ప్రపంచ వ్యాప్తంగా వాహన దొంగతనాలు సర్వ సాధారణం అయిపోయాయి. అయితే ఇప్పుడున్న టెక్నాలజీల సాయంతో పోలీసులు దొంగలను అవలీలగా పట్టుకుంటున్నారు. ఇటీవల కూడా అమెరికాలో పోయిన దాదాపు రూ.5 కోట్ల కారును ఎయిర్‌పాడ్‌ల సహాయంతో కనిపెట్టేశారు.
యూఎస్ నగరంలోని కనెక్టికట్‌లోని వాటర్‌బరీలో దొంగతనానికి గురైన రూ. 4.81 కోట్ల విలువైన ఒక ఫెరారీ కారును పోలీసులు పట్టుకోగలిగారు. దొంగతనానికి గురైన కారులో యజమాని తన ఎయిర్‌పాడ్‌లను వదిలిపెట్టారు. వాటర్‌బరీ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు యాపిల్ ఫైండ్ మై ఫీచర్ సాయంతో దానిని ట్రాక్ చేసి పట్టుకోగలిగారు.
ఇదీ చదవండి: 40 ఏళ్ల క్రితం టీసీఎస్‌లో జీతం ఎంతంటే?: ఆఫర్ లెటర్ వైరల్
కారులో వదిలిపెట్టిన యాపిల్ ఎయిర్‌పాడ్‌లు దొంగలించిన కారును వేగంగా గుర్తించడానికి సహాయపడ్డాయి. యాపిల్ పరికరాల సాయంతో పోయిన వస్తువులను గుర్తించిన సంఘటనలు గతంలో కూడా కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. పోయిన కారు మళ్ళీ దొరకడంతో యజమానికి యాపిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment