40 ఏళ్ల క్రితం టీసీఎస్‌లో జీతం ఎంతంటే?: ఆఫర్ లెటర్ ఇదిగో | 1984 TCS Salary Offer Letter Goes Viral | Sakshi
Sakshi News home page

40 ఏళ్ల క్రితం టీసీఎస్‌లో జీతం ఎంతంటే?: ఆఫర్ లెటర్ ఇదిగో

Published Tue, Oct 1 2024 3:25 PM | Last Updated on Tue, Oct 1 2024 5:37 PM

1984 TCS Salary Offer Letter Goes Viral

ఐటీ సెక్టార్ అనగానే లక్షల్లో జీతాలు ఉంటాయని అందరూ భావిస్తారు. అయితే 40 ఏళ్ల క్రితం ఐటీ కంపెనీలలో జీతాలు ఎలా ఉండేవని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి 'రోహిత్ కుమార్ సింగ్' తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఆఫర్ లెటర్ చూస్తే.. అప్పట్లో జీతాలు ఇలా ఉండేవా అని ఆశ్చర్యపోతారు.

1984లో టీసీఎస్ కంపెనీలో జీతం రూ.1,300. అప్పట్లో ఇది రాజకుమారులు జీతం అని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రోహిత్ కుమార్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్‌ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ సింగ్, 40 సంవత్సరాల క్రితం టీసీఎస్ సంస్థలో చేరినప్పుడు తన జీతం ఇదేనని పేర్కొన్నారు.

భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి సింగ్.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన మొదటి ఉద్యోగమని, ఐఐటీ బనారసీ హిందూ యూనివర్సిటిలో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా పొందానాని వెల్లడించారు. ఆ తరువాత అతను ముంబైలోని టీసీఎస్‌లోట్రైనీగా చేరారు. ప్రస్తుతం సింగ్ చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అప్పట్లో జీతం చూసి చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఒక నెటిజన్ ఐఏఎస్ ప్రొబేషనర్‌గా మీ ప్రారంభ జీతం ఎంత? అని అడిగిన ప్రశ్నకు సింగ్ సమాధానమిస్తూ.. 1989లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరినప్పుడు నెలకు రూ. 2200 అని వెల్లడించారు. మరొకరు ''టీసీఎస్ నుంచి సివిల్ సర్వీస్ వరకు'' నిజంగానే గొప్ప ప్రయాణం ప్రశంసించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement