investers
-
పదేళ్లు, అంతకుమించిన ఇన్వెస్ట్ చేయాలనుకుంటే..
ఈక్విటీలు ఎప్పుడూ అస్థిరతలతో చలిస్తుంటాయి. కొంత కాలం పాటు ర్యాలీ చేసి, కొంత కాలం దిద్దుబాటుకు గురవుతుంటాయి. భారత్ వేగంగా వృద్ధి చెందుతూ, అభివృద్ధి చెందిన దేశం కావాలన్న ఆకాంక్షలతో అడుగులు వేస్తోంది. కనుక దీర్ఘకాలంలో ఈక్విటీల్లో మెరుగైన రాబడులకే ఎక్కువ అవకాశాలున్నాయి.ఇన్వెస్టర్లు ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీల్లో, అది కూడా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ విభాగంలో పెట్టుబడి పెట్టుకోవడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు పొందే అవకాశాలుంటాయన్నది నిపుణుల సూచన. ఈ రెండు విభాగాల్లో పెట్టుబడికి వీలు కల్పిస్తున్నదే మిరే అస్సెట్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్. కనీసం 10 ఏళ్లు అంతకుమించిన దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు ఈ పథకంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులను పరిశీలించొచ్చు.రాబడులుఈ పథకం గడిచిన ఏడాదిలో ఒక శాతం నష్టాన్నిచ్చింది. ఇటీవలి కాలంలో స్టాక్స్ గణనీయంగా దిద్దుబాటుకు గురి కావడం చూస్తున్నాం. దీని ఫలితమే ఏడాది కాలంలో రాబడి కాస్తా నష్టంగా మారిపోవడం. మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే 12 శాతానికి పైనే వార్షిక రాబడి ఈ పథకంలో ఇన్వెస్టర్లకు లభించింది. అదే ఐదేళ్లలో ఏటా 17 శాతం పెట్టుబడులపై రాబడి తెచ్చి పెట్టింది. ఏడేళ్లలోనూ 14.63 శాతం, పదేళ్లలో 16 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. ఈ పథకం గతంలో మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ పేరుతో పనిచేసింది. 2010 జూలైలో పథకం ప్రారంభం కాగా, నాటి నుంచి చూస్తే ఇప్పటి వరకు వార్షిక రాబడి 19 శాతంగా ఉండడం గమనార్హం.పెట్టుబడుల విధానంపేరులో ఉన్నట్టుగా ఈ పథకం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. కంపెనీల భవిష్యత్ వృద్ధి సామర్థ్యాలపై ఈ పథకం ప్రధానంగా దృష్టి పెడుతుంది. భవిష్యత్‌లో దిగ్గజాలుగా ఎదిగే సామర్థ్యాలున్న కంపెనీలను ముందుగానే ఎంపిక చేసి ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగిస్తుంటుంది. ఈ పథకం సాధారణంగా 35 - 65 శాతం మధ్య లార్జ్‌క్యాప్ కంపెనీలకు (మార్కెట్ విలువ పరంగా 100 అగ్రగామి కంపెనీలు) కేటాయిస్తుంటుంది.మిడ్‌క్యాప్ కంపెనీలకు (మార్కెట్ విలువ పరంగా 101 నుంచి 250వరకు ఉన్నవి) కేటాయింపులు 35–65 శాతం మధ్య నిర్వహిస్తుంటుంది. భవిష్యత్ బ్లూచిప్ కంపెనీల్లో ముందే పెట్టుబడికి ఈ పథకం వీలు కల్పిస్తుంది. బోటమ్‌అప్, వ్యాల్యూ ఇన్వెస్టింగ్ విధానాలను అనుసరించి స్టాక్స్‌ను ఎంపిక చేస్తుంటుంది. అధిక నాణ్యమైన కంపెనీల్లో సహేతుక ధరల వద్దే పెట్టుబడులు పెడుతుంది. ఈ పథకం మొదలైన నాటి నుంచి నీలేష్ సురానా ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.36,514 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 99.31 శాతాన్ని ఇప్పటికే ఇన్వెస్ట్ చేసింది. మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 103 స్టాక్స్ ఉన్నాయి. ప్రస్తుతం లార్జ్‌క్యాప్‌లో 63 శాతం పెట్టుబడులు ఉన్నాయి. మిడ్‌క్యాప్‌లో 34 శాతానికి పైనే ఇన్వెస్ట్ చేసింది. స్మాల్‌క్యాప్ కంపెనీలకు 2.49 శాతం కేటాయింపులు చేసింది. అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 28 శాతం పెట్టుబడులు కేటాయించింది. ఇండ్రస్టియల్స్ కంపెనీల్లో 13.71 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 13 శాతం, మెటీరియల్స్ కంపెనీల్లో 11 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. -
యూట్యూబర్‌పై సెబీ కన్నెర్ర: ఎవరీ అస్మితా పటేల్?
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఆరు సంస్థలను నిషేధించింది. రిజిస్ట్రేషన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇచ్చి, కోర్సులు నిర్వహించి పెట్టుబడిదారుల నుంచి డబ్బులు సేకరించిన కారణంగానే సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (APGSOT) డైరెక్టర్ 'అస్మితా పటేల్' కూడా ఉన్నారు.అస్మితా పటేల్ పెట్టుబడికి సంబంధించిన టిప్స్ చెబుతూ.. కోర్సులు నేర్చుకునే వారి దగ్గర నుంచి భారీగానే వసూలు చేసింది. ఈమె టిప్స్ విన్న పెట్టుబడిదారులు నష్టాలను చవిచూశారు. దీంతో చాలామంది ఇన్వెస్టర్లు వరుసగా ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. దీంతో సెబీ రంగంలోకి దిగింది.టిప్స్ పేరుతో అస్మితా పటేల్ సుమారు రూ. 104 కోట్ల కంటే ఎక్కువ సంపాదించినట్లు సమాచారం. ఈ విషయాలు సెబీ విచారణలో తేలాయి. కోర్సు ఫీజుల కింద ఇన్వెస్టర్లు, స్టూడెంట్స్ నుంచి సేకరించిన రూ.53 కోట్లు.. సంబంధిత ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చేయాలని సెబీ ఆదేశించింది.అస్మితా పటేల్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్‌కు 5.26 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.9 లక్షల మంది ఫాలోవర్లు, ఫేస్బుక్లో 73,000 మంది, లింక్డ్ఇన్లో 1,900 మంది ఫాలోవర్లు, ఎక్స్ (ట్విటర్)లో 4,200 మంది ఫాలోవర్లు ఉన్నారు.ఇదీ చదవండి: తండ్రికి తగ్గ తనయ.. వేలకోట్ల కంపెనీలో కీలక వ్యక్తి: ఎవరీ నీలిమా?ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఎక్స్ (ట్విటర్)లలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్.. అస్మితా పటేల్ తనను తాను షీవోల్ఫ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్.. 'ఆప్షన్స్ క్వీన్'గా ప్రచారం చేసుకుంటోంది. ఈమె దాదాపు ఒక లక్షమంది స్టూడెంట్లకు, పెట్టుబడిదారులకు ట్రేడింగ్ సలహాలు ఇచ్చినట్లు సమాచారం.ఎవరీ అస్మితా పటేల్?అస్మితా పటేల్.. మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఉన్న అస్మితా పటేల్ గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (AGSTPL)కి డైరెక్టర్. కంపెనీ వెబ్సైట్ ప్రకారం.. ఆమె సాంప్రదాయ గుజరాతీ కుటుంబంలో జన్మించింది. ఈమెకు 17 సంవత్సరాల ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, పదేళ్లకు పైగా బోధనా నైపుణ్యం ఉందని తెలుస్తోంది. అంతే కాకుండా అనేక అవార్డులను గెలుచుకున్నట్లు చెబుతున్నారు. -
భారత్‌లో అద్భుత అవకాశాలు
వాషింగ్టన్: అమెరికా ఇన్వెస్టర్లకు భారత్ అసాధారణ రీతిలో అవకాశాలు కల్పిస్తోందని ఐఎంఎఫ్‌లో భారత ఈడీగా పనిచేస్తున్న కేవీ సుబ్రమణియన్ అన్నారు. వచ్చే 20–25 ఏళ్లలో ఈ స్థాయి రాబడులు మరే ఆర్థిక వ్యవస్థ కల్పించలేదన్నారు. తాను రాసిన ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్‌వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రెట్టింపు కాకుండా మూడింతలు చేయాలని సూచించారు. వారి పెట్టుబడులు 15–20 రెట్లు వృద్ధి చెందుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఇండియా @100: భవిష్యత్ ఆర్థిక శక్తిని ఊహించడం’ పేరుతో సుబ్రమణియన్ రచించిన ఈ పుస్తకంలో.. భారత్ 100వ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకునే 2047 నాటికి, 25 ఏళ్లలోపే 55 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎలా అవతరించగలదన్నది వివరించారు. 2014 తర్వాత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు, బలమైన విధానాలను ప్రవేశపెట్టడాన్ని ప్రస్తావించారు. కేవీ సుబ్రమణియన్ ప్రస్తుత పదవికి పూర్తం భారత మఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేయడం గమనార్హం. భారత్‌లో వేతన వృద్ధి ఎక్కువ.. భారత బ్యాంక్ ఖాతాల్లో పొదుపు చేసుకుంటే అమెరికా బ్యాంకుల కంటే ఎక్కువ రాబడి వస్తుందని భారత సంతతి వారికి సుబ్రమణియన్ సూచించారు. అమెరికాలో కంటే భారత్‌లో వేతన వృద్ధి ఎక్కువగా ఉంటుందన్నారు. ‘‘డాలర్ల రూపంలో 12 శాతం వృద్ధి ఉంటే, భారత్‌లో 17–18 శాతం మేర వృద్ధి చెందనుంది. అంటే ప్రతి ఐదేళ్లకు వేతనం రెట్టింపు అవుతుంది. 30 ఏళ్ల కెరీర్లో ఏడు వేతన రెట్టింపులు చూడొచ్చు. అంటే 100 రెట్ల వృద్ధి. అదే యూఎస్‌లో అయితే గరిష్టంగా ఏడెనిమిది రెట్ల వృద్ధే ఉంటుంది’’అని వివరించారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 55 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ధృడమైన విశ్వాసం వ్యక్తం చేశారు. -
మహిళలు ఇలా మారాలి: రాధికా గుప్తా సూచనలు
ఎన్నో సవాళ్ళను అధిగమించి ఎడిల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ & సీఈఓ స్థాయికి ఎదిగిన 'రాధికా గుప్తా' పెట్టుబడికి సంబంధించిన విషయాలను గురించి చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొన్న ఈమె, మహిళల ఆర్ధిక సామర్థ్యాన్ని వివరిస్తూ.. వారు మారాల్సిన సమయం వచ్చిందని అన్నారు.మహిళలు చాలా కాలంగా తమ కుటుంబాలకు ఆర్థిక సారథులుగా ఉన్నారు. కానీ చాలా మంది ఇప్పటికీ సొంత పెట్టుబడులకు సంబంధించిన బాధ్యత తీసుకోవడానికి మాత్రమే వెనుకాడుతున్నారని రాధికా గుప్తా పేర్కొన్నారు. పొదుపు విషయంలో ఆరితేరిన మహిళలు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని గురించి వివరించారు.అమ్మలు, అమ్మమ్మలు.. ఇలా తరాలుగా ఇళ్లకు సీఎఫ్ఓలుగా వ్యవహరిస్తున్నారు. ఈ విధానం మారాలి. డబ్బు నిర్వహణకు పురుషులకు అవుట్సోర్సింగ్ చేయడం ఆపేయండి. పొదుపుచేసే వారి నుంచి పెట్టుబడిదారులుగా మారండి. ఇది కష్టమైన పని కాదు. సవాళ్లు ఎదుర్కుంటేనే.. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుతారని చెబుతూ.. సవాళ్లు బయట నుంచి రావు. మనం అంతర్గతంగా ఎదుర్కొనేదే అతి పెద్ద సవాలు అని రాధికా గుప్తా అన్నారు.ఇదీ చదవండి: రెండో ఆదాయంపై కన్నేసిన సినీతారలు: అందరి చూపు అటువైపే..మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకోండి, మీ ఆలోచనలకు కార్యరూపం దాల్చండి అని.. ఆమె మహిళలకు సూచనలు చేశారు. మహిళలు సహజంగా మల్టీటాస్కింగ్ చేయగల సమర్థులు. ఇంట్లోనే భార్యగా, తల్లిగా, కోడలిగా ఇలా ఎన్నో బాధ్యతలను నిర్వరించే మహిళ.. అన్ని రంగాల్లోనూ సులభంగా రాణించగలదని రాధికా గుప్తా వెల్లడించారు. ఇకపోతే రాధికా గుప్తా సారథ్యంలో ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2017 మార్చిలో రూ. 6,500 కోట్లుగా ఉన్న కంపెనీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ జూలై 2024 నాటికి రూ. 1.40 లక్షల కోట్లకు పెరిగింది. -
వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లపై జాగ్రత్త: సెబీ హెచ్చరిక
న్యూఢిల్లీ: అనధికార వర్చువల్ ట్రేడింగ్ లేదా గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు దూరంగా ఉండాలని సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. కేవలం రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీల (మధ్యవర్తిత్వ సంస్థలు) ద్వారానే లావాదేవీలు నిర్వహించాలని సూచించింది. యాప్‌లు/వెబ్ అప్లికేషన్లు/ప్లాట్‌ఫామ్‌లపై లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరల ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ లేదా ఫాంటసీ గేమ్‌లు ఆఫర్ చేస్తున్నట్టు సెబీ దృష్టికి వచ్చింది.ఈ తరహా కార్యకలాపాలు సెక్యూరిటీస్ చాంట్రాక్ట్ (రెగ్యులేషన్స్) చట్టం, 1956, సెబీ చట్టం 1992కు విరుద్ధమని, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ చట్టాలను తీసుకొచ్చినట్టు సెబీ తెలిపింది. రిజిస్టర్డ్ సంస్థల ద్వారానే పెట్టుబడులు, ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించింది. ‘‘అనధికారిక పథకాల్లో పాల్గొనడం, వ్యక్తిగత కీలక సమాచారాన్ని పంచుకోవడం ఇన్వెస్టర్ల సొంత రిస్క్, పైనే ఆధారపడి ఉంటుంది. దీని వల్ల ఎదురయ్యే పరిణామాలకు ఇన్వెస్టర్లే బాధ్యులు. ఎందుకంటే ఆయా సంస్థలు సెబీ వద్ద నమోదైనవి కావు. కనుక ఆయా సంస్థలతో నిర్వహించే లావాదేవీలకు సంబంధించి ఇన్వెస్టర్లకు పెట్టుబడిదారుల పరిరక్షణ, ఫిర్యాదుల పరిష్కార విభాగం తదితర సెబీ యంత్రాంగాలు అందుబాటులో ఉండవు’’ అని స్పష్టం చేసింది.విదేశీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు..మ్యూచువల్ ఫండ్స్ విదేశీ పెట్టుబడుల విషయంలో సెబీ కొంత ఉపశమనాన్ని కల్పించనుంది. భారత సెక్యూరిటీల్లో విదేశీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టిన మేరకు.. ఆయా విదేశీ పథకాల్లో భారత మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సెబీ తాజాగా ప్రకటించింది. అయితే ఆయా విదేశీ ఫండ్స్ భారత పెట్టుబడులు వాటి నిర్వహణ ఆస్తుల్లో 25 శాతానికి మించకూడదని పేర్కొంది.మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ పెట్టుబడులను మరింత వైవిధ్యం చేసుకునేందుకు సెబీ తాజా నిర్ణయం వీలు కల్పించనుంది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని సెబీ తెలిపింది. ఫండ్స్ పెట్టుబడుల విలువ సెబీ పరిమితులను మించితే నిబంధనలకు అనుగుణంగా తగ్గించుకునేందుకు ఆరు నెలల వ్యవధి ఉంటుంది. -
రియల్టీలోకి తగ్గిన విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి గతేడాది (2023లో) 2.73 బిలియన్ డాలర్ల మేర విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 30 శాతం తగ్గాయి. 2022లో 3.96 బిలియన్ డాలర్లు వచ్చాయి. మరోవైపు, దేశీ సంస్థల పెట్టుబడులు రెట్టింపై 687 మిలియన్ డాలర్ల నుంచి 1.51 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మొత్తం మీద 2023లో రియల్ ఎస్టేట్‌లోకి సంస్థాగత పెట్టుబడులు 12 శాతం క్షీణించి 4.9 బిలియన్ డాలర్ల నుంచి 4.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. విదేశీ ఫండ్స్ ఆచితూచి వ్యవహరించడం వల్ల పెట్టుబడులు మందగించినట్లు వెస్టియన్ సీఈవో శ్రీనివాస రావు తెలిపారు. ‘రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్‌పై అనిశ్చితి నెలకొన్నప్పటికీ 2023లో పెట్టుబడులు భారీగానే వచ్చాయి. భారత వృద్ధి గాథపై దేశీ ఇన్వెస్టర్లలో నెలకొన్న విశ్వాసం, వారి ఆశావహ దృక్పథం మార్కెట్‌ను నిలబెట్టింది‘ అని ఆయన పేర్కొన్నారు. 2023లో పెట్టుబడులు అయిదేళ్ల కనిష్టానికి తగ్గినా.. దేశీ ఎకానమీ మెరుగైన పనితీరు, ఇన్ఫ్రా రంగంలో ప్రతిపాదిత ప్రాజెక్టుల ఊతంతో 2024లో ఇన్వెస్ట్మెంట్లు మరింత పుంజుకోగలవని శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. కొత్త పెట్టుబడి సాధనాల రాకతో భారతీయ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తోందని, దీంతో నిధుల అవసరం కూడా పెరుగుతోందని చెప్పారు. ఇలా పెట్టుబడులకు డిమాండ్ అధికంగా ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్లపై కూడా అధిక రాబడులు రావొచ్చని, అదే ఆలోచనతో ఇన్వెస్టర్లు రియల్టీలో మరిన్ని పెట్టుబడులు పెట్టొచ్చని శ్రీనివాస రావు వివరించారు. 2019లో దేశీ రియల్ ఎస్టేట్‌లోకి సంస్థాగత పెట్టుబడులు 6.5 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. 2020లో 5.9 బిలియన్ డాలర్లు, 2021లో 4.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. -
ఆర్బీఐ అలెర్ట్, పెట్టుబడులు పెడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఆర్బీఐ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఫారెక్స్ ట్రేడింగ్ పేరిట ప్రకటనలు గుప్పిస్తున్న పలు నకిలీ యాప్‌ల వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐ వెల్లడించిన అనుమతి లేని ఇన్వెస్ట్మెంట్ యాప్‌ల జాబితాలో అల్పరి ఇన్వెస్ట్–ఇన్వెస్ట్మెంట్స్, ఐక్యూ ఫారెక్స్–ఆన్లైన్ ట్రేడింగ్ యాప్, ఓలింప్ ట్రేడ్–ట్రేడింగ్ ఆన్లైన్లు ఉన్నాయి. అనుమతులు లేని యాప్‌లతో పెట్టుబడి పెట్టి మోసపోవద్దని ఆర్బీఐ హెచ్చరించింది. ఆర్బీఐ అనుమతి లేని అలాంటి సంస్థల వివరాలు తెలిస్తే వెంటనే సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్‌లోగానీ, 1930 టోల్‌ఫ్రీ నంబర్‌లోగానీ తెలియజేయాలని కేంద్ర హోంశాఖ అధికారులు సూచించారు. -
పోటెత్తిన ఎఫ్‌పీఐల పెట్టుబడులు...
విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్లో ఇప్పటికి వరకు (1–22 తేదీల మధ్య) రూ. 57,300 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో ఇదే గరిష్టం. ‘‘ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ గెలుపొందడం+తో బలమైన ఆరి్థక వృద్ధి, రాజకీయ సుస్థిరత ఏర్పడొచ్చనే ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ స్థిరంగా తగ్గుతోంది. ఈ పరిణామాలు ఎఫ్ఐఐల కొనుగోళ్లను ప్రేరేపించాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఊహాగానాలతో కొత్త ఏడాదిలోనూ భారత్ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వీకే విజయ కుమార్ తెలిపారు. ఈ ఏడాదిలో మొత్తంగా భారత్ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ.1.62 లక్షల కోట్ల మార్కును దాటేశాయి. ఇక డెట్ మార్కెట్లోకి డిసెంబర్ నెలలో రూ. 15,545 కోట్ల ఎఫ్‌పీఐ నిధులు వచ్చి చేరాయి. గత నెలలో రూ.14,860 కోట్లు, అక్టోబర్‌లో 6,381 కోట్ల నిధులు వచ్చాయి. ఫైనాన్సియల్ సరీ్వసెస్‌తో పాటు ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, టెలికం రంగాల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు ఎక్కువగా పెట్టుబడి పెట్టారని గణాంకాలు చెబుతున్నాయి. -
తక్కువ రిస్క్.. స్థిరమైన రాబడికి బెస్ట్ ఆప్షన్..
ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు సర్వ సాధారణం. ఆటుపోట్లతో చలిస్తూ ఉంటాయి. కానీ, దీర్ఘకాలానికి నికర ప్రతిఫలం సానుకూలంగానే ఉంటుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఈ ఆటుపోట్లను తట్టుకునే సామర్థ్యం అందరు ఇన్వెస్టర్లలోనూ ఉండాలని లేదు. కొందరు రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారికి ఈక్విటీ, డెట్‌తో కూడిన హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ కూడా ఒకటి. రిస్క్ తక్కువ ఉండాలని కోరుకునే వారు ఈ పథకాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. గడిన ఏడాది కాలంలో ఈ పథకం 9 శాతం రాబడులను అందింంది. మూడేళ్ల కాలంలో రాబడి ఏటా 13.56 శాతంగా ఉంది. ఐదేళ్ల కాలంలో చూసుకుంటే 13 శాతం, ఏడేళ్లలో 12 శాతం, పదేళ్లలో 14 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. పెట్టుబడుల విధానం ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడులను ఈక్విటీ, డెట్ మధ్య వర్గీకరిస్తాయి. ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రెండు మార్కెట్లలోని ప్రయోజనాలను ఇన్వెస్టర్లు సొంతం చేసుకున్నట్టు అవుతుంది. ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్న సమయంలో డెట్ పెట్టుబడులు పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వాన్ని ఇస్తాయి. ఈక్విటీలు అధిక రాబడులకు, డెట్ పెట్టుబడులు రక్షణకు సాయపడతాయి. పైగా అచ్చం డెట్ పథకాల్లో చేసే దీర్ఘకాల పెట్టుబడులకు ద్రవ్యోల్బణం పరంగా ఉన్న పన్ను ప్రయోజనాన్ని ఇటీవల ఎత్తివేశారు. దీంతో హైబ్రిడ్ ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఈక్విటీకి ఉండే పన్ను మినహాయింపు ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఈ పథకం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 75 శాతం వరకు ఈక్విటీలకు, 25 శాతం వరకు డెట్‌కు కేటాయిస్తుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ మధ్య కేటాయింపుల్లో మార్పులు చేస్తుంటుంది. ఈక్విటీల్లోనూ 50 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌కే కేటాయిస్తుంది. లార్జ్‌క్యాప్ కంపెనీల్లో అస్థిరతలు కొంత తక్కువగా ఉంటాయి. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో ర.59,302 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వీటిల్లో ఈక్విటీలకు 76.76 శాతం కేటాయింంది. డెట్ పెట్టుబడులు 20.32 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్‌లో 0.91 శాతం ఇన్వెస్ట్ చేయగా, 2 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. ఈక్విటీలకు 75 శాతం మిం పెట్టుబడులు ఉండడాన్ని గమనించొచ్చు. డెట్ కంటే ఈక్విటీలు ఆకర్షణీయంగా మారినప్పుడు, ర్యాలీకి అవకాశం ఉన్నప్పుడు అధికంగా కేటాయింపులు చేయడం ద్వారా రాబడులు పెంచుకునే విధంగా ఫండ్ మేనేజ్మెంట్ బృందం పనిచేస్తుంటుంది. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లోన 85 శాతం మేర ప్రస్తుతం లార్జ్‌క్యాప్ కంపెనీలోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 14.56 శాతం మేర ఇన్వెస్ట్ చేయగా, స్మాల్‌క్యాప్ కంపెనీలకు కేటాయింపులు 0.68 శాతంగానే ఉన్నాయి. డెట్‌లో రక్షణ ఎక్కువగా ఉండే ఎస్‌వోవీ, ఏఏఏ రేటెడ్ సాధనాల్లోనే అధిక పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 35 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 24 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. సేవల రంగ కంపెనీలకు 7.45 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 6.23 శాతం, ఆటోమొబైల్ కంపెనీలకు 6.12 శాతం, కమ్యూనికేషన్ కంపెనీలకు 5 శాతానికి పైగా కేటాయింపులు చేసింది. -
కోటక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ - ఏ కాలంలో అయినా మెరుగైన రాబడి ఇచ్చిన చరిత్ర!
మార్కెట్లో చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీలు ఎన్నో ఉంటాయి. ఇన్వెస్టర్లు కేవలం మెరుగైన రాబడుల దృష్టితోనే కంపెనీలను ఎంపిక చేసుకోకూడదు. పెట్టుబడులకు రక్షణ ఉండాలి. అదే సమయంలో దీర్ఘకాలంలో కాస్తంత మెరుగైన రాబడులు ఆశించాలి. ఈ దృష్ట్యా చూస్తే ఫ్లెక్సీక్యాప్ పథకాలు అనుకూలమైనవి. ఇవి లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తూ.. అదే సమయంలో అధిక రాబడుల కోణంలో మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు సైతం కొంత చొప్పున కేటాయింపులు చేస్తుంటాయి. ఈ విభాగంలో కోటక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మెరుగైన పనితీరు చూపిస్తోంది. తమ పెట్టుబడులకు కొంత రిస్క్ ఉన్నా ఫర్వాలేదని భావించే వారికి ఈ విభాగం అనుకూలంగా ఉంటుంది. రాబడులు అన్ని కాలాల్లోనూ మెరుగైన రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. గడిచిన ఆరు నెలల్లో ఈ పథకంలో రాబడి 15 శాతంగా ఉంది. ఏడాదిలో 21 శాతం రాబడిని ఇచ్చింది. ఇక మూడేళ్ల కాలంలో చూస్తే పెట్టుబడులపై వార్షిక ప్రతిఫలం 21 శాతం చొప్పున ఉంది. ఐదేళ్ల కాలంలో ఏటా 15.52 శాతం చొప్పున, ఏడేళ్లలో 14 శాతం, పదేళ్లలో ఏటా 17.63 శాతం చొప్పున ఈ పథకం ఇన్వెస్టర్లకు రాబడిని తెచ్చి పెట్టింది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకం పదేళ్ల కాలంలో మెరుగ్గా పనిచేసింది. బీఎస్ఈ 500 టీఆర్ఐతో పోలిస్తే ఏడాది, పదేళ్ల కాలంలో మెరుగైన రాబడిని అందించింది. గత మూడేళ్లలో మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురైన పరిస్థితులు చూశాము. పైగా ఈక్విటీల్లో కనీసం ఐదేళ్లు, అంతకుమించిన కాలానికే ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది నిపుణుల సూచన. కనుక ఐదేళ్లు, అంతకుమించి కాలానికి రాబడులనే ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఈ పథకం మెరుగైన పనితీరును చూపించింది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో మల్టీక్యాప్ ఫండ్స్ అన్ని రకాల మార్కెట్ విలువలతో కూడిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అంటే లార్జ్‌క్యాప్‌తోపాటు, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్లో ఎప్పుడూ అన్ని విభాగాలు ఒకే రీతిలో పని చేస్తాయని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఎక్కువ ర్యాలీ ఉండొచ్చు. గడిచిన ఆరు నెలల్లో చూసినట్టు.. కొన్ని సందర్భాల్లో మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలు లార్జ్‌క్యాప్ కంటే అధిక రాబడులు ఇస్తుంటాయి. దీర్ఘకాలంలోనూ వీటి మధ్య రాబడుల పరంగా వ్యత్యాసం ఉంటుంది. కనుక మల్టీక్యాప్ ఫండ్స్ అన్నింటి మిశ్రమంగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.40,685 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 98.71 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 76 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్‌క్యాప్ కంపెనీలకు 23.49 శాతం కేటాయింపులు చేసింది. స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులు ఒక శాతంలోపే ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 52 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 27 శాతం మేర ఈ రంగానికి చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆటోమొబైల్ కంపెనీలకు 11.60 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 8.77 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 7.48 శాతం, మెటీరియల్స్ కంపెనీలకు 6.82 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
సహారా డబ్బులు వెనక్కి ఇస్తున్నారు..వెంటనే ఇలా క్లయిమ్ చేసుకోండి
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ నాలుగు కోపరేటివ్‌ల పరిధిలో నాలుగు కోట్ల డిపాజిటర్లకు డబ్బులు చెల్లించడం మొదలైంది. మొదటి విడత కింద ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 112 మంది చిన్న ఇన్వెస్టర్లకు చెల్లింపులను కేంద్ర హోంశాఖ, సహకార శాఖల మంత్రి అమిత్‌షా శుక్రవారం ప్రారంభించారు. సీఆర్సీఎస్ సహారా రిఫండ్ పోర్టల్‌పై ఇప్పటి వరకు 18 లక్షల మంది డిపాజిటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు షా చెప్పారు. సహారా డిపాజిటర్ల చెల్లింపులకు వీలుగా సీఆర్సీఎస్–సహారా పోర్టల్‌ను కేంద్ర సహకార శాఖ జూలై 18న ప్రారంభించడం గమనార్హం. నమోదు చేసుకున్న ఇన్వెస్టర్లు అందరికీ తొలి విడతలో రూ.10వేల చొప్పున చెల్లించనున్నారు. ఆడిట్ పూర్తయిన తర్వాత రెండో విడత నిధులను బదిలీ చేస్తామని అమిత్‌షా తెలిపారు. ‘‘రానున్న రోజుల్లో డిపాజిటర్లు అందరూ తమ నిధులను పొందుతారని మీకు భరోసా ఇస్తున్నా’’అని ప్రకటించారు. సహార వంటి ఘటనలు జరిగినప్పుడల్లా సహకార సంస్థల పట్ల నమ్మకం కుదేలవుతున్నట్టు పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల డబ్బులు సురక్షితంగా ఉన్నాయని, వాటిని తిరిగి వారికి అందిస్తామని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సహారా డిపాజిటర్లు గత 12–15 ఏళ్ల నుంచి తమ డబ్బులు పొందలేకపోయారని, ఇందుకు సహారా యాజమాన్యం విఫలం కావడం, కోర్టుల్లో వ్యాజ్యాలతో జాప్యం జరిగినట్టు చెప్పారు. సెబీ–సహారా ఫండ్ నుంచి రూ.5,000 కోట్లను సహకార శాఖ పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు అమిత్‌షా వివరించారు. సీబీఐ, ఆదాయపన్ను శాఖ తదితర కేంద్ర ప్రభుత్వం సంస్థలను ఒకేతాటిపైకి తీసుకొచ్చి.. నిధులపై ముందుగా చిన్న ఇన్వెస్టర్లకు తొలుత హక్కు ఉండాలంటూ సుప్రీంకోర్టును కోరినట్టు గుర్తు చేశారు. సహారా గ్రూపు నాలుగు కోపరేటివ్‌ల పరిధిలోని 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు వచ్చే తొమ్మిది నెలల్లో వారి డబ్బులు తిరిగి పొందేలా చర్యలు తీసుకుంటామని ఈ ఏడాది మార్చి 29న కేంద్రం ప్రకటించడం గమనార్హం. ఇక సహారా డబ్బుల్ని ఎలా క్లయిమ్ చేసుకోవాలంటే? ♦ ముందుగా mocrefund.crcs.gov.in. పోర్టల్‌కి వెళ్లాలి ♦ ఆధార్ కార్డ్ నెంబర్ సాయంతో డిపాజిటర్ లాగిన్ అవ్వాలి ♦ అనంతరం మీ వద్ద ఉన్న సహారా బాండ్ పేపర్లని, ఇతర పత్రాలని అప్లోడ్ చేయాలి. ♦ అప్లోడ్ చేసిన పత్రాలని 30 రోజుల్లోగా ధృవీకరిస్తారు. ♦ అనంతరం 15 రోజుల్లో అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటారు ♦ తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా వెరిఫికేషన్ పూర్తయినట్లు ఇన్వెస్టర్లకు సమాచారం అందిస్తారు. ♦ ఎస్ఎంఎస్ వచ్చిందంటే మీ ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదం పొందినదని అర్థం. ♦ తర్వాత పెట్టుబడి మొత్తం ఖాతాకు బదిలీ అవుతుంది. ♦ క్లెయిమ్ని ధృవీకరించిన తేదీ నుంచి 45 రోజుల తర్వాత మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. -
రేపు ప్రారంభంకానున్న శ్రీ టెక్‌టెక్స్ ఐపీవో - ధరల శ్రేణి ఇలా..
న్యూఢిల్లీ: టెక్నికల్ టెక్స్టైల్ తయారీ కంపెనీ శ్రీ టెక్‌టెక్స్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 26న ప్రారంభంకానున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 54–61గా నిర్ణయించింది. 28న ముగియనున్న ఇష్యూలో భాగంగా 74 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 45 కోట్లకుపైగా సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు(25న) షేర్లను కేటాయించనుంది. చిన్నతరహా కంపెనీల కోసం ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసిన ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ షేర్లు లిస్ట్‌కానున్నాయి. ఇష్యూ నిధులను ఫ్యాక్టరీ షెడ్ నిర్మాణం, సోలార్ ప్లాంటు ఏర్పాటు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా పీపీ నాన్ఒవెన్ ఫ్యాబ్రిక్‌ను వివిధ పరిమాణాల్లో తయారు చేస్తోంది. -
సహారా డిపాజిటర్లకు గుడ్‌న్యూస్: చెల్లింపుల ప్రక్రియ షురూ.. ఫస్ట్ వారికే..
న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌నకు చెందిన నాలుగు కోఆపరేటివ్ సొసైటీల్లో ఇరుక్కుపోయిన దాదాపు రూ. 5,000 కోట్ల మొత్తాన్ని తిరిగి డిపాజిటర్లకు అందజేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. దీనితో చాలా కాలంగా తమ కష్టార్జితం కోసం ఎదురుచూస్తున్న కోట్ల మంది చిన్న ఇన్వెస్టర్లకు ఊరట లభించనుంది. ఇందుకోసం సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్‌ను కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. దీనితో ఒక కోటి మంది డిపాజిటర్లకు ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. ముందుగా రూ. 10,000 వరకు ఇన్వెస్ట్ చేసిన కోటి మంది ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరపనున్నట్లు మంత్రి చెప్పారు. నాలుగు సొసైటీల (సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, సహారాయాన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ, హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ) మొత్తం డేటా సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్‌లో ఉందని, దాని ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం ఇన్వెస్టరు ఆధార్ కార్డు వారి మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉండాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లోగా వారికి రావాల్సిన సొమ్ము వారి ఖాతాల్లో జమవుతుందని చెప్పారు. రూ. 5,000 కోట్ల చెల్లింపులు పూర్తయిన తర్వాత ఇతర ఇన్వెస్టర్లకు చెందిన డబ్బును కూడా తిరిగి చెల్లించేందుకు అనుమతుల కోసం సుప్రీం కోర్టును కోరనున్నట్లు ఆయన తెలిపారు. సహారా–సెబీ రిఫండ్ ఖాతా నుంచి రూ. 5,000 కోట్ల మొత్తాన్ని సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్సీఎస్)కు బదలాయించాలంటూ గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు సహకార సంఘాలకు చెందిన 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు 9 నెలల్లోగా డిపాజిట్ మొత్తాలను వాపసు చేస్తామంటూ మార్చి 29న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్‌లో తగ్గిన ఒక్కో ఇన్వెస్టర్ సగటు పెట్టుబడి విలువ
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక్కో ఇన్వెస్టర్ సగటు పెట్టుబడి విలువ 2023 మార్చి నాటికి 3 శాతం తగ్గి రూ.68,321గా ఉంది. 2022 మార్చి నాటికి ఇది రూ.70,199గా ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు వెల్లడించాయి. అదే సమయంలో ఒక్కో ఇనిస్టిట్యూషన్ ఖాతా సగటు పెట్టుబడి రూ.10.11 కోట్లుగా ఉంది. లిక్విడ్ ఫండ్స్‌తోపాటు ఇతర డెట్ ఆధారిత పథకాల్లో సగటు పెట్టుబడి ఎక్కువగా ఉంది. డెట్ ఆధారిత పథకాల్లో సగటు టికెట్ సైజు రూ.14.53 లక్షలుగా ఉంది. అదే ఈక్విటీ పథకాల్లో సగటున ఇది రూ.1.54 లక్షలుగా ఉంది. సాధారణంగా ఈక్విటీ పెట్టుబడులు ఎక్కువ కాలం పాటు ఉంటుంటాయి. 45 శాతం ఈక్విటీ పెట్టుబడులు రెండేళ్లకు పైగా కొనసాగుతున్నవి. రిటైల్ ఇన్వెస్టర్లు తమ మొత్తం ఈక్విటీ పెట్టుబడుల్లో రెండేళ్లకు మించి కొనసాగిస్తున్నవి 56.5 శాతంగా ఉన్నాయి. మరోవైపు గత కొన్నేళ్లుగా ఇన్వెస్టర్ పెట్టుబడి ఖాతాలు (ఫోలియోలు) క్రమంగా పెరుగుతూనే వస్తుండడం గమనించొచ్చు. ఇన్వెస్టర్లలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల పట్ల పెరుగుతున్న అవగాహన, డిజిటల్ చెల్లింపుల సౌలభ్యం ఇందుకు సానుకూలతలుగా చెప్పుకోవచ్చు. మొత్తం 42 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పరిధిలో ఇన్వెస్టర్ ఫోలియోలు గత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 1.62 కోట్లు కొత్తగా ప్రారంభమయ్యాయి. 2014 డిసెంబర్ నాటికి 4.03 కోట్లుగా ఉన్న ఫోలియోలు 2023 మార్చి నాటికి 14.57 కోట్లకు చేరాయి. ఒక ఇన్వెస్టర్‌కు ఒక పథకంలో పెట్టుబడికి గుర్తుగా కేటాయించే నంబర్‌ను ఫోలియోగా చెబుతారు. గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు 7 శాతం పెరిగి రూ.40.05 లక్షల కోట్లకు చేరాయి. -
దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి - ఆర్థిక మంత్రి పిలుపు
ఇంచెయాన్ (దక్షిణ కొరియా): భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ అభివృద్దిలో భాగం కావాలని ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. భారత్ శతాబ్ధి ఉత్సవాల నాటికి ఆధునిక దేశంగా అవతరించాలన్న లక్ష్యంతో పనిచేస్తోందని చెబుతూ.. ఈ 25 ఏళ్ల అమృత కాలం పెట్టుబడులకు ఎన్నో అవకాశాలను తీసుకొస్తుందన్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ సమీప ఇంచెయాన్‌లో 56వ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వార్షిక సమావేశానికి మంత్రి హాజరయ్యారు. నూతన భారత్ ఆవిష్కారానికి, మెరుగైన పాలన కోసం నరేంద్ర మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు, సంస్కరణలను మంత్రి సీతారామన్ వెల్లడించారు. ఇన్వెస్టర్లతో రౌండ్‌టేబుల్ సమావేశంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఇటీవల భారత్ చేపట్టిన సంస్కరణలకు తోడు, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైపులైన్ (ఎన్ఐపీ), నేషనల్ మోనిటైజేషన్ పైపులైన్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ తదితర చర్యలను వివరించారు. కరోనా కారణంగా ఏర్పడిన సవాళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి, ఆశాకిరణంగా నిలిచినట్టు చెప్పారు. భారత పట్ల నమ్మకాన్ని కొనసాగిస్తున్న కొరియా ఇన్వెస్టర్లను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ విడిభాగాలకు సంబంధించిన పీఎల్ఐ పథకంలో పాల్గొనడం పట్ల కొరియా ఇన్వెస్టర్లు ఆసక్తి, అంకితభావం చూపించడాన్ని ప్రస్తావించారు. ఈ సమావేశాల్లో భాగంగా మంత్రి సీతారామన్, ఫిజి దేశ ఉప ప్రధాని బిమన్ చంద్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. ఏడీబీకి ప్రోత్సాహం సభ్య దేశాలకు రుణ పంపిణీలో సరికొత్త, రిస్క్ ఆధారిత విధానాలను అనుసరించే విషయమై ఏడీబీకి భారత్ ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి సీతారామన్ తెలిపారు. ఏడీబీ గవర్నర్ల ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. భారత్ తరఫున గవర్నర్‌గా మంత్రి సీతారామన్ ఏడీబీ సమావేశాల్లో పాల్గొన్నారు. ప్లీనరీలో చర్చల ద్వారా చాలా అంశాలకు పరిష్కారం లభిస్తుందని, ఏడీబీకి మార్గదర్శకం లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. -
లేఆఫ్స్: గూగుల్‌కు టాప్ ఇన్వెస్టర్ షాకింగ్ సలహా వైరల్
సాక్షి,ముంబై: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన అనంతరం మరో సంచలన వార్త వైరల్ అవుతోంది. మరో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించండి అంటూ ప్రముఖ ఇన్వెస్టర్ హెడ్జ్ ఫండ్ బిలియనీర్ క్రిస్టోఫర్ హోహ్న్ గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్పిచాయ్కి రాసిన లేఖ హల్ చల్ చేస్తోంది. 12వేల మంది ఉద్యోగులను తొలగింపు విషయంలో గూగుల్ నిర్ణయం సరైనదేననీ, అయితే ఇంకా తొలగించాల్సి ఉందని ఆయన కోరినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్కువ జీతాలు తీసుకుంటున్న మరో వెయ్యిమందిని తొలగించాల్సి ఉందని సలహా ఇచ్చారట. అంతిమంగా నిర్వహణ ముందుకు సాగాలని తన లేఖలో పేర్కొన్నారు. ఈమేరకు గూగుల్-మాతృ సంస్థ ఆల్ఫాబెట్లో 6 బిలియన్ల డాలర్ల వాటా ఉన్న ది చిల్డ్రన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ (టిసిఐ) వ్యవస్థాపకుడు లేఖను ఉటంకిస్తూ ది టెలిగ్రాఫ్ నివేదించింది. గత సంవత్సరం, (2022) తనకు తానుగా రోజుకు 1.5 మిలియన్ యూరోలు తీసుకున్న క్రిస్ గత ఐదేళ్లలో ఆల్ఫాబెట్ తన హెడ్‌కౌంట్‌ని రెండింతలు చేసిందంటూ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో 2021 నాటి ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా దాదాపు 20శాతం తగ్గింపు అవసరమని, ఆ దిశగా గూగుల్ మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే అధిక వేతన ఉద్యోగులపై దృష్టిపెట్టాలని, స్టాక్ ఆధారిత చెల్లింపులను గూగుల్ మోడరేట్ చేయాలని ఆయన హెచ్చరించారు.అంతేకాదు సమయం వచ్చినపుడు ఈ విషయాలపై సుందర్ పిచాయ్‌తో చర్చించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాగా జనవరి 21న, గూగుల్ ఉద్యోగుల తొలగింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
స్టాక్ మార్కెట్లో లాభాల పంట,బుల్ రంకెలేసింది..రికార్డుల మోత మోగించింది
ముంబై: ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్ల పెంపు వేగాన్ని తగ్గిస్తుందనే ఆశలతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఎనిమిదో రోజూ కొనసాగింది. సానుకూల పీఎంఐ గణాంకాలు సెంటిమెంట్‌ను బలపరిచింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. మిడ్ సెషన్ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో ర్యాలీ వేగం తగ్గింది. ముఖ్యంగా ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్లు రాణించడంతో గురువారం సెన్సెక్స్ 185 పాయింట్లు లాభపడి 63,284 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 483 పాయింట్లు ఎగిసి 63,583 వద్ద తాజా జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 18,813 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 130 పాయింట్లు దూసుకెళ్లి 18,888 వద్ద కొత్త గరిష్టాన్ని నెలకొల్పింది. ఇంధన, ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ అరశాతం ర్యాలీతో 1.36 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.289.86 కోట్లకు చేరింది. డిసెంబర్ తొలి ట్రేడింగ్ సెషన్లోనూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.1566 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 2665 కోట్ల షేర్లను కొన్నారు. డిసెంబర్లో వడ్డీ రేట్ల పెంపుపై నెమ్మదిస్తామని ఫెడ్ రిజర్వ్ ప్రకటన తర్వాత ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ ఎనిమిది పైసలు బలపడి 81.22 స్థాయి వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ►సిమెంట్ షేర్లలో గురువారం ర్యాలీ చోటు చేసుకుంది. ఇన్పుట్ వ్యయాలు తగ్గడంతో పాటు వర్షాకాలం ముగియడంతో డిమాండ్ పుంజుకొని కంపెనీల మార్జిన్లు పెరగవచ్చనే అంచనాలతో ఈ రంగ షేర్లకు డిమాండ్ లభించింది. దాల్మియా భారత్, బిర్లా కార్పొరేషన్, జేకే సిమెంట్, ఇండియా సిమెంట్, జేకే లక్ష్మీ సిమెంట్, అంబుజా సిమెంట్స్, రామ్‌కో సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 1–5 శాతం ర్యాలీ చేశాయి. ► జొమాటో షేరు రెండున్నర శాతం పెరిగి రూ.67 వద్ద స్థిరపడింది. ఆలీబాబాకు చెందిన ఆలీపే సింగపూర్ హోల్డింగ్ సంస్థ బుధవారం జొమాటోకు చెందిన 3.07 శాతం వాటా విక్రయించింది. దీంతో గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు ఆరుశాతం ర్యాలీ చేసింది. -
ఈ ప్రకటనలు నమ్మొద్దు.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఎన్ఎస్ఈ హెచ్చరిక
ముంబై: ఇంటర్నెట్ ఆధారిత ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించే ఎయిమర్స్ ట్రేడర్‌లో ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దని నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ(ఎన్ఎస్ఈ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ‘‘సురజ్ మౌర్య అనే వ్యక్తి ఎయిమర్స్ ట్రేడర్ పేరుతో టెలిగ్రామ్, వాట్సప్, ట్విట్టర్ సామాజిక మాధ్యమాల ద్వారా కచ్చితమైన రాబడులను అందిస్తామంటూ మోసపూరిత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నారు. ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెట్టి మోసవద్దు. దీనికి ఎక్ఛేంజీ నుంచి ఎలాంటి గుర్తింపు లేదు’’ అని ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే తరహా తప్పుడు ఆఫర్లను ప్రకటించడంతో ఈ ఆగస్టులో రియల్ ట్రేడర్, గ్రో స్టాక్, షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్‌లను సైతం స్టాక్ ఎక్ఛేంజీ నిషేధించింది. -
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని, తగినంత శ్రద్ధ చూపించాలని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ సూచించారు. మార్కెట్ వదంతుల ఆధారంగా పెట్టుబడులు పెట్టొద్దని హితవు పలికారు. సెబీ వద్ద నమోదైన మధ్యవర్తుల ద్వారానే వ్యవహారాలు నిర్వహించాలని కోరారు. వరల్డ్ ఇన్వెస్టర్స్ వీక్ (10 నుంచి 16వ తేదీ వరకు) సందర్భంగా సెబీ వెబ్సైట్లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇన్వెస్టర్లు తమకుంటూ ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుని, తమ ఆర్థిక లక్ష్యాలకు సరిపోలే పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా పొదుపు చేయడం, భిన్నమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రాథమిక సూత్రాల్లో భాగమన్నారు. మన మార్కెట్ల విస్తృతి ఎంతో పెరిగిందని గుర్తు చేస్తూ.. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లలో పెద్ద ఎత్తున అవగాహన, రక్షణ గురించి తెలియజేయడం తప్పనిసరి అని బుచ్ పేర్కొన్నారు. పెట్టుబడుల ప్రక్రియలను సులభతరం చేశామని, అన్ని రకాల విషయాలను ఎప్పటికప్పుడు మార్కెట్లకు వెల్లడించేలా చేశామని చెప్పారు. -
అల్విదా బిగ్బుల్ ఒక శకం ముగిసింది: పలువురి భావోద్వేగం
సాక్షి, ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, బిలియనీర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా(62) ఆకస్మిక మరణం దిగ్భ్రాంతి గురిచేసింది. నేడు(ఆగస్టు 14న) ముంబైలో గుండెపోటుతో కన్నుమూయడంపై దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. ఇంకా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే బిలియనీర్ హఠాన్మరణంపై ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి : రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా? ఒక శకం ముగిసిందంటూ పలువురు పారిశశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, ఆయన అభిమానులు నివాళులర్పించారు. ముఖ్యంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ ఉదయ్ కోటక్, బిలియనీర్ గౌతమ్ అదానీ, హీలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు అండ్ ఫండ్ మేనేజర్ సమీర్ అరోరా తదితరులు ట్విటర్ ద్వారా సంతాపం వెలిబుచ్చారు. ఝున్‌ఝున్‌వాలా సలహాలు, సూచనలతో మార్కెట్లో విజయం సాధించిన పలువురు అభిమానులు ఆయన ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన జ్ఞాపకాలను తలుచుకుని కంట తడి పెట్టు కుంటున్నారు. పెట్టుబడిదారులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తన గుమిగూడడంతో ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మార్కెట్లో ఆయన లేని లోటు పూడ్చలేనిదని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఫోర్బ్స్ ప్రకారం భారతదేశానికి చెందిన వారెన్ బఫెట్ అని పిలుచుకునే నికర విలువ 5.8 బిలియన్ డాలర్లు (ఆగస్టు 2022 నాటికి) ఇండియాలో 36వ సంపన్నుడు. ప్రపంచంలోని 438వ బిలియనీర్‌గా ఉన్నారు. Rakesh Jhunjhunwala was indomitable. Full of life, witty and insightful, he leaves behind an indelible contribution to the financial world. He was also very passionate about India’s progress. His passing away is saddening. My condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/DR2uIiiUb7 — Narendra Modi (@narendramodi) August 14, 2022 Shri Rakesh Jhunjhunwala is no more. Investor, bold risk taker, masterly understanding of the stock market, clear in communication- a leader in his own right. Fondly remember several conversations we’ve had. Had strong belief in India’s strength and capabilities. Condolences — Nirmala Sitharaman (@nsitharaman) August 14, 2022 Shri Rakesh Jhunjhunwala is no more. Investor, bold risk taker, masterly understanding of the stock market, clear in communication- a leader in his own right. Fondly remember several conversations we’ve had. Had strong belief in India’s strength and capabilities. Condolences — Nirmala Sitharaman (@nsitharaman) August 14, 2022 Very saddened to know about the passing of the veteran investor Shree Rakesh JhunJhunwala. India has lost a gem, who made a mark not just on the stock market but on the minds of almost every investor in india.#RakeshJhunjhunwala pic.twitter.com/QX4uvBx7hA — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) August 14, 2022 -
స్టాక్ మార్కెట్: ఆరో రోజూ అదే సీన్.. ఆఖరి గంట ఊపిరిపోసింది
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఊగిసలాటకు లోనైన సూచీలు.., ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఆరో రోజూ లాభాలను ఆర్జించాయి. ఐటీ షేర్లతో పాటు అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు రాణించాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 214 పాయింట్లు పెరిగి 58,351 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 43 పాయింట్లు బలపడి 17,388 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 57,789–58,416 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 182 పాయింట్ల రేంజ్లో కదలాడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.765 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.518 కోట్ల షేర్లను అమ్మేశారు. అమెరికా, చైనా మధ్య తైవాన్ వివాదంతో ప్రపంచ మార్కెట్లు లాభ, నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆరు రోజుల్లో రూ.13.53 లక్షల కోట్లు గడచిన ఆరు రోజుల్లో సెన్సెక్స్ సూచీ ఐదున్నర శాతానికి(3,082 పాయింట్లు)పైగా ర్యాలీ చేయడంతో బీఎస్ఈలో రూ.13.53 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.271 లక్షల కోట్లకు చేరింది. ఇదే ఆరు రోజుల్లో నిఫ్టీ 904 పాయింట్లు పెరిగింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► 5జీ ఉత్పత్తుల ఆవిష్కరణకు జియోతో జతకట్టడంతో సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రొవైడర్ సుబెక్స్ షేరు 20% పెరిగి రూ.33.30 అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ► మధ్య ప్రాచ్యానికి చెందిన ఓ ప్రముఖ ఎయిర్వేస్ సంస్థకు 24% వాటాను అమ్మేందుకు చర్చలు జరుపుతుందనే వార్తలతో స్పైస్‌జెట్ జెట్ షేరు 13 శాతం లాభపడి రూ.50.05 వద్ద స్థిరపడింది. ► రైడ్ షేరింగ్ దిగ్గజం ఉబెర్.., జొమాటోలో తనకున్న మొత్తం వాటాను విక్రయించడంతో జొమాటో షేరు తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ట్రేడింగ్‌లో 9.62% పతనమై రూ.50.25కి దిగివచ్చింది. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో 0.50% స్వల్ప నష్టంతో రూ.55.40 వద్ద నిలిచింది. చదవండి: 'ప్రమాదం అంటే ఓ వ్యక్తి రోడ్డున పడటం కాదు..ఒక కుటుంబం రోడ్డున పడటం' -
Elon Musk:'రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు'!
ఊహించినట్లే జరిగింది. వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మెర్జర్ అగ్రిమెంట్ నిబంధల్ని ఉల్లంఘించిందంటూ 44 బిలియన్ డాలర్ల ట్విట్టర్ కొనుగోలు ఢీల్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఎలన్ మస్క్ నిర్ణయంపై ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసేలా చట్టపరమైన చర్యలకు దిగుతామని అన్నారు. కానీ మస్క్ ఏం చేశాడో తెలుసా? 'రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు'అన్న చందంగా ఎలన్ మస్క్ వ్యవహరిస్తున్నారు. ట్విట్టర్ డీల్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు మస్క్ ప్రకటనతో టెస్లాలో పెట్టుబడిన మదుపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ మస్క్ మాత్రం యథావిధిగా తనకు సంబంధం లేనివాటిపై స్పందిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రాంటర్ చూస్తూ ప్రసంగించే అలవాటుంది. ఎప్పటిలాగే 'రీ ప్రొడక్టివ్ రైట్స్' గురించి బైడెన్ ప్రాంప్టర్ చూస్తూ మాట్లాడుతున్నారు.ప్రసంగంతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రాంప్టర్‌లో ఉన్నట్లుగా 'రిపిటీ ద లైన్' అనే పదాన్ని పదే పదే పలుకుతూ తడబడ్డారు. ప్రసంగం మధ్యలోనే ఆపేశారు. బైడెన్ ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ మస్క్ ట్విట్ చేశారు. Whoever controls the teleprompter is the real President! pic.twitter.com/1rcqmwLe9S — Elon Musk (@elonmusk) July 8, 2022 మస్క్ ఇదేం పద్దతయ్యా 2004లో సెటైరికల్ కామెడీ సినిమా 'యాంకర్ మ్యాన్' తెరకెక్కింది. ఆ సినిమాలోని 'రాన్ బుర్గుండి' యాంకర్ క్యారక్టర్ సీన్లను ట్వీట్ చేస్తూ.. ఎవరు టెలిప్రాంప్టర్ను కంట్రోల్ చేస్తారో వాళ్లే నిజమైన ప్రెసిడెంట్లు అని ట్విట్లో పేర్కొన్నారు. కానీ మస్క్ ట్విట్టర్ డీల్ క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ తరహా ట్విట్లు చేయడంపై మదుపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మస్క్ ఇదేం పద్దతయ్యా. 'రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు' తాము నష్టపోతుంటే ఈ తరహాలో ప్రవర్తించడం సరికాదంటున్నారు. వాళ్ల ఆందోనకు అర్ధం ఉంది! అదే సమయంలో మదుపర్ల ఆందోళనకు అర్ధం ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎలన్ మస్క్ ట్విట్టర్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మదుపర్లు టెస్లాపై చేసిన పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవడంతో భారీగా నష్టపోయారు. టెస్లా 126 బిలయన్ డాలర్ల సంపద ఆవిరైంది. కానీ ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ ఢీల్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు మస్క్ ప్రకటనతో వారికి నష్టం ఏ తరహాలో ఉంటుందోనని మదనపడుతున్నారు. -
పిల్లల ఎడ్యుకేషన్ కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా!
నాకు పదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనువైన వేదికలు ఏవి? – వెంకట్రావ్ పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అని చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా అడిగే ప్రశ్న. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, పదేళ్ల వరకు కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. అందులోనూ ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను డైవర్సిఫై చేస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీలు సహజంగానే అస్థిరతంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరి ష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్‌్కను తగ్గిస్తుంది. మూడేళ్ల కాలంలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది తగిన విధంగా ఉంటుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. డివిడెండ్ ప్లాన్ల పనితీరును, అవి పంచే డివిడెండ్ ఆధారంగా తెలుసుకోవచ్చు. మరి గ్రోత్ ప్లాన్ల పనితీరు ఎలా తెలుసుకోవాలి? – పదమ్ దేవ్ ముందుగా ఒక పథకం డివిడెండ్ ఇస్తుంది కదా అని మంచి పనితీరు చూపిస్తుందని అనుకోవడం పొరపాటు. డివిడెండ్ ఇచ్చినా కానీ, చెత్త పనితీరు చూపించే అవకాశం లేకపోలేదు. అందుకని ఓ పథకం పనితీరును కచ్చితంగా అంచనా వేయాలంటే అందుకు రాబడులే ప్రామాణికం. వ్యాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ పోర్టల్‌లో పథకాల పనితీరు గణాంకాలను పరిశీలించుకోవచ్చు. పోటీ పథకాలతో పోలిస్తే మీరు శోధించే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారాన్ని పొందొచ్చు. లార్జ్‌క్యాప్ పథకం రాబడులను పరిశీలిస్తుంటే దానికి ప్రామాణిక సూచీ నిఫ్టీ లేదా సెన్సెక్స్ అవుతుంది. సూచీలతో పోలిస్తే లార్జ్‌క్యాప్ పథకం రాబడుల్లో ముందుందా? లేక వెనుకబడిందా తెలుసుకోవచ్చు. ట్రెయిలింగ్ రాబడుల కంటే రోలింగ్ రాబడులు మరింత కచి్చతంగా ఉంటాయి. ఏడాదికాల రోలింగ్ రాబడులు అంటే.. ఏడాది కాల రాబడులను ప్రతీ రోజుకు లెక్కించి సగటు రాబడిని చెప్పడం. గత ఏడాది కాలంలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారన్న దానితో సంబంధం లేకుండా రాబడుల రేటును తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ట్రెయిలింగ్ రాబడులు అంటే సరిగ్గా ఏడాది క్రితం ఇన్వెస్ట్ చేస్తే వచి్చన రాబడి. రోలింగ్ అంటే.. ఏడాది కాల రాబడులను ప్రతి రోజుకు అన్వయించి చెప్పడం. -
మా 25వేల కోట్లను ఇన్వెస్టర్లకు ఇవ్వండి, లేదంటే తిరిగి మాకే ఇచ్చేయండి!
లక్నో: మార్కెట్ రెగ్యులేటర్ సెబీని సహారా ఇండియా పరివార్ ఒక ప్రకటనలో ఘాటుగా విమర్శించింది. సహారాకు చెందిన రూ.25,000 కోట్లు ప్రస్తుతం సెబీ వద్ద ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అందులో గడచిన తొమ్మిది సంవత్సరాల్లో కేవలం రూ.125 కోట్లనే ఇన్వెస్టర్లకు చెల్లిందని పేర్కొంది. మిగిలిన డబ్బును ఎందుకు చెల్లించలేకపోతోందని ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక బాధిత కంపెనీగా సహారా మిగులుతోందని విమర్శించింది. అక్రమంగా వసూలు చేశారంటూ తమ వద్ద నుంచి డిపాజిట్ చేయించుకున్న రూ.25,000 కోట్లను ఇన్వెస్టర్లు అందరికీ చెల్లింపులు చేయాలని లేదా ఆ మొత్తాలను తమకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. తద్వారా తామే తమ డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లించుకుంటామని స్పష్టం చేసింది. సెబీ వద్ద సహారా డబ్బు డిపాజిట్‌కు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టు అసలు లక్ష్యం నెరవేరడం లేదని పేర్కొంది. -
బుల్ పరుగులు..చెలరేగిన సెన్సెక్స్, రూ.4.11 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద!
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్ రెండు రోజుల వరుస నష్టాలను బ్రేక్ చేస్తూ భారీ లాభాలను మూటగట్టుకుంది. ఇటీవల పతనంలో భాగంగా కనిష్ట స్థాయిలకు దిగివచ్చిన ఇంధన, ఆటో, వినిమయ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. వేడిక్కిన చమురు ధరలు చల్లబడటం కలిసొచ్చింది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 777 పాయింట్లు పెరిగి 57,357 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 247 పాయింట్లు బలపడి 17,201 వద్ద నిలిచింది. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పేయింట్స్, మారుతీ, టీసీఎస్ షేర్లు మాత్రమే నష్టపోయాయి. కాగా, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ నాలుగు పైసలు స్వల్పంగా బలపడి 76.60 స్థాయి వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,174 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీ ఇన్వెస్టర్లు రూ. 1,644 కోట్ల షేర్లను కొన్నారు. కార్పొరేట్ మార్చి క్వార్టర్ గణాంకాలు మెప్పించడంతో పాటు క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో లాభాల బాటపట్టాయి. ఒక దశలో సెన్సెక్స్ 862 పాయింట్లు ఎగసి 57,442 వద్ద, నిఫ్టీ 270 పాయింట్లు బలపడి 17,224 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిలకు అందుకున్నాయి. కాగా, మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లలో దాదాపు మిశ్రమ స్పందన కనిపించింది. రిలయన్స్ దూకుడు అబుదాబీ కెమికల్స్ డెరివేటివ్స్ కంపెనీ ఆర్ఎస్సీ (త’జీజ్)తో రెండు బిలియన్ డాలర్లు వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకుందనే వార్తలు రిలయన్స్ షేర్ల దూకుడు కారణమైంది. బీఎస్ఈలో ఉదయం ఈ షేరు అరశాతం లాభంతో రూ.2,710 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో నాలుగు శాతం ర్యాలీ చేసి రూ.2,796 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివరికి మూడు శాతం లాభంతో రూ.2,776 వద్ద స్థిరపడింది. ఎక్సే్చంజీలో మొత్తం 56 లక్షల చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.18.77 లక్షల కోట్లుగా నమోదైంది. సూచీల లాభాల్లో సింహభాగం రిలయన్స్‌దే. కాగా, రిలయన్స్ రిటైల్‌తో ఫ్యూచర్ గ్రూప్ రూ.24,713 కోట్ల ఒప్పందం రద్దుకావడంతో ఫ్యూచర్స్ గ్రూప్ సంస్థల షేర్లు రెండోరోజూ నష్టపోయాయి. సూచీల ఒకటిన్నర శాతం బౌన్స్‌బ్యాక్‌తో స్టాక్ మార్కెట్లో రూ.4.11 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.269 లక్షల కోట్లకు చేరింది. -
క్రిప్టో ఇన్వెస్టర్లకు కేంద్రం డెడ్‌లైన్..! ఉల్లంఘిస్తే భారీ జరిమానా..!
పార్లమెంట్లో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. బిల్లు వస్తోన్న నేపథ్యంలో...భారత్‌లోని క్రిప్టోకరెన్సీ హోల్డర్స్ ఆస్తులను ప్రకటించడానికి, రాబోయే కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి వారికి గడువు ఇవ్వాలనే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు బ్లూమ్‌బర్గ్ ఒక నివేదికలో పేర్కొంది. ఆస్తులుగా పరిగణించే అవకాశం..! ముఖ్యంగా క్రిప్టోకరెన్సీలను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీలను ఫైనాన్షియల్ ఆస్తులుగానే పరిగణించే అవకాశం ఉంది. ఇటీవల సర్క్యులేట్ చేయబడిన క్యాబినెట్ నోట్ ప్రకారం...క్రిప్టోకరెన్సీలకు బదులుగా బిల్లులో 'క్రిప్టో ఆస్తులు' అనే పదాన్ని చేర్చనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ప్రారంభంలో ఆర్బీఐ రిలీజ్ చేస్తోన్న డిజిటల్ కరెన్సీలకు, క్రిప్టో కరెన్సీలకు స్పష్టమైన వ్యత్యాసం ఉండనుంది. ఉల్లంఘిస్తే రూ. 20 కోట్ల జరిమానా..! క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం తెస్తోన్న బిల్లును క్రిప్టో ఇన్వెస్టర్లు ఉల్లంఘిస్తే ఏకంగా రూ. 20 కోట్ల జరిమానా లేదా 1.5 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అంతేకాకుండా చిన్న పెట్టుబడిదారులను రక్షించడానికి క్రిప్టో ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి కనీస థ్రెషోల్డ్ లేదా పరిమితిని కేంద్రం సెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వర్చువల్ కరెన్సీల ద్వారా జరిపే లావాదేవీలపై పన్నులను విధించే అవకాశం ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. భారత్‌లో 641 శాతం మేర వృద్ధి..! చైనాలిసిస్ నివేదిక ప్రకారం...2021లో భారత్‌లో క్రిప్టో ఇన్వెస్టర్లు ఏకంగా 641 శాతం మేర పెరిగారని వెల్లడించింది. అంతేకాకుండా 2021 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం 154 దేశాలలో క్రిప్టోకరెన్సీ యజమానుల సంఖ్య పరంగా రెండో స్థానంలో... 'క్రిప్టో-అవగాహన'లో ఏడో దేశంగా భారత్ నిలిచింది. చదవండి: క్రిప్టోకరెన్సీ బిల్లు..! ఆర్థిక శాఖ కీలక వ్యాఖ్యలు..! -
లాభాలంటే ఇష్టం.. నష్టాలంటే కష్టం
ఆర్థిక శాస్త్రానికి సంబంధించి రెండు విరుద్ధమైన సూత్రాలున్నాయి. ఒకటి సహేతుక నడవడిక. అంటే తమకు నష్టాన్ని కలిగించే లేదా తటస్థ నిర్ణయాలు కాకుండా.. ప్రయోజనం కలిగించే నిర్ణయాలను తీసుకోవడం. మరింత వివరంగా చూస్తే.. ఈ తరహా వ్యక్తులు తమపై, తమ మనసుపై నియంత్రణ కలిగి ఉంటారు. భావోద్వేగాలతో ఊగిపోరు. బిహేవియరల్ ఫైనాన్స్ మాత్రం.. ప్రజలు భావోద్వేగాలతో ఉంటారని.. సులభంగా దారితప్పడమే కాకుండా.. హేతుబద్ధంగా వ్యవహరించలేరని చెబుతోంది. సహేతుకంగా వ్యవహరించడానికి బదులు.. తరచుగా ఆర్థిక నిర్ణయాల విషయంలో తమ భావోద్వేగాలు, ఆలోచనలకు తగ్గట్టు పక్షపాతంగా వ్యవహరిస్తారని అంటోంది. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లను పరిశీలిస్తే ఈ రెండింటిలో బిహేవియరల్ ఆర్థిక శాస్త్రం చెప్పిందే నిజమని అనిపిస్తుంటుంది. పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లపై ప్రభావం చూపించే అంశాలపై అవగాహన కలి్పంచే కథనమే ఇది... 1970, 1980ల్లో విడుదలైన పలు ఆర్థిక అధ్యయన పత్రాలు అన్నీ కూడా.. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు పెట్టుబడుల విషయాల్లో సహేతుకంగానే వ్యవహరిస్తారని చెప్పగా.. దీనికి విరుద్ధంగా అదే కాలంలో ప్రముఖ సైకాలజిస్టులు డానియల్ కహెన్‌మాన్, అమోస్ ట్వెర్స్కీ మాత్రం.. ఆర్థికవేత్తలు చెప్పినట్టు సహేతుక నిర్ణయాలను కొద్ది మందే తీసుకుంటున్నట్టు గుర్తించారు. ప్రజలు నిజంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై వీరు అధ్యయనం చేశారు. 80వ దశకం చివరి నాటికి ఆర్థికవేత్తల ఆలోచనా ధోరణిని సైకాలజిస్టులు ప్రభావితం చేయడం మొదలైంది. ఇది బిహేవియరల్ ఆర్థిక శాస్త్రానికి దారితీసిందని చెబుతారు. 2002లో డానియల్ కహెన్‌మాన్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఇన్వెస్టర్లు ఆర్థిక వేత్తలు చెప్పినట్టు కాకుండా.. సైకాలజిస్టులు అంచనా వేసినట్టుగానే ప్రవర్తిస్తుంటారని కహెన్‌మాన్ శిష్యుడైన ఓడియన్ సైతం అంటారు. ‘‘అతి విశ్వాసం, పరిమిత శ్రద్ధ, కొత్తదనం కోసం పాకులాడడం, నష్టపోకూడదన్న తత్వం, అత్యుత్సాహం అన్నవి ఇన్వెస్టర్ల ప్రవర్తనను, ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తున్నాయని నేను గుర్తించాను’’ అని ఓడియన్ పేర్కొన్నారు. ‘‘పెట్టుబడులు అంటేనే క్లిష్టమైన అంశం. మనుషులు ఈ విషయంలో అసంపూర్ణంగా వ్యవహరిస్తుంటారు. నిర్ణయాల్లో తప్పులకు అవకాశం ఉంటుంది’’అని బిహేవియరల్ ఫైనాన్స్‌లో విస్తృత అధ్యయనం చేసిన కెనడియన్ ఆర్థికవేత్త అగ్రీడ్ హెర్‡్ష షెఫ్రిన్ (శాంతా క్లారా యూనివర్సిటీ) అంటారు. అటు ఆర్థికవేత్తలు, ఇటు మనస్వత్త శాస్త్రవేత్తలు ఎన్నో అధ్యయనాల ఆధారంగా అంగీకారానికి వచ్చిన విషయం.. పెట్టుబడుల విషయంలో మనుషుల మనస్తత్వం, ఆలోచనలు కీలక పాత్ర పోషిస్తాయని. సెబీ నమోదిత పెట్టుబడుల సలహాదారు చెంతిల్ అయ్యర్ (హోరస్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్) కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తారు. ‘‘క్లిష్టమైన అంశాల విషయంలో సత్వర పరిష్కారాలను ఇన్వెస్టర్లు కోరుకుంటారు. ఫలితంగా నిర్ణయాల్లో ఎన్నో తప్పులు దొర్లుతుంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల చర్యలపై మానసిక ప్రభావాన్ని.. అలాగే, తార్కిక, భావోద్వేగ, సామాజిక అంశాల ప్రభావాన్ని వివరించేదే బిహేవియరల్ ఫైనాన్స్. పెడచెవిన వాస్తవాలు ఇన్వెస్ట్మెంట్లు, లాభాల స్వీక రణపై అస్పష్ట మానసిక స్థితి తో పాటు, జరుగు తున్న వాస్తవా లను, హెచ్చరికలను పెడచెవిన బెట్టడం మెజారిటీ ఇన్వెస్టర్లకు మామూలే. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి ఇన్వెస్టర్లను అడిగినప్పుడు.. ఆ సంక్షోభం తాలూకూ సంకేతాలను ముందే గుర్తించామని చెబుతారు. కానీ, ఆయా సంక్షోభాలపై నిపుణుల హెచ్చరికలను మెజారిటీ ఇన్వెస్టర్లు పట్టించుకోకపోవడాన్ని గమనించొచ్చు. అం తెందుకు.. 2020 జనవరి నుంచే చైనాలో ఒక భయంకరమైన (కోవిడ్–19) వైరస్ వెలుగు చూసిందని.. అది ప్రపంచమంతా వ్యాప్తి చెందొచ్చన్న వార్తలను ఎవ్వరూ పట్టించుకోలేదన్నది కూడా వాస్తవం. అధిగమించడం ఎలా..? పెట్టుబడుల విషయంలో పలు ప్రతికూల, అస్పష్ట మానసిక స్థితి, వైఖరులను అధిగమించడం నిజానికి కష్టమైన పనే. ఎందుకంటే మానవులు సాధారణంగానే సంపూర్ణ కచ్చితత్వంతో ఉండరన్నది మనస్తత్వ శాస్త్రవేత్తల అభిప్రాయం. కాకపోతే ఈ తరహా అంశాల విషయంలో కాస్త మెరుగ్గా వ్యవహరించేందుకు ప్రయత్నించొచ్చని చెబుతారు. వీటిని అధిగమించేందుకు మంచి అలవాట్లను ఆచరణలో పెట్టుకోవాల్సి ఉంటుంది. విస్తృతమైన సమాచార పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటే.. ఈ తరహా ధోరణుల్లో పడిపోకుండా కాపాడే మంచి ఆయుధం అవుతుంది. ఇన్వెస్టర్ ముందుగా తన గురించి తాను పూర్తిగా తెలుసుకోవాలి. తన గురించి స్నేహితులను అడిగి తెలుసుకోవాలి. ఇతర ఇన్వెస్టర్ల ధోరణులను విశ్లేషించాలి. అప్పుడు తన ఆలోచనా తీరుపై అంచనాకు రావాలి. ఇన్వెస్టర్లు తమ గురించి మరింత అర్థం చేసుకునేందుకు ఇది సహకరిస్తుందన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో.. భావోద్వేగాలు, ముందుగా అనుకున్న మానసికమైన సిద్ధాంతాలు అడ్డుపడకుండా ఇది సాయపడుతుందని చెబుతారు. చాలా మంది ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఏమిటంటే.. వైవిధ్యమైన పెట్టుబడులను ఏర్పాటు చేసుకుని దీర్ఘకాలం పాటు కొనసాగించుకోవాలే కానీ.. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయకూడదు. తక్కువ వ్యయాలు (ఎక్స్పెన్స్ రేషియో) ఉండే æ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లు వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో ఏర్పాటుకు చక్కని మార్గం. తాజా అంశాలపై దృష్టి ‘‘మెజారిటీ ఇన్వెస్టర్లు తాజా రాబడులకు ప్రాధాన్యం ఇస్తారే కానీ, చారిత్రక రాబడులకు కాదు’’ అని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోరి్నయా ప్రొఫెసర్ టెర్నాన్స్ ఓడియన్ అంటారు. అంటే ఇటీవలి కాలంలో మంచి పనితీరు చూపించిన స్టాక్స్ లేదా ఇతర ఆస్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, ఆయా స్టాక్స్, ఆస్తుల పనితీరు అంతకుముందు కాలంలో ఎలా ఉన్నా పట్టించుకోనట్టు వ్యవహరిస్తారు. ఎక్కువ సంఖ్యలో ఇన్వెస్టర్లు రాబడుల వెంట పడినప్పుడు ఆయా స్టాక్స్ ధరలు స్వల్ప కాలంలోనే గణనీయంగా పెరిగిపోవడానికి దారితీస్తుంది. దీని కారణంగా దీర్ఘకాలంలో రాబడులు తక్కువగా ఉండచ్చు. నష్టాలకు కారణం పరిమిత దృష్టి ఉండడం వల్ల ఇన్వెస్టర్లు వారి దృష్టిలో పడిన స్టాక్స్‌ను కొనుగోలు చేస్తారు. కొనుగోళ్లకే కానీ.. విక్రయించడంపై ఈ ప్రభావం తక్కువగా ఉంటుంది. దీని ఫలితం ఎక్కువ మంది ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపే ఉంటారు. ‘‘తమను ఆకర్షించిన స్టాక్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. దీంతో ఆయా స్టాక్స్ ధరలపై ఇది తాత్కాలిక ఒత్తిళ్లకు దారితీస్తుంది. ఇలా ధరలు పెరిగిపోయిన స్టాక్స్‌ను కొనుగోలు చేయడం వల్ల.. అనంతరం వాటి ధరలు అమ్మకాల ఒత్తిడికి పడిపోవడంతో నష్టాల పాలవుతుంటారు’’అని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోరి్నయా ప్రొఫెసర్ టెర్నాన్స్ ఓడియన్ వివరించారు. ఏకపక్ష ధోరణి మనలో చాలా మంది సమాచార నిర్ధారణలో ఏకపక్షంగా వ్యవహరిస్తుంటామనేది కాదనలేని నిజం. ఈ ధోరణి కారణంగా మనకు ఫలానా కంపెనీకి సంబంధించి అప్పటికే తెలిసిన సమాచారంపైనే ఆధారపడతామే తప్పించి.. మన నమ్మకాలకు విరుద్ధంగా వచ్చే తాజా సమాచారాన్ని స్వీకరించలేని పరిస్థితుల్లో ఉంటాం. ఉదాహరణకు ఎక్స్ అనే కంపెనీకి సంబంధించిన వ్యాపారం, ఆర్థిక అంశాలు నచ్చి ఇన్వెస్ట్ చేశారనుకోండి. అదే కంపెనీ వ్యాపారానికి సంబంధించి వెలుగులోకి వచ్చే కొత్త అంశాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటాం. ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టేస్తాం. ఇది నష్టాలకు దారితీస్తుంది. నష్టపోకూడదనే తత్వం ‘రాబడి కోసం పెట్టుబడి పెడతాం.. కనుక నష్టపోయే సందర్భమే వద్దు’ అన్నది చాలా మంది ఇన్వెస్టర్లలో ఉండే ధోరణి. దీంతో రాబడులు ఎలా సంపాదించుకోవాలన్న అంశానికంటే నష్టపోకుండా ఎలా ఉండాలన్న దానిపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ ఒక తప్పుడు పెట్టుబడి నిర్ణయం తీసుకున్నాడని అనుకుంటే.. నష్టం బుక్ చేసుకోవద్దన్న ధోరణితో అందులోనే కొనసాగుతుంటారు. ఒకవేళ పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే నష్టపోయినట్టు అవుతుందని వారి ఆందోళన. నిజానికి అలాగే కొనసాగితే మిగిలినది కూడా నష్టపోవాల్సి వస్తుందేమో? అన్న ఆలోచనను వారు అంగీకరించరు. -
అదృష్టమంటే ఇదేనెమో..! 4 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు సొంతం...!
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు... ఇవ్వన్నీ సామాన్య జనాలకు అర్థం కాని ఒక క్లిష్టమైన సబ్జెక్ట్. ఒక్కసారి వీటిలో ప్రావీణ్యం సాధించాలే గానీ డబ్బులే..డబ్బులు..! స్టాక్‌మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో లాభాలు వస్తే రాత్రికి రాత్రే కుబేరుడు అవ్వచు. నష్టాలు వస్తే బికారీ కూడా అవ్వచ్చు. నాలుగు రోజుల్లో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..! గత నాలుగు రోజుల నుంచి స్టాక్‌మార్కెట్లు పరుగులు పెడుతూనే ఉంది. అక్టోబర్ 8 శుక్రవారం రోజన బీఎస్ఈ సెన్సెక్స్ 60 వేల మార్కును దాటి రికార్డులను సృష్టించింది. దీంతో గత నాలుగు రోజుల మార్కెట్ ర్యాలీలో ఈక్విటీ పెట్టుబడిదారులు సుమారు 6,09,840.74 కోట్ల లాభాలను సొంతం చేసుకున్నారు. అక్టోబర్ 12న బీఎస్ఈ సూచి నాల్గవ సెషన్లో 0.25 శాతం పెరిగి 60,284.31 పాయింట్ల వద్ద ముగిసింది. చదవండి: వారెవ్వా ! వైన్‌తో నడిచే కారు.. యువరాజు కారంటే అంతేమరి!! బీఎస్ఈ ఇండెక్స్ గత నాలుగు రోజుల్లో 1094.58 పాయింట్లు పుంజుకుంది.ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ. 6,09,840.74 కోట్లు పెరిగి రూ. 2,68,30,387.79 కోట్లకు చేరుకుంది. స్టాక్ మార్కెట్లు మంగళవారం రోజున బలహీనంగా ప్రారంభమయ్యాయి బలహీనమైన గ్లోబల్ సూచనలతో మార్కెట్లు అస్థిరతను చూశాయి. అయితే, చివరి గంటలో మార్కెట్లు భారీగా లాభాలను గడించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి టైటాన్ షేర్లు అత్యధికంగా 5 శాతం మేర లాభపడింది తరువాత బజాజ్ ఆటో, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే ఇండియా, ఐటీసీ షేర్లు లాభాలను పొందాయి. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్ షేర్లు వెనుకబడ్డాయి. చదవండి: ముంచుకొస్తున్న సౌర తుఫాన్..! అదే జరిగితే అంధకారమే...! -
అగ్రరాజ్యాలకు పోటీగా నిలుస్తోన్న భారత్...!
Over 100 Companies in India Raised Series A Funding for Startups in the Past Year: భారత్‌లో స్టార్టప్స్ సంస్కృతి గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకుంటూ సరికొత్త ఆవిష్కరణలను భారత స్టార్టప్స్ రూపోందిస్తున్నాయి. ఫండింగ్‌లో అగ్రరాజ్యాలకే పోటీగా భారత్ నిలుస్తోంది. స్టార్టప్స్ దూకుడు... భారత్‌లో పలు స్టార్టప్ కంపెనీలు దూకుడు మీదున్నాయి. భారత్‌లో ఇప్పటివరకు 100కు పైగా యూనికార్న్ స్టార్టప్‌లుగా అవతరించాయి. ఇండియన్ స్టార్టప్‌లు సిరీస్ ఏ ఫండింగ్‌లో భాగంగా పలు దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. సిరీస్ ఏ ఫండింగ్‌లో విషయంలో డేటా రిసెర్చ్ అండ్ అనాలిటిక్స్ ఫ్రీమ్ లాంచ్ గ్రావిటీ సహా వ్యవస్థాపకుడు డ్రేక్ డ్యూక్ స్టార్టప్ కంపెనీలపై పలు ఆసక్తి కర విషయాలను తెలియజేశారు. చదవండి: 75వేల కోట్ల కంపెనీ ..! అందులో అమితాబ్ బచ్చన్ ఎంట్రీ...! గత ఏడాది స్టార్టప్‌ల ‘సిరీస్ ఏ ఫండింగ్ ’ విషయంలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. తొలి రెండుస్ధానాల్లో అమెరికా, యూనైటేడ్ కింగ్డమ్ నిలిచాయి. భారత్‌కు చెందిన సుమారు 109 స్టార్టప్స్ పలు దిగ్గజం కంపెనీల నుంచి సిరీస్ ఏ ఫండింగ్‌ను పొందాయి. గత ఏడాది భారత స్టార్టప్స్ సుమారు 1820.3 మిలియన్ డాలర్ల సిరీస్ ఏ ఫండింగ్‌లో పెట్టుబడులను ఆకర్షించాయని డ్రేక్ పేర్కొన్నారు. The US is in the lead with 1.2K companies with Series A deals Here’s the breakout of the other countries: United Kingdom 🇬🇧 - 225 India 🇮🇳 - 109 Germany 🇩🇪 - 105 France 🇫🇷 - 86 Canada 🇨🇦 - 82 Israel 🇮🇱 - 72 Brazil 🇧🇷 - 42 Switzerland 🇨🇭- 39 Spain 🇪🇸 - 38 Others (283) — Drake Dukes (@DDukes12) September 30, 2021 సిరీస్ ఏ ఫండింగ్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్, మెక్కిన్సీ, గోల్డ్‌మన్ సాక్స్, ఐబీఎమ్, ఐడీఎఫ్, బీసీజీ, బెయిన్‌ఆలర్ట్స్, యూబర్, ఫేస్బుక్ కంపెనీలు నిలిచాయి. ఈ కంపెనీలు సాఫ్ట్వేర్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సాస్, ఫిన్‌టెక్, హెల్ద్‌కేర్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్, ఈ-కామర్స్ రంగాలోని స్టార్టప్‌లకు భారీ పెట్టుబడులను అందిస్తున్నాయి. Series A founders hold prior experiences from these companies: 1. @Google 2. @Microsoft 3. @McKinsey 4. @GoldmanSachs 5. @IBM 6. @IDF 7. @BCG 8. @BainAlerts 9. @Uber 10. @Facebook Other Notables:@salesforce (18th), @Apple (20th), @amazon (28th) — Drake Dukes (@DDukes12) September 30, 2021 చదవండి: ఆ వెబ్‌సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త తలనొప్పి..! -
ఇప్పుడు ఫేవరెట్ టెస్లా కాదు..! ఇండియన్ కంపెనీ కోసం క్యూ!
ఇన్ఫోసిస్, విప్రో, డబ్ల్యుఎన్ఎస్, డాక్టర్ రెడ్డిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి కంపెనీల తరువాత నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో మరో భారతీయ కంపెనీ ఫ్రెష్‌వర్క్స్ లిస్టింగ్ చేయబడిన విషయం తెలిసిందే. ఫ్రెష్‌వర్క్ లిస్టింగ్ ఐనా ఒక్కరోజులోనే కంపెనీ షేర్లు ఏకంగా 32 శాతం మేర ఎగబాకాయి. కంపెనీ మార్కెట్ విలువ సుమారు 13 బిలియన్ డాలర్లకు చేరింది. అంతేకాకుండా ఒక్కరోజులోనే కంపెనీకి చెందిన 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులైనారని ఫ్రెష్వర్స్క్ వ్యవస్థాపకుడు గిరీష్ మాతృబూతం వెల్లడించిన విషయం తెలిసిందే. శుక్రవారం రోజు నాస్డాక్ స్టాక్‌ఎక్సేచేంజ్ ముగిసే సమయానికి ఫ్రెష్‌వర్క్స్ 46.75 డాలర్ల వద్ద స్దిరపడింది. చదవండి: వీటిపై ఇన్వెస్ట్ చేస్తే లాభాలే..లాభాలు...! ఎగబడుతున్న ఇన్వెస్టర్లు...! తాజాగా పలు భారతీయ ఇన్వెస్టర్లు ఫ్రెష్‌వర్క్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఊవిళ్లురుతున్నారు. మైక్రోసాఫ్ట్ పొందిన ఆదరణను ఇప్పుడు ఫ్రెష్‌వర్క్స్ పొందుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా-లిస్టెడ్ సంస్థలలో పెట్టుబడులను సులభతరం చేసే బ్రోకర్ల ప్రకారం...గత కొన్ని రోజులుగా ఫ్రెష్‌వర్క్స్ స్టాక్స్‌పై ఇన్వెస్టర్లు గణనీయమైన ఆసక్తిని చూపుతున్నారని పేర్కొంది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ వెస్ట్ఫైనాన్స్ డేటా ప్రకారం..ఫ్రెష్‌వర్క్స్ ఇంక్. స్టాక్ దాని ఐపిఒ తర్వాత పెట్టుబడిదారుల అగ్ర ఎంపికగా నిలిచిందని, అంతేకాకుండా ఇన్వెస్టర్లలో అత్యంత ప్రాచుర్యం పొందినట్లు పేర్కొంది. టెస్లాకు తగ్గుతున్న ఆదరణ..! వెస్టెడ్ ఫైనాన్స్ పలు కంపెనీల స్టాక్ డేటాలను ట్రాక్ చేస్తోంది. టెస్లా కంపెనీ షేర్లు అమెరికాలో అత్యంత ఆదరణను పొందిన స్టాక్. గత ఆరు నెలల్లో కౌంటర్ కలిగి ఉన్న పెట్టుబడిదారుల నిష్పత్తి 10 శాతం నుండి 7.8 శాతానికి తగ్గడంతో టెస్లాపై ప్రజాదరణ బాగా తగ్గింది. పలు ఇన్వెస్టర్లకు టెస్లా ఫేవరేట్ స్టాక్‌గా ఆదరణ తగ్గతూ వస్తోంది. గత 30 రోజుల్లో, భారతీయ పెట్టుబడిదారులలో మైక్రోసాఫ్ట్ అత్యంత ప్రజాదరణ పొందిన స్టాక్. ఆపిల్, అమెజాన్, సేల్స్‌ఫోర్స్, ఫేస్బుక్ స్టాక్ ఎక్కువ ఆదరణను కలిగి ఉన్నాయి. చదవండి: Amazon- Flipkart: నువ్వా..! నేనా..! అన్నట్లుగా అమెజాన్-ఫ్లిప్‌కార్ట్...! కస్టమర్లకు మాత్రం పండగే...! -
‘కూ’ నుంచి చైనా ఇన్వెస్టరు నిష్క్రమణ
న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ సైటు ట్విట్టర్‌కు పోటీగా తెరపైకి వచ్చిన దేశీ యాప్ ‘కూ’ నుంచి తాజాగా చైనాకు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ షున్‌వై క్యాపిటల్ వైదొలిగింది. తమ మాతృ సంస్థ బాంబినేట్ టెక్నాలజీస్ నుంచి షున్‌వై తప్పుకున్నట్లు బుధవారం కూ వెల్లడించింది. కొత్తగా పలువురు ప్రముఖులు మైనారిటీ వాటాలు కొనుగోలు చేసినట్లు వివరించింది. వీరిలో మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్, బుక్‌మైషో వ్యవస్థాపకుడు ఆశీష్ హేమ్‌రాజానీ, ఉడాన్ సహ వ్యవస్థాపకుడు సుజీత్ కుమార్, ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి, జిరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తదితరులు ఉన్నట్లు తెలిపింది. అయితే, ఈ డీల్స్ విలువ ఎంతన్నది మాత్రం కూ వెల్లడించలేదు. -
ఎయిర్టెల్ నష్టం 763 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నష్టాలు భారీగా దిగొచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (2020-21, క్యూ2) కంపెనీ కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర నష్టం రూ. 763 కోట్లుగా నమోదైంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో సర్దుబాటు చేసిన స్థూల ఆదాయానికి(ఏజీఆర్) సంబంధించిన చట్టబద్ధమైన బకాయిల చెల్లింపు కోసం తక్షణం గతేడాది క్యూ2లో రూ.28,450 కోట్లను కేటాయింపుల (ప్రొవిజనింగ్) కింద పక్కనబెట్టడంతో ఆ త్రైమాసికంలో రూ.23,045 కోట్ల నికర నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. దీంతో పోలిస్తే నష్టాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కాగా, కంపెనీ మొత్తం ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.25,785 కోట్లకు ఎగబాకింది. ఎయిర్టెల్ చరిత్రలో ఒక క్వార్టర్లో ఇదే అత్యధిక కన్సాలిడేటెడ్ ఆదాయం కావడం గమనార్హం. అన్ని విభాగాలు, ప్రాంతాల్లోనూ పటిష్టమైన వృద్ధితో పాటు ఒక్కో యూజర్ నుంచి సగటు ఆదాయం (ఏఆర్పీయూ) పెరగడం, 4జీ కస్టమర్లు భారీగా జతకావడం దీనికి తోడ్పడినట్లు కంపెనీ పేర్కొంది. ఆదాయం, మార్జిన్లు, కస్టమర్ల వ్యాప్తంగా భారత్‌లో వ్యాపారం పటిష్టమైన వృద్ధిని సాధించినట్లు తెలిపింది. టెలికం శాఖ ఆదేశాలకు అనుగుణంగా తాము ఇప్పటికే ఏజీఆర్ బకాయిల్లో 10 శాతం పైగానే చెల్లించేశామని, సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటామని హామీ నిస్తూ ప్రభుత్వానికి భారతీ ఎయిర్టెల్ గ్రూపు లేఖ రాసినట్లు ఎయిర్టెల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. మొత్తం ఏజీఆర్ బకాయిల్లో 10 శాతాన్ని ఈ ఏడాది చెల్లించాల్సిందిగా, మిగతా మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 10 వాయిదాల్లో చెల్లించేందుకు సుప్రీం కోర్టు అనుమతించిన విషయాన్ని ఈ సందర్భంగా కంపెనీ గుర్తు చేసింది. భారత్ ఆదాయం 22 శాతం అప్... భారత్ కార్యకలాపాలపై క్యూ2లో ఆదాయం 22 శాతం వృద్ధి చెంది రూ.18,747 కోట్లకు ఎగబాకింది. మొబైల్ ఆదాయాలు 26 శాతం దూసుకెళ్లాయి. ఏఆర్పీయూ రూ.162కు చేరింది. ఈ ఏడాది క్యూ1లో ఏఆర్పీయూ రూ.128 మాత్రమే. 4జీ డేటా వినియోగదారులు గతేడాది క్యూ2తో పోలిస్తే 48.1శాతం పెరిగి 15.27 కోట్ల మందికి చేరారు. ఘనా మార్కెట్‌కు గుడ్‌బై! ఘనా టెలికం మార్కెట్ నుంచి వైదొలిగే ప్రణాళికల్లో ఉన్నట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. ‘ఎయిర్టెల్ ఘనా లిమిటెడ్ (ఎయిర్‌టెల్‌టిగో)లోని 100 శాతం వాటాలతో సహా మొత్తం కస్టమర్లు, ఆస్తులు, రుణాలన్నింటినీ ఘనా ప్రభుత్వం కొనుగోలు చేసేవిధంగా ఆ దేశ ప్రభుత్వంతో ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది’ అని కంపెనీ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. ఎయిర్‌టెల్‌టిగో జాయింట్ వెంచర్లో ఎయిర్‌టెల్‌కు 49.95శాతం వాటా ఉంది. ఫలితాల నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేరు మంగళవారం 0.24 శాతం స్వల్ప లాభంతో రూ.433 వద్ద ముగిసింది. సీజనల్‌గా బలహీన త్రైమాసికం అయినప్పటికీ, పటిష్టమైన పనితీరుతో మేం 22 శాతం ఆదాయ వృద్ధిని సాధించగలిగాం. వ్యాపార లాభదాయకతను పెంచుకునేందుకు కంపెనీ కట్టుబడి ఉంది. - గోపాల్ విఠల్, ఎండీ, సీఈఓ భారత్-దక్షిణాసియా -
మ్యూచువల్ ఫండ్స్‌కి బ్రేక్!
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్ల ఆలోచనా ధోరణి మారినట్టుంది. దీనికి ప్రతిబింబంగా నాలుగేళ్ల తర్వాత మొదటిసారి ఈక్విటీ పథకాల నుంచి నికరంగా రూ.2,480 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో, మ్యూచువల్ ఫండ్స్ సంస్థల ప్రచారం కారణంగా ఇన్వెస్టర్లలో పెరిగిన అవగాహనతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి ప్రతీ నెలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్న పరిస్థితి చూశాము. కానీ కరోనా రాకతో ఈ పరిస్థితి మారిపోయింది. తగ్గిపోయిన ఆదాయాలు, అత్యవసర ఖర్చుల కోసమో లేక, ఈక్విటీ పథకాల పనితీరు నచ్చక ఇటీవల ర్యాలీ తర్వాత వచ్చినంత చాలనుకునే ధోరణితో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి మొగ్గు చూపించినట్టు తెలుస్తోంది. జూలై నెల గణాంకాలను పరిశీలిస్తే ఇన్వెస్టర్ల తీరు ప్రస్ఫుటమవుతుంది. జూలైలో ఈక్విటీ పథకాల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.2,480 కోట్లను ఉపసంహరించుకున్నారు. 2016 మార్చి నెలలోనూ ఇన్వెస్టర్లు ఈక్విటీ పథకాల నుంచి రూ.1,370 కోట్లను వెనక్కి తీసుకోగా, ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది జూలైలో అదే పరిస్థితి కనిపించింది. అంతక్రితం జూన్ నెలలో ఈక్విటీ స్కీమ్ ల్లోకి రూ.240 కోట్ల మేర నికరంగా పెట్టుబడులు రావడం గమనార్హం. ఇక అంతకుముందు నెలల్లో.. మేలో రూ.5,256 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ.6,213 కోట్లు, మార్చిలో రూ.11,723 కోట్లు, ఫిబ్రవరిలో రూ.10,796 కోట్లు, జనవరిలో రూ.7,877 కోట్ల చొప్పున ఈక్విటీ పథకాలు నికరంగా పెట్టుబడులను ఆకర్షించాయి. అంటే 2020లో మొదటి ఐదు నెలలు ఈక్విటీ పథకాల్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు గత రెండు నెలల్లో అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు తెలుస్తోంది. ► జూలై మాసంలో ఫండ్స్ పరిశ్రమలోకి నికరంగా రూ.89,813కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. జూన్ నెలలో వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే రూ.7,625 కోట్లు అదనంగా వచ్చినట్టు. ప్రధానంగా డెట్ ఫండ్స్ లోకి భారీ మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. ఇందులో లిక్విడ్, లో డ్యురేషన్ ఫండ్స్ అధిక పెట్టుబడులను ఆకర్షించాయి. ► మల్టీక్యాప్ ఫండ్స్ నుంచి రూ.1,033 కోట్లు, మిడ్ క్యాప్ ఫండ్స్ నుంచి రూ.579 కోట్లు, వ్యాల్యూ ఫండ్ విభాగం నుంచి రూ.549 కోట్ల చొప్పున బయటకు వెళ్లాయి. ► స్థిరాదాయ పథకాలు లేదా డెట్ ఫండ్స్ లోకి జూన్ నెలలో కేవలం రూ.2,862 కోట్లు పెట్టుబడులే రాగా, జూలైలో రూ.91,392 కోట్ల మేర భారీగా ఇన్వెస్టర్లు డెట్ ఫండ్స్ లోకి కుమ్మరించారు. ఇందులో డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.14,219 కోట్లు, లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ.14,055 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ లోకి రూ.11,910 కోట్లు, బ్యాంకింగ్ అండ్ పీఎస్ యూ ఫండ్స్ లోకి రూ.6,323 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి రూ.670 కోట్లు బయటకు వెళ్లాయి. ► గోల్డ్ ఈటీఎఫ్ ల్లోకి రూ.921 కోట్లు నికరంగా పెట్టుబడులు వచ్చాయి. ► జూలై ఆఖరుకు 45 సంస్థలతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహలోని పెట్టుబడుల విలువ రూ.27.12 లక్షల కోట్లుగా ఉంది. లాభాల స్వీకరణే.. ఈ ఏడాది జూలైలో ఈక్విటీ విభాగంలో ఈఎల్ఎస్ఎస్, ఫోకస్డ్ ఫండ్స్ మినహా మిగిలిన అన్ని విభాగాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ చోటు చేసుకుంది. అయితే, దీన్ని లాభాల స్వీకరణగా యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. మల్టీక్యాప్, లార్జ్ క్యాప్ విభాగంలో లాభాలు స్వీకరించినట్టు చెప్పారు. తగ్గిన వడ్డీ రేట్ల కారణంగా మెరుగైన రాబడులతో డెట్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ‘‘మల్టీక్యాప్ ఫండ్స్ నుంచి ఎక్కువగా పెట్టుబడుల ఉపసంహరణ నెలకొనగా, ఆ తర్వాత మిడ్‌క్యాప్, వ్యాల్యూ ఫండ్ విభాగాల్లో ఈ పరిస్థితి కనిపించింది’’ అని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు తెలిపారు. ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరగడంతో లాభాలు స్వీకరించినట్టు చెప్పారు. ‘‘ఈక్విటీ మార్కెట్లలో భారీ పతనం అనంతరం ఇన్వెస్టర్లు వచ్చిన లాభాలతో బయటకు వెళ్లిపోవడం సాధారణంగా కనిపించే ధోరణే. అయితే పరిణతి చెందిన ఇన్వెస్టర్లు మాత్రం తమ సిప్ పెట్టుబడులను కొనసాగించడంతో వాటి రాక పెరిగింది’’అని గ్రోవ్ సహ వ్యవస్థాపకుడు,సీవోవో జైన్ పేర్కొన్నారు. -
పెట్టుబడులతో రండి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఏర్పడనున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో జల విప్లవం కొనసాగుతుందని, తద్వారా వ్యవసాయ రంగంతో పాటు పాలు, మాంసం, చేపల ఉత్పత్తికి భవిష్యత్తులో భారీ అవకాశాలు ఏర్పడతాయని, పెద్ద మొత్తంలో ఫుడ్‌ప్రాసెసింగ్, వ్యవసాయరంగ అనుబంధ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే అవకాశముందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఇతర రంగాల పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం విజయవంతంగా కొనసాగుతోందని, ఈ విషయంలో తెలంగాణ అగ్రభాగాన ఉందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు. ఇన్వెస్ట్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫోరం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై సోమవారం ఏర్పాటు చేసిన వెబినార్‌లో కేటీఆర్ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుబడిదారులు దీనికి హాజరయ్యారు. రెడీ టు ఈట్, బేవరేజెస్, కాయగూరలు, పండ్లు, పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తికి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు వీరు ఆసక్తి చూపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, తద్వారా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం అత్యంత సౌకర్యవంతమైన విషయమని కేటీఆర్ వారికి వివరించారు. పెట్టుబడులకు బడా సంస్థల ఆసక్తి ఇప్పటికే తెలంగాణ అనేక రంగాల్లో ప్రపంచ స్థాయి పరిశ్రమలను ఆకర్షించిందని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అనేక పెద్దసంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రారంభించిన నూతన ప్రాజెక్టులతో భారీగా సాగునీటి వనరులు పెరుగుతాయని, తద్వారా వ్యవసాయ రంగంలో విభిన్న రకాలైన పంటలు, వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు. వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు సులువుగా తరలించేందుకు వీలుగా రాష్ట్రం భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉందన్నారు. రాష్ట్రంలో అపారంగా ప్రభుత్వ భూముల లభ్యత ఉందని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రత్యేకంగా పారిశ్రామికవాడలను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకంగా స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను సైతం ఏర్పాటు చేయనున్నామన్నారు. రైతులను సంఘటిత పరిచే రైతుబంధు సమితులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వానికి లేదా పరిశ్రమ వర్గాలకు సులువవుతుందన్నారు. స్థానికంగా ఉన్న పరిశ్రమలు లేదా ఇతర వర్గాలతో కలిసి వ్యాపారం నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం సహకరిస్తుందని అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. -
ఇప్పట్లో బ్యాంకు షేర్లు వద్దు!
మారిటోరియం పొడిగింపు, ఎన్‌బీఎఫ్‌సీలకు రుణసాయం పెంపు, లాక్డౌన్.. తదితర కారణాలు బ్యాంకులపై ఒత్తిడిపెంచుతాయని, అందువల్ల స్వల్పకాలానికి బ్యాంకు షేర్ల జోలికి పోవద్దని మార్కెట్ నిపుణులు సలహా ఇస్తున్నారు. తాజాగా ఆర్బీఐ ప్రకటించిన రేట్ కట్‌ను మార్కెట్ ఊహిస్తూనే ఉందన్నారు. రుణాల రిస్ట్రక్చరింగ్తో సహా ఇతర మద్దతు చర్యలు ప్రకటించకపోవడం బ్యాంకులకు ఇబ్బందికరమన్నారు. దీనికితోడు మారిటోరియం పొడగింపు కొత్తగా ఎన్పీఏలను పెంచవచ్చన్న భయాలు పెరిగాయని వివరించారు. ఇదే నిజమైతే క్రమంగా బ్యాంకుల బాలెన్స్ షీట్స్ దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఎకానమీని రక్షించేందుకు ఆర్బీఐ ప్రకటించిన చర్యలు బ్యాంకులు లాభదాయకం కాదని అభిప్రాయపడ్డారు. ఫైనాన్షియల్స్ రంగంలో ఒడిదుడుకులున్నందున ఇన్వెస్టర్లు కొత్తగా బ్యాంకు షేర్లలో పెట్టుబడులు మానుకోవాలని సామ్కో సెక్యూరిటీస్ సూచించింది. కరోనా సంక్షోభ పరిణామాలు పూర్తిగా బహిర్గతం అయి, బ్యాంకుల పద్దు పుస్తకాలపై భారం లేదని తెలిసిన అనంతరం వీటిని పరిశీలించవచ్చని తెలిపింది. వాల్యూషన్లు బాగా తక్కువగా ఉన్నాయని బ్యాంకు షేర్లను ఎంచుకోవడం సరికాదని సూచించింది. ఇప్పటికే బ్యాంకు షేర్లలో పెట్టుబడులు ఉన్న వాళ్లు హెడ్జింగ్ కోసం ఇతర రంగాల్లో బలమైన షేర్లను ఎంచుకోవాలని సలహా ఇచ్చింది. నిఫ్టీకి ఈ వారం 8700 పాయింట్ల వద్ద మద్దతు, 9200 పాయింట్ల వద్ద నిరోధం ఉన్నట్లు తెలిపింది. మ్యూచువల్ ఫండ్స్ సైతం అమ్మకాలకు దిగుతున్న ప్రస్తుత సందర్భంలో రిటైల్ ఇన్వెస్టర్లు నగదు చేతిలో ఉంచుకొని ఓపికగా వేచిచూడడం మంచిదని, రాబోయే వారాల్లో మార్కెట్లో మరింత ఇబ్బందులు ఉండొచ్చని అంచనా వేసింది. -
కరోనా: రూ.19.49 లక్షల కోట్లు ఆవిరి
సాక్షి, ముంబై: కోవిడ్-19 భయాలతో దలాల్ స్ట్రీట్ గజగజ వణుకుతోంది. కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ మార్కెట్లతోపాటు, దేశీయ స్టాక్‌మార్కెట్లను అతలాకుతలం చేస్తోంది. దీంతో ఈ వారంలో కూడా కీలక సూచీలు తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నాయి. వరుస నష్టాలతో లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకు పోయింది. ముఖ్యంగా ఈ వారంలో నాలుగు రోజుల వ్యవధిలో రూ.19.49 లక్షల కోట్ల విలువైన పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. దీనికితోడు భారతదేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు, మరణాలు ఇన్వెస్టర్లలో తీవ్ర నిరాశను నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ట్రేడింగ్‌లో ఆరంభంలోనే నష్టాల బాట పట్టాయి. మిడ్ సెషన్లో కొంత పుంజుకున్నప్పటికీ, ప్రధాన మద్దతు స్థాయిలను నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందాయి. అయితే షార్ట్ కవరింగ్ ప్రభావంగానే రికవరీ వచ్చిందనీ, ఇన్వెస్టర్ల అప్రమత్తత రానున్న కాలంలో కొనసాగుతుందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. వరుసగా నాలుగవ రోజు మార్కెట్లు పడిపోవడంతో, బీఎస్ఈ-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19,49,461.82 కోట్ల నుండి 1,09,76,781 కోట్లకు పడిపోయింది. నాలుగు రోజుల్లో బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 5,815 పాయింట్లు కుప్పకూలింది. 1200 కు పైగా కంపెనీలు ఏడాది కనిష్ట స్థాయికి చేరుకున్నాయంటే.. నష్టాలను అంచనా వేయవచ్చు. మరోవైపు కోవిడ్ -19 (కరోనా) ముప్పు దేశీయ కరెన్సీని కూడా బాగా ప్రభావితం చేసింది. దీంతో గురువారం డాలరుమారకంలో రూపాయి చారిత్రక కనిష్టానికి పడిపోయింది. 85 పైసల నష్టంతో 75.11 వద్ద ఆల్ టైం కనిష్టానికి చేరింది. -
విప్రో బైబ్యాక్ బొనాంజా
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం విప్రో మరోసారి ఇన్వెస్టర్లకు తీపి కబురు చెప్పింది. భారీస్థాయిలో రూ.10,500 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. కంపెనీ మంగళవారం మార్చి క్వార్టర్(క్యూ4) ఫలితాల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా, బైబ్యాక్‌లో భాగంగా షేరుకు రూ.325 ధర చొప్పున 32.3 కోట్ల షేర్లను తమ వాటాదారుల నుంచి తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రతిపాదనకు తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. కంపెనీ మొత్తం పెయిడ్–అప్ ఈక్విటీలో ఇది 5.35 శాతానికి సమానం.సెబీ నిబంధనల ప్రకారం టెండర్ ఆఫర్ రూపంలో ప్రస్తుత వాటాదారుల నుంచి ఈ బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు విప్రో ఎక్సే్ఛంజీలకు వెల్లడించిన సమాచారంలో పేర్కొంది. ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ కంపెనీ కూడా బైబ్యాక్‌లో పాలుపంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. కాగా, తాజా బైబ్యాక్ ధర విప్రో షేరు మంగళవారం నాటి మార్కెట్ ముగింపు ధర రూ.281తో పోలిస్తే దాదాపు 16 శాతం అధికం కావడం గమనార్హం. 15 నెలల్లో రెండోది... గడిచిన 15 నెలల్లో ఇది విప్రో ప్రకటించిన రెండో షేర్ల బైబ్యాక్. 2017 నవంబర్–డిసెంబర్లో విప్రో రూ.11,000 కోట్ల విలువైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేసింది. ఇక గడిచిన నాలుగేళ్ల కాలాన్ని తీసుకుంటే విప్రో చేపట్టిన మూడో బైబ్యాక్ ఇది. 2016లో తొలిసారి విప్రో రూ. 2,500 కోట్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. కాగా, ఈ ఏడాది మార్చి 31 నాటికి విప్రోలో ప్రమోటర్లకు 73.85 శాతం వాటా ఉంది. 6.49 శాతం వాటా ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ చేతిలో ఉంది. ఇక విదేశీ ఇన్వెస్టర్ల వద్ద 11.74 శాతం వాటా, ప్రజలు, కార్పొరేట్లు, ఇతరత్రా ఇన్వెస్టర్ల వద్ద 7.92 శాతం వాటా ఉంది. తాజా బైబ్యాక్ ఆఫర్ నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి చేపడతామని... పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదారుల ఆమోదం తీసుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. బైబ్యాక్ ప్రక్రియ, కాల వ్యవధి, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఐటీ కంపెల బైబ్యాక్ రూటు... భారీ మొత్తంలో ఉన్న నగదు నిల్వలను ఇన్వెస్టర్లకు పంచేందుకు ఇటీవల కాలంలో దేశీ ఐటీ కంపెనీలు వరుసపెట్టి బైబ్యాక్‌లను ప్రకటిస్తున్నాయి. గత రెండేళ్లలో దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్ ఏకంగా రూ.16,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ రూపంలో కొనుగోలు చేసింది. రెండో అతిపెద్ద దేశీ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా 2017 డిసెంబర్లో రూ.13,000 కోట్ల బైబ్యాక్‌ను ప్రకటించగా.. మళ్లీ ఈ ఏడాది జనవరిలో రూ.8,260 కోట్ల బైబ్యాక్ ఆఫర్‌ను చేపట్టింది. ఇంకా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎంఫసిస్ ఇతరత్రా ఐటీ కంపెనీలు కూడా బైబ్యాక్‌లు, ప్రత్యేక డివిడెండ్ల రూపంలో ఇన్వెసర్లకు మంచి రాబడులనే అందించాయి. కాగా, ఎల్అండ్టీ బలవంతంగా టేకోవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్న మైండ్‌ట్రీ కూడా ప్రత్యేక డివిడెండ్‌పై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) పరంగా టాప్–5 దేశీ ఐటీ కంపెనీలు 2017 జనవరి నుంచి 2019 జనవరి మధ్య కాలంలో ఏకంగా రూ.1.17 లక్షల కోట్లను షేర్ల బైబ్యాక్, డివిడెండ్ల రూపంలో ఇన్వెస్టర్లకు చెల్లించాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే షేర్లను బైబ్యాక్ చేసేందుకు సెబీ నిబంధనలు అనుమతిస్తున్నాయి. షేర్ల బైబ్యాక్ కారణంగా కంపెనీ షేరువారీ ఆర్జన (ఈపీఎస్) మెరుగుపడుతుంది. -
విప్రోకు బోనస్ బొనాంజా
దేశీ ఐటీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌కు బోనస్ బొనాంజా తగిలింది. తన వాటాదారులకు బోనస్ షేర్ల జారీకి ఈ నెల 7 రికార్డ్ డేట్‌గా విప్రో ప్రకటించడంతో ఈ కౌంటర్ ఎక్స్‌బోనస్‌లోకి చేరింది. వాటాదారులకు 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. ప్రతీ 3 షేర్లకు 1 షేరుని కేటాయించనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కొనుగోళ్ల జోరుతా విప్రో షేరు 2శాతానికిపైగా ఎగిసింది. అంతకుముందు 5శాతానికిపై పైగా లాభపడింది. కాగా జనవరంలోనే విప్రో బోనస్ వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. గత 8 నెలల్లో విప్రో షేరు 45 శాతం ర్యాలీ అయింది. -
అమెరికా టు ఆస్ట్రేలియా... అమ్మకాల ముసలం!
అమెరికాలో మొదలైన అమ్మకాల ముసలం ప్రపంచ మార్కెట్లంతటికీ విస్తరించి మన మార్కెట్‌ను కూడా గురువారం నష్టాలపాలు చేసింది. దీంతో బుధవారం లాభాలొచ్చాయన్న సంతోషం గురువారం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చమురు, విమానయాన, మీడియా మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ చోటు చేసుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 34,000 పాయింట్ల చేరువకు పడిపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,250 పాయింట్ల దిగువకు పతనమైంది. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు, లోహ, వాహన, ఫార్మా, ఐటీ షేర్లు బాగా నష్టపోయాయి. సెన్సెక్స్ 760 పాయింట్లు (2.19 శాతం) పతనమై 34,001 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 225 పాయింట్లు (2.16 శాతం) పతనమై 10,235 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు దాదాపుగా ఆరు నెలల కనిష్టానికి పడిపోయాయి. మీడియా, చమురు మినహా అన్ని రంగాల నిఫ్టీ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఈ ఏడాది స్టాక్ సూచీలు సాధించిన లాభాలన్నీ గురువారంతో హరించుకుపోయాయి. బీఎస్ఈలో నమోదైన ప్రతి మూడు షేర్లలో రెండు షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. భారీ గ్యాప్‌డౌన్‌తో ఆరంభం... సెన్సెక్స్ భారీ గ్యాప్‌డౌన్... 697 పాయింట్ల భారీ నష్టంతో ఆరంభమైంది. ట్రేడింగ్ ఆరంభమైన అరగంటలోనే 1,037 పాయింట్ల నష్టంతో 33,724 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా ఆరంభంలో 10,250 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో నిఫ్టీ 321 పాయింట్ల నష్టంతో 10,139 పాయింట్లకు పడిపోయింది. అయితే ఇంధన షేర్లు కోలుకోవడంతో ఈ నష్టాలు ఒకింత తగ్గాయి. ప్రపంచ మార్కెట్ల పతనంలో భాగంగానే మన మార్కెట్ కూడా నష్టపోయిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వి.కె. విజయ్‌కుమార్ పేర్కొన్నారు. అమెరికాలో బాండ్ల రాబడులు పెరగడం, వర్ధమాన దేశాల కరెన్సీలు పతనం కావడం, భారత్ వంటి వర్ధమాన దేశాల నుంచి విదేశీ నిధులు తరలిపోతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని వివరించారు. కాగా నిఫ్టీ తదుపరి మద్దతు స్థాయి 10,000 పాయింట్లని, నిరోధం 10,650 పాయింట్లని బొనాంజా పోర్ట్‌ఫోలియో అంచనా వేస్తోంది. ఎదురీదిన ఆయిల్ షేర్లు స్టాక్ మార్కెట్ భారీగా పతనమైనప్పటికీ, ఆయిల్ షేర్లు మంచి లాభాలు సాధించాయి. అమెరికా చమురు నిల్వలు అంచనాలను మించి పెరిగాయన్న గణాంకాలు, అమెరికాలోని మైకేల్ తుఫాన్ కారణంగా చమురు క్షేత్రాలపై పెద్దగా ప్రభావం పడలేదని, సరఫరా సమస్యలు ఉండబోవని వచ్చిన వార్తల కారణంగా ముడి చమురు ధరలు 1.5 శాతానికి పైగా పతనమై, నాలుగేళ్ల గరిష్ట స్థాయి నుంచి రెండు వారాల కనిష్ట స్థాయికి చేరాయి. అంతేకాకుండా చమురు కంపెనీలు అదనపు సబ్సిడీ భారాన్ని భరించాల్సిన అవసరం లేదంటూ కేంద్రం భరోసానివ్వడం కూడా కలసివచ్చింది. దీంతో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఐఓసీ, గెయిల్ ఇండియా షేర్లు 4–15% వరకూ ర్యాలీ చేశాయి. మరోవైపు విమానయాన ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గించడంతో విమానయాన ఇంధన షేర్లు పెరిగాయి. జెట్ ఎయిర్వేస్, ఇండిగో, స్పైస్‌జెట్ షేర్లు 1–3 శాతం రేంజ్లో లాభపడ్డాయి. ఇంట్రాడేలో ఈ మూడు షేర్లు 7.4 శాతం వరకూ పెరిగాయి. మరిన్ని విశేషాలు... ►మొత్తం 31 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు–ఓఎన్జీసీ, యస్ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలివర్ మాత్రమే లాభపడగా, మిగిలిన 28 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ►మొత్తం 50 నిఫ్టీ షేర్లలో 8 షేర్లు మాత్రమే లాభపడగా, 42 షేర్లు నష్టపోయాయి. ► స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.7 శాతం నష్టంతో రూ.262 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► క్యూ2 ఆర్థిక ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో టీసీఎస్ షేర్ 3.1 శాతం నష్టపోయి రూ.1,980 వద్దకు చేరింది. ► బీఎస్ఈలో 370 షేర్లు తాజా ఏడాది కనిష్టాలకు పడిపోయాయి. ఎయిర్టెల్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► యస్ బ్యాంక్ సీఈఓ ఎంపిక కమిటీ తొలి సమావేశం నేపథ్యంలో షేర్ ఇంట్రాడే కనిష్ట స్థాయి, రూ.217 నుంచి చూస్తే, ఈ షేర్ 24% లాభపడింది. 2.5% పెరిగి రూ.240 వద్ద ముగిసింది. ► మార్కెట్ భారీగా నష్టపోయినప్పటికీ, గ్రాఫైట్ ఎలక్ట్రోడ్లు తయారు చేసే గ్రాఫైట్ ఇండియా, హెచ్ఈజీలు 10% వరకూ పెరిగాయి. ► 250కు పైగా షేర్లు వాటి వాటి లోయర్ సర్క్యూట్లను తాకాయి. క్వాలిటీ, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వి–మార్ట్, ట్రీ హౌజ్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 2.69 లక్షల కోట్లు ఆవిరి బీఎస్ఈ సెన్సెక్స్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2.69 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,69,348 కోట్లు ఆవిరై రూ.1,35,70,403 కోట్లకు పరిమితమైంది. పతనానికి ప్రధాన కారణాలు... ప్రపంచ మార్కెట్ల పతనం... ఇటీవల అమెరికాలో వెలువడిన ఆర్థిక గణాంకాలు పటిష్టంగా ఉన్నాయి. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను మరింతగా పెంచుతుందనే అంచనాలతో బుధవారం బాండ్ల రాబడులు భారీగా పెరిగాయి. ఫలితంగా అమెరికా కంపెనీల వడ్డీ వ్యయాలు పెరిగి, లాభదాయకత దెబ్బతింటుందనే ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో బాండ్లు, ఇతరత్రా సురక్షిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం కోసం ఇన్వెస్టర్లు ఈక్విటీలను తెగనమ్మారు. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. అమెరికా స్టాక్ సూచీలు గత ఎనిమిది నెలల్లో అధ్వానమైన నష్టాలను బుధవారం నమోదు చేశాయి. ఈ ప్రభావంతో గురువారం ఆసియా, యూరప్ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లోనే ముగిశాయి. అమెరికా– చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింతగా ముదిరే అవకాశాలుండటం, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తగ్గించడం.. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై తీవ్రమైన ప్రభావం చూపాయి. చైనా స్టాక్ సూచీలు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోగా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా సూచీలు కూడా భారీగా పతనమయ్యాయి. జపాన్ నికాయ్ సూచీ 3.8%, చైనా షాంగై సూచీ 5.2 వాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 3.7 శాతం చొప్పున నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా 1–1.5 శాతం రేంజ్లో పతనమయ్యాయి. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు ఇప్పటివరకూ ఆకర్షణీయంగా ఉన్న మన స్టాక్ మార్కెట్ ఆ ప్రాభవాన్ని కోల్పోయింది. రూపాయి భారీగా పతనం కావడం, ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో కరెంట్ అకౌంట్ లోటు మరింతగా పెరుగుతున్న భయాలు దీనికి ప్రధాన కారణాలు. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.16,536 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మళ్లీ జీవిత కాల కనిష్టానికి రూపాయి డాలర్‌తో రూపాయి మారకం మళ్లీ జీవిత కాల కనిష్ట స్థాయి, 74.48కు పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై తీవ్రమైన ప్రభావాన్నే చూపించింది. చివరి రెండు గంటల్లో రూపాయి ఒకింత రికవరీ అయినా, స్టాక్ సూచీల పతనం ఆగలేదు. వృద్ధి మందగమన భయాలు అమెరికా– చైనాల మధ్య సుంకాల పోరు అంతర్జాతీయంగా వృద్ధిని మందగింపజేస్తుందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ వ్యాఖ్యానించారు. అన్ని దేశాలు సుంకాలను పెంచుతూ పోతే ప్రపంచ వృద్ధికి విఘాతం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హెవీ వెయిట్ షేర్ల నష్టాలు: సెన్సెక్స్‌లో వెయిటేజీ అధికంగా ఉన్న 5 షేర్లు.. ఇన్ఫీ, హెచ్డీఎఫ్సీ ద్వయం, టీసీఎస్, ఎస్బీఐ భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 760 పాయింట్ల నష్టంలో ఈ 5 షేర్ల వాటాయే సగం వరకూ ఉంది. -
5 నిమిషాల్లో రూ.4 లక్షల కోట్ల ఆవిరి
సాక్షి,ముంబై: భారీ నష్టాల్లోంచి తేరుకుని బుధవారం లాభాల్లోకి అడుగుపెట్టిన దలాల్ స్ట్రీట్‌కు నేడు (గురువారం) వాల్‌స్ట్రీట్ సెగ తగిలింది. దీంతో ఆరంభంలోనే కీలక సూచీలు భారీగా కుప్పకూలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టంతో 34వేల కిందికి, నిఫ్టీ 300 పాయింట్లు క్షీనించి10,200 స్థాయి కిందికి దిగజారాయి. దీంతో కేవలం 5 నిమిషాల్లో సుమారు రూ.4లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. బీఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కసారిగా 134.38 లక్షలకోట్ల రూపాయలకు పడిపోయింది. మార్కెట్లో దాదాపు 175 స్టాక్స్ 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, భారతీ ఎయిర్ టెల్, బాంబేడైయింగ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , దీపక్ ఫెర్టిలైజర్స్, ఫినోలెక్స్,హెచ్ఏఎల్ తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. మరోవైపు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 26పైసలు క్షీణించి రూ.74.47 పైసలతో జీవన కాల గరిష్ఠానికి చేరింది. ఆసియా మార్కెట్లు, అమెరికా మార్కెట్లు బాగా నష్టపోవడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ కుదించింది. ఈ రెండు దేశాలూ వచ్చే ఏడాదిలో వాణిజ్య వివాద ప్రభావాలను చవిచూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఎస్ అండ్ పి 500 3.29 శాతం నాన్డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 4.08 శాతం, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ క్యాజువల్ 2.2 శాతం నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో తైవాన్ సూచీ 5.21 శాతం, జపాన్ నిక్కి 3.7 శాతం, కొరియాకు చెందిన కోస్పి 2.9 శాతం షాంఘై కాంపోజిట్ 2.4 శాతం క్షీణించాయి. -
మార్కెట్ క్రాష్ : రూ. 5.66 లక్షల కోట్లు మటాష్!
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్ ఉత్థానపతనాలను ఒడిసిపట్టుకోవడం కత్తిమీదసామే. రికార్డుస్తాయిలకు చేరుకున్నకీలక సూచీలు లాభనష్టాల ఊగిసలాడాయి. అనూహ్య పరిణామాలతో మార్కెట్లో ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సందప ఆవిరై పోయింది. ముఖ్యంగా ఈ వారాంతంలో శుక్రవారం నాటి పరిణామాలు ఇన్వెస్టర్లను వణికించాయి. నిమిషాల వ్యవధిలోనే సంపద అలా మంచులా కరిగిపోయింది. ఇక మ్యూచువల్ ఫండ్ల సంగతి సరే. ముఖ్యంగా ఈ వారంలోని నాలుగు రోజుల ట్రేడింగ్‌లో రూ. 5.66 లక్షల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. బ్యాంకింగ్, ఫార్మా, ఆటో, ఐటీ, హౌసింగ్ ఫైనాన్స్ ఇలా దాదాపు అన్ని సెక్టార్ల షేర్లు పాతాళానికి పరుగులు తీశాయి. ఇవాళ ఒక్కరోజే సెన్సెక్స్ 1100పాయింట్లకుపైగా ఢమాల్ అంది. అయితే, ఇది కొన్ని నిమిషాలలో మెరుగుపడినా..ఇన్వెస్టర్ల నష్టం మాత్రం తప్పలేదు. బీఎస్ఇలో లిస్టయిన షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,66,187 కోట్లు కరిగిపోయింది. అటు నిఫ్టీది కూడా ఇదేబాట. ఈ వారంలో నిఫ్టీ 1249 పాయింట్లు అంటే 3.28 శాతం నష్టపోయింది శుక్రవారం ఒక్క రోజే 2,02,433 కోట్లు నష్టపోయారు. ఎస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ రాణా కపూర్ పదవీకాలం పొడిగించేందుకు ఆర్బీఐ ససేమిరా అనడంతో ఆ కంపెనీ షేర్ ఏకంగా 34 శాతం పడింది. -
2 రోజుల్లో రూ. 4.14 కోట్లు హాంఫట్
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీగా పతనమయ్యాయి. గత ఏడు నెలల్లో స్టాక్ సూచీలు వరుసగా రెండు రోజుల పాటు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే ప్రథమం. భారీ అమ్మకాల ఒత్తిడితో మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీ మద్దతు స్థాయిలకు దిగువకు పడిపోయింది. చివరలో సెన్సెక్స్ 509 పాయింట్ల పతనంతో 37,413 వద్ద ముగియగా, నిఫ్టీ 151 పాయింట్లు క్షీణించి 11,288వద్ద ముగిసింది. వాణిజ్యలోటు, ముదురుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, డాలరు మారకంలో పాతాళానికి పడిపోతున్న రూపాయి, మండుతున్నచమురు ధర, ఫెడ్ రేట్ల పెంపు భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పూనుకున్నారు. దీంతో గత రెండు రోజుల్లో 4 లక్షల కోట్లకు పైగా సంపద తుడిచి పెట్టుకు పోయింది. గత రెండు రోజుల స్టాక్ మార్కెట్ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.4.14 లక్షల కోట్లు ఆవిరైంది. కాగా సెన్సెక్స్ గత రెండు రోజుల్లో 977 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ ఈ రెండు రోజుల్లో రూ.4,14,122 కోట్లు తగ్గి రూ.1,53,25,666 కోట్లకు తగ్గింది. మరోవైపు కీలక సూచీలు మద్దతు స్థాయిల కిందికి చేరిన నేపథ్యంలో మరింత పతనం నమోదు కావచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలలో ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు తథ్యమని, దీంతో డాలర్ మరింతగా బలపడుతుందని, విదేశీ నిధులు మరింతగా తరలిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
నిమిషాల్లో రూ. 30వేల కోట్లు
సాక్షి, ముంబై: ఆర్థిక ఫలితాల నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ మరో రికార్డును సొంతం చేసుకుంది. 2017-18 క్యూ4లో పటిష్ట ఫలితాల్లో అంచనాలకు మించి రాణించడంతోపాటు వాటాదారులకు 1:1 బోనస్ బొనాంజాతో నిమిషాల్లో ఇన్వెస్టర్ల సంపదను భారీగా రూ. 30వేలకోట్ల మేర పుంజుకుంది. శుక్రవారం టీసీఎస్ షేరు 6శాతానికిపైగా పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 6.5 లక్షల కోట్లకు చేరింది. అంతేకాదు 100బిలియన్ డాలర్ల క్లబ్లో చేరేందుకు సమీపంలో ఉంది. దేశీ స్టాక్ మార్కెట్లలో తొలిసారి రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్(విలువ)ను సాధించిన దిగ్గజ సంస్థగా ఇప్పటికే చరిత్ర సృష్టించిన టాటా గ్రూప్ ఐటీ సేవల కంపెనీ టీసీఎస్ తాజాగా ఈ సరికొత్త రికార్డును సాధించింది. టీసీఎస్ షేర్ రూ. 3400 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకడంతో కంపెనీ మార్కెట్ విలువ తొలిసారి రూ. 6.5 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మార్కెట్ విలువలో దేశీయంగా ఈ ఘనతను సాధించిన తొలి కంపెనీ టీసీఎస్. అంతేకాదు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌తో (38 బిలియన్ డాలర్లు) పోలిస్తే ఇది రెండున్నరెట్లు ఎక్కువ. కాగా క్యూ4(జనవరి-మార్చి)లో త్రైమాసిక ప్రాతిపదికన టీసీఎస్ నికర లాభం 5.7 శాతం పెరిగి రూ. 6904 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం రూ. 32,075 కోట్లకు చేరింది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి బోర్డు అనుమతించింది. దీంతోపాటు వాటాదారులకు షేరుకి రూ. 29 తుది డివిడెండ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
స్కాం ఎఫెక్ట్ : రూ. 7వేల కోట్లు ఆవిరి
సాక్షి, ముంబై: మాల్యా తరహాలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ భారీ కుంభకోణం వెలుగు చూడటంతో మార్కెట్లో జ్యువెల్లరీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో పలుషేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతేకాదు పీఎన్బీ ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 7వేల కోట్లు ఆహుతైపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లావాదేవీల్లో భారీగా అక్రమాలు ఆరోపణల నేపథ్యంలో మార్కెట్ లో ఆందోళన నెలకొంది. దీంతో అటు జ్యువెలరీ, బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతోపాటు ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ముంబై బ్రాంచీలో సుమారు రూ. 11,400 కోట్లమేర అక్రమ లావాదేవీలు జరిగిన నేపథ్యంలో జ్యువెలరీ స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాల వెల్లువ సాగింది. ముఖ్యంగా పీసీ జ్యువెలర్స్ షేరు దాదాపు 9 శాతం పతనంకాగా గీతాంజలి జెమ్స్ షేర్ లో అదే ధోరణి. ఇంకా తంగమాయిల్ జ్యువెలరీ , టీబీజెడ్, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, రినైసన్స్ జ్యువెలరీ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేరు కూడా దాదాపు 13 శాతం కుప్పకూలింది. రెండు రోజుల్లో మొత్తం 18శాతం నష్టపోయింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు మూడు వేలకోట్ల రూపాయలను కోల్పోగా, సీబీఐ ప్రకటన వెలువడిన వెంటనే గురువారం మరో నాలుగు వేల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సందర ఆవిరైపోయింది. దీంతో మొత్తం రూ7వేల కోట్ల సంపద నిమిషాల్లో గాల్లో కలిసిపోయింది. మరోవైపు ఇప్పటికే పీఎన్బీలో జరిగిన కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌తోపాటు సీబీఐ పలు వ్యక్తులపై కేసులు నమోదు చేశాయి. ఫైర్‌స్టార్ డైమండ్ కంపెనీ చీఫ్ నీరవ్ మోదీతోపాటు, అతడి భార్య, సోదరుడు, తదితరులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
చైనా పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు
హైదరాబాద్: చైనా పర్యటనకు బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం ఇవాళ తెల్లవారుజామున హాంకాంగ్ చేరుకుంది. అక్కడి నుంచి మూడు గంటల అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం జరిగే టియాంజిన్ పట్టణానికి చంద్రబాబు బృందం బయలు దేరింది. చైనాతో రాజకీయ, వ్యాపార సంబంధాలను మెరుగుపరచుకొనే లక్ష్యంతో చంద్రబాబు చైనా పర్యటనకు బయలుదేరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు చైనా కంపెనీలను ఆయన ఆహ్వానించనున్నారు. -
ఈ నాలుగు ముఖ్యం
ఈక్విటీలు గత కొన్నేళ్లుగా ఆశించిన లాభాలను ఇవ్వకపోవడంతో ఇన్వెస్టర్లు డెట్ ఫండ్లు, బంగారం వంటి ఇతర ప్రత్యామ్నాయాలపైకి దృష్టి మళ్లించారు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి పసిడిలో పెట్టుబడులు పెట్టారు. 2011 అక్టోబర్ నుంచి 2013 మే మధ్యకాలంలో (ఈ వ్యవధిలో రెపో రేటు 8 శాతం పైనుంచి 7.25 శాతానికి తగ్గింది) రిజర్వు బ్యాంకు అనుసరించిన విధానాల కారణంగా డెట్ ప్రొడక్టుల్లో పెట్టుబడులు పెట్టిన వారికి 10% వరకు ఆదాయం లభించింది. 2013 జూన్ తర్వాత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్లలో అసాధారణ అస్థిరత్వం నెలకొంది. ఈ సమస్యను అధిగమించేందుకు లిక్విడిటీని కట్టడి చేసే చర్యలను రిజర్వు బ్యాంకు చేపట్టింది. స్థూల ఆర్థిక వాతావరణం మెరుగుపడడంతో ఆ చర్యల ఉపసంహరణను రిజర్వు బ్యాంకు క్రమంగా అమలుచేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రెపో రేటును ఆర్బీఐ మరోమారు 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందనేది మార్కెట్ అంచనా. కనుక, మీ కష్టార్జితాన్ని డెబిట్ ప్రొడక్టుల్లో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవేమిటంటే... {పొడక్టుపై వసూలు చేసే చార్జీలను పరిశీలించాలి. చార్జీల వ్యయం అధికంగా ఉంటే ఆ మేరకు ఆదాయం తగ్గిపోతుంది. {పొడక్టుకు ఉన్న క్రెడిట్ రేటింగ్‌ను చూడాలి. సొమ్మును ఎలాంటి పథకాల్లో పెట్టుబడి పెడతారో గమనించాలి. అధిక ఆదాయం ఉన్నదంటే.. తక్కువ రేటింగ్ కలిగిన ఇన్‌స్ట్రుమెంట్లపై ఈ ప్రొడక్టు దృష్టి కేంద్రీకరిస్తుందన్న మాట. టాక్స్-ఫ్రీ బాండ్లు మినహా, ఇతర బాండ్ల విషయంలో పన్ను భారం ఉంటుంది. తక్కువ పన్ను సౌలభ్యం డెట్ ఫండ్లలో ఉంది. డెబిట్ మ్యూచువల్ ఫండ్లలో ఏడాదికి మించి చేసే పెట్టుబడులపై ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను(ద్రవ్యోల్బణం పెరుగుదల) కోరడం ద్వారా పెట్టుబడిదారులు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. గత కొన్ని నెలలుగా కొంత అస్థిరత్వం ఉన్నప్పటికీ, ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, డిబెంచర్లు, డెబిట్ మ్యూచువల్ ఫండ్లు (ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్లు, షార్ట్ టర్మ్ ఫండ్ల వంటివి) అధిక రాబడి ఇస్తూనే ఉన్నాయి. డెబిట్ ఫండ్లలో పెట్టుబడులను నాలుగు అంశాల ఆధారంగా చేయాలి. అవి: 1. ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ 2. ప్రొడక్టులు 3. పోర్ట్‌ఫోలియోలు 4. పనితీరు. -
సహారా సుబ్రతా మరికొన్నాళ్లు జైల్లోనే
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల నిధుల చెల్లింపు వివాదం కేసులో సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్‌కి సుప్రీం కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం చేపట్టాల్సిన విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఇందుకు గల కారణాలు వెల్లడి కాకపోయినప్పటికీ.. చెల్లింపులకు సంబంధించి సహారా నిర్మాణాత్మకమైన ప్రతిపాదనేదీ సమర్పించలేకపోవడమే దీనికి దారి తీసి ఉంటుందని భావిస్తున్నారు. ఈ పరిణామంతో సుబ్రతా రాయ్ మరికొన్నాళ్లు జైల్లో గడపాల్సి రానుంది. ఈ నేపథ్యంలో సంబంధిత బెంచ్ ముందు సహారా గ్రూప్ ఈ అంశాన్ని ప్రస్తావించి, విచారణ తేదిని సాధ్యమైనంత త్వరగా నిర్ణయించాలని కోరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సముచిత ప్రతిపాదనతో మార్చి 11న (మంగళవారం) రావాలంటూ ఈ నెల 7న విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, సోమవారం సుప్రీం కోర్టు వెబ్సైటులో ఉంచిన వివరాల ప్రకారం కేసును వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రూ. 20,000 కోట్ల పైచిలుకు చెల్లింపులకు సంబంధించి మార్చి 4న సుబ్రతా రాయ్‌తో పాటు మరో ఇద్దరు డెరైక్టర్లను సుప్రీంకోర్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. -
తొలి పెట్టుబడికి బ్యాలెన్స్డ్ ఫండ్స్ బెస్ట్
నేను నెలకు రూ.2,000 చొప్పున ఏదో ఒక ఫండ్‌లో 10-15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నా డబ్బులు వెనక్కి తీసుకునే అవకాశమున్న ఏదైనా ఒక స్కీమ్‌ను సూచించండి? - అవినాశ్, అనంతపురం మీరు ఓపెన్‌ఎండెడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ డబ్బులను తీసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఏడాది లోపు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే, మీరు ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఈ ఈక్విటీ ఫండ్స్ నుంచి ఏమైనా లాభాలు పొందితే, షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీరు మొదటిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, బ్యాలెన్స్డ్ ఫండ్‌తో మొదలు పెట్టండి. 2-3 ఏళ్లలో మీకు ఈక్విటీ మార్కెట్ల గురించి ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఈక్విటీ ఫండ్స్‌కు మారవచ్చు. సిప్ విధానంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూ చిప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్‌లో నా పెట్టుబడులను కొనసాగించమంటారా? - నందిత, నందిగామ ఈ ఫండ్ ప్రారంభమై, ఐదేళ్లయింది. అయినా మంచి పనితీరునే కనబరుస్తోంది. ఐదేళ్ల ఫండ్ రాబడులను చూస్తే 23 శాతం రాబడులనిచ్చింది. తన ఇన్వెస్ట్‌మెంట్స్‌ల్లో దాదాపు 83 శాతానికి పైగా ఈ ఫండ్ లార్జ్‌క్యాప్ స్టాక్స్‌ల్లోనే ఇన్వెస్ట్ చేస్తోంది. పరిమితమైన స్టాక్స్‌పైనే దృష్టి సారిస్తున్న ఫోకస్డ్ ఫండ్ ఇది. మరో వైపు వివిధీకరణకు కూడా ప్రాధాన్యతనిస్తోంది. మొత్తం మీద ఈ ఫండ్ పనితీరు బావుందని చెప్పొచ్చు. ఒక్క 2011లోనే ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. మీరు ఈ ఫండ్‌లో కొనసాగవచ్చు. ప్రస్తుతం పన్ను ఆదా చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఏదీ మార్కెట్లో లేదు. పన్ను ఆదా చేసే మార్గాలను సూచించండి. -క్రిష్టోఫర్, హైదరాబాద్ మౌలిక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి పన్ను ఆదా చేసే ఇన్ఫ్రా బాండ్లను పరిమిత కాలానికి అందుబాటులోకి తెచ్చారు. ఈ బాండ్లలో పెట్టుబడులకు సెక్షన్ 80 సీసీఎఫ్ కింద రూ.20 వేల వరకూ పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఏడాది నుంచి ఈ సౌకర్యానికి కోత పడింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో కొన్ని పన్ను-ఆదా బాండ్లు ఉన్నాయి. ఈ బాండ్ల మీద వచ్చే వడ్డీ ఆదాయానికి పన్ను ఆదా లభిస్తుంది. అయితే ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన మొత్తం పన్నుకు అర్హమయ్యే ఆదాయానికి కలుస్తుంది. సెక్షన్ 80 సీ కింద కాకుండా ఇతర సెక్షన్ల కింద లభించే పన్ను తగ్గింపుల వివరాలు.... సెక్షన్ 80డి: సొంతానికి, భాగస్వామికి, పిల్లలకు, తల్లిదండ్రులకు తీసుకున్న వైద్య బీమాకు చెల్లించే ప్రీమియం. సెక్షన్ 24: గృహరుణంపై చెల్లించే వడ్డీ. రుణం తీసుకున్న గృహంలోనే ఉంటున్నట్లయితే ఈ రుణంపై చెల్లించిన వడ్డీ గరిష్ట మొత్తం రూ.1.5 లక్షల వరకు, అద్దెకిచ్చిన గృహం..సంబంధిత గృహ రుణంపై వడ్డీకి గరిష్ట మొత్తానికి ఇంత అని పరిమితి లేదు. సెక్షన్ 80ఈ: గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ఫుల్టైమ్ కోర్సుల కోసం తీసుకున్న విద్యా రుణంపై వడ్డీకి పన్ను తగ్గింపులు లభిస్తాయి. అయితే అసలు చెల్లింపులపై ఎలాంటి పన్ను ప్రయోజనాలు లేవు. సెక్షన్ 80జి: ధార్మిక సంస్థలు, ఇతరత్రా ఫండ్స్‌కు ఇచ్చిన డొనేషన్లపై 50 నుంచి 100 శాతం వరకూ పన్ను తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ విరాళాలకు సంబంధించిన మొత్తం మీ స్థూల ఆదాయంలో 10 శాతానికి మించి ఉండకూడదు. సెక్షన్ 80డిడి: మీపై ఆధారపడిన వికలాంగులకు అయిన మెడికల్ ట్రీట్మెంట్పై రూ.50,000 నుంచి రూ.1 లక్ష వరకూ తగ్గింపు పొందవచ్చు. సెక్షన్ 80డిడిబి: కిడ్నీ వైఫల్యం, పార్కిన్సన్ వ్యాధి కొన్ని ఎంపిక చేసిన వ్యాధుల ట్రీట్మెంట్కు అయ్యే వ్యయంపై 65 ఏళ్లలోపు వారికి రూ.40,000 వరకూ తగ్గింపులు పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకైతే ఈ మొత్తం రూ.60,000 ఉంటుంది. సెక్షన్ 80 సిసిజి: రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడులు. ధీరేంద్ర కుమర్ ,సీఈవో,వాల్యూ రీసెర్చ్ -
ఎగ్జిట్ పోల్స్‌తో దూకుడు
తాజాగా జరిగిన ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపాగా వేయనుందన్న అంచనాలు మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. మిజోరం మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోగలదన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సెంటిమెంట్‌కు ఊపునిచ్చాయని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి సెన్సెక్స్ ఆదిలోనే 457 పాయింట్లు జంప్‌చేసి 21,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించింది. గరిష్టంగా 21,166ను తాకింది. ఆపై కొంతమేర నెమ్మదించినప్పటికీ రోజంతా లాభాల్లోనే కదిలింది. చివరకు 249 పాయింట్ల లాభంతో 20,958 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ కూడా 80 పాయింట్లు ఎగసి 6,241 వద్ద నిలిచింది. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి సైతం ఇంట్రాడేలో 61.53కు బలపడటం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చింది. దీంతో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. బ్యాంకింగ్ దూకుడు బీఎస్ఈలో ప్రధానంగా బ్యాంకెక్స్ 4.5%, క్యాపిట్ గూడ్స్ 3.6% చొప్పున ఎగశాయి. ఐసీఐసీఐ 7%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4.5% చొప్పున దూసుకెళ్లగా, యస్ బ్యాంక్, కెనరా, యాక్సిస్, యూనియన్ బ్యాంక్ 6-4% మధ్య జంప్ చేశాయి. ఇక క్యాపిటల్ గూడ్స్ షేర్లు ఏబీబీ, ఎల్అండ్టీ, భెల్ , క్రాంప్టన్ గ్రీవ్స్ 4% స్థాయిలో ఎగశాయి. ఈ బాటలో ఇతర దిగ్గజాలు మారుతీ, కోల్ ఇండియా, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఆర్ఐఎల్ 3.7-1.6% మధ్య పుంజుకున్నాయి. హెల్త్‌కేర్ డీలా వివిధ కారణాల నేపథ్యంలో హెల్త్‌కేర్ షేర్లు ఫైజర్, వైత్(ఎక్స్డివిడెండ్), స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్, జూబిలెంట్ లైఫ్(యూఎస్ ఎఫ్‌డీఏ హెచ్చరికలు) 25-10% మధ్య పతనంకాగా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, అరబిందో, లుపిన్ సైతం 2.2-1.2% మధ్య నీరసించాయి. దీంతో హెల్త్‌కేర్ రంగం 1.5% నష్టపోయింది. ఇక ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు ఐటీసీ, హెచ్‌యూఎల్ 1% స్థాయిలో నష్టపోయాయి. ఎఫ్ఐఐల జోరు ఎఫ్ఐఐలు దాదాపు రూ. 1,152 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 674 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. కాగా, ట్రేడైన షేర్లలో 1,253 లాభపడగా, 1,258 డీలాపడ్డాయి. గురువారం ట్రేడింగ్‌లో ఇన్ఫ్రా షేర్లు వెలుగులో నిలిచాయి. మిడ్‌క్యాప్స్‌లో ఐవీఆర్సీఎల్, కల్పతరు, ఎన్సీసీ, ఐడీఎఫ్సీ, జిందాల్ స్టెయిన్లెస్, హెచ్‌సీసీ, స్వాన్ ఎనర్జీ, జీవీకే పవర్, జేఎంసీ ప్రాజెక్ట్స్, ఐఆర్బీ ఇన్ఫ్రా 18-6% మధ్య దూసుకెళ్లాయి. -
మార్కెట్లు నింగికి సంపద నేలకు!
ముంబై: ఏడాది కాలంలో అంటే జనవరి 1 నుంచి సెన్సెక్స్ 4% పుంజుకోగా, ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు మాత్రం దాదాపు రూ. 3.5 లక్షల కోట్లమేర చిల్లుపడటం విశేషం! 2012 డిసెంబర్ 31న 19,426 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ ఈ నెల 22కల్లా 20,217కు ఎగసింది. ఇది 791 పాయింట్ల లాభం! ఇదే కాలంలో ఇన్వెస్టర్ల సంపద మాత్రం రూ. 3.46 లక్షల కోట్లు ఆవిరై రూ. 66.39 లక్షల కోట్లకు పరిమితమైంది. కాగా, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ 11 నెలల కాలంలో రూ. 96,461 కోట్లు (17.4 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. అయితే ఇందుకు విరుద్ధమైన రీతిలో 2012 ఏడాదిలో సెన్సెక్స్ 25% పుంజుకుంటే ఇన్వెస్టర్ల సంపద (లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ) 27% ఎగసి రూ. 67.7 లక్షల కోట్లకు చేరింది. ఇదే కాలంలో ఎఫ్ఐఐలు రూ. 1,27,455 కోట్లు(24 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. కాగా, ఓవైపు డాలరుతో మారకంలో రూపాయి విలువ క్షీణించడం, మరోపక్క అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్యాకేజీల ఉపసంహరణ సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ ఈ ఏడాది ఎఫ్ఐఐలు దేశీ స్టాక్స్‌ను కొనుగోలు చేస్తూ రావడం చెప్పుకోదగ్గ అంశం. ఫలితంగా మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ ఈ ఏడాది ఆగస్ట్ 28న 52 వారాల కనిష్ట స్థాయికి పడినప్పటికీ, తిరిగి ఈ నెల 3కల్లా 21,321 పాయింట్లకు దూసుకెళ్లింది. ఇది దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే కొత్త గరిష్టం! దీంతో పోలిస్తే ప్రస్తుతం సెన్సెక్స్ 5%పైగా(1,104 పాయింట్లు) క్షీణించింది. -
దేశం విడిచి వెళ్లొద్దు...
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను తిరిగిచ్చే అంశానికి సంబంధించిన కేసులో సహారా గ్రూప్‌నకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. రూ. 20,000 కోట్ల విలువ చేసే ఆస్తుల టైటిల్ డీడ్స్‌ను సెబీకి సమర్పించాలన్న ఆదేశాలను సహారా సరిగ్గా పాటించలేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్‌తో పాటు మిగతా డెరైక్టర్లు వందనా భార్గవ, రవి శంకర్ దూబే, అశోక్ రాయ్ చౌదరీ దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. అలాగే గ్రూప్‌లోని ఏ సంస్థా కూడా తమ అనుమతి లేకుండా ఎటువంటి ఆస్తిని విక్రయించడానికి వీల్లేదని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ ఖెహర్‌లతో కూడిన బెంచ్ స్పష్టంచేసింది. గురువారం జరిగిన వాదనల సందర్భంగా.. తాము సుప్రీం కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించామంటూ సహారా గ్రూప్ తరఫు న్యాయవాది సీఏ సుందరం న్యాయమూర్తులకు తెలియజేశారు. అయితే, సహారా గ్రూప్ అసెట్ల విలువను ఉండాల్సిన స్థాయికంటే ఎక్కువ చూపిందని, పైగా రూ. 20,000 కోట్ల విలువ చేసే ఒరిజినల్ టైటిల్ డీడ్స్ ఇవ్వలేదని సెబీ న్యాయవాది అరవింద్ దత్తార్ పేర్కొన్నారు. వెర్సోవాలోని 106 ఎకరాల స్థలం అధికారిక విలువ కేవలం రూ. 118.42 కోట్లు ఉండగా, సహారా దానికి రూ.19,000 కోట్ల విలువ కట్టిందని దత్తార్ తెలిపారు. పైగా ఇది గ్రీన్ జోన్లో ఉండటం వల్ల ఇతరత్రా అభివద్ధికీ ఉపయోగపడదన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు బెంచ్.. ఈ మొత్తానికి సరిపడేలా సహారా ఆస్తులు ఇతరత్రా ఇంకా ఏమైనా ఉన్నాయేమో గుర్తించాలని దత్తార్కి సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 11కి వాయిదా వేసింది. -
పడగొట్టిన ‘ఫెడ్’!
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్(ఫెడ్) ఆర్థిక ఉద్దీపన కోసం విడుదల చేస్తున్న నిధుల్ని క్రమేపీ తగ్గించే ప్రక్రియను త్వరలోనే మొదలుపెడుతుందన్న భయాలతో స్టాక్ సూచీలు వరుసగా రెండోరోజు భారీ నష్టాల్ని చవిచూసాయి. గురువారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. దాంతో 406 పాయింట్లు పతనమై 20,229 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకేరోజున ఇంతగా క్షీణించడం రెండున్నర నెలల తర్వాత ఇదే ప్రధమం. సెప్టెంబర్ 3న సెన్సెక్స్ 652 పాయింట్లు పడింది. బుధ, గురువారాల్లో కలిపి 662 పాయింట్లు తగ్గింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇండెక్స్ 124 పాయింట్ల నష్టంతో 6,000 పాయింట్ల దిగువన ముగిసింది. ఫెడ్ ఎఫెక్ట్ ఏమిటి.... బ్యాంకింగ్ వ్యవస్థలోకి అమెరికా ఫెడ్ విడుదల చేస్తున్న పుష్కల నిధుల ఫలితంగానే కొద్ది నెలల నుంచి ఇండియాతో సహా పలు ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లు పెరుగుతున్నాయి. ప్రతీ నెలా 85 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను బ్యాంకుల నుంచి కొనుగోలుచేయడం ద్వారా ఫెడ్ వ్యవస్థలోకి నిధుల్ని విడుదల చేస్తుంది. అయితే ఇటీవల అమెరికా ఆర్థికవ్యవస్థ కోలుకుంటున్నట్లు గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో ఫెడ్ బాండ్ల కొనుగోలుకు నిర్దేశించుకున్న మొత్తాన్ని క్రమేపీ తగ్గిస్తుందన్న(టేపరింగ్) అంచనా లు ఇటీవల పెరిగాయి. ఆర్థికాభివృద్ధికి సంబంధించి, మరింత మెరుగైన డేటా వెలువడేంతవరకూ ఉద్దీపన ప్యాకేజీ కొనసాగుతుందంటూ ఫెడ్ ప్రస్తుత ఛైర్మన్ బెన్ బెర్నాంకీ, కాబోయే ఛైర్పర్సన్ జెనెత్ యెలెన్లు ఇటీవల ప్రకటించినా, మార్కెట్లో మాత్రం టాపరింగ్ భయాలు వారానికోమారు తలెత్తుతూనే వున్నాయి. బుధవారం వెల్లడైన ఫెడ్ కమిటీ సమావేశపు మినిట్స్ ఈ భయాలను మరింత పెంచాయి. అక్టోబర్ చివరివారంలో జరిగిన ఫెడ్ కమిటీ సమావేశానికి సంబంధించిన ఈ మినిట్స్ ప్రకారం...ఆర్థిక వ్యవస్థ ఆశించినరీతిలో కొలుకుంటున్నందున బాండ్ల కొనుగోలు మొత్తాన్ని తగ్గించడం మంచిదన్న అభిప్రాయాన్ని కమిటీ సభ్యులు వ్యక్తంచేసారు. ఈ మినిట్స్ ఫలితంగా బంగారం, వర్థమాన మార్కెట్ల షేర్లు, కరెన్సీలు క్షీణించడం, డాలరు బలపడటం జరిగింది. అన్ని రంగాల్లోనూ అమ్మకాలు... అన్ని రంగాల షేర్లనూ ఇన్వెస్టర్లు విక్రయించారు. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో పతనశాతం ఎక్కువగా వుంది. మరోవైపు రూపాయి మారకపు విలువ 63 స్థాయికి తగ్గినా, ఐటీ, ఫార్మా షేర్లు కూడా లాభాల స్వీకరణ ఫలితంగా క్షీణించాయి. ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్‌లు నాలుగూ కలిపి సెన్సెక్స్‌లో 171 పాయింట్ల నష్టానికి కారణమయ్యాయి. వీటిలో పాటు సిమెంటు షేర్లు ఏసీసీ, అంబూజా సిమెంట్ లతో పాటు యాక్సిస్‌బ్యాంక్, సేసా స్టెరిలైట్, లార్సన్ అండ్ టూబ్రోలు 3-4 శాతం మధ్య తగ్గాయి. మిడ్‌సైజ్ పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు కెనరా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్‌లు 4-5 శాతం మధ్య పడిపోయాయి. ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో బుల్ ఆఫ్‌లోడింగ్.... నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టుతోపాటు ప్రధాన స్టాక్ ఫ్యూచర్స్ నుంచి ఇన్వెస్టర్లు వైదొలగడంతో దాదాపు అన్ని కాంట్రాక్టుల్లోనూ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) కట్ అయ్యింది. ఈ ఏడాది మంచి లాభాలందించిన ఫ్యూచర్ పొజిషన్లను సంవత్సరాంతపు లాభాల స్వీకరణలో భాగంగా విదేశీ ఇన్వెస్టర్లు విక్రయిస్తున్నారని, ప్రస్తుత మార్కెట్ పతనానికి ఈ బుల్ ఆఫ్‌లోడింగ్ కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్ ఓఐ నుంచి తాజగా 13.86 లక్షల షేర్లు కట్ అయ్యాయి. 6,000, 6,100 స్ట్రయిక్స్ వద్ద కాల్ రైటింగ్ కారణంగా ఈ ఆప్షన్లలో ఓఐ వరుసగా 25 లక్షలు, 16 లక్షల షేర్ల మేర పెరిగింది. 6,100 పుట్ ఆప్షన్ నుంచి 13 లక్షల షేర్లు కట్‌కాగా, 6,000 పుట్ ఆప్షన్లో స్వల్పంగా 1.11 లక్షల షేర్లు యాడ్ అ య్యాయి. 6,000 పుట్ ఆప్షన్లో మొత్తం ఓఐ 58 లక్షల షేర్లవరకూ వుండగా, 6,100 కాల్ ఆప్షన్లో 50.52 లక్షల షేర్ల బిల్డప్ వుంది. సమీప భవిష్యత్తులో 6,000పైన నిఫ్టీ స్థిరపడితే 6,100 స్థాయిని చేరవచ్చని, 6,000 మద్దతును అధిక ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే మరింత పతనం కావొచ్చని డేటా సూచిస్తున్నది. -
విదేశీ ఫండ్స్‌పై భారతీయుల క్రేజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పుడు దేశీయ ఇన్వెస్టర్లు డాలర్లు, యూరోల్లో ఇన్వెస్ట్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. విదేశీ ఫండ్స్ ముఖ్యంగా అమెరికా, యూరో దేశాల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ అధిక లాభాలను అందిస్తుండటంతో వీటిపై ఆసక్తిని కనపరుస్తున్నారు. ఒకపక్క దేశీయ మ్యూచువల్ ఫండ్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు వైదొలుగుతుంటే, విదేశీ ఫండ్స్‌లో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో అమెరికా, యూరప్ దేశాల ఫండ్స్ 40 నుంచి 50 శాతం దాకా రాబడులను అందించాయి. కాని ఇదే సమయంలో మన సెన్సెక్స్ కేవలం 13 శాతం, నిఫ్టీ 11 శాతం రాబడులను మాత్రమే అందించాయి. దేశీయ ఫండ్స్ కంటే అమెరికా, యూరప్ ఫండ్స్ అధిక లాభాలను అందించడానికి రూపాయి క్షీణత కూడా దోహదం చేసిందంటున్నారు నిపుణులు. గడిచిన ఏడాది కాలంలో అమెరికా మార్కెట్లు 26 శాతం రాబడిని అందిస్తే ఇదే సమయంలో రూపాయి విలువ 18 నుంచి 20 శాతం క్షీణించింది. కొత్త పథకాల వెల్లువ: ఇండియాతో పోలిస్తే గత రెండేళ్ళుగా అమెరికా వృద్ధి రేటు బాగుండటం, అక్కడి మార్కెట్లు పెరుగుతుండటంతో దేశీయ ఇన్వెస్టర్లు ఈ విదేశీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.శరత్ శర్మ చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో ఇండియాలో నిర్వహిస్తున్న అమెరికా ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.251 కోట్ల నుంచి రూ.658 కోట్లకు చేరిందంటే, వీటిపై ఏ విధంగా ఆసక్తి చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు విదేశీ ఫండ్స్‌ను ప్రారంభించడానికి అనుమతి కోరుతూ సెబీ తలుపులు తడుతున్నాయి. కోటక్, రెలిగేర్, పైన్ బ్రిడ్జ్ ఇండియాలు అమెరికా ఫండ్స్‌ను ప్రారంభించడానికి సెబీకి దరఖాస్తు చేసుకోగా, జేపీ మోర్గాన్, రెలిగేర్ సంస్థలు యూరోప్ ఫండ్, రిలయన్స్ జపాన్ ఫండ్స్‌ను ప్రారంభించడానికి రెడ్ హెర్రింగ్ ప్రోస్పెక్టస్ను దాఖలు చేసుకున్నాయి. ఇవికాకుండా ఎస్బీఐ వంటి మరికొన్ని సంస్థలు ఇదే ఆలోచనలో ఉన్నాయి. తాము కూడా గ్లోబల్ ఫండ్స్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నామని, ఇందుకోసం అమెరికాలో ఒక భాగస్వామిని వెతికే పనిలో ఉన్నామని, ఇదంతా ఇంకా ప్రారంభ దశలోనే ఉందని శర్మ పేర్కొన్నారు. రూపీ రిస్క్ ఉంటుంది అమెరికా మార్కెట్ లాభాలకు తోడు, దేశీయ కరెన్సీ పతనంతో దేశీయ ఇన్వెస్టర్లు రెండిందాల లాభపడ్డారని, కాని ప్రతీసారి అదే విధమైన పరిస్థితులు ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది కూడా రూపాయి ఇదే విధంగా పతనమవుతుందని ఆశించడం ఆత్యాశ అవుతుందన్నది వారి అభిప్రాయం. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్ల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లే ఎక్కువ లాభాలను అందిస్తాయని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి పేర్కొన్నారు. ఒక్కసారి మన ఆర్థిక వ్యవస్థ కుదుటపడి, కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే రూపాయి విలువ పెరుగుతుందని, ఆ మేరకు ఈ ఫండ్స్ లాభాలు తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది కాలానికి ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయోచ్చని, అది కూడా మొత్తం పోర్ట్‌ఫోలియోలో 10 శాతం మించకుండా చూసుకోమని సతీష్ సూచిస్తున్నారు. టాప్5 విదేశీ ఫండ్స్ పథకం పేరు- ఎన్ఏవీ(రూ.లలో)- ఏడాది రాబడి% ఎఫ్టీ ఇండియా యూఎస్ ఆపర్చునుటీస్- 16.57 - 52 మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 - 207.36 - 46 ఐసీఐసీఐ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ -15.13 - 45 డీఎస్‌పీబీఆర్ యూఎస్ ఫ్లెక్సిబుల్ -14.06 - 39 డీడబ్ల్యూఎస్ గ్లోబల్ థీమటిక్ ఆఫ్‌షోర్- 12.74 - 37 -
నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో షార్ట్ రోలోవర్స్....
నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి నవంబర్ కాంట్రాక్టుకు వరుసగా రెండురోజులపాటు పెద్ద ఎత్తున లాంగ్ రోలోవర్స్ జరగ్గా, బుధవారం మాత్రం షార్ట్ రోలోవర్స్ ఊపందుకున్నట్లు డేటా సూచిస్తున్నది. స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి చేరువవుతుండటంతో ముందుజాగ్రత్త చర్యగా ఇన్వెస్టర్లు వారి క్యాష్ పోర్టఫోలియోలను సంరక్షించుకోవడానికి కొద్దిమోతాదులో నిఫ్టీ ఫ్యూచర్లో షార్ట్ పొజిషన్లను రోలోవర్ చేసుకున్నారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. తాజాగా నవంబర్ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 27 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 1.88 కోట్ల షేర్లకు పెరిగింది. అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ ప్రారంభానికి ముందురోజున..అంటే సెప్టెంబర్ 25న అక్టోబర్ నిఫ్టీ ఫ్యూచర్ మొత్తం ఓఐ 1.36 కోట్ల షేర్ల మేరకే వుంది. అక్టోబర్ సిరీస్ ప్రారంభంలో స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం రూ. 55 వుండగా, నవంబర్ ఫ్యూచర్లో ఇప్పుడది రూ. 48కు పరిమితమయ్యింది. క్రితం రోజుతో పోల్చిచూసినా ప్రీమియం రూ. 9వరకూ తగ్గడం షార్ట్ రోలోవర్స్కు సంకేతం. ఈ దఫా అటు లాంగ్, ఇటు షార్ట్ రోలోవర్స్ జోరుగా పెరగడంతో ఓఐ 2 కోట్ల షేర్లకు చేరువవుతున్నది. రానున్న కొద్దిరోజుల్లో మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని ఈ అధిక ఓపెన్ ఇంట్రస్ట్ సూచిస్తున్నది. -
ఒకే రకమైన రైడర్లున్న రెండు పాలసీలొద్దు
గడువు తేదీ(మెచ్యూరిటీ)కి ముందే ఎఫ్ఎంపీ(ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్) నుంచి వైదొలగవచ్చా? - హర్షిణి, హైదరాబాద్ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్ఎంపీ) అంటే నిర్ణీత కాలానికి నిర్దేశించిన ప్లాన్లనే చెప్పాలి. అయితే ఇన్వెస్టర్లు ఈ ప్లాన్ల నుంచి ముందే వైదొలిగే వెసులుబాటు కల్పించాల్సిందేనని మ్యూచువల్ఫండ్ కంపెనీలకు సెబీ ఆదేశాలిచ్చింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో లిస్టింగ్ అనే రూట్ ద్వారా ఎఫ్ఎంపీ(క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్)నుంచి ముందే వైదొలిగే అవకాశం ఉంది. ఎఫ్ఎంపీకి సంబంధించి క్లోజ్డ్ ఎండ్ ఫండ్ నుంచి మీరు వైదొలగాలనుకుంటే మీరు స్టాక్ మార్కెట్లో వాటిని విక్రయించుకోవచ్చు. అయితే వీటిని కొనుగోలు చేసే కొనుగోలుదారులు దొరకడం కొంచెం కష్టమైన పనే. క్లోజ్డ్ ఎండ్ ఫండ్ కనుక నిర్దేశిత కాలానికి ఈ ఫండ్ సొమ్ములు లాక్ ఇన్ అయి ఉంటాయి. అందుకే ఇది లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్ కాదని చెప్పవచ్చు. అందుకే అత్యవసర సమయాల్లో మనం ఎఫ్ఎంపీలపై ఆధారపడలేం. ఈ ఏడాది జనవరి నుంచే ఎఫ్ఎంపీలు ట్రేడవుతున్నాయి. 20 రోజుల్లో బీఎస్‌లో 8, ఎన్ఎస్ఈలో 9 స్కీమ్‌లు మాత్రమే చేతులు మారాయి. ఈ ఏడాది కొన్ని స్కీమ్‌లకు సంబంధించిన లావాదేవీలు కొన్ని లక్షలున్నప్పటికీ, రోజుకు వంద మాత్రమే ఉండడం గమనించదగ్గ విషయం. అందుకే ఎఫ్‌ఎంపీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు లిక్విడిటీ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. లిక్విడ్, గోల్డ్ ఈ రెండు ఫండ్స్‌లో చెరొక దాంట్లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేశాననుకోండి. ఏడాది తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ మొత్తం రూ.1.1 లక్షలయిందనుకుందాం. ఈ ఆదాయమంతా పన్నురహితమైనదేనా? ఇండెక్సేషన్ ప్రభావం ఎలా ఉంటుంది? - శ్రీరామ్, విశాఖపట్నం గోల్డ్, లిక్విడ్ ఫండ్స్లపై పన్ను ఒకే విధంగా ఉంటుంది. మీ విషయంలో ఏడాది తర్వాత మీకు వచ్చే రిటర్న్‌ల్లో లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను (10 శాతం ఫ్లాట్ లేదా 20 శాతం (ఇండెక్సేషన్ మదింపు తర్వాత) విధిస్తారు. ఇండెక్సేషన్ ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్‌పై వచ్చే లాభాలను ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసుకోవచ్చు. మీ పెట్టుబడులపై మీరు ఆర్జించిన వాస్తవ రాబడులు ద్రవ్యోల్బణం సంచిత ప్రభావం వల్ల తగ్గుతాయి. ఉదాహరణకు మీరు పెట్టిన పెట్టుబడి 15 ఏళ్లలో నాలుగింతలైందనుకుందాం. ద్రవ్య కొనుగోలు శక్తి మీరు పెట్టుబడి పెట్టిన కాలంతో పోల్చితే ఇప్పటికి సగానికి కంటే తక్కువకే పడిపోతుంది. ఇండెక్సేషన్ ప్రకారమైతే, మీరు ఆర్జించిన లాభాలు ద్రవ్యోల్బణం కారణంగా హరించుకుపోతే, ఆ మొత్తంపై ప్రభుత్వం పన్ను విధించదు. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ విషయమై ఇన్వెస్టర్లు కోల్పోయే కొనుగోలు శక్తి నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ఇన్వెస్టర్లకు ఈ ప్రయోజనాన్ని కల్పిస్తున్నారు. ఇండెక్సేషన్‌ను ఎలా లెక్కిస్తారంటే.., వ్యయ ద్రవ్యోల్బణ సూచికీ, వాస్తవ ధరలను పోల్చి ఇండెక్సేషన్‌ను లెక్కగడతారు. ఇండేక్సేషన్ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత దీర్ఘకాలిక మూలధన లాభాలను లెక్కిస్తారు. ఆ తర్వాత 20 శాతం పన్ను విధిస్తారు. ఇలా లెక్కించిన పన్ను మొత్తం 10 శాతం ఫ్లాట్ ట్యాక్స్ (ఇండెక్సేషన్‌తో కాకుండా) కంటే అధికంగా ఉంటే, ఆ అధిక మొత్తాన్ని వదిలివేస్తారు. నా వయస్సు 31 సంవత్సరాలు. రూ.70 లక్షలకు ఆన్లైన్ టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. నేను పనిచేసే కంపెనీ తరపు నాకు బీమా ఉన్నప్పటికీ, మరో ఆరోగ్య బీమా పాలసీ తీసుకోమని మిత్రులంటున్నారు. అవసరమా? చాలా ఆన్లైన్ టర్మ్ పాలసీల్లో యాక్సిడెంటల్ కవర్ వంటి రైడర్స్ (ఏగాన్ రెలిగేర్ మినహా) లభించడం లేదు. దేనిని ఎంచుకోవాలి. నాకు తగిన సలహా ఇవ్వండి? - జాన్సన్, నెల్లూరు చిన్న వయసులోనే బీమా పాలసీ తీసుకోవాలనుకోవడం మంచి నిర్ణయం. చిన్న వయసు లోనే బీమా పాలసీ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. మీరు పెద్ద మొత్తానికి పాలసీ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ మొత్తానికి రెండు కంపెనీల పాలసీలు తీసుకోవడం ఉత్తమం. ఫలితంగా డైవర్సిఫికేషన్ ప్రయోజనం లభించి రిస్క్ తగ్గుతుంది. యాక్సిడెంటల్ డెత్ రైడర్‌ను ఏగాన్ రెలిగేర్ ఐటెర్మ్ ప్లాన్ ఆఫర్ చేస్తుంది. క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌పై ప్రీమియంను రద్దు చేసే ఆఫర్‌ను కూడా ఈ ప్లాన్ అందిస్తోంది. ఈ ఆఫర్ వల్ల ఈ ప్లాన్ కవర్ చేసే క్రిటికల్ ఇల్నెస్కు పాలసీదారుడు గురైతే, భవిష్యత్తులో ప్రీమియంలు చెల్లించాల్సిన పనిలేదు. అంతేకాకుండా లైఫ్ కవర్ కూడా కొనసాగుతుంది. ఇలాంటి రైడర్లే ఆఫర్ చేసే కొన్ని ఆన్లైన్ పాలసీలు-బజాజ్ ఆలియంజ్ ఐ సెక్యూర్ ఇన్సూరెన్స్ ప్లాన్, బజాజ్ అలయెంజ్ ఐ సెక్యూర్ మోర్ ఇన్సూరెన్స్ ప్లాన్, బజాజ్ అలయెంజ్ న్యూరిస్క్ కేర్ టూ, బజాజ్ అలయెంజ్ టర్మ్ కేర్. వాటిల్లో నుంచి మీ అవసరాలకు తగ్గట్లుగా పాలసీలను ఎంచుకోండి. కంపెనీ తరపున బీమా ఉన్నప్పటికీ, మరో వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం తప్పనిసరి. మీరు ఆ కంపెనీ నుంచి వైదొలిగితే మీకు బీమా రక్షణ లభించదు. అందుకనే యాక్సిడెంట్లు, క్రిటికల్ ఇల్‌నెస్‌లు, తదితరాలను కవర్ చేసే సమగ్రమైన ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం ఉత్తమం. పాలసీలు తీసుకునే ముందు మీ అవసరాలకనుగుణంగా పాలసీలు ఎంచుకోవాలి. ఆరోగ్య, జీవిత బీమా పాలసీల్లో ఒకే రకమైన రైడర్లు లేకుండా చూసుకోవాలి. -
డిసెంబర్ నాటికి 22వేలకు సెన్సెక్స్: డాయిష్ బ్యాంక్
ముంబై: మెరుగైన వర్షపాతం వంటి సానుకూల పరిణామాలతో ఇన్వెస్టర్లలో నిరాశావాదం క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో సెన్సెక్స్ ఈ డిసెంబర్ నాటికి 22,000 పాయింట్ల రికార్డు స్థాయికి పెరగగలదని జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. గతంలో తాము ప్రకటించిన 21,000 పాయింట్ల లక్ష్యాన్ని సవరించి 22,000కి పెంచుతున్నట్లు తెలిపింది. 2008 జనవరి ఒకటిన 21,206.77 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత మళ్లీ.. గురువారం ఇంట్రాడేలో 21,039 పాయింట్ల స్థాయిని తాకింది. 2008లో సెన్సెక్స్ తన పీఈ నిష్పత్తికి 28.12 రెట్లు ట్రేడ్ కాగా.. గురువారం 18.89 రెట్లు ట్రేడ్ అయ్యింది. కరెంట్ అకౌంట్ లోటు తగ్గుతుండడం, ఎగుమతుల పెరుగుదల ధోరణి వంటి అంశాలను ఈ సందర్భంగా బ్యాంక్ ప్రస్తావించింది. మరోవైపు, పెట్టుబడులకు అనుకూలమైన రంగాల జాబితాలో ఐటీ సర్వీసులను తప్పించి బ్యాంకులను చేర్చింది. ఐటీ సేవలకు న్యూట్రల్ రేటింగ్ ఇచ్చింది. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్ వంటి సంస్థలు మెరుగైన పనితీరు కనబర్చగలవని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. -
చౌకలో షేర్లను కనుక్కొనేదెలా?
ప్రపంచవ్యాప్తంగా షేర్లను ఎంపిక చేసుకోవడానికి ఇన్వెస్టర్లకు అనేక విధానాలు అందుబాటులో ఉన్నా రెండు విధానాలనే ఎక్కువగా అవలంబిస్తుంటారు. వీటిని గ్రోత్ ఇన్వెస్ట్మెంట్, వేల్యూ ఇన్వెస్ట్మెంట్గా పరిగణిస్తారు. ఈ రెండు విధానాల్లో షేర్ల ఎంపిక అనేది పీఈ నిష్పత్తి ఆధారంగానే జరుగుతుంది. కాని ఈ రెండు పూర్తి విభిన్నమైనవి. గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో పీఈ రేషియో ఎక్కువ ఉన్న షేర్లను ఎంచుకుంటే, వేల్యూ ఇన్వెస్ట్మెంట్లో తక్కువ పీఈ నిష్పత్తి ఉన్న షేర్లను ఎంపిక చేసుకుంటారు. వేల్యూ ఇన్వెస్ట్మెంట్ అంటే.. ఫండమెంటల్స్ పరంగా పటిష్టంగా ఉండి కూడా మార్కెట్లోని పరిస్థితుల దృష్ట్యా తక్కువ రేటు వద్ద ట్రేడ్ అవుతున్న షేర్లలో ఇన్వెస్ట్ చేయడాన్నే వేల్యూ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే వాస్తవ విలువ కంటే తక్కువ ధరలో ట్రేడ్ అవుతూ భవిష్యత్తులో పెరగడానికి అవకాశం ఉన్న షేర్లలో ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. ఈ విధానంలో ముఖ్యంగా ఆయా కంపెనీల ఫండమెంటల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. కొన్ని సందర్భాల్లో వ్యాపార పరంగా వృద్ధికి అవకాశం ఉన్నా వివిధ పుకార్లు, లేదా మార్కెట్ సెంటిమెంట్ వంటి వాటి వల్ల షేర్లు బాగా పతనమవుతాయి. ఇలాంటి సందర్భాల్లో వాటిని గుర్తించి ఇన్వెస్ట్ చేయడాన్నే వేల్యూ ఇన్వెస్ట్మెంట్ అంటారు. కంపెనీల సగటు పీఈ నిష్పత్తి కంటే ఎంత తక్కువగా ఉంటే అంత చౌకగా ఈ షేర్లు లభిస్తున్నట్లు. ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే.. రూ.100 వస్తువు రూ.70కే లభిస్తుంటే దాన్ని కొనడం అనేది తెలివైన నిర్ణయమేనా... కాదా? తెలియడం లేదా?... కంపెనీ ఫండమెంటల్స్, పీఈ రేషియో అనేవి సాధారణ ఇన్వెస్టర్లు అందరికీ అర్థం కావు. ఇవి తెలుసుకోవాలంటే రోజువారీ స్టాక్ మార్కెట్ కదలికలపై పట్టు ఉండాలి. వీటిపై అవగాహన లేని వారి కోసం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టాయి. ఇవి తక్కువ పీఈలో ఉన్న షేర్లను కొనుగోలు చేసి అవి అధిక ధరకు చేరిన తర్వాత విక్రయించడం జరుగుతుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌తో పాటు ఇతర మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టాయి. -
పరస్పర ఆమోదనీయ యంత్రాంగం!
న్యూఢిల్లీ: సహారా గూప్ సంస్థలు రెండు నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన సొమ్ములో రూ.19,000 కోట్లను చెల్లించడంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నిధుల చెల్లింపులకు సంబంధించి ఒక యంత్రాంగానికి రూపకల్పన చేయాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, సహారా గ్రూప్‌లకు సూచించింది. కేసుకు సంబంధించి రూ.20,000 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేందుకు సిద్ధమేనా? అని సైతం గ్రూప్ సంస్థలను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఆయా అంశాలపై సెబీ, సహారా గ్రూప్‌లు పరస్పర ఆమోదనీయ అంగీకారానికి రావడానికి వీలుగా కేసు తదుపరి విచారణను అక్టోబర్ 28వ తేదీకి వాయిదా వేసింది. పూర్వాపరాలకు వెళితే- దాదాపు రూ.19,000 కోట్ల నిధుల చెల్లింపుల్లో విఫలం కావడంపై సహారా గ్రూప్‌పై సెబీ దాఖలు చేసిన మూడు కోర్టు ధిక్కార పిటిషన్లు శుక్రవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చాయి. నిధుల చెల్లింపులకు సంబంధించి తన స్థిరాస్తిని పూచీకత్తుగా ఉంచేందుకు సుబ్రతారాయ్ నేతృత్వంలోని గ్రూప్ ఈ సందర్భంగా అంగీకరించింది. అయితే ఈ విషయంలో సెబీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. సేల్‌డీడ్, ఆస్తుల విలువలను ప్రశ్నించింది. కంపెనీనే ప్రతిపాదిత పూచీకత్తు ఆస్తిని విక్రయించి, రెగ్యులేటర్‌కు ఆ సొమ్మును చెల్లించాలని సెబీ న్యాయవాది పేర్కొన్నారు. దీనితో ఈ మొత్తం వ్యవహారంపై పరస్పర ఆమోదనీయమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. ఇటీవల లండన్‌లో గ్రూప్ కొనుగోలు చేసిన రూ. 256 కోట్ల స్థిరాస్తి అంశం ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. మీడియాలో వచ్చిన ఈ వార్తలే నిజమైతే- కేసులో సెబీకి చెల్లించాల్సిఉన్న నిధుల మొత్తం చెల్లించే సామర్థ్యం సహారాకు ఉన్నట్లేనని కోర్టు వ్యాఖ్యానించింది. పూర్వాపరాలు... సహారా గ్రూపులు రెండు- ఎస్‌ఐఆర్‌ఈసీ (సహారా ఇండియా రియల్టీ), ఎస్‌ఐహెచ్‌ఐసీ (సహారా ఇండియా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్) మార్కెట్ నిబంధనలకు విరుద్దంగా ఇన్వెస్టర్ల నుంచి రూ.24,000 కోట్లను వసూలు చేశాయన్నది ఈ కేసులో ప్రధానాంశం. ఈ కేసులో గత ఆగస్టు 31న సుప్రీం రూలింగ్ ఇస్తూ, 2012 నవంబర్ ముగింపునకు ఈ మొత్తాలను 15 శాతం వడ్డీతో సెబీకి రిఫండ్ చేయాలని ఆదేశించింది. అయితే ఇందులో సంస్థ విఫలం కావడంతో గడువును పెంచింది. దీని ప్రకారం తక్షణం రూ.5,120 కోట్ల తక్షణం చెల్లించాలని, రూ.10,000 కోట్లను జనవరి మొదటి వారంకల్లా చెల్లించాలని, మిగిలిన సొమ్మును ఫిబ్రవరి మొదటివారంలోపు చెల్లించాలని పేర్కొంది. డిసెంబర్ 5న రూ.5,120 కోట్ల డ్రాఫ్ట్‌ను చెల్లించిన సహారా- ఆపై మొత్తాల చెల్లింపుల్లో విఫలమయ్యింది. కోర్టులో సెబీ ధిక్కరణ పిటిషన్లను ఎదుర్కొంటోంది. -
ఫండ్ ఆల్ఫా అంటే ఏమిటి?
కొనుగోలు చేసిన తేదీ నుంచి ఒక ఏడాది లోపు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయిస్తే, 1 శాతం కోత ఉంటుందని నా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ స్టేట్మెంట్ వెల్లడిస్తోంది. ఇలా ఎందుకు? -అవినాష్, కాకినాడ మ్యూచువల్ ఫండ్స్ స్వల్పకాలిక పెట్టుబడులను ప్రోత్సహించవు. స్వల్పకాలంలో పెట్టుబడులను ఉపసంహరిస్తే, ఇతర ఇన్వెస్టర్ల లాభాలపై ప్రభావం పడుతుంది. అందుకనే దీనిని నిరోధించేందుకు మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిట్ లోడ్‌ను లేదా కంటింజెంట్ డిఫర్డ్ సేల్స్ చార్జ్(సీడీఎస్‌సీ)ను విధిస్తాయి. ఉదాహరణకు, మార్కెట్లు పతనంలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయించాలని కోరతారు. వారి కోరిక మేరకు ఈ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఈ సెక్యూరిటీలను నష్టాలకు విక్రయించాల్సి ఉంటుంది. దీంతో ఆ ఫండ్ ఎన్ఏవీ పడిపోతుంది. ఇతర ఇన్వెస్టర్ల లాభాలపై ఈ ప్రభావం ఉంటుంది. అందుకే స్వల్పకాలిక పెట్టుబడులను ఎగ్జిట్ లోడ్ కొంత మేరకు నిరోధిస్తుందని చెప్పవచ్చు. ఇక ఏడాది లోపు మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయిస్తే, కొంత శాతం(సుమారుగా 1 శాతం) ఈ ఎగ్జిట్ లోడ్ విధిస్తారు. ఉదాహరణకు ఎవరైనా ఇన్వెస్టర్ రూ.10,000 యూనిట్లను విక్రయిస్తే, ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థ 1 శాతం ఎగ్జిట్ లోడ్ (రూ.100) చార్జ్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ గ్రోత్ ప్లాన్స్‌లో లాభాలతో పాటే ఎన్ఏవీ కూడా పెరుగుతుంది. డివిడెండ్ ప్లాన్స్‌లో డివిడెండ్ లభిస్తుంది. మరి డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎందుకు? -జాన్సన్, మధిర ఈ మూడు ప్లాన్స్- గ్రోత్ ప్లాన్, డివిడెండ్ ప్లాన్, డివిడెండ్ రీ ఇన్వెస్ట్ ప్లాన్లలో లాభాల విషయంలో ఎలాంటి తేడా ఉండదు. గ్రోత్ ఆప్షన్ విషయంలో రిటర్న్‌లు ఫండ్ నెట్ అసెట్ వాల్యూ(ఎన్ఏవీ)లో ప్రతిఫలిస్తాయి. అంటే ఆ మేరకు ఎన్ఏవీ పెరుగుతుంది. ఇక డివిడెండ్ ఆప్షన్ ప్లాన్‌లో ఇన్వెస్టర్లకు నిర్ణీత కాల వ్యవధుల్లో డివిడెండ్ చెల్లించడం జరుగుతుంది. ఇక డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ విషయానికొస్తే వచ్చిన డివిడెండ్‌ను మరలా అదే ఫండ్‌లో రీ ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో మ్యూచువల్ ఫండ్ యూనిట్ల సంఖ్య పెరుగుతాయి. ఈ ఆప్షన్లో కొత్త ఎన్ఏవీ వద్ద యూనిట్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. త్వరలో డెరైక్ట్ ట్యాక్స్ కోడ్(డీటీసీ) అమల్లోకి రానున్నది. డీటీసీ ప్రకారం..., ఈక్విటీ ఫండ్స్ డివిడెండ్లపై 5 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీటిపై ఎలాంటి పన్ను బాధ్యత లేదు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే గ్రోత్ ప్లాన్స్ బెటర్. ఇక మీ పెట్టుబడులపై క్రమం తప్పకుండా ఆదాయం అవసరం లేదనుకుంటే గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోండి. సిప్ విధానంలో ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఫండ్ ఆల్ఫా ప్రస్తుతం రుణాత్మకంగా ఉంది. ఈ ఫండ్ నుంచి వైదొలగమంటారా? - ప్రవల్లిక, నెల్లూరు ఆల్ఫా అంటే ఒక ఫండ్ ఆశించిన రాబడి రేటు కంటే అధికంగా ఆర్జించిన రాబడి. ఫండ్ ఆశించిన రాబడి రేట్ ఆ ఫండ్ రిస్క్ బేటాపై ఆధారపడి ఉంటుంది. ఆల్ఫా ధనాత్మకంగా ఉంటే, ఆఫండ్ పనితీరు ఆశించిన దానికంటే బావుందని అర్థం. ఆల్ఫా రుణాత్మకంగా ఉంటే ఆశించిన దానికంటే ఆ ఫండ్ పనితీరు బాగాలేదని అర్థం. వాల్యూ రీసెర్ఛ్ సంస్థలో నిఫ్టీని బెంచ్‌మార్క్‌గా తీసుకుని ఈక్విటీ ఫండ్స్ ఆల్ఫాను లెక్కిస్తాం. దీంతో వివిధ ఈక్విటీ ఫండ్స్ పనితీరును పోల్చడానికి వీలవుతుంది. అందుకే ఒక ఫండ్ ఆల్ఫా ఆ ఫండ్ కేటగిరిలో సాపేక్ష రిఫరెన్స్‌గా ఉపయోగపడుతుంది. మిడ్, స్మాల్ క్యాప్ కేటగిరిలో అన్ని ఫండ్స్ ఆల్ఫాను పరిశీలించినట్లయితే, ఒక్క ఆరు ఫండ్స్ మినహా అన్ని ఫండ్స్ ఆల్ఫా రుణాత్మకంగానే ఉంది. ఇక మీరు ఇన్వెస్ట్ చేసిన ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్ విషయానికొస్తే, ప్రస్తుతం ఈ ఫండ్ ఆల్ఫా రుణాత్మకంగా ఉన్నా, ఈ కేటగిరిలో 12వ అధిక ఆల్ఫా సాధించిన ఫండ్ ఇదేనని గుర్తించాలి. ఈ కేటగిరి ఫండ్‌లో ఆశించిన రాబడులకు, వాస్తవ రాబడులకు మధ్య భేదం తక్కువగా ఉన్న ఫండ్స్‌ల్లో ఇది కూడా ఒకటి. -
స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులు
సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపురోజైన గురువారం మార్కెట్లో ట్రేడింగ్ మందకొడిగా జరిగింది. ఈ నెలలో ఇప్పటికే 9 శాతం మార్కెట్ పెరిగిన నేపథ్యంలో ఫ్యూచర్ కాంట్రాక్టుల స్క్వేర్అప్ చేసుకోవడంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నిమగ్నంకావడంతో రోజంతా స్వల్ప శ్రేణిలో స్టాక్ సూచీలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 19,826-19,997 పాయింట్ల మధ్య ఊగిసలాడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 37 పాయింట్ల లాభంతో 19,894 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5,865-5,918 పాయింట్ల మధ్య కదిలి, తుదకు 8 పాయింట్ల లాభంతో 5,882 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. బీహెచ్ఈఎల్ 5 శాతంపైగా ర్యాలీ జరపగా, సన్‌ఫార్మా 2.5 శాతం పెరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, గెయిల్‌లు 1 శాతం మేర నష్టాల్ని చవిచూసాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 172 కోట్లు నికర పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 362 కోట్ల నికర అమ్మకాలు నిర్వహించాయి. నిఫ్టీ ఫ్యూచర్లో రోలోవర్స్ జోరు... కార్పొరేట్ ఫలితాల సీజన్ అయిన అక్టోబర్ నెలలో భారీ హెచ్చుతగ్గులను అంచనావేస్తున్న ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులను పెద్దమొత్తంలో వచ్చేనెలకు రోలోవర్ చేసుకున్నారు. ఆగస్టు నెలలో మార్కెట్ నిలువునా పతనంకాగా, సెప్టెంబర్‌లో అనూహ్యమైన ర్యాలీ జరిపింది. అయితే అక్టోబర్ నెలలో హెచ్చుతగ్గుల తీవ్రత వుంటుందన్న అంచనాలతో షార్ట్, లాంగ్ పొజిషన్ల క్రియేషన్ అధికంగా జరిగింది. దాంతో అక్టోబర్ నిఫ్టీ కాంట్రాక్టులో ఈ ఒక్కరోజే 44 లక్షల షేర్ల ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) యాడ్ అయ్యింది. దాంతో మొత్తం ఓఐ 1.80 కోట్ల షేర్లకు చేరింది. సెప్టెంబర్ సిరీస్ ప్రారంభమయ్యే ముందురోజైన ఆగస్టు 29న ఈ నెల కాాంట్రాక్టు ఓఐ 1.46 కోట్ల షేర్లవరకే వుంది. బీహెచ్ఈఎల్ కౌంటర్లో భారీ బిల్డప్... సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ ప్రారంభానికి ముందు సేసా గోవా కౌంటర్లో జరిగిన తరహాలో అక్టోబర్ సిరీస్‌కు పీఎస్‌యూ షేరు బీహెచ్ఈఎల్ కౌంటర్లో భారీ బిల్డప్ క్రియేట్కావడంతో పాటు స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ డిస్కౌంట్‌తో ముగిసింది. గురువారం బీహెచ్ఈఎల్ అక్టోబర్ ఫ్యూచర్ కాంట్రాక్టులో 53 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 3.02 కోట్లకు చేరింది. సెప్టెంబర్ సిరీస్ ప్రారంభసమయంలో ఈ కౌంటర్లో 2.34 కోట్ల షేర్ల బిల్డప్ మాత్రమే వుండేది. బీహెచ్ఈఎల్ వరుసగా రెండురోజులపాటు 15 శాతం ర్యాలీ జరిపింది. క్యాష్ మార్కెట్లో భారీ కొనుగోళ్లను సూచిస్తూ ట్రేడింగ్ పరిమాణం పెరిగింది. క్యాష్ మార్కెట్లో జరిపిన కొనుగోళ్లను మార్కెట్ హెచ్చుతగ్గుల సందర్భంగా పరిరక్షించుకునేందుకు ఫ్యూచర్ కాంట్రాక్టులను విక్రయించినట్లు (హెడ్జ్డ్ షార్ట్స్) బీహెచ్ఈఎల్ బిల్డప్ డేటా సూచిస్తున్నది. స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ ధర రూ.5 డిస్కౌంట్‌తో ట్రేడయ్యింది.