TCS
-
ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు
గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో.. ప్రముఖ టెక్ కంపెనీ 'టీసీఎస్' కీలక ప్రకటన చేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో భారీ రిక్రూట్మెంట్స్ ఉంటాయని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'మిలింద్ లక్కడ్' పేర్కొన్నారు.వచ్చే ఏడాది సుమారు 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉందని.. మిలింద్ లక్కడ్ అన్నారు. అంతే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ ఏఐ (GenAI)తో సహా అత్యాధునిక సాంకేతికతలలో ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.కేవలం ఫ్రెషర్లను మాత్రమే కాకుండా.. హయ్యర్ క్యాడర్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకోకున్నట్లు సమాచారం. సుమారు ఏడాది తరువాత కంపెనీ నియమాలను గురించి వెల్లడించింది. కరోనా మహమ్మారి తరువాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడ్డారు.ఏఐ వంటి లేటెస్ట్ టెక్నాలజీలు పెరుగుతున్న క్రమంలో ఐటీ కంపెనీలు.. ఈ రంగంలో అభివృద్ధి చెందడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే తమ ఉద్యోగులకు ఈ టెక్నాలజీలలో శిక్షణ ఇవ్వడానికి ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నాయి.ఇదీ చదవండి: టెక్ దిగ్గజం కీలక నిర్ణయం: 10 శాతం ఉద్యోగులు బయటకువారానికి ఐదు రోజులుకరోనా తరువాత ఉద్యోగులందరూ ఆఫీసు నుంచే పనిచేయాలని, వారానికి ఐదు రోజులు ఆఫీసులో ఉండాలని పలు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ జాబితాలో టీసీఎస్ కూడా ఉంది. ఈ విధానాన్ని అమలు చేయడానికి.. కంపెనీ ప్రోత్సాహకాలతో ముడిపెట్టింది. కార్యాలయ సంస్కృతిని బలోపేతం చేయడానికి, సహకారాన్ని మెరుగుపరచడానికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మళ్ళీ మొదలుపెట్టింది. -
నో బోనస్.. ఉద్యోగులకు టీసీఎస్ ఝలక్!
దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కొంతమంది ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. ఆఫీస్ నుంచి పని చేసే విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్న టీసీఎస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కొందరు ఉద్యోగులకు బోనస్ చెల్లింపులను తగ్గించింది.‘మనీకంట్రోల్’ నివేదిక ప్రకారం.. జూనియర్ ఉద్యోగులు ఇప్పటికీ వారి పూర్తి త్రైమాసిక వేరియబుల్ అలవెన్స్‌ను అందుకున్నారు. అయితే కొంతమంది సీనియర్ ఉద్యోగులకు మాత్రం బోనస్‌లో 20-40 శాతం కోత విధించింది ఐటీ దిగ్గజం. కొంతమందికైతే బోనస్ అస్సలు లభించలేదు.“2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జూనియర్ గ్రేడ్లకు 100% క్యూవీఏ (త్రైమాసిక వేరియబుల్ అలవెన్స్) చెల్లించాము. ఇతర అన్ని గ్రేడ్లకు క్యూవీఏ వారి యూనిట్ వ్యాపార పనితీరుపై ఆధారపడి ఉంటుంది” అని టీసీఎస్ ప్రతినిధి చెప్పినట్లుగా మీడియా నివేదికలో పేర్కొన్నారు.టీసీఎస్ కార్యాలయ హాజరు, ఆయా వ్యాపార యూనిట్ల పనితీరు రెండింటి ఆధారంగా బోనస్‌లను నిర్ణయిస్తుంది. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేలా కంపెనీ చర్యలు తీసుకుంటోంది. హాజరు విధానాలను స్థిరంగా పాటించకపోవడం క్రమశిక్షణా చర్యకు దారితీస్తుందని టీసీఎస్ గతంలోనే స్పష్టం చేసింది.కార్యాలయ హాజరు కీలకంఉద్యోగుల కార్యాలయ హాజరును కీలక అంశంగా చేరుస్తూ సవరించిన వేరియబుల్ పే విధానాన్ని టీసీఎస్ గత ఏప్రిల్‌లో ప్రవేశపెట్టింది. కొత్త విధానం ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని నిర్దేశిస్తూ నాలుగు హాజరు స్లాబ్‌లను ఏర్పాటు చేసింది. కొత్త విధానం ప్రకారం.. 60 శాతం కంటే తక్కువ సమయం కార్యాలయాల పనిచేసే ఉద్యోగులకు త్రైమాసికానికి ఎటువంటి వేరియబుల్ వేతనం లభించదు.ఇదీ చదవండి: ఇంటెల్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..60-75 శాతం మధ్య కార్యాలయ హాజరు ఉన్నవారు వేరియబుల్ వేతనంలో 50 శాతం అందుకుంటారు. అయితే 75-85 శాతం కార్యాలయానికి హాజరయ్యే ఉద్యోగులు వేరియబుల్ పేలో 75 శాతానికి అర్హులు. 85 శాతం కంటే ఎక్కువ ఆఫీస్‌కు వచ్చి పనిచేసినవారు మాత్రమే త్రైమాసికానికి పూర్తి వేరియబుల్ చెల్లింపును అందుకుంటారు. -
టీసీఎస్.. ఇన్ఫోసిస్‌కు ప్రత్యర్థి కాదా?
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. తనకు, దివంగత రతన్ టాటాకు మధ్య 2004లో జరిగిన ఆసక్తికరమైన సంఘటన గుర్తు చేసుకున్నారు. ఇన్ఫోసిస్‌లో జంషెడ్జీ టాటా రూమ్‌ను ప్రారంభించేందుకు ఇన్ఫోసిస్ ఆహ్వానించినప్పుడు రతన్ టాటా ఆశ్చర్యపోయారని మూర్తి చెప్పారు.ఇన్ఫోసిస్‌కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) పోటీదారుగా ఉన్నప్పటికీ తనను ఎందుకు ఆహ్వానించారని రతన్ టాటా అడిగారని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో రతన్ టాటా టీసీఎస్ సంస్థకు నాయకత్వం వహించేశారు. టాటా సందేహానికి మూర్తి మర్యాదపూర్వకంగా బదులిస్తూ, జంషెడ్జీ టాటా కంపెనీలకు అతీతమైనవారని, గొప్ప దేశభక్తుడని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌కు టాటా గ్రూప్‌ను పోటీదారుగా తాను ఎన్నడూ భావించలేదని, రతన్ టాటా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నందున రూమ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించామని రతన్ టాటాకు చెప్పారు.ఇదీ చదవండి: రతన్ టాటా మళ్లీ బతికొస్తే..తర్వాత టాటా ఆహ్వానాన్ని మన్నించారని, ఈ కార్యక్రమం తనకు జ్ఞాపకంగా మారిందని నారాయణమూర్తి పేర్కొన్నారు. రతన్ టాటాకు కాస్త సిగ్గుపడే స్వభావం ఉందని, దీంతో అప్పడు సుదీర్ఘ ప్రసంగం చేసే మూడ్‌లో లేరని చెప్పుకొచ్చారు. అయితే రతన్ టాటా పర్యటన తమ టీమ్‌పై చాలా ప్రభావం చూపిందని, ఇన్ఫోసిస్ సిబ్బందితో సమయం గడిపారని మూర్తి గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా వినయం, దయ, దేశభక్తి ఉన్న గొప్ప వ్యక్తి అని నారాయణమూర్తి కొనియాడారు. -
టీసీఎస్ భేష్.. వచ్చే ఏడాది క్యాంపస్ హైరింగ్ షురూ
ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరోసారి పటిష్ట ఫలితాలు సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో నికర లాభం 5 శాతం బలపడి రూ. 11,909 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలం(క్యూ2)లో రూ. 11,342 కోట్లు ఆర్జించింది.అయితే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో ఆర్జించిన రూ. 12,040 కోట్లుతో పోలిస్తే లాభాలు నామమాత్రంగా తగ్గాయి. పన్నుకుముందు లాభం రూ. 15,330 కోట్ల నుంచి రూ. 16,032 కోట్లకు మెరుగుపడింది. ఇక మొత్తం ఆదాయం 7% పుంజుకుని రూ. 64,988 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో రూ. 60,698 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ ఏడాది క్యూ1లో రూ. 63,575 కోట్ల అందుకున్న సంగతి తెలిసిందే. ఇతర విశేషాలు » ఆర్డర్ బుక్ విలువ (టీసీవీ) 8.6 బి. డాలర్లకు చేరింది. దీనిలో ఉత్తర అమెరికా నుంచి 4.2 బిలియన్ డాలర్లు లభించింది. » మొత్తం సిబ్బంది సంఖ్య 6,12,724కు చేరింది. » షేరుకి రూ. 10 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.» 2025–26కు క్యాంపస్ హైరింగ్ షురూఅనిశ్చితుల ఎఫెక్ట్ గత కొన్ని త్రైమాసికాలుగా కనిపిస్తున్న అప్రమత్తత తాజా క్వార్టర్లోనూ కొనసాగింది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లోనూ మా అతిపెద్ద విభాగం బీఎఫ్ఎస్ఐ రికవరీ బాటలో సాగుతోంది. వృద్ధి మార్కెట్లలో పటిష్ట పనితీరు చూపాం. క్లయింట్లు, ఉద్యోగులు, వాటాదారుల విలువ పెంపుపై ప్రత్యేక దృష్టిని కొనసాగిస్తున్నాం. – కె.కృతివాసన్, సీఈవో, ఎండీ -
చంద్రబాబుకి నిజం అంటే భయం.. అందుకే : వైఎస్సార్సీపీ శ్యామల
సాక్షి, తాడేపల్లి: నిజాలంటే సీఎం చంద్రబాబుకి భయమని అన్నారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. ఏన్డీయే అధికారం చేపట్టాక టాటా సంస్థ విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైందంటూ చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్యామల ఎక్స్ వేదికగా స్పందించారు.నిజాలంటే చంద్రబాబు భయం. ఆ నిజాల్ని పాతరవేయడానికి ఎంతకైనా దిగజారుతారు. విశాఖలో టీసీఎస్ రాబోతోందని నిన్న లోకేష్ ట్వీట్ చేయగానే.. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖలో టీసీఎస్ క్యాంపస్ కోసం చేసిన ప్రయత్నాలు, 2022లో టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో చర్చలు తదితర వివరాలను నెటిజన్లు బయటపెట్టారు. సొమ్ము ఒకరిది, సోకు ఇంకొకరిది అంటూ విమర్శలు సంధించారు. నిజాలంటే @ncbn గారికి భయం. ఆ నిజాల్ని పాతరవేయడానికి ఎంతకైనా దిగజారుతారు. వైజాగ్‌లో టీసీఎస్ రాబోతోందని నిన్న లోకేష్ ట్వీట్ చేయగానే @ysjagan గారు విశాఖలో టీఎస్ క్యాంపస్ కోసం చేసిన ప్రయత్నాలు, 2022లో టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో చర్చలు తదితర వివరాలను నెటిజన్లు… pic.twitter.com/VNfu2gQ1u0— Are Syamala (@AreSyamala) October 10, 2024 -
రతన్ టాటా విశిష్టతలు ఎన్నో... (ఫొటోలు)
-
Ratan Tata Photos: దివికేగిన వ్యాపార సామ్రాజ్యాధిపతి రతన్ టాటా...(ఫొటోలు)
-
40 ఏళ్ల క్రితం టీసీఎస్‌లో జీతం ఎంతంటే?: ఆఫర్ లెటర్ ఇదిగో
ఐటీ సెక్టార్ అనగానే లక్షల్లో జీతాలు ఉంటాయని అందరూ భావిస్తారు. అయితే 40 ఏళ్ల క్రితం ఐటీ కంపెనీలలో జీతాలు ఎలా ఉండేవని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి 'రోహిత్ కుమార్ సింగ్' తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఆఫర్ లెటర్ చూస్తే.. అప్పట్లో జీతాలు ఇలా ఉండేవా అని ఆశ్చర్యపోతారు.1984లో టీసీఎస్ కంపెనీలో జీతం రూ.1,300. అప్పట్లో ఇది రాజకుమారులు జీతం అని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రోహిత్ కుమార్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ సింగ్, 40 సంవత్సరాల క్రితం టీసీఎస్ సంస్థలో చేరినప్పుడు తన జీతం ఇదేనని పేర్కొన్నారు.భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి సింగ్.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన మొదటి ఉద్యోగమని, ఐఐటీ బనారసీ హిందూ యూనివర్సిటిలో జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా పొందానాని వెల్లడించారు. ఆ తరువాత అతను ముంబైలోని టీసీఎస్లోట్రైనీగా చేరారు. ప్రస్తుతం సింగ్ చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అప్పట్లో జీతం చూసి చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఒక నెటిజన్ ఐఏఎస్ ప్రొబేషనర్‌గా మీ ప్రారంభ జీతం ఎంత? అని అడిగిన ప్రశ్నకు సింగ్ సమాధానమిస్తూ.. 1989లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరినప్పుడు నెలకు రూ. 2200 అని వెల్లడించారు. మరొకరు ''టీసీఎస్ నుంచి సివిల్ సర్వీస్ వరకు'' నిజంగానే గొప్ప ప్రయాణం ప్రశంసించారు.A little more than 40 years ago, I got my first job at TCS Mumbai through campus recruitment at IIT BHU. With a princely salary of 1300 Rupees, the ocean view from the 11th Floor of Air India Building at Nariman Point was regal indeed! pic.twitter.com/A9akrhgu7F— Rohit Kumar Singh (@rohitksingh) September 29, 2024 -
టీసీఎస్ ఉద్యోగులకు ఐటీ నోటీసులు
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు అందుకున్నారు. టీడీఎస్ క్లెయిమ్‌లలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 143(1) ప్రకారం ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది.2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఉద్యోగులకు కట్ చేసిన టీడీఎస్‌లలో కొంత భాగం ఆదాయపు పన్ను శాఖ రికార్డులలో నమోదు కాలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుల్లో డిమాండ్ చేసిన మొత్తాలు రూ.50,000 నుంచి రూ.1,45,000 వరకు ఉన్నాయి. టీడీఎస్ వ్యత్యాసాలపై వడ్డీ, ఛార్జీలను సైతం నోటీసుల్లో పేర్కొన్నారు.ట్యాక్స్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా టీడీఎస్ క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా అప్డేట్ కాకపోయి ఉండవచ్చని టీసీఎస్ ఉద్యోగి ఒకరు తెలిపారు. తాము క్లెయిమ్స్‌ను మ్యాన్యువల్ సమర్పించాల్సి వచ్చిందని, సిస్టమ్‌లో నమోదు కాని టీడీఎస్ మొత్తానికి సంబంధించి ఐటీ శాఖ నోటీసులు పంపిందని ఆ ఉద్యోగి వివరించారు.ఇదీ చదవండి: కలవరపెడుతున్న డెల్ ప్రకటనటీడీఎస్ రికార్డుల్లోని వ్యత్యాసాల కారణంగా చాలా మంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను రీఫండ్లు ఆలస్యం అయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ నుండి ప్రాథమిక అంచనా ఆందోళన కలిగించింది. సమస్యలను సరిదిద్దే వరకు ట్యాక్స్ రీఫండ్‌లో మరింత జాప్యం జరుగుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డిమాండ్ నోటీసులు ఉన్నప్పటికీ, పన్ను అధికారుల ద్వారా రీప్రాసెసింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని టీసీఎస్ తమ ఉద్యోగులకు ఇంటర్నల్ ఈ-మెయిల్స్‌లో తెలియజేసింది. -
‘ప్రైమ్ కేటగిరీ’లో రూ.11 లక్షల వరకు జీతం
టెక్ కంపెనీ ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయని తెలుసుకదా. తాజాగా ప్రముఖ సాఫ్ట్వేర్ సేవలందించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఏడాది ‘ప్రైమ్ రిక్రూట్మెంట్’ విధానాన్ని అనుసరించబోతున్నట్లు ప్రకటించింది. ఈ కేటగిరీలో నియమించుకుంటున్న అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షల మధ్య వేతనం ఉంటుందని పేర్కొంది.టీసీఎస్ టాలెంట్ అక్విజిషన్ విభాగం గ్లోబల్ హెడ్ గిరీష్ నందిమఠ్ మాట్లాడుతూ..‘ఈ ఏడాది సంస్థ రిక్రూట్మెంట్ విధానంలో కొత్త పద్ధతిని తీసుకురాబోతున్నాం. ‘ప్రైమ్’ కేటగిరీలో నియామకం పొందిన అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షలు వేతనం అందిస్తాం. కంపెనీ అవసరాలకు తగిన ప్రతిభ ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశాలున్నాయి. కొంతమంది అభ్యర్థులు ‘డ్రీమ్ కేటగిరీ’(ఇష్టమైన జాజ్) ఉద్యోగాలు వస్తే టీసీఎస్ నుంచి సదరు కొలువును ఎంచుకుంటున్నారు. దాంతో కంపెనీకి టాలెంట్ ఉన్న ఇంజినీర్ల కొరత ఎదురవుతుంది. దాన్ని తగ్గించేందుకే ఈ ‘ప్రైమ్’ కేటగిరీను ప్రవేశపెట్టాం. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఈ కేటగిరీ కింద ఉద్యోగం పొందిన విద్యార్థులు మరొక కంపెనీ నియామక ప్రక్రియకు వెళ్లకుండా కళాశాలలు నిర్ధారిస్తాయి. ప్రోగ్రామింగ్, కోడింగ్ సామర్థ్యంపై అధిక నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఏఐ, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతికతలపై యువత నైపుణ్యం పెంచుకోవాలి. టీసీఎస్‌లో ఐటీ సేవల రంగాన్ని మార్చే వేగవంతమైన సాంకేతిక పురోగతి ఉంది. వ్యూహాత్మక వృద్ధి వ్యాపారాలు, పరిశోధనా విభాగాలున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ సమన్లుజూన్ 30, 2024 నాటికి టీసీఎస్‌లో మొత్తం 6,06,998 మంది ఉద్యోగులున్నారు. 2024-25లో టీసీఎస్ క్యాంపస్‌ల నుంచి 40,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తున్నారు. డిజిటల్ కేటగిరీలో ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ఏటా రూ.3.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వేతనం ఆఫర్ చేస్తున్నారు. డిజిటల్, ప్రైమ్ కేటగిరీలో రిక్రూట్ అయిన వారికి శిక్షణ తక్కువగా అవసరం అవుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. -
ఉద్యోగులకు నంబర్1 మైక్రోసాఫ్ట్
న్యూఢిల్లీ: భారత్‌లో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా మైక్రోసాఫ్ట్ మొదటి స్థానంలో నిలిచింది. టీసీఎస్, అమెజాన్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నట్టు ‘ర్యాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2024’ నివేదిక తెలిపింది. ఆర్థిక సామర్థ్యం, మంచి పేరు, కెరీర్లో చక్కని పురోగతి అవకాశాలు ఈ మూడూ ఉద్యోగులు ప్రధానంగా చూసే అంశాలు. వీటి పరంగా మైక్రోసాఫ్ట్ ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. టాటా పవర్, టాటా మోటార్స్, శామ్సంగ్ ఇండియా, ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, మెర్సెడెస్ బెంజ్ వరుసగా టాప్–10లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1,73,000 మంది ప్రతినిధులు, 6,084 కంపెనీల అభిప్రాయాలను సర్వేలో భాగంగా ర్యాండ్‌స్టాడ్ తెలుసుకుంది. భారత్ నుంచి 3,507 మంది అభిప్రాయాలు స్వీకరించింది. -
ఐటీ ఫ్రెషర్లకు పండగే.. క్యూ కట్టనున్న కంపెనీలు!
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, విప్రో వంటి పెద్ద ఐటీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY25) గణనీయమైన సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను ప్రకటించాయి. దీంతో భారత ఐటీ రంగం రిక్రూట్మెంట్ ప్రయత్నాలలో గణనీయమైన పునరుద్ధరణను పొందుతోంది. టాప్ కంపెనీలు మొత్తంగా 80,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నాయన్న వార్తలు ఐటీ ఫ్రెషర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.ముందంజలో టీసీఎస్ ఆదాయపరంగా భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ సంవత్సరం 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జూన్ త్రైమాసికంలోనే 5,452 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దాని మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరుకుంది.ఇన్ఫోసిస్ వ్యూహాత్మక నియామకందేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ నియామకం ఆన్-క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ రిక్రూట్మెంట్ మిశ్రమంగా ఉంటుంది. వరుసగా ఆరు త్రైమాసికాలుగా హెడ్‌కౌంట్‌లో క్షీణతను నివేదించినప్పటికీ, ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ సంఘ్రాజ్కా భవిష్యత్ వృద్ధిపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.తాజా ప్రతిభపై హెచ్‌సీఎల్‌టెక్ దృష్టిఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 8,080 మంది ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, ఆర్థక సంవత్సరంలో 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను హెచ్‌సీఎల్‌టెక్ ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న టెక్ ల్యాండ్‌స్కేప్‌లో పోటీగా నిలవడానికి ఉత్పాదక ఏఐలో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో సహా అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాలపై దృష్టి సారించడం ద్వారా తాజా ప్రతిభపై పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తోంది.విప్రో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్విప్రో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 నుంచి 12,000 మంది ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక సంవత్సరం విరామం తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్కు తిరిగి రావడాన్ని సూచిస్తోంది. -
81,000 దాటిన సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ నాలుగోరోజూ కొనసాగింది. అధిక వెయిటేజీ టీసీఎస్(3%), ఇన్ఫోసిస్(2%), రిలయన్స్(1%), ఐసీఐసీఐ బ్యాంక్(1%) చొప్పున రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతలు సెపె్టంబర్ నుంచి ప్రారంభం కావచ్చొనే అంచనాలూ సానుకూల ప్రభావం చూపాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 627 పాయింట్ల లాభంతో 81,343 వద్ద ముగిసింది. నిఫ్టీ 188 పాయింట్లు పెరిగి 24,801 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు సూచీలకు సరికొత్త రికార్డులు కావడం విశేషం. ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు ప్రథమార్ధమంతా బలహీనంగా ట్రేడయ్యాయి. మిడ్ సెషన్ నుంచి మార్కెట్ లాభాల బాట పట్టింది. ఒక దశలో సెన్సెక్స్ 806 పాయింట్లు బలపడి 81,523 వద్ద, నిఫ్టీ 225 పాయింట్లు ఎగసి 24,838 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. → ఐటీ కంపెనీలు ప్రకటిస్తున్న జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పిస్తున్నాయి. సెపె్టంబర్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు ఈ రంగ షేర్లకు మరింత డిమాండ్ పెంచాయి. ఎల్టీఐఎం 3.50%, టీసీఎస్ 3%, విప్రో 2.50%, ఇన్ఫోసిస్, పెర్సిస్టెంట్, కోఫోర్జ్, టెక్ మహీంద్రా 2% రాణించాయి. ఎంఫసీస్‌లు ఒకశాతం లాభపడ్డాయి. రూపాయి రికార్డ్ కనిష్టం @ 83.63 దేశీ కరెన్సీ డాలరుతో మారకంలో చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 5 పైసలు నీరసించి 83.63 వద్ద ముగిసింది. రూపాయి 83.57 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 83.66 వరకూ క్షీణించింది. -
టాటా కొత్త డీల్.. జియోకి గట్టి పోటీ తప్పదా?
ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, రిలయన్స్ జియో తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచేశాయి. దీని వల్ల చాలా మంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ (BSNL)కి మారారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ధోరణి మరింతగా పెరుగుతోంది. అనేకమంది ఎయిర్టెల్ (Airtel), జియో (Jio) వినియోగదారులు తమ మొబైల్ నంబర్లను బీఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేసుకుంటున్నారు.ఈ రెండు తమ ప్లాన్ ధరలను విపరీతంగా పెంచడంపై సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారులు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), బీఎస్ఎన్ఎల్ మధ్య ఇటీవల రూ.15,000 కోట్ల డీల్ కుదిరింది. ఇందులో భాగంగా టీసీఎస్, బీఎస్ఎన్ఎల్ కలిసి దేశం అంతటా 1,000 గ్రామాలకు 4జీ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. ఇది సమీప భవిష్యత్తులో వేగవంతమైన ఇంటర్నెట్ను అందిస్తుంది.ప్రస్తుతం 4జీ ఇంటర్నెట్ సర్వీస్ మార్కెట్లో జియో, ఎయిర్టెల్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే బీఎస్ఎన్ఎల్ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటే అది జియో, ఎయిర్‌టెల్‌లకు గణనీయమైన సవాలుగా మారవచ్చు. టాటా దేశం అంతటా నాలుగు ప్రాంతాలలో డేటా సెంటర్లను కూడా నిర్మిస్తోంది. ఇది దేశంలో 4జీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడుతుంది.గత నెలలో జియో తమ రీఛార్జ్ ప్లాన్లలో ధరల పెంపును ప్రకటించింది. ఆ తర్వాత ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా ఇలాంటి ప్రకటనలు చేశాయి. వీటిలో జియో ధరల పెరుగుదల అత్యధికం. ఇది 12% నుంచి 25% వరకు ఉంది. ఎయిర్టెల్ ధరలు 11% నుంచి 21%, వొడాఫోన్ ధరలు 10% నుంచి 21% వరకు పెరిగాయి. కాగా సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు జియోపైనే ఉన్నాయి. చాలా మంది జియో యూజర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. -
ఐటీ కష్టాలు తీరినట్టేనా? నియామకాల పునరుద్ధరణ సంకేతాలు
దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నియామకాల పునరుద్ధరణకు టీసీఎస్‌లో పరిణామాలు సంకేతంగా నిలుస్తున్నాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 11,000 మంది ట్రైనీలను చేర్చుకున్నామని, మార్చి 2025తో ముగిసే సంవత్సరానికి 40,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది.దేశపు అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల ఎగుమతిదారు అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) హెడ్‌కౌంట్ (ఉద్యోగుల సంఖ్య) మొదటి త్రైమాసికంలో 5,452 పెరిగి 6,06,998కి చేరుకుందని కంపెనీ తెలిపింది. అయితే 2024 ఆర్థిక సంవత్సరంలో దీని హెడ్‌కౌంట్ 13,249 తగ్గింది. క్రితం త్రైమాసికంలో ఉన్న 12.5%తో పోలిస్తే క్యూ1లో అట్రిషన్ 12%కి తగ్గింది.రెండో త్రైమాసికంలో అట్రిషన్ స్థిరపడుతుందని క్యూ1 ఎర్నింగ్స్ కాల్లో టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. "ప్రతిభను పెంపొందించడానికి టీసీఎస్‌కు ట్రైనీలు కీలకమైన వ్యూహం. అది ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది" అని ఆయన చెప్పారు.40 వేల జాబ్స్2025 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికలో ఉన్నామని టీసీఎస్ తెలిపింది. అయితే ఇది బాహ్య కారకాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని పేర్కొంది. కంపెనీ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్‌ని కూడా ముగించి క్వాలిఫైడ్ అభ్యర్థులను ప్రాసెస్ చేస్తోంది. టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ అనేది అభ్యర్థి సామర్థ్యాలు, నైపుణ్యాలను అంచనా వేసే సామర్థ్య పరీక్ష. కంపెనీ నైపుణ్య అంతరాలను అంచనా వేస్తుందని, అవసరాల ఆధారంగా నియామకాలు చేపడుతోందని లక్కాడ్ చెప్పారు. -
ఫలించిన టీసీఎస్ మంత్రం.. నిండుగా ఆఫీసులు!
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి టీసీఎస్ వేసిన మంత్రం ఫలించింది. వేరియబుల్ పేను కార్యాలయ హాజరుకు అనుసంధానించే కొత్త విధానాన్ని అమలు చేశాక దాదాపు 70 శాతం ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్నారని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు.అయితే ఇది తాత్కాలిక చర్య అని, దాన్ని ఆ విధంగా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గత ఏప్రిల్‌లో ఉద్యోగులకు త్రైమాసిక వేరియబుల్ చెల్లింపును వారి కార్యాలయ హాజరుతో లింక్ చేసింది. దీని ప్రకారం 60 శాతం కంటే తక్కువ హాజరు ఉన్నవారు త్రైమాసిక బోనస్‌కు అర్హులు కాదు.వారానికి ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీసు నుంచి పని చేయాలని ఆదేశించిన నెలల తర్వాత ఈ పాలసీ అప్డేట్ వచ్చింది. కొత్త విధానం ప్రకారం ఉద్యోగులు పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందాలంటే కార్యాలయంలో కనీసం 85 శాతం హాజరు ఉండాలి. 75-85 శాతం హాజరున్న ఉద్యోగులు వారి వేరియబుల్ పేలో 75 శాతం, 60-75 శాతం హాజరు ఉన్నవారు 50 శాతం మాత్రమే వేరియబుల్ పే పొందుతారు. -
టీసీఎస్‌కు షాక్!.. రూ.1600 కోట్ల జరిమానా
తమ వ్యాపార రహస్యాలను 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) బయట పెట్టించిందని 'కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్' డల్లాస్‌లోని నార్త్ డిస్ట్రిక్ టెక్సాస్‌లోని యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ కోర్ట్‌లో కేసు వేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన తరువాత వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేసినందుకు టీసీఎస్ పూర్తి బాధ్యత వహిస్తుందని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. ఈ కారణంగా కంపెనీకి 194 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1600 కోట్లు) జరిమానా విధించింది.ఈ విషయాన్ని టీసీఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ మేరకు జూన్ 14న కోర్టు ఉత్తర్వులను అందుకున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో టీసీఎస్ కూడా తన వాదనలను బలంగా వినిపించింది. జిల్లా కోర్టులు మళ్ళీ ఈ విషయాన్ని పునఃపరిశీలన చేయనున్నట్లు సమాచారం. కంపెనీకి అమెరికా కోర్టు భారీ జరిమానా విధించినప్పటికీ.. తమ ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని టీసీఎస్ పేర్కొంది.ఆన్‌బోర్డింగ్ ఆలస్యంఇదిలా ఉండగా గత రెండేళ్ల కాలంలో ఐటీ కంపెనీలు సుమారు 10,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్ఐటీఈఎస్ వెల్లడించింది. ఈ జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మొదలైన కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేసి.. ఉద్యోగంలో చేర్చుకోవడంలో చాలా ఆలస్యం చూపిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని.. ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. -
టీసీఎస్‌లో విచిత్ర పరిస్థితి! 80,000 జాబ్స్ ఉన్నాయి.. కానీ..
ఐటీ కంపెనీల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ఓ వైపు లేఆఫ్‌ల పేరుతో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తుండగా మరో వైపు నియామకాలు మందగించాయి. వేలాది మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే భారత్‌కు చెందిన ఐటీ దిగ్గజం టీసీఎస్‌లో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కంపెనీలో 80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరకడం లేదు.స్కిల్స్ గ్యాప్ కారణంగా టీసీఎస్ 80,000 ఖాళీలను భర్తీ చేయడానికి కష్టపడుతోందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఇది ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలు, కొత్త ఉద్యోగాల అవసరాల మధ్య అసమతుల్యతను తెలియజేస్తోంది. ఈ అంతరాలను భర్తీ చేయడానికి కాంట్రాక్టర్లపై ఆధారపడవలసి వస్తోందని టీసీఎస్ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ) గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ అమర్ షెట్యే టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు.ఓ వైపు ఎంపిక చేసుకున్న ఫ్రెషర్లను ఉద్యోగాలలోకి చేర్చుకోకుండా ఇలా స్కిల్ గ్యాప్ పేరుతో వేలాది ఉద్యోగాలను ఖాళీగా ఉంచడంపై ఉద్యోగార్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. టీసీఎస్ సహా భారత ఐటీ దిగ్గజాలు ఫ్రెషర్స్ ఆన్‌బోర్డింగ్‌లో జాప్యం చేస్తుండటంతో చాలామంది జాయిన్ డేట్లను కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నారు. గత రెండేళ్లలో 10,000 మందికి పైగా ఫ్రెషర్లు ఈ జాప్యం వల్ల ప్రభావితమయ్యారని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) తెలిపింది. -
టీసీఎస్‌కు కువైట్ బ్యాంక్ డీల్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రముఖ కువైట్ బ్యాంకు డీల్‌ను దక్కించుకుంది. కువైట్‌లోని ప్రముఖ వాణిజ్య బ్యాంకు అయిన బుర్గాన్ బ్యాంక్ యొక్క కోర్ బ్యాంకింగ్ టెక్నాలజీని ఆధునీకరించడానికి డీల్ కుదుర్చుకున్నట్లు టీసీఎస్ ప్రకటించింది.ఈ డీల్‌లో భాగంగా బుర్గాన్ బ్యాంక్ బహుళ స్వతంత్ర లెగసీ అప్లికేషన్లను సమకాలీన సార్వత్రిక బ్యాంకింగ్ సొల్యూషన్‌గా ఏకీకృతం చేయడంలో టీసీఎస్ సహాయం చేస్తుంది. 160కి పైగా శాఖలు, 360 ఏటీఎంల ప్రాంతీయ నెట్‌వర్క్‌తో కువైట్‌లోని అతి తక్కువ కాలంలో ఏర్పాటైన వాణిజ్య బ్యాంకులలో బుర్గాన్ బ్యాంక్ ఒకటి. అధిక లావాదేవీల వాల్యూమ్లను నిర్వహించడానికి, ఆటోమేషన్‌ను మెరుగుపరచడానికి, సిబ్బంది ఉత్పాదకతను మెరుగుపరచడానికి టీసీఎస్ అందించే పరిష్కారాన్ని బుర్గాన్ బ్యాంక్ అమలు చేయనుంది.బుర్గాన్ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోనీ డాహెర్ మాట్లాడుతూ కస్లమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తమ కోర్ సిస్టమ్‌ల ఆధునికీకరణపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. బుర్గాన్ బ్యాంక్ వంటి ప్రగతిశీల సంస్థతో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని టీసీఎస్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ గ్లోబల్ హెడ్ వెంకటేశ్వరన్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. -
పదేళ్లలో ఫస్ట్‌టైమ్! టీసీఎస్‌ను మించిన మరో టాటా కంపెనీ..
టాటా గ్రూప్‌లోని కంపెనీలన్నింటిలో అత్యంత లాభదాయక కంపెనీగా ఉన్న దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)ను మరో టాటా కంపెనీ అధిగమించింది. ఇలా జరగడం గత పదేళ్లలో ఇదే తొలిసారి.2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.17,407 కోట్ల నికర లాభంతో టాటా మోటార్స్ టీసీఎస్ నికర లాభం రూ.12,434 కోట్లను అధిగమించింది. టాటా మోటార్స్ లాభం ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.5,407.79 కోట్లు ఉండగా ఈ ఏడాది ఏకంగా 221.89 శాతం పెరిగింది. మరోవైపు టీసీఎస్ నికర లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.11,392 కోట్ల నుంచి 9.1 శాతం వృద్ధిని సాధించింది.టాటా మోటర్స్ చివరిసారిగా 2014 జూన్ త్రైమాసికంలో టాటా గ్రూప్‌లో అత్యంత లాభదాయకమైన కంపెనీ స్థానాన్ని ఆక్రమించింది. అయితే గ్రూప్‌లోని మరో పెద్ద కంపెనీ టాటా 2024 క్యూ4 ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. టాటా మోటార్స్ టీసీఎస్ త్రైమాసిక లాభాలను అధిగమించినప్పటికీ , వార్షిక ప్రాతిపదికన టాటా గ్రూప్‌లో అత్యంత లాభదాయకమైన కంపెనీగా టీసీఎస్ కొనసాగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ మొత్తం లాభం రూ.45,908 కోట్లు కాగా టాటా మోటార్స్ మొత్తం లాభం రూ.31,399 కోట్లు. -
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో, ఎండీ కృతివాసన్ 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక పరిహారంగా రూ. 25.36 కోట్లు తీసుకున్నారు. అతిపెద్ద ఐటీ కంపెనీల సీఈవోల జీతాల్లో ఇదే అత్యంత తక్కువ కావడం గమనార్హం.ఆసక్తికరంగా, బయటకు వెళ్తున్న చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణ్యం ఇదే సంవత్సరంలో సీఈవో కృతివాసన్ కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు. అయితే, సీఈఓగా కృతివాసన్ జీతం 10 నెలల కాలానికి కాగా, సుబ్రమణ్యం వేతనం పూర్తి సంవత్సరానికి. కృతివాసన్ 2023 జూన్ 1న రాజేష్ గోపీనాథన్ నుండి సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. రాజీనామా చేయడానికి ముందు రెండు నెలల స్వల్ప వ్యవధిలో గోపీనాథన్ రూ. 1.1 కోట్లు అందుకున్నారు. అంతకు ముందు ఏడాది అంటే 2023 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 29.16 కోట్లు అందుకున్నారు.కృతివాసన్ వేతన పరిహారంలో ప్రాథమిక జీతం, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు, కమీషన్ ఉన్నాయి. టీసీఎస్ వార్షిక నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.21 కోట్ల కమీషన్ అందుకున్నారు. కంపెనీలో కృతివాసన్‌కి 11,232 స్టాక్‌లు ఉన్నప్పటికీ వేతన పరిహారంలో ఎంప్లాయి స్టాక్ పర్చేజ్ స్కీమ్ (ESPS) ఉండదు.2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇతర ఐటీ సంస్థలు తమ వార్షిక నివేదికలను ఇంకా విడుదల చేయలేదు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ రూ. 56 కోట్ల వార్షిక రెమ్యునరేషన్ ప్యాకేజీని పొందారు. ఐటీ కంపెనీ సీఈవోల జీతాల్లో ఇదే అత్యధికం. ఈయన తర్వాత విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా సుమారు రూ. 50 కోట్ల అత్యధిక వార్షిక ప్యాకేజీ అందుకున్నారు. రూ. 28.4 కోట్లతో హెచ్‌సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ మూడో స్థానంలో ఉన్నారు. -
ఉద్యోగుల తొలగింపు..టీసీఎస్‌లో అసలేం జరుగుతోంది?
ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగుల తొలగింపు మరోసారి చర్చకు దారి తీసింది. గతేడాది ‘లంచాలకు ఉద్యోగాలు’ కుంభకోణంలో పలువురికి ఉద్వాసన పలకగా.. తాజాగా భద్రత పేరుతో అనుమానం ఉన్న ఉద్యోగుల్ని తొలగించడం టెక్ విభాగంలో చర్చాంశనీయంగా మారింది. భద్రత పేరుతో టీసీఎస్ తమను ఉద్యోగాల నుంచి తొలగించిందంటూ పలువురు ఉద్యోగులు సోషల్ మీడియాలో వాపోతున్నారు.రెడ్డిట్ పోస్ట్‌ల ప్రకారం.. లేఆఫ్స్ ఇచ్చిన ఉద్యోగులు వ్యక్తిగత ల్యాప్‌ట్యాప్‌లను ఉపయోగించి వారి సున్నితమైన లాగిన్ క్రెడిన్షియల్స్‌ను షేర్ చేశారని, భద్రత దృష్ట్యా వారిని తొలగించినట్లు మేనేజర్ ఆరోపిస్తున్నట్లు సదరు బాధిత ఉద్యోగులు రెడ్డిట్ పోస్ట్‌లో తెలిపారు. I got suspended from tcs today because of a security incident which was reported by me byu/Personal_Stage4690 indevelopersIndia తమను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించినప్పుడల్లా క్లయింట్ అడ్రస్‌లు షేర్ చేయడం, వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడం, వాట్సాప్‌లో కమ్యూనికేట్ చేయడం ఇలా ప్రతిదానిపై నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఉద్యోగుల తొలగింపులపై టీసీఎస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. I got suspended from tcs today because of a security incident which was reported by me byu/Personal_Stage4690 indevelopersIndia -
దేశంలోనే అత్యుత్తమ కంపెనీ ఇదే.. లింక్డ్ఇన్ నివేదిక
దేశంలో 25 అత్యుత్తమ సంస్థల జాబితాను ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ సంస్థ విడుదల చేసింది. అందులో ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ముందువరుసలో నిలిచింది. గత కొద్దికాలంగా టాప్‌లో నిలుస్తున్న టీసీఎస్ సంస్థ ఈసారీ తన సత్తా చాటుకుంది. దాంతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. పనిచేయడానికి ఉద్యోగులకు అత్యంత అనువైన కంపెనీగా లింక్డ్ఇన్ టీసీఎస్‌కు ఈస్థానం కల్పించింది. విదేశీ ఐటీ కంపెనీలైన యాక్సెంచర్, కాగ్నిజెంట్ వరుస స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో టెక్ కంపెనీలే ఉండడంతో వాటి హవా స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారంటే.. ఈ జాబితాను తయారుచేసేందుకు సంస్థ కింది అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది. కెరియర్ గ్రోత్ నైపుణ్యాభివృద్ధి సంస్థ స్థిరత్వం అవకాశాలు ఉద్యోగుల సంతృప్తి వైవిధ్యం ఉద్యోగుల విద్యార్హతలు దేశవ్యాప్తంగా కంపెనీ కార్యకలాపాలు టాప్-15 మధ్యశ్రేణి కంపెనీల జాబితానూ లింక్డ్ఇన్ విడుదల చేసింది. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) సేవలందిస్తున్న లెంత్రా.ఏఐ సంస్థ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. మేక్మైట్రిప్, నైకా, డ్రీమ్11 సంస్థలూ ఈ లిస్టులో ఉన్నాయి. ఇదీ చదవండి: యాపిల్‌కు ఆదాయం సమకూర్చడంలో భారత్ టాప్ లింక్డ్ఇన్ జాబితాలోని టాప్-25 సంస్థలు టీసీఎస్ యాక్సెంచర్ కాగ్నిజెంట్ మాక్వెరీ గ్రూప్ మోర్గాన్ స్టాన్లీ డెలాయిట్ ఎండ్రెస్ప్లస్ హోసర్ గ్రూప్ బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ జేపీమోర్గాన్ చేజ్అండ్కో పెప్సీకో డీపీ వరల్డ్ హెచ్‌సీఎల్ టెక్ ఈవై ష్నైడర్ ఎలక్ట్రిక్ అమెజాన్ కాంటినెంటల్ మాస్టర్‌కార్డ్ ఇంటెల్ కార్పొరేషన్ ఐసీఐసీఐ బ్యాంక్ మిషెలిన్ ఫోర్టివ్ వెల్స్ ఫార్గో గోల్డ్‌మన్ సాక్స్ నోవో నోర్డిస్క్ వియాట్రిస్ -
ఏటీఎల్ వినియోగంలో ఏపీ ముందంజ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్)’ సద్వినియోగం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని యునిసెఫ్, టీసీఎస్ ప్రతినిధులు ప్రశంసించారు. శుక్రవారం న్యూఢిల్లీ, హైదరాబాద్ నుంచి వచ్చిన యునిసెఫ్, టీసీఎస్ ప్రతినిధులు ఎన్టీఆర్ జిల్లాలో మొవ్వ, పెనమలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. దీన్లోభాగంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్, హబ్, స్పోక్స్ మోడల్‌తో పాటు ప్రభుత్వం అమలు చేసిన స్టెమ్ ఆధారిత కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విజయవాడలో పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 713 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను హబ్, స్పోక్ మోడల్‌గా రూపొందించామన్నారు. విద్యార్థులను సాంకేతికత విజ్ఞానం వైపు ప్రోత్సహించడానికి ‘సంకల్పం’ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నామన్నారు. అటల్ టింకరింగ్ మారథాన్, సీడ్ ది ఫ్యూచర్, సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ తదితర పోటీల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పనితీరుపై యునిసెఫ్ డాక్యుమెంటరీ రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీ నుంచి వచ్చిన యునిసెఫ్ ప్రతినిధులు అరేలియా ఆర్డిటో (చీఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్), ప్రమీల (విద్యా నిపుణురాలు), హైదరాబాదు నుంచి శేషగిరి మధుసూదన్ (విద్యా నిపుణులు), శిఖా రాణా (విద్యాధికారి), టీసీఎస్ నుంచి విమల్, విపుల్, శ్రీనివాస్ విశ్వనాథ, ఏపీ యునిసెఫ్ కన్సల్టెంట్ టి.సుదర్శన్, రాష్ట్ర నోడల్ అధికారి డా.జిఆర్ భాగ్యశ్రీ, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్ రెడ్డి తదితరులున్నారు. -
దేశంలో నెం.1 ఐటీ కంపెనీ.. 19 ఏళ్లలో తొలిసారి ఇలా..
దేశంలో నంబర్ వన్ ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగుల సంఖ్య తొలిసారి తగ్గింది. టీసీఎస్‌లో హెడ్‌కౌంట్ తగ్గడం కంపెనీ 2004లో లిస్ట్ అయినప్పటి నుంచి 19 ఏళ్లలో ఇదే మొదటిసారి అని కంపెనీ వెల్లడిందింది. హెడ్‌కౌంట్ అనేది ఒక నిర్దిష్ట వ్యవధిలో కంపెనీలో లేదా నిర్దిష్ట విభాగంలో పని చేసే సిబ్బంది సంఖ్యను సూచిస్తుంది. 202-24 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 13,249 తగ్గి మొత్తం సిబ్బంది సంఖ్య 6,01,546కి తగ్గిపోయిందని టీసీఎస్ ప్రకటించింది. ఇక కొత్త ఉద్యోగుల నికర చేరిక మొత్తం సంవత్సరానికి కేవలం 22,600 మాత్రమే. 2022 ఆర్థిక సంవత్సరం డేటాను పరిశీలిస్తే ఆ ఏడాది కంపెనీ 1.03 లక్షల మంది ఉద్యోగులు పెరిగారు. క్యూ 4లో కంపెనీ హెడ్‌కౌంట్ 1,759 తగ్గింది. టీసీఎస్‌లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 5,680 తక్కువ. అలాగే రెండవ త్రైమాసికంలో కంపెనీలో మొత్తంంగా 6,333 మంది ఉద్యోగులు తగ్గారు. అయితే 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ 523 మందిని అధికంగా నియమించుకుంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 24 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో టీసీఎస్ లాభం 9 శాతం పెరిగి రూ. 12,434 కోట్లకు చేరుకుంది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికి దాని ఆదాయం కూడా 3.5 శాతం పెరిగి రూ. 61,237 కోట్లకు చేరుకుంది. కంపెనీ లాభం అంచనాలను అధిగమించినప్పటికీ, దాని ఆదాయం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. మరోవైపు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ 2024 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అట్రీషన్ (రిటైరవడం, తొలగించడం లేదా మానేయడం ద్వారా కంపెనీని వీడటం) రేటులో 12.5 శాతం క్షీణతను నివేదించారు. రానున్న రోజుల్లో ఈ రేటు మరింత తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.