market capitalisation
-
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది
దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ మరో రికార్డ్‌ను సొంతం చేసుకుంది. తొలిసారి టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్ల మార్క్‌ను దాటేసింది. గ్లోబల్ అసిస్టెన్స్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ సంస్థ ‘యూరప్ అసిస్టెన్స్’ సంస్థతో డీల్ కుదుర్చుకుంది. దీంతో ఆ సంస్థ స్టాక్ నాలుగు శాతానికి పైగా పుంజుకుంది. ఈ తరుణంలో యూరప్ అసిస్టెన్స్ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకున్నట్లు స్టాక్ మార్కెట్లలో టీసీఎస్ ప్రకటించింది. ఒప్పందంలో భాగంగా యూరోప్ అసిస్టెన్స్ సంస్థకు ఐటీ సేవలు అందించేందుకు యూరప్‌లో టీసీఎస్ డెలివరీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది. యూరోప్ అసిస్టెన్స్ సంస్థతో డీల్ ప్రకారం ఆ సంస్థకు టీసీఎస్ తన ఏఐ యాప్స్ సేవలతో పాటు ఇతర అడ్వాన్స్డ్ టెక్నాలజీల వినియోగంలో కలిసి పని చేయనున్నాయి. -
దలాల్ స్ట్రీట్‌లో అదానీ మెరుపులు: రూ. 11 లక్షల కోట్లకు ఎంక్యాప్
అదానీ గ్రూప్ అధినేత, బిలియనీర్ గౌతం అదానీకి భారీ ఊరట లభించింది. ఈ ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్ ఆరోపణల తరువాత మార్కెట్ క్యాపిటలైజేషన్ను భారీగా కోల్పోయిన అదానీ గ్రూపు క్రమంగా కోలుకుంటోంది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో గౌతమ్ అదానీ నేతృత్వంలోని సమ్మేళనానికి చెందిన లిస్టెడ్ సంస్థలు 12 శాతం ర్యాలీ అయ్యాయి.తాజాగా లాభాలతోసంస్థ ఎం క్యాప్ ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. అదానీ మార్కెట్ క్యాప్ రూ.11 లక్షల కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. ఈ ఫిబ్రవరి తర్వాత మొదటిసారిగా గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ను రూ.11 లక్షల కోట్ల మార్కును అధిగమించడం విశేషం. మొత్తం పది అదానీ గ్రూప్ కంపెనీలు - అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్, అదానీ పవర్, ఎసిసి, అంబుజా, ఎన్డిటివి శుక్రవారం ట్రేడ్‌లో భారీ పెరుగుదలను నమోదు చేశాయి. మరోవైపు అబుదాబి నేషనల్ ఎనర్జీ PJSC (TAQA) అదానీలో పెట్టుబడులపై మీడియా నివేదికల మధ్య అదానీ గ్రూప్ స్టాక్‌లు దలాల్ స్ట్రీట్స్‌లో మెరుపులు మెరిపించాయి. అదాని గ్రూప కంపెనీలో పెట్టుబడుల వార్తలపై అబుదాబి కంపెనీ స్పందించింది. ఆ వార్తల్లోవాస్తవం లేదని TAQA కొట్టిపారేసింది.ఈ వారం ప్రారంభంలో, యూఎస్ ఆధారిత బోటిక్ పెట్టుబడి సంస్థ రాజీవ్ జైన్ నేతృత్వంలోని GQG భాగస్వామి అదానీ పవర్ 31.2 కోట్ల ఈక్విటీ షేర్లను రూ. 9,000 కోట్లకు (1.1 బిలియన్ డాలర్ల) కొనుగోలు చేసింది. కాగా ఈ ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు విడుదలైనప్పటి నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ రెండు నెలల్లోపే సమ్మేళనం స్టాక్‌లు 75 శాతానికి పడి పోయాయి. అదానీ గ్రూప్ అవకతవకలు, అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ ఆరోపణలు సత్యదూరమైనవని గౌతం అదానీ తీవ్రంగా ఖండించారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన మార్కెట్రెగ్యులేటరీ సెబీరిపోర్ట్ను త్వరలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంచ నుంది. -
అదానీకి ఊరట:వేల కోట్ల మార్కెట్ క్యాప్ జంప్, ఎందుకు?
సాక్షి,ముంబై: షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో విలవిల్లాడుతున్న అదానీ గ్రూపునకు భారీ ఊరట లభించింది. బుధవారం నాటి మార్కెట్లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీగా ఎగిసాయి. దీంతో అదానీ గ్రూప్ ఎం-క్యాప్ ఏకంగా రూ. 39 వేల కోట్లు మేర పెరిగింది. అదానీ గ్రూప్ షేర్లు పెరగడం ఇది రెండో రోజు. అదానీకి చెందిన రెండో విలువైన స్టాక్ అదానీ పోర్ట్స్ & సెజ్, ఇప్పటివరకు మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ.4,277 కోట్లు జోడించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 10 శాతం జంప్ చేసి రూ.1,500 స్థాయికి చేరుకున్నాయి. వీటితోపాటు అదానీ గ్రీన్ ఎనర్జీ jpce గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను రూ. 39,000 కోట్ల నుంచి రూ. 7.50 లక్షల కోట్ల మార్కుకు పెంచిన స్టాక్‌లలో ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ బుధవారం ఉదయం ట్రేడింగ్ సమయానికి అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 10 శాతం ఎగసింది. గత రెండు రోజుల్లో ఈ షేరు 29 శాతం లాభపడింది. అదానీ పోర్ట్స్ రూ.4,277 కోట్లు ,అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.3,841 కోట్లు , అదానీ పవర్, అదానీ విల్మార్ , అంబుజా సిమెంట్స్ రూ. 2-3వేల కోట్లను గ్రూప్ ఎం-క్యాప్‌కు జోడించడ విశేషం. ముంద్రా అల్యూమినియం కాగా కంపెనీ అనుబంధ సంస్థ ముంద్రా అల్యూమినియం, ఒడిశాలోని కుట్రుమాలి బాక్సైట్ బ్లాక్ తవ్వకాలకు ప్రాధాన్య బిడ్డర్‌గా నిలిచింది. ఒడిషాలోని కలహండి ,రాయగడ జిల్లాల్లో ఉన్న ఈ బ్లాక్‌లో మొత్తం 128 మిలియన్ టన్నుల భౌగోళిక వనరులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఒడిశా ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) పొందింది. మరోవైపు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచేందుకు అదానీ గ్రూప్ సింగపూర్, హాంకాంగ్‌లలో ఫిక్ట్స్డ్ ఇన్‌కం రోడ్‌షోను నిర్వహిస్తోంది. దీనికి తోడు అదానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 800 మిలియన్ల డాలర్లు రుణ సదుపాయాన్ని పొంద నుందన్న నివేదికలు పాజిటివ్‌గా మారాయి. -
వరుస నష్టాలు, గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో అదానీ ఎక్కడంటే?
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా ఏడో సెషన్లో కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా ఫెడ్ రేట్ల పెంపుపై ఆందోళనల మధ్య గ్లోబల్ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్‌తో గత ఐదు నెలల్లో లేని నష్టాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో విదేశీ నిధుల ప్రవాహం, ఐటీ, ఆటో, ఆయిల్ స్టాక్స్‌లో నష్టాలు కూడా ఇన్వెస్టర్ల మనోభావాలను దెబ్బతీశాయి. చివరికి సెన్సెక్స్ 176 పాయింట్లు లేదా 0.30 శాతం క్షీణించి 59,288 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో 526 పాయింట్ల మేర కుప్పకూలింది. నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 17,393 వద్ద ముగిసింది. కాగా ఏడు సెషన్లలో, సెన్సెక్స్ 2,031 పాయింట్లు లేదా 3.4 శాతం క్షీణించగా, నిఫ్టీ 643 పాయింట్లు లేదా 4.1 శాతం నష్టపోయి 17,400 స్థాయికి దిగువన ముగిసింది. అటు డాలరుమారకంలో రూపాయి 9పైసల నష్టంతో 82.84 వద్ద ముగిసింది. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, లార్సెన్ & టూబ్రో, భారతీ ఎయిర్టెల్, విప్రో, బజాజ్ ఫైనాన్స్ భారీగా నష్టపోగా, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభపడ్డాయి. 40 బిలియన్ డాలర్ల దిగువకు అదానీ మార్కెట్ క్యాప్ మరోవైపు అమెరికా షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణల తరువాత బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 40 బిలియన్ల డాలర్ల మార్క్ దిగువకు పడిపోయింది. ప్రధానంగా ఫిబ్రవరి 27న అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 12 శాతం క్షీణించి 1107 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. చివర్లో పుంజుకుని 1188 వద్ద ముగిసింది. దీంతో గ్రూప్ వాల్యుయేషన్ ఆగస్టు 2021 తర్వాత మొదటిసారిగా రూ. 7 లక్షల కోట్ల దిగువకు పడిపోయిందని మార్కెట్ వర్గాల అంచనా. జనవరి 24 నాటికి రూ. 19.19 లక్షల కోట్లతో పోలిస్తే 65 శాతం క్షీణించింది. దీంతో గౌతం అదానీ ఇప్పుడు గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో 39వ స్థానానికి పడిపోయారు. -
మార్కెట్లో రూ.3 లక్షల కోట్లు గోవిందా?
సాక్షి, ముంబై: వరుసగా నాలుగో రోజు దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ పతనాన్ని నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 17700 స్థాయి వద్ద ఊగిసలాడింది. ఆ తరువాత అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 785 పాయింట్లు కుప్పకూలి 60వేల దిగువకు చేరింది. అటు కుప్పకూలిన నిఫ్టీ 235 పాయింట్ల నష్టంతో 17600 స్థాయిని కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 927.74 పాయింట్లు క్షీణించి 59,744.98 పాయింట్ల వద్ద, నిఫ్టీ 272.40 పాయింట్లు క్షీణించి 17,554.30 పాయింట్ల వద్ద ముగిసింది. ఇప్పటికే మంగళవారం నాటి గణాంకాల ప్రకారం బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.265.21 లక్షల కోట్ల నుంచి రూ.2.79 లక్షల కోట్ల నుంచి రూ.262.41 లక్షల కోట్లకు పడిపోయింది. అటు హిండెన్‌బర్గ్ ఆరోపణలతో వరుస నష్టాలతో అదానీకి భారీ షాకే తగులుతోంది. అదానీ గ్రూప్ కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ మంగళవారం రూ.8,07,794 కోట్ల నుండి రూ. 7,74,356 కోట్లకు పడి పోయింది. ఇది దేశంలో మూడవ అత్యంత విలువైన సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం క్యాప్ రూ. 9,12,986 కోట్ల కంటే తక్కువ కావడ గమనార్హం. జనవరి 24న ప్రారంభమైన అమ్మకాల సెగతో అదానీ గ్రూప్ స్టాక్‌లు గత పంతొమ్మిది సెషన్లలో రూ.11,43,702 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఫలితంగా సంస్థ ఎం క్యాప్ 19,18,058 కోట్ల నుండి రూ. 7,74,356 కోట్లకు చేరింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ( రూ.16,24,156 కోట్లు) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ.12,57,268 కోట్లు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోరర్ట్స్‌జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫినాన్స్, గగ్రాసిం భారీగా నష్టపోగా, సిప్లా, ఐటీసీ, దివీస్, డా. రెడ్డీస్, బజాజ్ ఆటో లాభాల్లో ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టంతో 82.85 వద్ద ఉంది. -
ఇన్వెస్టర్లకు షాక్..నాలుగోవంతు సంపద మటాష్!
సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మార్కెట్ విలువ దారుణ స్థితికి చేరింది. మార్కెట్ వాల్యుయేషన్‌లో నాలుగో వంతు తుడిచిపెట్టుకుపోయింది. విశ్లేషకుల అంచనాలకు, భయాలకు అనుగుణంగానే షేరు మరింత దిగజారి కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. అమ్మకాల ఒత్తిడితో ఎల్ఐసీ షేర్ ధర గురువారం మరో కొత్త రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఐపీవో ఇష్యూ ధర 949 రూపాయలతో పోలిస్తే దాదాపు 25 శాతం కుప్పకూలింది. మే 17న స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ అయిన దగ్గరినుంచి కేవలం నాలుగు సెషన్లలో మాత్రమే లాభపడిన షేరు ధర ఆల్ టైం లో రూ.720 టచ్ చేసింది. ప్రస్తుతం 723.20 వద్ద కొనసాగుతోంది. ఫలితంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,00,242 కోట్లకు చేరింది. ఒక దశలోమార్కెట్ క్యాప్ దాదాపు 4.6 లక్షల కోట్లకు పడిపోయింది. దలాల్ స్ట్రీట్‌లో షేరు విలువ రూ. 1.4 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోవడంతోపెట్టుబడిదారులు లబోదిబో మంటున్నారు. -
యాడ్స్‌పై ఒక్క రూపాయి పెట్టలేదు.. కానీ కంపెనీ విలువ రూ.76.21 లక్షల కోట్లు
పబ్లిసిటీపై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ సినిమాకు పబ్లిసిటీ తీసుకురావడంలో రామ్‌గోపాల్ వర్మది అందవేసిన చేయి. అలాంటి ఆర్జీవీకే బాప్లా ఉన్నాడు ఎలన్ మస్క్. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న ఎలన్‌మస్క్ విజయ ప్రస్థానంలో టెస్లా కార్లది కీలక పాత్ర. మోస్ట్ సక్సెస్ఫుల్ ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్‌గా టెస్లా కొనసాగుతోంది. టెస్లా కార్ల పబ్లిసిటీ కోసం ఎలన్ మస్క్ ఎటువంటి ప్రచారం చేయలేదు. ఎక్కడా కూడా ఒక సెంటు డాలరు ఖర్చు పెట్టి అడ్వెర్టైజ్మెంట్లు ఇచ్చింది లేదు. కానీ టెస్లా కార్ల నాణ్యత. ఎలన్ మస్క్ వ్యూహచతురతతో టెస్లా కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ ఒక ట్రిలియన్ డాలర్లకు (రూ. 76.21 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ విషయాన్ని ఎలన్‌మస్క్ ఇటీవల ఓ మార్కెట్ నిపుణుడి ట్వీట్‌కి స్పందిస్తూ స్వయంగా తెలిపారు. గ్యారీబ్లాక్ అనే మార్కెట్ నిపుణుడు టెస్లా వ్యవహరాలను నిశితంగా పరిశీలిస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో టెస్లా కార్ల సేల్స్, మార్కెట్ వాల్యు ఎలా పెరిగిందో తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. ఈవీ సెక్టార్లో ఇతర కంపెనీలు అడ్వైర్టైజ్మెంట్లు ఇస్తుంటే అమ్మకాలు టెస్లాలో పెరుగుతున్నాయంటూ ఓ చార్ట్‌ను పోస్ట్ చేశారు. దీనికి ఎలన్ మస్క్ స్పందిస్తూ యాడ్స్ కోసం రూపాయి ఖర్చు చేయకుండా టెస్లా కంపెనీ మార్కెట్ విలువ వన్ ట్రిలియన్ డాలర్లకు చేరిందంటూ తెలిపాడు. Most informative chart in the 1Q earnings deck: The day after the 2022 Super Bowl, $TSLA orders surged, which validates our long held view that competitors’ advertising their new EVs helps TSLA as EV market leader the most. @elonmusk @MartinViecha pic.twitter.com/68G4wOaqKn — Gary Black (@garyblack00) April 20, 2022 చదవండి: Elon Musk: నేను ట్విటర్ సొంతం చేసుకుంటే వాళ్లకు జీతం ఉండదు! -
వారం రోజుల్లో సుమారు రెండున్నర లక్షల కోట్లు ఖతమ్..!
గత కొద్దిరోజులుగా దేశీయ స్టాక్‌మార్కెట్స్ కొత్త రికార్డులను నమోదుచేసిన విషయం తెలిసిందే. రంకెలేస్తు వచ్చిన బుల్‌ను బేర్ ఒక దెబ్బతో పడగొట్టింది. పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకలు, ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించే విషయంలో అమ్మకాల జోరు ఊపందుకోవడంతో స్టాక్‌మార్కెట్లు కొద్దిరోజుల నుంచి కుప్పకూలుతూ వచ్చాయి. అక్టోబర్ 29 రోజున దేశీయ సూచీలు ఒక్కసారిగా పడిపోవడంతో ఇన్వెస్టర్ల రూ. 4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి అయ్యింది. బేర్ కొట్టిన దెబ్బకు రిలయన్స్, హెడీఎఫ్సీ లాంటి టాప్ 10 అత్యంత విలువైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పడిపోయాయి. అత్యంత విలువైన కంపెనీలలో తొమ్మిది కంపెనీలు గత వారం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 2,48,542.3 కోట్లను కోల్పోయాయి. బలహీనమైన విస్తృత మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా సంస్థలు తమ మార్కెట్ విలువను కోల్పోవడం జరిగింది. టాప్-10 మార్కెట్ క్యాప్ కంపెనీల జాబితాలో కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే లాభపడింది. చదవండి: నవంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..! ►రిలయన్స్ మార్కెట్ క్యాప్ సుమారు రూ.56,741.2 కోట్లు తగ్గి రూ.16,09,686.75 కోట్లకు చేరుకుంది. ►హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 54,843.3 కోట్లు క్షీణించి రూ.8,76,528.42 కోట్ల వద్ద స్థిరపడింది. ►టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) విలువ రూ.37,452.9 కోట్లు తగ్గి రూ.12,57,233.58 కోట్లకు చేరుకుంది. ►ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ విలువ రూ.27,678.78 కోట్లు తగ్గి రూ.7,01,731.59 కోట్ల వద్ద స్థిరపడింది. ►కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాప్ విలువ రూ.27,545.09 కోట్లు తగ్గడంతో రూ.4,03,013 కోట్లకు చేరింది. ►బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 18,774.8 కోట్లు తగ్గింది. దీంతో ఎమ్-క్యాప్ విలువ 4,46,801.66 కోట్లకు చేరుకుంది. ►హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) రూ. 14,356 కోట్లు తగ్గి రూ. 5,62,480.40 కోట్ల వద్ద స్థిరపడింది. ►హెచ్‌డిఎఫ్‌సి వాల్యుయేషన్ రూ.10,659.37 కోట్లు తగ్గి రూ.5,14,217.69 కోట్లకు చేరుకోగా.. ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత మేర నష్టాలను చవిచూసింది. గతవారంలో సుమారు రూ.490.86 కోట్లు తగ్గి రూ.4,48,372.48 కోట్లకు చేరింది. ►టాప్-10 మార్కెట్ క్యాప్ కల్గిన కంపెనీలో కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే రూ. 30,010.44 కోట్లను జోడించి రూ. 5,56,507.71 కోట్లకు తీసుకుంది. చదవండి: గూగుల్‌పే మాదిరిగా...వాట్సాప్‌లో రూ. 255 వరకు క్యాష్‌బ్యాక్..! -
తిరుగులేని టెస్లా.. రూ.75 లక్షల కోట్ల విలువైన కంపెనీగా రికార్డు
Tesla Crosses One Trillion Dollar Market Capital: ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో ప్రపంచలోనే నంబర్ వన్ కంపెనీగా ఉన్న టెస్లా మరో రికార్డు సాధించింది. మార్కెట్ క్యాపిటల్ విలువలో ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీగా నిలిచింది. వన్ ట్రిలియన్ క్లబ్లో అమెరికన్ స్టాక్ మార్కెట్లో టెస్లా కంపెనీ షేర్ల ధర సోమవారం ఒక్క రోజే దాదాపు 15 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ ఒక్కో షేరు విలువ ఏకంగా 1045 యూఎస్ డాలర్లకి చేరుకుంది. ఫలితంగా మార్కెట్ క్యాపిటల్ విలువ వన్ ట్రిలియన్ డాలర్లు దాటి పోయింది. ఎలన్ మస్క్ సైతం తన ట్వీట్ ద్వారా ఈ విషయం ధ్రువీకరించారు. భారీ ఆఫర్ అమెరికాలో రెంటల్ కార్ సర్వీసులు అందించే హెర్జ్ కంపెనీ టెస్లాతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం వచ్చే ఏడాది చివరినాటికి టెస్లా నుంచి లక్ష కార్లను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ వివరాలు బయటకు రావడం ఆలస్యం టెస్లా కంపెనీ షేర్లు ఆకాశాన్ని తాకాయి. మార్కెట్ ముగిసే సమయానికి 14.9 శాతంగా షేర్ల విలువ పెరిగింది. దీంతో సునాయాసంగా వన్ ట్రిలియన్ మార్క్‌ని క్రాస్ చేసింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ ఇండియన్ కరెన్సీలో రూ. 75 లక్షల కోట్ల (రూ. 75,133,05,00,00,000)కు పైగా నమోదు అయ్యింది. Wild $T1mes! — Elon Musk (@elonmusk) October 25, 2021 ఆ ఒక్క డీల్ విలువే హెర్జ్ కంపెనీతో కుదిరిన ఒప్పందం విలువ ఏకంగా 4.4 బిలియన్ డాలర్లుగా ఉంది. టెస్లా ఎస్ ప్లెయిడ్ కారు ధర ప్రస్తుతం 44,000 డాలర్లుగా ఉంది. కేవలం ఏడాది వ్యవధిలోనే లక్ష కార్లను కొనుగోలు చేయడం ద్వారా 4.4 బిలియన్ డాలర్ల బిజినెస్ జరగబోతుంది. ఇది కాకుండా యూరప్, ఏషియా మార్కెట్లలో సైతం టెస్లా కార్లను ఫుల్ డిమాండ్ ఉంది. ఐదో కంపెనీ ఇప్పటి వరకు వన్ ట్రిలియన్ మార్క్ మార్కెట్ వ్యాల్యూని దాటిన కంపెనీలన్నీ టెక్నాలజీ బేస్డ్గాను ఉన్నాయి. యాపిల్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల మార్కెట్ క్యాపిటల్ విలువ వన్ ట్రిలియన్ పైకి ఉండగా తాజగా టెస్లా వాటి సరసన చేరింది. వాటికి సాధ్యం కానిది ఫోర్డ్, జనరల్ మోటార్స్, హోండా, హ్యుందాయ్, రెనాల్ట్, ఫోక్స్ వ్యాగన్ లాంటి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలకు సాధ్యం కాని రికార్డును టెస్లా అలవోకగా అధిగమించింది. వందల ఏళ్లుగా ఆటోమొబైల్ సెక్టార్లో ఉన్న బడా కంపెనీలు చేయలేకపోయిన ఫీట్‌ని అవలీలగా క్రాస్ చేసింది. చదవండి:టెస్లా కార్లపై నీతి ఆయోగ్ కీలక వ్యాఖ్యలు...! -
రెండేళ్లు.. లక్ష కోట్లు.. ఇవి షేర్లా అల్లాఉద్దీన్ అద్భుత దీపమా?
స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. కొత్త ఇన్వెస్టర్లు వరదలా దలాల్ స్ట్రీట్‌కి పోటెత్తుతున్నారు. దేశీ సూచీలు జీవితకాల గరిష్టాలను తాకుతున్నాయి. ఇలా ఎంత పాజిటివ్‌గా చెప్పినా సరే ఈ కంపెనీ షేర్లు ధరలు అంతకు మించిన అన్నట్టుగా ఉన్నాయి. కేవలం రెండంటే రెండేళ్లలోనే ఎవ్వరూ నమ్మలేని రీతిలో ఇన్వెస్టర్లకు లాభాలు అందించింది. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) షేర్లు దుమ్ము రేపుతున్నాయి. గిల్లుకుని చూస్తే తప్ప నమ్మలేని రేంజ్లో ఈ కంపెనీ షేర్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అసాధారణ రీతిలో ఇన్వెస్టర్లు ఈ కంపెనీలో పెట్టుబడికి ఆసక్తి చూపిస్తుండటంతో అత్యంత తక్కువ కాలంలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ కంపెనీ షేర్ ధర పెరిగింది. రెండేళ్ల కిందట ఐఆర్సీటీసీ సంస్థ స్టాక్ మార్కెట్లో తొలిసారిగా 2019 సెప్టెంబరులో అడుగు పెట్టింది. ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి (ఐపీవో)కి వచ్చినప్పుడు షేర్ ప్రైస్‌బ్యాండ్ ధర రూ. 315 నుంచి 320 మధ్య పలికింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ రూ. 640 కోట్లుగా నమోదు అయ్యింది. లక్ష కోట్లు దాటింది ఈ ఏడాది ఆరంభంన ఉంచి ఐఆర్సీటీసీ షేర్లు మార్కెట్లో హాట్‌కేకుల్లా మారాయి. మరీ ముఖ్యంగా గత రెండు నెలలుగా ఇన్వెస్టర్లు వీటిని ఎగబడి కొంటున్నారు. దీంతో షేర్ విలువ అమాంతం పెరిగిపోతుంది. అక్టోబరు 19న ఐఆర్‌సీటీస షేర్ వ్యాల్యూ రికార్డు స్థాయిలో రూ.6287లకు చేరుకుంది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ లక్ష కోట్ల రూపాయలను దాటింది. మంగళవారం ఐఆర్సీటీసీ మార్కెట్ క్యాపిటల్ వన్ ట్రిలియన్ మార్క్‌ని రీచ్ అయ్యింది. 20 రెట్ల లాభం రెండేళ కిందట రూ 31,500 పెట్టుబడి ఐఆర్సీటీసీ కంపెనీ షేర్లు వంద కొనుగోలు చేసి వాటిని అలాగే హోల్డ్ చేసిన వారికి లాభల పంట పండింది. ఈ రోజు ఈ షేర్ల విలువ రూ 6,28,700 చేరుకుంది. అంటే కేవలం రెండేళ్లలో ఇరవై రెట్ల లాభాన్ని అందించింది. ఇక ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇంత కంటే ఎక్కువే లాభాలను ఆర్జించిన వాళ్లూ ఉన్నారు. ఇరవై ఏళ్లలోనే భారత ప్రభుత్వం రైల్వేకు అనుబంధంగా 1999లో ఐఆర్సీటీసీని ఏర్పాటు చేసింది. ఆన్లైన్లో టిక్కెట్టు బుక్ చేయడం, క్యాటరింగ్ సర్వీసులు అందివ్వడం ఈ సంస్థ విధులు. ఇరవై ఏళ్ల తర్వాత మార్కెట్లో లిస్టయ్యింది. రెండేళ్లలోనే లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్‌ను క్రాస్ చేసింది. ప్రభంజనం కరోనా సంక్షోభం తర్వాత ఇండియన్ రైల్వేస్‌లో సంస్కరణలు చేపట్టడం, ప్యాసింజర్ రైళ్లకు కోత పెట్టడం, రాయితీలయు మంగళం పాడటం వంటి చర్యలను కేంద్రం తీసుకుంది. దీనికి తోడు ప్రైవేటు రైళ్లను కూడా పట్టాలపైకి ఎక్కించింది. దీంతో రైల్వేకు అనుబంధంగా ఉన్న ఐఆర్సీటీసీకి కేంద్రం తీసుకున్న చర్యలు మేలు చేశాయి. ఇక ఆన్లైన్ టికెట్ బుకింగ్ పెరగడం, హస్పిటాలిటీ రంగంలోకి సైతం ఐఆర్సీటీసీ విస్తరించడం వంటి చర్యలు మార్కెట్లోకి సానుకూల సంకేతాలు పంపాయి. వెరసి ఐఆర్సీటీసీ స్టాక్మార్కెట్లో ప్రభంజనం మొదలైంది. 9వ కంపెనీ స్టాక్మార్కెట్లో లాభాలు పంట పండించడంలో ప్రైవేటు కంపెనీలు ముందుంటాయి. ఈ విషయంలో ప్రభుత్వ రంగ కంపెనీలది వెనుకడుగే. ఇప్పటి వరకు లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్ విలువ దాటిన కంపెనీలుగా ఎనిమిది మాత్రమే ఉన్నాయి. అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోలిండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, భారత్ పెట్రోలియం, ఎస్బీఐ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసన తొమ్మిదవ కంపెనీగా ఐఆర్సీటీసీ చేరింది. చదవండి: లాభాలని మొత్తుకుంటే సరిపోయిందా? మరి నష్టపోయినోళ్ల సంగతేంటి? -
లాభాల పంట పండిస్తోన్న టాటా షేర్లు
షేర్ మార్కెట్లో టాటాగ్రూపు హవా నడుస్తోంది. ఏ రంగం, ఏ బిజినెస్ అనే తేడా లేకుండా టాటా షేరు అయితే చాలు కొనేస్తాం అన్నట్టుగా ఇన్వెస్టర్లు పోటీ పడుతున్నారు. దీంతో టాటా గ్రూపుకు చెందిన వివిధ కంపెనీల షేర్లు గరిష్టాలను తాకుతున్నాయి. భారతీయ మార్కెట్లో టాటాలకు ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో ఉన్ని కంపెనీలు ఉన్నా కొత్తగా ఎన్ని కంపెనీలు వస్తున్నా బ్రాండ్ ఇమేజ్‌లో టాటాలకు దీటుగా నిలవలేకపోతున్నాయి. ఇటీవల ఎయిర్ ఇండియాను టాటాలు తిరిగి సొంతం చేసుకున్నప్పుడు దేశంలో మెజారిటీ ప్రజలు ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని స్వాగతించారు. ఆ డీల్ కుదిరి వారం రోజుల కూడా కాకముందే ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో విస్తరణకు సంబంధించి టీపీజీ గ్రూపుతో బిలియన్ డాలర్ల ఒప్పందం టాటా చేసుకుంది. ఇటు ఎయిర్‌లైన్స్‌తో పాటు అటు ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారంలో టాటా దూకుడుగా వ్యవహరించడంలో మరోసారి టాటా లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు పోటీ పడ్డారు. ఫలితంగా మొదట టాటా మోటార్స్ షేర్లు రికార్డు ఇంట్రాడేలో స్థాయిలో 20 శాతం వృద్ధిని నమోదు చేసి ఆల్‌టైం హైని టచ్ చేశాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో టాటా మోటార్ షేర్లు ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలలో దాదాపు 21 శాతం లాభపడ్డాయి. షేరు ధర ఎన్ఎస్ఈలో రూ. 509 దగ్గర బీఎస్ఈలో రూ. 508.25 దగ్గర ట్రేడవుతోంది. దీంతో టాటా మోటార్స్ మార్కెట్ క్యాపిటల్ విలువ రూ.1,49,774 కోట్లకు చేరుకుంది. - టాటా గ్రూపు నుంచి మొత్తం 17 కంపెనీలు రెండు స్టాక్ మార్కెట్లలో లిస్టయి ఉండగా ఇందులో కేవలం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మాత్రమే స్వల్పంగా 0.04 శాతం నష్టపోగా మిగిలిన పదహారు కంపెనీల షేర్లు వృద్దిని కనబరుస్తూ లాభాల్లో ఉన్నాయి. - టాటా కెమికల్స్ లిమిటెడ్ ఎన్ఎస్ఈ (15.4), బీఎస్ఈలలో (14.6) శాతం వృద్దితో షేరు విలువ రూ.1120 దగ్గర ట్రేడవుతోంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ రూ.24,720 కోట్లకు చేరుకుంది. టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీని షేర్లు రూ.224 దగ్గర ట్రేడవుతుండగా మార్కెట్ క్యాపిటల్ విలువ రూ. 62,564 కోట్లకు చేరుకుంది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ సైతం 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. సగం విలువ అక్కడే వందేళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూపు నుంచి సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు రకరకాల ఉత్పత్తులను అందిస్తోంది, అయితే టాటా గ్రూపు మార్కెట్ క్యాపిటల్ విలువలో సగానికి పైగా స్థానాన్ని టెక్నాలజీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ నమోదు చేసింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటల్ విలువ ఏకంగా రూ.13,51,596 కోట్టుగా ఉంది. మిగిలిన అన్ని గ్రూపుల మార్కెట్ క్యాపిటల్ కలిపినా టీసీఎస్కి సమంగా లేదు. చదవండి: అప్పుడు చైనాపై రెచ్చిపోయి..! ఇప్పుడు ష్.. గప్‌చుప్ -
అరుదైన ఫీట్‌ను సాధించిన హెచ్‌సీఎల్..!
భారత టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. హెచ్‌సీఎల్ టెక్ షేర్లు సెప్టెంబర్ 24న మార్కెట్ క్యాప్ 50 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. శుక్రవారం బీఎస్ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్ రూ. 3,68,420 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను హెచ్‌సీఎల్ నమోదు చేసింది.సెప్టెంబర్ 24 న హెచ్‌సీఎల్ కంపెనీ షేర్లు రూ .1,359.75 వద్ద ట్రేడయ్యాయి. అమెరికాకు చెందిన ఎమ్‌కెఎస్ ఇన్స్ట్రుమెంట్స్తో కంపెనీ ఐదు సంవత్సరాల ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత గత 5 రోజుల్లో దాదాపు 7 శాతం మేర హెచ్‌సీఎల్ షేర్లు పెరిగాయి. చదవండి: ప్యాన్‌కేక్ .. ఆ రుచి వెనుక కష్టాల కథ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగంలో మెరుగైన పనితీరు, అధిక ఉత్పాదకత కోసం ఎమ్కేఎస్ ఇన్స్ట్రుమెంట్స్తో హెచ్‌సీఎల్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హెచ్‌సీఎల్ కంపెనీ మార్కెట్ క్యాప్ 50 బిలియన్ డాలర్లకు చేరిందని మాజీ సీఈఓ వినీత్ నాయర్ ఈరోజు ట్విటర్లో వెల్లడించారు. ఈ అసాధారణ ఫీట్‌ను అందించినందుకు ఉద్యోగులకు, మేనెంజ్మెంట్ టీమ్‌కు ధన్యవాదాలను తెలియజేశారు. కంపెనీ తదుపరి లక్ష్యం 100 బిలియన్ డాలర్లని పేర్కొన్నారు. చదవండి: Knight Frank Luxury Investment Index: లగ్జరీ ఉత్పత్తుల్లో వీటిపై అధిక లాభాలు...! -
సరికొత్త రికార్డును సృష్టించిన ఎయిర్టెల్..!
న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం రంగానికి , ఆటో రంగం కొరకు ఉత్పత్తి-ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) పథక రిలీఫ్ ప్యాకేజీపై కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించిన విషయం తెలిసిందే. టెలికాం సంస్థల స్థూల ఆదాయాలు, స్పెక్ట్రమ్ చెల్లింపులను క్లియర్ చేయడానికి నాలుగు సంవత్సరాల తాత్కాలిక నిషేధాన్ని కేంద్రం ఆమోదించింది. టెలికాం రంగానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతగానో ఉపశమనాన్ని కల్గించింది. ముఖ్యంగా తీవ్ర అప్పుల ఊబిలో చిక్కుకుపోయినా వొడాఫోన్ ఐడియాకు భారీ ఉపశమనం. పన్నెండవ సంస్థగా ఎయిర్టెల్...! టెల్కోలకు ఇచ్చిన స్పెక్ట్రమ్ చెల్లింపులపై మరో రెండు సంవత్సరాలు పొడింగించడంతో పలు టెలికాం కంపెనీల షేర్లు మార్కెట్లో లాభాలను గడించాయి. తాజాగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ బుధవారం రోజున బీఎస్ఈ సెన్సెక్స్‌లో సరికొత్త రికార్డులను నమోదుచేసింది. భారతి ఎయిర్టెల్ షేర్లు బీఎస్ఈలో ఆల్-టైమ్ గరిష్ట స్థాయి రూ. 734 ను తాకింది. అంతేకాకుండా ఇంట్రాడేలో 5శాతం మేర లాభపడింది. భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్(మూలధన) విలువ రూ. 4 లక్షల కోట్లు దాటింది. మూలధన విలువ నాలుగు లక్షల కోట్లకు చేరుకున్న పన్నెండవ భారతీయ సంస్థగా ఎయిర్టెల్ రికార్డు సృష్టించింది. గతంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డీఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్డీఎఫ్సి లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐటిసి లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటక్ మహీంద్రా బ్యాంక్ నాలుగు లక్షల కోట్ల మైలురాయిని సాధించాయి. కేంద్రప్రభుత్వం చర్యలే..! గత కొన్ని రోజుల నుంచి టెలికాం షేర్లు లాభాలను గడిస్తున్నాయి. గత పది సెషన్లలో వోడాఫోన్ ఐడియా 45% పైగా పెరిగింది, గత 12 సెషన్లలో భారతీ ఎయిర్టెల్ 23% పైగా పురోగమించింది. గత రెండు వారాల్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా 33% పైగా పెరిగింది. భారతీ ఎయిర్టెల్ బీఎస్ఈ సెన్సెక్స్ లాభాల కంపెనీలో తొలి స్థానంలో నిలిచింది. దేశ అభివృద్ధికి కీలకమైన టెలికాం కంపెనీలకు సహాయం చేయడం కోసం గత కొన్ని రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ల శాఖతో అనేక సమావేశాలను ఏర్పాటుచేసింది. దీంతో గత వారం రోజులుగా టెలికాం సంస్థలు లాభాలను గడించాయి. -
సరికొత్త రికార్డు సృష్టించిన టీసీఎస్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరో రికార్డు సృష్టించింది. నేడు(ఆగస్టు 17) ఇంట్రా-డే వాణిజ్యంలో టీసీఎస్ స్టాక్ కొత్త గరిష్టాన్ని తాకడంతో రూ.13 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్(మార్కెట్ క్యాప్) దాటిన రెండవ లిస్టెడ్ కంపెనీ, మొదటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) కంపెనీగా అవతరించింది. టీసీఎస్ షేర్లు ఇంట్రా-డే ట్రేడ్ లో బిఎస్ఈలో 2.16 శాతం పెరిగి రూ.3,548 జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. ఎస్అండ్ పీ బిఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 11: 21 గంటలకు 55,632 పాయింట్ల వద్ద 0.09 శాతం పెరిగింది. టాటా గ్రూపు కంపెనీల్లో భాగమైన టీసీఎస్ ఇప్పటి వరకు ఆగస్టు నెలలో 12 ట్రేడింగ్ రోజుల్లో టీసీఎస్ స్టాక్ 11 శాతం ర్యాలీ చేసింది. (చదవండి: తాలిబన్లకు భారీ షాకిచ్చిన ఫేస్బుక్..!) ప్రస్తుతం రూ.13.01 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్ తో మొత్తం మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్ లో టీసీఎస్ రెండవ స్థానంలో ఉంది. రూ.13.80 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉంది. బిఎఫ్ఎస్ఐ, కమ్యూనికేషన్, మాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్, హైటెక్ వర్టికల్స్ లో ఉనికిని కలిగి ఉన్న ప్రముఖ ఐటి సర్వీస్ ప్రొవైడర్లలో టీసీఎస్ ఒకటి. కరోనా మహమ్మారి వల్ల డిజిటల్ టెక్నాలజీకి విపరీతంగా డిమాండ్ ఏర్పడటంతో రెండు ఏళ్లుగా ఐటీ కంపెనీ స్టాక్ వృద్ధి కనబరుస్తుంది. ఐరోపాలో డిజిటల్ టెక్నాలజీ సంబంధించి భారీగా ప్రాజెక్టులు రావడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ టీసీఎస్ షేర్ ధర పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ట్రంప్ బ్యాన్ : ట్విటర్ నష్టం ఎంతో తెలుసా?
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా తొలగించిన సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ట్రంప్‌పై నిషేధం ప్రకటించిన తరువాత ట్విటర్ షేర్ సోమవారం 12 శాతం కుప్పకూలింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 బిలియన్ డాలర్లు ఆవిరై పోయింది. మరోవైపు ఇప్పటికే ట్రంప్ అధికారిక ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసినసంస్థ తాజాగా మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. ట్రంప్ మద్దతుదారులకు చెందిన సుమారు 70వేల అకౌంట్లను నిలిపి వేసింది. సుమారు ట్విటర్లో 88 మిలియన్ల మంది ఫాలోవర్స్ ట్రంప్ సొంతం. (బైడెన్ ప్రమాణస్వీకారం.. ఎమర్జెన్సీ విధించిన ట్రంప్) వాషింగ్టన్, డీసీలో హింసాత్మక సంఘటనలు కొనసాగే ప్రమాదం ఉన్నందున క్యాపిటల్ ఘటనకు సంబంధించిన కంటెంట్‌ను షేర్ చేస్తున్న వేలాది ఖాతాలను శుక్రవారం నుంచి శాశ్వతంగా నిలివేస్తున్నట్లు ట్విటర్ సోమవారం ఆలస్యంగా తన బ్లాగ్‌లో వెల్లడించింది నిశిత పరిశీలన అనంతరం 70వేల ఖాతాలను ఆపివేసినట్టు చెప్పింది. గతవారం అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు యూఎస్ క్యాపిటల్‌లో అమెరికా కాంగ్రెస్ సమావేశమైన సమయంలో ట్రంప్ మద్దతుదారులు బీభత్సం సృష్టించారు. ఏకంగా క్యాపిటల్ భవనంలోకి దూసుకువచ్చి వీరంగం వేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికిముందు ట్రంప్ తన మద్దతుదారులనుద్దేశించివరుస ట్వీట్లు చేశారు. దీంతో ట్రంప్ అధికారిక ఖాతాను ట్విటర్ శాశ్వతంగా నిషేధించింది. ట్రంప్ ట్వీట్లు హింసను మరింత ప్రేరేపించే ప్రమాదం ఉందని భావించిన ట్విటర్ ఈ నిర్ణయం తీసుకుంది. మరో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కూడా ట్రంప్ అనుకూల పోస్టులపై చర్యలు చేపట్టింది. తమ నిబంధనలు ఉల్లంఘించే ఎలాంటి పోస్టులనైనా తొలగిస్తామని, హింసను ప్రేరేపించే తప్పుడు సమాచార వ్యాప్తి నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. (పోర్న్ వీడియో? ట్విటర్ తప్పులో కాలు ) -
మార్కెట్ విలువలో బీఎస్ఈ సరికొత్త రికార్డ్
ముంబై, సాక్షి: ఇటీవల రికార్డుల బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్ల కారణంగా మరో సరికొత్త రికార్డు ఆవిష్కృతమైంది. సోమవారానికల్లా మార్కెట్లు వరుసగా 9 రోజులపాటు లాభపడుతూ వచ్చాయి. ఇదే కాలంలో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 2,623 పాయింట్లు జంప్‌చేసింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 12,89,863 కోట్లకుపైగా జత కలిసింది. వెరసి బీఎస్ఈ మార్కెట్ విలువ అంటే లిస్టెడ్ కంపెనీల విలువ తొలిసారి రూ. 191 లక్షల కోట్లను తాకింది. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే ఈ విలువ డాలర్ల రూపేణా 2.6 ట్రిలియన్లకు సమానంకావడం విశేషం! (బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్) పలు అంశాల సపోర్ట్ కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ ఈక్విటీలలో భారీగా ఇన్వెస్ట్ చేస్తుండటం ప్రధానంగా మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత రెండు నెలల్లోనే ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో ఏకంగా 14 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్ చేసినట్లు ప్రస్తావించారు. దీనికితోడు ఇటీవల దేశీయంగా రెండు వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సెంటిమెంటు బలపడిందని తెలియజేశారు. డిసెంబర్లో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదుకావడం, ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా రికవర్ అవుతున్నట్లు ఆర్బీఐ నివేదిక తాజాగా అభిప్రాయపడటం వంటి పలు సానుకూల అంశాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు వివరించారు. (తొలుత మనకే వ్యాక్సిన్లు: సీరమ్) 2020లోనూ బీఎస్ఈ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ. 191 ట్రిలియన్ మార్క్‌ను సాధించిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంపెనీ ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ తాజాగా రూ. 12,49,218 కోట్లను అధిగమించింది. ఈ వెనుకే సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ రూ. 11,50,106 కోట్ల విలువతో రెండో ర్యాంకును సాధించింది. కాగా.. కోవిడ్-19 సంక్షోభంలోనూ 2020లో సెన్సెక్స్ దాదాపు 16 శాతం పురోగమించిన విషయం విదితమే. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 32.49 లక్షల కోట్లమేర వృద్ధి చెందింది! -
కేంద్ర ప్రభుత్వాన్ని అధిగమించిన టాటా సన్స్
న్యూఢిల్లీ, సాక్షి: గత కేలండర్ ఏడాది(2020)లో దేశీయంగా లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రీత్యా అతిపెద్ద ప్రమోటర్‌గా టాటా సన్స్ ఆవిర్భవించింది. తద్వారా పలు పీఎస్‌యూలలో మెజారిటీ వాటాలు కలిగిన కేంద్ర ప్రభుత్వాన్ని అధిగమించింది. 2020 డిసెంబర్ చివరికల్లా టాటా సన్స్ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 9.28 లక్షల కోట్లను తాకింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పీఎస్‌యూల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 9.24 లక్షల కోట్లకు పరిమితమైంది. ఏడాది కాలంలో టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 34 శాతానికిపైగా బలపడటం విశేషంకాగా. పీఎస్‌యూల విలువ దాదాపు 20 శాతం క్షీణించడం గమనార్హం! వెరసి రెండు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం నిలుపుకుంటూ వస్తున్న టాప్ ర్యాంకును టాటా సన్స్ చేజిక్కించుకున్నట్లు ఆంగ్ల పత్రిక బిజినెస్ స్టాండర్ట్ నివేదిక పేర్కొంది. (జేవీకి.. ఫోర్డ్, మహీంద్రాల ‘టాటా’) ఏడాది కాలంలో.. నిజానికి 2019 డిసెంబర్‌కల్లా ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ రూ. 18.6 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో టాటా సన్స్ గ్రూప్ లిస్టెండ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 11.6 లక్షల కోట్లుగా మాత్రమే నమోదైంది. ఈ సమయంలో టాటా సన్స్ గ్రూప్ కంపెనీల విలువతో పోలిస్తే ప్రమోటర్‌గా కేంద్ర ప్రభుత్వ కంపెనీల విలువ 67 శాతం అధికంకావడం గమనార్హం! కాగా.. 2020 డిసెంబర్‌కల్లా మొత్తం టాటా సన్స్ గ్రూప్ కంపెనీల విలువ రూ. 15.6 లక్షల కోట్లకు చేరగా.. పీఎస్‌యూలలో కేంద్ర వాటాల విలువ రూ. 15.3 లక్షల కోట్లుగా నమోదైనట్లు నివేదిక పేర్కొంది. -
కోవిడ్-19లోనూ దిగ్గజాల దూకుడు
న్యూయార్క్: ఈ కేలండర్ ఏడాది(2020)లో తలెత్తిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను సంక్షోభంలోకి నెట్టింది. అటు ఆరోగ్యపరంగా, ఇటు ఆర్థిక వ్యవస్థలనూ కుదేల్ చేసింది. అయినప్పటికీ కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు ప్రకటించిన చర్యలూ సహాయక ప్యాకేజీలతో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పడుతున్నాయి. కాగా.. కోవిడ్-19 కారణంగా ఆన్లైన్, ఈకామర్స్, రిటైల్, ఐటీ రంగాలలో మరిన్ని కొత్త అవకాశాలకు మార్గమేర్పడినట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2020 జనవరి -జూన్ మధ్య కాలంలో పలు యూఎస్ దిగ్గజ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన పలు బ్లూచిప్ కంపెనీల షేర్లు ర్యాలీ బాటలో్ సాగుతూ వచ్చాయి. వెరసి పలు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) భారీగా బలపడుతూ వచ్చింది. జాబితాలో ఈకామర్స్, టెక్నాలజీ, ఆటోమోటివ్, ఫైనాన్స్, టెలికం, మీడియా, రిటైల్, ఫార్మా తదితర రంగాలుండటం గమనార్హం! (4 నెలల్లో 4 బిలియన్ డాలర్ల దానం) టాప్4లో.. ఈ ఏడాది జనవరి1 నుంచి జూన్ 17వరకూ చూస్తే.. మార్కెట్ విలువలో అత్యధికంగా లాభపడిన కంపెనీగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ నిలిచింది. కంపెనీ మార్కెట్ క్యాప్ 401 బిలియన్ డాలర్లకుపైగా ఎగసింది. ఇదేవిధంగా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దాదాపు 270 బిలియన్ డాలర్ల విలువను పెంచుకోవడం ద్వారా రెండో ర్యాంకులో నిలిచింది. ఈ బాటలో ఐఫోన్ల దిగ్గజం యాపిల్ మార్కెట్ విలువ 219 బిలియన్ డాలర్లు జంప్‌చేయగా.. ఎలక్ట్రిక్ కార్ల బ్లూచిప్ కంపెనీ టెస్లా ఇంక్ 108 బిలియన్ డాలర్లకుపైగా ఎగసింది. తద్వారా జాబితాలో మూడు, నాలుగు ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. ఈ జాబితాలో టెక్నాలజీ కంపెనీ టెన్సెంట్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, చిప్ కంపెనీ ఎన్విడియా, ఇంటర్నెట్ దిగ్గజం అల్ఫాబెట్, టెలికం దిగ్గజం టీమొబైల్, మీడియా దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తదితరాలు సైతం చోటు చేసుకున్నాయి. ఇదేవిధంగా వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలు అందించే జూమ్ యాప్ ప్రస్తావించదగ్గ స్థాయిలో పుంజుకోవడం విశేషం! జాబితాలో టెక్ దిగ్గజం టెన్సెంట్, ఈకామర్స్ దిగ్గజం అలీబాబా వంటి చైనీస్ కంపెనీలు సైతం స్థానం సంపాదించినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇతర వివరాలు టేబుల్ ద్వారా చూద్దాం.. 2020 జనవరి- జూన్ 17 మధ్య వివిధ యూఎస్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగిన తీరిలా.. -
దుమ్మురేపిన బజాజ్ ఫైనాన్స్
ముంబై, సాక్షి: పతన మార్కెట్లోనూ ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ షేరు కదం తొక్కుతోంది. వెరసి తొలిసారి కంపెనీ విలువ రూ. 3 ట్రిలియన్ మార్క్‌ను అధిగమించింది. ఎన్ఎస్ఈలో షేరు ప్రస్తుతం 2.5 శాతం ఎగసి రూ. 5,018 సమీపంలో ట్రేడవుతోంది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 3.02 లక్షల కోట్లను తాకింది. ఇందుకు ప్రధానంగా రానున్న రెండేళ్లలో బిజినెస్ 25 శాతం చొప్పున వృద్ధి సాధించగలదంటూ కంపెనీ వేసిన అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. మార్కెట్ విలువరీత్యా తాజాగా బజాజ్ ఫైనాన్స్ 9వ ర్యాంకుకు చేరడం గమనార్హం! ర్యాలీ బాటలో గత మూడు నెలల్లో మార్కెట్లు 18 శాతమే పుంజుకున్నప్పటికీ.. బజాజ్ ఫైనాన్స్ షేరు మాత్రం 42 శాతం ర్యాలీ చేసింది. కోవిడ్-19 ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ బయటపడుతుండటం, ఆర్థిక రికవరీ సంకేతాలు వంటి అంశాలు పలు రంగాలకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు కోవిడ్-19 నేపథ్యంలోనూ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) క్యూ2(జులై- సెప్టెంబర్)లో బజాజ్ ఫైనాన్స్ పటిష్ట పనితీరును చూపడం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేశారు. కాగా.. ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం రూ. 50,000 కోట్ల ఆస్తులను కలిగి పదేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎన్బీఎఫ్సీలు బ్యాంకింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెరసి బ్యాంకింగ్ లైసెన్స్ రేసులో బజాజ్ ఫైనాన్స్ ముందుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరుపట్ల రీసెర్చ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆశావహంగా స్పందించింది. రూ. 5,900 టార్గెట్ ధరతో ఈ షేరుని కొనుగోలు చేయవచ్చంటూ సిఫారసు చేస్తోంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్@ రూ. 8 లక్షల కోట్లు
ముంబై, సాక్షి: ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త రికార్డ్ సాధించింది. తొలిసారి రూ. 8 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించింది. తద్వారా దేశీ లిస్టెడ్ కంపెనీలలో మూడో ర్యాంకును కైవసం చేసుకుంది. నేటి ట్రేడింగ్ ప్రారంభంలో దాదాపు 2 శాతం లాభపడటం ద్వారా రూ. 1464 వద్ద సరికొత్త గరిష్టాన్ని సైతం షేరు తాకింది. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 8 ట్రిలియన్లను దాటింది. వెరసి గరిష్ట మార్కెట్ క్యాప్‌ను సాధించిన తొలి ఫైనాన్షియల్ రంగ సంస్థగా నిలిచింది. 98 శాతం జూమ్ కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది మార్చిలో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు రూ. 739 వరకూ పతనమైంది. ఆ స్థాయి నుంచి ర్యాలీ బాట పట్టి తాజాగా రూ. 1464కు చేరింది. వెరసి 8 నెలల్లో 98 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో గత మూడు నెలల్లో 30 శాతం, గత నెల రోజుల్లో 17 శాతం చొప్పున బలపడుతూ వచ్చింది. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 18 శాతంపైగా ఎగసి రూ. 7,513 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ. 15,776 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.1 శాతంగా నమోదయ్యాయి. జాబితా ఇలా లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్స్‌లో ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 13.34 లక్షల కోట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాటా గ్రూప్ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ రూ. 10.19 ట్రిలియన్ల విలువతో రెండో ర్యాంకులో నిలుస్తోంది. ఇదే విధంగా రూ. 5.08 లక్షల కోట్లతో ఎఫ్ఎంసీజీ బ్లూచిప్ కంపెనీ హెచ్‌యూఎల్, రూ. 4.83 ట్రిలియన్ల విలువతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 4, 5 ర్యాంకులను పొందుతున్నాయి. కాగా.. పోటీ సంస్థలతో పోలిస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రీమియంతో ట్రేడయ్యేందుకు అర్హత కలిగి ఉన్నట్లు విదేశీ రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ అభిప్రాయపడింది. పటిష్ట లాభదాయకత, నిలకడైన మార్జిన్లు, అండర్‌రైటింగ్ నాణ్యత వంటి పలు అంశాలు బ్యాంకునకు సానుకూల అంశాలుగా పేర్కొంది. దీంతో రూ. 1,700 టార్గెట్ ధరతో కొనుగోలుకి సిఫారసు చేస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 0.7 శాతం వెనకడుగుతో రూ. 1428 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1454 వద్ద గరిష్టాన్ని తాకగా, రూ. 1421 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. -
పురీ వేవ్- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రికార్డ్స్
ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను రెండున్నర దశాబ్దాలపాటు ముందుండి నడిపించిన ఆదిత్య పురీ సోమవారం(26న) పదవీ విరమణ చేశారు. దీంతో కొత్త ఎండీ, సీఈవోగా శశిధర్ జగదీశన్ బాధ్యతలు చేపట్టారు. బ్యాంకు అదనపు డైరెక్టర్, ఫైనాన్స్ హెడ్‌గా విధులు నిర్వహిస్తున్న శశిధర్ ఎండీ, సీఈవో బాధ్యతలను పురీ నుంచి స్వీకరించారు. పురీ 1994 సెప్టెంబర్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీగా పదవిని చేపట్టారు. ఆపై బ్యాంక్ పలు విధాలుగా వృద్ధి బాటలో పరుగు పెట్టింది. తద్వారా తీవ్రమైన పోటీలోనూ బ్యాంకు తొలి స్థానంలో నిలుస్తూ వచ్చింది. ప్రస్థానమిలా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1995 మే 19న బీఎస్ఈలో లిస్టయ్యింది. అప్పట్లో బ్యాంకు ఆస్తులు రూ. 3,394 కోట్లుగా నమోదుకాగా.. ప్రస్తుతం రూ. 16 లక్షల కోట్లకుపైగా విస్తరించాయి. మొత్తం డిపాజిట్లు రూ. 642 కోట్ల నుంచి రూ. 12.29 లక్షల కోట్లకు ఎగశాయి. ఇదేవిధంగా 1995 మార్చిలో రూ. 98 కోట్లుగా ఉన్న రుణాలు(అడ్వాన్సులు) 2020 సెప్టెంబర్‌కల్లా రూ. 10.38 లక్షల కోట్లను తాకాయి. వెరసి పురీ హయాంలో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 7 లక్షల కోట్లకు చేరింది. వెరసి ప్రయివేట్ రంగ బ్యాంకులలో టాప్ ర్యాంకుకు చేరుకుంది. 1997లో బ్యాంక్ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ. 1,000 కోట్లను అధిగమించింది. గత 25 సంవత్సరాలలో బ్యాంకు షేరు రూ. 3 నుంచి రూ. 1,200కు దూసుకెళ్లింది. అంటే 1995 నుంచి చూస్తే 30,000 శాతానికిపైగా రిటర్నులు అందించింది. లాభాల బాటలో ఏస్ ఈక్విటీ వివరాల ప్రకారం 1995 మే చివర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 432 కోట్లను తాకింది. ఆపై 1997 కల్లా రూ. 1,000 కోట్లను అధిగమించగా.. 2005 జులై 6న రూ. 20,130 కోట్లకు చేరింది. ఈ బాటలో 2007 కల్లా రూ. 50,000 కోట్లు, 2010 ఆగస్ట్‌లో రూ. లక్ష కోట్ల మార్క్‌ను దాటేసింది. తిరిగి 2018 జనవరిలో మరింత వృద్ధి చూపుతూ రూ. 5 లక్షల కోట్లను తాకింది. ఇక ప్రస్తుతం అంటే 2020 అక్టోబర్ 27కల్లా బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 6.73 లక్షల కోట్లకు చేరింది.ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం పుంజుకుని రూ. 1,223 వద్ద ట్రేడవుతోంది. షేర్ల విభజన గతంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండుసార్లు షేర్ల ముఖ విలువను విభజించింది. 2011లో రూ. 10 ముఖ విలువను రూ. 2కు, తిరిగి 2019లో రూ. 2 నుంచి రూ. 1కు షేర్ల విభజన చేపట్టింది. ప్రస్తుతం బీఎస్ఈ డేటా ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా ప్రస్తుతం 26.02 శాతంగా నమోదైంది. పబ్లిక్ వాటా దాదాపు 74 శాతానికి చేరింది. వీటిలో మ్యూచువల్ ఫండ్స్ 13.95 శాతం, ఎల్ఐసీ 3.79 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) 37.43 శాతం వాటాను సొంతం చేసుకున్నారు. -
బీఎస్ఈ మార్కెట్ విలువ- సరికొత్త రికార్డ్
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, సానుకూల ప్రపంచ సంకేతాల నేపథ్యంలో ఇటీవల జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డును సాధించాయి. వారాంతాన ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 40,509 వద్ద ముగిసింది. దీంతో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 160.68 ట్రిలియన్లను తాకింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. తద్వారా ఈ ఏడాది(2020) జనవరి 17న సాధించిన రూ. 160.57 ట్రిలియన్ల రికార్డును అధిగమించింది. ఈ బాటలో జనవరి 20న నమోదైన 42,274 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని అందుకునేందుకు సెన్సెక్స్ దాదాపు 4 శాతం దూరంలో నిలిచింది. డాలర్ల రూపేణా చూస్తే గత మూడేళ్లలో 14 శాతం పుంజుకోవడం ద్వారా దేశీ స్టాక్ మార్కెట్లు వర్ధమాన మార్కెట్లలో ముందంజలో ఉన్నాయి. కాగా.. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ చరిత్రాత్మక గరిష్టానికి 20 శాతం దూరంలో నిలవడం గమనార్హం! ఐటీ, ఫార్మా దన్ను కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సెన్సెక్స్ విలువకు రూ. 4.67 ట్రిలియన్లను జమ చేయడం ద్వారా తొలి స్థానంలో నిలిచింది. ఈ బాటలో ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో కలసికట్టుగా రూ. 5.08 ట్రిలియన్ల విలువను అందించాయి. ఇక ఫార్మా దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, దివీస్ ల్యాబ్, అరబిందో ఫార్మా, బయోకాన్ రూ. 2 ట్రిలియన్లను సమకూర్చగా.. అదానీ గ్రీన్ ఎనర్జీ, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ రూ. 1.75 ట్రిలియన్లతో సహకరించాయి. న్యూ లిస్టింగ్స్ ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన ఆరు కంపెనీల నుంచి సెన్సెక్స్ మార్కెట్ క్యాప్‌నకు రూ. 1.01 ట్రిలియన్లు జమయ్యింది. వీటిలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ తదితరాలున్నాయి. బీఎస్ఈ-500 ఇండెక్స్‌లో 177 స్టాక్స్ జనవరి 17 స్థాయిలను అధిగమించగా.. 19 షేర్ల మార్కెట్ విలువలో సగానికిపైగా క్షీణించింది. జాబితాలో ఇండస్ఇండ్, కెనరా బ్యాంక్, పీఎన్బీ, బీవోబీ, ఫ్యూచర్ రిటైల్, స్పైస్‌జెట్ తదితరాలు చేరాయి. -
టీసీఎస్ అరుదైన ఘనత
సాక్షి, న్యూఢిల్లీ : దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) శుక్రవారం అసెంచర్‌ను అధిగమించి కొద్దిసేపు ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది. ఆ సమయంలో (అక్టోబర్ 8, క్లోజింగ్ గణాంకాల ప్రకారం) టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 144.7 బిలియన్ డాలర్లు కాగా, యాక్సెంచర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 143.1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. చదవండి : టీసీఎస్ ఉద్యోగులకు వేతన పెంపు ఇక టీసీఎస్ సోమవారం మరో కీలక మైలురాయిని చేరుకుంది. రిలయన్స్ ఇండస్ర్టీస్ తర్వాత రూ 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన రెండో భారతీయ కంపెనీగా టీసీఎస్ నిలిచింది. కంపెనీ షేర్ ధర పెరగడంతో టీసీఎస్ మార్కెట్ విలువ ఏకంగా రూ 69,082.25 కోట్లు ఎగిసి ట్రేడ్ ముగిసే సమయానికి బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ 10,15,714 కోట్లకు ఎగబాకింది. కాగా దేశంలో రూ 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ర్టీస్ నిలిచిన సంగతి తెలిసిందే. టీసీఎస్ బుధవారం రూ 16,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రణాళికను ప్రకటించింది. మరోవైపు పలు కంపెనీలు లేఆఫ్‌లు, వేతన కోతలు విధించడంతో పాటు ఏడాది పాటు ప్రమోషన్లు, వేతన పెంపులను నిలిపివేసిన నేపథ్యంలో టీసీఎస్ తమ ఉద్యోగులందరికీ వేతనాలను పెంచనుంది. టీసీఎస్ వేతన పెంపు నిర్ణయం ఐటీ రంగానికి తీపికబురుగా మారింది. ఇక దేశీ ఐటీ దిగ్గజంలో నియామకాల ప్రక్రియా ఊపందుకుంది. భారత్‌లో 7,000 మంది ట్రైనీలను, అమెరికాలో 1000 మందిని ట్రైనీలను నియమించుకోనుంది. -
పెట్టుబడుల వెల్లువ : రిలయన్స్ జోరు
సాక్షి,ముంబై: ఆసియా అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రోజుకో కొత్త రికార్డుతో దూసుకుపోతోంది. టెలికాం విభాగం రిలయన్స్ జియోలో పెట్టుబడుల సునామీ అనంతరం తాజాగా రిలయన్స్ రిటైల్‌లో వరుస పెట్టుబడులను సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ షేర్ సోమవారం దాదాపు 2 శాతం లాభపడి ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేసింది. తద్వారా 15 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ అధిగమించింది. దీంతో అత్యంత విలువైన తొలి భారతీయ కంపెనీగా అవతరించింది. రిలయన్స్ రిటైల్ లో అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కార్లయిల్ 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అవకాశం ఉందన్న రిపోర్టుల మధ్య ఆర్ఐఎల్ షేరు 2360 రూపాయల వద్ద ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. దీంతో బీఎస్ఇలో సంస్థ మార్కెట్ క్యాప్ రూ.15.80 లక్షల కోట్లకు చేరింది. ఆర్ఐఎల్ షేరు గత ఆరు రోజులలో 12.21 శాతం పుంజుకోవడం విశేషం. రిలయన్స్ రీటైల్ విభాగంలో పెట్టుబడులువెల్లువ కొనసాగుతున్నసంగతి తెలిసిందే. తాజా కార్లయిల్ ఒప్పందం ఖరారైతే, ఒక భారతీయ కంపెనీలో ఇది అతిపెద్ద పెట్టుబడిగాను, దేశ రిటైల్ రంగంలో కంపెనీ మొదటి పెట్టుబడిగాను రికార్డు దక్కించుకోనుంది. ఇప్పటికే టెక్ ఇన్వెస్టర్ సిల్వర్ లేక్ పార్ట్నర్స్ రూ.7500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్ ఏకంగా 20 బిలియన్ డాలర్లతో 40శాతం వాటా కొనుగోలుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో పాటు త్వరలో కేకేఆర్, ముబదాలా, అబుదాబీలు కూడా ఇన్వెస్ట్ మెంట్ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాయి. -
వారెవ్వా రిలయన్స్.. రూ. 15 లక్షల కోట్లకు!
ఇటీవల కొత్త చరిత్రను సృష్టిస్తూ సాగుతున్న డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా మరిన్ని రికార్డులను సాధించింది. అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌లో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌కు వాటాను ఆఫర్ చేసిందన్న వార్తలతో ఆర్ఐఎల్ షేరుకి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వెరసి ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8.4 శాతం దూసుకెళ్లింది. రూ. 2,345కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) ఏకంగా రూ. 15 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో తొలిసారి ఈ ఘనతను సాధించిన దిగ్గజ కంపెనీగా ఆర్ఐఎల్ నిలిచింది! 11 శాతం అప్ రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటాను పీఈ సంస్థ సిల్వర్ లేక్‌కు విక్రయించడం ద్వారా ఆర్ఐఎల్ షేరు జోరందుకుంది. వెరసి రెండు రోజుల్లోనే ఈ షేరు 11 శాతం ర్యాలీ చేసింది. 1.75 శాతం వాటా కోసం సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్లను ఇన్వెస్ట్ చేయనుండటంతో రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరింది. పీఈ కంపెనీ కేకేఆర్ రిలయన్స్ రిటైల్‌లో 1.5 బిలియన్ డాలర్లవరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు సౌదీ ఫండ్స్ సైతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. తాజాగా రిలయన్స్ రిటైల్‌లో అమెజాన్‌కు 20 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,45,000 కోట్లు) విలువైన వాటాను ఆర్ఐఎల్ ఆఫర్ చేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఈ అంశంపై ఇరు కంపెనీలూ స్పందించనప్పటికీ షేరు దూకుడు చూపుతుండటం గమనార్హం!