Tesla Crosses One Trillion Dollar Market Capital: ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో ప్రపంచలోనే నంబర్ వన్ కంపెనీగా ఉన్న టెస్లా మరో రికార్డు సాధించింది. మార్కెట్ క్యాపిటల్ విలువలో ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీగా నిలిచింది.
వన్ ట్రిలియన్ క్లబ్‌లో
అమెరికన్ స్టాక్ మార్కెట్‌లో టెస్లా కంపెనీ షేర్ల ధర సోమవారం ఒక్క రోజే దాదాపు 15 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ ఒక్కో షేరు విలువ ఏకంగా 1045 యూఎస్ డాలర్లకి చేరుకుంది. ఫలితంగా మార్కెట్ క్యాపిటల్ విలువ వన్ ట్రిలియన్ డాలర్లు దాటి పోయింది. ఎలన్ మస్క్ సైతం తన ట్వీట్ ద్వారా ఈ విషయం ధ్రువీకరించారు.
భారీ ఆఫర్
అమెరికాలో రెంటల్ కార్ సర్వీసులు అందించే హెర్జ్ కంపెనీ టెస్లాతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం వచ్చే ఏడాది చివరినాటికి టెస్లా నుంచి లక్ష కార్లను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ వివరాలు బయటకు రావడం ఆలస్యం టెస్లా కంపెనీ షేర్లు ఆకాశాన్ని తాకాయి. మార్కెట్ ముగిసే సమయానికి 14.9 శాతంగా షేర్ల విలువ పెరిగింది. దీంతో సునాయాసంగా వన్ ట్రిలియన్ మార్క్‌ని క్రాస్ చేసింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ ఇండియన్ కరెన్సీలో రూ. 75 లక్షల కోట్ల (రూ. 75,133,05,00,00,000)కు పైగా నమోదు అయ్యింది.
Wild $T1mes!
— Elon Musk (@elonmusk) October 25, 2021
ఆ ఒక్క డీల్ విలువే
హెర్జ్ కంపెనీతో కుదిరిన ఒప్పందం విలువ ఏకంగా 4.4 బిలియన్ డాలర్లుగా ఉంది. టెస్లా ఎస్ ప్లెయిడ్ కారు ధర ప్రస్తుతం 44,000 డాలర్లుగా ఉంది. కేవలం ఏడాది వ్యవధిలోనే లక్ష కార్లను కొనుగోలు చేయడం ద్వారా 4.4 బిలియన్ డాలర్ల బిజినెస్ జరగబోతుంది. ఇది కాకుండా యూరప్, ఏషియా మార్కెట్‌లలో సైతం టెస్లా కార్లను ఫుల్ డిమాండ్ ఉంది.
ఐదో కంపెనీ
ఇప్పటి వరకు వన్ ట్రిలియన్ మార్క్ మార్కెట్ వ్యాల్యూని దాటిన కంపెనీలన్నీ టెక్నాలజీ బేస్డ్‌గాను ఉన్నాయి. యాపిల్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల మార్కెట్ క్యాపిటల్ విలువ వన్ ట్రిలియన్ పైకి ఉండగా తాజగా టెస్లా వాటి సరసన చేరింది.
వాటికి సాధ్యం కానిది
ఫోర్డ్, జనరల్ మోటార్స్, హోండా, హ్యుందాయ్, రెనాల్ట్, ఫోక్స్ వ్యాగన్ లాంటి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలకు సాధ్యం కాని రికార్డును టెస్లా అలవోకగా అధిగమించింది. వందల ఏళ్లుగా ఆటోమొబైల్ సెక్టార్‌లో ఉన్న బడా కంపెనీలు చేయలేకపోయిన ఫీట్‌ని అవలీలగా క్రాస్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment