SpaceX
-
భారత పారిశ్రామికవేత్తలకు మస్క్ ఆతిథ్యం
టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) అధినేత ఎలాన్‌మస్క్(Elon Musk) భారత్, అమెరికా సంబంధాలు సానుకూలంగా ఉన్నాయనే సంకేతాలిచ్చారు. ఇటీవల టెక్సాస్‌లోని స్పేస్ఎక్స్(SpaceX) స్టార్‌బేస్ ఫెసిలిటీలో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందానికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి తన మద్దతును వ్యక్తం చేశారు.ఆతిథ్యం(hosting)లో పాల్గొన్న ఇండియా గ్లోబల్ ఫోరం (ఐజీఎఫ్) నేతృత్వంలోని ప్రతినిధుల బృందంలో ప్రశాంత్ రుయా (డైరెక్టర్ - ఎస్సార్ క్యాపిటల్), జయ్ కోటక్ (కోహెడ్ - కోటక్ 811), రితేష్ అగర్వాల్ (ఫౌండర్ & గ్రూప్ సీఈఓ-ఓయో), కళ్యాణ్ రామన్ (సీఈఓ - ఫ్లిప్‌కార్ట్), ఆర్యమన్ బిర్లా (డైరెక్టర్ - ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్), నీలేష్ వేద్ (ఛైర్మన్ - అప్పారెల్ గ్రూప్), ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి ఉన్నారు.ఈ ఆతిథ్యంలో భాగంగా భారత పారిశ్రామికవేత్తలు స్పేస్ ఎక్స్ అత్యాధునిక సౌకర్యాలను సందర్శించారు. స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ఫ్లైట్ 7 ప్రయోగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, అంతరిక్ష అన్వేషణ రంగాల్లో అమెరికా, భారత్ మధ్య సహకారానికి ఉన్న అవకాశాలను మస్క్ నొక్కి చెప్పారు. ‘పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. అమెరికా, భారత్ మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి, అడ్డంకులను తగ్గించడానికి నేను అన్ని విధాలా అనుకూలం’ అని మస్క్ అన్నారు.ఇదీ చదవండి: ఏఐ చిప్‌లపై అమెరికా ఆంక్షల ప్రభావంఐజీఎఫ్ వ్యవస్థాపకులు మనోజ్ లాడ్వా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘స్థిరమైన, సాంకేతిక ఆధారిత భవిష్యత్తును రూపొందించడంలో భారత్‌కు, ప్రపంచ మార్గదర్శకుల మధ్య సహకారం పెరుగుతుందనడానికి ఈ కార్యక్రమం నిదర్శనం. డొనాల్డ్ ట్రంప్ త్వరలో అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న తరుణంలో అర్థవంతమైన చర్చలు మరింత ప్రాధాన్యతను ఇస్తాయి’ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డీజీజీ) కో-ఛైర్మన్‌గా మస్క్‌ను ప్రతిపాదించారు. -
స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్... ప్రయోగం విఫలం
టెక్సాస్: అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తున్న ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్ఎక్స్’కు చేదు అనుభవం ఎదురైంది. స్పేస్ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ పునరి్వనియోగ రాకెట్ ‘స్టార్‌షిప్’ ప్రయోగం విఫలమైంది. 123 మీటర్ల (400 అడుగులు) పొడవైన ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కొద్దిసేపటికే పేలిపోయింది. శకలాలు కరీబియన్ సముద్రంలో పడిపోయాయి. రాకెట్ బూస్టర్ మాత్రం క్షేమంగా భూమిపైకి తిరిగివచ్చింది. టెక్సాస్‌లోని లాంచ్‌ప్యాడ్ హస్తాలు బూస్టర్‌ను చక్కగా ఒడిసిపట్టుకున్నాయి. టెక్సాస్‌లో మెక్సికో సరిహద్దులోని బొకా చికా బీచ్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.37 నిమిషాలకు స్టార్‌షిప్ రాకెట్‌ను ప్రయోగించారు. ఇది 10 డమ్మీ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. 8 నిమిషాల తర్వాత రాకెట్‌తో సంబంధాలు తెగిపోయాయి. స్పేస్‌క్రాఫ్ట్‌లోని ఆరు ఇంజన్లు ఒకదాని తర్వాత ఒకటి పనిచేయడం ఆగిపోయింది. రాకెట్ భూమిపైకి తిరిగివస్తూ గాల్లోనే పేలిపోయింది. శకలాలు నిప్పుల వర్షాన్ని తలపించాయి. కేవలం ప్రయోగాత్మకంగానే స్టార్‌షిప్‌ను ప్రయోగించినట్లు స్పేస్ఎక్స్ అధికార ప్రతినిధి డాన్ హౌట్ చెప్పారు. బూస్టర్ క్షేమంగా తిరిగిరావడం సంతోషకరమే అయినప్పటికీ రాకెట్ పేలిపోవడం బాధాకరమని అన్నారు. ప్రయోగం విఫలమైనప్పటికీ ఇది స్టార్‌షిప్ విశ్వసనీయతను మరింత పెంచిందని తెలిపారు. ఇలాంటి వైఫల్యాలు పునరావృతం కాకుండా జాగ్రత్తవహిస్తామని పేర్కొన్నారు. డమ్మీ శాటిలైట్లను అంతరిక్షంలో ఎలా వదిలిపెట్టాలన్న దానిపై సాధనకోసం స్టార్‌షిప్‌ను ప్రయోగించామని వివరించారు. మరోవైపు రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోతున్న దృశ్యాలను స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.SpaceX Starship breaking up and re-entering over Turks and Caicos this afternoon. pic.twitter.com/LbpJWewoYB— Molly Ploofkins™ (@Mollyploofkins) January 16, 2025 విజయం సంగతి ఏమోగానీ వినోదం మాత్రం లభించిందని చమత్కరించారు. ఇంధనం లీకేజీ వల్లే రాకెట్ ప్రయోగం విఫలమైనట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్దది, శక్తివంతమైనది అయిన స్టార్‌షిప్ రాకెట్‌కు సంబంధించి ఇది ఏడో ప్రయోగం కావడం విశేషం. ఈ రాకెట్ సాయంతోనే అంగారక గ్రహంపై అడుగు పెట్టాలని ఎలాన్ మస్క్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మరోవైపు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ రెండు స్టార్‌షిప్ రాకెట్ల కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది.🚨#BREAKING: Debris was seen over the Caribbean after SpaceX's Starship broke apart during a test flight, creating a spectacular show in the sky.📌#Caicos | #IslandsWatch as multiple footage shows debris lights up the skies as SpaceX successfully launched Starship Flight 7… pic.twitter.com/ZWIUr22USV— R A W S A L E R T S (@rawsalerts) January 16, 2025 -
ఎలాన్ మస్క్ చేతికి టిక్‌టాక్..?
టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ ఆధ్వర్యంలోని టిక్‌టాక్(TikTok) అమెరికా కార్యకలాపాల(US operations)ను కొనుగోలు చేయవచ్చనే వార్తలొస్తున్నాయి. అమెరికాలో జాతీయ భద్రత, డేటా గోప్యతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ యూఎస్ కార్యకలాపాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను స్థానికంగా నిషేధించనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు.చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్(ByteDance) ఆధ్వర్యంలోని టిక్‌టాక్‌ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. లేదంటే ఈ యాప్‌పై నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్‌టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై తుదితీర్పు రావాల్సి ఉంది.అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్‌పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది.డేటా భద్రతలొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్‌టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.కంటెంట్ మానిప్యులేషన్అమెరికన్లు చూసే కంటెంట్‌ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: మరింత క్షీణిస్తున్న రూపాయి!ఈ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్‌లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. ఈ తరుణంలో ఎలాన్‌మస్క్ టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేయబోతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురిస్తున్నాయి. -
అమెజాన్ తొలి రాకెట్ ప్రయోగం.. స్పేస్ఎక్స్కు ముప్పు?
అమెజాన్ ఆధ్వర్యంలోని బ్లూ ఆరిజిన్(Blue Origin) స్పేస్ సర్వీస్ కంపెనీ తన మొదటి రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జెఫ్ బెజోస్(Jeff Bezos) నేతృత్వంలోని ఈ సంస్థ ‘న్యూ గ్లెన్’ అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను జనవరి 8న ప్రయోగించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రయోగం ఫ్లోరిడాలోని కేప్ కనావరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ సంస్థ స్థాపించిన 25 ఏళ్లకు మొదటి రాకెట్‌ను లాంచ్ చేస్తుండడం విశేషం. ఇప్పటికే ఎలన్ మస్క్ ఆధ్వర్యంలోని స్పేస్ఎక్స్ ప్రైవేట్ స్పేస్ సంస్థ అంతరిక్ష ప్రయోగాల్లో ఆధిపత్యం చలాయిస్తోంది. ఈ నేపథ్యంలో దానికి పోటీగా అమెజాన్ ఈ ప్రయోగం చేయడం రెండు సంస్థల మధ్య పోటీని తెలియజేస్తుంది. త్వరలో ప్రయోగించబోయే రాకెట్ లాంచ్‌కు సంబంధించి ‘నెక్ట్స్ స్టాప్ లాంచ్’ అని తెలియజేస్తూ జెఫ్ బెజోస్ ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.ఆరు గంటల ప్రయోగంబ్లూ ఆరిజిన్ న్యూ గ్లెన్ రాకెట్(New Glenn rocket)ను లండన్‌లోని కేప్ కెనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి లాంచ్ చేయనున్నట్లు ‘స్పేస్ ఫ్లైట్ నౌ’ తెలిపింది. 2024 డిసెంబర్ 27న రాకెట్ హాట్-ఫైర్ పరీక్ష పూర్తయినట్లు తెలిపింది. రాకెట్ పనితీరును, పేలోడ్లను మోసుకెళ్లే సామర్థ్యాన్ని పరీక్షించే ఈ ప్రయోగం సుమారు ఆరు గంటల పాటు ఉంటుందని భావిస్తున్నారు. న్యూ గ్లెన్ విజయవంతమైతే, బ్లూ ఆరిజిన్‌ను ప్రైవేట్ రంగ అంతరిక్ష రేసులో ముందంజలో ఉంచుతుందని కంపెనీ విశ్వసిస్తుంది.ఇదీ చదవండి: 130 బిలియన్ డాలర్లకు దేశీ ఫార్మాస్పేస్ఎక్స్కు ముప్పు?స్పేస్ఎక్స్ ఇటీవల పునర్వినియోగ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 2024లోనే 132 ప్రయోగాలు చేసి 99 శాతం సక్సెస్ రేట్ సాధించింది. ఈ కంపెనీకు చెందిన స్టార్ లింక్‌కు పోటీగా బ్లూ ఆరిజిన్ నిలుస్తుందా లేదా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంది. స్పేస్‌ఎక్స్‌తోపాటు లూనార్ ల్యాండర్ తయారీ కంపెనీలు, ప్రైవేట్ స్పేస్ స్టేషన్లు వంటి పోటీదారులతో పోటీ పడటానికి అమెజాన్ ప్రయత్నిస్తోంది. -
హెచ్1బీ వీసాల రక్షణ కోసం యుద్ధానికైనా సిద్ధమే
వాషింగ్టన్: టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ హెచ్–1బీ వీసాలకు మద్దతుగా నిలిచారు. ఈ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు. హెచ్–1బీ వీసాల విషయంలో ఇటీవల విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొందరు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు మద్దతిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎలాన్ మస్క్ శనివారం స్పందించారు. నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసుకొనేందుకు అవకాశం కల్పించే హెచ్–1బీ వీసాల విషయంలో అభిప్రాయం మార్చుకోవాలని వాటి వ్యతిరేకులకు సూచించారు. ‘‘నాతోపాటు ఎంతోమంది అమెరికాకు రావడానికి, స్పేస్ఎక్స్, టెస్టా వంటి సంస్థలు స్థాపించడానికి కారణం హెచ్–1బీ వీసాలే. ఈ వీసాలతోనే మేము ఇక్కడికొచ్చి పనిచేశాం. అవకాశాలు అందుకున్నాం. హెచ్–1బీ వీసాలతోనే అమెరికా బలమైన దేశంగా మారింది. ఇలాంటి వీసాలను వ్యతిరేకించడం మూర్ఖుపు చర్య. దాన్ని నేను ఖండిస్తున్నా. ఈ వీసాలు ఉండాల్సిందే. ఈ విషయంలో అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నా’’అని మస్క్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్నా డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి వలసలు తగ్గిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశీయులకు వీసాలు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నట్లు ఇప్పటికే ఆయన సంకేతాలిచ్చారు. ట్రంప్క అత్యంత సన్నిహితుడైన ఎలాన్ మస్క్ హెచ్–1బీ వీసాలకు మద్దతుగా గొంతు విప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. కృత్రిమ మేధపై వైట్‌హౌస్ సీనియర్ పాలసీ సలహాదారుడిగా భారత అమెరికన్ వెంచర్క్యాలిటలిస్టు శ్రీరామ్ కృష్ణన్‌ను ట్రంప్ ఇటీవల నియమించారు. నిపుణులైన వలసదార్ల కోసం గ్రీన్‌కార్డులపై పరిమితి తొలగించాలని కృష్ణన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని రిపబ్లికన్ నేతలు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై రగడ మొదలైంది. -
రివైండ్ 2024: చేదెక్కువ... తీపి తక్కువ!
2024 ఏడాది మన స్మృతి పథం నుంచి మరలిపోతూ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నెన్నో సంఘటనలను మనకు గుర్తులుగా మిగిల్చిపోతోంది. దశాబ్దాల బషర్ అసద్ నిరంకుశ పాలన నుంచి సిరియాకు తిరుగుబాటుదారులు స్వేచ్ఛ కల్పిస్తే అగ్రరాజ్యం అమెరికాలో ఓటర్లు దుందుడుకు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి పాలనా పగ్గాలు అప్పజెప్పారు. బంగ్లాదేశ్ విమోచన పోరాటయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లను కల్పించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ విద్యార్థుల చేసిన ఉద్యమం ధాటికి షేక్ హసీనాను అధికార పీఠం నుంచి దిగిపోయి భారత్‌కు పలాయనం చిత్తగించారు. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతం మరకలను భారత్‌కు పూసేందుకు కెనడా బరితెగించింది. అందుకు దీటుగా దౌత్యవేత్తలను బహిష్కరించి, భారత్ తీవ్ర నిరసన తెలపడంతో బాగా క్షీణించిన ఇరు దేశాల సత్సంబంధాలు వంటి ఎన్నో ఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. రాజకీయ సంక్షోభాలు, ప్రకృతి విపత్తులేకాదు ప్రపంచవ్యాప్తంగా పలు సందర్భాల్లో తీపికబుర్లనూ 2024 మోసుకొచ్చింది. ప్లాస్టిక్‌భూతం భూమండలాన్ని చుట్టేస్తున్న వేళ పర్యావరణహిత ప్లాస్టిక్‌ను జపాన్ శాస్త్రవేత్తలు సృష్టించారు. సోషల్‌మీడియా, స్మార్ట్‌ఫోన్ వలలో చిక్కుకున్న చిన్నారులను దాని నుంచి బయటపడేసేందుకు ఆ్రస్టేలియా వంటి పలు దేశాలు టీనేజర్ల ‘సోషల్’వినియోగంపై ఆంక్షలు విధించాయి. అసాధ్యమనుకున్న రాకెట్ టెక్నాలజీని స్పేస్ఎక్స్ సాధించి చూపింది. ప్రయోగించాక తిరిగొస్తున్న రాకెట్ సూపర్హెవీ బూస్టర్‌ను ప్రయోగవేదిక భారీ రోబోటిక్ చేతితో తిరిగి ఒడిసిపట్టి ఔరా అనిపించింది. 2024 ప్రపంచపుస్తకంలోని కొన్ని ముఖ్య పేజీలను తరచిచూస్తే...ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఏప్రిల్‌లో సిరియాలోని తమ దౌత్యకార్యాలయంపైకి ఇజ్రాయెల్ జరిపిన దాడితో ఇరాన్ వీరావేశంతో ఇజ్రాయెల్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు రంగంలోకి దూకింది. నెలల తరబడి గాజా స్ట్రిప్‌లో హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌పైకి బాంబులేసి కొత్తగా ఇరాన్ యుద్ధంలో తలదూర్చింది. దీంతో హమాస్ నుంచి ఇజ్రాయెల్ తన దృష్టినంతా ఇరాన్‌పై నిలిపింది. దాని పర్యవసానాలను ఇరాన్ తీవ్రంగా చవిచూసింది. ఇజ్రాయెల్ భీకర దాడులను తట్టుకోలేక ఇరాన్ దాదాపు చేతులెత్తేసింది. తూర్పు అజర్బైజాన్ సరిహద్దు ప్రాంతంలో డొక్కు హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ చనిపోయారు. కీలక నేత మరణంతో ఇజ్రాయెల్‌తో పోరులో అంతర్జాతీయంగా సైనికసాయం సాధించడంలోనూ ఇరాన్ విఫలమైంది. పేజర్లు, వాకీటాకీల ఢమాల్ ఢమాల్ యుద్ధవ్యూహాల చరిత్రలో ఎన్నడూలేనంత వినూత్న శైలిలో శత్రువుల పీచమణచడంలో తమది అందవేసిన చేయి అని ఇజ్రాయెల్ మరోసారి నిరూపించుకున్న సంఘటన ఇది. హమాస్‌కు మద్దతుపలుకుతున్న హెజ్»ొల్లా ఉగ్రమూలాలను ఇజ్రాయెల్ భారీగా దెబ్బకొట్టింది. తామే సృష్టించిన ఒక డొల్ల కంపెనీ ద్వారా వేలాదిగా పేజర్లు, వాకీటాకీలను హెజ్»ొల్లాతో కొనిపించి, అవి డెలివరీ అయ్యేలోపే వాటిల్లో సూక్ష్మస్థాయిలో ప్లాస్టిక్ బాంబును అమర్చి హెజ్»ొల్లా మిలిటెంట్లను ఇజ్రాయెల్ చావుదెబ్బతీసింది. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఏకకాలంలో వేలాది పేజర్లు, వాకీటాకీలను పేల్చేసింది. దీంతో దాదాపు 4,000 మంది రక్తసిక్తమయ్యారు. డజన్ల మంది చనిపోయారు. ఈ దాడి దెబ్బకు లెబనాన్‌లో సామాన్యులు సైతం ఏసీలు, రేడియోలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను వాడేందుకు వణికిపోయారు.కయ్యానికి కాలుదువ్విన కెనడా ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో భారత ప్రమేయం ఉందంటూ అక్కడి భారత హైకమిషన్కే నోటీసులిచ్చి విచారణ జరిపేందుకు కెనడా సాహసించి భారతదేశ ఆగ్రహానికి గురైంది. వెంటనే ఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తలు, ఎంబసీలు, కాన్సులేట్ల సిబ్బందిని వెనక్కి పంపేసి, సొంత దౌత్యాధికారులను వెనక్కి రప్పించి భారత్ తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేసింది. కెనడా సైతం అలాంటి దుందుడుకు చర్యకు పాల్పడటంతో ఇరుదేశాల మధ్య దౌత్య సత్సంబంధాలు దారుణంగా క్షీణించాయి. బంగ్లాదేశ్‌లో కూలిన హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్ విమోచనోద్యమకారుల కుటుంబాలకు ఉద్యోగాలు, ప్రవేశాల్లో రిజర్వేషన్లపై విద్యార్థి లోకం కన్నెర్రజేయడంతో ప్రధాని షేక్ హసీనా కాళ్లకు పనిచెప్పాల్సి వచ్చింది. హుటాహుటిన ఢాకాను వదిలి ఢిల్లీకి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు, హిందూ మైనారిటీలపై దాడులతో బంగ్లాదేశ్ ప్రభ అంతర్జాతీయంగా ఒక్కసారిగా మసకబారింది. పరిస్థితిని కాస్తంత చక్కబెడతానంటూ తాత్కాలికంగా పగ్గాలు చేపట్టిన యూనుస్ కూటమి ఇప్పుడేం చేస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉద్యమాలను అణచేస్తూ వేలమంది మరణాలకు బాధ్యురాలైన హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరడం, భారత్ స్పందించకపోవడం చూస్తుంటే పొరుగుదేశంలో భారత్‌కు సఖ్యత చెడే విపరిణామాలే కనుచూపుమేరలో కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యంపై రిపబ్లికన్ జెండా రెపరెపలు మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్ నినాదంతో దూసుకొచ్చి అలవోకగా అగ్రరాజ్య పీఠాన్ని కైవసం చేసుకున్న రిపబ్లికన్ల అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు 2025 ఏడాదికి హాట్‌టాపిక్ వ్యక్తిగా మారారు. ముఖాముఖి చర్చలో బైడెన్‌ను మట్టికరిపించి తన గెలుపును దాదాపు ఖాయం చేసుకున్న ట్రంప్ ఆతర్వాత రేసులో దిగిన కమలా హారిస్‌పై వ్యక్తిగత, విధానపర నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేసి నెగ్గుకురావడం విశేషం. అధికారంలోకి వస్తే ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని వెంటనే ఆపేస్తానన్న ప్రతిజ్ఞను ట్రంప్ ఏమేరకు నెరవేరుస్తారో వేచిచూడాలి. తమపై ఎక్కువ పన్ను వేసే భారత్‌పై అధిక పన్నులు మోపుతానని, తమకు భారంగా మారిన కెనడాపై అధిక ట్యాక్స్ వేస్తానని ట్రంప్ చెప్పారు. అక్రమ వలసదారులను కట్టకట్టి బయటకు పంపేస్తానన్నారు. నైతిక నిష్టలేని వ్యక్తులను కీలక పదవులకు నామినేట్ చేస్తూ ట్రంప్ తన ఏకపక్ష ధోరణిని ఇప్పటికే బయటపెట్టుకున్నారు. సిరియాలో బషర్‌కు బైబై తండ్రి నుంచి వారసత్వంగా పాలన మాత్రమే కాదు నిరంకుశ లక్షణాలను పుణికిపుచ్చుకున్న బసర్ అల్ అసద్‌కు తిరుగుబాటుదారులు ఎట్టకేలకు చరమగీతం పాడారు. తిరుగుబాటుదారుల మెరుపు దాడులతో అసద్ హుటాహుటిన రష్యాకు పారిపోయారు. దీంతో సిరియన్ల సంబరాలు అంబరాన్ని తాకాయి. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాసనలు కొట్టే తిరుగుబాటుదారుల ఏలుబడిలో ఇకపై సిరియా ఏపాటి అభివృద్ధి ఫలాలను అందుకుంటుందోనని ప్రపంచదేశాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఎవరికి వారు కొంత ప్రాంతాలను పాలిస్తున్న వేర్పాటువాదులను ఏకం చేసి ఐక్యంగా దేశాన్ని పాలించాల్సిన బాధ్యత ఇప్పుడు హయత్ తహ్రీర్ అల్షామ్ అధినేత అబూ మొహమ్మద్ అల్ జులానీ మీద పడింది. రష్యా నేలపైకి ఉక్రెయిన్ సేనలు నెలల తరబడి జరుగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో 2014లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఆగస్ట్ ఆరున రష్యాలోని కురస్క్ ఒబ్లాస్ట్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ సేనలు ఆక్రమించాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత రష్యా భూభాగాన్ని మరో దేశం ఆక్రమించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ సేనల దూకుడుకు కళ్లెం వేసేందుకు రష్యా భూతల, గగనతల దాడులకు తెగబడింది. మళ్లీ దాదాపు సగంభూభాగాన్ని వశంచేసుకోగల్గింది. ఇంకా అక్కడ రోజూ భీకర పోరు కొనసాగుతోంది. మరోవైపు రష్యా తరఫున పోరాడుతూ ఉత్తరకొరియా సైనికులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. పశి్చమదేశాల నుంచి అందుతున్న దీర్ఘశ్రేణి మిస్సైళ్లతో ఉక్రెయిన్ వచ్చే ఏడాది యుద్ధాన్ని ఏ దిశగా తీసుకెళ్తుందోమరి.దక్షిణకొరియాలో ఎమర్జెన్సీ పార్లమెంట్లో మెజారిటీలేక, తెచి్చన బిల్లులు ఆమోదం పొందక తీవ్ర అసహనంలో ఉన్న దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ డిసెంబర్ మూడోతేదీన మార్షల్ లా ప్రకటించారు. దీంతో చిర్రెత్తుకొచి్చన విపక్షపారీ్టల సభ్యులు పార్లమెంట్ గోడలు దూకివచి్చమరీ మెరుపువేగంతో పార్లమెంట్‌ను సమావేశపరచి మార్షల్ లాను రద్దుచేస్తూ సంబంధిత తీర్మానంపై ఓటింగ్ చేపట్టి నెగ్గించుకున్నారు. దీంతో కేవలం ఆరు గంటల్లోనే ఎమర్జెన్సీని ఎత్తేశారు. మార్షల్ లాను ప్రయోగించి దేశంలో అస్థిరతకు యతి్నంచారంటూ అధ్యక్షుడిపై విపక్షాలు అభిశంసన తీర్మానం తెచ్చాయి. తొలి తీర్మానం అధికార పార్టీ సభ్యుల గైర్హాజరుతో వీగిపోయింది. బగ్ దెబ్బకు ‘విండోస్’ క్లోజ్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక చిన్న అప్డేట్ పేద్ద సమస్యను సృష్టించింది. జూలైలో విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను మైక్రోసాఫ్ట్ పరిష్కరించింది.పర్యావరణహిత ప్లాస్టిక్! మనం వాడే ప్లాస్టిక్ తొలుత మురుగు నీటితో ఆ తర్వాత నదీజలాల్లో చివరకు సముద్రాల్లో కలుస్తోంది. ప్రపంచముప్పుగా మారిన ప్లాస్టిక్‌కు చెక్ పెట్టేందుకు జపాన్ శాస్త్రజ్ఞులు పర్యావరణహిత ప్లాస్టిక్‌ను సృష్టించారు. సముద్రజలాలకు చేరగానే కేవలం 10 గంటల్లో నాశనమయ్యే ప్లాస్టిక్ అణువులను వీళ్లు తయారుచేశారు. నేలలో కలిస్తే కేవలం 10 రోజుల్లో ఇది విచి్ఛన్నమవుతుంది. సింగ్ యూజ్ ప్లాస్టిక్‌ల బదులు ఈ కొత్తతరహా ప్లాస్టిక్ త్వరలోనే వాణిజ్యస్థాయిలో ఉత్పత్తయి ప్రపంచదేశాలకు అందుబాటులోకి రావాలని అంతా ఆశిస్తున్నారు.రోబోటిక్ చేయి అద్భుతం అంతరిక్ష ప్రయోగాలకు వ్యోమనౌకలు, కృత్రిమ ఉపగ్రహాల ప్రయోగాలకు ఉపయోగించే వందల కోట్ల ఖరీదైన రాకెట్ బూస్టర్లను మళ్లీ వినియోగించుకునేలా తయారుచేసి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ అందర్నీ ఔరా అనిపించింది. ఇటీవల చేసిన ప్రయోగంలో నింగిలోకి దూసుకెళ్లి తిరిగి యథాస్థానానికి చేరుకుంటున్న భారీ రాకెట్బూస్టర్ను ప్రయోగవేదికపై అమర్చిన రోబోటిక్ చేయి జాగ్రత్తగా పట్టుకుని శెభాష్ అనిపించుకుంది. బూస్టర్ల పునరి్వనియోగంతో ఎంతో డబ్బు ఆదాతోపాటు బూస్టర్ తయారీలో వాడే ఖరీదైన అరుదైన ఖనిజ వనరుల వృథాను తగ్గించుకోవచ్చు. కృత్రిమ మేధ హవా ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) దిగ్గజా లు జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌లకు భౌతికశాస్త్ర నోబెల్‌ను బహూకరించిన నోబెల్ కమిటీ సైతం ఈ ఏడాది కృత్రిమ మేధ ఆవశ్యకతను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. ఏఐ చాట్బాట్లు దైనందిన జీవితంలో భాగ మైపోయాయి. లక్షల రెట్ల వేగంతో పనిచేస్తూ పురోగమిస్తున్న ఏఐ రంగం ఇప్పుడు మానవ మేధస్సుకు సవాల్ విసురుతోంది. డిజిటల్ దురి్వనియోగం బారినపడకుండా ఏఐను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రపంచదేశాలు ఇటీవల హెచ్చరించాయి. అత్యుష్ణ ఏడాదిగా దుష్కీర్తి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, యథేచ్ఛగా జరుగుతున్న మానవ కార్యకలాపాలు, అడవుల నరికివేత, పారిశ్రామికీకరణతో భూగోళం ఈ ఏడాది గతంలో ఎన్నడూలేనంతగా వేడెక్కింది. పారిశ్రామికవిప్లవం ముందునాటితో పోలిస్తే ఉష్ణోగ్రతలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించిపోకుండా కాచుకోవాల్సిన జనం ఈ ఏడాదే అది మించిపోయేలా చేశారు. చరిత్రలో తొలిసారిగా ఒక్క ఏడాదిలోనే భూతాపంలో ఉన్నతి 1.5 డిగ్రీ సెల్సియస్‌ను దాటింది. ఎల్‌నినో కన్నా వాతావరణ మార్పులు, మానవ తప్పిదాల వల్లే అత్యుష్ణ ఏడాదిగా 2024 చెడ్డపేరు తెచ్చుకుందని తాజా అధ్యయనాల్లో తేలింది. సూర్యుడి ముంగిట పార్కర్ సందడి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’వ్యోమనౌక నూతన చరిత్ర లిఖించింది. భగభగ మండే భానుడికి అత్యంత దగ్గరగా వెళ్లింది. తర్వాత అక్కడి నుంచి సురక్షితంగా వెలుపలికి వచ్చింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వ్యోమనౌకగా రికార్డు నెలకొల్పింది. పార్కర్‌ను 2018లో ప్రయోగించారు. అంతరిక్ష వాతావరణం, సౌర తుపానులపై లోతైన అవగాహన కోసం దీనిని తయారుచేశారు. వచ్చే ఏడాది మార్చి 22వ తేదీన, మళ్లీ జూన్ 19వ తేదీన సైతం భానుడి చేరువగా వెళ్లనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్టార్‌షిప్ ప్రయోగం పాక్షికంగా విజయవంతం
టెక్సాస్: చంద్రుడితోపాటు అంగారక గ్రహంపై భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాల కోసం స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘స్టార్‌షిప్’ రాకెట్‌కు సంబంధించిన ఆరో ప్రయోగాన్ని మంగళవారం టెక్సాస్‌లో నిర్వహించారు. ఇందులో ఒక దశ విఫలం కాగా, మరో దశ విజయవంతమైంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తోపాటు స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఈ ప్రయోగాన్ని స్వయంగా వీక్షించారు. దాదాపు 400 అడుగుల(121 మీటర్లు) పొడవైన స్టార్‌షిప్ రాకెట్‌ను స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్పేస్ఎక్స్ లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగించారు. ఇందులోని 33 శక్తివంతమైన రాప్టర్ ఇంజన్లను మండించడంతో స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. కొద్ది సేపటి తర్వాత స్పేస్‌క్రాఫ్ట్ నుంచి సూపర్ హెవీ బూస్టర్ విజయవంతంగా విడిపోయింది. భూమివైపు తిరుగు ప్రయాణం ఆరంభించింది. Booster 13 splashdown in the Gulf of Mexico. Tower was go, but booster was not. pic.twitter.com/RwhZDxPaQU— Chris Bergin - NSF (@NASASpaceflight) November 19, 2024షెడ్యూల్ ప్రకారం మళ్లీ లాంచ్సైట్ వద్దకే చేరుకోవాలి. అక్కడున్న మర చేతులు బూస్టర్‌ను జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలి. కానీ, ఇంతలో సాంకేతిక సమస్య ఎదురుకావడంతో బూస్టర్ క్యాచింగ్ ప్రక్రియను నిలిపివేశారు. బూస్టర్‌ను నింగిలోనే దారి మళ్లించారు. దాంతో అది గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాల్లో కూలిపోయింది. ఖాళీగా ఉన్న స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్ మాత్రం షెడ్యూల్ ప్రకారమే 90 నిమిషాలపాటు భూమిచుట్టూ చక్కర్లుకొట్టింది. Starship preparing to splash down in the Indian Ocean pic.twitter.com/EN9jibr07l— SpaceX (@SpaceX) November 19, 2024చివరకు హిందూ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండైంది. స్టార్‌షిప్ రాకెట్ప్రయోగ దృశ్యాలను స్పేస్ ఎక్స్ సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. గత నెలలో చేపట్టిన స్టార్‌షిప్ ఐదో ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. లాంచ్ సైట్ వద్దకు బూస్టర్ క్షేమంగా తిరిగొచ్చింది. మర చేతులు దాన్ని జాగ్రత్తగా అందుకున్నాయి. ఈ ప్రయోగం ద్వారా స్పేస్ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. -
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి GSAT-20
-
30 నిమిషాల్లో.. ఢిల్లీ నుంచి అమెరికాకు: సాధ్యమే అంటున్న మస్క్
టెక్ బిలియనీర్ 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే స్టార్‌షిప్ రాకెట్ రూపొందించారు. దీని ద్వారా ప్రపంచంలోని ప్రధాన నగరాలకు చేరుకోవడానికి గంట కంటే తక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు.నవంబర్ 6న ఎక్స్ యూజర్ అలెక్స్ పోస్ట్ చేసిన వీడియోలో గమనిస్తే.. స్టార్‌షిప్ రాకెట్ ప్రయాణించడం చూడవచ్చు. ఇందులో భూమిపైనా ఎక్కడికైనా కేవలం గంటలోపే.. కొన్ని సంవత్సరాల్లోనే ఇది అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ.. ఇది సాధ్యమవుతుందని మస్క్ ట్వీట్ చేశారు.సాధారణంగా ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ చేరుకోవడానికి సుమారు 16 గంటల సమయం పడుతుంది. అయితే స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ ద్వారా ఈ గమ్యాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చని వీడియోలో వెల్లడైంది.ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే ఇది రాబోయే రోజుల్లో వినియోగంలోకి కూడా వచ్చేస్తుంది.ఇదీ చదవండి: మీటింగ్‌కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓస్పేస్ఎక్స్ రూపొందిస్తున్న స్టార్‌షిప్ రాకెట్ సాధారణ విమానం మాదిరిగా కాకుండా.. రాకెట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో ఒక్కసారికి 1,000 మంది ప్రయాణించవచ్చని చెబుతున్నాయి. ఇది పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారై ఉంటుంది. అయితే డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత ఈ ప్రాజెక్టుకు కావలసిన అన్ని అనుమతులను మంజూరు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది వినియోగంలోకి వచ్చిన తరువాత విమానయాన సంస్థలు గట్టి పోటీ ఎదుర్కోవాలి ఉంటుంది.This is now possible— Elon Musk (@elonmusk) November 6, 2024 -
ట్రంప్‌నకు మద్దతు.. మస్క్ కంపెనీలు ఎంత పెరిగాయంటే..
ప్రముఖ పారిశ్రామికవేత్త ఇలాన్‌మస్క్ తన విజయానికి ఎంతో కృషి చేసినట్లు స్వయంగా డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ట్రంప్ గెలుపు ఖాయం అని నిర్ధారించుకున్న మార్కెట్లు గడిచిన రెండు సెషన్ల నుంచి భారీగా పెరుగుతున్నాయి. అనుకున్న విధంగానే ఆయన గెలుపు ఖరారైంది. దాంతో మస్క్ ఆధ్వర్యంలోని కంపెనీల స్టాక్ విలువ భారీగా పెరుగుతోంది. గడిచిన రెండు సెషన్‌ల్లో దాదాపు రూ.రెండు లక్షల కోట్లు మేర వీటి విలువ పెరిగినట్లు మార్కెట్ అంచనా వేస్తుంది.ప్రభుత్వ ఏజెన్సీల సడలింపులుమస్క్ కంపెనీల్లోకెల్లా ముఖ్యంగా టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ సంస్థలపై ప్రభుత్వ నిబంధనల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌తో మస్క్‌కు ఉన్న సంబంధాలు ఉపయోగించుకొని ఆయా కంపెనీలు లబ్ధి పొందే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీలపై ప్రభుత్వ ఏజెన్సీల నిబంధనల సడలింపులు, ఒత్తిడిని తగ్గించుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఎన్నిక ముగిసింది.. పరుగు ఆగింది! బంగారం ధర యూటర్న్మస్క్ ఆధ్వర్యంలోని కంపెనీలు ఇవే..టెస్లాస్పేస్ఎక్స్న్యూరాలింక్ది బోరింగ్ కంపెనీఎక్స్ కార్పొరేషన్జిప్ 2పేపాల్స్టార్లింక్ఎక్స్ ఏఐ -
శుభాన్షు శుక్లా... ఎంటర్ ద ‘డ్రాగన్’
ప్రతిష్టాత్మక ఆక్సియం స్పేస్ ఏఎక్స్–4 మిషన్‌కు ఎంపికైన భారత వ్యోమగామి, వైమానిక దళ గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా తాము ప్రయాణించబోయే అత్యాధునిక డ్రాగన్ వ్యోమనౌకను తొలిసారి సందర్శించారు. అమెరికాలో హూస్టన్‌లోని స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిగతా ముగ్గురు సిబ్బందిని ముఖాముఖి కలుసుకున్నారు. వారంతా కలిసి వ్యోమనౌకలో కాసేపు గడిపారు. స్పేస్సూట్కు కొలతలివ్వడంతో పాటు ప్రెజరైజేషన్ తదితర తప్పనిసరి పరీక్షల్లో వారంతా పాల్గొన్నారు. దీంతో వారందరికీ శిక్షణ ప్రక్రియ లాంఛనంగా మొదలైనట్టయింది. ఈ మిషన్‌కు నాసా వ్యోమగామి పెగీ వాట్సన్ సారథ్యం వహించనున్నారు. ఇందులో భాగంగా వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 10 రోజుల పాటు పలు ప్రయోగాలు, పరిశోధనల్లో గడుపుతారు. ప్రైవేట్ వ్యక్తులు, పరిశోధకులకు ఐఎస్ఎస్ సందర్శనకు వీలు కలి్పచేందుకు స్పేస్ ఎక్స్ తలపెట్టిన నవతరం వాణిజ్య అంతరిక్ష యాత్రల్లో ఆక్సియం స్పేస్ మిషన్ నాలుగోది. ఆక్సియం స్పేస్, స్పేస్ ఎక్స్, నాసా భాగస్వామ్యంతో ఈ ప్రయోగం జరుగుతోంది. -
ఇండియన్ రైల్వే నుంచి స్పేస్ఎక్స్ వరకు..
SpaceX Sanjeev Sharma: అమెరికాకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఇటీవల చేసిన అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది. స్టార్ఫిష్ రాకెట్‌తో పాటు స్పేస్‌లోకి దూసుకెళ్లిన బూస్టర్ తిరిగి యథాస్థానానికి వచ్చేలా చేసిన ప్రయోగం అందరి దృష్టిని ఆకర్షించింది. స్పేస్ రీసెర్చిలో అత్యద్భుతంగా పేర్కొంటున్న ఈ ప్రయోగాన్ని సౌత్ టెక్సాస్‌లోని స్టార్‌బేస్ నుంచి స్పేస్ఎక్స్ శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. ఈ సెంటిస్టుల బృందంలో మనదేశానికి చెందిన సంజీవ్ శర్మ కీలకపాత్ర పోషించారు. ఆయనకు సంబంధించిన లింక్డిన్ ప్రొఫైల్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.అంచెలంచెలుగా ఎదిగి..శ్రీసాయి దత్తా అనే యూజర్ సంజీవ్ శర్మకు సంబంధించిన విద్యా, ఉద్యోగ వివరాలు ఎక్స్‌లో షేర్ చేశారు. ఫ్రం ఇండియన్ రైల్వేస్ టు స్పేస్ఎక్స్’ పేరుతో ఈ వివరాలను వెల్లడించారు. ఒకప్పుడు ఇండియన్ రైల్వేలో పనిచేసిన ఆయన పస్తుతం స్పేస్ఎక్స్ సంస్థలో ప్రిన్సిపల్ ఇంజనీర్‌గా పనిచేస్తూ రోదసి ప్రయోగాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. భారతీయ రైల్వేలో 11 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదివి.. అంచెలంచెలుగా ఎదిగి అంతరిక్ష ప్రయోగాల్లో పాలుపంచుకుంటున్నారు.అమెరికాలో ఉన్నత విద్యరూర్కీ ఐఐటీలో మెకానికల్ ఇంజనీర్ చదువు పూర్తైన తర్వాత సంజీవ్ శర్మ 1990లో ఇండియన్ రైల్వేలో డివిజినల్ మెకానికల్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించారు. 1994లో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా ఆయన ప్రమోషన్ లభించింది. 2001 వరకు ఈ జాబ్‌లో ఆయన కొనసాగారు. తర్వాత రైల్వే ఉద్యోగం వదిలిపెట్టి అమెరికా వెళ్లి కొలరాడో యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు. 2003లో సీగేట్ టెక్నాలజీ కంపెనీలో స్టాఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా చేరారు. ఇదే సమయంలో మిన్నెసోటా యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో మరో మాస్టర్ డిగ్రీ చేశారు. 2013లో స్పేస్ఎక్స్ సంస్థలో స్ట్రక్చర్స్ గ్రూప్ డైనమిక్స్ ఇంజినీర్‌గా జాబ్ సంపాదించారు. అక్కడ ఐదేళ్లు పనిచేసిన తర్వాత 2018లో మ్యాటర్నెట్ కంపెనీకి మారారు. మళ్లీ 2022లో స్పేస్ఎక్స్కు తిరిగొచ్చారు. ‘బూస్టర్’ ప్రయోగం సక్సెస్ నేపథ్యంలో సంజీవ్ శర్మ పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది."From Indian Railways to SpaceX, From Building Trains to building Starships & catching them"Podcast of Sanjeev Sharma- Principal Engineer for #Starship Dynamicshttps://t.co/mzD2QEQTWa pic.twitter.com/fbDXXJf8sx— SRI SAIDATTA (@nssdatta) October 15, 2024ఓపిక అంటే ఇది..ఇండియన్ రైల్వే నుంచి స్పేస్ఎక్స్ వరకు సాగిన సంజీవ్ శర్మ విజయ ప్రస్థానంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ రైల్వేలో 11 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత ప్రైవేట్ సంస్థకు మారడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే సౌలభ్యాలు, సౌకర్యాలను వదులుకోవడానికి చాలా మంది ఇష్టపడరని నెటిజన్ ఒకరు పేర్కొన్నారు. ‘ఓపిక అంటే ఇది. స్పేస్ఎక్స్లో చేరడానికి ముందు సంజీవ్ శర్మకు 20 సంవత్సరాల కెరీర్ ఉంద’ని మరొకరు కామెంట్ చేశారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సంజీవ్ శర్మ ప్రమోషన్ సంపాదించారంటే ఆయన ఎంత ప్రతిభావంతుడో అర్థమవుతోందని మరో నెటిజన్ మెచ్చుకున్నారు. చదవండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసుల మృతి -
మస్క్.. టికెట్ ఎక్కడ కొనాలి?: ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల 'ఇలాన్ మస్క్'కు (Elon Musk) చెందిన స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ విజయవంతంగా దాని లాంచ్ ప్యాడ్‌కు తిరిగి వచ్చిన సందర్భంగా ఆ వీడియోను షేర్ చేస్తూ.. నేను నా టికెట్‌ను ఎక్కడ కొనాలి అంటూ ట్వీట్ చేశారు.ఈ ఆదివారం స్పేస్ఎక్స్ ప్రయోగం జరుగుతున్న సమయంలో టీవీ ముందే ఉండిపోయాను. స్పేస్ఎక్స్ తిరిగిరావడం ఓ చారిత్రాత్మక ఘట్టం. ఈ ప్రయోగం.. అంతరిక్ష ప్రయాణంలోనే కీలకమైన క్షణం కావచ్చని ఆనంద్ మహీంద్రా పేర్కొంటూ మస్క్‌ను ప్రశంసించారు.And this Sunday, I’m happy to be a couch potato, if it means that I get to watch history being made. This experiment may just be the critical moment when space travel was democratised and made routine. Where can I buy my ticket, @elonmusk ? 👏🏽👏🏽👏🏽pic.twitter.com/yruGSwL2Y4— anand mahindra (@anandmahindra) October 13, 2024మొదటిసారి నింగిలోకి దూసుకెళ్లిన స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ బూస్టర్ సురక్షితంగా భూమిపైకి చేరుకుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలా తిరిగి వచ్చిన మొదటి బూస్టర్‌గా.. స్టార్‌షిప్ రాకెట్ గుర్తింపు పొందింది. సూపర్ హెవీ బూస్టర్ రాకెట్ మొదటి ప్రయత్నంలోనే ఎలాంటి అంతరాయాలకు లోనుకాకుండా కిందికి దిగుతుందని ఎవరూ ఊహించలేదు.ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు.. 2025లో వీటిదే హవా!ఇలాన్ మస్క్ స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ కిందికి దిగటానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. టవర్ రాకెట్‌ని పట్టుకుంది. ఈ విజయవంతమైన క్యాచ్ పునర్వినియోగ రాకెట్ టెక్నాలజీలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుందని మస్క్ పేర్కొన్నారు. -
మంచు లోకంలో మహా సముద్రం!
‘‘ప్రాణం... ఎపుడు మొదలైందో... తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా?’’ అని ప్రశి్నస్తారొక సినీ కవి. నిజమే. ప్రాణం ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? భూమి కాకుండా అనంత విశ్వంలో ఇంకెక్కడైనా జీవులున్నాయా? కోట్లాది గెలాక్సీలు, తారాతీరాలు, గ్రహాలు, ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు... సుదూరాన ఎన్నో కొత్త లోకాలు, మరెన్నో ప్రపంచాలు! వీటిలో ఎక్కడైనా ప్రాణికోటి వర్ధిల్లుతోందా? ఆ జీవరాశి జాడ తెలిసేదెలా? భూమి మినహా విశ్వంలో జీవులకు ఆవాసయోగ్యమైన ప్ర దేశాలను కనిపెట్టేదెలా? వాతావరణం, పరిస్థితుల పరంగా జీవుల మనుగడకు ఆలంబనగా నిలిచే సానుకూల ప్ర దేశాలు మన సౌరవ్యవస్థలో ఉన్నాయా? జవాబులు తెలియాలంటే గ్రహాంతర జీవం కోసం అన్వేíÙంచాలి. మరి ఎలా వెదకాలి? ఎక్కడని వెదకాలి? శోధించేందుకు సరైన, అత్యుత్తమ జగత్తు ఏదైనా ఉందా? అంటే... ఉంది! దాని పేరు యూరోపా. బృహస్పతిగా పిలిచే గురు గ్రహానికి అది ఒక చందమామ. యూరోపాపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:49 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘యూరోపా క్లిప్పర్’అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్ ఎక్స్’సంస్థకు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది. నీరు–రసాయనాలు–శక్తి ఈ మూడు వనరుల నెలవు! జీవావిర్భావంలో కీలక పాత్ర పోషించే మూడు అంశాలు... ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి. ‘జలం ఎక్కడో జీవం అక్కడ’అనేది నానుడి. జీవులు ఆహారంగా స్వీకరించే పోషకాలను నీరు కరిగిస్తుంది. కణాంతర్గత జీవక్రియల్లో రసాయనాల రవాణాకు, అలాగే కణాలు వ్యర్థాలను తొలగించుకోవడానికి నీరు కీలకం. ఈ కోణంలో చూస్తే యూరోపాపై ఓ భారీ సముద్రమే ఉంది! జీవం పుట్టుకకు కర్బనం, ఉదజని, ఆమ్లజని, నత్రజని, గంధకం, భాస్వరం తదితర రసాయనిక పదార్థాలు అత్యావశ్యకం. అవి యూరోపా ఆవిర్భావ సమయంలోనే దానిపై ఉండి ఉండొచ్చు. ఇక తోకచుక్కలు, గ్రహశకలాలు యూరోపాను ఢీకొని మరిన్ని సేంద్రియ అణువులను దానిపై వదిలి ఉంటాయని భావిస్తున్నారు. భూమ్మీద శక్తికి సూర్యుడే మూలాధారం. కిరణజన్యసంయోగ క్రియ సాయంతో మొక్కలు ఆహారం తయారుచేసుకుంటాయి. మొక్కలను తినడం వల్ల మానవులు, జంతువులకు శక్తి బదిలీ అవుతుంది. కానీ యూరోపాలోని మహాసంద్రంలో జీవులు ఉంటే వాటి శక్తికి కిరణజన్యసంయోగక్రియ ఆధారం కాకపోవచ్చని, రసాయన చర్యల శక్తి మాత్రమే వాటికి లభిస్తుందని ఊహిస్తున్నారు. యూరోపాలోని మహాసముద్ర అడుగు భాగం రాతిపొరతో నిర్మితమైంది. ప్రాణుల మనుగడకు కావాల్సిన రసాయన పోషకాలను అక్కడి హైడ్రోథర్మల్ యాక్టివిటీ అందించగలదని అంచనా. భూమ్మీది సముద్రాల్లో మాదిరిగా యూరోపాలోని సముద్రంలోనూ రసాయన క్రియల వల్ల హైడ్రోథర్మల్ వెంట్స్ ఏర్పడే అవకాశముంది. భూమిపై మాదిరిగానే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ యూరోపా మీద కూడా పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. ద్రవరూప జలం, రసాయనాలు, శక్తి... ఇవన్నీ ఉన్నా జీవావిర్భావానికి సమయం పడుతుంది. అలాంటి కాలం గడిచిపోయి ఇక జీవం పుట్టబోతున్న సమయం ఆసన్నమైన ప్రపంచాల కోసం మనం అన్వేíÙంచాలి. అదిగో... సరిగ్గా ఇక్కడే శాస్త్రవేత్తల కళ్లు మన సౌరకుటుంబంలోని యూరోపాపై పడ్డాయి. గ్రహాంతర జీవాన్వేషణ దిశగా మనకు గట్టి హామీ ఇస్తున్న మరో ప్రపంచం యూరోపానే! క్లిప్పర్... అంతరిక్ష నౌకలకు పెద్దన్న! గ్రహాంతర అన్వేషణలో ‘నాసా’ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్’. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.42 వేల కోట్లు. క్లిప్పర్ నౌక మొత్తం బరువు 6 టన్నులు. నౌక బరువు 3,241 కిలోలు కాగా ఇంధనం బరువు 2,759 కిలోలు. దాదాపు సగం బరువు ఇంధనానిదే. నౌకలో యూరోపా ఇమేజింగ్ సిస్టమ్, థర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టమ్, మ్యాపింగ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, అ్రల్టావయొలెట్ స్పెక్ట్రోగ్రాఫ్, మాస్ స్పెక్ట్రోమీటర్, సర్ఫేస్ డస్ట్ మాస్ అనలైజర్, మాగ్నెటోమీటర్ తదితర 9 శాస్త్రీయ పరికరాలున్నాయి. ‘యూరోపా క్లిప్పర్’ఎత్తు 16 అడుగులు. 24 ఇంజిన్లు, 3 మీటర్ల వ్యాసంతో హై గెయిన్ యాంటెన్నా అమర్చారు. సౌరఫలకాలు అన్నీ విచ్చుకుంటే వాటి పొడవు అటు చివర నుంచి ఇటు చివరకు 100 అడుగుల పైనే. బాస్కెట్ బాల్ కోర్టు పొడవు ఎంతో ఆ సోలార్ ప్యానెల్స్ పొడవు అంత! సూర్యుడు–భూమి మధ్య గల దూరంతో పోలిస్తే భూమి–గురుడుల మధ్య దూరం 5 రెట్లు ఎక్కువ (77 కోట్ల కిలోమీటర్లు). సూర్యుడు–గురుడుల నడుమ దూరం ఎక్కువ కనుక గురుడి చెంత సూర్యకాంతి తక్కువగా, సూర్యకిరణాలు బలహీనంగా ఉంటాయి. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్ పరిశోధనలు చేయాలన్నా, సేకరించిన డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే అంత పెద్ద సోలార్ ప్యానెల్స్ పెట్టారు. ఇంధనం పొదుపు నిమిత్తం ‘యూరోపా క్లిప్పర్’తన ప్రయాణంలో భూమి, అంగారకుడుల గురుత్వశక్తిని వాడుకుంటుంది. అలా ఐదున్నరేళ్లలో అది సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గురుగ్రహపు మరో చంద్రుడు ‘గానిమీడ్’గురుత్వ శక్తిని వాడుకుంటూ ‘యూరోపా క్లిప్పర్’తన వేగాన్ని తగ్గించుకుని 2030 ఏప్రిల్ నెలలో గురుగ్రహం కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం పలు సర్దుబాట్లతో గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు ఓ ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది. 21 రోజులకోసారి గురుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తిచేస్తూ యూరోపా ఉపరితలానికి బాగా సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోకి క్లిప్పర్ నౌక వెళ్లొస్తుంటుంది. రేడియేషన్ ముప్పు దృష్ట్యా క్లిప్పర్ అంతరిక్ష నౌకను నేరుగా యూరోపా కక్ష్యలో ప్రవేశపెట్టబోవడం లేదు. గురుడి కక్ష్యలోనూ రేడియేషన్ తీవ్రత అధికం. ఆ ప్రమాదాన్ని తప్పించడం కోసం క్లిప్పర్ నౌకను గురుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. రేడియేషన్ బారి నుంచి నౌకలోని ఎల్రక్టానిక్ వ్యవస్థలను కాపాడటానికి 9 మిల్లీమీటర్ల మందం గల అల్యూమినియం గోడలతో ‘వాల్ట్’ఏర్పాటుచేశారు. యూరోపా జియాలజీ, మూలకాల కూర్పు, ఉష్ణోగ్రతలను క్లిప్పర్ నౌక పరిశీలిస్తుంది. మహాసముద్రం లోతును, లవణీయతను కొలుస్తుంది. యూరోపా గురుత్వక్షేత్రాన్ని, దాని ప్రేరేపిత అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. యూరోపా ఉపరితలంపై ఎరుపు–ఆరెంజ్ కలబోత రంగులో కనిపించే సేంద్రియ పదార్థాన్ని విశ్లేషిస్తుంది. అది మహాసముద్రం నుంచి ఉద్భవించిందో లేక సమీపంలోని చంద్రుళ్ళ శిథిలాలతో తయారైందో పరిశీలిస్తుంది. గురుగ్రహం, దాని చంద్రుళ్ళు గానిమీడ్, యూరోపా, కలిస్టోలను పరిశోధించడానికి యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) 2023లో ప్రయోగించిన ‘జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్సŠోప్లరర్’(జ్యూస్) అంతరిక్ష నౌక కూడా 2031 జులైలో గురుడి కక్ష్యలో ప్రవేశిస్తుంది. యూరోపా... మరో జల ప్రపంచం! జీవాన్వేషణలో యూరోపాను ‘నాసా’ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణాలు లేకపోలేదు. గురుగ్రహానికి 95 ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. వీటిలో పెద్దవైన నాలుగు చంద్రుళ్లను ఇటలీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ 1610లో కనుగొన్నారు. ఆ చంద్రుళ్ల పేర్లు... అయో, యూరోపా, గానిమీడ్, కలిస్టో. వీటిలో ‘ఐసీ మూన్’యూరోపా సైజులో మన చంద్రుడి కంటే కొంచె చిన్నదిగా ఉంటుంది. యూరోపా ఉపరితలం గడ్డకట్టిన మంచుతో నిండివుంది. ఆ మంచు పొర మందం 15–25 కిలోమీటర్లు. మంచు పొర కింద 60–150 కిలోమీటర్ల లోతున సువిశాల ఉప్పునీటి మహాసముద్రం ఒకటి ఉందట. గతంలో పయనీర్–10, పయనీర్–11, వోయేజర్–1, వోయేజర్–2, గెలీలియో, కేసిని, జునో మిషన్స్ ఆ మహా సముద్రం ఆనవాళ్లను గుర్తించాయి. భూమ్మీద అన్ని సముద్రాల్లో ఉన్న నీటి కంటే రెట్టింపు నీరు యూరోపాలోని మహాసంద్రంలో ఉండొచ్చని విశ్వసిస్తున్నారు. యూరోపాపై పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న పగుళ్లు, కొద్దిపాటి బిలాల ఆధారంగా చూస్తే దాని ఉపరితలం ‘యుక్త వయసు’లోనే ఉందని, భౌగోళికంగా క్రియాశీలకంగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ‘నాసా’యూరోపా క్లిప్పర్ మిషన్ ప్రధాన లక్ష్యం... యూరోపాపై ప్రస్తుతం జీవం ఉందో, లేదో నిర్ధారించడం కాదు. అంటే... యూరోపా ఉపరితలపు మంచు పొరను క్లిప్పర్ నౌక తవ్వదు (డ్రిల్ చేయదు). అలాగే అక్కడి సముద్రంలోకి చొచ్చుకెళ్లి పరిశీలించదు. యూరోపా మంచు పొర కింద గల మహాసముద్రంలో జీవం మనుగడ సాగించడానికి దోహదపడే సానుకూల పరిస్థితులున్నాయా? జీవులకు ఆవాసం కలి్పంచే సామర్థ్యం యూరోపాకు ఉందా? అసలక్కడ జీవం మనుగడ సాధ్యమేనా? వంటి అంశాలు తెలుసుకోవడానికే నాసా ఈ ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ మిషన్లకు కావాల్సిన కీలక సమాచారాన్ని ‘యూరోపా క్లిప్పర్’సంపాదిస్తుంది. శని గ్రహపు చంద్రుడైన ఎన్సెలాడస్ ఉపరితలం నుంచి గీజర్ల మాదిరిగా నీటి ఆవిర్లు రోదసిలోకి విడుదలవుతున్నట్టు గతంలో గుర్తించారు. యూరోపా ఉపరితలం నుంచి పైకి లేస్తున్న నీటి ఆవిర్లు కూడా అలాంటివేనా అనే అంశాన్ని ‘యూరోపా క్లిప్పర్’పరిశోధిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
స్పేస్ఎక్స్ మిషన్‌లో... స్వల్ప సమస్య
వాషింగ్టన్: స్పేస్ఎక్స్ సంస్థ క్రూ–9 డ్రాగన్ అంతరిక్ష ప్రయోగంలో చిరు వైఫల్యం చోటుచేసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ శనివారం ఈ మిషన్ చేపట్టడం తెలిసిందే. అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి ఫాల్కన్9 రాకెట్ ద్వారా క్రూ–9 డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. ఇది విజయవంతమైనట్టు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. అయితే, ‘‘డ్రాగన్ వ్యోమనౌక రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయి ఐఎస్ఎస్ వైపు సాగింది. అనంతరం ఫాల్కన్9 రాకెట్ క్షేమంగా భూమిపైకి తిరిగివచి్చంది. అందులోని రెండో దశ మాత్రం సముద్రంలో పడాల్సిన చోటికి కాస్తంత దూరంలో పడిపోయింది’’ అని స్పేస్ఎక్స్ వెల్లడించింది. ఇందుకు కారణాలపై పరిశోధన చేస్తున్నట్లు పేర్కొంది. ఫాల్కన్9 పునరి్వనియోగ రాకెట్. ఇందులోని రెండో దశ విఫలం కావడం ఇది రెండోసారి. ఇది స్పేస్ఎక్స్కు ఇబ్బందికరంగా మారింది. పొరపాట్లు సరి చేసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చెబుతోంది. క్రూ–9 రాకెట్లో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్కోస్మాస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఐఎస్ఎస్కు పయనమయ్యారు. సునీత, విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు వీలుగా రెండు సీట్లను ఖాళీగా ఉంచారు. వారిద్దరూ జూన్‌లో స్టార్‌లైనర్ తొలి ప్రయోగంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోవడం తెలిసిందే. -
సునీత విలియమ్స్ కోసం 26న క్రూ–9 ప్రయోగం.. అయినా 5 నెలలు పడుతుందా!
కేప్ కెనవెరల్ (అమెరికా): హమ్మయ్యా... సునీతా విలియమ్స్ త్వరలోనే భూమిని చేరుకోనున్నారు. భూమికి సుమారు 300 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన ఈ భారతీయ సంతతి అమెరికన్ వ్యోమగామిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇంకో రెండు రోజుల్లోనే (సెప్టెంబరు 26వ తేదీ) దీనికి సంబంధించిన ప్రయోగం ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలిపింది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ - రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కేప్ కెనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి గురువారం ప్రయోగించనున్నామని నాసా ప్రకటించింది. అన్నీ సవ్యంగా సాగితే సునీత, బుచ్ విల్మోర్లతోపాటు అమెరికా, రష్యాకు చెందిన మరో ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భూమ్మీదకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.బోయింగ్ స్టార్‌లైనర్ -12 ద్వారా ఈ ఏడాది జూన్‌లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారి తిరుగు ప్రయాణం మాత్రం అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. స్టార్‌లైనర్‌లోని 24 థ్రస్టర్లలో ఐదు పనిచేయకుండా పోయాయి. అలాగే ప్రొపల్షన్ వ్యవస్థలో హీలియం లీక్ అయినట్లు స్పష్టమైంది. ఐఎస్ఎస్ నుంచే ఈ సమస్యలను పరిష్కరించేందుకు సునీత, విల్మోర్లు, గ్రౌండ్‌స్టేషన్ నుంచి నాసా అన్ని రకాల ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ ఈ స్టార్‌లైనర్ సురక్షితంగా భూ వాతావరణంలోకి ప్రవేశించలేదని, ల్యాండింగ్‌ను నియంత్రించడమూ కష్టమని తేలిన నేపథ్యంలో ఖాళీగానే వెనక్కు రప్పించాలని నాసా నిర్ణయించింది. దీంతో సునీత, విల్మోర్లు నాలుగు నెలలపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కొసమెరుపు ఏమిటంటే.. ఈ నెల 26 నాటి ప్రయోగం కూడా కచ్చితంగా జరుగుతుందని చెప్పలేము. ఫ్లారిడాకు సమీపంలోని మెక్సికో జలసంధి వద్ద ఏర్పడ్డ ‘నైన్’ తుపాను ప్రయోగ కేంద్రం కేప్ కెనవెరాల్ వైపు దూసుకు వస్తూంది ఫలితంగా అనానుకూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయోగం వాయిదా పడే సూచనలు ఉన్నాయి.భూమికి సురక్షితంగా చేరుకున్న ముగ్గురు మాస్కో: ఇద్దరు రష్యన్, ఒక అమెరికన్ వ్యోమగాములతో కూడిన సోయుజ్ క్యాప్సూల్ ఐఎస్ఎస్ నుంచి కజకిస్తాన్‌కు చేరుకుంది. ఐఎస్ఎస్ నుంచి సోమవారం విడివడిన క్యాప్సూల్ మూడున్నర గంటల తరువాత కజకిస్తాన్‌లోని పచ్చిక మైదానంలో దిగింది. సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా క్యాప్సూల్‌లోని రెండు థ్రస్టర్లను కొద్దిసేపు మండించారు. ఆఖరు దశలో 7.2 మీటర్ల పారాచూట్ విచ్చుకుని క్యాప్సూల్ సురక్షితంగా గంటకు 16 మైళ్ల వేగంతో కిందికి వచ్చింది.చదవండి: ట్రంప్ నోట ఓటమి మాట.. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే..అనంతరం అందులోని వ్యోమగాములను బయటకు తీసుకువచ్చి, వైద్య పరీక్షలు జరిపారు. ఈ వ్యోమగాములు ఒలెగ్ కొనొనెంకో, నికొలాయ్ చుబ్లు 374 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. ఇది ప్రపంచ రికార్డని అధికారులు తెలిపారు. వీరితోపాటే వచ్చిన అమెరికన్ వ్యోమగామి ట్రేసీ డైసన్ ఆరు నెలలపాటు ఐఎస్ఎస్లో ఉన్నారు. కాగా, ఐఎస్ఎస్లో సునీతా, విల్మోర్ సహా ఇంకా 8 మంది వ్యోమగాములున్నారు. -
మస్క్ VS టెస్లా ఉద్యోగులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో బిలియనీర్ ఎలాన్ మస్క్.. తన ఈవీ కంపెనీ టెస్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు పరస్పరం విరుద్ధంగా మారారు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు మస్క్ మద్దతు ఇస్తుండగా టెస్లా ఉద్యోగులు మాత్రం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలహారిస్ వైపు నిలుస్తున్నారు.అధ్యక్ష రేసులో పాల్గొంటున్న అభ్యర్థులకు ప్రచారం నిమిత్తం ఇస్తున్న విరాళాల ద్వారా టెస్లా ఉద్యోగుల మొగ్గు ఎటువైపు అన్నది తెలుస్తోంది. టెస్లా ఉద్యోగులు ట్రంప్ కంటే దాదాపు రెట్టింపు విరాళాలను కమలాహారిస్‌కు ఇస్తున్నట్లు తెలిసింది. యూఎస్ ప్రచార సహకారాలు, లాబీయింగ్ డేటాను ట్రాక్ చేసే ఓపెన్ సీక్రెట్ అనే సంస్థ ప్రకారం.. టెస్లా ఉద్యోగులు కమలకు 42,824 డాలర్లు విరాళం అందించగా ట్రంప్‌నకు 24,840 డాలర్ల విరాళం అందించారు.ఎక్స్, స్పేస్ఎక్స్ ఉద్యోగులు కూడా..ఎలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్ ఉద్యోగులు కూడా డెమోక్రాటిక్ అభ్యర్థి కమలహారిస్కే మద్దతిస్తున్నారు. వీరు కమలహారిస్‌కు 34,526 డాలర్లు విరాళం అందించగా ట్రంప్‌నకు ఇచ్చింది కేవలం 7,652 డాలర్లు. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (ట్విటర్) ఉద్యోగులు సైతం హారిస్‌కు 13,213 డాలర్లు విరాళమిచ్చారు. ట్రంప్‌కు ఇచ్చింది 500 డాలర్ల కంటే తక్కువ కావడం గమనార్హం. -
వచ్చేస్తోంది మార్స్ ట్రాన్స్ఫర్ విండో!
మరొక్క నెల రోజులే! సైంటిస్టులంతా రెండేళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ అక్టోబర్‌లో అందుబాటులోకి రానుంది. 2022 నాటి ట్రాన్స్ఫర్ విండో సందర్భంగా నాసా వంటి అంతరిక్ష సంస్థలు పలు అంగారక ప్రయోగాలు చేశాయి. భావి మార్స్ మిషన్లకు అవసరమైన సామగ్రిని అంగారకునిపైకి ముందే చేరేసేందుకు ప్రయతి్నంచాయి. మరో నెల రోజుల అంతరం అక్టోబర్ ‘విండో’లో కూడా అలాంటి ప్రయోగాలు చేపట్టే దిశగా యోచిస్తున్నాయి. ఏమిటీ ట్రాన్స్ఫర్ విండో? ఇది భూ, అంగారక గ్రహాలు రెండూ పరస్పరం అత్యంత సమీపానికి వచ్చే సమయమని చెప్పవచ్చు. కనుక సహజంగానే ఆ సందర్భంగా భూమికి, అంగారకునికి మధ్య దూరం అత్యంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో అతి తక్కువ ఇంధన వ్యయంతో అంగారక ప్రయోగాలు సాధ్యపడుతాయి. ఫలితంగా ప్రయోగ ఖర్చుతో పాటు అరుణ గ్రహాన్ని చేరేందుకు పట్టే సమయమూ తగ్గుతుంది. కేవలం 6 నుంచి 8 నెలల్లో అంగారకున్ని చేరవచ్చు. అదే ఇతర సమయాల్లో అయితే ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది. వీటన్నింటికీ మించి ట్రాన్స్ఫర్ విండోలో ప్రయోగించే అంతరిక్ష నౌక అంగారకుడు అత్యంత అనువైన పొజిషన్లో ఉండగా దాని కక్ష్యలోకి ప్రవేశించగలుగుతుంది. కనుక ప్రయోగం విజయవంతమయ్యే అవకాశం ఎన్నో రెట్లు పెరుగుతుంది. భూమి, అంగారకుల మధ్య ఈ విండో దాదాపు 26 నెలలకు ఓసారి పునరావృతమవుతూ ఉంటుంది. హాన్‌మన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ సూత్రం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. ఈ విండో సమయాన్ని కచి్చతంగా లెక్కించడం అంతరిక్ష సంస్థలకు చాలా కీలకం. లేదంటే ప్రయోగం రెండేళ్లు ఆలస్యమయ్యే ప్రమాదముంటుంది. 2026 విండోపై స్పేస్ ఎక్స్ కన్ను ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ తన అంగారక యాత్ర సన్నాహాలకు మరింత పదును పెడుతోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే 2026లో అంగారకునిపైకి మానవరహిత ‘స్టార్íÙప్’ మిషన్ చేపట్టనున్నట్టు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ ఏడాది ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ సందర్భంగా ప్రయోగం ఉంటుందని వెల్లడించారు. అంతరిక్ష నౌక సజావుగా అరుణ గ్రహంపై దిగి తమ మిషన్ విజయవంతమైతే మరో రెండేళ్లలో, అంటే 2028 నాటికి మానవసహిత అంగారక యాత్ర ఉంటుందని చెప్పారు. నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు కూడా 20206 విండో సందర్భంగా అంగారకునిపైకి మరింత అదనపు సామగ్రి తదితరాలను చేరవేసేందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు వేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Polaris Dawn: తిరిగొచ్చిన స్పేస్‌వాకర్లు
స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రైవేట్ స్పేస్‌వాక్ ప్రాజెక్టు ‘పొలారిస్ డాన్’ విజయవంతమైంది. అందులో భాగంగా ఐదు రోజుల క్రితం అంతరిక్షానికి వెళ్లడమే గాక వ్యోమగామిగా అనుభవం లేకున్నా స్పేస్‌వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కిన కుబేరుడు జరేద్ ఇసాక్‌మాన్ ఆదివారం సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. ఆయన, మరో ముగ్గురు సిబ్బందితో కూడిన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలో ఫ్లోరిడాలోని డై టార్టగస్ బీచ్ సమీప సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. ఇసాక్మాన్తోపాటు ఇద్దరు స్పేస్ఎక్స్ ఇంజనీర్లు, ఒక మాజీ ఎయిర్‌ఫోర్స్ థండర్బర్డ్ పైలట్ కూడా ఈ క్యాప్సూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లడం తెల్సిందే. భూమి నుంచి 740 కి.మీ. ఎత్తులో తొలుత ఇసాక్‌మాన్, తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ స్పేస్‌వాక్ చేశారు. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ గరిష్టంగా భూమి నుంచి ఏకంగా 875 మైళ్ల ఎత్తుకు వెళ్లి మరో రికార్డు సృష్టించింది. చంద్రుడిపైకి నాసా అపోలో మిషన్ల తర్వాత మానవులు ఇంత ఎత్తుకు వెళ్లడం ఇదే తొలిసారి! ప్రైవేట్ రంగంలో స్పేస్‌వాక్ చేసిన తొలి వ్యక్తిగా, మొత్తమ్మీద 264వ వ్యక్తిగా ఇస్సాక్‌మాన్ నిలిచారు. ఆయన, గిలిస్ దాదాపు రెండు గంటల పాటు క్యాప్సూల్ నుంచి బయటికొచ్చి స్పేస్ఎక్స్ నూతన స్పేస్‌సూట్‌ను పరీక్షించారు. గిలిస్ అంతరిక్షం నుంచే సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా స్టార్‌వార్స్ థీమ్ సాంగ్‌కు వయోలిన్ వాయించి రికార్డు సృష్టించడం తెలిసిందే. – కేప్ కనావరెల్ -
అంతరిక్షం నుంచి ఐక్యతా గీతం
అంతరిక్షంలో తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ చేసిన వ్యోమగాముల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా ‘స్టార్‌వార్స్: ద ఫోర్సెస్ అవేకెన్స్’లోని ప్రఖ్యాత ‘రేస్ థీమ్’ను అంతరిక్షం నుంచే పర్ఫామ్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. పొలారిస్ డాన్ ప్రైవేట్ ప్రాజెక్టులో భాగంగా ఐఎస్ఎస్కు ప్రయాణించిన స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక నుంచే ఆమె ఈ మ్యూజికల్ ట్రిబ్యూట్లో పాల్గొన్నారు. సోలో వయోలిన్‌ను సారా వాయించగా పూర్తిస్థాయి ఆర్కెస్ట్రా బృందం భూమి నుంచి ఆమెకు వాద్య సహకారం అందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘హార్మనీ ఆఫ్ రెసీలియన్స్’ పేరిట పొలారిస్ ప్రోగ్రాం బృందం శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘‘విశ్వభాష అయిన సంగీతమే ఈ వీడియోకు స్ఫూర్తి. అలాగే బాలల్లో క్యాన్సర్ తదితర మహమ్మారులపై పోరాటం కూడా. చుక్కలనంటే ఉన్నత ఆశయాలను నిర్దేశించుకునేలా తర్వాతి తరాన్ని ప్రేరేపించడమే దీని ఉద్దేశం’’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొంది. ‘అందమైన మన పుడమి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ ఆనంద క్షణాలను సంగీతమయంగా మార్చి మీ అందరితో పంచుకునేందుకు చేసిన ఓ చిన్న ప్రయత్నమిది’ అంటూ సారా గొంతుతో వీడియో ముగుస్తుంది. ‘‘మానవాళి ఐక్యతకు, మెరుగైన ప్రపంచపు ఆకాంక్షలకు ఈ ప్రయత్నం ఓ ప్రతీక. బాలల్లో నిబిడీకృతమై ఉండే అనంతమైన ప్రతిభా పాటవాలకు ఇది అంకితం’’ అని సారా పేర్కొన్నారు. పొలారిస్ డాన్ మిషన్ కమాండర్ జరేద్ ఐజాక్‌మ్యాన్‌తో పాటు సారా గురువారం స్పేస్ వాక్ చేయడం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి నాన్ ప్రొఫెషనల్ వ్యోమగాములుగా వారు నిలిచారు. ఈ వీడియో తయారీలో సెయింట్ జూడ్ చి్రల్డన్స్ రీసెర్చ్ హాస్పిటల్ కూడా పాలుపంచుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐఎస్ఎస్ను కూల్చేయనున్న స్పేస్ఎక్స్
వాషింగ్టన్: ప్రతి గంటన్నరకు ఒకసారి భూమి చుట్టూ తిరిగే ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఉన్న ఆకాశ ప్రయోగశాల.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) త్వరలో నీలిసంద్రంలో కూలిపోనుంది. 2030 సంవత్సరంకల్లా పాతబడిపోతున్న ఐఎస్ఎస్ అంతరిక్షచెత్తగా మిగిలిపోకుండా, తదుపరి ప్రయోగశాలలకు అవరోధంగా మారకుండా చూడాలని అమెరికా నాసా నిర్ణయించుకుంది. అందుకే గడువు ముగిసేనాటికి దానిని ప్రస్తుత కక్ష్య నుంచి తప్పించనుంది.ఇప్పటికే రాకెట్ల తయారీతో అంతరిక్ష అనుభవం గడించిన కుబేరుడు ఎలాన్ మస్‌్కకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థకు నాసా ఈ బాధ్యతను అప్పగించింది. ఇందుకోసం దాదాపు రూ.7,036 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను స్పేస్ఎక్స్కు ఇచి్చనట్లు నాసా బుధవారం ప్రకటించింది. కాంట్రాక్ట్‌లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ డీఆర్బిట్ వెహికల్(యూఎస్‌డీవీ)ను స్పేస్ఎక్స్ నిర్మించనుంది. అది సముద్రంలో చిన్న పడవలను లాగే/నెట్టే టగ్ బోటులా ఉంటుందని భావిస్తున్నారు.ఐఎస్ఎస్ ప్రస్తుతం భూమికి 400 కి.మీ.ల ఎత్తులో తిరుగుతోంది. ఏకంగా 430 టన్నుల బరువైన ఐఎస్ఎస్ను యూఎస్డీవీతో నియంత్రిస్తూ దశల వారీగా దిగువ కక్ష్యలకు తీసుకొస్తూ ముందుగా నిర్దేశించిన పసిఫిక్ మహాసముద్రంలోని మారుమూల ‘పాయింట్ నెమో’ వద్ద కూల్చేయనున్నారు. ఈ ‘పాయింట్ నెమో’ సముద్రప్రాంతం నుంచి దగ్గర్లోని భూభాగానికి వెళ్లాలంటే కనీసం 2,500 కిలోమీటర్లు ప్రయాణించాలి. పౌరులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదని సుదూర ప్రాంతాన్ని ఎంచుకున్నారు.వేల ప్రయోగాలకు వేదిక ఐఎస్ఎస్ నిర్మాణం కోసం తొలి భాగాలను 1998లో రాకెట్లలో తీసుకెళ్లారు. 2000 సంవత్సరందాకా దీని నిర్మాణం సాగింది. శూన్యంలో ఎన్నో భిన్న ప్రయోగాలకు ఐఎస్ఎస్ సాక్షిగా నిలిచింది. అమెరికా, రష్యా, కెనడా, జపాన్ తదితర దేశాలు దీని నిర్వహణ చూసుకుంటున్నాయి. 2028లో చేతులు దులిపేసుకుంటామని రష్యా చెప్పేసింది. -
ఎలాన్ మస్క్ కు 11వ బిడ్డ
న్యూయార్క్: ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు. న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్స్ హెడ్ శివోన్ జిలిస్ ద్వారా ఆయనకు కొన్ని రోజుల క్రితం మూడో బిడ్డ జన్మించినట్లు బ్లూమ్‌బర్గ్ సంస్థ వెల్లడించింది. దీంతో మస్క్ పిల్లల సంఖ్య ఇప్పటిదాకా 11కు చేరుకున్నట్లు తెలియజేసింది. మస్క్ కు మొదటి భార్య, రచయిత్రి జస్టిన్ మస్క్ ద్వారా ఐదుగురు బిడ్డలు కలిగారు. సంగీత కళాకారిణి గ్రిమ్స్ ద్వారా ముగ్గురు పిల్లులు, శివోన్ జిలిస్ ద్వారా మరో ముగ్గురు పిల్లలు జని్మంచారు. ఎలాన్ మస్క్, శివోన్ జిలిస్‌కు 2021లో కవలలు పుట్టారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జననాల రేటు పడిపోతుండడంతో జనాభా తగ్గిపోతోందని మస్క్ 2021లో ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే జనాభాను పెంచాలని, వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. పిల్లలను కనకపోతే నాగరికత అంతమైపోతుందని చెప్పారు. అత్యధికంగా తెలివితేటలు, మేధాశక్తి ఉన్న వ్యక్తులు పిల్లలను ఎక్కువగా కనాలన్నది మస్క్ అభిప్రాయం. ఆయనకు తన సంస్థల్లో పనిచేసే మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. -
జూలైలో జీశాట్–ఎన్2 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), భారత అంతరిక్ష వాణిజ్య విభాగానికి చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ సహకారంతో జూలై నెలాఖరులో జీశాట్–ఎన్2 (జీశాట్–20) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. సుమారు ఐదు టన్నుల బరువు (4,700 కిలోలు) కలిగిన ఈ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ప్రయోగ వేదిక నుంచి పాల్కన్ రాకెట్ ద్వారా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.దేశంలోని మారుమూల రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు బ్రాండ్‌బ్యాండ్, ఇన్–ఫ్లైట్ సేవలను అందించేందుకు ఇస్రోలోని ఫ్రొఫెసర్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో ఈ ఉపగ్రహాన్ని తయారుచేశారు. ఈ ఉపగ్రహం భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఉండి 15 ఏళ్లపాటు సేవలు అందించే విధంగా రూపొందించారు.ఇది పూర్థిస్థాయి కమ్యూనికేషన్ ఉపగ్రహం కావడం విశేషం. ఇప్పటివరకు పంపిన కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఒక ఎత్తయితే ఈ జీశాట్–ఎన్2 ఉపగ్రహం మాత్రమే ఒక ఎత్తు అని ఇస్రో పేర్కొంది. ఇప్పటికే ఉపగ్రహాన్ని రూపొందించి క్లీన్‌రూంలో పరీక్షలు పూర్తిచేశారు. వైబ్రేషన్ పరీక్షలను కూడా విజయవంతంగా నిర్వహించారు. ఇస్రోకి ఇది వాణిజ్యపరమైన ప్రయోగం కావడం విశేషం. -
Elon Musk: హ్యాక్ చేయొచ్చు..!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరు, పారదర్శకతపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈవీఎంలలో నమోదైన ఫలితాలను సులభంగా తారుమారు చేయొచ్చని, ఎన్నికల్లో వీటిని ఉపయోగించకపోవడమే మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఈవీఎంలపై స్పందించారు. ఈ మేరకు తాజాగా ‘ఎక్స్’లో తన అభిప్రాయం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వినియోగిస్తున్న ఈవీఎంల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యంత్రాలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. మస్క్ అభిప్రాయాన్ని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీంఎలు పూర్తిగా సురక్షితమేనని తేల్చిచెప్పారు. దీనిపై మస్క్ ఘాటుగా స్పందించారు. ఏదైనా హ్యాక్ చేయొచ్చని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లు కూడా ఆదివారం స్పందించారు. ఈవీఎంలు ఎవరూ తనిఖీ చేయలేని బ్లాక్‌బాక్సుల్లాంటివేనని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ‘ఎక్స్’లో ఎలాన్ మస్క్ చేసిన పోస్టును తన ‘ఎక్స్’ ఖాతాల్లో రాహుల్ షేర్ చేశారు. ఈవీఎంల విశ్వసనీయతను అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. రిస్క్ చిన్నదైనా పరిణామం పెద్దదే మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను వాడొద్దు. ఎన్నికల నుంచి ఈ యంత్రాలను దూరంగా ఉంచాలి. ఈవీఎంలను హ్యాక్ చేసే రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికీ హ్యాకింగే అవుతుంది. రిస్క్ చిన్నదైనా అది పెద్ద పరిణామానికి దారితీస్తుంది.– ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎన్నికల ప్రక్రియపై అనుమానాలున్నాయి భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీఎంలు బ్లాక్‌బాక్సుల్లాంటివే. వాటిని తనిఖీ చేయడానికి ఎవరినీ అనుమతించరు. మన దేశంలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఓ బూటకంగానే మిగిలిపోతుంది – ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ ఈవీఎంలు పూర్తి సురక్షితం పూర్తిగా సురక్షితమైన ఎల్రక్టానిక్ పరికరాలను, డిజిటల్ హార్డ్‌వేర్‌ను ఎవరూ తయారు చేయలేరన్న సాధారణ అభిప్రాయం ప్రజల్లో ఉంది. అలా అను కోవడం పొరపాటు. ఈవీఎంలపై ఎలాన్ మస్క్ వ్యక్తం చేసిన భయాందోళలు సమంజసం కాదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయడం అమెరికాతోపాటు ఇతర దేశాల్లో సాధ్యమవుతుందేమో గానీ ఇండియాలో ఎంతమాత్రం వీలుపడదు. ఇతర దేశాల్లో ఇంటర్నెట్తో అనుసంధానించిన ఓటింగ్ యంత్రాలను వాడుతుంటారు. ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. ఇంటర్నెట్తో కనెక్ట్ చేసినప్పుడు అవకతవకలు జరిగే అవకాశం ఉండొచ్చు. ఇండియాలో ఈవీఎంలకు ఇంటర్నెట్తో గానీ, బ్లూటూత్‌తో గానీ, వై–ఫైతోగానీ ఎలాంటి అనుసంధానం ఉండదు. ఇవి పూర్తిగా సురక్షితమైనవి. ఫ్యాక్టరీలో పోగ్రామ్ చేసిన ఈవీఎం కంట్రోలర్లను బయట రీప్రోగ్రామింగ్ చేయడం సాధ్యం కాదు. ఇండియాలో ఉపయోగిస్తున్న ఈవీఎంలు, వాటి భద్రత గురించి ఎలాన్ మస్‌్కకు ట్యూషన్ చెప్పడానికి నేను సిద్ధమే – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి ‘‘ఏదైనా(ఏ ఎల్రక్టానిక్ పరికరమైనా) హ్యాక్ చేయొచ్చు’’ – రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ ప్రతిస్పందన ఈవీఎంలకు స్వస్తి పలకాలి టెక్నాలజీ అనేది సమస్యలను పరిష్కరించేలా ఉండాలి. అదే టెక్నాలజీ ఒక సమస్యగా మారినప్పుడు దాన్ని పక్కనపెట్టమే మంచిది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని నిపుణులు ఇప్పటికే నిరూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేస్తున్నట్లు సందేహాలున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్‌పై ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ నిపుణులు సైతం బహిరంగంగా ప్రకటనలు చేశారు. అలాంటప్పుడు మన దేశంలో ఈవీఎంలను బలవంతంగా ఉపయోగించాల్సిన అవసరం ఏమిటి? దీనిపై అధికార బీజేపీ సమాధానం ఇవ్వాలి. ఈవీఎంలకు స్వస్తి పలకాలి. భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలి. – ‘ఎక్స్’లో అఖిలేష్ యాదవ్ దమ్ముంటే హ్యాక్ చేసి చూపించండి ఎలాన్ మస్క్ గానీ, ఇంకెవరైనా గానీ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్న వ్యక్తులు భారత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలి. అక్కడ ఈవీఎంను తీసుకొని హ్యాక్ చేసి చూపించాలి. ఇదే మా చాలెంజ్. భారతదేశ ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ ఎందుకు ఎలాన్ మస్‌్కకు ఫిర్యాదు చేస్తున్నారు? మస్క్ ఏం చేయగలరు? ప్రపంచం ముందు కన్నీళ్లు పెట్టుకోవడం, భారతదేశ ప్రతిష్టను దిగజార్చడం కాంగ్రెస్ డీఎన్ఏలో ఒక భాగమా? వారసత్వ రాజకీయాలను ప్రజలు వరుసగా మూడోసారి తిరస్కరించారు. అయినా ఆ విషయం కాంగ్రెస్‌కు అర్థం కావడం లేదు? – అమిత్ మాలవీయ, బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి -
ఆరు ఉపగ్రహాలను ప్రయోగించనున్న స్టార్టప్ సంస్థ
బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ పిక్సెల్ తయారుచేస్తున్న ఉపగ్రహాలను 2024 చివరినాటికి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం స్పేస్ఎక్స్కు చెందిన రైడ్‌షేర్ మిషన్లు, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)ను ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది.ఈ సందర్భంగా పిక్సెల్ సీఈఓ అవైస్ అహ్మద్ మాట్లాడుతూ..‘కంపెనీకు స్పేస్ఎక్స్, పీఎస్ఎల్వీ రెండింటిలోనూ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. అయితే, ఇది ఉపగ్రహాల సంసిద్ధత, ప్రయోగ షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుంది. సంస్థ వద్ద ప్రస్తుతం ఏటా 40 పెద్ద ఉపగ్రహాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం పరిశోధకుల బృందం ఆరు ఉపగ్రహాలపై పని చేస్తోంది. వీటిని ఈ ఏడాది చివరినాటికి అంతరిక్షంలోని ప్రవేశపెట్టనున్నాం. 2024లో మరిన్ని ఉపగ్రహాలను తయారుచేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: మోదీ ప్రధాని అయినా, అవ్వకపోయినా అందులో మార్పులేదుఈ ఏడాది జనవరిలో పిక్సెల్ బెంగుళూరులో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘మెగాపిక్సెల్’ అనే ఫెసిలిటీని ప్రారంభించింది. ఇందులో ఆరు హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజరీ ఉపగ్రహాలను ప్రయోగాలు జరుపుతున్నారు. ఇవి వ్యవసాయం, ఎనర్జీ, అటవీ, పర్యావరణ పర్యవేక్షణతో సహా వివిధ పరిశ్రమలకు ఉపయోగపడుతాయని కంపెనీ వర్గాలు చెప్పాయి. 2022లో పిక్సెల్ స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్-9 రాకెట్‌ను ఉపయోగించి ‘శకుంతల’ (టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్-2) ఉపగ్రహాన్ని ప్రయోగించింది.