్చింది. ఫెరారీ జీటీసీ4 లుస్సో వీ 12 ఇంజిన్ తో వచ్చింది. 681బీహెచ్పీ, 697 ఎన్ఎం గరిష్ట టార్క్. మోటార్ 7-స్పీడ్ డబుల్ క్లచ్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ . కేవలం సెకనులో 100 కి.మీ దూసుకుపోతోంది. ఇది కేవలం 3.4 సెకన్లలో 345కెఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. మరోవైపు ఫెరారీ జీటీసీ4 లుస్సో టీ అనేది 3.9-లీటర్ ఇంజిన్ వీ 8 ఇంజిన్ పవర్తోలాంచ్ అయింది. 610బీహెచ్పీ పవర్, 760గరిష్ట టార్క్. ఈ ఒక 7 స్పీడ్ డ్యుయల్ క్లచ్ గేర్‌బాక్స్ అమర్చారు. అంతేకాదు 10.25 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం తదితర ఫీచర్లతోపాటు ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా లెగ్ రూంను 16మి.మీ పెంచింది.