అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో బిలియనీర్ ఎలాన్ మస్క్.. తన ఈవీ కంపెనీ టెస్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు పరస్పరం విరుద్ధంగా మారారు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు మస్క్ మద్దతు ఇస్తుండగా టెస్లా ఉద్యోగులు మాత్రం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలహారిస్ వైపు నిలుస్తున్నారు.
అధ్యక్ష రేసులో పాల్గొంటున్న అభ్యర్థులకు ప్రచారం నిమిత్తం ఇస్తున్న విరాళాల ద్వారా టెస్లా ఉద్యోగుల మొగ్గు ఎటువైపు అన్నది తెలుస్తోంది. టెస్లా ఉద్యోగులు ట్రంప్ కంటే దాదాపు రెట్టింపు విరాళాలను కమలాహారిస్‌కు ఇస్తున్నట్లు తెలిసింది. యూఎస్ ప్రచార సహకారాలు, లాబీయింగ్ డేటాను ట్రాక్ చేసే ఓపెన్ సీక్రెట్ అనే సంస్థ ప్రకారం.. టెస్లా ఉద్యోగులు కమలకు 42,824 డాలర్లు విరాళం అందించగా ట్రంప్‌నకు 24,840 డాలర్ల విరాళం అందించారు.
ఎక్స్, స్పేస్‌ఎక్స్ ఉద్యోగులు కూడా..
ఎలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్ ఉద్యోగులు కూడా డెమోక్రాటిక్ అభ్యర్థి కమలహారిస్‌కే మద్దతిస్తున్నారు. వీరు కమలహారిస్‌కు 34,526 డాలర్లు విరాళం అందించగా ట్రంప్‌నకు ఇచ్చింది కేవలం 7,652 డాలర్లు. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (ట్విటర్) ఉద్యోగులు సైతం హారిస్‌కు 13,213 డాలర్లు విరాళమిచ్చారు. ట్రంప్‌కు ఇచ్చింది 500 డాలర్ల కంటే తక్కువ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment