ఇన్ఫోసిస్, విప్రో, డబ్ల్యుఎన్ఎస్, డాక్టర్ రెడ్డిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి కంపెనీల తరువాత నాస్‌డాక్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్లో మరో భారతీయ కంపెనీ ఫ్రెష్‌వర్క్స్ లిస్టింగ్ చేయబడిన విషయం తెలిసిందే. ఫ్రెష్‌వర్క్ లిస్టింగ్ ఐనా ఒక్కరోజులోనే కంపెనీ షేర్లు ఏకంగా 32 శాతం మేర ఎగబాకాయి. కంపెనీ మార్కెట్ విలువ సుమారు 13 బిలియన్ డాలర్లకు చేరింది. అంతేకాకుండా ఒక్కరోజులోనే కంపెనీకి చెందిన 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులైనారని ఫ్రెష్‌వర్స్క్ వ్యవస్థాపకుడు గిరీష్ మాతృబూతం వెల్లడించిన విషయం తెలిసిందే. శుక్రవారం రోజు నాస్‌డాక్ స్టాక్‌ఎక్సేచేంజ్ ముగిసే సమయానికి ఫ్రెష్‌వర్క్స్ 46.75 డాలర్ల వద్ద స్దిరపడింది.
చదవండి: వీటిపై ఇన్వెస్ట్ చేస్తే లాభాలే..లాభాలు...!
ఎగబడుతున్న ఇన్వెస్టర్లు...!
తాజాగా పలు భారతీయ ఇన్వెస్టర్లు ఫ్రెష్‌వర్క్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఊవిళ్లురుతున్నారు. మైక్రోసాఫ్ట్ పొందిన ఆదరణను ఇప్పుడు ఫ్రెష్‌వర్క్స్ పొందుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా-లిస్టెడ్ సంస్థలలో పెట్టుబడులను సులభతరం చేసే బ్రోకర్ల ప్రకారం...గత కొన్ని రోజులుగా ఫ్రెష్‌వర్క్స్ స్టాక్స్‌పై ఇన్వెస్టర్లు గణనీయమైన ఆసక్తిని చూపుతున్నారని పేర్కొంది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ వెస్ట్‌ఫైనాన్స్ డేటా ప్రకారం..ఫ్రెష్‌వర్క్స్ ఇంక్. స్టాక్ దాని ఐపిఒ తర్వాత పెట్టుబడిదారుల అగ్ర ఎంపికగా నిలిచిందని, అంతేకాకుండా ఇన్వెస్టర్లలో అత్యంత ప్రాచుర్యం పొందినట్లు పేర్కొంది.
టెస్లాకు తగ్గుతున్న ఆదరణ..!
వెస్టెడ్ ఫైనాన్స్ పలు కంపెనీల స్టాక్ డేటాలను ట్రాక్ చేస్తోంది. టెస్లా కంపెనీ షేర్లు అమెరికాలో అత్యంత ఆదరణను పొందిన స్టాక్. గత ఆరు నెలల్లో కౌంటర్ కలిగి ఉన్న పెట్టుబడిదారుల నిష్పత్తి 10 శాతం నుండి 7.8 శాతానికి తగ్గడంతో టెస్లాపై ప్రజాదరణ బాగా తగ్గింది. పలు ఇన్వెస్టర్లకు టెస్లా ఫేవరేట్ స్టాక్‌గా ఆదరణ తగ్గతూ వస్తోంది. గత 30 రోజుల్లో, భారతీయ పెట్టుబడిదారులలో మైక్రోసాఫ్ట్ అత్యంత ప్రజాదరణ పొందిన స్టాక్. ఆపిల్, అమెజాన్, సేల్స్‌ఫోర్స్, ఫేస్‌బుక్ స్టాక్ ఎక్కువ ఆదరణను కలిగి ఉన్నాయి.
చదవండి: Amazon- Flipkart: నువ్వా..! నేనా..! అన్నట్లుగా అమెజాన్-ఫ్లిప్‌కార్ట్...! కస్టమర్లకు మాత్రం పండగే...!
Comments
Please login to add a commentAdd a comment