
ఎప్పుడొస్తామో తెలియకపోవడమే అసలైన కష్టం
వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ మనసులోని మాట
వాషింగ్టన్: అంతరిక్షంలో ఉండటం కష్టం కాదు, కానీ ఎప్పుడు భూమి మీదకు చేరుకుంటామో నాసా అధికారులకు కూడా తెలియకపోవడమే అసలైన కష్టమని వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ అన్నారు. రాజకీయాలు జీవితంలో ఒక భాగమైనప్పటికీ... తను, విలియమ్స్ తిరిగి భూమిపైకి వెంటనే రాకపోవడానికి అవి కారణం కాదని విలియమ్స్ చెప్పారు. తన లాబ్రడార్ రిట్రీవర్స్‌తో తిరిగి ఆడుకోవడానికి వేచి చూస్తున్నానని తెలిపారు.
స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్స్‌లో మార్పు కారణంగా ఇప్పుడు మరో రెండు వారాలు అంతరిక్షంలో ఉండాల్సి వస్తోందని వెల్లడించారు. సహ వ్యోమగామి విల్‌మోర్‌తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2030 చివరిలో కాకుండా ముందుగానే రిటైర్ చేయాలని మస్క్ ఇటీవల చేసిన సూచనను విలియమ్స్ తోసిపుచ్చారు.
‘ఇప్పుడు కీలకమై న సమయంలో ఉన్నాం. ఐఎస్‌ఎస్ ని్రష్క మణకు ఇది సరైన సమయం కాదని నేను అనుకుంటున్నాను.’అని విలియమ్స్ అన్నా రు. ఇక ఇన్నాళ్లు అంతరిక్ష కేంద్రంలో ఉండటం కొంత ఆందోళన కలిగించినా.. తాము తిరిగి భూమిమీదకు ఎప్పుడు చేరుకుంటామో నాసా అధికారులకు కూడా తెలియకపోవడమే అసలైన కష్టమని ఆమె వ్యాఖ్యానించారు.
గతేడాది జూన్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విల్‌మోర్, విలియమ్స్ వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉంది. కానీ.. స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. గతేడాది క్రిస్‌మస్ వేడుకల ఫొటోలను విల్‌మోర్, విలియమ్స్ పంచుకోవడం, అందులో నీరసంగా కనిపించడంతో వారి ఆరోగ్యంపై ఆందోళనలు తలెత్తిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం ఆందోళన వ్యక్తంచేశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం వారిని వదిలేసిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. తొందరగా తీసుకురావాలంటూ స్పేస్‌ఎక్స్ చీఫ్ మస్క్‌కు విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన మస్క్ వీలైనంత తొందరగా తీసుకొస్తానని తెలిపారు. అయితే మస్క్ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదని నాసా ఉన్నతాధికారులు చెప్పారని బిడెన్ హయాంలోని నాసా మాజీ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పామ్ మెల్రాయ్ ఫిబ్రవరిలో వెల్లడించారు. దీనిపై స్పందించిన విల్‌మోర్ ఆ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం మస్‌్కపై తమకు గౌరవం, అభిమానం ఉన్నాయన్నారు. ‘మేం దేశానికి మద్దతునిస్తాం. దేశాధినేతలకు మద్దతునిస్తాం. వారికి కృతజ్ఞతలు’అని ప్రకటించారు. జనవరిలో ఇద్దరూ కలిసి స్పేస్ వాక్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment