అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు.. టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) సపోర్ట్ చేస్తున్నారనే విషయం రాజకీయ వివాదం రేకెత్తించింది. ఇది టెస్లా అమ్మకాలపైన తీవ్రమైన ప్రభావం చూపించింది. దీంతో అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి.
ట్రంప్‌కు మస్క్ ఇస్తున్న మద్దతును చాలామందికి నచ్చడం లేదు. దీనివల్ల టెస్లా కార్లను కొనుగోలు చేయకుండా ఊరుకున్నారు. ఈ కారణంగా టెస్లా కార్ల విక్రయాలు 50 శాతం తగ్గిపోయింది. ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో స్పష్టంగా తెలియడం లేదు.
బ్యాటరీతో నడిచే వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో యునైటెడ్ స్టేట్స్‌లో మాత్రం అమ్మకాలు క్షిణించాయి. టెస్లాతో పోలిస్తే.. ఇతర ప్రత్యర్థుల సేల్స్ కొంతవరకు ఉత్తమంగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. టెస్లా కార్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదని పలువురు నెటిజన్లు తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాల ద్వారా పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment