Nasdaq Stock Exchange
-
‘ఇన్సైడర్ ట్రేడింగ్’.. అమెరికాలో ఎన్నారై విభాగం టీడీపీ నేతలకు 25 ఏళ్ల జైలు శిక్ష!
అమెరికా టీడీపీ ఎన్నారై విభాగంలో కీలక సభ్యులుగా వ్యవహరిస్తున్న నెల్లూరు జనార్ధన్ చౌదరి, బర్మా శివ నారాయణ చౌదరిలు జైలు శిక్ష అనుభవించనున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడినట్లు తేలడంతో అమెరికా న్యాయ స్థానం సుమారు 25 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో తుది తీర్పు వెలువరించనుంది. నెల్లూరు జనార్ధన్ చౌదరి, బర్మా శివ నారాయణ చౌదరిలు అమెరికాలో ఐటీ ప్రొఫెషనల్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఓవైపు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూనే అమెరికా టీడీపీ ఎన్నారై విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే వారిద్దరు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడడంతో కాలిఫోర్నియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికన్ స్టాక్ ఎక్చ్ంజ్లో నమోదైన ఓ పబ్లిక్ ట్రెడెడ్ కంపెనీ నిర్వహించే ట్రేడింగ్‌లో.. ఆ కంపెనీ స్టాక్స్‌తో పాటు ఇతర ఆర్ధిక సంబంధిత రహస్య సమాచారాన్ని నాలుగు సార్లు ఇతరులకు చేరవేయడం ద్వారా నిందితులు లాభపడేలా సెక్యూరిటీ ఫ్రాడ్‌కు పాల్పడినట్లు తేలింది. శివ నారాయణ బర్మాతో పాటు అతని సహచరుడు నెల్లూరు జనార్ధన్ కుట్రపూరితంగా సెక్యూరిటీ మోసానికి పాల్పడ్డారంటూ 2019లో అమెరికన్ పోలీసులు అభియోగాలు మోపారు. కేసు విచారణ కొనసాగుతుండగా సత్యనారాయణ సహచరుడు తాము నేరం చేసినట్లు అంగీకరించాడు. దీనిపై జ్యూరీ ట్రయల్స్ (కోర్టు ధర్మాసనం) విచారణ జరిపి గతేడాది డిసెంబర్ 13న తీర్పు వెలువరించారు. పాలో ఆల్టో నెట్వర్క్స్ జ్యూరీ ట్రయల్స్‌లో నిందితుడు శివ నారాయణ అమెరికా టెక్నాలజీ ఎక్స్ఛేంజ్ 'నాస్డాక్'లో లిస్టైన పాలో ఆల్టో నెట్వర్క్ క్వార్టర్లీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించిన సమాచారాన్ని షేర్ చేసి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారించారు. సమాచారాన్ని షేర్ చేయకూడదు స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్టెడ్ కంపెనీలు తమ పనితీరు, లాభనష్టాల గురించి ప్రతి మూడు నెలలకు (క్యూ1, క్యూ2, క్యూ3, క్యూ4) ఒకసారి బహిరంగంగా ప్రకటిస్తుంటాయి. ఆ మూడు నెలల లోపల కంపెనీ పనితీరు గురించి ఎవరికి షేర్ చేయరు. అలా చేయడం వల్ల స్టాక్ మార్కెట్లో ఆసంస్థ పనితీరుపై ప్రభావం చూపుతుంది. స్టాక్ వ్యాల్యూపెరగడం,తగ్గడంలాంటి ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. అందుకే 3 నెలలు ముగిసిన తర్వాతనే కంపెనీల పనితీరును అనౌన్స్ చేస్తాయి. ఆ సమాచారాన్ని సత్యనారాయణ పాలో ఆల్టో నెట్వర్క్స్ పనితీరు గురించి ముందే లీక్ చేశారు. అన్నం పెట్టిన ఇంటికే సున్నం రహస్యంగా ఉండే కంపెనీల సమాచారాన్ని శివ నారాయణ ముందే ఎలా చేరవేశారనే అనుమానంతో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. ఆ విచారణలో నిందితుడు పాలో ఆల్టో నెట్వర్క్స్ మాజీ కాంట్రాక్టర్‌గా పనిచేసినట్లు తేలింది. కాంట్రాక్టర్‌గా పనిచేసే సమయంలో ఆ సంస్థ ఐటీ విభాగంలో పనిచేసే ఉద్యోగుల్ని కలిసినట్లు, వారి ద్వారా కంపెనీ ఆర్ధిక పరమైన రహస్యాలు సేకరించినట్లు నార్తన్ డిస్ట్రీక్ కాలిఫోర్నియా న్యాయవాది స్టెఫానీ ఎమ్ హిండ్స్ కార్యాలయం తెలిపింది ఏడాది కాలంగా శివ నారాయణ బర్మా ఓ వైపు ఉద్యోగిగా పనిచేస్తూనే.. మరోవైపు పాలో ఆల్టో నెట్వర్క్ 4 సార్ల త్రైమాసిక ఆదాయ ఫలితాల సమాచారంతో అక్టోబర్ 2016 నుంచి సెప్టెంబర్ 2017 వరకు ఇన్ సైడ్ ట్రేడింగ్ నిర్వహించారు. సంస్థకు చెందిన రహస్య సమాచారంతో పాటు, ట్రేడింగ్ ఇన్స్ట్రక్షన్ గురించి.. ఆ కంపెనీ షేర్లు కొన్న ఇన్వెస్టర్లకు చేరవేశారు. దీంతో మదుపర్లు 5 రెట్లు లాభపడ్డారు. 7.3 మిలియన్ల లాభం అదే సమయంలో శివ నారాయణ సైతం నాలుగు సార్లు 7.3 మిలియన్లు, అంతకంటే ఎక్కువ అర్జించారు. ఇక జ్యూరీ సభ్యులు విచారణలో 18 యూఎస్ఈ సెక్షన్లు 1348ని ఉల్లంఘించి నాలుగు సెక్యూరిటీల మోసాలకు పాల్పడ్డారని, జ్యూరీ గత వారం బరామాను దోషిగా నిర్ధారించింది. 25ఏళ్లు జైలు శిక్ష విచారణలో ప్రధాన యూఎస్ కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి రిచర్డ్ సీబోర్గ్ బరామకు శిక్షా విచారణ తేదీని ఖరారు చేయలేదు. ఒకవేళ అతనికి 25ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు 18 యూఎస్ఈ సెక్షన్లు 1348ని ఉల్లంఘన నియమావళిలో ఉంది. -
ఈ ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో ఏదంటే..!
Rivian Valued 100 Billion Dollars In Debut After World Biggest IPO Of 2021: అమెజాన్ మద్దతు ఇస్తోన్న ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ రివియన్ ఆటోమోటివ్ నాస్డాక్లో అరంగేట్రంలోనే అదరగొట్టింది. కంపెనీ షేర్లు 53 శాతం మేర పెరిగాయి. ఈ ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవోగా రివియన్ ఆటోమొబైల్ నిలిచి రికార్డు సృష్టించింది. రివియన్ ఆటోమోటివ్ మార్కెట్ వాల్యుయేషన్ సుమారు 100 బిలియన్ డాలర్లకుపైగా చేరింది. రివియన్ షేర్లు 100.73 డాలర్ల వద్ద ముగిశాయి. ఐపీవో ఇష్యూతో పోలిస్తే సుమారు కంపెనీ షేర్ల విలువ దాదాపు 30శాతం మేర జంప్ అయ్యాయి. టెస్లాకు గట్టిపోటీ..! ఎలక్ట్రిక్ వాహనాల్లో పేరొందిన టెస్లాకు రివియన్ ఆటోమోటివ్ గట్టిపోటీను ఇచ్చేందుకు సిద్దమైంది. ఒక ట్రిలియన్ పైగా వాల్యుయేషన్‌తో నిలిచిన టెస్లా తరువాత రివియన్ రెండో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థగా నిలిచింది. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును రివియన్ జరుపుతోంది. కంపెనీ రెవెన్యూ కొద్దిమేరే ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సప్లై చైన్, సెమికండక్టర్ల కొరత రివియన్ను కూడా వెంటాడుతోంది. దీంతో కంపెనీ పెద్దమొత్తంలో ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేయలేకపోతుందని రివియన్ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. రివియన్ ఆటోమోటివ్స్‌లో అమెజాన్ సుమారు 20 శాతం మేర వాటాలను కల్గి ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ ప్రారంభించిన ఆల్ ఎలక్ట్రిక్ ఆర్1టీ పికప్ ట్రక్‌ను రెట్టింపు చేస్తూ ఉత్పత్తి పెంచడానికి ప్రణాళికలను రివియన్ రచిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: వరుసగా రెండోసారి...! భారీ నష్టాలతో పేటీఎం..! -
అయ్యో ఎలన్ మస్క్.. ఎంత కష్టం వచ్చే!
Elon Musk Loses 50 Billion Dollars: ప్రపంచదిగ్గజ పారిశ్రామికవేత్తలలో బిలియనీర్ ఎలన్ మస్క్ ఒకరు. తాను స్థాపించిన టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీలతో ఆయా రంగాల్లో సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సంపద సైతం అదే స్థాయిలో పెరుగుతూ పోతోంది. అయితే, కొద్ది రోజుల క్రితం.. "నా దగ్గర డబ్బులు లేవు. షేర్లు అమ్మేయాలని అనుకుంటున్నాను. మీరేమంటారు" అంటూ ట్వీట్లో నెటిజన్ల అభిప్రాయాన్ని కోరారు. ఆ తర్వాత అతని ఆస్తి భారీగా తగ్గిపోయింది. టెస్లా ఇంక్ షేర్లు వరుసగా రెండవ రోజు పడిపోయాయి. దీంతో ఎలన్ మస్క్ ఈ వారంలో ఇప్పటివరకు 50 బిలియన్ డాలర్లు(రూ.3.71 లక్షల కోట్లు) నష్టపోయారు. ఇటీవల వాషింగ్టన్లో కొంతమంది డెమోక్రాట్లు ఎలన్ మస్క్ లాంటి బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి నేను నా టెస్లా స్టాక్‌లో 10శాతం విక్రయించాలని అనుకుంటున్నాను. దీనికి మీరు మద్దతు ఇస్తున్నారా?అని ఎలన్ నవంబర్ 7న ట్వీట్ చేశారు. అలాగే, అతని సోదరుడు కింబాల్ ఈ పోల్ పెట్టడానికి ముందే వాటాలను విక్రయించాడనే వార్తలు రావడంతో పెట్టుబడుదారులు తమ డబ్బును వెనక్కి తీసుకున్నారు. దీంతో రెండు రోజుల నుంచి టెస్లా షేర్ ధరలు పడిపోతున్నాయి. నవంబర్ 9న 1,173.60 డాలర్లు ఉన్న టెస్లా షేర్ ధర, నేడు 1,023.50 డాలర్లుగా ఉంది. (చదవండి: ఫల్గుణి నాయర్: స్వీయ నిర్మిత మహిళా బిలినీయర్) -
ఇప్పుడు ఫేవరెట్ టెస్లా కాదు..! ఇండియన్ కంపెనీ కోసం క్యూ!
ఇన్ఫోసిస్, విప్రో, డబ్ల్యుఎన్ఎస్, డాక్టర్ రెడ్డిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి కంపెనీల తరువాత నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో మరో భారతీయ కంపెనీ ఫ్రెష్‌వర్క్స్ లిస్టింగ్ చేయబడిన విషయం తెలిసిందే. ఫ్రెష్‌వర్క్ లిస్టింగ్ ఐనా ఒక్కరోజులోనే కంపెనీ షేర్లు ఏకంగా 32 శాతం మేర ఎగబాకాయి. కంపెనీ మార్కెట్ విలువ సుమారు 13 బిలియన్ డాలర్లకు చేరింది. అంతేకాకుండా ఒక్కరోజులోనే కంపెనీకి చెందిన 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులైనారని ఫ్రెష్వర్స్క్ వ్యవస్థాపకుడు గిరీష్ మాతృబూతం వెల్లడించిన విషయం తెలిసిందే. శుక్రవారం రోజు నాస్డాక్ స్టాక్‌ఎక్సేచేంజ్ ముగిసే సమయానికి ఫ్రెష్‌వర్క్స్ 46.75 డాలర్ల వద్ద స్దిరపడింది. చదవండి: వీటిపై ఇన్వెస్ట్ చేస్తే లాభాలే..లాభాలు...! ఎగబడుతున్న ఇన్వెస్టర్లు...! తాజాగా పలు భారతీయ ఇన్వెస్టర్లు ఫ్రెష్‌వర్క్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఊవిళ్లురుతున్నారు. మైక్రోసాఫ్ట్ పొందిన ఆదరణను ఇప్పుడు ఫ్రెష్‌వర్క్స్ పొందుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా-లిస్టెడ్ సంస్థలలో పెట్టుబడులను సులభతరం చేసే బ్రోకర్ల ప్రకారం...గత కొన్ని రోజులుగా ఫ్రెష్‌వర్క్స్ స్టాక్స్‌పై ఇన్వెస్టర్లు గణనీయమైన ఆసక్తిని చూపుతున్నారని పేర్కొంది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ వెస్ట్ఫైనాన్స్ డేటా ప్రకారం..ఫ్రెష్‌వర్క్స్ ఇంక్. స్టాక్ దాని ఐపిఒ తర్వాత పెట్టుబడిదారుల అగ్ర ఎంపికగా నిలిచిందని, అంతేకాకుండా ఇన్వెస్టర్లలో అత్యంత ప్రాచుర్యం పొందినట్లు పేర్కొంది. టెస్లాకు తగ్గుతున్న ఆదరణ..! వెస్టెడ్ ఫైనాన్స్ పలు కంపెనీల స్టాక్ డేటాలను ట్రాక్ చేస్తోంది. టెస్లా కంపెనీ షేర్లు అమెరికాలో అత్యంత ఆదరణను పొందిన స్టాక్. గత ఆరు నెలల్లో కౌంటర్ కలిగి ఉన్న పెట్టుబడిదారుల నిష్పత్తి 10 శాతం నుండి 7.8 శాతానికి తగ్గడంతో టెస్లాపై ప్రజాదరణ బాగా తగ్గింది. పలు ఇన్వెస్టర్లకు టెస్లా ఫేవరేట్ స్టాక్‌గా ఆదరణ తగ్గతూ వస్తోంది. గత 30 రోజుల్లో, భారతీయ పెట్టుబడిదారులలో మైక్రోసాఫ్ట్ అత్యంత ప్రజాదరణ పొందిన స్టాక్. ఆపిల్, అమెజాన్, సేల్స్‌ఫోర్స్, ఫేస్బుక్ స్టాక్ ఎక్కువ ఆదరణను కలిగి ఉన్నాయి. చదవండి: Amazon- Flipkart: నువ్వా..! నేనా..! అన్నట్లుగా అమెజాన్-ఫ్లిప్‌కార్ట్...! కస్టమర్లకు మాత్రం పండగే...! -
ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...!
500 Indian Employees Just Turned Crorepatis: భారత సంతతికి చెందిన ఫ్రెష్‌వర్క్స్ ఐటీ సంస్థ నాస్డాక్లో లిస్టింగ్ చేసిన ఒక్కరోజులోనే కంపెనీల షేర్లు 32 శాతం మేర పెరిగాయి. నాస్డాక్ ట్రేడింగ్‌లో బుధవారం రోజున ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ షేర్లు 47.55 డాలర్ల వద్ద ముగిశాయి. కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 13 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాగా ఫ్రెష్‌వర్క్స్ కంపెనీలోని సుమారు 500 మంది భారతీయ ఉద్యోగులు ఒక్కరోజులోనే కోటీశ్వరులైనారని కంపెనీ వ్యవస్థాపకుడు గిరీష్ మాతృబూతం వెల్లడించారు. అందులో సుమారు 70 మంది ఉద్యోగులు 30 ఏళ్ల లోపు వారే. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా సుమారు 4300 ఉద్యోగులున్నారు. సుమారు 76 శాతం మంది ఉద్యోగులు ఫ్రెష్‌వర్క్స్ షేర్లను కలిగి ఉన్నారు. చదవండి: క్రిప్టోకరెన్సీకి పోటీగా...సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు...! నాస్డాక్ స్టాక్ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేసిన భారతీయ సాఫ్ట్వేర్ సంస్థగా ఫ్రెష్‌వర్క్ నిలిచింది. ఫ్రెష్ వర్క్స్ సంస్థను 2010లో భారత్‌లో గిరీష్ మాతృబూతం, షాన్ కృష్ణసామి స్థాపించారు. కస్టమర్లకు మరింత దగ్గరవ్వడం కోసం కొద్ది రోజుల క్రితమే భారత్ నుంచి అమెరికాకు ఫ్రెష్‌వర్క్స్‌ను యాజమాన్యం తరలించింది. ఇప్పుడు కాలిఫోర్నియాలోని శాన్ మేటియోలో, చెన్నైలో గణనీయమైన ఉద్యోగులను ఫ్రెష్‌వర్క్స్ కలిగి ఉంది. ఆక్సెల్ , సీక్వోయా క్యాపిటల్ వంటి పెట్టుబడిదారుల నుండి నిధులను ఫ్రెష్‌వర్క్స్ సేకరించింది. ఇన్ఫోసిస్, విప్రో, డబ్ల్యుఎన్ఎస్, డాక్టర్ రెడ్డిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి డజనుకు పైగా నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేసిన భారతీయ కంపెనీలలో ఫ్రెష్‌వర్క్స్ ఒకటిగా నిలవనుంది,. 1999లో నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేసిన మొదటి భారతీయ సంస్థ ఇన్ఫోసిస్ తన పేరిట ఆ రికార్డు కలిగి ఉంది. చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన ఫ్రెష్‌వర్క్స్ ఐటీ కంపెనీ -
సరికొత్త రికార్డు సృష్టించిన ఫ్రెష్‌వర్క్స్ ఐటీ కంపెనీ
నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేసిన మొదటి భారతీయ సాఫ్ట్వేర్ ఉత్పత్తుల సంస్థగా ఫ్రెష్‌వర్క్స్ నిలిచింది. 10.13 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ వద్ద పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా పెట్టుబడిదారుల నుంచి 1.03 బిలియన్ల డాలర్లకు పైగా సేకరించింది. 36 డాలర్ల ధరకు 28.5 మిలియన్ షేర్లను విక్రయించినట్లు కంపెనీ బుధవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. "మేము ఇంత దూరం వచ్చినందుకు నాకు నిజంగా గర్వంగా ఉంది. భారతదేశం నుంచి వచ్చిన ఒక గ్లోబల్ ప్రొడక్ట్ కంపెనీ ఏమి సాధించగలదో మేము ప్రపంచానికి చూపిస్తాము" అని ఫ్రెష్‌వర్క్స్ సహవ్యవస్థాపకుడు, సీఈఓ గిరీష్ అన్నారు. ఇటీవల ఫ్రెష్‌వర్క్స్ 40 కోట్ల డాలర్ల(రూ.2,925 కోట్లు) పెట్టుబడులు సమకూర్చుకుంది. దీంతో కంపెనీ విలువ 3.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఫ్రెష్‌వర్క్స్‌లో దిగ్గజాలు సీక్వోయా క్యాపిటల్, యాక్సెల్, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, క్యాపిటల్ జి తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. గత ఏడాది కాలంలో యూఎస్‌లో సాప్ ఐపీవోలు విజయవంతమయ్యాయి. అతిపెద్ద దేశీ సాస్ స్టార్టప్‌లలో ఇది ఒకటిగా నిలిచింది. ఫ్రెష్‌వర్క్స్ వ్యవస్థాపకుడు గిరీష్ 2010లో సంస్థను స్థాపించారు. ఈ కంపెనీ డిసెంబర్ 2011లో యాక్సెల్ పార్టనర్స్ నుంచి మొదటి సారిగా 1 మిలియన్ డాలర్ నిధులను సేకరించింది. (చదవండి: జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..!) మళ్లీ ఏడు సంవత్సరాల తర్వాత ఏడవ నిధుల రౌండ్ లో భాగంగా అక్సెల్, సీక్వోయా క్యాపిటల్ నుంచి 100 మిలియన్ డాలర్లను సేకరించినప్పుడు ఇది దేశం యొక్క మొదటి సాస్ సంస్థగా మారింది. అలాగే, 1 బిలియన్ డాలర్ విలువ కలిగిన మొదటి సాస్ సంస్థగా మారింది. ఇన్ఫోసిస్, విప్రో, డబ్ల్యుఎన్ఎస్, డాక్టర్ రెడ్డిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి డజనుకు పైగా నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేసిన భారతీయ కంపెనీలలో ఫ్రెష్‌వర్క్స్ ఒకటిగా నిలవనుంది,. 1999లో నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేసిన మొదటి భారతీయ సంస్థ ఇన్ఫోసిస్ తన పేరిట ఆ రికార్డు కలిగి ఉంది. ఫ్రెష్ వర్క్స్, జూలైలో ఫుడ్ టెక్నాలజీ ప్లాట్ ఫామ్ జొమాటో ద్వారా నక్షత్ర దేశీయ జాబితా వెనుక ప్రైవేట్ మార్కెట్లను దాటి దూకుడుగా వైవిధ్యభరితమైన భారతదేశంలో వెంచర్-ఫండెడ్ కంపెనీల హడావిడిలో చేరిన తాజాది. -
ఒక్క రోజులోనే మస్క్ సంపద ఎంత పెరిగిందో తెలుసా?
వాషింగ్టన్: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మధ్య నెలకొన్న త్రీవ పోటీ నేపథ్యంలో మరో కొత్త మైలురాయిని సాధించాడు. సంపదపరంగా మంగళవారం సరికొత్త రికార్డును సృష్టించాడు. కేవలం ఒకే ఒక్క రోజులోనే టెస్లా కంపెనీ రికార్డు స్థాయిలో 25 బిలియన్ల డాలర్ల సంపదను సృష్టించింది. దీంతో ఎలాన్ మస్క్ సంపద 174 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం, మంగళవారం టెస్లా షేర్ విలువ 20 శాతం ఎగిసింది. ప్రస్తుతం ఎలాన్ ప్రపంచ కుబేరుడైన జెఫ్ బెజోస్‌కు కేవలం 6 బిలియన్ల డాలర్లు తేడా మాత్రమే ఉండటం విశేషం. నాస్డాక్ 3.7 శాతం పెరగగా, దిగ్గజ టెక్ కంపెనీలు ఆపిల్, అమెజాన్, ఫేస్బుక్ లాభాలు గడించాయి.(ఈ పెయింటింగ్ ఖరీదు ఎంతో తెలుసా?) ఈ క్రమంలో జెఫ్ బెజోస్ కంపెనీ అమెజాన్ 6 బిలియన్ డాలర్ల సంపదను సృష్టించింది. దీంతో బెజోస్ నికర విలువ 180 బిలియన్ డాలర్లకు చేరింది. జనవరిలో ఎలాన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుడిగా 210 బిలియన్ల డాలర్లతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. త్రైమాసికాల్లో నిలకడ లాభాలు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలు ,రిటైల్ పెట్టుబడిదారుల ఉత్సాహం టెస్లా షేర్ల విలువ పెరుగుదలకు మద్దతునిచ్చాయి. -
యాపిల్ వండర్- యూఎస్ భళా
వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు రికార్డులతో బలపడ్డాయి. ఎస్అండ్పీ 12 పాయింట్లు(0.35 శాతం) పుంజుకుని 3,397 వద్ద నిలవగా.. నాస్డాక్ 47 పాయింట్లు(0.45 శాతం) ఎగసి 11,312 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ 191 పాయింట్లు(0.7 శాతం) పెరిగి వద్ద స్థిరపడింది. తయారీ, సర్వీసుల రంగాల దన్నుతో జులైలో బిజినెస్ యాక్టివిటీ 2019 ఆగస్ట్ స్థాయిలో పుంజుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. మరోపక్క వరుసగా రెండో నెలలోనూ గృహ విక్రయాలు జోరందుకున్నాయి. దీంతో ఇళ్ల ధరలు రికార్డ్ స్థాయికి చేరినట్లు రియల్టీ సంస్థలు తెలియజేశాయి. దీంతో వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. లాక్‌డవున్‌ల తదుపరి ఆర్థిక వ్యవస్థలో రికవరీ కనిపించడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించిందని తద్వారా సెంటిమెంటు బలపడిందని నిపుణులు పేర్కొన్నారు. 497 డాలర్లకు యాపిల్ శుక్రవారం ట్రేడింగ్‌లో యాపిల్ షేరు 5 శాతం జంప్‌చేసి 497 డాలర్లకు ఎగువన ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 2.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది అమెరికన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డుకాగా.. ఇతర టెక్ దిగ్గజాలు మైక్రొసాఫ్ట్, గూగుల్, ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ డీలా పడ్డాయి. ఇతర కౌంటర్లలో వ్యవసాయ పరికరాల కంపెనీ డీరె అండ్ కంపెనీ షేరు 4.4 శాతం జంప్‌చేసింది. 200 డాలర్ల సమీపంలో నిలిచింది. 2020 ఏడాదిలో ఆకర్షణీయ పనితీరు చూపే వీలున్నట్లు కంపెనీ వేసిన అంచనాలు ఇందుకు సహకరించాయి. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ షేరు 2.4 శాతం బలపడింది. 2050 డాలర్ల సమీపంలో ముగిసింది. తద్వారా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 382 బిలియన్ డాలర్లను దాటింది. తద్వారా ఆటో రంగంలో అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆసియా లాభాల్లో యూఎస్ మార్కెట్ల ప్రోత్సాహంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి నెలకొంది. హాంకాంగ్, కొరియా, జపాన్, తైవాన్, సింగపూర్, థాయ్‌లాండ్ 1.5-0.3 శాతం మధ్య ఎగశాయి. ఇతర మార్కెట్లలో చైనా, ఇండోనేసియా స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. -
ఎస్అండ్పీ- నాస్డాక్.. రికార్డ్ రికార్డ్స్
ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్ పురోగమించడంతో అమెరికన్ స్టాక్ ఇండెక్సులు మంగళవారం సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. అయితే ఓవైపు డోజోన్స్ నీరసించినప్పటికీ ఎస్అండ్పీ-500, నాస్డాక్ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. తాజాగా ఎస్అండ్పీ 8 పాయింట్లు(0.25 శాతం) పుంజుకుని 3,390వద్ద ముగిసింది. తద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి 19న 3,386 వద్ద నిలవడం ద్వారా సాధించిన సరికొత్త గరిష్టాన్ని తిరగరాసింది. అంతేకాకుండా మార్చి 23న నమోదైన కనిష్టం నుంచీ ఏకంగా 55 శాతం ర్యాలీ చేసింది! దీంతో గత 87ఏళ్లలో అత్యధిక లాభాలను ఆర్జించిన రికార్డును సైతం ఎస్అండ్పీ సొంతం చేసుకుంది. ఫలితంగా ఫిబ్రవరి- మార్చి మధ్య నెల రోజుల కాలంలోనే బేర్ ట్రెండ్ అంతమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇది అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతితక్కువ కాలం నిలిచిన బేర్ మార్కెట్‌గా నమోదైనట్లు తెలియజేశారు. నాస్డాక్ జోరు ఈ ఏడాది జూన్‌లోనే ఫిబ్రవరి గరిష్టాలను దాటిన నాస్డాక్ మంగళవారం 81 పాయింట్లు(0.75 శాతం) ఎగసి 11,211 వద్ద నిలిచింది. వెరసి జూన్ నుంచీ ఇప్పటివరకూ నాస్డాక్ 18సార్లు సరికొత్త గరిష్టాలను నెలకొల్పడం విశేషం! అంతేకాకుండా 2020లో ఇప్పటివరకూ 34సార్లు ఈ ఫీట్ సాధించింది. కాగా.. రిటైల్ దిగ్గజాలు హోమ్ డిపో, వాల్‌మార్ట్ ఆకర్షణీయ ఫలితాలు సాధించినప్పటికీ షేర్లు 1 శాతం చొప్పున డీలాపడటంతో డోజోన్స్ 67 పాయింట్లు(0.25 శాతం) నీరసించి 27,778 వద్ద స్థిరపడింది. టెస్లా దూకుడు మంగళవారం ట్రేడింగ్‌లో టెక్నాలజీ, ఈకామర్స్, సోషల్ మీడియా దిగ్గజాలకు డిమాండ్ పెరిగింది. అమెజాన్ 4 శాతం జంప్‌చేయగా, గూగుల్ 2.7 శాతం ఎగసింది. ఈ బాటలో నెట్‌ఫ్లిక్స్ 2 శాతం, యాపిల్ 0.8 శాతం, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇక ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్ 2.8 శాతం పెరిగింది. ఆసియా అటూఇటుగా ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. హాంకాంగ్‌కు సెలవుకాగా.. జపాన్, కొరియా 0.5 శాతం చొప్పున ఎగశాయి. సింగపూర్ నామమాత్ర లాభంతో కదులుతోంది. అయితే తైవాన్, చైనా, థాయ్‌లాండ్, ఇండొనేసియా 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. -
ఎస్అండ్పీ- నాస్డాక్.. పోటాపోటీ
ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్ పురోగమించడంతో ఎస్అండ్పీ-500 ఇండెక్స్ సైతం చరిత్రాత్మక గరిష్టానికి చేరువైంది. బుధవారం ఇంట్రాడేలో ఈ స్థాయిని అందుకున్నప్పటికీ చివరికి 6 పాయింట్ల దూరంలో నిలిచింది. వెరసి బుధవారం ఎస్అండ్పీ ఇండెక్స్ 45 పాయింట్లు(1.4 శాతం) పెరిగి 3,380 వద్ద ముగిసింది. ఇంతక్రితం ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్అండ్పీ 3,386 వద్ద నిలవడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసుకుంది. కాగా.. జూన్‌లోనే ఫిబ్రవరి గరిష్టాలను దాటిన నాస్డాక్ ఇటీవల వెనకడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం 229 పాయింట్లు(2.1 శాతం) జంప్‌చేసి 11,012 వద్ద స్థిరపడింది. తద్వారా ఇంతక్రితం సాధించిన కొత్త రికార్డు 11,108కు చేరువలో ముగిసింది. ఈ బాటలో డోజోన్స్ సైతం 290 పాయింట్లు(1.1 శాతం) లాభపడి 27,977 వద్ద స్థిరపడింది. జోరు తీరిలా బుధవారం ట్రేడింగ్‌లో టెక్నాలజీ, ఈకామర్స్, సోషల్ మీడియా దిగ్గజాలకు డిమాండ్ పెరిగింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్బుక్ 3.3-1.5 శాతం మధ్య ఎగశాయి. దీంతో మార్కెట్లకు జోష్ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్ 5:1 నిష్పత్తిలో షేర్ల విభజనకు ప్రతిపాదించింది. దీంతో ఈ షేరు 13 శాతంపైగా దూసుకెళ్లింది. ఇతర కౌంటర్లలో టీమొబైల్, షెవ్రాన్ కార్పొరేషన్ 1.5 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే రాయల్ కరిబియన్ 2.5 శాతం, ఉబర్ టెక్నాలజీస్ 1.2 శాతం చొప్పున క్షీణించాయి. ఆసియా ప్లస్‌లో బుధవారం యూరోపియన్ మార్కెట్లు సైతం 1-2 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపిస్తోంది. జపాన్, సింగపూర్, కొరియా, థాయ్‌లాండ్, తైవాన్ 2-0.6 శాతం మధ్య ఎగశాయి. హాంకాంగ్ 0.4 శాతం క్షీణించగా.. ఇండొనేసియా స్వల్పంగా బలపడింది. చైనా యథాతథంగా కదులుతోంది. -
ఫేస్బుక్, యాపిల్ పుష్- 11,000కు నాస్డాక్
ప్రధానంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, ఐఫోన్ల దిగ్గజం యాపిల్, టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ జోరు చూపడంతో గరువారం నాస్డాక్ చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. ఎక్స్ఛేంజీల చరిత్రలో తొలిసారి 11,000 పాయింట్ల మార్క్ ఎగువన ముగిసింది. డోజోన్స్ 185 పాయింట్లు(0.7 శాతం) లాభపడి 27,387కు చేరగా.. ఎస్అండ్పీ 21 పాయింట్లు(0.6 శాతం) పుంజుకుని 3,349 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 110 పాయింట్లు(1 శాతం) ఎగసి 11,108 వద్ద స్థిరపడింది. తద్వారా ఆల్‌టైమ్ హై వద్ద నిలిచింది. కాగా.. ఫిబ్రవరిలో నమోదైన రికార్డ్ గరిష్టాలను చేరేందుకు ఎస్అండ్పీ 1 శాతం, డోజోన్స్ 7 శాతం చొప్పున లాభపడవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. అంచనాలకంటే తక్కువ ఆగస్ట్ 1తో ముగిసిన వారంలో నిరుద్యోగ క్లెయిములు 1.2 మిలియన్లుగా నమోదైనట్లు యూఎస్ లేబర్ డిపార్ట్మెంట్ తాజాగా పేర్కొంది. కోవిడ్-19 సంక్షోభం తలెత్తాక ఈ గణాంకాలు కనిష్టంకాగా.. విశ్లేషకులు 1.4 మిలియన్ దరఖాస్తులను అంచనా వేశారు. దీంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా తొలుత ఏర్పడిన నష్టాల నుంచి మార్కెట్లు బయటపడి లాభాలతో ముగిసినట్లు తెలియజేశారు. టెక్ అండ గురువారం ఫేస్బుక్ కౌంటర్‌కు డిమాండ్ పెరగడంతో 6.5 శాతం జంప్‌చేసింది. 265 డాలర్లకు ఎగువన నిలిచింది. ఈ బాటలో యాపిల్ ఇంక్ 3.5 శాతం ఎగసి 456 డాలర్ల సమీపంలో స్థిరపడింది. ఇక గూగుల్ 2 శాతం పుంజుకుని 1500 డాలర్లను తాకగా.. మైక్రోసాఫ్ట్ 1.6 శాతం లాభంతో 216 డాలర్లకు చేరింది. ఈ బాటలో నెట్‌ఫ్లిక్స్ సైతం 1.4 శాతం బలపడి 509 డాలర్ల వద్ద ముగిసింది. అమెజాన్ 0.6 శాతం వృద్ధితో 3225 డాలర్ల వద్ద నిలిచింది. ఆసియా డీలా గురువారం యూరోపియన్ మార్కెట్లు 0.6-1.5 శాతం మధ్య డీలా పడ్డాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. హాంకాంగ్, చైనా, ఇండొనేసియా, సింగపూర్, జపాన్, తైవాన్, థాయ్‌లాండ్ 2.25-0.6 శాతం మధ్య క్షీణించాయి. కొరియా 0.15 శాతం నష్టంతో కదులుతోంది. -
ఊరిస్తున్న యూఎస్ స్టాక్స్- ఇన్వెస్ట్ చేస్తారా?
కోవిడ్-19 భయాలతో ఈ ఏడాది మార్చిలో కుప్పకూలిన ప్రపంచ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల దౌడు తీస్తున్నాయి. దేశీయంగా సెన్సెక్స్ 38,000 పాయింట్ల మైలురాయి అందుకుంది. ఇందుకు ప్రధానంగా డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) దోహదం చేసింది. అయితే యూఎస్ మార్కెట్లు మరింత దూకుడు చూపుతున్నాయి. ఏప్రిల్ నుంచి నాస్డాక్ పలుమార్లు సరికొత్త గరిష్టాలను అందుకుంటూ వస్తోంది. ఈ బాటలో ప్రధాన ఇండెక్సులు డోజోన్స్, ఎస్అండ్పీ సైతం రికార్డ్ గరిష్టాలకు చేరువయ్యాయి. ఇందుకు FANMAG స్టాక్స్‌గా పిలిచే టెక్నాలజీ కౌంటర్లు సహకరిస్తున్న విషయం విదితమే. ఇతర వివరాలు చూద్దాం.. యమ స్పీడ్ FANMAG స్టాక్స్‌గా పిలిచే గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలు ఫేస్బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్.. కొద్ది రోజులుగా జోరు చూపుతున్నాయి. మార్చి కనిష్టాల నుంచి చూస్తే 128 శాతం స్థాయిలో ఎగశాయి. అయితే వీటిలో గూగుల్, మైక్రోసాఫ్ట్ 60 శాతం స్థాయిలో లాభపడ్డాయి. ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్ అయితే 750 శాతం దూసుకెళ్లింది. దీంతో అమెరికా మార్కెట్లు బలపడగా.. ఇదే సమయంలో దేశీయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 140 శాతం జంప్‌చేసింది. దీంతో సెన్సెక్స్ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్‌లను దాటాయి. భారీ విలువ అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన FANMAG.. గ్లోబల్ కంపెనీలు కావడంతో వీటి సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ 7.2 ట్రిలియన్ డాలర్లను తాకాయి. ఇక బీఎస్ఈ మొత్తం మార్కెట్ విలువ 2.4 ట్రిలియన్ డాలర్లస్థాయికి చేరింది. అంటే బీఎస్ఈ మార్కెట్ క్యాప్‌తో చూస్తే FANMAG మార్కెట్ విలువ మూడు రెట్లు అధికం. కాగా.. ఇటీవల ఈ స్టాక్స్‌లో వస్తున్న ర్యాలీ కారణంగా పలువురు ఇన్వెస్టర్లు వీటిలో ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తి చూపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు తెలియజేశాయి. ఇందుకు వీలుగా బ్రోకింగ్ సంస్థలు సైతం వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అవకాశాలు ఇలా ప్రస్తుతం సంపన్నులు, మధ్యస్థాయి వర్గాలు అధికంగా యూఎస్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు తెలియజేశాయి. దీంతో విదేశీ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసే ప్రక్రియ దేశీయంగా ఊపందుకోలేదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసానీ పేర్కొన్నారు. చిన్న ఇన్వెస్టర్లు యూఎస్ ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేయడం అంత సులభంకాదని పలువురు నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా మ్యూచువల్ ఫండ్ మార్గంలో అంతర్జాతీయ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా ఇందుకు వీలున్నట్లు తెలియజేశారు. పీపీఎఫ్ఏఎస్ దీర్ఘకాలిక ఈక్విటీ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ ఎస్అండ్పీ-500 ఫండ్ వంటి అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. విదేశీ ఈక్విటీలలో అయితే పలు రంగాలు, కంపెనీల ద్వారా భారీ ఇన్వెస్ట్మెంట్ అవకాశాలున్నప్పటికీ అత్యధిక రిస్కులను ఎదుర్కోవలసి ఉంటుందని విశ్లేషకులు వివరించారు. డాలరు- రూపాయి మారకం విలువ, సామాజిక, రాజకీయ అంశాలు వంటివి ప్రభావం చూపుతుంటాయని తెలియజేశారు. తగినంత రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం భారీ నష్టాలకు దారితీయవచ్చని సూచించారు. ప్రస్తుతం మార్కెట్లలో కనిపిస్తున్న బుల్‌ట్రెండ్ కారణంగా భారీ ఆటుపోట్లకు వీలున్నట్లు చెబుతున్నారు. -
యాపిల్, మైక్రోసాఫ్ట్ జోరు- నాస్డాక్ రికార్డ్
ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఐఫోన్ల దిగ్గజం యాపిల్ అండగా నిలవడంతో సోమవారం నాస్డాక్ తిరిగి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. దీనికితోడు జులైలో తయారీ రంగం ఏడాదిన్నర తదుపరి జోరందుకున్నట్లు వెలువడిన గణాంకాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి సోమవారం డోజోన్స్ 236 పాయింట్లు(0.9 శాతం) లాభపడి 26,664కు చేరగా.. ఎస్అండ్పీ 24 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 3,295 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 158 పాయింట్లు(1.5 శాతం) ఎగసి 10,903 వద్ద స్థిరపడింది. తద్వారా ఇంతక్రితం జులై 20న సాధించిన రికార్డ్ గరిష్టాన్ని అధిగమించింది. ఈ బాటలో చరిత్రాత్మక గరిష్టాలను సాధించేందుకు ఎస్అండ్పీ 2.9 శాతం దూరంలో నిలవగా.. డోజోన్స్ దాదాపు 10 శాతం ర్యాలీ చేయవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. జులైలో జూమ్ జులైలో డోజోన్స్ 2.4 శాతం లాభపడగా.. ఎస్అండ్పీ 5.5 శాతం ఎగసింది. ఇక నాస్డాక్ మరింత స్పీడుతో దాదాపు 7 శాతం జంప్‌చేసింది. గత వారం రోజుల్లోనే నాస్డాక్ 4.5 శాతం బలపడటం విశేషం! నెట్‌ఫ్లిక్స్ అప్ చైనీస్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇంక్ జోరందుకుంది. 5.6 శాతం జంప్‌చేసింది. టిక్‌టాక్ యూఎస్ విభాగాన్ని సొంతం చేసుకునే సన్నాహాల్లో ఉన్నట్లు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. కాగా.. మరోపక్క షేర్ల విభజన ప్రకటించిన ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ సైతం 2.5 శాతం ఎగసింది. ఈ బాటలో ఎంటర్టైన్మెంట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 2 శాతం పుంజుకుంది. కోవిడ్-19 చికిత్సకు రూపొందిస్తున్న ఔషధం మూడోదశ క్లినికల్ పరీక్షలను ప్రారంభించినట్లు వెల్లడించడంతో ఎలీ లిల్లీ 1.7 శాతం బలపడింది. కొనుగోళ్లు గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్.. 7 శాతం వాటాను కొనుగోలు చేయనున్న వార్తలతో హోమ్ సెక్యూరిటీ కంపెనీ ఏడీటీ 56 శాతం దూసుకెళ్లింది. ఇందుకు అల్ఫాబెట్ 45 కోట్ల డాలర్లను వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా జర్మన్ దిగ్గజం సీమెన్స్ హెల్దినీర్స్ టేకోవర్ చేయనున్న వార్తలతో వారియన్ మెడికల్ సిస్టమ్స్ 22 శాతం జంప్‌చేసింది. ఇందుకు సీమెన్స్ 16 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆసియా లాభాల్లో సోమవారం యూరోపియన్ మార్కెట్లు 2.5 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో చైనా 0.25 శాతం నీరసించగా.. మిగిలిన మార్కెట్లు 1.5-0.5 శాతం మధ్య లాభాలతో ట్రేడవుతున్నాయి. -
ఫాంగ్ స్టాక్స్ పుష్- యూఎస్ మార్కెట్లు ప్లస్
ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలు జోరందుకోవడంతో వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. అయితే కోవిడ్-19 విసురుతున్న సవాళ్లనుంచి నిరుద్యోగులకు దన్నునిచ్చేందుకు ప్రతిపాదించిన సహాయక ప్యాకేజీపై డెమక్రాట్లు, రిపబ్లికన్లమధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం గమనార్హం! ఈ నేపథ్యంలో శుక్రవారం డోజోన్స్ 115 పాయింట్లు(0.5 శాతం) లాభపడి 26,428కు చేరగా.. ఎస్అండ్పీ 25 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 3,271 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 157 పాయింట్లు(1.5 శాతం) పురోగమించి 10,745 వద్ద స్థిరపడింది. జులైలో జూమ్ జులైలో డోజోన్స్ 2.4 శాతం లాభపడగా.. ఎస్అండ్పీ 5.5 శాతం ఎగసింది. ఇక నాస్డాక్ మరింత స్పీడుతో దాదాపు 7 శాతం జంప్‌చేసింది. గత వారంలోనే నాస్డాక్ 3.7 శాతం బలపడటం విశేషం! ఫాంగ్ స్టాక్స్ జోరు ఏప్రిల్- జూన్‌లో పటిష్ట ఫలితాలు సాధించడంతో ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ షేరు 10.5 శాతం దూసుకెళ్లింది. 425 డాలర్లను అధిగమించింది. దీంతో కంపనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) ఒక్క రోజులోనే 172 బిలియన్ డాలర్లు జంప్‌చేసింది. 1.81 లక్షల కోట్ల డాలర్లను తాకింది. తద్వారా చమురు దిగ్గజం సౌదీ అరామ్కో(1.76 ట్రిలియన్ డాలర్లు)ను వెనక్కినెట్టింది. ఈ బాటలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 8.2 శాతం జంప్‌చేసి 254 డాలర్ల సమీపంలో నిలిచింది. ఇదే విధంగా అమెజాన్ 3.7 శాతం ఎగసి 3165 డాలర్లకు చేరింది. అయితే ప్రకటనలు పుంజుకున్నప్పటికీ 16 ఏళ్లలో తొలిసారి.. ఒక త్రైమాసికంలో మొత్తం ఆదాయం క్షీణించడంతో అల్ఫాబెట్ షేరు 3.2 శాతం నష్టపోయింది. 1483 డాలర్ల వద్ద ముగిసింది. కాగా.. కేటర్పిల్లర్ 2.8 శాతం క్షీణించి 133 డాలర్లకు చేరగా.. షెవ్రాన్ 2.7 శాతం నష్టంతో 84 డాలర్ల వద్ద నిలిచింది. ఆసియా అటూఇటూ ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో జపాన్ 2 శాతం, చైనా 1 శాతం చొప్పున ఎగశాయి. ఇండొనేసియా దాదాపు 3 శాతం పతనమైంది. ఇతర మార్కెట్లలో సింగపూర్, తైవాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్ 1.4-1 శాతం మధ్య క్షీణించగా.. కొరియా నామమాత్ర నష్టంతో కదులుతోంది. -
2 రోజుల నష్టాలకు చెక్- మోడర్నా జోరు
ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలు జోరందుకోవడంతో సోమవారం యూఎస్ మార్కెట్లు లాభపడ్డాయి. డోజోన్స్ 115 పాయింట్లు(0.4 శాతం) బలపడి 26,585కు చేరగా.. ఎస్అండ్పీ 24 పాయింట్లు(0.7 శాతం) పుంజుకుని 3239 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 173 పాయింట్లు(1.7 శాతం) ఎగసి 10,536 వద్ద నిలిచింది. వెరసి రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. 600 బిలియన్ డాలర్లు కోవిడ్-19 కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి అండగా రిపబ్లికన్ సెనేట్స్ 600 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీని ప్రతిపాదిస్తున్నట్లు వెలువడిన వార్తలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. నేటి నుంచి కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రెండు రోజులపాటు పరపతి సమీక్షా సమావేశాలను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్యాకేజీలపై దృష్టి సారించినట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. హ్యూస్టన్, చెంగ్డూలలో కాన్సులేట్ల మూసివేత ఆదేశాలతో యూఎస్, చైనా మధ్య చెలరేగిన వివాదాలు రెండు రోజులుగా మార్కెట్లను దెబ్బతీసిన విషయం విదితమే. ఫాంగ్ స్టాక్స్ ఈ బుధ, గురువారాలలో టెక్నాలజీ దిగ్గజాలు యాపిల్, అల్ఫాబెట్, అమెజాన్, ఫేస్బుక్ క్యూ2 ఫలితాలు ప్రకటించనున్నాయి. దీంతో ఫాంగ్ స్టాక్స్‌కు డిమాండ్ పెరిగింది. ఫలితంగా నాస్డాక్ జోరందుకున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్-19కు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న మోడర్నా ఇంక్ తాజాగా ప్రభుత్వం నుంచి 47.2 కోట్ల డాలర్ల ఎయిడ్‌ను అందుకుంది. దీంతో ఈ షేరు 9.2 శాతం దూసుకెళ్లింది. డిసెంబర్‌కల్లా వ్యాక్సిన్ వెలువడవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ బాటలో బయోజెన్ 5 శాతం ఎగసింది. క్యూ2 నిరాశపరచడంతో బొమ్మల తయారీ కంపెనీ హాస్బ్రో 7.4 శాతం, గ్రాసరీస్ కంపెనీ ఆల్బర్ట్సన్స్ 5.4 శాతం చొప్పున పతనమయ్యాయి. అల్భాబెట్ 1.4 శాతం పుంజుకోగా.. తైవాన్ కంపెనీ టీఎస్ఎం షేరు దాదాపు 13 శాతం జంప్‌చేసింది. 7నానోమీటర్ చిప్స్‌ను తయారు చేయనున్నట్లు ప్రకటించడం ఇందుకు దోహదపడింది. ఇతర కౌంటర్లలో కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా క్రూయిజర్ కంపెనీలు కార్నివాల్, నార్వేజియన్, రాయల్ కరిబియన్ 7-3 శాతం మధ్య పతనమయ్యాయి. -
వ్యాక్సిన్లపై ఆశలు- నాస్డాక్ రికార్డ్
ఓవైపు దేశంలోని 50 రాష్ట్రాలకుగాను 42 రాష్ట్రాలకు కరోనా వైరస్ విస్తరించినప్పటికీ మరోపక్క వ్యాక్సిన్ల అభివృద్ధిలో ఫార్మా దిగ్గజాల ముందడుగు సెంటిమెంటుకు బలాన్నిస్తోంది. దీంతో సోమవారం ఆటుపోట్ల మధ్య యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. డోజోన్స్ నామమాత్రంగా 9 పాయింట్లు బలపడి 26,681 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 27 పాయింట్లు(0.9 శాతం) ఎగసి 3,252 వద్ద స్థిరపడింది. నాస్డాక్ మరింత అధికంగా 264 పాయింట్లు(2.5 శాతం) జంప్‌చేసి 10,767 వద్ద ముగిసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ఇందుకు ప్రధానంగా అమెజాన్, మైక్రోసాఫ్ట్ సహకరించాయి. అయితే వారాంతానికి కోవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 1.4 లక్షలను దాటడం ఆందోళనలను పెంచుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సానుకూల ఫలితాలు ఆస్ట్రాజెనెకా, కాన్సినో బయోలాజిక్స్, ఫైజర్- బయోఎన్‌టెక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షలు విజయవంతమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రయోగాలలో వ్యాక్సిన్లు రోగ నిరోధక శక్తిని పెంచుతున్నట్లు డేటా పేర్కొంది. దీంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. అయితే ఇటీవల జోరు చూపుతున్న ఫార్మా షేరు మోడర్నా ఇంక్ కౌంటర్లో లాభాల స్వీకరణ తలెత్తినట్లు తెలియజేశారు. దీంతో సోమవారం ఈ షేరు 13 శాతం కుప్పకూలింది. 83 డాలర్ల దిగువకు చేరింది. ఇందుకు వ్యాక్సిన్ల అభివృద్ధిలో ప్రత్యర్థి సంస్థలు ముందడుగు వేయడం కూడా ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా ఆస్ట్రాజెనెకా- ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్(AZD1222) క్లినికల్ పరీక్షలలో ఇమ్యూనిటీని పెంచుతున్నట్లు తాజాగా వెల్లడైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. బ్రిటిష్ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ వినియోగంలో ఇతర సమస్యలు పెద్దగా తలెత్తకపోవడం గమనార్హం! ఐబీఎం అప్ బ్లూచిప్స్‌లో సోషల్ మీడియా దిగ్గజం అమెజాన్ 8 శాతం దూసుకెళ్లి 3197 డాలర్లను తాకగా.. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 4.3 శాతం జంప్‌చేసి 212 డాలర్లకు చేరింది. ఈ బాటలో ఫలితాలు ఆకట్టుకోవడంతో ఐబీఎం 5 శాతం పుంజుకోగా.. ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 9.5 శాతం ఎగసింది. 1643 డాలర్ల వద్ద ముగిసింది. వెరసి మరోసారి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఇతర కౌంటర్లలో చమురు దిగ్గజం షెవ్రాన్ 5 బిలియన్ డాలర్లకు కంపెనీని కొనుగోలు చేయనున్న వార్తలతో నోబుల్ ఎనర్జీ 5.4 శాతం జంప్‌చేసింది. అయితే షెవ్రాన్ 2.2 శాతం క్షీణించింది. సానుకూల క్యూ2 ఫలితాలతో హాలిబర్టన్ 2.5 శాతం బలపడింది. ఆసియా ఇలా కోవిడ్-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈసీబీ 650 బిలియన్ యూరోల ప్యాకేజీపై అంచనాలతో సోమవారం జర్మనీ 1 శాతం పుంజుకోగా.. ఫ్రాన్స్ 0.5 శాతం లాభపడింది. అయితే యూకే 0.5 శాతం నీరసించింది. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు జోష్‌తో కదులుతున్నాయి. తైవాన్, హాంకాంగ్, కొరియా, థాయ్‌లాండ్, ఇండొనేసియా, జపాన్ 2-1 శాతం మధ్య ఎగశాయి. సింగపూర్ 0.3 శాతం బలపడగా.. చైనా యథాతథంగా కదులుతోంది. -
మోడర్నా వహ్వా.. నెట్‌ఫ్లిక్స్ బేర్
వారాంతాన యూఎస్ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్ 63 పాయింట్లు(0.25 శాతం) క్షీణించి 26,672 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 9 పాయింట్లు(0.3 శాతం) పుంజుకుని 3,225 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 29 పాయింట్లు(0.3 శాతం) బలపడి 10,503 వద్ద స్థిరపడింది. దీంతో గత వారం డోజోన్స్ నికరంగా 2.3 శాతం ఎగసింది. ఇందుకు ప్రధానంగా ఫైజర్, మోడర్నా ఇంక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్లు సానుకూల ఫలితాలు చూపడం దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ బాటలో ఎస్అండ్పీ 1.3 శాతం లాభపడగా.. నాస్డాక్ 1.1 శాతం నీరసించింది. కాగా.. టెక్నాలజీ దిగ్గజాల అండతో ఈ ఏడాది ఇప్పటివరకూ నాస్డాక్ 17 శాతం ర్యాలీ చేయగా.. ఎస్అండ్పీ దాదాపు యథాతథంగా నిలిచింది. డోజోన్స్ మాత్రం 6 శాతం క్షీణించింది. శుక్రవారం యూరోపియన్ మార్కెట్లలో ఫ్రాన్స్ 0.3 శాతం డీలాపడగా.. యూకే, జర్మనీ అదే స్థాయిలో బలపడ్డాయి. బ్లూచిప్స్ తీరిలా ఈ ఏడాది క్యూ3(జులై-సెప్టెంబర్)లో కొత్త పెయిడ్ కస్టమర్లు భారీగా తగ్గనున్న అంచనాలతో ఎంటర్టైన్మెంట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ షేరు 6.5 శాతం పతనమైంది. 493 డాలర్ల వద్ద ముగిసింది. మరోపక్క కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ చివరి దశ క్లినికల్ పరీక్షలకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొనడంతో ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ షేరు 16 శాతం దూసుకెళ్లింది. వెరసి 95 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ మోడర్నా షేరు 370 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఇతర దేశాల దన్ను కోవిడ్-19 కట్టడికి ఫైజర్‌తో జత కట్టి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై చైనీస్ ఫోజన్ ఫార్మా పరీక్షలు చేపట్టేందుకు లైసెన్సింగ్‌ను పొందిన వార్తలతో బయోఎన్‌టెక్ షేరుకి హుషారొచ్చింది. మరోవైపు యూనియన్ యూనియన్‌లో వ్యాక్సిన్ సరఫరా కోసం ఆస్ట్రాజెనెకాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బయోఎన్‌టెక్ షేరు శుక్రవారం 12 శాతం జంప్‌చేసింది. 85 డాలర్లను అధిగమించింది. ఇక ఇండెక్స్ దిగ్గజాలలో కోకకోలా, ఇంటెల్, ఫైజర్ 1.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో బోయింగ్, షెవ్రాన్, ఎక్సాన్ మొబిల్, గోల్డ్‌మన్ శాక్స్, జేపీ మోర్గాన్ 1 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. కరోనా వైరస్ కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై అంచనాలతో గత వారం ఫైజర్ ఇంక్ నికరంగా 7 శాతం లాభపడింది. -
నాస్‌డాక్‌కు ఫాంగ్ స్టాక్స్ దెబ్బ
జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ మరింత ముందంజ వేసిన వార్తలతో తొలుత జోరందుకున్న డోజోన్స్ చివర్లో అమ్మకాలు పెరిగి నీరసించింది. నేడు బ్యాంకింగ్ దిగ్గజాలు క్యూ2(ఏప్రిల్-జూన్) ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో తొలుత 500 పాయింట్లు జంప్‌చేసిన డోజోన్స్ లాభాల స్వీకరణ కారణంగా చివరికి 10 పాయింట్ల నామమాత్ర లాభంతో 26,086 వద్ద నిలిచింది. మరోవైపు టెక్నాలజీ దిగ్గజాలు డీలాపడటంతో నాస్డాక్, ఎస్‌అండ్‌పీకి దెబ్బతగిలింది. వెరసి సోమవారం నాస్డాక్ 227 పాయింట్లు(2.15 శాతం) పతనమై 10,391 వద్ద స్థిరపడగా.. ఎస్అండ్పీ 30 పాయింట్లు(1 శాతం) నీరసించి 3,155 వద్ద ముగిసింది. కోవిడ్-19 కేసులు పెరుగుతండటంతో కాలిఫోర్నియా గవర్నర్ తిరిగి లాక్‌డవున్ నిబంధనలను కఠినతరం చేసిన వార్తలతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫార్మా దన్ను కరోనా వైరస్ కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు ఫాస్ట్‌ట్రాక్ హోదాను ప్రకటించడంతో ఈ నెలాఖరున తదుపరి దశ పరీక్షలను చేపట్టనున్నట్లు ఫైజర్, బయోఎన్‌టెక్ పేర్కొన్నాయి. దీంతో బయోఎన్‌టెక్ షేరు 10 శాతం దూసుకెళ్గగా.. ఫైజర్ 4 శాతం జంప్‌చేసింది. చిప్ తయారీ కంపెనీ అనలాగ్ డివైసెస్ మాగ్జిమ్ ఇంటిగ్రేటెడ్ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో అనలాగ్ 6 శాతం పతనంకాగా.. మాగ్జిమ్ 8 శాతం ఎగసింది. సాల్టీ స్నాక్స్ ఫ్రిటోస్, చీటోస్ అమ్మకాలు పెరుగుతున్నట్లు పేర్కొనడంతో పెప్సీకో 0.3 శాతం బలపడింది. నేలచూపులో ఫాంగ్ స్టాక్స్‌లో నెట్‌ఫ్లిక్స్ 4.25 శాతం పతనంకాగా.. ఫేస్బుక్ 2.5 శాతం క్షీణించింది. అల్ఫాబెట్ దాదాపు 2 శాతం బలహీనపడింది. ఇక మైక్రోసాఫ్ట్ 3 శాతం తిరోగమించింది. కాగా.. తొలుత 16 శాతం దూసుకెళ్లిన ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ షేరు చివరికి 3 శాతం నష్టంతో ముగిసింది. -
ఫాంగ్ స్టాక్స్ పుష్- నాస్డాక్ రికార్డ్
ఒకే రోజు ఏకంగా 60,000 మందికి కరోనా సోకడంతో రోగుల సంఖ్య 30 లక్షలకు చేరినప్పటికీ బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలోనే సాగాయి. ప్రధానంగా టెక్ దిగ్గజాలు అండగా నిలవడంతో నాస్డాక్ 149 పాయింట్లు(1.5 శాతం) ఎగసి 10,492 వద్ద ముగిసింది. వెరసి మరోసారి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది.ఈ బాటలో ఎస్అండ్పీ 25 పాయింట్లు(0.8 శాతం) బలపడి 3170 వద్ద నిలవగా.. డోజోన్స్ 177 పాయింట్లు(0.7 శాతం) బలపడి 26,067 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌కు ప్రధానంగా టెక్ దిగ్గజాలు యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్ దన్నునిచ్చాయి. ఈకామర్స్‌లో వాల్‌మార్ట్ పోటీకి తెరతీసినప్పటికీ అమెజాన్ మరోసారి సరికొత్త గరిష్టాన్ని తాకగా.. ఎస్అండ్పీ మార్చి కనిష్టం నుంచి 40 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! షేర్ల తీరిలా ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 0.5 శాతం పుంజుకుని 383 డాలర్ల వద్ద రికార్డ్ గరిష్టాన్ని అందుకుంది. అమెజాన్ 0.5 శాతం బలపడి 3095 డాలర్లను తాకింది. ఇక మైక్రోసాఫ్ట్ 0.3 శాతం లాభంతో 213 డాలర్ల వద్ద, అల్ఫాబెట్ 1500 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. ఇతర కౌంటర్లలో అల్జెమీర్స్(మతిమరుపు వ్యాధి)కి ప్రయోగాత్మక చికిత్సను అందించేందుకు దరఖాస్తు చేసిన వార్తలతో ఫార్మా కంపెనీ బయోజెన్ ఇంక్ 4.4 శాతం జంప్‌చేసింది. నేషనల్ జనరల్ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడంతో బీమా సంస్థ ఆల్స్టేట్ కార్ప్ 5 శాతం పతనమైంది. నేషనల్ జనరల్ మాత్రం 66 శాతం దూసుకెళ్లింది. క్రూయిజర్, ఎయిర్‌లైన్స్ కౌంటర్లు నీరసిస్తున్నప్పటికీ ఫాంగ్ స్టాక్స్ అండగా నిలవడంతో మార్కెట్లు బలపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. -
టెస్లా @1000 డాలర్లు- కొత్త రికార్డ్
కొత్త తరం ఆటోమొబైల్, డైవర్సిఫైడ్ రంగ కంపెనీ టెస్లా ఇంక్ సరికొత్త రికార్డును సాధించింది. బుధవారం యూఎస్ మార్కెట్లు వెనకడుగు వేసినప్పటికీ షేరు తొలిసారి 1,000 డాలర్ల మార్క్‌ను తాకింది. షేరు 6.3 శాతం అంటే 59 డాలర్లకుపైగా జంప్‌చేసి 1,000 డాలర్ల ఫీట్‌ను సాధించింది. తద్వారా కంపెనీ మార్కెట్ విలువరీత్యా ఆటో రంగ దిగ్గజాలలో టాప్ ర్యాంకులో నిలిచింది. టెస్లా మార్కెట్ క్యాప్ 184 బిలియన్ డాలర్లను అధిగమించడంతో 179 బిలియన్ డాలర్ల విలువగల జపనీస్ ఆటో దిగ్గజం టయోటా ద్వితీయ స్థానానికి పరిమితమైంది. కాగా.. గతేడాది ఒక దశలో టెస్లా షేరు విలువ 760 డాలర్లకు చేరడంతో కంపెనీ సీఈవో ఎలన్ మస్క్.. అత్యంత ఖరీదుగా మారిందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం! ఈ ఏడాది ఇప్పటివరకూ టెస్లా ఇంక్ షేరు 125 శాతం దూసుకెళ్లడం విశేషం! ఎలక్ట్రిక్ పవర్ టెస్లా ఇంక్ కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహన(కార్ల) తయారీలో ముందంజలో ఉంది. ఈ బాటలో కోవిడ్-19 నేపథ్యంలోనూ ఎలక్ట్రిక్ సెమీట్రక్ ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధంకావాలంటూ ఎలన్ మస్క్ తాజాగా సిబ్బందిని కోరడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. గిగా నెవడా ప్లాంటులో బ్యాటరీ, పవర్‌ట్రయిన్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఉద్యోగులకు మస్క్ తెలియజేశారు. లాక్‌డవున్ తదుపరి కంపెనీ ఇటీవలే ప్లాంట్లను పునఃప్రారంభించింది. వాల్‌మార్ట్, పెప్సీ తదితర దిగ్గజాల అవసరాలకు అనుగుణంగా సెమీ ట్రక్‌ను 2017లో కంపెనీ రూపొందించింది. మోడల్ 3 సెడాన్ కారుకు కనిపిస్తున్న డిమాండ్ సైతం టెస్లా షేరుకి బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మే నెలలో చైనాలో మోడల్-3 కార్లను 11,095 యూనిట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. డోజోన్స్ డౌన్ రెండు రోజులపాటు పాలసీ సమీక్షను చేపట్టిన ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చని అంచనా వేసింది. నిరుద్యోగ రేటు 9.3 శాతానికి పెరిగే వీలున్నట్లు పేర్కొంది. అయితే అవసరమైతే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా భవిష్యత్‌లో మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. వడ్డీ రేట్లను యథాతంగా 0-0.25 శాతం స్థాయిలో కొనసాగించేందుకే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బుధవారం డోజోన్స్ 282 పాయింట్లు(1 శాతం) క్షీణించి 26,990 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 17 పాయింట్లు(0.55 శాతం) నీరసించి 3,190 వద్ద ముగిసింది. అయితే నాస్డాక్ 67 పాయింట్లు(0.7 శాతం) పుంజుకుని 10,020 వద్ద స్థిరపడింది. తద్వారా వరుసగా మూడో రోజు సరికొత్త గరిష్టం వద్ద ముగిసింది. ఇందుకు టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, యాపిల్ బలపడటం సహకరించింది. సెప్టెంబర్‌కల్లా కోవిడ్-19 చికిత్సకు ఔషధాన్ని తీసుకువచ్చే వీలున్నట్లు కంపెనీ ప్రతినిధి పేర్కొనడంతో ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ షేరు 1.3 శాతం లాభపడింది. -
కోవిడ్-19లోనూ నాస్డాక్ కొత్త చరిత్ర
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 నేపథ్యంలోనూ అమెరికా టెక్నాలజీ ఇండెక్స్ నాస్డాక్ సోమవారం సరికొత్త రికార్డ్ సృష్టించింది. 111 పాయింట్లు(1.15 శాతం) లాభపడటం ద్వారా 9,925 వద్ద ముగిసింది. వెరసి మార్కెట్ చరిత్రలో తొలిసారి చరిత్రాత్మక గరిష్టం వద్ద నిలిచింది. తద్వారా యూఎస్ మార్కెట్లలో బుల్ ట్రెండ్ నెలకొన్న సంకేతాలను ఇచ్చింది. ఫాంగ్(FAANG) స్టాక్స్ దన్నుతో ఇటీవల కొద్ది రోజులుగా దూకుడు చూపుతున్న నాస్డాక్ మార్చి 23న నమోదైన కనిష్టం నుంచి తాజాగా 45 శాతం బౌన్స్‌బ్యాక్‌ను సాధించింది. ఈ బాటలో రికార్డ్ గరిష్టాలకు.. ఎస్అండ్పీ 4.5 శాతం, డోజోన్స్ 6.7 శాతం దూరంలో నిలవడం విశేషం! కాగా.. సోమవారం డోజోన్స్ 461 పాయింట్లు(1.7 శాతం) జంప్‌చేసి 27,572 వద్ద స్థిరపడగా.. ఎస్అండ్పీ 38 పాయింట్లు(1.2 శాతం) పుంజుకుని 3,232 వద్ద ముగిసింది. రివకరీ ఆశలు అటు వైట్‌హౌస్, ఇటు ఫెడరల్ రిజర్వ్ భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డవున్‌ను ఎత్తివేస్తున్న కారణంగా ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా బలపడనున్నట్లు అంచనాలు పెరుగుతున్నాయని తెలియజేశారు. దీంతో చౌకగా లభిస్తున్న పెట్టుబడులు స్టాక్ మార్కెట్లను ముంచెత్తుతున్నట్లు పేర్కొన్నారు. దీనికితోడు మే నెలలో ఉపాధి గణాంకాలు అంచనాలను మించుతూ ఆశావహంగా వెలువడటంతో సెంటిమెంటుకు జోష్‌వచ్చినట్లు తెలియజేశారు. నేటి నుంచి ఫెడరల్ రిజర్వ్ రెండు రోజులపాటు పాలసీ సమావేశాలను నిర్వహించనుంది. అవసరమైతే ఆర్థిక పురోగతికి మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఇప్పటికే ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రకటించడంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. క్రూయిజర్ జోరు కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్ అమలు కారణంగా దెబ్బతిన్న క్రూయిజర్, ఎయిర్‌లైన్స్ కంపెనీల కౌంటర్లకు ఇటీవల డిమాండ్ పెరిగింది. దీంతో సోమవారం సైతం కార్నివాల్ కార్ప్, నార్వేజియన్ క్రూయిజ్ లైన్‌తోపాటు ఎయిర్‌లైన్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి. కాగా.. కొద్ది రోజులుగా నాస్డాక్ ఇండెక్స్‌కు టెక్ దిగ్గజాలు ఫేస్బుక్, అమెజాన్, అల్ఫాబెట్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ అండగా నిలుస్తున్న విషయం విదితమే. -
15 ఏళ్ల తర్వాత.. నాస్డాక్ కొత్త రికార్డు
సాక్షి, వాణిజ్య విభాగం : గూగుల్, ఫేస్బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఆమెజాన్, ఇన్ఫోసిస్...ఒక్కటేమిటి ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ కంపెనీలన్నీ లిస్టయిన అమెరికా నాస్డాక్ సూచీ 15 సంవత్సరాల తర్వాత ఈ గురువారం ఆల్‌టైమ్ రికార్డుస్థాయిని చేరి చరిత్ర సృష్టించింది. కడపటి సమాచారం అందేసరికి ఈ సూచీ 5,143 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ 15 ఏళ్లలో అదే అమెరికాలోని డోజోన్స్ ఇండస్ట్రియల్, ఎస్ అండ్ పీ-500 సూచీలు 2000 సంవత్సరంలో సాధించిన రికార్డును 2007లో ఒకసారి బద్దలుకొట్టిన తర్వాత, మళ్లీ 2013 నుంచి ఇప్పటివరకూ ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. అలాగే భారత్‌తో పాటు పలు ప్రపంచ ప్రధాన సూచీలు కూడా. ఈ సూచీల్లో టెక్నాలజీ కంపెనీలే కాకుండా మెటల్, ఆయిల్, రియాల్టీ తదితర రంగాల షేర్లు లిస్ట్అయివుండటం, ఈ రంగాల్లో గణనీయమైన వృద్ధి 2004-2007 మధ్య జరగడం కారణం. ఫీట్ అసాధారణం... నాస్డాక్ మాత్రం 2000 మార్చి 10న నెలకొల్పిన 5,132 పాయింట్ల గరిష్టస్థాయిని అధిగమించడానికి 15 ఏళ్లు నిరీక్షించాల్సివచ్చింది. దశాబ్దాల టెక్నాలజీ వృద్ధిని, ఆయా కంపెనీలు ఆర్జించబోయే లాభాల్ని 1998-2000 మధ్యకాలంలోనే ఇన్వెస్టర్లు అంచనాలు కట్టేయడంతో, అప్పుడే అది 1000 పాయింట్ల నుంచి 5000 పాయింట్లకు పెరిగిపోయింది. ఏ రంగం జోరునైనా స్వల్పకాలంలోనే స్టాక్ మార్కెట్ డిస్కౌంట్ చేసుకోవడం, ఆతర్వాత మరో గొప్ప వృద్ధి విప్లవం వస్తేతప్ప, ఆ మార్కెట్ ఊగిసలాటతో క్షీణించడం తప్ప, మళ్లీ కొత్త రికార్డును చేరడం సాధారణంగా జరగదు. కానీ గురువారం నాస్డాక్ చేసిన ఫీట్ అసాధారణమైనది. మన కంపెనీలూ... టెక్నాలజీకి పర్యాయపదం నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్. ఏ దేశానికి చెందినదైనా గొప్ప టెక్నాలజీ కంపెనీ నాస్డాక్లో లిస్ట్‌కావడం ద్వారా భారీ నిధులు సమీకరించి, వ్యాపారాన్ని పెంచుకున్నవే. మన దేశానికి చెందిన ఇన్ఫోసిస్, విప్రో, సత్యం కంప్యూటర్స్, రీడీఫ్ డాట్ కామ్, డాక్టర్ రెడ్డీస్ లాబ్ వంటి కంపెనీలన్నీ నాస్డాక్ తలుపుతట్టినవే. అక్కడ లిస్టయిన కంపెనీలకు వృద్ధికి అవసరమైన నిధులతో పాటు, బ్రాండ్ ఇమేజ్ వచ్చేసేది. అప్పుడు పేలిపోయిన బుడగ.. ప్రపంచానికంతటికీ పీసీలు విక్రయించిన ఐబీఎం, యాపిల్లు సాఫ్ట్వేర్ విక్రయించిన ఇంటెల్, విండోస్‌ను అందించిన మైక్రోసాఫ్ట్‌లు అప్పట్లో నాస్డాక్ సూచీని పరుగులు పెట్టించాయి. ఇప్పటి స్టార్ట్అప్ కంపెనీల్లా, ఆ సమయంలో ఉప్పెనలా ముంచుకువచ్చిన డాట్‌కామ్ కంపెనీల షేర్లతో నాస్డాక్ సూచీ 2000 సంవత్సరం తొలి త్రైమాసికంలో అడ్డూఆపూ లేకుండా పెరిగిపోయింది. డాట్ కామ్ కంపెనీలు, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ కంపెనీలు గొప్పగా ఎదిగిపోతాయని అంచనాలు వేసిన ఇన్వెస్టర్లు, అవి దశాబ్దాలుగా ఆర్జించే లాభాల్ని అప్పుడే లెక్కలు కట్టేయడంతో అధిక విలువలకు షేర్లు పెరిగిపోయి, నాస్డాక్ బుడగ పేలిపోయింది. ఈ రికార్డు రూటే వేరు.... 2000 సంవత్సరంలో నాస్డాక్ రికార్డుస్థాయికి పెరగడానికి మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇంటెల్, హెచ్‌పీ, యాపిల్‌లాంటి దిగ్గజాలతో పాటు పలు డాట్ కామ్ షేర్లు కారణం. డాట్‌కామ్ బుడగపేలిన తర్వాత నాస్డాక్ సూచీ 2001 సెప్టెంబర్‌కల్లా 5,100 పాయింట్ల నుంచి 900కు పతనమయ్యింది. 2004లో లిస్టయిన గూగుల్.. 2008 వరకూ నాస్డాక్ను పెంచుతూ వచ్చింది. ఆ తర్వాత ఐపోన్తో యాపిల్, ఈకామర్స్ కంపెనీలు అమెజాన్, ఈబే, సోషల్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విటర్లు కొత్త రికార్డుల్ని సృష్టిస్తూ, నాస్డాక్ సూచీని 15 ఏళ్ల తర్వాత ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి చేర్చాయి.