ప్రముఖ దేశీయ టెక్నాలజీ సంస్థ టీసీఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రద్దు చేసుకుంది.
విద్యార్ధులకు అడ్మిషన్‌లు ఇచ్చేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతి ఏడాది ఆన్‌లైన్ అడ్మిషన్ టెస్ట్‌లు నిర్వహిస్తుంది. ఆ ప్రాజెక్ట్‌ను ఆక్స్‌ఫర్డ్.. టీసీఎస్‌కు అప్పగిచ్చింది. అయితే, ఇటీవల యూనివర్సిటీ ఆన్‌లైన్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహించే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
డీల్ క్యాన్సిల్
దీనిపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో టీసీఎస్‌తో కుదుర్చున్న డీల్‌ను రద్దు చేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారిక ప్రకటన చేసింది. ఇకపై ఆక్స్‌ఫర్డ్ నిర్వహించే అడ్మిషన్ టెస్ట్‌లకు టీసీఎస్‌కు సంబంధం లేదని తెలిపింది.
టీసీఎస్‌పై ఫిర్యాదుల వెల్లువ
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ యూకేలోని సుమారు 30 కాలేజీల్లో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యను అందిస్తుంది. సంబంధిత కాలేజీల్లో అర్హులైన విద్యార్ధుల్ని ఎంపిక చేసేందుకు ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విద్యార్ధులకు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఎప్పటిలాగే గత ఏడాది ఏప్రిల్ నెలలో అడ్మిషన్ టెస్ట్‌లను నిర్వహించడం కోసం టీసీఎస్ లెర్నింగ్ అండ్ అసెస్‌మెంట్ ఫోకస్డ్ యూనిట్ టీసీఎస్ ఐఓఎన్‌ని ఎంపిక చేసింది. ఈ ఆన్‌లైన్ టెస్ట్ జరిగే సమయంలో విద్యార్ధులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే అంశంపై యూనిటీకి సైతం ఫిర్యాదు చేశారు.
తప్పదు మరి
కొద్ది రోజులకే ఆన్‌లైన్ టెస్ట్ జరిగే సమయంలో తలెత్తిన ఆయా సమస్యలను, అలాగే అభ్యర్థులు, ఉపాధ్యాయులు, పరీక్షా కేంద్రాల నుండి వచ్చిన అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని టీసీఎస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ‘విద్యార్ధల భవిష్యత్‌ను తీర్చిదిద్దడమే మా అంతిమ లక్ష్యం. ఈ ప్రక్రియలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. తదుపరి అడ్మీషన్లు ఎప్పుడనేది త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని’ ఆక్స్‌ఫర్డ్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment