
Elon Musk Loses 50 Billion Dollars: ప్రపంచదిగ్గజ పారిశ్రామికవేత్తలలో బిలియనీర్ ఎలన్ మస్క్ ఒకరు. తాను స్థాపించిన టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీలతో ఆయా రంగాల్లో సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సంపద సైతం అదే స్థాయిలో పెరుగుతూ పోతోంది. అయితే, కొద్ది రోజుల క్రితం.. "నా దగ్గర డబ్బులు లేవు. షేర్లు అమ్మేయాలని అనుకుంటున్నాను. మీరేమంటారు" అంటూ ట్వీట్‌లో నెటిజన్‌ల అభిప్రాయాన్ని కోరారు. ఆ తర్వాత అతని ఆస్తి భారీగా తగ్గిపోయింది. టెస్లా ఇంక్ షేర్లు వరుసగా రెండవ రోజు పడిపోయాయి. దీంతో ఎలన్ మస్క్ ఈ వారంలో ఇప్పటివరకు 50 బిలియన్ డాలర్లు(రూ.3.71 లక్షల కోట్లు) నష్టపోయారు.
ఇటీవల వాషింగ్టన్‌లో కొంతమంది డెమోక్రాట్లు ఎలన్ మస్క్ లాంటి బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి నేను నా టెస్లా స్టాక్‌లో 10శాతం విక్రయించాలని అనుకుంటున్నాను. దీనికి మీరు మద్దతు ఇస్తున్నారా?అని ఎలన్ నవంబర్ 7న ట్వీట్ చేశారు. అలాగే, అతని సోదరుడు కింబాల్ ఈ పోల్ పెట్టడానికి ముందే వాటాలను విక్రయించాడనే వార్తలు రావడంతో పెట్టుబడుదారులు తమ డబ్బును వెనక్కి తీసుకున్నారు. దీంతో రెండు రోజుల నుంచి టెస్లా షేర్ ధరలు పడిపోతున్నాయి. నవంబర్ 9న 1,173.60 డాలర్లు ఉన్న టెస్లా షేర్ ధర, నేడు 1,023.50 డాలర్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment