![Elon Musk Might Buy TikTok Tesla CEO Responds](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/tiktok.jpg.webp?itok=G3Bcjlnx)
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అధిక ప్రజాదరణ పొందిన చైనా షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok)ను ఇప్పటికే భారత్‌తో సహా చాలా దేశాలు నిషేధించాయి. అమెరికా కూడా ఈ యాప్‌ను నిషేదించనున్నట్లు సమాచారం. కానీ దీనిని (టిక్‌టాక్) ఇలాన్ మస్క్ (Elon Musk) కొనుగోలు చేయనున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత?.. దీనిపై మస్క్ అభిప్రాయం ఏంటనేది ఇక్కడ చూసేద్దాం.
భద్రతా కారణాల దృష్ట్యా.. టిక్‌టాక్ యాప్‌ను అమెరికా నిషేధించాలని యోచిస్తోంది. ఈ నిషేధం నుంచి తప్పించుకోవడానికి.. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ (ByteDance) ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత మస్క్‌కు విక్రయించాలని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. దీనిపై మస్క్ స్పందించారు.
నేను టిక్‌టాక్ కొనుగోలుకు బిడ్డింగ్ వేయలేదు. దానిని కొనుగోలు చేయాలనే ఆసక్తి నాకు లేదు. ఒకవేళా ఆ యాప్ కొనుగోలు చేస్తే దానిని ఏమి చేయాలో తెలియదు. కంపెనీలను కొనుగోలు చేయడం కంటే.. కొత్త కంపెనీలను నెలకొల్పడమే నాకు ఇష్టం అని మస్క్ స్పష్టం చేశారు.
2017లో ప్రారంభమైన టిక్‌టాక్, అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయింది. ఎంత వేగంగా ప్రజాదరణ పొందిందో.. అంతే వేగంగా ఈ యాప్‌ను పలు దేశాలు రద్దు చేశాయి. అమెరికా కూడా ఈ యాప్‌పై ఆంక్షలు విధించింది. చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే టిక్‌టాక్ నిషేధాన్ని ఎదుర్కోక తప్పదనే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఇటీవల ఆమోదం తెలిపింది.
ఇదీ చదవండి: యూట్యూబర్‌పై సెబీ కన్నెర్ర: ఎవరీ అస్మితా పటేల్?
అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం.. తరువాత అమెరికా సుప్రీంకోర్టు కూడా టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు ఓ డెడ్‌లైన్ ఇచ్చింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లో టిక్‌టాక్‌ను విక్రయించాలని సూచించింది. అయితే కంపెనీ జాయింట్ వెంచర్‌లో అమెరికాకు 50 శాతం వాటా ఇస్తే.. టిక్‌టాక్‌కు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో సంస్థ టిక్‌టాక్‌ను మస్క్‌కు విక్రయించనున్నట్లు వార్తలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment