Tesla
-
టెస్లా కీలక నిర్ణయం: వేలాది కార్లపై ఎఫెక్ట్
అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా (Tesla).. తన 'సైబర్ ట్రక్' కార్లకు రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు డెలివరీ చేసిన అన్ని సైబర్ ట్రక్కులలోనూ సమస్య ఉందని గుర్తించడంతో ఈ రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావానికి 46,000 కంటే ఎక్కువ కార్లు ప్రభావితమయ్యాయి.డ్రైవింగ్ చేస్తున్నప్పుడు.. బాహ్య ప్యానెల్ విడిపోతుందనే ఆందోళనల కారణంగా ఈ రీకాల్ ప్రకటించడం జరిగింద 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) వెల్లడించింది. మే 19 నుంచి వాహన యజమానులకు మెయిల్ ద్వారా రీకాల్ విషయాన్ని కంపెనీ తెలియజేయనుంది.టెస్లా సైబర్ ట్రక్ వెలుపలి భాగంలో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ ట్రిమ్ ప్యానెల్ విడిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ సన్నద్ధమైంది. దీనికోసం వాహనదారులు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. సంస్థ సర్వీస్ సెంటర్లలో ఉచితంగా భర్తీ చేస్తామని ఆటోమేకర్ కస్టమర్లకు హామీ ఇచ్చింది.టెస్లా.. తన సైబర్ ట్రక్ కోసం రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. యాక్సిలరేటర్ పెడల్ ఇరుక్కుపోవడం, డ్రైవ్ పవర్ కోల్పోవడం, లోపభూయిష్ట విండ్‌షీల్డ్ వైపర్లు, ఎలక్ట్రిక్ ఇన్వర్టర్ సమస్య వంటి కారణాలతో 15 నెలల్లో పలుమార్లు రీకాల్ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరోమారు ఈ రీకాల్ ప్రకటించడం గమనార్హం. -
టెస్లా కార్లకు సప్లయర్ ‘టాటా’నే!
ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) కంపెనీ టెస్లాకు గ్లోబల్ సప్లయర్‌గా టాటా గ్రూప్ నిలిచింది. ఈమేరకు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ భాగస్వామ్యం ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెరుగుతున్న భారత్ పాత్రను, అధునాతన తయారీ, సాంకేతికతలో టాటా గ్రూప్ నైపుణ్యాన్ని నొక్కి చెబుతోంది.ఈ నివేదిక ప్రకారం.. టాటా ఆటోకాంప్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), టాటా టెక్నాలజీస్ , టాటా ఎలక్ట్రానిక్స్‌తో సహా అనేక టాటా గ్రూప్ కంపెనీలు ఇప్పుడు టెస్లా సరఫరా గొలుసులో భాగంగా ఉన్నాయి. కీలకమైన భాగాలు, సేవలను అందిస్తున్నాయి. ఈ టాటా సంస్థలు ఇప్పటికే టెస్లాతో అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, వివిధ విడిభాగాలు, సేవలను సరఫరా చేస్తున్నాయని ఈటీ నివేదించింది. ముఖ్యంగా టెస్లా భారత్‌లో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే వారి భాగస్వామ్యం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.టెస్లా సీనియర్ ప్రొక్యూర్మెంట్ అధికారులు నిర్దిష్ట విడిభాగాల తయారీ గురించి భారతీయ సరఫరాదారులతో చర్చలు జరుపుతున్నారని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఈటీ పేర్కొంది. వీటిలో కాస్టింగ్స్, ఫోర్జింగ్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాబ్రికేషన్ భాగాలు ఉన్నాయి. టెస్లాకు భారతీయ సప్లయర్ల సహకారం ఇప్పటికే గణనీయంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ కంపెనీలు టెస్లాకు దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను సరఫరా చేశాయి. టెస్లా తన సరఫరా గొలుసును వైవిధ్యపరచాలని చూస్తున్న క్రమంలో భారత్ నుంచి దాని సోర్సింగ్ పెరుగుతుందని భావిస్తున్నారు.టాటా కంపెనీలు ఏం సరఫరా చేస్తున్నాయంటే..ఈటీ కథనం ప్రకారం.. వివిధ టాటా గ్రూప్ కంపెనీలు టెస్లాకు ప్రత్యేక ఉత్పత్తులు, సేవలను అందిస్తున్నాయి. వాటిలో టాటా ఆటోకాంప్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఇంజనీరింగ్ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. టాటా టెక్నాలజీస్ ఎండ్-టు-ఎండ్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అందిస్తోంది. టీసీఎస్ సర్క్యూట్ బోర్డు టెక్నాలజీని అందిస్తోంది.టెస్లా తయారీ యూనిట్ ఇక్కడ ఏర్పాటయ్యాక టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ చిప్‌లను సరఫరా చేస్తుందని భావిస్తున్నారు. ఇక బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, మోటార్ కంట్రోలర్ యూనిట్లు, డోర్ కంట్రోల్ మెకానిజమ్‌కు కీలకమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లింగ్స్ (పీసీబీఏ) కోసం టెస్లా టాటా ఎలక్ట్రానిక్స్ వైపు చూడవచ్చు. -
ట్రంప్ హెచ్చరిక.. వారందరికీ 20 ఏళ్ల జైలు శిక్ష తప్పదు..
సియాటెల్: అమెరికాలో ప్రముక కుబేరుడు ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని టెస్లా విద్యుత్ కార్ల సంస్థకు చెందిన ఆస్తులపై దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాడులు చేసే వారికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. టెస్లాపై దాడులు చేస్తే 20 ఏళ్ల జైలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని టెస్లా కార్ల సంస్థకు చెందిన ఆస్తులపై దాడులు పెరిగిపోతున్నాయి. అమెరికా, ఇతర దేశాల్లో టెస్లా షోరూమ్‌లు, విద్యుత్ చార్జింగ్ స్టేషన్లతోపాటు కార్లపైనా ఇటీవల దాడులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టెస్లా కార్లపై దాడికి పాల్పడేవారికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అలాగే, దాడులను ప్రోత్సహిస్తున్న వారికి కూడా శిక్ష తప్పదని హెచ్చరించారు. టెస్లాపై దాడులకు దిగేవారు నరకాన్ని అనుభవించబోతున్నారని వార్నింగ్ ఇచ్చారు.ఇదిలా ఉండగా.. బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను ప్రభుత్వ సామర్థ్య పెంపుదల విభాగం (డోజ్) అధినేతగా ట్రంప్ నియమించినప్పటి నుంచీ టెస్లాపై దాడులు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలన్న మస్క్ సలహా మేరకు ట్రంప్ ప్రభుత్వం ఎందరో ప్రభుత్వోద్యోగులకు ఉద్వాసన పలకడంతోపాటు అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మస్క్ విధానాలను వ్యతిరేకిస్తున్న వారు.. ఉత్తర అమెరికా, యూరప్‌లలోని ఆయన కార్యాలయాలు, ఫ్యాక్టరీల ఎదుట ఆందోళనలు నిర్వహించారు. మస్క్‌తో విభేదిస్తున్న పలువురు సెనేటర్లు వారికి మద్దతు పలికారు. తాము టెస్లా కార్లను అమ్మేస్తామని తెలిపారు.Donald Trump about Tesla sabotaging$tsla pic.twitter.com/mJs1mhQVHs— Investors Guide To The Galaxy (@Alex_Ionescu) March 21, 2025 మార్చి 6వ తేదీన ఒరెగాన్(Oregon) పోర్ట్లాండ్ సబర్బ్ అయిన టిగార్డ్లోని టెస్లా డీలర్‌షిప్‌పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో పలు ఈవీ వాహనాలు ధ్వంసం అయ్యాయి.కొలరాడో లవ్ల్యాండ్లోని షోరూమ్‌ను ఓ మహిళ ధ్వంసం చేసింది. ఆపై మస్క్ వ్యతిరేక రాతలు రాసి.. బొమ్మలు గీసిందిబోస్టన్లోని టెస్లా ఛార్జింగ్ స్టేషన్‌కు దుండగుల నిప్పుసియాటెల్లో టెస్లా వాహనాలకు మంట పెట్టిన ఆగంతకులువాషింగ్టన్ లీన్‌వుడ్‌లో టెస్లా సైబర్ ట్రక్కులపై స్వస్తిక్ గుర్తులతో పాటు మస్క్ వ్యతిరేక రాతలుమార్చి 13వ తేదీన.. ఒరెగాన్ టిగార్డ్ షోరూంపై మరోసారి కాల్పులు.. షోరూం ధ్వంసంవారం వ్యవధిలో రెండుసార్లు ఒరెగాన్ షోరూంపై దాడి జరిగింది. దీంతో ఎఫ్‌బీఐ, ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో పని చేస్తామని పోలీసులు ప్రకటించారు."It's very clear that the Democrat Party no longer stands for anything. They only stand against Donald Trump, even if it means contradicting themselves."As attacks on Tesla continue, White House press secretary Karoline Leavitt calls out the hypocrisy of Democrats pic.twitter.com/7mArI0UEfq— Oscar Lewis (@lewis_osca44575) March 21, 2025 -
భారత్ కోసం సిద్దమవుతున్న టెస్లా కారు ఇదే!
టెస్లా (Tesla) కంపెనీ తన కార్లను ఇండియన్ మార్కెట్లో విక్రయించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సంస్థ భారతీయ విఫణి కోసం ప్రత్యేకంగా 'మోడల్ వై' (Model Y)ను మరింత చౌకైన వెర్షన్‌గా అభివృద్ధి చేస్తోంది. దీని ధర సాధారణ మోడల్ కంటే 20 శాతం తక్కువ. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో టెస్లా ఈ మోడల్ తీసురానుంది.టెస్లా తన భారత కార్యకలాపాలను.. తక్కువ ధరకు అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ కారుతో ప్రారంభించాలని యోచిస్తోంది. దీనిని కంపెనీ బెర్లిన్ గిగాఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ. 21 లక్షలు ఉంటుంది. ఈ కారును చైనా, యూరప్, ఉత్తర అమెరికా మార్కెట్లలో కూడా విక్రయించే అవకాశం ఉంది. అమెరికాలో కూడా దీని ఉత్పత్తిని పెంచడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది.సర్టిఫికేషన్ కోసం దరఖాస్తుటెస్లా కంపెనీ భారతీయ మార్కెట్లో విక్రయించనున్న ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం.. సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దేశంలో కార్లను విక్రయించే ముందు సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియ తప్పనిసరి. కాబట్టి టెస్లా ఇండియా మోటార్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో 'మోడల్ వై, మోడల్ 3' కార్ల హోమోలోగేషన్ కోసం రెండు దరఖాస్తులను సమర్పించింది. -
భారత్‌కు ఆ రెండు టెస్లా కార్లు!.. సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు
టెస్లా భారతదేశంలో తన కార్ల విక్రయాలను ప్రారభించడానికి సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని సన్నాహాలు చేస్తున్న సంస్థ.. తాజాగా భారతదేశంలో రెండు ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం.. సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది.దేశంలో కార్లను విక్రయించే ముందు సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియ తప్పనిసరి. కాబట్టి టెస్లా ఇండియా మోటార్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో 'మోడల్ వై, మోడల్ 3' కార్ల హోమోలోగేషన్ కోసం రెండు దరఖాస్తులను సమర్పించింది.హోమోలోగేషన్ అనేది.. ఒక వాహనం రహదారికి యోగ్యమైనదని, భారతదేశంలో తయారు చేసిన లేదా దేశంలోకి దిగుమతి చేసుకున్న అన్ని వాహనాలకు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉందని ధృవీకరించే ప్రక్రియ. కేంద్ర మోటారు వాహన నియమాలకు అనుగుణంగా ఉద్గారం, భద్రత, రహదారి యోగ్యత పరంగా వాహనం భారత మార్కెట్ అవసరాలకు సరిపోతుందని సంబంధిత శాఖ నిర్దారించాలి.ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారతదేశంలో.. అమెరికన్ కంపెనీ టెస్లా అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది. దీనికి సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. కాబట్టి త్వరలోనే టెస్లా కార్లు ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి రానున్నాయి. అయితే టెస్లా తయారీ ప్లాంట్ ఇండియాలో ప్రారంభిస్తారా?.. లేదా? అనేదానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేదు.టెస్లా ధరలు ఎలా ఉంటాయంటే?ప్రస్తుతం అమెరికాలో టెస్లా చౌకైన కారు.. 'మోడల్ 3' ధర ఫ్యాక్టరీ స్థాయిలో దాదాపు 35,000 డాలర్లు (సుమారు రూ. 30.4 లక్షలు). భారతదేశంలో దిగుమతి సుంకాలను 15-20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్ ట్యాక్స్ & ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులతో, ఆన్-రోడ్ ధర 40,000 డాలర్లు లేదా దాదాపు రూ. 35-40 లక్షలుగా ఉంటుంది. టెస్లా మోడల్ వై ధరలు రూ. 70 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్: వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 2023లో 82,688 యూనిట్ల నుంచి 2024లో 20 శాతం పెరిగి 99,165 యూనిట్లకు చేరుకున్నాయి. టాటా మోటార్స్.. జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్స్ కంపెనీలు ప్రస్తుతం మార్కెట్ లీడర్లుగా ఉన్నాయి.లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ కూడా ఈ సంవత్సరంలో అమ్మకాలలో పెరుగుదలను నమోదు చేసింది. 2024లో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ ఇండియా, వోల్వో కార్స్ ఇండియా, ఆడి, పోర్స్చే కంపెనీలు 2,809 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాయి. 2023లో ఈ అమ్మకాలు 2,633 యూనిట్లుగా ఉన్నాయి. మాత్రమే. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) ప్రకారం.. భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ రిటైల్ అమ్మకాలు దాదాపు 20 శాతం పెరిగాయి. -
మస్క్‌పై వ్యతిరేకత.. టెస్లా షోరూంలపై కొనసాగుతున్న దాడులు
సలమ్: అమెరికాలో టెస్లా షోరూంపై మళ్లీ దాడి జరిగింది. ఒరెగాన్లోని షోరూమ్‌పై గురువారం కొందరు దుండగులు కాల్పులకు దిగారు. ఈ దాడిలో షోరూం అద్దాలు ధ్వంసం కాగా.. పలు వాహనాలు సైతం దెబ్బ తిన్నాయి. అయితే అదృష్టం కొద్దీ ఎవరికీ హాని జరగలేదు. వారం వ్యవధిలో ఇదే షోరూమ్‌పై ఇలా దాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఇలాన్ మస్క్(Elon Musk) కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే ఆయన డోజ్ ఓవెల్ ఆఫీస్‌లో అడుగుపెట్టారో.. అప్పటి నుంచి ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. డోజ్(DOGE) చీఫ్ పేరిట ఫెడరల్ ఉద్యోగుల తొలింపు చర్యలతో ఆ వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆయన సీఈవోగా వ్యవహరిస్తున్న టెస్లా కంపెనీ లక్ష్యంగా వరుసగా దాడులు జరుగుతున్నాయి. మార్చి 6వ తేదీన ఒరెగాన్(Oregon) పోర్ట్లాండ్ సబర్బ్ అయిన టిగార్డ్లోని టెస్లా డీలర్‌షిప్‌పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో పలు ఈవీ వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొలరాడో లవ్ల్యాండ్లోని షోరూమ్‌ను ఓ మహిళ ధ్వంసం చేసింది. ఆపై మస్క్ వ్యతిరేక రాతలు రాసి.. బొమ్మలు గీసిందిబోస్టన్లోని టెస్లా ఛార్జింగ్ స్టేషన్‌కు దుండగుల నిప్పుసియాటెల్లో టెస్లా వాహనాలకు మంట పెట్టిన ఆగంతకులువాషింగ్టన్ లీన్‌వుడ్‌లో టెస్లా సైబర్ ట్రక్కులపై స్వస్తిక్ గుర్తులతో పాటు మస్క్ వ్యతిరేక రాతలుమార్చి 13వ తేదీన.. ఒరెగాన్ టిగార్డ్ షోరూంపై మరోసారి కాల్పులు.. షోరూం ధ్వంసంవారం వ్యవధిలో రెండుసార్లు ఒరెగాన్ షోరూంపై దాడి జరిగింది. దీంతో ఎఫ్‌బీఐ, ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో పని చేస్తామని పోలీసులు ప్రకటించారు. మరోవైపు టెస్లాపై జరుగుతున్న దాడులను దేశీయ ఉగ్రవాదంగా(Domestic Terrorism) అభివర్ణించిన ట్రంప్.. ఘటనలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని చెబుతున్నారు. ఇలాంటి చర్యలు ఓ గొప్ప కంపెనీకి తీరని నష్టం కలిగిస్తాయని.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు మస్క్ కంపెనీలు అందిస్తున్న సేవలు మరిచిపోకూడదని ట్రంప్ చెబుతున్నారు.#ICYMI Two people were federally charged in separate incidents of attacks on Tesla dealerships in Colorado and Oregon.@ATFDenver @FBIDenver @PoliceLoveland investigating: https://t.co/HExwL3I3Z4@ATF_Seattle @FBISeattle @SalemPoliceDept investigating: https://t.co/YXkpdAhJQi pic.twitter.com/Ll7KD0af5k— ATF HQ (@ATFHQ) March 14, 2025 -
టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా మోడల్ ఎస్ కారును కొనుగోలు చేసి ఎలాన్ మస్క్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దాంతో టెస్లాకు మద్దతుగా నిలిచారు. ట్రంప్ కారు కొనుగోలు చేసేందుకు వీలుగా మస్క్ వైట్హౌజ్నే షోరూమ్‌గా మార్చుకున్నారు. ట్రంప్ తనకు నచ్చిన కారును ఎంచుకునేందుకు వీలుగా కొన్ని మోడళ్లను వైట్‌హౌజ్‌లో ప్రదర్శించారు. అందులోనుంచి అధ్యక్షుడు ట్రంప్ సెడాన్ రెడ్ మోడల్ ఎస్‌ను ఎంచుకున్నారు.డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్)లో మస్క్ ప్రమేయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ అధీనంలో చాలామంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించడంతోపాటు డోజ్ తీసుకుంటున్న విభిన్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దాంతో మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా కొనుగోళ్లను బహిష్కరించాలని అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ట్రంప్ టెస్లాకు మద్దతుగా నిలుస్తానని, కంపెనీ కారును తాను కొనుగోలు చేస్తానని మాటిచ్చారు. దాంతో తాజాగా కంపెనీ మోడల్ ఎస్‌ను కొనుగోలు చేశారు. ఇటీవల కంపెనీ స్టాక్ ధరలు క్షీణించడం టెస్లాకు సవాలుగా మారింది. బహిరంగంగా ట్రంప్ టెస్లా కారు కొనుగోలు చేయడం ద్వారా కంపెనీకి మద్దతుగా నిలవాలని భావించారు.President @realDonaldTrump and @elonmusk hop in a Tesla! pic.twitter.com/NRRm7IEQGf— Margo Martin (@MargoMartin47) March 11, 2025ఇదీ చదవండి: మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్.. స్టార్‌లింక్‌తో జియో ఒప్పందంట్రంప్ ఈ కారుపై ఆసక్తిగా ఉన్నప్పటికీ సీక్రెట్ సర్వీస్ ఆంక్షల కారణంగా తాను దాన్ని స్వయంగా నడపలేనని తెలిపారు. సిబ్బంది ఉపయోగించేందుకు వీలుగా వైట్‌హౌజ్ వద్ద ఉంటుందని చెప్పారు. కారు కొనుగోలు చేసిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ..‘మస్క్ గొప్ప దేశభక్తుడు. ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. ఈ కారును నేను పూర్తి ధర వెచ్చింది 80వేల డాలర్ల(రూ.69.7 లక్షలు)కు కొనుగోలు చేశాను. మస్క్ దీనిపై డిస్కౌంట్ ఇచ్చేవారే. కానీ, ఒకవేళ నేను రాయితీ తీసుకుంటే ఇతర ప్రయోజనాలు పొందానని కొందరు విమర్శలు చేస్తారు’ అని చెప్పారు. -
మస్క్ పతనం మొదలైందా?: లక్షల కోట్లు ఆవిరి
టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ (ట్విటర్) వంటి సంస్థలను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న ఎలాన్ మస్క్ సంపద భారీగా ఆవిరవుతోంది. ఇటీవల తన నికర విలువలో 120 బిలియన్ డాలర్లు (రూ. 10లక్షల కోట్ల కంటే ఎక్కువ) తగ్గింది. అయితే.. 330 బిలియన్ డాలర్ల సంపదతో, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నప్పటికీ.. 2025 ప్రారంభం నుంచి సంపదలో 25 శాతం క్షీణతను పొందారు. ఇది ఇలాగే కొనసాగితే.. నెం.1 స్థానానికే ముప్పు ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.మస్క్ తరువాత స్థానంలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ (Jeff Bezos), ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఉన్నారు. మస్క్ సంపద ఇలాగే తగ్గుతూ పోతే.. ప్రపంచ కుబేరుడి స్థానాన్ని మరొకరు స్వాధీనం చేసుకుంటారు.మస్క్ సంపద తగ్గడానికి కారణంమస్క్ సంపద తగ్గడానికి ప్రధాన కారణం టెస్లా (Tesla) అని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల.. టెస్లా అమ్మకాలు 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి వరకు 16 శాతం తగ్గాయి. అంతే కాకుండా గత రెండు నెలల్లో, టెస్లా షేర్ ధర దాదాపు 35% తగ్గింది. దీంతో మస్క్ సంపద గణనీయంగా తగ్గింది.ఇదీ చదవండి: ఎక్స్‌పై సైబర్ ఎటాక్ ఆ దేశం పనే!మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే సంస్థలు కూడా పెరిగాయి. దీంతో చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. దెబ్బకు టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పడిపోయాయి. అమ్మకాల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాల్సి వచ్చింది. కాగా టెస్లా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.రాజకీయ ప్రమేయంప్రపంచ కుబేరుడు, దిగ్గజ వ్యాపారవేత్త మస్క్ సంపద తగ్గడానికి మరో కారణం.. పెరుగుతున్న రాజకీయ ప్రమేయం అని తెలుస్తోంది. ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మస్క్ భారీగా ఖర్చు చేశారు. దీంతో అమెరికా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత కొంతమంది పెట్టుబడిదారులతో భయం మొదలైంది. ఇది కూడా మస్క్ కంపెనీ షేర్స్ తగ్గడానికి కారణమైంది. -
భారత్‌లో టెస్లాకు అంత ఈజీ కాదు
న్యూఢిల్లీ: భారత్‌లో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు ఇక్కడి మార్కెట్‌పై పట్టు సాధించడం అంత సులువు కాదని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ వ్యాఖ్యానించారు. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలాంటి దేశీ దిగ్గజాల తరహాలో అది రాణించలేకపోవచ్చని తెలిపారు. ఎర్న్స్ట్ అండ్ యంగ్ ‘ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘మస్క్ చాలా స్మార్ట్. అందులో సందేహం లేదు. ఆయన చాలా గొప్ప పనులు చేస్తున్నారు. కానీ ఆయన ఉన్నది అమెరికాలో, భారత్‌లో కాదు. ఇక్కడ విజయం సాధించాలంటే అంత సులభం కాదు. మహీంద్రా, టాటాల్లాగా ఆయన రాణించలేరు’’ అని జిందాల్ పేర్కొన్నారు. ఈవీల దిగుమతులపై టారిఫ్‌ల తగ్గింపు అవకాశాలతో భారత మార్కెట్లో ప్రవేశించేందుకు టెస్లా సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కూడా ఈవీ సెగ్మెంట్లో అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. చైనాకు చెందిన ఎస్ఏఐసీ కార్పొరేషన్‌తో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా ఇటీవలే ఎలక్ట్రిక్, ప్లగ్–ఇన్ హైబ్రిడ్స్ మొదలైన పలు వాహనాలను ప్రదర్శించింది. -
భారత్‌లో టెస్లా తొలి షోరూమ్.. ఎక్కడంటే..
ఎలక్ట్రిక్ కార్ల యూఎస్ దిగ్గజం టెస్లా(Tesla) భారత్‌లో తొలి షోరూమ్‌ను ముంబైలో ఏర్పాటు చేయనుంది. ఇందుకు వీలుగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ) బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్పేస్‌ను లీజుకి తీసుకుంది. సీఆర్ఈ మ్యాట్రిక్స్ వివరాల ప్రకారం పార్కింగ్ సౌకర్యాలుగల షోరూమ్ స్పేస్‌కుగాను కంపెనీ ప్రమోటర్, బిలియనీర్ ఎలాన్ మస్క్ నెలకు రూ.35 లక్షల అద్దె చెల్లించనున్నారు. అద్దె ఏడాదికి 5 శాతం పెంపు ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి లీజుకి తీసుకుంది. ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ దేశీయంగా ఏర్పాటైన తొలి యాపిల్ స్టోర్‌కు దగ్గరగా ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టరైంది. రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా టెస్లా జమ చేసింది.ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) భారతదేశానికి టెస్లా కార్లను తీసుకురానున్నట్లు గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. టెస్లా (Tesla) కార్లు దేశీయ విపణిలో అడుగుపెడితే.. వాటి ధరలు ఎలా ఉంటాయనే వివరాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే విదేశీ కంపెనీలపై దిగుమతి సుంకాలను విధించడం సర్వసాధారణం. ప్రస్తుత అనిశ్చితుల కారణంగా టెస్లా కంపెనీపై దిగుమతి సుంకాన్ని 20 శాతం తగ్గిస్తే కార్ల ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు తగ్గిన తరువాత కూడా టెస్లా కారు ధర రూ.35 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని ఇటీవల గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ సీఎల్ఎస్ఏ తన నివేదికలో వెల్లడించింది.ఇదీ చదవండి: ఈ ఏడాదే భారత్‌లోకి చిన్న ఎలక్ట్రిక్ ఎస్యూవీప్రస్తుతం అమెరికాలో టెస్లా చౌకైన కారు ‘మోడల్ 3’ ధర ఫ్యాక్టరీ స్థాయిలో దాదాపు 35,000 డాలర్లు (సుమారు రూ.30.4 లక్షలు). భారతదేశంలో దిగుమతి సుంకాలను 15-20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులతో, ఆన్-రోడ్ ధర 40,000 డాలర్లు లేదా దాదాపు రూ.35-40 లక్షలుగా ఉంటుందని అంచనా. మహీంద్రా XEV 9e, హ్యుందాయ్ ఈ-క్రెటా, మారుతి సుజుకి ఈ-విటారా వంటి దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే టెస్లా మోడల్ 3 ధర 20-50 శాతం ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ధరపై ఇంకా కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
అమెరికాలో ట్విస్ట్.. జేడీ వాన్స్, మస్క్‌కు ఝలక్
వాషింగ్టన్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్, జేడీ వాన్స్‌ల ఆవేశపూరిత సంభాషణ అనంతరం అమెరికా అంతటా ఉక్రెయిన్ అనుకూల నిరసనలు జరిగాయి. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, బోస్టన్లలో వందలాది మంది ప్రజలు ఉక్రెయిన్‌కు మద్దతుగా రోడ్లపైకి వచ్చారు. ‘అమెరికా స్టాండ్స్ విత్ ఉక్రెయిన్’, ‘బి స్ట్రాంగ్ ఉక్రెయిన్’ ప్లకార్డులను ప్రదర్శించారు.హాలిడే కోసం వెర్మోంట్లోని వెయిట్స్ఫీల్డ్కు వచ్చిన వైస్ ప్రెసిడెంట్ వాన్స్, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా నిరసనకారులు ప్రదర్శన చేపట్టారు. మరోవైపు వీరికి వ్యతిరేకంగా, ట్రంప్, వాన్స్‌లకు అనుకూలంగా వెయిట్స్ఫీల్డ్లో కౌంటర్ నిరసనలు కూడా జరిగాయి. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపుల నేపథ్యంలో ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా స్టోర్ల ముందు కూడా అమెరికా వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. Vermont's message to JD Vance: Not in our town, you fascist piece of shit. 😡😡😡😡😡👇 pic.twitter.com/Pk4QwFu3fv— Bill Madden (@maddenifico) March 1, 2025ట్రంప్‌పై నమ్మకం లేదు..ఇదిలా ఉండగా.. అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ దేశాన్ని ముందుకు నడిపించే విధానంపై ప్రజల్లో ఇప్పటికీ అనుకూల వైఖరి కంటే వ్యతిరేక వైఖరే ఎక్కువగా కనిపిస్తోంది. ట్రంప్‌పై ప్రజామోదం, పని తీరు, నిర్ణయాలు, దేశాన్ని ఆయన సరైన దిశగా నడిపిస్తున్నారా అంటే లేదనే ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తమ్మీద ట్రంప్ పని తీరుపై 52 శాతం మంది పెదవి విరిచారు. 48 శాతం మంది మాత్రమే ట్రంప్ పాలన బాగుందన్నారు. ఫిబ్రవరి మధ్యలో సర్వే చేపట్టినప్పుడు సైతం దాదాపు ఇదే ఫలితం రావడం గమనార్హం. ఉద్యోగులపై వేటు సహా ఆయన విధానాలకు సొంత రిపబ్లికన్లు 90 శాతం మంది సానుకూలత చూపగా, ప్రతిపక్ష డెమోక్రాట్లు 90 శాతం మంది వ్యతిరేకత తెలిపారు. స్వతంత్రుల్లో 59 మంది కూడా ట్రంప్ తీరు నచ్చలేదన్నారు. ట్రంప్ విధానాలు దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాయని 45 శాతం మంది చెప్పగా సరైన దిశగానే దేశం సాగుతోందని 39 శాతం మంది బదులిచ్చారు. కాగా, శుక్రవారం వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తీవ్ర వాదోపవాదం జరిగిన ముందు రోజే ఈ పోల్ ముగియడంతో, ఆ ప్రభావం దీనిపై కనిపించలేదు. Hundreds of protesters gathered in Waitsfield on Saturday morning to protest Vice President JD Vance, who is visiting Vermont with his family for a ski trip this weekend. pic.twitter.com/gICcSJBU2a— Vermont Public (@vermontpublic) March 1, 2025 -
నెం. 14, మరోసారి తండ్రైన బిలియనీర్ : పేరేంటో తెలుసా?
టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో సారి తండ్రి అయ్యాడు. మస్క్ భార్య, అతని కంపెనీ న్యూరాలింక్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న షివోన్ జిలిస్‌తో కలిసి నాలుగో బిడ్డను స్వాగతించారు. ఇప్పటికే మస్క్‌కు 13 మంది పిల్లలున్నారు. దీంతో ఇపుడు మస్క్ సంతానం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.మస్క్ భార్య షివోన్ జిలిస్ ఈ విషయాన్ని ఎక్స్( ట్విటర్) ద్వారా వెల్లడించింది. ఇప్పటికే ఈ దంపతులు కవలలు (స్ట్రైడర్ , అజూర్) ఏడాది పాప ఆర్కాడియా ఉన్నారు. నాలుగో బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్గా అపుడే పేరు కూడా పెట్టేయడం గమనార్హం. అందమైన ఆర్కాడియా పుట్టినరోజు సందర్బంగా తమ అద్భుతమైన కుమారుడు సెల్డాన్ లైకుర్గస్ రాక గురించి చెప్పడం ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు హార్ట్ సింబల్‌తో ఎలాన్ మస్క్ సమాధానమిచ్చాడు. గణనీయంగా క్షీణిస్తున్న జనాభాపై ఎపుడూ ఆందోళన వ్యక్తం చేసే మస్క్ సంతానోత్పత్తి ప్రాముఖ్యతపై దృష్టిపెట్టునట్టున్నాడు అంటోది సోషల్ మీడియా. జనాభా వృద్ధి చెందాలని భావించే మస్క్, ఇప్పటికే తన స్పెర్మ్‌ను స్నేహితులు, పరిచయస్తులకు దానం చేశాడనే వాదనలు కూడా చాలానే ఉన్నాయి. Discussed with Elon and, in light of beautiful Arcadia’s birthday, we felt it was better to also just share directly about our wonderful and incredible son Seldon Lycurgus. Built like a juggernaut, with a solid heart of gold. Love him so much ♥️— Shivon Zilis (@shivon) February 28, 2025కాగా షివోన్ జిలిస్‌తో తనకున్న నలుగురు పిల్లలతో పాటు, మస్క్‌కు మొదటి భార్య జస్టిన్ విల్సన్ ద్వారా ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో కవలలు వివియన్ , గ్రిఫిన్‌తో పాటు, కై, సాక్సన్ , డామియన్ అనే ముగ్గురున్నారు. వీరి తొలి సంతానం బిడ్డ నెవాడా అలెగ్జాండర్ మస్క్ కేవలం 10 వారాల వయసులోనే మరణించాడు. -
'భారత్‌లో టెస్లా కార్ల ధరలు ఇలాగే ఉంటాయి!'
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) భారతదేశానికి టెస్లా కార్లను తీసుకురానున్నట్లు గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో షోరూమ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు, అందులో పనిచేయడానికి కావలసిన నిపుణుల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అయితే టెస్లా (Tesla) కార్లు దేశీయ విఫణిలో అడుగుపెడితే.. వాటి ధరలు ఎలా ఉంటాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.విదేశీ కంపెనీలపై.. దిగుమతి సుంకాలను విధించడం సర్వసాధారణం. అయితే టెస్లా కంపెనీపై దిగుమతి సుంకాన్ని 20 శాతం తగ్గిస్తే.. కార్ల ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గిన తరువాత కూడా.. టెస్లా కారు ప్రారంభ ధర రూ. 35 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ 'సీఎల్ఎస్ఏ' నివేదికలో వెల్లడించింది.ప్రస్తుతం అమెరికాలో టెస్లా చౌకైన కారు.. 'మోడల్ 3' ధర ఫ్యాక్టరీ స్థాయిలో దాదాపు 35,000 డాలర్లు (సుమారు రూ. 30.4 లక్షలు). భారతదేశంలో దిగుమతి సుంకాలను 15-20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్ ట్యాక్స్ & ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులతో, ఆన్-రోడ్ ధర 40,000 డాలర్లు లేదా దాదాపు రూ. 35-40 లక్షలుగా ఉంటుంది.మహీంద్రా XEV 9e, హ్యుందాయ్ ఈ-క్రెటా, మారుతి సుజుకి ఈ-విటారా వంటి దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే.. టెస్లా మోడల్ 3 ధర 20-50 శాతం ఎక్కువ. కాబట్టి టెస్లా అమ్మకాలు ఇండియాలో ఆశాజనకంగా ఉంటాయా? అనేది ఒక ప్రశ్న. అయితే టెస్లా ధరలు భారతీయ ఈవీ మార్కెట్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని సీఎల్ఎస్ఏ నివేదిక వెల్లడించింది.ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్.. ఆ టోల్ ప్లాజాలకు వర్తించదుటెస్లా కంపెనీ రూ. 25 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఎంట్రీ లెవల్ మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. టెస్లా ప్రవేశం ప్రధాన భారతీయ వాహన తయారీదారులపై గణనీయమైన ప్రభావాన్ని చూపదని నివేదిక సూచిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో మొత్తం EVల వ్యాప్తి చైనా, యూరప్ మరియు US కంటే తక్కువగా ఉంది. -
మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన ముగిసిన తర్వాత టెస్లా ఇండియాలో ప్రవేశించేందుకు లైన్ క్లియర్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్‌లో తన కార్యకలాపాలు సాగించేందుకు టెస్లా చర్యలకు పూనుకుంది. ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) నిర్ణయం ‘చాలా అన్యాయం’ అని తెలిపారు. మస్క్ సమక్షంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.భారీగా టారిఫ్లుప్రతి దేశం అమెరికా వస్తువులపై భారీగా దిగుమతి సుంకాలను విధిస్తూ యూఎస్‌ను బాగా ఉపయోగించుకుంటోందని తెలిపారు. భారత్ అందుకు మంచి ఉదాహరణ అని అన్నారు. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకం 100 శాతంగా ఉందని, దేశంలో కార్లను విక్రయించడం టెస్లాకు దాదాపు అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. మస్క్ భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కానీ, అమెరికా పరంగా అది చాలా అన్యాయమన్నారు. భారత్‌లోని సుంకాలను ఉద్దేశించి సమన్యాయం, న్యాయమైన వాణిజ్య పద్ధతుల ఆవశ్యకతను ట్రంప్ నొక్కిచెప్పారు. ఇదీ చదవండి: యాక్టివ్‌గా ఉన్న కంపెనీలు 65 శాతమేసుంకాలు తగ్గింపుమోదీ అమెరికా పర్యటన సందర్భంగా మస్క్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన సమావేశం అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సుంకాలపై విమర్శలు ఉన్నప్పటికీ భారతదేశం ఇటీవల హైఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. ఇది భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశానికి మార్గం సుగమం చేస్తుంది. టెస్లా ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబైల్లో షోరూమ్‌ల కోసం స్థలాలను గుర్తించినట్లు ప్రకటించింది. భారతదేశంలో పని చేసేందుకు మిడ్ లెవల్ పొజిషన్లను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేసింది. అధిక టారిఫ్‌లు ఉన్నప్పటికీ భారత మార్కెట్లో టెస్లా తన ఉనికిని చాటేందుకు చర్యలు చేపట్టింది. -
భారత్ టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం
-
టెస్లా వచ్చేస్తోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెస్లా.. ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తున్న అమెరికాకు చెందిన ఈ ఈవీ దిగ్గజం ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెడుతోంది. ఇందుకోసం నియామకాలను మొదలుపెట్టింది. ఢిల్లీ, ముంబై కేంద్రంగా 13 రకాల పోస్టులకు సిబ్బంది అవసరమంటూ లింక్డ్ఇన్ వేదికగా కంపెనీ ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. దీంతో కంపెనీ రాక ఇక లాంఛనమే అయింది. ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెస్లా వ్యవస్థాపకుడు, అమెరికన్ టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో టెస్లా నియామకాలు మొదలుపెట్టడం ఆసక్తి కలిగిస్తోంది. భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశం గురించి చాలా ఆసక్తిగా ప్రజలు ఎదురుచూస్తున్న విషయం విదితమే. తొలుత మోడల్–3.. పూర్తిగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను తొలుత భారత్‌కు టెస్లా దిగుమతి చేసుకోనుంది. అన్ని అనుకూలిస్తే తయారీ కేంద్రం కార్యరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. టెస్లా ఈ ఏడాది భారత్‌లో తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. యూఎస్‌లో కంపెనీ నుంచి చవక కారు ‘మోడల్–3’ ధర దాదాపు రూ.26 లక్షలు ఉంది. భారత మార్కెట్లో పోటీగా ఉండేందుకు మోడల్–3లో చవక వెర్షన్ ముందుగా రంగ ప్రవేశం చేసే చాన్స్ ఉంది. దశాబ్దం తర్వాత క్షీణత.. టెస్లా ప్రపంచవ్యాప్తంగా 2024లో 17.9 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. 2023తో పోలిస్తే అమ్మకాలు 1.1 శాతం క్షీణించాయి. విక్రయాలు 12 ఏళ్ల తర్వాత తగ్గడం గమనార్హం. కొనుగోలుదారులను ఆకర్షించడానికి, ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో నంబర్–1 ర్యాంక్‌ను నిలబెట్టుకోవడానికి కంపెనీ గత సంవత్సరం ధరలను పదేపదే తగ్గించినప్పటికీ విక్రయాలు క్షీణించాయి. ప్రస్తుతం సగటు కారు విక్రయ ధర 41,000 డాలర్లు నమోదైంది. ప్రధానంగా చైనాకు చెందిన బీవైడీ నుంచి టెస్లా పోటీ ఎదుర్కొంటోంది. బీవైడీ గత ఏడాది 17.6 లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ సంస్థ మొత్తం అమ్మకాల్లో చైనా వాటా ఏకంగా 90 శాతం ఉంది. భారత్‌లో 2024లో వివిధ కంపెనీల ఈవీల విక్రయాలు 99,068 యూనిట్లు నమోదయ్యాయి. చైనాలో ఈ సంఖ్య 1.1 కోట్లకుపైమాటే. షోరూంలు ఎక్కడంటే.. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఏరోసిటీలో, ముంబై విమానాశ్రయం సమీపంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా షోరూంలు రానున్నాయి. దాదాపు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్నాయి. ఇవి షోరూంలు మాత్రమే. సరీ్వస్ కేంద్రాలు కావు.ఉద్యోగాలివీ..బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్, సర్వీస్ అడ్వైజర్, పార్ట్స్ అడ్వైజర్, సర్వీస్ టెక్నీషియన్, సరీ్వస్ మేనేజర్, సేల్స్ అండ్ కస్టమర్ సపోర్ట్, స్టోర్ మేనేజర్, కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్, కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, కన్జూమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్ కావాలంటూ కంపెనీ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాలకు, దరఖాస్తుకు లింక్డ్ఇన్లో టెస్లా పేజీని చెక్ చేసుకోవచ్చు. భారత్‌పై ఆసక్తి... టెస్లా కొన్నేళ్లుగా భారత్‌లో అడుగుపెట్టాలని ఆసక్తిగా ఉంది. ఇక్కడి పన్నులే అడ్డంకిగా నిలిచాయి. దేశంలో దిగుమతి చేసుకున్న వాహనాలతో మొదట విజయం సాధిస్తే టెస్లా భారత్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయవచ్చని 2021 ఆగస్టులో మస్క్ ప్రకటించారు. టెస్లా తన వాహనాలను భారత్‌లో విడుదల చేయాలని భావిస్తోందని ఆయన చెప్పారు. అయితే దిగుమతి సుంకాలు ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో కూడా లేనంతగా ఇక్కడ అత్యధికంగా ఉన్నాయని అన్నారు. కాగా, 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లపై 110 శాతం దిగుమతి సుంకాన్ని గతంలో భారత్ విధించింది. విదేశీ ఈవీ సంస్థలను భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించే ప్రయత్నంలో ప్రభుత్వం ఇప్పుడు ఈ సుంకాన్ని 70 శాతానికి తగ్గించింది. -
ముంబై, ఢిల్లీలో నియామకాలు చేపడుతున్న మస్క్ కంపెనీ
-
భారత్‌లో ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న టెస్లా
ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), పునరుత్పాదక ఇంధన రంగాల్లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న టెస్లా ఇంక్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ల మధ్య సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని వాణిజ్య అంశాలపై చర్చించారు. అందులో భాగంగా టెస్లా భారత్‌లో ప్రవేశానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. దాంతో త్వరలో దీనిపై నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ అనుమానాలకు ఊతమిచ్చేలా ముంబై, ఢిల్లీలో కస్టమర్ ఫేసింగ్, బ్యాకెండ్ పొజిషన్లలో పని చేసేందుకు 13 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టెస్లా ప్రకటించింది. దాంతో టెస్టా భారత్‌లో ప్రవేశించేందుకు అడ్డంకులు తొలిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.వ్యూహాత్మక ఎత్తుగడ..టెస్లా భారతదేశంలో నియామకాలు చేపట్టాలని తీసుకున్న నిర్ణయం దేశంలో తన ఉనికిని స్థాపించే దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. సర్వీస్ టెక్నీషియన్, టెస్లా అడ్వైజర్, ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, స్టోర్ మేనేజర్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్ వంటి పోస్టులను ఈ మేరకు భర్తీ చేయనున్నారు. హైఎండ్ కార్లపై దిగుమతి సుంకాన్ని భారతదేశం ఇటీవల 110% నుంచి 70%కు తగ్గించిన తరువాత ఇలా నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. టెస్లా వంటి లగ్జరీ కార్ల తయారీదారులు మార్కెట్లోకి ప్రవేశించడం ఆర్థికంగా మరింత లాభదాయకంగా మారనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.భారత మార్కెట్లో అవకాశాలుచైనా వంటి దేశాలతో పోలిస్తే భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఇంకా తక్కువగానే ఉంది. 2024లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 1,00,000 యూనిట్లకు దగ్గరగా ఉన్నందున భారత ప్రభుత్వం ఈ రంగంలో మరింత వృద్ధి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ వ్యవహారం టెస్లాకు గణనీయమైన అవకాశాన్ని అందించనుంది. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించడానికి దేశం కట్టుబడి ఉంది. అందుకోసం సుస్థిర ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడంలో భాగంగా టెస్లా వంటి కంపెనీలకు కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: పరుగు ఆపని పసిడి! తులం ఎంతంటే..స్టార్ లింక్‌కు గ్రీన్ సిగ్నల్..?ఇటీవల మస్క్-మోదీల మధ్య జరిగిన సమావేశం అనంతరం మస్క్‌కు చెందిన శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ స్టార్ లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడంపై కూడా చర్చ జరుగుతుంది. ట్రాయ్ ఆంక్షల కారణంగా స్టార్ లింక్ భారత్‌లోకి ప్రవేశించడం ఆలస్యం అవుతుంది. అయితే మోదీ, మస్క్ ఇద్దరూ ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్టార్ లింక్ లైసెన్సింగ్ సవాళ్ల పరిష్కారానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇది రెండు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి మార్గం సుగమం చేస్తుందని కొందరు అధికారులు తెలియజేస్తున్నారు. -
మోదీతో మస్క్ భేటీ.. స్పేస్ఎక్స్, టెస్లాకు లైన్‌క్లియర్?
అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్ హౌస్‌లో సమావేశమయ్యారు. మోదీ ట్రంప్‌తో చర్చలకు ముందు మస్క్‌ను కలిశారు. ఈ సమావేశం ఇండియా-యునైటెడ్ స్టేట్స్ మధ్య వ్యాపార సంబంధాల భవిష్యత్తుపై ఊహాగానాలను రేకెత్తించింది.వ్యాపార సంస్కరణలకు భారత్ మద్దతుసమావేశం అనంతరం ఇరువురి మధ్య చర్చలు ఆసక్తికరంగా ఉన్నాయని మోదీ తెలిపారు. అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ సహా పలు అంశాలపై చర్చించినట్లు చెప్పారు. వ్యాపార సంస్కరణలకు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ‘కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన(మినిమం గవర్న్మెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్)’ అనే భావనను మోదీ హైలైట్ చేశారు. మోదీతో జరిగిన ఈ సమావేశానికి మస్క్ తన ముగ్గురు పిల్లలను వెంటపెట్టుకొని వచ్చారు. ఆ చిన్నారులతో మోదీ కాసేపు ముచ్చటించారు.వ్యాపార ఆసక్తులు, అవకాశాలుఈ సమావేశం అనంతరం మస్క్‌కు చెందిన శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ స్టార్ లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడంపై చర్చ జరుగుతుంది. ట్రాయ్ ఆంక్షల కారణంగా స్టార్ లింక్ భారత్‌లోకి ప్రవేశించడం ఆలస్యం అవుతుంది. అయితే మోదీ, మస్క్ ఇద్దరూ ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్టార్ లింక్ లైసెన్సింగ్ సవాళ్ల పరిష్కారానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇది రెండు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి మార్గం సుగమం చేస్తుందని కొందరు అధికారులు తెలియజేస్తున్నారు. భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశం గురించి కూడా చర్చలు సాగుతున్నాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీకి దేశం ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్నందున ఇండియాలోకి టెస్లా ఉత్పత్తులను తీసుకురావడానికి ఈ చర్చలు దారితీసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో కార్మిక శాఖ అధికారుల విచారణభారత్-అమెరికా సంబంధాలపై ప్రభావంఆవిష్కరణలు, అంతరిక్ష అన్వేషణ, కృత్రిమ మేధస్సు, సుస్థిర అభివృద్ధి వంటి రంగాల్లో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ మధ్య సహకారానికి మోదీ-మస్క్ మధ్య జరిగిన సమావేశం తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీలు, ఆంత్రప్రెన్యూర్‌షిప్, సుపరిపాలనలో సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలను కూడా ఈ చర్చల్లో ప్రస్తావించినట్లు అధికారులు చెప్పారు. -
టెస్లా బాస్ చేతికి టిక్‌టాక్?: మస్క్ ఏం చెప్పారంటే..
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అధిక ప్రజాదరణ పొందిన చైనా షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok)ను ఇప్పటికే భారత్‌తో సహా చాలా దేశాలు నిషేధించాయి. అమెరికా కూడా ఈ యాప్‌ను నిషేదించనున్నట్లు సమాచారం. కానీ దీనిని (టిక్‌టాక్) ఇలాన్ మస్క్ (Elon Musk) కొనుగోలు చేయనున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత?.. దీనిపై మస్క్ అభిప్రాయం ఏంటనేది ఇక్కడ చూసేద్దాం.భద్రతా కారణాల దృష్ట్యా.. టిక్‌టాక్ యాప్‌ను అమెరికా నిషేధించాలని యోచిస్తోంది. ఈ నిషేధం నుంచి తప్పించుకోవడానికి.. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ (ByteDance) ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత మస్క్‌కు విక్రయించాలని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. దీనిపై మస్క్ స్పందించారు.నేను టిక్‌టాక్ కొనుగోలుకు బిడ్డింగ్ వేయలేదు. దానిని కొనుగోలు చేయాలనే ఆసక్తి నాకు లేదు. ఒకవేళా ఆ యాప్ కొనుగోలు చేస్తే దానిని ఏమి చేయాలో తెలియదు. కంపెనీలను కొనుగోలు చేయడం కంటే.. కొత్త కంపెనీలను నెలకొల్పడమే నాకు ఇష్టం అని మస్క్ స్పష్టం చేశారు.2017లో ప్రారంభమైన టిక్‌టాక్, అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయింది. ఎంత వేగంగా ప్రజాదరణ పొందిందో.. అంతే వేగంగా ఈ యాప్‌ను పలు దేశాలు రద్దు చేశాయి. అమెరికా కూడా ఈ యాప్‌పై ఆంక్షలు విధించింది. చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే టిక్‌టాక్ నిషేధాన్ని ఎదుర్కోక తప్పదనే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఇటీవల ఆమోదం తెలిపింది.ఇదీ చదవండి: యూట్యూబర్‌పై సెబీ కన్నెర్ర: ఎవరీ అస్మితా పటేల్?అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం.. తరువాత అమెరికా సుప్రీంకోర్టు కూడా టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు ఓ డెడ్‌లైన్ ఇచ్చింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లో టిక్‌టాక్‌ను విక్రయించాలని సూచించింది. అయితే కంపెనీ జాయింట్ వెంచర్లో అమెరికాకు 50 శాతం వాటా ఇస్తే.. టిక్‌టాక్‌కు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో సంస్థ టిక్‌టాక్‌ను మస్క్‌కు విక్రయించనున్నట్లు వార్తలు వచ్చాయి. -
కొత్త కారును ఆవిష్కరించిన టెస్లా (ఫొటోలు)
-
ఎలాన్ మస్క్ చేతికి టిక్‌టాక్..?
టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ ఆధ్వర్యంలోని టిక్‌టాక్(TikTok) అమెరికా కార్యకలాపాల(US operations)ను కొనుగోలు చేయవచ్చనే వార్తలొస్తున్నాయి. అమెరికాలో జాతీయ భద్రత, డేటా గోప్యతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ యూఎస్ కార్యకలాపాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను స్థానికంగా నిషేధించనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు.చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్(ByteDance) ఆధ్వర్యంలోని టిక్‌టాక్‌ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. లేదంటే ఈ యాప్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్‌టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై తుదితీర్పు రావాల్సి ఉంది.అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్‌పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది.డేటా భద్రతలొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్‌టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.కంటెంట్ మానిప్యులేషన్అమెరికన్లు చూసే కంటెంట్‌ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: మరింత క్షీణిస్తున్న రూపాయి!ఈ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్‌లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. ఈ తరుణంలో ఎలాన్‌మస్క్ టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేయబోతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురిస్తున్నాయి. -
మస్క్‌కు ప్రభుత్వం ఆహ్వానం
టెస్లా(Tesla) సీఈఓ ఎలాన్ మస్క్‌తోపాటు ఇతర ప్రధాన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ సంస్థల ఉన్నతాధికారులకు దేశంలోని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపింది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీని ప్రోత్సహించే పథకం (SPMEPCI)కు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు వారికి ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం ఈమేరకు చర్చసాగనుంది.మార్చి 2024లో కొత్త ఈవీ పాలసీని ప్రతిపాదించారు. ప్రపంచ వాహన తయారీదారులను ఆకర్షించడానికి, దేశీయ తయారీ సామర్థ్యాలను పెంచడానికి దీన్ని రూపొందించినట్లు ప్రభుత్వం గతంలో తెలిపింది. స్థానిక తయారీ, సరఫరాను తప్పనిసరి చేస్తూ దేశంలో ఉత్పత్తి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ఈ పథకం ప్రోత్సాహకాలను అందిస్తుంది. ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్ (పీఎల్ఐ-ఆటో) కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అనుగుణంగా దేశీయ విలువ జోడింపు (DVA)ను లెక్కిస్తారు.ఈవీ పాలసీ నిబంధనలు ఇవే..భారతదేశంలో కనీసం 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,150 కోట్లు) పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్న వాహన తయారీదారులకు దిగుమతి సుంకాలను తగ్గించాలనే నిబంధనలున్నాయి. ఏదైనా కంపెనీ స్థానికంగా కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలో 25% డీవీఏ(DVA), ఐదో సంవత్సరం నాటికి 50% డీవీఏ సాధించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన తయారీదారులకు చెందిన ఉత్పత్తులు 35,000 డాలర్లు(రూ.30 లక్షలు) కంటే ఎక్కువ ధర ఉంటే దిగుమతి పన్ను సుమారు 70%గా విధిస్తారు.విభిన్న వాదనలుప్రతిపాదిత పథకానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ పథకం ద్వారా గణనీయమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నప్పటికీ టెస్లా, విన్‌ఫాస్ట్ వంటి వాహన తయారీదారులు కొన్ని నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 2024లో పాలసీపై ఇరు కంపెనీల నుంచి భిన్న వాదనలు వినిపించాయి. డీవీఏ లెక్కింపు పద్ధతి, అర్హత ప్రమాణాలపై ఆందోళన చెందాయి. నిర్ణీత గడువులోగా డీవీఏ లక్ష్యాలను చేరుకోవడంపై టెస్లా తన సలహాదారు ‘ది ఆసియా గ్రూప్ (TAG) ఇండియా’ ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఇప్పటికే విన్‌ఫాస్ట్ పెట్టుబడులు500 మిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో తమిళనాడులో ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంటును నిర్మిస్తున్న వియత్నాంకు చెందిన విన్ ఫాస్ట్, ముందుగా కంపెనీలు చేస్తున్న ఖర్చులకు కూడా ప్రోత్సాహకాలు అందించాలని కోరుతోంది. ఈ రెండు కంపెనీలే కాకుండా ఇతర కంపెనీల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని పాలసీ మార్గదర్శకాలను సవరించడానికి ప్రభుత్వం యోచిస్తుందేమో చూడాల్సి ఉంది. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్ అండ్ డీ), ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఈ పథకంలో చేర్చాలని కొన్ని వర్గాలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: గోవాలో హై డిమాండ్ వేటికంటే..గతంలో మస్క్ పర్యటన రద్దు2024లో మస్క్ ఇండియా పర్యటన కొన్ని కారణాల వల్ల రద్దు అయింది. అప్పటి నుంచి భారత్‌లో కంపెనీ పెట్టుబడి ప్రణాళికలు ప్రశ్నార్థకంగా మారాయి. తాజా పరిణామాల వల్ల ఈమేరకు తిరిగి చర్చసాగే అవకాశం ఉంటుదేమోనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో రాబోయే ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు. దాంతో త్వరలో జరగబోయే ఈ సంప్రదింపులకు ప్రాముఖ్యత సంతరించుకుంది. టెస్లా, హ్యుందాయ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, కియా, టయోటాతో సహా టాటా మోటార్స్, మహీంద్రా, హీరో మోటోకార్ప్ వంటి భారతీయ కంపెనీలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. -
సోరోస్‌కు మెడల్ హాస్యాస్పదం: మస్క్
వాషింగ్టన్ : బిలియనీర్ జార్జ్ సోరోస్‌కు అమెరికా అత్యున్నత పురస్కారాన్ని అందించడాన్ని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తప్పుబట్టారు. వివాదాస్పద నేపథ్యమున్న వ్యక్తికి అధ్యక్షుడు బైడెన్ మెడల్ ఆఫ్ ఫ్రీడం ప్రదానం చేయడం హాస్యాస్పదమన్నారు. నిక్కీ హేలీ, సెనేటర్ టిమ్ షీహీ సహా పలువురు రిపబ్లికన్ నేతలు ఈ నిర్ణయంపై మండిపడ్డారు. ప్రధాని మోదీని జార్జ్ సోరోస్ ఇటీవల బహిరంగంగా విమర్శించడం తెలిసిందే. ఆయనతో పాటు 19 మందికి అమెరికా అత్యున్నత పురస్కారమైన మెడల్ ఆఫ్ ఫ్రీడంను బైడెన్ ప్రదానం చేశారు. మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ, ఫుట్‌బాల్ స్టార్ లయొనెల్ మెస్సీ, నటుడు డెంజల్ వాషింగ్టన్ తదితరులు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. అవార్డు తీసుకునేందుకు వేదికనెక్కిన హిల్లరీకి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. సోరోస్ తరపున ఆయన కుమారుడు అవార్డును స్వీకరించారు. ఈ గౌరవం తననెంతగానో కదిలించిందని సోరోస్ ఒక ప్రకటనలో తెలిపారు. వలసదారునైన తనకు అమెరికాలో స్వేచ్ఛ లభించిందన్నారు. -
మస్క్ మంచి మనసు.. భారీ విరాళం
ప్రపంచ కుబేరుడు, టెస్లా చీప్ ఎగ్జిక్యూటివ్ 'ఇలాన్ మస్క్' (Elon Musk) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. కొత్త ఏడాది ప్రారంభం కావడానికి ముందే భారీ విరాళం అందించినట్లు సమాచారం.టెస్లా బాస్ ఇటీవల వివిధ ఛారిటీలకు 2,68,000 టెస్లా షేర్ల (Tesla Shares)ను విరాళంగా ఇచ్చారు. వీటి విలువ 108 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 926 కోట్ల కంటే ఎక్కువ). టెస్లాలో దాదాపు 12.8 శాతం వాటా కలిగిన మస్క్.. తన షేర్లను దానం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022 నుంచి భారీ మొత్తంలో విరాళాలను అందిస్తూనే ఉన్నారు.వందల కోట్లు విరాళంగా ఇచ్చిన 'మస్క్' మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే మస్క్ ఏ ఛారిటీలకు విరాళం ఇచ్చారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 2021లో కూడా ఈయన మస్క్ ఫౌండేషన్ (Musk Foundation)కు సుమారు 5.74 బిలియన్ డాలర్ల విరాళం అందించారు.పలు ఛారిటీలకు లెక్కకు మించిన డబ్బు విరాళంగా ఇవ్వడమే కాకుండా.. మానవాళికి ప్రయోజనం చేకూరేలా, దానికి తగిన కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేయడానికి కూడా భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.మస్క్ సంపదబ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల తరువాత ఈయన సంపద గణనీయంగా పెరిగింది. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ స్పేస్ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం.2022 వరకు మస్క్ నికర విలువ 200 డాలర్ల కంటే తక్కువ ఉండేది. అయితే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తరువాత.. ఈయన సంపాదన భారీగా పెరిగింది. తాజాగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది. మొత్తం మీద 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33.20 లక్షల కోట్లు) నికర విలువను అధిగమించిన మొదటి వ్యక్తిగా ఇలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. -
అమెరికాలో దాడులు.. ట్రెండింగ్‌లో ఆ కంపెనీ
కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అమెరికాలో జరిగిన వరుస ప్రమాదాలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. న్యూ ఆర్లీన్స్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ట్రక్కు దాడి.. లాస్ వెగాస్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. కాబోయే అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump)కు చెందిన హోటల్ వద్ద టెస్లా కారులో పేలుడు సంభవించింది. ఈ రెండు ఘటనల్లో పలువురు మృతి చెందారు.లాస్ వెగాస్‌లోని టెస్లా సైబర్‌ట్రక్ పేలుడు.. న్యూ ఓర్లీన్స్ ట్రక్ దాడికి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు ప్రమాదాలు ఒకే రోజు సంభవించాయి. అంతే కాకుండా ఈ రెండు వాహనాలను 'టూరో' (Turo) నుంచి అద్దెకు తీసుకున్నారు.న్యూ ఓర్లీన్స్లో జరిగిన సంఘటన తర్వాత, అనుమానితుడు 'షంసుద్ దిన్ జబ్బార్' కారును ఎలా స్వాధీనం చేసుకున్నాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఎఫ్‌బీఐ తెలిపింది. దాడి చేసిన ఈవీ పికప్ ట్రక్కులో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ జెండా కనిపించిందని ఎఫ్‌బీఐ వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే.. అనుమానితునికి ఐఎస్ఐఎస్ మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు పుడుతున్నాయి.లాస్ వెగాస్‌లోని ట్రంప్ హోటల్ వెలుపల టెస్లా సైబర్‌ట్రక్ పేలుడులో అనుమానితుడుగా 37 ఏళ్ల 'మాథ్యూ లైవెల్స్బెర్గర్'గా గుర్తించినట్లు యుఎస్ మీడియా నివేదికలు తెలిపాయి. అధికారులు ఈ సంఘటనను ఉగ్రవాద దాడిగా దర్యాప్తు చేస్తున్నారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. షంసుద్ దిన్ జబ్బార్ 2010 వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేసిన ఆర్మీ వ్యక్తి. మాథ్యూ లైవెల్స్బెర్గర్ కూడా యుఎస్ ఆర్మీ వెటరన్. అంటే వీరిరువురూ.. ఆర్మీలో పనిచేసినవారే. ఆర్మీలో పనిచేసిన వారు ఈ దాడులకు పాల్పడ్డారా? దీని వెనుక ఉన్న కారణం ఏమిటనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.టూరో కంపెనీ గురించిటూరో అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కార్ రెంటల్ యాప్. దీనిని శాన్ ఫ్రాన్సిస్కోలో 2010లో స్థాపించారు. 2010లో రిలే రైడ్స్గా ప్రారంభమై.. 2015లో టురోగా మారింది. ఇది వినియోగదారులు కలవకుండానే వారికి నేరుగా కార్లను అద్దెకు తీసుకునేందుకు అనుమతిస్తుంది.ఎలా అంటే.. వినియోగదారులు తమ లొకేషన్‌ను ఎంటర్ చేసిన తర్వాత సమీపంలో అందుబాటులో ఉన్న అద్దె కార్లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. టయోట, పోర్షెస్, టెస్లాస్తో సహా అనేక రకాల కార్లు టూరోలో అద్దెకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కారును అద్దెకు తీసుకోవాలంటే.. 18 సంవత్సరాలు నిండి, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. కాబట్టి కార్లను బుక్ చేసుకున్న వారిగురించి తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హెచ్1బీ వీసాల రక్షణ కోసం యుద్ధానికైనా సిద్ధమే
వాషింగ్టన్: టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ హెచ్–1బీ వీసాలకు మద్దతుగా నిలిచారు. ఈ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు. హెచ్–1బీ వీసాల విషయంలో ఇటీవల విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొందరు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు మద్దతిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎలాన్ మస్క్ శనివారం స్పందించారు. నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసుకొనేందుకు అవకాశం కల్పించే హెచ్–1బీ వీసాల విషయంలో అభిప్రాయం మార్చుకోవాలని వాటి వ్యతిరేకులకు సూచించారు. ‘‘నాతోపాటు ఎంతోమంది అమెరికాకు రావడానికి, స్పేస్ఎక్స్, టెస్టా వంటి సంస్థలు స్థాపించడానికి కారణం హెచ్–1బీ వీసాలే. ఈ వీసాలతోనే మేము ఇక్కడికొచ్చి పనిచేశాం. అవకాశాలు అందుకున్నాం. హెచ్–1బీ వీసాలతోనే అమెరికా బలమైన దేశంగా మారింది. ఇలాంటి వీసాలను వ్యతిరేకించడం మూర్ఖుపు చర్య. దాన్ని నేను ఖండిస్తున్నా. ఈ వీసాలు ఉండాల్సిందే. ఈ విషయంలో అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నా’’అని మస్క్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్నా డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి వలసలు తగ్గిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశీయులకు వీసాలు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నట్లు ఇప్పటికే ఆయన సంకేతాలిచ్చారు. ట్రంప్క అత్యంత సన్నిహితుడైన ఎలాన్ మస్క్ హెచ్–1బీ వీసాలకు మద్దతుగా గొంతు విప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. కృత్రిమ మేధపై వైట్‌హౌస్ సీనియర్ పాలసీ సలహాదారుడిగా భారత అమెరికన్ వెంచర్క్యాలిటలిస్టు శ్రీరామ్ కృష్ణన్‌ను ట్రంప్ ఇటీవల నియమించారు. నిపుణులైన వలసదార్ల కోసం గ్రీన్‌కార్డులపై పరిమితి తొలగించాలని కృష్ణన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని రిపబ్లికన్ నేతలు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై రగడ మొదలైంది. -
మనిషిలా తడబడిన రోబో - వీడియో వైరల్
రజినీకాంత్ నటించిన రోబో సినిమా చూసినప్పటి నుంచి.. చాలా మందికి రోబోలు మనిషిలాగే ప్రవర్తిస్తాయా? అనే అనుమానం వచ్చింది. అయితే రోబోలు మనుషులను మించిపోయే రోజులు భవిష్యత్తులో రానున్నట్లు, కొన్ని పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. మనిషిలా నడిచే ఒక రోబో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) సారథ్యంలో టెస్లా.. కార్లను మాత్రమే కాకుండా.. రోబోలను కూడా రూపొందిస్తోంది. ఇలాంటి రోబోలు మనిషి మాదిరిగానే నడుస్తున్నాయి. వీడియోలో గమనిస్తే.. ఒక రోబో ఏటవాలుగా ఉన్న ప్రదేశాన్ని దిగుతూ.. కొంత తడబడింది. అంతలోనే కంట్రోల్ చేసుకుని కిందకి పడిపోకుండా.. మెల్లగా దిగడం చూడవచ్చు.ఏటవాలుగా ఉన్న ప్రదేశాన్ని నెమ్మదిగా దిగటమే కాకుండా.. ఎత్తుగా ఉన్న ప్రాంతాన్ని కూడా రోబో ఎక్కడం కూడా చూడవచ్చు. ఇదంతా చూస్తుంటే.. రోబోలు మనుషుల్లా ప్రవర్తించే రోజులు వచేస్తున్నాయని స్పష్టంగా అవగతమవుతోంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tesla (@teslamotors) -
భారత్‌కు టెస్లా.. ఢిల్లీలో షోరూం కోసం అన్వేషణ!
ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్‌లో ఉనికిని నెలకొల్పడానికి ప్రయత్నాలను పునఃప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీలో షోరూమ్ స్థలం కోసం ఎంపికలను అన్వేషిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో తన పెట్టుబడి ప్రణాళికలకు బ్రేక్ ఇచ్చిన టెస్లా మళ్లీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది.భారత్‌లోకి ప్రవేశించే ప్రణాళికలను టెస్లా గతంలో విరమించుకుంది. గత ఏప్రిల్‌లో మస్క్ పర్యటించాల్సి ఉండగా అది రద్దయింది. ఆ పర్యటనలో ఆయన 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటిస్తారని భావించారు. అదే సమయంలో అమ్మకాలు మందగించడంతో టెస్లా తన శ్రామిక శక్తిని 10 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించింది.రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. టెస్లా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో షోరూమ్, ఆపరేషనల్ స్పేస్ కోసం దేశంలో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ అయిన డీఎల్ఎఫ్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సంస్థ దక్షిణ ఢిల్లీలోని డీఎల్ఎఫ్ అవెన్యూ మాల్, గురుగ్రామ్‌లోని సైబర్ హబ్‌తో సహా పలు ప్రదేశాలను అన్వేషిస్తోంది.వాహన డెలివరీలు, సర్వీసింగ్ సదుపాయంతో పాటు కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు కోసం 3,000 నుండి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కోసం టెస్లా చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికీ ఏదీ ఖరారు కాలేదని, ఇందు కోసం కంపెనీ ఇతర డెవలపర్లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.భారత్‌లోకి టెస్లా ప్రవేశం సవాళ్లతో నిండి ఉంది. ముఖ్యంగా దిగుమతి సుంకాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెస్లా.. 100 శాతం వరకు ఉన్న అధిక పన్ను రేటుతో దిగుమతులను కొనసాగిస్తుందా లేదా నిర్దిష్ట ఈవీ దిగుమతులపై 15 శాతం తగ్గింపు సుంకాలను అనుమతించే ప్రభుత్వ కొత్త విధానాలను ఉపయోగించుకుంటుందా అనేది అస్పష్టంగా ఉంది. -
చర్చల దశలోనే టెస్లా, స్టార్‌లింక్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికన్ టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా, స్టార్‌లింక్ పెట్టుబడులకు సంబంధించి ఇంకా ఎటువంటి చర్చ జరగలేదని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు అంశాలూ వేర్వేరు మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నందున, ఏమి జరుగుతుందో తనకు వ్యక్తిగతంగా తెలియదని అన్నారు. ‘‘నాకు తెలిసినంత వరకు మేము ఎటువంటి చర్చలు జరపలేదు‘అని టెస్లా– స్టార్‌లింక్ పెట్టుబడుల అవకాశాలపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ ఈ రెండు విభాగాలూ వేర్వేరు మంత్రిత్వ శాఖలు నిర్వహణలో ఉన్నాయి. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆటోమొబైల్స్‌ను చూస్తుంది. స్టార్‌లింక్ అంశాలను అంతరిక్ష శాఖ నిర్వహిస్తుంది. కాబట్టి, ఏమి జరుగుతుందో నాకు వ్యక్తిగత పరిజ్ఞానం లేదు’’ అని వాణిజ్యమంత్రి స్పష్టం చేశారు. నేపథ్యం ఇదీ... ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్ చివరి క్షణంలో తన భారత్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ‘టెస్లాలో కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన తక్షణ అవసరం ఉందంటూ పర్యటనకు కారణంగా చెప్పారు. నిజానికి ఈ సమావేశంలో ఆయన ప్రధాని నరేంద్రమెదీతో సమావేశం కావాల్సి ఉంది. భారత్‌లో టెస్లా తయారీ యూనిట్‌ను స్థాపించడానికి ప్రణాళికలు, బిలియన్ల డాలర్ల పెట్టుబడులపై చర్చలు, భారతదేశంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడంపై విధాన ప్రకటన వంటి అంశాలు మస్క్ పర్యటనలో భాగమని అప్పట్లో వార్తలు వచ్చాయి. కేవలం ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా, ఆయన తన శాటిలైట్ ఇంటర్నెట్ వ్యాపారం స్టార్‌లింక్ కోసం భారతీయ మార్కెట్‌పై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. స్టార్‌లింక్ భారతదేశంలో సేవలకు లైసెన్స్ పొందడానికి అన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ నెల ప్రారంభంలో తెలిపారు. శాటిలైట్ ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్ సేవల ప్రారంభానికి తగిన అన్ని అనుమతులనూ పొందే ప్రక్రియలో ఉందని, వారు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత లైసెన్స్ పొందుతారని మంత్రి చెప్పారు. అంతేకాకుండా ఈ ఏడాది మార్చిలో విద్యుత్–వాహన విధానాన్ని ప్రభుత్వం ఆమోదించింది. కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో భారతదేశంలో తయారీ యూనిట్లను స్థాపించే కంపెనీలకు దిగుమతి సుంకం రాయితీలను అందించాలన్నది ఈ విధానంలో కీలక అంశం. టెస్లా వంటి ప్రధాన ప్రపంచ సంస్థలను ఆకర్షించే లక్ష్యంతో ఈ చర్య తీసుకోవడం జరిగింది. ఈవీ ప్యాసింజర్ కార్ల తయారీ విభాగాలను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 అమెరికా డాలర్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలపై 15 శాతం తక్కువ కస్టమ్స్/ దిగుమతి సుంకంతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకోవడానికీ పాలసీ అనుమతించింది. ప్రభుత్వం ఆమోద పత్రం జారీ చేసిన తేదీ నుండి ఐదు సంవత్సరాల వ్యవధిలో ఉంటాయని పాలసీ వివరించింది. ట్రంప్ ’భారత్ స్నేహితుడే’ సంబంధాల్లో ఎలాంటి సమస్య లేదు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు మిత్రుడని, భారత్–అమెరికా మధ్య స్నేహం చిగురించి మరింతగా వృద్ధి చెందుతుందని గోయల్ అన్నారు. భారత్–అమెరికా భాగస్వామ్యంలో ఎలాంటి సమస్యలను తాను ఊహించడం లేదని పేర్కొన్న ఆయన, వాషింగ్టన్లో కొత్త పరిపాలనలో అమెరికాతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో వివిధ కార్యక్రమాలు సంస్కరణలపై మీడియాతో మాట్లాడుతూ, టెస్లా– స్టార్‌లింక్ పెట్టుబడి ప్రణాళికలు, ల్యాప్‌టాప్ దిగుమతి విధానం, యూరోపియన్ యూనియన్ ‘ఏకపక్ష‘ గ్రీన్ ఎకానమీ నిబంధనల వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, భారత్‌సహా అన్ని ప్రధాన దేశాలలో విదేశీ ఉత్పత్తులపై అత్యధిక సుంకాలను విధిస్తున్నాయని విమర్శించారు. అధికారంలోకి వస్తే, పరస్పర పన్నును ప్రవేశపెడతానని తెలిపారు. కాగా, నేడు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడైన ప్రధాని మోదీ భారతదేశ అంతర్జాతీయ సంబంధాలను గతంలో కంటే మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు గోయల్ ఈ సందర్బంగా అన్నారు. మోదీ నేతృత్వంలో అమెరికాతో భారతదేశ సంబంధాలు ప్రతి సంవత్సరం మెరుగవుతున్నాయని అన్నారు. ల్యాప్‌టాప్ దిగుమతి విధానంపై కొత్త మార్గదర్శకాలు భారత్ ల్యాప్‌టాప్ దిగుమతి విధానంపై కొత్త మార్గదర్శకాలు ఎల్రక్టానిక్స్ –ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో ఇంకా చర్చల దశలో ఉన్నాయని వాణిజ్య మంత్రి తెలిపారు. 300 చట్టాలు డీక్రిమినలైజ్.. 300కుపైగా చట్టాలను డీక్రిమనలైజ్ (నేరపూరిత చర్యల జాబితా నుంచి బయటకు) చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. వినియోగించుకోకపోతే.. సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ మూత సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌ను ఉపయోగించాలని, లేకుంటే ఈ పథకాన్ని మూసివేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి పియుష్ గోయల్ మరో కార్యక్రమంలో పరిశ్రమకు స్పష్టం చేశారు.నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్ఎస్డబ్ల్యూఎస్) అనేది వ్యాపార అవసరాలకు అనుగుణంగా దరఖాస్తులు, ఆమోదాలకు పరిశ్రమ వినియోగించుకునే విధంగా అభివృద్ధి చేసిన ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్. 32 కేంద్ర శాఖలు, 29 రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతుల కోసం తగిన అప్లికేషన్ సేవలను అందిస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై డీపీఐఐటీ–సీఐఐ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ‘‘ఎన్ఎస్డబ్ల్యూఎస్ అవసరమా? లేదా అనే అంశంపై ఎంపిక ఇప్పుడు మీ (పరిశ్రమ) వద్ద ఉంది. మీకు దానిపై ఆసక్తి లేదని మీరు భావిస్తే... సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌ను మూసివేయడానికి వెనకాడబోము. కేంద్రం దాని కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది’’ అని అన్నారు. ఎన్ఎస్డబ్ల్యూఎస్ పరిపూర్ణంగా ఉండకపోవచ్చని, అయితే దానిని మెరుగుపరచడానికి పరిశ్రమ నుండి వచ్చే సూచనలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మంత్రి తెలిపారు. జన్ విశ్వాస్ 2.0 బిల్లు గురించి మాట్లాడుతూ, పరిశ్రమకు రెట్రాస్పెక్టివ్ ప్రయోజనాలను (గతానికి వర్తించే విధంగా) అందించడానికి ప్రభుత్వం ప్రయతి్నస్తుందని చెప్పారు. భారత్‌లో వ్యాపారాలకు సంబంధించి ఎప్పటి కప్పుడు తగిన సూచనలు, సలహాలు చేయడానికి, ఆయా విభాగాల్లో మరింత మెరుగుదలకు సూచనలు, సలహాలు పొందానికి సీఐఐ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)– రెగ్యులేటరీ అఫైర్స్ పోర్టల్‌ను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. -
ట్రంప్ గెలుపుతో మస్క్ పంట పండింది!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో టెస్లా అధినేత ఇలాన్ మస్క్‌కు సిరుల పంట పండుతోంది. ట్రంప్ విజయం తర్వాత టెస్లా స్టాక్ ఏకంగా 40 శాతం పెరిగింది. దాంతో మస్క్ సంపద ఏకంగా 70 బిలియన్ డాలర్లు(రూ.5.8 లక్షల కోట్లు) పెరిగి నికరంగా సుమారు 340 బిలియన్ అమెరికన్ డాలర్ల(రూ.28 లక్షల కోట్లు) మార్కును దాటినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.యూఎస్ ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌నకు మస్క్ మద్దతిచ్చారు. దాంతోపాటు ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ పార్టీకి మస్క్ భారీగానే విరాళాలు అందించారని కొన్ని సంస్థలు వెల్లడించాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇలాన్ మస్క్‌కు సముచిత స్థానాన్ని కల్పిస్తానని చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక అనుకున్న విధంగానే ట్రంప్ కార్యవర్గంలో మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా మస్క్, వివేక్ రామస్వామిలను నియమించారు.ఇదీ చదవండి: ‘ఆరోగ్య నిధి’ ప్రాధాన్యం తెలుసా?డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండబట్టే మస్క్ సంపద అధికమవుతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ భవిష్యత్తులో తీసుకోబోయే కార్పొరేట్ నిర్ణయాల వల్ల మాస్క్‌కు లాభం చేకూరుతుందని, దాంతో కంపెనీకి మేలు కలుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా మస్క్ కంపెనీల్లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. దాంతో ఆయన సంపద పెరుగుతోంది. -
మస్క్ ‘ఫోరమ్ షాపింగ్’! ట్రంప్‌తో దోస్తీ ఇందుకేనా..?
ఇలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విటర్)కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరించుకోనున్నారు. ఇలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి సంస్థపై న్యాయపరంగా కొన్ని కంపెనీలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఎక్స్ నిబంధనలకు తగ్గట్లు వ్యవహరించడంలేదని అందులో పేర్కొన్నారు. వాటిని త్వరలో పరిష్కరించుకోనున్నట్లు మస్క్ నిర్ణయం తీసుకున్నారని వాషింగ్టన్పోస్ట్ తెలిపింది.సమస్యలేంటి..ఎక్స్‌లో వెలువరించే యాడ్స్‌కు సంబంధించి సంస్థ యాజమాన్యం వెండర్లకు సరైన విధంగా రెవెన్యూలో షేర్ ఇవ్వడంలేదని కొన్ని కంపెనీలు గతంలో ఫిర్యాదు చేశాయి.కార్పొరేట్ యాడ్ తర్వాత వెంటనే వీక్షకులకు కాంట్రవర్సీ యాడ్ కనిపించేలా ఎక్స్‌లో ఆల్గారిథమ్ను క్రియేట్ చేశారని కొన్ని సంస్థలు గతంలో కోర్టును ఆశ్రయించాయి.ఎక్స్ యాజమాన్యం లేఆఫ్స్ ప్రకటించిన దాదాపు 2,200 మంది మాజీ ఉద్యోగుల నుంచి ఆర్బిట్రేషన్ కేసు ఎదుర్కొంటోంది. వీటితోపాటు మరిన్ని న్యాయపరమైన వ్యాజ్యాలు కంపెనీపై దాఖలయ్యాయి.నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లో వ్యాజ్యాలుకంపెనీపై నమోదైన వ్యాజ్యాలను పరిష్కరించుకునేందుకు నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లో కౌంటర్ వ్యాజ్యాలను దాఖలు చేయాలని మస్క్ నిర్ణయించుకున్నారు. ఈ వ్యవహారాన్ని నిపుణులు ‘ఫోరమ్ షాపింగ్’(అనుకూలమైన తీర్పులు పొందడం)గా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకునేందుకు తమ ప్రధాన కార్యాలయానికి అనుసంధానించబడిన జిల్లా కోర్టును ఎంచుకుంటాయి. కానీ ఎక్స్ మాత్రం ట్రంప్‌నకు స్పష్టమైన మెజారిటీ వచ్చాక టెక్సాస్‌లోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో రిపబ్లికన్ పార్టీ నియమించిన న్యాయమూర్తులు అధికంగా ఉన్నారనే వాదనలున్నాయి. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌నకు మస్క్ మద్దతిచ్చారు.ఇదీ చదవండి: పన్ను ఎగవేత.. పలు రకాలు.. వీటి జోలికి పోవద్దుఎక్స్ను రక్షించే వ్యూహంమస్క్ నిర్ణయం ఎక్స్‌ను రక్షించే వ్యూహంగా నిపుణులు భావిస్తున్నారు. నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లోని 11 మంది న్యాయమూర్తుల్లో 10 మందిని రిపబ్లికన్ అధ్యక్షులు నియమించారని జార్జ్‌టౌన్ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ స్టీవ్ వ్లాడెక్ తెలిపారు. ఇది మస్క్‌కు అనుకూలంగా తీర్పులను మార్చగలదని అభిప్రాయపడుతున్నారు. -
ట్రంప్‌నకు మద్దతు.. మస్క్ కంపెనీలు ఎంత పెరిగాయంటే..
ప్రముఖ పారిశ్రామికవేత్త ఇలాన్‌మస్క్ తన విజయానికి ఎంతో కృషి చేసినట్లు స్వయంగా డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ట్రంప్ గెలుపు ఖాయం అని నిర్ధారించుకున్న మార్కెట్లు గడిచిన రెండు సెషన్ల నుంచి భారీగా పెరుగుతున్నాయి. అనుకున్న విధంగానే ఆయన గెలుపు ఖరారైంది. దాంతో మస్క్ ఆధ్వర్యంలోని కంపెనీల స్టాక్ విలువ భారీగా పెరుగుతోంది. గడిచిన రెండు సెషన్‌ల్లో దాదాపు రూ.రెండు లక్షల కోట్లు మేర వీటి విలువ పెరిగినట్లు మార్కెట్ అంచనా వేస్తుంది.ప్రభుత్వ ఏజెన్సీల సడలింపులుమస్క్ కంపెనీల్లోకెల్లా ముఖ్యంగా టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ సంస్థలపై ప్రభుత్వ నిబంధనల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌తో మస్క్‌కు ఉన్న సంబంధాలు ఉపయోగించుకొని ఆయా కంపెనీలు లబ్ధి పొందే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీలపై ప్రభుత్వ ఏజెన్సీల నిబంధనల సడలింపులు, ఒత్తిడిని తగ్గించుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఎన్నిక ముగిసింది.. పరుగు ఆగింది! బంగారం ధర యూటర్న్మస్క్ ఆధ్వర్యంలోని కంపెనీలు ఇవే..టెస్లాస్పేస్ఎక్స్న్యూరాలింక్ది బోరింగ్ కంపెనీఎక్స్ కార్పొరేషన్జిప్ 2పేపాల్స్టార్లింక్ఎక్స్ ఏఐ -
300 అప్లికేషన్స్.. 500 ఈమెయిల్స్: కట్ చేస్తే టెస్లాలో జాబ్
చదువుకునే చాలామంది అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటారు. అది బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ప్రయత్నిస్తే తప్పకుండా సాధ్యమవుతుందంటున్నాడు.. పూణేకు చెందిన ఓ యువకుడు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.పూణేకు చెందిన 'ధృవ్ లోయ' అమెరికాలో ఉద్యోగం కోసం ఐదు నెలలు శ్రమించాడు. జాబ్ కోసం 300 అప్లికేషన్స్, 500 కంటే ఎక్కువ ఈమెయిల్స్ పంపినట్లు వెల్లడించారు. ఇది మాత్రమే కాకుండా తాను 10 ఇంటర్వ్యూలకు కూడా హాజరైనట్లు పేర్కొన్నాడు. చివరకు ఆటోమొబైల్ దిగ్గజం టెస్లాలో టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్‌గా ఉద్యోగం సంపాదించాడు.ఉద్యోగం సాధించిన తరువాత.. జాబ్ కోసం ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. ఇందులో తాను ఉద్యోగం సాధించడానికి చాలా కష్టపడినట్లు పేర్కొన్నాడు. మూడు ఇంటర్న్‌షిప్‌లు పొందినా, మంచి జీపీఏ ఉన్నప్పటికీ.. జాబ్ తెచ్చుకోవడానికి ఐదు నెలల సమయం పట్టిందని చెప్పాడు.ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌పై మండిపడ్డ యూజర్: ఇంత అన్యాయమా అంటూ..వీసా గడువు పూర్తయిపోతుందేమో అన్న భయం.. ఉద్యోగం లేకుండానే అమెరికా విడిచి వెళ్లిపోవాల్సి వస్తుందేమో అనేలా చేసింది. అయినా ప్రయత్నం ఆపకుండా.. అమెరికాలో ప్రతి డాలర్‌ను జాగ్రత్తగా వినియోగించాను. మిత్రుల అపార్ట్మెంట్లలో ఉండాల్సి వచ్చింది. ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని టెస్లా కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాను. నాకు మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు అని పేర్కొన్నాడు. -
రూ.295 కోట్లతో ఇల్లు కొన్న మస్క్
టెక్సాస్: ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ భారీ ఇంటి సముదా యాన్ని కొనేశారు. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని అస్టిన్ నగరంలో రూ.295 కోట్ల (35 మిలియన్ డాలర్లు)తో ఆయన ఈ కాంపౌండ్ కొన్నారు. దీని విస్తీర్ణం 14,400 చదరపు అడుగులు. ఇందులో ఇటాలియన్ టస్కన్ విల్లాను పోలిన గృహం, ఆరు పడక గదుల ఇల్లు ఉన్నాయి. తన 11 మంది పిల్లలు, వారి తల్లులు ఉండేందుకు ఈ కాంపౌండ్‌ను మస్క్ కొనుగోలు చేశారు. తన పిల్లలతో తగినంత సమయం గడపడానికి ఈ భవన సముదాయం అనుకూలంగా ఉంటుందని నిర్ణయించానని, అందుకే కొనేశాని మస్క్ చెప్పారు. ఎలాన్ మస్క్‌కు మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఐదుగురు సంతానం ఉన్నారు. అనంతరం గాయకురాలు గ్రిమ్స్‌ను మస్క్ పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలాగే శివోన్ జిలీస్తో మస్క్‌కు మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. తన స్థిరాస్తులన్నీ అమ్మేశానని, తనకు సొంత ఇల్లు లేదని 2020లో మస్క్ ప్రకటించారు. మరోవైపు 11 మంది పిల్లలకు జన్మనివ్వ డాన్ని ఆయన పలు సందర్భాల్లో సమర్థించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గిపోతోందని, అందుకే జననాల సంఖ్య పెంచాలని చెప్పారు. -
ప్రాణం తీసిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్.. నలుగురు భారతీయులు దుర్మరణం
ఒట్టావా : టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు నలుగురు ప్రాణాలు తీసింది. కెనడా టొరంటో నగరం లేక్ షోర్ బౌలేవార్డ్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృత్యువాత పడ్డారు. ఓ యువతి ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్‌లోని గోద్రా చెందిన ఒకే కుటుంబసభ్యులు కేట్ గోహిల్,నీల్ గోహిల్‌తో పాటు వారి స్నేహితులు ఆ కారులో ఉన్నట్లు కెనడా స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక పోలీసుల సమాచారం మేరకు..టొరంటో నగరంలో బుధవారం అర్ధరాత్రి 12:15 గంటల సమయంలో లేక్ షోర్ బౌలేవార్డ్ రహదారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారులో అతి వేగతంతో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో టెస్లా కారు బ్యాటరీలో లోపాలు తలెత్తాయి. కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గార్డ్ రైల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో టెస్లా కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కారులో ఉన్న యువతి యువకులు మంటల్లో చిక్కుకున్నారు.సరిగ్గా ప్రమాదం జరిగి వెంటనే ఆటుగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు టెస్లా కారు అద్దాలు పగులగొట్టి బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. కారు లోపల ఉన్న ఓ యువతిని బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం.టెస్లా కారు ప్రమాదంపై స్థానికుడు ఫోర్‌మెన్ బారో మాట్లాడుతూ..ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది ప్రవహిస్తుంది. ఆ నదికి ఎదురుగా మేం ఉన్నాం. కారు నుంచి 20 నుంచి 20 అడుగుల పైకి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో వెంటనే బాధితుల్ని రక్షించేందుకు ప్రయత్నించాం. అప్పటికే ఘోరం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద ఘటనపై భారత్‌లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని తెలిపారు. -
అంబానీకి కాల్ చేస్తాను: మస్క్
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ముఖేశ్ అంబానీకి ఏదైనా అభ్యంతరం ఉందేమో అడగాలని ఇలొన్‌మస్క్ అన్నారు. దేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపుపై ముఖేశ్ అంబానీ, ఇలొన్‌మస్క్ పరస్పరం విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల వైరల్‌గా మారిన ఓ మీమ్‌కు సంబంధించి ఇలొన్‌మస్క్ స్పందించారు.ఎక్స్‌లో డోజీ డిజైనర్ అనే హ్యాండిల్ నుంచి వచ్చిన మీమ్‌కు మస్క్ రిప్లై ఇచ్చారు. బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపు విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ‘భారత్‌లో అత్యధిక ధనవంతుడిగా ఉన్న ముఖేశ్ అంబానీకి ఇలొన్‌మస్క్ అంటే ఎందుకంత భయం? మస్క్ స్టార్‌లింక్ ముఖేశ్ వ్యాపార సామ్రాజ్యానికి ప్రతిబంధకంగా మారుతుందా?’ అని మీమ్‌ను పోస్ట్ చేశారు. దీనిపై మస్క్ రిప్లై ఇస్తూ ‘భారత్‌లో ప్రజలకు ఇంటర్నెట్ సేవలందించేందుకు స్టార్‌లింక్ వల్ల ఏదైనా సమస్య ఉందేమో అంబానీకి కాల్ చేసి అడుగుతాను’ అని అన్నారు.Why is Indian billionaire Mukesh Ambani afraid of Elon Musk? Is he worried about Starlink's entry into India disrupting his telecom empire? pic.twitter.com/GJiXztmJDg— DogeDesigner (@cb_doge) October 14, 2024ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుశాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలని ముఖేశ్ అంబానీ అభిప్రాయ పడుతున్నారు. కానీ నేరుగా స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపితే సరిపోతుందని మస్క్ అన్నారు. కొంతకాలంగా దీనిపై వివిధ మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందిస్తూ వేలం ప్రక్రియ ప్రపంచంలోని వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానానికి విరుద్ధమన్నారు. దాంతో నేరుగా స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తామనే సంకేతాలు ఇచ్చారు. ఎయిర్టెల్ అధికారులు కూడా మస్క్ అభిప్రాయాలకు మద్దతు పలికారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. భారత్‌లో హై-స్పీడ్ ఇంటర్నెట్ కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను విస్తరించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. -
మస్క్ ఆవిష్కరణలు.. 2006 నుంచి 2024 వరకు (ఫోటోలు)
-
మరో సంచలనానికి తెరతీసిన ఎలాన్ మస్క్
-
టెస్లా .. రోబోట్యాక్సీ..
లాస్ ఏంజెలిస్: వాహనప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోబోట్యాక్సీ ’సైబర్‌క్యాబ్’ను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ఆవిష్కరించారు. అటానామస్ వాహనంగా ఉండే రోబోట్యాక్సీలో స్టీరింగ్ వీల్, పెడల్స్ ఉండవు. ఇద్దరు ప్రయాణికులు మాత్రమే పట్టేంత క్యాబిన్ ఉంటుంది. స్వయంచాలిత వాహనాలు మనుషులు నడిపే వాహనాల కన్నా 10–20 రెట్లు సురక్షితంగా ఉంటాయని, సిటీ బస్సులతో పోలిస్తే వీటిలో ప్రయాణ వ్యయాలు కూడా చాలా తక్కువేనని మస్క్ చెప్పారు. సైబర్‌క్యాబ్ ఉత్పత్తి 2026లో ప్రారంభమవుతుందని, ధర 30,000 డాలర్ల లోపే ఉంటుందని మస్క్ తెలిపారు. అలాగే 20 మంది పట్టే రోబోవ్యాన్ను కూడా మస్క్ ప్రవేశపెట్టారు. అటు వివిధ పనులు చేసి పెట్టే ఆప్టిమస్ రోబోను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు మస్క్ చెప్పారు. దీని ధర 20,000–30,000 డాలర్ల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు. అటానామస్ వాహనాలు ప్రమాదాలకు దారి తీస్తున్న ఉదంతాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో టెస్లా స్వయంచాలిత వాహనాలకు అనుమతులపై సందేహాలు నెలకొన్నాయి. -
కదిలి వచ్చిన రోబోల దండు..!
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా సీఈఓ ఇలొన్‌మస్క్ గతంలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఇటీవల జరిగిన ‘వి రోబోట్’ ఈవెంట్లో కృత్రిమమేధ సాయంతో పనిచేసే ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్‌లతోపాటు ఆప్టిమస్ రోబోలను పరిచయం చేశారు.టెస్లా సీఈఓ ఇలొన్ మస్క్ గతంలో ఏజీఎంలో చెప్పిన విధంగానే కంపెనీ భవిష్యత్తు కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఏఐలో విప్లవాత్మక మార్పు రాబోతుందని, భవిష్యత్తు అంతా ఏఐదేనని మస్క్ చెప్పారు. అందుకు అనుగుణంగా కంపెనీ ఏఐ ఉత్పత్తులను తయారు చేస్తుందని తెలిపారు. తాజాగా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్‌లతోపాటు రోబోల దండును పరిచయం చేశారు.pic.twitter.com/VK9vlGF0Ms— Elon Musk (@elonmusk) October 11, 2024ఇదీ చదవండి: రోబో కారును ఆవిష్కరించిన టెస్లాభవిష్యత్తులో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక రోబో ఉంటుందని గతంలో మస్క్ చెప్పారు. కంపెనీ తయారు చేస్తున్న ఆప్టిమస్ రోబోలకు గిరాకీ ఏర్పడుతుందన్నారు. హ్యూమనాయిడ్ రోబోట్స్ తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని చెప్పారు. తయారీ రంగంతోపాటు రోజువారీ జీవితంలో రోబోలు పాత్ర కీలకంగా మారనుందని తెలిపారు. ఆప్టిమస్ రోబో ఒక్కో యూనిట్ తయారీకి దాదాపు 10,000 డాలర్లు (రూ.8.3లక్షలు) ఖర్చవుతుందని అంచనా. టెస్లా ఏటా ఆప్టిమస్ ద్వారా 1 ట్రిలియన్ డాలర్ల (రూ.83లక్షల కోట్లు) లాభాన్ని ఆర్జించగలదని గతంలో మస్క్ అంచనా వేశారు. -
‘సిక్‌లీవ్’ పెడుతున్నారా..?
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులకు సిక్ లీవ్ (ఎస్ఎల్) అనేది ఒక హక్కు అన్నది తెలిసిందే. ఒక్కోసారి ఎలాంటి అనారోగ్యం లేకపోయినా, సెలవు తీసుకోవాలంటే ‘ఎస్ఎల్’ అనేది ఓ తిరుగులేని ఆయుధంగా మారిన సందర్భాలు కూడా అనేకం. ఎంతటి కఠిన హృదయుడైన కంపెనీ యజమాని లేదా ఉన్నతస్థానంలో ఉన్న మేనేజర్లయినా.. ఉద్యోగుల ‘సిక్‌లీవ్’ను తోసిపుచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ, ఇక ముందు సిక్‌లీవ్ పెట్టాలంటే.. ఉద్యోగులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎదుర్కొన్న అనుభవాన్ని చూశాక.. ఇతర ఉద్యోగులు సైతం సిక్‌లీవ్ పెట్టాలంటే ఆలోచించాల్సిందే. ఇక్కడ ఎదురైన అనుభవాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఈ సెలవు పెట్టేందుకు తప్పకుండా ఆలోచించ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు భారత్‌లో కూడా వస్తుందా? అనే విషయం మాత్రం.. వివిధ కార్పొరేట్ కంపెనీల తీరును బట్టి ఉంటుందనే అంచనాలకు ఇక్కడి ఉద్యోగులు వస్తున్నారు. అసలేం జరిగిందంటే..జర్మనీలోని బెర్లిన్‌లో టెస్లా కంపెనీ గిగా ఫ్యాక్టరీలో సిక్‌లీవ్ పెట్టిన ఉద్యోగుల ఇళ్లకు ఆ సంస్థ మేనేజర్లు వెళ్లి.. అసలు వారు నిజంగానే అనారోగ్యంతో ఉన్నారా? లేక ఎస్ఎల్ పెట్టేందుకు ఆ విధంగా అబద్ధం ఆడుతున్నారా? అని పరిశీలించారట.. దీంతో ఈ సంస్థ మేనేజ్మెంట్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తమకు పనిఒత్తిళ్లు పెరగడంతో పాటు అధిక పని గంటలతో తరచూ అనారోగ్యం బారిన పడడంతో సిక్ లీవ్‌లు పెట్టక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయని కార్మిక సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి.సిక్‌లీవ్‌లు తీసుకున్న ఉద్యోగులను తనిఖీ చేసేందుకు మేనేజర్లు వారి ఇళ్ల తలుపులు తట్టినపుడు, అధికారుల మొహాలపైనే తలుపులు మూసేయడమో, తిట్ల దండకం అందుకోవడమో లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడమో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎస్ఎల్లు తీసుకుంటున్నవారి సంఖ్య ఏకంగా 17 శాతానికి చేరుకోవడంతో.. ఈ పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగుల ఇళ్లకు మేనేజర్లు వెళ్లడాన్ని తప్పుపట్టనవసరం లేదని యాజమాన్య ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మరింత మెరుగైన పని సంస్కృతిని, ఉత్పాదకతను పెంచేందుకు సిక్‌లీవ్‌లు పెట్టే విషయంలో ఉద్యోగుల్లో తగిన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.లీవు తీసుకోకుంటే వెయ్యి యూరోల బోనస్లీవ్లు తీసుకోని వారికి వెయ్యి యూరోలు బోనస్‌గా చెల్లించేందుకు కూడా టెస్లా సంసిద్ధత వ్యక్తం చేసింది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సైతం.. సిక్లీవ్లతో తలెత్తిన పరిస్థితిని, అందుకు దారితీసిన పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా ఎక్స్ వేదికగా స్పష్టం చేయడం గమనార్హం. ఉద్యోగులు అత్యంత కఠినమైన పని సంస్కృతిని అలవరుచుకోవాలని, డెడ్లైన్లు, ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు పనిచేసే చోటే కొంతసేపు కునుకేసినా పరవాలేదని మస్క్ గతంలో పేర్కొనడాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఐతే సిక్లీవ్లకు సంబంధించి టెస్లా వివాదాస్పద విధానాలను అవలంబిస్తోందనే విమర్శలు మరోవైపు ఉండనే ఉన్నాయి. జర్మన్ కార్ల ప్లాంట్‌లో ఏటా పదిలక్షల కార్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ సప్లయ్ చెయిన్ సమస్యలు, ఉత్పత్తి నిలిచిపోవడం, డిమాండ్ తగ్గుదల వంటి కారణాలతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడం అక్కడ సమస్యగా మారింది. ఐతే టెస్లా తన విధానాలను గట్టిగా సమర్థిస్తూనే.. సెలవు తీసుకున్న ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయడం అనేది జవాబుదారీతనం పెంపుదలకు అవసరమని నొక్కి చెబుతోంది. కానీ ఇలాంటి విధానాల వల్ల ఇప్పటికే అధిక పనివత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులను మరింత ఆందోళనకు, చిరాకుకు గురిచేయడమే అవుతుందని యూనియన్లు, వర్కర్లు వాదిస్తున్నారు. -
మస్క్ VS టెస్లా ఉద్యోగులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో బిలియనీర్ ఎలాన్ మస్క్.. తన ఈవీ కంపెనీ టెస్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు పరస్పరం విరుద్ధంగా మారారు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు మస్క్ మద్దతు ఇస్తుండగా టెస్లా ఉద్యోగులు మాత్రం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలహారిస్ వైపు నిలుస్తున్నారు.అధ్యక్ష రేసులో పాల్గొంటున్న అభ్యర్థులకు ప్రచారం నిమిత్తం ఇస్తున్న విరాళాల ద్వారా టెస్లా ఉద్యోగుల మొగ్గు ఎటువైపు అన్నది తెలుస్తోంది. టెస్లా ఉద్యోగులు ట్రంప్ కంటే దాదాపు రెట్టింపు విరాళాలను కమలాహారిస్‌కు ఇస్తున్నట్లు తెలిసింది. యూఎస్ ప్రచార సహకారాలు, లాబీయింగ్ డేటాను ట్రాక్ చేసే ఓపెన్ సీక్రెట్ అనే సంస్థ ప్రకారం.. టెస్లా ఉద్యోగులు కమలకు 42,824 డాలర్లు విరాళం అందించగా ట్రంప్‌నకు 24,840 డాలర్ల విరాళం అందించారు.ఎక్స్, స్పేస్ఎక్స్ ఉద్యోగులు కూడా..ఎలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్ ఉద్యోగులు కూడా డెమోక్రాటిక్ అభ్యర్థి కమలహారిస్కే మద్దతిస్తున్నారు. వీరు కమలహారిస్‌కు 34,526 డాలర్లు విరాళం అందించగా ట్రంప్‌నకు ఇచ్చింది కేవలం 7,652 డాలర్లు. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (ట్విటర్) ఉద్యోగులు సైతం హారిస్‌కు 13,213 డాలర్లు విరాళమిచ్చారు. ట్రంప్‌కు ఇచ్చింది 500 డాలర్ల కంటే తక్కువ కావడం గమనార్హం. -
ప్రపంచ తొలి ట్రిలియనీర్ ఎలాన్ మస్క్!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ తొలి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్లు)గా 2027 నాటికి రికార్డ్ సృష్టించనున్నారు. మరుసటి ఏడాది (2028లో) అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సైతం ట్రిలియనీర్ అవుతారని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక అంచనా వేసింది. ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 2033లో ఈ స్థానానికి చేరుకుంటారని పేర్కొంది. ఎలాన్ మస్క్ 237 బిలియన్ డాలర్లతో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. 2027 నాటికి ట్రిలియనీర్ స్థానానికి చేరుకోవాలంటే మస్క్ నికర సంపద ఏటా 110 శాతం చొప్పున పెరగాల్సి ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది. అదానీ 100 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం మాదిరే అదానీ సంపద ఏటా 123 శాతం చొప్పున పెరుగుతూ పోతే, ఎలాన్ మస్క్ తర్వాత 2028లో ప్రపంచ రెండో ట్రిలియనీర్ అవుతారని ఈ నివేదిక అంచనా వేసింది. 111 బిలియన్ డాలర్లతో ఆసియా కుబేరుడిగా ఉన్న ముకేశ్ అంబానీ 2033 నాటికి ట్రిలియనీర్ అవుతారని తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2035లో లక్ష కోట్ల డాలర్ల మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేసింది. 2025లో టీఎస్ఎంసీ: తైవాన్‌కు చెందిన సెమీ కండక్టర్ తయారీ సంస్థ టీఎస్ఎంసీ మార్కెట్ విలువ 893.7 బిలియన్ డాలర్లుగా ఉంటే, వచ్చే ఏడాది ట్రిలియన్ డాలర్లకు చేరుకోనుంది. ఎలాన్ మస్‌్క, గౌతమ్ అదానీ, ఎన్వీడియా వ్యవస్థాపకుడు జెన్సెస్ హాంగ్, ఇండోనేసియాకు చెందిన ప్రజోగో పాంగెట్సు, ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఫేస్బేక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ట్రిలియనీర్లుగా అవతరించే అవకాశాలున్నట్టు వివరించింది. ప్రస్తుతం ప్రపంచంలో ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్, ఎన్వీడియా, యాపిల్, ఆల్ఫాబెట్, అమెజాన్, సౌదీ ఆరామ్కో, మెటా, బెర్క్‌షైర్ హాత్వే ఉన్నాయి. -
టెస్లా వైస్ ప్రెసిడెంట్ రాజీనామా.. కారణం ఇదే
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు భారతీయ సంతతికి చెందిన ''శ్రీలా వెంకటరత్నం'' రాజీనామా చేశారు. సుమారు 11 సంవత్సరాలు టెస్లా కంపెనీలో అనేక కీలక బాధ్యతలు చేపట్టిన ఈమె ఉద్యోగానికి రాజీనామా చేశారు.శ్రీలా వెంకటరత్నం టెస్లాలో ఫైనాన్స్ ఆపరేషన్ డైరెక్టర్‌గా తన ఉద్యోగం ప్రారంభించి వైస్ ప్రెసిడెంట్ వరకు ఎదిగారు. అయితే తన కుటుంబం, స్నేహితులతో కాలం గడపటానికి ఇప్పుడు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు.టెస్లాలో ఆమె ప్రారంభ రోజుల నుంచి ప్రాజెక్ట్‌లను మ్యాపింగ్ చేస్తూ కంపెనీ ఉన్నతికి తోడ్పడింది. మేము కలిసి ఇంత సాధించినందుకు గర్విస్తుంన్నాను అంటూ వెల్లడించింది. తానూ కంపెనీలో చేరిన తరువాత సంస్థ 700 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించిందని, ఇది తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు.శ్రీలా వెంకటరత్నం లింక్డ్ఇన్ పోస్ట్‌కు, టెస్లా మాజీ సీఎఫ్ఓ జేసన్ వీలర్ స్పందిస్తూ.. మంచి నిర్ణయం తీసుకున్నావు శ్రీలా.. కంపెనీలో అద్భుతమైన విజయాలను సాధించినందుకు అభినందనలు అంటూ పేర్కొన్నారు. -
రోజుకు రూ.28000 జీతం: ఏడు గంటలే పని!
ప్రముఖ అమెరికన్ కంపెనీ టెస్లా రోజుకు ఏడు గంటలు నడవడానికి ఇష్టపడే వ్యక్తుల కోసం ఒక జాబ్ ఆఫర్ చేసింది. ఈ ఉద్యోగంలో చేరే వ్యక్తులు గంటకు 48 డాలర్లు లేదా సుమారు 4000 రూపాయలు పొందవచ్చు. ఈ లెక్కన ఏడు గంటలు పనిచేస్తే రోజుకు రూ. 28000 సంపాదించుకోవచ్చు. ఇంతకీ జాబ్ ఏంటి? అక్కడ ఏం చేయాల్సి ఉంటుందనే విషయాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం.టెస్లా కంపెనీ తన హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్‌ను వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగమైన మోషన్-క్యాప్చర్ టెక్నాలజీలో ఉపయోగించి రోబోట్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి సంస్థ సన్నద్ధమైంది. దీనికోసమే ఉద్యోగాలను ప్రకటించింది. ఈ రంగంలో ప్రత్యేకమైన అనుభవం ఉన్న వ్యక్తులకు ఇది గొప్ప సువర్ణావకాశం అనే చెప్పాలి.టెస్లా కంపెనీ ప్రకటించిన ఈ ఉద్యోగంలో చేరాలనుకునే వ్యక్తులు మోషన్-క్యాప్చర్ సూట్ & వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ధరించి రోజూ ఏడు గంటల సమయం నిర్దిష్ట మార్గాల్లో నడవడం ఉంటుంది. ఇందులో భాగంగానే డేటా సేకరించడం, విశ్లేషించడం వంటివి చేయాలి. వీటితో పాటు ఉద్యోగంలో చేరాలనుకునే వ్యక్తి ఎత్తు 5'7' నుంచి 5'11' ఎండీ ఉండాలి. వీరు 13 ఫౌండ్స్ బరువును కూడా మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.ఇదీ చదవండి: తగ్గిన బంగారం, పెరిగిన వెండి: ఈ రోజు ధరలు ఇవేఉద్యోగంలో మూడు షిఫ్టులు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. అవి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30, సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12:00 వరకు.. అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 8:30 గంటల వరకు. అంటే ఈ ఉద్యోగంలో చేరాలనుకునేవారు కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో పని చేయాల్సి ఉంటుంది. -
‘లగ్జరీ కార్లను ఎలా విక్రయించాలో తెలియదు’
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కార్లు ఇండియాలోకి ఎప్పుడు వస్తుయో ప్రశ్నార్థకంగా మారింది. దేశీయ రోడ్లపై టెస్లా పరుగులు పెడుతుందని నమ్మినవారిలో కొందరు ఇప్పటికే ప్రీ ఆర్డర్ చేసుకున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా కార్ల రాకకు సంబంధించి స్పష్టత లేకపోవడంతో కస్టమర్లు తమ డిపాజిట్లను తిరిగి తీసుకుంటున్నారు. దాంతోపాటు ఇతర కంపెనీల నుంచి పోటీ పెరిగిందని చెబుతున్నారు.జీఓక్యూఐఐ అనే హెల్త్ టెక్ స్టార్టప్ కంపనీ సీఈఓ గోండాల్ తెలిపిన వివరాల ప్రకారం..‘భారత్‌లో టెస్లా ప్రవేశిస్తుందని నమ్మి 1000 డాలర్లతో మోడల్ 3 కారును ప్రీబుకింగ్ చేసుకున్నాను. ఏప్రిల్ 2016లో టెస్లా కారు భారత్‌లోకి వస్తుందని నమ్మబలికారు. ముందుగానే ఆర్డర్ చేసుకోమని చెప్పారు. కానీ ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ దానిపై స్పష్టత లేదు. భారత్‌లో దిగుమతి చేయాలంటే ఖరీదుతో కూడుకున్న విషయమని కంపెనీ గతంలో చెప్పింది. దాంతో స్థానికంగానే కార్లను తయారు చేస్తామని కూడా పేర్కొంది. కొన్ని కారణాలవల్ల ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇదే అదనుగా ఇతర పోటీ కంపెనీలు ఈవీలను తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. టెస్లా ఫీచర్లకు పోటీ ఇచ్చేలా వాటిలో మెరుగైన టెక్నాలజీ వాడుతున్నారు. అసలు భారత్‌లోకి ఎప్పుడు వస్తుందో తెలియని కంపెనీ కార్ల కోసం వేచి చూడడం కంటే, దాదాపు అదే తరహా ఫీచర్లు అందించే ఇతర కంపెనీ కార్లును ఎంచుకోవడం మేలనిపించింది. దాంతో ప్రీ బుకింగ్ డబ్బును తిరిగి తీసుకున్నాను. టెస్లా గొప్ప టెక్ కంపెనీయే కావచ్చు. కానీ వారికి లగ్జరీ కార్లను ఎలా విక్రయించాలో తెలియదు’ అని అన్నారు.ఇదీ చదవండి: సైబర్‌ట్రక్ ఆర్డర్ల నిలిపివేత!ఇదిలాఉండగా, దేశీయంగా టాటా, మహీంద్రా, మారుతీసుజుకీ..వంటి కంపెనీలు ఈవీలను తయారు చేస్తున్నాయి. మార్కెట్లోనూ వాటికి గిరాకీ పెరుగుతోంది. దాంతోపాటు విదేశీ కంపెనీలైన బీవైడీ, మోరిస్‌గరేజ్, బెంజ్, బీఎండబ్ల్యూ..వంటివి ఈవీలో కొత్త మోడళ్లను తీసుకొచ్చాయి. భారత ప్రభుత్వం విదేశీ కంపెనీ కార్ల తయారీదారులను ఆకర్షించడానికి 2024 మార్చిలో దిగుమతి సుంకాలను 70% నుంచి 15%కు తగ్గించింది. దాంతో భారత్‌లో తయారయ్యే విదేశీ ఈవీ కార్ల ధర రూ.30 లక్షల కంటే తక్కువకే లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే తయారీని ప్రారంభించే దిశగా మరిన్ని చర్చలు జరగాల్సి ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. -
సైబర్‌ట్రక్ ఆర్డర్లను నిలిపేసిన టెస్లా!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా సైబర్‌ట్రక్ బేసిక్ వేరియంట్ ఆర్డర్లను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ వినియోగదారులు తక్షణమే సైబర్‌ట్రక్‌ను పొందాలంటే 1 లక్ష డాలర్లు(రూ.83.9 లక్షలు) ధర ఉన్న ప్రీమియం వేరియంట్‌ను ఆర్డర్ చేయాలని తెలిపింది.టెస్లా ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన స్టెయిన్లెస్ స్టీల్ బాడీ కలిగిన సైబర్‌ట్రక్ బేసిక్ వేరియంట్ ధరను 61,000 డాలర్లు(రూ.51.2 లక్షలు)గా నిర్ణయించింది. దాంతో భారీగా ఆర్డర్లు వచ్చాయి. అయితే దీన్ని విక్రయించడం వల్ల కంపెనీకు తక్కువ మార్జిన్ వస్తున్నట్లు సమాచారం. సైబర్‌ట్రక్ ప్రీమియం వేరియంట్ ధరను 1 లక్ష డాలర్లు (రూ.83.9 లక్షలు)గా ఉంచారు. దాంతో దీనికి డిమాండ్ తగ్గిపోయింది. ఈ రెండు వేరియంట్లు కలిపి ఇప్పటివరకు దాదాపు 10 లక్షల యూనిట్లను ఆర్డర్ చేసుకున్నారని ఇలాన్‌మస్క్ తెలిపారు. ఇందులో బేసిక్ వేరియంట్ ఆర్డర్లను నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో ఇకపై సైబర్‌ట్రక్ కావాలనుకునేవారు ప్రీమియం మోడల్‌ను బుక్ చేసుకోవాలని కంపెనీ తెలిపింది. దానివల్ల మార్జిన్ పెరిగి కంపెనీ బ్యాలెన్స్షీట్లో రెవెన్యూ అధికమవుతుందని భావిస్తోంది. ఒకవేళ కస్టమర్లు ప్రీమియం మోడల్‌ను ఆర్డర్‌చేస్తే ఈ నెలలోనే డెలివరీ ఇస్తామని హామీ ఇస్తుంది. ఏలాగైనా ఈ ఏడాదిలో వీటి అమ్మకాలను 2 లక్షలకు తీసుకెళ్లాలని యోచిస్తోంది.‘కాక్స్ ఆటోమోటివ్’ తెలిపిన వివరాల ప్రకారం..టెస్లా జులైలో దాదాపు 4,800 సైబర్‌ట్రక్ ప్రీమియం యూనిట్లను విక్రయించింది. ఇది యూఎస్‌లో 1 లక్ష డాలర్ల ధర శ్రేణిలో అత్యధికంగా అమ్ముడైన వాహనంగా నిలిచింది. అయితే ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు కేవలం 16,000 యూనిట్లు మాత్రమే విక్రయించారు. ఆ సంఖ్యను పెంచడం కంపెనీకి సవాలుగా మారుతుంది.ఇదీ చదవండి: సీఈఓల జీతాలు పెంపు!ఇదిలాఉండగా, టెస్లా నవంబర్ 2023లో సైబర్‌ట్రక్‌ను ఆవిష్కరించింది. బేసిక్ వేరియంట్ కార్లను 2025లో డెలివరీ ఇస్తామని లక్ష్యంగా చేసుకుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 511 కిలోమీటర్ల వరకు వెళ్లే డ్యుయల్ మోటార్ వేరియంట్‌ను(ధర రూ.83.9 లక్షలు) ఆర్డర్ చేస్తే ఈ నెలలోనే డెలివరీ ఇస్తామని ప్రకటించింది. ‘ట్రై-మోటార్ వేరియంట్ సైబర్‌బీస్ట్’ మోడల్ (ధర దాదాపు రూ.1 కోటి) అక్టోబర్ నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. -
భారీగా తగ్గిన టెస్లా సేల్స్.. కారణం ఇదే!
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు.. టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) సపోర్ట్ చేస్తున్నారనే విషయం రాజకీయ వివాదం రేకెత్తించింది. ఇది టెస్లా అమ్మకాలపైన తీవ్రమైన ప్రభావం చూపించింది. దీంతో అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి.ట్రంప్‌కు మస్క్ ఇస్తున్న మద్దతును చాలామందికి నచ్చడం లేదు. దీనివల్ల టెస్లా కార్లను కొనుగోలు చేయకుండా ఊరుకున్నారు. ఈ కారణంగా టెస్లా కార్ల విక్రయాలు 50 శాతం తగ్గిపోయింది. ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో స్పష్టంగా తెలియడం లేదు.బ్యాటరీతో నడిచే వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో యునైటెడ్ స్టేట్స్లో మాత్రం అమ్మకాలు క్షిణించాయి. టెస్లాతో పోలిస్తే.. ఇతర ప్రత్యర్థుల సేల్స్ కొంతవరకు ఉత్తమంగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. టెస్లా కార్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదని పలువురు నెటిజన్లు తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాల ద్వారా పేర్కొంటున్నారు. -
16.8 లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చైనాలో 16.8 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ చేయకపోవడం వల్ల సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రీకాల్ చేసిన కార్లులో ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసి ఇస్తామని పేర్కొంది.టెస్లా తెలిపిన వివరాల ప్రకారం..చైనాలో దిగుమతి చేసుకున్న మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను రీకాల్ చేస్తున్నారు. వాటితోపాటు అక్టోబర్ 15, 2020 నుంచి జులై 17, 2024 మధ్య చైనాలో తయారు చేసిన మోడల్ 3, మోడల్ వై కార్లను కూడా రీకాల్ చేస్తున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం..డ్రైవింగ్ సమయంలో కారులో సామాన్లు పెట్టుకునేందుకు వీలుగా ఉండే ట్రంక్ డోర్ దానికదే తెరుచుకునే ప్రమాదం ఉంది. ఇది డ్రైవర్ దృష్టికి అంతరాయం కలిగిస్తుంది. అయితే ఇలాంటి సమస్య ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం టెస్లా వెల్లడించలేదు. ఈ సమస్య పరిష్కారానికి రిమోట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ చేయాలని పేర్కొంది. రీకాల్ చేసిన కార్లలో ఉచితంగానే ఈ సర్వీసును అందిస్తామని చెప్పింది.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం ఎంతంటే..ఇదిలాఉండగా, టెస్లాకు చైనా ప్రధాన మార్కెట్‌గా నిలుస్తోంది. జులైలో చైనా ప్రభుత్వం పెద్దమొత్తంలో ఈ కార్లను కొనుగోలు చేసింది. షాంఘైలో టెస్లా గిగాఫ్యాక్టరీని స్థాపించింది. 2023లో ఈ ఫ్యాక్టరీలో దాదాపు 9,47,000 కార్లు తయారు చేసింది. వీటిలో చాలా వరకు స్థానికంగా విక్రయించింది. మిగతావాటిని యూరప్‌కు ఎగుమతి చేసింది. చైనాకు చెందిన బీవైడీ కంపెనీ తయారు చేస్తున్న ఈవీ కార్లు టెస్లాకు పోటీగా నిలుస్తున్నాయి. -
నా పైనా రెండు హత్యాయత్నాలు: మస్క్
వాషింగ్టన్: గత ఎనిమిది నెలల కాలంలో తనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగినట్లు బిలియనీర్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ వెల్లడించారు. టెక్సాస్‌లోని టెస్లా ప్రధాన కార్యాలయం సమీపంలో తుపాకులతో ఉన్న వ్యక్తులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నం నేపథ్యంలో మస్క్ వ్యక్తిగత భద్రతపై ఆయన సొంత సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఓ యూజర్ ‘దయచేసి మీకున్న భద్రతా ఏర్పాట్లను మూడింతలు పెంచుకోండి. ఇవాళ ట్రంప్.. రేపు మీ వంతు రావచ్చు’అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మస్క్ స్పందిస్తూ... ‘నిజమే, ప్రమాదం పొంచి ఉంది. గత ఎనిమిది నెలల్లో నన్ను చంపేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నం చేశారు. తుపాకీలతో సహా వారిని అరెస్ట్ చేశారు’అని తెలిపారు. ఏ సమయంలోనైనా తాను హత్యకు గురి కావచ్చునంటూ గతంలోనూ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. -
టెస్లాలో కాఫీ కప్పుల దొంగలు.. 65 వేల కప్పులు మాయం!
టెస్లా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. బిలియనీర్ ఇలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ఇది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా ఫ్యాక్టరీల్లో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీలో కాఫీ మగ్లు మాయవుతున్నాయట.కాఫీ మగ్‌ల దొంగతనం గురించి స్వయంగా టెస్లా ప్లాంట్ మేనేజర్ తెలిపారు. ప్లాంట్ మేనేజర్ ఆండ్రీ థిరిగ్ ఒక స్టాఫ్ మీటింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారని జర్మనీకి చెందిన హ్యాండెల్స్‌బ్లాట్ వార్తాపత్రిక నివేదించింది.బెర్లిన్‌కు ఆగ్నేయంగా ఉన్న ఒక విశాలమైన కాంప్లెక్స్‌లో దాదాపు 12,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న టెస్లా ఫ్యాక్టరీలో "నేను మీకు ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పబోతున్నాను" అని థిరిగ్ చెప్పారు. "మేం ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి మేము 65,000 కాఫీ మగ్‌లను కొనుగోలు చేశాం. మరిన్ని కాఫీ కప్పులు కొనడానికి ఆర్డర్లను ఆమోదించడంలో నేను విసిగిపోయాను" అంటూ నవ్వుతూ పేర్కొన్నారు. దొంగతనాలు ఆపకపోతే బ్రేక్ రూమ్‌లలో పాత్రలేవీ మిగలవు అంటూ చమత్కరించారు.ఇటీవల టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ ఆదేశాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెస్లా ఫ్యాక్టరీలలో 10% ఉద్యోగులను తొలగించారు. దీంతో అనేక మంది తాత్కాలిక, పార్ట్‌టైమ్ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. -
భారత్‌కు టెస్లా ఇక రానట్టేనా?
ఇలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తమను సంప్రదించడం మానేయడంతో టెస్లా ఇక్కడ పెట్టుబడుల పెట్టే అంశంలో ముందుకు వెళ్తుందని భారత్ ఆశించడం లేదు.మస్క్ ఏప్రిల్ చివరిలో భారత పర్యటనను వాయిదా వేసుకున్న తరువాత మస్క్ బృందం తమతో తదుపరి సంప్రదింపులు జరపలేదని న్యూఢిల్లీలోని అధికారులు చెప్పినట్లు మనీ కంట్రోల్ కథనం పేర్కొంది. టెస్లాకు మూలధన సమస్యలు ఉన్నాయని, సమీప భవిష్యత్తులో భారత్‌లో కొత్త పెట్టుబడులు పెట్టే యోచన లేదని ప్రభుత్వానికి అర్థమైంది.టెస్లా ప్రపంచవ్యాప్తంగా త్రైమాసిక డెలివరీలలో వరుసగా రెండవసారి క్షీణతను నివేదించడం, చైనాలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నందున భారత్‌పై ఆసక్తి తగ్గింది. ఆటోమొబైల్ రంగాన్ని పర్యవేక్షించే భారత భారీ పరిశ్రమల శాఖ, ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖల ప్రతినిధులు గానీ, టెస్లా గానీ దీనిపై స్పందించలేదు. -
టెస్లా కీలక నిర్ణయం.. సైబర్ట్రక్లకు రీకాల్ - ఎందుకో తెలుసా?
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులకు ముందు అమరికలో సైబర్‌ట్రక్ లాంచ్ చేసింది. లాంచ్ చేసిన కొన్ని రోజుల తరువాత కంపెనీ సుమారు 11,688 సైబర్ ట్రక్కులకు రీకాల్ ప్రకటించింది. ఇంతకీ ఈ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి? దీనికోసం కంపెనీ చార్జెస్ వసూలు చేస్తుందా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.టెస్లా కంపెనీ లాంచ్ చేసిన ఈ సైబర్ ట్రక్కులను రీకాల్ చేయడానికి ప్రధాన కారణం.. విండ్‌షీల్డ్ వైపర్ పనిచేయకపోవడం, ట్రంక్ బెడ్ ట్రిమ్ సమస్య అని తెలుస్తోంది. ఈ రెండు సమస్యల కారణంగా భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) వెల్లడించింది.ఏజెన్సీ ప్రకారం.. కొన్ని సందర్భాల్లో విండ్‌షీల్డ్ వైపర్ ఎటువంటి హెచ్చరిక లేకుండా విఫలమవుతుంది. ఇది వర్షం పడుతున్నప్పుడు సమయంలో ప్రమాదానికి కారణం అవ్వొచ్చని తెలుస్తోంది. 2023 నవంబర్ 13 నుంచి జూన్ 6 మధ్య తయారైన వాహనాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కస్టమర్లకు ఆగష్టు 18న మెయిల్ ద్వారా మెయిల్ అందుతుంది. ఈ రీకాల్ కోసం కంపెనీ ఎటువంటి చార్జీలు వసూలు చేయదు.ఇప్పటి వరకు సైబర్ ట్రక్కుల వినియోగదారుల నుంచి దీనికి సంబంధించిన ఎటువంటి ఫిర్యాదు అందలేదు. అయితే భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉండవచ్చని.. కంపెనీ స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. దీనిని సైబర్‌ట్రక్ వినియోగదారులు సులభంగా ఎటువంటి చార్జీలు చెల్లించకుండా వినియోగించుకోవచ్చు. -
ఎలాన్ మస్క్ కు 11వ బిడ్డ
న్యూయార్క్: ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు. న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్స్ హెడ్ శివోన్ జిలిస్ ద్వారా ఆయనకు కొన్ని రోజుల క్రితం మూడో బిడ్డ జన్మించినట్లు బ్లూమ్‌బర్గ్ సంస్థ వెల్లడించింది. దీంతో మస్క్ పిల్లల సంఖ్య ఇప్పటిదాకా 11కు చేరుకున్నట్లు తెలియజేసింది. మస్క్ కు మొదటి భార్య, రచయిత్రి జస్టిన్ మస్క్ ద్వారా ఐదుగురు బిడ్డలు కలిగారు. సంగీత కళాకారిణి గ్రిమ్స్ ద్వారా ముగ్గురు పిల్లులు, శివోన్ జిలిస్ ద్వారా మరో ముగ్గురు పిల్లలు జని్మంచారు. ఎలాన్ మస్క్, శివోన్ జిలిస్‌కు 2021లో కవలలు పుట్టారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జననాల రేటు పడిపోతుండడంతో జనాభా తగ్గిపోతోందని మస్క్ 2021లో ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే జనాభాను పెంచాలని, వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. పిల్లలను కనకపోతే నాగరికత అంతమైపోతుందని చెప్పారు. అత్యధికంగా తెలివితేటలు, మేధాశక్తి ఉన్న వ్యక్తులు పిల్లలను ఎక్కువగా కనాలన్నది మస్క్ అభిప్రాయం. ఆయనకు తన సంస్థల్లో పనిచేసే మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. -
మస్క్ సంచలన నిర్ణయం: 2026 నాటికి..
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న టెస్లా రాబోయే రోజుల్లో హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో చైనా కంపెనీ బివైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్) గట్టి పోటీ ఇస్తోంది. ఈ తరుణంలో మస్క్ హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ 2026 నాటికి టెస్లా హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.టెస్లా కంపెనీ త్వరలోనే హైడ్రోజన్ కార్ల ప్రాజెక్టు మీద పనిచేయనుంది. హైడ్రోజన్‌తో నడిచే మొదటి కారు 'మోడల్ హెచ్'ను 2026లో ఆవిష్కరించనున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ కార్లను కేవలం అమెరికా మార్కెట్లో మాత్రమే లాంచ్ చేస్తారా?.. ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. -
Elon Musk: హ్యాక్ చేయొచ్చు..!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరు, పారదర్శకతపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈవీఎంలలో నమోదైన ఫలితాలను సులభంగా తారుమారు చేయొచ్చని, ఎన్నికల్లో వీటిని ఉపయోగించకపోవడమే మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఈవీఎంలపై స్పందించారు. ఈ మేరకు తాజాగా ‘ఎక్స్’లో తన అభిప్రాయం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వినియోగిస్తున్న ఈవీఎంల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యంత్రాలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. మస్క్ అభిప్రాయాన్ని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీంఎలు పూర్తిగా సురక్షితమేనని తేల్చిచెప్పారు. దీనిపై మస్క్ ఘాటుగా స్పందించారు. ఏదైనా హ్యాక్ చేయొచ్చని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లు కూడా ఆదివారం స్పందించారు. ఈవీఎంలు ఎవరూ తనిఖీ చేయలేని బ్లాక్‌బాక్సుల్లాంటివేనని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ‘ఎక్స్’లో ఎలాన్ మస్క్ చేసిన పోస్టును తన ‘ఎక్స్’ ఖాతాల్లో రాహుల్ షేర్ చేశారు. ఈవీఎంల విశ్వసనీయతను అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. రిస్క్ చిన్నదైనా పరిణామం పెద్దదే మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను వాడొద్దు. ఎన్నికల నుంచి ఈ యంత్రాలను దూరంగా ఉంచాలి. ఈవీఎంలను హ్యాక్ చేసే రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికీ హ్యాకింగే అవుతుంది. రిస్క్ చిన్నదైనా అది పెద్ద పరిణామానికి దారితీస్తుంది.– ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎన్నికల ప్రక్రియపై అనుమానాలున్నాయి భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీఎంలు బ్లాక్‌బాక్సుల్లాంటివే. వాటిని తనిఖీ చేయడానికి ఎవరినీ అనుమతించరు. మన దేశంలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఓ బూటకంగానే మిగిలిపోతుంది – ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ ఈవీఎంలు పూర్తి సురక్షితం పూర్తిగా సురక్షితమైన ఎల్రక్టానిక్ పరికరాలను, డిజిటల్ హార్డ్‌వేర్‌ను ఎవరూ తయారు చేయలేరన్న సాధారణ అభిప్రాయం ప్రజల్లో ఉంది. అలా అను కోవడం పొరపాటు. ఈవీఎంలపై ఎలాన్ మస్క్ వ్యక్తం చేసిన భయాందోళలు సమంజసం కాదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయడం అమెరికాతోపాటు ఇతర దేశాల్లో సాధ్యమవుతుందేమో గానీ ఇండియాలో ఎంతమాత్రం వీలుపడదు. ఇతర దేశాల్లో ఇంటర్నెట్తో అనుసంధానించిన ఓటింగ్ యంత్రాలను వాడుతుంటారు. ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. ఇంటర్నెట్తో కనెక్ట్ చేసినప్పుడు అవకతవకలు జరిగే అవకాశం ఉండొచ్చు. ఇండియాలో ఈవీఎంలకు ఇంటర్నెట్తో గానీ, బ్లూటూత్‌తో గానీ, వై–ఫైతోగానీ ఎలాంటి అనుసంధానం ఉండదు. ఇవి పూర్తిగా సురక్షితమైనవి. ఫ్యాక్టరీలో పోగ్రామ్ చేసిన ఈవీఎం కంట్రోలర్లను బయట రీప్రోగ్రామింగ్ చేయడం సాధ్యం కాదు. ఇండియాలో ఉపయోగిస్తున్న ఈవీఎంలు, వాటి భద్రత గురించి ఎలాన్ మస్‌్కకు ట్యూషన్ చెప్పడానికి నేను సిద్ధమే – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి ‘‘ఏదైనా(ఏ ఎల్రక్టానిక్ పరికరమైనా) హ్యాక్ చేయొచ్చు’’ – రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ ప్రతిస్పందన ఈవీఎంలకు స్వస్తి పలకాలి టెక్నాలజీ అనేది సమస్యలను పరిష్కరించేలా ఉండాలి. అదే టెక్నాలజీ ఒక సమస్యగా మారినప్పుడు దాన్ని పక్కనపెట్టమే మంచిది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని నిపుణులు ఇప్పటికే నిరూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేస్తున్నట్లు సందేహాలున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్‌పై ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ నిపుణులు సైతం బహిరంగంగా ప్రకటనలు చేశారు. అలాంటప్పుడు మన దేశంలో ఈవీఎంలను బలవంతంగా ఉపయోగించాల్సిన అవసరం ఏమిటి? దీనిపై అధికార బీజేపీ సమాధానం ఇవ్వాలి. ఈవీఎంలకు స్వస్తి పలకాలి. భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలి. – ‘ఎక్స్’లో అఖిలేష్ యాదవ్ దమ్ముంటే హ్యాక్ చేసి చూపించండి ఎలాన్ మస్క్ గానీ, ఇంకెవరైనా గానీ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్న వ్యక్తులు భారత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలి. అక్కడ ఈవీఎంను తీసుకొని హ్యాక్ చేసి చూపించాలి. ఇదే మా చాలెంజ్. భారతదేశ ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ ఎందుకు ఎలాన్ మస్‌్కకు ఫిర్యాదు చేస్తున్నారు? మస్క్ ఏం చేయగలరు? ప్రపంచం ముందు కన్నీళ్లు పెట్టుకోవడం, భారతదేశ ప్రతిష్టను దిగజార్చడం కాంగ్రెస్ డీఎన్ఏలో ఒక భాగమా? వారసత్వ రాజకీయాలను ప్రజలు వరుసగా మూడోసారి తిరస్కరించారు. అయినా ఆ విషయం కాంగ్రెస్‌కు అర్థం కావడం లేదు? – అమిత్ మాలవీయ, బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి -
ప్రపంచంలోనే అత్యధిక వేతనం ఆయనకే..ఎంతో తెలుసా..?
ప్రముఖ ఎలక్ట్రిక్‌కార్ల తయారీసంస్థ టెస్లా సీఈఓ ఇలాన్‌మస్క్ ఏడాది వేతనం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అవును..మనలో చాలామంది వేతనం ఏటా రూ.లక్షల్లో ఉంటుంది కదా. కంపెనీ యాజమాన్య స్థాయిలో కీలక పదవుల్లో ఉన్నవారి జీతం రూ.కోట్లల్లో ఉంటుందని తెలుసు కదా. మరి, మస్క్ వేతనం ఎంతో తెలుసా.. ఏకంగా రూ.4.67లక్షల కోట్లు(56 బిలియన్ డాలర్లు). ఇందులో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఆయనకు ఇంత వేతనం ఇచ్చేందుకు కంపెనీ వాటాదారులు కూడా అనుమతించారు. దాంతో ప్రపంచంలోనే ఎక్కువ వేతనం తీసుకుంటున్న సీఈవోల్లో మస్క్ నం.1గా కొనసాగుతున్నారు.టెక్సాస్‌లో జరిగిన టెస్లా వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో సీఈఓ ఇలాన్ మస్క్ వేతనాన్ని నిర్ధారిస్తూ వాటాదారుల ఓటింగ్ నిర్వహించారు. ఇందులో ఆయన వార్షిక వేతనం ఏకంగా 56 బిలియన్ అమెరికన్ డాలర్లు(రూ.4,67,880 కోట్లు)గా నిర్ణయించారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా ఈ ప్యాకేజీలో వాటాదారులు సవరణలు చేయవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వేతనంలో సింహభాగం నగదు రూపంలో కాకుండా ‘ఆల్-స్టాక్ కంపెన్జేషన్’(ఏడాదిలో స్టాక్ విలువ పెంపు ఆధారంగా షేర్ల కేటాయింపు)గా ఇస్తారని కొన్ని మీడియా కథనాలు నివేదించాయి. తాజాగా నిర్ణయించిన ప్యాకేజీలోని స్టాక్లను ఐదేళ్లపాటు విక్రయించనని మస్క్ హామీ ఇచ్చారు.టెస్లా కంపెనీలోని ఏఐ పురోగతిని వేరేచోటుకి తీసుకెళ్లకుండా నిరోధించడానికి కంపెనీలో 25% వాటాను కోరుతున్నట్లు గతంలో మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయన కోరుకున్న వేతన ప్యాకేజీని ఇవ్వడంలో వాటాదారులు విఫలమైతే కంపెనీ తయారుచేస్తున్న ఏఐ, రోబోటిక్స్ ఉత్పత్తులను బయట తయారుచేస్తానని జనవరిలోనే చెప్పారు. తాను కంపెనీతో కలిసి ఉండాలనుకుంటున్నట్లు మస్క్ ఏజీఎంలో తెలిపారు. ఇప్పటికే వేతనానికి సంబంధించి ఇలాన్‌మస్క్ డెలావేర్ ఛాన్సరీ కోర్టులో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు మార్కెట్ వర్గాలు చెప్పాయి.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌కు తేదీ ఖరారు..?ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో బీవైడీ, షావోమీ వంటి చైనా కంపెనీలు రంగప్రవేశం చేయడంతో టెస్లాకార్లకు డిమాండ్ మందగించిందని నిపుణులు చెబుతున్నారు. దాంతో ఇటీవల విడుదల చేసిన క్యూ2 ఫలితాల్లో టెస్లా అమ్మకాలు క్షీణించాయి. లాభాల మార్జిన్లు తగ్గినట్లు కంపెనీ నివేదించింది. -
మనిషికో రోబో!
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో సీఈఓ ఇలాన్ మస్క్ కంపెనీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. సంస్థ వాటాదారుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు. భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక రోబో ఉంటుందని, కంపెనీ తయారు చేస్తున్న ఆప్టిమస్ రోబోలకు గిరాకీ ఏర్పడుతుందన్నారు. సమావేశంలో భాగంగా టెస్లా లీగల్ కార్యాలయాన్ని యూఎస్‌లోని డెలావర్ నుంచి టెక్సాస్‌కు మార్చేందుకు షేర్హోల్టర్లు అనుమతించారు.టెస్లా ట్యాక్సీలుఏజీఎంలో మస్క్ మాట్లాడుతూ..‘టెస్లా యాజమానులకు మరింత విలువ జోడించేలా, కంపెనీ వల్ల తమ ఆదాయం పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నాం. టెస్లా వినియోగదారులు తమ కార్లను ఉబర్, ఎయిర్‌బీఎన్‌బీ మాదిరిగానే రెంట్‌కు ఇచ్చేలా కొత్త యాప్‌ను తీసుకు రాబోతున్నాం. కొన్ని గంటలు, రోజులు, వారాలపాటు యాజమానులు తమ కారును రెంట్‌కు ఇచ్చే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నాం. దాంతో యూజర్లకు అదనంగా ఆదాయం సమకూరుతుంది’ అన్నారు.హ్యూమనాయిడ్ రోబోట్స్‘హ్యూమనాయిడ్ రోబోట్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పరిశ్రమ రంగంతోపాటు రోజువారీ జీవితంలో వీటి పాత్ర కీలకంగా మారనుంది. భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతిఒక్కరికి ఒక రోబో ఉంటుంది. ఇంటి పనులు, పారిశ్రామిక అవసరాలతోపాటు ఇతర పనులకు హ్యూమనాయిడ్ రోబోట్లను విస్తారంగా వాడుతారు. దాంతో కంపెనీ తయారుచేసే ఆప్టిమస్ రోబోలకు భారీ గిరాకీ ఏర్పడనుంది. ఒక్కో యూనిట్ తయారీకి దాదాపు 10,000 డాలర్లు (రూ.8.3లక్షలు) ఖర్చవుతుందని అంచనా. టెస్లా ఏటా ఆప్టిమస్ ద్వారా 1 ట్రిలియన్ డాలర్ల (రూ.83లక్షల కోట్లు) లాభాన్ని ఆర్జించగలదు’ అని మస్క్ అంచనా వేశారు.ఇదీ చదవండి: ఏడు నెలల తర్వాత జరుగబోతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంసస్టైనబుల్ ఎనర్జీ‘టెస్లా కార్లలో వినియోగించే బ్యాటరీల సమర్థతను పెంచేలా చర్యలు సాగుతున్నాయి. కంపెనీ ఇప్పటికే కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా ప్రయత్నిస్తోంది. స్థిరమైన శక్తిని అందిస్తూ స్టోరేజీ కెపాసిటీను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని మస్క్ చెప్పారు. -
కారణం లేకుండానే ట్రంప్ పిలుస్తారు.. మస్క్ కీలక వ్యాఖ్యలు!
టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ (Elon Musk) ఇటీవల తన కంపెనీలో జరిగిన ఓ సమావేశంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడారు. కారణం లేకుండానే ట్రంప్ తనను పిలుస్తూ ఉంటారని, ఎందుకు పిలుస్తారో నాకే తెలియదని అన్నారు.డొనాల్డ్ ట్రంప్ అరిజోనాలో జరిగిన ర్యాలీలో తనను (మస్క్) ప్రశంసించారని పేర్కొన్నారు. ట్రంప్.. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే కాకుండా నాకు కూడా పెద్ద అభిమాని అని చెప్పినట్లు వెల్లడించారు. సైబర్‌ట్రక్‌కి ట్రంప్ పెద్ద ఫ్యాన్ కూడా అని ఈ సందర్భంగా మస్క్ చెప్పుకొచ్చారు.డొనాల్డ్ ట్రంప్ నన్ను పిలిచినప్పుడు చాలా బాగుంటుందని మస్క్ అన్నారు. ఈవీలు భవిష్యత్తుకు మంచివని, బ్యాటరీతో నడిచే కార్లలో అమెరికా అగ్రగామిగా ఉందని ట్రంప్ చెప్పినట్లు టెస్లా సీఈఓ వెల్లడించారు. టెస్లా కార్లను నా స్నేహితులలో కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారని అన్నారు. -
మస్క్‌పై మహిళా ఉద్యోగినుల సంచలన ఆరోపణలు
వాషింగ్టన్ డీసీ : స్పేస్ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ మరో వివాదంలో చిక్కుకున్నారు. స్పేక్స్ఎక్స్‌లో ఇద్దరు ఉద్యోగినులతో మస్క్ శృంగారంలో పాల్గొన్నారంటూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. వారిలో ఒక ఉద్యోగిని స్పేస్ఎక్స్ ఇంటర్న్ అని తెలుస్తోంది. మరో ఉద్యోగిని పిల్లల్ని కనాలని బలవంతం చేసినట్లు సమాచారం.మస్క్‌పై ఈ తరహా ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. 2016లో శృంగరంలో పాల్గొనాలని, అందుకు బదులుగా గుర్రాన్ని కొనుగోలు చేయొచ్చని ఆఫర్ చేశారంటూ స్పేస్ఎక్స్ ఫ్లైట్ అటెండెంట్ ఆరోపించారు.2013లో స్పేస్ఎక్స్కు రాజీనామా చేసిన మరో మహిళను పిల్లల్ని కనాలని మస్క్ పలు సందర్భాల్లో కోరినట్లు సదరు మహిళ చెప్పారంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొన్నారు. స్పేస్ఎక్స్లో పని చేస్తున్న ఒక మహిళను మస్క్ రాత్రి పూట తన ఇంటికి రావాలని పదే పదే ఆహ్వానించినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఆ ఆరోపణలతో చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ఎలోన్ మస్క్ తన తీరుతో టెస్లా,స్పెస్ఎక్స్లో వాతావారణం పూర్తిగా దెబ్బతింటోందని ఉద్యోగులతో పాటు ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి తాజా, ఆరోపణలపై మస్క్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
కర్ణాటకలో టెస్లా..? ‘నేను స్వార్థపరుడిని కాదు’
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి తాను స్వార్థపరుడిని కాదని, తన దృష్టి దేశ అభివృద్ధిపైనే ఉందని అన్నారు. తాను దృష్టి కేవలం సొంత రాష్ట్రం కర్ణాటకపైన లేదని, మొత్తం భారత్ దేశం అంతటా అభివృద్ది చెందాలని ఉన్నట్లు తెలిపారు. ఆయన భారీ పరిశ్రమల శాఖమంత్రిగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. టెస్లా వంటి అంతర్జాతీయ కంపెనీ కర్ణాటకలో తన ఫ్యాక్టరీ పెట్టాలని ఆసక్తి చూపుతుందా? అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై స్పందించారు. ‘‘ టెస్లా వంటి కంపెనీని కర్ణాటకకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అయితే నా ప్రాధ్యాన్యత కేవలం కర్ణాటకకు పరిమితం కాదు. ఇది దేశం మొత్తానికి సంబంధించిన అభివృద్ధి. దాని ప్రకారమే పని చేస్తాం. నేను అంత స్వార్థపరుడిని కాదు. దేశ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేస్తా’’ అని హెచ్డీ కుమార స్వామి అన్నారు.నరేంద్ర మోదీ మూడో సారి ప్రధానిగా ప్రమాస్వీకారం చేసిన సందర్భంగా టెస్లా సీఈఓ ఇలాన్ మాస్క్ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. తన కంపెనీలు ఇండియాలో పని చేయాలని ఎదురుచూస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.ఇక.. బీజేపీ కూటమిలో భాగంగా కుమార స్వామి జేడీఎస్ పార్టీ రెండు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కుమారస్వామి కేంద్రమంతి పదవి దక్కించుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్డీయే కూటమి పార్టీలు 28 స్థానాలకు గాను 19 సీట్లతో విజయం సాధించాయి. -
టెస్లా విజయం వెనుక ఇండియన్.. థాంక్స్ చెప్పిన మస్క్
గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ కంపెనీ టెస్లా ఎంత ఎత్తుకు ఎదిగిందో అందరికి తెలుసు. అయితే ఆ సంస్థ నేడు ఈ స్థాయికి రావడానికి కారణమైన వారిలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయనే 'అశోక్ ఎల్లుస్వామి'. ఈయనకు మస్క్ కృతజ్ఞతలు చెబుతూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.టెక్ బిలియనీర్ అశోక్ ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) వేదికగా టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'ను ప్రశంసించారు. కంపెనీలో ఏఐ / ఆటోపైలెట్ విభాగాలు అభివృద్ధి చెందడం వెనుక మస్క్ పాత్ర అనన్యసామాన్యమని అన్నారు. ప్రారంభంలో ఈ టెక్నాలజీ స్టార్ట్ చెయ్యాలనే ఆలోచనను మస్క్ చెప్పినప్పుడు.. అసలు అది సాధ్యమవుతుందా అని అందరు అనుకున్నారు. కానీ మస్క్ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా.. టీమ్‌ను ముందుకు నడిపించారు.అనుకున్న విధంగా ముందుకు వెళుతూ 2014లో ఆటోపైలట్‌ను ఓ చిన్న కంప్యూటర్‌తో స్టార్ట్ చేసాము. అది కేవలం 384 KB మెమరీ మాత్రమే కలిగి ఉంది. ఆ తరువాత లేన్ కీపింగ్, లేన్ ఛేంజింగ్, లాంగిట్యూడినల్ కంట్రోల్ ఫర్ వెహికల్స్ వంటి వాటిని అమలు చేయాలని మస్క్ ఇంజనీరింగ్ టీమ్‌కు చెప్పారు. ఇది మాకు చాలా క్రేజీగా అనిపించింది. అయినా పట్టు వదలకుండా 2015లో టెస్లా ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోపైలట్ సిస్టమ్‌ను తీసుకువచ్చాము.https://t.co/yUqvdS7JOf— Ashok Elluswamy (@aelluswamy) June 9, 2024ఆటోఫైలెట్ కోసం ఇతరుల మీద ఆధారపడకుండా.. కంపెనీలోనే చేయడం ప్రారంభించాము. కేవలం పదకొండు నెలల్లోనే ఈ లక్ష్యాన్ని సాధించాం. ఇది టెస్లా బలమైన ఏఐ బృందం సాధించిన గొప్ప విజయం. మస్క్ కేవలం బలమైన ఏఐ సాఫ్ట్వేర్ కోసం మాత్రమే కాకుండా, శక్తివంతమైన AI హార్డ్‌వేర్ కోసం కూడా ప్రయత్నించారు. ఇందులో భాగంగానే న్యూరల్ నెట్‌వర్క్‌లను సమర్థవంతంగా అమలు చేయడానికి సిలికాన్‌ను తయారు చేసాము.మొత్తం మీద ఏఐలో టెస్లా విజయానికి మస్క్ కీలకమైన వ్యక్తి. ఇది ఆయనకు టెక్నాలజీ మీద ఉన్న అవగాహన, పట్టుదల వల్ల సాధ్యమైంది. గొప్ప గొప్ప టెక్నాలజీలను ఇతరులు చూడకముందే మస్క్ కనిపెడుతున్నారు. అదే టెస్లాను వాస్తవ ప్రపంచ AIలో అగ్రగామిగా నిలిపింది. రాబోయే రోజుల్లో ఫుల్లీ అటానమస్ కార్లు, హౌస్ హోల్డ్ రోబోట్స్ సర్వ సాధారణమైపోతాయని అశోక్ ఎల్లుస్వామి.. మస్క్‌ను గొప్పగా ప్రశంసించారు.థాంక్యూ అశోక్ అని ప్రారంభించి.. అశోక్ టెస్లా ఆటోపైలట్ బృందంలో చేరిన మొదటి వ్యక్తి. నేడు ఆటోపైలట్ సాఫ్ట్వేర్లకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. అతడు.. మా అద్భుతమైన టీమ్ లేకుండా మేము విజయాలను సాధించి ఉండేవారము కాదేమో.. అంటూ ఎల్లుస్వామి ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.Thanks Ashok! Ashok was the first person to join the Tesla AI/Autopilot team and ultimately rose to lead all AI/Autopilot software. Without him and our awesome team, we would just be another car company looking for an autonomy supplier that doesn’t exist. Btw, I never… https://t.co/7eBfzu0Nci— Elon Musk (@elonmusk) June 9, 2024 -
భారత్‌లో టెస్లా పెట్టుబడులు.. మస్క్ యూటర్న్
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ యూటర్న్ తీసుకున్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మస్క్ ప్రధాని మోదీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మోదీకి మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు. మా సంస్థ త్వరలో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని ట్వీట్ చేశారు.భారత్‌కు ఆహ్వానంఆ ట్వీట్‌కు మోదీ స్పందించారు. ప్రతిభావంతులైన భారతీయ యువత, జనాభా, ఊహాజనిత విధానాలు, స్థిరమైన ప్రజాస్వామ్య రాజకీయాలతో మా భాగస్వాములందరికీ వ్యాపార వ్యవహారాల్ని చక్కబెట్టుకునేందుకు అనువైన వాతావరణాన్ని అందించడాన్ని కొనసాగిస్తామని మస్క్ ట్వీట్‌కు రిప్లయి ఇచ్చారు. మస్క్ యూటర్న్.. అంతలోనే భారత్‌లో టెస్లా పెట్టుబడులు నిమిత్తం ఆ సంస్థ సీఈవో ఎలోన్ మస్క్ ఈ ఏడాది ఏప్రిల్ 21,22 తేదీలలో ప్రధాని మోదీతో భేటీ కానున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత టెస్లాకు భారీ బాధ్యతలు ఉన్నాయని మస్క్ ట్వీట్ చేయడం..అనూహ్యంగా చైనాలో ప్రత్యక్షమయ్యారు. దీంతో మస్క్ భారత్‌లో పెట్టుబడుల అంశం వెనక్కి తగ్గింది. తాజాగా, మరోమారు పెట్టుబడులు పెట్టడంపై మస్క్ ట్వీట్ చేయడం వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
మస్క్ రూ.24వేలకోట్లు తిరిగి ఇచ్చేయాలి.. పిటిషన్ దాఖలు
టెస్లా వ్యవస్థాపకులు ఎలొన్‌మస్క్ ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా సంపాదించిన దాదాపు 3 బిలియన్ డాలర్లను(సుమారు రూ.24వేలకోట్లు) తిరిగి వాటాదారులకు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. మైకేల్ పెర్రీ అనే టెస్లా షేర్ హోల్డర్ ఈమేరకు అమెరికాలోని డెలావేర్ ఛాన్సరీ కోర్టులో పిటిషన్ వేశారు.అందులోని వివరాల ప్రకారం.. 2022లో టెస్లా కార్లకు భారీగానే డిమాండ్ ఉంది. కానీ నవంబర్ నెలలో కంపెనీ అంచనాల కంటే అమ్మకాలు తగ్గిపోయాయి. జనవరి 2023లో వెలువడిన నాలుగో త్రైమాసిక ఫలితాలకంటే ముందే మస్క్ చాకచక్యంగా షేర్లు విక్రయించి లాభాలు పొందారు. కంపెనీ సేల్స్ సహా ఇతర విషయాలు తెలుసుకునేందుకు మస్క్‌కు యాక్సెస్ ఉంటుంది. అందుకే ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా ఫలితాల ముందే షేర్లు విక్రయించారు. 2022లో మస్క్మొత్తం 7.5 బిలియన్ డాలర్లు(సుమారు రూ.62వేలకోట్లు) విలువ చేసే షేర్లను అమ్మారు. నవంబర్-డిసెంబర్లో ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా మస్క్ 3 బిలియన్ డాలర్లు(రూ.24వేలకోట్లు) లాభం పొందారు.టెస్లా సీఈఓ పదవిలో ఉన్న ఎలొన్‌మస్క్ నిబంధనలకు విరుద్ధంగా సంపాదించిన లాభాలను వెంటనే వాటాదారులకు తిరిగిచ్చేలా ఆదేశించాలని మైకేల్ పెర్రీ కోర్టును కోరారు. మస్క్ షేర్లను విక్రయించేలా టెస్లా డైరెక్టర్లు కూడా కార్పొరేట్ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. అయితే ఈ విషయంపై రాయిటర్స్ టెస్లాను వివరణ కోరగా ఎలాంటి స్పందన రాలేదని మీడియా కథనాల ద్వారా తెలిసింది.ఇదీ చదవండి: తగ్గిన చమురు ధరలు.. ఒపెక్‌ప్లస్ కూటమి ప్రభావంఇన్సైడ్ ట్రేడింగ్ అంటే..కంపెనీలో పనిచేస్తున్నవారికి రియల్‌టైమ్‌లో సంస్థ ఉత్పత్తులకు డిమాండ్ ఎలా ఉంది..ఉత్పత్తి ఎలా జరుగుతుంది..రాబోయే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనే అంశాలపై అవగాహన ఉంటుంది. దాన్ని అసరాగా చేసుకుని అప్పటికే తమకు కంపెనీలో ఉన్న పెట్టుబడులపై నిర్ణయం తీసుకుని అక్రమంగా లాభాలు పొందుతారు. -
1.25 లక్షల కార్లకు రీకాల్.. టెస్లా సంచలన నిర్ణయం
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఏకంగా 1,25,000 కంటే ఎక్కువ కార్లకు రీకాల్ ప్రకటించింది. సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్ పనితీరులో లోపాలు ఉన్నట్లు గుర్తించి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.రీకాల్ ప్రకటించిన కార్లలో 2012 - 2024 మధ్య తయారైన టెస్లా ఎస్ మోడల్, 2015 - 2024 మధ్య విడుదలైన ఎక్స్ మోడల్, 2017-2023 మోడల్ 3, 2020-2023 మోడల్ Y వాహనాలు ఉన్నాయి. సీట్ బెల్ట్ ధరించని డ్రైవర్లకు రిమైండర్ సిగ్నెల్ అందించాలి, కానీ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్యల కారణంగా ఇది సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించారు. ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది.సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్‌లో ఏర్పడిన లోపాన్ని సరిచేయడానికి టెస్లా ఈ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు కంపెనీ కార్లలో ఈ సమస్య ఉన్నట్లు ఎక్కడా ఫిర్యాదులు అందలేదు. కానీ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఈ సమస్యను గురించినట్లు సమాచారం. -
ఢిల్లీ హైకోర్టులో ఎలోన్ మస్క్ పిటిషన్.. ఎందుకంటే
టెస్లా పవర్ ఇండియా కంపెనీకి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంస్థ పేరు మీద ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఉంటే వాటి అమ్మకాలతో సహా ఇతర వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. గురుగావ్ కేంద్రంగా సేవలందిస్తున్న టెస్లా పవర్ ఇండియాపై అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన దావాపై పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఢిల్లీ హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. టెస్లా పవర్‌పై కేసును హైకోర్టు గురువారం విచారించనుంది.టెస్లా కంపెనీ ట్రేడ్ మార్క్‌తో భారత్‌లోని స్థానిక సంస్థ టెస్లా పవర్ ఇండియా వినియోగిస్తోందని, దీనిపై గందరగోళం నెలకొందని.. వ్యాపార ప్రయోజనాలకు హాని కలిగిస్తోందని వాదించింది. అంతేకాదు టెస్లా పవర్ బ్యాటరీలపై తమకు (టెస్లా-యూఎస్) ఫిర్యాదులు అందుతున్నాయని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో టెస్లా వెల్లడించింది. టెస్లా పవర్ బ్యాటరీలు ఎలోన్ మస్క్ టెస్లా కంపెనీవేనని ప్రచారం చేయడం, లోగోను వినియోగించుకున్నట్లు హైలెట్ చేసింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మస్క్ తరుపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేసింది. -
రూ.4.5 లక్షల కోట్లు భారీ వేతన ప్యాకేజీలో.. మస్క్‌కు ఎదురు దెబ్బ
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్‌కు చెల్లించే భారీ వేతన ప్యాకేజీ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీని ఇవ్వొద్దంటూ టెస్లా షేర్ హోల్డర్లు తమని కోరినట్లు ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్ లూయిస్ తెలిపింది. ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్ లూయిస్ అనేది కార్పొరేట్ కంపెనీల్లో జరిగే కార్యకలాపాల్లో షేర్ హోల్డర్లకు సహాయం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం టెస్లాలో షేర్ హల్డర్ల తరుపున పనిచేస్తోంది. మార్కెట్ విలువను పెంచిఅయితే, ఎలోన్ మస్క్ తన అసాధారణమైన ప్రతిభతో టెస్లా మార్కెట్ విలువను కేవలం 10 ఏళ్ల కాలంలో అన్యూహ్యంగా పెంచారని, 2018లో తొలిసారి మార్కెట్ విలువ 650 బిలియన్ డాలర్లకు చేర్చారని టెస్లా బోర్డు డైరెక్టర్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు టెస్లా బోర్డు డైరెక్టర్లు ఏడాదికి 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీ అందిస్తూ ఆమోదం తెలిపారు. వేతనాన్ని అందించారు.రూ.4.5 లక్షల కోట్ల వేతనం దండగదీనిని వ్యతిరేకిస్తూ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, ఆ సంస్థ డైరెక్టర్లకు వ్యతిరేకంగా టెస్లా వాటాదార్లలో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. ఇంత వేతనం ఇవ్వడం కార్పొరేట్ ఆస్తులను వృథా చేయడమే అవుతుందని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతుండగా.. షేర్ హోల్డర్లు మస్క్‌కు అంత ప్యాకేజీ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గ్లాస్ లూయిస్‌కు ప్రతిపాదనలు పంపారు. తాజా షేర్ హోల్డర్ల నిర్ణయంతో టెస్లాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. అంత ప్యాకేజీ.. అందుకు మస్క్ అనర్హుడేగతంలో టెస్లా షేర్ హోల్డర్ రిచర్డ్ టోర్నెట్టా పిటిషన్‌పై డెలావర్ కోర్టు విచారణ చేపట్టింది. టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు ఎలోన్ మస్క్ అనర్హుడని డెలావేర్ కోర్టు న్యాయమూర్తి కేథలీన్ మెక్కార్మిక్ ఆదేశాలిచ్చారు.అయితే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన పారిశ్రామికవేత్త, తన విలువైన సమయాన్ని కంపెనీ కోసం వెచ్చించాలనే ఉద్దేశంతోనే అంత మొత్తం చెల్లించామని టెస్లా డైరెక్టర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. -
పిల్లల తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చిన మస్క్
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం పెరుగుతుండడం పట్ల టెస్లా సీఈఓ ఎలొన్‌మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. పారిస్‌లోని వివాటెక్ ఫెయిర్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐ అల్గారిథమ్‌ల ద్వారా పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుందో వివరించారు. సోషల్ మీడియాకు పిల్లలను దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు హెచ్చరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పిల్లలను సోషల్ మీడియాకు బానిస అవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి. వాటిలోవాడే అధునాతన ఏఐ అల్గారిథమ్‌లు పిల్లల మానసికస్థితిని దెబ్బతీస్తాయి. అవి చిన్నారుల్లో డొపమైన్ స్థాయిలను పెంచేలా ఉంటాయి. దాంతో వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. సోషల్ మీడియా కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఏఐ ఆధారిత కంటెంట్‌తో వినియోగదారుల దృష్టిని ఆకర్షించేలా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో నా పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించకపోవడం తప్పుగా భావిస్తున్నాను. ప్రస్తుతం కొన్ని పరిమితులు విధించాను. పిల్లలు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో గమనిస్తున్నాను’ అని చెప్పారు.ఎలొనమస్క్ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో వచ్చే పిల్లల కంటెంట్ అంశంపై ఆయన స్పందించారు. చిన్నారుల కంటెంట్ విషయంలో తమ సంస్థ అప్రమత్తంగా ఉందన్నారు. అనవసర అంశాలను తొలగించడానికి కంపెనీ చురుకుగా పనిచేస్తోందని చెప్పారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. అదికాస్త వైరల్‌గా మారింది. పారిస్ ఈవెంట్లో మస్క్ ఏఐ ప్రభావంపై మాట్లాడుతూ..‘కృత్రిమమేథ చివరకు అందరి ఉద్యోగాలు కోల్పోయేలా చేస్తుంది. ఏఐ ఆధిపత్యం ఉన్న ప్రపంచంలో మానవ మనుగడ ఎలా ఉండబోతుందోననే ఆందోళనలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: ప్రపంచానికి సవాలుగా మారుతున్న ఖనిజ లోహాల కొరతమస్క్ ఈ సందర్భంగా ఇయాన్ ఎం.బ్యాంక్స్ విడుదల చేసిన ‘కల్చర్ బుక్ సిరీస్’ గురించి ప్రస్తావించారు. ఇది అధునాతన ఏఐ ఉండే సమాజాన్ని తెలియజేస్తుంది. ఈ బుక్ సిరీస్‌లో భవిష్యత్తును చూపించారని మస్క్ అన్నారు. ‘కంప్యూటర్లు, రోబోట్లు ప్రతిదీ మీ కంటే మెరుగ్గా చేస్తే మీ జీవితానికి అర్థం ఉందా? ఇకపై ఏఐను మించేలా మానవులు మరిన్ని మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది’ అని తెలిపారు.A lot of social media is bad for kids, as there is extreme competition between social media AIs to maximize dopamine! https://t.co/bzB8m5qL9z— Elon Musk (@elonmusk) May 23, 2024 -
టెస్లా కొనుగోలు దారులకు మస్క్ అనూహ్య ఆఫర్
టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ బంపరాఫర్ ప్రకటించారు. టెస్లా ‘మోడల్ వై’ (Model Y) కొనుగోలు దారులకు 0.99శాతం ఏపీఆర్(యాన్యువల్ పర్సెంటేజ్ రేట్) ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్ మే 31వరకు కొనసాగుతుంది. ఆటోమొబైల్ మార్కెట్లో ఇతర ఎలక్ట్రిక్ కార్ల కంపెనీల నుంచి పోటీ, తగ్గిపోతున్న కార్ల అమ్మకాలు టెస్లాపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.ఈ తరుణంలో టెస్లా అమ్మకాలను పెంచే ప్రయత్నంలో టెస్లా మోడల్ వైపై మోడల్ వై భారీ ఆఫర్లు ఇస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చైనా వాహనదారులు జీరో పర్సెంట్ వడ్డీతో టెస్లా కారును కొనుగోలు చేసే వెసులు బాటు కల్పించారు. దీంతో వడ్డీ చెల్లించే అవసరం లేకుండా టెస్లా కారును సొంతం చేసుకోవచ్చు.తాజాగా, అమెరికాలో మోడల్ వైపై 0.99% ఫైనాన్సింగ్‌తో భారీ తగ్గింపుతో పరిమిత కాల ఆఫర్‌ను అందిస్తున్నట్లు టెస్లా అధికారికంగా తెలిపింది. సాధారణంగా ఈ వడ్డీ 5 నుండి 7శాతం వరకు ఉంటుంది. కానీ మస్క్ వాహన కొనుగోలు దారులకు 0.99 శాతం వడ్డీకే టెస్లా వై మోడల్ కారును అందిస్తున్నారు. టెస్లా వెబ్సైట్ ప్రకారం, నిబంధనల మేరకు టెస్లా మోడల్ వై కొనుగులు దారులు 4,250వేల డాలర్లు డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 72 నెలల టెన్యూర్ ఫైనాన్స్ అందిస్తుంది. ఎలాంటి బెన్ఫిట్ లేకుండా నెలకు 603 డాలర్ల ఈఎంఐ చెల్లించాలి. అర్హతగల కొనుగోలుదారులు ఫెడరల్ టాక్స్ క్రెడిట్ నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. ఇది నిర్దిష్ట ఆదాయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారికి నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది. కేవలం 499 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. -
శ్రీలంకలో స్టార్‌లింక్ సేవలకై చర్చ
టెస్లా అధినేత ఎలొన్‌మస్క్ శ్రీలంకలో స్టార్‌లింక్ సేవలు విస్తరించాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఇండోనేషియా-బాలిలో జరిగిన 10వ వరల్డ్ వాటర్ ఫోరమ్‌లో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో మస్క్ సమావేశమయ్యారు.ఎలొన్‌మస్క్ ఇటీవల చైనాతోపాటు ఇండోనేషియాను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాలోని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ యాక్సెస్‌ను మెరుగుపరచాలనే లక్ష్యంతో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ను ప్రారంభించారు. తాజాగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు. శ్రీలంకలోనూ స్టార్‌లింక్ సేవలు అందించాలనే చర్చ జరిగినట్లు తెలిసింది.ప్రెసిడెంట్ మీడియా విభాగం తన ఎక్స్ ఖాతాలో ఈ మేరకు సమాచారాన్ని పంచుకుంది. ‘వరల్డ్ వాటర్ ఫోరమ్‌లో దేశాధ్యక్షుడు స్టార్‌లింక్ అమలుపై మస్క్‌తో చర్చించారు’ అని తెలిపింది. శ్రీలంక నీటి సరఫరా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మినిస్టర్ జీవన్ తొండమాన్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ..‘బాలిలో జరుగుతున్న ఈవెంట్లో దేశ అధ్యక్షుడు, ఎలొన్మస్క్తో కలిసి సమావేశం అయ్యారు. దేశ ఆర్థిక పునరుద్ధరణ, పెట్టుబడికి కొత్త అవకాశాలు వంటి అంశాలపై చర్చించాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా మస్క్ స్పందిస్తూ..‘రిమోట్ కమ్యూనిటీలకు ఇంటర్నెట్ కనెక్టివిటీను అందుబాటులోకి తీసుకొస్తే విద్య, ఆర్థిక అవకాశాలు మెరుగుపడుతాయి’ అని పేర్కొన్నారు.Bringing connectivity to remote communities radically improves access to education and economic opportunitiespic.twitter.com/hDVYvpRDKZ— Elon Musk (@elonmusk) May 19, 2024 -
‘మళ్లీ తొలగింపులా?’, మస్క్ కఠిన నిర్ణయం..ఆందోళనలో ఉద్యోగులు
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఎలోన్ మస్క్ ఉద్యోగుల విషయంలో కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో 10 శాతం మంది వర్క్ ఫోర్స్‌ను తొలగించనున్నారనే ఊహాగానాలు ఆ సంస్థ ఉద్యోగుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఖర్చు తగ్గింపు, క్యూ1లో కంపెనీ పేలవమైన ప్రదర్శన, అనిశ్చితితో పాటు పలు అంశాలు లేఆఫ్స్‌కు కారణమని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇప్పటికే కొంతమందిని తొలగించగా.. జూన్ నెల ముగిసే లోపు మరింత మందికి ఉద్వాసన పలకనుందని సమాచారం. దీనికి తోడు ఉద్యోగుల తొలగింపుకు పరోక్షంగా ఏఐ కారణమని తెలుస్తోంది. గత కొంత కాలంగా మస్క్ తన దృష్టిని ఈవీ వైపు కాకుండా ఏఐ, రోబోటిక్స్ వంటి టెక్నాలజీలకు సారించడం, ఈవీల తయారీ కంటే రోబోట్యాక్సీ వంటి ప్రాజెక్ట్‌లకు మస్క్ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే నైతికత క్షీణించిందని కొందరు ప్రస్తుత ఉద్యోగులు చెప్పారు.లేఆఫ్‌ల ముగింపుకు సంబంధించి మస్క్ నుండి స్పష్టమైన సూచన లేకపోవడం ఉద్యోగుల్లో ఆందోళనకు ఆజ్యం పోసింది. ఇక టెస్లా ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగులు సేల్స్, హెచ్ఆర్తో పాటు పలు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రభావితం కానున్నారు. -
భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
భారత్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీని బట్టి పాలసీని రూపొందించలేదని, అన్నీ ఈవీ కంపెనీలకు ఒకేరకమైన పాలసీ ఉంటుందంటూ నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అమితాబ్ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత్ మార్కెట్లోకి టెస్లా ఎంట్రీపై అమితాబ్ కాంత్ ఓ కార్యక్రమంలో పరోక్షంగా స్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పాలసీలు అన్ని కంపెనీలు ఆ విధానాన్ని మాత్రమే అనుసరించాలని అమితాబ్ కాంత్ చెప్పారు. కొన్ని నిర్దిష్ట కంపెనీల ప్రకారం భారత్ తన ఈవీ పాలసీ విధానాన్ని మార్చదని స్పష్టం చేశారు. అంతేకాదు టెస్లా సంస్థ తమకు ప్రత్యేకంగా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి ఉండొచ్చు. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రభుత్వం ఈవీ పాలసీని ప్రవేశ పెట్టిందని అన్నారు. భారత్‌లో కనీసం రూ.4150 కోట్ల పెట్టుబడి పెట్టే ఈవీ సంస్థలకు రాయితీలు అందిస్తామని కేంద్రం తెలిపింది. పాలసీ ప్రకారం దేశంలో ఈవీ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలి. లేదంటే దేశీయంగా తయారయ్యే విడిభాగాలను కనీసం 25శాతం వినియోగించాలి. ఐదేండ్ల తర్వాత ఆ మొత్తం వినియోగాన్ని 50 శాతానికి పెంచాలి అని ఈవీ పాలసీలో పేర్కొంది.కొత్త విధానం ప్రకారం, భారతదేశంలో ఈవీ ప్యాసింజర్ కార్ల తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలపై 15 శాతం తక్కువ కస్టమ్స్/దిగుమతి సుంకంతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉంది. -
టెస్లా సైబర్‌ట్రక్ పక్కన సౌదీ ప్రిన్స్.. మస్క్ ట్వీట్ వైరల్
సౌదీ యువరాజు 'తుర్కీ బిన్ సల్మాన్ అల్ సౌద్' టెస్లా సైబర్‌ట్రక్ పక్కన నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటో సాధారణ నెటిజన్లను మాత్రమే కాకుండా టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'ను (Elon Musk) కూడా ఆకర్శించింది.నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోను మస్క్ రీ ట్వీట్ చేస్తూ 'కూల్' అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ పోస్టుకు వేలసంఖ్యలో లైక్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.టెస్లా సైబర్ ట్రక్టెస్లా సైబర్‌ట్రక్ విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర 60990 డాలర్లు (రూ. 50.83 లక్షలు), హై వేరియంట్ ధర 99,990 డాలర్లు (రూ. 83.21 లక్షలు). ఇది డ్యూయెల్, ట్రై మోటర్ అనే రెండు ఆప్షన్లలలో లభిస్తుంది. డ్యూయెల్ మోటార్ 600 బీహెచ్పీ పవర్, ట్రై మోటార్ 845 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.డ్యూయెల్ మోటార్ మోటార్ 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, ట్రై మోటార్ మోడల్ 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టెస్లా సైబర్‌ట్రక్ రేంజ్ 547 కిమీ వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.Cool https://t.co/oS0gzawPCg— Elon Musk (@elonmusk) May 18, 2024 -
ఏలియన్స్ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్ ఏమన్నారంటే?
ఏలియన్స్.. ఎప్పుడైనా.. ఎవరికైనా ఇంట్రెస్ట్ కలిగించే టాపిక్. ఎలియన్స్ ఉన్నాయా..? లేవా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే..! అయితే.. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఎలియన్స్ లేవని తేల్చేశారు. ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా..? అవి భూమ్మిదకు వచ్చాయా..? అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే UFOలు ఏలియన్స్‌వేనా..? ఇవి ప్రశ్నలు కాదు..! కొన్ని దశాబ్దాలుగా అందరినీ వేధిస్తున్న అనుమానాలు..! ఏలియన్స్ ఉన్నాయని.. మనుషులతో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఏదో ఒక సమయంలో కచ్చితంగా భూమిపైకి వస్తాయని నమ్మేవారు కొందరైతే.. అసలు ఏలియన్సే లేవని ఈజీగా కొట్టిపారేసేవారు మరికొందరు. ఇప్పుడు ఈ సెకండ్ లిస్ట్‌లోకి యాడ్ అయ్యారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఏలియన్స్ ఉన్నాయనేందుకు అసలు ఆధారాలే లేవని తేల్చిపారేశారు.ఎలాన్ మస్క్..! ఈ జనరేషన్‌కు పరిచయం అవసరం లేని పేరు..! తన మాటలు.. తన చేతలు.. తన ప్రయోగాలు.. అన్ని సెన్సేషనే..! ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎలాన్ మస్క్.. కొత్త ప్రయోగాలు చేస్తూ.. కొత్త కొత్త టెక్నాలజీలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టును చేపడుతూనే ఉంటారు. ఈ టెక్నాలజీలో కచ్చితంగా తన మార్క్‌ను చూపించిన ఘనత ఎలాన్ మస్క్‌కే దక్కింది. టెస్లా పేరుతో తయారు చేసిన కార్లు ఎంత పెద్ద హిట్టో.. మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టేందుకు చేసిన ప్రయోగమూ అంతే సెన్సేషన్‌గా నిలిచింది. ఇదొక్కటే కాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..! స్పేస్ ఎక్స్ పేరుతో శాటిలైట్లు లాంచ్ చేసినా.. సోషల్ మీడియా సెన్సేషన్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసి ఎక్స్ అని పేరు మార్చినా అది.. ఎలాన్ మస్క్‌కే సాధ్యం.అలాంటి ఇలాన్ మస్క్.. ఏలియన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి.. ఏలియన్స్ లేవని మస్క్ తేల్చిపారేశారు. ఏలియన్స్ ఉనికిపై తనకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. HOW TO SAVE THE HUMANS పేరుతో జరిగిన డిబేట్లో పాల్గొన్న మస్క్.. ఏలియన్స్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ అనే జీవులు ఏవీ భూమిపై కాలు పెట్టలేదని తేల్చేశారు. కక్షలో స్పేస్ ఎక్స్‌కు చెందిన వేలాది బ్రాడ్ బ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్‌లు ఉన్నాయని.. కానీ ఎప్పుడూ ఏలియన్స్ ఉనికి కనిపించలేదని తన వాదనలు వినిపించారు. అయితే.. ఎవరైనా ఆధారాలు చూపిస్తే మాత్రం ఏలియన్స్‌పై ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అయితే.. ఆషామాషీగా కాకుండా.. సీరియస్ ఆధారాలతోనే రావాలని చెప్పారు. కానీ.. ఎవరూ అలాంటి ఆధారాలు తీసుకురాలేరని.. ఏలియన్స్ ఉనికే లేదని చెప్పేశారు.మరి నిజంగానే ఏలియన్స్ లేవా..? లేక మనషులకు దూరంగా ఉన్నాయా..? ఏలియన్స్ ఉంటే.. ఎప్పటికైనా భూమిపైకి వచ్చి మనుషులకు కనిపిస్తాయా..? ఎలన్ మస్క్ అవన్నీ ఉత్తమాటలే అని కొట్టిపారేసినా మిలియన్ డాలర్ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి..! -
మరో 600 జాబ్స్‌కి గండం!
Tesla Layoffs: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పని చేస్తున్న దాదాపు 10 శాతం మంది సిబ్బందిని తొలగించిన టెస్లా.. తాజాగా మరింత మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది.టెస్లా సోమవారం ప్రభుత్వ ఏజెన్సీలకు ఇచ్చిన నోటీసు ప్రకారం, కాలిఫోర్నియాలో అదనంగా 601 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించిన గ్లోబల్ ఉద్యోగ కోతల్లో భాగంగా కాలిఫోర్నియా, టెక్సాస్‌లలో 6,020 మందిని తొలగించనున్నట్లు గత నెలలో తెలిపింది.టెస్లా కార్ల విక్రయాలు ఇటీవల కాలంలో భారీగా పడిపోయాయి. మరోవైపు ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ భారీగా పెరిగింది. దీంతో టెస్లా కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విక్రయాలు పెంచడం కోసం ధరలను తగ్గించింది. త్వరలో అందుబాటు ధరలో కొత్త కార్లను తీసుకురానున్నట్లు టెస్లా తెలిపింది. మరోవైపు ఖర్చులను తగ్గించేందుకు పెద్ద ఎత్తున తమ కంపెనీలను ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 శాతం మంది సిబ్బందిని తొలగించింది. -
త్వరలో మస్క్‌కు ముప్పు.. భారత్ సంతతి సీఈవో సంచలన వ్యాఖ్యలు
టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ త్వరలో భారీ నష్టాల్ని చవిచూడనున్నారంటూ భారత సంతతి ఆంత్రప్రెన్యూర్ వివేక్ వాధ్వా హెచ్చరించారు. ఇటీవల టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ భారత్‌లో కాదని చైనాతో సంత్సంబంధాలు నెరపడంపై ఎక్స్ వేదికగా వివేక్ వాధ్వా మస్క్‌ను ప్రశ్నించారు.తన ఈవీ కార్యకలాపాల కోసం భారత్‌ను కాదని చైనాని ఎంచుకోవడం మస్క్ భారీ మొత్తంలో నష్టపోనున్నారని వివేక్ వాధ్వా అన్నారు. చైనాలో ప్రమాదం అంచున వ్యాపారాలపై మస్క్‌కు మెయిల్ చేసినట్లు వెల్లడించారు. చైనా మస్క్‌ను గుడ్డిగా దోచుకుంటుందని నేను అతనిని ముందే హెచ్చరించాను. కార్ల తయారీని చైనా నుంచి భారత్‌కు తరలించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ రష్యా యూరప్ ఆసియా స్టడీస్ డైరెక్టర్ థెరిసా ఫాలన్ పోస్ట్‌ను వివేక్ వాధ్వా ఉటంకించారు. థెరిసా ఫాలన్ తన పోస్ట్‌లో అమెరికా, యూరోపియన్ ఆటోమేకర్స్ చైనాలో ఎందుకు విఫలమవుతున్నారు. స్వల్ప కాలిక లాభాల కోసం టెక్, మేనేజ్మెంట్ టెక్నిక్ అంశాల్ని అక్కడ అమలు చేయడం ద్వారా చైనా ఎలాంటి ప్రయోజనాల్ని పొందుతుందని నివేదించారు. వాటి ద్వారా కార్ల తయారీ సంస్థలు ఎలా నష్టపోతున్నారని వివరించారు. ఆ అంశాన్ని ప్రధానంగా చర్చించిన వాధ్వా మస్క్ గురించి పై విధంగా వ్యాఖ్యానించారు. -
అసోం కాంగ్రెస్ ‘ఎక్స్’ అకౌంట్లో టెస్లా లోగో.. ఏం జరిగిందంటే..
అసోం కాంగ్రెస్ అధికారిక ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతా బుధవారం హ్యాక్ అయింది. ప్రొఫైల్ పేరు 'టెస్లా ఈవెంట్'గా మారిపోయింది. ప్రొఫైల్ ఫొటోగా అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా లోగోను పెట్టారు హ్యాకర్లు.ఈ మేరకు అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఖాతా హ్యాక్‌కు గురైందని ఏపీసీసీ సోషల్ మీడియా & ఐటీ చైర్మన్ రతుల్ కలితా గౌహతిలోని భంగాగర్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్ హ్యాక్ అయిందని, ఇప్పుడే పునరుద్ధరించామని అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుధవారం మధ్యాహ్నం ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపింది. పూర్తి భద్రతను నిర్ధారించడానికి ప్రస్తుతం సమీక్షలో ఉందని పేర్కొంది. ఇది ప్రభుత్వ పనే అంటూ కాంగ్రెస్ ఆరోపించింది.We would like to inform you that our official Twitter handle, Assam Pradesh Congress Committee, was hacked but has now been restored and is currently under review to ensure full security. This attempted silencing by the fascist government will not deter us. We remain committed to… pic.twitter.com/DE7vWGXWcv— Tesla Event (@INCAssam) May 8, 2024 -
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా కంపెనీలో సుమారు ఏడు సంవత్సరాలు పనిచేసిన ఓ ఉద్యోగిని ఒక్క ఈమెయిల్‌తో తొలగించినట్లు వెల్లడించింది.దాదాపు ఏడేళ్ల పాటు ఎంతో నమ్మకంగా పని చేసిన తన సోదరి లేఆఫ్‌కి గురైన తీరుపై ఆమె సోదరుడు జతిన్ సైనీ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఇందులో గత నెలలోనే ఆమె ప్రమోషన్ (పదోన్నతి) పొందినట్లు పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన తరువాత వారు న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్కు మకాం మార్చాలని కూడా అనుకున్నట్లు పేర్కొన్నారు.రోజు మాదిరిగానే జతిన్ సైనీ సోదరి మే 3న ఆఫీసుకు వెళ్తే తన కార్డు పనిచేయకపోవడాన్ని గమనించి విస్తుపోయింది. ఆశలన్నీ ఆవిరైపోవడంతో ఆమె చాలా బాధపడింది. ఆమెను మాత్రమే కాకుండా ఆమె టీమ్‌లో ఉండే దాదాపు 73 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఏడు సంవత్సరాలు ఎంతో నమ్మకంగా పనిచేసినప్పటికీ ఒక్క మైయిల్ పంపి తీసివేయడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది.పోస్ట్ చివరలో.. జతిన్ సైనీ తన సోదరి ఉద్యోగాన్ని కోల్పోవడంతో కార్పొరేట్ నిర్ణయాల వెనుక ఉన్న విలువలను గురించి వెల్లడించారు. టెస్లాలో ఏడు సంవత్సరాలు పనిచేస్తే.. కష్టాన్ని ఏ మాత్రం గుర్తించకుండా ఇప్పుడు బయటకు పంపారు. శ్రమ మొత్తం సున్నా అయిపోయిందని అన్నారు.టెస్లా కంపెనీ ఏప్రిల్ నెలలో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతం కంటే ఎక్కువమందిని తొలగించింది. గ్లోబల్ మార్కెట్లో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కారణంగా ఇప్పటికి నాలుగు సార్లు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. దీంతో టెస్లాలో ఉద్యోగం గాల్లో దీపంలాగా అయిపోయింది. -
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే గత వారం ఇలాన్ మస్క్ (Elon Musk) టెస్లాలో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.ఇటీవల టెస్లా తొలగించిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు సూపర్‌చార్జర్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్‌గా పని చేస్తున్న 'రెబెక్కా టినుచీ', మరొకరు న్యూ వెహికల్ ప్రోగ్రామ్ హెడ్ 'డేనియల్ హో' ఉన్నారు. వీరితో పాటు పలువురు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు పేర్కొన్నారు. తమకు అందిన ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను లింక్డిన్లో షేర్ చేయడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.టెస్లా సీఈఓ మస్క్ ఏప్రిల్ 14న కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతానికంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రిక్రూట్మెంట్, మార్కెటింగ్, సూపర్‌చార్జింగ్ టీమ్‌తో సహా వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. ఒక్క సూపర్‌చార్జింగ్ టీమ్‌లోనే సుమారు 500 మంది ఉద్యోగాలను తొలగించినట్లు సమాచారం.ఇప్పటికే మూడు సార్లు లేఆప్స్ ప్రకటించిన టెస్లా మరోమారు ఉద్యోగులను తొలగించడానికి పూనుకుంది. దీంతో ఉద్యోగుల్లో లేఆప్స్ భయం నిండిపోయింది. కంపెనీ ఉద్యోగులను తగ్గించడానికి ప్రధాన కారణం.. అంచనాల కంటే తక్కువ డెలివరీ సంఖ్యలు నమోదు చేయడమనే తెలుస్తోంది. -
ఇంకా తగ్గని లేఆప్స్ బెడద.. నాలుగు నెలల్లో 80 వేలమంది
కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచి.. ఉద్యోగులకు కష్టంకాలం మొదలైపోయింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గినా.. లేఆప్స్ మాత్రం తగ్గడమే లేదు. 2024 మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 80,000 మంది ఉద్యోగాలను కోల్పోయారు.సుమారు 279 టెక్ కంపెనీలు ఇప్పటి వరకు (మే 3 వరకు) 80,230 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఆర్ధిక అనిశ్చితుల కారణంగా.. లాభాలు తగ్గుతున్నాయి. దీంతో టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. దీనికి తోడు కొత్తగా పుట్టుకొస్తున్న టెక్నాలజీలు కూడా ఉద్యోగుల మీద తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.2024లో కూడా ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో టెస్లా, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.ఏప్రిల్ నెలలో మాత్రమే దిగ్గజ కంపెనీలు 20000 కంటే ఎక్కువమందిని తొలగించాయి. టెకీల పరిస్థితి ప్రస్తుతం గాల్లో దీపం లాగా మారిపోతున్నాయి.యాపిల్ కంపెనీలో స్మార్ట్ కారు, స్మార్ట్ వాచ్ డిస్ప్లే వంటి ప్రత్యేక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 600 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ కూడా ఈ బాటలోనే అడుగులు వేసింది.అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో.. ఏకంగా 10 శాతం మందిని విధుల నుంచి తప్పించింది. ఓలా క్యాబ్స్ కూడా 10 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించింది. హెల్త్ టెక్ స్టార్టప్ కంపెనీ, వర్ల్ పూల్, టెలినార్ మొదలైన కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తొలగించింది. -
భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..
గురుగ్రామ్‌లోని టెస్లా పవర్ ఇండియా అనధికారికంగా తమ ట్రేడ్‌మార్క్‌ను వాడుకుంటోందని ఎలొన్‌మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా ఇంక్ గురువారం దిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేసింది. టెస్లా పవర్.. టెస్లా ఇంక్ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని సంస్థ తరఫు న్యాయవాది చందర్ లాల్ కోర్టును అభ్యర్థించారు.‘గురుగ్రామ్ ఆధారిత కంపెనీ టెస్లా పవర్ ఇండియా.. టెస్లా ఇంక్ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోంది. కంపెనీ వ్యాపారాలపై కూడా దాని ప్రభావం పడుతోంది. టెస్లా పవర్ బ్యాటరీలకు సంబంధించిన ఫిర్యాదులను తమ వినియోగదారులు పొరపాటుగా టెస్లా ఇంక్‌తో లింక్ చేస్తున్నారు. ఆ ఫిర్యాదులను నేరుగా అమెరికన్ కంపెనీకి ఫార్వర్డ్ చేస్తున్నారు. టెస్లా పవర్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీగా జాతీయ వార్తాపత్రికల్లో అమెరికన్ కంపెనీ లోగోతో ప్రచారం చేసింది. టెస్లా పవర్ ‘టెస్లా’ ట్రేడ్‌మార్క్ వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి’ అని చందర్లాల్ వాదనలు వినిపించారు.టెస్లా పవర్ ఈవీ బ్యాటరీలను ఉత్పత్తి చేయదని సంప్రదాయ వాహనాలు, ఇన్వర్టర్లలో ఉపయోగించే లెడ్ యాసిడ్ బ్యాటరీలను విక్రయిస్తుందని వాదించింది. ఈ సందర్భంగా కంపెనీ ఛైర్మన్ కవీందర్ ఖురానా మాట్లాడుతూ..తమ కంపెనీకి యూఎస్‌లో భాగస్వామ్య సంస్థ ఉందన్నారు. అయితే తాము ఎలాంటి ఈవీను తయారుచేయమని స్పష్టం చేశారు. ఈవీ మార్కెట్లోకి ప్రవేశించే ఉద్దేశం తమ కంపెనీకి లేదని ఖురానా చెప్పారు. తాము మరో సంస్థ ‘ఈ-అశ్వ’తో కలిసి ప్రకటన ఇచ్చినట్లు పేర్కొన్నారు. టెస్లా పవర్ బ్రాండెడ్ ఉత్పత్తుల విక్రయానికి ఈ కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పెంచేలా ఏం చేస్తున్నారంటే..ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిష్ దయాల్ టెస్లా పవర్‌కి నోటీసు జారీ చేశారు. తదుపరి విచారణను మే 22 తేదీకి వాయిదా వేశారు. టెస్లా ఇంక్‌ను పోలి ఉండే ట్రేడ్‌మార్క్‌తో ఎలాంటి ప్రచార ప్రకటనలను విడుదల చేయకూడదని ఆదేశించారు. అయితే, టెస్లా ఇంక్ ఈ కేసులో ఎలాంటి ఎమర్జెన్సీను ప్రదర్శించలేదని తెలిసింది. 2020 నుంచి ఇరు కంపెనీల మధ్య సంప్రదింపులు సాగుతున్నట్లు సమాచారం. -
ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాలో లేఆఫ్‌లు అలజడి సృష్టిస్తున్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వరుసపెట్టి కంపెనీని వీడుతున్నారు. తాజాగా టాప్ హ్యూమన్ రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ అల్లి అరేబాలో కంపెనీని వీడారు.అరేబాలో ఇక కంపెనీలో కనిపించరని, ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) చెప్పినట్లుగా మనీ కంట్రోల్ కథనం పేర్కొంది. నేరుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్‌కి రిపోర్టింగ్ చేసే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆమె అంతట ఆమె కంపెనీని వీడారా.. లేక ఉద్యోగాల కోతలో భాగంగా ఉద్వాసనకు గురయ్యారా అనేది స్పష్టంగా తెలియలేదు. దీనిపై అటు మస్క్ గానీ, అరేబాలో గానీ స్పందించలేదు.ఈ ఎలక్ట్రిక్-వెహికల్ మేకర్ కంపెనీ వ్యాప్తంగా భారీగా ఉద్యోగాలను తగ్గిస్తోందని, సుమారు 20 శాతం సిబ్బంది తగ్గింపును లక్ష్యంగా చేసుకుందని బ్లూమ్‌బెర్గ్ గత నెలలో నివేదించింది. టెస్లాలో ఉన్నత స్థాయి వ్యక్తులుగా పేరున్న నలుగురిలో ఒకరైన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డ్రూ బాగ్లినోతో సహా మస్క్ టాప్ లెఫ్టినెంట్లలో కొందరు కూడా కొన్ని వారాల క్రితం రాజీనామా చేశారు.ఇటీవలి నెలల్లో వాహన విక్రయాలు క్షీణించడం ప్రారంభించినప్పటి నుండి ఖర్చుల కట్టడి, సిబ్బంది కోతపై ఎలాన్ మస్క్ దృష్టి పెట్టారు. టెస్లా ఛార్జింగ్ కనెక్టర్లను స్వీకరించే ప్రక్రియలో ఇతర ఆటోమేకర్లతో భాగస్వామ్యాన్ని పర్యవేక్షిస్తున్న కంపెనీ సూపర్‌చార్జర్ టీమ్‌లో చాలా మందిని ఇప్పటికే తొలగించారు. అరేబాలో కంపెనీలో అత్యంత సీనియర్ మహిళా ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. 2023 ఫిబ్రవరి నుంచి ఈ పదవిలో ఉన్నారు. అలాగే సుమారు ఆరేళ్లుగా టెస్లాలో పనిచేస్తున్నారు. -
మస్క్‌కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
తన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల మ్యాపింగ్, నావిగేషన్ ఫంక్షన్ల కోసం చైనా అతిపెద్ద సెర్చింజిన్ బైదూతో ప్రముఖ ఈవీ దిగ్గజం టెస్లా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో చైనాలో టెస్లా లేటెస్ట్ డ్రైవింగ్ ఫీచర్లను పరిచయం చేయడానికి కీలకమైన అడ్డంకిని తొలగించుకోబోతుందని తెలుస్తోంది. ఫలితంగా టెస్లా స్టాక్ ధర 10 శాతానికి పైగా పెరిగింది.బైదూ అందించే టాప్ లేన్ లెవల్ నావిగేషన్, మ్యాపింగ్ ఆధారంగా టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల సేవలను అందుబాటులోకి తెచ్చే సౌలభ్యం కలగనుందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కాగా, టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థ ఇప్పటి వరకు చైనాలో అందుబాటులో లేదు. దీన్ని అక్కడ ప్రవేశపెట్టేలా చైనా ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో చైనా కస్టమర్లకు సంబంధించిన డేటాను దేశం వెలుపలికి తీసుకెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో చైనా వెలుపలికి డేటాను బదిలీ చేసే అంశంపై కూడా మస్క్ ప్రభుత్వంతో చర్చించారు. -
భారత పర్యటన రద్దు.. అకస్మాత్తుగా చైనాలో ప్రత్యక్షమైన మస్క్
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ చైనాలో ప్రత్యక్షమయ్యారు. గత కొంత కాలంగా మస్క్ సారథ్యంలోని టెస్లా భారత్‌లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని, ఇందుకోసం మస్క్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.కేంద్రం సైతం మస్క్ ఏప్రిల్ నెల 21, 22 తేదీలలో వస్తున్నారంటూ సూచనప్రాయంగా తెలిపింది. కానీ పలు అన్వేక కారణాల వల్ల భేటీ రద్దయింది. అయితే ఈ నేపథ్యంలో టెస్లా సీఈఓ తన ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ)కార్లలోని సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేసేందుకు,ఎఫ్ఎస్డీ అల్గారిథమ్‌లకు శిక్షణ ఇవ్వడానికి దేశంలో సేకరించిన డేటాను విదేశాలకు బదిలీ చేసేందుకు కావాల్సిన అనుమతులను పొందేందుకు బీజింగ్‌లోని చైనా అధికారులతో భేటీ కానున్నారు.మరోవైపు ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై ఎక్స్‌లో చర్చ మొదలైంది.దీనిపై మస్క్ స్పందిస్తూ అతి త్వరలో డ్రాగన్ కంట్రీలో ఎఫ్ఎస్డీ కార్లు అందుబాటులోకి రానుందని తెలిపారు. -
నాలుగు నెలలు కాకుండానే.. మార్కెటింగ్ టీమ్ మొత్తానికి మంగళం!
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ టెస్లా కంపెనీ వ్యాప్త తొలగింపులలో భాగంగా కొత్తగా ఏర్పడిన మార్కెటింగ్ బృందం మొత్తాన్ని తొలగించింది. సాంప్రదాయ ప్రకటనలకు భిన్నంగా కొన్ని నెలల కిందటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్ ఈ టీమ్‌ను ఏర్పాటు చేశారు. సీనియర్ మేనేజర్ అలెక్స్ ఇంగ్రామ్ పర్యవేక్షణలో యూఎస్‌లో 40 మంది ఉద్యోగులతో ఏర్పాటు చేసిన "గ్రోత్ కంటెంట్" టీమ్ అంతటినీ తొలగించిట్లు తెలిసింది. గ్లోబల్ టీమ్‌కు నాయకత్వం వహించిన ఇంగ్రామ్, జార్జ్ మిల్బర్న్లను తొలగించినట్లు వారు తెలిపారు. అయితే ఐరోపాలో కంపెనీకి ఇప్పటికీ తక్కువ సంఖ్యలో మార్కెటింగ్ సిబ్బంది ఉన్నట్లు ఒకరు చెప్పారు.అలాగే కాలిఫోర్నియాలోని హౌథ్రోన్లో ఉన్న టెస్లా డిజైన్ స్టూడియో సిబ్బందిలో కూడా గణనీయమైన తొలగింపులు జరినట్లుగా తెలిసింది. కాగా బ్లూమ్‌బెర్గ్ నివేదికకు ఎలాన్ మస్క్ ప్రతిస్పందిస్తూ కంటెంట్ బృందం పని గురించి ‘ఎక్స్’ పోస్ట్‌లో "ప్రకటనలు చాలా సాధారణంగా ఉంటున్నాయి.. ఏదైనా కారుకైనా సరిపోవచ్చు" అంటూ రాసుకొచ్చారు. తొలగింపులకు గురైన గ్రోత్ టీమ్‌ను ఇంగ్రామ్ నాలుగు నెలల క్రితం నుంచే నిర్మించడం ప్రారంభించారు.టెస్లా గ్రోత్ టీమ్ తొలగింపు సంస్థలో అతిపెద్ద ఉద్యోగాల కోతను సూచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిలో 10 శాతం మందిని తొలగించనున్నట్లు ఎలాన్ మస్క్ గతవారం తెలిపారు. అయితే కంపెనీ సీఈవో 20 శాతం ఉద్యోగులను తొలగింపులకు ఆదేశించినట్లుగా బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. 20,000 మందిపైగా ఉద్యోగులను కంపెనీ తొలగించవచ్చు. -
టాప్ ఈవీ తయారీ సంస్థ క్యూ1 ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
అమెరికాలోని టాప్ ఈవీ తయారీ కంపెనీగా పేరున్న టెస్లా ఇటీవల విడుదల చేసిన మొదటి త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్లకు షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ఇచ్చిన హామీ మేరకు 3,87,000 యూనిట్లను డెలివరీ చేసినట్లు కంపెనీ తెలిపింది. అయితే క్యూ1 ఫలితాల్లో టెస్లా అమ్మకాలు అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 8.5 శాతం తగ్గాయి. దాంతో కంపెనీ రెవెన్యూ భారీగా తగ్గిపోయింది. ఏడేళ్లలో కంపెనీ ఇంతలా నష్టపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రెవెన్యూ తగ్గడంతో ఇటీవల కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10శాతం మందిని కొలువుల నుంచి తొలగించినట్లు టెస్లా ప్రకటించింది. అంటే సుమారు 14వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. చైనా ఈవీ తయారీ సంస్థల నుంచి టెస్లాకు భారీ పోటీ నెలకొన్నట్లు తెలిసింది. చైనాతోపాటు అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలు ఈవీలను తయారుచేస్తున్నాయి. టెస్లాలో వాడుతున్న ఫీచర్లతోపాటు అదనంగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. దాంతో వినియోగదారులు ఇతర కంపెనీ ఉత్పత్తులు కొనేందుకు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్యటన వాయిదా.. టెస్లా చీఫ్ ఎలొన్ మస్క్ ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారనే వార్తలు ఇటీవల వైరల్‌గా మారాయి. ఈమేరకు వీటిని ధ్రువీకరిస్తూ మస్క్ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. అయితే ఆ పర్యటనను వాయిదావేశారు. ఏప్రిల్ 23న అమెరికాలో టెస్లా ఇన్వెస్టర్ల సమావేశం ఉండడంతో ఈ పర్యటన వాయిదా పడిందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. మస్క్ భారత్‌లో రూ.16 వేలకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టెస్లా కంపెనీను భారత్‌లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. విదేశీ కంపెనీలు భారత్‌లో ప్రవేశించేందుకు లైన్‌క్లియర్ చేస్తూ కేంద్రం కొత్త ఈవీపాలసీను రూపొందించింది. ఈ మేరకు కేంద్రం ఇటీవల ఆటోమొబైల్ తయారీ కంపెనీల అభిప్రాయాలను సైతం తీసుకున్నట్లు ప్రకటించింది. -
ఈవీ పాలసీపై చర్చకు హాజరైన ప్రముఖ కంపెనీ ప్రతినిధులు
దేశంలో అమల్లోకి తీసుకురాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) పాలసీకి సంబంధించి మార్గదర్శకాల కోసం ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ క్రమంలో ఆయా ఈవీల తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతుండగా టెస్లా సలహాదారు కూడా ఇందులో పాల్గొన్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ సమావేశంలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, కియా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, రెనాల్ట్ వంటి ప్రధాన తయారీదారుల ప్రతినిధులు ఉన్నారు. వీరితోపాటు మెర్సిడెస్ జెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి లగ్జరీ కార్ల తయారీ కంపెనీలకు చెందిన ప్రతినిధుల నుంచి ప్రభుత్వ వర్గాలు అభిప్రాయాలను సేకరించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీలోని అంశాలను ఆయా కంపెనీలకు వివరించింది. ఇదీ చదవండి: యువ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్.. భారీ రాయితీ ప్రకటించిన సంస్థ ఏప్రిల్ 22 నుంచి ఎలొన్‌మస్క్ భారత పర్యటన ప్రారంభంకానుంది. మస్క్ తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని భావిస్తున్నారు. మస్క్‌ను కలిసేందుకు భారత్‌లోని కొన్ని అంతరిక్ష రంగ స్టార్టప్ కంపెనీలను ప్రభుత్వం ఆహ్వానించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అందులో స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, ధృవ స్పేస్ వంటి కంపెనీలున్నట్లు తెలిసింది. -
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వేలాది ఉద్యోగులు ఇంటికి!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా తమ ఉద్యోగులలో 10 శాతం కంటే ఎక్కువమందిని తొలగించడానికి సన్నద్ధమైంది. గ్లోబల్ మార్కెట్లో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థగా ఎదిగిన టెస్లా కంపెనీలో 2023 డిసెంబర్ నాటికి 1,40,473 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడు తాజాగా సంస్థ తీసుకున్న నిర్ణయం వల్ల 14000 కంటే ఎక్కువ మందిని తొలగించే అవకాశం ఉంది. టెస్లా సిబ్బందికి పంపిన ఇమెయిల్‌లో.. ఇలాన్ మస్క్ (Elon Musk) ఇలా పేర్కొన్నారు.. కంపెనీ తదుపరి వృద్ధికి సిద్దమవుతున్న తరుణంలో ఖర్చులను తగ్గించుకోవడానికి, ఉత్పాదకను పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎవరి మీద ద్వేషం లేదు, తప్పని పరిస్థితుల్లో చేస్తున్నామని అన్నారు. కాలిఫోర్నియా, టెక్సాస్‌లోని కొంతమంది సిబ్బందికి ఇప్పటికే తొలగించినట్లు సమాచారం. మరోవైపు గిగాఫ్యాక్టరీ షాంఘైలో టెస్లా సైబర్ ట్రక్ ఉత్పత్తి తగ్గించడం కూడా తాజాగా ఉద్యోగుల తొలగింపుకు కారణం అయి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఇదీ చదవండి: 13 ఏళ్ల అమ్మాయికి 'ఆనంద్ మహీంద్రా' జాబ్ ఆఫర్: ఎందుకో తెలిస్తే.. టెస్లా షేర్లు ఇటీవలి బాగా దెబ్బతిన్నాయి. గతంతో పోలిస్తే.. ఇది సుమారు 31 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నప్పటికీ.. ఆ విభాగంలో ప్రత్యర్థులు ఎక్కువవుతున్నారు. ఇది టెస్లా అమ్మకాల మీద ప్రభావం చూపిస్తోందని తెలుస్తోంది. -
ప్రముఖ భారత కంపెనీతో టెస్లా ఒప్పందం
టెస్లా తన కార్యకలాపాల కోసం సెమీకండక్టర్ చిప్‌లను కొనుగోలు చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్‌తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈమేరకు కొన్ని వార్తామీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. కొన్నినెలల కొందట టాటా గ్రూప్ సెమీ కండక్టర్ విభాగంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా దాదాపు రూ.40వేల కోట్ల పెట్టుబడితో అస్సాంలో సెమీకండక్టర్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. సెమీకండక్టర్ తయారీ నేపథ్యంలో టాటాగ్రూప్ గ్లోబల్ క్లయింట్లను సంపాదించే పనిలో పడింది. అందులో భాగంగా టెస్లాతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇప్పటికే టెస్లా భారత్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేసింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఈవీపాలసీ నిబంధనలతో దాదాపు ఆ సంస్థ భారత్ ప్రవేశానికి లైన్ క్లియరైంది. ఈ తరుణంలో ఇండియాలో తమ తయారీ ప్లాంట్ పెట్టేందుకు టెస్లా సిద్ధపడుతోందని తెలిసింది. ఈనెల 21న ఎలొన్‌మస్క్ ఇండియా రానున్నారు. ఈమేరకు దానిపై కీలక నిర్ణయం వెలువడనుందని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదీ చదవండి: ‘తప్పు చేశాం.. మళ్లీ తప్పు చేస్తాం..’ 10వేల డాలర్లు ఆఫర్.. ఈ పరిణామాల నేపథ్యంలో టాటాగ్రూప్ టెస్లాతో సెమీకండక్టర్ల విషయంలో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇరు కంపెనీల మధ్య ఎంత విలువ చేసే డీల్ కుదిరిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. మస్క్ భారత్ పర్యటనలో భాగంగా దాదాపు 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రకటించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అమెరికన్ ఈవీ దిగ్గజ సంస్థ దేశంలో తమ ఉత్పత్తుల తయారీకోసం రిలయన్స్‌తో జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని పరిశీలిస్తున్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. -
భారత్‌లో ప్రవేశించనున్న ఎలొన్‌మస్క్ మరో కంపెనీ
ప్రపంచ ఎలక్ట్రిక్‌కార్ల దిగ్గజ సంస్థ టెస్లా చీఫ్ ఎలొన్ మస్క్ ఏప్రిల్ 21న భారత్‌కు రానున్నారు. ఈ తరుణంలో భారత్‌లో టెస్లా ప్లాంట్ తయారీకి సంబంధించిన అంశాలు చర్చించనున్నట్లు తెలిసింది. దాంతోపాటు ప్రధానితో చర్చలు జరుపనున్నట్లు సమాచారం. అయితే కేవలం టెస్లా అంశమే కాకుండా మస్క్ కీలక ప్రాజెక్ట్ అయిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించే స్టార్‌లింక్‌ను కూడా ఇండియాలో ప్రవేశపెట్టేలా అధికారులతో చర్చలు జరుపనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ యూనిట్‌కు సంబంధించి లైసెన్స్ ప్రక్రియ ఇప్పటికే టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) పరిశీలనలో ఉంది. ఇటీవల శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ), ట్రయల్ స్పెక్ట్రమ్‌పై పని చేసేందుకు డీఓటీ లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది. స్టార్‌లింక్ లైసెన్స్ కోసం గతంలోనే ఆ సంస్థ గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ సర్వీసెస్ లైసెన్స్(జీఎంపీసీఎస్) కోసం దరఖాస్తు చేసింది. అయితే డేటా స్టోరేజీ, ట్రాన్స్ఫర్ విషయంలో సంతృప్తికర సమాధానం ఇవ్వకపోవడంతో లైసెన్స్ రద్దు అయింది. తాము అంతర్జాతీయంగా ఉన్న ప్రమాణాలనే పాటిస్తామని అప్పట్లో స్టార్ లింక్ పేర్కొంది. దాంతో ప్రభుత్వం తమ దరఖాస్తును తిరస్కరించింది. డేటా స్టోరేజీ విషయంలో భారత నియమ నిబంధనలే పాటించాలని ప్రభుత్వం స్టార్ లింక్‌కు స్పష్టం చేసింది. తర్వాత కొన్నిరోజులకు తిరిగి దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో స్టార్ లింక్ ఇచ్చిన సమాధానం పట్ల ప్రభుత్వం సంతృప్తి చెందింది. సెక్యూరిటీ చెక్ తర్వాత శాటిలైట్ సర్వీసులకు సంబంధించిన అనుమతులు మంజూరు అవుతాయని తెలిసింది. దేశీయంగా భారతీ ఎయిర్టెల్ మద్దతున్న వన్ వెబ్, రిలయన్స్ జియో శాటిలైట్ సర్వీసులకు మాత్రమే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. స్టార్ లింక్‌కు కూడా అనుమతులు లభిస్తే మూడో సంస్థ అవుతుంది. అదే జరిగితే ఎయిర్టెల్, జియోకు ఈ విభాగంలో గట్టి పోటీ ఎదురుకానుంది. మరోవైపు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ సైతం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఈ ప్రతిపాదనపై డాట్ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇదీ చదవండి: అలర్ట్.. 48 గంటల్లో యుద్ధం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంతంటే.. టెస్లా కంపెనీను భారత్‌లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇటీవల విదేశీ ఈవీ తయారీ కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాలు సాగించేలా, ఇక్కడ పెట్టుబడిపెట్టేలా కేంద్రం కొత్త ఈవీ పాలసీను రూపొందించింది. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొద్ది రోజులకే ఈవీ తయారీలో టాప్‌స్థాయిలో ఉన్న టెస్లా చీఫ్ మస్క్ భారత్ పర్యటన రాబోతుండడం పరిశ్రమవర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది. -
ఆంధ్రప్రదేశ్‌కు టెస్లా!?
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మ్యాన్యుఫ్యాక్చర్ యూనిట్ నెలకొల్పాలని అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. టెస్లా యాజమాన్యానికి ఇప్పటికే రెండు ఈ-మెయిల్స్ పంపామని, స్థల పరిశీలనకు రావాలని ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఏప్రిల్ 22న ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. టెస్లా కంపెనీకి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తగినంత భూమి అందుబాటులో ఉందని తెలియజేసింది. ఒకవేళ టెస్లా ప్రైవేట్ భూమిని కొనుగోలు చేయాలనుకుంటే దానికి కూడా సహకారం అందించనున్నట్లు భరోసా ఇచ్చింది. అనంతపురం జిల్లాలో.. “రాష్ట్రాన్ని సందర్శించి, వారి యూనిట్ ఏర్పాటుకు అవసరమైన భూములను పరిశీలించాలని టెస్లాను ఆహ్వానించాం. వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. అన్ని జిల్లాల్లో తగినంత భూమి అందుబాటులో ఉందని, వారు తమ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు కావాల్సిన చోట భూమిని ఇస్తామని చెప్పాం. చెన్నై, బెంగళూరు, కృష్ణపట్నం ఓడరేవులకు సమీపంలో ఉన్నందున అనంతపురం జిల్లాలో కియా ప్లాంట్ సమీపంలో భూములను ప్రతిపాదించాం. ఇది బెంగళూరుకు దగ్గరగా ఉంటుంది. అలాగే చెన్నై, కృష్ణపట్నం పోర్టుకు దగ్గరగా ఉండాలనుకుంటే నాయుడుపేట, శ్రీ సిటీ సమీపంలో భూములు పరిశీలించవచ్చు" అని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నట్లుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉటంకించింది. ఎన్నికల తర్వాత.. టెస్లా బృందం రాష్ట్రానికి వచ్చి వారి అవసరాలకు తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటే వారికి ప్రభుత్వ భూమి లేదా ప్రైవేట్ పార్టీల నుంచి భూమిని కొనుగోలు చేసైనా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారి వివరించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టెస్లా బృందాలు ఆంధ్రప్రదేశ్‌కి వస్తాయన్నారు. ప్లాంట్ నిర్మాణానికి 2,500 ఎకరాలకు పైగా భూమి అవసరమని అంచనా. మస్క్ ప్రధానిని కలుస్తున్నప్పటికీ ఎలక్షన్ కోడ్ కారణంగా టెస్లా తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన చర్చల ఫలితం బయటకు రాదని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. వాస్తవానికి, 2021, 2022 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంటు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం టెస్లా అధిపతి ఎలాన్ మస్క్‌ను ఆహ్వానించింది. ఇప్పుడు మరోసారి మస్క్ భారతదేశ పర్యటన గురించి తెలుసుకున్న తర్వాత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
మస్క్ భారత పర్యటనకు డేట్ ఫిక్స్.. ఏం జరగబోతుందంటే..
అమెరికాలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజ కంపెనీ టెస్లా చీఫ్ ఎలొన్ మస్క్ ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారనే వార్తలు వైరల్‌గా మారాయి. ఈమేరకు వీటిని ధ్రువీకరిస్తూ మస్క్ ట్విటర్ వేదికగా స్పందించారు. భారతప్రధాని నరేంద్రమోదీతో భేటీకి ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. మస్క్ పర్యటనకు డేట్ కూడా ఫిక్స్ అయిందని, ఏప్రిల్ 22న భారత్ రాబోతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు ధ్రువీకరించాల్సి ఉంది. ప్రధానితో భేటీలో భాగంగా భారత్‌లో తమ కంపెనీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మస్క్ భారత్‌లో రూ.16 వేలకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టెస్లా కంపెనీను భారత్‌లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. Looking forward to meeting with Prime Minister @NarendraModi in India! — Elon Musk (@elonmusk) April 10, 2024 ఇటీవల విదేశీ ఈవీ తయారీ కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాటు సాగించేలా, ఇక్కడ పెట్టుబడిపెట్టేలా కేంద్రం కొత్త ఈవీ పాలసీను రూపొందించింది. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొద్ది రోజులకే ఈవీ తయారీలో టాప్‌స్థాయిలో ఉన్న టెస్లా చీఫ్ మస్క్ భారత్ పర్యటన రాబోతుండడం పరిశ్రమవర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది. ఇదీ చదవండి: వాట్సప్, టెలిగ్రామ్ బాటలోనే ట్రూకాలర్.. కొత్త ఫీచర్ ప్రారంభం ఏం జరగబోతుంది.. కొత్త ఈవీ పాలసీ నిబంధనల ప్రకారం ఒకవేళ భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తే స్థానికంగా చాలామందికి ఉపాధి లభిస్తుంది. కార్ల తయారీలో ముడిసరుకు అందిస్తున్న ఇండియన్ కంపెనీలకు కాంట్రాక్ట్‌లు వస్తాయి. ప్రధానంగా బ్యాటరీ తయారీ కంపెనీలు, స్టీల్ కంపెనీలు, వైరింగ్ పరిశ్రమలోని కంపెనీలు, టైర్ సంస్థలు లాభపడనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు టెస్లా భారత్‌లో తయారీ ప్లాంట్ పెట్టే యోచనలో ఉంటే ఏ రాష్ట్రంలో దాన్ని ప్రారంభిస్తారనే చర్చలు ఇప్పటికే సాగుతున్నాయి. ఏదేమైనా మస్క్ పర్యటనతో ఒక స్పష్టత రాబోతుందని నిపుణులు చెబుతున్నారు. -
భారత పర్యటనకు ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌లో తమ కంపెనీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మస్క్ పర్యటన ఏప్రిల్ నాలుగో వారంలో ఉండొచ్చని, ఆయనతో పాటు కంపెనీ అధికారులు కూడా రావొచ్చని పేర్కొన్నాయి. దేశీయంగా తయారీని ప్రోత్సహించే క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని కేంద్రం ఇటీవల సవరించిన నేపథ్యంలో మస్క్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది. దీని ప్రకారం భారత్‌లో కనీసం 500 మిలియన్ డాలర్లతో తయారీ ప్లాంటును పెట్టే విదేశీ కంపెనీలు తక్కువ సుంకాలతో ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో తయారైన కారును (సీబీయూ) దిగుమతి చేసుకుంటే 70 శాతం నుంచి 100 శాతం వరకు కస్టమ్స్ సుంకాలు వర్తిస్తున్నాయి. భారత మార్కెట్లో ప్రవేశించేందుకు టెస్లా వంటి కంపెనీలకు ఇది అవరోధంగా ఉంటోంది. దీంతో సుంకాలను తగ్గించాలంటూ కొన్నాళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నాయి. దానికి అనుగుణంగా దేశీయంగా తయారీతో ముడిపెట్టి పాలసీని ప్రభుత్వం సవరించింది. గతేడాది మోదీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా ఆయనతో మస్క్ సమావేశమయ్యారు. భారత మార్కెట్లో టెస్లా ఎంట్రీకి సంబంధించి 2024లో తాను వచ్చే అవకాశమున్నట్లు అప్పట్లో ఆయన చెప్పారు. -
ఎలక్ట్రిక్ కార్ల ప్రియులకు శుభవార్త
ఎలక్ట్రిక్ కార్ల ప్రియులకు శుభవార్త. త్వరలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ కీలక భేటీ తర్వాత దేశీయంగా టెస్లా కార్ల తయారీ ప్లాంట్, పెట్టుబడులపై ప్రకటన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. ఏప్రిల్ 22న ఎలాన్ మస్క్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్నట్లు తెలుస్తోంది. అనంతరం మస్క్ భారత్‌లో వ్యాపార ప్రణాళికలపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే, మస్క్ భారత పర్యటనపై పీఎంఓ కార్యాలయం, టెస్లా స్పందించాల్సి ఉంది. కాగా, భారత్‌లో టెస్లా కార్ల తయారీ యూనిట్ కోసం టెస్లా దాదాపు 2 బిలియన్ల పెట్టుబడి పెట్టనున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన స్థలాల్ని, అనుమతులు పొందేందుకు టెస్లా ప్రతినిధులు భారత్‌లో పర్యటిస్తారని వెల్లడించింది. తాజాగా, మరోసారి భారత్ పర్యటనలో ఎలాన్ మస్క్ అంటూ నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
భారత్‌లోకి టెస్లా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మస్క్
ప్రతి దేశంలోనూ ఎలక్ట్రిక్ కార్లు ఉండాలని, భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను అందించడం తమ కంపెనీకి సహజమైన పురోగతి అని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నికోలై టాంగెన్‌తో జరిగిన చర్చలో భాగంగా ఈమేరకు ఎలోన్మస్క్ తన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘భారత్‌లో పెరుగుతున్న జనాభా కంపెనీల అభివృద్ధికి తోడ్పడుతుంది. అన్ని దేశాల్లోలాగే భారత్‌లోనూ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలనేది మా కంపెనీ లక్ష్యం. టెస్లా భారత్‌లోకి రావడం సహజమైన పురోగతే. ప్రపంచం అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ వెహికిల్స్‌గా మార్చడం చాలా సులువు’ అని ఎలోన్మస్క్ అన్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల కొత్త ఈవీ పాలసీను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వెలువడనంతవరకు టెస్లా భారత్‌లో ప్రవేశించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులతో మస్క్ పలుమార్లు సంప్రదించిన విషయం తెలిసిందే. తాజాగా టెస్లా భారత్‌లోకి రావడం సహజపురోగతేనని మస్క్ చెప్పడం గమనార్హం. టెస్లా వంటి అంతర్జాతీయ విద్యుత్ వాహనాల దిగ్గజాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీకి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం దేశీయంగా తయారీ యూనిట్లపై కనీసం 500 మిలియన్ డాలర్లు (రూ. 4,150 కోట్లు) ఇన్వెస్ట్ చేసే సంస్థలకు సుంకాలపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈవీ ప్యాసింజర్ కార్లను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లకు పైబడి విలువ చేసే వాహనాలపై 15 శాతం సుంకాలతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. ఇదీ చదవండి: విమానంలో 135 మంది.. గాల్లోనే ఊడిన ఇంజిన్ కవర్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈవీ వాహనాల కనిష్ట సీఐఎఫ్(కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్) విలువ రూ.29లక్షలు ఉంటే ఐదేళ్ల పాటు 15% కస్టమ్స్ డ్యూటీ విధించనున్నారు. అలా అయితే తయారీదారు మూడేళ్లలో భారత్‌లో తయారీ సౌకర్యాలను నెలకొల్పాల్సి ఉంటుంది. కంపెనీలకు గరిష్టంగా రూ.6,484 కోట్ల వరకే మినహాయింపులు ఇవ్వనున్నారు. కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందం కంటే అదనంగా పెట్టుబడుల మొత్తం రూ.6,600 కోట్లు ఉంటే గరిష్టంగా 40,000 ఈవీలు, ఏటా 8,000 మించకుండా దేశంలోని అనుమతిస్తారు. -
Tesla Homes: చవగ్గా డబుల్ బెడ్రూం ఇల్లు! వీడియో వైరల్
ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ తక్కువ ధరకే డబుల్ బెడ్రూం ఇళ్లు అమ్ముతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే ఈ కంపెనీ పూర్తీగా ఫర్నిష్ చేసిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లను కస్టమర్లకు అందిస్తోంది. 10,000 డాలర్లకే అన్ని సౌకర్యాలు ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను టెస్లా అందిస్తోందంటూ సోషల్ మీడయాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఇంటిలో నివసించేందుకే ఎలాన్ మస్క్ తన 50,000 డాలర్ల ఇంటిని కూడా అమ్మేసినట్లు ఈ వీడియోలో ఉంది. బాక్స్ లాగా ఉండే ఈ ఇళ్లకు అవసరమైన విడిభాగాలను ఫ్యాక్టరీలో తయారు చేసి ట్రక్‌లలో కావాల్సిన చోటుకు తీసుకొచ్చి అమర్చుతారు. ఇందులో రెండు బెడ్రూంలు, లివింగ్ ఏరియాతోపాటు కిచెన్, బాత్రూం ఉన్నాయి. ఈ ఇళ్ల నిర్మాణం కోసం తయారు చేసిన గోడలు చాలా దృఢంగా ఉంటాయి. భూకంపాలు, అగ్ని ప్రమాదాల నుంచి తట్టుకుంటాయి. పైకప్పుపై సోలార్ ప్యానెళ్లు అమర్చారు. దీంతో ఇంటి అవసరమైన విద్యుత్ వీటి నుంచే లభిస్తుంది. అలాగే వర్షపు నీటిని సేకరించే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. Elon Musk is at it again... A two bedroom Tesla home for $10,000. This man is a good Wizard. They come once in a generation. 👌🏼👌🏼 pic.twitter.com/w71Hcg0oFp — Aviator Anil Chopra (@Chopsyturvey) March 19, 2024 -
‘మళ్లీ డ్రగ్స్ తీసుకున్నాను..’ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి
డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలపై టెస్లా అధినేత ఎలోన్ మస్క్ స్పందించారు. మాదకద్రవ్యాలను వినియోగించినట్లు ఆయన అంగీకరించారు. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు డాక్టర్ల సూచన మేరకే ‘కెటమిన్’ అనే డ్రగ్‌ను తీసుకున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా తాను డ్రగ్స్ తీసుకోవడం వల్ల ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్టుబడి సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఏర్పడలేదని భావిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ తనపై ఎలాంటి ప్రభావం చూపాయనే విషయాన్ని పక్కనపెడితే.. టెస్లా కారు గతేడాది ప్రపంచంలోనే బెస్ట్ సెల్లింగ్ కారుగా రికార్డు నెలకొల్పిందని మస్క్ చెప్పారు. కొన్నినెలల కొందట తాను మానసిక కంగుబాటుకు గురైనట్లు మస్క్ చెప్పారు. ఆ సమయంలో దాన్నుంచి బయటపడేందుకు కెటమిన్ అనే డ్రగ్‌ను వినియోగించానన్నారు. వైద్యుడి సూచన మేరకు వారానికి ఒకసారి చిన్న మొత్తంలో దాన్ని తీసుకునేవాడినని తెలిపారు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రోజుకు 16 గంటలు పనిచేస్తాను. దాంతో నాపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. నేను ఎక్కువ కాలం డిప్రెషన్లోకి వెళితే దాని ప్రభావం టెస్లా పనితీరుపై పడుతుంది. దాన్ని అధిగమించేందుకు డాక్టర్ సూచనతో తగుమోతాదులోనే కెటమిన్ డ్రగ్ తీసుకున్నాను. అది టెస్లాకు ఎంతో ఉపయోగపడింది. ఒకవేళ ఎవరైనా కెటమిన్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏ పనీ సక్రమంగా పూర్తి చేయలేరు’ అని మస్క్ చెప్పారు. ఇదిలా ఉండగా, తాను డ్రగ్స్ తీసుకున్నట్లు మస్క్ చెప్పడం ఇది రెండోసారి. గతంలో ఓసారి డ్రగ్స్ సేవించిన విషయం నిజమేనని మస్క్ అప్పట్లోనే చెప్పారు. ఆ తర్వాత చాలాకాలంపాటు తాను డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. నాసా అభ్యర్థనతో టెస్లా ఆఫీసును డ్రగ్స్ రహితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆ అభ్యర్థన మేరకు గత మూడేళ్లుగా తాను వైద్య పరీక్షలు కూడా చేయించుకుంటున్నట్లు తెలిపారు. అయితే, ఈ మూడేళ్లలో తన శరీరంలో డ్రగ్స్ కానీ, మద్యానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లూ గుర్తించలేదన్నారు. ఇదీ చదవండి: వీడియో క్రియేటర్లకు పెద్దదెబ్బ.. యూట్యూబ్ కొత్త నిబంధన..? రెండు నెలల క్రితం మస్క్ డ్రగ్స్ వినియోగంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరిగే పార్టీల్లో మస్క్ తరచుగా పాల్గొంటూ నిషేధిత డ్రగ్స్‌ను తీసుకుంటున్నారని దానిలో పేర్కొంది. ఈ విషయంపై టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపింది. దీని వల్ల మస్క్ ఆరోగ్యంతోపాటు ఆయన వ్యాపార సామ్రాజ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతున్నదని ఆ సంస్థల డైరెక్టర్ల బోర్డు సభ్యులు చెప్పినట్లు ఆ కథనంలో ప్రచురించారు. తాజాగా డ్రగ్స్ వినియోగంపై స్వయంగా మస్క్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. -
కేంద్రం కీలక నిర్ణయం.. టెస్లాకు లైన్ క్లియర్!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ తయారీదారుల పెట్టుబడులను ఆకర్షించడానికి, కేంద్రం ఈ-వెహికల్ పాలసీని తీసుకొచ్చినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని వల్ల దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసువచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ.. దేశంలో అడుగుపెట్టడానికి ఉవ్విల్లూరుతున్న టెస్లా మార్గాన్ని మరింత సుగమం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా టెస్లా భారతదేశంలో ప్లాంట్ నిర్మించడానికి కేంద్రంతో చర్చలు జరుపుతూనే ఉంది. నేటికి కొత్త పాలసీ రావడంతో త్వరలోనే టెస్లా మనదేశానికి వస్తుందని పలువురు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త ఈవీ పాలసీ కింద.. ఏదైనా ఆటోమొబైల్ కంపెనీ సుమారు రూ. 4150 కోట్లు (5వేల మిలియన్ డాలర్స్) పెట్టుబడి పెడితే.. అనేక రాయితీలు లభిస్తాయి. ఈ పాలసీ వల్ల భారతీయులకు కొత్త తరహా టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో పాటు మేక్ ఇన్ ఇండియాకు ఊతం ఇచ్చినట్లవుతుందని వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ కొత్త పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగితే.. ఫ్యూయెల్ దిగుమతులు తగ్గుతాయి. పర్యావరణంలో కాలుష్యం కూడా తగ్గుతుంది. ఆటోమొబైల్ కంపెనీ రూ. 4150 కోట్లు పెట్టుబడి పెడితే.. మూడు సంవత్సరాల్లో స్థానికంగా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంతే కాకుండా విడి భాగాల్లో 25 శాతం స్థానీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్ల ధరలను బట్టి 70 నుంచి 100 శాతం దిగుమతి సుంకాలు వర్తిస్తాయి. గతంలో ఇదే టెస్లా భారత్ ఎంట్రీకి సమస్యగా ఉండేది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల టెస్లా ఊపిరి పీల్చుకుంది. గత ఏడాది దేశంలోని మొత్తం కార్ల అమ్మకాల్లో ఈవీల శాతం కేవలం 2% మాత్రమే. ఇది 2030 నాటికి 30 శాతానికి పెంచడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
భారత్‌లో ప్రవేశానికి గ్రీన్‌సిగ్నల్.. కొత్త ఈవీ పాలసీకి ప్రభుత్వం ఆమోదం..?
భారతదేశాన్ని ప్రధాన తయారీకేంద్రంగా మార్చే లక్ష్యంతో కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే తాజాగా పన్ను మినహాయింపుతో కూడిన కొత్త ఈవీ పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. టెస్లా వంటి ప్రముఖ కంపెనీలు దేశీయంగా తయారీ చేపట్టేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. స్థానికంగా ఉత్పత్తిని పెంచడానికి, అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగాన్ని ప్రోత్సహించడానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. తాజా వార్తా కథనాల ప్రకారం..రానున్న మూడు ఏళ్లలో భారత్‌లో ప్రవేశించాలనుకునే ఒక్కో కంపెనీ నుంచి దాదాపు రూ.4,143 కోట్లు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంతో విదేశీ కంపెనీలకు కొన్ని రాయితీలివ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఎంపిక చేసిన కంపెనీ ఉత్పత్తుల దిగుమతి పన్నులను తగ్గించాలని చూస్తున్నట్లు తెలిసింది. ఈ తాజా నిర్ణయంతో టెస్లా వంటి ప్రముఖ కంపెనీలు భారత్‌లో ప్రవేశించాలనే కళ నెరవేరబోతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈవీ వాహనాల కనిష్ట సీఐఎఫ్(కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్) విలువ రూ.29లక్షలు ఉంటే ఐదేళ్ల పాటు 15% కస్టమ్స్ డ్యూటీ విధించనున్నారు. అలా అయితే తయారీదారు మూడేళ్లలో భారత్‌లో తయారీ సౌకర్యాలను నెలకొల్పాల్సి ఉంటుంది. కంపెనీలకు గరిష్టంగా రూ.6,484 కోట్ల వరకే మినహాయింపులు ఇవ్వనున్నారు. కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందం కంటే అదనంగా పెట్టుబడుల మొత్తం రూ.6,600 కోట్లు ఉంటే గరిష్టంగా 40,000 ఈవీలు, ఏటా 8,000 మించకుండా దేశంలోని అనుమతిస్తారు. ఇదీ చదవండి: ఎన్నికల బాండ్లను భారీగా కొనుగోలు చేసిన కంపెనీలివే.. తయారీదారులు మూడు ఏళ్లలో దేశంలో తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించాలి. ఐదేళ్లలోపు కనీసం 50% దేశీయ విలువ జోడింపు (డీవీఏ) సాధించాలి. ఈ పథకానికి కంపెనీలు బ్యాంక్ గ్యారెంటీను సమర్పించాల్సి ఉంటుంది. ఇది డీవీఏ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. -
ప్రతి డిమాండ్‌ను నెరవేర్చలేమన్న మంత్రి
ప్రపంచంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కోసం భారత్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయబోదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు భారత్‌లో ప్లాంట్లు నెలకొల్పేందుకు అనుకూలంగా కేంద్రం చట్టాలను రూపొందించిందని చెప్పారు. చాలా కాలంగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న టెస్లా సంస్థ.. దిగుమతి సుంకంలో రాయితీ కోరుతోంది. అయితే, ఇతర కంపెనీలకు ఇవ్వని ప్రాధాన్యం టెస్లాకు మాత్రమే ఇవ్వడం సమంజసం కాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ‘ఈవీల ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తించింది. వాటితో కాలుష్యం, చమురు దిగుమతులు తగ్గుతాయి. పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇందుకోసం ఏదో ఒక కంపెనీకి అనుకూలంగా నిబంధనల్లో మార్పులు చేయలేం. యూరప్ సహా అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలకు చెందిన సంస్థలతో పలు అంశాల్లో చర్చలు జరుపుతున్నాం. భారత్‌లో పెట్టుబడి పెట్టే సంస్థలు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసే స్వేచ్ఛ ఉంటుంది. అయితే, వాటికనుగుణంగా ప్రభుత్వం తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటుందని భావించకూడదు. భవిష్యత్తులో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మారే సత్తా భారత్‌కు ఉంది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుంది’అని మంత్రి గోయల్ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 40,000 డాలర్లు (దాదాపు 29.75 లక్షలు) లేదా అంతకంటే తక్కువ విలువ ఉన్న విద్యుత్తు వాహనాలపై ప్రభుత్వం 60 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర ఉన్న విద్యుత్తు వాహనాలపై దిగుమతి సుంకం 100 శాతంగా ఉంది. అంటే, అమెరికాలో రూ.34 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లన్నీ భారత్‌లో రెట్టింపు ధరకు అందుబాటులో ఉంటాయి. దీన్ని 70 శాతానికి పైగా తగ్గించాలని టెస్లా కోరుతోంది. ఇదీ చదవండి: ‘ఇదే భవిష్యత్తు అయితే మాత్రం అదో పీడకలే’.. వీడియో వైరల్ ముందుగా భారత్‌లో కొంతకాలంపాటు కార్లను దిగుమతి చేసి విక్రయిస్తామని, ప్రజల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని చెబుతోంది. దీనివల్ల మిగతా సంస్థలకు తప్పుడు సంకేతాలు వెళతాయని కేంద్రం భావిస్తోంది. -
మంచులా కరిగిపోతున్న సంపద.. మస్క్‌కు దెబ్బ మీద దెబ్బ
ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలి స్థానం కోల్పోయిన టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ సంపద మంచులా కరిగిపోతుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు 40 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయినట్లు బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది. బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ధనవంతుల జాబితాలో తొలిస్థానంలో ఉన్న మస్క్‌ను అదిగమించారు. అయితే, స్వల్ప వ్యవధిలో 198 బిలియన్ డాలర్లతో రెండో స్థానానికి పడిపోయారు. లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ చైర్మన్, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ 201 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. నిన్న మొన్నటి వరకు తొలిస్థానంలో ఉన్న మస్క్ ఏకంగా 108 బిలియన్ డాలర్లతో మూడో స్థానానికి పడిపోవడం విశేషం. టెస్లా షేర్ల పతనం మస్క్ అపరకుబేరుల స్థానం నుంచి పడిపోవడానికి, ఆయన సంపద మంచులా కరిగిపోవడానికి టెస్లా షేర్లే కారణం. టెస్లాలో మస్క్‌కు 21 శాతం వాటా ఉంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరిగితే పెట్టుబడిదారులు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఫలితంగా షేర్ల ధరలు అమాంతం పెరుగుతాయి. బిజినెస్ టైకూన్ సంపద సైతం పెరుగుతుంది. అదే టెస్లా కంపెనీపై ప్రతి కూల ప్రభావం ఏర్పడితే.. మస్క్ సంపదపై పడుతుంది. తాజాగా ఇదే జరిగింది. గిగా ఫ్యాక్టరీ షట్‌డౌన్ ఈ నెల ప్రారంభంలో చైనాలోని షాంఘైలో టెస్లా కార్ల అమ్మకాలు తగ్గినట్లు టెస్లా రిపోర్ట్‌ను విడుదల చేసింది. మరోవైపు యూరప్‌లోని బెర్లిన్ ప్రాంతంలో ఉన్న టెస్లా గిగా ఫ్యాక్టరీ సమీపంలో అల్లరి మూకలు కాల్పులు తెగబడ్డాయి. దీంతో భద్రత దృష్ట్యా.. మార్చి 17 వరకు కరెంట్ సరఫరా నిలిపివేసింది. టెస్లా కార్లలో వినియోగించే ఉత్పత్తుల తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తూ మస్క్ నిర్ణయం తీసుకున్నారు. 55 బిలియన్ డాలర్ల వేతనంపై అభ్యంతరం దీనికి తోడు టెస్లా సంస్థ సీఈఓగా ఉన్న ఎలోన్ మస్క్ 2018లో అన్నీ రకాల ప్రయోజనాల్ని కలుపుకుని 55 బిలియన్ డాలర్ల వేతనాన్ని తీసుకుంటున్నాడు. మస్క్‌కు అంత వేతనం అవసరమా అంటూ టెస్లా పెట్టుబడిదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. డెలావర్ కోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టింది. కోర్టు తీర్పుతో మస్క్ 55 బిలియన్ డాలర్ల వేతనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ వరుస పరిణామాలతో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మస్క్ సంపద 29 శాతం తగ్గింది. 2021 గరిష్ట స్థాయి నుండి 50 శాతం పడిపోయింది. ఇలా వరుస దెబ్బ మీద దెబ్బలు మస్క్ సంపదపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. -
‘మీ పేరు మార్చుకుంటే దావా వెనక్కి తీసుకుంటా’.. కొత్తపేరు సూచించిన మస్క్..
చాట్‌జీపీటీని రూపొందించిన సంస్థ ఓపెన్ఏఐ, దాని సీఈఓ శామ్ ఆల్ట్మన్పై టెస్లా అధినేత ఎలోన్మస్క్ ఇటీవల దావా వేసిన సంగతి తెలిసిందే. చాట్‌జీపీటీ రూపొందించే సమయంలో కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ పరిణామాల వల్ల ఓపెన్ఏఐ, ఎలాన్ మస్క్ మధ్య వివాదం క్రమంగా ముదురుతోంది. తాజాగా కంపెనీ పేరు మారిస్తే దావా వెనక్కి తీసుకుంటానని మస్క్ తెలిపినట్లు కొన్ని వార్తా కథనాల ద్వారా తెలిసింది. ఓపెన్ఏఐ పేరును క్లోజ్డ్‌ఏఐగా మార్చాలని మస్క్ చెప్పారు. అలా చేస్తే సంస్థపై తాను వేసిన దావాను వెనక్కి తీసుకుంటానని తెలిపారు. ఇకనైనా ఓపెన్ఏఐ అబద్ధాల్లో జీవించడం మానేయాలని హితవు పలికారు. అలాగే ఆ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ‘క్లోజ్డ్ఏఐ’ ఐడీ కార్డును మెడలో ధరించినట్లుగా ఉన్న ఎడిట్ చేసిన ఫొటోను మస్క్ (Elon Musk) తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. Fixed it pic.twitter.com/KPtYLsJU3h — Elon Musk (@elonmusk) March 6, 2024 ఓపెన్ఏఐని ప్రజా సంక్షేమం కోసం లాభాలను ఆశించకూడదనే భావనతో ఏర్పాటు చేశామని మస్క్ ఇటీవల తెలిపారు. కానీ, ఆ కంపెనీ ఇప్పుడు.. మైక్రోసాఫ్ట్ కింద పూర్తిగా లాభాల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. దీంతో తన లక్ష్యం విషయంలో రాజీ పడిందని, ఒప్పందాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ శాన్ఫ్రాన్సిస్కో సుపీరియర్ కోర్టులో దావా వేశారు. ఈ వ్యవహారంపై ఓపెన్ఏఐ స్పందిస్తూ తమ కంపెనీని టెస్లాలో విలీనం చేయాలని మస్క్ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించింది. లేదంటే పూర్తి నియంత్రణను ఆయన చేతికి ఇవ్వమన్నారని పేర్కొంది. 2017లో లాభాపేక్ష సంస్థనే ఏర్పాటు చేయాలనుకున్నామని.. కానీ, బోర్డు నియంత్రణ, సీఈఓ పదవి తనకు కావాలని మస్క్ డిమాండ్ చేసినట్లు చెప్పింది. కానీ, తమ కంపెనీ వీటికి అంగీకరించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సంస్థ నుంచి వైదొలగారని చెప్పింది. వీటికి సంబంధించిన కొన్ని ఈమెయిళ్లను కంపెనీ బహిర్గతం చేసింది. ఇదీ చదవండి: ‘ఇష్టంలేని పని ఇంకెన్నాళ్లు.. వెంటనే రాజీనామా చేయండి’ 2022 నవంబరులో వచ్చిన చాట్‌జీపీటీ ఆరు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 2015లో ఓపెన్‌ఏఐను శామ్ ఆల్టమన్ బృందం స్థాపించినప్పుడు మస్క్ అందులో పెట్టుబడులు పెట్టారు. 2018లో సంస్థ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. 2022 అక్టోబరులో 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్)ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
ప్రపంచంలో వేగవంతమైన కారు ఇదే!.. లాంచ్ ఎప్పుడంటే?
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారును లాంచ్ చేయడానికి సిద్ధమైపోయింది. టెస్లా రోడ్‌స్టర్ (Tesla Roadster) పేరుతో కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు 0 నుంచి 60 కిమీ/గం వేగాన్ని సెకను కంటే తక్కువ వ్యవధిలోనే చేరుకుంటుందని సమాచారం.ఈ కారు గురించి టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk) కొన్ని వివరాలను వెల్లడిస్తూ.. ఇది 2024 చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అవుతుందని పేర్కొన్నారు. ఈ కారుని టెస్లా, స్పేస్ఎక్స్ సహకారంతో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.Tonight, we radically increased the design goals for the new Tesla Roadster.There will never be another car like this, if you could even call it a car.— Elon Musk (@elonmusk) February 28, 2024టెస్లా లాంచ్ చేయనున్న ఈ కొత్త కారు అత్యంత ఆకర్షణీయమైన కారుగా పేర్కొన్నారు. ఈ కారు డిజైన్ మాత్రమే కాకుండా, ఫీచర్స్ కూడా చాలా వరకు అప్డేట్ పొందినట్లు తెలుస్తోంది. ఇది 4 సీట్లు కలిగిన ఎలక్ట్రిక్ కారు. దీని గురించి మస్క్ 2017లోనే వెల్లడించారు.కంపెనీ టెస్లా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ కారు కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ కారును బుక్ చేసుకోవాలనుంటే 50000 డాలర్ల టోకెన్ మొత్తాన్ని వెచ్చించి బుక్ చేసుకోవచ్చు. నిజానికి 2021లో లాంచ్ కావలసిన ఈ కారు 2024 చివరి నాటికి లాంచ్ అవుతుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: భారత యాప్స్‌పై గూగుల్ కన్నెర్ర.. ప్లేస్టోర్‌లో అవి మాయం!0-60mph < 1 secAnd that is the least interesting part— Elon Musk (@elonmusk) February 28, 2024 -
రంగంలోకి ఆప్టిమస్.. మస్క్ వీడియో వైరల్
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన సంస్థ తయారు చేస్తున్న హ్యూమనాయిడ్ రోబోట్ ‘ఆప్టిమస్’నడుస్తున్న వీడియోను ప్రపంచానికి పరిచయం చేశారు. కంపెనీకి చెందిన ఓ ఫ్లోర్ లో ఆప్టిమస్ నడుస్తున్న వీడియోని ఎక్స్.కామ్ లో షేర్ చేశారు. అయితే 1 నిమిషం 18 సెకన్ల పాటు నడిచే రోబోట్ నడకను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆప్టిమస్ ల్యాబ్ చుట్టూ తిరుగుతోంది’అని ఎలోన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో వీడియోను షేర్ చేయగా.. ఆ వీడియోను ఇప్పటి వరకు 10 మిలియన్లకు పైగా వీక్షించారు. సురక్షితంగా నడవడం లేదంటే ఫ్యాక్టరీ అంతస్తులో పని చేయడం వంటి ఆప్టిమస్ సామర్థ్యాలను అందించడానికి టెస్లా తన డ్రైవర్ లెస్ కారులో వినియోగించే టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తున్నట్లు ఆ కంపెనీ ఇంజినీర్లు గతంలో తెలిపారు. Optimus strolling around the lab pic.twitter.com/E25ttHGsF0 — Elon Musk (@elonmusk) February 24, 2024 గత నెలలో మస్క్ రోబోట్ పనితీరుపై ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేసేలా ఆప్టిమస్ చొక్కా మడతపెట్టిన వీడియోను పంచుకున్నారు . టెస్లా ఆప్టిమస్ రోబోట్లను అధిక ధరలకు ఉత్పత్తి చేసేలా రూపొందిస్తోందని, దీని ధర బహుశా 20 వేల డాలర్ల కంటే తక్కువగా ఉంటుందని మస్క్ ఆ సమయంలో చెప్పారు. కాగా, మస్క్ భవిష్యత్తులో మనుషులు చేసే రకరకలా పనులను ఈ రోబోట్ లు భర్తీ చేయనున్నాయని ఓ సందర్భంలో టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ వెల్లడించారు. -
2000 ఉద్యోగాలు రెడీ..! ఎక్కడో తెలుసా?
టెస్లా పవర్ ఇండియా ఇటీవల తన విస్తరణ ప్రణాళికలలో భాగంగా ఏకంగా 2,000 మందికి పైగా ఉద్యోగులను రిక్రూట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఇంజినీరింగ్, ఆపరేషన్స్, సేల్స్, మార్కెటింగ్, సపోర్ట్ ఫంక్షన్లలోని వివిధ విభాగాలలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు సంస్థ ప్రకటనలో వెల్లడించింది. సస్టైనబుల్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ సేవలను అందిస్తున్న టెస్లా పవర్ కంపెనీ బ్యాటరీ బ్రాండ్ రీస్టోర్‌ను కూడా ప్రారంభించింది. కంపెనీ ఈ 2026 నాటికి దేశవ్యాప్తంగా ఈ రీస్టోర్ యూనిట్లను సుమారు ఐదు వేలకు చేర్చడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే వివిధ రంగాల్లో ఉద్యోగులను నియమించుకోవడానికి సన్నద్దమవుతోంది. భారతదేశంలో తమ ఉనికిని మరింత విస్తరించడంతో భాగంగా ప్రతిభావంతులైన కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్లు, వారికి మా సహకారాన్ని అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని టెస్లా పవర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కవిందర్ ఖురానా అన్నారు. -
కేంద్రం మరో కీలక నిర్ణయం?.. ఇక ఎలోన్ మస్క్‌దే ఆలస్యం!
భారత్ మార్కెట్లోకి టెస్లా కార్ల రాక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ కార్ల ప్రియులకు శుభవార్త. కేంద్రం దిగుమతి సుంకంపై ఇచ్చే రాయితీని పొడిగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అపర కుబేరుడు ఎలోన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ భారత్‌లో అడుగు పెట్టడం దాదాపూ ఖరారైనట్లేనని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రూ .30 లక్షలు (36,000 డాలర్లు) మించిన ఎలక్ట్రిక్ కార్లపై రాయితీ దిగుమతి సుంకాన్ని 2-3 సంవత్సరాల పాటు పొడిగించాలని కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే టెస్లా భారత్‌కు రాక సుగమైనట్లే. కాగా, కేంద్రం దిగుమతి సుంకంపై రాయితీలను కొనసాగిస్తే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గడమే కాకుండా, విదేశీ వాహన తయారీ సంస్థలు భారత్‌లో తమ తయారీ కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇక కేంద్రం ఇంపోర్ట్ డ్యూటీపై నిర్ణయం తీసుకోనుందనే వార్తల నేపథ్యంలో.. టెస్లా ఇప్పటి వరకు భారత్‌లో టెస్లా ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంక్ గ్యారెంటీలను అడుగుతోంది. తాజాగా పరిణామాలతో బ్యాంక్ గ్యారెంటీ బదులు దిగుమతి సుంకం తగ్గింపుపై కేంద్రంతో ఎలోన్ మస్క్ సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. వంద శాతం దిగుమతి సుంకం ప్రస్తుత విధానం ప్రకారం కేంద్రం 40,000 డాలర్ల (రూ.33 లక్షలు) విలువ చేసే కార్లపై 100 శాతం దిగుమతి సుంకం వసూలు చేస్తుండగా.. కారు ధర 40 వేల డాలర్ల కంటే తక్కువ ధర ఉంటే 60 శాతం పన్ను విధిస్తోంది. దిగుమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గిస్తే ఎలోన్ మస్క్ కేంద్రం వాహనాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గిస్తే భారత ఈవీ మార్కెట్లోకి ప్రవేశించి దేశంలో 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు. అందుకే దిగుమతి చేసుకున్న కార్లపై రాయితీ దిగుమతి సుంకాలను తగ్గించాలని, బ్యాంకు గ్యారంటీల ఆధారంగా పాలసీని ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దేశీయ కార్ల తయారీ సంస్థలకు భారీ షాక్! ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా, ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీలు ఈవీ కార్ల తయారీలో ముందజలో ఉన్నాయి. ఈ కంపెనీలు టెస్లా అడుగుతున్న గొంతెమ్మ కోరికలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా కేంద్రాన్ని సంప్రదించి భారత్‌లో తయారీని పెంచేలా ప్రోత్సహకాలు అందించాలని కోరింది. ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ కూడా విదేశీ సంస్థల నుంచి ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకోవాలనే ఆలోచనను వ్యతిరేకించారు. టెస్లా, ఇతర అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలను అందించడం దేశీయంగా తయారయ్యే కార్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అన్నారు. -
భారత్‌లోకి టెస్లా.. పేరు మార్చుకుంటేనే పనవుతుంది! వైరల్ ట్వీట్
ఎలాన్ మస్క్ ( Elon Musk ) నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ( Tesla ) భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. ఈ క్రమంలో నథింగ్ ఫోన్ ( Nothing Phone ) సీఈఓ కార్ల్ పీ ( Carl Pei ).. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కి ఓ ఫన్నీ సలహా ఇచ్చారు. భారత్‌లో ఫ్యాక్టరీని ఎలా తెరవాలో చమత్కారంగా సూచించారు. భారతదేశంలో టెస్లా ఫ్యాక్టరీని ప్రారంభించాలంటే ముందుగా ‘ఎక్స్’ (ట్విటర్) ప్లాట్‌ఫారమ్‌లో తన యూజర్ నేమ్‌ను "ఎలాన్ భాయ్"గా మార్చుకోవాలని కార్ల్ పీ సూచించారు. ఈయన కూడా స్వయంగా తన ‘ఎక్స్’ యూజర్ నేమ్‌ను 'కార్ల్ భాయ్'గా మార్చుకున్నారు. "ఎలాన్ మస్క్.. మీ యూజర్ నేమ్‌ను ఎలాన్ భాయ్‌గా మార్చకుండా భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొచ్చనుకుంటున్నారా?" ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. 6.7 లక్షల వీవ్స్, వందల కొద్దీ కామెంట్లు వచ్చాయి. ఈ ట్వీట్‌కు యూజర్లు సైతం అంతే ఫన్నీగా స్పందించారు. "మీరు భాయ్, అతను (మస్క్) మామూ అవుతాడు" అని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. "ప్రాంతాన్ని బట్టి పేరు ఆధారపడి ఉంటుంది. గుజరాత్ అయితే ఎలాన్ భాయ్, మహారాష్ట్ర అయితే ఎలాన్ భావ్, తెలంగాణ అయితే ఎలాన్ గారు, హర్యానా అయితే ఎలోన్ టౌ, పంజాబ్ అయితే ఎలాన్ పాజీ, తమిళనాడు అయితే ఎలాన్ అన్నా, అలాగే పశ్చిమ బెంగాల్ అయితే ఎలాన్ దాదా" అని మరొక యూజర్ పేర్కొన్నారు. "ఎలాన్ దాదా బాగా సరిపోతుంది!" ఇంకొక యూజర్ చమత్కరించారు. ఇంకా రకరకాల పేర్లను యూజర్లు సూచించారు. .@elonmusk did you really think you could build a Tesla factory in India without changing your username to Elon Bhai? — Carl Bhai (@getpeid) February 18, 2024 ది ఎకనామిక్ టైమ్స్ తాజా నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించే అంచున ఉంది. ఎలక్ట్రిక్ కార్లపై రూ.30 లక్షలకు మించిన రాయితీ దిగుమతి సుంకాలను 2-3 సంవత్సరాల పాటు పొడిగించే విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తోంది. ప్రస్తుతం భారత్ రూ.33 లక్షల కంటే ఎక్కువ విలువ కలిగిన కార్లపై 100 శాతం దిగుమతి సుంకాన్ని, ఆ శ్రేణి కంటే తక్కువ ఉన్న కార్లపై 60 శాతం విధిస్తోంది. కార్యకలాపాల ప్రారంభ సంవత్సరాల్లో విదేశీ ఈవీలపై ప్రభుత్వం 15 శాతం దిగుమతి సుంకాన్ని తగ్గించినట్లయితే భారత్‌లో 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి టెస్లా సుముఖతను వ్యక్తం చేసింది. -
కొత్తప్లాన్‌తో భారత్‌లోకి టెస్లా.. ప్రయత్నం ఫలిస్తుందా..?
భారతప్రధాని నరేంద్రమోదీ ఇటీవల రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్ ప్రకటించిన తర్వాత ఈ రంగంలోని కంపెనీల షేర్లు పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి బడ్జెట్లో కూడా దాదాపు రూ.10వేలకోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనివల్ల పేద కుటుంబాలకు ఏటా రూ.18 వేల వరకు లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. తాజాగా అమెరికాలోని ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇంక్ దేశంలో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఇన్స్టాల్ చేయడానికి స్థానిక భాగస్వామి కోసం చూస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా కంపెనీ తన భవిష్యత్తు ప్రణాళిక గురించి ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేసినట్లు లైవ్ మింట్ నివేదిక పేర్కొంది. సబ్సిడీ, ఇతర గ్రాంట్లలో రాయితీ ఇవ్వాలని కంపెనీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. ఎలక్ట్రిక్ కార్ వ్యాపారం కాకుండా, టెస్లా సౌర విద్యుత్ ఉత్పత్తి, కరెంట్ స్టోరేజ్ చేసే గృహ విద్యుత్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తోంది. టెస్లా తయారు చేసే ఉత్పత్తుల్లో ‘సోలార్ రూఫ్’ కూడా ఒకటి. దీనిలో పైకప్పును ఫొటోవోల్టాయిక్ టైల్స్‌తో భర్తీ చేస్తారు. దీన్ని పవర్వాల్ అని పిలుస్తారు. ఇది సోలార్ ప్యానెల్, బ్యాటరీ పవర్ స్టోరేజ్ యూనిట్‌గా వ్యవహరిస్తుంది. అమెరికాలో కంపెనీకి చెందిన సోలార్ వ్యాపారం కొంత మందగించిన తరుణంలో టెస్లా భారతదేశంలో తన కార్యకలాపాలు ప్రారంభించాలని చూస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. అమెరికాలో టెస్లా విద్యుత్ వ్యాపారం ఏడాది క్రితం 100 మెగావాట్ల నుంచి డిసెంబర్ త్రైమాసికానికి 59శాతం తగ్గి 41 మెగావాట్లకు చేరుకుంది. మరోవైపు, దేశీయంగా ఇప్పటికే టాటా పవర్ సోలార్, అదానీ సోలార్, సెర్వోటెక్ పవర్ సిస్టమ్స్..వంటి దేశీయ కంపెనీలు రూఫ్ టాప్ సోలార్ విభాగంలో పనిచేస్తున్నాయి. గత ఐదేళ్లలో భారతదేశ సోలార్ రూఫ్‌టాప్ సామర్థ్యం 47శాతం చొప్పున పెరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ నాటికి దేశం మొత్తం రూఫ్ టాప్ సోలార్ సామర్థ్యం 11.1 గిగావాట్లుగా ఉంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ద్వారా దేశంలోని కోటి ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదీ చదవండి: గగనతల రారాజు ‘జిర్కాన్’.. ఎన్నో ప్రత్యేకతలు ఇదిలా ఉండగా, ఇప్పటికే టెస్లా కార్ల తయారీ యూనిట్‌ను భారత్‌లో స్థాపించాలని కంపెనీ అన్నివిధాలా ప్రయత్నిస్తోంది. కానీ అందుకు సంస్థ కోరేలా భారీ రాయితీలు, పన్ను మినహాయింపులు ప్రభుత్వం ఇవ్వడానికి సుముఖంగా లేదు. దాంతో జాప్యం జరుతున్నట్లు తెలిసింది. తాజాగా సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటుకు భారత్‌లో ప్రవేశించడానికి కొత్త ప్రయత్నం చేస్తోంది. -
టెస్లాకు ప్రత్యేక రాయితీలు లేవు - విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాకు ప్రత్యేకంగా ఎలాంటి రాయితీలను కల్పించడం లేదని భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృష్ణ పాల్ గుర్జార్ స్పష్టం చేశారు. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు రాయితీలతో కూడిన ప్రత్యేక విధానం ఏదీ ప్రభుత్వం రూపొందించలేదని కూడా ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు, మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. దేశంలో ఎలక్ట్రిక్ కార్లతో పాటు అత్యాధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ (ఏఏటి)తో కూడిన ఉత్పాదనల కోసం ప్రభుత్వం ఉత్పత్తితో ముడిపడిన రెండు ప్రోత్సాహక పథకాలను (పిఎల్ఐ)ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఏఏటితోపాటు దేశంలో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసిసి) బ్యాటరీల ఉత్పాదనను కూడా పిఎల్ఐ స్కీమ్‌లో చేర్చినట్లు చెప్పారు. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజి కార్యక్రమం కింద ఈ రంగంలో దేశీయంగా ఏసీసీ బ్యాటరీల ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో 2021 మే 12న ప్రభుత్వం ఉత్పత్తితో ముడిపడ్డ ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. దీని కోసం 18 వేల 100 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. దేశంలో 50 గిగావాట్ అవర్స్ (జిడబ్ల్యూహెచ్) సామర్ధ్యం వరకు ఏసీసీ బ్యాటరీల ఉత్పత్తి సామర్ధ్యాన్ని స్థాపించడం, ఈ పథకం ఉద్దేశం అని మంత్రి పేర్కొన్నారు. ఇక ఆటోమొబైల్, అటో విడిభాగాల పరిశ్రమ కోసం 2021 సెప్టెంబర్ 15న ఉత్పత్తితో ముడిపడ్డ ప్రోత్సాహక పథకం (పిఎల్ఐ)ని ప్రభుత్వం ఆమోదించింది. దీని కోసం 25 వేల 938 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు జరిగింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి విడిభాగాలతో పాటు అత్యంత అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీ ఉత్పాదనలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. అయితే ఈ పిఎల్ఐ స్కీం కోసం కెంపెనీల నుంచి దరాఖాస్తుల స్వీకరణకు తుది గడువు ముగిసిపోయిందని మంత్రి వెల్లడించారు. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ బ్యాటరీ స్టోరేజి కార్యక్రమం కింద ఈ ఏడాది జనవరి 24న ప్రకటించిన పిఎల్ఐ పథకానికి ఆసక్తిగల కంపెనీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్‌ను ఆహ్వానించడం జరిగింది. దీనికి అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ కూడా ఆర్ఎఫ్పి పంపించవచ్చని భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు -
Viral Photo: ఢిల్లీలో టెస్లా క్రాస్‌బ్రీడ్.. మస్క్ చూస్తే ఏడుస్తాడు!
ఢిల్లీలోని కరోల్ బాగ్ ఏరియాలో ఓ టెస్లా కారు కనిపించి ఆశ్చర్యపరిచింది. అయితే ఇది అసలైన టెస్లా కారు కాదు. వేరే కంపెనీ కారుకు టెస్లా లేబుల్ తగిలించి తిప్పుతున్నారు. ఇది భారత్ పే మాజీ ఎండీ ఆష్నీర్ గ్రోవర్ కంట్లో పడింది. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. భారత్ పే మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా ఇంటర్నెట్లో వినోదభరితమైన, అబ్బురపరిచే విషయాలను పంచుకొంటుంటారు. ఇదే క్రమంలో టెస్లా లోగోతో ఉన్న బీవైడీ అట్టో3 కారు ఫొటోను షేర్ చేశారు. ‘బహుశా ప్రపంచంలోనే తొలి క్రాస్ బ్రీడ్ టెస్లా కారు ఇదేనేమో’ అంటూ కాప్షన్‌ను జోడించారు. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. దేశంలో క్రియేటివిటీకి కొదవ లేదని ఓ యూజర్ కామెంట్లు పెట్టారు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ.. ఈ ఫొటో చూస్తే టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ ఓ మూలన కూర్చుని ఏడుస్తాడని కామెంట్ చేశాడు. World’s first ‘cross - breed’ Tesla ! Some Delhi boy literally ‘built his dream’ in Karol Bagh @Tesla pic.twitter.com/zxuilgyvAV — Ashneer Grover (@Ashneer_Grover) February 3, 2024 -
Tesla: ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం!
టెస్లా విషయంలో ఆ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ ప్రధాన కార్యాలయాన్ని డెలావర్ నుంచి టెక్సాస్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. భారీ ప్యాకేజీ అందుకునేందుకు మస్క్ అనర్హుడంటూ డెలావర్ కోర్టు తీర్పు ఇచ్చిన తరుణంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు ఎలాన్ మస్క్ అనర్హుడంటూ డెలావర్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ వెంటనే మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. డెలావర్ రాష్ట్రంలో ఎవరూ తమ సంస్థలను రిజిస్టర్ చేసుకోవద్దని పిలుపునిచ్చారు. The public vote is unequivocally in favor of Texas! Tesla will move immediately to hold a shareholder vote to transfer state of incorporation to Texas. https://t.co/ParwqQvS3d — Elon Musk (@elonmusk) February 1, 2024 అంతేకాదు.. టెస్లా ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌కు మార్చాలా? అని పోల్ కూడా పెట్టారు. ఆ పోల్‌లో 80 శాతం అవునని చెప్పడంతో.. మార్పు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు సైతం టెక్సాస్‌లోనే తమ కంపెనీలను రిజిస్టర్ చేసుకుంటాయి. పన్ను శాతం తక్కువగా ఉండడమే అందుకు కారణం. -
భారత్‌లో టెస్లా కార్ల తయారీ షురూ.. ఆ మోడల్ పేరు ఇదేనా..?!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారత్‌లో వచ్చే ఏడాది కార్ల తయారీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ ధరలో ‘రెడ్‌వుడ్’ అనే పేరుతో కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. టెస్లా 2025 మధ్యలో ‘రెడ్‌వుడ్’ కోడ్‌నేమ్‌తో కొత్త 'మాస్ మార్కెట్' ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రాయిటర్స్ ప్రకారం, రాబోయే మోడల్‌లు ప్రారంభ కారు ధర 25వేల డాలర్లతో చవకైన కార్లను విడుదల చేసి చైనాకు చెందిన బీవైడీ తయారు చేసే అధిక ధరలతో కూడిన ఈవీ కార్ల కంటే పెట్రోల్ వేరియంట్ కార్లతో పోటీ పడేలా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని టెస్లా యాజమాన్యం భావిస్తున్నది. ఎలాన్ మస్క్ తొలిసారి 2020లో 25 వేల డాలర్ల ధరతో కార్లను తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కాగా, అమెరికాలో టెస్లా బడ్జెట్ కారు మోడల్ 3 సెడాన్ ప్రారంభ ధర 38,990 డాలర్లుగా ఉంది. అయితే ఎలాన్ మస్క్ ఈ కార్లను అమెరికాతో పాటు భారత్‌లో తయారు చేస్తారా? లేదా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
అమెరికాలో రెండు లక్షల టెస్లా కార్లు వెనక్కి! - కారణం ఇదే..
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా USAలో దాదాపు 2,00,000 వాహనాలకు రీకాల్ ప్రకటించింది. కారు రివర్స్‌లో ఉన్నప్పుడు బ్యాకప్ కెమెరా పనిచేయకపోవచ్చనే కారణంతో కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. టెస్లా రీకాల్ అనేది 2023 మోడల్ ఎస్, ఎక్స్, వై వాహనాలకు వర్తిస్తుంది. ఇవన్నీ కూడా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కంప్యూటర్ 4.0ని కలిగి ఉన్నాయి. ఇది 2023.44.30 సాఫ్ట్వేర్ వెర్షన్‌పై పనిచేస్తుంది. ప్రస్తుతానికి టెస్లా కార్లలో ఈ లోపాలకు సంబంధించిన ఎలాంటి ప్రమాదం జరగలేదని టెస్లా యూఎస్ నేషనల్ హైవేస్ ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు తెలిపింది. భవిష్యత్తులో కూడా టెస్లా కార్లలో ఎలాంటి సమస్య తలెత్తకూడదనే భావనతోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం కంపెనీ జనవరి 12 నుంచి రీకాల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నష్టాల్లో టెస్లా.. ఇదిలా ఉండగా టెస్లా కంపెనీ షేర్లు ఒక్కరోజులోనే ఏకంగా 12 శాతానికిపైగా నష్టపోయినట్లు తెలిసింది. టెస్లా ధరలను తగ్గిస్తున్నా.. సేల్స్ మాత్రం తగ్గుముఖం పడుతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మకాలు తగ్గడం మాత్రమే కాకుండా జనవరి 15న స్టాక్ విలువ 12.13 శాతం పడిపోయి 182.63 డాలర్ల వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్ విలువ బాగా తగ్గడం వల్ల టెస్లా మార్కెట్ వ్యాల్యూ ఒక్కరోజే 80 బిలియన్ డాలర్ల వరకు తగ్గింది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 6.64 లక్షల కోట్లకు పైనే అని తెలుస్తోంది. -
ఆ వ్యాఖ్యలే కొంప ముంచాయా! ఒకేరోజు రూ.6.64 లక్షల కోట్లు లాస్..
ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk)కు చెందిన టెస్లా కంపెనీ షేర్లు ఒక్కరోజులోనే ఏకంగా 12 శాతానికిపైగా నష్టపోయినట్లు తెలుస్తోంది. టెస్లా ధరలను తగ్గిస్తున్నా.. సేల్స్ మాత్రం తగ్గుముఖం పడుతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మస్క్ చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెస్లా గత కొంతకాలంగా ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల సేల్స్ కూడా బాగా దెబ్బతిన్నాయి. చైనా ప్రధాన పోటీదారుగా ఉండటం వల్ల ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది. టెస్లా స్టాక్ భారీగా తగ్గడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. టెస్లా అమ్మకాలు తగ్గడం మాత్రమే కాకుండా జనవరి 15న స్టాక్ విలువ 12.13 శాతం పడిపోయి 182.63 డాలర్ల వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్ విలువ బాగా తగ్గడం వల్ల టెస్లా మార్కెట్ వ్యాల్యూ ఒక్కరోజే 80 బిలియన్ డాలర్ల వరకు తగ్గింది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 6.64 లక్షల కోట్లకు పైనే అని తెలుస్తోంది. ఇదీ చదవండి: భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేదు.. ఐక్యరాజ్య సమితిపై మస్క్ కీలక వ్యాఖ్యలు ఎలక్ట్రిక్ వాహన రంగంలో చైనా తమకు పోటీ వస్తోందని ఇలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ మార్కెట్ మీద నియంత్రణ కోల్పోతే చైనా తప్పకుండా ఇతర దేశాల వ్యాపారాలను కొల్లగొట్టే ప్రమాదం ఉందని వాపోయారు. ప్రస్తుతం BYD కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని.. టెస్లా కార్లకంటే కూడా ఇవి తక్కువ ధరలో లభించడం వల్ల టెస్లా అమ్మకాలు క్షీణించాయని చెబుతూ.. గత త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు బాగా తగ్గినట్లు వెల్లడించారు. -
TS: రాష్ట్రంలో టెస్లా, బీవైడీ తయారీ ప్లాంట్..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆరు కంపెనీలు మొత్తం రూ.37,870 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, చైనా ఈవీ కంపెనీ బీవైడీ తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. తెలంగాణలో తయారీ ప్లాంట్ల ఏర్పాటు గురించి టెస్లా, బీవైడీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. లండన్‌లోని భారత హైకమిషన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: రోడ్లపై ‘స్మార్ట్‌ఫోన్ జాంబీ’లున్నాయి జాగ్రత్త..! ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి చైనాకు చెందిన బీవైడీ సంస్థకు కేంద్రం గత ఏడాది అనుమతి నిరాకరించింది. టెస్లా రెండు సంవత్సరాలుగా భారతదేశంలోకి ప్రవేశించాలని చూస్తోంది. ట్యాక్స్ రాయితీలు ఇవ్వాలని టెస్లా డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే అందుకు కేంద్రం ఒప్పకోవడం లేదనే వాదనలున్నాయి. -
ఎర్ర సముద్రంలో అలజడి.. టెస్లాకు గట్టి దెబ్బ!
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. హౌతీల ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి అమెరికా సహా 12 మిత్ర దేశాలు ఏకమయ్యాయి. ఎర్రసముద్రంలో గస్తీ నిర్వహిస్తున్నాయి. వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎర్ర సముద్రంలో హౌతీలు సృష్టిస్తున్న అలజడుల దెబ్బ అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా (Tesla)కు గట్టిగా తగిలింది. తన బెర్లిన్ ఫ్యాక్టరీలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 11 వరకు చాలా కార్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టెస్లా ప్రకటించినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఎర్ర సముద్రంలోని నౌకలపై జరుగుతున్న దాడుల ప్రభావం సరకు రవాణాపై తీవ్రంగా పడింది. దీంతో కంపెనీకి విడిభాగాల సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా ఉత్పత్తిని నిలిపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇరాన్-మద్దతుగల హౌతీ మిలిటెంట్లు గాజాలోని హమాస్‌కు సంఘీభావంగా ఎర్ర సముద్రంలో నౌకలు లక్ష్యంగా చేస్తున్న దాడులకు పర్యవసానంగా తగిలిన గట్టి దెబ్బగా దీన్ని భావిస్తున్నారు. ఎర్ర సముద్రంలో జరుగుతున్న సాయుధ దాడుల కారణంగా కేప్ ఆఫ్ గూడ్ హోప్ ద్వారా యూరప్, ఆసియా మధ్య రవాణా మార్గాలలో మార్పులు జరగడం తమ బెర్లిన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నట్లు టెస్లా ఒక ప్రకటనలో తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఉత్పత్తి నిలిపోవడానికి నిర్దిష్ట కారణాలను వెల్లడించనప్పటికీ ఫిబ్రవరి 12న పూర్తి ఉత్పత్తిని పునఃప్రారంభించనున్నట్లు టెస్లా పేర్కొంది. ఎర్ర సముద్రంలో అలజడి కారణంగా ఇతర వాహన తయారీదారులు ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవచ్చని ఆటో పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టెస్లాతోపాటు చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ గీలీ, అతిపెద్ద ఫర్నీచర్ కంపెనీ ఐకియా సహా అనేక కంపెనీలు డెలివరీ ఆలస్యం గురించి ఇప్పటికే హెచ్చరించాయి. -
గుజరాత్ సమ్మిట్‌లో కనిపించని 'ఇలాన్ మస్క్'.. టెస్లా ఫ్యూచర్ ఏంటి?
భారతదేశంలో టెస్లా అరంగేట్రం చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉంది. ప్రయత్నాలన్నీ సఫలీకృతమై గుజరాత్ రాష్ట్రంలో కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్దమైనట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల ప్రారంభమైన 'వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024' (2024 Vibrant Gujarat Global Summit)కు మాత్రం 'మస్క్' హాజరు కాలేదు. నిజానికి వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024 వేదికగా టెస్లా చర్చలు జరగనున్నట్లు జరుగుతాయని చాలామంది భావించారు, కానీ టెస్లా అధినేత ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీనిపై స్పందించిన గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ 'రాహుల్ గుప్తా' మస్క్ ఈ సమ్మిట్‌కు హాజరు కానప్పటికీ పెట్టుబడులు పెట్టడానికి స్వాగతం రాష్ట్రం పలుకుతోందని స్పష్టం చేశారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అమెరికన్ కంపెనీ కూడా ఇండియాలో ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. దీనికోసం కంపెనీ గుజరాత్‌ను మొదటి ఎంపిక చేసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలం గుజరాత్ అని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇదీ చదవండి: వెనుకపడ్డ యాపిల్.. వ్యాల్యుబుల్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ ఎలోన్ మస్క్ 2024లో భారతదేశంలో టెస్లా వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. త్వరలో గుజరాత్లో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు టెస్లా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోందని. 2023లోనే యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మస్క్ సమావేశమై టెస్లా ఫ్యాక్టరీ గురించి చర్చలు జరిపారు. మొత్తం మీద మస్క్ టెస్లా ఫ్యాక్టరీని ఈ ఏడాది భారత్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
Elon Musk: ఇంకా డ్రగ్స్ వాడుతున్నాడా.. వికృత ప్రవర్తనకు కారణం అదేనా?
ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ డిప్రెషన్ నుంచి బయటపడటానికి కెటామైన్ వంటి సైకెడెలిక్ డ్రగ్స్ వాడటం గత ఏడాది వార్తల్లో నిలిచింది. అయితే మస్క్ ఇప్పటికీ డ్రగ్స్ వాడుతున్నారని, ఇది ఆయన ఆరోగ్యంతోపాటు మస్క్ పర్యవేక్షిస్తున్న విస్తారమైన వ్యాపార సామ్రాజ్యంపై తీవ్ర పరిణామాలను కలిగిస్తుందని టెస్లా, స్పేస్‌ఎక్స్‌లోని పలువురు బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ సంచలన నివేదిక ప్రచురించింది. ప్రపంచంలోని పలు చోట్ల జరిగిన ప్రైవేట్ పార్టీలలో ఎలాన్ మస్క్ ఎల్ఎస్డీ, కొకైన్, ఎక్స్టాసీ, సైకెడెలిక్ మష్రూమ్లను తీసుకునేవాడని దగ్గర నుంచి గమనించిన కొందరు చెబుతున్నారు. సైకెడెలిక్ లాంటి డ్రగ్ కెటామైన్ కోసం తాను ప్రిస్క్రిప్షన్ కలిగి ఉన్నట్లు గతంలో స్వయంగా చెప్పిన మస్క్.. బహిరంగంగానే గంజాయిని సేవించిన విషయం తెలిసిందే. వరుస సంఘటనలు 2018లో లాస్ ఏంజెల్స్‌లో జరిగిన పార్టీలో ఎలాన్ మస్క్ చాలా యాసిడ్ టాబ్లెట్లను తీసుకున్నాడు. మరుసటి సంవత్సరం మెక్సికోలో జరిగిన ఒక పార్టీలోనూ మ్యాజిక్ పుట్టగొడుగులను సేవించాడు. ఇక 2021లో మియామిలోని ఆర్ట్ బాసెల్ హౌస్ పార్టీకి హాజరైనప్పుడు ఎలాన్ మస్క్, అతని సోదరుడు కింబాల్ మస్క్ ఇద్దరూ కెటామైన్ సేవిస్తూ కనిపించారు. గతంలో టెస్లా, ప్రస్తుతం స్పేస్ఎక్స్ బోర్డు సభ్యుడిగా ఉన్న స్టీవ్ జుర్వెట్సన్తో కలిసి ఎలాన్ మస్క్ మాదకద్రవ్యాలు సేవించినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం, టెస్లాలో మాజీ డైరెక్టర్ అయిన లిండా జాన్సన్ రైస్.. ఎలాన్ మస్క్ వికృత ప్రవర్తన, అతని మాదకద్రవ్యాల వాడకంతో చాలా ఆగ్రహానికి గురైంది. ఆమె 2019లో కంపెనీ బోర్డులోకి మళ్లీ రాకూడదని నిర్ణయించుకుంది. అయితే దీన్ని మస్క్ అటార్నీ అయిన అలెక్స్ స్పిరో ఖండించారు. స్పేస్ ఎక్స్‌లో మస్క్ ఎప్పటికప్పుడు డ్రగ్స్ పరీక్షలను ఎదుర్కొంటాడని, వీటిలో ఎప్పుడూ విఫలం కాలేదని చెప్పారు. స్పేస్ఎక్స్ ఈవెంట్లో బూతులు ఇక మరొక సంఘటనలో 2017లో కంపెనీ ఈవెంట్లో కొంతమంది స్పేస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్‌లు మస్క్ ప్రవర్తనలో మార్పును గమనించారు. కాలిఫోర్నియాలోని కంపెనీ ప్రధాన కార్యాలయం వద్ద మిషన్ కంట్రోల్ చుట్టూ వందలాది మంది ఉద్యోగులు చేరారు. దాదాపు గంట ఆలస్యంగా వచ్చిన మస్క్.. మత్తులో ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడారు.2018లో జో రోగన్ షోలో గంజాయిని సేవిస్తూ కనిపించిన మస్క్ తర్వాత నాసాతో ఇబ్బందుల్లో పడ్డాడు. ఇది కంపెనీపై ప్రభావం చూపించింది. స్పేస్‌ఎక్స్‌లోని సిబ్బంది అంతటికి ఔషధ పరీక్షలకు దారితీసింది. చాలా మంది టెస్లా బోర్డు సభ్యులు మస్క్ మాదకద్రవ్యాల వినియోగం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. మిటింగ్ మినిట్స్ లేదా బోర్డు అధికారిక ఎజెండాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ టెస్లా బోర్డు ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న రాబిన్ డెన్హోమ్ వంటి కొంతమంది డైరెక్టర్లు డ్రగ్స్ అనే పదాన్ని ఉపయోగించకుండా మస్క్ ప్రవర్తనపై 2022 ప్రారంభం వరకు టెస్లా, స్పేస్ఎక్స్ రెండింటిలో బోర్డు సభ్యుడైన కింబాల్ మస్క్‌ని సంప్రదించారు. చట్టవిరుద్ధమైన డ్రగ్స్ ఇష్టం లేదట! టెస్లాను ప్రైవేట్‌గా మార్చే ప్రణాళికల గురించి 2018లో చేసిన ట్వీట్‌తో సహా మస్క్ అసాధారణ ప్రవర్తనకు కారణం ఏమై ఉంటుందని ఎగ్జిక్యూటివ్‌లు తలలు పట్టుకున్నారు. దీనికి మాదకద్రవ్యాల వాడకమే కారణమని కొందరు, దీర్ఘకాలిక నిద్రలేమి మరికొందరు అభిప్రాయపడ్డారు. ఎలాన్ మస్క్ జీవిత చరిత్రపై రచయిత వాల్టర్ ఐజాక్సన్ ఇటీవల ప్రచురించిన పుస్తకంలోనూ మస్క్ "డెమోన్ మోడ్"ని వివరించారు. ఎలాన్ మస్క్ తరచుగా నిగ్రహాన్ని కోల్పోతాడని, ఉద్యోగులపై విరుచుకుపడతాడని పేర్కొన్నారు. అయితే చట్టవిరుద్ధమైన డ్రగ్స్ వాడటం తనకు ఇష్టం లేదని మస్క్ పేర్కొన్నట్లుగా ఈ పుస్తకంలో ఉండటం గమనార్హం. -
భారత్‌లో టెస్లా.. ఎలాన్ మస్క్‌కి షాకిచ్చిన గుజరాత్ మంత్రి!
అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కి గుజరాత్ పరిశ్రమల శాఖ మంత్రి భారీ షాకిచ్చారు. గుజరాత్లో ఇతర ఆటోమొబైల్ సంస్థలకు కల్పించిన సౌకర్యాలనే టెస్లాకు ఇస్తామని అన్నారు. అంతే తప్పా టెస్లాకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఇవ్వబోమని స్పస్టం చేశారు. గుజరాత్లో జనవరి 10-12 వరకు ‘వైబ్రంట్ గుజరాత్ 2014’ సమ్మిట్ జరగనుంది. ఈ తరుణంలో వైబ్రంట్ గుజరాత్ సదస్సుకు ఎలన్ మస్క్ హాజరవుతారా? లేదా? అన్న అంశంపై మంత్రి బల్వంత్ సింగ్ రాజ్‌పుత్ పై విధంగా స్పందించారు. ఈ సదస్సులో టెస్లా యూనిట్ ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని పరోక్షంగా సంకేతాలిచ్చారు. అయితే భారత్ తమకు ప్రత్యేక మినహాంపులిస్తే కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని గతంలో ఎలాన్ మస్క్ అన్నారు. తాజా, బల్వంత్ సింగ్ రాజ్‌పుత్ వ్యాఖ్యలపై మస్క్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారని మరింత ఆసక్తికరంగా మారింది. కాగా, గుజరాత్లో ఇప్పటికే మారుతీ సుజుకి, టాటా మోటార్స్ తయారీ యూనిట్లు ఉన్నాయి. తాజా టెస్లా రాకతో గుజారాత్‌తో పాటు ఆటోమొబైల్ రంగ వృద్ధికి మరింత దోహదం చేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం గుజరాత్ రాష్ట్రంలోని సనంద్, ధోలెరా, బెచరాజీ ప్రాంతాల్లో టెస్లా యూనిట్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. దేశీయంగా కార్ల విక్రయానికి, విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలుగా గుజరాత్ రాష్ట్రంలోనే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే టెస్లా కార్లపై దిగుమతి సుంకాలు 15-20 శాతం తగ్గిస్తారని గత నెలలో కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. -
మస్క్ చేతికి వొడాఫోన్ ఐడియా..? క్లారిటీ ఇచ్చిన టెలికాం సంస్థ
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ అప్పుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా సంస్థలో వాటాను కొనుగోలు చేస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, క్లిప్‌లు సామాజికమాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా స్పందించింది. స్టార్లింగ్ తమ కంపెనీలో వాటా కొనుగోలు చేయడానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరపడం లేదని టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా మంగళవారం ప్రకటించింది. వాటా కొనుగోలుకు అవకాశం ఉందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. తాము కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తామని పేర్కొంది. సామాజికమధ్యమాల్లో వస్తున్న వార్తలు నమ్మకూడదని చెప్పింది. ఏ సమాచారమైన అధికారిక వెబ్‌సైట్‌ల్లో సరిచేసుకోవాలని తెలిపింది. ఇదీ చదవండి: కొత్త కార్ల పరుగు దేశంలో తొలిసారి టెలికాం రంగంలో ప్రవేశించేందుకు స్టార్‌లింక్ వోడాఫోన్ ఐడియాతో జతకట్టవచ్చనే ప్రచారం వల్ల వీఐ షేర్లు ఇటీవల భారీగా ర్యాలీ అయ్యాయి. స్టార్‌లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు వీలుగా ప్రభుత్వం వీఐలో తన 33.1 శాతం వాటాను మస్క్‌కు విక్రయించవచ్చని ఊహాగానాలు వచ్చాయి. మస్క్ వచ్చే వారం వైబ్రెంట్ గుజరాత్ బిజినెస్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు భారత్ రానున్న నేపథ్యంలో ఈ వార్తలకు ప్రాధ్యాన్యం సంతరించుకుంది. -
భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్.. కార్ల ధరలు ఇంత తక్కువా?
భారతీయులకు శుభవార్త. దేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా రాకకు మార్గం సుగమమైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే భారత్‌లో టెస్లామోడల్ 3 కారు బడ్జెట్ ధరలో వాహనదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. అపరకుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరికొద్ది రోజుల్లో భారత్‌లో పర్యటించనున్నారు. జనవరి 10 నుంచి 12 వరకు జరిగే వైబ్రాంట్ గుజరాత్ గ్లోబుల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు భారత్‌లో పర్యటించన్నట్లు సమాచారం. ఇప్పటికే టెస్లా కార్ల తయారీ యూనిట్‌ను గుజరాత్లో ఏర్పాటు చేసే దిశగా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌కు కావాల్సిన అనుమతులు, స్థల అన్వేషణ త్వరగా జరిగేలా గుజరాత్ సమ్మిట్ దోహదం చేయనుంది. ఈ నివేదికలపై టెస్లా యూనిపై కేంద్రం గాని అటు టెస్లా కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వైబ్రాంట్ గుజరాత్ గ్లోబుల్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ సమక్షంలో ఎలాన్ మస్క్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. టెస్లా కార్ల ధరలు ఎంతంటే? పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, టెస్లా ధరలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చౌకైన మోడల్ టెస్లా మోడల్ 3 బేస్ వేరియంట్ ధర 40,240 (సుమారు రూ. 33.5 లక్షలు). ఈ మోడల్‌ను భారత్‌లోకి దిగుమతి చేసుకోవడం వల్ల రూ.60-66 లక్షల వరకు ఖర్చు అవుతుంది. భారతదేశం 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలపై (EVలు) 100 శాతం దిగుమతి పన్నును విధించింది. అన్నీ సవ్యంగా జరిగితే అన్నీ సవ్యంగా జరిగితే టెస్లా ఏడాదికి 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. అయితే, దీని ధర అనూహ్యంగా రూ. 20 లక్షల నుండి ప్రారంభమవుతుంది. -
టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..?
టెస్లా తన కార్ల తయారీ పరిశ్రమను గుజరాత్లో స్థాపించే అవకాశం ఉన్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. గుజరాత్లో జనవరి 2024లో జరిగే సమ్మిట్‌లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెస్లా చాలా రోజులుగా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి కేంద్రం ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నందున ఈ అంశం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం..గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సనంద్, ధోలేరా, బెచరాజీ ప్రదేశాల్లో ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దేశీయ, అంతర్జాతీయ డిమాండ్లను తీర్చేందుకు టెస్లా గుజరాత్ ప్లాంట్‌ను వినియోగించనున్నట్లు తెలిసింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమక్షంలో గుజరాత్లో టెస్లా ప్లాంట్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని కథనాల ద్వారా తెలుస్తుంది. టెస్లా 2021 నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని కోరుతోంది. పూర్తిగా విదేశాల్లో తయారై భారత్‌కు వచ్చే వాహనాలపై ప్రస్తుతం 100 శాతం వరకు సుంకం వర్తిస్తోంది. విలువతో సంబంధం లేకుండా ఈ సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలని టెస్లా గతంలో కోరింది. దీనికి ససేమిరా అన్న ప్రభుత్వం దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలను కొనుగోలు చేయాలని షరతు విధించింది. దీంతో టెస్లా ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఇదీ చదవండి: ‘ఎక్స్’లో కొత్త చాట్‌బాట్.. ప్రత్యేకతలివే.. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ, ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం గతంలో కాలిఫోర్నియాలోని టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. దీంతో టెస్లా ఎంట్రీకి సంబంధించిన ప్రయత్నాలు ఊపందుకున్నాయి. -
టెస్లా రోబో.. యమ డేంజర్!
అమెరికాలోని టెక్సాస్‌లో ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా గీగా ఫ్యాక్టరీలోని ఓ రోబో కారణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గీగా ఫ్యాక్టరీలో ప్రమాదాలపై అమెరికా ఆక్యూపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అందిన నివేదికలో (ఇంజ్యురీ రిపోర్టు) ద్వారా ఈ విషయం బయటపడింది. రెండేళ్ల క్రితం ఆస్టిన్లోని టెస్లా గీగా ఫ్యాక్టరీలో.. అల్యూమినియం పలకలను కోసి కారు విడిభాగాలను తయారు చేసేందుకు టెస్లా రోబోలను వినియోగిస్తుంటారు. రోబోల సాఫ్ట్‌వేర్‌ను ఇంజినీర్ అప్డేట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందట. సాధారణంగా ఇలాంటి సమయాల్లో రోబోలను ఇన్‌యాక్టివ్ చేస్తారు. అయితే, ఘటన జరిగిన రోజున అప్పటికే ఇంజనీర్ రెండింటిని ఇన్‌యాక్టివ్ చేశాడు. మరో రోబోని చేయడం మరిచిపోయాడు. అలా.. అది అతనిపై దాడికి దిగింది. అప్డేట్ సమయంలో అది ఇంజినీర్‌ను కింద పడదోసి, అదిమిపెట్టి బంధించింది. రోబోకున్న ఉన్న పదునైన భాగాలు బాధితుడి వీపులోకి దిగబడ్డాయి. అతడి చేతికి కూడా త్రీవ గాయమైంది. ఫ్యాక్టరీ ఫ్లోర్ రక్తిసిక్తమైంది. ఈ ప్రమాదం మినహా 2021,2022లో మరే ఇతర ప్రమాదాలు జరగలేదు. అయితే, ఫ్యాక్టరీలో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు ఆ నివేదికలో తేలింది. టెక్సాస్‌లోని ఫ్యాక్టరీలో గతేడాది సగటున 21 మంది సిబ్బందిలో ఒకరు గాయాల పాలయ్యారని ఇంజ్యురీ రిపోర్టులో తేలిసింది. ఆటోమొబైల్ రంగంలో సగటు కంటే ఇది అధికం. కాగా, కంపెనీలో తరచూ భద్రతాపరమైన ఉల్లంఘనలు జరుగుతున్నాయని గతంలో కొందరు టెస్లా మాజీ సిబ్బంది ఆరోపించారు. నిర్మాణం, నిర్వహణ, ఇతర కార్యకలాపాల్లో తగినన్ని జాగ్రత్తలు లేకపోవడంతో ఉద్యోగులకు రిస్క్ ఎక్కువవుతోందని తెలిపారు. -
20 లక్షల టెస్లా కార్లు వెనక్కి.. కారణం ఏంటంటే?
అగ్రరాజ్యం అమెరికాలో టెస్లా కంపెనీ సుమారు 20 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. సంస్థ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏంటి? కారులో రీప్లేస్ చేయాల్సిన భాగాలూ ఏమైనా ఉన్నాయా.. అనే మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా.. కంపెనీకి చెందిన దాదాపు రెండు మిలియన్స్ కార్లలో ఆటోపైలట్ సిస్టమ్‌లోని లోపాన్ని సరి చేయడానికి రీకాల్ చేసింది. ఇందులో 2015 నుంచి మార్కెట్లో విక్రయించిన కార్లు ఉన్నట్లు సమాచారం. ఆటోపైలట్ యాక్టివేట్ సిస్టం అనేది సెల్ఫ్-డ్రైవ్ మోడ్ యాక్టివేట్ అయినప్పుడు రోడ్డు, ట్రాఫిక్ పరిస్థితుల గురించి డ్రైవర్‌ను హెచ్చరించడానికి ఉపయోగపడుతుంది. టెస్లా ఆటోపైలట్ సిస్టమ్ అనేక ప్రమాదాలకు దారితీసినట్లు అమెరికా 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' వెల్లడించింది. ఈ దర్యాప్తు మొదలైన సుమారు రెండు సంవత్సరాల తర్వాత కంపెనీ ఈ సమస్య పరిష్కారానికి రీకాల్ ప్రకటించడం జరిగింది. ఇదీ చదవండి: రూ.350 కోట్లతో 500 అడుగుల గడియారం - రంగంలోకి జెఫ్ బెజోస్.. సెల్ఫ్ డ్రైవ్ మోడ్ యాక్టివేట్ అయినప్పుడు డ్రైవర్‌ను ఉంచడానికి ఆటోపైలట్ చర్యలు సరిపోకపోవచ్చని, తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ పరిశోధనలో తేలింది. కంపెనీ రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో టెస్లా మోడల్ వై, ఎస్, 3 మాత్రమే కాకుండా 2012 నుంచి 2023 మధ్య ఉత్పత్తి అయిన టెస్లా మోడల్ ఎక్స్ కూడా ఉన్నాయి. కంపెనీ నిర్దేశించిన సమయంలో టెస్లా కార్లను కొనుగోలు చేసిన వాహన వినియోగదారులు వారి కారులోని సమస్యను ఇప్పుడు రీకాల్ సమయంలో సులభంగా పరిష్కరించుకోవచ్చు. -
అలాంటివేం లేవు.. టెస్లాకు షాకిచ్చిన భారత ప్రభుత్వం
అమెరికా విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ కార్ల దిగుమతిపై సుంకం రాయితీలు, స్థానిక విలువ జోడింపు మినహాయింపుల ప్రతిపాదనలేవీ పరిగణగించడం లేదని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం నుంచి టెస్లా పలు రాయితీలు, మినహాయింపులు ఆశిస్తున్న విషయం తెలిసిందే. భారీ బ్యాటరీలు, సెమీకండక్టర్లు, అయస్కాంత భాగాలపై స్థానిక విలువ జోడింపు నుంచి టెస్లా, ఇతర బహుళజాతి కార్ కంపెనీలను మినహాయించే ప్రతిపాదన ఏదైనా ఉందా అంటూ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిపై విధించే సుంకంపై రాయితీ కూడా ఏమీ ఉండదని తెలిపారు.. ఇది కూడా చదవండి: AI warning: బ్యాంకులకూ ముప్పు తప్పదా? హెచ్చరిస్తున్న జెరోధా సీఈవో నితిన్ కామత్ భారత ప్రభుత్వం రూ.25,938 కోట్ల బడ్జెట్ వ్యయంతో ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ పరిశ్రమలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించిందని పేర్కొన్న ఆయన ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి విడి భాగాలతో సహా రేపటితరం ఆటోమోటివ్ టెక్నాలజీస్ ఉత్పత్తుల్లో దేశీయ తయారీని పెంచడమే లక్ష్యంగా ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు వివరించారు. -
మస్క్ వారి మరమనిషి మరింత కొత్తగా.. టెస్లా రోబో 2.0!
అప్పుడు యోగా చేసి ఆశ్చర్యపరిచిన టెస్లా హ్యూమనాయిడ్ రోబో ఇప్పుడు డ్యాన్స్ ఇరగదీస్తోంది. గుడ్లు చకాచకా ఉడకబెట్టేస్తోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ సరికొత్తగా ఆవిష్కరించిన హ్యుమనాయిడ్ రోబో డెమో వీడియోను మస్క్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా పంచుకున్నారు. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. తన కొత్త తరం హ్యూమనాయిడ్ రోబో 'ఆప్టిమస్ జెన్ 2' (Optimus Gen-2) ను ఆవిష్కరించింది. ఇది ఏమేమి పనులు చేయగలదో మస్క్ షేర్ చేసిన వీడియోలో చూడవచ్చు. ఇది అచ్చం మనిషిలాగే వివిధ పనులు చేస్తోంది. టెస్లా కొన్ని నెలల క్రితం ఆవిష్కరించిన 'ఆప్టిమస్ జెన్ 1'ను మరింత మెరుగుపరిచి ఈ 'ఆప్టిమస్ జెన్ 2' రూపొందించింది. ఇది మునుపటి రోబో కంటే 10 కేజీలు తేలికైనది. 30 శాతం వేగవంతమైనది. దీనికి మరింత సామర్థాన్ని జోడించారు. నడక వేగం, చేతి కదలికలు, వేళ్లపై స్పర్శ సెన్సింగ్ తదితర అన్ని అంశాల్లోనూ మెరుగుదలను ప్రదర్శిస్తోంది. ఇది కూడా చదవండి: CEOs Secret WhatsApp chat: ‘శామ్ అవుట్’.. వెలుగులోకి సీఈవోల సీక్రెట్ వాట్సాప్ చాట్ ఎలాన్ మస్క్ తాజాగా ‘ఎక్స్’లో షేర్ చేసిన ఈ వీడియోకు "ఆప్టిమస్" అని క్యాప్షన్ పెట్టారు. టెస్లా ఫ్యాక్టరీలో చుట్టూ సైబర్ ట్రక్ల మధ్య షైనీ వైట్ కలర్ బాడీలో ఆప్టిమస్ జెన్2 రోబో మెరిసిపోతూ కనిపిస్తోంది. వీడియో చివర్లో రెండు రోబోలు డ్యాన్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. కాగా 2022లో మొదటిసారిగా హ్యూమనాయిడ్ రోబో కాన్సెప్ట్ గురించి వెల్లడించారు. Optimuspic.twitter.com/nbRohLQ7RH — Elon Musk (@elonmusk) December 13, 2023 -
లోపాన్ని సరిచేసేందుకే దిగ్గజ కంపెనీ కార్ల రీకాల్
డెట్రాయిట్: ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అమెరికాలో విక్రయించిన దాదాపు అన్ని కార్లను రీకాల్ చేసింది. ఇవి సుమారు 20 లక్షల పైచిలుకు ఉంటాయి. 2012 అక్టోబర్ 5 మొదలు ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉత్పత్తి చేసిన వై, ఎస్, 3, ఎక్స్ మోడల్స్ వీటిలో ఉన్నాయి. ఆటోపైలట్ విధానాన్ని ఉపయోగించేటప్పుడు డ్రైవర్ల అప్రమత్తతను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన సిస్టమ్‌లో తలెత్తిన లోపాన్ని సరి చేసేందుకు, సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. డ్రైవర్లకు జారీ చేసే హెచ్చరికలు, అలర్ట్‌లను సాఫ్ట్వేర్ అప్డేట్ మరింతగా పెంచుతుందని, అలాగే ఆటోపైలట్ బేసిక్ వెర్షన్లు పని చేయగలిగే పరిధిని కూడా నియంత్రిస్తుందని పేర్కొంది. ఆటోపైలట్ పాక్షికంగా వినియోగంలో ఉన్నప్పుడు జరిగిన ప్రమాదాలపై జాతీయ రహదారి ట్రాఫిక్ భద్రత ఏజెన్సీ రెండేళ్ల పాటు దర్యాప్తు నిర్వహించిన మీదట టెస్లా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటోపైలట్ మోడ్‌లో ఉన్నప్పుడు డ్రైవర్లను అప్రమత్తంగా ఉంచేందుకు టెస్లా కార్లలో తీసుకున్న జాగ్రత్త చర్యలు తగినంత స్థాయిలో లేవని దర్యాప్తులో ఏజెన్సీ అభిప్రాయపడింది. పేరుకు ఆటోపైలట్ సిస్టమ్ అయినప్పటికీ ఇది డ్రైవర్‌కు కొంత అసిస్టెంట్‌గా మాత్రమే పని చేయగలదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే (తన లేన్‌లో) వాహనాన్ని నడపడం, యాక్సిలరేట్ చేయడం, బ్రేక్‌లు వేయడం మొదలైన పనులు చేస్తుంది. మిగతా అన్ని సందర్భాల్లో డ్రైవరు అప్రమత్తంగా ఉండి అవసరమైతే తనే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు ఈ జాగ్రత్తలను పక్కన పెట్టి ఆటోపైలట్‌ను ఆన్ చేసి వెనక సీట్లో కూర్చోవడం లేదా తాగేసి కూర్చోవడం వంటివి చేస్తుండటమే ప్రమాదాలకు దారి తీస్తున్నాయనే అభిప్రాయం నెలకొంది. -
Make in India: ‘టెస్లా వస్తే రానీ.. కానీ దాన్ని మాత్రం మార్చొద్దు’
దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మేకిన్ ఇండియా పాలసీ నిలకడగా ఉండాలని, ఏ ఒక్క సంస్థ కోసమో దాన్ని మార్చేయరాదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఈవీ కమిటీ చైర్పర్సన్ సులజ్జా ఫిరోదియా మోత్వానీ వ్యాఖ్యానించారు. భారత్‌లో విద్యుత్ కార్ల తయారీ ఇన్వెస్ట్ చేయాలంటే కొన్నాళ్ల పాటు తమ వాహనాల దిగుమతి సుంకాలను తగ్గించాలంటూ అమెరికన్ సంస్థ టెస్లా.. కేంద్రానికి ప్రతిపాదించిన నేపథ్యంలో మోత్వానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఎవరో దేశీయంగా తయారీపై ఇన్వెస్ట్ చేస్తామన్నంత మాత్రాన .. ప్రభుత్వం అమలు చేస్తున్న మేకిన్ ఇండియా విధానాలను మార్చడం సరికాదు. ఒక విధానం ఉందని, దాన్ని పాటించాల్సిందేనని అందరూ గుర్తెరగాలి. టెస్లా సమర్పించిన ప్రతిపాదన గురించి నాకు పూర్తిగా తెలియదు. కానీ పాలసీ విషయంలో గందరగోళం ఉండకూడదని, నిలకడగా ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం‘ అని ఆమె వివరించారు. భారత్ కచ్చితంగా మేకిన్ ఇండియాపై దృష్టి పెట్టినప్పుడే దీర్ఘకాలికంగా పోటీతత్వం పెరగగలదని పేర్కొన్నారు. అలా జరగకపోతే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం విడిభాగాలన్నింటినీ దిగుమతే చేసుకోవాల్సి వస్తుందన్నారు. మరోవైపు, వ్యక్తిగత అవసరాలకు కొనుగోలు చేసే చిన్న ఎలక్ట్రిక్ కార్లకు కూడా ఫేమ్ స్కీమును (విద్యుత్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు సబ్సిడీలిచ్చే పథకం) వర్తింపచేయాలని కేంద్రాన్ని కోరినట్లు మోత్వానీ తెలిపారు. ఇదీ చదవండి: ఆ దేశంలోనే అధిక ద్రవ్యోల్బణం ..! రూ. 20 లక్షల వరకు ఖరీదు చేసే కార్లకు దీన్ని వర్తింపచేసే అంశాన్ని పరిశీలించాలని ఫేమ్ మూడో విడతపై ఫిక్కీ సమరి్పంచిన సిఫార్సుల్లో పేర్కొన్నట్లు ఆమె వివరించారు. ప్రస్తుతం వ్యక్తిగత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ప్రభుత్వ.. వాణిజ్య రవాణా అవసరాలకు ఉపయోగించే త్రిచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లు, ఎలక్ట్రిక బస్సులకు ఫేమ్ స్కీము వర్తిస్తోంది. -
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సైబర్‌ట్రక్ లాంచ్ చేసిన టెస్లా - ధర ఎంతంటే?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టెస్లా 'సైబర్‌ట్రక్' (Cybertruck) డెలివరీలు ఎట్టకేలకు మొదలయ్యాయి. ఈ కొత్త సైబర్‌ట్రక్ వేరియంట్స్, ధరలు, రేంజ్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టెస్లా సైబర్‌ట్రక్ ప్రారంభ ధర 60990 డాలర్లు (రూ. 50.83 లక్షలు), హై వేరియంట్ ధర 99,990 డాలర్లు (రూ. 83.21 లక్షలు). ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ ట్రక్ డెలివరీలు సౌత్ అమెరికాలో మాత్రమే జరిగినట్లు సమాచారం. రానున్న రోజుల్లో మరిన్ని డెలివరీలు జరిగే అవకాశం ఉంది. కొత్త టెస్లా సైబర్‌ట్రక్ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. దీని కోసం ముందస్తుగా 100 డాలర్లు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది డ్యూయెల్, ట్రై మోటర్ అనే రెండు ఆప్షన్లలలో లభిస్తుంది. డ్యూయెల్ మోటార్ 600 బీహెచ్పీ పవర్, ట్రై మోటార్ 845 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదీ చదవండి: చైనా వద్దు భారత్ ముద్దు.. ఇండియాపై పడ్డ అమెరికన్ కంపెనీ చూపు.. డ్యూయెల్ మోటార్ మోటార్ 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, ట్రై మోటార్ మోడల్ 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టెస్లా సైబర్‌ట్రక్ రేంజ్ 547 కిమీ వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ ట్రక్‌ను 2025 నాటికి తక్కువ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది. -
అదిరిపోయే లుక్స్‌తో టెస్లా ‘సైబర్‌ట్రక్’ (ఫోటోలు)
-
‘ఆ కంపెనీకి ప్రత్యేక రాయితీలుండవు..’
దేశంలోకి టెస్లా కార్లు ప్రవేశపెట్టేలా ఎలాన్‌మస్క్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా దేశంలో కార్లు తయారీ కేంద్రాలు నెలకొల్పోందుకు కొన్ని మినహాయింపులు, రాయితీలు అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం ప్రత్యేకంగా టెస్లాకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. విద్యుత్ వాహన రంగంలో ఒక కంపెనీకి నిర్దిష్టంగా ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఇవ్వడం జరగదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఒకవేళ అలాంటివి ఏవైనా ఉంటే దేశంలో ప్రవేశించాలనుకునే వారితో పాటు ఈవీ తయారీదారులందరికీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందని పేర్కొన్నారు. టెస్లా డిమాండ్‌పై వివిధ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరిగాయన్నది వాస్తవమే అయినప్పటికీ.. తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేశారు. టెస్లా 2021 నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని కోరుతోంది. పూర్తిగా విదేశాల్లో తయారై భారత్‌కు వచ్చే వాహనాలపై ప్రస్తుతం 100 శాతం వరకు సుంకం వర్తిస్తోంది. విలువతో సంబంధం లేకుండా ఈ సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలని టెస్లా కోరింది. దీనికి ససేమిరా అన్న ప్రభుత్వం దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలను కొనుగోలు చేయాలని షరతు విధించింది. దీంతో టెస్లా ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ, ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం కాలిఫోర్నియాలోని టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. దీంతో టెస్లా ఎంట్రీకి సంబంధించిన ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో టెస్లాకు కస్టమ్స్ సుంకంలో భారత్ మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు ఒక కంపెనీకి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని దేశీయ ఈవీ తయారీ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
2 బిలియన్లు ఇన్వెస్ట్ చేస్తాం, కానీ..
ముంబై: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించడంపై మరింతగా కసరత్తు చేస్తోంది. భారత్‌లో ప్లాంటు ఏర్పాటుపై 2 బిలియన్ డాలర్ల వరకు (సుమారు రూ. 16,600 కోట్లు) ఇన్వెస్ట్ చేయడానికి తాము సుముఖంగానే ఉన్నామని, అయితే ఈ క్రమంలో తమకు రెండేళ్ల పాటు దిగుమతి సుంకాలపరంగా కొంత మినహాయింపునివ్వాలని కేంద్రాన్ని కోరుతోంది. సుంకాల మినహాయింపులకు, పెట్టుబడి పరిమాణానికి లంకె పెడుతూ కేంద్ర ప్రభుత్వానికి టెస్లా ఓ ప్రతిపాదన సమరి్పంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం దేశీ మార్కెట్లోకి ప్రవేశించాక రెండేళ్ల పాటు తాము దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలను 15 శాతానికే పరిమితం చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. 12,000 వాహనాలకు తక్కువ టారిఫ్ వర్తింపచేస్తే 500 మిలియన డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేస్తామని, అదే 30,000 వాహనాలకు వర్తింపచేస్తే 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను పెంచుతామని టెస్లా పేర్కొన్నట్లు సమాచారం. జనవరి నాటికి నిర్ణయం.. ప్రధాని కార్యాలయం మార్గదర్శకత్వంలో టెస్లా ప్రతిపాదనను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ), భారీ పరిశ్రమల శాఖ, రోడ్డు రవాణా.. జాతీయ రహదారుల శాఖ, ఆర్థిక శాఖ సంయుక్తంగా మదింపు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై వచ్చే ఏడాది జనవరి నాటికి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. టెస్లాకు మరీ ఎక్కువ వెసులుబాటు ఇవ్వకుండా అదే సమయంలో గరిష్టంగా 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను దక్కించుకునేలా మధ్యేమార్గంగా పాటించతగిన వ్యూహంపై కసరత్తు జరుగుతోందని వివరించాయి. ఇదే క్రమంలో తక్కువ టారిఫ్‌లతో టెస్లా దిగుమతి చేసుకోవాలనుకుంటున్న వాహనాల సంఖ్యను కుదించడంతో పాటు పలు విధానాలు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నాయి. తక్కువ స్థాయి టారిఫ్‌లను, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా అమ్ముడయ్యే మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో (ఈవీ) 10%కి పరిమితం చేయడం, రెండో ఏడాది దీన్ని 20% మేర పెంచడం వీటిలో ఉంది. భారత్‌లో ఈ ఆర్థిక సంవత్సరం 1,00,000 ఈవీలు అమ్ముడవుతాయన్న అంచనాల నేపథ్యంలో తక్కువ టారిఫ్‌లను, అందులో 10%కి, అంటే 10,000 వాహనాలకు పరిమితం చేయొ చ్చని తెలుస్తోంది. దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం 50,000 పైచిలుకు ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. మరోవైపు, టెస్లా కూడా భారత్‌లో స్థానికంగా జరిపే కొనుగోళ్లను క్రమంగా పెంచుకునే అవకాశం ఉంది. తొలి రెండేళ్లలో మేడిన్ ఇండియా కార్ల విలువలో 20%, ఆ తర్వాత 4 ఏళ్లలో 40% మేర కొనుగోలు చేసేందుకు కంపెనీ అంగీకరించవచ్చని తెలుస్తోంది. -
Tesla Cars: ఇండియాలో ఇక టెస్లా కార్లు.. ధర ఎంతంటే..?
టెస్లా తన కార్లను ఇండియాలో ప్రవేశపెట్టాలని కొన్ని రోజులుగా ప్రయత్నిస్తోంది. తాజాగా భారత ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు సఫలమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఒకవేళ టెస్లాకు అన్ని పరిస్థితులు అనుకూలించి ఇండియాలో ప్రవేశిస్తే మొదటి మోడల్ కారు ధర 25వేల యూరోలు(రూ.22 లక్షలు) ఉండనుందని సమాచారం. ఈ మోడల్కారును మొదట జర్మనీలో తర్వాత భారతదేశంలో లాంచ్ చేయనున్నారని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ కథనాల ప్రకారం.. భారతదేశంలో టెస్లా మోడల్ వై క్రాస్ఓవర్ పేరుతో కారు లాంచ్ చేయబోతుంది. మోడల్ వై అనేది మోడల్ 3 సెడాన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడుతుంది. ఈ క్రాస్ఓవర్ ఎస్యూవీను తయారుచేసేందుకు 2020 నుంచి కంపెనీ పనిచేస్తోంది. మూడు వరుసల్లో ఏడుగురు ప్రయాణించేలా దీన్ని రూపొందించినట్లు తెలిసింది. టెస్లా చాలారోజుల నుంచి భారత ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. దాని ప్రకారం.. టెస్లా వాహనాలను వచ్చే ఏడాది నుంచి దేశంలోకి అనుమతిస్తారు. కంపెనీ రానున్న రెండేళ్లలో భారత్‌లో తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనుందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. వచ్చే ఏడాది జనవరిలో గుజరాత్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పింది. టెస్లా భారతదేశంలో రూ.16 వేల కోట్లతో కొత్త ప్లాంట్ ప్రారంభించాలని యోచిస్తోంది. దేశీయ కంపెనీల నుంచి రూ.1.24 లక్షల కోట్ల విలువైన ఆటో విడిభాగాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్లా దేశంలో బ్యాటరీలు కూడా తయారు చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పక్షి కన్ను చూస్తున్న అర్జునుడి పాత్రలో ఆర్బీఐ: దాస్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గతవారం తన అమెరికా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్‌లోని టెస్లా ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడ ఎలాన్‌మస్క్‌ను కలవాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా మంత్రిని కలవలేకపోయానని క్షమాపణలు చెబుతూ మస్క్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. త్వరలో మంత్రిని కలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. -
చివరి దశకు చర్చలు, భారత్‌లో టెస్లా కార్లు తిరిగేది ఎప్పుడంటే?
భారత్‌లో ‘టెస్లా’ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ కేంద్ర ప్రభుత్వంతో చేసుకోనున్న ఒప్పంద ప్రయత్నాలు దాదాపు తుది అంకానికి చేరాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. భారత్-టెస్లాల మధ్య ఒప్పందం పూర్తయితే మరో రెండేళ్లలో దేశీయంగా టెస్లా ఫ్యాక్టరీ అందుబాటులోకి రానుంది. దీంతో టెస్లా కార్లు రయ్.. రయ్ మంటూ చక్కెర్లు కొట్టనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 12 వరకు గుజరాత్ రాష్ట్రంలో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు పాల్గొనే ఈ ఈవెంట్లో భారత్ - టెస్లాల మధ్య జరగనున్న ఒప్పందంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమ్మిట్లోనే ఎందుకు? టెస్లా కార్ల మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌పై ప్రకటన వస్తుందనే అంశంపై.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కేంద్రంగా ఇన్వెస్టర్ల సమావేశం, ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఎగుమతులకు అనువైన ప్రాంతాల్ని టెస్లా యాజమాన్యం గుర్తించిందని కాబట్టే ప్రకటన పరిశీలనలో ఉన్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. టెస్లా కనీస పెట్టుబడులు దేశీయంగా టెస్లా ప్లాంట్‌ను నిర్మించేందుకు ఎలాన్ మస్క్ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేలా హామీ ఇచ్చిన పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా టెస్లా ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కనీస పెట్టుబడి కింద మస్క్ 2 బిలియన్లు ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. కారు తయారీ కోసం కావాల్సిన ఇతర కారు పార్ట్స్‌ని దేశీయ సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు 15 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నారు. ఖర్చు తగ్గించుకునేలా మనదేశంలో కొన్ని బ్యాటరీలను తయారు చేయాలనే యోచనలో ఉన్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది పైన తెలిపినట్లుగా..దేశీయంగా టెస్లా- భారత్‌ల మధ్య ఒప్పందాలు ఎలా కొనసాగుతున్నాయనే అంశంపై అటు కేంద్రంగాని ఇటు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ నుంచి ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
టాప్‌గేర్‌లో టెస్లా దిగుమతులు..!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. భారత్ నుంచి ఆటో విడిభాగాల దిగుమతిని రెట్టింపు చేసుకునే యోచనలో ఉంది. నాలుగు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్ (కాలిఫోరి్నయా)లోని కంపెనీ ప్లాంటును సందర్శించిన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ విషయం తెలిపారు. అనారోగ్య కారణాల రీత్యా గోయల్‌ను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కలవలేకపోయారు. ‘టెస్లా అధునాతన ప్లాంటును సందర్శించాను. మొబిలిటీ ముఖచిత్రాన్ని మారుస్తున్న టెస్లా వృద్ధి ప్రస్థానంలో పలువురు భారతీయ ఇంజ నీర్లు, ఫైనాన్స్ నిపుణులు సీనియర్ల స్థాయిలో పాలుపంచుకుంటూ ఉండటం సంతోషం కలిగించింది. అలాగే టెస్లా సరఫరా వ్యవస్థలో భారతీయ ఆటో విడిభాగాల సరఫరా సంస్థలకు ప్రాధాన్యం పెరుగుతుండటం గర్వకారణం. భారత్ నుంచి టెస్లా దిగుమతులను రెట్టింపు చేసుకునే దిశగా ముందుకెడుతోంది. మస్క్ వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నాను‘ అని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్‌లో గోయల్ ట్వీట్ చేశారు. ‘మీరు టెస్లా ప్లాంటును సందర్శించడం సంతోషం కలిగించింది. కాలిఫోరి్నయాకు రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. భవిష్యత్తులో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను‘ అని దానికి ప్రతిస్పందనగా మస్క్ ట్వీట్ చేశారు. టెస్లా 2022లో భారత్ నుంచి 1 బిలియన్ డాలర్ల విలువ చేసే విడిభాగాలను దిగుమతి చేసుకోగా, ఈసారి 1.9 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు గోయల్ ఇటీవలే తెలిపారు. పరిశీలనలో మినహాయింపులు.. టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా దిగుమతులతో ప్రారంభించి ఇక్కడ డిమాండ్‌ను బట్టి ప్లాంటును నెలకొల్పే యోచనలో ఉన్నట్లు రెండేళ్ల క్రితం మస్క్ చెప్పారు. అయితే, భారీ స్థాయి దిగుమతి సుంకాల విషయంలో భారత్ తమకు కొంత మినహాయింపు కల్పించాలని కోరారు. కానీ, టెస్లా కూడా ఇతర సంస్థల బాటలోనే రావాల్సి ఉంటుందని కేంద్రం అప్పట్లో స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్‌లో అమెరికాలో ప్రధాని మోదీతో మస్క్ సమావేశం అనంతరం.. దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలను ఆకర్షించేందుకు తగిన విధానాన్ని రూపొందిస్తామంటూ కేంద్రం వెల్లడించడం గమనార్హం. దీనితో టెస్లా ఎంట్రీకి మార్గం సుగమం చేసేలా కంపెనీకి వెసులుబాట్లునిచ్చే అవకాశాలు ఉన్నాయంటూ అంచనాలు నెలకొన్నాయి. -
కొన్న ఏడాదిలో అమ్మేస్తే.. మస్క్ రూల్స్ మామూలుగా లేదుగా!!
టెస్లా తన మొదటి సైబర్‌ట్రక్‌ను ఈ నెలలో విడుదల చేయడానికి సర్వత్రా సిద్ధమైపోయింది. ఎలాన్ మస్క్ ఈ కొత్త కారుని విడుదల చేయడానికి ముందే కొనుగోలుదారులకు కొన్ని షరతులు పెట్టాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టెస్లా సైబర్‌ట్రక్ (Tesla Cybertrack) త్వరలో విడుదలకానుంది. కంపెనీ నియమాల ప్రకారం ఈ కారు కొన్ని కస్టమర్ కొన్న మొదటి సంవత్సరం లోపల విక్రయించినట్లతే.. 50000 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ చెల్లించాలి ఉంటుందని వెల్లడించారు. ఈ రూల్ కేవలం సైబర్‌ట్రక్ కొనుగోలుదారులకు మాత్రమే వర్తిస్తుంది. కంపెనీ నియమాలను ఎవరైనా అతిక్రమిస్తే.. భవిష్యత్తులో వారికి టెస్లా కంపెనీ తమ వాహనాలను విక్రయించాడని కూడా స్పష్టం చేసింది. కాబట్టి సైబర్‌ట్రక్ కొనుగోలు చేసిన కస్టమర్ ఒక సంవత్సరం వరకు విక్రయించడానికి అవకాశం లేదని స్పష్టమైంది. ఇదీ చదవండి: టీసీఎస్ కంపెనీకి బాంబ్ బెదిరింపు కాల్.. చేసిందెవరో తెలిసి అవాక్కయిన పోలీసులు! 2019లో మొదటి సారి కనిపించిన సైబర్‌ట్రక్ దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత ఎట్టకేలకు మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. నాలుగు సంవత్సరంలో కంపెనీ విడుదల చేసిన మొదటి వాహనం కూడా ఇదే అని పలువురు భావిస్తున్నారు. దీని ప్రారంభ ధర 39900 డాలర్లు ఉండవచ్చు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 33 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది. -
మంత్రికి క్షమాపణలు చెప్పిన మస్క్.. కారణం ఇదేనా..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌మస్క్‌కు చెందిన దిగ్గజ సంస్థ టెస్లా ప్లాంట్‌ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం సందర్శించారు. కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌లోని ఈ కేంద్రంలో విద్యుత్ కార్ల తయారీని మంత్రి పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అయితే మంత్రి వెంట టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కనిపించలేదు. దీనిపై ఎక్స్ వేదికగా మంత్రికి మస్క్ క్షమాపణలు చెప్పారు. మంత్రి తన సందర్శనను ఉద్దేశించి ఎక్స్ ఖాతాలో ఇలా పోస్ట్ చేశారు. ‘కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌లో ఉన్న టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించాను. ఇక్కడ సీనియర్ హోదాలో పనిచేస్తోన్న భారత ఇంజినీర్లు, ఆర్థిక నిపుణులను కలవడం ఆనందంగా ఉంది. టెస్లా ప్రయాణంలో వారు అందిస్తోన్న సహకారం గర్వకారణం. టెస్లా తయారీలో ఇండియా నుంచి దిగుమతులు పెంచడం సంతోషంగా ఉంది. ఈ పర్యటనలో మస్క్‌ను మిస్ అవుతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలి’ అని మంత్రి అన్నారు. మంత్రి ట్వీట్‌పై మస్క్ స్పందించారు. ‘మీరు టెస్లాను సందర్శిచడం మాకు గొప్ప గౌరవం. ఈ రోజు కాలిఫోర్నియాకు రాలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నాను. త్వరలో మీతో జరగబోయే భేటీకి ఎదురుచూస్తున్నాను’ అని టెక్ దిగ్గజం పోస్ట్ చేశారు. టెస్లా విద్యుత్ కార్లు త్వరలోనే భారత్‌లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో జరిగిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎలాన్ మస్క్ సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. ఈవీ వాహనాల తయారీకోసం దేశంలోని కొన్ని నిబంధనలు సడలించనున్నట్లు సమాచారం. తాజా పర్యటనలో గోయల్-మస్క్ భేటీ జరుగుతుందని, భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు, దేశీయంగా పరికరాల కొనుగోలు, ఛార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటు, సుంకాల గురించి ప్రధానంగా చర్చిస్తారని వార్తలు వచ్చాయి. అయితే మస్క్ అనారోగ్యంతో ఈ భేటీ సాధ్యం కాలేదు. Visited @Tesla’s state of the art manufacturing facility at Fremont, California. Extremely delighted to see talented Indian engineers & finance professionals working at Senior positions and contributing to Tesla’s remarkable journey to transform mobility. Also proud to see… pic.twitter.com/FQx1dKiDlf — Piyush Goyal (@PiyushGoyal) November 14, 2023 -
ఐటీ జాబ్ పోయి ఉబెర్ డ్రైవర్‌గా మారిన ఇండియన్ - వీడియో వైరల్
కరోనా మహమ్మారి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను ముప్పుతిప్పలు పెట్టి ఆర్థికమాంద్యంలోకి నెట్టివేసింది. ఈ ప్రభావం చాలామంది జీవితాల మీద పడింది. ఇప్పటికి కూడా కొన్నిదేశాల్లోని దిగ్గజ కంపెనీలు సైతం ఆర్థిక మాంద్యం తట్టుకోలేక తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఒకవైపు చదువు కోసం విదేశాలకు వెళ్లిన చాలా మంది భారతీయులు సమస్యలను ఎదుర్కొంటుంటే.. మరికొందరు ఉద్యోగాలు కోల్పోయి అగచాట్లు పడుతున్నారు. కెనడాలో ఉంటున్న ఒక భారతీయుడు ఉద్యోగం కోల్పోయి ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత, యూట్యూబ్ ఛానెల్ కలిగి ఉన్న టెకీ తన టెస్లాను డ్రైవ్ చేస్తూ నిత్యావసర వస్తువులను డెలివరీ చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనీష్ మావెలిక్కర తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోలో.. తాను ఐటీ ఉద్యోగం కోల్పోయినట్లు, కొత్త ఉద్యోగం కోసం వెతుక్కున్నట్లు.. ఇందులో భాగంగానే కొన్ని ఇంటర్వ్యూలకు హాజరైనట్లు, దానికి సంబంధించిన రిజల్ట్ ఇంకా రాలేదని వెల్లడించాడు. ఇదీ చదవండి: రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే! ఉద్యోగం వచ్చే వరకు పార్ట్ టైమ్ ఉద్యోగంగా కిరాణా సామాగ్రిని ఇంటింటికి డెలివరీ చేస్తున్నట్లు కూడా వీడియోలో తెలిపాడు. ప్రతి రోజూ తన పని తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని, తన టెస్లా కారుని ఉబెర్‌తో నడుపుతున్నట్లు స్పష్టం చేసాడు. ఒకవేళా ఉద్యోగం లభించకపోతే తన టెస్లా కారుని రోజంతా డ్రైవ్ చేయాల్సి ఉంటుందని తెలియజేస్తూ.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ వీడియో ఓ చిన్న ఉదాహరణగా వివరించాడు. -
భారత్‌లో టెస్లా.. ఎలాన్ మస్క్‌తో పియూష్ గోయల్ భేటీ!, ఎప్పుడంటే?
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా త్వరలో భారత్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో నవంబర్ 13 నుంచి 17 వరకు ఇండో-పసిపిక్ ఎకనామిక్స్ ఫ్రేమ్ వర్క్ (ఐపీఈఎఫ్) సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో పాల్గొనేందుకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ తరుణంలో పియూష్ గోయల్.. ఎలాన్ మస్క్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి భేటీలో భారత్‌లో టెస్లా పెట్టుబడులు, కార్ల తయారీ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రస్తుతం చైనా - అమెరికా దేశాల మధ్య వైరం తారా స్థాయికి చేరింది. దీంతో డ్రాగన్ దేశంలో వ్యాపారం చేయడం ఏమాత్రం మంచిది కాదేమోనన్న అభిప్రాయానికి వచ్చిన పలు అంతర్జాతీయ సంస్థలు సకల సౌకర్యాలు కలిగిన భారత్ అయితేనే తమకు అన్నీ విధాల ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాయి. మస్క్ సైతం భారత్‌లో అడుగు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా టెస్లా కార్ల తయారీ, అమ్మకాలు భారత్‌లో జరుపుకునేలా మస్క్‌ను పియూష్ గోయల్ భారత్‌కు ఆహ్వానించనున్నారు. భారత్‌లో టెస్లా ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఉన్న మోదీతో మస్క్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం వీలైనంత త్వరగా భారత్‌లో టెస్లా కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే యోచనలో ఉన్నట్లు మస్క్ తెలిపారు. సాధ్యమైనంత త్వరలో భారత్‌లో టెస్లా ప్రవేశం ఉంటుందని తాను బలంగా నమ్ముతున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ నుంచి మంచి సహకారం లభిస్తోందన్నారు. టెస్లా కార్లతో పాటు శాటిలైట్ ఇంటర్నెట్ స్టార్‌లింక్ సేవల్ని దేశంలోని మారుమూల ప్రాంతాలకు తీసుకొస్తామని ఆ సమయంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికాతో భారత్ ఆర్థిక సంబంధాలకు ఊతమిచ్చేందుకు, పెట్టుబడులను పెంచేందుకు బహుళ జాతి కంపెనీల సీఈవోలు, స్టార్టప్ కమ్యూనిటీ, ఇతర వ్యాపార వేత్తలతో పియూష్ గోయల్ భేటీ కానుండగా.. వారిలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఉన్నారు. -
జర్మనీ నుంచి టెస్లా దిగుమతులు!
న్యూఢిల్లీ: జర్మనీ ఫ్యాక్టరీలో తయారైన కార్లను దిగుమతి చేసుకోవడం ద్వారా భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భావిస్తోంది. చైనాలోనూ ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ ఆ దేశంతో నెలకొన్న ఉద్రిక్తతలరీత్యా అక్కణ్నుంచి దిగుమతులపై భారత్ అంత సుముఖంగా లేకపోవడంతో టెస్లా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి కార్లను దిగుమతి చేసుకోవద్దంటూ టెస్లా టాప్ మేనేజ్మెంట్కు కేంద్ర ప్రభుత్వ శాఖలు సూచించినట్లు వివరించాయి. దీంతో భారత్‌తో సత్సంబంధాలున్న జర్మనీ నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. జర్మనీలోని బ్రాండెన్‌బర్గ్‌లో టెస్లాకు గిగాఫ్యాక్టరీ ఉంది. భారత మార్కెట్లో 25,000 యూరోల (సుమారు రూ. 20 లక్షలు) కారును ప్రవేశపెట్టే యోచనలో కంపెనీ ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, జర్మనీ నుంచి దిగుమతి చేసే విద్యుత్ వాహనాలపై కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపులు ఇవ్వాలని కూడా టెస్లా కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఒకవేళ వాటిపై సుంకాలను 20–30 శాతం మేర తగ్గిస్తే టెస్లా మాత్రమే కాకుండా జర్మనీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి పలు లగ్జరీ కార్ల తయారీ సంస్థలకు కూడా ప్రయోజనం లభించవచ్చని పేర్కొన్నాయి. -
టెస్లాకు త్వరలో లైన్ క్లియర్.. భారత్‌లోకి ప్రవేశం!
ఎలాన్‌మస్క్‌కు చెందిన టెస్లా కార్ల గురించి వినడం..సామాజిక మాధ్యమాల్లో చూడడం తప్పా నేరుగా భారత్‌లో ఉపయోగించింది లేదు. ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల టెస్లా కార్లకు అనుమతులు ఇవ్వలేదు. అయితే ఈసారి 2024 జనవరి నాటికి అవసరమైన అన్ని అనుమతులను క్రమబద్ధీకరించాలని భారత ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించిన సమావేశంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. టెస్లాతో సహా ఇతర పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులిచ్చేలా చర్చలు జరిగాయని ఒక ఉన్నత అధికారి చెప్పినట్లు తెలిసింది. జూన్‌లో జరిగిన అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమావేశమయ్యారు. అప్పటినుంచి కామర్స్ అండ్ ఇండస్ట్రీ, భారీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖలు టెస్లాను భారత్‌కు తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు భారతదేశంలో కార్లు, బ్యాటరీల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. 2024 జనవరిలో అనుమతులు లభిస్తే టెస్లా కార్లను వీలైనంత త్వరలో భారత్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు చర్చల్లో పురోగతి లేకపోవడంతో టెస్లా గతంలో భారత్‌లో ప్రవేశించలేదు. దాదాపు రూ.33లక్షల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలపై 60% వరకే దిగుమతి సుంకం విధించాలని ప్రభుత్వాన్ని కోరింది. పూర్తిగా అసెంబుల్డ్ ఎలక్ట్రిక్ కార్లపై 40% ట్యాక్స్ ఉండేలా అభ్యర్థించింది. టెస్లా వాహనాలను ఎలక్ట్రిక్ కార్లుగా కాకుండా లగ్జరీ కార్లుగా గుర్తించాలని తెలిపింది. భారత్‌లో స్థానిక తయారీ యూనిట్‌ను స్థాపించడానికి ముందే తమ కార్ల విక్రయాన్ని ప్రారంభించాలని భావించింది. అయితే దిగుమతి సుంకం రాయితీల కోసం స్థానిక తయారీకి కట్టుబడి ఉండాలని ప్రభుత్వం చెప్పింది. కస్టమ్స్ డ్యూటీ రాయితీల స్థానంలో తయారీదారులకు ప్రత్యక్ష రాయితీలను అందిస్తూ, ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని టెస్లాకు వివరించింది. ఇదీ చదవండి: త్వరలో మొబైల్ యూజర్లకు ప్రత్యేక కస్టమర్ ఐడీ భారత కస్టమ్స్ డ్యూటీ నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ కార్లు, హైడ్రోకార్బన్ ఆధారిత వాహనాలను సమానంగా పరిగణిస్తారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి భారీగా సుంకాలను విధిస్తున్నారు. అయితే ఈవీ తయారు చేసే కంపెనీలను ప్రోత్సహించేలా పర్యావరణ అనుకూల వాహనాలపై తక్కువ పన్ను విధించేలా కొత్త దిగుమతి పాలసీని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ వెసులుబాటు టెస్లాకు మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేసే ఏ కంపెనీకైనా వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు. -
భారత్‌లో మరో ఈవీ దిగ్గజం.. కార్ల తయారీ దిశగా అడుగులు!
ఆసియా దేశమైన వియత్నామీస్ ఆటోమొబైల్ దిగ్గజం విన్ఫస్ట్ ఆటో భారత్‌లో ఈవీ కార్లను తయారు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తమిళనాడులో రెండు ప్రాంతాలను ఎంపిక చేసుకుంది. ఈ రెండు ప్రాంతాల్లో కార్లను మ్యానిఫ్యాక్చరింగ్ చేసేలా యూనిట్లను నెలకొల్పితే ఎలా ఉంటుందనే అంశంపై చర్చిస్తుంది. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లకు గిరాకీ విపరీతంగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ దేశాల దిగ్గ ఆటోమొబైల్ కంపెనీలు ఇక్కడే వాహనాల్ని తయారు చేసి అమ్మాలని భావిస్తున్నాయి. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం.. విన్ఫస్ట్కి చెన్నైకి ఉత్తరాన ఉన్న మనలూర్ ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాలలో ఒకటైన టుటికోరిన్లో ల్యాండ్‌ను చూపించారు రాష్ట్ర అధికారులు. ఆఫీస్ నిర్వహణ కోసం ప్లాట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో భారతదేశంలో తయారీ కేంద్రాన్ని స్థాపించాలనే ఉద్దేశాన్ని ధృవీకరించిన కంపెనీ, 2026 నాటికి వాహనాలను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించే లక్ష్యంతో సుమారు 200 మిలియన్లను పెట్టుబడి పెట్టనుంది. విన్‌ఫాస్ట్ తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తమిళనాడు తర్వాత గుజరాత్‌ను ఎంపిక చేసుకుందని అక్కడ కూడా స్థల అన్వేషణలో ఉందని సమాచారం. ప్రపంచంలోని అత్యంత విలువైన కార్ల తయారీ సంస్థగా పేరున్న ఈ కంపెనీకి భారత్‌లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించడం మరింత ఉపయోగకరంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
టెస్లాకు క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. నితిన్ గడ్కరీ ఏమన్నారంటే?
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' (Tesla) గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ప్రవేశించడానికి సరైన సమయం కోసం వేచి చూస్తోంది. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇటీవలే కొన్ని ఆంక్షలతో సుముఖత చూపించింది. తాజాగా కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కు ఓ స్పష్టమైన సందేశం అందించారు. భారతదేశం టెస్లాకు స్వాగతం పలుకుతుంది, కానీ కంపెనీ స్థానికంగా కార్లను తయారు చేస్తే ఇతర సంస్థలకు లభించే అన్ని రాయితీలు లభిస్తాయి. చైనాలో తయారు చేసి భారతదేశంలో విక్రయించాలనుకుంటే రాయితీలు లభించవని గడ్కరీ స్పష్టం చేశారు. గతంలో సీబీయూ మార్గం ద్వారా దిగుమతైన కార్లపై ప్రభుత్వం దిగుమతి సుంకాను తగ్గించింది. ప్రస్తుతం స్థానిక ఉత్పత్తులను పెంచడానికి, విదేశీ దిగుమతులను తగ్గించడానికి కేంద్రం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభించడానికి కట్టుబడి ఉన్న సంస్థలకు కొన్ని ప్రత్యేక రాయితీలను కల్పిస్తోంది. ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొనేసింది! కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారభించాలనుకుంటే మొదటి రెండు సంవత్సరాల్లో దాదాపు 20 శాతం భాగాలను స్థానికంగా సోర్సింగ్ చేయాలి, ఆ తరువాత ఇది 40 శాతానికి పెరిగే అవకాశం ఉంది. సంస్థలకు బ్యాంకు గ్యారెంటీలు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న విధంగా అన్నీ జరిగితే టెస్లా, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి కంపెనీలకు గణనీయమైన ప్రయోజనాన్ని పొందుతాయి. ఇదీ చదవండి: కొత్త హంగులతో మెరిసిపోతున్న 'ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్' - ఫోటోలు చూశారా? కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం భారతదేశంలో వాహన తయారీని పెంచడమే. ప్రస్తుతం టెస్లా కంపెనీ భారతదేశంలో కార్యకలాపాలను ప్రారంభించడానికి తమ ప్రణాళికలకు సంబంధించి, ప్రభుత్వంతో సానుకూల చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగానే సంస్థ భారతదేశంలో సంవత్సరానికి 5,00,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఒక కర్మాగారాన్ని స్థాపించాలనే ఉద్దేశాన్ని వెల్లడించారు. టెస్లా ఫ్యాక్టరీ, ఉత్పత్తికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడవుతాయని భావిస్తున్నాము. -
టెస్లా కారు రిపేర్ బిల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రపంచ ధనవంతుడైన ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా కార్లను కొనుగోలు చేసేందుకు వాహనదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తుంటారు. అయితే ఇవి ఎలాంటి రిపేర్ రానంతవరకు సాఫీగానే ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏదైనా రిపేర్ వస్తే మాత్రం బిల్లు తడిసిమోపెడవుతుందనే వాదనలు ఉన్నాయి. ఇటీవల టెస్లా కారు ఓనర్ తన కారును రిపేర్ చేయించడానికి వెళ్తే ఏకంగా రూ.17.46లక్షలు బిల్లు వేసినట్లు హిండెన్‌బర్గ్ నివేదిక తెలిపింది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. టెస్లాకు సంబంధించిన 'స్కాటిష్ మోడల్ Y ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్' కారు కొనుగోలు చేసిన ఓనర్‌కు కంపెనీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వాహనాన్ని మరమ్మతు కోసం ఇవ్వగా.. టెస్లా వేసిన బిల్లు చూసి ఖంగుతిన్నాడు. ఏకంగా రూ.17.46 లక్షల బిల్లు వేశారు. నివేదిక తెలిపిన వివరాల ప్రకారం..భారీగా వర్షం కురుస్తున్న సమయంలో యజమాని కారు నడిపాడు. వాహనం తీసుకున్న కొత్తలో కొంతకాలం పాటు బాగానే నడిచినా వర్షంలో తడిసిన తర్వాత స్టార్ట్ అవలేదు. ఈవీని ట్రక్ ద్వారా వర్క్‌షాప్‌కు తరలించడానికి ఓనర్ ఐదు గంటలు వేచి చూడాల్సి వచ్చింది. టెస్లా కస్టమర్ సర్వీస్ కూడా అంతగా సహాయపడలేదని యజమాని పేర్కొన్నాడు. టెస్లా వర్క్‌షాప్ యాజమాన్యం ఈ విషయంపై స్పందించింది. బ్యాటరీలోకి నీరు ప్రవేశించడం వల్ల ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ పాడైందని తెలిపింది. ఇది ప్రొపల్షన్ సిస్టమ్ పై ప్రభావం చూపినట్లు వివరించింది. టెస్లా అందించే వారంటీ పరిధిలోకి ఇది రాలేదని స్పష్టం చేసింది. అయితే యజమానికి రూ.17.46లక్షల రిపేర్ బిల్లు రావడంపై వర్క్‌షాప్ మేనేజర్ని నిలదీసినట్లు నివేదిక వెల్లడించింది. భారీగా బిల్లులు వసూలు చేస్తూ టెస్లా గతంలోనూ వార్తల్లో నిలిచింది. కానీ ఈసారి బిల్ మరింత షాకింగ్ గా ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. కస్టమర్ సపోర్ట్ వల్ల అంతగా ఉపయోగం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. -
Tesla: ఒక్కరోజులోనే రూ.1.30లక్షల కోట్ల సంపద ఆవిరి
ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్(ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ సంపద ఒక్కరోజులోనే భారీగా రూ.1.30లక్షల కోట్లు ఆవిరైంది. 2023-24 రెండో త్రైమాసికం జులై-సెప్టెంబర్‌కు సంబంధించి టెస్లా సంస్థ బలహీన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. దీంతో అక్టోబర్ 19న కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. దీనితో ఈ సంస్థలో 13 శాతం వాటాలున్న ఎలాన్ మస్క్ కూడా భారీగా నష్టపోవాల్సి వచ్చింది. టెస్లా షేర్ విలువ అక్టోబరు 19న ఏకంగా 9 శాతం నష్టపోయింది. దాంతో మస్క్ సంపద కూడా అదే రీతిలో 16.1 బిలియన్ డాలర్లు(రూ.1.30 లక్షల కోట్లు) నష్టం వాటిల్లింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ఎలాన్ మస్క్ ఇప్పటికి 210 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మస్క్ సంపద దాదాపు 70 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రత్యర్థి సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకొని రాణించేందుకు టెస్లా గత కొన్ని నెలలుగా కార్ల ధరలను భారీగా తగ్గిస్తూ వచ్చింది. దీంతో జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభంలో ఏకంగా 44 శాతం మేర క్షీణత నమోదైంది. ఈ నేపథ్యంలోనే టెస్లా షేర్లు భారీగా పతనానికి గురయ్యాయి. వడ్డీరేట్ల పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని మస్క్ వ్యాఖ్యానించారు. ఈ కారణంతోనే విక్రయాలు నెమ్మదించాయని పేర్కొన్నారు. అయితే సంస్థకు ఎలాంటి సవాళ్లు ఎదురైనా సరే.. తమ కస్టమర్లకు అందించాల్సిన 18లక్షల కార్లను నిర్ణీత గడువులోగా డెలివరీ చేస్తామని టెస్లా ప్రకటించింది. -
హమాస్ ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం..‘టెస్లా నా ప్రాణం కాపాడింది’
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో పాలస్తీనా గజగజా వణుకుతోంది. గాజా నగరం శవాల దిబ్బగా మారిపోతుంది. నగరంలోని మార్చురీలు నిడిపోయాయని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. హమాస్‌ను తుద ముట్టించే వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. అదే సమయంలో హమాస్ ఉగ్రవాదులు దక్షిణ ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ సమీపంలో దాడులకు తెగబడ్డారు. దీంతో సామాన్యులు తమ ప్రాణాల్ని కాపాడుకోడవం కోసం ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ దేవుడిపై భారం వేస్తున్నారు. అంతటి భయానక వాతావరణంలో హమాస్ టెర్రరిస్ట్‌ల బీభత్సం సృష్టిస్తూ కురించిన బుల్లెట్ల వర్షం టెస్లా ఎలక్ట్రిక్ కార్ తన ప్రాణాలు కాపాడిందంటూ ఆ కారు ఓనర్ గద్గద స్వరంతో చెప్పాడు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ మీడియా సంస్థ వాల్లా (walla) ఓ కథనాన్ని ప్రచురించింది. మెషిన్ గన్స్‌తో బీభత్సం హమాస్ దాడి ప్రారంభమైన సమయంలో కారు యజమాని టెస్లా మోడల్ 3 కారులో తప్పించుకునేందుకు ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. అయితే, ఊహించని విధంగా అతనికి హామాస్ దాడి ప్రారంభమైన సమయంలో మరో ప్రాంతానికి వెళుతుండగా కలాష్నికోవ్స్ రైఫిల్స్ ,భారీ మెషిన్ గన్స్‌తో టెర్రరిస్టులు వస్తున్న కారు ఎదురు పడింది. ఎలక్ట్రిక్ కారని వాళ్లకి తెలియదు అంతే టెర్రరిస్టుల వాహనం తనవైపుకు దూసుకు వచ్చింది. రెప్పపాటులో తనది ఎలక్ట్రిక్ కారు (టెస్లా మోడల్ 3) అని తెలియకపోవడంతో ఈవీలో లేని ఇంజన్ ట్యాంక్‌ను లక్ష్యంగా చేసుకుని కారుపై కాల్పులు జరిపారు. ఇలా చేస్తే కారు ఆగిపోవడం లేకపోతే ఇంధన ట్యాంక్ పేలిపోతుందని భావించారు. అయితే ఈవీ కార్ కావడంతో ఈ ముప్పు నుంచి తప్పించుకున్నాడు. వాళ్ల బుల్లెట్లు నన్ను ఏం చేయలేకపోయాయ్ అతని టైర్లను కాల్చినప్పటికి తన కారు యాక్సిలరేటర్‌ను రేజ్ చేసి డ్యూయల్-డ్రైవ్ ఫీచర్ ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకునేందుకు సాయం చేసిందని చెప్పాడు. పైగా, ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు బ్యాటరీ వెడెక్కలేదు. టెస్లా కారులో ఉన్న తనని టెర్రరిస్ట్‌లు కురిపించిన బుల్లెట్లు సైతం తనని ఏం చేయలేకపోయానని అన్నారు. అతని భార్య టెస్లా యాప్ ద్వారా తన కారు లొకేషన్, ఎమర్జెన్సీ రూమ్‌ల గురించి సమాచారం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్నట్లు చెప్పాడు. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇజ్రాయెల్‌లోని సూపర్‌చార్జర్ల గురించి కీలక ప్రకటన చేశారు. దేశంలోని అన్ని టెస్లా సూపర్ఛార్జర్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు. I think he deserves an highland. looking for the dashcam videos as well. pic.twitter.com/DJhrGwBubg — Michael Lugassy (@mluggy) October 12, 2023 -
మస్క్ సైబర్ ట్రక్ దూకుడు: యాపిల్ ఎనలిస్ట్ ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు
Cybertruck deliveries ట్విటర్ (ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎలక్ట్రానిక్ వాహనాల సంస్థ టెస్లాకు సంబంధించి తాజా విశ్లేషణ ఒకటి వైరల్‌గా మారింది. టెస్లాకు చెందిన ప్రతిష్టాత్మక ఆవిష్కరణ సైబర్‌ట్రక్ 2024లో దాదాపు 120,000 డెలివరీలన చేయనుంది. అంతేకాదు 2025 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని టాప్ ఆపిల్ విశ్లేషకుడు పేర్కొన్నారు. మింగ్-చి కువో టెక్ దిగ్గజం ఆపిల్‌ను కవర్ చేసే టాప్ ఎనలిస్టు ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. బహుశా 2030 నాటికి ఆల్ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కు సైబర్‌ట్రక్ మార్కెట్లో గొప్ప పోటీ ఇవ్వనుంది. సైబర్‌ట్రక్ 2024లో లక్షనుంచి లక్షా 20వేల యూనిట్ల డెలివరీలను నమోదు చేయనుంది. అదే 2025లో 240,000 నుండి 260,000 డెలివరీ చేస్తుందని TF ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు మింగ్-చి కువో నివేదించారు. ఈ సంవత్సరం సైబర్‌ట్రక్ షిప్మెంట్లు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నామన్నారు. అయితే కేవలం 100-200 యూనిట్లు మాత్రమే నని చెప్పారు. ప్రస్తుత రవాణా అంచనాలు వరుసగా ఈ ఏడాదిలో 100-200, 2024లో ఒక లక్ష నుంచి , లక్షా 20వేలు, అలాగే 2025లో 2 లక్షల 40 వేలనుంచి 2 లక్షల 60 వేల యూనిట్లుగా ఉంటాయని కువో ఒక పోస్ట్‌లో రాశారు. సైబర్ట్రక్కు కొనసాగింపుగా సైబర్ ట్రక్-2 వచ్చే అవకాశం ఉందన్నారు. సైబర్‌ట్రక్ వినూత్న డిజైన్లు (ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ వంటివి) 2030 వరకు దాని పోటీ ప్రయోజనాన్ని కొనసాగిస్తుందని, అలాగే సైబర్‌ట్రక్ 2 2030 వరకు షిప్పింగ్‌ను ప్రారంభించని కూడా కువా చెప్పారు సైబర్‌ట్రక్ 2 ప్రారంభానికి ముందు, అప్‌గ్రేడెడ్, సవరించిన స్పెసిఫికేషన్లతో సైబర్‌ట్రక్ వెర్షన్లు ఉంటాయని అంచనావేశారు. రాబోయే సంవత్సరాల్లో టెస్లా రాబడి , లాభాల వృద్ధికి సైబర్‌ట్రక్ ప్రధాన దోహదకారి అవుతుందని కువో పేర్కొన్నారు. Saw the @cybertruck. Looks like a Master Candidate. 📐👽🔥🤯 pic.twitter.com/yiN3KRj3y5 — Tesla Owners Silicon Valley (@teslaownersSV) October 10, 2023 -
మస్క్ మామూలోడు కాదయ్యా..వీడియో వైరల్! ఇక ఆ రోబో కూడా?
Tesla Optimus ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారవుతున్న హ్యూమనాయిడ్ రోబోమరో అడుగు ముందుకేసింది. స్వయంగా మనిషిలా ఆలోచించే రోబోలను గత ఏడాది ప్రకటించిన టెస్లా ఇపుడు అచ్చం మనిషిలాగే అన్ని పనులను చేయగలదంటూ తన అద్బుతమైన రోబో ఆప్టిమస్ వీడియోను టెస్లా ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రోబోట్ వస్తువులను సులువుగా పట్టుకోవడం, మానవుని కంటే వేగంతో క్రమబద్ధీ కరించగల సామర్థ్యాన్ని సాధించింది. ముఖ్యంగా నమస్తే ఫోజుతోపాటు, యోగా చేస్తున్న ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. మొక్కలకు నీళ్లు పోయడం, బాక్సులను మోయడం లాంటి పనులను చేసిన రోబో వీడియోను ఎలాన్ మస్క్ ప్రదర్శించారు. అయితే చివర్లో రోబో తడబడడం, ఇంజినీర్లు వచ్చి.. దానిని సరిచేయడం ట్రోలింగ్‌కు దారి తీసింది. ఇపుడు దాన్ని అధిగమించి సరికొత్త ప్రోగ్రెస్‌తో దూసుకొచ్చింది. ఈనేపథ్యంలో పురోగతి అంటూ ఈ వీడియోను మస్క్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. హ్యూమనాయిడ్ బైపెడల్ రోబో ‘ఆప్టిమస్’ స్వయంగా-కాలిబ్రేట్ చేయగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. వస్తువులు, దాని కలర్స్‌ను గుర్తించి సంబంధిత ట్రేలో పెట్టడం మనం ఈవీడియోలో చూడవచ్చు. అంతేకాదు చాలా చక్కగా యోగా కూడా చేస్తోంది. ఎండ్-టు-ఎండ్ శిక్షణ పొందిన న్యూరల్ నెట్‌వర్క్‌తో వస్తువులను గుర్తిస్తోంది. ఈ విషయంలో మానవుడు జోక్యం చేసుకున్నపుడు, అతనికంటే వేగంగా రోబో విజయవంతంగా పనిని పూర్తి చేసింది. కలర్స్ బ్లాక్‌లను ఒక క్రమంలో పెడుతుండగా, స్థానాన్ని మార్చి నప్పటికీ, రోబోట్ వాటిని సరైన ట్రేలో ఉంచింది.అంతేకాదు బ్లాక్‌ను తిరగేసి పెట్టినపుడు దాన్ని మార్చి కరెక్ట్‌గా ఉంచడం కూడా ఇందులో చూడొచ్చు. దీంతో వెల్ డన్ టెస్లా టీం. అభినందనలు అంటున్నారు ట్వీపుల్. అంతేకాదు మస్క్ మామ మామూలోడు కాదు భయ్యా అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. నెక్ట్స్ రోబో కోసం వెయిటింగ్ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. Optimus can now sort objects autonomously 🤖 Its neural network is trained fully end-to-end: video in, controls out. Come join to help develop Optimus (& improve its yoga routine 🧘) → https://t.co/dBhQqg1qya pic.twitter.com/1Lrh0dru2r — Tesla Optimus (@Tesla_Optimus) September 23, 2023 pic.twitter.com/30mCr2Duk9 — Elon Musk (@elonmusk) September 25, 2023 కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో హెడ్‌క్వార్టర్స్‌లో గత ఏడాది జరిగిన ఒక ఈవెంట్లో ప్రకదర్శించిన హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్ టెక్నాలజీ ఆకట్టుకుంది. త్వరలో సెక్సీ రోబోలను సృష్టిస్తామంటూ ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది మార్చిలో ఇన్వెస్టర్ డే సందర్భంగా, టెస్లా ఐదు రోబోలను ప్రదర్శించింది. ఇపుడిక ఒక ఏడాదిలోపే మరో కీలకమైన పురోగతిని సాధించడం విశేషం. -
భారత్‌లో ప్రవేశించడానికి టెస్లా కొత్త వ్యూహం! ఇదే జరిగితే..
Tesla Battery Storage Factory: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకి అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఇందులో భాగంగానే అనేక ఆధునిక కార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ బ్రాండ్ 'టెస్లా' (Tesla) ఇండియాలో ప్రవేశించడానికి అనేకవిధాలుగా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు కంపెనీ ఇప్పుడు 'బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ' ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని రోజులకు ముందు మన దేశంలో టెస్లా కార్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోడీతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే సుమారు 24,000 డాలర్ల విలువైన ప్లాంట్ భారతదేశంలో నిర్మించడానికి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి.. తయారీ & విక్రయం వంటి వాటికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సకాలను కోరుతూ ఇప్పటికే ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. సోలార్ ప్యానల్స్, గ్రిడ్ నుంచి పవర్ స్టోర్ చేసుకుని రాత్రి సమయంలో లేదా విద్యుత్తుకు అంతరాయం కలిగిన సందర్భంలో ఉపయోగించుకోవడానికి ఇలాంటి బ్యాటరీలు ఉపయోగపడతాయి. టెస్లా ప్రతిపాదనకు ప్రభుత్వం కూడా సుముఖత చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం టెస్లా ప్రతినిధులు, మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. కానీ ఇదే జరిగితే టెస్లా భారతదేశంలో తన ప్రాభవాన్ని నిరూపించుకుంటుంది. ఇదీ చదవండి: ప్రపంచం భారత్ వైపు చూసేలా.. హ్యాపీనెస్ ర్యాంకింగ్‌లో ఇండియన్ ఎంప్లాయిస్.. బ్యాటరీ ఫ్యాక్టరీ ప్రస్తుతం దేశానికి చాలా అవసరమని, గ్రామీణ ప్రాంతాల్లో కరెంటుకు అంతరాయం కలిగినప్పుడు ఇలాంటి వాటిని ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. పవర్ జనరేషన్ స్టోరేజి అవసరమైన అంశం.. ఈ అవకాశాన్ని టెస్లా అందుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది.