దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ మరో రికార్డ్‌ను సొంతం చేసుకుంది. తొలిసారి టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్ల మార్క్‌ను దాటేసింది.
గ్లోబల్ అసిస్టెన్స్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ సంస్థ ‘యూరప్ అసిస్టెన్స్’ సంస్థతో డీల్ కుదుర్చుకుంది. దీంతో ఆ సంస్థ స్టాక్ నాలుగు శాతానికి పైగా పుంజుకుంది.
ఈ తరుణంలో యూరప్ అసిస్టెన్స్ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకున్నట్లు స్టాక్ మార్కెట్లలో టీసీఎస్ ప్రకటించింది. ఒప్పందంలో భాగంగా యూరోప్ అసిస్టెన్స్ సంస్థకు ఐటీ సేవలు అందించేందుకు యూరప్‌లో టీసీఎస్ డెలివరీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది. యూరోప్ అసిస్టెన్స్ సంస్థతో డీల్ ప్రకారం ఆ సంస్థకు టీసీఎస్ తన ఏఐ యాప్స్ సేవలతో పాటు ఇతర అడ్వాన్స్‌డ్ టెక్నాలజీల వినియోగంలో కలిసి పని చేయనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment