![Who Is Asmita Patel Why Banned By SEBI](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/asmita-patel.jpg.webp?itok=QkpGf-Ak)
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఆరు సంస్థలను నిషేధించింది. రిజిస్ట్రేషన్ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు ఇచ్చి, కోర్సులు నిర్వహించి పెట్టుబడిదారుల నుంచి డబ్బులు సేకరించిన కారణంగానే సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (APGSOT) డైరెక్టర్ 'అస్మితా పటేల్' కూడా ఉన్నారు.
అస్మితా పటేల్ పెట్టుబడికి సంబంధించిన టిప్స్ చెబుతూ.. కోర్సులు నేర్చుకునే వారి దగ్గర నుంచి భారీగానే వసూలు చేసింది. ఈమె టిప్స్ విన్న పెట్టుబడిదారులు నష్టాలను చవిచూశారు. దీంతో చాలామంది ఇన్వెస్టర్లు వరుసగా ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. దీంతో సెబీ రంగంలోకి దిగింది.
టిప్స్ పేరుతో అస్మితా పటేల్ సుమారు రూ. 104 కోట్ల కంటే ఎక్కువ సంపాదించినట్లు సమాచారం. ఈ విషయాలు సెబీ విచారణలో తేలాయి. కోర్సు ఫీజుల కింద ఇన్వెస్టర్లు, స్టూడెంట్స్ నుంచి సేకరించిన రూ.53 కోట్లు.. సంబంధిత ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చేయాలని సెబీ ఆదేశించింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/sebi.jpg)
అస్మితా పటేల్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్‌కు 5.26 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.9 లక్షల మంది ఫాలోవర్లు, ఫేస్‌బుక్‌లో 73,000 మంది, లింక్డ్‌ఇన్‌లో 1,900 మంది ఫాలోవర్లు, ఎక్స్ (ట్విటర్)లో 4,200 మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఇదీ చదవండి: తండ్రికి తగ్గ తనయ.. వేలకోట్ల కంపెనీలో కీలక వ్యక్తి: ఎవరీ నీలిమా?
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్, ఎక్స్ (ట్విటర్)లలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్.. అస్మితా పటేల్ తనను తాను షీవోల్ఫ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్.. 'ఆప్షన్స్ క్వీన్'గా ప్రచారం చేసుకుంటోంది. ఈమె దాదాపు ఒక లక్షమంది స్టూడెంట్లకు, పెట్టుబడిదారులకు ట్రేడింగ్ సలహాలు ఇచ్చినట్లు సమాచారం.
ఎవరీ అస్మితా పటేల్?
అస్మితా పటేల్.. మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఉన్న అస్మితా పటేల్ గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (AGSTPL)కి డైరెక్టర్. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. ఆమె సాంప్రదాయ గుజరాతీ కుటుంబంలో జన్మించింది. ఈమెకు 17 సంవత్సరాల ట్రేడింగ్ ఎక్స్‌పీరియన్స్, పదేళ్లకు పైగా బోధనా నైపుణ్యం ఉందని తెలుస్తోంది. అంతే కాకుండా అనేక అవార్డులను గెలుచుకున్నట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment